వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. ప్రజాసంకల్పయాత్ర 88వ రోజు షెడ్యూల్ ఖరారు అయింది. ఈ మేరకు వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం పాదయాత్ర షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఉదయగిరి నియోజకవర్గం కొండాపూరం మండలంలోని జంగాలపల్లి శివారు నుంచి గురువారం ఉదయం 8 గంటలకు వైఎస్ జగన్ పాదయాత్ర ప్రారంభిస్తారు. ఆదిమూర్తిపురం, తూర్పు ఎర్రబల్లిక్రాస్, కొండాపురం చేరుకుని అక్కడ పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. పాదయాత్ర 11:30 గంటలకు రేనమాలకు చేరుకుంటుంది. మధ్యాహ్నం 12 గంటలకు జననేత వైఎస్ జగన్ లంచ్ విరామం తీసుకుంటారు. 2:45 గంటలకు మళ్లీ పాదయాత్ర కొనసాగించి 3 గంటలకు రేనమాలలో వైఎస్ జగన్ మహిళలను కలుసుకుని వారి సమస్యలు అడిగి తెలుసుకుంటారు. తూర్పుపాలెంక్రాస్ వద్ద 88వ రోజు పాదయాత్ర ముగుస్తుంది.