అక్రమంగా ఇసుకను దోచుకుంటూ, అడ్డుకున్న మహిళా ఎమ్మార్వోను జుట్టుపట్టి ఈడ్చిన ఎమ్మెల్యేను కాల్చి పారేయకుండా, కనీసం అరెస్టు చేసి జైల్లో వేయకుండా.. బాధితురాలిపై చంద్రబాబు ప్రభుత్వం కన్నెర్ర జేసిందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వైఎస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా చెప్పిన మాటలు అక్షర సత్యమని అన్నారు.