అధికారంలో ఉన్నాం..మాకెవరు అడ్డు అన్న రీతిలో అధికార పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారు. టీడీపీ నేతల అరాచకాలకు అడ్డూ అదుపులేకుండా పోతోంది. ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లోనూ చిచ్చు పెడుతున్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులే లక్ష్యంగా రెచ్చిపోతున్నారు. ప్రశ్నిస్తే అక్రమంగా కేసులు బనాయిస్తున్నారు. పోలీసులు కూడా అధికార పార్టీనేతలకు వత్తాసు పలుకుతూ కర్కశత్వం ప్రదర్శిస్తున్నారు.బుధ, గురువారాల్లో యల్లనూరు మండలం తిమ్మంపల్లి గ్రామంలో చోటుచేసుకున్న అధికార దురహంకారం, పోలీసుల దౌర్జన్యమే ఇందుకు నిదర్శనం.