వినుకొండ టీడీపీ ఎమ్మెల్యే ఆంజనేయులు స్మగ్లింగ్ చేసి డబ్బులు సంపాదించారని, ఆయన స్మగ్లర్లకే డాన్ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వినుకొండ నేత బొల్లా బ్రహ్మనాయుడు ఆరోపించారు. హత్యా రాజకీయాలు, శవరాజకీయాలు చేసే చరిత్ర ఆంజనేయులుదేనని మండిపడ్డారు. వ్యాపారంలో సొంత భాగస్వామిని హత్య చేయించిన వ్యక్తి ఆంజనేయులు అని అన్నారు. భాగస్వామి భార్యను బెదిరించి.. వారి ఆస్తులన్నీ బలవంతంగా ఆంనేయులు లాక్కున్నారని అన్నారు.