పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుబట్టింది. మూడున్నరేళ్ల తర్వాత పోలవరం ప్రాజెక్ట్ బాధ్యత నుంచి తప్పుకోవడానికి కుంటిసాకులు వెతకడం దారుణమని వ్యాఖ్యానించింది. ఆంధ్రప్రదేశ్‌కు పోలవరం జీవనాడి అని వైఎస్‌ఆర్ సీపీ నేతలు పేర్కొన్నారు. వైఎస్‌ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం పార్టీ నేతలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బొత్స సత్యనారాయణ మీడియా సమావేశంలో మాట్లాడారు.