మండలి రద్దుపై ఎన్టీఆర్ తీసుకున్న నిర్ణయమే వైఎస్సార్‌సీపీ తీసుకుందని ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. సోమవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు మండలి రద్దు చేయాలనే ఆలోచన లేదని.. ఎన్నికల తర్వాత అనివార్యమైన పరిస్థితులను టీడీపీ కల్పించిందని చెప్పారు. పెద్ద మెజార్టీతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గెలిచారని.. రాష్ట్రాభివృద్ధి కోసం త్వరితగతిన సీఎం నిర్ణయాలను తీసుకుంటున్నారని పేర్కొన్నారు.