పనిగట్టుకుని వైఎస్సార్‌సీపీ సానుభూతి పరుల ఓట్లను టీడీపీ నేతలు తొలగిస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కలిశారు. అన్యాయంగా చంద్రగిరి నియోజకవర్గంలో ఓట్లను తొలగిస్తున్నారని ఫిర్యాదు చేశారు.