విభజన చట్టంలోని పెండింగ్ అంశాలపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తన పోరాటాన్ని కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం వైఎస్‌ఆర్ సీపీ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కావాలంటూ ఫ్లకార్డులు ప‍్రదర్శిస్తూ నిరసన తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు పోలవరం ప్రాజెక్ట్, విశాఖకు రైల్వే జోన్ ఏర్పాటు చేయాలంటూ నినాదాలు చేశారు. రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి, లోక్‌సభ ఎంపీలు మిథున్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్, వైఎస్ అవినాష్ రెడ్డి ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.