Top Stories
ప్రధాన వార్తలు

రైతులపై కూటమి ప్రభుత్వ కపట ప్రేమ: వైఎస్ జగన్
సాక్షి, అనంతపురం: ఏపీలో రైతులపై కూటమి ప్రభుత్వం కపట ప్రేమ చూపుతోందన్నారు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. రాష్ట్రంలో అకాల వర్షాల కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు ఇన్యూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలన్నారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. వైఎస్సార్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా తాతిరెడ్డిపల్లిలో అకాల వర్షం కారణంగా పడిపోయిన అరటి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా పంట నష్టపోయిన రైతులతో ఆయన మాట్లాడారు. పంట నష్టం కారణంగా వారి ఆవేదనను అర్థం చేసుకున్నారు. రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఆదుకోకపోతే రైతుల కోసం పోరాటం చేస్తామన్నారు. అనంతరం, వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ఇలాంటి సమయంలో ప్రభుత్వం మానవత్వంతో వ్యవహరించాలి. కూటమి ప్రభుత్వంలో ఉచిత పంటల బీమాను ఎత్తేశారు. చంద్రబాబు ప్రభుత్వంలో రైతులకు సున్నా వడ్డీ రుణాలు కూడా అందడం లేదు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, ఇన్యూరెన్స్ ఇవ్వాలి. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే ఈ పర్యటన. అకాల వర్షాల కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతులపై కూటమి ప్రభుత్వం కపట ప్రేమ చూపుతోంది. వర్షాలు, గాలులతో పంట నష్టం తీవ్రంగా ఏర్పడింది. నెల కింద రూ.26వేలు ధర పలికితే ఇప్పుడు ఎవరూ కొనడం లేదు.వైఎస్సార్సీపీ హయాంలో ఉచిత పంటల బీమా రైతులకు హక్కుగా ఉండేది. మన వైఎస్సార్సీపీ పాలనలో ప్రతీ రైతుకు న్యాయం చేశాం. అరటి సాగులో రాష్ట్రంలోనే పులివెందుల నంబర్ వన్ స్థానంలో ఉంది. మా ప్రభుత్వంలో రూ.25కోట్లతో ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్‌లు ఏర్పాటు చేశాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్‌లు కూడా వాడుకోలేకపోతున్నారు. యూజర్ ఏజెన్సీకి అప్పగించి ఉంటే నష్టం జరిగేది కాదు. మళ్లీ అధికారంలోకి వచ్చేది మేమే. మళ్లీ ప్రతీ రైతు కళ్లలో ఆనందం కనిపించేలా చేస్తాం. అధికారంలోకి వచ్చాక ఇన్యూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ ఇస్తాం’ అని రైతులకు హామీ ఇచ్చారు. అకాల వర్షానికి భారీ నష్టం..శనివారం రాత్రి భారీ ఈదురుగాలులతో కూడిన వర్షానికి అరటి తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వైఎస్సార్, ఉమ్మడి అనంతపురం జిల్లాల్లో ఉద్యాన పంటలకు అపార నష్టం వాటిల్లింది. 4 వేలకు పైగా ఎకరాల్లో కోతకు సిద్ధంగా ఉన్న అరటి పంట నేలకొరిగింది. రెండు జిల్లాల్లోనూ వందలాది మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. వైఎస్సార్ జిల్లా లింగాల మండలంలోని పలు గ్రామాల్లో శనివారం రాత్రి ఈదురు గాలులతో కూడిన భారీవర్షం కురవడంతో 2,460 ఎకరాల్లో అరటి పంట కూలిపోయిందని, 827 మంది రైతులు తీవ్రంగా నష్టపోయినట్టు ప్రాథమికంగా అంచనా వేశామని ఉద్యాన శాఖ అధికారి రాఘవేంద్రారెడ్డి చెప్పారు.అనంతపురం జిల్లాలో 1,400 ఎకరాల్లో అరటికి నష్టం ఉమ్మడి అనంతపురం జిల్లాలో శనివారం సాయంత్రం నుంచి కురిసిన అకాల వర్షం అరటి, మొక్కజొన్న, బొప్పాయి పంటలను దెబ్బతీసింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురుగాలులకు పంటలు నేలవాలాయి. పుట్లూరు, యల్లనూరు, శింగనమల, పెద్దవడుగూరు, యాడికి మండలాల్లో సుమారు 1,400 ఎకరాల్లో అరటి పంట పూర్తిగా ధ్వంసమైందని ఉద్యాన శాఖ డిప్యూటీ డైరెక్టర్ నరసింహారావు తెలిపారు. దీనివల్ల వందలాది మంది రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. అదేవిధంగా 47 మందికి చెందిన 87.5 ఎకరాల్లో మొక్కజొన్న దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి, ముదిగుబ్బ మండలాల్లో అరటి తోటలు దెబ్బతిన్నాయి. తాతిరెడ్డిపల్లె, కోమన్నూతల, ఎగువపల్లె, వెలిదండ్ల, పెద్దకుడాల, కె.చెర్లోపల్లె, రామన్నూతనపల్లె, గుణకణపల్లె, లింగాల తదితర గ్రామాల్లో అరటి పంటలు నేలకూలాయి.

ఉగాదికి అటు ఇటుగా!
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నో నెలలుగా ఊరిస్తున్న రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు సమయం సమీపించింది. ఉగాదికి కొంచెం అటు ఇటుగా కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించాలని కాంగ్రెస్ అధిష్టానం, రాష్ట్ర పెద్దలు నిర్ణయించినట్లు సమాచారం. అయితే ఎంతమందికి అవకాశం దక్కుతుందన్న దానిపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. నలుగురా? లేక ఐదుగురా? అన్నది తేలాల్సి ఉంది. ఏఐసీసీ వర్గాలు, రాష్ట్ర నేతలు అందిస్తున్న సమాచారం మేరకు.. సీనియర్ నేతలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గడ్డం వివేక్, వాకిటి శ్రీహరి పేర్లు ఖరారైనట్లు తెలుస్తుండగా, మిగతా పేర్లపై నేడో, రేపో స్పష్టత వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. విస్తృత చర్చలు..అనేక కోణాల్లో పరిశీలన ప్రస్తుతం ఆరు కేబినెట్ స్థానాలు ఖాళీ ఉండగా, వీటి భర్తీపై గత కొన్ని నెలలుగా విస్తృత కసరత్తు జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్లు పలుమార్లు హైకమాండ్‌తో చర్చలు జరిపినా వివిధ కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. అయితే ప్రస్తుతం కీలకమైన కులగణన పూర్తికావడం, దానికి చట్టబద్ధత కల్పించే బిల్లుతో పాటు ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం పొందడం, మరికొద్ది రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్న నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణపై అధిష్టానం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో సోమవారం ఢిల్లీకి వచ్చిన రేవంత్, భట్టి, ఉత్తమ్, మహేశ్‌గౌడ్‌లు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌గాందీ, పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్‌లతో ఇందిరా భవన్లో భేటీ అయ్యారు. సుమారు గంటన్నర పాటు జరిగిన చర్చల్లో జిల్లాల ప్రాతినిధ్యం, సామాజిక వర్గాలు, పారీ్టలో పనిచేసిన అనుభవం, సీనియార్టీ ఆధారంగా కొత్త మంత్రుల ఎంపికపై చర్చించినట్లు తెలిసింది. పార్టీ బీ–ఫామ్‌ల మీద గెలిచిన ఎమ్మెల్యేలకే మంత్రివర్గంలో చోటు కల్పించాలని, కాంగ్రెస్‌లో చేరిన ఇతర పారీ్టల ఎమ్మెల్యేలకు అవకాశం ఇవ్వరాదని అధిష్టానం నిర్ణయించినట్లు తెలిసింది. దీంతో బీఆర్ఎస్ నుంచి వచ్చిన నేతలెవరికీ పదవులు దక్కే అవకాశం లేదని పారీ్టవర్గాలు చెబుతున్నాయి. గుర్తించిన నేతలపై విస్తృత చర్చ సోమవారం నాటి భేటీలో మంత్రివర్గంలోకి తీసుకునేందుకు ఇదివరకే గుర్తించిన పేర్లపై మరోమారు చర్చించారు. ఇందులో మహబూబ్‌నగర్ జిల్లా నుంచి వాకిటి శ్రీహరి, నిజామాబాద్ జిల్లా నుంచి పి.సుదర్శన్‌రెడ్డి, నల్లగొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, బాలూనాయక్, రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి, టి.రామ్మోహన్ రెడ్డి, ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రేమ్‌సాగర్‌రావు, వివేక్, కరీంనగర్ జిల్లా నుంచి ఆది శ్రీనివాస్, మైనార్టీ కోటాలో షబ్బీర్ అలీ, ఆమేర్ అలీఖాన్‌ల పేర్లు ఉన్నాయి. అలాగే మహిళా కోటాలో ఎమ్మెల్సీ విజయశాంతి పేరును కూడా పరిశీలించినట్టు సమాచారం. ఆమెను ఎమ్మెల్సీగా ప్రకటించినప్పుడే కేబినెట్లోకి కూడా తీసుకుంటారనే ప్రచారం జరిగింది. నిజామాబాద్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం లేనందున సుదర్శన్‌రెడ్డికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. ప్రేమ్‌సాగర్ వైపు భట్టి మొగ్గు వెలమ సామాజిక వర్గం నుంచి మంత్రి పదవికి పోటీ ఎక్కువగా ఉంది. ఈ సామాజిక వర్గం నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు ప్రేమ్‌సాగర్ రావు, మదన్మోహన్, మైనంపల్లి రోహిత్‌తో పాటు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ల మధ్య పోటీ నెలకొంది. అయితే ఈ సామాజిక వర్గం నుంచి ఇప్పటికే జూపల్లి కష్ణారావు ఉన్నందున మరొకరికి అవకాశం ఇవ్వాలా? లేదా? అన్న దానిపై చర్చలు జరుగుతున్నాయి. ప్రేమ్‌సాగర్‌రావుకు అవకాశం ఇవ్వాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించినట్టు తెలిసింది. మదన్మోహన్కు పార్టీ పెద్దలు, రోహిత్‌కు సీఎం ఆశీస్సులు! మదన్మోహన్ పార్టీ పెద్దల నుంచి ఒత్తిళ్లు తెస్తుండగా, రోహిత్‌కు ముఖ్యమంత్రి మద్దతిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక బీఆర్ఎస్ నుంచి పారీ్టలో చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, తెల్లం వెంకట్రావ్, కాలె యాదయ్య, సంజయ్‌కుమార్‌లలో ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలనే డిమాండ్ ఉన్నా, తాజా నిర్ణయం నేపథ్యంలో వారికి అవకాశం లేదని తెలిసింది. నల్లగొండ జిల్లా నుంచి ఇప్పటికే ఎస్టీ (లంబాడా) కోటాలో శంకర్‌నాయక్‌ను ఎమ్మెల్సీగా చేసినందున, బాలూనాయక్‌ను కేబినెట్లోకి తీసుకోకుండా డిప్యూటీ స్పీకర్‌గా చేయాలన్న ప్రతిపాదనలపై చర్చలు జరిగాయి. త్వరలో కార్యవర్గం! పీసీసీ కార్యవర్గ ప్రకటన కూడా త్వరలో వెలువడే అవకాశం ఉంది. ఏఐసీసీ పెద్దలతో భేటీలో ఈ అంశం కూడా చర్చకు రాగా ముందుగా నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు, 20 మందికి పైగా వైస్ ప్రెసిడెంట్లను ప్రకటించేందుకు నిర్ణయం జరిగినట్లు తెలిసింది. కొన్ని నామినేటెడ్ పోస్టుల భర్తీపై సైతం చర్చించినట్లు చెబుతున్నారు. అలాగూ కులగణనపై ప్రజలు ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు? ఎస్సీ వర్గీకరణపై ఏమనుకుంటున్నారు? స్థానిక సంస్థల ఎన్నికల్లో వీటి ప్రభావం ఎంతవరకు ఉంటుందనే అంశాలపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. మంత్రుల శాఖల్లో మార్పులు?కొత్తగా నలుగురిని లేక ఐదుగురిని మంత్రివర్గంలోకి తీసుకుంటే ముఖ్యమంత్రి వద్ద ఉన్న ఏయే శాఖలు వారికి కేటాయించాలి, కొంతమంది మంత్రుల శాఖల్లో మార్పులు చేయాలా? కొందరికి కీలక శాఖలు అప్పగించాలా? అన్న దానిపైనా చర్చ జరిగింది. ముఖ్యమంత్రి వద్ద ఉన్న మున్సిపల్, హోం, విద్యా శాఖలను సీనియర్ మంత్రులకు ఇవ్వాలన్న చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో పాత మంత్రుల శాఖలు కొన్ని మార్చే అవకాశం ఉందని ఏఐసీసీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

డ్రిల్లింగ్ & బ్లాస్టింగ్
సాక్షి, హైదరాబాద్: ఎస్ఎల్బీసీ టన్నెల్ తవ్వకంతోపాటు, అందులో చిక్కుకున్న కార్మికులను వెలికితీసేందుకు డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ విధానాన్ని అనుసరించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీనికి సంబంధించి కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ నుంచి సత్వర అనుమతులకు ప్రయత్నించాలని నీటిపారుదల శాఖను ఆదే శించింది. ఏఎంఆర్ ప్రాజెక్టులో భాగంగా శ్రీశైలం జలాశయం నుంచి నీటిని 43.93 కి.మీల సొరంగ మార్గంలో తరలించి లింక్ కాల్వ ద్వారా డిండి జలాశయంలోకి పోయాల్సి ఉంది. సొరంగాన్ని రెండు టన్నెల్ బోర్ మెషీన్ల (టీబీఎం) సహాయంతో రెండు వైపులా (ఇన్లెట్, అవుట్లెట్) నుంచి తవ్వుకుంటూ పోతున్నారు. శ్రీశైలం జలాశయ ఇన్లెట్ నుంచి 13.93 కి.మీల పనులు పూర్తి కాగా,అవతలి వైపు నుంచి మరో 20.43 కి.మీల మేర తవ్వకాలు పూర్తయ్యాయి. మధ్యలో 9.55 కి.మీల మేర సొరంగం తవ్వకాలు జరగాల్సి ఉంది. ఇకపై టీబీఎంతో రెండు వైపులా తవ్వకాలను విరమించుకొని ప్రత్యామ్నాయంగా డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ విధానాన్ని అనుసరించనున్నారు. రెండు వైపుల నుంచి సొరంగాన్ని నేరుగా అనుసంధానం చేసేందుకు ఇప్పటి వరకు తవ్వకాలు జరిగాయి. ఇకపై నేరుగా తవ్వకాలను కొనసాగించరు. రెండు వైపులా తవ్వకాలు ఆగిపోయిన చివర పక్కభాగం నుంచి డ్రిలింగ్ అండ్ బ్లాస్టింగ్ విధానంలో తవ్వకాలు జరుపుకుంటూపోయి రెండు చివరలను అనుసంధానం చేస్తారు దీంతో కిలోమీటర్ వరకు సొరంగం పొడవు పెరిగే అవకాశముంది. రెండు టీబీఎంలను సొరంగంలో ఇప్పుడున్న ప్రాంతంలోనే సమాధి చేస్తారు. ఎస్ఎల్బీసీ సొరంగం పైకప్పు కూలిన ఘటనలో గల్లంతైన కార్మికులను వెలికితీసేందుకు జరుగుతున్న సహాయక చర్యలపై ముఖ్యమంతి రేవంత్‌రెడ్డి సోమవారం అసెంబ్లీ కమిటీ హాల్లో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ సమీక్షలో మంత్రులు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. సహాయక చర్యలు కొనసాగించండి కార్మికులను వెలికితీసేందుకు కొనసాగుతున్న సహాయక చర్యలను ఏప్రిల్ 10లోగా ముగించాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సహాయక చర్యలను నిరంతరం దగ్గరుండి పర్యవేక్షించేందుకు ఐఏఎస్ అధికారి శివశంకర్‌ను ప్రత్యేకాధికారిగా నియమించాలని సీఎస్‌ను ఆదేశించారు. నెలరోజులుగా ప్రమాద స్థలిలో కొనసాగుతున్న సహాయక చర్యల పురోగతిని విపత్తుల నిర్వహణ శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధానకార్యదర్శి అర్వింద్‌కుమార్, కల్నల్ పరీక్షిత్ మెహ్రా ముఖ్యమంత్రికి వివరించారు. రెస్క్యూ ఆపరేషన్ కళ్లకు కట్టేలా ప్రమాదం జరిగిన రోజు నుంచి, ఇప్పుడున్న పరిస్థితులపై ఫొటోలతో సహా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో 30 మీటర్లు అత్యంత ప్రమాదకర జోన్ ఉన్నట్టు గుర్తించామన్నారు. జీఎస్ఐ, ఎన్జీఆర్ఐ శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం..అక్కడ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాల్సి ఉంటుందనే అభిప్రాయం వెలిబుచ్చారు. అవసరమైన అనుమతులు తీసుకోవాలి ప్రమాదానికి గురైన కార్మికుల ఆచూకీ కనుక్కునేందుకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఈ ఆపద సమయంలో చేపట్టాల్సిన అత్యవసర పనులకు కేంద్రం నుంచి అవసరమైన అన్ని అనుమతులు తీసుకోవాలని ఆదేశించారు. ఫిబ్రవరి 22న ఎస్ఎల్బీసీ సొరంగం కుప్పకూలడంతో ఎనిమిది మంది కార్మికులు గల్లంతు కాగా, వీరిలో గుర్‌ప్రీత్‌సింగ్ మృతదేహాన్ని మార్చి 9న వెలికితీశారు. మిగతా కార్మికులను గుర్తించేందుకు ఆపరేషన్ కొనసాగించాలని, అవసరమైన అన్ని ప్రత్యామ్నాయాలను అనుసరించాలని ముఖ్యమంత్రి చెప్పారు. తెలంగాణ, ఆంధ్రా సబ్ ఏరియా జనరల్ ఆఫీసర్ కమాండింగ్ అజయ్ మిశ్రా, ఇరిగేషన్ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ తదితరులు పాల్గొన్నారు. అవసరమైన అనుమతులు తీసుకోవాలి కార్మికుల ఆచూకీ కనుక్కునేందుకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ ఆపద సమయంలో చేపట్టాల్సిన అత్యవసర పనులకు కేంద్రం నుంచి అన్ని అనుమతులు తీసుకోవాలని ఆదేశించారు. ఫిబ్రవరి 22న ఎస్ఎల్బీసీ సొరంగం కుప్ప కూలడంతో ఎనిమిది మంది కార్మికులు గల్లంతు కాగా, వారిలో గుర్‌ప్రీత్‌సింగ్ మృతదేహాన్నిమార్చి 9న వెలికితీశారు. మిగతా కార్మికులను గుర్తించేందుకు ఆపరేషన్ కొనసాగించాలని, అవసరమైన అన్ని ప్రత్యామ్నాయాలను అనుసరించాలని సీఎం చెప్పారు. తెలంగాణ,ఆంధ్రా సబ్ ఏరియా జనరల్ ఆఫీసర్ కమాండింగ్ అజయ్ మిశ్రా, ఇరిగేషన్ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ తదితరులు పాల్గొన్నారు.

ఉత్కంఠపోరులో ఢిల్లీ విజయం..
IPL 2025 LSG vs DC live updates and highlights: వారెవ్వా అశుతోష్.. ఉత్కంఠపోరులో ఢిల్లీ విజయంవైజాగ్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒక్క వికెట్ తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ సంచలన విజయం సాధించింది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో అశుతోష్ శర్మ ఢిల్లీని గెలిపించాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన అశుతోష్.. తన విరోచిత పోరాటంతో ఢిల్లీని ఓటమి నుంచి గట్టెక్కించాడు. ఫలితంగా 210 పరుగుల భారీ లక్ష్యాన్ని ఢిల్లీ.. 9 వికెట్లు కోల్పోయి 19.3 ఓవర్లలో అందుకుంది. ఢిల్లీ బ్యాటర్లలో అశుతోష్‌తో పాటు విప్రజ్ నిగమ్( 15 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 39), స్టబ్స్(34) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు.రసవత్తరంగా మ్యాచ్..ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. ఢిల్లీ విజయానికి 12 బంతుల్లో 22 పరుగులు కావాలి. క్రీజులో అశుతోష్ శర్మ(48) పరుగులతో ఉన్నారు.దూకుడుగా ఆడుతున్న విప్రజ్విప్రజ్ నిగమ్(11 బంతుల్లో 30) దూకుడుగా ఆడుతున్నాడు. విప్రజ్ తన బ్యాటింగ్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ శిబిరంలో ఆశలు రెకెత్తించాడు. ఢిల్లీ విజయానికి 30 బంతుల్లో 62 పరుగులు కావాలి.ఢిల్లీ ఆరో వికెట్ డౌన్ట్రిస్టన్ స్టబ్స్ రూపంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఆరో వికెట్ కోల్పోయింది. 34 పరుగులు చేసిన స్టబ్స్.. సిద్దార్ధ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. ఢిల్లీ విజయానికి 42 బంతుల్లో 94 పరుగులు కావాలి. క్రీజులో అశుతోష్ శర్మ(17), విప్రాజ్ నిగమ్(2) ఉన్నారు.కష్టాల్లో ఢిల్లీ క్యాపిటల్స్..210 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి ఢిల్లీ క్యాపిటల్స్ తడబడుతోంది. ఢిల్లీ కేవలం 66 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అక్షర్ పటేల్(22) నాలుగో వికెట్ వెనుదిరగగా.. ఫాఫ్ డుప్లెసిస్(29) ఐదో వికెట్‌గా పెవిలియన్‌కు చేరాడు. 4 ఓవర్లకు ఢిల్లీ స్కోర్: 32/34 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ 3 వికెట్ల నష్టానికి 32 పరుగులు చేసింది. క్రీజులో ఫాప్ డుప్లెసిస్(14), అక్షర్ పటేల్(13) పరుగులతో ఉన్నారు.ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్ షాక్.. తొలి ఓవర్లో రెండు వికెట్లు210 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి ఢిల్లీ క్యాపిటల్స్‌కు భారీ షాక్ తగిలింది. శార్థూల్ ఠాకూర్ వేసిన తొలి ఒవర్లో వరుసగా జాక్ ఫ్రెజర్ మెక్‌గర్క్(1), అభిషేక్ పోరెల్(0) ఔటయ్యాడు.మార్ష్, పూరన్ ఊచకోత.. ఢిల్లీ ముందు భారీ టార్గెట్వైజాగ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్లు అదరగొట్టారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. లక్నో బ్యాటర్లలో మిచెల్ మార్ష్( 36 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 72), నికోలస్ పూరన్( 30 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్స్‌లతో 75 పరుగులు) హాఫ్ సెంచరీలతో మెరిశారు. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు, కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు సాధించగా.. విప్రాజ్ నిగమ్, ముఖేష్ కుమార్ తలా వికెట్ సాధించారు.18 ఓవర్లకు ఢిల్లీ స్కోర్: 188/6ఢిల్లీ క్యాపిటల్స్ వరుస క్రమంలో వికెట్లు కోల్పోయింది. 18 ఓవర్లు ముగిసే సరికి 6 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. క్రీజులో డేవిడ్ మిల్లర్(12), షెబాజ్ ఆహ్మద్(4) ఉన్నారు.మిచెల్ మార్ష్ ఔట్.. లక్నో సూపర్ జెయింట్స్ మిచెల్ మార్ష్ రూపంలో రెండో వికెట్ కోల్పోయింది. 72 పరుగులు చేసిన మార్ష్.. ముఖేష్ కుమార్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి రిషబ్ పంత్ వచ్చాడు. 14 ఓవర్లకు లక్నో స్కోర్: 161/2. క్రీజులో నికోలస్ పూరన్(70), రిషబ్ పంత్(0) పరుగులతో ఉన్నారు.భారీ స్కోర్ దిశగా లక్నో..11 ఓవర్లు ముగిసే సరికి లక్నో వికెట్ నష్టానికి 125 పరుగులు చేసింది. క్రీజులో మిచెల్ మార్ష్(65), నికోలస్ పూరన్(41) పరుగులతో ఉన్నారు.మార్ష్ హాఫ్ సెంచరీ..లక్నో స్టార్ ఓపెనర్ మిచెల్ మార్ష్ ఆర్ధశతకం సాధించాడు. మార్ష్ 21 బంతుల్లో తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. క్రీజులోకి వచ్చిన నికోలస్ పూరన్ సైతం దూకుడుగా ఆడుతున్నాడు. 8 ఓవర్లకు లక్నో స్కోర్: 98/1. ప్రస్తుతం క్రీజులో మిచెల్ మార్ష్(20), నికోలస్ పూరన్(31) ఉన్నారు.తొలి వికెట్ కోల్పోయిన లక్నో..ఐడైన్ మార్క్రమ్ రూపంలో లక్నో సూపర్ జెయింట్స్ తొలి వికెట్ కోల్పోయింది. 15 పరుగులు చేసిన మార్క్రమ్.. విప్రజ్ నిగమ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 5 ఓవర్లకు లక్నో స్కోర్: 50/1దూకుడుగా ఆడుతున్న లక్నో..టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన లక్నో సూపర్ జెయింట్స్ వికెట్ నష్టపోకుండా 33 పరుగులు చేసింది. ఓపెనర్లు ఐడైన్ మార్క్రమ్(13), మిచెల్ మార్ష్(20) దూకుడుగా ఆడుతున్నారు.తుది జట్లుఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, ఫాఫ్ డు ప్లెసిస్, అభిషేక్ పోరెల్(వికెట్ కీపర్), సమీర్ రిజ్వి, అక్షర్ పటేల్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ, ముఖేష్ కుమార్లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): ఐడెన్ మార్క్రామ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, రిషబ్ పంత్(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్ రాఠీ, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, రవి బిష్ణోయ్

8 వారాలు కాదు.. 4 వారాలే గడువు
లక్నో: కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పౌరసత్వానికి(Rahul Gandhi Citizenship) సంబంధించిన కేసులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. పౌరసత్వ వ్యవహారం తేల్చే విషయంలో కేంద్రానికి నాలుగు వారాల గడువు విధించింది అలహాబాద్ హైకోర్టు.రాహుల్ గాంధీ పౌరసత్వాన్ని సవాల్ చేస్తూ కర్ణాటకకు చెందిన విగ్నేష్ శిశిర్ అనే బీజేపీ కార్యకర్త అలహాబాద్ హైకోర్టులోని లక్నో బెంచ్‌లో ఈ ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేశారు. రాహుల్ గాంధీ ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్నారని, కాబట్టి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 84(ఏ) ప్రకారం ఆయన ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హుడంటూ తన పిటిషన్లో పేర్కొన్నారు. అంతేకాదు.. ఈ వ్యవహారంపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని కోరారు. తాజాగా.. జరిగిన విచారణ సందర్భంగా సంచలన విషయాల పేరిట కోర్టు ముందు కొన్ని విషయాలు ఉంచారు. ‘‘రాహుల్ గాంధీ పౌరసత్వంపై యూకే ప్రభుత్వం నుంచి వచ్చిన మెయిల్ సమాచారం మా దగ్గర ఉంది. అక్కడి పౌరసత్వ జాబితాలో రాహుల్ గాంధీ పేరు ఉంది. అందుకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను మేం కోర్టుకు సమర్పించాం. భారత చట్టాల ప్రకారం.. ద్వంద్వ పౌరసత్వం చెల్లదు. వేరే దేశ పౌరసత్వం తీసుకుంటే.. భారత పౌరసత్వం రద్దు అయిపోతుంది’’ అని శిశిర్ అంటున్నారు.ఇదిలా ఉంటే.. కిందటి ఏడాది నవంబర్లోనే ద్విసభ్య ధర్మాసనం కేంద్ర హోం శాఖ నుంచి ఈ పిటిషన్‌పై వివరణ కోరింది. అయితే అందుకు సమగ్ర వివరాల సేకరణకు గడువు కావాలని కేంద్రం కోరడంతో అనుమతించింది. తాజా విచారణలోనూ 8 వారాల గడువు కోరగా.. అందుకు నిరాకరిస్తూ 4 వారాల గడువు మాత్రమే ఇచ్చింది. మరోవైపు.. బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి ఢిల్లీ హైకోర్టులో రాహుల్ గాంధీ పౌరసత్వంపై ఆరోపణలతో 2019లోనే ఓ పిటిషన్ వేశారు. 2003లో స్థాపించబడిన ఓ బ్రిటిష్ కంపెనీ రికార్డుల్లో రాహుల్ గాంధీ పేరు యూకే పౌరుడిగా ఉందని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. అంతకు నాలుగేళ్ల ముందే.. 2015లో అప్పటి ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ డీకే ఉపాధ్యాయ, జస్టిస్ టీఆర్ గెడెలకు ఈ అంశంపై సుబ్రహ్మణ్య స్వామి లేఖ రాశారు. అయితే ఆ టైంలో ప్రతిస్పందన రాలేదు. తాజాగా.. అలహాబాద్ హైకోర్టులోనూ ఒకే తరహా పిటిషన్ ఫైల్ కావడాన్ని ప్రస్తావించిన ఢిల్లీ హైకోర్టు.. తగిన చర్యలు తీసుకోవాలంటూ కేంద్రాన్ని ఆదేశించింది. మరోవైపు.. రాహుల్ గాంధీ ద్వంద్వ పౌరసత్వం ఆరోపణలను కాంగ్రెస్ ఎప్పటికప్పుడు తోసిపుచ్చుతూ వస్తోంది. ఆయన భారతీయుడేనంటూ చెబుతోంది. మరోవైపు ఇది తన ప్రతిష్టను దెబ్బ తీసే ప్రయత్నమేనని రాహుల్ గాంధీ, తన సోదరుడు పుట్టింది.. పెరిగింది ఈ గడ్డ మీదేనంటూ వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ ఇంతకు ముందే ప్రకటించారు.

టీడీపీ ఎంపీలు మూగబోయినా మేం పోరాడుతూనే ఉంటాం
న్యూఢిల్లీ, సాక్షి: ఒకవైపు ఏపీకి తీరని అన్యాయం జరుగుతుంటే.. మరోవైపు ఏ ఒక్క అంశంపైనా టీడీపీ ఎంపీలు(TDP MPs) నోరు విప్పడం లేదని వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి అన్నారు. అయితే.. రాష్ట్రానికి న్యాయం జరిగే వరకు వైఎస్సార్సీపీ పోరాడుతూనే ఉంటుందని స్పష్టం చేశారాయన. ఫైనాన్స్ బిల్లుపై చర్చ సందర్భంగా సోమవారం వైఎస్సార్సీపీ తరఫున ఆయన చర్చలో పాల్గొన్నారు. పోలవరం అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తే దమ్ము టీడీపీ ఎంపీలకు లేదు. ప్రాజెక్టు ఎత్తు(Polavaram Hight)పై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి. పోలవరం ఎత్తును 45 . 72 నుంచి 41.15 తగ్గించడం అన్యాయం. దాదాపు 194 టీఎంసీల కెపాసిటీతో దీనిని డిజైన్ చేశారు. కానీ, ఎత్తు తగ్గించడం వల్ల స్టోరేజ్ కెపాసిటీ 115 టీఎంసీలకు పడిపోతుంది. అలాగే.. రూ.60 వేల కోట్ల వ్యయం అవుతుండగా కేవలం 30 వేల కోట్ల రూపాయలకి కేంద్ర ప్రభుత్వం పరిమితం అవుతోంది. పార్లమెంటులో ఇచ్చిన హామీని కేంద్రం నిలబెట్టుకోకపోవడం అన్యాయం. 👉టీడీపీ ఎంపీలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ (Vizag Steel Plant Privatization) అంశాన్ని ప్రస్తావించలేకపోతున్నారు. ఓవైపు ప్రైవేటీకరణ చేస్తామని, మరోవైపు మద్దతిస్తామని విరుద్ధ ప్రకటన చేస్తున్నారు. ప్రైవేటీకరణే జరిగితే ఉద్యోగులకు, రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది.👉ఏపీలో రూ.2,000 కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తవుతుంది. కానీ, ప్రస్తుత ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలు నిర్మాణాన్ని నిలిపివేసింది. మంజూరైన సీట్లను సైతం తాము కాలేజీని నడపలేమని ప్రభుత్వం చేతులెత్తేసింది. మెడికల్ కాలేజీలను ప్రైవేటు వారికి అమ్మివేయాలని చూస్తున్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని మెడికల్ కాలేజీలను నడిపేలా చర్యలు తీసుకోవాలి. 👉ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా ఉన్నాయి. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను కేంద్రం విస్మరించింది. విభజన చట్టంలోని హామీలను మరిపోయింది. ఒక కిలోమీటర్ నేషనల్ హైవే నిర్మించడానికి 20 కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. కానీ, అమరావతిలో మాత్రం 40 నుంచి 50 కోట్ల రూపాయలకు పెంచారు. ఇది ప్రజాధనం దుర్వినియోగం చేయడమే. ఇందులో పెద్ద ఎత్తున దుర్వినియోగం జరుగుతోంది. ఈ గణాంకాల పైన అధికారిని నియమించి దర్యాప్తు చేయాలి. 👉వైఎస్సార్ హయాంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రవేశపెట్టారు. కానీ, గడిచిన 11 నెలల నుంచి ఏపీలోని కూటమి రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ చేయడం లేదు. విద్యార్థులు డబ్బు చెల్లిస్తే తప్ప హాల్ టికెట్లు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడ్డాయి. ఆరోగ్యశ్రీ పథకం కింద చెల్లించాల్సిన బకాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడం లేదు. ఫలితంగా రోగులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఏపీలో గత ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాత్మక కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ‘‘మేము రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. మాపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. కేసులకు భయపడేది లేదు.. ప్రశ్నిస్తూనే ఉంటాం ఏపీకి న్యాయం జరిగే వరకు మేము పోరాటం చేస్తుంటాం’’ అని మిథున్ రెడ్డి అన్నారు.

‘ఉషా వాన్స్ రాక.. మమ్మల్ని రెచ్చగొట్టడమే!’
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సతీమణి ఉషా వాన్స్ ‘గ్రీన్లాండ్ పర్యటన’ ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. రెండ్రోజులు ఆమె పర్యటించాల్సి ఉండగా.. ప్రకటన వెలువడి 24 గంటలు గడవక ముందే గ్రీన్లాండ్ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. ఉష పర్యటనను బహిష్కరించాలని అక్కడి తాత్కాలిక ప్రభుత్వం నిర్ణయించింది. విలువైన ఖనిజాలు ఉన్న ఈ అతిపెద్ద ద్వీపదేశాన్ని హస్తగతం చేసుకుంటానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న వరుస ప్రకటనలే ఇందుకు కారణం. అమెరికా సెకండ్ లేడీ ఉషా వాన్స్(Usha Vance) ఈ నెల 27 నుంచి 29వ తేదీదాకా గ్రీన్లాండ్లో పర్యటించాల్సి ఉంది. అవన్నాట కిముస్సర్సులో జరగబోయే డాగ్స్లెడ్ రేసుకు హాజరు కావడంతో పాటు పలు ప్రాంతాల్లో ఆమె పర్యటించనున్నారు. అయితే ఈ పర్యటనను ఆ దేశ ప్రధాని మ్యూట్ ఎగేడే తీవ్రంగా విమర్శిస్తున్నారు. అమెరికా-గగ్రీన్లాండ్ మధ్య ఒకప్పటిలా మంచి సంబంధాలు లేవని.. అది ఈమధ్యే ముగిసిపోయిందని అన్నారాయన. అలాగే ఉషా వాన్స్ పర్యటన.. ముమ్మాటికీ గ్రీన్‌లాండ్‌ను రెచ్చగొట్టడం కిందకే వస్తుందని అంటున్నారాయన. అంతేకాదు.. ఆమె వెంట జాతీయ భద్రతా సలహాదారు మైక్ వాల్ట్జ్, ఎనర్జీ సెక్రటరీ క్రిస్ రైట్లతో కూడిన బృందాలు వస్తుండడంపైనా ఎగేడే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక తన పర్యటనకు ముందు ఉషా వాన్స్ ఓ వీడియోను పోస్ట్ చేశారు. SLOTUS VISITING GREENLAND 🇬🇱 Hands up If USA should purchase Greenland. pic.twitter.com/fkduBBVOPB— Usha Vance News (@UshaVanceNews) March 23, 2025 గ్రీన్లాండ్(GreenLand).. అతిపెద్ద ద్వీపం. అర్కిటిక్-అట్లాంటిక్ మహాసముద్రాల మధ్యలో ఉంటుంది. భౌగోళికంగా ఉత్తర అమెరికాలో భాగమైనప్పటికీ.. యూరప్ దేశాలతోనే రాజకీయ, సంప్రదాయపరంగా కలిసి ఉంది. అయితే ఇది స్వతంత్ర దేశం కాదు. కింగ్డమ్ ఆఫ్ డెన్మార్క్ సరిహద్దులో అటానమస్‌గా ఉండిపోయింది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచే గ్రీన్‌లాండ్‌ను చేజిక్కించుకోవడంపై ట్రంప్ వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. అయితే.. ఈ ప్రతిపాదనను ఇటు గ్రీన్లాండ్, అటు డెన్మార్క్ రెండూ వ్యతిరేకిస్తున్నాయి. రెండు నెలల కిందట ట్రంప్ పెద్ద కొడుకు గ్రీన్‌లాండ్‌ను సందర్శించారు.మార్చి 11వ తేదీన జరిగిన గ్రీన్లాండ్ పార్లమెంట్ ఎన్నికల్లో డెమోక్రట్స్ ఘన విజయం సాధించారు. డెమోక్రట్స్ నేత జెన్స్ ఫ్రెడ్రిక్ నీల్సన్ సైతం ఉషా వాన్స్ పర్యటనను తీవ్రంగా తప్పుబట్టారు. అయితే విమర్శలతో సంబంధం లేకుండా.. ఉషా వాన్స్ పర్యటన భద్రత కోసం అమెరికా నుంచి ప్రత్యేక బలగాలు గ్రీన్లాండ్కు చేరుకున్నాయి. మరోవైపు ఈ పర్యటనను వ్యతిరేకిస్తూనే.. అమెరికాతో దౌత్యపరమైన సంబంధాల దృష్ట్యా గ్రీన్లాండ్కు తమ పోలీసు బలగాలను డెన్మార్క్ పంపించింది.

మంచు పావురం
కశ్మీర్లో సైకిల్ తొక్కడం కష్టం. అయితే మగ పోస్ట్‌మేన్‌లే సైకిల్ తొక్కుతారు. ఉల్ఫతాబానోకు తన రెండు కాళ్లే సైకిల్ చక్రాలు. కశ్మీర్లో మొదటి మహిళా పోస్ట్ఉమన్గా ఆమె 30 ఏళ్లుగా నడిచి ఉత్తరాలు అందిస్తోంది. మంచు తుఫాన్లు, కాల్పుల మోతలు, భయం గొలిపే ఒంటరి మార్గాలు ఆమెను ఆపలేవు. ఇలా వార్తలు మోసే పావురం ఒకటి ఉందని తెలియడానికి ఇంత కాలం పట్టింది. ఇప్పుడుగాని మీడియా రాయడం లేదు. ఈ ఉత్తరం జీవితకాలం లేటు.మంచులో నడవడం మీకు వచ్చా? మూడు నాలుగడుగుల మంచులో నాలుగు అడుగులు నడవడం ఎంత కష్టమో తెలుసా? బాగా శక్తి ఉన్న యువతీ యువకులకే సాధ్యం కాదు. కాని 55 ఏళ్ల ఉల్ఫతా బానో గత 30 ఏళ్లుగా అలాంటి మంచులోనే నడిచి తన ఊరికి బయటి ప్రపంచానికి అనుసంధానకర్తగా ఉంది. ‘హిర్పురా’ అనే చిన్న పల్లెకి ఆమె ఏకైక మహిళా పోస్ట్ఉమన్. ఈ ఊరు శ్రీనగర్‌కు 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రపంచంతో తెగినట్టుండే ఈ ఊరిలో ఒక వార్త తెలియాలన్నా ఒక విశేషం అందాలన్నా ఉల్ఫతానే ఆధారం.5 నెలలు మంచులోనేదక్షిణ కశ్మీర్‌లోని హిర్పురాలో ప్రతి నవంబర్ నుంచి మార్చి వరకు ఐదు నెలల పాటు దారుణమైన వాతావరణం ఉంటుంది. దట్టమైన మంచు కురుస్తుంది. రోడ్లు మూసుకుపోతాయి. కాని హిర్పురాకు ప్రతిరోజూ కనీసం 30 ఉత్తరాలో, పార్శిళ్లో వస్తాయి. ఒక పురుష ఉద్యోగి జిల్లా హెడ్‌క్వార్టర్ అయిన షోపియన్‌కు వెళ్లి వాటిని పట్టుకొస్తాడు. ఇక పంచే బాధ్యత ఉల్ఫతా బానోదే. ‘నేను మెట్రిక్యులేషన్ చదవడం వల్ల ఈ ఉద్యోగం వచ్చింది. నా భర్త కూడా పోస్ట్‌మేన్‌గా పని చేసి రిటైర్ అయ్యాడు. నాకు ప్రస్తుతం 22 వేల రూపాయల జీతం వస్తోంది’ అని తెలిపింది ఉల్ఫతా బానో.ఎన్నో సవాళ్లు ధైర్యమే జవాబుఉల్ఫతాకు సైకిల్ తొక్కడం రాదు. సైకిల్ తొక్కడం కష్టమే ఆప్రాంతంలో. అందుకే తాను ఎక్కువగా నడుస్తుంది. ‘రోజుకు నాలుగైదు కిలోమీటర్లు నడుస్తాను’ అంటుందామె. ఉల్ఫతా ఎంతో అవసరం అయితే తప్ప లీవ్ పెట్టదు. ‘దట్టమైన మంచు కురుస్తున్నా లాంగ్బూట్లు వేసుకొని గొడుగు తీసుకొని డ్యూటీకి వెళతాను. పాపం... ఉత్తరాల కోసం ఎదురు చూస్తుంటారు కదా’ అంటుందామె. మంచులో ఒకో ఇంటికి మరో ఇంటికి కూడా సంబంధం తెగిపోయినా ఉల్ఫతా మాత్రం అక్కడకు వెళ్లి ఉత్తరం అందిస్తుంది. ‘ఊళ్లో చాలామంది స్టూడెంట్స్ స్టడీ మెటీరియల్ తెప్పించుకుంటూ ఉంటారు. వారికి నన్ను చూస్తే సంతోషం. వాళ్ళు చదువుకోవడానికి నేను సాయపడుతున్నందుకు తృప్తిగా ఉంటుంది’ అంటుందామె.క్రూరమృగాల భయంకశ్మీర్ సున్నితప్రాంతం. గొడవలు... కాల్పుల భయం ఉండనే ఉంటుంది. అయితే అది అటవీప్రాంతం కూడా. ‘మంచు కాలంలో ఆహారం దొరక్క మంచు చిరుతలు, ఎలుగుబంట్లు ఊరి మీద పడతాయి. నేను ఉత్తరాలు ఇవ్వడానికి తిరుగుతుంటే అవి ఎక్కడ దాడి చేస్తాయోననే భయం ఉంటుంది. కాని నాకెప్పుడు అవి ప్రమాదం తలపెట్టలేదు’ అంటుంది ఉల్ఫతా. సాధారణంగా ఇలాంటి ఊళ్లలో డ్యూటీ చేసినా చేయక పోయినా ఎవరూ పట్టించుకోరు. ‘కాని డ్యూటీ ఒప్పుకున్నాక చేయాలి కదా. అది పెద్ద బాధ్యత. ఆ బాధ్యతే నన్ను 30 ఏళ్లుగా పని చేసేలా చేస్తోంది’ అని సంతృప్తి వ్యక్తం చేస్తుంది ఉల్ఫతా.ఏసి ఆఫీసుల్లో ఉంటూ హాయిగా వాహనాల్లో వచ్చి పోతూ కూడా తమ డ్యూటీ తాము చేయడానికి అలక్ష్యం చేసే వారు ఉల్ఫతాను చూసి బాధ్యతను గుర్తెరగాలి.

మాకొద్దంటున్నా... అలహాబాద్ హైకోర్టుకే యశ్వంత్ వర్మ!
ఢిల్లీ : అవినీతి మరక అంటుకుని దాని నుంచి ఎలా బయటపడాలో తెలియని అయోమయ స్థితిలో ఉన్న ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మను.. అలహాబాద్ హైకోర్టుకే బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం మరోమారు నిర్ణయం తీసుకుంది. యశ్వంత్ వర్మ బదిలీ అంశానికి సంబంధించి గురువారం, సోమవారాల్లో ప్రత్యేకంగా రెండు సార్లు సమావేశమైన సుప్రీంకోర్టు కొలీజియం చివరకు అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా పంపాలని నిర్ణయించింది. ఈ మేరకు సీజేఐ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం తీసుకున్న నిర్ణయాన్ని.. కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే యశ్వంత్ వర్మ అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా వెళ్లాల్సి ఉంటుంది.ఢిల్లీ హైకోర్టులో నో వర్క్..!అవినీతి ఆరోపణల అనంతరం ఏం జరుగుతుందా అని ఉత్కంఠ ఏర్పడింది. యశ్వంత్ యధావిధిగా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా కొనసాగుతారా.. లేక అలహాబాద్ హైకోర్టు వెళతారా అనే సందిగ్థంలో ఉండగా సుప్రీంకోర్టు కొలీజియం ఎట్టకేలకు అలహాబాద్ హైకోర్టుకు పంపడానికే మొగ్గుచూపింది. ఢిల్లీ హైకోర్టులో యశ్వంత్ కు ఎటువంటి బాధత్యలు అప్పగించకపోవడంతోనే.. సుప్రీంకోర్టు కొలీజియం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ నిరసనలు..అయితే అలహాబాద్ హైకోర్టు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం తొలుత తీసుకున్న నిర్ణయంపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్.. దీనిపై తీవ్రంగా మండిపడింది. అవినీతి ఆరోపణలు ఉన్న యశ్వంత్ ను ఇక్కడకు ఎలా బదిలీ చేస్తారంటూ నేరుగా సీజేఐకే లేఖ రాసింది. ఆ ‘ చెత్త’ మాకొద్దంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. అయితే బదిలీకి, అవినీతి అంశానికి ఎటువంటి సంబంధం లేదని సీజేఐ చెప్పుకొచ్చారు. యశ్వంత్ పై దర్యాప్తు జరుగుతుందంటూనే బదిలీని సమర్ధించుకుంది ధర్మాసనంకాగా, ఇటీవల జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో భారీగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. దాని విలువ సుమారు రూ. 15 కోట్లు ఉంటుందని అంచనాలు కూడా వేశారు. ఒక న్యాయమూర్తి వద్ద అంత డబ్బు ఎలా వచ్చిందంటూ చర్చ మొదలైంది. అదే సమయంలో ఇది కచ్చితంగా అవినీతి చేసే కూడపెట్టిందని వాదన బలంగా వినిపించింది. 2021లో అలహాబాద్ నుంచి ఢిల్లీ హైకోర్టుకు..ఈ నేపథ్యంలో యశ్వంత్ ను అలహాబాద్ హైకోర్టు బదిలీ చేయడం, ఆపై తమకు ఆ జడ్జి వద్దని అక్కడ నుంచి తీవ్ర నిరసన వ్యక్తం కావడం జరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టులోనే యశ్వంత్ కొనసాగుతారని భావించారు. కానీ అక్కడ ఆయన చేదు అనుభవం ఎదురుకావడంతో ఇప్పుడు అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకుంది. 2021 లో అలహాబాద్ హైకోర్టు నుంచి ఢిల్లీ హైకోర్టుకు వచ్చిన యశ్వంత్.. మళ్లీ అక్కడికే వెళ్లడానికి దాదాపు రంగం సిద్ధం కావడంతో అలహాబాద్ హైకోర్టులో ఆయనకు ఏ పరిణామాలు ఎదురవుతాయో చూడాల్సిందే.సుప్రీంకోర్టులో పిల్..యశ్వంత్ వర్మ ఇంట్లో వెలుగుచూసిన నోట్ల కట్టల వ్యవహారంపై దర్యాప్తునకు ఆదేశిస్తూ ప్రజా ప్రయోజన వాజ్యం(పిల్0 దాఖలైంది. ముందు భారీగా నోట్ల కట్టలు దొరికాయనే ఆరోపణలపై ముందుగా ఎప్ఐఆర్ నమోదు చేయాలని సుప్రీంకోర్టులో పలువురు న్యాయవాదులు పిల్ దాఖలు చేశారు.

గేమ్ ఛేంజర్‌లో ఛాన్స్.. ఎలా వచ్చినా నాకైతే గర్వంగా ఉంది: నవీన్ చంద్ర
టాలీవుడ్ నటుడు నవీన్ చంద్ర నటించిన చిత్రం '28 డిగ్రీ సెల్సియస్'. ఈ మూవీకి అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో షాలిని హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమాను వీరాంజనేయ ప్రొడక్షన్స్, రివర్సైడ్ సినిమాస్, జెనస్ స్టూడియోస్ బ్యానర్లపై సాంబకుల సాయి అభిషేక్ నిర్మిస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఈ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. కరోనాకు ముందే రావాల్సిన ఈ మూవీ పలు కారణాలతో వాయిదా పడింది. ఈ చిత్రం త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో ప్రియదర్శి, వైవా హర్ష, జయప్రకాష్, రాజా రవీంద్ర కీలక పాత్రలు పోషించారు.ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన హీరో నవీన్ చంద్ర గేమ్ ఛేంజర్ సినిమా గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆ చిత్రంలో అవకాశం రావడంపై ఆయన మాట్లాడారు. అంత పెద్ద భారీ బడ్జెట్ సినిమాలో నాకు ఛాన్స్ వచ్చినందుకు గర్వపడతానని నవీన్ చంద్ర అన్నారు. నన్ను ఎలా సెలెక్ట్ చేసినప్పటికీ ఆ మూవీ చేయడం నా కెరీర్లో ఓ గొప్ప మైలురాయిగా నిలిచిపోతుందని వెల్లడించారు.నవీన్ చంద్ర మాట్లాడుతూ..'పెద్ద బడ్జెట్, పెద్ద సినిమా.. అందరు ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకుని గేమ్ ఛేంజర్ తీశారు. నేను బళ్లారి నుంచి వచ్చా. అలాంటి పెద్ద సినిమాలో నాకు ఛాన్స్ వచ్చినందుకు గర్వంగా ఉంది. ఫలితం పక్కనపెడితే ఆ బిగ్గెస్ట్ బడ్జెట్.. బిగ్గెస్ట్ స్టార్ సినిమాలో ఛాన్స్ రావడమే చాలా గొప్పగా ఫీలయ్యా. నేను కొత్తవారితోనే ఎక్కువగా సినిమాలు చేస్తుంటాను. అయితే నేను చేసిన మొదటి పెద్ద సినిమా నేను లోకల్.. ఆ తర్వాత అరవింద సమేత వీరరాఘవ. మధ్యలో ఎక్కువగా చిన్న చిన్న బడ్జెట్ చిత్రాలే చేశా. కానీ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్‌కు వాళ్లు ఎలా సెలెక్ట్ చేసినా శంకర్ సార్‌తో, దిల్‌రాజ్ ప్రొడక్షన్లో వర్క్ చేయాలనే లక్ నాకు ఉంది. అందుకే గేమ్ ఛేంజర్‌లో అవకాశం వచ్చింది' అని అన్నారు.
టికెట్లివ్వగానే పని చేయడం మానేస్తున్నార్సార్!
ఏప్రిల్ 23న హైదరాబాద్ ‘స్థానిక’ ఎమ్మెల్సీ ఎన్నిక
అసెంబ్లీకి జగదీశ్‌రెడ్డి
ఆన్లైన్ ప్రకటనలపై డిజిటల్ ట్యాక్స్ తొలగింపు
ఉగాదిలోపు రాష్ట్ర బీజేపీకి కొత్త అధ్యక్షుడు!
పెను గాలుల నుంచి టేపులతో అరటికి రక్షణ!
లైంగిక దాడికి యత్నం.. రైలు నుంచి దూకిన యువతి
బతికాను బతికించాను
ప్లస్ టు పరీక్షల్లో కాలిక్యులేటర్‌కు అనుమతి
మంచు పావురం
అమెరికాలో విద్యాశాఖను మూసేసిన ట్రంప్
'6 నెలల సమయమివ్వండి.. అర్జున్ వరల్డ్‌లోనే బెస్ట్ బ్యాటర్ అవుతాడు'
అలా అయితే.. నేను జట్టులో ఉండటం వేస్ట్: ధోని
అమెరికాలో గుడివాడ యువకుడి బలవన్మరణం
నాలుగు వారాల కొరియన్ డైట్ ప్లాన్ : 6 రోజుల్లో 4 కిలోలు
అతడిని ఆపటం ఎవరితరం కాలేదు: భారత మాజీ క్రికెటర్
హీరో నితిన్‌పై హర్టయ్యా.. అవమానభారంతో షూటింగ్‌కు రానన్నా..: హర్షవర్ధన్
‘‘నాన్నా చంపొద్దు.. ప్లీజ్’’
BCCI: వార్షిక కాంట్రాక్టులు ప్రకటించిన బీసీసీఐ.. వాళ్లపై వేటు
ఐపీఎల్ వేలంలో అన్‌సోల్డ్.. కట్ చేస్తే! ఆ జట్టు కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్
టికెట్లివ్వగానే పని చేయడం మానేస్తున్నార్సార్!
ఏప్రిల్ 23న హైదరాబాద్ ‘స్థానిక’ ఎమ్మెల్సీ ఎన్నిక
అసెంబ్లీకి జగదీశ్‌రెడ్డి
ఆన్లైన్ ప్రకటనలపై డిజిటల్ ట్యాక్స్ తొలగింపు
ఉగాదిలోపు రాష్ట్ర బీజేపీకి కొత్త అధ్యక్షుడు!
పెను గాలుల నుంచి టేపులతో అరటికి రక్షణ!
లైంగిక దాడికి యత్నం.. రైలు నుంచి దూకిన యువతి
బతికాను బతికించాను
ప్లస్ టు పరీక్షల్లో కాలిక్యులేటర్‌కు అనుమతి
మంచు పావురం
అమెరికాలో విద్యాశాఖను మూసేసిన ట్రంప్
'6 నెలల సమయమివ్వండి.. అర్జున్ వరల్డ్‌లోనే బెస్ట్ బ్యాటర్ అవుతాడు'
అలా అయితే.. నేను జట్టులో ఉండటం వేస్ట్: ధోని
అమెరికాలో గుడివాడ యువకుడి బలవన్మరణం
నాలుగు వారాల కొరియన్ డైట్ ప్లాన్ : 6 రోజుల్లో 4 కిలోలు
అతడిని ఆపటం ఎవరితరం కాలేదు: భారత మాజీ క్రికెటర్
హీరో నితిన్‌పై హర్టయ్యా.. అవమానభారంతో షూటింగ్‌కు రానన్నా..: హర్షవర్ధన్
‘‘నాన్నా చంపొద్దు.. ప్లీజ్’’
BCCI: వార్షిక కాంట్రాక్టులు ప్రకటించిన బీసీసీఐ.. వాళ్లపై వేటు
ఐపీఎల్ వేలంలో అన్‌సోల్డ్.. కట్ చేస్తే! ఆ జట్టు కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్
సినిమా

గేమ్ ఛేంజర్‌లో ఛాన్స్.. ఎలా వచ్చినా నాకైతే గర్వంగా ఉంది: నవీన్ చంద్ర
టాలీవుడ్ నటుడు నవీన్ చంద్ర నటించిన చిత్రం '28 డిగ్రీ సెల్సియస్'. ఈ మూవీకి అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో షాలిని హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమాను వీరాంజనేయ ప్రొడక్షన్స్, రివర్సైడ్ సినిమాస్, జెనస్ స్టూడియోస్ బ్యానర్లపై సాంబకుల సాయి అభిషేక్ నిర్మిస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఈ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. కరోనాకు ముందే రావాల్సిన ఈ మూవీ పలు కారణాలతో వాయిదా పడింది. ఈ చిత్రం త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో ప్రియదర్శి, వైవా హర్ష, జయప్రకాష్, రాజా రవీంద్ర కీలక పాత్రలు పోషించారు.ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన హీరో నవీన్ చంద్ర గేమ్ ఛేంజర్ సినిమా గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆ చిత్రంలో అవకాశం రావడంపై ఆయన మాట్లాడారు. అంత పెద్ద భారీ బడ్జెట్ సినిమాలో నాకు ఛాన్స్ వచ్చినందుకు గర్వపడతానని నవీన్ చంద్ర అన్నారు. నన్ను ఎలా సెలెక్ట్ చేసినప్పటికీ ఆ మూవీ చేయడం నా కెరీర్లో ఓ గొప్ప మైలురాయిగా నిలిచిపోతుందని వెల్లడించారు.నవీన్ చంద్ర మాట్లాడుతూ..'పెద్ద బడ్జెట్, పెద్ద సినిమా.. అందరు ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకుని గేమ్ ఛేంజర్ తీశారు. నేను బళ్లారి నుంచి వచ్చా. అలాంటి పెద్ద సినిమాలో నాకు ఛాన్స్ వచ్చినందుకు గర్వంగా ఉంది. ఫలితం పక్కనపెడితే ఆ బిగ్గెస్ట్ బడ్జెట్.. బిగ్గెస్ట్ స్టార్ సినిమాలో ఛాన్స్ రావడమే చాలా గొప్పగా ఫీలయ్యా. నేను కొత్తవారితోనే ఎక్కువగా సినిమాలు చేస్తుంటాను. అయితే నేను చేసిన మొదటి పెద్ద సినిమా నేను లోకల్.. ఆ తర్వాత అరవింద సమేత వీరరాఘవ. మధ్యలో ఎక్కువగా చిన్న చిన్న బడ్జెట్ చిత్రాలే చేశా. కానీ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్‌కు వాళ్లు ఎలా సెలెక్ట్ చేసినా శంకర్ సార్‌తో, దిల్‌రాజ్ ప్రొడక్షన్లో వర్క్ చేయాలనే లక్ నాకు ఉంది. అందుకే గేమ్ ఛేంజర్‌లో అవకాశం వచ్చింది' అని అన్నారు.

నెల క్రితం గాయం.. 'మన్మథుడు' హీరోయిన్ కి ఏమైంది?
'మన్మథుడు' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ అన్షు (Anshu Sagar).. ఆ తర్వాత పెళ్లి చేసుకుని లండన్ లో సెటిలైపోయింది. దాదాపు 20 ఏళ్ల తర్వాత తిరిగి తెలుగు సినిమా చేసింది. అదే 'మజాకా' (Mazaka Movie). ఈ మూవీ థియేటర్లలో సరిగా ఆడలేదు. అయితే ఈ చిత్ర ప్రమోషన్స్ టైంలో అన్షు.. నుదుటిపై ప్లాస్టర్ తో కనిపించింది. ఏం జరిగిందా అనుకున్నారు గానీ ఈమె చెప్పకపోవడంతో ఎవరూ దీని గురించి అడగలేదు.(ఇదీ చదవండి: 'సలార్' విలన్ కి కారు ఈఎంఐ కష్టాలు)ఇప్పుడు స్వయంగా అన్షునే తనకు గాయమైన విషయాన్ని బయటపెట్టింది. దాదాపు నెల క్రితం ఊహించని విధంగా గాయపడ్డానని చెప్పింది. కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ ప్రేమ వల్ల ప్రస్తుతం కోలుకున్నానని చెప్పుకొచ్చింది. అయితే ఆ ప్లాస్టర్ కెమెరాల కోసం పెట్టుకున్నది కాదని, అది నిజమేనని క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది.నుదుటిపై పెద్ద గాయం కావడంతో ఆస్పత్రికి అన్షు వెళ్లడంతో కుట్లు వేశారు. తర్వాత దానిపై ప్లాస్టర్ పెట్టుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోల్ని.. వీడియోగా చేసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇలాంటి గాయాలు తనని ఆపలేవని, మరింత బలంగా బౌన్స్ బ్యాక్ అవుతానని అన్షు చెప్పుకొచ్చింది. మజాకా మూవీపై చాలా ఆశలు పెట్టుకుంది గానీ ఇదేమంత పెద్దగా ఆడకపోవడంతో తిరిగి లండన్ వెళ్లిపోయింది.(ఇదీ చదవండి: 'కన్నప్ప' మూవీని ట్రోల్ చేస్తే శాపానికి గురవుతారు: రఘుబాబు) View this post on Instagram A post shared by Anshu (@actressanshuofficial)

దళపతి విజయ్ చివరి సినిమా.. రిలీజ్ తేదీ ఫిక్స్
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తోన్న చివరి చిత్రం 'జననాయగన్'. ఈ సినిమాను పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో నటి పూజా హెగ్డే, మమిత బైజు హీరోయిన్లుగా కనిపించనున్నారు. అంతేకాకుండా కోలీవుడ్ భామ శృతిహాసన్ అతిథి పాత్రలో మెరవబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.ఇప్పటికే రాజకీయ పార్టీని ప్రారంభించిన విజయ్ వచ్చే ఎన్నికల్లో పోటీకి ముందు నటిస్తోన్న చివరి సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకున్నాయి.అయితే తాజాగా ఈ సినిమా గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌ను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. పొంగల్ పండుగ సందర్భంగా జనవరి 9, 2026న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తామని ట్విటర్లో పోస్ట్ చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ విజయ్ ప్రత్యేక పోస్టర్‌ను సోషల్ మీడియాలో పంచుకున్నారు. కాగా.. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, నటి ప్రియమణి, దర్శకుడు గౌతమ్ మీనన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందిస్తున్నారు.pic.twitter.com/JeY4Vpnc3J— Vijay (@actorvijay) March 24, 2025

'చనిపోయిన వాళ్లు మళ్లీ తిరిగొస్తారా?'.. ఆసక్తిగా 28 డిగ్రీల సెల్సియస్ ట్రైలర్
నవీన్ చంద్ర, షాలిని జంటగా నటించిన చిత్రం '28 డిగ్రీస్ సెల్సియస్'(28°C Movie). ఈ చిత్రానికి పొలిమేర సిరీస్ చిత్రాల డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించారు. అయితే ఈ మూవీ కరోనాకు ముందే రిలీజ్ కావాల్సి ఉండగా పలు కారణాలతో వాయిదా పడింది. తాజాగా హైదరాబాద్‌లో ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాను వీరాంజనేయ ప్రొడక్షన్స్, రివర్సైడ్ సినిమాస్, జెనస్ స్టూడియోస్ బ్యానర్లపై సాంబకుల సాయి అభిషేక్ నిర్మించారు.ట్రైలర్ చూస్తే హారర్ థ్రిల్లర్ మూవీగానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఒక అమ్మాయిని 28 డిగ్రీల సెల్సియస్‌లోనే కాపాడుకునే కథాంశంతో ఈ సినిమా రూపొందించారు. ట్రైలర్లో సీన్స్ చూస్తే ఓ ఇంటి చుట్టే ఈ కథ తిరుగుతున్నట్లు అనిపిస్తోంది. ఈ చిత్రం ఏప్రిల్ 4వ తేదీన థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో ప్రియదర్శి, వైవా హర్ష, జయప్రకాష్, రాజా రవీంద్ర కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీకి శ్రవణ్ భరద్వాజ్ సంగీతమందించారు.
న్యూస్ పాడ్‌కాస్ట్
క్రీడలు

ఢిల్లీ క్యాపిటల్స్‌కు భారీ షాక్.. లక్నోతో మ్యాచ్‌కు రాహుల్ దూరం
ఐపీఎల్-2025లో ఢిల్లీ క్యాపిటల్స్ తమ తొలి మ్యాచ్‌లో విశాఖపట్నం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. అయితే ఈ మ్యాచ్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ వ్యక్తిగత కారణాల వల్ల దూరమయ్యాడు.అతడి భార్య తొలి బిడ్డకు జన్మనివ్వనుండడంతో రాహుల్ ఇంకా జట్టుతో చేరలేదు. రాహుల్ స్ధానంలో సమీర్ రిజ్వీ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. కేఎల్ త్వరలోనే జట్టుతో చేరనున్నాడు. ఐపీఎల్-2025 మెగా వేలంలో రూ.14 కోట్ల భారీ ధరకు ఢిల్లీ కొనుగోలు చేసింది.తుది జట్లుఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, ఫాఫ్ డు ప్లెసిస్, అభిషేక్ పోరెల్(వికెట్ కీపర్), సమీర్ రిజ్వి, అక్షర్ పటేల్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ, ముఖేష్ కుమార్లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): ఐడెన్ మార్క్రామ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, రిషబ్ పంత్(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్ రాఠీ, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, రవి బిష్ణోయ్

ఐపీఎల్ వేలంలో అన్‌సోల్డ్.. కట్ చేస్తే! ఆ జట్టు కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్
పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) 2025 సీజన్లో కరాచీ కింగ్స్ (KK) కెప్టెన్‌గా ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని కరాచీ కింగ్స్ ఫ్రాంచైజీ సోమవారం సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. పీఎస్ఎల్లో డేవిడ్ వార్నర్ యాక్షన్ కోసం మేము ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము. కెప్టెన్ సాబ్ మీరు సిద్దంగా ఉన్నారా? అని కరాచీ కింగ్స్ ఎక్స్‌లో ఓ వీడియోను పోస్ట్ చేసింది. పాకిస్తాన్ సూపర్ లీగ్ డేవిడ్ భాయ్ ఆడటం ఇదే తొలిసారి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 మెగా వేలంలో అమ్ముడుపోకపోవడంతో వార్నర్ తన పేరును పీఎస్ఎల్ డ్రాప్ట్‌లో నమోదు చేసుకున్నాడు. దీంతో జనవరిలో జరిగిన పీఎస్ఎల్ వేలంలో 300,000 డాలర్లు (రూ. 2.56 కోట్లు)కు వార్నర్‌ను కరాచీ కింగ్స్ కొనుగోలు చేసింది.మసూద్‌పై వేటు..గత సీజన్ వరకు తమ జట్టు కెప్టెన్‌గా వ్యవహరించిన షాన్ మసూద్‌పై కరాచీ కింగ్స్ వేటు వేసింది. అతడి స్ధానంలో డేవిడ్ వార్నర్‌కు తమ జట్టు పగ్గాలను కరాచీ అప్పగించింది. కాగా గతేడాదిలో జూన్‌లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయినప్పటి నుండి, వార్నర్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్రాంచైజీ లీగ్‌లలో ఆడుతున్నాడు.ఈ క్రమంలో ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోకపోవడంతో పాకిస్తాన్లో ఆడాలని ర్ణయించుకున్నాడు. పీఎస్ఎల్ డ్రాప్ట్‌లో ప్లాటినం విభాగంలో అతడిని కేకే ఫ్రాంచైజీ దక్కించుకుంది. కరాచీ జట్టులో ఆడమ్ మిల్నే, జేమ్స్ విన్స్,టిమ్ సీఫెర్ట్ వంటి విదేశీ స్టార్లు ఉన్నారు. ఇక పీఎస్ఎల్-2025 సీజన్ ఏప్రిల్ 11 నుంచి ప్రారంభం కానుంది.కరాచీ కింగ్స్ జట్టు: అబ్బాస్ అఫ్రిది, ఆడమ్ మిల్నే, డేవిడ్ వార్నర్, హసన్ అలీ, జేమ్స్ విన్స్, ఖుష్దిల్ షా, ఇర్ఫాన్ ఖాన్ నియాజీ, షాన్ మసూద్, అమీర్ జమాల్, అరాఫత్ మిన్హాస్, టిమ్ సీఫెర్ట్, జాహిద్ మహమూద్, లిట్టన్ దాస్, మీర్ హమ్జా, కేన్ విలియమ్సన్, ఇమ్మాద్ మమ్జామ్, ఎమ్బియామ్సన్ యూసుఫ్, ఫవాద్ అలీ, రియాజుల్లాచదవండి: IPL 2025: సీఎస్కేతో మ్యాచ్.. ఆర్సీబీకి గుడ్ న్యూస్! స్వింగ్ కింగ్ వచ్చేస్తున్నాడు?

సీఎస్కేతో మ్యాచ్.. ఆర్సీబీకి గుడ్ న్యూస్! స్వింగ్ కింగ్ వచ్చేస్తున్నాడు?
ఐపీఎల్-2025 సీజన్ తొలి మ్యాచ్‌లోనే కేకేఆర్‌ను చిత్తు చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. ఇప్పుడు మరో కీలక పోరుకు సిద్దమవుతోంది. ఆర్సీబీ తమ రెండో మ్యాచ్‌లో భాగంగా మార్చి 28న చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. సీఎస్కే కూడా తమ మొదటి మ్యాచ్‌లో ముంబై పై విజయం సాధించి మంచి జోష్ మీద ఉంది. దీంతో ఈ రెండు జట్ల మధ్య పోరు మరోసారి అభిమానులను మునివేళ్లపై నిలబెట్టడం ఖాయం.ఇక ఈ మ్యాచ్‌కు ఆర్సీబీకి ఓ గుడ్ న్యూస్ ఉంది. కేకేఆర్‌తో జరిగిన తొలి మ్యాచ్‌కు గాయం కారణంగా దూరమైన స్పీడ్ స్టార్ భువనేశ్వర్ కుమార్.. ఇప్పుడు ఫుల్ ఫిట్నెస్ సాధించినట్లు తెలుస్తోంది. భువీ నెట్స్‌లో బౌలింగ్ ప్రాక్టీస్‌ను మొదలు పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆర్సీబీ కూడా తాజాగా భువీ బంతి పట్టికుని ఉన్న ఫోటోను షేర్ చేసింది.అందుకు క్యాప్షన్‌గా "భువీ త్వరలోనే బంతిని స్వింగ్ చేస్తాడు. అతడు మరింత బలంగా తిరిగిరానున్నాడని" బెంగళూరు ఫ్రాంచైజీ రాసుకొచ్చింది. దీంతో ఆర్సీబీ తదుపరి మ్యాచ్‌లో భువనేశ్వర్ ఆడటం దాదాపు ఖాయమైనట్లే. కాగా మొదటి మ్యాచ్‌కు భువనేశ్వర్ కుమార్ స్ధానంలో జమ్మూ కాశ్మీర్ బౌలర్రసిఖ్ సలాం చోటు దక్కించుకున్నాడు. కానీ అతడు అంత ప్రభావం చూపలేదు. మూడు ఓవర్లు బౌలింగ్ చేసి 35 పరుగులతో పాటు ఓ వికెట్ పడగొట్టాడు. భువీ ఎంట్రీ ఇస్తే ధార్ సలీం బెంచ్‌కు పరిమితం కానున్నాడు. కాగా 35 ఏళ్ల భువనేశ్వర్ కుమార్‌కు అద్భుతమైన రికార్డు ఉంది. 176 ఐపిఎల్ మ్యాచ్‌లు ఆడిన ఈ యూపీ ఫాస్ట్ బౌలర్.. 7.56 ఎకానమీతో 181 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా గత కొన్ని సీజన్లగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించిన భువనేశ్వర్‌ను ఐపీఎల్-2025 వేలంలో రూ. 10.75 భారీ ధరకు ఆర్సీబీ కొనుగోలు చేసింది. కాగా సీఎస్కేపై భువనేశ్వర్‌కు అంతమంచి రికార్డు లేదు. సీఎస్కేపై 20 మ్యాచ్‌ల్లో అతడు 39 సగటుతో 20 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. ఐపీఎల్-2025కు ఆర్సీబీ తుది జట్టు ఇదేరజత్ పాటిదార్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, యశ్ దయాల్, జోష్ హేజిల్‌వుడ్, ఫిల్ సాల్ట్, జితేష్ శర్మ, లియామ్ లివింగ్‌స్టోన్, రసిఖ్ దార్, సుయాష్ శర్మ, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, స్వప్నిల్ సింగ్, టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, నువాన్ తుషార, మనోజ్ స్వేఖ్ భండాగే, జాకబ్ బండెక్, జాకబ్ బంధేజ్ లుంగీ ఎంగిడీ, అభినందన్ సింగ్, మోహిత్ రాథీ.చదవండి: DC vs LSG: విశాఖలో మ్యాచ్.. తుదిజట్లు ఇవే!.. వర్షం ముప్పు?

విఘ్నేశ్‌ను సత్కరించిన నీతా అంబానీ.. పాదాలకు నమస్కరించిన స్పిన్నర్
ముంబై ఇండియన్స్ యువ సంచలనం విఘ్నేశ్ పుతూర్ (Vignesh Puthur)పై ఆ జట్టు యజమాని నీతా అంబానీ ప్రశంసలు కురిపించారు. అరంగేట్ర మ్యాచ్‌లోనే అద్భుతంగా ఆడావని కొనియాడారు. భవిష్యత్తులోనూ ఇదే తరహాలో అద్భుతంగా ఆడాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ‘బెస్ట్ బౌలర్’ బ్యాడ్జ్‌ను నీతా అంబానీ (Nita Ambani) విఘ్నేశ్‌కు అందించారు.కాగా ఐపీఎల్-2025 మార్చి 22న ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చిరకాల ప్రత్యర్థులు చెన్నై సూపర్ కింగ్స్- ముంబై ఇండియన్స్ మధ్య ఆదివారం (మార్చి 23) మ్యాచ్ జరిగింది. చెన్నైలోని చెపాక్ స్టేడియం ఇందుకు వేదిక కాగా.. టాస్ గెలిచిన రుతురాజ్ సేన తొలుత బౌలింగ్ చేసింది.నామమాత్రపు స్కోరుఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ముంబై జట్టు స్టార్ బ్యాటర్లు విఫలం కావడంతో నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. ఓపెనర్లలో రోహిత్ శర్మ (Rohit sharma) డకౌట్ కాగా.. రియాన్ రెకెల్టన్ 13 పరుగులకే పెవిలియన్ చేరాడు. వన్‌డౌన్‌లో వచ్చిన విల్ జాక్స్ 11 రన్స్ మాత్రమే చేయగా.. తాత్కాలిక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 29, తిలక్ వర్మ 31, దీపక్ చహర్ 28(నాటౌట్) చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు.ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ముంబై ఇండియన్స్ తొమ్మిది వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన చెన్నై టార్గెట్‌ను సులువుగానే పూర్తి చేస్తుందని అంతా భావించారు. ఓపెనర్ రచిన్ రవీంద్ర (65 నాటౌట్), కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (26 బంతుల్లో 53) అద్భుత అర్ధ శతకాలు సాధించారు. అయితే, మ్యాచ్‌ను ఆఖరి వరకు తీసుకువెళ్లింది మాత్రం ముంబై అరంగేట్ర బౌలర్ విఘ్నేశ్ పుతూర్ అని చెప్పవచ్చు. స్పిన్ మాయాజాలంతోరుతురాజ్తో పాటు శివం దూబే(9), దీపక్ హుడా(3) వికెట్లను విఘ్నేశ్ తన ఖాతాలో వేసుకున్నాడు. తన స్పిన్ మాయాజాలంతో సీఎస్కే మూడు కీలక వికెట్లను కూల్చి సత్తా చాటాడు. అయితే, ఈ మ్యాచ్‌లో మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే చెన్నై లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో ముంబై ఇండియన్స్‌కు పరాజయం తప్పలేదు. తాజా ఎడిషన్ ఆరంభ సీజన్లో చెన్నై చేతిలో నాలుగు వికెట్ల తేడాతో ముంబై ఓటమిని చవిచూసింది.విఘ్నేశ్ ఎక్కడ?అయితే, విఘ్నేశ్ ప్రదర్శన మాత్రం జట్టు యాజమాన్యానికి సంతృప్తినిచ్చింది. ఈ క్రమంలో మ్యాచ్ అనంతరం డ్రెసింగ్ రూమ్‌కి వెళ్లిన ముంబై జట్టు యజమాని నీతా అంబానీ విఘ్నేశ్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ‘‘ఈరోజు మొదటి అవార్డును మన యువ స్పిన్నర్.. ముంబై ఇండియన్స్‌కు తొలిసారిగా ఆడిన విఘ్నేశ్‌కు ఇస్తున్నా. విఘ్నేశ్ ఎక్కడ?’’ అంటూ అక్కడున్న ఆటగాళ్లను అడిగారు.ఇంతలో గుంపులో నుంచి పరిగెత్తుకు వచ్చిన విఘ్నేశ్‌కు నీతా అంబానీ స్వయంగా బ్యాడ్జ్ తొడిగారు. అద్భుతంగా ఆడావు అంటూ అతడికి కితాబు ఇచ్చారు. ఈ పరిణామంతో ఆనందంతో ఉబ్బితబ్బిబ్బపోయిన విఘ్నేశ్ నీతా అంబానీ పాదాలకు నమస్కరించి కృతజ్ఞతలు తెలియజేశాడు.థాంక్యూ సూర్య భాయ్‘‘నాకు మ్యాచ్ ఆడే అవకాశం ఇచ్చిన ముంబై ఫ్రాంఛైజీకి ధన్యవాదాలు. అసలు ఇలా నేను స్టార్లతో కలిసి ఆడతానని అస్సలు ఊహించలేదు. చాలా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మేము గెలవలేకపోవడం మాత్రం కాస్త బాధగా ఉంది.మా జట్టు మొత్తానికి థాంక్స్ చెప్పాలి. ముఖ్యంగా సూర్య భాయ్ నాకు పూర్తి మద్దతుగా నిలిచాడు. అందుకే నేను ఏమాత్రం ఒత్తిడికి లోనుకాలేదు. నాకు అండగా ఉన్నందుకు థాంక్యూ భయ్యా’’ అని విఘ్నేశ్ పుతూర్ సహచర ఆటగాళ్లకు ధన్యవాదాలు తెలిపాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ముంబై ఇండియన్స్షేర్ చేయగా వైరల్‌గా మారింది.కాగా కేరళకు చెందిన విఘ్నేశ్ స్పిన్ బౌలర్. 24 ఏళ్ల ఈ స్పిన్నర్ ఇంత వరకు డొమెస్టిక్ క్రికెట్లోనూ అరంగేట్రం చేయలేదు. అయితే, అతడిలోని ప్రతిభను గుర్తించిన ముంబై ఫ్రాంఛైజీ మెగా వేలంలో రూ. 30 లక్షలకు కొనుగోలు చేసింది.చదవండి: అలా అయితే.. నేను జట్టులో ఉండటం వేస్ట్: ధోనిLocal Kerala talent ➡️ MI debut in a big game ➡️ Wins the Dressing Room Best Bowler 🏅Ladies & gents, Vignesh Puthur! ✨#MumbaiIndians #PlayLikeMumbai #TATAIPL #CSKvMI pic.twitter.com/UsgyL2awwr— Mumbai Indians (@mipaltan) March 24, 2025
బిజినెస్

ఏప్రిల్ నుంచి కార్ల ధరలు అప్
ప్రముఖ కార్ల తయారీ సంస్థలు ఏప్రిల్ నుంచి తమ ఉత్పత్తుల ధరలు పెంచుతున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. మారుతీ సుజుకి, హ్యుందాయ్, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా.. వంటి కంపెనీలు పెరుగుతున్న ఇన్పుట్, నిర్వహణ ఖర్చులను భర్తీ చేయడానికి కార్ల ధరలను సర్దుబాటు చేయాలని నిర్ణయించాయి. ముడి సరుకు వ్యయాలు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లతో సతమతమవుతున్నందున తయారీ సంస్థలు ఈ చర్య తీసుకున్నట్లు తెలిపాయి.మారుతీ సుజుకి 4 శాతం పెంపుదేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి తన మొత్తం శ్రేణి వాహనాలపై ఏప్రిల్ 1 నుంచి 4% ధరల పెంపును అమలు చేయాలని యోచిస్తోంది. మార్కెట్లో కంపెనీ పోటీతత్వాన్ని కొనసాగిస్తూనే వ్యయ పెరుగుదలను అమలు చేయడానికి ప్రయత్నిస్తోంది. ధరల పెంపు నిర్ణయంతో ఆల్టో, వ్యాగన్ఆర్, బాలెనో సహా పాపులర్ మోడళ్లపై ఈ ప్రభావం పడే అవకాశం ఉంది.హ్యుందాయ్, ఎం అండ్ ఎంహ్యుందాయ్ మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా తమ వాహనాలపై 3 శాతం వరకు ధరల పెంపును ప్రకటించాయి. క్రెటా, ఐ20 వంటి మోడళ్లను కలిగి ఉన్న హ్యుందాయ్ లైనప్ ధరను సవరించనుంది. అదేవిధంగా మహీంద్రా అండ్ మహీంద్రా స్కార్పియో, ఎక్స్‌యూవీ 700 సహా ఎస్యూవీ కూడా మరింత ఖరీదవనున్నాయి.ఇతర బ్రాండ్లు ఇలా..కియా, హోండా, రెనాల్ట్, బీఎండబ్ల్యూ వంటి ఆటోమొబైల్ కంపెనీలు కూడా ధరల పెంపునకు సిద్ధమవుతున్నాయి. ఈ ధరల సర్దుబాట్లకు సంబంధించి పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా పరిశ్రమలో ఏకీకృత ప్రతిస్పందన వస్తుంది. ఇది వినియోగదారులపై తీవ్ర ప్రభావితం చూపుతుందనే వాదనలున్నాయి.పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లుఉక్కు, అల్యూమినియం, సెమీకండక్టర్ చిప్స్ వంటి ముడి పదార్థాలపై చేస్తున్న ఖర్చులు పెరగడంతో ఆటోమోటివ్ రంగం అనేక అడ్డంకులను ఎదుర్కొంటోంది. అదనంగా లాజిస్టిక్స్, ఇంధనానికి సంబంధించిన నిర్వహణ ఖర్చులు ధరలు సవరించేందుకు కారణమయ్యాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఉత్పత్తి నాణ్యత లేదా సృజనాత్మకతలో రాజీపడకుండా వినియోగదారులకు మెరుగైన సేవలందిస్తున్నట్లు చెబుతున్నాయి.వినియోగదారులపై ప్రభావంధరల పెరుగుదల స్వల్పకాలంలో విక్రయాలను ప్రభావితం చేసినప్పటికీ, వాహన తయారీదారులు తమ వాహనాలలో అధునాతన ఫీచర్లు, సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. కొనుగోలుదారులపై ధరల పెరుగుదల ప్రభావాన్ని తగ్గించడానికి, వారి ఉత్పత్తులకు నిరంతర గిరాకీ ఏర్పడేందుకు వీలుగా చర్యలు చేపడుతున్నారు. ఏప్రిల్ సమీపిస్తున్న కొద్దీ కారు కొనుగోలుదారులు తమ నిర్ణయాలను పునఃసమీక్షించాల్సి ఉంటుంది. ఈనేపథ్యంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకునేందుకు అవకాశాలున్నాయో నిపుణులు విశ్లేషిస్తున్నారు.ఏప్రిల్లోపే కొనుగోలుఇప్పటికే వాహనాలు కొనుగోలు చేయాలని యోచిస్తున్న కొందరు వినియోగదారులు ఏప్రిల్‌లో ధరల పెంపు అమల్లోకి రాకముందే తమ కొనుగోళ్లను ఖరారు చేయడానికి పరుగులు తీస్తున్నారు. దీంతో మార్చి నెలాఖరు నాటికి కార్ల అమ్మకాలు తాత్కాలికంగా పెరిగే అవకాశం ఉంది.బడ్జెట్ వాహనాలపై దృష్టిధరల పెరుగుదల వల్ల కొనుగోలుదారులు తమ ఎంపికలను పునఃపరిశీలించవచ్చు. గతంలో నిర్ణయించుకున్న మోడల్‌ను కాకుండా బడ్జెట్లో మరో మోడల్‌కు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ఒక కస్టమర్ ఎస్‌యూవీని కొనుగోలు చేయడానికి బదులుగా సెడాన్ కేటగిరీ కారును ఎంచుకోవచ్చు.యూజ్డ్ కార్లకు డిమాండ్కొత్త కార్ల ధరలు పెరుగుతుండటంతో ప్రీ ఓన్డ్ కార్ల(ఇది వరకే ఉపయోగించిన కార్లు) మార్కెట్లో డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. కొత్త వాహనాలపై అధిక ఖర్చులను నివారించాలని చూస్తున్న కొనుగోలుదారులు మరింత చౌకైన ప్రత్యామ్నాయంగా సెకండ్ హ్యాండ్ మార్కెట్ వైపు మొగ్గు చూపవచ్చు.ఇదీ చదవండి: అపార్ట్మెంట్లు విక్రయించిన అక్షయ్ కుమార్రుణాలపై ఆధారపడటంవాహన ధరలు పెరుగుతున్న కొద్దీ ఎక్కువ మంది కస్టమర్లు తాము చేయాలనుకుంటున్న కొనుగోళ్ల కోసం ఫైనాన్సింగ్ లేదా రుణాలపై ఆధారపడవచ్చు. ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు లేదా ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్లను అందించే వాహన తయారీదారులు ఈమేరకు ప్రయోజనం చూడవచ్చు.

ఒక్కరోజులో 1000 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 307 పాయింట్లు లాభపడి 23,658 వద్దకు చేరింది. సెన్సెక్స్ 1078 పాయింట్లు ఎగబాకి 77,984 వద్దకు చేరింది.సెన్సెక్స్ 30 సూచీలో ఎన్టీపీసీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎస్బీఐ, టెక్ మహీంద్రా, పవర్‌గ్రిడ్, బజాజ్ ఫిన్సర్వ్, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్నాలజీసీ, రియలన్స్ ఇండస్ట్రీస్, ఎల్ అండ్ టీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, మారుతీ సుజుకీ, టీసీఎస్, టాటా మోటార్స్, ఐటీసీ స్టాక్‌లు లాభాల్లో ముగిశాయి. టైటాన్, ఇండస్ ఇండ్ బ్యాంక్, జొమాటో, ఎం అండ్ ఎం, భారతీ ఎయిర్టెల్, సన్‌ఫార్మా స్టాక్‌లు నష్టపోయాయి.ఇదీ చదవండి: 5జీ విస్తరణపై నోకియా నివేదిక.. కీలకాంశాలు..యూఎస్ టారిఫ్ వార్తలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు లేదా అమ్మకాలతోపాటు.. డాలరు ఇండెక్స్, ముడిచమురు ధరల కదలికలపై ఈ వారం ఇన్వెస్టర్లు దృష్టి పెట్టనున్నారు. గత వారం అమ్మకాల బాట వీడి విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులకు దిగారు. అయితే దేశీ ఫండ్స్ విక్రయాలవైపు చూపు సారించాయి. ఇటీవల ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు కొంతమేర బలహీనపడింది. ఈ నేపథ్యంలో గత వారం మార్కెట్లు జోరందుకున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. యూఎస్ మార్కెట్లు సైతం పుంజుకున్నప్పటికీ రానున్న రోజుల్లో హెచ్చుతగ్గులు ఎదురుకావచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

5జీ విస్తరణపై నోకియా నివేదిక.. కీలకాంశాలు..
దేశంలో వివిధ టెలికాం సంస్థలు 5జీ నెట్వర్క్ పరిధిని విస్తరిస్తున్నాయి. ఇందుకోసం అవసరమయ్యే మౌలిక సదుపాయాలపై భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఇటీవల విడుదలైన ‘నోకియా 2024 మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ ఇండెక్స్ రిపోర్ట్’ దేశీయ 5జీ నెట్వర్క్ విస్తరణను విశ్లేషించింది. దేశవ్యాప్తంగా మెరుగవుతున్న టెలికాం కనెక్టివిటీని ఈ నివేదిక హైలైట్ చేసింది. అందులోకి కీలక అంశాలు కింది విధంగా ఉన్నాయి.పెరుగుతున్న 5జీ వినియోగం2024లోనే 5జీ డేటా ట్రాఫిక్ మూడు రెట్లు పెరగడం గమనార్హం. మెట్రోపాలిటన్ ప్రాంతాల్లో మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ వాడకంలో 5జీ నెట్వర్క్ ప్రస్తుతం 43% వాటాను కలిగి ఉంది. 2023 నుంచి ఈ వాటా దాదాపు రెట్టింపు అయింది. 2024లో ప్రతి వినియోగదారుడి సగటు నెలవారీ డేటా వినియోగం 27.5 జీబీకి చేరుకుంది. గత ఐదేళ్లలో 19.5% సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్) చొప్పున ఈ వినియోగం పెరిగింది. స్మార్ట్ఫోన్లు పెరగడం, మెరుగైన ఇంటర్నెట్ సేవలు, డిజిటల్ కంటెంట్ వ్యాప్తి ఈ పెరుగుదలకు కారణమవుతున్నాయి.నెట్వర్క్ వ్యవస్థ విస్తరణదేశంలో 5జీ ఎకోసిస్టమ్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. అందుకు కావాల్సిన పరికరాలు, మౌలిక సదుపాయాలు రెట్టింపు అవుతున్నాయి. 2025 నాటికి దేశంలో దాదాపు 90% స్మార్ట్ఫోన్లు 5జీ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని అంచనా. దేశంలో యాక్టివ్ 5జీ డివైజ్‌ల సంఖ్య 2024 నాటికి రెట్టింపై 271 మిలియన్లకు చేరుకుంది. తదుపరితరం వినియోగదారులు అధునాతన కనెక్టివిటీ కోసం సిద్ధంగా ఉంటారని ఇది నిర్ధారిస్తుంది.ఇదీ చదవండి: అపార్ట్మెంట్లు విక్రయించిన అక్షయ్ కుమార్ఫిక్స్డ్ వైర్లెస్ యాక్సెస్ ప్రభావంహైస్పీడ్ ఇంటర్నెట్ను అందించడంలో ఫిక్స్డ్ వైర్లెస్ యాక్సెస్ (ఎఫ్‌డబ్ల్యూఏ) టెక్నాలజీకి పెరుగుతున్న ఆదరణను ఈ నివేదిక ఎత్తిచూపింది. 5జీ ఎఫ్‌డబ్ల్యూఏ వినియోగదారులు సగటు మొబైల్ వినియోగదారుల కంటే 12 రెట్లు ఎక్కువ డేటాను వినియోగించారు. ఇది వెనుకబడిన ప్రాంతాల్లో కనెక్టివిటీ సవాళ్లను పరిష్కరించే సామర్థ్యాన్ని నొక్కి చెబుతుంది. మొత్తం 5జీ డేటా ట్రాఫిక్ 2026 ప్రారంభం నాటికి ప్రస్తుత 4జీ ట్రాఫిక్‌ను మించిపోతుందని నివేదిక అంచనా వేసింది.

అపార్ట్మెంట్లు విక్రయించిన అక్షయ్ కుమార్
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ముంబయిలోని బోరివాలిలో తనకున్న రెండు రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లను మొత్తం రూ.6.6 కోట్లకు విక్రయించారు. అందులో ఒక యూనిట్ రూ.5.35 కోట్లకు అమ్ముడుపోగా, మరొకటి రూ.1.25 కోట్లకు అమ్ముడైంది. కన్సల్టెన్సీ, హౌసింగ్ ట్రాన్సాక్షన్స్, మార్టగేజ్ అడ్వైజరీ.. వంటి వంటి పలు రకాల సేవలను అందిస్తున్న రియల్ ఎస్టేట్ సంస్థ స్క్వేర్ యార్డ్స్ ఈమేరకు వివరాలు వెల్లడించింది.స్క్వేర్ యార్డ్స్ తెలిపిన వివరాల ప్రకారం ముంబయిలోని ఒబెరాయ్ స్కై సిటీలోని ఈ రెసిడెన్షియల్ యూనిట్లకు సంబంధించి 2025 మార్చిలో లావాదేవీలు నమోదయ్యాయి. ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ (ఐజీఆర్) వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం రూ.5.35 కోట్లకు విక్రయించిన అపార్ట్మెంట్ వాస్తవానికి నవంబర్ 2017లో రూ.2.82 కోట్లకు కొనుగోలు చేశారు. దాంతో 89 శాతం విలువ జోడించినట్లయింది. ఈ అపార్ట్మెంట్ కార్పెట్ ఏరియా 100.34 చదరపు మీటర్లు (1,080 చదరపు అడుగులు). రూ.32.1 లక్షల స్టాంప్ డ్యూటీతో పాటు రిజిస్ట్రేషన్ ఫీజు రూ.30 వేలు చెల్లించాల్సి వచ్చింది.ఇదీ చదవండి: కేర్ హెల్త్ ఇన్సూరెన్స్‌కు రూ.104.77 కోట్ల నోటీసులు2017లో రూ.67.19 లక్షలకు కొనుగోలు చేసిన మరో అపార్ట్‌మెంట్‌ను అక్షయ్‌కుమార్ రూ.1.25 కోట్లకు విక్రయించారు. 23.45 చదరపు మీటర్ల (252 చదరపు అడుగులు) కార్పెట్ ఏరియా ఉన్న ఈ అపార్ట్మెంట్ లావాదేవీకి రూ.7.5 లక్షల స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు రూ.30,000గా ఉంది. స్కై సిటీలో ఉన్న ఈ ప్రాపర్టీని ఒబెరాయ్ రియాల్టీ 25 ఎకరాల్లో అభివృద్ధి చేసింది. ఇది 3 బీహెచ్‌కే, 3 బీహెచ్‌కే+స్టూడియో, డూప్లెక్స్ అపార్ట్మెంట్లను అందించే రెడీ-టు-మూవ్-ఇన్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌గా ప్రసిద్ధి చెందింది. బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ కూడా 2024 మేలో ఒబెరాయ్ స్కై సిటీలో కొన్ని ఆస్తులను కొనుగోలు చేశారు.
ఫ్యామిలీ

World TB Day: క్షయకు కళ్లెం పడేనా!
కర్నూలుకు చెందిన 45 ఏళ్ల మహిళ క్షయ వ్యాధితో కోలుకోలేక కన్నుమూసింది. మందులపై సరైన అవగాహన లేక మొదట్లో కాస్త బాగా అనిపించగానే మందులు మానేసింది. ఆమెకు షుగర్ కూడా ఉండటంతో వ్యాధి తిరగబెట్టి ఎండీఆర్ టీబీగా రూపాంతరం చెందింది. తర్వాత మందులు వాడినా కోలుకోలేక మృతిచెందింది. ఈ మందులు ఎలా వాడాలో వైద్యులు, సిబ్బంది అవగాహన కలి్పంచకపోవడం వల్లే ఆమె కన్నుమూయాల్సి వచ్చింది. – కర్నూలు(హాస్పిటల్)ఎంతో మంది క్షయ వ్యాధికి మందులు వాడుతూ మధ్యలో ఆపేసి, ఆ తర్వాత మొండి టీబీతో మరణిస్తున్నారు. క్షయ బాధితులు మొదటిసారి మందుల వాడకం ప్రారంభించగానే కొందరికి కడుపులో తిప్పుతుంది. ఇందుకోసం కొందరు వైద్యులు గ్యాస్ట్రబుల్ మందులు ఇస్తారు. మరికొందరికి తీవ్ర ఆకలి అవుతుంది. ఇంకొందరికి రెండు నెలలు మందులు వాడగానే ఆరోగ్యం కుదుట పడుతుండటంతో బాగైందని భావించి మందుల ప్రభావానికి భయపడి మానేస్తున్నారు. కానీ మందులు మధ్యలో ఆపకూడదని, కచ్చితంగా 6 నుంచి 8 నెలలు వాడాలని చెప్పేవారు లేరు. గతంలో లాగా డాట్స్ విధానంలో ఇచ్చే మందుల పద్ధతి కూడా ఇప్పుడు లేకపోవడంతో రోగుల్లో తీవ్రత పెరిగిపోతోంది. నేడు వరల్డ్ టీబీ డే (ప్రపంచ క్షయ వ్యాధి అవగాహన దినం) సందర్భంగా ప్రత్యేక కథనం. జిల్లాలో ప్రతి 2 లక్షల నుంచి 2.5 లక్షల జనాభాకు ఒక టీబీ యూనిట్ చొప్పున 9 యూనిట్లు ఏర్పాటయ్యాయి. ఇందులో ఒక సీనియర్ టీబీ సూపర్వైజర్, సీనియర్ ల్యాబ్ సూపర్వైజర్ విధులు నిర్వహిస్తున్నారు. రోగులను పర్యవేక్షించేందుకు ప్రతి సూపర్వైజర్కు ఒక మోటార్ సైకిల్ ఇచ్చారు. దీంతో పాటు ప్రతి పీహెచ్సీలో ఎక్స్‌రే యూనిట్లు ఉన్నాయి. వీటి ద్వారా క్షయ నిర్ధారణ చేయవచ్చు. గతేడాది 78,368 మందికి పరీక్షలు చేయగా 3,077 మందికి క్షయ నిర్ధారణ అయ్యింది. గత కేసులతో కలుపుకొని మొత్తం 4,571 మందికి చికిత్స అందిస్తున్నారు. వీరికి జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు 6 నుంచి 8 నెలల పాటు ఉచితంగా అందిస్తారు. గతేడాది క్షయ నుంచి కోలుకోలేక 104 మంది మరణించారు. వ్యాధినిర్దారణ ఇలా ! రెండు వారాలకు మించి దగ్గ, సాయంత్రం వేళల్లో జ్వరం, దగ్గితే గళ్ల పడటం, బరువు తగ్గడం, ఆకలి తగ్గడం, ఉమ్మిలో రక్తం పడటం వంటి లక్షణాలుంటే క్షయగా అనుమానించి సమీప ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్ష చేయించుకోవాలి. రోగి గళ్లను వైద్య సిబ్బంది సేకరించి మైక్రోస్కోప్, ట్రూనాట్, సీబీ నాట్ మిషన్ల ద్వారా నిర్దారిస్తారు. పెరుగుతున్న ఎండీఆర్టీబీ కేసులు క్షయవ్యాధిలో మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ టీబీ (ఎండీఆర్టీబీ) కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. క్షయ మందులపై అవగాహన లేక చాలా మంది కోర్సు మధ్యలోనే మానేస్తున్నారు. దీనివల్ల వ్యాధి తిరగబెట్టి మరింత మొండిగా తయారవుతోంది. అప్పుడు సాధారణ టీబీ మందులు పనిచేయవు. వారికి ఖరీదైన ఎండీఆర్ టీబీ మందులు ఇవ్వాల్సి ఉంటుంది. వీటి ఖరీదు రూ.2 లక్షల దాకా ఉంటుంది. ఈ మందులకు కూడా లొంగకపోతే బెడాక్విలిన్ అనే రూ.18 లక్షల విలువైన 11 నెలల కోర్సు మందును ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఎండీఆర్ టీబీ రోగులు 135 మంది ఉండగా, బెడాక్విలిన్ మందులు వాడే వారు 52 మంది ఉన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత మందులతో పాటు రోగి పోష కాహారం కోసం నెలకు రూ.వెయ్యి అందిస్తున్నారు. నిక్షయ్ మిత్ర ద్వారా సరుకులు నిక్షయ్ మిత్ర ద్వారా కో–ఆపరేటివ్, కార్పొరేట్, ప్రజాప్రతినిధులు, దాతల ద్వారా క్షయ రోగులకు అవసరమైన పోషకాహార కిట్లను అందిస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాలో 129 సంస్థలు రిజిస్టర్ కాగా 2,117 మంది క్షయ రోగులను దత్తత తీసు కుని 12,045 పోషకాహార ప్యాకెట్లను అందజేశారు. నేడు అవగాహన సదస్సు ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవాన్ని పురస్కరించుకుని కర్నూలులో ఈ నెల 24వ తేదీన ర్యాలీ నిర్వహించనున్నారు. కర్నూలు మెడికల్ కాలేజీలోని ఓల్డ్ క్లినికల్ లెక్చరర్ గ్యాలరీలో అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తున్నారు. క్షయ వ్యాధిపై వైద్య, ఫార్మసీ విద్యార్థులకు నిర్వహించిన క్విజ్, వ్యాసరచన పోటీల విజేతలకు బహుమతుల ప్రదానం చేయనున్నారు. క్షయను తగ్గించడమే లక్ష్యం జిల్లాలో ప్రస్తుతం ప్రతి 3 వేల మందికి పరీక్ష చేయగా 170 దాకా కేసులు బయటపడుతు న్నాయి. ఈ సంఖ్యను 50లోపు తగ్గించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఒకరి నుంచి మరొకరికి వ్యాధి సోకకుండా చర్యలు తీసుకుంటు న్నాం. వ్యాధిసోకిన వారి ఇంట్లో అందరికీ టీబీ ప్రీవెంటివ్ థెరపీ కింద ఆరు నెలల పాటు మందులు ఉచితంగా ఇస్తున్నాం. ఇటీవల పెద్దవారికి కూడా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. –డాక్టర్ ఎల్.భాస్కర్, జిల్లా క్షయ నియంత్రణాధికారి, కర్నూలు

సెలబ్రిటీ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ పెళ్లి ఫోటోలు వైరల్, ఎవరు తీశారో ఊహించగలరా?
సెలబ్రిటీ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ తన లేడీ లవ్‌తో ఏడడగులు వేశాడు. ఈ వివాహానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట సందడిగా మారాయి. అయితే అందరి పెళ్లి ఫోటోలను అత్యంత అందంగా తీసే ఈ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ పెళ్లి ఫోటోలు ఎవరు తీశారు అనేది నెట్టింట చర్చకు దారి తీసింది. నిజమే కదా.. ఎవ్వరికైనా ఇలాంటి సందేహం రావడం సహజమే కదా? మరి ఇంకెందుకు ఆలస్యం.. అసలింతకీ ఎవరీ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్. వీరి బిగ్ డేకు సంబంధించిన ఫోటోలను బంధించింది ఎవరు? ఏమిటి? తెలుసుకుందాం.సెలబ్రిటీ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ విశాల్ పంజాబీ ఒక ఇంటి వాడయ్యాడు. ప్రేయసి నిక్కీ కృష్ణన్‌తో వివాహ బంధంలోకి అడుగు పెట్టాడు. తద్వారా ఇటీవల బ్యాచిటర్ లైఫ్ కి గుడ్ బై చెబుతున్న సెలబ్రిటీల సరసన చేరాడు. మార్చి 23,ఇన్స్టాగ్రామ్ పేజీలో తన వెడ్డింగ్ ఫోటోలను పంచుకున్నాడు. ఎంతో ఆనందకరమైన వేడుకను విశాల్ స్నేహితుడు, మరో ప్రముఖ వివాహ ఫోటోగ్రాఫర్ జోసెఫ్ రాధిక్ బంధించడం విశేషం. అంతేకాదు తన స్నేహితుడు విశాల్ పెళ్లికి సంబంధించిన ప్రీ వెడ్డింగ్ వేడుకలనుంచి పవిత్ర హోమం చుట్టూ ప్రదక్షిణలు దాకా, అనేక ఇతర వేడుకల ఫోటోలను అందమైన క్యాప్షన్లతో తన ఇన్‌స్టాలో పోస్ట్ చేయడం మరో విశేషం.ఇదీ చదవండి: Tamannaah Bhatia: సమ్మర్ స్పెషల్ : పింక్ పూల చీరలో ఎథ్నిక్ లుక్‘‘15 ఏళ్ల తన కరియర్లో చాలా తక్కువ సార్లుమాత్రమే తన సన్నిహితుల పెళ్లి వేడుకలను బంధించే అవకాశం లభించింది. అదీ పెళ్ళళ్లలో మాట్లాడే అవకాశం కేవలం రెండు సార్లు మాత్రమే. ఇపుడు నిక్కీ, విశాల్ ఫోటోలను తీయడం అదృష్టం . ఈ అవకాశం కల్పించినందుకు ఇద్దరికీ కృతజ్ఞతలు’’ అంటూ ఇన్‌స్టాలో ఒక నోట్ ద్వారా కొత్త జంటకు అభినందనలు తెలిపాడు.మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన దుస్తుల్లో వధూవరులు పెళ్లి కళతో కళ కళలాడిపోయాడు. హ్యాండ్లూమ్ పింక్ బనారసి బ్రోకేడ్ లెహంగా, పుదీనా ఆకుపచ్చ టిష్యూ దుపట్టాతో నిక్కీ కృష్ణన్ డిఫరెంట్ లుక్‌లో కనిపించగా, విశాల్ పంజాబీ కాశ్మీరీ థ్రెడ్ ఎంబ్రాయిడరీతో చేసిన సాంప్రదాయ ఓపెన్ షేర్వానీని ఎంచుకున్నాడు. ఫ్లేర్డ్ కుర్తా, వైడ్-బాటమ్ ప్యాంటు , క్యాస్కేడింగ్ డ్రేప్‌తో దీన్ని జత చేశాడు. రష్యన్ పచ్చలు, అన్ కట్ డైమండ్ జ్యుయల్లరీ, 18K బంగారంతో కూడిన ఇంపీరియల్ హెయిర్లూమ్స్తో కొత్త జంట అందంగా మెరిసిపోయారు.విశాల్-నిక్కీ లవ్ స్టోరీవిశాల్ పంజాబీ , నిక్కీ కృష్ణన్ గత ఏడాది జూన్ 2024లో లండన్‌లో క్రైస్తవ వేడుకలో వివాహం చేసుకున్నారు. నిక్కీ సోదరి వివాహంలో తాము మొదట కలుసుకున్నారు. ఆ పెళ్లికి విశాల్ ఫోటోగ్రాఫర్. ఆ సమయంలో వారి పరిచయం ప్రేమగా మారింది. అయితే నిక్కీ లండన్‌కు చెందినది కావడంతో ఆరంభంలో వీరి ప్రేమకు కొన్ని ఇబ్బందులొచ్చాయి, మొత్తానికి తమ బంధం వివాహ బంధంగా బలపడింది. ఎవరీ జోసెఫ్ రాధిక్హై ప్రొఫైల్ పెళ్లిళ్లు అనగానే ప్రముఖ ఫోటోగ్రాఫర్ జోసెఫ్ రాధిక్ గుర్తొస్తాడు. బాలీవుడ్ పవర్ కపుల్స్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ, కత్రినా కైఫ్ ,విక్కీ కౌశల్, నయనతార విఘ్నేష్ శివన్, అలాగే అదితి రావు హైదరి, సిద్ధార్థ్ కలల వివాహ క్షణాలను బంధించిన ఘనత జోసెఫ్‌దే. అంతేకాదు అనంత్ అంబానీ , రాధిక మర్చంట్ల డ్రీమీ వెడ్డింగ్ ఫోటోలు తీసింది కూడా జోసెఫ్.

అలా చేస్తే వర్క్-లైఫ్ బ్యాలెన్స్ ఈజీ..!
ఇటీవల "వర్క్ లైఫ్ బ్యాలెన్స్" తెగ చర్చనీయాంశంగా మారింది. వారానికి 70 గంటలు పనిచేయాల్సిందే మన భారత్ మరింత అభివృద్ధి చెందడానికి అని ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి ఏ ముహర్తానా అన్నారో గానీ అప్పటి నుంచి వర్క్‌లైఫ్ బ్యాలెన్స్ తెరపైకి వచ్చేంది. అందరూ ఇక పనికే అంకితమైతే వ్యక్తిగత జీవితం, బాంధవ్యాల పరిస్థితి ఏంటీ...?. ఆ తరువాత జీవిత చరమాంకలో ఎవ్వరూ మనతో ఉండరు అంటూ రకరకాలు మాటలు లెవెనెత్తారు నెట్టింట నెటిజన్లు. సరిగ్గా ఈ సమయంలో ఓ బెంగళూరు టెకీ ఇలా చేస్తే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ సులభంగా మెయింటైన్ చేయొచ్చు అంటూ ఓ సలహా సూచించాడు. ఇప్పుడది నెట్టింట తెగ వైరల్‌గా మారి నెటిజన్లను తెగ ఆకర్షిస్తోంది. అతడు చెప్పిన సలహా ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలియదు గానీ కానీ కాస్త ఆలోచింపచేసేలా ఉందంటున్నారు నెటిజన్లు. మరీ అదెంటో చూసేద్దామా..!.బెంగళూరు టెకీ హర్షిత్ మహావర్ లింక్డ్ ఇన్ పోస్ట్‌లో పని జీవిత సమతుల్య సాధించడానికి ఇలా చేయండి అంటూ ఓ ఉచిత సలహ ఇచ్చాడు. అదేంటంటే..మీ సహోద్యోగినే పెళ్లాడండి సింపుల్‌గా. అంతే ఇక ఎన్నో ప్రయోజనాలు పొందుతారంటూ జాబితా చిట్టా చెప్పుకొచ్చాడు. క్యాబ్‌లపై డబ్బు ఆదా అవుతుంది. ఇంటి నుంచి పనిచేసిన అనుభూతే ఉంటుంది. ఎందుకంటే ఆఫీస్‌లో అనుక్షణం మనల్ని అంటిపెట్టుకునే ఉంటుంది కదా..!. కాబట్టి ఆఫీస్‌లో ఉన్నాం అనిపించదు. ఏ మాత్రం విరామం దొరికినా..కాసేపు మీ శ్రీమతి లేదా శ్రీవారితో ముచ్చటించొచ్చు. ఇక తిరిగి ఇంటి నుంచి వెళ్లిపోయేటప్పుడూ ఏదో ఊరు నుంచి వెళ్తున్నట్లుగా జాలీగా గడపండి. మీ భాగస్వామితో గడపలేదన్న భాధ కూడా ఉండదు. అటు వర్కు హయిగా చేసుకోవచ్చు..ఇటు భార్యతోనూ హ్యాపీగా స్పెండ్ చెయ్యొచ్చు. ఇలా చేస్తే కుటుంబాన్ని మిస్ అవుతున్నాం అనే ఫీల్ ఉండదు. రెండింటికి న్యాయం చేసినవారు అవుతారంటూ రాసుకొచ్చాడు లింక్డ్ఇన్ పోస్ట్‌లో హర్షిత్. అయితే నెటిజన్లు ఇదేదో బాగుందే..!.. ట్రై చేస్తా అని కొందరు, సహోద్యోగిని పెళ్లిచేసుకోవడం అనేది శాశ్వత పరిష్కారం కాకపోవచ్చు అని మరికొందరు కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. (చదవండి: ఊపిరి సలపని ఒత్తిడులు..ఆగిపోతున్న ఖాకీల గుండెలు..!)

Tamannaah Bhatia: సమ్మర్ స్పెషల్ : పింక్ పూల చీరలో ఎథ్నిక్ లుక్
అందాల హీరోయిన్, తమన్నా భాటియా (Tamannaah Bhatia) ఎథ్నిక్ వేర్లో అందంగా మెరిసిపోతున్న లుక్ ఫ్యాన్స్నువిపరీతంగా ఆకట్టుకుంటోంది. మిల్కీ బ్యూటీగా పాపులర్అయిన గులాబీ రంగు పువ్వుల డిజైన్‌తో ఉన్న శారీలో అందంగా మారిపోయింది. తాజాగా పింక్ శారీలో ఉండే ఫొటోలను షేర్ చేసింది. దీంతో ఫ్యాన్స్ కామెంట్లతో సందడి చేస్తున్నారు.తమన్నా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తన ఫ్యాషన్స్టైల్ను చాటుకుంటూ ఉంటుంది. తాజాగా వేసవి వార్డ్‌రోబ్‌లో పూల చీర ఎందుకు అవసరమో తమన్నా లుక్ రుజువు చేసింది. స్టేట్మెంట్-మేకింగ్ బోర్డర్ సారీకి మెరిసిపోయేతన లుక్‌తో మరింత సొగసుదనాన్ని జోడించింది. పింక్కలర్ శారీలో మెరిసి పోతున్న ఆమెను ఫ్యాన్స్ తెగ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గులాబీ కంటే అందంగా ఉందని నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం తమన్నా శారీ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దేవతలా వుంది, వెరీ ప్రెటీ అంటూ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. (వెరైటీ ఇడ్లీ, చట్నీకూడా అదిరింది, ట్రై చేయండి!) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) అందమైన తన శారీ లుక్కు మ్యాచింగ్‌గా ముత్యాల ఆభరణాలను ఎంచుకుంది. రెండు పొరల ముత్యాల చోకర్ , సొగసైన స్టడ్లు అతికినట్టు సరిపోలాయి. ప్రొఫెషనల్ లాగా ఆమె ఎథ్నిక్ స్టైల్‌ను పూర్తి చేయడానికి ఓపెన్ వేవ్స్ బెస్ట్ ఆప్షన్ అంటున్నారు ఫ్యాషన్ రంగ నిపుణులు. కాగా అశోక్ తేజ దర్శకత్వంలో తమన్నా భాటియా నటించిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ చిత్రం 'ఒడెలా 2' (Odela 2) విడుదలకు సిద్ధమవుతోంది. ఏప్రిల్ 17 రిలీజ్ అవుతోందంటూ తమన్నా ఇన్‌స్టాలో వెల్లడించింది. తమన్నా ప్రతిసారీ సాధారణం కంటే భిన్నంగా ఉండే దుస్తులతో ఆశ్చర్యపరుస్తుంటుంది. సాంప్రదాయ చీరలో అయినా, మోడ్రన్ దుస్తుల్లో అయినా, తన ఐకానిక్ స్టైల్‌తో ఆకట్టుకోవడం తమన్నా స్పెషాల్టీ.
ఫొటోలు
International

గాజా మృతులు 50 వేలు
డెయిర్ అల్–బలాహ్: గాజాలో ఇజ్రాయెల్ మారణహోమానికి బలైన వారి సంఖ్య 50 వేలు దాటింది! ఆదివారం గాజా ఆరోగ్య విభాగం ఈ మేరకు ప్రకటించింది. ‘‘మృతుల్లో సగానికి పైగా మహిళలు, చిన్నారులే. 1.13 లక్షల మందికి పైగా క్షతగాత్రులుగా మారారు. ఇజ్రాయెల్ దాడుల వల్ల గాజా జనాభాలో 90 శాతం మంది నిలువనీడ కోల్పోయారు’’ అని ఆవేదన వెలిబుచ్చింది. శనివారం అర్ధరాత్రి నుంచి ఇజ్రాయెల్ చేపట్టిన తాజా వైమానిక దాడుల్లో హమాస్ రాజకీయ విభాగం సీనియర్ నేత సహా 23 మంది చనిపోయారు. ఖాన్‌యూనిస్ సమీపంలో దాడుల్లో పాలస్తీనా పార్లమెంట్ సభ్యుడు, తమ రాజకీయ విభాగం సభ్యుడు సలాహ్ బర్దావిల్, ఆయన భార్య చనిపోయినట్లు హమాస్ వర్గాలు ప్రకటించాయి. టెంట్లో ప్రార్థనలు చేస్తున్న సమయంలో వీరిపై దాడి జరిగిందని పేర్కొన్నాయి. హమాస్ రాజకీయ వ్యవహారాలపై తరచూ మీడియాకు బర్దావిల్ ఇంటర్వ్యూలిస్తుంటారు. ఖాన్ యూనిస్‌పై జరిగిన దాడిలో దంపతులతో పాటు వారి ఐదుగురు సంతానం చనిపోయారు. మరో దాడిలో దంపతులు, ఇద్దరు కుమార్తెలు ప్రాణాలు కోల్పోయినట్టు యూరోపియన్ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. మరో దాడిలో చనిపోయిన మహిళ, చిన్నారి మృతదేహాలను ఆస్పత్రికి తీసుకొచ్చినట్టు కువైటీ ఆస్పత్రి నిర్వాహకులు చెప్పారు.మారణహోమమే హమాస్ సాయుధులు 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై మెరుపు దాడులు చేసి 1,200 మందిని చంపడం, 250 మందికి పైగా బందీలుగా తీసుకెళ్లడం తెలిసిందే. అప్పటి నుంచి గాజాపై ఇజ్రాయెల్ భీకర యుద్ధానికి దిగింది. ఆ ప్రాంతాన్ని శ్మశానసదృశంగా మార్చేసింది. జనవరిలో కుదిరిన కాల్పుల విరమణ రెండు నెలల ముచ్చటే అయింది. వారం రోజులుగా మళ్లీ గాజాపై దాడులతో ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది.

ఎయిర్‌పోర్ట్‌లో దారుణం: పెంపుడు కుక్కను చంపేసి.. విమానం ఎక్కేసింది
అమెరికాలోని ఫ్లోరిడా విమానాశ్రయంలో చోటుచేసుకున్న ఘటన జంతు ప్రేమికులను నివ్వెరపోయేలా చేసింది. జంతు రవాణాకు తగిన పత్రాల్లేవని కుక్కను విమానంలోకి సిబ్బంది అనుమతించకపోవడంతో తన పెంపుడు కుక్కని చంపి చెత్తసంచిలో పడేసి వెళ్లిపోయిందా ఆ మహిళా యజమాని..సీసీటీవీ ఫుటేజీతో వెలుగులోకి దారుణం..పెంపుడు శునకంతో విమానాశ్రయానికి వచ్చిన అలిసన్ లారెన్స్ అనే మహిళను ఎయిర్ పోర్ట్ అధికారులు అడ్డుకున్నారు. శునకాన్ని వెంట తీసుకెళ్లేందుకు ప్రత్యేక అనుమతి కావాలని, ఆ పత్రాలు ఉంటే తప్ప శునకాన్ని విమానంలోకి అనుమతిస్తామంటూ అధికారులు స్పష్టం చేశారు. దీంతో వెనుదిరిగిన ఆ మహిళ కాసేపటి తర్వాత తిరిగి వచ్చి.. ఏమీ తెలియనట్లుగా విమానం ఎక్కి వెళ్లిపోయింది. శునకాన్ని తెలిసిన వారికి అప్పగించి వచ్చి ఉంటుందని అధికారులు భావించారు.అంతలోనే ట్విస్ట్ చోటు చేసుకుంది.. విమానం బయలుదేరిన కాసేపటికి బాత్ రూయ్లు శుభ్రం చేసేందుకు వెళ్లిన సిబ్బందికి అక్కడ కుక్క చనిపోయి కనిపించింది. బాత్ రూమ్‌లో శునకం కళేబరం బయటపడటంతో మెడకు ఉన్న వివరాలు, ఫోన్ నెంబర్ ఆధారంగా దాని యజమానురాలు అలిసన్గా ఎయిర్‌పోర్టు అధికారులు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజీ పరిశీలించగా అలిసన్ చేసిన దారుణం బయటపడింది. దీంతో జంతుహింస నేరం కింద ఆమెను అరెస్టు చేశారు.

అమెరికాలో దారుణం.. కాల్పుల్లో భారత్‌కు చెందిన తండ్రీకూతురు మృతి
వర్జీనియా: అగ్రరాజ్యం అమెరికాలో దారుణ ఘటన వెలుగుచూసింది. వర్జీనియాలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో భారత్‌కు చెందిన తండ్రీ, కూతురు చనిపోయారు. వీరిని గుజరాత్‌కు చెందిన ప్రదీప్ పటేల్, ఉర్మిగా గుర్తించారు. ఈ క్రమంలో కాల్పులు జరిపిన నిందితుడు ఫ్రేజర్ దేవన్ వార్టన్ (44)ను వర్జీనియా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు.వివరాల ప్రకారం.. ప్రదీప్ పటేల్, ఆయన కూతురు ఉర్మి.. గురువారం రోజున వర్జీనియాలోని అకోమాక్ కౌంటీలో డిపార్ట్మెంటల్ స్టోర్‌కి వెళ్లారు. వారు స్టోర్‌లో ఉన్న సమయంలో నిందితుడు ఫ్రేజర్ దేవన్ వార్టన్ అక్కడికి వెళ్లాడు. తనకు మందు కావాలని అడగడంతో స్టోర్ సిబ్బందికి, అతడికి మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం, స్టోర్‌లో ఉన్న వర్కర్లపై నిందితుడు విచక్షణారహితంగా కాల్పలు జరిపాడు. కాల్పుల్లో ప్రదీప్ కుమార్, ఉర్మి తీవ్రంగా గాయపడ్డారు. ఈ క్రమంలో ప్రదీప్ కుమార్ ఘటనా స్థలంలోనే మృతిచెందగా.. ఉర్మి తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. అనంతరం, కాల్పులు జరిపిన ఫ్రేజర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఇదిలా ఉండగా.. గుజరాత్‌లోని మెహసనా జిల్లాకు చెందిన ప్రదీప్ పటేల్.. తన భార్య హన్స్‌బెన్, కుమార్తె ఊర్మితో కలిసి ఆరేళ్ల కిందట అమెరికాకు వెళ్లారు. అక్కడ తన బంధువులకు చెందిన డిపార్ట్మెంటల్ స్టోర్‌లో పనిచేస్తున్నారు. మృతుడు ప్రదీప్ కుమార్‌కు మరో ఇద్దరు కుమార్తెలు ఉన్నట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. వారిలో ఒకరు అహ్మదాబాద్, ఇంకొకరు కెనడాలో ఉన్నారని చెప్పారు. ప్రదీప్, ఉర్మి మృతితో కుటుంట సభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు.🚨 Gujarati father, daughter shot dead in US store in Virginia.Pradeep Patel, 56, was shot dead on the spot, while his 24-year-old daughter, Urmi, succumbed to her injuries two days later. pic.twitter.com/RtU2VYqAmv— The Tradesman (@The_Tradesman1) March 23, 2025

America: మరోమారు కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి
లాస్ క్రూసెస్: అమెరికాలో మరోమారు కాల్పులు కలకలం రేపాయి. తాజాగా న్యూ మెక్సికో(New Mexico)లోని లాస్ క్రూసెస్ నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఒక పార్కులో జరిగిన కాల్పుల ఘటనలో ముగ్గురు మృతిచెందారు. 15 మంది గాయపడ్డారు. ఈ ఉదంతానికి సంబంధించిన వివరాలను పోలీసులు మీడియాకు వెల్లడించారు.శుక్రవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందగానే పోలీసులు(Police) ఘటన జరిగిన యంగ్ పార్కుకు చేరుకున్నారు. పార్కులో ఒక కార్ షో జరిగింది. దానికి దాదాపు 200 హాజరయ్యారు. కాగా ఈ కార్ షోకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. లాస్ క్రూసెస్ పోలీస్ చీఫ్ జెరెమీ స్టోరీ మీడియాతో మాట్లాడుతూ పార్క్‌లో చెల్లాచెదురుగా 50 నుండి 60 షెల్ కేసింగ్‌లు కనిపించాయని, దీనిని చూస్తుంటే, చాలామంది తుపాకీలతో కాల్పులు జరిపినట్లు తెలుస్తున్నదన్నారు.పార్కులో రెండు గ్రూపుల మధ్య కాల్పులు జరిగివుండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కాల్పుల ఘటనలో ముగ్గురు మృతిచెందారు. 15 మంది గాయపడ్డారు. మృతులంతా టీనేజర్లు(Teenagers). మృతులు, గాయపడిన వారి పేర్లను పోలీసులు ఇంకా వెల్లడించలేదు. ఈ ఘటనలో గాయపడినవారిని ఆస్పత్రులకు తరలించినట్లు లాస్ క్రూసెస్ అగ్నిమాపక విభాగం చీఫ్ మైఖేల్ డేనియల్స్ తెలిపారు. లాస్ క్రూసెస్ నగర కౌన్సిలర్ జోహన్నా బెంకోమో, మేయర్ ప్రో టెం జోహన్నా బెంకోమో ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ చేస్తూ, ఈ సంఘటనపై విచారాన్ని వ్యక్తం చేశారు.ఇది కూడా చదవండి: దక్షిణ కొరియాలో బూడిదవుతున్న 20 అడవులు
National

కర్నాటక ముస్లిం కోటా బిల్లుపై రాజ్యసభలో రసాభాస
ఢిల్లీ: కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం(Karnataka Congress government) ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లును ఆమోదించడంపై రాజ్యసభలో బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కర్ణాటకలో ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ ఆమోదించడాన్ని కేంద్ర మంత్రి నడ్డా,బీజేపీ ఎంపీలు ఖండించారు. కర్ణాటక ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నదంటూ ఆందోళనకు దిగారు.దీనిపై కాంగ్రెస్ అధ్యక్షుడు సమాధానం చెప్పాలంటూ రాజ్యసభ(Rajya Sabha)లో జేపీ నడ్డా డిమాండ్ చేశారు. ఈ నేపధ్యంలో నెలకొన్న గందరగోళం మధ్య రాజ్యసభను రెండు గంటలకు వాయిదా పడింది. కర్నాటక ప్రభుత్వ టెండర్లలో ముస్లిం కాంట్రాక్టర్లకు నాలుగు శాతం కోటా ఇచ్చేందుకు ప్రభుత్వం చట్టం తీసుకువచ్చింది. దీనిని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఇటువంటి బిల్లు రాజ్యాంగ విరుద్ధమని, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంపై కోర్టుకు వెళ్తామని కర్నాటక బీజేపీ హెచ్చరించింది.కర్నాటక ట్రాన్స్పరెన్సీ ఇన్ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ చట్టంలో సవరణ తీసుకువచ్చి, కేటగిరీ 2బీ కింద రిజర్వేషన్(Reservation) విధానాన్ని అమలు చేయనున్నట్లు సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు. కేటగిరీ 2బీలో ముస్లిం కాంట్రాక్టర్లు ఉంటారని ఆయన తెలిపారు. కేటగిరీ వన్‌లో ఎస్సీ, ఎస్టీలు, క్యాటగిరీ 2ఏలో వెనుకబడిన తరగతులు వారు ఉంటారన్నారు. కేటీపీపీ చట్టం కింద ఇకపై ముస్లిం కాంట్రాక్టర్లు సుమారు రెండు కోట్ల మేరకు విలువ కలిగిన ప్రభుత్వ పనులు చేసేందుకు అర్హులు కానున్నారు.ఇది కూడా చదవండి: యోగి సర్కారుకు ఎనిమిదేళ్లు.. యూపీలో సంబరాలు

ఏక్నాథ్ షిండేపై అనుచిత వ్యాఖ్యలు.. కమెడియన్ కునాల్‌కు బిగ్ షాక్
ముంబై: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేపై స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రకంపనలు సృష్టించాయి. మరోవైపు.. శివసేన నేతల ఫిర్యాదు మేరకు పోలీసులు కమెడియన్ కమ్రాపై కేసు నమోదు చేశారు. క్రమాపై వ్యాఖ్యలను సీఎం ఫడ్నవీస్, మరో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తప్పుబట్టారు.ఈ ఘటనపై సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పందిస్తూ..‘కునాల్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఏకానాథ్ షిండేపై చేసిన వ్యాఖ్యలకు గాను కునాల్ కమ్రా క్షమాపణలు చెప్పాల్సిందే. నేను కామెడీకి వ్యతిరేకంగా కాదు.. కానీ, కామెడీ పేరుతో ఒకరిని అగౌరవ పరచడం సరికాదు. డిప్యూటీ సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి గురించి ఇలా మాట్లాడాల్సింది కాదు. రాజ్యాంగం మనకు స్వేచ్ఛను ఇస్తుంది. అలా అని మీరు ఇతరుల స్వేచ్చను భంగపరచకూడదు. దానికి పరిమితులు ఉన్నాయి. అలా మాట్లాడి మీ తప్పును మీరు సమర్థించుకోలేరు’ అంటూ కామెంట్స్ చేశారు. మరోవైపు.. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మాట్లాడుతూ..‘రాజ్యాంగ నియమాలకు వ్యతిరేకంగా ఎవరూ ప్రవర్తించకూడదు. రాజ్యాంగం కల్పించిన హక్కులకు కట్టుబడి మాట్లాడాలి. చట్టం పరిధి దాటి వ్యవహరించకూడదు అంటూ వ్యాఖ్యలు చేశారు.This part was so hilarious 😂#kunalkamra @kunalkamra88 pic.twitter.com/zJ74DODgoO— ɱąŋʑʂ ☘️🍉 (@TheManzs007) March 23, 2025ఇదిలా ఉండగా.. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేను ఉద్దేశిస్తూ స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఖార్ ప్రాంతంలోని ది యూనికాంటినెంటల్ హోటల్లోని హాబిటాట్ కామెడీ క్లబ్లో కునాల్ కమ్రా (Kunal Kamra) షో జరిగింది. ఇందులో కుమ్రా.. డిప్యూటీ సీఎంను ఉద్దేశిస్తూ ఓ జోక్ వేశారు. ‘శివసేన నుంచి శివసేన బయటికి వచ్చింది. ఎన్సీపీ నుంచి ఎన్సీపీ విడిపోయింది. అంతా గందరగోళంగా ఉందన్నారు. ఏక్నాథ్ షిండేను ద్రోహిగా అభివర్ణించారు. ఈ సందర్భంగా ‘దిల్ తో పాగల్ హై’ అనే హిందీ పాటను రాజకీయాలకు అనుగుణంగా మార్చి అవమానకర రీతిలో పాడారు. దీంతో, కమెడియన్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తంచేసిన శివసేన కార్యకర్తలు.. ఆదివారం రాత్రి షో జరిగిన హోటల్‌పై దాడి చేశారు. హోటల్లోని ఫర్నీచర్‌ు ధ్వంసం చేశారు. కమ్రా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ దాడికి పాల్పడ్డారు. కమెడియన్ వ్యాఖ్యలపై శివసేన కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కమ్రాపై కేసు నమోదు చేశారు. Kunal Kamra's Joke On Eknath Shinde । FIR Lodge Against Kamra । #kunalkamra #eknathshinde #gaddar #Trending #Mumbai pic.twitter.com/U8RfKqSwbQ— Magadh Talks (@MagadhTalks) March 24, 2025

యోగి సర్కారుకు ఎనిమిదేళ్లు.. యూపీలో సంబరాలు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో సీఎం యోగి ఆదిత్యనాథ్(CM Yogi Adityanath) సర్కారు ఎనిమిదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తోంది. ప్రతి జిల్లాలోనూ బీజేపీ నేతలు సంబరాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా ఇన్‌చార్జ్‌లు, కార్యకర్తలు ‘ఉత్తరప్రదేశ్ శ్రేయస్సు - ఎనిమిది వసంతాల బీజేపీ ప్రభుత్వం’ అనే నినాదంతో గ్రామాలలో సందడి చేస్తున్నారు.ఈ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం(State Government) మార్చి 24 నుండి ఏప్రిల్ 14 వరకు నిర్వహించనుంది. రాష్ట్రంలోని బూత్‌ల నుండి జిల్లా ప్రధాన కార్యాలయాల వరకు అన్నిచోట్లా ఉత్సవాలు జరగనున్నాయి. మార్చి 24 నుండి జిల్లా స్థాయిలో వర్క్‌షాప్‌లు నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా ప్రభుత్వ పథకాలను, ఇందుకోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఇంటింటికి చేరవేయనున్నారు. అసెంబ్లీ స్థాయిలో అభివృద్ధి సదస్సులు కూడా నిర్వహించనున్నారు.జిల్లాలో ప్రభుత్వం చేపడుతున్న ప్రధాన ప్రాజెక్టుల గురించి అందరికీ వివరించేందుకు యువమోర్చా బైక్ ర్యాలీ(Bike rally)లు నిర్వహించనుంది. గత ఎనిమిదేళ్లలో ప్రభుత్వం సాధించిన విజయాలను జిల్లా స్థాయిలో సమావేశాలు నిర్వహించి, అందరికీ తెలియజేయనున్నారు. ఏప్రిల్ 14న బాబా సాహెబ్ డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా బాబా సాహెబ్ విగ్రహానికి బీజేపీ నేతలు పూలమాలలు వేయనున్నారు.ఇది కూడా చదవండి: ‘రెండు కిలోల వెల్లుల్లి, రూ. 500 తెస్తేనే కేసు దర్యాప్తు’

‘రెండు కిలోల వెల్లుల్లి, రూ. 500 తెస్తేనే కేసు దర్యాప్తు’
ముజఫర్‌పూర్: అవినీతికి పాల్పడుతున్న పోలీసులకు సంబంధించిన ఉదంతాలను మనం అప్పుడప్పుడూ వింటుంటాం. ఇటువంటి ఘటనలపై ఉన్నతాధికారులు వెంటనే స్పందిస్తూ, అవినీతికి పాల్పడిన పోలీసులను సస్సెండ్ చేస్తుంటారు. అయితే బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో పోలీసుల అవినీతి బాగోతం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముజఫర్‌పూర్ పరిధిలోని మీనాపూర్ పోలీస్ స్టేషన్(Meenapur Police Station)కు వచ్చిన వృద్ధ దంపతులకు చేదు అనుభవం ఎదురయ్యింది. తమ కుమారుడు తప్పిపోయాడని, అతనిని వెదికిపెట్టాలంటూ వచ్చిన ఆ వృద్ధ తల్లిదండ్రుల విషయంలో పోలీసులు అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు. తమ కుమారుడిని వెదికి పెట్టాలంటే రెండు కిలోల వెల్లుల్లి, ఐదు వందల రూపాయలు ఇవ్వాలని స్టేషన్ ఇన్స్పెక్టర్ డిమాండ్ చేస్తున్నారని ఆ వృద్ధ దంపతులు ఆరోపిస్తున్నారు. కేసు ఇన్ఫార్మర్ యోగేంద్ర భగత్ మీడియాతో మాట్లాడుతూ ఆ దంపతుల ఏకైక కుమారుడు అజిత్ కుమార్ సిటీకి వెళ్లిన తరువాత అదృశ్యమయ్యాడన్నారు. మీనాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని, కానీ ఇప్పటి వరకు ఎటువంటి పురోగతి లేదన్నారు.బాధిత దంపతులు మీడియాతో మాట్లాడుతూ తాము స్టేషన్‌కు వెళ్ళినప్పుడల్లా పోలీసు అధికారులు(Police officers) తమను దూషిస్తూ, అక్కడి నుండి తరిమివేస్తుంటారని చెప్పారు. పోలీస్ ఇన్స్పెక్టర్ రెండు కిలోల వెల్లుల్లి, రూ.500 ఇస్తే కేసు దర్యాప్తు చేస్తామని చెబుతున్నారన్నారు. మా ఇంట్లో 50 గ్రాముల వెల్లుల్లి కూడా లేదని, అలాంటప్పుడు తాము రెండు కిలోల వెల్లుల్లిని ఎలా ఇవ్వగలమని బాధిత తండ్రి వాపోయాడు. తాజాగా బాధిత కుటుంబం బీహార్ మానవ హక్కుల కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు విడివిడిగా పిటిషన్లు దాఖలు చేసింది. ఈ సందర్భంగా మానవ హక్కుల న్యాయవాది మాట్లాడుతూ పోలీసులు ఈ కేసును పరిష్కరించడానికి బదులుగా, మరింత క్లిష్టతరం చేస్తున్నారని అన్నారు. దీనిపై ఉన్నత స్థాయిలో దర్యాప్తు జరగాలన్నారు. పోలీసులు ఈ కేసును దాచిపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని, అందుకే సీఐడీ దర్యాప్తు ఖచ్చితంగా అవసరమని అన్నారు.ఇది కూడా చదవండి: ‘డాన్స్ కోసం పుట్టి.. ప్రొఫెసర్ అయ్యారు’
NRI

ఫ్లోరిడాలో అత్యున్నత స్థాయి ‘హెర్ హెల్త్ ఆంకాలజీ కాంగ్రెస్ 2025’
అమెరికాలోని ఫ్లోరిడాలోని ఓర్లాండో నగరంలో మెడికల్ కాన్ఫరెన్స్ ఘనంగా జరిగింది. 70-80 మంది ఆంకాలజిస్టులు, ప్రైమరి కేర్ డాక్టర్లు హాజరైన ఈ కార్యక్రమం, ఇన్నోవేటివ్ ఎడ్యుకేషన్‌కి ఒక వేదికగా పనిచేసిందని నిర్వాహకులు తెలిపారు. ఈ సదస్సు ప్రముఖ కీనోట్ వక్త, డాక్టర్ బార్బరా మెకనీ, మాజీ AMA ఉపాధ్యక్షురాలు ఆంకాలజి పరిశోధన, పక్షవాతం, పేషంట్ కేర్ మొదలైన అంశాల ప్రాముఖ్యాన్ని వివరించారు.‘హెర్ హెల్త్ ఆంకాలజీ కాంగ్రెస్ 2025 తన విజన్‌ను నిజం చేసింది. మహిళల కోసం క్యాన్సర్ సంరక్షణను ముందుకు తీసుకెళ్లడంలో వైద్య సమాజాన్ని శక్తివంతం చేయడానికి, అవగాహన నిమిత్తందీన్ని రూపొదిచామనీ, ఈమెడ్ ఈవెంట్స్, ఈమెడ్ ఎడ్ సీఈఓగా, శంకర నేత్రాలయ, యూఎస్ఏ సీఎమ్ఈ చైర్‌పర్సన్‌గా(USA CME) ఒక మహిళగా, మహిళా ఆరోగ్య సంరక్షణలో మార్పు తీసుకురావడానికి ఇదొక సదవకాశమని’ డాక్టర్ ప్రియా కొర్రపాటి సంతోషం వ్యక్తం చేశారు. మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి!చైర్పర్సన్ డాక్టర్ సతీష్ కత్తుల, ఆంకాలజిస్ట్, హెమటాలజిస్ట్, AAPI అధ్యక్షుడు, మహిళలలో సాధారణ క్యాన్సర్లను పరిష్కరించడం, నిరంతర అవగాహన ప్రాముఖ్యతను హైలైట్ చేశారు. కాంగ్రెస్‌లో 10 మంది అత్యున్నత నైపుణ్యం కలిగిన వక్తలు ఉన్నారని, ప్రతి ఒక్కరూ ఆంకాలజీలో పురోగతి, సమగ్ర రోగి సంరక్షణపై దృష్టిపెడుతున్నారని డా. ప్రియా అన్నారు. ఈ కాంగ్రెస్‌ను కేవలం ఒక కార్యక్రమం కాకుండా, కంటిన్యూస్ లర్నింగ్ చేయాలనే తమ లక్ష్యాన్ని బలోపేతం చేశారన్నారు. AAPI, CAPI (టంపా నుండి స్థానిక అధ్యాయం) eMed Ed తో కలిసి చేస్తున్న సహకార ప్రయత్నాలను డా. సతీష్ అభినందించారు. ప్రత్యేక ఆకర్షణలుNFL ఆటగాడు షెప్పర్డ్ స్టెర్లింగ్ ఈ సదస్సు హాజరు కావడం విశేషం. ఆంకాలజీ వంటి క్రిటికల్ కేర్ వైద్యులలో చాలా ఉద్యోగపరైమన ఒత్తిడి అధికంగా ఉంటుంది దాని కోసం ప్రత్యేకంగా ఆంకాలజీ బర్నవుట్ సెషన్ నిర్వహించటం మరో విశేషం. డాక్టర్ వర్షా రాథోడ్, ఇంటిగ్రేటివ్ మెడిసిన్ స్పెషలిస్ట్, ఓర్లాండో, ఫ్లోరిడా ఈ సెషన్ నిర్వహించారు. డాక్టర్ శైలజ ముసునూరి, ఇంటిగ్రేటెడ్ మెడిసిన్, చీఫ్ ఆఫ్ సైకియాట్రి, వుడ్ సర్వీసెస్, పెన్సిల్వేనియా వారు నిర్వహించిన సైకాలజికల్ ఆంకాలజీ సెషన్ ఆకట్టుకుంది. క్యాన్సర్ కేర్ లో మెడికల్ ట్రీట్మెంట్ మాత్రమే కాకుండా, రోగుల మానసిక, భావోద్వేగ స్థితిని కూడా సమర్థంగా నిర్వహించాలని పేర్కొన్నారు.వాలంటీర్ల దృక్పదంస్పీకర్లకి మించి, ఈ కాంగ్రెస్ స్వచ్ఛంద సేవకులకు కూడా గొప్ప అనుభవాన్ని ఇచ్చిందనీ, సెషన్లు, ఆసక్తిక్రమైన చర్చలు జరిగాయి. డాక్టర్లు అనేక ప్రశ్నలను చాలా లోతైన వివరణ, పరిస్కారాలు ఇచ్చారని, క్వెషన్ అండ్ ఆన్సర్ సెషన్ చాలా ఆసక్తిగా, ఉపయోగంగా ఉందని ఆమె తెలిపారు.ఆడియన్స్ అభిప్రాయాలుమహిళల క్యాన్సర్లపై దృష్టి సారించే ఆంకాలజీ సమ్మేళనాలు అరుదుగా ఉన్నాయని, ఈ కార్యక్రమం ఆంకాలజిస్ట్‌లు, ప్రమరి కేర్ డక్టర్లు ఇద్దరికీ ఒక అమూల్యమైన అవకాశం అని అన్నారు. రోగులను ఎప్పుడు రిఫర్ చేయాలి, కొత్త చికిత్సా విధానాల ఏమున్నాయి వంటి అవసరమైన అంశాలను ఎలా నిర్వహించాలనేది తమ అభిప్రాయాల ద్వారా వెల్లడించారు.హెర్ హెల్త్ ఆంకాలజీ కాంగ్రెస్ భవిష్యత్తు హెర్ హెల్త్ ఆంకాలజీ కాంగ్రెస్ 2026 కాంగ్రెస్ ఓహియోలో జరుగుతుందని ప్రకటించారు. ఈ కార్యక్రం విజయానికి సహకరించిన అందరికీ ప్రియా కొర్రపాటి ధన్యవాదాలు తెలిపారు. అలాగే మహిళల కోసం ఆంకాలజీ సంరక్షణను ముందుకు తీసుకెళ్లే మిషన్‌లో ముందుకు సాగడానికి ఇది స్ఫూర్తినిస్తుందని ఇప్పుడున్నఆంకాలజీని ముందుకు ముందుకు తీసుకెళ్ళటానికి కలిసి పనిచేద్దామనిఆమె పిలుపునిచ్చారు.

డాక్టర్ కావాలనుకుంది : భారతీయ విద్యార్థిని విషాదాంతం?!
డొమినికన్ రిపబ్లిక్లో కనిపించకుండాపోయిన భారతీయ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయిందా అంటే అవుననే అనుమానాలు బాగా బలపడుతున్నాయి. గత వారం విహారయాత్రకు వెళ్లి కనిపించకుండా పోయిన పిట్స్బర్గ్ విశ్వవిద్యాలయ విద్యార్థిని నీటిలో మునిగి మరణించి ఉంటుందని భావిస్తున్నట్టు అధికారులు ఆదివారం ధృవీకరించారని ఏబీసీ న్యూస్ తెలిపింది. ప్రమాదవశాత్తూ నీటిమునిగి ఉంటుందని పోలీసులు వెల్లడించినట్టు తెలిపింది. మార్చి 6వ తేదీ,తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఆరుగురు స్నేహితులతో రిసార్ట్‌కు వెళ్లినట్లు సమాచారం. ప్రస్తుతం పిట్స్బర్గ్ యూనివర్శిటీలో గ్రాడ్యుయేషన్ చదువుతున్న సుదీక్ష కోణంకి ఈ నెల 6న ప్రముఖ పర్యాటక పట్టణమైన వ్యూంటా కానా ప్రాంతానికి వెళ్లింది. అక్కడ బీచ్‌లో ఒక స్నేహితుడితో కలిసి ఈతకోసం వెళ్లిన ఆమె ఎంతకీ తిరిగి రాకపోవడంతో మిగిలిన స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై సోషల్ మీడియాలో ఆమె ఆచూకీ కోసం విస్తృతంగా ప్రచారం చేశారు. దీంతో ఆమె బీచ్‌లో కొట్టుకుపోయి ఉంటుందని పోలీసులు భావించి సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టారు. డ్రోన్లు, హెలికాఫ్టర్లతో గత నాలుగు రోజులుగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. భారతదేశానికి చెందిన సుదీక్ష తల్లిదండ్రులు రెండు దశాబ్దాల క్రితం అమెరికాకు వలస వెళ్లి అక్కడ శాశ్వత నివాస హోదా పొందారు. 20 ఏళ్ల నుంచి వర్జీనియాలో నివాసం ఉంటున్న సుదీక్ష కోణంకి పిట్స్బర్గ్ యూనివర్శిటీలోచదువుతోంది. తన కుమార్తె పిట్స్బర్గ్ విశ్వవిద్యాలయంలో ప్రీ-మెడికల్ స్టడీకి ముందు వెకేషన్కోసం పుంటా కానాకు వెళ్లిందని, స్నేహితులతో కలిసి రిసార్ట్‌లో పార్టీకి వెడుతున్నట్టు చెప్పిందని, అవే తనతో మాట్లాడిన చివరి మాటలని సుదీక్ష తండ్రి సుబ్బరాయుడు కోణంకి కన్నీటి పర్యంతమైనారు. తన బిడ్డ మెరిట్ స్టూడెంట్ అనీ, డాక్టర్ కావాలని కలలు కనేదని గుర్తు చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో స్నేహితులను పోలీసులు ప్రశ్నించారని, ఎవరిపైనా ఎలాంటి అభియోగాలు నమోదు కాలేదని అధికారులు తెలిపారు.

న్యూయార్లో ఘనంగా తెలుగువారి సంబరాలు.
అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్ లో తెలుగువారి సంబరాలు అంబరాన్ని అంటాయి. ఒకే రోజు రెండు ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నారు. మహిళా దినోత్సవంతో పాటు మహా శివరాత్రి వేడుకలను కూడా ఓకేసారి న్యూయార్క్ లో స్థిరపడిన తెలుగువారి చేసుకున్నారు. న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (నైటా) ఆధ్వర్యంలో ఫ్లషింగ్ గణేష్ టెంపుల్ ఆడిటోరియంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి.వందలాది మంది తెలంగాణ, తెలుగు వాసులు తమ కుటుంబాలతో సహా చేరి ఉత్సవాల్లో పాల్గొని ఆడి పాడారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ మాట్లాడుతూ అమెరికాతో పాటు న్యూ యార్క్ మహానగరం అభివృద్ది, సంస్కృతిలో తెలుగువారు అంతర్భాగం అయ్యారని కొనియాడారు.తెలంగాణ ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్కమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీతక్క, తదితర ప్రముఖులు ప్రత్యేక సందేశాల ద్వారా నైటా కార్యక్రమాలను, ఆర్గనైజింగ్ కమిటీ కృషిని ప్రశంసిస్తూ ప్రత్యేక సందేశాలను పంపారు. వీటి సంకలనంతో పాటు నైటా సభ్యులు, కార్యక్రమాలతో కూడిన సమాహారంగా నైటా వార్షికోత్సవ సావనీర్ ను ఈ సందర్భంగా విడుదల చేశారు.ఈ ఫెస్టివల్ ఈవెంట్ లో తెలంగాణ సూపర్ రైటర్, సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ కాసర్ల శ్యామ్ తో పాటు, యూకే నుంచి సింగర్ స్వాతి రెడ్డి, డాన్సింగ్ అప్సరాస్ గా పేరొందిన టీ అండ్ టీ సిస్టర్స్, ఇండియన్ ఫేమస్ ఫ్యూజన్ మ్యూజిక్ గ్రూప్ పరంపరా లైవ్ ఫెర్మామెన్స్ తో అదరగొట్టారు. కొన్ని గంటల పాటు జరిగిన కార్యక్రమం ఆద్యంతం అందరినీ కట్టిపడేసింది.తెలుగు యువత గుండెల్లో చిరకాలం నిలిచిపోయే పాటలను రచించటంతో పాటు, పాడిన యువ గాయకుడు కాసర్ల శ్యామ్ కొన్ని హిట్ సాంగ్స్ తో అందరినీ ఉర్రూతలూగించారు. అమెరికాలో తెలుగువారి బలగాన్ని, బలాన్ని తన పాటల ద్వారా శ్యామ్ చాటి చెప్పారు. ఇక కొంత ఆలస్యంగానైనా న్యూయార్క్ తెలుగువారు శివరాత్రి వేడుకలు జరుపుకున్నా ఆధ్యాత్మిక గీతాలు, చిన్నారులు భక్తి పాటలతో ఆడిటోరియటం మారు మోగింది.న్యూయార్క్ మహానగరంలో నిత్యం వారి వారి వృత్తుల్లో బిజీగా ఉండే మన తెలుగు వారు అన్నింటినీ పక్కన పెట్టి అటు శివ భక్తి, ఇటు మహిళా దినోత్సవాన్ని ఒకే సారి వేడుకగా జరుపుకున్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నైటా ఆర్గనైజింగ్ టీమ్ తో పాటు తెరవెనుక సహకరించిన ప్రతీ ఒక్కరికీ పేరు పేరునా అధ్యక్షురాలు వాణీ రెడ్డి ఏనుగు కృతజ్జతలు తెలిపారు.నైటా కార్యక్రమాలకు వెన్నుముకగా నిలుస్తూ ప్రోత్సాహం అందిస్తున్న డాక్టర్ పైళ్ల మల్లారెడ్డిని నైటా టీమ్ ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో వందలాది మంది తెలుగు కుటుంబాలతో పాటు, న్యూయార్క్ కాంగ్రెస్ విమెన్ గ్రేస్ మెంగ్, ఇండియన్ కాన్సులేట్ జనరల్ నుంచి బిజేందర్ కుమార్ తదితరులు హాజరయ్యారు.

లండన్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
బిందువు బిందువు కలిస్తేనే సింధువు అనే విధంగా యూకే లో నివసిస్తున్న తెలుగు మహిళలు అందరూ “తెలుగు లేడీస్ యుకె” అనే ఫేస్బుక్ గ్రూప్ ద్వారా కలుసుకుని అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాలు జరుపుకున్నారు సహాయం కోరే వారికి మరియు సహాయం అందించే వారికి వారధిగా నిలిచే తెలుగు లేడీస్ ఇన్ యుకె గ్రూపును శ్రీదేవి మీనా వల్లి 14 ఏళ్ల క్రితం స్థాపించారు. ఈ గ్రూపులో ప్రస్తుతం ఐదు వేలకు పైగా తెలుగు మహిళలు ఉన్నారు.యూకే కి వచ్చినా తెలుగు ఆడపడుచులను ఆదరించి వారికి తగిన సూచనలు సలహాలు ఇస్తూ విద్యా వైద్య ఉద్యోగ విషయాల్లో సహాయం అందించడమే గ్రూప్ ఆశయమని శ్రీదేవి గారు తెలియజెప్పారు. ఈ సంవత్సరం యూకేలోని పలు ప్రాంతాల నుండి 300కు పైగా తెలుగు మహిళలు పాల్గొని ఆటపాటలతో ,లైవ్ తెలుగు బ్యాండ్ తో, పసందైన తెలుగు భోజనంతో పాటు,చారిటీ రాఫెల్ నిర్వహించి అవసరంలో ఉన్న మహిళలకు ఆసరాగా నిలిచారు.మస్తీ ఏ కాదు మానవత్వం లో కూడా ముందు ఉన్నాము అని నిరూపించారు.ఈవెంట్ లో డాక్టర్ వాణి శివ కుమార్ గారు మహిళలకు సెల్ఫ్ కేర్ గురించి ఎన్నో మంచి సూచనలు ఇచ్చారు. ఈవెంట్ కి వచ్చిన వాళ్లందరికీ మనసు నిండా సంతోషంతో పాటు మన తెలుగుతనాన్ని చాటిచెప్పేలా గాజులు,పూతరేకులు, కాజాలు వంటి పసందైన రుచులతో తాంబూలాలు పంచిపెట్టారు. ఈ ఈవెంట్లో శ్రీదేవి మీనావల్లితో పాటు సువర్చల మాదిరెడ్డి ,స్వాతి డోలా,జ్యోతి సిరపు,స్వరూప పంతంగి ,శిరీష టాటా ,దీప్తి నాగేంద్ర , లక్ష్మి చిరుమామిళ్ల , సవిత గుంటుపల్లి, చరణి తదితరులు పాల్గొన్నారు.
క్రైమ్

Film Nagar: స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం
హైదరాబాద్: నిబంధనలు ఉల్లంఘించి అక్రమ మార్గాల్లో క్రాస్ మసాజ్ చేస్తున్న స్పా సెంటర్‌పై ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల సమాచారం మేరకు... ఫిలింనగర్ రోడ్డు నెంబర్–5లో అర్బన్ రిట్రీట్ పేరుతో మసాజ్ పార్లర్ నిర్వహిస్తున్నాడు. అయితే వివిధ ప్రాంతాల నుంచి యువతులను తీసుకొచ్చి నిబంధనలకు విరుద్ధంగా క్రాస్ మసాజ్‌కు పాల్పడుతున్నట్లుగా ఫిర్యాదు అందుకున్న ఫిలింనగర్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. పలువురు యువతులు మసాజ్ థెరపిస్టుల పేరుతో క్రాస్ మసాజ్‌కు పాల్పడుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. దీంతో స్పా యజమాని అక్షయ్ బొహ్రపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భర్త స్నేహితుడని కారు ఇస్తే... వెంగళరావునగర్: భర్త స్నేహితుడని నమ్మి కారు ఇస్తే దాన్ని సదరు వ్యక్తి తాకట్టు పెట్టిన సంఘటన మధురానగర్ పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసుల సమాచారం మేరకు... కె.లక్ష్మి అనే మహిళ కళ్యాణ్నగర్కాలనీలోని ఓ బ్యాంకులో మేనేజర్‌గా పని చేస్తున్నారు. గత ఏడాది జూన్ 10వ తేదీ తన భర్త స్నేహితుడైన పరమేశ్వర్‌రెడ్డి వచ్చి తన కారును తీసుకెళ్లాడు. నాలుగు రోజుల్లో ఇస్తానని చెప్పాడు. అయితే ఎంతకీ కారును తీసుకురాలేదు. ఈ నెల 5వ తేదీనాడు చల్లా మనోహర్ యాదవ్ అనే వ్యక్తి ఆమెకు ఫోన్ చేసి పరమేశ్వర్‌రెడ్డి కారును తనకు మార్ట్గేజ్ చేశాడని తెలియజేశాడు. దాంతో ఆమె మధురానగర్ పీఎస్‌లో ఆదివారం ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

అమ్మానాన్నను వీడి అనంతలోకాలకు..
నంద్యాల: బుడిబుడి నడకలతో..వచ్చీ రాని మాటలతో... ముసిముసి నవ్వులతో అందరినీ మెప్పించే ఆ చిన్నారి ఇక లేరు. ఎప్పుడూ అమ్మానాన్న వెంటే ఉండే ఆ బాలిక ఈ లోకాన్ని వీడి వెళ్లి పుట్టెడు శోకాన్ని మిగిల్చింది. ప్రమాదవశాత్తూ ఇంటి మిద్దైపె నుంచి పడి మృత్యువాత పడింది. ఈ దుర్ఘటన కోసిగి మండలం వందగల్లు గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన లంకా ఆంజనేయులు, నాగలక్ష్మి దంపతులు వ్యవసాయ కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె శ్రీదేవికి మూడేళ్లు ఉండగా.. చిన్న కుమార్తె ఏడాది వయస్సులో ఉన్నారు. ఆదివారం తల్లిదండ్రులు ఇంటి పనుల్లో నిమగ్నమై ఉండగా పెద్ద కుమార్తె శ్రీదేవి (3) ఇంటి ఆవరణలో ఆడుకుంటూ ఉంది. ఆటల్లోనే మెల్లగా మెట్లు ఎక్కి మిద్దె పైకి వెళ్లింది. అదే సమయంలో ట్రాక్టర్ శబ్దం రావడంతో తండ్రి వెళ్తున్నాడని భావించి మిద్దైపె నుంచి తొంగి చూస్తూ కింద పడిపోయింది. తలకు తీవ్రమైన రక్త గాయం కావడంతో బైక్‌పై కోసిగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. కళ్లెదుట కుమార్తె మృతి చెందడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.

భర్తను చంపేందుకు తార్ కార్‌తో ఢీకొట్టి..
మునిపల్లి(అందోల్): కట్టుకున్న భర్తను కారుతో ఢీకొట్టి హత్య చేసేందుకు ప్రియుడితో కలిసి భార్య కుట్ర చేసిన ఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. అప్రమత్తమైన భర్త తప్పించుకొని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బుదేరా ఎస్ఐ రాజేశ్ నాయక్ కథనం ప్రకారం... పెద్దగోపులారం గ్రామానికి చెందిన కొమిశెట్టిపల్లి రవి ఝరాసంగం మండలంలోని దేవరాంపల్లిలో పంచాయతీ కార్యదర్శిగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఎప్పటిలాగే ఈ నెల 22న బైక్‌పై వెళ్లి విధులు నిర్వహించుకొని బుదేరా నుంచి గోపులారానికి వస్తున్న క్రమంలో నల్ల రంగు తార్ కార్‌తో రవిబైక్ను ఢీకొట్టి వెళ్లిపోయారు. బైక్‌పై నుంచి కిందడిన రవి అప్రమత్తమై తప్పించుకొని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు కంకోల్ టోల్ ప్లాజా వద్ద ఫాస్ట్ ట్రాక్ డిటేల్స్ ద్వారా నేరస్తులను గుర్తించారు. హత్య చేయడానికి గల ముఖ్య కారణం రవి భార్య హరితనే తేల్చారు. హరిత సంగారెడ్డికి చెందిన మిర్దొడ్డి సాయి ప్రదీప్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీంతో భర్తను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలనుకొని ప్రియుడుతో కలిసి భర్త హత్యకు పథకం రచించింది. దీంతో ఏ1గా హరిత, ఏ2 మిరుదొడ్డి సాయి ప్రదీప్, ఏ3 దాసోజీ సాయికిరణ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరు పరిచారు. అక్కడి నుంచి జైలుకు పంపించారు. చాకచక్యంగా వ్యవహరించి ఈ కేసును ఛేదించిన సిబ్బందిని ఎస్ఐ ఎం. రాజేశ్ నాయక్, కానిస్టేబుల్స్ పాండు, తుకారాం, హనీఫ్, సునీల్‌లను కొండాపూర్ సీఐ వెంకటేశం అభినందించారు.

పెళ్లి పేరుతో నమ్మించి గర్భవతిని చేశాడు
ఖమ్మం: పెళ్లి చేసుకుంటానని నమ్మించి మైనర్ బాలికను గర్భవతిని చేశాడని, నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేయాలని ఎర్రుపాలెం మండలం భీమవరం గ్రామానికి చెందిన పలువురు డిమాండ్ చేశారు. బాలిక బంధువులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. గ్రామంలోని దళిత కాలనీకి చెందిన బాలిక, అదే గ్రామానికి చెందిన ముల్లంగి జమలయ్య అనే యువకుడు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని బాలికకు మాయమాటలు చెప్పి గర్భవతిని చేశాడు. ప్రస్తుతం ఐదు నెలల గర్భవతి కాగా, ఖమ్మం, విజయవాడలోని ఆస్పత్రులకు తీసుకెళ్లి అబార్షన్‌కు ప్రయత్నించాడని, ఇప్పుడు పెళ్లికి నిరాకరిస్తున్నాడని వారు ఆరోపించారు. దీంతో ఈనెల 21న తాము ఎర్రుపాలెం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు పట్టించుకోలేదని, 22వ తేదీన ఖమ్మంలో సీపీని కలిసినా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ఆదివారం గ్రామస్తులతో కలిసి మళ్లీ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఆందోళన చేశారు. ఆ తర్వాత మధిర – విజయవాడ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. అయినా పోలీసులు స్పందించకపోవడంతో బాలిక స్టేషన్ పక్కనే ఉన్న వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే ఆమె సోదరుడు ట్యాంక్ ఎక్కి నచ్చజెప్పినా బాలిక కిందకు దిగకపోవడంతో ఎస్ఐ పి.వెంకటేష్, సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. దీంతో గ్రామస్తులు వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టకేలకు బాలికకు న్యాయం చేస్తామని, నిందితుడిపై కేసు నమోదు చేస్తామని హామీ ఇచ్చిన ఎస్ఐ ఇద్దరు మహిళా కానిస్టేబుళ్ల సాయంతో బాలికను కిందకు తీసుకొచ్చారు. కాగా, స్టడీ సర్టిఫికెట్లో ఉన్న వయసు ప్రకారం ఆమె మైనర్ కాదని ఎస్ఐ చెబుతుండగా, ఆధార్ కార్డు, ఆస్పత్రి రికార్డులు తమ వద్ద ఉన్నాయని, వాటి ప్రకారం అమ్మాయి మైనరేనని బంధువులు అంటున్నారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేయకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని చెబుతున్నారు. కేసు నమోదు కాకుండా ఇద్దరు పోలీస్ ఉన్నతాధికారులు, మాజీ ప్రజాప్రతినిధి అడ్డుకుంటున్నారని ఆరోపించారు.