Top Stories
ప్రధాన వార్తలు

మీ బెదిరింపులకు ఎవరూ భయపడరు.. లావుకు పేర్ని స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి,గుంటూరు: టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు బెదిరింపులకు ఎవరూ భయపడరని మాజీ మంత్రి పేర్నినాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు మెప్పు కోసం ఎంపీ లావు లోక్‌సభలో విషం చిమ్ముతున్నారని ఆరోపించారు. మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పేర్నినాని మీడియాతో మాట్లాడారు. టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు బెదిరింపులకు ఎవరూ భయపడరు. పార్లమెంటును అడ్డు పెట్టుకుని కక్షసాధింపు రాజకీయాలు చేయటం మానుకోవాలి. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే భారీగా లిక్కర్ స్కాం జరిగింది. టీడీపీ ఎమ్మెల్యేలు లిక్కర్ షాపులను చెరపట్టారు. ప్రతిచోటా బెదిరించి కమీషన్లు, లంచాలు తీసుకుంటున్నారు. ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు వీటిపై పార్లమెంటులో మాట్లాడాలివైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వేలకోట్లు దేశం దాటి వెళ్లినట్టు టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు ఆరోపణలు చేశారు. అప్పుడు ఆయన మా పార్టీలోనే ఉన్నారు కదా? మరెందుకు మాట్లాడలేదు?.లావు శ్రీకృష్ణ దేవరాయలు ఫ్లెమింగో పక్షిలాంటివాడు.టీడీపీ గూటిలో చేరి చంద్రబాబు మాటలను చిలక పలుకులుగా మాట్లాడుతున్నారు. పల్నాడు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని శ్రీకృష్ణ రాష్ట్ర అభివృద్ధి కోసం వాడితే ఉపయోగ పడుతుంది. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రయివేటీకరణను ఆపటానికి, పోలవరానికి నిధులు తేవటానికి తన అధికారాన్ని వాడుకుంటే మంచిది. రాయలసీమ లిఫ్టు ఎత్తిపోతల పథకం కోసం వాడితే మంచిది.దక్షినాది రాష్ట్రాల్లో తగ్గబోతున్న సీట్ల గురించి మాట్లాడాలి.కనీసం పల్నాడులో నీటి ఎద్దడి గురించి కూడా మాట్లాడటం లేదు.కేవలం చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్టు చదవటమే లావు శ్రీకృష్ణ దేవరాయలు పనిగా పెట్టుకున్నారు.ఇప్పుడు లిక్కర్ వ్యాపారం మొత్తాన్ని టీడీపీ నేతలే చెరబట్టారు.కమీషన్లు, వాటాల కోసం వ్యాపారుల గొంతు మీద కత్తి పెట్టారు.చంద్రబాబు, లోకేష్ తో సహా అందరూ దోపిడీ చేస్తున్నారు. ఇదికదా అసలైన లిక్కర్ స్కాం అంటే? ఇవేమీ కనపడటం లేదా శ్రీకృష్ణ దేవరాయలూ? అవినీతి, అక్రమాలు చేసిన చంద్రబాబుకు ఐటీ శాఖ నోటీసులు ఇచ్చింది.దానిపై ఐటీ శాఖ పూర్తి విచారణ ఎందుకు చేయటంలేదో శ్రీకృష్ణ దేవరాయలు ప్రశ్నించాలి.పాపపు సొమ్ము చంద్రబాబుకి చేరిందని ఈడీ చెప్పింది.దానిపై శిక్షలు వేయమని శ్రీకృష్ణ దేవరాయలు గట్టిగా అడగాలి.స్కిల్ స్కాం విచారణ మొదలవగానే చంద్రబాబు పిఏ శ్రీనివాస్ దుబాయ్ ఎందుకు పారిపోయాడో ప్రశ్నించాలి. శ్రీనివాస్ పదేపదే దుబాయ్ ఎందుకు వెళ్తున్నాడో? ఆయన వెనుకే లోకేష్ ఎందుకు వెళ్తున్నాడో ప్రశ్నించాలి.బేవరేజ్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డితో తప్పుడు వాంగ్మూలం తీసుకుని వైఎస్సార్సీపీ నేతలను అరెస్టు చేయాలని చూస్తున్నారు.ఏదోలా వైఎస్ జగన్ మీద అక్రమ కేసులు పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి బెదిరింపులకు భయపడేదే లేదని’ స్పష్టం చేశారు.

‘గిల్ ఒక్కడే ఏమీ చేయలేడు.. మేమంతా ఉంటేనే ఏదైనా సాధ్యం’
న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ గ్లెన్ ఫిలిప్స్ (Glenn Phillips) గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill)ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గతేడాది టైటాన్స్ వైఫల్యాలకు అతడు ఏమాత్రం కారణం కాదని పేర్కొన్నాడు. కెప్టెన్ ఒక్కడి ప్రదర్శన మీద జట్టు జయాపజయాలు ఆధారపడి ఉండవని.. ఆటగాళ్లంతా సమిష్టిగా రాణిస్తేనే గెలుపు వరిస్తుందని ఫిలిప్స్ అన్నాడు.అరంగేట్ర సీజన్లోనే చాంపియన్గాకాగా 2022లో గుజరాత్ టైటాన్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. హార్దిక్ పాండ్యా సారథ్యంలో.. తమ అరంగేట్ర సీజన్లోనే చాంపియన్‌గా నిలిచి చరిత్ర సృష్టించింది. ఆ తర్వాతి ఏడాది ఫైనల్ చేరింది. అయితే, 2024లో పాండ్యా టైటాన్స్‌ను వీడి తన సొంతజట్టు ముంబై ఇండియన్స్‌లో చేరాడు. ఫలితంగా టైటాన్స్ పగ్గాలను యాజమాన్యం భారత యువ తార గిల్‌కు అప్పగించింది.పేలవ ప్రదర్శన అయితే, గతేడాది తొలిసారిగా గిల్ కెప్టెన్సీలో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ పేలవ ప్రదర్శన కనబరిచింది. పద్నాలుగు మ్యాచ్‌లకు గానూ కేవలం ఐదే గెలిచి.. పది పాయింట్లతో పట్టికలో ఎనిమిదో స్థానానికి పరిమితమైంది. పాండ్యా జట్టును వీడటంతో పాటు మహ్మద్ షమీ (అప్పుడు టైటాన్స్ జట్టులో) గాయం వల్ల సీజన్ మొత్తానికి దూరం కావడం టైటాన్స్ ప్రదర్శనపై ప్రభావం చూపింది.అయితే, ఈసారి తాము ఆ ప్రతికూలతలు అధిగమించి అనుకున్న ఫలితాలు రాబడతామని గిల్ స్పష్టం చేశాడు. తమ జట్టు ప్రస్తుతం అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉందని ధీమా వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో గ్లెన్ ఫిలిప్స్ హిందుస్తాన్ టైమ్స్‌తో మాట్లాడుతూ.. ‘‘క్రికెట్ జట్టుగా ఆడాల్సిన ఆట.గిల్ ఒక్కడే ఏమీ చేయలేడు.. మేమంతా ఉంటేనే ఏదైనా సాధ్యంఒక్క ఆటగాడు లేదా కెప్టెన్ జట్టు మొత్తాన్ని గెలిపించలేదు. కాబట్టి శుబ్‌మన్ గిల్ కెప్టెన్సీ వల్లే గతేడాది గుజరాత్ ప్రదర్శన బాలేదని చెప్పడం సరికాదు. టీ20 క్రికెట్ స్వరూపమే వేరు. మ్యాచ్ రోజు ఎవరు ఫామ్‌లో ఉంటారో వారిదే పైచేయి అవుతుంది. గతేడాది సన్‌రైజర్స్, కేకేఆర్ సీజన్ ఆసాంతం ఒకే లయను కొనసాగించి ఫైనల్ వరకు చేరాయి.ఏదేమైనా తమ తొలి రెండు సీజన్లలో గుజరాత్ అద్భుతంగా ఆడింది. మంచి ఫామ్ కనబరిచింది. ఈ ఏడాది అదే ఫలితాన్ని పునరావృతం చేయగలమని నమ్ముతున్నా. శుబ్‌మన్ గిల్ కెప్టెన్సీ విషయంలో ఒత్తిడికి గురవుతాడని నేను అస్సలు అనుకోను. అతడు టీమిండియా ప్రధాన ప్లేయర్. జాతీయ జట్టుకు ఆడటం కంటే లీగ్ క్రికెట్లో ఆడటం తేలికే’’ అని గిల్‌కు ఫిలిప్స్ మద్దతు ప్రకటించాడు.రూ. 2 కోట్లకు కొనుగోలుకాగా 2021లో గ్లెన్ ఫిలిప్స్‌ను రాజస్తాన్ రాయల్స్ కొనుక్కోగా.. ఆ మరుసటి ఏడాది సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 1.5 కోట్లకు అతడిని సొంతం చేసుకుంది. కానీ తుదిజట్టులో మాత్రం ఎక్కువగా అవకాశాలు ఇవ్వలేదు. ఈ క్రమంలో మెగా వేలం-2025కి ముందు రైజర్స్ అతడిని విడిచిపెట్టింది. దీంతో గుజరాత్ టైటాన్స్ రూ. 2 కోట్లకు అతడిని వేలంపాటలో కొనుక్కుంది.ఇక ఇప్పటి వరకు ఐపీఎల్లో కేవలం ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన ఫిలిప్స్ 65 పరుగులు చేశాడు. ఇందులో మూడు ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2025లో భాగంగా గుజరాత్ టైటాన్స్ మంగళవారం తమ తొలి మ్యాచ్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌ను ఢీకొట్టనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఇందుకు వేదిక.చదవండి: అలా అయితే.. నేను జట్టులో ఉండటం వేస్ట్: ధోని

అదృష్టవశాత్తూ ఎమ్మెల్యేలు 4 ఏళ్లు ఆగలేదు: సుప్రీం కోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేల పిటిషన్లపై సుప్రీం కోర్టు(Supreme Court)లో మంగళవారం విచారణ జరిగింది. ఈ క్రమంలో పార్టీ ఫిరాయింపులపై సర్వోన్నత న్యాయస్థానం సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆయారాం, గయారాంలను నిరోధించేందుకే రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ఉందని, అలాంటప్పుడు ఫిరాయింపులపై ఏ నిర్ణయం అనేది తీసుకోకపోతే ఆ షెడ్యూల్‌ను అపహాస్యం చేయడం కిందకే వస్తుందని స్పష్టం చేసింది.కారు గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి పార్టీ ఫిరాయించారని.. ఆ 10 మందిపై అనర్హత వేటు విషయంలో తెలంగాణ స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని, కాబట్టి అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్(BRS) తరఫున ఈ జనవరిలో వేర్వేరు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై జస్టిస్ బీఆర్ గవాయ్, ఆగస్టీన్ జార్జ్ మసీహ్లతో కూడిన ధర్మాసనం వాదనలు వింటోంది. మంగళవారం వాదనలు మొదలవ్వగానే.. అసెంబ్లీ కార్యదర్శి దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ సంగతిని స్పీకర్ తరఫున వాదనలు వినిపిస్తున్న సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గీ వాదనలు ప్రస్తావించారు. ఈ వ్యవహారంలో స్పీకర్‌ను ఆదేశించే అధికారం న్యాయస్థానానికి ఉంటుందా? లేదంటే రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించాలా? అని కోరారు. బీఆర్ఎస్ తరఫున న్యాయవాది ఆర్యమా సుందరం వాదనలు వినిపిస్తూ.. ‘‘ఫిర్యాదులపై ఏం చేస్తారో.. 4 వారాల్లో షెడ్యూల్ చేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. అయినా పార్టీ మారిన వారికి స్పీకర్ నోటీసులు ఇవ్వలేదు. ధర్మాసనం కొన్ని వ్యాఖ్యలు చేసిన తర్వాతే నోటీసు ఇచ్చారు. 3 వారాల్లో రిప్లై ఇవ్వాలని.. ఫిబ్రవరి 13న స్పీకర్ నోటీసులు ఇచ్చారు. ఇప్పటికి 3 వారాలైంది.. నోటీసులు ఎటు వెళ్లాయో తెలియదు. మేము ఫిర్యాదు చేసి ఏడాదైనా స్పీకర్ షెడ్యూల్ కూడా చేయలేదు’’ అని సుందరం వాదించారు. బీఆర్ఎస్ వాదనలు.. కీ పాయింట్స్ 2024 మార్చి 18న మొదట ఫిరాయింపులపై శాసనసభ స్పీకర్ ఫిర్యాదు చేశాంమొదటి ఫిర్యాదు చేసినా నోటీసులు ఇవ్వలేదుహైకోర్టుకు వెళ్లేంత వరకు కూడా నోటీసులు ఇవ్వలేదురీజనబుల్ టైంలోనే చర్యలు తీసుకోవాలని హైకోర్టు డివిజన్ బెంచ్ చెప్పిందిహైకోర్టు చెప్పినా ఎలాంటి చర్యలు లేవుదానం నాగేందర్‌పై ఫిర్యాదు చేసినా.. ఆయనకు నోటీసులు ఇవ్వలేదుదానం ఎంపీగా పోటీ చేసినా చర్యల్లేవ్‌కడియంకు వ్యతిరేకంగా సాక్ష్యాలు ఉన్నా.. చర్యలు లేవ్‌అనర్హత పిటిషన్ విచారణపై షెడ్యూల్ చేయాలని.. హైకోర్టు నాలుగు వారాల గడువు ఇచ్చిందిస్పీకర్ 7 రోజుల సమయం ఇస్తూ నోటీసులు ఇచ్చారుముగ్గురు ఎమ్మెల్యేలు ఒకేరకంగా సమాధానం ఇచ్చారుపార్టీ మారినవాళ్లు లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ప్రచారం చేశారుముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు ప్రచారం చేశారునోటీసులు ఇచ్చామని స్పీకర్ అంటున్నారు.. కానీ, ఆ కాపీలు మాకు అందజేయలేదుస్పీకర్ అధికారాలు సైతం న్యాయసమీక్ష పరిధిలోనే ఉంటాయిన్యాయ సమీక్షకు స్పీకర్ అతీతులు కాదుఫిరాయింపులపై స్పీకర్ నిర్ణయంపై నిర్దిష్టమైన గడువు విధించాలినాలుగు వారాల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకునేలా ఆదేశించాలిఈక్రమంలో స్పందించిన జస్టిస్ గవాయ్.. పార్టీ ఫిరాయింపులకు వార్షికోత్సవం అయిందా? అని వ్యాఖ్యానించారు. అయితే ఇలాంటి వ్యవహారాల్లో గతంలో రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పులు ఉన్నప్పటికీ.. ఎప్పటిలోగా తేల్చాలనే విషయంపైనే స్పష్టత కొరవడిందని జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం వ్యాఖ్యానించింది. అలాంటప్పుడు ఆ తీర్పును కాదని ఎలా ముందుకు వెళ్లగలమని చెప్పింది. ఉన్నత ధర్మాసనాల తీర్పులను ఎలా తిరిగి రాయగలమని ప్రశ్నించింది.ధర్మాసనం ఇంకా ఏమందంటే..ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వడానికి ఇంకా ఎంత కాలం పడుతుంది?: ధర్మాసనంఆలస్యం చేసే ఎత్తుగడలు అనుసరించొద్దుఎమ్మెల్యేల ఫిరాయింపులపై ఫిర్యాదు వచ్చి ఎంతకాలమైంది?రీజనబుల్ టైం అంటే గడువు ముగిసేవరకా?మొదటి ఫిర్యాదు చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎంత టైం గడిచింది.నాలుగు వారాలైనా షెడ్యూల్ ఫిక్స్ చేయలేదా?అదృష్టవశాత్తూ.. ఎమ్మెల్యేలు 4 ఏళ్లు ఆగలేదుమూడు వారాల సమయం విషయంలో మాత్రం స్పీకర్ రీజనబుల్‌గా ఉన్నారుతెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన తీర్పులో డివిజన్ బెంచ్ జోక్యం సరైందో కాదో చూస్తాం?కౌంటర్ దాఖలుకు ప్రతివాదులు మరింత సమయం కోరగా.. కాలయాపన చేసే విధానాలు మానుకోవాలి బెంచ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇవాళ బీఆర్ఎస్ తరఫున వాదనలు ముగియడంతో తదుపరి విచారణను ఏప్రిల్ 2వ తేదీకి వాయిదా వేసింది. ఆరోజు స్పీకర్ తరఫున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించనున్నారు. మరోవైపు.. స్పీకర్ తరఫున సోమవారం(మార్చి 24వ తేదీన) అసెంబ్లీ కార్యదర్శి దాఖలు చేసిన కౌంటర్లో.. ‘‘రీజనబుల్ టైం అంటే గరిష్టంగా మూడు నెలలే అని అర్థం కాదు. ఒక్కో కేసు విచారణకు ఒక్కో రకమైన సమయం అవసరం. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చాం. కానీ, స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన వెంటనే కోర్టుకు వెళ్లారు. స్పీకర్ ఈ అంశంపై నిర్ణయం తీసుకున్న తర్వాతే.. న్యాయపరమైన పరిష్కారం కోసం ప్రయత్నించాలి. అప్పటిదాకా న్యాయస్థానాల జోక్యం కుదరదు. .. అనర్హత పిటిషన్ లను విచారించి నిర్ణయం తీసుకునే అధికారం కేవలం స్పీకర్ కే ఉంది. గత సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఇదే అంశాన్ని చెబుతున్నాయి. స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన వెంటనే....పిటీషనర్లే దురుద్దేశపూర్వకంగా కోర్టును ఆశ్రయించారు. ఫిరాయింపులపై స్పీకర్ నిర్ణయం తీసుకోవడం లేదన్నది సరికాదని.. చట్ట ప్రకారమే నడుచుకుంటున్నామని.. కాబట్టి ఈ పిటిషన్లను డిస్మిస్ చేయాలి’’ అని కోరారు. 👉కారు గుర్తుపై గెలిచి పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై చర్యలు చేపట్టేలా స్పీకర్‌కు ఆదేశాలివ్వాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ(BRS Party) జనవరిలో సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్, దానం నాగేందర్లపై స్పెషల్ లీవ్ పిటిషన్ (SLP) దాఖలు అయ్యింది. పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎం.సంజయ్‌కుమార్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, అరికెపూడి గాంధీలపై రిట్ పిటిషన్ దాఖలైంది. వీటిపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపింది సుప్రీం కోర్టు(Supreme Court). కేటీఆర్, పాడి కౌశిక్‌రెడ్డి, ఇతర బీఆర్ఎస్ నేతలు ఈ పిటిషన్లు వేశారు. అయితే.. 👉ఈ పిటిషన్లకు సంబంధించి.. కొద్దిరోజుల క్రితం మహిపాల్‌రెడ్డి, తాజాగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సుప్రీం కోర్టులో అఫిడవిట్లు దాఖలు చేశారు. తాము బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నామని, పార్టీ ఫిరాయింపు ఆరోపణల్లో వాస్తవం లేదని అందులో పేర్కొన్నారు. కేవలం ఎమ్మెల్యే హోదాలోనే సీఎంను కలిశామని తెలిపారు. అందువల్ల తమపై దాఖలైన కేసులను కొట్టివేయాలని అభ్యర్థించారు. బీఆర్ఎస్కు తాము రాజీనామా చేయలేదని.. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ చేరలేదని.. మీడియాలో వచ్చిన వార్తలలో నిజం లేదని.. కాబట్టి ఈ అనర్హత పిటీషన్లకు విచారణ అర్హత లేదని వాటిల్లో పేర్కొన్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో ఉన్న ఫొటోలు, పోస్టర్లను, తమ ఫొటోలతో కూడిన పార్టీ ఫ్లెక్సీల ఫొటోలనూ అఫిడవిట్లో జత చేశారు. ఇప్పటికే ఈ కేసు విచారణలో సర్వోన్నత న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ వస్తోంది. గతంలో తెలంగాణ స్పీకర్‌పై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. తగినంత సమయం అంటే ఎంతో చెప్పాలని కోరింది. గత విచారణలో.. ఆపరేషన్ సక్సెస్ , పేషంట్ డెడ్ అనే తీరు సరికాదన్న పేర్కొంది.

ఏడు నిమిషాల్లో బాడీ ఫిట్ : హిట్ హిట్ హుర్రే!
ప్రపంచం వేగంగా మారుతోంది. అలా వేగం పెరుగుతున్న కొద్దీ మన శారీరక కదలికలు తగ్గిపోతున్నాయి. మరోవైపు ఉరుకుల పరుగుల జీవితంలో వ్యాయామానికి సమయం లేదనడమూ సర్వసాధారణంగా మారింది. అయితే నిజానికి మానవ శరీరం చురుకుగా కదులుతూ ఉండేందుకు అనువుగా రూపొందింది. సమయం లేదంటూ దానిని కదిలించ కపోతే శారీరక సమస్యలతో పాటు ఆరోగ్యానికి చేటు తప్పదు. ఈ నేపథ్యంలో గంటల తరబడి చేయడానికి బదులు కేవలం నిమిషాల్లో ముగించేందుకు వీలుగా కొత్త కొత్త వ్యాయామాలు పుట్టుకొస్తున్నాయి. అలా అందుబాటులోకి వచ్చిందేఈ హిట్ పద్ధతి. – సాక్షి, సిటీబ్యూరో అమెరికాకు చెందిన వ్యాయామ మనస్తత్వవేత్త క్రిస్ జోర్డాన్ ఈ హిట్ అనే వ్యాయామ కార్యక్రమాన్ని రూపొందించారు. ఇది కదలికలు కురవైన శరీరం తెచ్చిపెట్టే సమస్యలకు.. కేవలం 7 నిమిషాల్లో పరిష్కరించగలదని ఆయన చెబుతున్నారు. సొంత శరీర బరువును ఉపయోగించి సుపరిచితమైన కాలిస్టెనిక్ వ్యాయామాలను చేయడమే హై ఇన్టెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ (హెచ్ఐఐటీ) ఈ హిట్ ఫార్ములా. ప్రతి రౌండ్‌కూ మధ్య ఐదు సెకన్ల విశ్రాంతి తీసుకుంటూ చేసే హై ఇన్టెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ (హెచ్ఐఐటీ)గా దీనిని పేర్కొంటున్నారు. ఇందులో ప్రతి వ్యాయామం 30 సెకన్ల పాటు చేయాలి. ఒక భంగిమ నుంచి మరో భంగిమకు మారేటప్పుడు మధ్యన 5 సెకన్ల చొప్పున గ్యాప్ ఉండాలి. పుష్–అప్స్: నేలపై లేదా చాపపై ‘ప్లాంక్’ పొజిషన్న్లోకి వెళ్లి చేసే ప్రక్రియ. బరువును పాదాలకు బదులుగా మోకాళ్లపై ఉంచడం ద్వారా దీన్ని సులభతరం చేయవచ్చు. వాల్ సిటప్స్: గోడ దగ్గర వెనుకభాగంలో నిల్చుని కుర్చీలో కూర్చున్నట్లుగా కూర్చునే భంగిమ. ఓ రకంగా గోడకుర్చీ వేయడం అని చెప్పొచ్చు. అబ్ క్రంచ్: ప్రాథమిక క్రంచ్‌తో ప్రారంభించి, వెనుకభాగంలో చదునుగా ఉంచి పడుకోవాలి, మోకాళ్లను వంచి పాదాలను నేలపై ఉంచి చేయాలి. స్టెప్–అప్: దృఢమైన కుర్చీ లేదా బెంచ్‌కు ఎదురుగా నిలబడి, ఎడమ కాలితో ఓ సారి కుడికాలితో మరోసారి ప్రారంభించి చేయాలి. 30 సెకన్ల వ్యవధిలో వీలైనన్ని సార్లు చేయాలి. స్క్వాట్: పాదాలను భుజం–వెడల్పు వేరుగా చేసి కాలి వేళ్లను ముందుకు ఉంచి నిలబడాలి. ఈ భంగిమలో ఉన్నప్పుడు బరువులో ఎక్కువ భాగాన్ని మడమల మీద ఉంచాలి. 30 సెకన్ల పాటు ఇలా చేయాలి. ట్రైసెప్ డిప్: కుర్చీ లేదా బెంచ్ ముందు అంచున కూర్చుని, మన అరచేతులను అంచుపై ఉంచి దీనిని చేయాలి. ప్లాంక్: చాపపై బోర్లా పొట్టపై పడుకుని దీన్ని చేయాలి. ఈ భంగిమలో మన మోచేతులు మన వైపు దగ్గరగా, అరచేతులు కిందికి వేళ్లు ముందుకు ఎదురుగా ఉంటాయి.చదవండి: 64 ఏళ్ల ప్రేమ : ఇన్నాళ్లకు అంగరంగ వైభవంగా పెళ్లిహై ‘నీస్’: 30 సెకన్ల పాటు ఉన్నచోటే పరుగెత్తడంగా దీన్ని చెప్పొచ్చు. ప్రతి అడుగుతో మోకాళ్లను వీలైనంత ఎత్తుకు పైకి తీసుకొస్తూ, అరచేతులను తాకడానికి మన మోకాళ్లను వేగంగా పైకి కందికి ఎత్తుతూ చేయాలి. లంజెస్: పాదాలను కలిపి నిలబడి, కుడి పాదం మీద ముందుకు సాగదీయాలి. ముందు, వెనుక మోకాలు రెండూ వీలైనంత 90–డిగ్రీల కోణానికి దగ్గరగా వంగి ఉండే వరకూ చేయాలి.ఇదీ చదవండి: నాలుగు వారాల కొరియన్ డైట్ ప్లాన్ : 6 రోజుల్లో 4 కిలోలుసైడ్ ప్లాంక్‌లు: చాపపై కుడి వైపున పడుకుని, ఎడమవైపు పడుకుని చేసే వ్యాయామం.

E Shinde: ముమ్మాటికీ పొలిటికల్ సుపారీనే!
ముంబై: ప్రముఖ స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై శివసేన అధినేత, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే స్పందించారు. కునాల్ ఆ వ్యాఖ్యలు వ్యంగ్యంగానే చేసినట్లు తాను అర్థం చేసుకోగలనని.. కానీ ప్రతిదానికి ఓ హద్దు ఉంటుందని అన్నారాయన. ఈ క్రమంలో సంచలన ఆరోపణలకు దిగారు.మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ శిందేపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు స్టాండప్ కమెడియన్ కునాల్. ఈ నేపథ్యంలో ఆ షో జరిగిన హబిటాట్ స్టూడియోపై షిండే వర్గీయులు దాడికి పాల్పడ్డారు. అయితే అది ఎవరైనా సరే విధ్వంసానికి తన మద్దతు ఎప్పుడూ ఉండబోదని ఏక్నాథ్ షిండే అన్నారు. బీబీసీ మరాఠీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కునాల్ ఎపిసోడ్‌పై స్పందించారు.ప్రజాస్వామ్యంలో వాక్ స్వాతంత్రం అందరికీ ఉంటుంది. దీనిని కాదనలేం. నా సంగతి పక్కన పెట్టండి. ప్రధాని మోదీ, భారత మాజీ న్యాయమూర్తి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, హోం మంత్రి అమిత్ షా..వీళ్ల గురించే కాదు ప్రముఖ వ్యాపారులు, గొప్ప గొప్పవాళ్ల గురించి కూడా చాలా తప్పుగా మాట్లాడాడతను. ఇలాంటి వ్యాఖ్యల కోసం అతనికి ఎవరి నుంచి సుపారీ అందింది?. ఇది కచ్చితంగా రాజకీయ ప్రత్యర్థుల కుట్రే అని అన్నారాయన. ఈ వ్యవహారంలో ప్రజలు కూడా ప్రతిపక్షాలనే వేలెత్తి చూపిస్తున్నారని.. అయినా వాళ్ల విధానాలు మారడం లేదన్నారు. ఇక హబిటాట్ స్టూడియోపై జరిగిన దాడిని ఖండించిన షిండే.. అది కార్యకర్తల మనోభావాలకు సంబంధించిన అంశమని పేర్కొన్నారు. ‘‘ఏక్నాథ్ షిండే అనేది చాలా సున్నితమైన అంశం. నాపై ఎన్నో ఆరోపణలు వస్తుంటాయి. కానీ, నేను నా పనితోనే వాటికి బదులిస్తుంటా. విధ్వంసానికి నేను వ్యతిరేకం. కానీ, పార్టీ కార్యకర్తలు ఊరుకోలేరు కదా. చర్యకు ప్రతిచర్య కచ్చితంగా ఉంటుంది’’ అంటూ వ్యాఖ్యలు చేశారు.

ఇప్పటిదాకా ఆరు అక్రమ కేసులు.. దేనికైనా రెడీ: కాకాణి
సాక్షి, నెల్లూరు జిల్లా: మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డిపై కూటమి సర్కార్ రాజకీయ కక్ష వేధింపులకు దిగింది. రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా ఆయనపై మరో అక్రమ కేసు నమోదైంది. కాకాణి సహా ఏడుగురిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తాటిపర్తిలో క్వార్జ్ అక్రమ రవాణా అభియోగాల నేపథ్యంలో కేసు నమోదైంది. కాకాణి లక్ష్యంగా కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది.అక్రమ కేసులపై కాకాణి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘ఇప్పటి వరకు ఆరు కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక కేసు పెట్టారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రోజు నుంచే నా గళం విప్పుతున్నా. కేసులకు భయపడే ప్రసక్తే లేదు’’ అంటూ ఆయన తేల్చి చెప్పారు. హామీలు అమలు చేయాలని కోరితే కేసు పెట్టారు. క్వార్జ్కి సంబంధించి మరో కేసు పెట్టారు. ఏదో ఒక విధంగా నాపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. దేనికైనా సిద్ధంగా ఉన్నాను. నేనేమి తప్పు చేయలేదు’’ అని కాకాణి పేర్కొన్నారు.‘‘ఉడత బెదిరింపులకు భయపడను. ప్రభుత్వ అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తూనే ఉంటాను. సిట్, విజిలెన్స్ విచారణలకు భయపడను. ఈ కేసుపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. కొన్ని కేసుల్లో క్వాష్ పిటిషన్ వేశాను. ఈ కేసు మీద కూడా వేస్తాను’’ అని కాకాణి తెలిపారు.

SLBC టన్నెల్లో మరో మృతదేహం వెలికితీత
సాక్షి, నాగర్‌కర్నూల్/మహబూబ్‌నగర్: ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగిన ప్రమాదంలో చిక్కుకున్న వారిలో మరో మృతదేహాన్ని ఇవాళ వెలికితీశారు మృతుడిది ఉత్తర ప్రదేశ్ ఉన్నావ్ జిల్లాకు చెందిన మనోజ్ కుమార్‌గా గుర్తించారు ఇతను జేపీ కంపెనీలో ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నాగర్ కర్నూల్ జనరల్ ఆసుపత్రికి తరలించారు అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించి వారి స్వగ్రామానికి తరలించనున్నట్లు కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు మిగిలిన వారి ఆచూకీ కోసం సహాయక చర్యలు కొనసాగుతాయని వెల్లడించారు.లోకో ట్రాక్ సమీపంలో మృతదేహాన్ని గుర్తించా. లోకో ట్రైన్ శిథిలాల కింద డెడ్‌బాడీని గుర్తించిన రెస్క్యూ బృందాలు.. తవ్వకాలు చేపట్టాయి. ఘటన స్థలం నుంచి మృతదేహాన్ని లోకో ట్రైన్ ద్వారా బయటకి తీసుకువచ్చారు. శిథిలాలను గ్యాస్ కట్టర్‌తో తొలగిస్తున్నారు. ఎస్ఎల్బీసీ సొరంగం పైకప్పు కూలిపోయి నెల రోజులకు పైగా గడిచినా, ప్రమాదంలో మరణించిన ఎనిమిది మంది కార్మికులలో ఇద్దరిని వెలికితీశారు.ఇక ఆరుగురి మృతదేహాలను వెలికితీయడానికి సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఫిబ్రవరి 22న ఈ ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. 8 మంది లోపల చిక్కుకుపోగా, ఇప్పటివరకు రెండు మృతదేహాన్ని మాత్రమే వెలికి తీశారు.కాగా, నిన్న(సోమవారం) అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం ఎస్ఎల్బీసీ ప్రమాదం, సహాయక చర్యల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. సమీక్షలో ప్రభుత్వం సొరంగంలో సహాయక చర్యలు నిలిపివేస్తారన్న అందరి అంచనాలు తారుమారయ్యాయి. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించలేమని సహాయక బృందాలు చేతులెత్తేసిన నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయంతో మరికొన్ని రోజులపాటు ఆపరేషన్‌లో పాల్గొననున్నారు. 30 మీటర్ల వద్ద అత్యంత ప్రమాదకరమైన ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగిస్తే సహాయక సిబ్బంది ప్రాణాలకు సైతం ముప్పు వాటిల్లనుందని నిపుణులు హెచ్చరించారు.సొరంగం కుప్పకూలిన డీ–1, డీ–2 ప్రదేశాల్లో సహాయక సిబ్బంది సోమవారం 31వ రోజు సహాయక చర్యలు చేపట్టారు. సొరంగంలో కూలిన రాళ్లు, టీబీఎం విడి భాగాలను ప్లాస్మా కట్టర్‌తో కట్ చేసి బయటకి తెస్తున్నారు. మట్టి, రాళ్ల దిబ్బలు, బురద పూడిక, ఉబికి వస్తున్న నీటిని వాటర్ జెట్ల ద్వారా బయటికి పంపిస్తున్నారు. సంక్లిష్ట పరిస్థితుల్లో ఎస్ఎల్బీసీ ఇన్లెట్ నుంచి ప్రమాదం జరిగిన 14 కిలోమీటరు వద్ద గాలి, వెలుతురు తక్కువగా ఉండటంతో సహాయక చర్యలు చేపట్టడం సంక్లిష్టంగా మారింది. ఈ క్రమంలో విద్యుత్, వెంటిలేషన్ పనులను పునరుద్ధరిస్తున్నారు.ప్రమాదం జరిగిన ప్రాంతంలో 30 మీటర్లు అత్యంత ప్రమాద జోన్‌గా అధికారులు గుర్తించారు. నేషనల్ జియో లాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఎన్డీఆర్ఐ నిపుణుల నివేదిక ప్రకారం రెస్క్యూ ఆపరేషన్ కొనసా గించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఎక్స్‌ఫర్ట్ కమిటీని కూడా నియమించి వారి సూచనలు, సలహాల మేరకు పనులు కొనసాగించనున్నారు. కేరళ నుంచి వచ్చిన కాడవర్స్ డాగ్స్ గుర్తించిన డీ–1, డీ–2 ప్రదేశాల్లో చేపడుతున్న సహాయక చర్యలకు టీబీఎం భాగాలు అడుగడుగునా అడ్డు వస్తున్నాయి. అదేవిధంగా సొరంగం తవ్వకాలకు మినీ హిటాచీ, కన్వేయర్ బెల్టు, డీవాటరింగ్ పైపులు కూడా అడ్డు పడుతున్నాయి. సింగరేణి, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, దక్షిణమధ్య రైల్వే, హైడ్రా, ర్యాట్ హోల్స్ మైనర్స్, ఆర్మీ బృందాలు నిర్విరామంగా శ్రమిస్తున్నా ఫలితం లేకుండా పోతోంది.

‘ఇక్కడి నుంచి త్వరగా పారిపో అని విరాట్ సర్ చెప్పారు’
సెలబ్రిటీలను ఆరాధ్య దైవంగా భావించే యువత మన దేశంలో చాలా మందే ఉన్నారు. క్రికెటర్లు, సినీ నటులను చూసేందుకు ఎంతకైనా తెగించేందుకు సిద్ధపడతారు. ఈ క్రమంలో.... ఒక్కోసారి తొందరపాటు చర్యలు, అత్యుత్సాహం కారణంగా జైలు పాలుకావాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. పద్దెమినిదేళ్ల రితూపర్నో పఖిరా కూడా ఈ కోవకే చెందుతాడు.భారత్‌లో క్రికెట్ కూడా ఓ మతం లాంటిది. సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar), విరాట్ కోహ్లి, మహేంద్ర సింగ్ ధోని, రోహిత్ శర్మ (Rohit Sharma).. ఇలా టీమిండియా దిగ్గజాలను దేవుళ్లలా భావించే ఫ్యాన్స్ కోకొల్లలు. వారిలో ఒకడే రితూపర్నో. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)- 2025 ఆరంభ మ్యాచ్ సందర్భంగా తన అభిమాన ఆటగాడు విరాట్ కోహ్లిని చూసేందుకు ఈడెన్ గార్డెన్స్‌లోకి దూసుకువచ్చాడు.ఒకరోజు జైలులోఈ రన్‌మెషీన్ పాదాలకు నమస్కరించి.. అతడిని ఆలింగనం చేసుకుని జన్మధన్యమైనట్లు తరించాడు. ఈ హఠాత్పరిణామంతో కంగుతిన్న భద్రతా సిబ్బంది పరుగుపరుగున వచ్చి రితూపర్నోను మైదానం నుంచి తీసుకుని వెళ్లి పోలీసులకు అప్పగించారు. పోలీసులు అతడిని అరెస్టు చేసి ఒకరోజు జైలులో ఉంచినట్లు సమాచారం. అనంతరం.. మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా.. ఓ షరతు మీద రితూపర్నోకు బెయిల్ మంజూరు చేశారు. ఈ ఐపీఎల్ సీజన్ మొత్తం ఈడెన్ గార్డెన్స్ వైపు వెళ్లకుండా ఉండాలని మెజిస్ట్రేట్ రితూపర్నోకు కండిషన్ విధించారు. PC: BCCI/IPLపశ్చాత్తాపం లేదుఅయితే, అతడి వైఖరిలో మాత్రం ఎటువంటి మార్పూ రాలేదు. బెయిలు మీద బయటకు వచ్చిన తర్వాత టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘విరాట్ కోహ్లి పాదాలను తాకగానే ఆయన నా భుజాలు పట్టుకుని పైకి లేపారు. నా పేరేమిటని అడిగారు.ఇక్కడి నుంచి త్వరగా పారిపో అని చెప్పారు. అంతేకాదు.. నా పట్ల కాస్త సౌమ్యంగా వ్యవహరించాలని భద్రతా సిబ్బందికి చెప్పారు కూడా. నన్ను కొట్టవద్దని వారికి పదే పదే చెప్పారు. ఎలాగైనా ఆరోజు మైదానంలోకి వెళ్లాలని నేను ముందుగానే ప్రణాళికలు రచించుకున్నా.ఈ విషయంలో నాకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు. నా దేవుడి పాదాలు తాకే అవకాశం వచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉన్నా’’ అని రితూపర్నో చెప్పడాన్ని బట్టి అతడి మానసిక పరిపక్వత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.పెద్ద మనసుతో క్షమించండిఅయితే, రితూపర్నో తల్లి మాత్రం తన కుమారుడు తెలియక చేసిన తప్పును క్షమించాలని న్యాయ వ్యవస్థను వేడుకుంటున్నారు. ‘‘విరాట్ కోహ్లిని ఆరాధిస్తాడు. వాడికి ఆయన దేవుడితో సమానం. అందుకే ఇలాంటి పని చేశాడు.వాడి వయసు, కెరీర్‌ను దృష్టిలో పెట్టుకుని పోలీసులు, న్యాయమూర్తి నా కుమారుడి తప్పులను పెద్ద మనసుతో క్షమించాలి’’ అని విజ్ఞప్తి చేశారు. కాగా రితూపర్నో 12వ ఏట నుంచి జమాల్‌పూర్‌లో ఉన్న నేతాజీ అథ్లెటిక్స్ క్లబ్లో క్రికెట్ కోచింగ్ తీసుకుంటున్నాడు. కాగా రితూపర్నో మైదానంలోకి దూసుకువచ్చి.. కోహ్లి కాళ్లు మొక్కడంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పందించిన తీరు విమర్శలకు దారి తీసిన విషయం తెలిసిందే.శుక్లా తీరుపై విమర్శలు‘‘కోహ్లి క్రేజ్ ఇలా ఉంటుంది’’ అని రాజీవ్ శుక్లా ట్వీట్ చేయగా.. ‘‘భద్రతా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారా? ఒకవేళ ఆ వ్యక్తి సాధారణ పౌరుడు కాకుండా.. ఓ ఆటంకావాదో అయి ఉంటే కోహ్లి పరిస్థితి ఏమిటి? ఆటగాళ్లకు సరైన భద్రత కల్పించండి. అలాగే ఇలాంటి యువత తమ భవిష్యత్తు నాశనం చేసుకునేందుకు ఆస్కారం ఇవ్వకండి’’ అని నెటిజన్లు చురకలు అంటించారు.కాగా ఐపీఎల్-2025 కోల్‌కతాలోని ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్‌లో అంగరంగ వైభవంగా శనివారం మొదలైంది. డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన ఆరంభ మ్యాచ్‌లో కోహ్లి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 36 బంతుల్లోనే 59 పరుగులతో అజేయంగా నిలిచి బెంగళూరును గెలిపించాడు.ఐపీఎల్-2025: కోల్‌కతా వర్సెస్ ఆర్సీబీ స్కోర్లు👉కోల్‌కతా- 174/8 (20)👉ఆర్సీబీ- 177/3 (16.2)👉ఫలితం- ఏడు వికెట్ల తేడాతో కోల్‌కతాపై ఆర్సీబీ గెలుపుచదవండి: విఘ్నేశ్ పుతూర్‌ను ‘సన్మానించిన’ నీతా అంబానీ.. పాదాలకు నమస్కరించిన స్పిన్నర్

'రాబిన్‌హుడ్' టికెట్ ధరలు పెంపునకు ప్రభుత్వం అనుమతి
టాలీవుడ్ హీరో నితిన్(Nithiin), శ్రీలీల( Sreeleela) జోడీగా నటించిన చిత్రం 'రాబిన్‌హుడ్'(Robinhood).. ఉగాది కానుకగా మార్చి 28న ఈ చిత్రం విడుదల కానుంది. అయితే, ఎవరూ ఊహించని విధంగా ఈ మూవీ టికెట్ల ధరలను పంచుతూ ఏపీ ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. సుమారు రూ. 50 కోట్ల బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మించారు. డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. గతంలో భీష్మ సినిమాతో నితిన్ - వెంకీ కాంబినేషన్ సూపర్ హిట్ అయింది. ఇప్పుడు రాబిన్‌హుడ్ కూడా భారీగా క్లిక్ అవుతుందని ఇండస్ట్రీలో అంచనాలు ఉన్నాయి.రాబిన్‌హుడ్ చిత్ర మేకర్స్‌కు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మార్చి 28 నుంచి ఏడు రోజుల పాటు టికెట్ల రేట్లు పెంచుకోవచ్చని ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. సింగిల్ స్క్రీన్‌లో ఒక్కో టికెట్‌పై రూ.50 , మల్టీప్లెక్స్ లలో టికెట్‌కు రూ.75 ధరను అదనంగా పెంచుకునేందుకు అనుమతిని ఇచ్చింది. జీఎస్టీతో కలిపే ఈ ధరలు ఉంటాయని అందులో పేర్కొంది. అయితే, తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి రాలేదు.రేట్లు పెంపు సరే.. తేడా వస్తే..భారీ బడ్జెట్ చిత్రాలకు మాత్రమే గతంలో టికెట్ల రేట్లు పెంపునకు ప్రభుత్వాలు అనుమతి ఇచ్చేవి. అయితే, ఇప్పుడు మీడియమ్ బడ్జెట్ చిత్రాలకు కూడా ఇలా రేట్లు పెంచడం ఏంటి అంటూ విమర్శలు వస్తున్నాయి. సంక్రాంతి సమయంలో గేమ్ ఛేంజర్, డాకూమహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం వంటి చిత్రాలకు టికెట్ ధరలు పెంచారు. అయితే, ప్రేక్షకులు థియేటర్స్‌కు వెళ్లడం బాగా తగ్గిపోయింది. దీంతో వెంటనే ఆ ధరలను మళ్లీ తగ్గించేశారు. ఇప్పుడు రాబిన్‌హుడ్ చిత్రానికి టికెట్ ధరలను పెంచాలనే నిర్ణయం సరైంది కాదని విమర్శలు ఉన్నాయి. సినిమా బాగుందని టాక్ వస్తే సరే.., ఒకవేళ మిక్స్డ్ టాక్ వస్తే మాత్రం రిస్క్ తప్పదని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. ధరల పెంపు వల్ల థియేటర్లకు వెళ్లే వారి సంఖ్య తగ్గే ఛాన్స్ ఉంది. రిపీటెడ్ ఆడియన్స్ కూడా ఉండకపోవచ్చని చెప్పవచ్చు.

గురు శిష్యుల కాకమ్మ కథలు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని విషయాలలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునే ఫాలో అవుతున్నట్లు అనిపిస్తుంది. సాధారణంగా రేవంత్‌ను చంద్రబాబు శిష్యుడుగానే చాలామంది భావిస్తుంటారు. దానిని రేవంత్ ఒప్పుకున్నా, లేకున్నా జనాభిప్రాయం అలాగే ఉంది. పలు విషయాలలో రేవంత్ చేస్తున్న వ్యాఖ్యలు, అనుసరిస్తున్న విధానాలు చంద్రబాబు తరహాలోనే కనిపిస్తుంటాయి. మార్గదర్శి అక్రమ డిపాజిట్లకు సంబంధించి హైకోర్టులో వీరిద్దరి ప్రభుత్వాలు దాదాపు ఒకే తరహాలో రామోజీ సంస్థకు అనుకూలంగా అఫిడవిట్లు వేసిన సంగతి తెలిసిందే. అందులోనే కాదు అనేక అంశాలలో ఇదే ధోరణి కనిపిస్తుంది. గత ప్రభుత్వాన్ని విమర్శించడంలో ఇద్దరిది ఒకటే తీరు. అప్పుల విషయంలో రేవంత్ గత కెసిఆర్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.👉అలాగే చంద్రబాబు గత జగన్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తుంటారు. ఇది ఒకరకంగా చూస్తే ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుగా అన్నమాట. రేవంత్ అధికారంలోకి వచ్చి అప్పుడే పదిహేను నెలలు గడిచిపోయింది. అయినా ఇంకా పట్టు రాలేదని ఆయనే చెబుతున్నారు. దానికి కూడా కేసీఆర్ కారణం అన్నట్లుగా మాట్లాడడం విడ్డూరమే అనిపిస్తుంది. అవినీతితో దోచుకుంటే పట్టు వచ్చినట్లవుతుందా అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. రేవంత్ కొద్ది రోజుల క్రితం ఒక విషయం చెప్పారు. అది ఆయన నిజాయితీతో చెప్పారా?లేక కేసీఆర్ ప్రభుత్వంపై బండ వేయడానికి చెప్పారా? అన్నది తేల్చజాలం కాని, వినడానికి మాత్రం సంచలనంగానే ఉంది. 👉తెలంగాణ ప్రభుత్వానికి ఎక్కడా అప్పు పుట్టడం లేదని అన్నారు. తెలంగాణ పేరు గొప్పగాని, అప్పుపుట్టకుంది అని ఆయన అన్నారని మీడియాలో కథనాలు వచ్చాయి. డబ్బు తనవద్ద ఉంటే గంటలో రుణమాఫీ చేసేవాడినని, 25 లక్షల ఇళ్లు నిర్మించేవాడినని, ఎన్నో అద్భుతాలు చేసేవాడినని రేవంత్ అన్నారు. ఏపీలో సైతం ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కొంత ఇదే తరహాలో మాట్లాడడం గమనార్హం. తాను ఇచ్చిన హామీల ప్రకారం సూపర్ సిక్స్ సంక్షేమ స్కీములు అమలు చేయాలని ఉందని, కాని నిధులు లేవని, గల్లా పెట్టే చూస్తే ఖాళీగా కనబడుతా ఉందని చంద్రబాబు సభలలో అంటున్నారు.👉తల్లికి వందనం స్కీము కింద ప్రతి విద్యార్ధికి పదిహేనువేల రూపాయలు ఇచ్చే స్కీమును ప్రస్తావిస్తూ అప్పులు దొరకడం లేదని అన్నారు. చంద్రబాబు, రేవంత్‌లు ఒకవైపు రాష్ట్రాలను గత ప్రభుత్వాలు అప్పుల పాలు చేశాయని చెబుతూ, మరో వైపు అప్పటికన్నా అప్పులు అధికంగా తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఎవరూ మనల్ని నమ్మడం లేదని రేవంత్ చెప్పడం సంచలనమే. గతంలో ఏ ముఖ్యమంత్రి ఈ తరహాలో మాట్లాడలేదు. కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎలా నమ్మి ఆర్థిక సంస్థలు అప్పులు ఇచ్చాయని ఎవరైనా అడిగితే రేవంత్ ఏమని సమాధానం ఇస్తారో తెలియదు.👉కాళేశ్వరానికి అధిక వడ్డీకి రుణాలు తెచ్చారని, ఆ వడ్డీరేటును తగ్గించడానికి యత్నిస్తున్నానని అన్నారు. మంచిదే. కాని అన్నిటికి ఒకే మంత్రం జపించినట్లు కేసీఆర్ వల్లే తాను ఏమి చేయలేకపోతున్నట్లుగా చెప్పడం వల్ల ప్రయోజనం ఏమిటి?నిజానికి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అప్పులపై రేవంత్ చాలా విమర్శలు చేశారు కదా! దాదాపు ఏడు లక్షల కోట్ల అప్పులు చేసినట్లు కెసిఆర్ పై ఆరోపణలు చేశారు కదా?. కాని కాంగ్రెస్ బడ్జెట్లో అలా ఎందుకు చూపించలేకపోయారు. ఏపీలో కూడా ఇదే తంతు. మరీ ఘోరంగా జగన్ ప్రభుత్వం 14 లక్షల కోట్ల అప్పులు చేసిందని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌లు పచ్చి అబద్దాలు ప్రచారం చేశారు. తీరా చూస్తే ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పిన వివరాల ప్రకారమే గత ఏడాది ప్రభుత్వం మారేనాటికి అన్ని రకాల అప్పులు కలిసి ఏడు లక్షల కోట్లే ఉన్నాయి. ఇందులో చంద్రబాబు 2014 టరమ్ లో చేసిన అప్పులు, రాష్ట్రం విభజన నాటి అప్పులు కలిసి సుమారు మూడు లక్షలకోట్ల వరకు ఉన్నాయి.👉అంతేకాక రికార్డు స్థాయిలో ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఏపీ ప్రభుత్వం సుమారు లక్ష ముప్పైవేల కోట్ల అప్పులు చేసింది. ఇవి చాలవన్నట్లుగా కేశవ్‌ను ఢిల్లీ పంపించి మరో 68 వేల కోట్ల అప్పుకోసం యత్నిస్తున్నారని ఎల్లో మీడియానే వార్తలు ఇచ్చింది. రేవంత్ ఒక మాట అన్నారు. ఎన్నిరోజులు దాచిపెట్టుకోను.. ఉన్నది ఉన్నట్లు చెబుతున్నా.. కాన్సర్ ఉంటే సిక్స్‌ఫ్యాక్ బాడీ అని చెప్పుకుంటే నమ్ముతారా అని ఆయన అన్నారు. ఇవి కొంచెం సీరియస్ వ్యాఖ్యలే. ఇలాంటి కామెంట్ల వల్ల తెలంగాణ ప్రభుత్వ పరపతి దెబ్బతింటుందని కొందరి అభిప్రాయం. అయితే వాస్తవ దృక్పధంతో రేవంత్ ఈ మాటలు చెప్పి ఉండవచ్చు. ఇక్కడ ఒకదానికి బేసిక్‌గా సమాధానం చెప్పవలసి ఉంటుంది.👉కాళేశ్వరం ప్రాజెక్టు అప్పులపై కాని, ఇతరత్రా రుణాలపై కాని 2023 ఎన్నికల కంటే ముందుగానే రేవంత్ కాని, కాంగ్రెస్ నేతలు కాని తీవ్ర విమర్శలు చేశారు కదా?. రాష్ట్రం అప్పులకుప్ప అయిపోయిందని అన్నారు కదా!. అయినా ఆరు గ్యారంటీలు అంటూ ఎందుకు భారీ హామీలు గుప్పించారు? అన్నదానికి ఎన్నడైనా జవాబిచ్చారా? ఈ విషయంలో చంద్రబాబు మాదిరే రేవంత్ కూడా వ్యవహరిస్తున్నారన్న భావన కలగదా! ఏపీ ఆర్థిక మంత్రి కేశవ్ తన బడ్జెట్ ప్రసంగంలో జగన్ ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం చేసిందని అంటే, తెలంగాణ ఆర్థిక మంత్రి మల్లు భట్టి కూడా విధ్వంస తెలంగాణ నుంచి వికసిత తెలంగాణవైపు నడిపిస్తున్నామని చెప్పారు. అప్పు కూడా పుట్టడం లేదని ముఖ్యమంత్రి చెప్పడం తెలంగాణ వికసించడం ఎలా అవుతుంది?👉అంచనా వేసిన దానికన్నా 70 వేల కోట్ల ఆదాయం ఎలా తగ్గింది? ఏపీని రెండో ప్రపంచ యుద్ధంలో అణు బాంబులు పడిన హిరోషిమాతో కేశవ్ పోల్చితే, తెలంగాణ ఆర్థిక పరిస్థితిని కాన్సర్‌తో రేవంత్ పోల్చుతున్నారు. ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడానికి కూడా డబ్బులు లేవని, గత ప్రభుత్వం ఎనిమిదివేల కోట్ల బకాయిపెట్టి వెళ్లిందని రేవంత్ చెప్పారు. ప్రభుత్వం అన్నది ఒక నిరంతర ప్రక్రియ. గత ప్రభుత్వంపై వ్యతిరేకతతోనో, లేక కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలకు ఆకర్షితులయ్యో ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారు కదా! ఎన్నికల సమయంలో ఎన్నడైనా చంద్రబాబుకాని, రేవంత్ కాని ఆర్థిక పరిస్థితిని పరిశీలించిన తర్వాత హామీలు అమలు చేస్తామని అన్నారా?లేదే!👉రేవంత్ ఏమో తాము అధికారంలోకి రాగానే రైతు బంధు డబ్బులు మరో ఐదువేలు కలిపి ఇస్తామని, రెండు లక్షల రూపాయల రుణ మాఫీ ఒకేసారి చేసి చూపిస్తామని ఎలా హామీ ఇచ్చారో చెబుతారా?. అది కూడా రాహుల్ గాంధీతో ప్రకటింపచేశారే?. చంద్రబాబేమో తాను అప్పులు చేయనక్కర్లేదని, సంపద సృష్టించి పేదలకు పంచుతానని ప్రచారం చేసి,ఇప్పుడేమో సంపద ఎలా సృష్టించాలో తెలియదని, అదెలాగో ప్రజలే చెవిలో చెప్పాలని ఒకసారి, జనానికి సంపద సృష్టి నేర్పుతానని మరోసారి అంటున్నారు. ఒక్కోసారి ఒక్కరకంగా చెబుతూ డబ్బులు లేవని కథలు చెబితే ప్రజలను పిచ్చోళ్లను చేసినట్లు కాదా?. ఇప్పుడు రేవంత్ ప్రయారిటీ ఫ్యూచర్ సిటీ అయితే, చంద్రబాబు ప్రాధాన్యత అమరావతి అన్నది అందరికి తెలిసిందే. అమరావతికి వేల కోట్ల అప్పులు తీసుకువస్తున్న చంద్రబాబు సంక్షేమానికి వ్యయం చేయలేనని చేతులెత్తేశారు.👉రేవంత్ ప్రభుత్వం కొంతలో కొంత బెటర్. ఇచ్చిన ఆరు గ్యారంటీలలో కొంతమేర అయినా అమలు చేసే యత్నం చేసింది.కాగా ఏటా అప్పులకే 66 వేల కోట్లు మిత్తి కింద కట్టవలసి వస్తోందని రేవంత్ అంటున్నారు. ఏది ఏమైనా రాజకీయ పార్టీలు ప్రజల ఓట్లను దండుకోవడానికి ఇష్టం వచ్చినట్లు హామీలు ఇవ్వడం, ఆ తర్వాత గత ప్రభుత్వాల మీద కాకమ్మ కబుర్లు చెబుతూ ప్రజల చెవిలో పూలు పెట్టాలని చూడడం శోచనీయం. ఇవన్ని గమనించిన తర్వాత చంద్రబాబు, రేవంత్‌లు గురు,శిష్యులే అనిపించదా!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత
'రాబిన్ హుడ్' టికెట్ రేట్ల పెంపు.. కొన్ని చోట్ల మాత్రమే
ఏడు నిమిషాల్లో బాడీ ఫిట్ : హిట్ హిట్ హుర్రే!
ప్రశాంత్‌రెడ్డి Vs కోమటిరెడ్డి.. అసెంబ్లీలో RRRపై రచ్చ
రూ.కోట్లు కోల్పోయిన వ్యాపారవేత్త.. ఏం జరిగిందంటే..
‘విడాకులు మాత్రమే కావాలి.. నేనేమీ బికారిని కాదు.. ఆ దెయ్యం డబ్బు నాకొద్దు’
కారు ప్రమాదంలో నటుడు సోనూసూద్ భార్య
Hyd: హిట్ అండ్ రన్ కేసు.. యువతికి తీవ్ర గాయాలు
'నాకు శ్రీలీల తప్పితే ఎవరూ నచ్చరు'.. వార్నర్ మామ తెలుగు ప్రాక్టీస్ చూశారా?
రైతు కంట కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదు: లేళ్ల అప్పిరెడ్డి
నూరేళ్ల గ్రంథాలయం
‘లిప్‌లాక్’ కి ముందు అతన్ని బ్రష్ చేసుకోమన్నా: నటి సురభి
టికెట్లివ్వగానే పని చేయడం మానేస్తున్నార్సార్!
అలా అయితే.. నేను జట్టులో ఉండటం వేస్ట్: ధోని
'6 నెలల సమయమివ్వండి.. అర్జున్ వరల్డ్‌లోనే బెస్ట్ బ్యాటర్ అవుతాడు'
64 ఏళ్ల ప్రేమ : ఇన్నాళ్లకు అంగరంగ వైభవంగా పెళ్లి
మన ఆస్కార్ అవార్డ్స్‌ను లాక్కున్నారు.. దీపికా పదుకొణె సంచలన వ్యాఖ్యలు
విఘ్నేశ్‌ను సత్కరించిన నీతా అంబానీ.. పాదాలకు నమస్కరించిన స్పిన్నర్
ఈ రాశి వారికి పలుకుబడి మరింత పెరుగుతుంది.. ధనలాభం
అదృష్టవశాత్తూ ఎమ్మెల్యేలు 4 ఏళ్లు ఆగలేదు: సుప్రీం కోర్టు
ఓటీటీలోకి 'మజాకా'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
'రాబిన్ హుడ్' టికెట్ రేట్ల పెంపు.. కొన్ని చోట్ల మాత్రమే
ఏడు నిమిషాల్లో బాడీ ఫిట్ : హిట్ హిట్ హుర్రే!
ప్రశాంత్‌రెడ్డి Vs కోమటిరెడ్డి.. అసెంబ్లీలో RRRపై రచ్చ
రూ.కోట్లు కోల్పోయిన వ్యాపారవేత్త.. ఏం జరిగిందంటే..
‘విడాకులు మాత్రమే కావాలి.. నేనేమీ బికారిని కాదు.. ఆ దెయ్యం డబ్బు నాకొద్దు’
కారు ప్రమాదంలో నటుడు సోనూసూద్ భార్య
Hyd: హిట్ అండ్ రన్ కేసు.. యువతికి తీవ్ర గాయాలు
'నాకు శ్రీలీల తప్పితే ఎవరూ నచ్చరు'.. వార్నర్ మామ తెలుగు ప్రాక్టీస్ చూశారా?
రైతు కంట కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదు: లేళ్ల అప్పిరెడ్డి
నూరేళ్ల గ్రంథాలయం
‘లిప్‌లాక్’ కి ముందు అతన్ని బ్రష్ చేసుకోమన్నా: నటి సురభి
టికెట్లివ్వగానే పని చేయడం మానేస్తున్నార్సార్!
అలా అయితే.. నేను జట్టులో ఉండటం వేస్ట్: ధోని
'6 నెలల సమయమివ్వండి.. అర్జున్ వరల్డ్‌లోనే బెస్ట్ బ్యాటర్ అవుతాడు'
64 ఏళ్ల ప్రేమ : ఇన్నాళ్లకు అంగరంగ వైభవంగా పెళ్లి
మన ఆస్కార్ అవార్డ్స్‌ను లాక్కున్నారు.. దీపికా పదుకొణె సంచలన వ్యాఖ్యలు
విఘ్నేశ్‌ను సత్కరించిన నీతా అంబానీ.. పాదాలకు నమస్కరించిన స్పిన్నర్
ఈ రాశి వారికి పలుకుబడి మరింత పెరుగుతుంది.. ధనలాభం
అదృష్టవశాత్తూ ఎమ్మెల్యేలు 4 ఏళ్లు ఆగలేదు: సుప్రీం కోర్టు
ఓటీటీలోకి 'మజాకా'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
సినిమా

స్టేజీపైనే స్టార్ సింగర్ కి అవమానం.. గో బ్యాక్ నినాదాలు
సెలబ్రిటీలకు ప్రశంసలతో పాటు విమర్శలు కూడా కామన్. అలా అని పొరపాటు చేస్తే అభిమానించే వాళ్లు కూడా తిడతారు. నోటికొచ్చింది మాట్లాడుతారు. ఇప్పుడు ఇలాంటి అనుభవమే ఇండియన్ స్టార్ సింగర్ కి ఎదురైంది. ఆస్ట్రేలియాలో ఈమెని ఏడిపించేశారు. ఇంతకీ ఏమైందంటే?(ఇదీ చదవండి: పవన్ కల్యాణ్ మార్షల్ ఆర్ట్స్ గురువు కన్నుమూత)హిందీ సాంగ్స్ పాడి గుర్తింపు తెచ్చుకున్న నేహా కక్కర్ (Neha Kakkar).. 'ఇండియన్ ఐడల్' షోకి జడ్జిగా ఇంకా ఫేమస్. జడ్జిమెంట్ ఇస్తూ అప్పుడప్పుడు కన్నీళ్లు పెడుతూ ఉంటుంది. ఇదంతా డ్రామా అని కొందరు ట్రోల్ చేస్తుంటారు. ఇక అసలు విషయానికొస్తే తాజాగా ఆస్ట్రేలియా మెల్ బోర్న్ లో ఈమె స్టేజీ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చింది.కాకపోతే సాయంత్రం ఏడున్నరకు ప్రోగ్రాంకి రావాల్సి ఉండగా.. దాదాపు మూడు గంటలు ఆలస్యంగా వచ్చి పాటలు పాడింది. అది కూడా గంట మాత్రమే ఫెర్ఫార్మెన్స్ ఇచ్చింది. దీంతో టికెట్ కొని షో చూసేందుకు వచ్చిన కొందరు ఈమెని 'గో బ్యాక్' (తిరిగి హోటల్ కి వెళ్లిపో) అని కామెంట్ చేశారు. దీంతో ఏం చేయాలో తెలీక స్టేజీపైనే కన్నీళ్లు పెట్టుకుంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'మజాకా'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)Neha Kakkar crying for being 3 hrs late at a Melbourne showShe also performed for less than 1 hour #NehaKakkar pic.twitter.com/TGyhaeCjpu— Redditbollywood (@redditbollywood) March 24, 2025

ఓటీటీలోకి 'మజాకా'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తెలుగులో మిగతా సినిమాల మాటేమో గానీ కామెడీ సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. సంక్రాంతికి అలా వచ్చిన ఓ కామెడీ మూవీ ఏకంగా రూ.300 కోట్ల వసూళ్లు సాధించింది. అదే 'సంక్రాంతికి వస్తున్నాం'. ఇది వచ్చిన కొన్నిరోజులకు థియేటర్లలోకి వచ్చిన మరో హాస్యభరిత చిత్రం 'మజాకా' (Mazaka Movie). ఇప్పుడు దీని ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయింది.రావు రమేశ్, సందీప్ కిషన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి నక్కిన త్రినాథరావు దర్శకుడు. తండ్రి కొడుకుల ఒకేసారి ప్రేమలో పడటం అనే కాన్సెప్ట్ తో తీసిన ఈ చిత్రంలో రీతూ చౌదరి, అన్షు (Anshu) హీరోయిన్లుగా నటించారు. (ఇదీ చదవండి: పవన్ కల్యాణ్ మార్షల్ ఆర్ట్స్ గురువు కన్నుమూత)శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 26న థియేటర్లలోకి వచ్చిన మజాకా చిత్రానికి అనుకున్నంత రెస్పాన్స్ రాలేదు. కంటెంట్ లో చిన్నచిన్న లోపాలే దీనికి కారణం. ఇకపోతే ఇప్పుడు ఈ చిత్రం ఉగాది కానుకగా మార్చి 28 నుంచి జీ5లో (Zee 5 Ott) స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అధికారిక పోస్టర్ రిలీజ్ చేశారు.'మజాకా' విషయానికొస్తే.. రమణ (రావు రమేశ్), కృష్ణ (సందీప్ కిషన్) తండ్రి కొడుకులు. చిన్నప్పుడే భార్య చనిపోవడటంతో మరో పెళ్లి చేసుకోకుండా కొడుకుని రమణ పెంచుతాడు. కానీ కృష్ణకి పెళ్లి చేయాలనేసరికి ఇంట్లో ఆడదిక్కు లేదని ఎవరూ పిల్లనివ్వరు. దీంతో రమణ.. యశోద (అన్షు)తో, కృష్ణ.. మీరా(రీతూవర్మ)తో ప్రేమలో పడతారు. తర్వాత ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: నన్ను దెబ్బ కొట్టేందుకు వాళ్లు కోట్లు ఖర్చు పెట్టారు: పూజా హెగ్డే)

ఇద్దరు లెజండరీ పర్సన్స్ క్రియేట్ చేసిన సాంగ్.. చూశారా
'లేడీస్ టైలర్' సినిమాతో మెప్పించిన రాజేంద్రప్రసాద్, అర్చన సుమారు 38 ఏళ్ల తర్వాత మరోసారి వారిద్దరూ కలిసి నటించిన చిత్రం 'షష్టి పూర్తి'.. తాజాగా ఈ మూవీ నుంచి ఒక మెలోడీ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇప్పటికే ఎన్నో పాటలకు మ్యూజిక్ అందించడమే కాకుండా రచయితగా కూడా కీరవాణి గుర్తింపు తెచ్చకున్నారు. అయితే, ఈ సినిమాతో తొలిసారి ఇళయరాజా సంగీతంలో ఆయన ఈ సాంగ్‌ను రచించడం విశేషం. ‘షష్టిపూర్తి’ సినిమాలో రూపేష్, ఆకాంక్షా సింగ్ జంటగా.. రాజేంద్ర ప్రసాద్, అర్చన మరో జోడీగా నటించారు. ఈ మూవీని పవన్ ప్రభ దర్శకత్వంలో రూపేష్ చౌదరి నిర్మించారు. ‘లేడీస్ టైలర్’ తర్వాత ఈ చిత్రంలో వారిద్దరూ మరోసారి నటిస్తుండటంతో సినిమాపై ఆసక్తికలిగించేలా ఉంది. తాజాగా విడుదలైన సాంగ్ రూపేష్, ఆకాంక్షా సింగ్ మధ్యే ఉంటుంది. మంచి లవ్ ట్రాక్‌తో పాటు చక్కటి మెలోడీనిచ్చేలా పాట ఉంది.

'రాబిన్‌హుడ్' టికెట్ ధరలు పెంపునకు ప్రభుత్వం అనుమతి
టాలీవుడ్ హీరో నితిన్(Nithiin), శ్రీలీల( Sreeleela) జోడీగా నటించిన చిత్రం 'రాబిన్‌హుడ్'(Robinhood).. ఉగాది కానుకగా మార్చి 28న ఈ చిత్రం విడుదల కానుంది. అయితే, ఎవరూ ఊహించని విధంగా ఈ మూవీ టికెట్ల ధరలను పంచుతూ ఏపీ ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. సుమారు రూ. 50 కోట్ల బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మించారు. డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. గతంలో భీష్మ సినిమాతో నితిన్ - వెంకీ కాంబినేషన్ సూపర్ హిట్ అయింది. ఇప్పుడు రాబిన్‌హుడ్ కూడా భారీగా క్లిక్ అవుతుందని ఇండస్ట్రీలో అంచనాలు ఉన్నాయి.రాబిన్‌హుడ్ చిత్ర మేకర్స్‌కు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మార్చి 28 నుంచి ఏడు రోజుల పాటు టికెట్ల రేట్లు పెంచుకోవచ్చని ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. సింగిల్ స్క్రీన్‌లో ఒక్కో టికెట్‌పై రూ.50 , మల్టీప్లెక్స్ లలో టికెట్‌కు రూ.75 ధరను అదనంగా పెంచుకునేందుకు అనుమతిని ఇచ్చింది. జీఎస్టీతో కలిపే ఈ ధరలు ఉంటాయని అందులో పేర్కొంది. అయితే, తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి రాలేదు.రేట్లు పెంపు సరే.. తేడా వస్తే..భారీ బడ్జెట్ చిత్రాలకు మాత్రమే గతంలో టికెట్ల రేట్లు పెంపునకు ప్రభుత్వాలు అనుమతి ఇచ్చేవి. అయితే, ఇప్పుడు మీడియమ్ బడ్జెట్ చిత్రాలకు కూడా ఇలా రేట్లు పెంచడం ఏంటి అంటూ విమర్శలు వస్తున్నాయి. సంక్రాంతి సమయంలో గేమ్ ఛేంజర్, డాకూమహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం వంటి చిత్రాలకు టికెట్ ధరలు పెంచారు. అయితే, ప్రేక్షకులు థియేటర్స్‌కు వెళ్లడం బాగా తగ్గిపోయింది. దీంతో వెంటనే ఆ ధరలను మళ్లీ తగ్గించేశారు. ఇప్పుడు రాబిన్‌హుడ్ చిత్రానికి టికెట్ ధరలను పెంచాలనే నిర్ణయం సరైంది కాదని విమర్శలు ఉన్నాయి. సినిమా బాగుందని టాక్ వస్తే సరే.., ఒకవేళ మిక్స్డ్ టాక్ వస్తే మాత్రం రిస్క్ తప్పదని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. ధరల పెంపు వల్ల థియేటర్లకు వెళ్లే వారి సంఖ్య తగ్గే ఛాన్స్ ఉంది. రిపీటెడ్ ఆడియన్స్ కూడా ఉండకపోవచ్చని చెప్పవచ్చు.
న్యూస్ పాడ్‌కాస్ట్
క్రీడలు

IPL 2025: పంత్‌కు లక్నో ఓనర్ క్లాస్..? రాహుల్ ఉదంతాన్ని గుర్తు చేసిన సీన్
ఐపీఎల్ 2025లో భాగంగా నిన్న (మార్చి 24) జరిగిన రసవత్తర మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో లక్నో సూపర్ జెయింట్స్ షాకింగ్ ఓటమికి గురైంది. ఈ మ్యాచ్‌లో లక్నో గెలుపుకు సువర్ణావకాశాలు లభించినా ఒడిసి పట్టుకోలేకపోయింది. తొలుత బ్యాటింగ్ చేస్తూ అతి భారీ స్కోర్ చేసే అవకాశం (14 ఓవర్లలోనే 161 పరుగులు) వచ్చినా 209 పరుగులకే పరిమితమైంది. అనంతరం ఛేదనలో 113 పరుగులకే 6 వికెట్లు తీసినా మ్యాచ్‌ను కాపాడుకోలేకపోయింది. ఆశుతోష్ శర్మ (31 బంతుల్లో 66 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), విప్రాజ్ నిగమ్ (15 బంతుల్లో 39; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి ఢిల్లీని గెలిపించారు.ఈ మ్యాచ్‌లో లక్నో ఓటమికి కెప్టెన్ పంత్ ప్రధాన కారకుడయ్యాడు. తొలుత బ్యాటింగ్‌లో 6 బంతులాడి డకౌట్ అయిన పంత్.. ఆతర్వాత ఛేదనలో అత్యంత కీలక సమయంలో స్టంపింగ్ మిస్ చేసి ఢిల్లీకి మ్యాచ్‌ను వదిలేశాడు. 9 వికెట్లు కోల్పోయిన ఢిల్లీకి చివరి ఓవర్లో గెలుపుకు 6 పరుగులు అవసరం కాగా.. తొలి బంతికి పంత్ మొహిత్ శర్మను స్టంపౌట్ చేసే సువర్ణావకాశాన్ని జారవిడిచాడు. ఆతర్వాతి బంతికి సింగిల్ తీసిన మోహిత్ అశుతోష్‌కు స్ట్రయిక్ ఇచ్చాడు. అప్పటికే జోష్‌లో ఉండిన అశుతోష్ మూడో బంతిని సిక్సర్‌గా మలిచి ఢిల్లీకి అపురూప విజయాన్నందించాడు.Bro ! Pant you lost the match here ! Misses the match stumping ! #LSGvsDC #IPL2025 #RishabhPant #starc #NupurSharma #kunalkamra #HarbhajanSingh #NicholasPooran #asutosh pic.twitter.com/BjzoJN0mQM— fart cat 🐱 smokimg🚬 (@gajendra87pal) March 24, 2025మ్యాచ్ అనంతరం లక్నో ఓనర్ సంజీవ్ గొయెంకా కెప్టెన్ పంత్ ప్రదర్శన పట్ల అసంతృప్తిగా ఉన్నట్లు కనిపించాడు. గొయెంకా-పంత్ వాడి వేడిగా చర్చిస్తున్నట్లు కనిపించే దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి. వారి మధ్య సంభాషణ గతేడాది కేఎల్ రాహుల్ ఉదంతాన్ని గుర్తు చేసింది. గత సీజన్లో ఎస్ఆర్హెచ్ చేతిలో ఓటమి అనంతరం గొయెంకా నాటి కెప్టెన్ రాహుల్‌ను దుర్భాషలాడినట్లు ప్రచారం జరిగింది. తాజా ఓటమి తర్వాత గొయెంకా పంత్‌పై కూడా అదే రేంజ్లో ఫైరయ్యాడని టాక్ నడుస్తుంది. ఈ ఘటన కారణంగానే రాహుల్ లక్నోను వీడాడన్నది కాదనలేని సత్యం. ఈ విషయంపై రాహుల్ ఎక్కడా నోరు విప్పకపోయినా ఆ సీన్ చూసిన జనాలకు విషయం ఇట్టే అర్దమవుతుంది. Once a toxic Manager always a toxic Manager #DCvLSGRishabh Pant #KLRahul Sanjiv Goenka pic.twitter.com/MmFZ4MlCRq— Ex Bhakt (@exbhakt_) March 24, 2025రాహుల్‌ను కాదనుకునే పంత్‌ను తెచ్చిపెట్టుకున్న గొయెంకా ఇప్పుడు అతనితోనూ అలాగే ప్రవర్తిస్తున్నట్లున్నాడు. ఇదే రిపీటైతే పంత్ కూడా వచ్చే సీజన్లో లక్నోకు టాటా చెప్పడం ఖాయం. కాగా, పంత్‌ను గొయెంకా ఈ సీజన్ మెగా వేలంలో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర (రూ. 27 కోట్లు) వెచ్చించి సొంతం చేసుకున్నాడు. పంత్ గత సీజన్ వరకు ఢిల్లీకి ఆడాడు. ఢిల్లీతో ఉన్న అనుబంధం ఇంకా తగ్గలేదో ఏమో మరి, ఈ మ్యాచ్‌లో పంత్ తన స్థాయి మేరకు రాణించలేకపోయాడు. ఇదే కొనసాగితే పంత్ మహా కోపిష్టి అయిన గొయెంకా చేతిలో మున్ముందైనా అవమానాలకు గురి కావల్సి ఉంటుంది. ఢిల్లీ తమ తదుపరి మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ను వైజాగ్‌లో ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్ మార్చి 30న మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమవుతుంది.

‘ఇక్కడి నుంచి త్వరగా పారిపో అని విరాట్ సర్ చెప్పారు’
సెలబ్రిటీలను ఆరాధ్య దైవంగా భావించే యువత మన దేశంలో చాలా మందే ఉన్నారు. క్రికెటర్లు, సినీ నటులను చూసేందుకు ఎంతకైనా తెగించేందుకు సిద్ధపడతారు. ఈ క్రమంలో.... ఒక్కోసారి తొందరపాటు చర్యలు, అత్యుత్సాహం కారణంగా జైలు పాలుకావాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. పద్దెమినిదేళ్ల రితూపర్నో పఖిరా కూడా ఈ కోవకే చెందుతాడు.భారత్‌లో క్రికెట్ కూడా ఓ మతం లాంటిది. సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar), విరాట్ కోహ్లి, మహేంద్ర సింగ్ ధోని, రోహిత్ శర్మ (Rohit Sharma).. ఇలా టీమిండియా దిగ్గజాలను దేవుళ్లలా భావించే ఫ్యాన్స్ కోకొల్లలు. వారిలో ఒకడే రితూపర్నో. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)- 2025 ఆరంభ మ్యాచ్ సందర్భంగా తన అభిమాన ఆటగాడు విరాట్ కోహ్లిని చూసేందుకు ఈడెన్ గార్డెన్స్‌లోకి దూసుకువచ్చాడు.ఒకరోజు జైలులోఈ రన్‌మెషీన్ పాదాలకు నమస్కరించి.. అతడిని ఆలింగనం చేసుకుని జన్మధన్యమైనట్లు తరించాడు. ఈ హఠాత్పరిణామంతో కంగుతిన్న భద్రతా సిబ్బంది పరుగుపరుగున వచ్చి రితూపర్నోను మైదానం నుంచి తీసుకుని వెళ్లి పోలీసులకు అప్పగించారు. పోలీసులు అతడిని అరెస్టు చేసి ఒకరోజు జైలులో ఉంచినట్లు సమాచారం. అనంతరం.. మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా.. ఓ షరతు మీద రితూపర్నోకు బెయిల్ మంజూరు చేశారు. ఈ ఐపీఎల్ సీజన్ మొత్తం ఈడెన్ గార్డెన్స్ వైపు వెళ్లకుండా ఉండాలని మెజిస్ట్రేట్ రితూపర్నోకు కండిషన్ విధించారు. PC: BCCI/IPLపశ్చాత్తాపం లేదుఅయితే, అతడి వైఖరిలో మాత్రం ఎటువంటి మార్పూ రాలేదు. బెయిలు మీద బయటకు వచ్చిన తర్వాత టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘విరాట్ కోహ్లి పాదాలను తాకగానే ఆయన నా భుజాలు పట్టుకుని పైకి లేపారు. నా పేరేమిటని అడిగారు.ఇక్కడి నుంచి త్వరగా పారిపో అని చెప్పారు. అంతేకాదు.. నా పట్ల కాస్త సౌమ్యంగా వ్యవహరించాలని భద్రతా సిబ్బందికి చెప్పారు కూడా. నన్ను కొట్టవద్దని వారికి పదే పదే చెప్పారు. ఎలాగైనా ఆరోజు మైదానంలోకి వెళ్లాలని నేను ముందుగానే ప్రణాళికలు రచించుకున్నా.ఈ విషయంలో నాకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు. నా దేవుడి పాదాలు తాకే అవకాశం వచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉన్నా’’ అని రితూపర్నో చెప్పడాన్ని బట్టి అతడి మానసిక పరిపక్వత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.పెద్ద మనసుతో క్షమించండిఅయితే, రితూపర్నో తల్లి మాత్రం తన కుమారుడు తెలియక చేసిన తప్పును క్షమించాలని న్యాయ వ్యవస్థను వేడుకుంటున్నారు. ‘‘విరాట్ కోహ్లిని ఆరాధిస్తాడు. వాడికి ఆయన దేవుడితో సమానం. అందుకే ఇలాంటి పని చేశాడు.వాడి వయసు, కెరీర్‌ను దృష్టిలో పెట్టుకుని పోలీసులు, న్యాయమూర్తి నా కుమారుడి తప్పులను పెద్ద మనసుతో క్షమించాలి’’ అని విజ్ఞప్తి చేశారు. కాగా రితూపర్నో 12వ ఏట నుంచి జమాల్‌పూర్‌లో ఉన్న నేతాజీ అథ్లెటిక్స్ క్లబ్లో క్రికెట్ కోచింగ్ తీసుకుంటున్నాడు. కాగా రితూపర్నో మైదానంలోకి దూసుకువచ్చి.. కోహ్లి కాళ్లు మొక్కడంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పందించిన తీరు విమర్శలకు దారి తీసిన విషయం తెలిసిందే.శుక్లా తీరుపై విమర్శలు‘‘కోహ్లి క్రేజ్ ఇలా ఉంటుంది’’ అని రాజీవ్ శుక్లా ట్వీట్ చేయగా.. ‘‘భద్రతా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారా? ఒకవేళ ఆ వ్యక్తి సాధారణ పౌరుడు కాకుండా.. ఓ ఆటంకావాదో అయి ఉంటే కోహ్లి పరిస్థితి ఏమిటి? ఆటగాళ్లకు సరైన భద్రత కల్పించండి. అలాగే ఇలాంటి యువత తమ భవిష్యత్తు నాశనం చేసుకునేందుకు ఆస్కారం ఇవ్వకండి’’ అని నెటిజన్లు చురకలు అంటించారు.కాగా ఐపీఎల్-2025 కోల్‌కతాలోని ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్‌లో అంగరంగ వైభవంగా శనివారం మొదలైంది. డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన ఆరంభ మ్యాచ్‌లో కోహ్లి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 36 బంతుల్లోనే 59 పరుగులతో అజేయంగా నిలిచి బెంగళూరును గెలిపించాడు.ఐపీఎల్-2025: కోల్‌కతా వర్సెస్ ఆర్సీబీ స్కోర్లు👉కోల్‌కతా- 174/8 (20)👉ఆర్సీబీ- 177/3 (16.2)👉ఫలితం- ఏడు వికెట్ల తేడాతో కోల్‌కతాపై ఆర్సీబీ గెలుపుచదవండి: విఘ్నేశ్ పుతూర్‌ను ‘సన్మానించిన’ నీతా అంబానీ.. పాదాలకు నమస్కరించిన స్పిన్నర్

IPL 2025: తెలుగు సినిమా అభిమానిని.. తగ్గేదేలేదు: నితీష్ రెడ్డి
సాక్షి, సిటీబ్యూరో: సచిన్ టెండూల్కర్, రిషబ్ పంత్ తర్వాత ఆ్రస్టేలియాలో శతకం సాధించిన మూడో అత్యంత పిన్న వయస్కుడిగా తెలుగు క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి చరిత్రలో నిలిచాడు. ఆ మ్యాచ్‌కు ముందు విరాట్ కోహ్లీ తనకు కానుకగా ఇచ్చిన షూతో ఆడి సెంచరీ చేశానని నితీష్ వెల్లడించాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్లో హైదరాబాద్ జట్టు సన్ రైజర్స్ ఆల్‌రౌండర్‌గా నితీష్ కుమార్ రెడ్డి ఆడుతున్నాడు. ఈ నేపథ్యంలో తను బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న ప్యూమా ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో తన క్రికెట్ అనుభవాలను పంచుకున్నాడు. విరాట్ కోహ్లీ ఇచ్చిన ప్రత్యేక బహుమతి మొదలు తన మొదటి టెస్ట్ అర్ధ శతకం తరువాత వేసిన పుష్పా స్టెప్ వరకూ నితీష్ పంచుకున్న అనుభవాలు ఆయన మాటల్లోనే.. కోహ్లీ షూ కోసం అబద్దం చెప్పాను.. ‘డ్రెస్సింగ్ రూమ్‌లో కోహ్లీ.. సర్ఫరాజ్ ఖాన్ వద్దకు వచ్చి ‘సర్ఫూ, నీ షూ సైజ్ ఎంత?’ అని అడగ్గా.. తను ‘తొమ్మిది’ అని చెప్పాడు. తర్వాత నన్ను చూసి షూ నంబర్ ఎంత అన్నాడు. ఆ క్షణం ఎలాగైనా నా ఫేవరెట్ కోహ్లీ బూట్లు పొందాలనే ఆశతో నా సైజ్ కాకుండా ‘పది’ అని చెప్పాను. వెంటనే కోహ్లీ వాటిని నాకు ఇచ్చాడు. తదుపరి మ్యాచ్‌లో ఆ షూస్ వేసుకుని సెంచరీ కొట్టాను. ఆ జ్ఞాపకం ఎప్పటికీ మర్చిపోలేను. 21 ఏళ్ల వయస్సులో మొదటి టెస్ట్ అర్ధ శతకాన్ని చేసిన తరుణంలో ఆ సంతోషాన్ని పుష్పా సినిమా తగ్గేదెలే అనే స్టయిల్లో సెలబ్రేట్ చేసుకున్నాను. ‘నేను తెలుగు సినిమా అభిమాని.. నేను తెలుగు వాడిని కాబట్టి టాలీవుడ్ అభిమానులు ఆనందించేలా సెలబ్రేట్ చేసుకున్నాను. తర్వాతి మ్యాచ్‌లలో కూడా మరికొన్ని సినిమా సెలబ్రేషన్స్ ప్లాన్ చేసుకున్నాను.నా విజయంలో మామయ్య త్యాగం.. నా క్రికెట్ ప్రయాణంలో కుటుంబ ప్రాముఖ్యత ప్రధానమైనది. ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోయినా.. మా మామయ్య అండగా నిలిచాడు. ‘ఆర్థిక సమస్యల కారణంగా మా నాన్న నాకు స్పైక్ షూస్, క్రికెట్ బ్యాట్ కొనలేని సందర్భాల్లో మామయ్య తన తక్కువ జీతంలోనే నేను కోరుకున్న విరాట్ కోహ్లీ ధరించే షూస్ కొనిచ్చాడు. ఆ బూట్లు వేసుకుని మైదానంలో కోహ్లీలా ఫీలయ్యేవాడిని. అలాంటిది 2024లో ప్యూమా ఇండియా బ్రాండ్ అంబాసిడర్‌గా మారడం గర్వంగా ఉంది. పాడ్‌కాస్ట్‌లో మామయ్యకు వీడియో కాల్ చేసి, ప్యూమా షూస్ గిఫ్ట్‌గా ఇస్తున్నట్టు తెలిపాను. ఆయన చేసిన త్యాగం తీర్చలేనిది.. ఇది ఆయనను సంతోషపెట్టడానికి నా చిన్న ప్రయత్నం.కాగా, గత సీజన్ రన్నరప్ అయిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్‌ను మెరుపు విజయంతో ప్రారంభించింది. సొంత మైదానంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆరెంజ్ ఆర్మీ 44 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ ఇషాన్ కిషన్ సుడిగాలి సెంచరీతో విరుచుకుపడటంతో 286 పరుగుల రికార్డు స్కోర్ చేసింది. సన్‌రైజర్స్ భారీ స్కోర్‌లో నితీశ్ కూడా భాగమయ్యాడు. 15 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్ సాయంతో 30 పరుగులు చేశాడు. దాదాపుగా అసాధ్యమైన లక్ష్యం కావడంతో రాయల్స్ ఛేదనలో తడబడింది. అయినా ఆ జట్టు అద్భుతంగా పోరాడి 20 ఓవర్లలో 242 పరుగులు చేయగలిగింది. సంజూ శాంసన్, దృవ్ జురెల్ మెరుపు అర్ద సెంచరీలతో పోరాడారు. సన్‌రైజర్స్ తమ తదుపరి మ్యాచ్‌ను లక్నో సూపర్ జెయింట్స్‌తో ఆడుతుంది. ఈ మ్యాచ్ మార్చి 27న హైదరాబాద్‌లోనే జరుగనుంది.

చరిత్ర సృష్టించిన అశుతోష్.. ఐపీఎల్లో భారత తొలి బ్యాటర్‌గా..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)- 2025 సీజన్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ గెలుపుతో ఆరంభించింది. లక్నో సూపర్ జెయింట్స్‌తో ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో ఒక్క వికెట్ తేడాతో సంచలన విజయం సాధించింది. ఇందుకు ప్రధానం కారణం ఢిల్లీ లోయర్ ఆర్డర్ బ్యాటర్లు.సుడిగాలి ఇన్నింగ్స్ముఖ్యంగా ఏడో స్థానంలో బ్యాటింగ్ చేసిన అశుతోష్ శర్మ (Ashutosh Sharma) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో.. చేజారిందనుకున్న మ్యాచ్ ఢిల్లీ సొంతమైంది. 26 ఏళ్ల ఈ బ్యాటింగ్ ఆల్‌రౌండర్.. కేవలం 31 బంతుల్లోనే 66 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన అశుతోష్ ఇన్నింగ్స్‌లో ఐదు ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి.ఇక లక్నోతో మ్యాచ్ సందర్భంగా సుడిగాలి ఇన్నింగ్స్ ఆడిన అశుతోష్ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్లో.. విజయంతమైన లక్ష్య ఛేదనలో ఏడు లేదంటే ఆ తర్వాతి స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చి.. అత్యధిక స్కోరు సాధించిన భారత తొలి బ్యాటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో యూసఫ్ పఠాన్ రికార్డును అశుతోష్ బద్దలు కొట్టాడు.సెంచూరియన్ వేదికగా 2009లో యూసఫ్ పఠాన్ రాజస్తాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగి.. ఢిల్లీపై 62 పరుగులు సాధించి నాడు తన జట్టును గెలిపించుకున్నాడు. ఇక ఈ జాబితాలో ఓవరాల్‌గా డ్వేన్ బ్రావో 68 పరుగులతో టాప్‌లో కొనసాగుతున్నాడు.ఏడు లేదా ఆ తర్వాతి స్థానాల్లో వచ్చి లక్ష్య ఛేదనలో జట్టును గెలిపించిన బ్యాటర్లు👉డ్వేన్ బ్రావో- 2018లో ముంబై వేదికగాచెన్నై సూపర్ కింగ్స్ తరఫున ముంబై ఇండియన్స్‌పై 68 పరుగులు👉అశుతోష్ శర్మ- 2025లో విశాఖపట్నం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున లక్నో సూపర్ జెయింట్స్‌పై 66 నాటౌట్👉ఆండ్రీ రసెల్- 2015లో పుణె వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున పంజాబ్ కింగ్స్‌పై 66 పరుగులు👉యూసఫ్ పఠాన్- 2009లొ సెంచూరియన్ వేదికగా రాజస్తాన్ రాయల్స్ తరఫున ఢిల్లీపై 62 పరుగులు👉ప్యాట్ కమిన్స్- 2022లో పుణె వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ముంబై ఇండియన్స్‌పై 56 పరుగులుమొదటి జట్టుగా ఢిల్లీ అరుదైన రికార్డుమరోవైపు.. ఢిల్లీ క్యాపిటల్స్ కూడా సరికొత్త రికార్డు సాధించింది. ఐపీఎల్ చరిత్రలో ఓ జట్టు తరఫున ఏడు, ఆ తర్వాతి స్థానాల్లో వచ్చిన బ్యాటర్లు వందకు పైగా పరుగులు సాధించి.. జట్టును గెలిపించడం ఇదే తొలిసారి. అంతకు ముందు ఈ రికార్డు చెన్నై సూపర్ కింగ్స్ పేరిట ఉండేది. 2018లో ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్ సందర్భంగా చెన్నై లోయర్ ఆర్డర్ బ్యాటర్లు 79 పరుగులు చేసి జట్టును గెలిపించారు.ఏడు లేదా ఆ తర్వాతి స్థానాల్లోని బ్యాటర్లు లక్ష్య ఛేదనలో అత్యధిక పరుగులతో జట్టును గెలిపించిన సందర్భాలు👉2025- ఢిల్లీ క్యాపిటల్స్- లక్నో సూపర్ జెయింట్స్‌పై 113 రన్స్👉2018- చెన్నై సూపర్ కింగ్స్- ముంబై ఇండియన్స్‌పై 79 పరుగులు.ఐపీఎల్-2025: ఢిల్లీ వర్సెస్ లక్నో👉వేదిక: డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ- వీడీసీఏ క్రికెట్ స్టేడియం, విశాఖపట్నం👉టాస్: ఢిల్లీ క్యాపిటల్స్.. తొలుత బౌలింగ్👉లక్నో స్కోరు: 209/8 (20)👉ఢిల్లీ స్కోరు: 211/9 (19.3)👉ఫలితం: ఒక వికెట్ తేడాతో లక్నోపై ఢిల్లీ గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: అశుతోష్ శర్మ. చదవండి: అలా అయితే.. నేను జట్టులో ఉండటం వేస్ట్: ధోనిClose finish ✅Safe to say, the #DC dugout was a bunch of emotions in those last couple of overs of a nail-biter! 😦 ☺𝗥𝗮𝘄 𝗩𝗶𝘀𝘂𝗮𝗹𝘀! 🎥 🔽 #TATAIPL | #DCvLSG | @DelhiCapitals pic.twitter.com/0EIdIQ7VTt— IndianPremierLeague (@IPL) March 25, 2025
బిజినెస్

దిగొస్తున్న బంగారం ధరలు! ఈరోజు తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతున్న బంగారం ధర మంగళవారం కొంత తగ్గి కొనుగోలుదారులకు ఊరట కల్పించింది. వివిధ ప్రాంతాల్లో ఈ రోజు రోజున గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.81,850 (22 క్యారెట్స్), రూ.89,290 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. బుధవారం ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.300, రూ.330 తగ్గింది.చెన్నైలో మంగళవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.300, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.330 తగ్గింది. దీంతో గోల్డ్ రేటు రూ.81,850 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.89,290 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే తగ్గింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.300 దిగి రూ.82,000కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.330 తగ్గి రూ.89,440 వద్దకు చేరింది.ఇదీ చదవండి: బంగారు ఆభరణాలు అమ్మితే పన్ను చెల్లించాలా?వెండి ధరలుబంగారం ధరలు మంగళవారం తగ్గినా వెండి ధరలు మాత్రం స్థిరంగానే ఉన్నాయి. సోమవారం ముగింపు ధరలతో పోలిస్తే ఏమాత్రం కదలాడకుండా నిలకడగా ఉన్నాయి. దాంతో కేజీ వెండి రేటు రూ.1,10,000 వద్ద ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

బంగారు ఆభరణాలు అమ్మితే పన్ను చెల్లించాలా?
నా బంగారం ఆభరణాలను విక్రయించాలనుకుంటున్నాను? మూలధన లాభానికి ఇండెక్సేషన్ ప్రయోజనం లభిస్తుందా? – ప్రణయ్ఇండెక్సేషన్ అంటే ద్రవ్యోల్బణానికి తగినట్టుగా కొనుగోలు ధరను సర్దుబాటు చేయడం. కానీ, బంగారు ఆభరణాలకు ఇండెక్సేషన్ ప్రయోజనం ఇప్పుడు లేదు. ఆభరణాలను విక్రయించగా వచ్చిన లాభంపై పన్ను ఎంత చెల్లించాలన్నది.. వాటిని ఎంత కాలం పాటు కొని ఉంచుకున్నారన్న దానిపై ఆధారపడి ఉంటుంది. రెండేళ్లకుపైగా ఉంచుకుంటే అప్పుడు దీర్ఘకాల మూలధన లాభంపై 12.5% పన్ను పడుతుంది. రెండేళ్లలోపు విక్రయిస్తే ఆ మొత్తం స్వల్పకాల మూలధన లాభం అవుతుంది. ఇది మీ వార్షిక ఆదాయానికి కలుస్తుంది. అప్పుడు మీ మొత్తం ఆదాయం ఏ శ్లాబు పరిధిలోకి వస్తే, ఆ మేరకు పన్ను చెల్లించాలి. ఆభరణాలు వారసత్వంగా మీకు సంక్రమించినా లేక బహుమతి రూపంలో వచ్చినా.. అప్పుడు ఆ ఆభరణం కొన్న అసలు తేదీ, అప్పటికి ఉన్న ధరను పరిగణనలోకి తీసుకుంటారు. ఇదీ చదవండి: ప్రభుత్వ బ్యాంకుల డివిడెండ్ అప్పెట్టుబడులపై ఎలా..?గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో 2023 ఏప్రిల్ 1, ఆ తర్వాత ఇన్వెస్ట్ చేసి.. 2025 మార్చి 31లోపు విక్రయిస్తే.. లాభం మొత్తం వార్షికాదాయానికి కలుస్తుంది. 2025 ఏప్రిల్ 1, ఆ తర్వాత విక్రయిస్తే.. హోల్డింగ్ పీరియడ్ (ఉంచిన కాలం) ఏడాదికి మించితే లాభంపై 12.5% పన్ను పడుతుంది. ఆభరణాల హోల్డింగ్ పీరియడ్ ఏడాదిలోపు ఉంటే లాభం మొ త్తం వార్షిక ఆదాయానికి కలుస్తుంది. గోల్డ్ ఫండ్స్ లో 2023 ఏప్రిల్ 1, ఆ తర్వాత ఇన్వెస్ట్ చేసి.. 2025 మార్చి 31లోపు విక్రయిస్తే, వచి్చన లాభం వార్షి కాదాయానికి కలుస్తుంది. 2025 ఏప్రిల్ 1 తర్వాత విక్రయిస్తే, హోల్డింగ్ పీరియడ్ రెండేళ్లకు పైన ఉంటే లాభంపై 12.5% పన్ను చెల్లించాలి. ఆలోపు ఉంటే లాభం వార్షిక ఆదాయానికి కలుస్తుంది.

ప్రభుత్వ బ్యాంకుల డివిడెండ్ అప్
గత ఆర్థిక సంవత్సరం(2023–24) ప్రభుత్వ రంగ బ్యాంకుల డివిడెండ్ చెల్లింపులు 33 శాతం ఎగశాయి. ఉమ్మడిగా రూ.27,830 కోట్లు చెల్లించాయి. ఇది పీఎస్‌యూ బ్యాంకుల ఆర్థిక పరిస్థితి భారీగా మెరుగుపడినట్లు తెలియజేస్తోంది. అంతక్రితం ఏడాది(2022–23) ప్రభుత్వ బ్యాంకులు డివిడెండ్ రూపేణా రూ.20,694 కోట్లు అందించాయి. వీటితో పోలిస్తే గతేడాది చెల్లింపులు 33 శాతం బలపడ్డాయి. కాగా.. వీటిలో 65 శాతం అంటే రూ.27,830 కోట్లు వాటా ప్రకారం ప్రభుత్వానికి అందించాయి.ఇదేవిధంగా 2022–23లో ప్రభుత్వ వాటాకు పీఎస్‌యూ బ్యాంకులు ఉమ్మడిగా రూ.13,804 కోట్లు చెల్లించాయి. గతేడాది ఎస్బీఐసహా 12 ప్రభుత్వ బ్యాంకులు పీఎస్‌యూ బ్యాంకింగ్ చరిత్రలోనే అత్యధికంగా రూ.1.41 లక్షల కోట్లకుపైగా నికర లాభం ఆర్జించాయి. దీనిలో ఎస్బీఐ వాటా విడిగా 40 శాతంకావడం గమనార్హం! 2022–23లో రూ.1.05 లక్షల కోట్ల నికర లాభం ప్రకటించాయి. ఈ బాటలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) తొలి 9 నెలల్లో(ఏప్రిల్–డిసెంబర్) రూ.1.29 లక్షల కోట్ల నికర లాభం సాధించిన విషయం విదితమే. ఇదీ చదవండి: చైనా ఆర్మీలోకి ‘డీప్‌సీక్’!ఎస్బీఐ 22 శాతం జూమ్గతేడాది ఎస్బీఐ రూ. 61,077 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఏడాది సాధించిన రూ. 50,232 కోట్లతో పోలిస్తే 22 శాతం అధికం! పంజాబ్ నేషనల్ బ్యాంక్ నికర లాభం అత్యధికంగా 228 శాతం దూసుకెళ్లి రూ. 8,245 కోట్లను తాకింది. ఈ బాటలో యూనియన్ బ్యాంక్ లాభం 62 శాతం వృద్ధితో రూ. 13,249 కోట్లకు చేరగా.. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాభం 61 శాతం ఎగసి రూ. 2,549 కోట్లయ్యింది. ఇతర సంస్థల లాభాలలో బ్యాంక్ ఆఫ్ ఇండియా 57 శాతం వృద్ధితో రూ. 6,318 కోట్లకు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 56 శాతం ఎగసి రూ. 4,055 కోట్లకు, ఇండియన్ బ్యాంక్ 53 శాతం అధికంగా రూ. 2,549 కోట్లకు చేరాయి. 2017–18లో పీఎస్‌బీలు ఉమ్మడిగా రూ. 85,390 కోట్ల నష్టాలు నమోదుచేయగా.. 2023–24కల్లా ఏకంగా రూ. 1,41,203 కోట్ల నికర లాభం ఆర్జించి సరికొత్త రికార్డ్ సాధించడం కొసమెరుపు!!

రూపాయి రయ్ రయ్
ఏడో రోజూ ర్యాలీతో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి ఈ ఏడాది నష్టాలన్నీ పూడ్చుకోగలిగింది. దేశీయ ఈక్విటీ మార్కెట్ వరుస లాభాల పరంపర, ఎఫ్ఐఐల పునరాగమనంతో దేశీయ కరెన్సీ వరుస ఏడు ట్రేడింగ్ సెషన్లలో 154 పైసలు బలపడింది. క్రూడాయిల్ ధరలు దిగిరావడం, డాలర్ ఇండెక్సు బలహీనత అంశాలు కలిసొచ్చాయి. తాజాగా సోమవారం డాలర్ మారకంలో 37 పైసలు బలపడిన రూపాయి 85.61 వద్ద ముగిసింది. కాగా, 2024 డిసెంబర్ 31న 85.64 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. ఉదయం ఫారెక్స్ మార్కెట్లో 85.93 వద్ద ట్రేడింగ్ మొదలైంది. ఇంట్రాడేలో 85.49 వద్ద గరిష్టాన్ని, 86.01 వద్ద కనిష్టాన్ని తాకింది.ఇదీ చదవండి: చైనా ఆర్మీలోకి ‘డీప్‌సీక్’!‘ఆర్థిక సంవత్సరం ముగింపు సర్దుబాటులో భాగంగా విదేశీ బ్యాంకులు, ఎగుమతిదారులు డాలర్ల అమ్మకాలకు పాల్పడుతున్నారు. ఏప్రిల్ 2 నుంచి అమెరికా ప్రతీకార సుంకాలు అమల్లోకి రాకముందే చర్చలు జరుపుతామని భారత ప్రతినిధుల ప్రకటన ఇన్వెస్టర్లకు భరోసానిచ్చింది’ అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రీసెర్చ్ విశ్లేషకుడు దిలీప్ పర్మార్ తెలిపారు.
ఫ్యామిలీ

ట్రెండింగ్ కర్రీ బిజినెస్ : సండే స్పెషల్స్, టేస్టీ ఫుడ్
ఉరుకులు పరుగుల జీవితంలో ప్రత్యేకమైక సమయాన్ని కేటాయించి వంటలు చేసుకోవడం చాలా మందికి కష్టతరంగా మారింది. హోటల్స్‌లో భోజనం కూడా ఖర్చుతో కూడుకుంది కావడంతో అన్నం మాత్రం వండుకుని కర్రీస్‌ను బయట కొనుగోలు చేసేందుకు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. దీంతో నగరంలో వీధికో కర్రీస్ పాయింట్లు వెలిశాయి. నగరంలోని కర్రీస్ పాయింట్లకు రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది. అందుకు తగ్గట్లు కొత్త రుచులతో ఆహార ప్రియులకు రోజుకో ఒక స్పెషల్ కర్రీని పరిచయం చేస్తున్నారు. నాన్‌వేజ్ ఐటమ్స్‌లో కొత్త రకాలను పరిచయం చేస్తూ కర్రీస్ సెంటర్లు నగర వాసుల మన్నలను పొందుతున్నాయి. 17 ఏళ్ల క్రితం మాగుంట లేఅవుట్ ప్రాంతంలో గంగోత్రి కర్రీస్ పాయింట్ ఏర్పాటు చేశారు. అప్పట్లో కర్రీస్ పాయింట్లను పరిచయం చేసింది వారే. అయితే ప్రస్తుతం ఆ కర్రీ పాయింట్ లేదు. దాదాపు 400పైగా కర్రీ పాయింట్స్ నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో కర్రీ పాయింట్స్ అనేకం వెలిశాయి. ఒక్క స్టోన్‌హౌస్‌పేట, బాలాజీనగర్, నవాబుపేట, కిసాన్‌నగర్, మైపాడుగేటు ప్రాంతాల్లోనే 70 కర్రీస్ పాయింట్లు ఉన్నాయి. అదే విధంగా హరనాథపురం, చిల్డ్రన్స్‌పార్క్, చిన్నబజారు, పెద్దబజారు, వీఆర్సీ సెంటర్, మద్రాసు బస్టాండు, దర్గామిట్ట, వేదాయపాళెం, అయ్యప్పగుడి ఇలా ప్రధాన ప్రాంతాల్లోని అధిక సంఖ్యలో కర్రీస్ పాయింట్లు వెలిశాయి. ఇలా మొత్తం దాదాపు 400కు పైగా కర్రీస్ పాయింట్లు ఉన్నాయి. చదవండి: నాలుగు వారాల కొరియన్ డైట్ ప్లాన్ : 6 రోజుల్లో 4 కిలోలు నిత్యావసరాల ఖర్చులు పెరగడంతో... గతంతో పోలిస్తే కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. దీంతో ఇంట్లో గ్యాస్, నిత్యావసర వస్తువులకు ఖర్చు చేయడం కన్నా రూ.20 నుంచి రూ.30లకు ఒక కర్రీ ప్యాకెట్ రావడంతో వాటిపైనే ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. సాంబార్, పప్పు, రసానికి కలిపి రూ.60 నుంచి రూ.80లు వెచ్చిస్తే నలుగురు వ్యక్తులు తినేందుకు సరిపోతుంది. ఇంట్లో అన్నం వండుకుని కర్రీస్ కొనుగోలు చేస్తే రోజు గడిచిపోతుంది. జీవనోపాధికి దోహదం హోటల్స్‌లో పనిచేసిన అనుభవం ఉన్నవారు, సొంత కాళ్లపై నిలబడాలనే ఉద్దేశంతో ఉన్న వారు కర్రీ సెంటర్ల ఏర్పాటుకు ముందుకు వస్తున్నారు. ఇంటి పెద్ద మాత్రమే కాకుండా ఇంట్లోని భార్య, పిల్లలు కర్రీ పాయింట్లో అవసరమైన పనులు ఒకరికి ఒకరు సహాయ పడుతూ బుతుకు జీవనాన్ని నెట్టుకొస్తున్నారు. ఉదయం 4 నుంచి కర్రీకి సంబంధించి కూరగాయలు, ఇతర వస్తువులను సమకూర్చుకుంటారు. ఉదయం 11 గంటలకే అన్ని రకాల కర్రీస్‌ను అందుబాటులో ఉంచుతారు. సాయంత్రానికి తిరిగి మళ్లీ వంటకాలు చేయాల్సి ఉంది. కుటుంబ సభ్యులు అందరూ కలిసి పనులను పంచుకుంటారు. వీరిలో రుచిని, నాణ్యతను అందించిన వాళ్లకు మాత్రమే ఆదరణ లభిస్తుంది. సండే స్పెషల్స్ ఆదివారం వచ్చిందంటే నగర వాసులు సినిమాలు, షికార్లుకు వెళ్తుంటారు. రోజంతా పిల్లలతో గడుపుతుంటారు. బయట వంటకాలు రుచి చూసేందుకు ఇçష్ట పడుతుంటారు. దీంతో ఆదివారం హోటల్స్‌తో పాటు కర్రీ సెంటర్లు కూడా ప్రత్యేకంగా నాన్‌వెజ్ రుచులను అందుబాటులోకి తెస్తుంటాయి. రాగి సంగటితో పాటు బొమ్మిడాయల పులుసు, రొయ్యలు, చికెన్, మటన్‌లో ఫ్రైలు, కర్రీల విక్రయాలు చేస్తుంటారు. సాధారణ రోజులో కన్నా ఆదివారం తమ వ్యాపారం జోరుగా ఉంటుందని కర్రీ పాయింట్ నిర్వాహకులు చెబుతున్నారు. చదవండి: వాకింగ్ చేస్తూనే మృత్యు ఒడికి.. సీసీటీవీలో దృశ్యాలు వివిధ రకాల పచ్చళ్లు... కర్రీ పాయింట్లలో అనేక రకాల పచ్చళ్లు కూడా అందుబాటులో ఉన్నాయి. కొన్ని కర్రీ సెంటర్లు వారంలో ప్రతిరోజు ఒక్కో రకం పచ్చళ్లను అందుబాటులో ఉంచుతుంటాయి. అదే విధంగా కారపు పొడులు సైతం విక్రయిస్తున్నారు. అదే విధంగా నాన్‌వెజ్‌లో ఫ్రై ఐటమ్స్, వెజ్‌లో కూడా పలు కొత్త రకాల ఫ్రై ఐటమ్స్ అందుబాటులోకి తీసుకొచ్చారు. రుచి, నాణ్యత ఉంటేనే.. చాలా కాలంగా కర్రీ పాయింట్ నిర్వహిస్తున్నా. అయితే రుచి, నాణ్యత ఇవ్వగలిగితేనే కస్టమర్లు మళ్లీ మళ్లీ వస్తారు. కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు హెచ్చుతగ్గులు ఉన్నా కస్టమర్ల కోసం అందుబాటు ధరల్లో విక్రయాలు చేస్తుంటాం. – వెంకటేశ్వర్లు, కర్రీ పాయింట్ నిర్వాహకుడు

నాలుగు వారాల కొరియన్ డైట్ ప్లాన్ : 6 రోజుల్లో 4 కిలోలు
అధిక బరువును తగ్గించుకోవాలంటే..భారీ కసరత్తే చేయాలి. చెమట చిందిస్తేనే అదనపు కొవ్వు కరుగుతుంది. అయితే ఇది అంత ఈజీ కాదు. పట్టుదల, కృషి ఉండాలి. అలాగే ఏదో యూట్యూబ్‌లోనో, ఇంకెవరోచెప్పారని కాకుండా, శరీరంపై మనంతీసుకుంటున్న ఆహారంపైనా అవగాహన పెంచుకుని, శ్రద్ధపెట్టి, నిపుణుల సలహా తీసుకని ఈ ప్రక్రియను మొదలు పెట్టాలి. విజయం సాధించాలి. అలా కేవలం ఆరు రోజుల్లో నాలుగు కిలోల బరువు తగ్గించుకుందో మోడల్. ఆ తరువాత తన సక్సెస్ గురించి ఇన్‌స్టాలో షేర్ చేసింది.సియోల్‌లో ఉంటున్న ఫ్రీలాన్స్ మోడల్' షెర్రీ తరచుగా ఫిట్నెస్ రహస్యాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా ఒక ఆసక్తికరమైన వీడియోను పోస్ట్ చేసింది. కండరాల నష్టం లేకుండా 6 రోజుల్లో 4 కిలోల బరువు తగ్గిన విధానాన్ని తన అభిమానులతో పంచుకుంది. దీన్ని కొరియన్ 'స్విచ్ ఆన్' డైట్ అంటారట. ఆహారం, ఉపవాసం, అధిక ప్రోటీన్ భోజనం ఈ మూడు పద్దతులను అనుసరించినట్టు తెలిపింది. View this post on Instagram A post shared by Sherrie 셰리 🌸 | 외국인 모델 (@shukiiii)ఆహారం జీవనశైలి మార్పుల వివరాలనుఇలా పంచుకుంది..“నేను ఎలాంటి ఆహారం/జీవనశైలి మార్పులు చేసుకోవాలి లాంటి సలహా ఇవ్వడం లేదు. అంత ఎక్స్‌పర్ట్‌ని కూడా కాదు. కేవలం నా సొంత అనుభవం. కాబట్టి దీన్ని దయచేసి నా అనుభవంలాగే తీసుకోండి అంటూ తన అనుభవాన్ని షేర్ చేసింది.చదవండి: సెలబ్రిటీ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ పెళ్లి ఫోటోలు వైరల్, ఎవరు తీశారో ఊహించగలరా?షెర్రీ వెయిట్ లాస్ జర్నీఆరు రోజుల్లో 4 కిలోలు తగ్గాను , ఎలా చేశానంటే.. తొలుత 'స్విచ్ ఆన్ (డైట్)' గురించి చెప్తా. ఇది చాలా కాలం పాటు బరువును నిలుపుకోవడంలో నాకు సహాయపడుతుంది. ఇది ఒక కొరియన్ వైద్యుడు అభివృద్ధి చేసిన 4 వారాల కార్యక్రమం. ఇది కండరాల నష్టాన్ని నివారించడంతో పాటు కొవ్వు జీవక్రియను సక్రియం చేయడంలో , ఇన్సులిన్ నిరోధకతను మెరుగుపరచడంలోసహాయపడుతుంది. ప్రాథమికంగా ఇది ఎలా పనిచేస్తుంది...”కండరాల శక్తి కోల్పోకుండా బరువుతగ్గాలంటే సరైన పోషకాహారం అవసరం. తగినంత ప్రోటీన్ తినేలా చూసుకుంది. అలాగే కెఫిన్, ఆల్కహాల్, ప్రాసెస్ చేసిన మాంసం, చక్కెర లేకుండా జాగ్రత్త పడింది. ఉపవాసాలను కూడా తన డైట్ ప్లాన్‌లో చేర్చుకుంది.ఇంకా ఇలా చెప్పింది:మొదటి వారం: ప్రోటీన్ షేక్స్, కూరగాయలు , అధిక ప్రోటీన్ భోజనం తీసుకుంది. తద్వారా శరీరం నుంచి మలినాలు బైటికిపోతాయి. గట్ ఆరోగ్యం బలపడుతుంది. రెండో వారం అధిక మజిల్ రికవరీ కోసం ప్రోటీన్ భోజనం , ఉపవాసాలు చేసింది. మూడో వారంలో ఎక్కువ ఫాస్టింగ్ని ప్రాధాన్యత ఇచ్చింది. అలాగే అధిక ప్రోటీన్ కలిగిన ఆహారాన్ని తీసుకుంటూ, ఎక్కువ కొవ్వు కరిగేలా జాగ్రత్త పడింది. ఏమి తినాలి ? ఏమి తినకూడదు?షెర్రీ స్విచ్ డైట్ ప్లాన్ ప్రకారం మూడు రోజుల్లో తొలి రోజు అల్పాహారం, భోజనం, స్నాక్స్ , రాత్రి భోజనం అన్నీ ప్రోటీన్ షేక్ మీల్స్ మాత్రమే. ఇక మిగిలిన రెండు రోజుల్లో ప్రోటీన్ షేక్స్ 'కార్బ్-లెస్' మిశ్రమం, ఇంకా మల్టీ-గ్రెయిన్ రైస్, ఉడికించిన కొవ్వు లేని చికెన్, చేపలు, స్కిన్ లెస్ చికెన్, గింజలు, గుడ్లు, బెర్రీలు, అరటిపండు, చిలగడదుంపలు వంటి ఆహారాలతో కూడిన సాధారణ భోజనం.ఈ డైట్ ప్రోగ్రామ్‌లో కెఫిన్, ఆల్కహాల్, ప్రాసెస్ చేసిన మాంసం, చక్కెర లాంటి పూర్తిగా నిషిద్ధం.స్విచ్ ఆన్ డైట్ కండరాలను కాపాడుతూ, ప్రస్తుత శక్తికోసం బాడీలోని అదనపు కొవ్వును కరిగిస్తుంది. గత ఏడాది కొవ్వు శాతాన్ని తగ్గించడంలో డైట్ సహాయపడింది. శీతాకాలంలో ఎక్కువ మొబిలిటీ లేక హార్మోన్లను ప్రభావితం చేయడంతో పాటు పేగు ఆరోగ్య సమస్యలకు దారితీసిందని అలాగే తన శరీరం నీరు పడుతుందని చెప్పుకొచ్చింది. అందుకే మళ్లీ ఈ డైట్ ప్రారంభించే ముందు 3 రోజుల ఉపవాసంతో ప్రతిదీ రీసెట్ చేసాననీ తెలిపింది. అలాగే ఈసారి పాల ఉత్పత్తులు లేకుండా కొన్ని మార్పులు చేసాను. తద్వారా తన డైట్‌ను యాంటీ ఇన్ఫ్లమేటరీగా మార్చి, ఫైబర్‌పై ఎక్కువ దృష్టి పెట్టినట్టు చెప్పింది. స్విచ్ ఆన్ డైట్ అంటే ఏమిటి?శాస్త్రీయంగా, బరువు తగ్గడం, గట్ హెల్త్ కోసం దక్షిణ కొరియాలో ట్రెండింగ్‌లో ఉన్నవిధానమే స్విచ్ ఆన్ డైట్. ఇది మజిల్స్‌కు నష్టం లేకుండా కొవ్వు కరిగించుకునేలా 4 వారాల జీవక్రియ రీసెట్ ప్రోగ్రామ్. డాక్టర్ పార్క్ యోంగ్-వూ దీన్ని రూపొందించారు. భారీ కేలరీలను తగ్గించడం, క్రాష్ డైటింగ్ లాంటి విధానం గాకుండా అడపాదడపా ఉపవాసం, శుభ్రంగా తినడం, జీవక్రియను సమతుల్యం చేయడంపై దృష్టి పెడుతుంది, అదే సమయంలో గట్ ఆరోగ్యానికి కాపాడుకునేలా జాగ్రత్త పడటం. నోట్: ఇది షెర్రీ వ్యక్తిగత అనుభవం మాత్రం అని గమనించగలరు. అధిక బరువును తగ్గించు కోవాలనుకుంటే, నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.

యూట్యూబ్ సాయంతో సెల్ఫ్ సర్జరీ..! ఐతే అతడు..
ఏదైన తెలియని విషయం నేర్చుకోవాలంటే ఠక్కున గుర్తొచ్చేది యూట్యూబ్ మాయజాలమే. అందులో ఏ వంటకమైన, తెలియని పనైనా సులభంగా నేర్చుకోవచ్చు..నిమిషాల్లో చేసేయొచ్చు. అయితే అది కొన్నింటికే పరిమితం. ఆరోగ్యానికి సంబంధించినవి చాలామటుకు వ్యక్తిగత వైద్యుల సలహా తీసుకునే చేయాలి. లేదంటే ప్రాణాలకే ముప్పు. అయితే ఈ వ్యక్తి ఏకంగా యూట్యూబ్ చూసి తనకు తాను సర్జరీ చేసుకున్నాడు. చివరికి అది కాస్త సివియర్ అయ్యి ఆస్పత్రి మెట్లు ఎక్కక తప్పలేదు. అయితే వైద్య నిపుణులు ఇదెంత వరకు సబబు అని మండిపడుతున్నారు. మరీ ఆ వ్యక్తి పరిస్థితి ఎలా ఉందంటే..ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్‌కు చెందిన 32 ఏళ్ల వ్యక్తి యూట్యూబ్ వీడియోల సాయంతో నేర్చుకున్న పరిజ్ఞానంతో తనకు తానుగా సర్జీర చేసుకునేందుకు రెడీ అయిపోయాడు. అందుకోసం మార్కెట్ నుంచి సర్జికల్ బ్లేడ్లు, కుట్లు వేసే తీగలు, సూదులు వంటివి అన్ని కొనుగోలు చేశాడు. అనుకున్నట్లుగానే అన్నంత పని చేసేశాడు. తనకు తానుగా పొత్తికడుపు కోసుకుని మరీ ఆపరేషన్ చేసుకున్నాడు. అంత వరకు బాగానే ఉంది. ఆ మరుసటి రోజు ఆ వ్యక్తి పరిస్థితి దారుణంగా దిగజారడంతో హుటాహుటినా ఆస్పత్రికి తరలింరు అతడి బంధువులు. ఆస్పత్రి వైద్యులు అతడి చేసిన ఘనకార్యం విని కంగుతిన్నారు. వెంటనే పరీక్షించగా..అదృష్టవశాత్తు సదరు వ్యక్తి పొత్తి కడుపు పైపొర మాతమే కోయడంతో త్రటిలో ప్రాణాపయం తప్పిందన్నారు. ఎందుకంటే కాస్త లోతుగా కోసుంటే ఇతర అంతర్గ అవయవాలు కూడా డ్యామేజ్ అయ్యేవని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నట్లు వైద్యులు వెల్లడించారు.ఘటనపై సీరియస్ అవుతున్న వైద్యులు..ఆన్లైన్లో చూసిన ప్రతిదాన్ని చేసేయాలని చూడొద్దు. ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో పరాచకాలు వద్దు. నిపుణుల సాయం లేకుండా సర్జరీ లాంటివి అత్యంత ప్రమాదకరమని అన్నారు. వైద్యుడిని సంప్రదించకుండా ఇలాంటి సర్జరీలు చేసేటప్పుడూ ఒకవేళ అధిక రక్తస్రావం అయితే పరిస్థితి చేజారిపోతుంది. పైగా ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు. డబ్బు ఆదా చేయాలనో లేదా మాకు చాలా పరిజ్ఞానం వచ్చేసిందన్న అత్యుత్సాహంతోనే ఇలాంటిపనులకు అస్సలు ఒడిగట్టద్దు. ఈ మిడిమిడి జ్ఞానంతో స్వీయంగా లేదా వేరేవాళ్లకి సర్జరీలు చేసి లేనిపోని సమస్యలు కొని తెచ్చుకోవద్దు అని గట్టి వార్నింగ్ ఇచ్చారు. ముఖ్యంగా ఆన్లైన్ హెల్త్ ట్యూటోరియల్స్ లేదా హెల్త్ ట్రెండ్లు వంటి వాటిని చాలావరకు వైద్యులు ఆమోదించరిన అన్నారు. నిపుణుల మార్గదర్శకత్వంలోనే ఇలాంటివి చేయాలి. ఎంబీబిఎస్ చదివి ఎన్నేళ్లో ప్రాక్టీస్ చేసినా వైద్యులే ఒక్కోసారి పొరపాట్లు దొర్లుతుంటాయి. అలాంటిది ఏ మాత్రం అనుభవం లేకుండా .. జస్ట్ చూసి ఎలా చేసేస్తారంటూ మండిపడుతున్నారు వైద్య నిపుణులు.(చదవండి: 'విద్యార్థి భవన్ బెన్నే దోసె'..యూకే ప్రధాని, ఐకానిక్ డ్రమ్మర్ శివమణి ఇంకా..)

వాకింగ్ చేస్తూనే మృత్యు ఒడికి.. సీసీటీవీలో దృశ్యాలు
గుండె పోటు అంటే బీపీ, సుగర్ లాంటి వ్యాధులున్నవారిలో, అధిక బరువు ఉన్నవారిలోమాత్రమే వస్తుంది అని భ్రమపడేవారు. కానీ ప్రస్తుతం గుండెపోటు తీరు మారింది. నిరంతరం వ్యాయామం చేస్తూఆరోగ్యంగా ఉన్నవారినికూడా గుండె పోటు బలి తీసుకుంటోంది. తాజాగా ఉదయం వాకింగ్ చేస్తూ ఉన్నట్టుండి కుప్పకూలి ప్రాణాలు కోల్పోయిన వైనం పలువుర్ని విస్మయ పర్చింది. ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకున్న ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లాలో ఆదివారం ఉదయం నడకకు వెళుతుండగా 28 ఏళ్ల అనుమానాస్పదంగా కుప్పకూలి మరణించాడు. బాధితుడిని రాష్ట్రీయ లోక్‌దళ్ కార్యకర్త అమిత్ చౌదరిగా గుర్తించారు. నడుస్తూ ఉండగా ఒక వ్యక్తి వచ్చి చౌదరిని పలకరించి, అతని భుజం తట్టి వెళ్ళిపోయిన దృశ్యాలు CCTV ఫుటేజ్‌లో రికార్డైనాయి. ఆ తరువాత అతను అకస్మాత్తుగా గుండెపోటుకు గురైనాడు.. తీవ్ర ఇబ్బందికి గురైన అతను ఇంటి ఎదురుగా ఉన్న గోడను ఆసరా చేసుకోవాలని ప్రయత్నించాడు. కానీ ఫలితం లేకపోయింది. జిల్లాలోని మదన్‌పూర్ గ్రామంలోని ఇంటి వెలుపల గుండెపోటుతో మరణించాడు. చౌదరి కుప్పకూలిన తర్వాత కొంతమంది వ్యక్తులు ఆయన ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించారు. కానీ అతను ప్రాణాలు కోల్పోయాడు. చౌదరి మరణానికి డెపోటే కారణమని భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అని భావిస్తున్నారు.⚠️ Trigger Warning : Sensitive Visual⚠️जिंदगी–मौत का कुछ नहीं पता। इस Video को देखिए। 20 सेकेंड पहले तक जो इंसान एकदम फिट दिखाई दे रहा है, वो अचानक से मर जाता है।📍बुलंदशहर, यूपी pic.twitter.com/9jiDgbC2ay— Sachin Gupta (@SachinGuptaUP) March 22, 2025 చదవండి: సెలబ్రిటీ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ పెళ్లి ఫోటోలు వైరల్, ఎవరు తీశారో ఊహించగలరా?గుండెపోటుఎందుకు వస్తుంది?గుండెలోని రక్త నాళాల్లో రక్త ప్రసరణకు అడ్డంకులు ఏర్పడటం, రక్తనాళాలు పూడుకుపోవడం, రక్తాన్ని గుండె సరిగా సరఫరా చేయలేకపోవడం తదితర కారణాల వల్ల గుండె పోటు వచ్చే అవకాశముందని వైద్యులు చెబుతున్న మాట. గుండె నొప్పి లక్షణాలు:గుండె నొప్పి (ఛాతీ నొప్పి) తీవ్రమైన వైద్య పరిస్థితికి సంకేతం. వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఛాతీ నొప్పి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీ బరువుగా, టైట్‌గా అనిపించిడం, నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వికారం, చల్లని చెమటలు, ఎడమ చేయి లేదా దవడలో నొప్పి వంటి లక్షణాలు ఉంటే అప్రమత్తం కావాలి.ఇంకా తలనొప్పి, ఎడమ చేయి, మెడ, దవడ లేదా రెండు చేతుల్లో నొప్పి, బలహీనంగా, అనీజిగా అనిపించడం, చర్మం పాలిపోవడంలాంటి లక్షణాలు కనిపించినా వైద్య సహాయం తీసుకోవాలి. ఇంతకు ముందే గుండె సమస్యలున్నా, కుటుంబంలో ఎవరికైనా గుండె సంబంధిత సమస్యలున్నా మరింత అప్రమత్తంగా ఉండాలి.
ఫొటోలు
International

ఏప్రిల్ 28న కెనడాలో ఎన్నికలు
ఒట్టావా: కెనడాలో ఎన్నికల నగారా మోగింది. ఏప్రిల్ 28న ముందస్తు పోలింగ్ జరపనున్నట్లు ఆదివారం కెనడా ప్రధానమంత్రి కార్నీ ప్రకటించారు. ట్రంప్ అధ్యక్షుడయ్యాక అగ్రరాజ్యం అమెరికాతో సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్న వేళ ఆయనీ ప్రకటన చేయడం గమనార్హం. జస్టిన్ ట్రూడో పదవి నుంచి వైదొలగడంతో రెండు వారాల క్రితమే కార్నీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ముందస్తు ఎన్నికలపై ఊహాగానాలు వెలువడుతున్న వేళ ఆదివారం ఆయన గవర్నర్ జనరల్‌తో భేటీ అయి పార్లమెంట్‌ను రద్దు చేయాలని కోరారు. అక్టోబర్ 20న ఎన్నికలు జరగాల్సి ఉంది. అధికార లిబరల్ పార్టీకి అనుకూల పవనాలు వీస్తుండటంతో కార్నీ ముందస్తు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.

రష్యా డ్రోన్ల దాడిలో తొమ్మిది మంది మృతి
కీవ్: ఓవైపు కాల్పుల విరమణ చర్చలకు సిద్ధమవుతూనే ఉక్రెయిన్‌పై రష్యా దాడులను కొనసాగిస్తోంది. తాజాగా ఆదివారం తెల్లవారుజామున జరిపిన డ్రోన్ల దాడిలో తొమ్మిది మంది మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఖార్కివ్, సుమి, చెర్నిహివ్, ఒడెసా, డొనెట్స్క్ ప్రాంతాలతోపాటు రాజధాని కీవ్‌పైనా ఐదు గంటలకు పైగా రష్యా దాడులు కొనసాగాయని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. గగనతల రక్షణ వ్యవస్థల నుంచి తప్పించుకునేందుకు తక్కువ ఎత్తులో ఎగిరిన రష్యా డ్రోన్లు నివాస భవనాలపై పడ్డాయి. కీవ్‌పై జరిపిన డ్రోన్ దాడిలో ఐదేళ్ల చిన్నారి సహా ముగ్గురు మృతి చెందారు. మరో 10 మంది గాయపడ్డారు. డ్రోన్ శిథిలాలు పడటంతో డ్నిప్రో జిల్లాలోని రెండు నివాస భవనాలకు మంటలు అంటుకున్నాయి. 9 అంతస్తుల భవనంపై అంతస్తులో మంటలు చెలరేగడంతో ఒక మహిళ మృతి చెందింది. పొదిల్ జిల్లాలో 25 అంతస్తుల భవనంలోని 20వ అంతస్తులో అగ్నిప్రమాదం సంభవించింది. హోలోసివ్స్కీలో గోదాము, కార్యాలయ భవనంలో మంటలు చెలరేగి ఒకరు మృతి చెందారు. డొనెట్స్క్ ప్రాంతంపై జరిపిన దాడుల్లో నలుగురు చనిపోయారు.

ట్విట్టర్ పిట్టకు రూ.30 లక్షలు!
సామాజిక మాధ్యమం ట్విట్టర్ లోగో బ్లూబర్డ్ గుర్తుంది కదా. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఆ సంస్థను కొనుగోలు చేశాక ఎక్స్‌గా పేరు మార్చినా ఇంకా అంతా ట్విట్టర్ అనే పిలుస్తారంటే దాని ప్రభావం అర్థం చేసుకోవచ్చు! ట్విట్టర్ కార్యాలయంపై 2012 నుంచి 2023 వరకూ సగర్వంగా వేలాడిన బ్లూ బర్డ్ లోగో తాజా వేలంలో రూ.30లక్షలకు అమ్ముడు పోయింది. 560 పౌండ్ల బరువున్న ఈ లోగోను ఓ అజ్ఞాత వ్యక్తి కొనుగోలు చేశాడు. మస్క్ 2022లో ట్విట్టర్‌ను టేకోవర్ చేయగానే శాన్ఫ్రాన్సిస్కో ప్రధాన కార్యాలయం నుంచి ట్విట్టర్ ఐకానిక్ బ్లూ బర్డ్‌ను తొలగించడం తెలిసిందే. ప్రధాన కార్యాలయాన్ని కూడా టెక్సాస్‌కు మార్చారు. ట్విట్టర్‌కు సంబంధించిన వస్తువులు, ఆఫీస్ ఫర్నిచర్‌తో పాటు లోగోను కూడా 2023 ఆగస్టులో మస్క్ వేలం వేశారు. అప్పుడు దాన్ని దక్కించుకున్న ఆర్ఆర్ సంస్థ తాజాగా తిరిగి వేలం వేసింది.

అనంత దూరంలోని... ఆ గెలాక్సీలో ఆక్సిజన్!
అనంతమైన విశ్వంలో మన భూమిపై తప్ప ఇంకెక్కడా ప్రాణవాయువు(ఆక్సిజన్) ఉండకపోవచ్చని శాస్త్రజు్ఞలు ఇప్పటిదాకా భావించేవారు. కానీ మనకు అత్యంత సుదూరంలో ఉన్న ఒక నక్షత్ర మండలం (గెలాక్సీ)లో ఆక్సిజన్ ఆనవాళ్లను గుర్తించారు. అంతేగాక భారీ లోహాల జాడను సైతం కనిపెట్టారు. ఈ గెలాక్సీ భూమి నుంచి ఏకంగా 1,340 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది! విశ్వం ఏర్పడిన తొలినాళ్లలోనే ఇది ఏర్పడి ఉండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. విశ్వం పుట్టుకకు కారణమైన బిగ్‌బ్యాంగ్ 1,380 కోట్ల ఏళ్ల క్రితం సంభవించిందన్న వాదనలు ఇప్పటికే ఉన్నాయి. ఈ నక్షత్ర మండలానికి జేడ్స్–జీఎస్–జెడ్14–0 అని నామకరణం చేశారు. నిజానికి దీన్ని 2024 జనవరిలోనే ప్రాథమికంగా గుర్తించారు. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ఈ గెలాక్సీ ఉనికిని వెలుగులోకి తెచ్చింది. కాకపోతే దానిపై ప్రాణవాయువు ఉన్నట్లు కనిపెట్టడం కీలక పరిణామమని సైంటిస్టులు చెబుతున్నారు. ఆ ఆక్సిజన్ ఏ రూపంలో, ఎంత పరిమాణంలో ఉందన్నది తేల్చడానికి పరిశోధనలు కొనసాగిస్తున్నారు. పరిమాణంలో అత్యంత భారీగా ఉన్న ఈ నక్షత్ర మండలం కాంతివంతమైనది కూడా. మన భూగోళమున్న గెలాక్సీకి సమీపంలో ఇప్పటిదాకా మరో 700 గెలాక్సీలను జేమ్స్ వెబ్ టెలిస్కోప్ గుర్తించింది. – సాక్షి, నేషనల్ డెస్క్
National

నోటీసిచ్చి.. 24 గంటల్లో కూల్చేస్తారా?
న్యూఢిల్లీ: ఇంటిని కూల్చేస్తామంటూ నోటీసు ఇచ్చి 24 గంటల్లోపే బుల్డోజర్తో ఇంటిని కూల్చేస్తున్న ఘటనలపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు (Supreme Court) మరోసారి మండిపడింది. నిబంధనలను పాటిస్తూనే ఇళ్ల కూలి్చవేత ప్రక్రియను యోగి ఆదిత్యనాథ్ సర్కార్ కొనసాగిస్తోందని అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి చేసిన వాదనలను జస్టిస్ అభయ్ ఎస్.ఓకా, జస్టిస్ ఉజ్జల్ భూయాల సుప్రీంకోర్టు ధర్మాసనం తప్పుబట్టింది. 2023లో పోలీస్ ఎన్కౌంటర్లో చనిపోయిన గ్యాంగ్‌స్టర్ పొలిటీషియన్ అతీఖ్ అహ్మద్‌కు చెందినదిగా భావిస్తున్న ప్రయాగ్‌రాజ్ నగరంలోని భవనాలను అధికారులు కూల్చేశారు(Prayagraj Demolitions). దీనిపై జులి్ఫకర్ హైదర్ అనే న్యాయవాది, ప్రొఫెసర్ అలీ అహ్మద్, ఇద్దరు వితంతువులు, మరో వ్యక్తి అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. గ్యాంగ్స్టర్విగా భావించి మా ఇళ్లను కూల్చేశారని బాధితులు కేసు వేశారు. అయితే ఈ కేసును అలహాబాద్ హైకోర్టు కొట్టేయడంతో వాళ్లంతా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ‘‘ఇళ్లను నిర్దయగా కూల్చేయడం చూస్తుంటే మాకే షాకింగ్‌గా ఉంది. కూలి్చవేతకు అనుసరించిన విధానం సైతం షాకింగ్‌కు గురిచేస్తోంది. మార్చి ఆరో తేదీ రాత్రి నోటీసులు ఇచ్చి మరుసటి రోజే కూల్చేస్తారా?. ఇలాంటి పద్ధతిని న్యాయస్థానాలు ఏమాత్రం అంగీకరించవు. ఒక్క కేసులో వీటిని పట్టించుకోకుండా ఉన్నామంటే ఇక ఇదే కూలి్చవేతల ధోరణి కొనసాగుతుంది. నోటీసులు అందుకున్నాక బాధితులు వాటిపై అప్పీల్ చేసుకునే అవకాశం కూడా అధికారులు ఇవ్వలేదు. 24 గంటల్లోపు భవనాలను కూల్చేశారు. ఈ కేసులో తిరిగి ఇంటిని నిర్మించుకుంటామని బాధితులు కోరితే అందుకు మేం అనుమతిస్తాం. అయితే కేసు తుదితీర్పు వాళ్లకు వ్యతిరేకంగా వస్తే బాధితులే ఆ కొత్త ఇళ్లను నేలమట్టం చేయాల్సి ఉంటుంది’’అని న్యాయస్థానం వ్యాఖ్యానించడం గమనార్హం. దీనిపై ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్(Attorney General) వాదించారు. ‘‘లీజు గడువు దాటాక అక్రమంగా ఆ నివాసస్థలాల్లో పిటిషనర్లు ఉంటున్నారు. వాస్తవానికి 2020 డిసెంబర్లో తొలిసారి, 2021 జనవరి, మార్చి నెల ఆరో తేదీన నోటీసులు ఇచ్చారు. తర్వాతే కూల్చారు’’అని వాదించారు. దీనిపై జడ్జి అభ్యంతరం వ్యక్తంచేశారు. ‘‘గతంలో సాధారణ రీతిలో నోటీసులు ఇచ్చారు. చట్టప్రకారం రిజిస్టర్ పోస్ట్‌లో పంపాలి. అలాకాకుండా మామూలుగా పంపేసి, చివరి నోటీసు మాత్రం రిజిస్టర్ పోస్ట్ లో పంపించి వెంటనే కూల్చేస్తారా?’’అని ధర్మాసనం నిలదీసింది. మళ్లీ ఇంటి నిర్మాణాల విషయంలో అఫిడవిట్ సమర్పించేందుకు పిటిషనర్లను అనుమతిస్తూ కేసు విచారణను న్యాయస్థానం వాయిదావేసింది. ‘క్రికెట్’ నినాదాలతో కూల్చేశారు గత నెల ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లో ఇండియా, పాకిస్తాన్ జట్ల మధ్య క్రికెట్ ఆట సందర్భంగా భారతవ్యతిరేక నినాదాలు చేశారంటూ ఎఫ్ఐఆర్ నమోదుచేసి తమ ఇల్లు కూల్చారంటూ కితాబుల్లా హమీదుల్లా ఖాన్ వేసిన పిటిషన్‌పై స్పందన తెలపాలని మహారాష్ట్ర సర్కార్‌ను జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ల సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం ఆదేశించింది. ఆస్తుల కూలి్చవేతకు సంబంధించి గతేడాది నవంబర్‌లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ను రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘించిందని, ఈ అంశంలో సర్కార్‌పై, మాలాŠవ్న్ మున్సిపల్ కౌన్సిల్ అడ్మినిస్ట్రేటర్లపై ఉల్లంఘన కేసు నమోదుచేయాలని బాధితుడు సుప్రీంకోర్టును కోరాడు. అయితే ఎఫ్ఐఆర్ నమోదుచేసి సింధుదుర్గ్ జిల్లాలో పాతసామాను దుకాణం, ఇల్లు రెండూ అక్రమ నిర్మాణాలని పేర్కొంటూ అధికారులు ఫిబ్ర వరి 24న వాటిని కూల్చేశారు. భారతవ్యతిరేక నినాదాలు చేశాడంటూ తొలుత పిటిషనర్‌తోపాటు అతని 14ఏళ్ల కుమారుడిని అరెస్ట్‌చేసి తర్వాత కుమారుడిని వదిలేశారు. తర్వాత భార్యాభర్తలను అరెస్ట్‌చేసి జైలుకు పంపారు. ఈ సమయంలోనే ఇల్లు, దుకాణం కూల్చేశారు.

ఆర్జీ కర్ ఘటనకు ముందే...
కోల్‌కతా: దేశాన్ని కుదిపేసిన ఆర్జీ కర్ ఆస్పత్రి హత్యాచార బాధితురాలైన ట్రెయినీ వైద్యురాలు ఆ ఘటనకు ముందు నుంచే తీవ్ర మానసిక ఒత్తిడితో బాధపడినట్టు మోహిత్ రణ్‌దీప్ అనే సైకియాట్రిస్టు తెలిపారు. ఆస్పత్రిలో జరిగే అవకతవకలతో పాటు సుదీర్ఘ పనివేళలు, షిఫ్టుల కేటాయింపులో వివక్ష వంటివి ఆమెను తీవ్ర ఇబ్బందులకు, ఒత్తిళ్లకు లోను చేసినట్టు వివరించారు. ఆయన సోమవారం ఒక బెంగాలీ టీవీ చానల్‌తో మాట్లాడారు. ‘‘హత్యాచారోదంతానికి నెల ముందు ఆమె నన్ను సంప్రదించింది. ఒక్కోసారి వరుసగా 36 గంటలపాటు డ్యూటీ చేయాల్సి వచ్చేదని వాపోయింది. అందరికీ అలాగే వేస్తారా అని అడిగితే లేదని చెప్పింది. వీటికితోడు ఆస్పత్రికి అవసరమయ్యే వైద్య పరికరాలు, ఔషధాల కొనుగోలులో భారీ అవకతవకలు ఆమెను ఎంతగానో కలతకు గురిచేశాయి. తనకు పలు సలహాలిచ్చా. ఆమె మరోసారి కౌన్సెలింగ్‌కు రావాల్సి ఉండగా ఆలోపే ఘోరానికి బలైపోయింది’’అంటూ ఆవేదన వెలిబుచ్చారు. ఇందుకు సంబంధించి సీబీఐ ముందు వాంగ్మూలమిచ్చేందుకు కూడా సిద్ధమన్నారు. గత ఆగస్టు 9న ఆస్పత్రి సెమినార్ హాల్లోనే ఆమె అత్యాచారానికి, హత్యకు గురవడం తెలిసిందే. ఈ ఘటనలో సంజయ్ రాయ్ అనే పౌర వలెంటీర్‌ను దోషిగా కోర్టు నిర్ధారిస్తూ అతనికి జీవితఖైదు విధించింది. ఈ ఘోరం వెనక పలువురు పెద్దల హస్తముందని బాధితురాలి తల్లిదండ్రులు, తోటి వైద్యులు ఆరోపిస్తున్నారు. ఆస్పత్రిలో అవకతవకల్ని ప్రశ్నించినందుకే ఆమెపై కక్ష కట్టినట్టు చెబుతున్నారు.

భార్యకు భర్త యజమాని కాడు!
ప్రయాగ్‌రాజ్: భార్య తనతో ఉన్న ఇంటిమేట్ వీడియోను ఫేస్బుక్లో అప్లోడ్ చేసిన వ్యక్తిపై అలహాబాద్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పెళ్లి చేసుకోగానే భార్యకు భర్త యజమాని అయిపోడని వ్యాఖ్యానించింది. అతనిపై క్రిమినల్ కేసు కొట్టేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను తోసిపుచ్చింది. ‘ఇంటిమేటెడ్ వీడియోను ఫేస్బుక్లో అప్లోడ్ చేసి దరఖాస్తుదారుడు (భర్త) వివాహ బంధానికున్న పవిత్రతను ఉల్లంఘించారు. భార్య తనపై ఉంచిన నమ్మకాన్ని పోగొట్టారు. భార్య గౌరవాన్ని కాపాడలేకపోయారు. ఇలాంటి కంటెంట్‌ను షేర్ చేయడం భార్యాభర్తల మధ్య బంధాన్ని నిర్వచించే గోప్యతను ఉల్లంఘించడమే అవుతుంది. ఈ నమ్మక ద్రోహం వైవాహిక బంధం పునాదినే దెబ్బతీస్తుంది’అని విచారణ సందర్భంగా జస్టిస్ వినోద్ దివాకర్ వ్యాఖ్యానించారు. భార్య అంటే భర్తకు కొనసాగింపు కాదని, తనకంటూ సొంత హక్కులు, కోరికలు, ఉన్న వ్యక్తని ఆయన పేర్కొన్నారు. తామిద్దరూ సాన్నిహిత్యంతో ఉన్న వీడియోలను తన భర్త మొబైల్లో చిత్రీకరించి, తనకు తెలియకుండా ఫేస్బుక్లో అప్లోడ్ చేశాడని, తరువాత బంధువులు, గ్రామస్తులతో పంచుకున్నాడంటూ మీర్జాపూర్ జిల్లాలో ప్రద్యుమ్న్ యాదవ్ అనే వ్యక్తిపై అతని భార్య కేసు నమోదు చేసింది. తాను ఆమె భర్త కాబట్టి అది నేరం కాదని, తనపై మోపిన క్రిమినల్ కేసులను కొట్టేయాలని ప్రద్యుమ్న్ కోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. భార్యాభర్తల మధ్య రాజీ కుదిరే అవకాశం ఉంది కాబట్టి.. కేసును కొట్టేయాలంటూ ఆయన తరపు న్యాయవాది సైతం వాదించారు. ఫిర్యాదుదారు చట్టబద్ధంగా వివాహం చేసుకున్న భార్య అయినప్పటికీ, ఆమెను అశ్లీల వీడియో తీసి బంధువులకు, గ్రామస్తులకు పంపే హక్కు భర్తకు లేదని కోర్టు తేల్చి చెప్పింది.

డంపర్ ట్రక్కు బీభత్సం
డెహ్రాడూన్: డంపర్ ట్రక్కు ఢీకొట్టడంతో ఓ కారు రూపు ఇలా మారిపోయింది. అందులోని ఇద్దరు వ్యక్తుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్–డెహ్రాడూన్ హైవేపైనున్న లచ్చివాలా టోల్ ప్లాజా వద్ద సోమవారం ఉదయం 7.3 0గంటల సమయంలో ఘటన చోటుచేసుకుంది. అదుపుతప్పి వేగంగా దూసుకువచ్చిన ఈ డంపర్ ట్రక్కు ప్లాజా వద్ద వరుసగా ఆగి ఉన్న మూడు కార్లను వెనుక నుంచి ఢీకొట్టింది. ఒక కారు ఇలా ఇనుప స్తంభాన్ని గుద్దుకుని ఇలా నుజ్జవగా మరో రెండు కార్లలోని వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. నుజ్జయిన కారులో ఇరుక్కుపోయిన వారిని బయటకు తీసేందుకు పోలీసులు ఎంతో శ్రమించాల్సి వచ్చింది. తెహ్రిలోని చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు ఉద్యోగులైన వీరిద్దరూ విధులకు వెళ్తూ ఇలా ప్రమాదం బారినపడ్డారు. అతివేగం, ట్రక్కు బ్రేకులు ఫెయిలవడమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు.
NRI

ఫ్లోరిడాలో అత్యున్నత స్థాయి ‘హెర్ హెల్త్ ఆంకాలజీ కాంగ్రెస్ 2025’
అమెరికాలోని ఫ్లోరిడాలోని ఓర్లాండో నగరంలో మెడికల్ కాన్ఫరెన్స్ ఘనంగా జరిగింది. 70-80 మంది ఆంకాలజిస్టులు, ప్రైమరి కేర్ డాక్టర్లు హాజరైన ఈ కార్యక్రమం, ఇన్నోవేటివ్ ఎడ్యుకేషన్‌కి ఒక వేదికగా పనిచేసిందని నిర్వాహకులు తెలిపారు. ఈ సదస్సు ప్రముఖ కీనోట్ వక్త, డాక్టర్ బార్బరా మెకనీ, మాజీ AMA ఉపాధ్యక్షురాలు ఆంకాలజి పరిశోధన, పక్షవాతం, పేషంట్ కేర్ మొదలైన అంశాల ప్రాముఖ్యాన్ని వివరించారు.‘హెర్ హెల్త్ ఆంకాలజీ కాంగ్రెస్ 2025 తన విజన్‌ను నిజం చేసింది. మహిళల కోసం క్యాన్సర్ సంరక్షణను ముందుకు తీసుకెళ్లడంలో వైద్య సమాజాన్ని శక్తివంతం చేయడానికి, అవగాహన నిమిత్తందీన్ని రూపొదిచామనీ, ఈమెడ్ ఈవెంట్స్, ఈమెడ్ ఎడ్ సీఈఓగా, శంకర నేత్రాలయ, యూఎస్ఏ సీఎమ్ఈ చైర్‌పర్సన్‌గా(USA CME) ఒక మహిళగా, మహిళా ఆరోగ్య సంరక్షణలో మార్పు తీసుకురావడానికి ఇదొక సదవకాశమని’ డాక్టర్ ప్రియా కొర్రపాటి సంతోషం వ్యక్తం చేశారు. మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి!చైర్పర్సన్ డాక్టర్ సతీష్ కత్తుల, ఆంకాలజిస్ట్, హెమటాలజిస్ట్, AAPI అధ్యక్షుడు, మహిళలలో సాధారణ క్యాన్సర్లను పరిష్కరించడం, నిరంతర అవగాహన ప్రాముఖ్యతను హైలైట్ చేశారు. కాంగ్రెస్‌లో 10 మంది అత్యున్నత నైపుణ్యం కలిగిన వక్తలు ఉన్నారని, ప్రతి ఒక్కరూ ఆంకాలజీలో పురోగతి, సమగ్ర రోగి సంరక్షణపై దృష్టిపెడుతున్నారని డా. ప్రియా అన్నారు. ఈ కాంగ్రెస్‌ను కేవలం ఒక కార్యక్రమం కాకుండా, కంటిన్యూస్ లర్నింగ్ చేయాలనే తమ లక్ష్యాన్ని బలోపేతం చేశారన్నారు. AAPI, CAPI (టంపా నుండి స్థానిక అధ్యాయం) eMed Ed తో కలిసి చేస్తున్న సహకార ప్రయత్నాలను డా. సతీష్ అభినందించారు. ప్రత్యేక ఆకర్షణలుNFL ఆటగాడు షెప్పర్డ్ స్టెర్లింగ్ ఈ సదస్సు హాజరు కావడం విశేషం. ఆంకాలజీ వంటి క్రిటికల్ కేర్ వైద్యులలో చాలా ఉద్యోగపరైమన ఒత్తిడి అధికంగా ఉంటుంది దాని కోసం ప్రత్యేకంగా ఆంకాలజీ బర్నవుట్ సెషన్ నిర్వహించటం మరో విశేషం. డాక్టర్ వర్షా రాథోడ్, ఇంటిగ్రేటివ్ మెడిసిన్ స్పెషలిస్ట్, ఓర్లాండో, ఫ్లోరిడా ఈ సెషన్ నిర్వహించారు. డాక్టర్ శైలజ ముసునూరి, ఇంటిగ్రేటెడ్ మెడిసిన్, చీఫ్ ఆఫ్ సైకియాట్రి, వుడ్ సర్వీసెస్, పెన్సిల్వేనియా వారు నిర్వహించిన సైకాలజికల్ ఆంకాలజీ సెషన్ ఆకట్టుకుంది. క్యాన్సర్ కేర్ లో మెడికల్ ట్రీట్మెంట్ మాత్రమే కాకుండా, రోగుల మానసిక, భావోద్వేగ స్థితిని కూడా సమర్థంగా నిర్వహించాలని పేర్కొన్నారు.వాలంటీర్ల దృక్పదంస్పీకర్లకి మించి, ఈ కాంగ్రెస్ స్వచ్ఛంద సేవకులకు కూడా గొప్ప అనుభవాన్ని ఇచ్చిందనీ, సెషన్లు, ఆసక్తిక్రమైన చర్చలు జరిగాయి. డాక్టర్లు అనేక ప్రశ్నలను చాలా లోతైన వివరణ, పరిస్కారాలు ఇచ్చారని, క్వెషన్ అండ్ ఆన్సర్ సెషన్ చాలా ఆసక్తిగా, ఉపయోగంగా ఉందని ఆమె తెలిపారు.ఆడియన్స్ అభిప్రాయాలుమహిళల క్యాన్సర్లపై దృష్టి సారించే ఆంకాలజీ సమ్మేళనాలు అరుదుగా ఉన్నాయని, ఈ కార్యక్రమం ఆంకాలజిస్ట్‌లు, ప్రమరి కేర్ డక్టర్లు ఇద్దరికీ ఒక అమూల్యమైన అవకాశం అని అన్నారు. రోగులను ఎప్పుడు రిఫర్ చేయాలి, కొత్త చికిత్సా విధానాల ఏమున్నాయి వంటి అవసరమైన అంశాలను ఎలా నిర్వహించాలనేది తమ అభిప్రాయాల ద్వారా వెల్లడించారు.హెర్ హెల్త్ ఆంకాలజీ కాంగ్రెస్ భవిష్యత్తు హెర్ హెల్త్ ఆంకాలజీ కాంగ్రెస్ 2026 కాంగ్రెస్ ఓహియోలో జరుగుతుందని ప్రకటించారు. ఈ కార్యక్రం విజయానికి సహకరించిన అందరికీ ప్రియా కొర్రపాటి ధన్యవాదాలు తెలిపారు. అలాగే మహిళల కోసం ఆంకాలజీ సంరక్షణను ముందుకు తీసుకెళ్లే మిషన్‌లో ముందుకు సాగడానికి ఇది స్ఫూర్తినిస్తుందని ఇప్పుడున్నఆంకాలజీని ముందుకు ముందుకు తీసుకెళ్ళటానికి కలిసి పనిచేద్దామనిఆమె పిలుపునిచ్చారు.

డాక్టర్ కావాలనుకుంది : భారతీయ విద్యార్థిని విషాదాంతం?!
డొమినికన్ రిపబ్లిక్లో కనిపించకుండాపోయిన భారతీయ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయిందా అంటే అవుననే అనుమానాలు బాగా బలపడుతున్నాయి. గత వారం విహారయాత్రకు వెళ్లి కనిపించకుండా పోయిన పిట్స్బర్గ్ విశ్వవిద్యాలయ విద్యార్థిని నీటిలో మునిగి మరణించి ఉంటుందని భావిస్తున్నట్టు అధికారులు ఆదివారం ధృవీకరించారని ఏబీసీ న్యూస్ తెలిపింది. ప్రమాదవశాత్తూ నీటిమునిగి ఉంటుందని పోలీసులు వెల్లడించినట్టు తెలిపింది. మార్చి 6వ తేదీ,తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఆరుగురు స్నేహితులతో రిసార్ట్‌కు వెళ్లినట్లు సమాచారం. ప్రస్తుతం పిట్స్బర్గ్ యూనివర్శిటీలో గ్రాడ్యుయేషన్ చదువుతున్న సుదీక్ష కోణంకి ఈ నెల 6న ప్రముఖ పర్యాటక పట్టణమైన వ్యూంటా కానా ప్రాంతానికి వెళ్లింది. అక్కడ బీచ్‌లో ఒక స్నేహితుడితో కలిసి ఈతకోసం వెళ్లిన ఆమె ఎంతకీ తిరిగి రాకపోవడంతో మిగిలిన స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై సోషల్ మీడియాలో ఆమె ఆచూకీ కోసం విస్తృతంగా ప్రచారం చేశారు. దీంతో ఆమె బీచ్‌లో కొట్టుకుపోయి ఉంటుందని పోలీసులు భావించి సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టారు. డ్రోన్లు, హెలికాఫ్టర్లతో గత నాలుగు రోజులుగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. భారతదేశానికి చెందిన సుదీక్ష తల్లిదండ్రులు రెండు దశాబ్దాల క్రితం అమెరికాకు వలస వెళ్లి అక్కడ శాశ్వత నివాస హోదా పొందారు. 20 ఏళ్ల నుంచి వర్జీనియాలో నివాసం ఉంటున్న సుదీక్ష కోణంకి పిట్స్బర్గ్ యూనివర్శిటీలోచదువుతోంది. తన కుమార్తె పిట్స్బర్గ్ విశ్వవిద్యాలయంలో ప్రీ-మెడికల్ స్టడీకి ముందు వెకేషన్కోసం పుంటా కానాకు వెళ్లిందని, స్నేహితులతో కలిసి రిసార్ట్‌లో పార్టీకి వెడుతున్నట్టు చెప్పిందని, అవే తనతో మాట్లాడిన చివరి మాటలని సుదీక్ష తండ్రి సుబ్బరాయుడు కోణంకి కన్నీటి పర్యంతమైనారు. తన బిడ్డ మెరిట్ స్టూడెంట్ అనీ, డాక్టర్ కావాలని కలలు కనేదని గుర్తు చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో స్నేహితులను పోలీసులు ప్రశ్నించారని, ఎవరిపైనా ఎలాంటి అభియోగాలు నమోదు కాలేదని అధికారులు తెలిపారు.

న్యూయార్లో ఘనంగా తెలుగువారి సంబరాలు.
అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్ లో తెలుగువారి సంబరాలు అంబరాన్ని అంటాయి. ఒకే రోజు రెండు ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నారు. మహిళా దినోత్సవంతో పాటు మహా శివరాత్రి వేడుకలను కూడా ఓకేసారి న్యూయార్క్ లో స్థిరపడిన తెలుగువారి చేసుకున్నారు. న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (నైటా) ఆధ్వర్యంలో ఫ్లషింగ్ గణేష్ టెంపుల్ ఆడిటోరియంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి.వందలాది మంది తెలంగాణ, తెలుగు వాసులు తమ కుటుంబాలతో సహా చేరి ఉత్సవాల్లో పాల్గొని ఆడి పాడారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ మాట్లాడుతూ అమెరికాతో పాటు న్యూ యార్క్ మహానగరం అభివృద్ది, సంస్కృతిలో తెలుగువారు అంతర్భాగం అయ్యారని కొనియాడారు.తెలంగాణ ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్కమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీతక్క, తదితర ప్రముఖులు ప్రత్యేక సందేశాల ద్వారా నైటా కార్యక్రమాలను, ఆర్గనైజింగ్ కమిటీ కృషిని ప్రశంసిస్తూ ప్రత్యేక సందేశాలను పంపారు. వీటి సంకలనంతో పాటు నైటా సభ్యులు, కార్యక్రమాలతో కూడిన సమాహారంగా నైటా వార్షికోత్సవ సావనీర్ ను ఈ సందర్భంగా విడుదల చేశారు.ఈ ఫెస్టివల్ ఈవెంట్ లో తెలంగాణ సూపర్ రైటర్, సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ కాసర్ల శ్యామ్ తో పాటు, యూకే నుంచి సింగర్ స్వాతి రెడ్డి, డాన్సింగ్ అప్సరాస్ గా పేరొందిన టీ అండ్ టీ సిస్టర్స్, ఇండియన్ ఫేమస్ ఫ్యూజన్ మ్యూజిక్ గ్రూప్ పరంపరా లైవ్ ఫెర్మామెన్స్ తో అదరగొట్టారు. కొన్ని గంటల పాటు జరిగిన కార్యక్రమం ఆద్యంతం అందరినీ కట్టిపడేసింది.తెలుగు యువత గుండెల్లో చిరకాలం నిలిచిపోయే పాటలను రచించటంతో పాటు, పాడిన యువ గాయకుడు కాసర్ల శ్యామ్ కొన్ని హిట్ సాంగ్స్ తో అందరినీ ఉర్రూతలూగించారు. అమెరికాలో తెలుగువారి బలగాన్ని, బలాన్ని తన పాటల ద్వారా శ్యామ్ చాటి చెప్పారు. ఇక కొంత ఆలస్యంగానైనా న్యూయార్క్ తెలుగువారు శివరాత్రి వేడుకలు జరుపుకున్నా ఆధ్యాత్మిక గీతాలు, చిన్నారులు భక్తి పాటలతో ఆడిటోరియటం మారు మోగింది.న్యూయార్క్ మహానగరంలో నిత్యం వారి వారి వృత్తుల్లో బిజీగా ఉండే మన తెలుగు వారు అన్నింటినీ పక్కన పెట్టి అటు శివ భక్తి, ఇటు మహిళా దినోత్సవాన్ని ఒకే సారి వేడుకగా జరుపుకున్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నైటా ఆర్గనైజింగ్ టీమ్ తో పాటు తెరవెనుక సహకరించిన ప్రతీ ఒక్కరికీ పేరు పేరునా అధ్యక్షురాలు వాణీ రెడ్డి ఏనుగు కృతజ్జతలు తెలిపారు.నైటా కార్యక్రమాలకు వెన్నుముకగా నిలుస్తూ ప్రోత్సాహం అందిస్తున్న డాక్టర్ పైళ్ల మల్లారెడ్డిని నైటా టీమ్ ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో వందలాది మంది తెలుగు కుటుంబాలతో పాటు, న్యూయార్క్ కాంగ్రెస్ విమెన్ గ్రేస్ మెంగ్, ఇండియన్ కాన్సులేట్ జనరల్ నుంచి బిజేందర్ కుమార్ తదితరులు హాజరయ్యారు.

లండన్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
బిందువు బిందువు కలిస్తేనే సింధువు అనే విధంగా యూకే లో నివసిస్తున్న తెలుగు మహిళలు అందరూ “తెలుగు లేడీస్ యుకె” అనే ఫేస్బుక్ గ్రూప్ ద్వారా కలుసుకుని అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాలు జరుపుకున్నారు సహాయం కోరే వారికి మరియు సహాయం అందించే వారికి వారధిగా నిలిచే తెలుగు లేడీస్ ఇన్ యుకె గ్రూపును శ్రీదేవి మీనా వల్లి 14 ఏళ్ల క్రితం స్థాపించారు. ఈ గ్రూపులో ప్రస్తుతం ఐదు వేలకు పైగా తెలుగు మహిళలు ఉన్నారు.యూకే కి వచ్చినా తెలుగు ఆడపడుచులను ఆదరించి వారికి తగిన సూచనలు సలహాలు ఇస్తూ విద్యా వైద్య ఉద్యోగ విషయాల్లో సహాయం అందించడమే గ్రూప్ ఆశయమని శ్రీదేవి గారు తెలియజెప్పారు. ఈ సంవత్సరం యూకేలోని పలు ప్రాంతాల నుండి 300కు పైగా తెలుగు మహిళలు పాల్గొని ఆటపాటలతో ,లైవ్ తెలుగు బ్యాండ్ తో, పసందైన తెలుగు భోజనంతో పాటు,చారిటీ రాఫెల్ నిర్వహించి అవసరంలో ఉన్న మహిళలకు ఆసరాగా నిలిచారు.మస్తీ ఏ కాదు మానవత్వం లో కూడా ముందు ఉన్నాము అని నిరూపించారు.ఈవెంట్ లో డాక్టర్ వాణి శివ కుమార్ గారు మహిళలకు సెల్ఫ్ కేర్ గురించి ఎన్నో మంచి సూచనలు ఇచ్చారు. ఈవెంట్ కి వచ్చిన వాళ్లందరికీ మనసు నిండా సంతోషంతో పాటు మన తెలుగుతనాన్ని చాటిచెప్పేలా గాజులు,పూతరేకులు, కాజాలు వంటి పసందైన రుచులతో తాంబూలాలు పంచిపెట్టారు. ఈ ఈవెంట్లో శ్రీదేవి మీనావల్లితో పాటు సువర్చల మాదిరెడ్డి ,స్వాతి డోలా,జ్యోతి సిరపు,స్వరూప పంతంగి ,శిరీష టాటా ,దీప్తి నాగేంద్ర , లక్ష్మి చిరుమామిళ్ల , సవిత గుంటుపల్లి, చరణి తదితరులు పాల్గొన్నారు.
క్రైమ్

Hyderabad: ఇంజినీరింగ్ విద్యార్థుల దుర్మరణం
హైదరాబాద్: అతి వేగం ఇద్దరు విద్యార్థుల నిండు ప్రాణాలను తీసుకుంది. ఈ సంఘటన ఉస్మానియా యూనివర్సిటీ పోలీసు స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం దుమ్ముగూడెం ప్రగలపల్లి గ్రామానికి చెందిన బంటు రాజ్‌కుమార్(20), పెద్దపల్లి జిల్లా, గోదావరిఖనికి చెందిన అటికెటి సిద్దార్ధ(21) ఓయూ ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజినీరింగ్ చదువుతున్నారు. ఆదివారం రాత్రి వీరు ఓయూ హాస్టల్ నుంచి బైక్‌పై విద్యానగర్ వెళుతుండగా అడిక్‌మెట్ ఫ్లైఓవర్‌పై వారు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి కిందపడింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరూ అక్కడిక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సోమవారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

గృహిణికి అండగా ఉన్నందుకు...అంతమొందించాడు
హైదరాబాద్: లైంగిక వేధింపులకు గురవుతున్న ఓ మహిళకు అండగా ఉన్న లాయర్‌ను కక్షగట్టి దారుణంగా హత్య చేశాడు. చంపాపేటలో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు, మృతుడి బంధువులు తెలి్పన వివరాల ప్రకారం..మహేశ్వరం మండల కేంద్రానికి చెందిన సీనియర్ న్యాయవాది ఎర్రబాబు ఇజ్రాయిల్ (56) నగరంలోని చంపాపేట డివిజన్ న్యూమారుతీనగర్ కాలనీలో నివసిస్తున్నాడు. తన ఇంటి సమీపంలోనే ఓ అపార్ట్మెంట్లో ఇటీవల ఫ్లాట్‌ను కొనుగోలు చేసి..ఓ గృహిణి కుటుంబ సభ్యులకు అద్దెకు ఇచ్చాడు. అదే కాలనీ సమీపంలోని సుల్తానా అల్వా కాలనీ శ్మశాన వాటిక కాపలాదారుడుగా పని చేస్తున్న గులాం దస్తగిరి ఖాళీ సమయంలో ప్రైవేట్ ఎలక్ట్రీషియన్‌గా కూడా పనిచేస్తున్నాడు.ఇజ్రాయిల్ కొనుగోలు చేసిన ఫ్లాట్‌లో దస్తగిరి విద్యుత్ మరమ్మతు పనులకు వెళ్తుండే వాడు. ఈ క్రమంలోనే ఫ్లాట్‌లో అద్దెకు ఉంటున్న గృహిణితో పరిచయం ఏర్పడింది. దీన్ని అలుసుగా తీసుకున్న దస్తగిరి తనను ప్రేమించాలని, అండగా ఉంటానని ఆమెను వేధించసాగాడు. వేధింపులు భరించలేని ఆ గృహిణి ఫ్లాట్ యజమాని ఇజ్రాయిల్‌కు ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన ఆయన దస్తగిరిని మందలించాడు. పోలీసులకు ఫిర్యాదు చేయించి.. దస్తగిరి వేధింపులు ఎక్కువ అవడంతో 25 రోజుల క్రితం ఇజ్రాయిల్ ఐఎస్‌సదన్ పోలీసులకు గృహిణితో ఫిర్యాదు చేయించాడు. ఆమెకు దస్తగిరి నుంచి ప్రాణహాని ఉందని హెచ్చరించాడు. ఆమెను బంధువుల ఇంటికి పంపించి వేశాడు. ఈ క్రమంలో పోలీసులు దస్తగిరిని స్టేషన్‌కు పిలిపించి..నామమాత్రంగా మందలించి, కౌన్సిలింగ్ చేసి పంపించేశారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన దస్తగిరి..ఇజ్రాయిల్‌పై కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా అతన్ని అంతం చేయాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. గత మూడు రోజులుగా ఇజ్రాయిల్ ఇంటి ముందు రెక్కీ నిర్వహించిన దస్తగిరి సోమవారం ఉదయం 9 గంటలకు ఇజ్రాయిల్ తన స్కూటీపై ఒంటరిగా రావటాన్ని పసిగట్టి..ఒక్కసారిగా తన వెంట తెచ్చుకున్న కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. అనంతరం పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు.విషయం తెలసుకున్న స్థానికులు రక్తపు మడుగులో కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఇజ్రాయిల్‌ను సమీపంలోని డీఆర్డీఓ అపోలో ఆసుపత్రిలో చేరి్పంచారు. పరీక్షించిన వైద్యులు ఇజ్రాయిల్ అప్పటికే మృతిచెందాడని నిర్ధారించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించి కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. కాగా పోలీసులు గృహిణి ఫిర్యాదును సీరియస్‌గా తీసుకోలేదని, తీసుకుని ఉంటే ఈ హత్య జరిగేది కాదని స్థానికులు విమర్శిస్తున్నారు. కాగా ఇజ్రాయిల్ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రాష్ట్ర మాజీ డైరెక్టర్‌గా పనిచేశాడు. అలాగే కాంగ్రెస్ పార్టీ తరపున జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేశారు.

తిరుపతమ్మని ఎవరు చంపి ఉండొచ్చు?
తాడేపల్లి రూరల్: గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని కొలనుకొండలో సాయిబాబా గుడి వెనుక కృష్ణాకెనాల్‌కు వచ్చే జంక్షన్లో జనవరి 31న కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మహిళ మృతదేహాన్ని ప్రాథమిక దర్యాప్తు చేయకుండా రాత్రికిరాత్రే పోలీసులు మార్చురీకి తరలించారు. 45 రోజుల క్రితం జరిగిన ఈ ఘటనపై పోలీసులు ఇప్పటి వరకు ఎటువంటి ఆధారాలు సేకరించలేదు. తాజాగా ఆదివారం రాత్రి కొలనుకొండ జాతీయ రహదారి పక్కనే జరిగిన లక్ష్మీతిరుపతమ్మ హత్య కేసులోనూ పోలీసులు ఇలాగే వ్యవహరించారు. రాత్రి 9 గంటలకు వచ్చిన పోలీసులు 11 గంటలకల్లా మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. హత్య జరిగిన వెంటనే ఘటనా స్థలం వద్దకు డాగ్ స్క్వాడ్‌ను తీసుకు రావడంలో పోలీసులు విఫలమయ్యారు. తెల్లవారుజామున ఎప్పుడో నాలుగు గంటలకు డాగ్‌స్కా్వడ్ వచ్చింది. అప్పటికే ఘటనా స్దలం వద్ద ఉన్న సిమెంటుతో కూడిన చెప్పులు, కండోమ్స్, హ్యాండ్‌బ్యాగ్, అమెరికన్ క్లబ్ సిగరెట్ పెట్టెలను తీసివేయడంతో డాగ్ స్క్వాడ్ వచ్చినా ఉపయోగం లేకుండా పోయింది. చివరకు ఎస్పీ సతీష్‌కుమార్ వచ్చేంత వరకు కూడా మృతదేహాన్ని ఉంచకపోవడం పట్ల ఆయన అసహనం వ్యక్తం చేసినట్లు పోలీసువర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా డీజీపీ కార్యాలయానికి సమీపంలో వీవీఐపీలు నిత్యం తిరిగే ప్రాంతంలో మహిళ అత్యంత దారుణంగా హత్యకు గురైనా పోలీసులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏమిటనే వాదన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఎవరు చంపి ఉండొచ్చు? జెస్సీ, నజీరాతోపాటు లక్ష్మీతిరుపతమ్మ ఆదివారం రాత్రి కూడా కొలనుకొండ జాతీయ రహదారి వద్దకు వచ్చింది. జెస్సీ విటులను పిలిచి లక్ష్మీతిరుపతమ్మతో పంపేది. ఆదివారం రాత్రి కూడా తొలుత ఇద్దరు విటులు వెళ్లారు. అనంతరం చేతిలో ఒక సంచి పట్టుకుని హిందీలో మాట్లాడే పొట్టిగా నల్లగా ఉన్న వ్యక్తి లక్ష్మీ తిరుపతమ్మ వద్దకు వెళ్లాడు. అతను తిరిగి వచ్చిన తరువాత ముళ్ల పొదలలో నుంచి తిరుపతమ్మ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన జెస్సి, నజీరా లోపలకు వెళ్లి చూశారు. రక్తపు మడుగులో పడి వున్న తిరుపతమ్మ కనిపించింది. దీంతో భయపడిన వారిద్దరూ పెద్దగా కేకలు వేశారు. 108కు ఫోన్ చేశారు. 108 సిబ్బంది రావడంతో లక్ష్మీ తిరుపతమ్మ మృతి చెందిందని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. రాత్రి 8 గంటలకు ఘటన జరిగితే తాడేపల్లి పోలీసులు రాత్రి 9.30 గంటలకు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఈ సమయంలో తిరుపతమ్మ మాజీ ప్రియుడు చింటూ కూడా అదే ప్రాంతంలో ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. కొంతకాలంగా తిరుపతమ్మ తనను దూరం పెడుతుందని చింటూ కోపంగా ఉన్నట్టు తెలుస్తోంది. అనాథలుగా పిల్లలు లక్ష్మీతిరుపతమ్మ మృతి వార్త తెలుసుకుని ఘటనాస్థలానికి వచ్చిన ఆమె తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇప్పుడు ఆమె ఇద్దరు పిల్లలు అనాథలు అయ్యారని రోధించారు. పిల్లలను ప్రభుత్వం సంరక్షించాలని విన్నవించారు.హతురాలు పామర్రు వాసి.. తాడేపల్లి రూరల్: డీజీపీ కార్యాలయం సమీపంలో ఆదివారం జరిగిన హత్యాచారం కేసు విచారణను పోలీసులు ముమ్మరం చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ సతీ‹Ùకుమార్ విచారణకు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఎస్పీ సతీ‹Ùకుమార్, లా అండ్ ఆర్డర్ అడిషనల్ ఎస్పీ సుప్రజ, డీఎస్పీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతోంది. దీంతోపాటు విజయవాడకు చెందిన సీసీఎస్ పోలీసులు కూడా దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. పామర్రు స్వగ్రామం.. మృతురాలు కృష్ణాజిల్లా పామర్రు గ్రామానికి చెందిన సజ్జ లక్ష్మీ తిరుపతమ్మ (32)గా పోలీసులు గుర్తించారు. ఈమె భర్త అయిన నవీన్ అనారోగ్యంతో మృతి చెందాడు. అప్పటి నుంచి తల్లి శీలం ఝాన్సీ వద్ద పిల్లలిద్దరినీ ఉంచింది. విజయవాడలో వంటపని చేస్తున్నానని ఆమెకు చెబుతూ వస్తోంది. విజయవాడలోని కృష్ణలంకలో ఉంటోంది. ఏడాది క్రితం ట్రాన్స్‌జెండర్ జెస్సీ పరిచయమైంది. ఆమె లక్ష్మీతిరుపతమ్మను వ్యభిచార వృత్తిలోకి దించినట్టు సమాచారం. ఆ తర్వాత మరో ట్రాన్స్‌జెండర్ నజీరాతోనూ తిరుపతమ్మకు పరిచయం అయింది. వీరిద్వారా తిరుపతమ్మ మాజీ ప్రియుడు రాధారంగా నగర్‌కు చెందిన చింటూ గురించి పోలీసులు తెలుసుకున్నారు. అతడినీ అదుపులోకి తీసుకుని ప్రశి్నస్తున్నట్టు సమాచారం. తిరుపతమ్మ తన ఇద్దరు బిడ్డలను చదివించుకోవడం కోసమే ఈ వృత్తి చేపట్టినట్లు తెలుస్తోంది.వీడియోలు, రీల్స్.. హత్య జరిగిన ప్రాంతంలో ఎన్నాళ్లగానో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నా.. పోలీసులు పట్టించుకోవడం లేదు. ఈ ప్రాంతంలో గంజాయి అమ్మకాలూ విస్తృతంగా జరుగుతున్నట్టు సమాచారం. మూడునెలలుగా ఇక్కడే లక్ష్మీ తిరుపతమ్మ, మరికొంతమంది మహిళలు రీల్స్, ఇంస్టాగ్రామ్ లో పాటలు పాడుతూ సెల్ఫీ వీడియోలు చిత్రీకరించినట్టు సమాచారం. తిరుపతమ్మ, ఆమె ప్రియుడు చింటూ, జెస్సీ కొలనుకొండ ప్రాంతంలో దౌర్జన్యం చేస్తూ వ్యభిచార వృత్తిలో ఉన్న ఇతరులను రానీయకుండా విటులను తీసుకెళ్లి సొమ్ము చేసుకుంటారని, ఇక్కడ వీరి ఆధిపత్యం ఏమిటనే భావనతో ప్రత్యర్థులు ఈ హత్య చేసి ఉంటారా అనే అనుమానమూ వ్యక్తమవుతోంది.

లైంగిక దాడికి యత్నం.. రైలు నుంచి దూకిన యువతి
సికింద్రాబాద్/గాంధీ ఆస్పత్రి: ఎంఎంటీఎస్ రైలులో ఓ యువతిపై అత్యాచార యత్నం జరిగింది. ఆగంతకుడి బారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో వేగంగా వెళ్తున్న రైలు నుంచి బాధితురాలు కిందకు దూకటంతో తీవ్రంగా గాయపడింది. ఈ నెల 22న రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు ప్రస్తుతం సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో కోలుకుంటోంది. నిందితుడిని పట్టుకునేందుకు దర్యాప్తు ముమ్మరం చేసినట్లు సికింద్రాబాద్ జీఆర్పీ ఇన్స్పెక్టర్ జి.సాయీశ్వర్‌గౌడ్ తెలిపారు.బోగీలో ఒంటరిగా ఉండటంతో..అనంతపురం జిల్లా ఉరవకొండ ప్రాంతానికి చెందిన ఓ యువతి (23) మేడ్చల్‌లోని ఒక ఉమెన్స్ హాస్టల్లో ఉంటూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తోంది. ఈ నెల 22న మధ్యాహ్నం 3 గంటల సమయంలో తన మొబైల్ రిపేర్ చేయించుకునేందుకు సికింద్రాబాద్‌కు వచ్చింది. తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో తెల్లాపూర్– మేడ్చల్ ఎంఎంటీఎస్ రైలు ఎక్కింది. ఆమె ఎక్కిన లేడీస్ కోచ్‌లో ఉన్న మరో ఇద్దరు మహిళలు రాత్రి 8 గంటల సమయంలో అల్వాల్ స్టేషన్లో దిగిపోవటంతో బోగీలో బాధితురాలు ఒక్కరే మిగిలింది. అది గమనించిన ఒక ఆగంతకుడు బోగీలోకి ప్రవేశించి బాధి తురాలిపై అఘాయిత్యం చేయబోయాడు. భయాందోళనకు గురైన ఆమె కొంపల్లి రైల్వే బ్రిడ్జి సమీపంలో నడుస్తున్న రైలు నుంచి కిందికి దూకేసింది. తీవ్ర గాయాలపాలై ప్రాణాపాయ స్థితికి చేరిన యువతిని గుర్తించిన స్థానికులు అంబులెన్స్‌లో గాంధీ ఆస్పత్రికి తరలించారు.రెండు స్టేట్మెంట్లుగాంధీ ఆస్పత్రిలో అదే రోజు సికింద్రాబాద్ రైల్వే పోలీసులు బాధితురాలి స్టేట్మెంట్ను రికార్డు చేశారు. అయితే, తాను ప్రమాదవశాత్తు రైలు నుంచి కిందపడ్డట్లు ఆమె పోలీసులకు తెలిపింది. దీంతో ప్రమాదవశాత్తు జరిగిన ఘటనగానే పోలీసులు రికార్డు చేశారు. ఆ తర్వాత ఆస్పత్రికి వచ్చిన తన కుటుంబ సభ్యులకు తనపై అత్యాచార యత్నం జరిగిందన్న విషయాన్ని బాధితురాలు చెప్పటంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మరోమారు బాధితురాలి స్టేట్మెంట్ను రికార్డు చేసుకున్న పోలీసులు అత్యాచార యత్నం కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బాధితురాలిని కుటుంబ సభ్యులు సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.నాలుగు బృందాలతో గాలింపుబాధితురాలిని గవర్నమెంట్ రైల్వే పోలీస్ (జీఆర్పీ) ఎస్పీ చందనదీప్తి సోమవారం పరామర్శించి, వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. నిందితుడిని పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు తెలిపారు. రెండు బృందాలు సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలన, సాంకేతిక ఆధారాల సేకరణలో ఉన్నాయని వివరించారు. నిందితుడిని గుర్తించడంలో పురోగతి సాధించామని, త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.మెరుగైన వైద్యం అందించాంబాధితురాలిని 22న రాత్రి 11.30 గంటలకు గాంధీ ఆస్పత్రి ఎమర్జెన్సీ వార్డులో చేర్పించారని ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ సునీల్‌కుమార్ తెలిపారు. ఆ సమయంలో ఆమె స్పృహలోనే ఉన్నప్పటికీ మతిస్థిమితం కోల్పోయినట్లు కనిపించిందని చెప్పారు. ఆమె చేయి మణికట్టు వద్ద విరిగిందని, శరీరంపై గాయాలున్నాయని వివరించారు. బాధితురాలికి వెంటనే ఆర్థోపెడిక్, ప్లాస్టిక్ సర్జరీ వైద్యులు తగిన వైద్యసేవలు అందించారని, సీటీ స్కానింగ్ చేయించామని వెల్లడించారు. కాగా, కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ సూచన మేరకు బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి సోమవారం సాయంత్రం గాంధీ ఆస్పత్రికి చేరుకుని బాధితురాలితో మాట్లాడారు. మంత్రుల ఆదేశాల మేరకు మెరుగైన వైద్యం కోసం యశోద ఆస్పత్రికి తరలించారు. లెఫ్ట్ ఎగనెస్ట్ మెడికల్ ఎడ్వైజ్ (లామా) ద్వారా బాధితురాలు గాంధీ ఆస్పత్రి నుంచి వెల్లిపోయినట్లు ప్రొఫెసర్ సునీల్ కుమార్ ఆ తర్వాత వెల్లడించారు.