Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

YS Jagan extends Ramzan greetings1
ముస్లిం సోదరులకు రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్‌ జగన్‌

సాక్షి, తాడేపల్లి: ముస్లిం సోదరులకు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. మనిషిలోని చెడు భావనల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ రంజాన్‌ అని వైఎస్‌ జగన్‌ చెప్పుకొచ్చారు. అల్లా చూపిన మార్గంలో న‌డవాల‌ని, అల్లా చ‌ల్ల‌ని దీవెన‌లు అంద‌రికీ ఉండాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు తెలిపారురంజాన్‌ పండుగ సందర్బంగా వైఎస్‌ జగన్‌..‘ముస్లింలకు రంజాన్‌ పండుగ ఎంతో పవిత్రమైనది. రంజాన్‌ పండుగ సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వమానవ సమానత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక. అల్లాహ్‌ దీవెనలతో రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ మానవాళికి సకల శుభాలు కలగాలని కోరుకుంటున్నాను. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్‌ మాసం విశిష్టత. పవిత్ర దివ్య ఖురాన్‌ అవతరించిన ఈ మాసంలో కఠిన ఉపవాస దీక్షలకు రంజాన్‌ ఒక ముగింపు వేడుక. మనిషిలోని చెడు భావనల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ రంజాన్‌’ అని అన్నారు.భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో క‌ఠిన‌మైన ఉప‌వాస దీక్ష‌లు ముగించుకుని ప్రేమ‌, శాంతి, సౌభ్రాతృత్వానికి ప్ర‌తీక అయిన రంజాన్ పండుగ‌ను జ‌రుపుకుంటున్న ముస్లిం సోద‌ర సోద‌రీమ‌ణులంద‌రికీ నా శుభాకాంక్ష‌లు. అల్లా చూపిన మార్గంలో న‌డవాల‌ని, అల్లా చ‌ల్ల‌ని దీవెన‌లు అంద‌రికీ ఉండాల‌ని మ‌న‌స్ఫూర్తిగా…— YS Jagan Mohan Reddy (@ysjagan) March 31, 2025

KSR Comment On Nara Lokesh Red Book Kothi Che2
Nara Lokesh: కోతి చేతికి కొబ్బరిచిప్ప దొరికినట్లు..!

తెలుగుదేశం పార్టీ అబద్దాల ఫ్యాక్టరీగానే కాదు.. అహంభావం తలకెక్కిన పార్టీగా మారిపోయిందా! పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు, మంత్రి లోకేష్‌లు చేసిన ప్రసంగాలు చూస్తే అలాగే అనిపిస్తోంది! అవకాశవాద రాజకీయాలు చేసేందుకు చంద్రబాబు ఏ మాత్రం ఫీల్ కారు. ఇప్పుడు లోకేష్ కూడా అదేబాటలో పయనిస్తూ అబద్దాలు చెప్పడంలో తండ్రితో పోటీ పడుతున్నారన్న విమర్శలు ఎదుర్కుంటున్నారు. అబద్దాల వరకైతే ఒక రకంగా సరిపెట్టుకోవచ్చు. కాని తానొక యువరాజు అనుకుని అహంకారంతో నారా లోకేష్‌(Nara Lokesh) మాట్లాడుతున్న తీరు కచ్చితంగా ఆయన స్వభావాన్ని తెలియచేస్తుంది. చంద్రబాబు నాయుడుకు లోపల అహం ఉన్నా, పైకి కనిపించకుండా నటిస్తూ, రెండు రకాలుగా ఆయనే మాట్లాడుతూ ప్రజలను మభ్య పెట్టే యత్నం చేస్తుంటారు. కానీ లోకేష్ మాత్రం అధికారంతో వచ్చిన కైపుతో మాట్లాడుతున్న వైనం పార్టీలోనే కాదు.. ప్రజలలో కూడా వెగటు పుట్టించే అవకాశం ఉంది. వీరి ఉపన్యాసాలకు వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇస్తూ.. చంద్రబాబు ఎప్పటి మాదిరే అసత్యాలు చెప్పారని, లోకేష్ అధికార మదంతో మాట్లాడారని ధ్వజమెత్తారు. భవిష్యత్తులో లోకేష్ ఇందుకు మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. 👉విశేషం ఏమిటంటే తెలుగుదేశం పార్టీ(TDP) ఏర్పడినప్పుడు చంద్రబాబు ఆ పార్టీలో చేరనే లేదు. పార్టీలోకి రావాల్సిందిగా మామ ఎన్‌టీఆర్‌, తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు కోరినా, అసలు తెలుగుదేశం పార్టీ మనజాలదని చెప్పారు. సినిమా వాళ్లను జనం ఆదరించరని ఎద్దేవా చేశారు. అప్పట్లో ఆయన కాంగ్రెస్ (ఐ) ప్రభుత్వంలో మంత్రి. పార్టీ అదేశిస్తే మామపై కూడా పోటీ చేస్తానని బీరాలు పలికిన చరిత్ర ఆయనది. కానీ 1983 ఎన్నికలలో చంద్రబాబు ఓడిపోయాయిన వెంటనే ముఖ్యమంత్రి పీఠమెక్కిన మామ పార్టీలోకి రావడం చంద్రబాబుకు ఇబ్బంది రాలేదు. అప్పటి నుంచి పార్టీని ఒక ప్లాన్ ప్రకారం తన గుప్పెట్లోకి తెచ్చుకుని, చివరికి రామారావునే కూలదోసిన సంగతీ తెలిసిందే. 👉చివరి రోజుల్లో ఎన్టీఆర్‌ స్వయంగా చంద్రబాబును(Chandrababu) విలువలు లేని వ్యక్తి అని చెప్పిన విషయం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. చంద్రబాబు అంత దుష్టుడు లేడంటూ రామారావే వీడియో విడుదల చేశారు. ఆయన ఆకస్మిక మరణంతో చంద్రబాబు మాట మార్చేసి, ఆయన వారసత్వం తనదేనని ప్రకటించుకున్నారు. ఎన్టీఆర్‌ ఆశయాలే తమ సిద్దాంతమని, ఆయన యుగపురుషుడు అంటూ కబుర్లు చెబుతూ వస్తున్నారు. కాలం గడిచే కొద్ది ఆ పేరు కనుమరుగవుతూ వచ్చింది. స్వోత్కర్ష పెరిగింది. పార్టీలోని ఇతర నేతలు, క్యాడర్ కూడా అదే బాటలో నడుస్తోంది. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు టీడీపీని ఒక అబద్దాల కర్మాగారంగా మార్చడంలో విజయవంతం అయ్యారన్న అభిప్రాయం వివిధ వర్గాలలో వ్యక్తం అవుతుంటుంది. ఒక వర్గం మీడియాకు అవసరమైన వనరులను సమకూర్చి దానిని తన చెప్పుచేతలలో ఉండేలా చేసుకున్నారు. చంద్రబాబు చెప్పే అబద్దాలను జనంలోకి తీసుకువెళ్లడంలో ఈ ఎల్లో మీడియా నిరంతరం శ్రమిస్తుంటుంది. ఈ క్రమంలో కొన్నిసార్లు విజయవంతం అయ్యారు. మరికొన్ని సార్లు విఫలం అయ్యారు. వార్షికోత్సవంలో ఒకరినొకరు పొగుడుకుంటే పర్వాలేదు.కాని అదేదో పార్టీలో మొదటి నుంచి తానే ఉన్నట్లు, ఇప్పటికీ ఎన్టీఆర్‌ కాలం నాటి విలువలు కొనసాగిస్తున్నట్లుగా కబుర్లు చెప్పడమే అతిశయోక్తిగా ఉంటుంది. ఎన్టీఆర్‌ ఆత్మగౌరవ నినాదంతో పార్టీని పెట్టారు. పేదలను సంక్షేమ కార్యక్రమాలతో ఆదుకోవాలని భావించేవారు. మాట ఇస్తే సాధ్యమైనంత వరకు ఆచరించి చూపాలని అనేవారు. అబద్దాలు చెప్పడానికి అంతగా ఇష్టపడేవారు కారు. అయితే పార్టీ చంద్రబాబు నాయుడు చేతిలోకి వచ్చినప్పటి నుంచి వీటన్నిటికి మంగళం పలికింది కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఎన్టీఆర్‌ ఆత్మగౌరవం కోసం ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడితే, చంద్రబాబు అదే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడానికి 2023 లో నానా తంటాలు పడ్డారు. 2024 ఎన్నికలకు ముందు ఢిల్లీలో రోజుల తరబడి బీజేపీ పెద్దల చుట్టూ తిరిగి ఎలాగైనా పొత్తు కావాలని కోరిన వైనం, పవన్ కళ్యాణ్‌ను బతిమలాడుకున్న తీరును గమనిస్తే, టీడీపీ ఆత్మగౌరవం ఎలా దిగజారిపోయింది తెలియడం లేదా! తన పార్టీలోకి ఎవరైనా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రావాలంటే రాజీనామా చేసి రావాలని ఎన్టీఆర్‌ నియమం పెట్టారు. చంద్రబాబేమో పూర్తిగా అందుకు విరుద్దం. 2014 టర్మ్‌లో 23 మంది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసి టీడీపీలోకి తీసుకు వచ్చి, నలుగురికి మంత్రి పదవులు కట్టబెట్టారు. ఎన్టీఆర్‌ ఎన్నికలలో హామీ ఇచ్చిన విధంగా 1994లో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి మద్య నిషేధం విధిస్తే, చంద్రబాబు ఆయనను పదవీచ్యుతుడిని చేసి మొత్తం రివర్స్ చేశారు. పోనీ వాటికైనా కట్టుబడి ఉంటారా ఉంటే అదేమీ లేదు. ఎన్నికలకు ముందు ఎక్కడలేని అబద్దాలు చెబుతారన్న విమర్శకు ఆస్కారం ఇస్తారు. ఆ తర్వాత వాటిని ఏ రకంగా ఎగవేయాలన్న దాని కోసం ఎన్ని అసత్యాలైనా చెప్పడానికి వెనుకాడరని అనుభవాలు చెబుతున్నాయి. 2014 టర్మ్‌లో రైతుల రుణమాఫీ, డ్వాక్రా మహిళల రుణమాఫీ వంటి హామీలు ఇచ్చి ఏమి చేశారో అందరికి తెలుసు. 2024లో రికార్డు స్థాయిలో అబద్దాలు చెప్పి గెలిచిన తర్వాత ఇప్పుడు ఏ రకంగా మాట్లాడుతున్నారో అంతా గమనిస్తూనే ఉన్నారు. సూపర్ సిక్స్, తదితర హామీలు, అప్పుల గురించి ఎన్నికల ప్రచారంలో ఏమి చెప్పారు! ఇప్పుడు ఏమి అంటున్నారు. 👉ఎన్నికలకు ముందు బయట నుంచి చూస్తే సూపర్ సిక్స్ అమలు చేయగలనని అనిపించిందట. అందుకే హామీలు ఇచ్చారట. కాని అధికారం వచ్చాక చేయడం కష్టమని తెలుస్తోందట. పదిహేనేళ్లు సీఎంగా ఉన్న వ్యక్తి ఈ మాటలు చెబితే ఎవరైనా నమ్ముతారా? ప్రజల చెవిలో పూలు పెట్టడం తప్ప ఇంకొకటి అవుతుందా? ఒకసారి అప్పు చేసి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తానంటారు. మరోసారి స్కీములన్నీ ఇచ్చేస్తానని అంటారు. వేరొకసారి అప్పులు చేసి స్కీములు ఎలా ఇస్తామని ప్రజలనే ప్రశ్నిస్తారు. ఇలా అన్ని మాటలు ఆయనే చెబుతారు. కక్ష రాజకీయాలు చేయబోమని అంటారు. మళ్లీ ఆయనే తప్పు చేస్తే తాట తీస్తామని చెబుతారు. చంద్రబాబు పైకి కనీసం నటించనన్నా నటిస్తారు. కాని లోకేష్ ఏ మాత్రం మొహమాటం, పద్దతి ఏమీ లేకుండా అహంకార పూరితంగా మాట్లాడుతున్నారు. కేవలం మాటలే కాదు.. ఆయన పనులు కూడా అలాగే ఉన్నాయి. ఎన్నికలకు ముందు తాను చంద్రబాబు అంత మంచివాడిని కానని కూడా ప్రచారం చేసుకునేవారు. ఆయన కనిపెట్టిన రెడ్ బుక్ అనేది కోతికి కొబ్బరికాయ మాదిరిగా ఉంది. రెడ్‌బుక్‌ పేరుతో అరాచకాలు సృష్టిస్తున్నది, ఇష్టారాజ్యంగా వైసీపీ వారిపై కేసులు పెడుతున్నది, దౌర్జన్యాలు, విధ్వంసాలను ప్రోత్సహిస్తున్నది తానేనని లోకేష్ చెప్పకనే చెబుతున్నారు. రెడ్ బుక్ అనగానే ఒకరికి గుండెపోటు వచ్చిందని, ఇంకొకరు బాత్ రూమ్ లో కాలు జారిపడ్డారని.. అర్థమైందా రాజా! అంటూ మాట్లాడిన తీరు ఆయనలోని అహంభావాన్ని స్పష్టంగా తెలియచేస్తుంది. ఈ నేపథ్యంలోనే అంబటి రాంబాబు కౌంటర్ ఇస్తూ లోకేష్ అధికార మదంతో మాట్లాడుతున్నారని, మూల్యం చెల్లించుకునే రోజు వస్తుందని హెచ్చరించారు. లోకేష్ తండ్రి చంద్రబాబు నాయుడు స్కిల్ స్కామ్‌లో అరెస్టు అయినప్పుడు బెయిల్ కోసం ఎన్ని వ్యాధులు ఉన్నాయని కోర్టుకు చెప్పారని ప్రశ్నించారు. కేసులు రాగానే ఎక్కడ లేని వ్యాధులు చంద్రబాబుకు గుర్తుకు వచ్చాయని అంబటి వ్యాఖ్యానించారు. ఇందులో కొంత వాస్తవం లేకపోలేదు. ఆ స్కామ్‌లో మనీలాండరింగ్ జరిగిందని, చివరికి టీడీపీ ఆఫీస్ ఖాతాకు కూడా డబ్బు చేరిందని, అప్పట్లో సీఐడీ ఆధార సహితంగా చూపితే దానిని ఖండించలేక పోయారే!. దానికి తోడు ఒక ప్రైవేటు ఆస్పత్రి నుంచి చంద్రబాబుకు రకరకాల జబ్బులు ఉన్నాయని సర్టిఫికెట్ తీసుకుని బెయిల్ పొందారే! అదే ఆస్పత్రిలో ఇప్పుడు ఎవరైనా వైఎస్సార్‌సీపీ నేత చేరితే జబ్బు లేకపోయినా చేరినట్లవుతుందా? అదెందుకు!.. .. చంద్రబాబు అరెస్టు అయితే, పాదయాత్ర ఆపేసి మరీ లోకేష్ డిల్లీకి ఎందుకు పరుగులు తీశారు? కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసి ఏమని వేడుకున్నారు? ఇవన్ని వాస్తవాలే కదా. కాని జాక్ పాట్ మాదిరి అధికారం వచ్చింది కదా అని విర్రవీగితే లోకేష్ కే నష్టమని రాంబాబు అన్నారు. అబ్దుల్ కలాంను టీడీపీనే రాష్ట్రపతి చేసినట్లు, ఇలా ఏవేవో డాంబికాలు చెప్పుకుంటే చెప్పుకోవచ్చు. కానీ రెడ్ బుక్ పేరుతో ప్రజలపైన ,ప్రతిపక్షంపై, ప్రశ్నించే వారిపై దాడులకు తెగబడతామంటే ఎల్లకాలం వారి ఆటలు సాగవు. ఈ సంగతిని గుర్తు పెట్టుకోకపోతే అదే రెడ్ బుక్ తన మెడకు చుట్టుకుంటుందన్న సంగతి లోకేష్ ఎంత త్వరగా గుర్తిస్తే ఆయనకే అంత మంచిది.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత

IPL 2025: RR Captain Riyan Parag Fined 12 Lakh For Code Of Conduct Breach During Match VS CSK3
Riyan Parag: మ్యాచ్‌ గెలిచినా సుఖం లేదు..!

ఐపీఎల్‌ 2025లో భాగంగా సీఎస్‌కేతో నిన్న (మార్చి 30) జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్‌లో రెండు పరాజయాల తర్వాత (సన్‌రైజర్స్‌, కేకేఆర్‌) రాయల్స్‌ సాధించిన తొలి విజయం ఇది. సారధిగా రియాన్‌ పరాగ్‌కు కూడా ఇదే తొలి గెలుపు. కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌ గెలిచిన ఆనందం రియాన్‌కు ఎంతో సేపు నిలబడలేదు. జట్టు స్లో ఓవర్‌రేట్‌కు బాధ్యుడిని చేస్తూ రియాన్‌కు 12 లక్షల జరిమానా విధించారు. ఈ సీజన్‌లో రాయల్స్‌కు ఇది తొలి స్లో ఓవర్‌రేట్‌ తప్పిదం. Pink Prevail in a sea of Yellow 🙌#RR held their nerve to record their first win of the season by 6 runs 👍Scorecard ▶️ https://t.co/V2QijpWpGO#TATAIPL | #RRvCSK | @rajasthanroyals pic.twitter.com/FeD5txyCUs— IndianPremierLeague (@IPL) March 30, 2025స్లో ఓవర్‌ రేట్‌ (నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయలేకపోవడం​) అనేది ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22ని ఉల్లంఘన కిందికి వస్తుంది. గత సీజన్‌ వరకు ఓ సీజన్‌లో ఓ జట్టు మూడు సార్లు స్లో ఓవర్‌రేట్‌ తప్పిదం చేస్తే కెప్టెన్‌పై ఓ మ్యాచ్‌ నిషేధం (భారీ జరిమానాతో పాటు) విధించేవారు. అయితే ఈ రూల్‌ను ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ ఈ సీజన్‌లో రద్దు చేసింది. కెప్టెన్లపై నిషేధాస్త్రాన్ని ఎత్తి వేసి కేవలం​ జరిమానాతో సరిపెట్టింది. గత సీజన్‌లో మూడు సార్లు స్లో ఓవర్‌రేట్‌ మెయింటైన్‌ చేసినందుకు గానూ ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా ఈ సీజన్‌లో ఓ మ్యాచ్‌ నిషేధాన్ని ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో కూడా హార్దిక్‌ తన తొలి మ్యాచ్‌లో స్లో ఓవర్‌రేట్‌ తప్పిదానికి బాధ్యుడయ్యాడు. గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ స్లో ఓవర్‌రేట్‌ మెయింటైన్‌ చేయడంతో కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యాకు 12 లక్షల జరిమానా విధించారు.కాగా, సీఎస్‌కేతో నిన్న జరిగిన మ్యాచ్‌లో రాయల్స్‌ చివరి ఓవర్‌లో విజయాన్ని ఖరారు చేసుకుంది. 183 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకునేందుకు రాయల్స్‌ బౌలర్లు చివరి వరకు పోరాడారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆ జట్టు నితీశ్‌ రాణా (36 బంతుల్లో 81; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) శివాలెత్తిపోవడంతో 182 పరుగులు చేసింది. వాస్తవానికి రాయల్స్‌ ఇంకా భారీ స్కోర్‌ చేయాల్సింది. అయితే నితీశ్‌ను ఔట్‌ చేశాక సీఎస్‌కే బౌలర్లు అద్బుతంగా బౌలింగ్‌ చేసి పరిస్థితికి అదుపులోకి తెచ్చుకున్నారు. అనంతరం సీఎస్‌కే ఛేదనలో తడబడినా చివరి ఓవర్‌ వరకు గెలుపు కోసం ప్రయత్నించింది. ఆఖరి ఓవర్‌లో 20 పరుగులు చేయాల్సి ఉండగా.. 13 పరుగులకే పరిమితమై సీజన్‌లో వరుసగా రెండో ఓటమిని మూటగట్టుకుంది. రాయల్స్‌ బౌలర్లలో హసరంగ (4-0-35-4), జోఫ్రా ఆర్చర్‌ (3-1-13-1) సీఎస్‌కేను దెబ్బకొట్టారు. కెప్టెన్‌గా తొలి విజయం సాధించిన రియాన్‌ ఈ మ్యాచ్‌లో వ్యక్తిగతంగానూ రాణించాడు. బ్యాటింగ్‌లో కీలకమైన ఇన్నింగ్స్‌ (28 బంతుల్లో 37; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆడి ఓ అద్భుతమైన క్యాచ్‌ (శివమ్‌ దూబే) అందుకున్నాడు.

YSRCP Ambati Rambabu Satirical Comments On CBN4
పవన్‌ అసమర్థుడినని తానే ఒప్పుకున్నాడు: అంబటి

సాక్షి, గుంటూరు: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సంపద సృష్టిస్తామన్నారు.. ఏమైంది? అని ప్రశ్నించారు. అలాగే, రాష్ట్రంలో తొమ్మిది నెలల కూటమి పాలనలో ఎంత సంపద సృష్టించారు చెప్పాలని డిమాండ్‌ చేశారు.మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబుది అంతా పబ్లిసిటీ స్టంట్‌. చంద్రబాబు పీ-4 పేరుతో ప్రజలందరినీ అడ్వాన్స్‌డ్‌ ఏప్రిల్‌ ఫూల్‌ చేశారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు సంపద సృష్టిస్తామన్నారు.. సంపద ఏమైంది?. రాష్ట్రంలో తొమ్మిది నెలల కూటమి పాలనలో ఎంత సంపద సృష్టించారు. గత ప్రభుత్వ పథకాలను పాతరేశారు. కొత్త పథకాల ఊసేలేదు. రాష్ట్రంలోని పేద ప్రజలను మరింత పేదరికంలోకి నెడుతున్నారు. డబ్బులు ఉన్నోడికే మెడికల్‌ సీట్లు దోచిపెడుతున్నారు. నీతి, నిజాయితీకి మారు పేరు అంటే చంద్రబాబు ఎవరైనా నమ్ముతారా?. బంగారు కుటుంబం అని రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారు. పీ-4 అంటూ బాధ్యతల నుంచి తప్పించుకుంటున్నారు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. పీ-4 పేరుతో కొత్త నాటకం..చంద్రబాబు నాయుడు పీ-4 పేరుతో కొత్త నాటకాన్ని ప్రారంభించాడు. పీ-4కు మార్గదర్శి బంగారు కుటుంబం అని కొత్త పేరు పెట్టాడు. ఆంధ్రప్రదేశ్‌లో పేదరిక నిర్మూలనకు పీ-4 దోహదం చేస్తుందని చంద్రబాబు చెప్తున్నారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కొత్తగా టోల్ గేట్లు పెడతానని చెబుతున్నారు. మెడికల్ కాలేజీలు, పోర్టులు, గ్రామీణ ప్రాంత రోడ్డును చంద్రబాబు నాయుడు ప్రైవేటుపరం చేస్తున్నాడు. గత చంద్రబాబు ప్రభుత్వంలో 58 కార్పొరేషన్లను ప్రైవేటీకరణ చేశాడు. ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్, సంపద సృష్టిస్తానని చెప్పాడు. పేదరిక నిర్మూలన చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.పేదరిక నిర్మూలన కావాలంటే విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించాలి. అంతేకానీ కాంట్రాక్టర్లను, డబ్బులు ఉన్నవారిని, బడా బాబుల్ని పీ-4 పేరుతో వేదికపైన కూర్చోబెడితే పేదరికం పోదు. ఈ రాష్ట్రంలో రెండే రెండు బంగారు కుటుంబాలు ఉన్నాయి. ఒకటి చంద్రబాబుది, రెండోది పవన్ కళ్యాణ్‌ది. ఈ రెండు బంగారు కుటుంబాలే. గతంలో చంద్రబాబు నాయుడు జన్మభూమి అన్నాడు.. శ్రమదానం అన్నాడు అవన్నీ పోయాయి. ఇప్పుడు పీ-4 పేరు చెప్పి ప్రచారం చేసుకుంటున్నాడు.చంద్రబాబు నాయుడు నేనేం తప్పు చేయనని డప్పు కొట్టుకుంటున్నాడు. ఆయన పుట్టిన దగ్గర నుంచి ఆయన చేసేవన్నీ తప్పులే. ఎన్టీఆర్ దగ్గర పని చేశారని చంద్రబాబు చెప్తున్నాడు. ఆయన ఇందిరా గాంధీ దగ్గర పని చేశాడు.. ఎన్టీఆర్ పని పూర్తి చేశాడు. లోకేష్ లాంటి అసమర్ధుడిని ప్రజలపై రుద్దాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడు. రాష్ట్రంలో ఒక కోటి 40 లక్షల మంది వైట్ రేషన్ కార్డులు ఉన్నవాళ్లు ఉన్నారు. ఎనిమిది లక్షల అరవై వేల మంది ట్యాక్స్‌ కట్టే వాళ్ళు ఉన్నారు. వీళ్లని వాళ్లతో ఎలా అనుసంధానం చేస్తాడు?.పవన్‌ ప్యాకేజీ స్టారే..పవన్ కళ్యాణ్ నేను అసమర్థున్ని అని మనసులో మాట బయటపెట్టారు. పవన్ మాటలను జనసేన కార్యకర్తలు, వీర మహిళలు ఆలోచించాలి. లోకేష్ డబ్బులు వసూలు చేసి పవన్‌కి ప్యాకేజీ ఇస్తున్నాడు. పేదల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబు నాయుడుకి లేదు. చంద్రబాబు నాయుడు సెల్ ఫోన్ నేనే కనిపెట్టాను.. ఐటీ నేనే తెచ్చానని పిట్టలదొర మాటలు మాట్లాడుతున్నాడు. డబ్బులు కోసం పోలవరాన్ని చంద్రబాబు సర్వనాశనం చేశాడు. పోలవరాన్ని ఏటీఎంగా మార్చుకున్నారని సాక్షాత్తు ప్రధాని మోదీనే చెప్పారు. పోలవరంపై ఎప్పుడైనా ఎక్కడైనా చర్చకు నేను సిద్ధం. చంద్రబాబు వచ్చినా.. ఆయన మంత్రులను పంపించినా చర్చకు నేను సిద్ధం. కేంద్రం కట్టాల్సిన పోలవరాన్ని ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది అని ఎప్పటినుంచో అడుగుతున్నాను. కానీ, తెలుగుదేశం నాయకులు గానీ చంద్రబాబు గానీ.. ఎవరు సమాధానం చెప్పడం లేదు ఎందుకు?. కూటమి ప్రభుత్వానికి రోజులు చెల్లాయి. చంద్రబాబు సర్కార్‌పై ప్రజలు తిరగబడే రోజులు దగ్గరపడ్డాయి. చంద్రబాబు తెలిపి తక్కువ వల్లే పోలవరం ఆలస్యమైంది. పోలవరంపై చర్చకు ఎప్పుడైనా సిద్దమే. స్పిల్‌ వే, కాఫర్‌ డ్యామ్‌ పూర్తి చేసిన ఘనత వైఎస్సార్‌సీపీదే. కాఫర్‌ డ్యామ్‌ పూర్తి చేయకుండా డయాఫ్రం వాల్‌ వేస్తారా? అని ప్రశ్నించారు.

Donald Trump Says third Presidential Term IN USA5
రాజకీయ ప్రకంపనలు.. మూడోసారి అధికారంపై ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. తాను మూడోసారి అధికారంలోకి రావడానికి మార్గాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడిగా మూడోసారి ఎన్నిక కావడంపై తాను జోక్‌ చేయడం లేదంటూ మాట్లాడారు. అయితే, అమెరికా అధ్యక్షుడిగా మూడోసారి ఎన్నిక కావడాన్ని రాజ్యాంగంలోని 22వ సవరణ అనుమతించదు. దీంతో, ఆయన వ్యాఖ్యలు అమెరికాలో కొత్త చర్చకు దారి తీశాయి.అమెరికా అధ్యక్షుడిగా మూడోసారి ఎన్నిక కావడానికి అవకాశం, మార్గాలు ఉన్నాయని డొనాల్డ్‌ ట్రంప్‌ తెలిపారు. అయితే దీనిపై ఇప్పుడే ఆలోచించడం సరికాదన్నారు. దానికి ఇంకా సమయం ఉందని చెప్పుకొచ్చారు. అధ్యక్షుడు ట్రంప్‌ ఆదివారం ఓ న్యూస్‌ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అమెరికాలో చాలా మంది ప్రజలు.. నన్ను మూడోసారి ఎన్నిక కావాలని కోరుతున్నారు. నాకు పనిచేయడం అంటే ఇష్టం. అమెరికా ప్రజలు కోసం ఎంత కష్టమైనా కొన్ని నిర్ణయాలు తీసుకోడానికి వెనుకాడను. మూడోసారి అధ్యక్ష బాధ్యతలు తీసుకోవడానికి ఇంకా చాలా సమయం ఉంది. ఇప్పుడే దానిపై ఆలోచించడం తొందరపాటు అవుతుంది. ఇప్పుడు నేను ప్రస్తుత పరిస్థితులపై దృష్టి సారించాను. ఇప్పుడు చేయాల్సింది చాలా మిగిలి ఉంది’ అంటూ కామెంట్స్‌ చేశారు.రెండు మార్గాలు.. ఇదిలా ఉండగా.. అమెరికా రాజ్యాంగంలో విధించిన రెండు దఫాల నిబంధనను మార్చాలంటే సవరణ చేయాలి. అది కష్టతరమైనది. రాజ్యాంగ సవరణ చేయాలంటే కాంగ్రెస్‌లో మూడింట రెండు వంతుల మెజారిటీ ఉండాలి. లేదంటే మూడింట రెండు వంతుల రాష్ట్రాలు అంగీకరించాలి. ఈ రెండు మార్గాలనూ నాలుగింట మూడు వంతుల రాష్ట్రాలు ఆమోదించాలి. ఇది వ్యాఖ్యలు చేసినంత సులభం కాదని పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక, అమెరికాలో 2028లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.

Waqf Bill Row: Muslims Protest On CM Chandrababu Double Game6
బాబు డబుల్‌ గేమ్‌.. సొంత ఇలాకాలో ఊహించని షాక్‌

చిత్తూరు, సాక్షి: ముస్లింల హక్కుల విషయంలో డబుల్‌ గేమ్‌ ఆడుతున్న నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం తీరుపై ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా.. చంద్రబాబు నియోజకవర్గంలో, అదీ రంజాన్‌ పర్వదినాన ముస్లిం సోదరులు శాంతియుత నిరసనకు దిగారు. తమ సంక్షేమాన్ని, అభివృద్దిని నిర్ల‌క్ష్యం చేస్తున్న చంద్రబాబు(Chandrababu).. ఇప్పుడేమో ర‌క్షించేవాడిలా నాట‌కాలు ఆడుతున్నార‌ని ఆవేదన వ్యక్తం చేశారు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నియోజకవర్గం కుప్పం(Kuppam)లో ఇవాళ నిరసన జరిగింది. నల్ల బ్యాడ్జిలు ధరించిన మరీ రంజాన్‌ ప్రత్యేక ప్రార్థనంలో పాల్గొన్నారు ముస్లిం సోదరులు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు కూటమి ప్రభుత్వం నడుం బిగించాలనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. కేంద్రంలోని ఎన్డీయేలో కీలక భాగస్వామిగా ఉంటూనే.. వక్ఫ్ సవరణ బిల్లుకు చంద్రబాబు మద్దతు ఇస్తుండడాన్ని వీళ్లంతా ఖండించారు. ఈ బిల్లు గనుక పార్ల‌మెంట్‌లో పాసైతే ముస్లిం స‌మాజం తీవ్రంగా న‌ష్ట‌పోతుంది అని ఆవేదన చెందుతున్నారు. ఇదీ చదవండి: వక్ఫ్‌ సవరణ బిల్లును అడ్డుకోవాల్సిందేముస్లిం స‌మాజం మొత్తం వ్య‌తిరేకిస్తున్న వ‌క్ఫ్ స‌వ‌ర‌ణ‌ బిల్లు(Waqf Bill) విష‌యంలో రాష్ట్రంలో ఒక‌లా, ఢిల్లీలో మ‌రో ర‌కంగా చంద్రబాబు మాట్లాడుతుండడాన్ని రాజకీయ వర్గాలు ఖండిస్తున్నాయి. ఈ బిల్లు విష‌యంలో చంద్ర‌బాబు రెండు నాల్క‌ల ధోర‌ణితో వ్య‌వ‌హ‌రిస్తున్నారని మండిపడుతున్నాయి.ఇదిలా ఉంటే.. టీడీపీ మ‌ద్ధ‌తు మీద‌నే కేంద్రం ఆధార‌ప‌డి ఉందనేది విశ్లేషకుల మాట. అలాంటప్పుడు ఆ బిల్లును ఆదిలోనే టీడీపీ వ్య‌తిరేకించి ఉంటే ఇప్పుడు జేపీసీ వ‌ర‌కు వ‌చ్చి ఉండేది కాదన అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. మరోప‌క్క బిల్లుకి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించిన చంద్రబాబు.. తాజాగా జరిగిన ఇఫ్తార్ విందులో పాల్గొని వ‌క్ఫ్ ఆస్తుల‌ను ప‌రిర‌క్షిస్తున్నామ‌ని చెబుతుండడం మోసమేనన్నది కొందరి వాదన. ఈ క్రమంలోనే ఎన్డీయే కూటమిలో కీలక భాగస్వాములైన టీడీపీ అధినేత చంద్రబాబు, జేడీయూ నితీశ్‌ కుమార్‌లపై మజ్లిస్‌ అధినేత.. హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అలాంటి వారిని క్షమించబోమంటూ ఘాటు వ్యాఖ్యాలు చేశారు.

Critical illness insurance for rare diseases7
అరుదైన వ్యాధులు వస్తే.. ఇదిగో ఈ ఇన్సూరెన్స్‌..

హీమోఫీలియా, మర్ఫాన్‌ సిండ్రోమ్‌ లాంటి అరుదైన వ్యాధులు కొద్ది మందికి మాత్రమే వస్తాయి. కానీ వాటి తీవ్రత మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల మంది 7 వేల పైగా రకాల అరుదైన వ్యాధులతో బాధపడుతున్నారని అంచనా. ఇలాంటి వాటికి నాణ్యమైన చికిత్స దొరకడం కష్టంగానే ఉంటోంది.. అలాగే చికిత్స వ్యయాలు భారీగానే ఉంటున్నాయి.భారత్‌ విషయానికొస్తే 7 కోట్ల మంది అరుదైన వ్యాధులతో బాధపడుతున్నారని అంచనాలున్నాయి. అవగాహనారాహిత్యం, వైద్యపరీక్షల వ్యయాలు భారీగా ఉండటం, ఆరోగ్య సంరక్షణ సదుపాయాలు అంతగా లేకపోవడం వంటి అంశాల కారణంగా వారు సమయానికి సరైన చికిత్సను పొందలేకపోతున్నారు.ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) 4,001 అరుదైన వ్యాధులను గుర్తించింది. కానీ, 450 వ్యాధుల రికార్డులు మాత్రమే ఆస్పత్రుల్లో అధికారికంగా అందుబాటులో ఉంటున్నాయి. వైద్యపరీక్షలు, డేటా సేకరణపరమైన సవాళ్లను ఇది సూచిస్తోంది. 80 శాతం అరుదైన వ్యాధులు జన్యుపరమైనవే కాగా మిగతావి ఇన్ఫెక్షన్లు, ఆటోఇమ్యూన్‌ లేదా పర్యావరణంపరమైన అంశాల వల్ల వస్తున్నాయి.50 శాతం పైగా అరుదైన వ్యాధుల లక్షణాలు ఎక్కువగా పిల్లల్లోనే ఉంటాయి కాబట్టి సాధ్యమైనంత ముందుగా వైద్యపరీక్షలు చేసి గుర్తించడం కీలకంగా ఉంటుంది. అరుదైన వ్యాధులకు ప్రత్యేకమైన చికిత్సలు, జీవిత కాల సంరక్షణ, కొన్ని సందర్భాల్లో ప్రయోగాత్మక చికిత్సలు కూడా అవసరమవుతాయి. అందుకే తగినంత బీమా కవరేజీ ఉండాలి. ఈ నేపథ్యంలో సాధారణ హెల్త్‌ ఇన్సూరెన్స్, క్రిటికల్‌ ఇల్‌నెస్‌ ప్లాన్ల మధ్య వ్యత్యాసాలు, వాటితో ఏయే ప్రయోజనాలు ఉంటాయో తెలియజేసేదే ఈ కథనం. క్రిటికల్‌ ఇల్‌నెస్‌ ప్లాన్‌ అంటే.. సాధారణ ఆరోగ్య బీమాతో పోలిస్తే క్రిటికల్‌ ఇల్‌నెస్‌ (సీఐ) స్వరూపం భిన్నంగా ఉంటుంది. ఆస్పత్రిలో చికిత్స వ్యయాలకు మాత్రమే చెల్లించడం కాకుండా, వ్యాధి నిర్ధారణయినప్పుడు ఏకమొత్తంగా బీమా మొత్తాన్ని కంపెనీ చెల్లిస్తుంది. దీన్ని చికిత్స వ్యయాల కోసం కావచ్చు, కోల్పోయిన ఆదాయాన్ని భర్తీ చేసుకోవడం కోసం కావచ్చు, ఇతరత్రా ప్రత్యామ్నాయ చికిత్స కోసం కావచ్చు, పాలసీదారు తనకు కావాల్సిన విధంగా ఉపయోగించుకోవచ్చు.లూపస్‌ లేదా స్లెరోడెర్మాలాంటి అరుదైన ఆటోఇమ్యూన్‌ వ్యాధులకు సీఐ ప్లాన్‌తో ఆర్థికంగా కొంత ఉపశమనం లభించవచ్చు. సాధారణంగా ముందస్తుగా నిర్ణయించిన వ్యాధుల కేటగిరీలకు మాత్రమే సీఐ ప్లాన్లు బీమా మొత్తాన్ని చెల్లిస్తాయి. ఒకవేళ ఏదైనా అరుదైన వ్యాధికి కవరేజీ నుంచి మినహాయింపు ఉంటే, పాలసీదారుకు ఆర్థిక ప్రయోజనం దక్కదు. కవరేజీల్లో వ్యత్యాసం.. ఏది మెరుగైనది.. అరుదైన వ్యాధుల విషయంలో ప్రాథమిక ఆరోగ్య బీమా, హాస్పిటలైజేషన్, తక్షణ వైద్య వ్యయాలకు ఉపయోగపడుతుంది. డాక్టర్లను సంప్రదించడం, ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో చేరడం, అవసరమైన ప్రొసీజర్లు మొదలైన వాటికి పాలసీ చెల్లిస్తుంది. అయితే, ఆదాయ నష్టం, దీర్ఘకాల సంరక్షణలాంటి పరోక్ష వ్యయాలకు కవరేజీనివ్వదు. మరోవైపు, క్రిటికల్‌ ఇల్‌నెస్‌ పాలసీ అనేది ఏకమొత్తంగా చెల్లిస్తుంది. దాన్ని పాలసీదారు తనకు కావాల్సిన విధంగా ఉపయోగించుకోవచ్చు.అయితే, సదరు వ్యాధి గురించి పాలసీలో ప్రస్తావిస్తేనే ఇది వీలవుతుంది. లేకపోతే కవరేజీ లభించదు. సాధారణంగా సీఐ పాలసీలు చాలా మటుకు అరుదైన వ్యాధులకు కవరేజీనివ్వవు. కాబట్టి ఆర్థిక భద్రత కోసం వాటిని మాత్రమే నమ్ముకోవడానికి ఉండదు. అరుదైన సమస్యలు ఉన్న వారు అధిక కవరేజీ ఉండే బేసిక్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్, క్రిటికల్‌ ఇల్‌నెస్‌ పాలసీని కలిపి తీసుకుంటే ఆర్థికంగా భరోసాగా ఉంటుంది. అసాధారణ వ్యాధుల కోసం ఆర్థిక ప్రణాళిక.. అరుదైన వ్యాధులతో అధిక రిస్కులున్న వారు రెండు రకాల బీమాను తీసుకుంటే భరోసాగా ఉంటుంది. అధిక కవరేజీ ఉండే సాధారణ ఆరోగ్య బీమా పాలసీ, ఆస్పత్రి.. వైద్య వ్యయాలకు కవరేజీనిస్తుంది. ఇక క్రిటికల్‌ ఇల్‌నెస్‌ పాలసీ (ఒకవేళ తీసుకుంటే) వైద్యయేతర వ్యయాలకు ఆర్థికంగా తోడ్పాటు అందిస్తుంది. కవరేజీల్లో అంతరాలను తగ్గించుకునేందుకు టాప్‌ అప్‌ ప్లాన్లు, నిర్దిష్ట వ్యాధి సంబంధిత పాలసీల్లాంటివి పరిశీలించవచ్చు.రెగ్యులర్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ అంటే.. సమగ్ర ఆరోగ్య బీమా పాలసీలనేవి హాస్పిటలైజేషన్‌ చార్జీలు, డాక్టర్ల కన్సల్టేషన్లు, వైద్య పరీక్ష ప్రొసీజర్లు, ఆస్పత్రిలో చేరడానికి ముందు అలాగే ఆ తర్వాత తలెత్తే వ్యయాలకు కవరేజీనిస్తాయి. హంటింగ్టన్స్‌ డిసీజ్‌ లేదా రెట్‌ సిండ్రోమ్‌లాంటి నరాల సంబంధిత అరుదైన వ్యాధుల విషయంలో హాస్పిటలైజేషన్‌.. సపోర్టివ్‌ కేర్‌కి, జీవక్రియ సంబంధ గౌచర్‌ వ్యాధి లేదా ఫ్యాబ్రీ వ్యాధి, ఎంజైమ్‌ మార్పిడి థెరపీ కూడా కవరేజీ లభిస్తుంది. అయితే, సాధారణ పాలసీల్లో అన్ని రకాల అరుదైన వ్యాధులూ కవర్‌ కావు. కాబట్టి, జేబు నుంచి భారీగా పెట్టుకోవాల్సి వస్తుంది.అమితాబ్‌ జైన్‌, చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్, స్టార్‌ హెల్త్‌ అండ్‌ అలైడ్‌ ఇన్సూరెన్స్‌

Prithviraj Sukumaran Mother Mallika Comments On L2 Empuraan Issue8
నా కుమారుడు ఎవరినీ మోసం చేయలేదు.. లూసిఫర్‌పై 'పృథ్వీరాజ్' తల్లి

'ఎల్‌ 2: ఎంపురాన్‌' (L2 Empuraan) వివాదంపై మోహన్‌లాల్‌ (Mohanlal) ఇప్పటికే స్పందించారు. సోషల్‌ మీడియా వేదికగా చిత్ర బృందం తరఫున క్షమాపణలు చెబుతూ ఆయన ఒక పోస్టు కూడా చేశారు. తాజాగా చిత్ర దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్‌ (Prithviraj Sukumaran) తల్లి మల్లిక కూడా ఈ గొడవపై రియాక్ట్‌ అయ్యారు. లూసిఫర్‌ సినిమా విషయంలో కేవలం తన కుమారుడిని మాత్రమే తప్పుగా చూపుతూ కొందరు దూషిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. తన కుమారుడు ఎవరినీ మోసం చేయలేదని సోషల్‌మీడియా వేదికగా పోస్ట్‌ చేశారు.లూసిఫర్‌2 సినిమా విషయంలో తన కుమారుడిని కించపరిచేలా తప్పుడు కథనాలు రావడాన్ని మల్లిక తప్పుబట్టారు. ఈ వివాదంపై మొదట తాను రియాక్ట్‌ కాకూడదని నిర్ణయించుకున్నానని ఆమె చెప్పారు. కానీ, ఒక తల్లిగా తన కుమారుడి కోసం రియాక్ట్‌ కావాల్సి వస్తుందని ఆమె ఇలా అన్నారు. 'ఎల్‌ 2: ఎంపురాన్‌' తెర వెనుక జరుగుతున్న విషయాలన్ని నాకు తెలుసు. కానీ, నా కుమారుడిని మాత్రమే తప్పుగా చూపుతూ కథనాలు క్రియేట్‌ చేస్తున్నారు. నా కుమారుడు ఎవరినీ మోసం చేయలేదు. మోహన్‌లాల్‌, చిత్ర నిర్మాతలు ఎవరూ కూడా పృథ్వీరాజ్ మోసం చేసినట్లు చెప్పలేదు. మోహన్‌లాల్‌ నా సోదరుడితో సమానం. నా కుమారుడిపై జరుగుతున్న తప్పుడు ప్రచారం కూడా ఆయనకు తెలియకుండానే కొందరు చేస్తున్నారు. చాలామంది కుట్రలు పన్ని నా కుమారుడిని బలిపశువును చేస్తున్నారు. నా కుమారుడు పృథ్వీరాజ్ ఎవరినీ మోసం చేయడని బలంగా చెబుతున్నాను. ఈ మూవీ వల్ల ఏమైనా ఇబ్బందులు వచ్చాయంటే అందులో భాగమైన వారందరికీ బాధ్యత ఉంటుందని తెలుసుకోవాలి. కేవలం ఒక్కరి మీద మాత్రమే నిందలు వేయకూడదు. సినిమా కథను అందరూ చదివే కదా అందరూ ఆమోదించారు. సినిమా షూటింగ్‌ జరుగుతున్నప్పుడు రచయిత కూడా ఎల్లప్పుడు పక్కనే ఉన్నారు. ఇబ్బంది ఉంటే ఆయనే మార్పులు చేసేవారు. సినిమా విడుదలయ్యాక కేవలం పృథ్వీరాజ్‌ను మాత్రమే తప్పుపడుతున్నారు. పూర్తి విషయాలు తెలుసుకోకుండా కొందరు సోషల్‌ మీడియాలో ఇష్టం వచ్చినట్లు కామెంట్లు చేస్తున్నారు. మోహన్‌లాల్‌కు తెలియకుండా కొన్ని సీన్లు ఈ మూవీలో కలిపారంటూ వస్తున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు. సినిమా పూర్తి అయిన తర్వాత అందరూ చూసిన తర్వాతే విడుదల చేశారు. అందరి ఆమోదంతోనే మీ వద్దకు మూవీ వచ్చిందని గ్రహించండి. నా కుమారుడు ఎప్పటికీ ఎవరి వ్యక్తిగత విశ్వాసాల జోలికి వెళ్లడు.' అని మల్లిక చెప్పుకొచ్చారు.2002 సమయంలో గుజరాత్‌లో జరిగిన అల్లర్ల నేపథ్యంలోని కొన్ని సీన్లు ఈ సినిమాలో చూపించారని కొందరు తప్పపట్టారు. ఆ సమయంలో ఓ కుటుంబాన్ని మరో వర్గానికి చెందిన నాయకుడు అత్యంత కీరాతకంగా హత్య చేసి ఫైనల్‌గా అతనే రాజకీయాల్లోకి అడుగుపెట్టారని చూపించటం ఒక వర్గం వారికి నచ్చలేదు. దీంతో ఈ చిత్రంపై చాలా విమర్శలు వచ్చాయి.

Students Protests In HCU Over Land Issue9
HCU వద్ద హైటెన్షన్‌.. భారీగా పోలీసుల మోహరింపు

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(HCU) వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. యూనివర్సిటీలో 400 ఎకరాల భూమిని ప్రభుత్వం విక్రయించ వద్దని విద్యార్థులు నినాదాలు చేస్తున్నారు. ఈ క్రమంలో నిన్న సాయంత్రం 200 మంది విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే, యూనివర్సిటీ వద్ద పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు.హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ రణరంగంలా మారింది. వర్సిటీ పరిధిలోని 400 ఎకరాల భూముల్లో ఆదివారం వందలాదిగా మోహరించిన పోలీసులు విద్యార్థులపై లాఠీ దెబ్బలతో విరుచుకుపడి దాదాపు 200 మందిని అరెస్ట్‌ చేయడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. టీజీఐఐసీ, రెవెన్యూ అధికారులు జేసీబీలతో పోలీసుల కాపలా నడుమ వర్సిటీ పరిధిలోని 400 ఎకరాల భూముల్లోకి వచ్చారు. దట్టమైన పొదలు, చెట్లను తొలగించే ప్రయత్నం చేశారు. అది గమనించిన కొందరు విద్యార్థులు అక్కడికి చేరుకునేసరికి పోలీసులు చుట్టుముట్టారు.Hyderabad Central University witnessed police brutality.Students peacefully protesting against CM @revanth_anumula remarks calling HCU students “cunning foxes” and opposing a land grab near their campus were met with violence lathi charge, phones smashed, voices silenced.… pic.twitter.com/25oHPIGoXH— Harish Rao Thanneeru (@BRSHarish) March 30, 2025ఈ క్రమంలో పర్యావరణాన్ని దెబ్బతీస్తూ.. జీవ వైవిధ్యానికి నష్టం కలిగించే ప్రయత్నాలు చేయవద్దని నినదిస్తూ అక్కడికి చేరుకున్న విద్యార్థులపై పోలీసులు రెచ్చిపోయారు. కాళ్లు, చేతులు పట్టుకొని నేలపై ఈడ్చుకెళ్లి వ్యాన్లలోకి ఎక్కించారు. అరెస్టులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిని వర్సిటీలో పరిగెత్తిస్తూ మరీ లాఠీలతో చితకబాదారు. 200 మందికి పైగా విద్యార్థులను రాయదుర్గం, మాదాపూర్‌, గచ్చిబౌలి, కొల్లూరు పోలీస్‌ స్టేషన్లకు తరలించారు. ఠాణాలకు తరలించే క్రమంలో ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పాలని అడిగినందుకు హెల్మెట్లు, ప్రొటెక్షన్‌ షీల్డ్‌తో విచక్షణా రహితంగా కొట్టారు. కొందరు పోలీసులు తమను బూతులు తిట్టారని విద్యార్థులు ఆవేదన వ్యక్తంచేశారు.Save our university land from being auctioned for private entities. University is an intellectual power house,don't kill the progress of the Telangana. Save our land.@KTRBRS @BRSHarish @Krishank_BRS @dhanyarajendran @revathitweets @bainjal @CharanT16 @RahulGandhi @priyankagandhi pic.twitter.com/81zQ3APMVd— sree charan (@mscharan) March 30, 2025బట్టలు చిరిగినా వదలకుండా..పోలీసుల అరాచకాన్ని ప్రశ్నించిన ఆడపిల్లలను మహిళా పోలీసులు జుట్టు పట్టుకుని నేలపై ఈడ్చుకుంటూ వ్యాను ఎక్కించారు. ఈ క్రమంలో పదుల సంఖ్యలో విద్యార్థినులు గాయాలపాలయ్యారు. బట్టలు చిరిగిపోయినా పట్టించుకోకుండా విద్యార్థులను లాకెళ్లారు. అడ్డుకోబోయిన యువకులను కాళ్లు, చేతులు పట్టుకుని వ్యాన్‌లో పడేశారు. పోలీసుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ తోటి విద్యార్థులు వర్సిటీ మెయిన్‌ గేట్‌ ఎదుట బైఠాయించారు. బయటకు రాకుండా నిర్బంధించడంతో అక్కడే కూర్చుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. Mohabbat Ka Dukaan at HCU today. Kudos to @RahulGandhi & Congress sarkaar You have outdone yourselves pic.twitter.com/NPZOqG7Uoh— KTR (@KTRBRS) March 30, 2025

Ramadan Special : Sheer Khurma Biryani And Other Traditional Foods10
రంజాన్‌ విందు: టేస్టీ.. టేస్టీగా..షీర్‌ కుర్మా, కచ్చీ బిర్యానీ చేసేయండిలా..!

రంజాన్‌ ఉపవాస దీక్షలు ముగించుకుని ఈదుల్‌ ఫిత్ర్‌ లేక రంజాన్‌ వేడుకను బంధుమిత్రులతో కలిసి ఆనందంగా సెలబ్రెట్‌ చేసుకుంటారు. ఈ పర్వదినాన్ని ఈద్‌ అని కూడా పిలుస్తారు. ప్రతి ఒక్కరూ ఈ రోజున వారి వారిస్థోమత మేరకు కొత్త దుస్తులు ధరించి, పలు రకాల తీపి వంటకాలు ముఖ్యంగా సేమియా/షీర్‌ ఖుర్మా, బిర్యానీ చేసుకుని ఆనందంగా విందు ఆరగిస్తారు. ఈ సందర్భంగా నోరూరించే ఆ వంటకాల తయారీ ఎలానో చూద్దామా..!.షీర్‌ కుర్మా..కావల్సినవి: పాలు – అర లీటర్‌ (3 కప్పులు); నెయ్యి – టేబుల్‌స్పూన్‌; పంచదార – ఒకటిన్నర టేబుల్‌ స్పూన్‌ (డేట్స్‌ ఎక్కువ వాడితే తక్కువ పంచదార వేసుకోవాలి); సేవియాన్‌ (వెర్మిసెల్లి)– అర కప్పు; జీడిపప్పు – 8 (తరగాలి); బాదంపప్పు – 8 (సన్నగా తరగాలి); పిస్తాపప్పు – 8 (తరగాలి); ఖర్జూర – 9 (సన్నగా తరగాలి); యాలకులు – 4 (లోపలి గింజలను ΄÷డి చేయాలి); బంగారు రంగులో ఉండే కిస్‌మిస్‌ – టేబుల్‌ స్పూన్‌; రోజ్‌వాటర్‌ – టీ స్పూన్‌తయారీ విధానం: సేవియాన్‌ను కొద్దిగా నెయ్యి వేసి బంగారురంగు వచ్చేలా వేయించి తీసి పక్కన పెట్టాలి.అదె గిన్నె లేదా పాన్‌లో మరికాస్త నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్‌ వేసి వేయించి తీయాలి ∙విడిగా పాలు మరిగించి, సన్నని మంట కాగనివ్వాలి. పాలు కొద్దిగా చిక్కబడ్డాక దీంట్లో వేయించిన సేవియాన్, పంచదార వేసి ఉడికించాలి. సేవియాన్‌ ఉడికాక మంట తగ్గించి డ్రై ఫ్రూట్స్‌ మిశ్రమం, యాలకుల పొడి వేసి కలిపి, మంట తీసేయాలి. తీపిదనం ఎక్కువ కావాలనుకునేవారు మరికాస్త పంచదార కలపుకోవచ్చు. కుంకుమపువ్వు, గులాబీ రేకలు, మరిన్ని డ్రై ఫ్రూట్స్‌ చివరగా అలంకరించుకోవచ్చు.నోట్‌: ఎండుఖర్జూరం ముక్కలు కలుపుకోవాలంటే వాటిని రాత్రిపూట నీళ్లలో నానబెట్టి మరుసటి రోజు ఉపయోగించాలి.కచ్చీబిర్యానీ..కావల్సినవి: బాస్మతి బియ్యం – పావు కేజీ (250 గ్రా.ములు); మటన్‌ – కేజీ (ముక్కలు 2 అంగుళాల పరిమాణం); అల్లం– వెల్లుల్లి పేస్ట్‌ – టేబుల్‌ స్పూన్‌; ఉల్లిపాయలు – 5 (నిలువుగా సన్నగా తరిగి, విడిగా వేయించి పక్కనుంచాలి); కారం – టేబుల్‌ స్పూన్‌; పసుపు – అర టీ స్పూన్‌; పచ్చి బొప్పాయి ముక్క – పేస్ట్‌ చేయాలి; చిలికిన పెరుగు – కప్పు; కుంకుమపువ్వు – కొన్ని రేకలు (గరిటెడు వేడి పాలలో కలిపి పక్కనుంచాలి)మటన్‌ మసాలా కోసం... (దాల్చిన చెక్క, 2 యాలకులు, 3 పచ్చ యాలకులు, 3 లవంగాలు, బిర్యానీ ఆకు, అర టీ స్పూన్‌ మిరియాలు, అర టీ స్పూన్‌ సాజీర) రైస్‌ మసాలా కోసం... (యాలకులు 2, దాల్చిన చెక్క, పచ్చ యాలక్కాయ, 2 లవంగాలు, నెయ్యి లేదా నూనె 3 టేబుల్‌స్పూన్లు, పుదీనా, కొత్తిమీర గుప్పెడు, ఉప్పు తగినంత)తయారీ విధానం:బేసిన్‌లో మటన్‌ వేసి అందులో పెరుగు, అల్లం వెల్లుల్లి ముద్ద, బొప్పాయి ముద్ద, కారం, పసుపు, మసాలా, ఉప్పు, వేయించిన ఉల్లిపాయల తరుగు సగం వేసి కలిపి, 3 గంటల సేపు నానబెట్టాలి. కప్పు బియ్యానికి రెండున్నర కప్పుల చొప్పున నీళ్లు, మసాలా, బియ్యం, తగినంత ఉప్పు వేసి ముప్పావు వంతు వరకు ఉడికించి, నీళ్లను వడకట్టాలి. తర్వాత అందులో నెయ్యి వేసి కలపాలి. మరో మందపాటి డేకిసా(గిన్నె) తీసుకొని నెయ్యి వేసి వేడయ్యాక నానిన మటన్‌ వేసి కలపాలి. పైన పుదీనా, కొత్తిమీర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, నిమ్మరసం వేయాలి. సగం ఉడికిన బియ్యం పైన లేయర్‌గా వేయాలి. మిగిలిన నెయ్యి, కుంకుమపువ్వు కలిపిన పాలు, నిమ్మరసం వేయాలి. డేకిసా మీద మూత పెట్టి, గోధుమపిండి ముద్దతో చుట్టూ మూసేయాలి. పెద్ద మంట మీద 20–25 నిమిషాలసేపు ఉడకనివ్వాలి. సన్నని మంట మీద మరో 40 నిమిషాలు ఉంచాలి. తర్వాత దించి, రైతా/ఏదైనా గ్రేవీతో వేడి వేడిగా వడ్డించాలి. (చదవండి: ప్రేమను పంచే శుభదినం ఈద్‌)

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement