Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Ysrcp Releases Video In Illegal Case Against Vallabhaneni Vamsi1
వంశీపై అక్రమ కేసు.. వీడియో బయటపెట్టిన వైఎస్సార్‌సీపీ

సాక్షి, తాడేపల్లి: వల్లభనేని వంశీపై పెట్టిన అక్రమ కేసులో వీడియోను వైఎస్సార్‌సీపీ బయట పెట్టింది. షాపింగ్ చేస్తున్న సత్యవర్థన్‌ వీడియోను ఆ పార్టీ విడుదల చేసింది. ‘సత్యమేవ జయతే’ అంటూ ట్వీట్ చేసింది. ‘‘తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ.. తప్పుడు కేసులు, అక్రమ నిర్బంధాలతో చట్టాన్ని.. న్యాయ వ్యవస్థలను అపహాస్యం చేస్తున్న చంద్రబాబు సర్కారు తీరుకు నిలువెత్తు నిదర్శనం ఇది’’ అని వైఎస్సార్‌సీపీ ఆధారాలతో సహా బట్టబయలు చేసింది.‘‘ఈ వీడియోలో బ్లూషర్ట్‌ వేసుకున్న వ్యక్తే సత్యవర్థన్‌. వల్లభనేని వంశీ కిడ్నాప్‌ చేశారంటూ పోలీసులు చెప్తున్న వ్యక్తి ఇతనే. మరి ఈ వీడియోను చూస్తే సత్యవర్థన్‌ కిడ్నాప్‌నకు గురైనట్టుగా ఉందా?’’ అని వైఎస్సార్‌సీపీ ప్రశ్నించింది.‘‘పోలీసులు ఆరోపిస్తున్న ఫిబ్రవరి 12న విశాఖపట్నంలోని ఆనందపురం జంక్షన్‌లో ఒక బట్టల దుకాణంలో స్వేచ్చగా షాపింగ్‌ చేసుకుంటున్న సత్యవర్థన్‌ వీడియో ఇది. కిడ్నాప్‌ చేసి, నిర్బంధించిన వ్యక్తి బయటకు ఎలా వస్తారు?. ఇలా స్వేచ్ఛగా షాపింగ్‌ ఎలా చేస్తారు?. దీని అర్థం పోలీసులు తప్పుడు కేసులు పెట్టారని.. వారి కుటుంబ సభ్యులను భయపెట్టి, బెదిరించి తప్పుడు ఫిర్యాదు తీసుకున్నారని ఈ వీడియో సాక్షిగా బయటపడింది’’ అని వైఎస్సార్‌సీపీ ట్వీట్‌ చేసింది.💣 Truth Bomb 💣సత్యమేవ జయతేతీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ, తప్పుడు కేసులు, అక్రమ నిర్బంధాలతో చట్టాన్ని, న్యాయవ్యవస్థలను అపహాస్యం చేస్తున్న @ncbn సర్కారు తీరుకు నిలువెత్తు నిదర్శనం ఇది.ఈ వీడియోలో బ్లూషర్ట్‌ వేసుకున్న వ్యక్తే సత్యవర్థన్‌. వల్లభనేని వంశీ కిడ్నాప్… pic.twitter.com/pAa5VMknV9— YSR Congress Party (@YSRCParty) February 26, 2025ఇదీ చదవండి: లోకేష్.. ఇవిగో ఆధారాలు..!

Vijay says DMK,Centre clash over Hindi is like KG students fighting2
‘ఏంటి బ్రో ఇది.. ఎల్‌కేజీ,యూకేజీ పిల్లల కొట్లాటలా ఉంది’

చెన్నై: ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వం,బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మధ్య తారా స్థాయికి చేరిన త్రీభాషా సూత్రం వివాదంపై ప్రముఖ హీరో, తమిళగ వెట్రి కళగం (టీవీకే)అధినేత విజయ్‌ విమర్శలు గుప్పించారు. తమిళనాడు, కేంద్ర ప్రభుత్వాల మధ్య వివాదాన్ని చిన్న పిల్లల కొట్లాటతో పోల్చారు.వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో అత్యధిక అసెంబ్లీ స్థానాల్ని కైవసం చేసుకునే దిశగా, వీలైతే అధికారంలోకి వచ్చేలా టీవీకే అధ్యక్షుడు విజయ్‌ పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా బుధవారం టీవీకే తొలి వార్షికోత్సవం నిర్వహించారు.ఈ సందర్భంగా విజయ్‌ జాతీయ విద్యావిధానం – 2020 (NEP-2020) పై మాట్లాడారు. త్రిభాషా సూత్రం ప్రకారం.. రాష్ట్రాలు తప్పనిసరిగా త్రిభాషా (హిందీ, ఇంగ్లిష్‌, ప్రాంతీయ భాష) సూత్రాన్ని అమలు చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ విధానం అమలు చేయకపోతే కేంద్రం రాష్ట్రాలకు నిధులు కేటాయించమని కేంద్రం ప్రకటించిందంటూ వస్తోన్న ఆరోపణలపై నవ్వారు. త్రిభాషను అమలు చేయాలని కేంద్రం అనడం.. హిందీ కారణంగానే ఉత్తరాదిలో ప్రాంతీయ భాషల పరిధి తగ్గుతుందని, దాన్ని అమలు చేయబోమని డీఎంకే అనడం ఎల్‌కేజీ, యూకేజీ పిల్లల గొడవలా ఉందని వ్యాఖ్యానించారు. త్రిభాషా సూత్రంపై సోషల్‌ మీడియాలో డీఎంకే, బీజేపీ చేస్తున్నక్యాంపెయిన్‌ను తప్పుబట్టారు. వీళ్లు సోషల్‌ మీడియాలో హ్యాష్‌ ‍ట్యాగ్స్‌తో కుటిల రాజకీయం చేస్తున్నారు. ఒకరు డ్యాన్స్‌ చేస్తుంటే.. మరొకరు పాటపాడుతున్నారు. వీళ్లిద్దరి గొడవ ఎల్‌కేజీ, యూకేజీ పిల్లల కొట్లాటలా ఉంది. సోషల్‌ మీడియాలో పోరాటం చేస్తూ మనల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఏంటి బ్రో .. ఇది.. చాలా తప్పు బ్రో అని ఎద్దేవా చేశారు.అదే సమయంలో త్రిభాషా విధానాన్ని విజయ్ వ్యతిరేకించారు. ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. తాము అన్ని భాషలను గౌరవిస్తామని, తమిళనాడు భాషా విధానాన్ని భంగపరిచే ఉద్దేశ్యంతో రాజకీయంగా ఏ భాషనైనా బలవంతంగా రుద్దేందుకు యత్నిస్తే మాత్రం వ్యతిరేకిస్తామన్నారు. త్రిభాష సూత్రం అమలును అంగీకరించకపోతే.. తమిళనాడుకు రావాల్సిన 2 వేల400 కోట్ల నిధులను కేంద్రం నిలిపివేస్తామనడం సరికాదన్నారు. కేంద్రం నుంచి ఆ నిధులను పొందడం తమ హక్కు అని ఆయన అన్నారు.రెండు పార్టీలపై సెటైర్లు వేస్తూ బీజేపీ,డీఎంకేలు.. అవి ఫాసిజం, పాయసం లాంటివి.. వాళ్లు ఫాసిజం, ఫాసిజం, ఫాసిజం అని మాట్లాడుతారు. అవి ఏంటి? పాయసమా? అంటూ సెటైర్లు వేశారు విజయ్.

Minister Uttam Kumar Reddy Press Meet On Slbc Tunnel Incident3
వారు బతికున్నారన్న నమ్మకంతోనే రెస్క్యూ చేస్తున్నాం : ఉత్తమ్

సాక్షి, నాగర్‌కర్నూల్‌: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ప్రమాదంలో చిక్కుకున్న ఎనిమిది మందిని రక్షించేందుకు అధికార యంత్రాంగం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. గ్యాస్‌ కట్టర్‌లతో టీబీఎం మెషీన్‌ భాగాలను తొలగిస్తున్నామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వాటర్‌ను బయటకు పంపే క్రమంలో నిన్న(మంగళవారం) రెస్క్యూ కాస్త ఆలస్యమైందన్నారు. రెస్క్యూలో పాల్గొన్న వారు రిస్క్‌లో పడకూడదన్న నిర్ణయంతో ముందుకు వెళ్తున్నామని ఉత్తమ్‌ వివరించారు.‘‘మరో రెండురోజుల్లో ఆచూకీ తెలుసుకుంటాం. వారు బతికున్నారన్న నమ్మకంతోనే రెస్క్యూ ఆపరేషన్‌ వేగవంతం చేశాం. టన్నెల్‌లో బురద పేరుకుపోయింది. 15 నుంచి 20 మీటర్ల వరకు బురద నీటితో కూరుకుపోయింది. అధికారులు నిబద్ధతతో పనిచేస్తున్నారు. దీన్ని రాజకీయ కోణంలో చూడకూడదు. ఒక మానవీయ కోణంపై విపక్షాలు దిగజారి మాట్లాడుతున్నాయి. దేశంలోని అన్ని బెస్ట్‌ రెస్క్యూ టీములను రప్పించాం’’ అని ఉత్తమ్‌ తెలిపారు.కాగా, గల్లంతైన 8 మంది కార్మికులు, ఉద్యోగుల క్షేమంపై ఆశలు ఆవిరవుతున్నాయి. నిన్న కూడా(మంగళవారం) సొరంగంలోకి వెళ్లిన ఎన్డీఆర్‌ఎఫ్, ర్యాట్‌ హోల్‌ మైనర్లతో కూడిన రెస్క్యూ బృందం ఎట్టకేలకు సొరంగం చివరివరకు చేరుకుని ప్రమాద స్థలంలో విస్తృతంగా గాలించింది. పైకప్పు కూలడంతో పెద్ద మొత్తంలో కిందపడిన బండ రాళ్లు, కంకరతో నిండిపోయిన ఆ ప్రాంతంలో ఎక్కడా కార్మికుల ఉనికి కనిపించలేదు. ఈ బృందం పూర్తిగా ప్రమాద స్థలానికి చేరుకుని లోపలి నుంచి ల్యాండ్‌లైన్‌ ఫోన్‌ ద్వారా బయటకి ఈ సమాచారం అందించగానే కార్మికుల క్షేమంపై అధికారులందరూ దాదాపుగా ఆశలు వదులుకున్నారు. టన్నుల కొద్దీ బండరాళ్లు, కంకర, మట్టి, యంత్రాల తుక్కు కిందే కార్మికులు నలిగిపోయి ఉంటారనే అనుమానాలు మరింతగా బలపడ్డాయి.

Champions Trophy 2025: Ibrahim Zadran Shines With Super Century, Afghanistan Sets Huge Target To England4
Champions Trophy 2025: చరిత్ర సృష్టించిన జద్రాన్‌.. రికార్డు శతకం.. ఆఫ్ఘనిస్తాన్‌ భారీ స్కోర్‌

ఛాంపియన్స్‌ ట్రోఫీ-2025లో (Champions Trophy) భాగంగా లాహోర్‌ వేదికగా ఇంగ్లండ్‌తో ఇవాళ (ఫిబ్రవరి 26) జరుగుతున్న కీలక సమరంలో ఆఫ్ఘనిస్తాన్‌ యువ ఓపెనర్‌ ఇబ్రహీం జద్రాన్‌ (Ibrahim Zadran) రికార్డు శతకం సాధించాడు. ఈ మ్యాచ్‌లో జద్రాన్‌ 146 బంతుల్లో డజను ఫోర్లు, అర డజను సిక్సర్ల సాయంతో 177 పరుగులు చేసి ఔటయ్యాడు. ఫలితంగా టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆఫ్ఘనిస్తాన్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 325 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఆఫ్ఘనిస్తాన్‌ ఇన్నింగ్స్‌లో రహ్మానుల్లా గుర్భాజ్‌ (6), సెదికుల్లా అటల్‌ (4), రహ్మత్‌ షా (4) విఫలం కాగా.. హష్మతుల్లా షాహిది (40), అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌ (41), మహ్మద్‌ నబీ (40) రాణించారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌ 3 వికెట్లు పడగొట్టగా.. లివింగ్‌స్టోన్‌ 2, జేమీ ఓవర్టన్‌, ఆదిల్‌ రషీద్‌ తలో వికెట్‌ తీశారు.ఈ మ్యాచ్‌లో సూపర్‌ సెంచరీతో అలరించిన జద్రాన్‌ పలు రికార్డులు కొల్లగొట్టాడు. ఛాంపియన్స్‌ ట్రోఫీ చరిత్రలోనే అత్యధిక స్కోర్‌ (177) నమోదు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌కు ముందు ఈ రికార్డు ఇంగ్లండ్‌ ఆటగాడు బెన్‌ డకెట్‌ పేరిట ఉండేది. డకెట్‌ ఇదే ఎడిషన్‌లో ఆస్ట్రేలియాపై 165 పరుగులు స్కోర్‌ చేశాడు.ఛాంపియన్స్‌ ట్రోఫీలో అత్యధిక వ్యక్తిగత స్కోర్లు..ఇ‍బ్రహీం జద్రాన్‌-177బెన్‌ డకెట్‌-165నాథన్‌ ఆస్టల్‌-145 నాటౌట్‌ఆండీ ఫ్లవర్‌-145సౌరవ్‌ గంగూలీ-141 నాటౌట్‌సచిన్‌ టెండూల్కర్‌-141గ్రేమీ స్మిత్‌-141ఈ సెంచరీతో జద్రాన్‌ మరో రెండు భారీ రికార్డులు కూడా సాధించాడు. వన్డేల్లో ఆఫ్ఘనిస్తాన్‌ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఈ రికార్డు గతంలో కూడా జద్రాన్‌ పేరిటే ఉండేది. జద్రాన్‌ తన రికార్డును తనే సవరించుకున్నాడు. 2022లో శ్రీలంకతో జరిగిన వన్డేలో జద్రాన్‌ 162 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌కు ముందు వరకు వన్డేల్లో ఆఫ్ఘనిస్తాన్‌ తరఫున ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోర్‌గా ఉండింది. వన్డేల్లో ఆఫ్ఘనిస్తాన్‌ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్లు..ఇబ్రహీం జద్రాన్‌-177 వర్సెస్‌ ఇంగ్లండ్‌, 2025ఇబ్రహీం జద్రాన్‌-162 వర్సెస్‌ శ్రీలంక, 2022రహ్మానుల్లా గుర్భాజ్‌-151 వర్సెస్‌ పాకిస్తాన్‌, 2023అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌-149 నాటౌట్‌ వర్సెస్‌ శ్రీలంక, 2024రహ్మానుల్లా గుర్భాజ్‌-145 వర్సెస్‌ బంగ్లాదేశ్‌, 2023ఈ సెంచరీతో జద్రాన్‌ రెండు ఐసీసీ వన్డే ఈవెంట్లలో సెంచరీలు చేసిన తొలి ఆఫ్ఘనిస్తాన్‌ ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. జద్రాన్‌.. వన్డే వరల్డ్‌కప్‌లో, ఛాంపియన్స్‌ ట్రోఫీలో సెంచరీలు చేశాడు. జద్రాన్‌.. 2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియాపై సూపర్‌ సెంచరీతో మెరిశాడు. ముంబైలో జరిగిన ఆ మ్యాచ్‌లో జద్రాన్‌ 129 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.ఈ రికార్డులతో పాటు జద్రాన్‌ మరో ఘనత కూడా సాధించాడు. పాక్‌ గడ్డపై నాలుగో అత్యధిక వన్డే స్కోర్‌ చేసిన ఆటగాడిగా నిలిచాడు. పాక్‌ గడ్డపై వన్డేల్లో అత్యధిక స్కోర్‌ చేసిన ఘనత గ్యారీ కిర​్‌స్టన్‌కు దక్కుతుంది. 1996 వరల్డ్‌కప్‌లో కిర్‌స్టన్‌ యూఏఈపై 188 పరుగులు (నాటౌట్‌) చేశాడు.పాక్‌ గడ్డపై వన్డేల్లో అత్యధిక స్కోర్లు..గ్యారీ కిర్‌స్టన్‌-188 నాటౌట్‌వివియన్‌ రిచర్డ్స్‌-181ఫకర్‌ జమాన్‌-180 నాటౌట్‌ఇబ్రహీం జద్రాన్‌-177బెన్‌ డకెట్‌-165ఆండ్రూ హడ్సన్‌-161జద్రాన్‌ అద్భుత పోరాటం​టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆఫ్ఘనిస్తాన్‌.. ఇంగ్లండ్‌ పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ ధాటికి 37 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆర్చర్‌.. 11 పరుగుల వద్ద గుర్భాజ్‌ను (6), 15 పరుగుల వద్ద సెదికుల్లా అటల్‌ను (4).. 37 పరుగుల వద్ద రహ్మత్‌ షాను (4) ఔట్‌ చేశాడు. ఈ దశలో జద్రాన్‌.. కెప్టెన్‌ హష్మతుల్లా షాహిది, అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌, మహ్మద్‌ నబీతో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పి ఆఫ్ఘనిస్తాన్‌ ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. సెంచరీ వరకు ఆచితూచి ఆడిన జద్రాన్‌.. ఆతర్వాత శివాలెత్తిపోయాడు. ఎడాపెడా బౌండరీలు బాది ఇంగ్లండ్‌ బౌలర్లకు చుక్కలు చూపించాడు. లివింగ్‌స్టోన్‌ వేసిన ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌ తొలి బంతికి జద్రాన్‌ ఔటయ్యాడు. జద్రాన్‌ ఔట్‌ కాపోయుంటే ఆఫ్ఘనిస్తాన్‌ ఇంకా భారీ స్కోర్‌ చేసేది. ఇదే ఓవర్‌లో నబీ కూడా ఔట్‌ కావడంతో ఆఫ్ఘనిస్తాన్ చివరి ఓవర్‌లో కేవలం​ 2 పరుగులు మాత్రమే చేయగలిగింది.

North Korea Opens Its Doors To Foreign Tourists For 1st Time Since Covid5
కిమ్‌ కీలక నిర్ణయం.. విదేశీ టూరిస్టులకు గుడ్‌న్యూస్‌

ఉత్తర కొరియాను సందర్శించాలనుకునే విదేశీ టూరిస్టులకు ఇది శుభవార్తే.. దాదాపు ఐదేళ్ల తర్వాత తొలిసారిగా విదేశీ పర్యాటకులకు ఆ దేశం తలుపులు తెరవబోతోంది. పర్యాటక రంగంపై ఫోకస్‌ పెట్టిన కిమ్‌ ప్రభుత్వం తమ దేశంలోకి అనుమతిస్తున్నట్లు తెలిపింది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌.. పర్యాటకాన్ని పునరుద్ధరించేందుకు సిద్ధమైనట్లు పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.కొన్ని వారాల క్రితం విదేశీయులు ఉత్తర కొరియాలో పర్యటించారని.. ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు కిమ్‌ సర్కార్‌ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించి విదేశీ మారక నిల్వలను పెంచుకోవడంపై దృష్టి పెడుతున్నట్లు సమాచారం.ఉత్తర కొరియా నిర్ణయంతో కెనడా, యూకే, న్యూజిలాండ్, చైనా వంటి దేశాల నుంచి అధిక సంఖ్యలో పర్యాటకులు ఉత్తర కొరియా వచ్చే అవకాశం ఉంది. కరోనా మహమ్మారి కారణంగా 2020 నుంచి ఉత్తర కొరియా పర్యాటకంపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఇన్నాళ్లుకు మళ్లీ విదేశీయులను అనుమతిస్తోంది.ఇదీ చదవండి: USA: ఎలాన్‌ మస్క్‌కు బిగ్‌ షాక్‌..

Amit Shah slams MK Stalin6
అవినీతిలో మాస్టర్స్ డిగ్రీ.. అమిత్‌షా చురకలు

చెన్నై: వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి విజయం సాధిస్తుందని కేంద్ర హోమంత్రి అమిత్‌షా జోస్యం చెప్పారు. ఇవాళ అమిత్‌ షా తమిళనాడులోని పలు జిల్లా‍ల్లో బీజేపీ పార్టీ కార్యాలయాల్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా అమిత్‌ షా.. తమిళ రాజకీయాలు, అసెంబ్లీ ఎన్నికలు, డీఎంకేలో అవినీతి వంటి అంశాలపై మాట్లాడారు. తమిళనాడులో అవినీతిలో మాస్టర్స్ డిగ్రీ చేసిన అవినీతి పరులంతా ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) సభ్యత్వం తీసుకున్నారు. ఒకరు క్యాష్ ఫర్ జాబ్ స్కామ్, మనీ లాండరింగ్‌, ఇసుక అక్రమ తవ్వకాలు, అక్రమ ఆస్తుల కేసులు నమోదయ్యాయి.నాకు కొన్ని సార్లు అనిపిస్తుంది అవినీతి పాల్పడే వారికి సభ్యత్వం ఇచ్చి డీఎంకే తన పార్టీలోకి చేర్చుకుంటుందేమోనని. తమిళనాడు డీఎంకే అధినేత, సీఎం ఎంకే స్టాలిన్‌, అతని కుమారుడు డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్‌లు రాష్ట్ర సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారు. ఆ ఇద్దరు నేతలు డీలిమిటేషన్‌పై సమావేశం నిర్వహించనున్నారు. ఇప్పటికే ఈ డీలిమిటేషన్‌పై ప్రధాని మోదీ స్పష్టం చేశారు.డీలిమిటేషన్‌ తర్వాత దక్షణాది రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానల సీట్లలో ఎలాంటి మార్పు ఉండబోదని.అన్నీ అవాస్తవాలేతమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ ప్రధాని మోదీపై ఆరోపణలు చేస్తున్నారు. కేంద్రం రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా అన్యాయం చేస్తోందని. ఆయన చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదు. రాష్ట్రానికి నిధుల కేటాయింపులపై యూపీఏ, ఎన్డీయేలను పోల్ల్చి చూస్తే.. ఎన్డీయే ప్రభుత్వం తమిళనాడుకు ఎక్కువ మొత్తంలో నిధుల్ని కేటాయించింది. మోదీ ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలలో తమిళనాడుకు రూ. 5 లక్షల కోట్ల రూపాయలు కేటాయించింది’ అని అమిత్‌ షా అన్నారు.కూటమిదే అధికారం..వచ్చే ఏడాది తమిళనాడులో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది. కుటుంబ రాజకీయాలు, అవినీతి అంతమొందిస్తాం. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని రాష్ట్రం నుంచి పంపించేస్తాం’ అని అమిత్‌ షా స్పష్టం చేశారు. దేశంలో జనగణన (Census) జరపాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రక్రియ అనంతరం లోక్‌సభ స్థానాల విభజన ప్రక్రియ ఉంటుందని సమాచారం. ఇప్పుడు ఇదే అంశాన్ని తమిళనాడు అధికార ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) అధినేత, సీఎం ఎంకే స్టాలిన్ వ్యతిరేకిస్తున్నారు. ఇదే అంశంపై చర్చించేందుకు మార్చి నెలలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 40 పార్టీలకు ఆహ్వానించారు. జన గణన ప్రక్రియ అనంతరం లోక్‌సభ స్థానాల విభజన ప్రక్రియ ఉండనుంది. అయితే, జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తీవ్రంగా నష్టపోయేది దక్షిణాది రాష్ట్రాలే అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. దీనిపై ఎంకే స్టాలిన్‌ ఆల్‌ పార్టీ మీటింగ్‌కు పిలుపునిచ్చారు.

Ysrcp Mlc Lella Appi Reddy Slams On Chandrababu Government7
‘ప్రధాన ప్రతిపక్ష గుర్తింపుపై చంద్రబాబు సర్కార్‌ నిరంకుశ వైఖరి’

సాక్షి, తాడేపల్లి: ప్రజాస్వామ్య స్పూర్తికి తూట్లు పొడుతూ అసెంబ్లీలో అసలు ప్రధాన ప్రతిపక్ష గుర్తింపునే ఇవ్వకుండా, ప్రశ్నించే గొంతు వినిపించకుండా కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి మండిపడ్డారు. ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాన ప్రతిపక్ష గుర్తింపు అంటే ఏదో రాజకీయపరమైన హోదాగా కూటమి పార్టీలు విషప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన ప్రతిపక్ష గుర్తింపు అనేది ఒక బాధ్యత, దీనివల్ల అసెంబ్లీలో ఎక్కువ సమయం ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు ఉండే అవకాశం వైఎస్సార్‌సీపీకి దక్కుతుందన్నారు. దీనిని కూడా వక్రీకరించడం దుర్మార్గమన్నారు.ఇంకా ఆయన ఏమన్నారంటే..ఏపీ అసెంబ్లీలో నాలుగు పార్టీలు ఉంటే, దానిలో మూడు పార్టీలు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నాయి. మిగిలిన వైఎస్సార్‌సీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాల్సి ఉంది. పార్లమెంట్ చట్టం 1977 ప్రకారం సభలో సభ్యుల సంఖ్యతో సంబంధం లేకుండా ప్రధాన ప్రతిపక్షంను గుర్తించాలి. కూటమి ప్రభుత్వం దీనిని ఏ మాత్రం ఖాతరు చేయడం లేదు. ప్రధాన ప్రతిపక్ష గుర్తింపును వైఎస్సార్‌సీపీ కోరుతుంటే దీనిని రాజకీయం చేయడం దుర్మార్గం. దీనిపై కూటమి పార్టీలు చేస్తున్న ఈ విమర్శలను చూసి ప్రజాస్వామికవాదులే ఆశ్చర్యపోతున్నారు.ప్రజా సమస్యలను ప్రస్తావించకుండా అడ్డుకుంటున్నారుతొమ్మిది నెలల కూటమి పాలనపై ఇప్పటికే ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత ప్రారంభమైంది. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను ఎక్కడా నెరవేర్చడం లేదు. మరోవైపు గ్రూప్-2 నిరుద్యోగులు, మిర్చి రైతులు, విద్యుత్ చార్జీల భారాన్ని మోయలేని ప్రజలు బాహాటంగానే ప్రభుత్వం మీద తమ నిరసనను తెలియచేస్తున్నారు. వీటన్నింటినీ ప్రజల పక్షాన ఎక్కడ వైఎస్సార్‌సీపీ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఎండగడుతుందోననే భయంతోనే కూటమి ప్రభుత్వం ఉంది. న్యాయంగా వైఎస్సార్‌సీపీకి దక్కాల్సిన ప్రధాన ప్రతిపక్ష గుర్తింపును దూరం చేస్తూ, ప్రజా సమస్యలపై ఎక్కడ వైఎస్సార్‌సీపీ తమను ప్రశ్నిస్తుందోనని కంగారుపడుతోంది. ప్రతిపక్షంగా అడిగే ప్రశ్నలకు అసెంబ్లీలో సమాధానం చెప్పుకోలేని నిస్సహాయ స్థితిలో కూటమి ప్రభుత్వం ఉంది. తమ పాలనా వైఫల్యాలను ప్రజాగొంతుకగా వైఎస్సార్‌సీపీ సభలో వినిపిస్తే తట్టుకోలేమనే ఉద్దేశంతోనే ప్రధాన ప్రతిపక్ష గుర్తింపును నిరాకరిస్తున్నారు.ప్రధాన ప్రతిపక్షంగా శాసనమండలిలో పోరాడుతున్నాంశాసనమండలిలో ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షంగా వైఎస్సార్‌సీపీ అనేక ప్రజా సమస్యలపై మాట్లాడుతోంది. ప్రధాన ప్రతిపక్ష గుర్తింపు ఉండటం వల్ల వైఎస్సార్‌సీపీ సభ్యులకు ఎక్కువ సమయం లభిస్తోంది. తాజాగా వైస్ చాన్సలర్ల బలవంతపు రాజీనామాలపై ప్రభుత్వాన్ని నిలదీయడంతో సమాధానం చెప్పలేక కూటమి ప్రభుత్వం కంగారు పడింది. గవర్నర్ ప్రసంగంలో మాట్లాడించిన మాటలు, చెప్పించిన అబద్ధాలపై నిలదీయడంతో అధికారపక్షం నీళ్ళు నమిలింది. తమ తప్పులను ఒప్పుకోవాల్సిన పరిస్థితిలో పడింది.ప్రజాస్వామ్యంలో అధికారపక్షానికి ఎంత బాధ్యత ఉంటుందో, ప్రధాన ప్రతిపక్షంకు అంతకంటే ఎక్కువ బాధ్యత ఉంటుంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో తెలుగుదేశానికి ప్రతిపక్షంగా చట్టసభల్లో మాట్లాడేందుకు ఎంతో సమయం లభించింది. సభలో ప్రధాన ప్రతిపక్షం లేకుండా చర్చలు జరిగితే వాటిని అర్థమవంతమైనవని అంటారా? ప్రధాన ప్రతిపక్షంగా ప్రశ్నించే వాటికి ధీటుగా సమాధానం చెప్పగలిగితేనే కూటమి ప్రభుత్వ పాలనా సామర్థ్యం ప్రజలకు తెలుస్తుంది. ఇటువంటి సంప్రదాయాలకు తిలోదకాలు ఇస్తూ, అసలు ప్రధాన ప్రతిపక్ష గుర్తింపే లేకుండా, ప్రశ్నించేవారే లేకుండా ఏకపక్షంగా పాలనను సాగించాలని అనుకోవడం నిరంకుశత్వం అవుతుంది. సంఖ్యాబలం రీత్యా మాకే ప్రధాన ప్రతిపక్ష గుర్తింపు వస్తుందంటే, జనసేన పార్టీ కూటమి ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించాలి.

Shah Rukh Khan leaves Mannat and to Live in Rented Flat with family8
సొంతిల్లు ఖాళీ చేయనున్న హీరో.. కుటుంబంతో అద్దె ఇంట్లోకి!

బాలీవుడ్‌ స్టార్‌ షారూఖ్‌ ఖాన్‌ (Shah Rukh Khan) తన సొంతిల్లు మన్నత్‌ను వీడనున్నాడు. మన్నత్‌ (Mannat)ను వదిలేసి అద్దె ఇంట్లోకి షిఫ్ట్‌ కానున్నాడు. 25 ఏళ్లుగా కుటుంబంతో కలిసి నివసిస్తున్న ఇంటిని ఖాళీ చేయడానికి ప్రత్యేక కారణం ఉంది. మన్నత్‌ బంగ్లాను రెనోవేషన్‌ చేయనున్నారట. ఆ పనులు పూర్తయ్యేవరకు షారూఖ్‌ అద్దె అపార్ట్‌మెంట్‌లో ఉండనున్నారట!అద్దెకు నాలుగంతస్తులుతన కుటుంబంతోపాటు సిబ్బంది, సెక్యురిటీ.. ఇలా అందరికోసం బాంద్రాకు సమీపంలోని పూజా కాసా అపార్ట్‌మెంట్‌లో నాలుగంతస్తులను రెంట్‌కు మాట్లాడుకున్నారట! దీనికిగానూ నెలకు రూ.24లక్షలు అద్దె చెల్లించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మన్నత్‌ బంగ్లా పునరుద్ధరణ పనులు మే నెలలో ప్రారంభం కానున్నాయి. ఆ బంగ్లా మళ్లీ కొత్తగా తయారవ్వడానికి దాదాపు రెండేళ్లు పట్టే అవకాశం ఉంది.మూడేళ్లపాటు లీజుకుఇక షారూఖ్‌కు అపార్ట్‌మెంట్‌ అద్దెకిస్తోంది మరెవరో కాదు నిర్మాత వాసు భగ్నానీ. వాసు తనయుడు జాకీ భగ్నానీ (రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ భర్త), కూతురు దీప్శిక దేశ్‌ముఖ్‌లు.. నాలుగు అంతస్తులను షారూఖ్‌కు మూడేళ్లపాటు లీజుకు ఇచ్చేందుకు అగ్రిమెంట్‌ చేయించుకున్నారట! అయితే అంతకాలంపాటు షారూఖ్‌ అక్కడే ఉంటారా? అన్నది ప్రశ్నార్థకమే! షారూఖ్‌ చివరగా 2023లో 'పఠాన్‌', 'జవాన్‌', 'డంకీ' సినిమాలతో వరుస బ్లాక్‌బస్టర్స్‌ అందుకున్నాడు. సల్మాన్‌ ఖాన్‌ 'టైగర్‌ 3'లో అతిథి పాత్రలో మెరిశాడు.చదవండి: తొమ్మిదేళ్ల బంధం.. విడాకులు కావాలన్న నటి!

College doesnt matter resume not needed Bengaluru job offering Rs 40 LPA viral9
రూ.40 లక్షల జాబ్‌.. రెజ్యూమ్ కూడా అవసరం లేదు!

ఈరోజుల్లో జాబ్‌ తెచ్చుకోవడం ఎంత కష్టమో చూస్తూనే ఉన్నాం. మంచి అకడమిక్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ ఉండాలి. అంటే మంచి పేరున్న కాలేజీలో చదివుండాలి. ఎన్ని నైపుణ్యాలు ఉన్నా వాటిని రెజ్యూమ్‌లో ఆకట్టుకునేలా పేర్కొనకపోతే ఉద్యోగం కష్టమే. అయితే ఇవేవీ లేకుండా హై పేయింగ్‌ జాబ్‌ ఇస్తానంటున్నారు బెంగళూరుకు చెందిన ఓ కంపెనీ ఫౌండర్‌.బెంగళూరులో జాబ్‌.. ఏడాదికి రూ. 40 లక్షల వేతనం.. వారానికి ఐదు రోజులు ఆఫీసు నుంచి పని.. మంచి కాలేజీ నుంచి రావాల్సిన అవసరం లేదు.. అనుభవం అక్కర్లేదు.. కనీసం రెజ్యూమ్‌తో కూడా పని లేదు. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం కూడా లేదంటూ కంపెనీ ఫౌండర్‌ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ‘ఎక్స్‌’లో పెట్టిన పోస్ట్‌ ఆసక్తిని రేకెత్తించింది.బెంగళూరులోని ఇందిరానగర్‌లో తమ కార్యాలయానికి సున్నా నుంచి రెండేళ్ల వరకూ అనుభవం ఉన్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను నియమించుకోవాలని చూస్తున్నట్లు ‘స్మాలెస్ట్‌ ఏఐ’ కంపెనీ అధినేత సుదర్శన్ కామత్ తెలిపారు. "‘స్మాలెస్ట్‌ ఏఐ’ కంపెనీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో క్రాక్డ్‌ ఫుల్ స్టాక్ ఇంజనీర్ ను నియమించాలని చూస్తున్నాం. మిమ్మల్ని పరిచయం చేసుకుంటూ ఒక చిన్న 100 పదాల టెక్స్ట్ పంపండి చాలు" అంటూ ‘ఎక్స్’లో పోస్ట్‌ చేశారు. "మీది ఏ కాలేజీ అనేది ముఖ్యం కాదు".. "రెజ్యూమ్ అవసరం లేదు" అంటూ పేర్కొన్నారు.ఇక్కడ "క్రాక్డ్ ఇంజనీర్స్" అనేది నూతన మార్పులకు, కొత్త ఆలోచనలకు భయపడని అత్యంత సమర్థనీయులైన, ప్రతిభావంతులైన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లని వర్ణించడానికి ఉపయోగించే పదం. ఈ పోస్ట్ షేర్ చేసిన కొన్ని గంటల్లోనే వైరల్ గా మారింది. ఆకట్టుకునే రెజ్యూమె కంటే నైపుణ్యాలకు కామత్ ప్రాధాన్యత ఇచ్చారని పలువురు ఎక్స్ యూజర్లు ప్రశంసించారు. అయితే క్రాక్డ్‌ ఇంజనీర్ కు ఈ జీతం చాలా తక్కువ అని మరికొందరు వ్యాఖ్యానించారు.We are looking to hire a cracked full-stack engineer at @smallest_AI Salary CTC - 40 LPASalary Base - 15-25 LPASalary ESOPs - 10-15 LPAJoining - ImmediateLocation - Bangalore (Indiranagar)Experience - 0-2 yearsWork from Office - 5 days a weekCollege - Does not matter…— Sudarshan Kamath (@kamath_sutra) February 24, 2025

 I wearing mangalsutra, bangles says American shares how she responded to Indian womans question10
మంగళసూత్రం, మెట్టెలు అందుకే.... అమెరికన్‌ మహిళ వీడియో వైరల్‌

సాంప్రదాయ భారతీయ వివాహాలలో వివాహిత మహిళలను మంగళసూత్రం, నుదుటిన బొట్టు, కాళ్లకు మెట్టెలు విధిగా పాటిస్తారు. మంగళసూత్రం భార్యాభర్తల మధ్య ప్రేమకు ప్రతీక అని. స్త్రీ మంగళసూత్రాన్ని ధరించినప్పుడు, వైవాహిక జీవితాన్ని అన్ని కష్టాల నుండి కాపాడుతుందని చెబుతారు. మహిళలు కూడా అది తమకు శుభప్రదంగా, మంగళకరంగా ఉంటుందని భావిస్తారు తాజాగా అమెరికాకు చెందిన ఒక మహిళ మంగళసూత్రాలు, మెట్టెలు, పట్టీలు బొట్టు ధరించడం విశేషంగా నిలిచింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది అంతేకాదు భారతదేశంలో వివాహిత హిందూ మహిళలు ధరించే మంగళసూత్రం లేదా కుంకుమ, ఎందుకు ధరిస్తారనే ప్రశ్నలకు కౌంటర్‌ కూడా ఇచ్చింది.గోవాకు చెందిన వ్యక్తిని వివాహం చేసుకుంది అమెరికాకుచెందిన జెస్సికా. సూపర్ మార్కెట్ నుంచి బైటికి వస్తున్నప్పుడు ఆమె మెడలో మంగళసూత్రం, మెట్టెలు, పట్టీలు పెట్టుకొని, భారతీయ సంప్రదాయాలను స్వీకరించడం గురించి ఒక అమెరికన్ మహిళ సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్ అయ్యింది. అమెరికాలో ఉంటూ కూడా ఇవన్నీ ధరించడం చర్చకు దారితీసింది. ఇలా ఎందుకు ధరిస్తావని అమెరికాలోని ఇండియన్స్‌ తనని విచిత్రమైన ప్రశ్నలు అడుగుతారని చెప్పుకొచ్చింది. ‘నేను ఒక భారతీయడ్ని పెళ్లి చేసుకున్నా. వివాహిత హిందూ మహిళ ఈ వస్తువులను ధరించడం కామనే కదా.. అని చెప్పాను. ఇలా చెప్పడం కరెక్టే కదా. నేను సరిగ్గానే స​మాధానం చెప్పానా?’ కామెంట్‌ చేయాలంటూ నెటిజనులను కోరింది.చదవండి: వింగ్‌డ్‌ బీన్స్‌..పోషకాలు పుష్కలం : ఒకసారి పాకిందంటే!ఒక్క ర​‍క్త పరీక్ష : రానున్న పదేళ్లలో మన మరణం గుట్టు! కొత్త పరిశోధన నెటిజన్లు ఏమన్నారంటేఆచారాలను పాటిస్తూ, భర్త సంస్కృతిని గౌరవించినందుకు చాలామంది జెస్సికాను ప్రశంసించారు. మరికొందరు తమ అనుభవాలను పంచుకున్నారు. పంజాబీ సిక్కుని పెళ్లి చేసుకొని 39 ఏళ్లు. అయినా ఇప్పటికే ప్రశ్నలు ఎదురైతాయి. అయినా వాటిని ధరించడం ఇష్టం.. అందుకే వేసుకుంటాను.. సత్ శ్రీ అకల్ అని చెప్పి వెళ్ళిపోతాను అని ఒకరు వ్యాఖ్యానించగా, పెళ్లై 23 ఏళ్లు..అయినా సరే భారతీయ ఆహారం ఇష్టమా? దానిని ఎలా వండాలో తెలుసా? అని అడుగుతారు.. వచ్చు అని చెబితే తెగ ఆశ్చర్య పోతారు అంటూ ఒకింత అసహనం వ్యక్తం చేసింది మరో మహిళ. ‘‘ఎయిర్‌పోర్టుల్లో సెక్యూరిటీ సిబ్బంది కూడా అడుగుతారు.. ఒక భారతీయుడిని వివాహం చేసుకున్నానని వారికి చెబుతాను. అపుడు వారు దాన్ని లైక్‌ చేస్తారు. అలాగే నువ్వు నిజమైన భారతీయ మహిళవి' అన్నపుడు నాకు భలే గర్వంగా అనిపిస్తుంది. జెస్సికా సాంప్రదాయాలను పాటించడాన్ని ప్రేమిస్తున్నాను" అని మరొక యూజర్‌ రాశారు.కాగా ఇన్‌స్టాగ్రామ్‌లో వెర్నేకర్ ఫ్యామిలీ పేరుతో ఉన్న జెస్సికా వెర్నేకర్, భారతీయుడితో తన ప్రేమ, పెళ్లి గురించి కొన్ని రీల్స్‌ ద్వారా పంచుకుంది. స్పోర్ట్స్ బైక్‌పై ప్రయాణం ద్వారా అతణ్ని కలుసుకున్నట్టు గుర్తుచేసుకుంది. ఆ పరిచయం ప్రేమగా నైట్‌క్లబ్‌లకు వెళ్లి కలిసి నృత్యం చేసేవాళ్ళమని, పెళ్లి చేసుకున్నా మని తెలిపింది. తన భర్త అమ్మమ్మతో సహా తన కుటుంబాన్ని మొత్తం ఆకట్టుకున్నాడని చెప్పింది. ప్రస్తుతం జెస్సికా భర్తతో కలిసి అమెరికాలో నివసిస్తోంది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు.https://www.instagram.com/reel/DGdYI6dxmSo/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

National View all
title
అవినీతిలో మాస్టర్స్ డిగ్రీ.. అమిత్‌షా చురకలు

చెన్నై: వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమ

title
‘ఏంటి బ్రో ఇది.. ఎల్‌కేజీ,యూకేజీ పిల్లల కొట్లాటలా ఉంది’

చెన్నై: ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) నేతృత్వంలోని తమిళనాడు

title
నిర్మాత కేదార్‌ మరణంపై సీఎం రేవంత్‌ సంచలన వ్యాఖ్యలు

సాక్షి,ఢిల్లీ : టాలీవుడ్‌ నిర్మాత కేదార్‌ సెలగంశెట్టి

title
డీఆర్‌డీవో శాస్త్రవేత్తకు ఐదు కిడ్నీలు

ముంబై: రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో)లో పనిచేసే శాస్త్రవేత్త శరీరంలో ఇప్పుడు ఒకటీ రెండూ కాదు..

title
Jammu and Kashmir: ఆర్మీ వాహనంపై ఉగ్రవాదుల కాల్పులు

జమ్మూ: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల కాల్పుల కలకలం సృష్టిస్తున్న

International View all
title
కిమ్‌ కీలక నిర్ణయం.. విదేశీ టూరిస్టులకు గుడ్‌న్యూస్‌

ఉత్తర కొరియాను సందర్శించాలనుకునే విదేశీ టూరిస్టులకు ఇది శుభవార్తే..

title
ఒక్క ర​‍క్త పరీక్ష : రానున్న పదేళ్లలో మన మరణం గుట్టు! కొత్త పరిశోధన

ఎన్నాళ్లు బతుకుతాం? ఎపుడు చచ్చిపోతాం?  ఎలాంటి జబ్బులొస్తాయి?

title
పౌరసత్వంపై ట్రంప్‌ సంచలన ప్రకటన.. వారందరికీ ‘గోల్డ్‌కార్డు’ వీసా

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నార

title
USA: ఎలాన్‌ మస్క్‌కు బిగ్‌ షాక్‌..

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికాలో కీలక పరిణామం చోటుచేసుకుంది

title
పుతిన్‌కు అండగా ట్రంప్‌ సంచలన నిర్ణయం.. భారత్‌ వైఖరి ఇదే..

ఐక్యరాజ్యసమితి: బైడెన్‌ సారథ్యంలోని అమెరికా ప్రభుత్వం గత మూడ

NRI View all
title
Hong kong: హాంకాంగ్‌లో ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం

హాంకాంగ్ తెలుగు సమాఖ్య అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం 2025ని ఘనంగా జరుపుకుంది.

title
తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో “నా భాషే నా శ్వాస” సదస్సు విజయవంతం

డాలస్ :  ఉత్తరఅమెరికా తెలుగుసంఘం (తానా) సాహిత్యవిభాగం

title
డా. తాడేపల్లి లోకనాథశర్మ శాస్త్రీయ సంగీతంపై ప్రత్యేక భాషణం

శ్రీ సాంస్కృతిక కళాసారథి సంస్థ ఆధ్వర్యంలో సింగపూర్‌లో తెలుగువారి కోసం, గానకళానిధి కలైమామణి డాక్టర్ తాడేపల్లి లోకనాథశర్మ

title
Canada New Visa Rules : భారతీయ విద్యార్థులు, వర్కర్లకు పీడకల!

వలసదారుల విషయంలో  డొనాల్డ్‌ ట్రంప్‌ నేతృత్వంలోని అమెరికా కఠిన చర్యలు ఆ

title
ఎఫ్‌బీఐ డైరెక్టర్‌ కాశ్‌ పటేల్‌ లవ్‌స్టోరీ : అందంలోనే కాదు టాలెంట్‌లోనూ!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌  ట్రంప్‌ (Donald Trump) తన  మద్దతు ద

Advertisement

వీడియోలు

Advertisement