Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Heavy Rain In YSR And Anantapur Districts Huge Crop Loss1
AP: ఈదురు గాలులు, వడగళ్ల వాన బీభత్సం.. 1000 ఎకరాల్లో..!

వైఎస్సార్‌ జిల్లా: వైఎస్సార్‌, అనంతపురం జిల్లాలల్లో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. శనివారం అర్థరాత్రి ఈదురు గాలులతో కూడా వడగళ్ల వానకు భారీ ఎత్తున అరటి పంటలు నేలకూలాయి. శనివారం అర్ధరాత్రి పులివెందుల నియోజకవర్గంలోని లింగాల మండలంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. మండలంలోని కోమనంతల, వెలిగండ్ల, పార్నపల్లి, లింగాల గ్రామాలతో పాటు అనేక గ్రామాలలో నేలకొరిగిన అరటి చెట్లు నేలకూలాయి. సరిగ్గా కోతకు వచ్చిన సమయంలో భారీ పంట నష్టం ఏర్పడింది. చేతి కందిన పంట నేలకూలడంతో లబోదిబోమని అంటున్నారు రైతులు.రెండు జిల్లాలో పరిధిలో సుమారు 1000 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. ఆకస్మికంగా వచ్చిన ఈదురుగాలులతో కూడా వడగాళ్ల వానకు తన పంట పూర్తిగా నేలకొరికిందని అనంతపురం జిల్లాకు చెందిన ఇద్దరు రైతుల ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. పురుగుల మందుల తాగి లక్ష్మీ నారాయణ, వెంగప్ప అనే రైతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ప్రస్తుత వీరికి పులివెందుల మెడికల్ కాలేజ్ లో చికిత్స అందిస్తున్నారు. పంట నష్టపోయిందని బాధతో అధికారులకు ఫోన్ చేస్తే ఈ రోజు సెలవు అన్నారని , దాంతోనే వీరు ఆత్మహత్యకు పాల్పడ్డారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు..పులివెందుల నియోజకవర్గంలో భారీ పంట నష్టంపులివెందుల నియోజకవర్గంలో భారీ అరటి పంట నష్టం జరిగిందని హార్టికల్చర్‌ అధికారి రాఘవేంద్ర​ రెడ్డి తెలిపారు. నియోజకవర్గంలోని లింగాలలో భారీగా అరటి చెట్లు నేలకూలయాన్నారు. నిన్న రాత్రి ఆకస్మాత్తుగా వచ్చిన వర్షం, ఈదురుగాలులతో తీవ్రంగా నష్టం వాటిల్లినట్లు తెలిపారు. దీనిపై ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక పంపామని రాఘవేంద్ర రెడ్డి తెలిపారు. మొత్తం రూ. 20 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నామన్నారు.

YSRCP President YS Jagan letter to PM Modi On Delimitation2
1971 జనాభా లెక్కలే ప్రాతిపదిక కావాలి: వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: దేశంలో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్‌)కు 1971 జనాభా లెక్కలే ప్రాతిపదిక కావాలని.. ప్రస్తుత జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్‌ ప్రక్రియ చేపడితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీకి వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి( YS Jagan Mohan Reddy) వివరించారు. జాతీయ ప్రాధాన్యతగా జనాభా నియంత్రణను నిజాయితీగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలకు డీలిమిటేషన్‌ ప్రక్రియ శిక్షగా మారకూడదని స్పష్టంచేశారు. దామాషా ప్రకారం అన్ని రాష్ట్రాల్లో సీట్ల పెరుగుదల అంశాన్ని దృష్టిలో ఉంచుకుని డీలిమిటేషన్‌ కసరత్తు చేపడతామని హోం మంత్రి అమిత్‌షా హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఆ హామీ అమలుకు అడ్డంకిగా మారిన రాజ్యాంగంలోని 81(2)(ఏ) అధికరణ(ఆర్టికల్‌)ను సవరిస్తూ రాజ్యాంగ సవరణ చేయాలని కోరారు. దీనివల్ల సీట్లలో ఆయా రాష్ట్రాల వాటాలు అలానే ఉంటాయని, లోక్‌సభలో ఆయా రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గుతుందన్న అంశం ఉత్పన్నం కాదని స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోదీకి వైఎస్‌ జగన్‌ శుక్రవారం లేఖ రాశారు. శనివారం మీడియాకు విడుదల చేశారు. కొన్ని రాష్ట్రాల ప్రాతినిధ్యంతోపాటు ఆయా రాష్ట్రాల ప్రజల మనోభావాలను డీలిమిటేషన్‌ ప్రక్రియ ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున ఈ లేఖ రాస్తున్నానని తెలిపారు. డీలిమిటేషన్‌ ప్రక్రియపై వస్తున్న అభ్యంతరాలు దేశ సామాజిక, రాజకీయ సామరస్యాన్ని దెబ్బ తీసే అవకాశం ఉన్నందున, ఈ అంశం తీవ్రతను దృష్టిలో ఉంచుకోవాలని ప్రధాని మోదీని కోరారు. ఈ విషయంలో ప్రధానిగా మీ నాయకత్వం, మార్గ నిర్దేశం చాలా ముఖ్యమని.. మీరిచ్చే హామీ అనేక రాష్ట్రాలకున్న భయాలను, అపోహలను తొలగించడానికి దోహద పడుతుందని ప్రధానికి వైఎస్‌ జగన్‌ వివరించారు. లోక్‌సభలో ఇప్పుడున్న సీట్ల పరంగా ఆయా రాష్ట్రాలకు ఉన్న వాటాను కుదించకుండా పునర్విభజన (డీలిమిటేషన్‌) కసరత్తు చేపట్టాలని కోరారు. ఆ లేఖలో ఇంకా ప్రధానాంశాలు ఇలా ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గకూడదు రాజ్యాంగంలో 84వ రాజ్యాంగ సవరణ ప్రకారం 2026లో డీలిమిటేషన్‌ ప్రక్రియను చేపట్టాల్సి ఉంది. కానీ.. దీనికి ముందుగా 2021లో చేపట్టాల్సిన జనాభా లెక్కింపు ప్రక్రియ కోవిడ్‌ కారణంగా వాయిదా పడింది. 2026 నాటికి జనాభా లెక్కల ప్రక్రియను పూర్తి చేయడానికి ఇప్పటికే అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. ఇది జరిగిన వెంటనే డీలిమిటేషన్‌ ప్రక్రియ జరుగుతుందన్న అంశం అనేక రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తోంది. ముఖ్యంగా ఈ ప్రక్రియ ద్వారా తమ ప్రాతినిధ్యం తగ్గిపోతుందని దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జనాభా నియంత్రణను నిజాయితీగా చేయడం వల్లే.. జనాభా నియంత్రణ కోసం వివిధ రాష్ట్రాలు అనేక విధానాలు అమలు చేశాయి. అయితే వాటి ఫలితాలు ఆయా రాష్ట్రాల్లో వేర్వేరుగా ఉన్నాయి. దీని వల్ల జనాభా పెరుగుదల వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాలుగా ఉంది. దేశ వ్యాప్తంగా జనాభా వృద్ధి ఒకే తరహాలో లేదు. అసమతుల్యత ఉంది. దీని వల్ల డీలిమిటేషన్‌ అంశం విస్తృత స్థాయిలో ఆందోళనకు దారి తీస్తోంది. 42వ.. 84వ రాజ్యాంగ సవరణల ద్వారా ఆయా రాష్ట్రాలకు సీట్ల కేటాయింపును నిలిపేశారు. కాలక్రమేణా అన్ని రాష్ట్రాలు జనాభా నియంత్రణ కసరత్తులో భాగంగా ఒకే స్థాయిలో ఫలితాలు సాధిస్తాయని భావించి ఈ సీట్ల కేటాయింపును నిలిపేశారు. దేశ జనాభాలో ఆయా రాష్ట్రాల వాటా 1971 నాటికి అనుకున్న స్థాయికి చేరుకుంటుందని భావించారు. కానీ, 2011 జనాభా లెక్కల గణాకాంలను చూస్తే.. దశాబ్దాల తరబడి జనాభా వృద్ధి, దాని అంచనాలు అన్ని రాష్ట్రాల్లో ఒకేలా లేవని తేలింది. 1971, 2011 మధ్య 40 సంవత్సరాల్లో దేశ జనాభాలో దక్షిణాది రాష్ట్రాల వాటా తగ్గింది. గత 15 సంవత్సరాల్లో జనాభా మరింత తగ్గిందని మేం నమ్ముతున్నాం. జనాభా నియంత్రణను జాతీయ ప్రాధాన్యతగా తీసుకున్నందున, దక్షిణాది రాష్ట్రాలు నిజాయితీగా తమ విధానాలను అమలు చేయడం వల్ల ఈ వాటా తగ్గింది. 1971 జనాభా లెక్కల ప్రకారం దక్షిణాది రాష్ట్రాల జనాభా వృద్ధి రేటు 24.80 శాతం అయితే, 2011 జనాభా లెక్కల ప్రకారం 20.88 శాతంగా ఉంది. అపోహలు, భయాలు తొలగించండి రాష్ట్రాల్లో ఇప్పుడున్న జనాభా లెక్కలను ఆధారంగా చేసుకుని డీలిమిటేషన్‌ ప్రక్రియ జరిగితే దేశ విధానాల రూపకల్పన సహా శాసన ప్రక్రియలో దక్షిణాది రాష్ట్రాల భాగస్వామ్యం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని మీ దృష్టికి తీసుకు వస్తున్నాను. దామాషా ప్రకారం అన్ని రాష్ట్రాలకు సీట్ల పెరుగుదల అంశాన్ని దృష్టిలో ఉంచుకుని డీలిమిటేషన్‌ కసరత్తు చేపడతామని హోం మంత్రి అమిత్‌షా హామీ ఇచ్చినందుకు కృతజ్ఞతలు. అయితే ఈ హామీని అమలు చేయాలంటే రాజ్యాంగ పరంగా చేయాల్సిన సడలింపును కూడా మీ దృష్టికి తీసుకు వస్తున్నాను. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 81 (2) (ఎ) జనాభా ప్రాతిపదికన ఆయా రాష్ట్రాలకు సీట్ల కేటాయింపు జరగాలని పేర్కొంది. దీని ప్రకారం డీలిమిటేషన్‌ ప్రక్రియలో ముందుకు వెళ్తే ఈ నిబంధన వల్ల హోంమంత్రి అమిత్‌షా ఇచ్చిన హామీని అమలు చేయడంలో అడ్డంకులు ఏర్పడతాయి. అందువల్ల దామాషా ప్రకారం ప్రతి రాష్ట్రానికి సీట్ల కేటాయింపుపై రాజ్యాంగ సవరణ చేయాల్సిన అవసరం ఉంది. దీని వల్ల సీట్లలో ఆయా రాష్ట్రాల వాటాలు అలానే ఉంటాయి, ఆయా రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గుతుందనే అంశం ఉత్పన్నం కాదు. డీలిమిటేషన్‌ ప్రక్రియపై వస్తున్న అభ్యంతరాలు దేశ సామాజిక, రాజకీయ సామరస్యాన్ని దెబ్బ తీసే అవకాశం ఉన్నందున ఈ అంశం తీవ్రతను దృష్టిలో ఉంచుకోవాలని కోరుతున్నాను. ఈ విషయంలో ప్రధానిగా మీ నాయకత్వం, మార్గనిర్దేశం చాలా ముఖ్యం. మీరిచ్చే హామీ అనేక రాష్ట్రాలకున్న భయాలను, అపోహలను తొలగించడానికి దోహద పడుతుంది.డీఎంకే నాయకులకు లేఖ ప్రతి డీలిమిటేషన్‌ ప్రక్రియపై దక్షిణాది రాష్ట్రాల అఖిలపక్ష కమిటీ సమావేశం శనివారం చెన్నైలో డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు సీఎం స్టాలిన్‌ నేతృత్వంలో జరిగింది. ఈ సమావేశం నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు.. ఆయన ప్రధాని మోదీకి రాసిన లేఖ ప్రతిని ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి డీఎంకే నాయకులకు పంపారు.

ipl 2025 SRH Vs Rajasthan Royals live updates and highlights3
IPL SRH Vs RR: రాజస్తాన్‌ రాయల్స్‌ వర్సెస్‌ ఎస్‌ఆర్‌హెచ్‌ లైవ్‌ అప్‌డేట్స్‌

IPL 2025- SRH VS Rajasthan Royals Match Live Updates9 ఓవర్లకు రాజస్తాన్‌ స్కోర్‌: 108/39 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్‌ రాయల్స్‌ 3 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. క్రీజులో సంజూ శాంసన్‌(48), ధ్రువ్‌జురెల్‌(38) ఉన్నారు.రాజస్తాన్‌ మూడో వికెట్‌ డౌన్‌నితీష్‌ రాణా రూపంలో రాజస్తాన్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. 11 పరుగులు చేసిన రాణా.. మహ్మద్‌ షమీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 5 ఓవర్లకు రాజస్తాన్‌ స్కోర్‌: 57/3. క్రీజులో సంజూ శాంసన్‌(32), ధ్రువ్‌జురెల్‌(3) ఉన్నారు.రాజస్తాన్‌కు భారీ షాక్‌..287 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌కు భారీ షాక్ త‌గిలింది. సిమ్రాన్‌జీత్ సింగ్‌ వేసిన రెండో ఓవర్‌లో రాజస్తాన్‌ వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. తొలుత య‌శ‌స్వి జైశ్వాల్‌(1).. తర్వాత రియాన్‌ పరాగ్‌(4) పెవిలియన్‌కు చేరాడు. 3 ఓవర్లకు ఎస్‌ఆర్‌హెచ్‌ స్కోర్‌: 35/2భారీ ‍స్కోర్‌ చేసిన సన్‌రైజర్స్‌..ఉప్ప‌ల్ స్టేడియం వేదిక‌గా రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ బ్యాట‌ర్లు విధ్వంసం సృ​‍ష్టించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఎస్‌ఆర్‌హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 286 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్లలో ఇషాన్ కిషన్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. కేవలం 47 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్స్‌లతో 106 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు ట్రావిస్‌ హెడ్‌(67) హాఫ్‌ సెంచరీతో మెరవగా.. క్లాసెన్‌(34), నితీశ్‌ కుమార్‌(30) పరుగులతో రాణించారు. రాజస్తాన్‌ బౌలర్లలో తుషార్‌ దేశ్‌పాండే మూడు వికెట్లు పడగొట్టగా.. థీక్షణ రెండు, సందీప్‌ శర్మ ఒక్క వికెట్‌ సాధించారు. ఐపీఎల్‌ చరిత్రలో ఇది రెండో అత్యధిక స్కోర్‌ కావడం గమనార్హం.ఇషాన్ కిష‌న్ సెంచరీ..రాజ‌స్తాన్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ ఓపెన‌ర్ ఇషాన్ కిష‌న్ సెంచ‌రీతో మెరిశాడు. కేవ‌లం 45 బంతుల్లోనే త‌న తొలి ఐపీఎల్ సెంచ‌రీని కిష‌న్ అందుకున్నాడు.మూడో వికెట్ డౌన్‌నితీశ్ రెడ్డి రూపంలో ఎస్ఆర్‌హెచ్ మూడో వికెట్ కోల్పోయింది. 30 ప‌రుగులు చేసిన నితీశ్.. థీక్ష‌ణ బౌలింగ్‌లో పెవిలియ‌న్‌కు చేరాడు. క్రీజులో ఇషాన్ కిష‌న్(75), క్లాసెన్‌(1) ఉన్నారు. 16 ఓవ‌ర్ల‌కు ఎస్ఆర్‌హెచ్ స్కోర్‌: 219/3. ఇషాన్ కిష‌న్ హాఫ్ సెంచ‌రీ..ఇషాన్ కిష‌న్ హాఫ్ సెంచ‌రీతో మెరిశాడు. 25 బంతుల్లో కిష‌న్ త‌న హాఫ్ సెంచ‌రీ మార్క్‌ను అందుకున్నాడు. 70 ప‌రుగులతో కిష‌న్ త‌న బ్యాటింగ్‌ను కొన‌సాగిస్తున్నాడు. అత‌డి ఇన్నింగ్స్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 7 ఫోర్లు, 4 సిక్స్‌లు ఉన్నాయి. 14 ఓవ‌ర్ల‌కు ఎస్ఆర్‌హెచ్ స్కోర్‌: 196/2. ఎస్ఆర్‌హెచ్ రెండో వికెట్ డౌన్‌..ట్రావిస్ హెడ్ రూపంలో ఎస్ఆర్‌హెచ్ రెండో వికెట్ కోల్పోయింది. 67 ప‌రుగులు చేసిన హెడ్‌.. తుషార్ దేశ్ పాండే బౌలింగ్‌లో ఔట‌య్యాడు. 11 ఓవ‌ర్ల‌కు ఎస్ఆర్‌హెచ్ స్కోర్‌: 147/2. క్రీజులో నితీష్ కుమార్‌రెడ్డి(15), ఇషాన్ కిష‌న్(35) ఉన్నారు.ట్రావిస్ హెడ్ ఫిప్టీ.. ఎస్ఆర్‌హెచ్ ఓపెన‌ర్ ట్రావిస్ హెడ్ హాఫ్ సెంచ‌రీతో మెరిశాడు. కేవ‌లం 21 బంతుల్లోనే హెడ్ త‌న హాఫ్ సెంచ‌రీ మార్క్‌ను అందుకున్నాడు. హెడ్ 59 ప‌రుగుల‌తో త‌న బ్యాటింగ్‌ను కొన‌సాగిస్తున్నాడు. అత‌డి ఇన్నింగ్స్‌ల‌లో ఇప్ప‌టివ‌ర‌కు 8 ఫోర్లు, 3 సిక్స్‌లు ఉన్నాయి. 9 ఓవ‌ర్ల‌కు ఎస్ఆర్‌హెచ్ స్కోర్‌: 124/1.దూకుడుగా ఆడుతున్న హెడ్‌..ఎస్ఆర్‌హెచ్ ఓపెన‌ర్ ట్రావిస్ హెడ్ దూకుడుగా ఆడుతున్నాడు. కేవ‌లం 15 బంతుల్లో 41 ప‌రుగుల‌తో త‌న బ్యాటింగ్‌ను కొన‌సాగిస్తున్నాడు. అత‌డితో పాటు ఇషాన్ కిష‌న్‌(20) ప‌రుగులతో క్రీజులో ఉన్నాడు. 6 ఓవ‌ర్ల‌కు ఎస్ఆర్‌హెచ్ స్కోర్‌: 94/1తొలి వికెట్‌ డౌన్‌..టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ తొలి వికెట్ కోల్పోయింది. 24 ప‌రుగులు చేసిన అభిషేక్ శ‌ర్మ‌.. మ‌హేష్ థీక్ష‌ణ బౌలింగ్‌లో పెవిలియ‌న్‌కు చేరాడు. క్రీజులోకి ఇషాన్ కిష‌న్ వ‌చ్చాడు. 5 ఓవ‌ర్ల‌కు ఎస్ఆర్‌హెచ్ స్కోర్‌: 55/1ఐపీఎల్ 25 లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో ఉప్పల్‌ లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో రాజస్తాన్ రాయల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన రాజస్తాన్ కెప్టన్ రియాన్ పరాగ్.. ముందుగా సన్ రైజర్స్ ను బ్యాటింగ్ ఆహ్వానించాడు. పిచ్ ను చూస్తుంటే డ్రై వికెట్ గా ఉందని, దాంతోనే ముందుగా బౌలింగ్ తీసుకున్నట్లు తెలిపాడు.ఇరు జట్ల బలాబలాలు..ఐపీఎల్‌ 2025 సీజన్‌లో భాగంగా ఇవాళ (మార్చి 23) మధ్యాహ్నం జరుగబోయే మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు ఎస్‌ఆర్‌హెచ్‌ హోం గ్రౌండ్‌ ఉప్పల్‌ స్టేడియం (హైదరాబాద్‌) వేదిక కానుంది. గత సీజన్‌ ఫైనల్లో కేకేఆర్‌ చేతిలో ఓడి తృటిలో టైటిల్‌ చేజార్చుకున్న ఆరెంజ్‌ ఆర్మీ.. తొలి మ్యాచ్‌లో గెలిచి సీజన్‌ను ఘనంగా ప్రారంభించాలని భావిస్తుంది. గతేడాది మూడో స్థానంతో సరిపెట్టుకున్న రాయల్స్‌ సైతం గెలుపుతో సీజన్‌ను ప్రారంభించాలని పట్టుదలగా ఉంది.ఇరు జట్ల మధ్య హెడ్‌ టు హెడ్‌ రికార్డులు పరిశీలిస్తే.. రాయల్స్‌పై సన్‌రైజర్స్‌ కాస్త పైచేయి కలిగి ఉంది. ఇరు జట్లు ఇప్పటివరకు 20 మ్యాచ్‌ల్లో తలపడగా.. సన్‌రైజర్స్‌ 11, రాయల్స్‌ 9 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి. ఇరు జట్లు మధ్య జరిగిన గత మూడు మ్యాచ్‌ల్లో సన్‌రైజర్సే విజయం సాధించింది. హైదరాబాద్‌లో ఇరు జట్లు తలపడిన చివరిసారి (2023) మాత్రం రాయల్స్‌నే విజయం వరించింది. ఇరు జట్లు హైదరాబాద్‌లో నాలుగుసార్లు తలపడగా రాయల్స్‌ ఆ ఒక్కసారి మాత్రమే గెలుపొందింది.సన్ రైజర్స్ తుది జట్టుప్యాట్ కమిన్స్( కెప్టెన్‌), ట్రావిస్‌ హెడ్‌, అభిషేక్‌ శర్మ, ఇషాన్‌ కిషన్‌, నితీష్‌ కుమార్‌ రెడ్డి, క్లాసెన్‌, అంకిత్‌ వర్మ, అభినవ్‌ మనోహర్‌, సిమర్‌ జీత్‌ సింగ్‌, హర్షల్‌ పటేల్‌​; మహ్మద్‌ షమీరాజస్తాన్‌ తుది జట్టురియాన్‌ పరాగ్‌(కెప్టెన్‌), యశస్వి జైశ్వాల్‌, శివం దూబే, నితీష్‌ రానా, ధృవ్‌ జురెల్‌, షిమ్రోన్‌ హెట్‌ మెయిర్‌, జోఫ్రా ఆర్చర్‌, మహేశ్‌ తీక్షనా, తుషారా దేశ్‌ పాండే, సందీప్‌ శర్మ, ఫజల్‌ హక్‌ పరూఖి

Bengaluru Temple Chariot Collapse4
వీడియో వైరల్‌: జాతరలో అపశ్రుతి.. కుప్పకూలిన 120 అడుగుల రథం

బెంగళూరు: కర్ణాటకలోని బెంగళూరు శివార్లలో ఊరేగింపు సందర్భంగా 120 అడుగుల రథం కూలిన ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అనేకల్‌లోని హుస్కూర్‌లో శనివారం మద్దురమ్మ జాతర నిర్వహించారు. ఈ సందర్భంగా వంద అడుగులకుపైగా ఎత్తైన రెండు రథాలను ఆలయ నిర్వాహకులు సిద్ధం చేశారు.కాగా, ఊరేగింపు సందర్భంగా రెండు రథాలను తాళ్ల సహాయంతో భక్తులు లాగారు. అయితే ఈదురు గాలుల వల్ల120 అడుగుల ఎత్తైన రథం అదుపుతప్పి ఒక పక్కకు కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి చెందగా.. పలువులు గాయపడ్డారు. వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.మృతి చెందిన వ్యక్తిని తమిళనాడులోని హోసూర్‌కు చెందిన లోహిత్‌గా పోలీసులు గుర్తించారు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఏడాది కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. ఇదే ఉత్సవంలో రథం కూలిపోవడంతో.. పార్క్ చేసిన అనేక వాహనాలు దెబ్బతిన్నాయి, అయితే, ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.📍Karnataka | #Watch: 100 feet chariot fell down during Huskur Madduramma Devi Jatra Mahotsava in Anekal. Two people sustained serious injuries. pic.twitter.com/s0tTwPIiGo— NDTV (@ndtv) March 22, 2025

This Megastar House Open For Fans, Check Rate Inside5
మెగాస్టార్‌ ఇంట్లో బస చేసే ఛాన్స్‌.. రోజుకు రూ.75,000!

హీరోలు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. కాస్ట్‌లీ బంగ్లాలో నివసిస్తారు. వారిని చూసేందుకు స్టార్‌ హీరోల ఇంటిముందు పడిగాపులు కాస్తుంటారు ఫ్యాన్స్‌. అంతేకాదు.. కథానాయకుల లైఫ్‌స్టైల్‌ ఎలా ఉంటుంది? ఏం తింటారు? ఎక్కడకు వెళ్తుంటారు? ఇంద్రభవనంలాంటి ఇల్లు లోపల ఎలా ఉంటుంది? ఇలా అన్నీ తెలుసుకోవాలనుకుంటారు. అందుకే ఓ హీరో బంపరాఫర్‌ ఇస్తున్నారు. తన ఇంట్లో బస చేసే అవకాశం కల్పిస్తున్నారు. కాకపోతే హోటల్‌ మాదిరిగానే ఇక్కడ కూడా రోజుకింత అని డబ్బు కట్టి ఉండొచ్చట.. ఇంతకీ ఆ హీరో ఎవరు? ఆ ఇల్లు ఎక్కడ అనేది పూర్తి కథనంలో చదివేయండి..ఇంటిని అభిమానుల కోసం..మలయాళ మెగాస్టార్‌ మమ్ముట్టి (Mammootty)కి కేరళ కొచ్చిలోని పనంపిల్లి నగర్‌లో ఓ ఇల్లుంది. భార్య సుల్ఫాత్‌, కుమారుడు దుల్కర్‌ సల్మాన్‌ (Dulquer Salmaan), కూతురు కుట్టి సురుమితో కలిసి 2008 నుంచి 2020 వరకు ఇదే ఇంట్లో నివసించారు. ఆ తర్వాత ఎర్నాకులంలోని వేరే ఇంటికి షిఫ్ట్‌ అయ్యారు. అయినప్పటికీ అప్పుడప్పుడు ఈ పాతింటికి వస్తూ వెళ్తుంటారట! అయితే సకల వసతులు ఉన్న ఈ ఇంటిని ఖాళీగా ఉంచడం ఇష్టం లేక.. అభిమానులకు ఆతిథ్యం ఇస్తే ఎలా ఉంటుందని ఆలోచించారు. అనుకున్నదే తడవుగా ప్లాన్‌ను అమల్లోకి తెచ్చారు. ఒక్కరోజు ఉండాలంటే..ఇంతకాలం ఇంటిని బయటనుంచే ఫోటోలు తీసుకున్న అభిమానులు ఇప్పుడెంచక్కా ఇంట్లోనే బస చేయొచ్చు. మమ్ముట్టి గదిలో, దుల్కర్‌ గదిలో సేద తీరొచ్చు. తండ్రీకొడుకుల జ్ఞాపకాలతో ముడిపడి ఉన్న ప్రైవేట్‌ థియేటర్‌, గ్యాలరీ రూమ్‌ చూసేందుకు కూడా వీలు కల్పిస్తారట! ఈ ఇంట్లో ఒక్కరోజు బస చేయాలంటే రూ.75 వేలు చెల్లించాలి. ఏప్రిల్‌ 1 నుంచి బుకింగ్స్‌ మొదలుపెడతారట! ఎంత ఖర్చయినా పర్లేదు, మమ్ముట్టి ఇంటికి వస్తాం.. ఆయన్ను కలుస్తాం అనుకునేరు.. కేవలం ఆయన ఇంట్లో బస చేయడానికి మాత్రమే అవకాశం కల్పిస్తున్నారు. మమ్ముట్టిని, దుల్కర్‌ను కలిసేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేయరు.దుల్కర్‌ సల్మాన్‌ బెడ్‌రూమ్‌సినిమా..మమ్ముట్టి.. చివరగా డామినిక్‌ అండ్‌ ద లేడీస్‌ పర్స్‌ అనే సినిమా చేశారు. గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ దగ్గర పెద్దగా కలెక్షన్లు రాబట్టలేకపోయింది. ప్రస్తుతం మమ్ముట్టి బజూక అనే సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్‌ 10న విడుదల కానుంది. ఈ మూవీలో గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. డీనో డెనిస్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. దుల్కర్‌ సల్మాన్‌ విషయానికి వస్తే.. ఈయన చివరగా లక్కీ భాస్కర్‌ చిత్రంతో అలరించాడు. ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపించింది. ప్రస్తుతం కాంత, ఆకాశంలో ఒక తార, ఐయామ్‌ గేమ్‌ అనే సినిమాలు చేస్తున్నాడు. View this post on Instagram A post shared by VKation Experiences (@vkationexperiences) చదవండి: 'ఒకప్పటిలా లేదు.. ప్లాస్టిక్‌ సర్జరీ'.. పెదవి విప్పిన హీరోయిన్‌

Burnt 500 Notes Found In Justice yashwant Varma Residence6
జడ్జి ఇంట్లో నోట్ల కట్టల వ్యవహారంలో కీలక మలుపు!

ఢిల్లీ : హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ (Justice Yaswant Varma) ఇంట్లో కాలిన నోట్ల కట్టల ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ ఇంట్లోనే కాదు ఇంటి సమీపంలో చెత్త కుప్పలో కాలిన రూ.500 నోట్లు ప్రత్యక్షమవ్వడంతో కాలిన నోట్ల కట్టల ఘటనలో కీలక మలుపు తిరిగినట్లైంది.హోలీ పండుగ (మార్చి 14)న ఢిల్లీలో జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పెద్ద ఎత్తున కాలిన నోట్ల కట్టలు వెలుగులోకి వచ్చాయి. ఇదే అంశంపై సుప్రీం కోర్టు విచారణకు ఆదేశించింది. ప్రస్తుతం,ఈ కేసు ప్రస్తుతం విచారణలో ఉంది.#WATCH | A sanitation worker, Inderjeet says, "We work in this circle. We collect garbage from the roads. We were cleaning here 4-5 days back and collecting garbage when we found some small pieces of burnt Rs 500 notes. We found it that day. Now, we have found 1-2 pieces...We do… pic.twitter.com/qnLjnYvnfe— ANI (@ANI) March 23, 2025 ఈ విచారణ నేపథ్యంలో,జస్టిస్ వర్మ నివాసానికి సమీపంలోని చెత్తను శుభ్రం చేస్తున్న సమయంలో కాలిన రూ.500 నోట్ల ముక్కలు కనిపించాయి. అందుకు సంబంధించిన వీడియోలో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ఈ కాలిన నోట్లు ఎవరివన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ సందర్భంగా మున్సిపల్‌ కార్మికుడు ఇంద్రజిత్‌ మీడియాతో మాట్లాడుతూ.. మేం నాలుగైదు రోజుల క్రితం ఈ వీధిని శుభ్రం చేసే సమయంలో మాకు కాలిన నోట్ల కనిపించాయి. అవి ఎక్కడ నుంచి వచ్చాయో మాకు తెలియదు. శుభ్రం చేయడం మా పని. శుభ్రం చేసే సమయంలో ఇప్పటికీ కాలిన నోట్ల ముక్కలు కనిపిస్తున్నాయని అన్నారు. మరోవైపు, తన ఇంట్లో డబ్బులు లభ్యమైనట్లు వస్తున్న ఆరోపణలపై జస్టిస్ యశ్వంత్ వర్మ స్పందించారు. ఢిల్లీ హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయకు లేఖ రాశారు. ఈ ఘటనలో నిజా నిజాలు నిగ్గు తేల్చాలని విజ్ఞప్తి చేశారు.

they wanted to stay in the same barrack, Officers Says Not Possible7
మేము ఇ‍ద్దరం జైల్లో కూడా కలిసే ఉంటాం..!

ఉత్తర ప్రదేశ్‌ మీరట్‌కు చెందిన మర్చంట్ నేవీ ఆఫీసర్ సౌరభ్ రాజ్‌పుత్ మర్డర్ కేసులో వెన్నులో వణుకు పుట్టించే విషయాలు వెలుగులోకి చూస్తుండగా.. ముస్కాన్‌ రాక్షసత్వంపై సోషల్‌ మీడియాలో తీవ్ర చర్చ నడుస్తోంది. భర్తను చంపాక అతనితో జాలీగా ట్రిప్పులు వేసిన ముస్కాన్‌.. అతని పుట్టినరోజుతో పాటు హోలీ పార్టీ కూడా జరుపుకుంది. అయితే ఈ కేసులో వీరద్దర్నీ అరెస్ట్‌ చేసి ప్రస్తుతం పోలీస్‌ కస్టడీకి తీసుకున్నారు. దీనిలో భాగంగా చౌదరి చరణ్‌ సింగ్‌ జైల్‌ లో ఉన్న వీరిని పోలీసులు విచారిస్తున్నారు.జైల్లో కూడా కలిసే ఉంటామని..భర్తను హత్య చేసి జైలు పాలయ్యానన్న కనీస పశ్చాత్తాపం కూడా ముస్కాన్‌ లో కనిపించడం లేదు. జైల్లో కూడా తామిద్దరం కలిసే ఉంటామని పట్టుబట్టారు. ఇద్దర్నీ వేరు వేరు సెల్‌ లో వేయకండి.. తాము ఇద్దరం ఒకే చోట ఉంటామంటూ పోలీస్‌ అధికారులకు విజ్ఞప్తి చేశారు. అయితే ఇది జైలు నియమాలకు విరుద్ధమని, ఇలా ఒక పురుషుడు, ఒక మహిళ కలిసి ఉండటం సాధ్యం కాదని సదరు అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటివరకూ వారిద్దరితో మిగతా ఖైదీలు ఎవరూ మాట్లాడలేదని జైలు సూపరెండెంట్‌ విరేష్‌ రాజ్‌ శర్మ తెలిపారు. తొలిరోజు వీరు ఏమీ తినలేదని, తర్వాత నుంచి భోజనం చేస్తున్నారన్నారు. అయితే ఒకే సెల్‌ లో ఉంచాలని కోరినట్లు విరేష్‌ రాజ్‌ శర్మ పేర్కొన్నారు. ఇది విరుద్దం కావడంతో వారి అభ్యర్థనను తిరస్కరించినట్లు చెప్పారు. వీరిద్దరికి సెపరేట్‌ బారక్‌ లు ఇచ్చామని, దాంతో వారు కనీసం మాట్లాడే అవకాశం కూడా ఉండదన్నారు.వీరిద్దరూ డ్రగ్స్‌కు బానిసలువీరిద్దరూ డ్రగ్స్‌ కు బానిసలైన సంగతని విరేష్‌ రాజ్‌ శర్మ పేర్కొన్నారు. మెడికల్‌ రిపోర్ట్‌ లు ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో భాగంగా వీరికి ట్రీట్‌ మెంట్‌ కు కూడా ఇప్పించడానికి ఏర్పాట్లు చేసినట్లు ఇండియన్‌ న్యూస్‌ ఏజెన్సీ ఏఎన్‌ఐకి తెలియజేశారు.మాకు లాయర్‌ ను ఏర్పాటు చేయండితమ తరఫున వాదించడానికి లాయర్‌ కావాలని విజ్ఞప్తి చేశారు ఆ నిందితులిద్దరూ. తమ కుటుంబానికి న్యాయవాదిని ఏర్పాటు చేసుకునే స్థోమత లేదని, అందుచేత తమ తరఫున వాదించడానికి ప్రత్యేక గవర్నమెంట్‌ లాయర్‌ ను ఏర్పాటు చేయాలని చెప్పినట్లు మరో సీనియర్‌ పోలీస్‌ అధికారి తెలిపారు.#WATCH | Saurabh Rajput murder case | On accused Muskan Rastogi and Sahil Shukla, Senior Jail Superintendent Viresh Raj Sharma says, "They arrived 3 days ago and they said that they be lodged together or nearby barracks. They were told that as per the system in jail, there is no… pic.twitter.com/5vKpgzXEe0— ANI (@ANI) March 23, 2025ప్రియుడితో కలిసి భర్త హత్యసౌరభ్ గుండెల్లో కత్తితో మూడు సార్లు పొడిచింది. కత్తి లోతుగా అతడి గుండెల్లో దిగబడింది. ముస్కాన్ అతి దారుణంగా సౌరభ్ గుండెను చీల్చి పడేసింది. తర్వాత తలను శరీరంనుంచి వేరు చేసింది. శరీరాన్ని ముక్కలుముక్కలుగా కొసి పడేసింది. ముక్కల్ని డ్రమ్‌లో పడేసింది. ముస్కాన్ చేసిన దారుణం తెలిసి డాక్టర్లే షాక్ అయిపోయారు.ఇక, పోలీసులు కేసు దర్యాప్తులో భాగంగా హిమాచల్ ప్రదేశ్ వెళ్లారు. ముస్కాన్ పినతల్లిని కలిశారు. ఆమె ముస్కాన్‌పై ఫైర్ అయింది. చేసిన ఘోరానికి తన కూతురికి ఉరి శిక్ష వేయాలని డిమాండ్ చేసింది. ఈ దారుణంలో ముస్కాన్ హస్తంతో పాటు ఆమె ప్రియుడు సాహిల్ హస్తం కూడా ఉంది. ఇద్దరూ కలిసి, పక్కా ప్లాన్ ప్రకారం సౌరభ్‌ను చంపేశారు. మృతదేహాన్ని కనిపించకుండా చేసి తప్పించుకుందామనుకున్నారు. చాలా నాటకాలు ఆడారు. అవేవీ ఫలించలేదు. సౌరభ్ తల్లిదండ్రులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సౌరభ్ గురించి ఎంక్వైరీ చేయగా.. మర్డర్ విషయం బయటపడింది.ప్రేమ పెళ్లి.. ప్రియుడి కోసం..ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన సౌరభ్ రాజ్‌పుత్ అదే ప్రాంతానికి చెందిన ముస్కాన్ రస్తోగి ప్రేమించుకున్నారు. 2016లో పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత భార్యతో గడపడానికి టైం దొరకటం లేదని నేవీలో ఉద్యోగం మానేశాడు. ఇంట్లో గొడవలు అవ్వటంతో భార్యతో కలిసి వేరుకాపురం పెట్టాడు. 2019లో వీరికి ఓ ఆడపిల్ల పుట్టింది. బిడ్డపుట్టిన తర్వాత సౌరభ్‌కు ఓ దారుణమైన విషయం తెలిసింది. ముస్కాన్.. ఆమె స్నేహితుడు సాహిల్‌తో అక్రమ సంబంధం పెట్టుకుందని తెలిసింది. ఈ విషయమై సౌరభ్, ముస్కాన్‌ల మధ్య గొడవలు అయ్యాయి. పరిస్థితి విడాకుల వరకు వెళ్లింది. కూతురు కోసం సౌరభ్ వెనక్కు తగ్గాడు. మళ్లీ జాబ్‌లో జాయిన్ అయ్యాడు. 2023లో విదేశానికి వెళ్లిపోయాడు. 2025 ఫిబ్రవరి నెలలో కూతురి పుట్టిన రోజు ఉండటంతో ఇండియా వచ్చాడు. ఇది నచ్చని ముస్కాన్, సాహిల్ .. అతడ్ని చంపేశారు. ఆరేళ్ల చిన్నారి తండ్రి హత్యను కళ్లారా చూసింది.. తన తల్లి మరో వ్యక్తితో కలిసి తండ్రిని ప్లాస్టిక్ డ్రమ్ములో దాచడం గమనించింది. అయితే, అది దాచడం కాదని, నాన్నను చంపేశారని ఆ చిన్నారికి తెలియదు. మీ నాన్న ఏరమ్మా అని అడిగిన చుట్టుపక్కల వాళ్లకు ‘డ్రమ్ములో ఉన్నాడు’ అంటూ చెప్పింది. ఆ మాటల వెనకున్న విషాదం తెలియక చిన్నపిల్ల ఏదో చెబుతోందని వారంతా అనుకున్నారు. కానీ నిజంగానే పాప తండ్రి నిర్జీవంగా మారి డ్రమ్ములో సమాధి అయ్యాడని వారు ఊహించలేకపోయారు.

Ysrcp Vidadala Rajini Comments On Mp Lavu Sri Krishna Devarayalu8
‘లావు శ్రీకృష్ణదేవరాయలు.. నా కాల్‌ డేటాను తీశారు’

సాక్షి, పల్నాడు జిల్లా: తనపై ఏసీబీకి ఫిర్యాదు చేసిన వారిని తాను ఎప్పుడూ చూడలేదని.. కూటమి నేతల డైరెక్షన్‌లోనే తనపై ఏసీబీ కేసు నమోదు చేసిందని మాజీ మంత్రి విడదల రజిని అన్నారు. ఆదివారం ఆమె చిలకలూరిపేటలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఆదేశాలతోనే ఏసీబీ కేసు పెట్టారని మండిపడ్డారు. ‘‘నన్ను, నా కుటుంబాన్ని ఎంపీ కృష్ణదేవరాయులు ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు నా కాల్‌ డేటాను తీశారు. ఆయన ఒత్తిడితోనే కాల్‌డేటా తీసినట్లు పోలీసులు ఒప్పుకున్నారు. ఫిర్యాదు చేసిన వారితో నాకెలాంటి సంబంధం లేదు’’ అని విడదల రజిని స్పష్టం చేశారు.రాష్ట్రంలో రెడ్‌బుక్‌ అరాచకాలు తారాస్థాయికి చేరాయి. నాపై ఏసీబీ అక్రమంగా కేసు నమోదు చేసింది. కూటమి నేతల బెదిరింపులకు నేను భయపడను. ప్రజలకు సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చాను. రెడ్ బుక్ పాలనలో నన్ను టార్గెట్ చేశారు. అక్రమ కేసులు పెడుతున్నారు. అదిగో రజిని.. ఇదిగో రజిని అంటూ ఆవు కథలు చెబుతున్నారు. ఏసీబీ కేసులో ఫిర్యాదుదారులను ఇంతవరకూ నేను కలవ లేదు. రెడ్ బుక్ పాలనకు పరాకాష్టే ఈ ఏసీబీ కేసు’’ అని రజిని మండిపడ్డారు.‘‘ఏసీబీ కేసులో ఫిర్యాదుదారుడు టీడీపీ వ్యక్తి‌. మార్కెట్ ఏజెన్సిని పెట్టి నాపై కేసులను పెట్టిస్తున్నారు. ఈ కథకు మొత్తం డైరెక్టర్ ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు. అక్రమంగా వ్యాపారం చేసుకోవడానికి ఫిర్యాదు దారులకు సహకరిస్తామని ఎంపీ హామీ ఇచ్చారు. నేనంటే ఎంపీ శ్రీకృష్ణదేవరాయలకు ఎక్కువ కోపమే. 2020లో గురజాల డీఎస్పీ, సీఐలకు లంచం ఇచ్చి నాతో పాటు నా కుటుంబ సభ్యుల కాల్ డేటాను తీయించారు. బీసీ మహిళ, ఎమ్మెల్యే అయిన నా కాల్ డేటాను తీయించారు. నా వ్యక్తి గత జీవితంలో ఎందుకు రావాలనుకున్నారో తెలియదు. మీ ఇంటిలో ఉన్న ఆడపిల్లల కాల్ డేటా తీస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. అంతటి నీచుడు ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు’’ అని విడదల రజిని ధ్వజమెత్తారు.వైఎస్‌ జగన్‌ ఎంపీని ప్రశ్నించారు. అప్పుడే ఆయన మనసులో శ్రీకృష్ణదేవరాయలు నమ్మకాన్ని కోల్పోయారు. అప్పటి నుండి ఎంపీ నాపై కక్ష పెంచుకున్నాడు. పది నెలల నుండి ఒకే ఫిర్యాదును పదేపదే అందరికి ఇప్పించారు. ప్రస్తుతం విజిలెన్స్ ఎస్పీగా ఉన్న శ్రావణ్ టీడీపీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు కొడుకు. ఆ ఎస్పీ ఇచ్చే విజిలెన్స్ నివేదిక ఏవిధంగా ఉంటుందో ఆలోచించండి. ఆయన ఇచ్చిన రిపోర్ట్ తెలుగుదేశం రిపోర్ట్. అవినీతి ఘనాపాటి ప్రత్తిపాటి... నా మీద, జర్మనీలో ఉండే నా మరిది మీద అక్రమ కేసులు పెట్టించారు‌. నా మామ కారుపై దాడి చేయించారు. ఎవరూ ఎటువంటి వారో అందరికి తెలుసు. నా కళ్లలో భయం చూద్దామనుకుంటున్నారు. ఇటువంటి వాళ్లను చూస్తే నాకు భయమనిపించదు’’ అని విడదల రజిని చెప్పారు.లావు రత్తయ్య అంటే నాకు గౌరవం. శ్రీకృష్ణదేవరాయలు వైజాగ్‌లో చెరువు భూములను కొట్టేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పోసానిని రాష్ట్రమంతా తిప్పి ఇబ్బందిపెట్టారు. వడ్లమూడి యూనివర్సిటీ నుంచి చిలకలూరిపేట ఎంత దూరమో? చిలకలూరిపేట నుంచి వడ్లమూడి యూనివర్సిటీ అంతే దూరం. శ్రీకృష్ణదేవరాయలు ఇది గుర్తుపెట్టుకోవాలి’’ అని విడదల రజిని హెచ్చరించారు.

First Indian to win UFC Fight Puja Tomar My Parents Didnt Want Me9
పుట్టగానే చంపేయాలని చూశారు! కానీ ఆ అమ్మాయే ఇవాళ..

ఇంతలా ఏఐ సాంకేతికత దూసుకుపోతున్నా.. ఆడపిల్ల అనగానే అమ్మో..! అనే అంటున్నారు. ఇంకా ముగ్గురూ.. అబ్బాయిలే అయినా భయం ఉండదు. గానీ అదే రెండోసారి లేదా మూడోసారి ఆడబిడ్డ అనగానే ప్రాణాలే పోయినంతంగా తల్లడిల్లిపోతారు చాలామంది. ఎందుకనేది అంతుపట్టని చిక్కు ప్రశ్న. ఎందుకంటే అటు అబ్బాయి లేదా అమ్మాయిని పెంచి పెద్దచేసి విద్య చెప్పించడం వంటివన్ని షరామాములే కానీ..ముగ్గురు అమ్మాయిల తల్లిదండ్రులనగానే సమాజం సైతం టన్నుల కొద్దీ జాలి చూపిస్తుంది. అలాంటి వివక్షనే ఈ అమ్మాయి చిన్నప్పటి నుంచే ఎదుర్కొంది. చిన్ననాటి నుంచి దానిపై పోరాడుతూనే వచ్చింది. చివరికి తనను వద్దు, చంపేయాలని చూసిన తల్లిదండ్రులనే గర్వపడేలా అత్యున్నత స్థాయికి ఎదిగింది. ప్రపంచమే తనవైపు తిరిగి చూసేలా చేసింది.ఆ అమ్మాయే పూజ తోమర్. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్ నగర్ సమీపంలోని బుధాన అనే చిన్న గ్రామంలో జన్మించింది. ఆమెకు అంజలి, అను అనే ఇద్దరు అక్కలు ఉన్నారు. ఆ గ్రామస్థులు అమ్మాయి అనగానే కట్నం ఇచ్చి పెళ్లిచేసే కష్టతర బాధ్యతగా చూసేవారు. అలాంటి వాతావరణంలో పూజా తల్లిదండ్రులు కూడా మూడోసారి అమ్మాయి పుట్టకూడదని దేవుళ్లందరికీ దండాలు పెట్టుకున్నారు. కానీ విధి వింత పరీక్షకు ఎవ్వరైనా తలొగ్గక తప్పదు కదా..!. పాపం అలానే ఈ తల్లిదండ్రులకు ఎంతలా వద్దనుకున్నా మూడోసారి ఆడపిల్లే పుట్టింది. తండ్రే ఈ విషయం విని జీర్ణించుకోలేక కళ్లు తిరిగిపడిపోయాడు. ఇక తాము ఈ అమ్మాయిని పెంచలేం అని కుండలోపెట్టి చంపేయాలనుకున్నారు. కానీ ఆ చిన్నారి గుక్కపెట్టిన ఏడుపుకి జాలి కలిగిందో ఏమో..! వెంటనే చేతుల్లోకి తీసుకున్నారు తల్లిదండ్రులు. అలా చిన్ననాడే బతుకు పోరాటం చేసింది పూజ. అలా నెమ్మదిగా పెద్దదైంది. తనంటే ఇంట్లో వాళ్లకి ఇష్టం లేదనే విషయం తెలిసి మౌనమే దాల్చిందిగానీ వారితో పోరాడలేదు. అడుగడుగున ముగ్గురు ఆడపిల్లలు అనే మాటలు ఓ పక్కన, మరోవైపు నువ్వు పుట్టుకుంటే బాగుండును అన్న సూటిపోటి మాటల మధ్య బాధనంత పట్టికింద బిగబెట్టి బతికింది. అప్పుడే ఫిక్స్‌ అయ్యింది. ఎలాగైన ఆడిపిల్ల భారం కాదు అదృష్టమనే చెప్పాలని నిర్ణయించుకుంది. అదెలాగనేది తెలియదు. అయితే చిన్నప్పటి నుంచి యూట్యూబ్‌లో జాకీ చాన్ పాత్రలే ఆమెకు నచ్చేవి. ఎందుకంటే తాను ఎదుర్కొన్న వివక్ష పోరాటాల అందుకు కారణమై అయి ఉండొచ్చు కూఆ. కానీ పూజ ఎప్పుడు రాజకీయ నాయకురాలు, ఏ ఐపీఎస్‌ వంటివి లక్ష్యంగా ఏర్పరచుకాలేదు. కరాటేలో రాణించాలనుకోవడం విశేషం. తన చుట్టూ ఉన్న పరిస్థితుల రీత్యా అది నేర్చుకోవడం అంత ఈజీ కాదు అయినా అదే నేర్చుకోవాలనుకుంది. సరిగ్గా ఇంటర్‌లో ఉండగా ఒక కరాటే టీచర్ స్థానిక పాఠశాలకు రావడం జరిగింది. ఇక ఆమె ఆ టీచర్‌ సాయంతో దానిలోని మెళుకువలు నేర్చుకుంది. మరింత ఇందులో ఛాంపియన్‌గా రాణించాలంటే ఏం చేయాలో తెలుసుకుంది. ఆ విషయంలో ఆమె మేనమామ కాస్త సాయం అందించడంతో మార్షల్‌ ఆర్ట్స్‌తో మిళితమైన కరాటేలో ప్రావీణ్యం తెచ్చుకునేందుకు భోపాల్‌కు పయనమైంది. అక్కడ ఐదేళ్లలో పలు కాంపీటీషన్లలో గెలుపొంది కానిస్టేబుల్‌ ఉద్యోగాన్ని పొందింది. అయితే దీన్ని పూజ చాలా అవమానంగా భావించి వదులుకుంది. మరింతగా దీనిలో రాణించి ఉన్నతోద్యోగం పొందాలంటే ఏం చేయాలని ఆలోచనలో పడింది. ఆ సమయంలోనే అల్టిమేట్‌ ఫైనల్‌ ఛాంపియనషిష్‌(మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌(MMA)) గురించి తెలుసుకుంది. ఇక దాని కోసం ఢిల్లీ వెళ్లాలనుకుంది. కనీసం అందుకు ఎవరైన స్పాన్స్‌ చేయడంగానీ కాంట్రాక్టులు, జీతం లేదా ఎవరిదైనా హామీ వంటివి ఏం లేకుండానే ఢిల్లీ వెళ్లింది. అక్కడ ఆమె ట్యూషన్‌ పీజు కట్టేందుకు ఎవరో దాత ముందుకు వచ్చారు. అంతే తప్ప కనీసం ఏ మద్దతు సాయం లేకుండా ఒంటరిగా మొండిగా అక్కడ ఎంఎఏలో శిక్షణ తీసుకుంది. అలా పూజ అల్టిమేట్‌ ఫైనల్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో బ్రెజిల్‌కు చెందిన రాయన్నే అమండా డోస్ శాంటోస్‌తో తలపడి గెలుపొందింది. దీంతో ఇలా యూఎఫ్‌సీ టైటిల్‌ దక్కించుకున్న తొలి భారతీయురాలుగా యావత్తు భారతావనిని తనవైపు గర్వంగా చూసేలా చేసింది. 31 ఏళ్ల ఈ పంచర్ ఇప్పుడు తన MMA జట్టులో నెలకు దాదాపు రూ. 1.5 నుండి 2 లక్షలు ఖర్చుచేసే ఛాంపియన్‌గా ఎదిగింది. ఇన్నాళ్లుగా తాను చేస్తున్న పోరాటనికి ఓ అర్థం వచ్చేలా విజయాలు సాధిస్తున్నా అంటూ కంటతడిపెట్టుకుంది. తానెంటన్నది తన కుటుంబానికి చూపించాలనుకోలేదని, ఈ ప్రపంచానికి ఆడపిల్ల భారం అనే మాటకు తావివ్వకూడదు అని చెప్పేందుకే పోరాడనంటోంది పూజ. ఇక ఆమె అనితరసాద్యమైన విజయం అందుకోగానే ఆమె గ్రామంలో ఒక్కసారిగా పండుగ వాతావరణం నెలకొంది. నాడు ముచ్చటగా మూడోసారి ఆడపిల్లగా పుట్టిన శాపగ్రస్తురాలిగా చూసిన వాళ్లే తన కరచలనం కోసం తహతహలాడటం విశేషం. అమె అక్కలు ఒకరు నర్సుగా, మరొకరు డాక్టర్‌గా ప్రాక్టీస్‌ చేస్తున్నారు. వాళ్లంతా తమ చెల్లి పూజ విజయాన్ని ఘనంగా సెలబ్రేట్‌ చేసుకున్నారు. పూజా తల్లి సైతం ఆమె తన కూతురని గర్వంగా చెబుతూ మీడియా ముందుకొస్తుంది. ఇక చివరగా భారతదేశం అనగానే కేవలం క్రికెట్‌ మ్యాచ్‌లే కాదు యోధులు కూడా ఉన్నారని చూపించాలనుకుంటున్నా..అని ఆత్మవిశ్వాసంగా చెబుతోంది పూజ. దురదృష్టం ఏంటంటే ఏ ఆడపిల్ల అని అవమానంగా ఫీలయ్యాడో ఆ తండ్రే పూజ విజయాన్ని చూడకముందే కన్నుమూశాడు. ఏదీఏమైనా ఇలాంటి తల్లిదండ్రులందరికీ కనువిప్పు కలిగించేలా పూజ విజయం ఉండటమే గాక తనలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్న ఆడపిల్లలందరకీ స్ఫూర్తిగా నిలిచింది పూజ. (చదవండి: ఇనుములో ఓ మనిషే మొలిచెనే)

Rs 25 LPA Feels Like Nothing Says IT Professional in Bengaluru10
రూ.25 లక్షల వేతనం.. బెంగళూరులో కష్టం!: పోస్ట్ వైరల్

ఉద్యోగం చేయాలనుకునే చాలామంది.. ఢిల్లీ, ముంబై, బెంగళూరు లేదా హైదరాబాద్ వంటి నగరాలనే ఎంచుకుంటారు. అయితే బెంగళూరులో ఉండటం కష్టం అంటూ.. రూ.25 లక్షల వేతనం తీసుకునే ఓ కార్పొరేట్ ఉద్యోగి చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.ఒక కార్పొరేట్ ఉద్యోగి 40 శాతం ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగం కోసం పూణే నుంచి బెంగళూరుకు షిఫ్ట్ అయ్యారు. అయితే ఓ సంవత్సరం గడిచాక, బెంగళూరుకు రావడం తప్పు అయిందని పశ్చాత్తాపపడ్డాడు. ఈ విషయాలు ప్రస్తుతం లింక్డ్ఇన్ పోస్ట్‌లో వైరల్ అయ్యాయి.పూణేలో రూ. 18 లక్షల వేతనం వచ్చేది. బెంగళూరులో రూ. 25 లక్షలు వస్తున్నా ఏమీ మిగలడం లేదని, కొత్త ఉద్యోగంలో చేరి ఒక సంవత్సరం తర్వాత తన స్నేహితుడికి ఫోన్ చేసి తన నిరాశను వ్యక్తం చేశాడు కార్పొరేట్ ఉద్యోగి. నగరాలు మారకూడదు, పూణే చాలా బాగుందని అన్నాడు.ఇదీ చదవండి: వారానికి 70 గంటల పని: మొదటిసారి స్పందించిన సుధామూర్తికార్పొరేట్ ఉద్యోగి మాటలు విన్న, అతని ఫ్రెండ్ ఆశ్చర్యపోతూ.. 40 శాతం ఇంక్రిమెంట్ బాగానే ఉంది కదా. ఏమైంది అని అడిగితే.. బెంగళూరులో జీతాలు పెరిగేకొద్దీ ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. అద్దెలు మరీ ఎక్కువగా ఉన్నాయి. ఇంటి యజమానులు మూడు లేదా నాలుగు నెలల రెంట్ అడ్వాన్స్ తీసుకుంటున్నారు. ట్రాఫిక్ కూడా విపరీతంగా ఉంది.పూణేలోని 15 రూపాయల వడాపావ్‌ మిస్ అవుతున్నా అని చెప్పాడు. కనీసం అక్కడ జీవితం, సేవింగ్స్ అన్నీ బాగున్నాయి. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవ్వడంతో నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తూ.. తాము ఎదుర్కొన్న సొంత అనుభవాలను కూడా వెల్లడించారు. కొందరు బెంగళూరును సమర్దిస్తే.. మరికొందరు బెంగళూరులో బతకడం కష్టం అని అన్నారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement