టీమిండియా, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సారథి విరాట్ కోహ్లికి ఘోర అవమానం జరిగింది. ఐస్‌ల్యాండ్ క్రికెట్ తమ ట్విటర్ పేజీలో కోహ్లిని కించపరిచేలా పోస్ట్ చేసింది. ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకున్న ముగ్గురు కెప్టెన్ల ఫొటోలతో పాటు టీ కప్పు పట్టుకున్న కోహ్లి ఫొటోను జత చేసి ట్వీట్ చేసింది. మిగతా ముగ్గురు కెప్టెన్లలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ, అప్పటి కోల్‌కతా కెప్టెన్ గౌతమ్ గంభీర్, సన్‌రైజర్స్ సారథి డేవిడ్ వార్నర్‌లున్నారు. ఈ ముగ్గురు ఐపీఎల్ ట్రోఫీలతో నవ్వులు చిందిస్తుండగా.. కోహ్లి టీకప్పుతో పేలవంగా చూస్తున్నాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. ఐస్‌ల్యాండ్ క్రికెట్‌పై కోహ్లి అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారతీయులపై జోకుల వేయడం అంత మంచిది కాదనీ బదులిస్తున్నారు.
కోహ్లి చేతిలో టీ కప్..ఫ్యాన్స్ ఫైర్!
Published Fri, May 4 2018 8:03 AM | Last Updated on Thu, Mar 21 2024 7:44 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement