రాబోవు వరల్డ్‌కప్‌లో ఒత్తిడిని అధిగమించడం చాలా ముఖ్యమని భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి స్పష్టం చేశాడు. తమదైన రోజున ఏ జట్టునైనా ప్రత్యర్థి దెబ్బతీయగలదన్న కోహ్లి.. ప్రతీ మ్యాచ్‌కు పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాల్సి ఉందన్నాడు. ఈ వరల్డ్‌కప్‌కు అన్ని విధాలుగా సన్నద్ధమవుతున్నట్లు కోహ్లి తెలిపాడు. ప్రస్తుతమున్న భారత జట్టు చాలా సమతుల్యంగా ఉందని, మెరుగైన ప్రదర్శన చేయడమే తమ ముందున్న లక్ష్యంగా పేర్కొన్నాడు. ఇప్పటి వరకూ తాను ఆడిన మూడు వరల్డ్ కప్‌లలో ఇదే అత్యంత చాలెంజింగ్ వరల్డ్ కప్ అని కోహ్లి తెలిపాడు. వరల్డ్‌కప్ కోసం ఇంగ్లండ్ బయల్దేరడానికి ముందు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, కోచ్ రవిశాస్త్రి మంగళవారం ముంబైలో మీడియా సమావేశం నిర్వహించారు.