అండర్-19లో వరల్డ్‌కప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించిన తర్వాత చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్..పాక్ డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. పాక్ ఆటగాళ్లలో స్ఫూర్తినింపేందుకు ఆ జట్టు మేనేజర్ నదీమ్ ఖాన్ పిలుపు మేరకు ద్రవిడ్ వారి డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లి ముచ్చటించినట్లు రూమర్లు వ్యాపించాయి. అయితే వీటిని తాజాగా రాహుల్ ద్రవిడ్ ఖండించాడు. వరల్డ్ కప్ గెలిచి సోమవారం స్వదేశానికి వచ్చిన తర్వాత రాహుల్ ద్రవిడ్ మీడియాతో మాట్లాడాడు. అందులో భాగంగా ఒక విలేకరి నుంచి ఎదురైన ప్రశ్నకు ద్రవిడ్ కూల్‌గా బదులిచ్చాడు.
Published Tue, Feb 6 2018 12:38 PM | Last Updated on Fri, Mar 22 2024 11:29 AM
Advertisement
Advertisement
Advertisement