వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు రన్నరప్‌గా సరిపెట్టుకుంది. ఆదివారం జరిగిన తుదిపోరులో సింధు 21-15, 21-12, 21-19 తేడాతో యామగుచి(జపాన్) చేతిలో పోరాడి ఓడింది. తొలి గేమ్‌ను పెద్దగా కష్టపడకుండా గెలిచిన సింధు.. ఆపై వరుసగా రెండు గేమ్‌లను కోల్పోయి టైటిల్ వేటలో నిరాశ పరిచింది.