క్షణాల్లోనే స్కూటర్‌ పేలి పోయింది! | Huge Blast As Electric Scooter Explodes, Family's Escape Caught On Camera | Sakshi
Sakshi News home page

క్షణాల్లోనే స్కూటర్‌ పేలి పోయింది!

Published Wed, Aug 1 2018 8:30 PM | Last Updated on Fri, Mar 22 2024 11:07 AM

సెల్‌ఫోన్లు, పవర్‌ బ్యాంకులు వంటి ఎలక్ట్రానిక్‌ వస్తువులు పేలిన ఘటనలు తరచుగా చూస్తూనే ఉన్నాం. తాజాగా ఇటువంటి ఘటనే చైనాలో మరొకటి చోటుచేసుకుంది. కానీ ఇక్కడ పేలింది మాత్రం సెల్‌ఫోనో, పవర్‌ బ్యాంకో కాదు ఓ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌. అసలేం జరిగిందంటే.. చైనాకు చెందిన ఓ వ్యక్తి తన ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ని చార్జింగ్‌ పెట్టి... కూతురితో మాటల్లో మునిగిపోయాడు. కాసేపటి తర్వాత స్కూటర్‌ నుంచి పొగలు రావడంతో పక్కనే ఉన్న పెంపుడు కుక్క అరవడం మొదలు పెట్టింది. అసలేం జరిగిందో చూద్దామని దగ్గరికి వెళ్లేలోపే ఇళ్లంతా పొగలు వ్యాపించేశాయి. కొన్ని క్షణాల్లోనే స్కూటర్‌ పేలి పోయింది. అయితే అప్పటికే అప్రమత్తమైన ఆ వ్యక్తి కూతురుని తీసుకుని దూరంగా పరిగెత్తడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement