కేరళలో జరిగిన అమానుష ఘటన యావద్ధేశాన్ని కదిలించింది. మానవత్వం ఉన్న ప్రతీ మనిషి కళ్లు బాధతో చెమ్మగిల్లాయి. గర్భంతో ఉన్న ఏనుగుపై ఘోరానికి పాల్పడిన వారిపై జనం భగ్గుమన్నారు. దాన్నో క్రూరమైన చర్యగా అభివర్ణించటమే కాకుండా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రముఖులు సైతం మూగజీవం కోసం గళమెత్తారు. ఈ నేపథ్యంలో అందరు మనుషులూ ఒకేలా ఉండరని, మానవత్వం, జంతుప్రేమ ఉన్నవారు కూడా ఈ ప్రపంచంలో ఉన్నారని తెలిపే ఓ పాత వీడియోను ఐపీఎస్ అధికారి స్వాతి లక్రా గురువారం తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు.