ఇది మామూలు పాము కాదండోయ్‌.. | Watch video, Hognose Snake Fakes Death In Most Overacted Way | Sakshi
Sakshi News home page

ఇది మామూలు పాము కాదండోయ్‌..

Published Sun, Jul 7 2019 10:51 AM | Last Updated on Wed, Mar 20 2024 5:16 PM

ఈ పామును చూడగానే మీకేమనిపించింది.. అయ్యో పాపం పాము చచ్చిపోయిందే.. అనుకున్నారు కదా..! కానీ ఇది మామూలు పాము కాదండోయ్‌.. పెద్ద మాయల మరాఠీ పాము. ఉత్తర అమెరికాలో ఎక్కువగా కనిపించే ఈ పాము పేరు ‘హోగ్నోస్‌’.. దీని ‘నాటకాలు’ చూసి కొందరు ‘జాంబీ’ పాము అని కూడా పిలుస్తారు. ఇంతకీ దీన్ని ఇన్ని పేర్లతో ఎందుకు పిలుచుకుంటారో తెలుసా.. సాధారణంగా ఏ జంతువు అయినా శత్రువుల నుంచి రక్షించుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తుంటాయి. ఊసరవెల్లి అయితే రంగులు మార్చుకుంటుంది.. కొన్ని రకాల సీతాకోకచిలుకలు చెట్టు బెరడు రంగులో ఉంటాయి.. అయితే ఈ జాదూ పాము మాత్రం.. ఏదైనా ఆపద వచ్చిందనుకోండి.. మొదట తన తల చుట్టూ ఉన్న చర్మాన్ని ఒక్కసారిగా విదిల్చి తాచుపాము మాదిరిగా నటించి.. గట్టిగా హిస్‌ అంటూ శబ్దం చేస్తుందట. అది వర్క్‌అవుట్‌ కాలేదనుకోండి వెంటనే.. ప్లాన్‌–బీ సిద్ధంగా ఉంచుకుంటుంది. అదేంటంటే నోరును బాగా తెరిచి వెల్లకిలా పడుకుని (ఫొటోలో ఉన్నట్లు) చనిపోయినట్లు నటిస్తుందట. అంతే దీని శత్రువులు చనిపోయిన దాన్ని తినడమెందుకు అని వెళ్లిపోతాయట. అయితే దీని ఆస్కార్‌ లెవల్‌ నటన గురించి ముందే తెలిసిన వారు దాన్ని పట్టుకుంటే చాలు.. వెంటనే కదులుతుందట. చాలా తక్కువ సందర్భాల్లో కాటేస్తుందట. ఈ పాముకు తన ప్రాణంతో పాటు పక్కవాళ్ల ప్రాణం విలువ కూడా తెలుసేమో!!

Advertisement
 
Advertisement
 
Advertisement