Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

YSRCP councilors from Thiruvur Nagar Panchayat in NTR district met YS Jagan1
కూటమి ప్రభుత్వ అరాచకాలను దీటుగా ఎదుర్కొందాం: వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి/తిరువూరు: రాష్ట్రంలో ప్రజా­స్వామ్యం ఖూనీ జరుగుతోందని.. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో మెజారిటీ లేకపోయినా కూటమి నేతలు బరితెగించి అనైతిక రాజకీయాలకు పాల్పడుతున్నారని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ అరాచకాలను దీటుగా ఎదుర్కొందామన్నారు. తాడేపల్లి­లోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం వైఎస్‌ జగన్‌ను ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరు నగర పంచాయతీ వైఎస్సార్‌సీపీ కౌన్సి­లర్లు కలిశారు. చైర్‌పర్సన్‌ ఎన్నిక సందర్భంగా తమపై టీడీపీ నాయకులు చేసిన దాడుల గురించి వివరించారు. పోలీసులు, కూటమి నేతలు, టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్‌ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించిన తీరును వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ అరాచకాలు, దాష్టీకాలను దీటుగా ఎదుర్కొందామని.. చట్టపరంగా, న్యాయపరంగా పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనేక ఇబ్బందులు పెట్టినా ధైర్యంగా నిలబడ్డారంటూ కౌన్సిలర్లను అభినందించారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్, తిరువూరు వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్‌ నల్లగట్ల స్వామిదాసు, కౌన్సిలర్లు తంగిరాల వెంకటరెడ్డి, పరసా శ్రీనివా­స­రావు, మోదుగు ప్రసాద్, ఇనపనూరి చిన్నారి, పాలం రమాదేవి, గుమ్మా వెంకటేశ్వరి, పరసా సత్యనారాయణ, వెలుగోటి విజయలక్ష్మి, షేక్‌ నదియా, రామవరపు మంజుల, జెడ్పీటీసీ సభ్యుడు యరమల రామచంద్రారెడ్డి, మాజీ జెడ్పీ చైర్‌పర్సన్‌ నల్లగట్ల సుధారాణి, వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు కలకొండ రవికుమార్, సీనియర్‌ నాయకులు మద్దిరెడ్డి సూర్యనారాయణరెడ్డి, నరెడ్ల వీరారెడ్డి, తిరువూరు మండలాధ్యక్షుడు తాళ్లూరి నవీన్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు

USA Donlad Trump Slams Reporter Over Qatar Jet Question2
ట్రంప్‌కు కోపమొచ్చింది.. ఏం మాట్లాడుతున్నావ్‌ వెళ్లిపో అంటూ..

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు మరోసారి కోపమొచ్చింది. ప్రశ్నించిన ఓ విలేకరిపై ట్రంప్ విరుచుకుపడ్డారు. ఏం మాట్లాడుతున్నావ్‌?. ఇక్కడి నుంచి వెళ్లిపో అంటూ ట్రంప్‌ చిందులు తొక్కారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఏం జరిగిందంటే..తాజాగా వైట్‌హౌస్‌లో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రామఫోసా, ట్రంప్‌ భేటీ జరిగింది. ఈ సందర్భంగా ట్రంప్‌కు ఖతార్‌.. విలాసవంతమైన విమానాన్ని బహుమతిగా ప్రకటించిన విషయమై ట్రంప్‌ను ఎన్‌బీసీ ఛానెల్‌ విలేకరి ప్రశ్నించారు. సదరు విలేకరి అడిగిన ప్రశ్నకు ట్రంప్‌ ఊగిపోయారు. అనంతరం, ట్రంప్‌ మాట్లాడుతూ.. ‘నువ్వు ఏం మాట్లాడుతున్నావ్‌?. నువ్వు తెలివితక్కువ వాడివి. ఇక్కడ మేం మాట్లాడుతున్న దానికి, ఖతార్‌ విమానానికి సంబంధం ఏంటి? వాళ్లు విమానం ఇస్తున్నారు. అది చాలా గొప్ప విషయం. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్లిపో. దక్షిణాఫ్రికాలోని శ్వేతజాతి రైతుల సమస్యలు, హింస తదితర సమస్యల నుంచి దారి మళ్లించడానికే నువ్వు ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నావు. విలేకరిగా విధులు నిర్వహించే అర్హత నీకు లేదు’ అని ట్రంప్‌ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆ వార్తా సంస్థపై కూడా ట్రంప్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. దానిపై విచారణ జరపాల్సి ఉందని వ్యాఖ్యానించారు.ఇదిలా ఉండగా.. అమెరికా అధ్యక్షడు ట్రంప్‌కు ఖతార్‌ పాలక కుటుంబం విలాసవంతమైన 747-8 జంబో జెట్‌ విమానాన్ని బహుమతిగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో జంజో జెట్‌ విమానాన్ని స్వీకరించేందుకు ట్రంప్ సిద్ధమయ్యారు. తాజాగా ఈ విమానం ట్రంప్‌ స్వీకరించడానికి అమెరికా రక్షణశాఖ కూడా ఆమోదం తెలిపింది. ఇక, దీనికి అధ్యక్ష విమానానికి (ఎయిర్‌ఫోర్స్‌ వన్‌) తగ్గట్టుగా కొన్ని హంగులు సమకూర్చనున్నారు. 2029 జనవరిలో పదవీవిరమణ చేసేవరకు ఈ విమానాన్ని ట్రంప్‌ ‘ఎయిర్‌ఫోర్స్‌ వన్‌’కు కొత్త వెర్షన్‌గా ఉపయోగించాలని ప్రణాళికలు చేస్తున్నారు. President Trump Slams NBC reporter 🔥 "GET OUT OF HERE"You ought to go back to your studio at NBC because Brian Roberts and the people that run that place, they ought to be investigated. They are so terrible the way you run that network. And you're a disgrace. No more questions… pic.twitter.com/ezuE4vXstc— Steve Gruber (@stevegrubershow) May 21, 2025

IPL 2025 MI vs DC: BCCI Punished Delhi Capitals Pacer Mukesh Kumar3
MI vs DC: ఢిల్లీ క్యాపిటల్స్‌ పేసర్‌కు ఎదురుదెబ్బ

ఢిల్లీ క్యాపిటల్స్‌ ఫాస్ట్‌ బౌలర్‌ ముకేశ్‌ కుమార్‌ (Mukesh Kumar)కు ఐపీఎల్‌ పాలక మండలి జరిమానా విధించింది. అతడి మ్యాచ్‌ ఫీజులో పది శాతం కోత విధించడంతో పాటు.. ఓ డీమెరిట్‌ పాయింట్‌ కూడా జత చేసింది. ఐపీఎల్‌-2025 (IPL 2025)లో చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు బుధవారం ముంబై ఇండియన్స్‌తో తలపడింది.సూర్య, నమన్‌ ధనాధన్‌ముంబై సొంత మైదానం వాంఖడేలో జరిగిన ఈ పోరులో టాస్‌ గెలిచిన ఢిల్లీ తొలుత బౌలింగ్‌ చేసింది. ఆరంభంలో ఆకట్టుకున్నా.. ఆఖర్లో ఢిల్లీ బౌలర్లు తేలిపోయారు. సూర్యకుమార్‌ యాదవ్‌ (43 బంతుల్లో 73 నాటౌట్‌), నమన్‌ ధిర్‌ (8 బంతుల్లో 24 నాటౌట్‌) అద్భుతంగా రాణించడంతో ముంబై మెరుగైన స్కోరు సాధించింది.నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో ముకేశ్‌ కుమార్‌ (2/48) రెండు వికెట్లతో రాణించగా.. దుష్మంత చమీర, ముస్తాఫిజుర్‌ రహ్మాన్‌, కుల్దీప్‌ యాదవ్‌ తలా ఓ వికెట్‌ పడగొట్టారు. ఇక లక్ష్య ఛేదనలో ఢిల్లీ ఆరంభం నుంచే తడబడింది.ఢిల్లీ తడ‘బ్యా’టుఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌ (11), కెప్టెన్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌ (6) పూర్తిగా విఫలమయ్యారు. వన్‌డౌన్‌లో వచ్చిన అభిషేక్‌ పోరెల్‌ (6) కూడా తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ క్రమంలో సమీర్‌ రిజ్వీ (39), విప్రాజ్‌ నిగమ్‌ (20) కాసేపు పోరాడే ప్రయత్నం చేశారు.అయితే, ముంబై బౌలర్ల ధాటికి ఢిల్లీ బ్యాటింగ్‌ ఆర్డర్‌ ఎక్కువ సేపు నిలవలేకపోయింది. 18.2 ఓవర్లలో కేవలం 121 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. దీంతో 59 పరుగుల తేడాతో గెలిచిన ముంబై ప్లే ఆఫ్స్‌ చేరగా.. ఢిల్లీ టోర్నీ నుంచి నిష్క్రమించింది.అనుచిత ప్రవర్తనఇక ఈ మ్యాచ్‌ సందర్భంగా అనుచితంగా ప్రవర్తించినందుకు గానూ ముకేశ్‌ కుమార్‌కు జరిమానా విధిస్తున్నట్లు ఐపీఎల్‌ ఒక ప్రకటనలో పేర్కొంది. ‘‘ఐపీల్‌ ప్రవర్తనా నియమావళిలలోని ఆర్టికల్‌ 2.2 (ఆటకు సంబంధించిన వస్తువులు, దుస్తులు, గ్రౌండ్‌కు చెందిన ఎక్విప్‌మెంట్‌ను డ్యామేజ్‌ చేయడం) ప్రకారం ముకేశ్‌ కుమార్‌ లెవల్‌ 1 తప్పిదానికి పాల్పడ్డాడు.ఇందుకు సంబంధించి మ్యాచ్‌ రిఫరీ తీసుకున్న నిర్ణయాన్ని అతడు అంగీకరించాడు’’ అని ఐపీఎల్‌ పాలక మండలి తెలిపింది. అయితే, ముకేశ్‌ కుమార్‌ చేసిన తప్పేమిటో మాత్రం స్పష్టంగా వెల్లడించలేదు. కాగా డెత్‌ ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించుకున్న వేళ ఈ ఢిల్లీ పేసర్‌ కాస్త అసహనానికి లోనైన విషయం తెలిసిందే.ఇక ముంబైతో కీలక మ్యాచ్‌కు ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ అక్షర్‌ పటేల్‌ దూరమైన విషయం తెలిసిందే. అనారోగ్యం కారణంగా ఈ ఆల్‌రౌండర్‌ సేవలను జట్టు వినియోగించుకోలేకపోయింది. అతడి స్థానంలో వైస్‌ కెప్టెన్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌ ఢిల్లీని ముందుకు నడిపించాడు. అయితే, ఈ మ్యాచ్‌లో ఢిల్లీ ఓడిపోవడంతో ఇంటిబాట పట్టింది.చదవండి: Vaibhav Suryavanshi: ఫోన్‌ ఆన్‌ చేయగానే 500 మిస్స్‌డ్‌ కాల్స్‌ Dominant victory ✅Playoffs ✅A dream outing for #MI in their last match at Wankhede this season as they secure a 59-run win over #DC 💙👏Scorecard ▶ https://t.co/fHZXoEJVed#TATAIPL | #MIvDC | @mipaltan pic.twitter.com/mitYRgtqlZ— IndianPremierLeague (@IPL) May 21, 2025

Trinamool MPs Team On IndiGo Plane Caught In Storm Srinagar4
మేము చనిపోయామని అనుకున్నాం.. ఇండిగో బాధితుల ఆవేదన

శ్రీనగర్‌: దేశంలో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ, ఉత్తరాది రాష్ట్రాల్లో తీవ్ర ఈదురుగాలులు, వడగళ్లతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. ఈ కారణంగా విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరోవైపు.. ఢిల్లీ నుంచి ప్రయాణికులతో శ్రీనగర్‌ బయలుదేరిన ఇండిగో విమానం 6E2142 వడగండ్ల వానలో చిక్కుకుని తీవ్ర కుదుపులకు గురైంది. వడగండ్ల కారణంగా విమానం ముందుభాగం దెబ్బతిని పెద్ద రంధ్రమే ఏర్పడింది. దీంతో ప్రయాణికులు భయాందోళనలకు గురై హాహాకారాలు చేశారు. ఇదే విమానంలో ప్రయాణించిన తృణముల్‌ కాంగ్రెస్‌ నేతలు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.ఐదుగురు సభ్యుల తృణమూల్ కాంగ్రెస్ ప్రతినిధి బృందం డెరెక్ ఓ'బ్రియన్, నదిముల్ హక్, సాగరికా ఘోష్, మనస్ భూనియా, మమతా ఠాకూర్‌తో కూడిన బృందం బుధవారం శ్రీనగర్‌కు వెళ్తున్న 6E2142 విమానంలో ప్రయాణించారు. విమానం ల్యాండ్‌ అయిన తర్వాత సాగరిక ఘోష్‌ మాట్లాడుతూ.. విమానంలో ఒక్కసారిగా కుదుపులు రావడంతో మేమంతా ఇక చనిపోయామని అనుకున్నాం. చావు దగ్గర వరకు వెళ్లి వచ్చినట్టుగా ఉంది. నా జీవితంలో ఇలాంటి పరిస్థితులను ఎప్పుడూ చూడలేదు.I had a narrow escape while flying from Delhi to Srinagar. Flight number #6E2142. Hats off to the captain for the safe landing.@IndiGo6E pic.twitter.com/tNEKwGOT4q— Sheikh Samiullah (@_iamsamiullah) May 21, 2025విమానంలో ఉన్న వారంతా భయంతో కేకలు వేస్తున్నారు. కొందరు ప్రార్థనలు చేశారు. మమ్మల్ని సురక్షితంగా తీసుకువచ్చిన పైలట్‌కు కృతజ్ఞతలు. విమానం దిగిపోయిన తర్వాత మేమంతా విమానం దెబ్బతిన్న భాగాన్ని చూసి ఖంగుతిన్నాం’ అని చెప్పుకొచ్చారు. భారత్‌, పాక్‌ మధ్య దాడుల వల్ల సరిహద్దుల్లో ప్రభావితమైన ప్రజలకు సంఘీభావం తెలియజేయడానికి వీరంతా శ్రీనగర్‌ వెళ్లినట్టు తెలిపారు. టీఎంసీ ప్రతినిధి బృందం మే 23 వరకు జమ్మూ కాశ్మీర్‌లో ఉంటుంది. శ్రీనగర్‌తో పాటు పూంచ్, రాజౌరిలో వీరు పర్యటించనున్నారు.Delhi–Srinagar IndiGo flight hit by severe turbulenceFlight 6E-2142 was caught in a terrifying hailstorm just before landing in Srinagar, forcing an emergency landing around 6:30pm. Damage to plane's nose cone, cabin luggage tumbling. #6E2142 #indigo6e pic.twitter.com/gHKFxpn7SI— Lucifer (@krishnakamal077) May 21, 2025ఇదిలా ఉండగా.. 227 మంది ప్రయాణికులతో శ్రీనగర్‌ బయలుదేరిన ఇండిగో విమానం 6E2142 వడగండ్ల వానలో చిక్కుకుని బుధవారం తీవ్ర కుదుపులకు గురైంది. అప్రమత్తమైన పైలట్‌ ఎమర్జెన్సీ ప్రకటించారు. శ్రీనగర్‌ ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో విమానం సురక్షిత ల్యాండింగ్‌కు చర్యలు చేపట్టారు. చివరకు సాయంత్రం 6.30గంటల సమయంలో విమానాన్ని సురక్షితంగా కిందకు దించారు. విమానం ముందు భాగం దెబ్బతిన్న, ప్రయాణికులు కేకలు వేసిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. సాంకేతిక సమస్యలతో విమానం శ్రీనగర్‌లోనే నిలిచిపోయింది.

Health Tips: Dance as Therapy for Individuals with Parkinson Disease5
డ్యాన్స్‌ బేబీ డ్యాన్స్‌..! పార్కిన్‌సన్స్‌కు నృత్య చికిత్స

అద్భుతమా, అసంబద్ధమా? ఏమిటిది! నియంత్రణ లేని కదలికలకు నియమబద్ధమైన కదలికలతో చికిత్సా?! ‘పార్కిన్‌సన్స్‌’ డిసీజ్‌ అంటే నడక అదుపు తప్పటం, చేతులు కదలకపోవటం, కాళ్లు మెదలకపోవటం, తల వణకడం, ఉన్నట్లుండి అదిరి పడటం, నాడీ వ్యవస్థకు, ఇంద్రియాలకు మధ్య సమన్వయం గాడి తప్పటం!! దేహం ఇంత దుర్భరంగా ఉన్నప్పుడు నృత్యం చెయ్యటం ఎంత దుర్లభం! పైగా దుర్లభమే దుర్భరానికి చికిత్స అవటం ఇంకెంత విడ్డూరం! అయితే ఇది విడ్డూరమేమీ కాదు, ప్రయోగాత్మకంగా నిర్థారణ అయిన విషయమే అంటోంది ‘ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ డ్యాన్స్‌ మూవ్‌మెంట్‌ థెరపీ’ (ఐ.ఎ.డి.ఎం.టి). పార్కిన్‌సన్‌లో ఏ కదలికా లయబద్ధంగా ఉండదు. డాన్స్‌లో లయబద్ధంగా లేని ఒక్క కదలికా ఉండదు. కానీ ఐ.ఎ.డి.ఎం.టి. పార్కిన్‌సన్స్‌ వ్యాధిని నయం చేయటానికి, వ్యాధిగ్రస్తుల్ని శక్తిమంతం చేయటానికి భారతీయ నృత్య రీతుల్ని ఒక చికిత్సా విధానంగా ఉపయోగిస్తోంది. విశాలమైన ఒక నిశ్శబ్దపు గది, వెనుక నుంచి మంద్రస్థాయిలో వినిపించే తబలా బీట్‌ వంటి ఒక సంగీత వాద్యం ఈ చికిత్సలో ముఖ్య భాగంగా ఉంటాయి. స్త్రీలు, పురుషులు, ముఖ్యంగా వృద్ధులు అంతా కలిసి ఆ గదిలో ఉంటారు. అందరూ కూడా పార్కిన్‌సన్స్‌ బాధితులే. మనసును తాకుతున్న నేపథ్య ధ్వనికి అనుగుణంగా వాళ్ల చేతులు మబ్బుల్లా తేలుతాయి. చేతి వేళ్లు మృదువైన హావభావాలు అవుతాయి. పాదాలు లయకు అనుగుణంగా కదులుతాయి. గొప్ప పారవశ్యంతో మదిలోంచి జనించే ఉద్దేశపూర్వకమైన ఆంగికం (అవయవాల కదలిక)తో వారు ఒక మహా విజయాన్ని సాధిస్తారు. పార్కిన్‌సన్స్‌లో ప్రమేయం లేని కదలికలు మాత్రమే ఉంటాయి కనుక ఉద్దేశపూర్వకంగా శరీరాన్ని కదలించటం అన్నది మహా విజయమే. తప్పిన పట్టు తిరిగి వచ్చేస్తోంది‘‘ఇక్కడికి వచ్చిన వారు కొన్ని నెలల క్రితం వరకు కూడా పడిపోతామేమో అనే భయం లేకుండా నడవలేకపోయిన వారే. కానీ వారిని ఈ నృత్య చికిత్స ఎంతగానో మెరుగు పరిచింది’’ అంటారు ఐ.ఎ.డి.ఎం.టి. అధ్యక్షురాలు, ‘డ్రామా థెరపీ ఇండియా’ వ్యవస్థాపకురాలు అన్షుమా క్షేత్రపాల్‌. పార్కిన్‌సన్స్‌లో నాడీ వ్యవస్థ–శరీరావయవాల పరస్పర చర్యల మధ్య సమన్వయం (మోటార్‌ కంట్రోల్‌) దెబ్బతింటుంది. మానసికంగానూ పార్కిన్‌సన్స్‌ వ్యాధిగ్రస్తులు పట్టుతప్పుతారు. ఈ స్థితిలో వారికొక ఉనికిని, వ్యక్తీకరణ శక్తిని, మునుపటి ఆనందకరమైన జీవితంలోకి మార్గాన్ని నృత్య చికిత్స ఏర్పరుస్తుందని అన్షుమా చెబుతున్నారు. ఈ సంస్థల శాఖలు ముంబై, పుణే, బెంగళూరులలో ఉన్నాయి.నృత్యం తెచ్చే మార్పేమిటి?పార్కిన్‌సన్స్‌ మెదడు క్రియాశీలతను, డోపమైన్‌ కేంద్రమైన ‘బేసల్‌ గాంగ్లియా’ను ప్రభావితం చేస్తుంది. దాంతో స్వచ్ఛంద కదలికలు కష్టతరం అవుతాయి. కానీ మెదడు మాత్రం ‘లయ’లకు స్పందిస్తుందని అన్షుమా అంటున్నారు. ‘‘సంగీతాన్ని వింటున్నప్పుడు మెదడులో దెబ్బతినని సర్క్యూట్‌లు (పార్కిన్‌సన్స్‌ వల్ల దెబ్బతిన్నవి కాకుండా) వేర్వేరు నాడీ రహదారుల ద్వారా కదలికలను తెస్తాయి. నాడీ శాస్త్రపరంగా, ఈ నృత్య చికిత్స బలాల్లో ఒకటి రిథమిక్‌ ఆడిటరీ స్టిమ్యులేషన్‌ (ఆర్‌.ఎ.ఎస్‌.) ఉద్దీపన చెందటం. దీనివల్ల అవయవ సమన్వయం ఏర్పడుతుంది. డోపమైన్, ఎండార్ఫిన్‌లు, సెరోటోనిన్‌ల వంటి న్యూరో ట్రాన్సిమీటర్‌ హార్మోన్‌లు పెరుగుతాయి. దాంతో కదలికలు మాత్రమే కాదు, మానసిక స్థితీ మెరుగుపడుతుంది’’ అని ఆమె అంటున్నారు.గర్బా నృత్యంపై తొలి ప్రయోగంగుజరాతీ సంప్రదాయ నృత్యం ‘గర్బా’పై 2024లో ప్రయోగాత్మకంగా జరిగిన అధ్యయనంలో పార్కిన్‌సన్స్‌ రోగులపై ఈ డ్యాన్స్‌ చక్కటి ప్రభావం చూపినట్లు వెల్లడైంది. పార్కిన్‌సన్స్‌కు చికిత్సగా నృత్య రీతుల్ని ఆశ్రయించటం 2009లో ముంబైలోని ‘పార్కిన్‌సన్స్‌ డిసీ జ్‌ అండ్‌ మూవ్‌మెంట్‌ డిజార్డర్‌ సొసైటీ ’ ప్రయత్నాలతో మొదలైంది. అదే సమయంలో ఆర్జెంటీనాలో టాంగో, సల్సా డ్యాన్సులు పార్కిన్సన్స్‌కు చికిత్స గా ఉపయోగపడతాయా అన్న దానిపై అధ్యయనం జరుగుతోంది. ఆ స్ఫూర్తితో 2010లో మన దగ్గర శా స్త్రీయ నృత్యాల చికిత్సా తరగతులు వారానికి రెండుసార్లు 3 నెలల పాటు ముంబైలో జరిగాయి. ప్రస్తుతం దేశంలోని అనేక కమ్యూనిటీ సెంటర్లు భరతనాట్యం, గర్బా, కూడియట్టంలతో చికిత్స చేస్తున్నాయి.పార్కిన్‌సన్స్‌ లక్షణాలు – కారణాలుప్రధానంగా ఇవి శారీరకమైనవి. వణుకు, బిగదీసుకుపోవటం, కదలికలు నెమ్మదించటం, భంగిమలో అస్థిరత వంటివి కనిపిస్తాయి. క్రమంగా ఆందోళన, కుంగుబాటు మొదలౌతుంది. ఎవ్వరితోనూ కలవలేక, ఆత్మ విశ్వాసం సన్నగిల్లి అపారమైన దుఃఖం మిగులుతుంది. మెదడులో డోపమైన్‌ రసాయనాన్ని ఉత్పత్తి చేసే నాడీ కణాలు సక్రమంగా పని చెయ్యకపోవటం లేదా నశించటం పార్కిన్‌సన్స్‌కు ప్రధాన కారణం. మనిషి తను కదలాలనుకున్నట్లు కదలటానికి డోపమైన్‌ అవసరం. డోపమైన్‌ లోపించటం వల్ల కదలికలు అస్తవ్యస్తం అవుతాయి. మెదడులో డోపమైన్‌ ఉత్పత్తి తగ్గటానికి గల కారణాలపై పరిశోధకులింకా స్పష్టమైన నిర్ధారణకు రాలేదు. ఒక కారణం మాత్రం వృద్ధాప్యం. అరవై ఏళ్లు పైబడిన వాళ్లలో సుమారు ఒక శాతం మందికి పార్కిన్‌సన్స్‌ వచ్చే అవకాశాలున్నాయని అంచనా. డోపమైన్‌ను భర్తీ చేసే మందులు, మెదడు ఉద్దీపన వంటి వైద్య చికిత్సలలో పురోగతి సాధించినప్పటికీ ఫలితాలైతే అనుకున్నంతగా లేవు.రోగులు తమకు తామే వైద్యులుసాధారణ వైద్యంలా ఈ ‘డ్యాన్స్‌ మూవ్‌మెంట్‌ థెరపీ’ ఎవరో సూచించేది కాదు. ఎవరికి వారుగా అనుసరించేది. ఎలా కదలాలన్నదీ ఎవరూ చెప్పరు. కదిలే మార్గాలను ఎవరికి వారే అన్వేషించేలా మాత్రం ప్రోత్సహిస్తారు. నడక లేదా భంగిమను సరిదిద్దుతారు. శ్వాసపై నియంత్రణ కల్పిస్తారు. ఊహాశక్తిని, వ్యక్తీకరణను లయబద్ధం చేస్తారు. చికిత్సలో పాల్గొనే వారిలో కొంతమంది కూర్చుని నృత్యం చేస్తారు. మరికొందరు స్థిరంగా నిలబడతారు. కొందరు మరింత స్వేచ్ఛగా కదులుతారు. మొత్తానికి వాళ్లంతా రోగుల్లా కాకుండా, దేన్నో సృష్టిస్తున్నట్లుగా ఉంటారు.సాక్షి నేషనల్‌ డెస్క్‌(చదవండి: హీరో శింబు ఫిట్‌నెస్‌ సీక్రెట్‌ ఇదే..! రాత్రి పూట అలా నిద్రపోతేనే..)

Vijay Sethupathi Comments About Movie Title with Puri Jagannath6
'పూరి అంటే చాలా రెస్పెక్ట్'.. అది ఎవరో క్రియేట్ చేశారు: విజయ్ సేతుపతి

కోలీవుడ్‌ హీరో విజయ్ సేతుపతి మరో మూవీ రెడీ అయిపోయారు. విడుదల-2 తర్వాత ఆయన నటించిన ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌ ఏస్. ఈ మూవీ హీరోయిన్‌గా రుక్మిణీ వసంత్‌ నటించారు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 23న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు హాజరైన హీరో విజయ్ సేతుపతి పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.టాలీవుడ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌తో చేస్తున్న సినిమా టైటిల్‌పై ప్రశ్నించగా.. విజయ్ సేతుపతి స్పందించారు. ఇంకా మేము టైటిల్ ఫిక్స్ చేయలేదని ఆయన అన్నారు. ఏఐతో ఎవరో పోస్టర్‌ చేశారని.. అది మనది కాదని తెలిపారు. పూరి జగన్నాథ్‌ అంటే నాకు చాలా రెస్పెక్ట్ ఉందని విజయ్ సేతుపతి అన్నారు. ఆయన సినిమాలు కూడా చూశానని.. స్క్రిప్ట్‌ అద్భుతంగా ఉంటుందని ప్రశంసలు కురిపించారు. అంతేకాకుండా విశాల్‌తో ఎయిర్‌పోర్ట్‌లో కలవడంపై మాట్లాడారు. ఆయనతో కేవలం పెళ్లి గురించి మాత్రమే చర్చించానని వెల్లడించారు. రాజకీయాల్లోకి వస్తారా? అని కూడా విశాల్‌ను అడిగానని తెలిపారు. నేను మాత్రం రాజకీయాల్లోకి రానని విజయ్ సేతుపతి ఫుల్ క్లారిటీ ఇచ్చారు.విజయ్ సేతిపతి మాట్లాడుతూ.. 'మేము టైటిల్‌ ఖరారు చేయలేదు. బెగ్గర్‌ అని టైటిల్ మీరే ఫిక్స్ చేశారా? పూరి జగన్నాథ్‌ అంటే నాకు చాలా రెస్పెక్ట్. ఆయన సినిమాలు చాలా చూశా. స్క్రిప్టు వినడానికి రెండు, మూడు రోజులు పడుతుందేమో అనుకున్నా. కానీ కొన్ని గంటల్లోనే పూర్తి చేశారు. జూన్‌లో షూటింగ్‌ ప్రారంభం అవుతుంది. ఆడియన్స్‌ కంటే ఎక్కువ ఆసక్తిగా ఎదురుచూస్తున్నా' అని అన్నారు.

HYDRA Demolish Constructions In  Boduppal7
హైడ్రా కూల్చివేతలు.. బోడుప్పల్‌లో కబ్జాలు..

సాక్షి, మేడ్చల్‌: తెలంగాణలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. తాజాగా మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలోని పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. పోలీసులు బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి.వివరాల ప్రకారం.. పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పర్వతాపూర్‌లో స్మశాన వాటికల్లోని కొంత భూమిని కొందరు ఆక్రమించారు. అక్కడ అక్రమ నిర్మాణాలను చేపట్టారు. సర్వే నంబర్లు 1, 12లోని స్మశాన వాటికల్లోని భూములను కబ్జా చేసి కబ్జాదారులు వాటని విక్రయిస్తున్నారు. గత రెండేళ్లుగా కబ్జాలు జరుగుతున్నాయి. దీంతో, స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. అనంతరం, హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ బుధవారం మధ్యాహ్నం బోడుప్పల్, పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్‌లో పర్యటించారు. అక్రమ నిర్మాణాలు, కబ్జాలు జరిగినట్టు గుర్తించారు.ఈ నేపథ్యంలో అక్కడ అక్రమ నిర్మాణాలను తొలగస్తామని రంగనాథ్‌.. స్థానికులకు హామీ ఇచ్చారు. గురువారం ఉదయమే హైడ్రా అధికారులు అక్కడికి చేరుకుని అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. అక్రమ నిర్మాణాలు, కబ్జాలపై హైడ్రా స్పందించడంతో​ స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక, అంతకుముందు, బుధవారం ఉదయం మేడిపల్లిలోని సేజ్ స్కూల్లోని అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు.

Heavy Rain Fall In Delhi And Telangana8
ఢిల్లీ అతలాకుతలం.. తెలంగాణలో అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

సాక్షి, ఢిల్లీ/హైదరాబాద్‌: మండు వేసవిలో దేశవ్యాప్తంగా అకాల వర్షాలు దంచికొడుతున్నాయి. వ‍ర్షాకాలం నాటి పరిస్థితులు వేసవిలో కనిపిస్తున్నాయి. ఢిల్లీ, తెలుగు రాష్ట్రాలు సహా పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక, ఢిల్లీలో బలమైన గాలులు, వడగళ్ల వానతో నగరం మొత్తం అస్తవ్యస్తంగా మారింది. ఈదురు గాలులకు చెట్లు, హోర్డింగ్‌లు నేలకొరిగి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. అటు.. చెట్లు కూలడంలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. కొన్ని ఏరియాల్లో మెట్రో సేవలు కూడా నిలిచిపోయాయి. ఇటు తెలంగాణలోనూ ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి.ఢిల్లీలో బుధవారం రాత్రి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. గంటకు 70కిలో మీటర్ల వేగంతో గాలులు వీచాయి. సఫ్దర్‌జంగ్‌ ప్రాంతంలో ఏకంగా గంటకు 80 కిలీమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచాయి. లోదీ రోడ్‌లో వడగళ్ల వాన పడింది. ఈదురుగాలులు, భారీ వర్షం కారణంగా ఢిల్లీ ఎయిర్‌పోర్టు సహా పలు విమానయాన సంస్థలు ప్రయాణికులను అప్రమత్తం చేశాయి. విమాన సర్వీసులపై ప్రభావం పడే అవకాశముందని ముందుగానే ప్రకటించాయి.Just now Delhi witnessed a massive dust storm followed by rain and hail. The power of nature is on full display #delhirain ⛈️"From dust storm to heavy rain and hail - #Delhi's weather is going to change dramatically tonight 🌪⚡️#delhirain #DelhiWeather pic.twitter.com/FLatYfSEap— Weatherman Uttam (@Gujarat_weather) May 21, 2025Thunderstorms and dust storms coupled with heavy rain wreak havoc across Delhi-NCR, uprooting trees and mangling sign boards.#delhirain #DelhiWeather pic.twitter.com/duY0nhOhIs— Mr. J (@LaughingDevil13) May 21, 2025ఇదిలా ఉండగా.. మరో మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళా తీరాన్ని తాకనున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. నిన్న తెలంగాణలో కురిసిన భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. పిడుగులు పడి మహబూబాబాద్‌ జిల్లాల్లో ఇద్దరు, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల్లో ఒక్కొక్కరు చనిపోయారు. సూర్యాపేట జిల్లాలో పిడుగుపాటుకు 39 మేకలు చనిపోయాయి. ఇక వీటితో పాటు.. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్, మెదక్, నిజామాబాద్, నల్గొండ జిల్లాల్లో వర్షాలు కురిశాయి.#delhirain pic.twitter.com/1nxW0mxdVC— Suaib (@JournalistSuaib) May 21, 2025హైదరాబాద్‌లో వాన బీభత్సంహైదరాబాద్‌లో వాన బీభత్సం సృష్టించింది. రోడ్లన్ని నదులను తలపించాయి. దీంతో ఎక్కడిక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరో 4 రోజుల పాటు కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అప్రమత్తం చేసింది. తెలంగాణలోని అన్నిజిల్లాలకు ఎల్లో అలర్ట్‌ విధించింది వాతావరణ శాఖ. బంగ్లగూడ, సైదాబాద్‌, మలక్‌పేట్‌, ఉప్పల్‌ తదితర ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. #HyderabadRains Continue... 🌧️📸: Retratoooo [IG] pic.twitter.com/2LrjO7dxqT— Hi Hyderabad (@HiHyderabad) May 21, 2025It was a craziest downpour in Sikh Village Secunderabad. @balaji25_t #HyderabadRains pic.twitter.com/TzkHmGDfUA— The Food GlanZer (@JavedMohammeds) May 21, 2025Dramatic visuals from Hyderabad's Greenpark Colony: Two-wheeler almost swept away by rainwater.#Rain #Hyderabad #HyderabadRains #ViralVideo #Trending pic.twitter.com/mD3hRXFpLi— TIMES NOW (@TimesNow) May 22, 2025

Amrit Bharat Station Scheme PM Modi to Inaugurate 103 Redeveloped Rrailway Stations9
నేడు ప్రధాని మోదీ ‍ప్రారంభించనున్న రైల్వే స్టేషన్లు ఇవే..

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పునరాభివృద్ధి చేసిన 103 రైల్వే స్టేషన్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు (మే 22)న ప్రారంభించనున్నారు. 2022, డిసెంబర్‌లో అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకం కింద ఈ స్టేషన్ల పునరాభివృద్ధికి ప్రధానమంత్రి రెండు దశల్లో శంకుస్థాపన చేశారు. దేశంలోని రైల్వే స్టేషన్లను ఆధునిక, సమగ్ర రవాణా కేంద్రాలుగా మార్చడంలో భాగంగా రైల్వే మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా 1,300కుపైగా స్టేషన్లను పునరాభివృద్ధి చేసింది.అమృత్‌ భారత్‌ స్టేషన్‌(Amrit Bharat Station) పథకాన్ని దేశంలోని పలు రైల్వే స్టేషన్లలో ఆధునిక వసతుల కల్పన, మల్టీమోడల్ ఇంటిగ్రేషన్, దివ్యాంగులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా చేపట్టారు. నేడు ప్రధాని మోదీ 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని 103 రైల్వే స్టేషన్లను ప్రారంభించనున్నారు. ఆ స్టేషన్ల వివరాలిలా ఉన్నాయి.అస్సాం: హైబర్‌గావ్బీహార్‌: పిర్పైంటి, థావే.ఛత్తీస్‌గఢ్‌: దొంగగర్, భానుప్రతాపూర్, భిలాయ్, ఉర్కురా, అంబికాపూర్.గుజరాత్‌: సమఖియాలీ, మోర్బి, హపా, జామ్ వంతాలి, కనలస్ జంక్షన్, ఓఖా, మిథాపూర్, రాజులా జంక్షన్, సిహోర్ జంక్షన్, పాలిటానా, మహువ, జామ్ జోధ్‌పూర్, లింబ్డి, డెరోల్, కరంసాద్, ఉత్రాన్, కొసాంబ జంక్షన్, డాకోర్.హర్యానా: మండి దబ్వాలి.హిమాచల్ ప్రదేశ్‌: బైజ్నాథ్ పప్రోలా.జార్ఖండ్‌: శంకర్‌పూర్, రాజమహల్, గోవింద్‌పూర్ రోడ్.కర్ణాటక: మునీరాబాద్, బాగల్‌కోట్, గడగ్, గోకాక్ రోడ్, ధార్వాడ్.కేరళ: వడకర, చిరాయింకీజ్.మధ్యప్రదేశ్‌: షాజాపూర్, నర్మదాపురం, కట్ని సౌత్, శ్రీధం, సియోని, ఓర్చా.మహారాష్ట్ర: పరేల్, చించ్‌పోక్లి, వడలా రోడ్, మాతుంగా, షాహద్, లోనంద్, కేద్గావ్, లాసల్‌గావ్, ముర్తిజాపూర్ జంక్షన్, దేవ్‌లాలి, ధూలే, సావ్దా, చందా ఫోర్ట్, ఎన్‌ఎస్‌బీసీ ఇటావ్రీ జంక్షన్, అమ్‌గావ్. పుదుచ్చేరి: మహే.రాజస్థాన్‌: ఫతేపూర్ షెఖావతి, రాజ్‌గఢ్, గోవింద్ గర్, దేశ్‌నోక్, గోగమేరి, మందావర్ మహువ రోడ్, బుండి, మండల్ గర్.తమిళనాడు: సామలపట్టి, తిరువణ్ణామలై, చిదంబరం, వృద్ధాచలం జంక్షన్, మన్నార్గుడి, పోలూరు, శ్రీరంగం, కుళిత్తురై, సెయింట్ థామస్ మౌంట్.తెలంగాణ: బేగంపేట(Begumpet), కరీంనగర్, వరంగల్.ఉత్తరప్రదేశ్‌: బిజ్నోర్, సహరాన్‌పూర్ జంక్షన్, ఈద్గా ఆగ్రా జంక్షన్, గోవర్ధన్, ఫతేహాబాద్, కర్చన, గోవింద్‌పురి, పోఖ్రాయాన్, ఇజ్జత్‌నగర్, బరేలీ సిటీ, హత్రాస్ సిటీ, ఉఝని, సిద్ధార్థ్ నగర్, స్వామినారాయణ్ చప్పియా, మైలానీ జంక్షన్, గోల గోకరనాథ్, రామ్‌ఘాట్ హాల్ట్, సురైమాన్‌పూర్, బల్‌రామ్‌పూర్.పశ్చిమ బెంగాల్‌: పనగఢ్, కళ్యాణి ఘోష్పరా, జోయ్‌చండీ పహార్.ఇది కూడా చదవండి: యూట్యూబ్‌లో జ్యోతి మల్హోత్రా సంపాదన ఎంతంటే..

TCS gets Rs 2903 crore order from BSNL10
టీసీఎస్‌కు రూ. 2,903 కోట్ల ఆర్డర్‌

న్యూఢిల్లీ: దేశీ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) తాజాగా ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి రూ. 2,903 కోట్ల యాడ్‌–ఆన్‌ అడ్వాన్స్‌ పర్చేజ్‌ ఆర్డరు (ఏపీవో) దక్కించుకుంది. దీని ప్రకారం బీఎస్‌ఎన్‌ఎల్‌కు 18,685 సైట్లలో 4జీ మొబైల్‌ నెట్‌వర్క్‌ ప్లానింగ్, ఇంజినీరింగ్, సరఫరా, ఇన్‌స్టాలింగ్, టెస్టింగ్, వార్షిక మెయింటెనెన్స్‌ మొదలైన సర్వీసులను టీసీఎస్‌ అందించాల్సి ఉంటుంది.ఏపీవోలో పేర్కొన్న నిర్దిష్ట నిబంధనలకు లోబడి సవివర పర్చేజ్‌ ఆర్డర్లను (పీవో) బీఎస్‌ఎన్‌ఎల్‌ జారీ చేస్తుందని కంపెనీ తెలిపింది. ఈ కాంట్రాక్టుకు సంబంధించి తాము టీసీఎస్‌కు సరఫరా చేసే రేడియో యాక్సెస్‌ నెట్‌వర్క్‌ (ఆర్‌ఏఎన్‌), ఇతరత్రా పరికరాల విలువ సుమారు రూ. 1,526 కోట్లుగా ఉంటుందని తేజాస్‌ నెట్‌వర్క్స్‌ పేర్కొంది. నిర్దిష్ట షరతులకు లోబడి టీసీఎస్‌ సవివర పీవోలను జారీ చేస్తుందని వివరించింది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement