Top Stories
ప్రధాన వార్తలు

తిరువూరు కౌన్సిలర్లను అభినందించిన వైఎస్ జగన్
తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని తిరువూరు కౌన్సిలర్లు బుధవారం కలిశారు. తిరువూరు నగర పంచాయతీ ఛైర్పర్సన్ ఎన్నిక సందర్భంగా తమపై టీడీపీ నాయకుల దాడి, దౌర్జన్యం గురించి వైఎస్ జగన్‌కు కౌన్సిలర్లు వివరించారు. పోలీసులు, కూటమి నేతలు, టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ రాజ్యాంగ విరుద్దంగా వ్యవహరించిన తీరును పార్టీ నేతలు వైఎస్ జగన్ దృష్టికి తీసుకొచ్చారు.ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో మెజారిటీ లేకపోయినా బరితెగించి అనైతిక రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వ అరాచకాలను, దాష్టికాలను ధీటుగా ఎదుర్కొందామన్నారు. చట్టపరంగా, న్యాయపరంగా పార్టీ అండగా ఉంటుందన్న వైఎస్ జగన్.. ఎన్ని ఇబ్బందులు పెట్టినా ధైర్యంగా నిలిచినందుకు అభినందనలు తెలిపారు.

నీటి వివాదం.. పాక్ హోంమంత్రి ఇంటికి నిప్పు
ఇస్లామాబాద్: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌ను దెబ్బ కొడుతూ భారత్ తీసుకున్న కఠిన నిర్ణయాల్లో సింధూ నదీ జలాలతో ముడిపడిన అంశం ఒకటి. భారత్ తీసుకున్న నిర్ణయంతో పాకిస్తాన్ సింధ్ ప్రావిన్స్‌లో నిరసనలు మిన్నంటాయి. నీళ్లు లేకపోవడంతో పాక్ ప్రజలు ఎదురు తిరిగారు. పాక్ హోంమంత్రి జియా ఉల్ హసన్ ఇంటిని తగలబెట్టారు.ఈ సంఘటన భద్రత, ప్రజల ఆగ్రహాన్ని అదుపు చేయడంలో ప్రభుత్వ సామర్థ్యంపై తీవ్రమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నీటి కటకటతో నిరసనకారులు హోమంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బహిరంగంగా ఏకే 47 గన్నుతో గాల్లోకి కాల్పులు జరుపుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పాకిస్తాన్లో నీటి సంక్షోభంసింధు నది నుండి నీటిని మళ్లించి,పంజాబ్‌కు నీటి సరఫరాను పెంచేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం కాలువను నిర్మించాలని యోచిస్తోంది. కానీ సింధ్‌లోని స్థానికులు ప్రభుత్వ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయం వల్ల తమ వ్యవసాయ భూములకు,తాగునీటికి ముప్పు వాటిల్లుతుందని,ఇప్పటికే నీటి కొరతను ఎదుర్కొంటున్నామని ఈ ప్రాజెక్ట్ పరిస్థితిని మరింత దిగజార్చుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అంతేకాదు,ఐఎంఎఫ్ ఒత్తిడితో పంటలకు కనీస మద్దతు ధర (MSP) నిలిపివేయడంకార్పొరేట్ వ్యవసాయం కోసం వారసత్వ భూములను బలవంతంగా సేకరించడంలాభం కోసం పాకిస్తాన్ సైన్యం సైతం వ్యవసాయంలో భాగస్వామ్యం కావడం.. వంటి అంశాలపై పాక్ ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికింది. తాజాగా, ప్రభుత్వ తీరును నిరసిస్తూ స్థానికులు జాతీయ రహదారిని దిగ్బంధించడానికి ప్రయత్నించారు. ఈ ప్రయత్నంతో అక్కడ నిరసనలు మిన్నంటాయి. పోలీసులు భారీ ఎత్తున మోహరించి ఆందోళనకు దారితీసింది. ఇది ఘర్షణలకు దారితీసింది. ఈ హింసాత్మక ఘటనలో ఇద్దరు పౌరులు మరణించారు.పోలీసు అధికారులతో సహా అనేక మంది గాయపడ్డారు. నిరసనకారులు మోరోలోని హోంమంత్రి ఇంటిపై కూడా దాడి చేసి తగలబెట్టారు. House of Sindh Interior Minister Ziaul Hasan🇵🇰 pic.twitter.com/hQdD02tBBj— ARIKA🇮🇳🚩 (@nidhisj2001) May 21, 2025పోలీసు చర్యకు ఆదేశించినందుకు స్థానికులు మంత్రిపై మండిపడుతున్నారు. నీటి కొరత కారణంగా సింధ్ విధ్వంసానికి దారితీసే విధానాలకు ఆయన మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. నిరసనకారులు ఆసుపత్రిలో గాయపడిన పోలీసు అధికారులపై దాడి చేయడంతో మరింత ఉద్రిక్తతకు దారి తీసింది. నిరసనకారులు యూరియా ఇతర ఎరువులతో వెళ్తున్న ట్రక్కులను దోచుకుని ఆపై వాటిని తగలబెట్టారు.స్పందించిన పాక్ ప్రభుత్వంఈ ఆందోళనపై పాక్ ప్రభుత్వం స్పందించింది. సింధ్‌లో భద్రతను బలోపేతం చేసే దిశగా పారామిలిటరీ దళాలను మోహరించారు. దాడులలో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. పహల్గాం ఉగ్రదాడితో పహల్గాంలో పర్యటకులపై ఉగ్రదాడి అనంతరం సింధూ జలాల ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు భారత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దాదాపు తొమ్మిదేళ్లపాటు విస్తతస్థాయి చర్చల తర్వాత 1960 సెప్టెంబర్ 19వ తేదీన నాటి భారత ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూ, పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్‌ఖాన్‌లు ఈ చరిత్రాత్మక ఒప్పందంపై సంతకాలు చేశారు.ఈ డీల్ ప్రకారం సింధు ఉప నదుల్లో తూర్పున పారే రావి, బియాస్, సట్లెజ్ నదులపై భారత్ కు హక్కులు లభించాయి. సింధూ నదితోపాటు దాని పశ్చిమ ఉపనదులైన జీలం, చీనాబ్‌లపై పాకిస్తాన్‌కు హక్కులు దక్కాయి. ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్‌కు బుద్ధి చెప్పేందుకు సింధూ నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది.దీంతో పాక్‌లో నీటి సమస్య ఉత్పన్నమవుతున్నాయి.

ఆపరేషన్ కగార్.. భద్రత బలగాల నెక్ట్స్ టార్గెట్ అతడేనా?
ఛత్తీస్‌గఢ్: భద్రతా బలగాల కూంబింగ్ కొనసాగుతోంది. మావోయిస్టు పార్టీ అగ్రనేత నంబాల కేశవరావు మృతి చెందడంతో భద్రత బలగాలు మరింత దూకుడు పెంచాయి. పార్టీలో కీలక నేతగా ఉన్న మడావి హిడ్మా టార్గెట్‌గా కేంద్ర హోంశాఖ ఆపరేషన్ మొదలుపెట్టింది.అంబుజ్‌మడ్ దండకారణ్యంలో హిడ్మా కోసం రెండు వేల మంది భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే ఎన్ఐఏ హిట్ లిస్టులో హిడ్మా ఉండగా, మావోయిస్టు పార్టీలో 18 మంది కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నట్లు కేంద్ర హోంశాఖ గుర్తించినట్లు సమాచారం.రాబోయే 10 నెలలు కీలక నేతలు టార్గెట్‌గా ఆపరేషన్ కొనసాగుతోంది. ప్రస్తుతం మావోయిస్టు పార్టీ అగ్ర నేతలు ఎక్కడెక్కడ షెల్టర్ జోన్ తీసుకున్నారన్నదానిపై పూర్తి వివరాలను కేంద్ర హోంశాఖ సేకరిస్తోంది. మరో వైపు నంబాల కేశవరావు మృతిపై మావోయిస్ట్ పార్టీ ఎటువంటి ప్రకటన చేయలేదు. కేశవరావు మృతిని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధికారికంగా ప్రకటించారు. తాజా ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అత్యవసర సమావేశమైంది.

వెస్టిండీస్‌తో సిరీస్‌కు ముందు ఇంగ్లండ్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ
మే 29 నుంచి స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు ముందు ఇంగ్లండ్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. కుడి చేతి బొటన వేలి గాయం కారణంగా ఆ జట్టు స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) అధికారికంగా ప్రకటించింది. ఆర్చర్‌కు ప్రత్యామ్నాయంగా లూక్ వుడ్‌ను ఎంపిక చేసింది. ఆర్చర్ ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతూ గాయం బారిన పడ్డాడు. దీని కారణంగా అతను కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యాడు. మధ్యలో ఐపీఎల్ ఆగిపోవడంతో స్వదేశానికి వచ్చేసిన ఆర్చర్ తిరిగి భారత్‌కు రాలేదు. ఈ సీజన్లో ఆర్చర్ 12 మ్యాచ్‌లు ఆడి 11 వికెట్లు తీశాడు. ఈ సీజన్లో రాయల్స్ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించలేక ఇంటిముఖం పట్టింది. నిన్న (మే 20) సీఎస్కే విజయంతో రాయల్స్ ఈ సీజన్‌ను ముగించింది. ఈ సీజన్లో 14 మ్యాచ్‌లు ఆడిన ఆ జట్టు కేవలం నాలుగే విజయాలతో పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది.ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2025 జరుగుతుండగానే వెస్టిండీస్, ఇంగ్లండ్ మధ్య వన్డే సిరీస్ జరుగుతుంది. ఈ సిరీస్ మే 29, జూన్ 1, జూన్ 3 తేదీల్లో జరుగుతుంది. ఈ సిరీస్ కారణంగా ఇంగ్లండ్, విండీస్‌కు చెందిన ఆటగాళ్లు ఐపీఎల్ ప్లే ఆఫ్స్‌కు దూరం కానున్నారు. ఈ సిరీస్ అనంతరం ఇరు జట్ల మధ్య టీ20 సిరీస్ కూడా జరుగుతుంది. జూన్ 6, 8, 10 తేదీల్లో ఈ మ్యాచ్‌లు జరుగనున్నాయి.విండీస్‌తో వన్డే సిరీస్ కోసం ఇంగ్లండ్ జట్టు..హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జో రూట్, బెన్ డకెట్, జేకబ్ బేతెల్, విల్ జాక్స్, జోస్ బట్లర్, టామ్ బాంటన్, జేమీ స్మిత్, జోఫ్రా ఆర్చర్ (లూక్ వుడ్), బ్రైడన్ కార్స్, టామ్ హార్ట్లీ, గస్ అట్కిన్సన్, మాథ్యూ పాట్స్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్, జేమీ ఓవర్టన్విండీస్ జట్టు..బ్రాండన్ కింగ్, షిమ్రోన్ హెట్‌మైర్, ఎవిన్ లెవిస్, కీసీ కార్తీ, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, రోస్టన్ ఛేజ్, జస్టిన్ గ్రీవ్స్, గుడకేశ్ మోటీ, జువెల్ ఆండ్రూ, షాయ్ హోప్ (కెప్టెన్), ఆమిర్ జాంగూ, మాథ్యూ ఫోర్డ్, అల్జరీ జోసఫ్, షమార్ జోసఫ్, జేడన్ సీల్స్, జేదియా బ్లేడ్స్

దుబాయ్‌లో కంపెనీ గల్లంతు.. రూ.కోట్లు నష్టపోయిన భారతీయులు
దుబాయ్‌కు చెందిన ఓ బ్రోకరేజీ సంస్థ రాత్రికి రాత్రే గల్లంతైంది. రూ.కోట్ల కొద్దీ ఇన్వెస్టర్ల సొమ్ముతో ఆచూకీ లేకుండా మాయమైంది. దుబాయ్ లోని బిజినెస్ బేలోని క్యాపిటల్ గోల్డెన్ టవర్‌లో అప్పటి వరకూ ఆ కంపెనీ ఉన్న ఆఫీస్ బయట ఒక బకెట్, అందులో ఒక మాప్, చెత్త సంచి మాత్రమే కనిపించాయి. కొన్ని వారాల క్రితం ఈ స్థలంలో గల్ఫ్ ఫస్ట్ కమర్షియల్ బ్రోకర్స్ కార్యాలయం ఉండేదని, అదే ఇప్పుడు అదృశ్యమైనట్లు కనిపిస్తోందని ఖలీజ్ టైమ్స్ నివేదిక తెలిపింది.గల్లంతైన సంస్థ..గత నెల వరకు గల్ఫ్ ఫస్ట్ దుబాయ్ సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ లోని క్యాపిటల్ గోల్డెన్ టవర్ 302, 305 సూట్ లలో సుమారు 40 మంది ఉద్యోగులతో కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉండేది. ఔత్సాహిక ఇన్వెస్టర్లను సంప్రదించడం, ఫారెక్స్ పెట్టుబడులను ప్రోత్సహించడం వారి పని.క్యాపిటల్ గోల్డెన్ టవర్లోని ఆ రెండు గదులు ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి. ఫోన్ లైన్లు తెగిపోయి ఫ్లోర్లు దుమ్ముతో నిండిపోయి ఉన్నాయి. తాళాలు తిరిగి ఇచ్చి, అన్నీ క్లియర్ చేసి హడావుడిగా వెళ్లిపోయారని క్యాపిటల్ గోల్డెన్ టవర్ సెక్యూరిటీ గార్డు ఒకరు మీడియాకు తెలిపారు. ఇప్పుడు రోజూ జనం వచ్చి వారి గురించి అడుగుతున్నారని చెప్పారు.నష్టపోయిన భారత ఇన్వెస్టర్లుగల్ఫ్ ఫస్ట్ బాధితుల్లో భారతీయ ఇన్వెస్టర్లు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. కంపెనీలో పెట్టుబడి పెట్టి కోట్లాది రూపాయలు నష్టపోయినట్లు బాధితులు చెబుతున్నారు. కేరళకు చెందిన మహ్మద్, ఫయాజ్ పొయిల్ గల్ఫ్ ఫస్ట్ కమర్షియల్ బ్రోకర్స్ బ్యాంకర్స్ ద్వారా 75,000 డాలర్లు అంటే రూ.64 లక్షలకు పైగా ఇన్వెస్ట్ చేసి మోసపోయారు.మరో భారతీయ ఇన్వెస్టర్ అయితే ఏకంగా 2,30,000 డాలర్లు భారతీయ కరెన్సీలో దాదాపు రూ.2 కోట్లు నష్టపోయారు. ఇన్వెస్ట్ చేసే సయమంలో కంపెనీ రిలేషన్షిప్ మేనేజర్ తనతో తన మాతృ భాష కన్నడంలో మాట్లాడారని చెప్పుకొచ్చారు. మొదట చిన్న చిన్న లాభాలను చూపించి డబ్బును ఉపసంహరించుకునేందుకు అవకాశం కల్పించిన కంపెనీ ఆ తర్వాత ఉపసంహరణలకు వీలు లేకుండా ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేయించారని బాధితుడు పేర్కొన్నారు.కంపెనీ సిబ్బంది తనతో మాట్లాడేటప్పుడు గల్ఫ్ ఫస్ట్, సిగ్మా-వన్ పేర్లను మార్చి మార్చి చెప్పారని, అవి రెండూ ఒకే కంపెనీగా ఉన్నాయని 50,000 డాలర్లు (సుమారు రూ.42 లక్షలు) నష్టపోయిన మహమ్మద్ అనే మరో ఇన్వెస్టర్ వివరించారు. రెండు సంస్థలపై కేసు నమోదు చేసిన పోలీసులు సిగ్మా-వన్ క్యాపిటల్ కు డీఎఫ్ఎస్ఏ లేదా ఎస్సీఏ అనుమతి లేదని నిర్ధారించారు.

నీ భాషలో మాట్లాడ.. ఏం చేసుకుంటావో చేస్కో పో!
సాక్షి,బెంగళూరు: ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐలో (sbi) ప్రాంతీయ (language row) భాష చిచ్చు పెట్టింది. ఎస్బీఐ మేనేజర్ తమ మాతృ భాషలో మాట్లాడడం లేదంటూ స్థానికులు ఆందోళన బాటపట్టారు. ఎస్బీఐ ప్రధాన కార్యాలయంలో ప్లకార్డ్‌లతో నిరసన చేపట్టారు. ఈ అంశంలో రాష్ట్ర ముఖ్యమంత్రితో సహా ఇతర నేతలు సైత్యం జోక్యం చేసుకోవడం చిలికి చిలికి గాలివానలా మారింది. చివరకు సదరు మేనేజర్‌ను ట్రాన్స్ఫర్ చేస్తూ ఎస్బీఐ చర్యలకు ఉపక్రమించింది.ఇంతకీ ఏం జరిగిందంటే? కర్ణాటక రాజధాని బెంగళూరు సూర్యా నగర్ ఎస్బీఐ (SBI Surya Nagar branch Bangalore) బ్రాంచ్‌లో కస్టమర్‌కు, మహిళా బ్యాంక్ మేనేజర్ మధ్య వివాదం జరిగింది.అందుకు సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.ఆ వీడియోల్లో బ్యాంక్ మేనేజర్‌ను పదేపదే కన్నడలో (kannada language row) మాట్లాడమని కస్టమర్ సూచించడం, అందుకు బ్యాంక్ మేనేజర్ తాను కన్నడలో మాట్లాడనని, ఏం చేసుకుంటారో ఏం చేసుకోండి’ అంటూ కస్టమర్, బ్రాంచ్ మేనేజర్ మధ్య సంభాషణ జరిగింది. 🚨 Karnataka's divisive language war!SBI manager in Chandapura unfairly targeted for not speaking Kannada.India’s diversity means we can’t force one language—Hindi & English are official too.Let’s respect all tongues & unite, not vilify!🇮🇳#sbimanager #Kannada #Karnataka… pic.twitter.com/nv0Rd5W6Yr— Rahul Kumar (@RealRavani) May 21, 2025 అలా అని రాసుందా?ఒకానొక సమయంలో ‘మేమేం చేయాలో మీరు చెప్పడం కాదని బ్యాంక్ మేనేజర్..కస్టమర్‌తో అనడం. భాష విషయంలో మళ్లీ జోక్యం చేసుకున్న కస్టమర్ మీరు హిందీలో కాకుండా కన్నడలో మాట్లాడమని బ్యాంక్ మేనేజర్‌కు సూచించడం.. అందుకు మేనేజర్ బదులిస్తూ..అలా అని ఎక్కడైనా రాసుందా? అని ప్రశ్నించడంతో మరింత వివాదం రాజుకుంది.ఇది కర్ణాటక.. కాదు ఇండియాకస్టమర్ బ్యాంక్ మేనేజర్ తీరును ప్రశ్నిస్తూ.. ఇది ఆర్బీఐ నిర్ణయం. మీరు ముందు అది తెలుసుకోండి. ఇది కర్ణాటక ఇక్కడ కన్నడే మాట్లాడాలి అని అనడంతో.. ఇది ఇండియా అని బ్యాంక్ మేనేజర్ జవాబు ఇవ్వడం వీడియోల్లో కనిపిస్తోంది.ఎస్బీఐ సూర్యానగర్ బ్రాంచ్‌లో జరిగిన వివాదంపై ఎస్బీఐ స్పందించింది. బెంగళూరులోని సూర్యనగర్ బ్రాంచ్‌లో జరిగిన ఘటనపై మేం తీవ్రంగా విచారిస్తున్నాము. ఈ వ్యవహారాన్ని సమీక్షిస్తున్నాం. ఎస్బీఐ తన కస్టమర్ల భావోద్వేగాలను దెబ్బతీసే ప్రవర్తనకు సంబంధించి జీరో టాలరెన్స్ పాలసీని పాటిస్తుందని స్పష్టం చేసింది. అలాగే, ఎస్బీఐ మేనేజర్‌ను ట్రాన్స్ఫర్ చేసినట్లు సమాచారం. మరింత వివాదం ఎస్బీఐ బ్యాంక్‌లో బ్యాంక్ మేనేజర్,క స్టమర్ మధ్య చోటు చేసుకున్న వివాదం రాష్ట్రంలో పలు చోట్ల కన్నడ మద్దతు దారులు ఆందోళన చేపట్టారు. ప్రో-కన్నడ సంస్థ కర్ణాటక రక్షణ వేదిక (కేఆర్వీ) రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు ప్రకటించింది. ఎస్బీఐ సూర్యాపురం బ్రాంచ్ సిబ్బంది కన్నడ కస్టమర్లను అవమానిస్తోందని, స్థానిక భాషలో ప్రాథమిక సేవల్ని అందించడంలో విఫలమవుతున్నారని కేఆర్వీ ప్రతినిధులు ఆరోపించారు.A severe protest erupted today by the #KaRaVe members against the arrogant manager at the #SBIBank in #Chandapur, #Bengaluru!#ServeInMyLanguage #StopHindiImposition #KannadaInKarnataka https://t.co/K9HNZlsiYr pic.twitter.com/2WiFLdTiBD— Safa 🇮🇳 (@safaspeaks) May 21, 2025మరోవైపు, ఎస్బీఐ బ్యాంక్‌లో జరిగిన వివాదంపై సీఎం సిద్ధరామయ్య ఎక్స్ వేదికగా సంప్రదించారు. బ్రాంచ్ మేనేజర్ ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ట్వీట్లో పేర్కొన్నారు. బెంగళూరు సౌత్ ఎంపీ తేజస్వి సూర్య ఈ వ్యవహారాన్ని తీవ్రంగా ఖండించారు. Many bank customers, especially in rural Karnataka, face extreme difficulty when banking staff - those that have a public interface - don’t communicate in local language. This is an issue faced by millions of customers in many states. After we raised this issue at multiple… https://t.co/msr6azNuFf pic.twitter.com/juFQyNq8uj— Tejasvi Surya (@Tejasvi_Surya) May 21, 2025The behaviour of the SBI Branch Manager in Surya Nagara, Anekal Taluk refusing to speak in Kannada & English and showing disregard to citizens, is strongly condemnable.We appreciate SBI’s swift action in transferring the official. The matter may now be treated as closed.…— Siddaramaiah (@siddaramaiah) May 21, 2025

పూజా ఖేడ్కర్ హంతకురాలో, తీవ్రవాదో కాదు: సుప్రీంకోర్టు
ఢిల్లీ: మాజీ ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్‌కు బెయిల్ మంజూరైంది. నకిలీ సర్టిఫికెట్ కేసులో బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు.. పూజ హంతకురాలో, తీవ్రవాదో కాదంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్రశర్మల ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. కేసు తీవ్రత, వాస్తవాలు, పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని.. పిటిషనర్‌కు ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసి ఉండాల్సిందంటూ సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.ఇప్పుడు పూజ అన్నీ కోల్పోయింది.. ఎక్కడా ఆమెకు ఉద్యోగం దొరికే అవకాశం కూడా లేదన్న ధర్మాసనం.. ఈ కేసు దర్యాప్తును త్వరగా పూర్తి చేయాలని సూచించింది. కాగా, నకిలీ సర్టిఫికెట్లతో ఐఏఎస్‌కు ఎంపికైన పూజ ఖేడ్కర్‌ను శిక్షణ నుంచి యూపీఎస్సీ తొలగించిన సంగతి తెలిసిందే. ఐఏఎస్ రూల్స్ 1954 ప్రకారం ఆమెపై చర్యలు తీసుకున్నట్లు అధికార ఉత్తర్వుల్లో పేర్కొంది.పుణెలో ఐఏఎస్ ప్రొబేషనరీ సమయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఖేద్కర్‌పై ఆరోపణలు ఉన్నాయి. ట్రైనింగ్ సమయంలో అధికారిక ఐఏఎస్ నెంబర్ ప్లేట్ కలిగిన కారు, కార్యాలయం వినియోగించడంతో గత ఏడాది ఆమెపై పుణె కలెక్టర్ మహారాష్ట్ర సీఎస్‌కు లేఖ రాశారు. దీంతో ఆమెపై బదిలీ వేటు పడింది. సివిల్ సర్వీసెస్‌కు ఎంపిక అయ్యేందుకు ఓబీసీ, వికలాంగుల కోటాలో నకిలీ దృవీకరణ పత్రాలు సర్పించినట్లు సైతం తేలింది.అంతేగాక నిబంధనలకు మించి సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాసినట్లు తెలిసింది. దీంతో ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టిన యూపీఎస్సీ... ఆమెను ముస్సోరిలోని లాల్‌బహదూర్ శాస్త్రి జాతీయ అకాడమీకి తిరిగి రావాలని ఆదేశించింది. నకిలీ పత్రాలతో పరీక్షలో ఉత్తీర్ణత సాధించినట్లు గుర్తించిన యూపీఎస్సీ దానిపై వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసులిచ్చింది. ఆమెపై ఫోర్జరీ కేసు నమోదు చేయడంతో పాటు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేసింది.

మావోయిస్టు అగ్రనేత నంబాల మృతి: అమిత్ షా అధికారిక ప్రకటన
సాక్షి, న్యూఢిల్లీ: మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు(Nambala Keshava Rao) బుధవారం ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందారు. నంబాల మృతిని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ వివరాలను ఆయన తెలియజేశారు. నారాయణపూర్‌లో ఇప్పటిదాకా జరిగిన ఎన్కౌంటర్లో 27 మంది మృతి చెందారు. ఇందులో సీపీఐ మావోయిస్ట్ జనరల్ సెక్రటరీ నంబాల కేశవరావు కూడా ఉన్నారు. నక్సల్స్ ఉదమ్యానికి నంబాల వెన్నెముకగా నిలిచారు. నక్సలిజాన్ని అంతమొందించడంలో ఇది కీలక ముందడుగు. ముప్పై ఏళ్ల పోరాటంలో ఇంత పెద్ద నాయకుడ్ని మట్టుబెట్టడం ఇదే తొలిసారి’’ అని ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారాయన. ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ తర్వాత 54 మందిని అరెస్ట్ చేశాం. మరో 84 మంది లొంగిపోయారు. 2026 ఏడాది మార్చి చివరికల్లా నక్సలిజాన్ని అంతమొందదిస్తాం’’ అని షా ఎక్స్ వేదికగా ప్రకటించారు. నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు అలియాస్ గంగన్నగా ఆయన ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. 2010లో ఛత్తీస్‌గఢ్‌లో 76 మంది జవాన్ల మృతి ఘటనకు ఈయన ప్రధాన సూత్రధారి. కేంద్ర కమిటీ సభ్యుడైన నంబాలపై కోటిన్నర రివార్డు ఉంది.కాల్పులు ఇలా.. నారాయణపూర్‌లోని అబూజ్మడ్ అడవుల్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కీలక సమావేశం ఏర్పాటు చేశారన్న సమాచారంతో భద్రత బలగాలు కూంబింగ్ చేపట్టాయి. దంతెవాడ, బీజాపూర్ జిల్లాలకు చెందిన డీఆర్జీ జవాన్లు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో.. భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. ఇంజనీరింగ్ చదివి.. నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు స్వస్థలం ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా. ఆయన తండ్రి ఉపాధ్యాయుడు. నంబాల వరంగల్(తెలంగాణ) ఆర్ఈసీలో ఇంజినీరింగ్ చదివారు. 1984లో ఎంటెక్ చదువుతూ పీపుల్స్ వార్ సిద్ధాంతాల పట్ల ఆకర్షితుడు అయ్యారు. 2018లో గణపతి రాజీనామాతో మావోయిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బసవరాజు కొనసాగుతూ వచ్చారు.

రామ్ చరణ్‌తో సినిమా.. ‘రంగస్థలం’ మించిపోతుంది: సుకుమార్
మలికిపురం: తన తదుపరి చిత్రం ‘గ్లోబల్ స్టార్’ రామ్‌చరణ్‌తో ఉంటుందని ప్రముఖ సినీ దర్శకుడు సుకుమార్ చెప్పారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలంలో స్వగ్రామమైన మట్టపర్రుకు కుటుంబ సమేతంగా మంగళవారం ఆయన విచ్చేశారు. గ్రామస్తులు, చిన్ననాటి స్నేహితులు, బంధువులతో ఆనందంగా గడిపారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ... హీరో రామ్‌చరణ్‌తో సినిమా తీసేందుకు కథ సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. షూటింగ్ ఎప్పుడు ప్రారంభించేది త్వరలోనే వెల్లడిస్తామన్నారు. తామిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘రంగస్థలం’ చిత్రం అప్పట్లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిందని, ఆ తరువాత ‘ఆర్ఆర్ఆర్’తో పాన్ ఇండియా స్థాయికి రామ్‌చరణ్ ఎదిగారన్నారు. ఆయనతో తాను చేయబోయే చిత్రం ఆ స్థాయిలోనే ఉంటుందని తెలిపారు. అల్లు అర్జున్‌తో తీసిన ‘పుష్ప’ జాతీయ స్థాయిలో తనకు గుర్తింపు తెచ్చిందన్నారు. పుష్ప–1కు ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన చూసి రెండో భాగాన్ని మరింత ఫోకస్ పెట్టి తీశామన్నారు. స్వగ్రామం మట్టపర్రులోని తన ఇంట్లో చిన్నారితో ముచ్చటిస్తున్న దర్శకుడు సుకుమార్ ప్రేక్షకుల అభిరుచి ఏం మారలేదు సినిమాపై ప్రేక్షకుల అభిరుచి ఏ మాత్రం మారలేదని, అప్పటికీ ఇప్పటికీ ఒకేలా ఉందని సుకుమార్ పేర్కొన్నారు. పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రేక్షకులు థియేటర్లను బాగా ఆదరిస్తున్నారని చెప్పారు. పట్టణ ప్రేక్షకుల్లో కొంత భాగం ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ పట్ల ఆకర్షితులవుతున్నారన్నారు. టాలెంట్ ఉన్నవారు చాలా మంది ఉన్నారని, అలాంటి వారిని ప్రోత్సహించేందుకు సుకుమార్ రైటింగ్స్ వంటి సంస్థల్ని స్థాపించానన్నారు. ఈ సంస్థల ద్వారా చాలామందికి ప్రోత్సాహం, టాలెంట్‌ను ప్రూవ్ చేసుకునే అవకాశం దక్కుతుందన్నారు. ఆ దిశగానే ఫలితాలు ఉంటున్నాయని చెప్పారు. పుట్టిన ఊరంటే అందరికీ మమకారమేరెండేళ్లకు పైగా చాలా బిజీ షెడ్యూల్స్‌లో ఇరుక్కుపోయానని, షూటింగ్స్ నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లడం వల్ల స్వగ్రామానికి రాలేకపోయానని సుకుమార్ చెప్పారు. లేదంటే ఏటా సంక్రాంతి పండుగను ఇక్కడే చేసుకునే వాళ్లమన్నారు. ఇకపైనా ఏటా ఇదే సంప్రదాయం కొనసాగిస్తానన్నారు. పుట్టిన ఊరంటే అందరికీ మమకారమే అన్నారు. కోనసీమలో గోదారి గట్లూ.. కాలువ చెంత, పొలాల మధ్య స్నేహితులతో తిరిగిన క్షణాలు, కాలేజీ రోజులు చాలా బాగుంటాయన్నారు.

హైదరాబాద్‌లో భారీ వర్షం.. నగరవాసులకు బిగ్ అలర్ట్
హైదరాబాద్, సాక్షి: ద్రోణి, ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాజధాని నగరం హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో బుధవారం మధ్యాహ్నాం నుంచి ఈదురు గాలులు, పిడుగులతో కూడిన వానలు పడుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం ‘రెయిన్ అలర్ట్’ జారీ చేసింది.ఉపరితల ద్రోణి ఉదయం నుంచి హైదరాబాద్-సికింద్రాబాద్ జంట నగరాలపై మేఘాలు కమ్ముకోగా.. మధ్యాహ్నాం నుంచి పలుచోట్ల ఈదురు గాలులతో వర్షం(Hyderabad Rains) కురుస్తోంది. కొన్ని చోట్ల చిరుజల్లులు, మరికొన్ని చోట్ల ఓ మోస్తరు వాన పడుతోంది. మలక్ పేట్, నాంపల్లి, చార్మినార్, దిల్సుఖ్ నగర్, కోఠి, రామంతపూర్, అబిడ్స్, అంబర్పేట్.. తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఖైరతాబాద్, లక్డీకాపూల్, రాజ్ భవన్, ట్యాంక్ బండ్ సమీపంలో స్వల్ప వర్షంతో మొదలై.. జడి వానగా మారింది. నగర శివారు ప్రాంతాల్లో చోట్ల చిరు జల్లులు పడుతున్నాయి. మరికొన్ని గంటల్లో జంట నగరాల వ్యాప్తంగా పూర్తి స్థాయిలో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. అలాగే.. రాత్రి సమయంలో హైదరాబాద్‌లో తీవ్రమైన తుఫాను(Cyclone) వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ(GHMC) అప్రమత్తం అయ్యింది. సాయంత్రం పనులు ముగించుకుని వెళ్లేవాళ్లను అప్రమత్తం చేస్తోంది. మ్యాన్ హోల్స్, కరెంట్ పోల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని నగర ప్రజలకు సూచించింది.ఇదిలా ఉంటే.. ద్రోణి, ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాజధాని నగరంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో(Telangana Rains) ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులపాటు ఈదురు గాలులు, పిడుగులతో కూడిన భారీ వానలు తప్పవని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాలకు ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్‌లు జారీ చేసింది. ఇక పంట చేతికొచ్చే సమయం కావడంతో అప్రమత్తంగా ఉండాలని రైతులకు అధికార యంత్రాంగం సూచిస్తోంది. తెలంగాణకు రెయిన్ అలర్ట్వాతావరణ శాఖ భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. రాష్ట్ర వ్యాప్తంగా రెయిన్ అలర్ట్ జారీ చేసింది. సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉండడంతో.. అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ముందస్తు ప్రణాళికలతో సమన్వయం చేసుకోవాలని సూచించింది. అలాగే..ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బెటాలియన్లను సైతం అందుబాటులో ఉండాలని ఆదేశించింది.‘‘ఋతుపవనాలు ముందుగా రాబోతున్నాయి. అన్ని విభాగాలు అప్రమత్తంగా ఉండాలి. 2024లో కురిసిన భారీ వర్షాలకు NDRF అందుబాటులో లేకపోవడంతో గోల్డెన్ అవర్ కోల్పోయాం. 2024 సెప్టెంబర్ లాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కావొద్దు. జిల్లాల్లో కలెక్టర్లు ముందస్తు ప్రణాళికలు, సమన్వయం చేసుకోవాలి. సింగరేణి లో ప్రత్యేక శిక్షణ పొందిన రెస్క్యూ టీమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి’’ అని సర్క్యులర్‌లో డిజాస్టర్స్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ అరవింద్ కుమార్ పేర్కొన్నారు. సీఎం రేవంత్ కీలక ఆదేశాలుముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం సీఎస్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, వాతావరణ శాఖ ఇచ్చిన సూచనలకు అనుగుణంగా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ‘‘ధాన్యం కొనుగోలు కేంద్రాలు, మార్కెట్లలో ఉన్న ధాన్యం తడవకుండా తగిన రక్షణ చర్యలు చేపట్టాలి. కలెక్టర్లు.. కాంటాలు వేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలి. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బంది పడకుండా తగిన చర్యలు చేపట్టాలి.హైదరాబాద్ సిటీలో వర్షం కురుస్తున్న ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిల్వ లేకుండా చూడాలి. ట్రాఫిక్ ఇబ్బందులు, విద్యుత్తు సమస్యలు లేకుండా చూడాలి. జీహెచ్ఎంసీ, పోలీస్, హైడ్రా, ట్రాఫిక్, విద్యుత్తు విభాగాలు సమన్వయంతో పని చేయాలి. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలి’’ అని సీఎస్‌ను ఆదేశించారాయన. ఇదీ చదవండి: సూర్యుడిపైకి సాగర మేఘాలు
IPL 2025, MI VS DC: సెంచరీ పూర్తి చేసిన కుల్దీప్ యాదవ్
సాలూరులో గాఢ అంధకారం.. చిమ్మచీకట్లో ప్రజల ఆందోళన
రానా నాయుడు సీజన్-2.. టీజర్ వచ్చేసింది
యూపీఐ యాప్‌లలో కొత్త మార్పులు.. జూన్ 30 నుంచి..
'ఇది చాలా ప్రత్యేకం.. నా అభిమానులకు అంకితమిస్తున్నా': మోహన్ లాల్
తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల బంద్.. ఆ రోజే తుది నిర్ణయం!
బెంగళూరు: సూట్‌కేస్‌లో యువతి డెడ్‌బాడీ కలకలం
ఇండియా ఏతో టెస్ట్ సిరీస్.. ఇంగ్లండ్ జట్టు ప్రకటన.. వోక్స్, ఫ్లింటాఫ్‌కు చోటు
కమల్ హాసన్ థగ్ లైఫ్.. 'షుగర్ బేబీ' వచ్చేసింది..!
RRR దాకా మహా నగర విస్తరణకు మార్గదర్శనం
ఆర్థిక సంక్షోభం రాబోతోంది!.. రాబర్ట్ కియోసాకి హెచ్చరిక
వైఎస్సార్సీపీదే విజయం.. మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక ఏకగ్రీవం
ఆకట్టుకున్న మానస హల్దీ వేడుకలు
సారూ.. మా ఊరు పేరు మార్చండి
ఇండియా ఇంత బలహీనమైనదా?
స్లీపర్ ప్రయాణికులకు ఇక ఆ సౌకర్యం లేదు..
పాకిస్తాన్ వద్దట! నరకానికే తీసుకుపొమ్మని బ్రతిమిలాడుతున్నాడు!
డిగ్రీ తీసుకున్న కుమారుడు - ఆనందంలో కల్వకుంట్ల కవిత (ఫోటోలు)
అక్కడ యుద్ధాలు ఆగిపోవడం ఏమోగానీ ఇక్కడ పాలన ఆగిపోయింది. కాస్త ఇటువైపు కూడా పట్టించుకోండి సార్!
పిల్లలను తీసుకుని ఇంటికి రా తల్లీ.. సరదాగా వెళ్లారు..
చరిత్ర సృష్టించిన హర్షల్ పటేల్.. ఐపీఎల్లో హిస్టరీలోనే
నేడు మానస వివాహం.. పెళ్లి పెద్దగా కలెక్టర్ శ్రీహర్ష
..ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదట వెళ్లండి!
ఈ రాశి వారికి పలుకుబడి పెరుగుతుంది.. ఆస్తిలాభం
జనసేనకు కీలక పదవి.. టీడీపీ నేతలు ఆగ్రహం
మనం దెబ్బతిన్న ప్రతీసారి శాంతి చర్చలనడం మనకు ఆనవాయితీ సార్!
24 ఏళ్లకే 101 కిలోల బరువు : ఈజీడైట్‌తో దెబ్బకి 62 కిలోలకు!
ఈ రాశి వారికి వ్యాపార , ఉద్యోగాలలో నూతనోత్సాహం.
మియాపూర్‌లో హైడ్రా కూల్చివేతలు.. 70 ప్లాట్ల యజమానులు..
బోల్తా కొట్టిన ఎల్లోపిట్ట!
IPL 2025, MI VS DC: సెంచరీ పూర్తి చేసిన కుల్దీప్ యాదవ్
సాలూరులో గాఢ అంధకారం.. చిమ్మచీకట్లో ప్రజల ఆందోళన
రానా నాయుడు సీజన్-2.. టీజర్ వచ్చేసింది
యూపీఐ యాప్‌లలో కొత్త మార్పులు.. జూన్ 30 నుంచి..
'ఇది చాలా ప్రత్యేకం.. నా అభిమానులకు అంకితమిస్తున్నా': మోహన్ లాల్
తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల బంద్.. ఆ రోజే తుది నిర్ణయం!
బెంగళూరు: సూట్‌కేస్‌లో యువతి డెడ్‌బాడీ కలకలం
ఇండియా ఏతో టెస్ట్ సిరీస్.. ఇంగ్లండ్ జట్టు ప్రకటన.. వోక్స్, ఫ్లింటాఫ్‌కు చోటు
కమల్ హాసన్ థగ్ లైఫ్.. 'షుగర్ బేబీ' వచ్చేసింది..!
RRR దాకా మహా నగర విస్తరణకు మార్గదర్శనం
ఆర్థిక సంక్షోభం రాబోతోంది!.. రాబర్ట్ కియోసాకి హెచ్చరిక
వైఎస్సార్సీపీదే విజయం.. మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక ఏకగ్రీవం
ఆకట్టుకున్న మానస హల్దీ వేడుకలు
సారూ.. మా ఊరు పేరు మార్చండి
ఇండియా ఇంత బలహీనమైనదా?
స్లీపర్ ప్రయాణికులకు ఇక ఆ సౌకర్యం లేదు..
పాకిస్తాన్ వద్దట! నరకానికే తీసుకుపొమ్మని బ్రతిమిలాడుతున్నాడు!
నేడు మానస వివాహం.. పెళ్లి పెద్దగా కలెక్టర్ శ్రీహర్ష
అక్కడ యుద్ధాలు ఆగిపోవడం ఏమోగానీ ఇక్కడ పాలన ఆగిపోయింది. కాస్త ఇటువైపు కూడా పట్టించుకోండి సార్!
పిల్లలను తీసుకుని ఇంటికి రా తల్లీ.. సరదాగా వెళ్లారు..
చరిత్ర సృష్టించిన హర్షల్ పటేల్.. ఐపీఎల్లో హిస్టరీలోనే
..ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదట వెళ్లండి!
ఈ రాశి వారికి పలుకుబడి పెరుగుతుంది.. ఆస్తిలాభం
జనసేనకు కీలక పదవి.. టీడీపీ నేతలు ఆగ్రహం
మనం దెబ్బతిన్న ప్రతీసారి శాంతి చర్చలనడం మనకు ఆనవాయితీ సార్!
24 ఏళ్లకే 101 కిలోల బరువు : ఈజీడైట్‌తో దెబ్బకి 62 కిలోలకు!
ఈ రాశి వారికి వ్యాపార , ఉద్యోగాలలో నూతనోత్సాహం.
మియాపూర్‌లో హైడ్రా కూల్చివేతలు.. 70 ప్లాట్ల యజమానులు..
బోల్తా కొట్టిన ఎల్లోపిట్ట!
ఈ రాశి వారికి వ్యాపారాలు.. ఉద్యోగాలలో మరింత అనుకూలం.
సినిమా

గేమ్ ఛేెంజర్ హీరోయిన్‌పై ఆర్జీవీ పోస్ట్.. నెటిజన్ల దెబ్బకు డిలీట్ చేసిన డైరెక్టర్!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం వార్-2. ఈ మూవీలో గేమ్ ఛేంజర్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా నటించింది. ఈ ఫుల్ యాక్షన్ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. అయితే ఈనెల 20న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో హీరోయిన్ కియారా బికినీలో కనిపించి అభిమానులకు షాకిచ్చింది. ఆ హీరోయిన్ను అలా చూసిన నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేశారు.అయితే ఈ టీజర్ చూసిన టాలీవుడ్ సంచలన డైరెక్టర్ రాం గోపాల్ వర్మ సైతం టీజర్ చూసి ఓ పోస్ట్ పెట్టారు. అందులో కియారా అద్వానీ బికినీ డ్రెస్‌ను ఉద్దేశించి పోస్ట్ చేయడంతో అది కాస్తా వివాదానికి దారితీసింది. ఆర్జీవీ పోస్ట్ చూసిన నెటిజన్స్ చెత్త పోస్ట్ అంటూ రాం గోపాల్ వర్మపై విమర్శలు చేశారు. రామ్ గోపాల్ వర్మ భాయ్, ఏదైనా పోస్ట్ చేసే ముందు కాస్తా ఆలోచించండి.. అప్పుడు మీరు ఇలాంటివి పోస్ట్ చేయరంటూ ఓ నెటిజన్ సలహా ఇచ్చారు.తన ట్వీట్‌పై పెద్దఎత్తున విమర్శలు రావడంతో ఆర్జీవీ తన పోస్ట్‌ను సోషల్ మీడియాలో తొలగించాడు. కియారా అభిమానులు, నెటిజన్స్ నుంచి సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత రావడంతో పోస్ట్ డిలీట్ చేశాడు. కాగా.. వార్- 2 లో హృతిక్ రోషన్ రా ఏజెంట్ మేజర్ కబీర్ ధిలావాల్ పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీ ద్వారా జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. ఈ చిత్రంలో విలన్‌గా నటించారు. ఈ సినిమాను యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్లో ఆదిత్య చోప్రా నిర్మించారు. ఈ మూవీ ఆగస్టు 14, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

రామ్‌చరణ్ టూ ప్రభాస్..టుస్సాడ్స్‌లో స్టార్స్...ఎవరు గ్రేట్?
మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన మైనపు విగ్రహాల ప్రదర్శన కేంద్రం. ఇది లండన్, సింగపూర్, దుబాయ్, ఢిల్లీ వంటి భారీ నగరాల్లో ఉంది. ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన రాజకీయ నాయకులు, క్రీడాకారులు, సినీ నటులు, సంగీతకారులు తదితర అంతర్జాతీయ ప్రముఖుల మైనపు విగ్రహాలను ప్రదర్శిస్తారు. ఆయా సెలబ్రిటీలకు ఆయా సందర్భాల్లో ఉన్న పాప్యులారిటీని దృష్టిలో ఉంచుకుని వీటిని నెలకొల్పుతారు కాబట్టి ఈ విగ్రహాలు అత్యంత ప్రాచుర్యం సెలబ్రిటీలకు స్టేటస్ సింబల్స్‌గా మారాయి. ఇటీవల మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం భారతీయ సినీ ప్రముఖుల గౌరవార్థం మైనపు విగ్రహాలను ప్రదర్శించడంలో భాగంగా టాలీవుడ్ ప్రముఖులకు ప్రాధాన్యం ఇవ్వడం టాలీవుడ్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంత గుర్తింపు పొందిందో సూచిస్తుంది. ఇందులో పదుల సంఖ్యలోనే ఇండియన్ స్టార్స్ చోటు చేసుకున్నప్పటికీ.. విశేషం ఏమిటంటే... మన టాలీవుడ్ స్టార్స్ నలుగురి విగ్రహాలు ఒక్కోటి ఒక్కో రకమైన ప్రత్యేకతతతో చరిత్ర సృష్టించాయి.లండన్‌లోని మేడమ్ టుస్సాడ్స్ లో కొలువుదీరిన తాజా మైనపు విగ్రహం టాలీవుడ్ నటుడు రామ్ చరణ్‌ది. ఇటీవల లండన్ లో ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఇందులో రామ్ చరణ్ అతని పెంపుడు కుక్క రైమ్ సహా మైనపు బొమ్మలుగా మారి కొలువుదీరడం విశేషం. క్వీన్ ఎలిజబెత్ తర్వాత మేడమ్ టుస్సాడ్స్ వ్యాక్స్ మ్యూజియంలో తన పెట్‌తో సహా కొలువుదీరిన రెండవ సెలబ్రిటీగా, సినీరంగం నుంచి మొదటి వాడిగా రామ్ చరణ్ రికార్డ్ సాధించాడు.గత మార్చి 2024లో, ప్రపంచ ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం దుబాయ్‌లో అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అలా వైకుంఠపురములో చిత్రం లో కనిపించినట్టుగా ఎరుపు జాకెట్ ధరించి, మేడమ్ టుస్సాడ్స్ లో ఈ విగ్రహం కొలువుదీరింది. పుష్ప ద్వారా అంతర్జాతీయ ఖ్యాతి సాధించిన బన్నీ ని కింగ్ ఆఫ్ డ్యాన్స్ అంటూ టుస్సాడ్స్ పేర్కొనడం విశేషం.గత 2019 మార్చి లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన మేడమ్ టుస్సాడ్స్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించాడు. మహేష్ బాబుకు ఉన్న భారీ అభిమానుల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు కారణంగా, ఈ విగ్రహాన్ని సింగపూర్ నుంచి హైదరాబాద్‌కు విమానంలో తీసుకువచ్చారు. అలా తొలిసారిగా, ఒక భారతీయ నటుడి విగ్రహాన్ని స్వదేశానికి తీసుకువచ్చిన ఘనతను మహేష్ దక్కించుకున్నాడు. ఇక ఇలాంటి అంతర్జాతీయ పాప్యులారిటీకి కొబ్బరికాయ కొట్టిన హీరో ప్రభాస్... మేడమ్ టుస్సాడ్స్‌లో చోటు సంపాదించిన మొట్టమొదటి దక్షిణ భారత నటుడుగా కూడా ఘనత దక్కించుకున్నాడు. గత 2017మార్చి లో బ్యాంకాక్‌లోని మేడమ్ టుస్సాడ్స్‌లో కొలువుదీరిన బాహుబలి తన నటన ద్వారా, బ్లాక్‌బస్టర్ విజయాల ద్వారా జపాన్, చైనా, మలేషియా, సింగపూర్ అమెరికా వంటి దేశాలలోనూ ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నాడు.

మోహన్ లాల్ బర్త్ డే.. అలాంటి పిల్లల కోసం కీలక నిర్ణయం!
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఈ రోజుతో 65 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. మలయాళంలో మాత్రమే కాదు.. టాలీవుడ్‌లోనూ ఫ్యాన్స్‌ను సొంతం చేసుకున్న హీరో మోహన్ లాల్ ప్రస్తుతం కన్నప్ప మూవీలో నటిస్తున్నారు. తాజాగా ఆయన బర్త్ డే కావడంతో స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇప్పటికే టాలీవుడ్ హీరో మంచు విష్ణు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.మోహన్ లాల్ బర్త్ డే సందర్భంగా అభిమానులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు. సూపర్ స్టార్ మమ్ముట్టి, పృథ్వీరాజ్ సుకుమారన్, మంజు వారియర్, నివిన్ పౌలీ, నిర్మాత ఆంటోనీ సోషల్ మీడియా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మే 21, 1960న జన్మించిన మోహన్‌లాల్ నాలుగు దశాబ్దాలుగా మలయాళ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. మలయాళం, తమిళం, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో కలిపి దాదాపు 400 కి పైగా చిత్రాలలో నటించారు. ఐదుసార్లు జాతీయ అవార్డు పొందిన మోహన్‌లాల్‌కు 2019లో భారత ప్రభుత్వం పద్మభూషణ్‌ను ప్రదానం చేసింది.తాజాగా ఇవాళ తన బర్త్‌డే సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. తన విశ్వశాంతి ఫౌండేషన్ ద్వారా రెండు గొప్ప కార్యక్రమాలను ప్రకటించారు. బేబీ మెమోరియల్ హాస్పిటల్‌తో కలిసి ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన అర్హులైన పిల్లలకు తక్కువ ధరకే కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలను అందించనున్నట్లు తెలిపారు. కేరళలో చాలా మంది పిల్లలు కాలేయ వ్యాధులతో బాధపడుతున్నారని.. వారికి కాలేయ మార్పిడి అవసరమని తెలిపారు. ఈ ప్రకటనతో అలాంటి కుటుంబాలకు సహాయం చేయడమే లక్ష్యమని మోహన్ లాల్ అన్నారు. అంతేకాకుండా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 'బి ఎ హీరో' అనే పేరుతో మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. కాగా.. 2015లో మోహన్‌లాల్ విశ్వశాంతి ఫౌండేషన్ స్థాపించారు. పేదల ఆరోగ్య సంరక్షణ, విద్య, సామాజిక-ఆర్థిక అభివృద్ధికి కార్యక్రమాలను అమలు చేస్తున్నారు.

జయం రవి విడాకుల కేసు.. ఆయన భార్య ఆర్తి మరో పిటిషన్
కోలీవుడ్ స్టార్ జయం రవి, ఆయన భార్య ఆర్తి విడాకుల వ్యవహారం రోజుకో మలుపు తిరుతుతోంది. ప్రస్తుతం వీరిద్దరి పంచాయతీ కోర్టులో ఉన్నప్పటికీ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం మాత్రం ఆగడం లేదు. ఇటీవల ఓ పెళ్లిలో జయంరవి.. ఆయన గర్ల్‌ఫ్రెండ్‌గా భావిస్తోన్న సింగర్ కెన్నీషా హాజరు కావడంతో వీరి వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. జయం రవి తాను ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నానని.. పంజరం నుంచి బయటపడ్డానని చెబుతూ ఓ లేఖ విడుదల చేశారు.తాజాగా ఆయన భార్య సైతం తామిద్దరం మూడో వ్యక్తి వల్లే విడిపోవాల్సి వచ్చిందని మూడు పేజీల లేఖను విడుదల చేసింది. మా ఇద్దరి మధ్యలో మూడో వ్యక్తి ప్రమేయం ఉందనడానికి తన వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని తెలిపింది.ఒకవైపు వీరిద్దరు విడాకుల కోసం కోర్టుకు తిరుగుతూనే ఉన్నారు. అంతలోనే ఆర్తి మరో కీలక నిర్ణయం తీసుకుంది. తనకు నెలకు రూ.40 లక్షల భరణం చెల్లించాలని కోరుతూ కోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు ఆమె పిటిషన్ దాఖలు చేసింది. ఇప్పటికే వీరిద్దరు ఇటీవల విడాకుల కేసులో కోర్టుకు కూడా హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆర్తి భరణం కోరుతూ పిటిషన్ వేయడంతో కోలీవుడ్‌లో మరోసారి చర్చనీయాంశంగా మారింది
న్యూస్ పాడ్‌కాస్ట్
క్రీడలు

చరిత్ర సృష్టించిన ఐర్లాండ్ క్రికెటర్ పాల్ స్టిర్లింగ్
ఐర్లాండ్ వెటరన్ క్రికెటర్ పాల్ స్టిర్లింగ్ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్లో 10000 పరుగులు (మూడు ఫార్మాట్లలో) పూర్తి చేసుకున్న తొలి ఐరిష్ క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. వెస్టిండీస్‌తో ఇవాళ (మే 21) జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. దాదాపు రెండు దశాబ్దాలుగా ఐరిష్ క్రికెట్‌కు మూలస్థంభంగా ఉన్న స్టిర్లింగ్.. ఆ దేశం తరఫున 8 టెస్ట్‌లు, 167 వన్డేలు, 150 టీ20లు ఆడి 10000 పరుగులు పూర్తి చేశాడు. ఇందులో 16 సెంచరీలు, 57 అర్ద సెంచరీలు ఉన్నాయి. అంతర్జాతీయ క్రికెట్లో 10000 పరుగులు పూర్తి చేసిన 97వ ఆటగాడిగానూ స్టిర్లింగ్ రికార్డుల్లోకెక్కాడు. ఐర్లాండ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో స్టిర్లింగ్‌కు దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. స్టిర్లింగ్ తర్వాత ఆండ్రూ బల్బిర్నీ అత్యధికంగా 6055 పరుగులు చేశాడు. ఆతర్వాత కెవిన్ ఓబ్రెయిన్ 5850, విలియమ్ పోర్టర్‌ఫీల్డ్ 5480, హ్యారీ టెక్టార్ 3732 పరుగులు చేశారు. 2008లో వన్డేల ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన స్టిర్లింగ్.. ఆ మరుసటి ఏడాది టీ20లు, 2018లో టెస్ట్ అరంగేట్రం చేశాడు. మ్యాచ్ విషయానికొస్తే.. 3 వన్డేలు, 3 మ్యాచ్ టీ20 సిరీస్‌ల కోసం వెస్టిండీస్ జట్టు ఐర్లాండ్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా ఇవాళ (మే 21) తొలి వన్డే జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఐర్లాండ్ 35 ఓవర్ల తర్వాత 2 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. పాల్ స్టిర్లింగ్ (54), కార్మిచెల్ (16) ఔట్ కాగా.. బల్బిర్నీ (87), హ్యారీ టెక్టార్ (11) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో 37 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద స్టిర్లింగ్ 10000 పరుగుల మైలరాయిని చేరుకున్నాడు. ఈ మ్యాచ్‌లో స్టిర్లింగ్ సాధించిన హాఫ్ సెంచరీ వన్డేల్లో అతనికి 57వది.

IPL 2025: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్
సంజూ శాంసన్ ఐపీఎల్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున 4000 పరుగుల మార్కును తాకిన తొలి ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కాడు. 2013లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన సంజూ ఈ ఫ్రాంచైజీ తరఫున 148 మ్యాచ్‌లు ఆడి 141.24 స్ట్రయిక్‌రేట్‌తో 4027 పరుగులు చేశాడు. సంజూ తర్వాత జోస్ బట్లర్ (3055), అజింక్య రహానే (2810), షేన్ వాట్సన్ (2372) రాజస్థాన్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లుగా ఉన్నారు. ఐపీఎల్ 2025లో భాగంగా నిన్న (మే 20) సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో 31 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 41 పరుగులు చేసిన సంజూ ఈ ఘనత సాధించాడు. మధ్యలో రెండు సీజన్లు (2016, 2017) మినహాయించి ఐపీఎల్ కెరీర్ మొత్తం రాజస్థాన్‌కే ఆడిన సంజూ ఇప్పటివరకు 176 మ్యాచ్‌లు ఆడి 139.05 స్ట్రయిక్‌రేట్‌తో 4704 పరుగులు చేశాడు. ఇందులో 26 హాఫ్ సెంచరీలు, 3 సెంచరీలు ఉన్నాయి.2016, 2017 సీజన్లలో రాజస్థాన్ రాయల్స్‌పై వేటు పడటంతో ఆ రెండు సీజన్లు ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడిన సంజూ, ఆ ఫ్రాంచైజీ తరఫున 28 మ్యాచ్‌లు ఆడి ఓ శతకం సాయంతో 677 పరుగులు చేశాడు. 2021 సీజన్లో రాజస్థాన్ కెప్టెన్‌గా నియమితుడైన సంజూ ఐదు సీజన్లలో ఆ జట్టుకు సారధిగా వ్యవహరించాడు.ఈ సీజన్లో సంజూ గాయం కారణంగా చాలా మ్యాచ్‌లకు దూరంగా ఉండటంతో అతని స్థానంలో రియాన్ పరాగ్ తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహించాడు. మొత్తంగా ఈ సీజన్లో రాజస్థాన్ పేలవ ప్రదర్శన కనబర్చి లీగ్ నుంచి నిష్క్రమించింది. ఈ సీజన్లో 14 మ్యాచ్‌లు ఆడిన ఈ జట్టు కేవలం నాలుగే విజయాలతో పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. నిన్న సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో రాయల్స్ ఊరట పొందే విజయం సాధించి సీజన్‌ను ముగించింది.నిన్నటి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. ఆయుశ్ మాత్రే (43), డెవాల్డ్ బ్రెవిస్ (42), శివమ్ దూబే (39) ఓ మోస్తరు స్కోర్లు చేసి సీఎస్కేకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. రాయల్స్ బౌలర్లలో ఆకాశ్ మధ్వాల్, యుద్ద్‌వీర్ సింగ్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. తుషార్ దేశ్‌పాండే, హసరంగ చెరో వికెట్ పడగొట్టారు.అనంతరం నామమాత్రపు లక్ష్యఛేదనకు దిగిన రాజస్థాన్..యశస్వి జైస్వాల్ (36), వైభవ్ సూర్యవంశీ (57), సంజూ శాంసన్ (41), ధృవ్ జురెల్ (31 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడటంతో 17.1 ఓవర్లలో నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది.

ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన
ట్రెంట్‌బ్రిడ్జ్ వేదికగా జింబాబ్వేతో రేపటి నుండి (మే 22) ప్రారంభం కాబోయే నాలుగు రోజుల టెస్ట్ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ తుది జట్టును ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా బెన్ స్టోక్స్ వ్యవహరించనున్నాడు. ఈ మ్యాచ్‌తో ఎసెక్స్ సీమర్ సామ్ కుక్ టెస్ట్ అరంగేట్రం చేయనున్నాడు. ఈ మ్యాచ్‌లో జేమీ స్మిత్ ఇంగ్లండ్ వికెట్‌కీపర్‌గా వ్యవహరించనున్నాడు. యువ స్పిన్నర్ షోయబ్ బషీర్ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. టాపార్డర్‌లో జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్ కొనసాగనున్నారు. పేస్ విభాగంలో గస్ అట్కిన్సన్, జోష్ టంగ్, సామ్ కుక్ ఉండనున్నారు. ఇంగ్లండ్ జింబాబ్వేతో చివరిసారిగా 2003లో టెస్ట్ మ్యాచ్ ఆడింది. ఇంగ్లండ్ హోం సమ్మర్లో ఇదే తొలి టెస్ట్ మ్యాచ్ కానుంది.ఈ టెస్ట్ మ్యాచ్ తర్వాత ఇంగ్లండ్ స్వదేశంలో వెస్టిండీస్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఆడనుంది. ఈ సిరీస్‌లు మే 29 నుంచి ప్రారంభమవుతాయి. ఈ సిరీస్‌ల్లో మొదటిగా వన్డేలు (3), ఆతర్వాత టీ20లు (3) జరుగనున్నాయి. ఈ సిరీస్‌ల కోసం కూడా ఇంగ్లండ్ జట్టును ఇదివరకే ప్రకటించారు. విండీస్‌తో సిరీస్‌ల తర్వాత ఇంగ్లండ్ స్వదేశంలోనే భారత్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ జూన్ 12 నుంచి ప్రారంభం కానుంది. అనంతరం ఈ ఏడాది నవంబర్‌లో ఇంగ్లండ్ ఆస్ట్రేలియాతో యాషెస్ సిరీస్‌లో తలపడుతుంది.జింబాబ్వేతో టెస్ట్ మ్యాచ్‌కు ఇంగ్లండ్ ప్లేయింగ్ XI: జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్, జేమీ స్మిత్, గస్ అట్కిన్సన్, సామ్ కుక్, జోష్ టంగ్, షోయబ్ బషీర్.

అతడెలా ఖరీదైన ఆటగాడు?.. వారికి డబ్బు ఎలా చెల్లిస్తారో తెలుసా?
ఐపీఎల్-2025(IPL 2025) ప్లే ఆఫ్స్ దశలో పలు ఫ్రాంఛైజీలలోకి కొత్త ఆటగాళ్లు చేరారు. ‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంలో లీగ్ వారం పాటు వాయిదా పడటంతో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాకు చెందిన కొందరు ఆటగాళ్లు అందుబాటులో లేకుండా పోయారు. మరికొంత మంది గాయాలు, ఫిట్నెస్ లేమి కారణంగా దూరమయ్యారు. ఈ క్రమంలో ఫ్రాంఛైజీలు కొత్త ప్లేయర్లతో వీరి స్థానాలను భర్తీ చేశాయి.ఇందులో భాగంగా ఐదుసార్లు ఐపీఎల్ చాంపియన్ ముంబై ఇండియన్స్ (Mumbai Indians) ఫ్రాంఛైజీ కొత్తగా ముగ్గురు విదేశీ ఆటగాళ్లను జట్టులోకి తీసుకుంది. ఈ నెల 26 తర్వాత జాతీయ జట్టుకు అందుబాటులో ఉండేందుకు ముగ్గురు విదేశీ ఆటగాళ్లు ముంబై జట్టును వీడుతుండటంతో... ఫ్రాంఛైజీ వారి స్థానాలను మరో ముగ్గురు విదేశీ ఆటగాళ్లతో భర్తీ చేసుకుంది. ఇంగ్లండ్ ప్లేయర్లు జానీ బెయిర్‌స్టో, రిచర్డ్ గ్లీసన్‌తో పాటు శ్రీలంక ఆటగాడు చరిత అసలంకలను జట్టులోకి తీసుకుంది.రూ.5.25 కోట్లుబెయిర్ స్టోతో రూ. రూ.5.25 కోట్లకు, గ్లీసన్‌తో రూ. కోటికి, అసలంకతో రూ. 75 లక్షలతో ఒప్పందం కుదుర్చుకుంది. మిగిలిన రెండు- మూడు మ్యాచ్‌ల కోసమే ముంబై వీరికి పెద్ద మొత్తంలో చెల్లిస్తోందని.. తద్వారా ముంబైతో పాటు కొత్త ఆటగాళ్లతో ఒప్పందాలు కుదుర్చుకున్న ఫ్రాంఛైజీలపై అదనపు భారం పడుతోందనే వార్తలు వస్తున్నాయి. ఈ పరిణామాలపై భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా స్పందించాడు.తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘కేవలం ప్లే ఆఫ్స్ మ్యాచ్‌ల కోసం ముంబై జానీ బెయిర్‌స్టో, రిచర్డ్ గ్లీసన్, చరిత్ అసలంకలను తీసుకుంది.. ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి ముస్తాఫిజుర్ రహ్మమాన్ కూడా వచ్చాడు.. ఇక ఆర్సీబీ లుంగి ఎంగిడి స్థానంలో బ్లెస్సింగ్ ముజర్బానీని తీసుకుంది.ఆడిన మ్యాచ్‌లను బట్టిమరి వీళ్లకు ఎంత డబ్బు చెల్లిస్తారని మీరు అనుకుంటున్నారు? చాలా మంది సోషల్ మీడియాలో ఓ నకిలీ వార్తను ప్రచారం చేస్తున్నారు. ఐపీఎల్లో బెయిర్‌స్టో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడని చెబుతున్నారు.కేవలం మూడు మ్యాచ్‌లకే రూ. 5.25 కోట్లు పొందుతున్నాడని అంటున్నారు. ఈ క్రమంలో రిషభ్ పంత్ (రూ. 27 కోట్లు) పేరును కూడా ప్రస్తావిస్తున్నారు. మీరన్నట్లు ఫ్రాంఛైజీలు వారితో ఆ ధరకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. కానీ ప్రొ-రెటా ఆధారంగా మాత్రమే వారికి డబ్బు చెల్లిస్తారు. అంటే.. అందుబాటులో ఉ న్న, ఆడిన మ్యాచ్‌ల సంఖ్య ఆధారంగా మాత్రమే ఫీజు ముట్టజెప్పుతారు’’ అని ఆకాశ్ చోప్రా స్పష్టం చేశాడు.ఢిల్లీతో అమీతుమీకాగా ప్లే ఆఫ్స్ బెర్తు దక్కించుకునేందుకు తహతహలాడుతున్న ముంబై జట్టు... పాయింట్ల పట్టికలో తుది నాలుగు స్థానాల్లో నిలిస్తేనే ఈ ముగ్గురు ఆటగాళ్ల సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్‌తో బుధవారం మ్యాచ్ ఆడనున్న ముంబై.. ఈ నెల 26న పంజాబ్ కింగ్స్‌తో ముంబై ఇండియన్స్ తమ చివరి లీగ్ మ్యాచ్ ఆడుతుంది.ఆ తర్వాతే ఈ ముగ్గురు జట్టుతో కలవనున్నారు. దక్షిణాఫ్రికాకు చెందిన రికెల్టన్, కార్బిన్ బాష్... ఇంగ్లండ్ ప్లేయర్ విల్ జాక్స్ ఈనెల 26 తర్వాత ముంబై జట్టును వీడనున్నారు. ‘జాక్ స్థానాన్ని ఇంగ్లండ్ వికెట్ కీపర్ బెయిర్‌స్టో భర్తీచేస్తాడు. అతడిని రూ. 5 కోట్ల 25 లక్షలకు ముంబై ఇండియన్స్ జట్టు కొనుగోలు చేసుకుంది. కాగా రికెల్టన్ స్థానంలో జట్టులోకి తీసుకున్న ఇంగ్లండ్ పేసర్ రిచర్డ్ గ్లీసన్‌కు 1 కోటి రూపాయాలు... శ్రీలంక బ్యాటర్ అసలంకను రూ. 75 లక్షలు అందజేస్తారు’ అని ఐపీఎల్ పాలక మండలి ఒక ప్రకటనలో తెలిపింది. చదవండి: ధోని పాదాలకు నమస్కరించిన వైభవ్.. సీఎస్కే కెప్టెన్ రియాక్షన్ వైరల్
బిజినెస్

ఐటీఆర్-యూ ఫైలింగ్ నిబంధనల్లో కీలక మార్పులు
ఆదాయపు పన్ను శాఖ ఐటీఆర్-యూ (అప్డేటెడ్ రిటర్న్) ఫైలింగ్ నిబంధనల్లో మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇది పన్ను చెల్లింపుదారులు తమ రిటర్నులను సవరించడానికి అధిక సమయం ఇస్తుందని తెలిపింది. అదే సమయంలో ఆలస్యంగా సమర్పించిన రిటర్న్‌లపై భారీ జరిమానాలు ఉంటాయని స్పష్టం చేసింది. పన్ను సమ్మతిని మెరుగుపరచడం, మోసపూరిత ఫైలింగ్‌లను తగ్గించడం లక్ష్యంగా ఈ మార్పులు చేసినట్లు పేర్కొంది.సవరణలు ఇలా..అప్డేటెడ్ రిటర్న్ దాఖలు చేయడానికి పన్ను చెల్లింపుదారులకు ఇప్పటివరకు అసెస్మెంట్ ఇయర్ నుంచి 24 నెలలు గడువు ఉండేది. దాన్ని తాజాగా 48 నెలలు (4 సంవత్సరాలు)కు పెంచారు. ఇది వ్యక్తులు, వ్యాపారాలకు రిటర్న్‌ల సమయంలో తప్పులను సరిదిద్దుకోవడానికి, గతంలో ఫైల్ చేయని ఆదాయాన్ని నివేదించడానికి మరింత సౌలభ్యాన్ని కలిగిస్తుంది. ఆలస్యంగా ఐటీ రిటర్న్‌లను ఫైలింగ్ చేయడాన్ని కట్టడి చేసేందుకు భారీ జరిమానాలు విధిస్తున్నట్లు ఆదాయపన్ను శాఖ వెల్లడించింది.మదింపు సంవత్సరం ముగిసిన 12 నెలలలోపు ఐటీఆర్-యూ దాఖలు చేస్తే 25 శాతం పన్ను విధిస్తారు.12 నుంచి 24 నెలల్లోపు అయితే 50 శాతం పన్ను చెల్లించాలి.మూడో సంవత్సరంలో ఫైల్ చేస్తే అదనంగా 60 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.నాలుగో సంవత్సరంలో ఫైల్ చేస్తే 70 శాతం పన్ను వర్తిస్తుంది.ఇదీ చదవండి: ఓలమ్మో.. భారీగా పెరిగిన బంగారం ధర!2024-25 ఆర్థిక సంవత్సరానికి (2025-26 అసెస్మెంట్ ఇయర్) మొత్తం ఏడు ఐటీఆర్ ఫారాలను (ఐటీఆర్-1 నుంచి ఐటీఆర్-7 వరకు) ప్రభుత్వం ఇప్పటికే నోటిఫై చేసింది. అయితే ప్రస్తుతానికి ఈ ఫారాలకు సంబంధించిన ఈ-ఫైలింగ్ సదుపాయాలు ఇంకా అందుబాటులోకి రావాల్సి ఉంది. రెగ్యులర్ ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేవారికి 2024-25 ఆర్థిక సంవత్సరానికి (అసెస్మెంట్ ఇయర్ 2025-26) గడువు 2025 జులై 31గా ఉంది.

ఓలమ్మో.. భారీగా పెరిగిన బంగారం ధర!
స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. నిన్నటి మార్కెట్ సెషన్లో స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు ఈ రోజు తిరిగి భారీగా పెరిగాయి. వివిధ ప్రాంతాల్లో బుధవారం రోజున గోల్డ్ రేట్లు(Today Gold Rates) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.89,300 (22 క్యారెట్స్), రూ.97,420 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా ఏకంగా రూ.2,200, రూ.2,400 పెరిగింది.చెన్నైలో బుధవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.2,200, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.2,400 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.89,300 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.97,420 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్)కు చేరింది.ఇదీ చదవండి: మెరుగైన విత్తనాలతో రైతేరాజు.. కానీ..దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.2,200 పెరిగి రూ.89,450కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.2,400 పెరిగి రూ.97,570 వద్దకు చేరింది.వెండి ధరలుబంగారం ధరల మాదిరిగానే బుధవారం వెండి ధర(Silver Prices)ల్లో భారీగా మార్పులొచ్చాయి. నిన్నటితో పోలిస్తే వెండి ధర కేజీపై రూ.3,000 పెరిగింది. దాంతో కేజీ వెండి ధర రూ.1,11,000 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

గ్రీన్‌లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే బుధవారం స్థిరంగా కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:39 సమయానికి నిఫ్టీ(Nifty) 108 పాయింట్లు పెరిగి 24,792కు చేరింది. సెన్సెక్స్(Sensex) 364 ప్లాయింట్లు ఎగబాకి 81,560 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.57 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 66.38 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.5 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో గతంతో పోలిస్తే నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 0.39 శాతం నష్టపోయింది. నాస్డాక్ 0.38 శాతం పడిపోయింది.ఆపరేషన్ సిందూర్ కాల్పులవిరమణ తర్వాత సూచీలు అనూహ్యంగా ఇటీవల 4% లాభపడ్డాయి. భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై స్పష్టత కొరవడింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు నిన్నటి మార్కెట్లో గరిష్ట స్థాయిల్లో లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు కలవరపెడుతున్నాయి. భారత్‌లో యాక్టివ్ కేసుల సంఖ్య 257కు చేరింది. వారం రోజుల్లో 164 కేసులు నమోదైనట్లు గణాంకాలు తెలపడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ అమ్మకాలకు పాల్పడుతున్నారు.(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

మెరుగైన విత్తనాలతో రైతేరాజు.. కానీ..
విత్తనాలు వ్యవసాయ పరిశ్రమకు కీలకం. ఆహార ఉత్పత్తి, సుస్థిరత, వాణిజ్య లాభదాయకతలో ఇవి ప్రధానపాత్ర పోషిస్తాయి. విత్తన ఉత్పత్తి రంగంలో నిత్యం విప్లవాత్మక మార్పులొస్తున్నాయి. సాంప్రదాయ వ్యవసాయ పద్ధతులకు అతీతంగా బయోటెక్ ఆవిష్కరణలు, స్థిరమైన పద్ధతుల ద్వారా వీటిని ఉత్పత్తి చేసి రైతన్నలకు అధిక దిగుబడులు ఇవ్వాలని శాస్త్రవేత్తలు, కంపెనీలు, ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆహార డిమాండ్ పెరగడంతో విత్తన పరిశ్రమలో పెట్టుబడులు, పరిశోధనలు, మార్కెట్ పోటీ పెరుగుతోంది.మార్కెట్ ఇలా..అధిక దిగుబడి, వాతావరణ మార్పులు, పంటలకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా 2030 నాటికి ప్రపంచ వ్యవసాయ విత్తన మార్కెట్ 100 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. బేయర్ క్రాప్ సైన్స్, సింజెంటా, కోర్టెవా అగ్రిసైన్స్, యూపీఎల్.. వంటి ప్రధాన సంస్థలు ఈ పరిశ్రమలో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. అయితే సేంద్రీయ, స్వదేశీ విత్తనాల ఉత్పత్తులపై అభివృద్ధి చెందుతున్న స్టార్టప్‌లు దృష్టి సారిస్తున్నాయి.వ్యాపార ధోరణులుబయోటెక్, జీఎం విత్తనాలు: జన్యుమార్పిడి (జెనటికల్లీ మాడిఫైడ్-జీఎం) విత్తనాలను తెగుళ్లు, కరువు, వ్యాధులను తట్టుకేనేందుకు ఉత్పత్తి చేస్తున్నారు. ఇవి దిగుబడిని మెరుగుపరుస్తాయని కంపెనీలు చెబుతున్నాయి. వీటి నియంత్రణ, వినియోగదారుల ప్రాధాన్యతల చుట్టూ వివాదాలు ఉన్నప్పటికీ జన్యుమార్పిడి విత్తనాలు ఏటా బిలియన్ల ఆదాయాన్ని సృష్టిస్తూనే ఉన్నాయి.హైబ్రిడ్ విత్తనాలు: అధిక ఉత్పాదకత కోసం రూపొందించిన హైబ్రిడ్ విత్తనాలను వ్యవసాయంలో విరివిగా వాడుతున్నారు. ఇవి రైతుల ఆదాయాన్ని పెంచుతున్నాయి.సేంద్రీయ, సుస్థిర విత్తనాలు: సుస్థిర వ్యవసాయం పెరగడంతో సేంద్రీయ విత్తనాలు ప్రజాదరణ పొందుతున్నాయి. పర్యావరణ స్పృహ కలిగిన వినియోగదారులను, నియంత్రణ సంస్థలను ఇవి ఆకర్షిస్తున్నాయి.శీతోష్ణస్థితిని తట్టుకునే విత్తనాలు: వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో కీలకమైన వేడిని, వరదలను తట్టుకునే రకాలను అభివృద్ధి చేయడానికి కంపెనీలు పరిశోధనలో పెట్టుబడులు పెడుతున్నాయి.ఈ-కామర్స్, డైరెక్ట్-టు-ఫార్మర్ సేల్స్: డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా రైతులు నేరుగా ఉత్పత్తిదారుల నుంచి అధిక నాణ్యత విత్తనాలను పొందడానికి వీలు కలుగుతుంది. మధ్యవర్తులపై ఆధారపడటాన్ని ఈ ప్లాట్‌ఫామ్‌లు తగ్గిస్తున్నాయి.పెట్టుబడి, లాభదాయకతవిత్తన కంపెనీలు ప్రత్యేక జన్యు పరీక్షలపై పేటెంట్లను పొందుతున్నాయి. దీని ద్వారా మేధో సంపత్తి హక్కులను అందిపుచ్చుకుంటూ దీర్ఘకాలిక ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయి. అదనంగా ప్రభుత్వ సబ్సిడీలు, పరిశోధన గ్రాంట్లు, కార్పొరేట్ భాగస్వామ్యాల ద్వారా కంపెనీలు వాటి మార్కెట్‌ను పెంచుకుంటున్నాయి. వ్యవసాయ వృద్ధిని అందిపుచ్చుకోవాలని చూస్తున్న ఇన్వెస్టర్లు కృత్రిమ మేధ ఆధారిత బ్రీడింగ్ పద్ధతుల్లో నైపుణ్యం కలిగిన విత్తన ఉత్పత్తి స్టార్టప్‌లపై ఆసక్తి చూపుతున్నాయి. భారత విత్తన మార్కెట్ 2025 నాటికి 3.82 బిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనా. 2030 నాటికి ఇది 5.01 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. 2022లో మొత్తం సాగు విస్తీర్ణంలో హైబ్రిడ్ విత్తనాలు 80.6%గా ఉన్నాయి.సవాళ్లురెగ్యులేటరీ ఆంక్షలు: జన్యుమార్పిడి విత్తనాల ఆమోదానికి సంబంధించి నియమాలు దేశాన్ని బట్టి మారుతాయి. ఇది ప్రపంచ వాణిజ్యాన్ని ప్రభావితం చేస్తుంది.అధిక పరిశోధన ఖర్చులు: కొత్త విత్తన వంగడాలను అభివృద్ధి చేయడానికి విస్తృతమైన పరిశోధన అవసరం అవుతుంది. ఇది విత్తన ఉత్పత్తి ఖర్చులను పెంచుతుంది.సరసమైన ధరలు: నాణ్యమైన విత్తనాలను చిన్న, సన్నకారు రైతులకు సరసమైన ధరలకు అందేలా చూడటం సవాలుగా మారుతుంది. దీనికితోడు బ్లాక్‌లో విత్తనాలు విక్రయించే మాఫియా ప్రభుత్వ యంత్రాంగానికి సవాలుగా మారుతుంది.ఇదీ చదవండి: దానశీలురు ఈ కార్పొరేట్లువ్యవసాయ విత్తనాలను బ్లాక్ మార్కెట్లో విక్రయించకుండా నిరోధించడానికి ప్రభుత్వ యంత్రాంగం, సాంకేతిక పరిష్కారాలు, రైతుల్లో అవగాహన కల్పిచడం కీలకం. విత్తన కంపెనీలు, డిస్ట్రిబ్యూటర్లకు కచ్చితమైన సర్టిఫికేషన్ ప్రమాణాలు ఉండేలా చూడాలి. నకిలీ విత్తన విక్రయాలకు కఠిన శిక్షలు అమలు చేయాలి. విత్తన ధ్రువీకరణకు క్యూఆర్ కోడ్లు, ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్‌లను ఉపయోగించాలి. తక్కువ దిగుబడులు, తెగుళ్ల బెడద, చట్టపరమైన సమస్యలు వంటి బ్లాక్ మార్కెట్ విత్తనాల వల్ల కలిగే నష్టాలపై రైతులకు అవగాహన కల్పించాలి.
ఫ్యామిలీ

అస్లీ మ్యాంగో.. రుచి చూడాల్సిందే..
ప్రస్తుతం మామిడి పండ్ల సీజన్ పురస్కరించుకుని ప్రముఖ కేఫ్ చైన్ బ్రాండ్ యమ్మీ బీ మామిడితో తయారైన డిసర్ట్స్ రూపొందించి అస్లీ మామిడి 2.0 కలెక్షన్ పేరిట నగరంలో విడుదల చేసింది. ఈ సందర్భంగా యమ్మీ బీ వ్యవస్థాపకుడు మాజీ ఇండియన్ అండర్–19 క్రికెటర్ కూడా అయిన సందీప్ జంగాల మాట్లాడుతూ ఇవి చక్కెర రహిత, గ్లూటెన్ రహితంగా ఉంటాయని, శుద్ధి చేసిన పిండి వంటివి వినియోగించకుండా సహజ పదార్థాలతో తయారైనవని తెలిపారు. ఈ కలెక్షన్లో మ్యాంగో ఫ్లోరిడా పేస్ట్రీ, మ్యాంగో చీజ్‌కేక్ తదితర వెరైటీలు ఉన్నాయని వివరించారు. ఇవి నగరంలోని తమ అవుట్‌లెట్స్‌లో అందుబాటులో ఉంటాయన్నారు. (చదవండి: జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్ల 'IV డ్రిప్ థెరపీ'..! ఆరోగ్యానికి మంచిదేనా..?)

Ashtavakra అష్టావక్ర సందేశం
మహాభారతంలో నీతులను నేర్పించే కథలు కోకొల్లలుగా ఉన్నాయి. అందుకే అది నిత్యనూతనంగా కనపడుతుంది. అందులో ఒక కథను చూద్దాం. ఏకపాదుడు మహా తపశ్శాలి. గొప్ప విద్వాంసుడు. రాత్రింబవళ్ళు శిష్యుల చేత వేదాధ్యయనం, విద్యాభ్యాసం చేయిస్తుండేవాడు. అతడి భార్య సుజాత గర్భవతిగా ఉన్నపుడు గర్భంలోని శిశువు తండ్రితో, ‘నువ్వు రాత్రింబగళ్ళు విరామం లేకుండా శిష్యుల చేత వేదాధ్యయనం చేయిస్తున్నావు. నిద్ర లేకపోవడం వల్ల, విసుగు చేత వాళ్ళు అధ్యయనం చేసే వేదంలో దోషాలుంటున్నాయి. అలాంటి విద్య నేర్చుకోవడం వల్ల ప్రయోజనమేమిటి?’ అని అన్నాడు. అప్పుడు ఏకపాదుడు, ‘నువ్వు వేదాధ్యయనంలో దోషాలెన్నడమంటే గుడ్డొచ్చి పిల్లను వెక్కిరించి నట్లుంది. అధిక ప్రసంగం చేసి వేదాన్ని వక్రంగా విమర్శించావు కాబట్టి ‘అష్టావక్రుడవై పుట్టు’ అని శపించాడు. అతడు అలాగే పుట్టాడు. ఆ తర్వాత ఏకపాదుడు జనకమహారాజు ఆస్థానంలో వంది అనే వేదపండితునితో వాదించి, ఓడి, బందీ అయ్యాడు. అష్టావక్రుడు పోయి వందితో వాదించి, ఓడించి తన తండ్రిని విడిపించి ఇంటికి తెచ్చాడు. (పుటలు 296–297–అరణ్యపర్వము–శ్రీమదాంధ్ర మహాభారతము, రామకృష్ణ మఠం).ఇదీ చదవండి: అశ్వినీ దేవతలు ఎవరు?నేడు ఎందరో తల్లితండ్రులు, కోచింగ్ సెంటర్ వాండ్లు వాళ్ళ పిల్లలకు, విద్యార్థులకు మంచి ర్యాంకులు రావాలని విరామంలేకుండా వారిని ఉదయం నుంచి రాత్రి వరకు చదివిస్తున్నారు. వారికి తీవ్ర ఒత్తిడిని కలిగిస్తున్నారు. ఆ పిల్లలు మానసిక రోగాలకు శారీరక రోగాలకు గురువుతున్నారు. ర్యాంకుల మాట దేవుడెరుగు. వారు ఆత్మ హత్యలకు పాల్పడుతున్నారు. అట్టి విద్య వల్ల ప్రయోజనం లేదంటుంది ఈ కథ. ఇక మహా తపశ్శాలి అయిన ఏకపాదుడు కోపానికి గురై కన్న కొడుక్కే శాపమిచ్చాడు. కోపం దుష్పలితాలను ఇస్తుందని హెచ్చరిస్తుంది ఈ కథ. శపించిన తండ్రినే విడిపించుకొని తెచ్చాడు కొడుకు. తల్లితండ్రులపై అలాంటి ప్రేమ సంతానానికి ఉండాలని బోధిస్తుంది ఈ కథ.– రాచమడుగు శ్రీనివాసులు

చిన్నారులు పజిల్స్ ఎందుకు చేయాలో తెలుసా..!
పరీక్షల్లో మీ మార్కులు బెస్ట్‌గా వచ్చే ఉంటాయి. అయితే పజిల్స్ చేయడంలో తెలుస్తుంది అసలైన చురుకుదనం. ఈ పజిల్స్‌ను స్పీడ్గాచేయగలరా? అసలు పజిల్స్ ఎందుకు చేయాలో తెలుసా?పిల్లలూ.. పజిల్స్ మన మెదడుకు మేత పెడతాయి. వీటికి సమయం కేటాయించడం వల్ల మీ ఏకాగ్రత, ఓర్పు పెరగడంతోపాటు కొత్త విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. పజిల్స్‌లో ఎన్ని రకాలున్నాయో, వాటివల్ల ఉపయోగాలేమిటో చూద్దామా?పద వినోదం: దీనినే గళ్ల నుడికట్టు అని కూడా అంటారు. ఇది పదాలతో ఆడే సరదా ఆట. ఇది భాష మీద పట్టును పెంచుతుంది. దినపత్రికల్లో తెలుగు, ఇంగ్లిషుల్లో మీకు ఇవి కనిపిస్తూ ఉంటాయి. ఖాళీ గళ్లలో పదాలు నింపే ప్రక్రియ ఇది. అందుకోసం పక్కనే మీకు కొన్ని క్లూస్ ఇస్తారు. వీటివల్ల కొత్త కొత్త పదాలు, వాటి అర్థాలు తెలుస్తాయి.సుడోకు: ఇది జపాన్ దేశంలో పుట్టిన పజిల్. నిలువు తొమ్మిది, అడ్డం తొమ్మిది చొప్పున మొత్తం 81 గడులు ఉంటే సుడోకులో కొన్ని గడుల్లో అంకెలు వేసి ఉంటాయి. మిగిలిన వాటిని మనం పూర్తి చేయాలి. అయితే అడ్డంగా, నిలువుగా, తొమ్మిది గడులలో ఒకసారి వేసిన అంకె మరోసారి వేయకూడదు. సుడోకు పూర్తి చేయాలంటే చాలా ఏకాగ్రత అవసరం. పైగా సుడోకు పూర్తి చేయడం వల్ల అంకెల మీద ఇష్టం ఏర్పడుతుంది. లెక్కలంటే భయం ఉన్న పిల్లలు సుడోకు చేయడం వల్ల లెక్కల మీదున్న భయం పోతుంది.జిగ్సా: ప్రపంచవ్యాప్తంగా చాలా పాపులర్ అయిన పజిల్ ఇది. 1760లో దీన్ని కనిపెట్టారు. ఒక అట్ట ముక్కపై ఓ ఆకారాన్ని గీసి, ఆపైన దాన్ని రకరకాలుగా ఆకృతులుగా కత్తిరిస్తారు. మనం ఆ కత్తిరించిన ముక్కల్ని కలిపి ఆ ఆకారాన్ని తిరిగి తీసుకురావాలి. ఇది ఒకరికంటే ఎక్కువమంది కూడా ఆడొచ్చు. ఆడుతున్నంతసేపూ ఏకాగ్రత చాలా అవసరం. మార్కెట్లో అనేక జిగ్సా పజిల్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిని మీరు కొని ఆడుకోవచ్చు.కొత్తగా ఆలోచించు (Lateral Thinking): ఇవి మనందరికీ తెలిసిన పజిల్స్. రకరకాల ప్రశ్నలకు సమాధానాలు కనుక్కోవడమే ఇందులో కీలకం. ప్రశ్నలకు సమాధానాలు కనుక్కోవడంలో భలే సరదాగా ఉంటుంది. పొడుపు కథలు, ప్రాచీన గాథలు, పదాలతో చేసే చిక్కుప్రశ్నలు వీటిలో కీలకం అవుతాయి. ఈ ప్రశ్నల కోసం మార్కెట్లో ప్రత్యేకమైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ‘ఫలానా సందర్భంలో మీరైతే ఏం చేస్తారు? ఫలానా అంశం ఇలాగే ఎందుకు జరుగుతుంది?’ అంటూ ప్రశ్నలు వేసి పిల్లల చేత సమాధానాలు రాబట్టడం ఇందులో ముఖ్యమైన విషయం.లెక్కల పజిల్స్: ఇది మనందరికీ తెలిసినవే. లెక్కలతో తయారైన పజిల్స్. వీటిని పూర్తి చేయడం వల్ల గణితశాస్త్రంలోని పలు అంశాలపై అవగాహన పెరుగుతుంది. కూడికలు, తీసివేతలు, గుణించడం, భాగించడం వంటి అంశాలతో కూడిన ప్రశ్నలు వేసి వాటికి సమాధానాలు పిల్లల చేత రాబడతారు. సరదాగా సాగుతూ పిల్లలకు లెక్కల మీద అవగాహన పెంచడం వీటిలో కీలకం. (చదవండి: పాడ్‌కాస్ట్ చేద్దామా?)

Sagubadi : పర్పుల్ వింగ్డ్ బీన్స్
చిక్కుడు పంటలో బోలెడంత వైవిధ్యం ఉంది. మనకు తెలిసిన అన్ని చిక్కుడు కాయలు ఆకుపచ్చగానే ఉంటాయి. కాయ పొడవుగా, పలకగానో, గుండ్రంగానో ఉంటాయి.అయితే, కాయకు నాలుగు రెక్కలు ఉండే చిక్కుడు (వింగ్డ్ బీన్) వంగడం ఉంది. ఇది ఆకుపచ్చని రకం. ఇందులోనే ఊదా రంగులో ఉండే వింగ్డ్ బీన్స్ రకం ఒకటి ఉంది. అదే పర్పుల్ వింగ్డ్ బీన్. దక్షిణ ఆసియాలోని రైతులు, వినియోగదారులకు ఈ పర్పుల్ వింగ్డ్ బీన్ (Purple Winged Beans) తెలుసు. దీనితో వివిధ రకాల ఉపయోగాలు ఉన్నాయని, వ్యాధి నిరోధకతకు దోహదం చేస్తుందని వారికి గమనిక ఉంది. మొక్క 3–4 మీటర్లు (9.8–13.1 అడుగులు) ఎత్తు పాకే తీగ జాతి కూరగాయ పంట ఇది. దీని గింజలతో పాటు ఆకులు, పువ్వులు, వేర్లు.. అన్నీ తినదగినవే. కాయలను పచ్చిగా లేదా ఉడికించి తినవచ్చు. గింజలను ఉడికించి తినొచ్చు. వేర్లు కూడా తినొచ్చు. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సి, కాల్షియం, ఇనుముతో పాటు ఇతర పోషకాలు ఉంటాయి. నాటిన మూడు నెలల్లోనే కాయలు కోతకు వస్తాయి. పర్పుల్ బీన్ పువ్వులను సలాడ్‌గా తినొచ్చు. లేత ఆకులను కోసి పాకూర మాదిరిగానే ఆకు కూరగా తయారు చేసుకోవచ్చు. వేర్లను పచ్చివి లేదా దుంపల్లా కాల్చుకొని తినొచ్చు. గింజలను సోయా బీన్స్ మాదిరిగా అనేక విధాలుగా ఉపయోగించుకోవచ్చు. గింజల్లో 20% ప్రొటీన్ ఉంటుంది. ఆకులు, పూలలో 10–15% ప్రొటీన్ ఉంటుంది. వింగ్డ్ బీన్స్ పంటకు చీడపీడల బెడద లేదని, ఒక్కసారి నాటితే మళ్లీ మళ్లీ దానంతట అదే పెరుగుతూ ఉంటుందని కర్ణాటకకు చెందిన సహజ సీడ్స్ సంస్థ ప్రతినిధి కృష్ణప్రసాద్ చెబుతున్నారు.చిక్కుడు పంటలో బోలñ డంత వైవిధ్యం ఉంది. మనకు తెలిసిన అన్ని చిక్కుడు కాయలు ఆకుపచ్చగానే ఉంటాయి. కాయ పొడవుగా, పలకగానో, గుండ్రంగానో ఉంటాయి.అయితే, కాయకు నాలుగు రెక్కలు ఉండే చిక్కుడు (వింగ్డ్ బీన్) వంగడం ఉంది. ఇది ఆకుపచ్చని రకం. ఇందులోనే ఊదా రంగులో ఉండే వింగ్డ్ బీన్స్ రకం ఒకటి ఉంది. అదే పర్పుల్ వింగ్డ్ బీన్.
ఫొటోలు
అంతర్జాతీయం

హెచ్–1బీ వీసాలు రద్దు చేయాలి
టెక్సాస్: భారత సంతతికి చెందిన రిపబ్లికన్ పార్టీ నేత రోహిత్ జాయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘హెచ్–1బీ వీసాలను రద్దు చేయాలి. ఆ కార్యక్రమాన్నే ఆపేయాలి. హెచ్–1బీ వీసాదారులను అమెరికా నుంచి పంపించేయాలి’’అంటూ ట్రంప్ సర్కారుకు మతిలేని సూచనలు చేశారు. హెచ్–1బీ, ఇతర వీసాదారుల వీసాలు పునరుద్ధరించాలన్న రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుడు రిచ్ మెక్కారి్మక్ వ్యాఖ్యలను జాయ్ వ్యతిరేకించారు. అమెరికాను పోటీలో ముందు నిలపడంలో హెచ్–1బీ వీసా విధానం పాత్ర ఏమీ లేదని చెప్పుకొచ్చారు. ఆయన వ్యాఖ్యలపై ఆన్లైన్లో తీవ్రస్థాయిలో వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. హెచ్–1బీ వీసాదారుల్లో అత్యధికులు భారతీయులేనన్నది తెలిసిందే. వారంతా జాయ్ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. ఆయన తన వలస నేపథ్యాన్ని గుర్తు చేసుకుంటే మంచిదని హితవు పలుకుతున్నారు. ‘మీరు సౌకర్యవంతంగా స్థిరపడ్డాక అందుకు దోహదపడ్డ నిచ్చెనను లాగేయాలని అనుకుంటున్నారా?’అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జాయ్ కుటుంబం ఆ వీసా పథకం ద్వారానే లబ్ధి పొందిన విషయాన్ని మర్చిపోవద్దని అంటున్నారు. అమెరికా కంపెనీలు నిపుణులైన విదేశీయులను నియమించుకునేందుకు హెచ్–1బీ వీసా వీలు కలి్పస్తుంది. 2022లో జారీ అయిన 3.2 లక్షల హెచ్–1బీ వీసాల్లో 77 శాతం భారతీయులే దక్కించుకున్నారు. 2023లో 3.86 లక్షల వీసాల్లోనూ 72.3 శాతం వాటా వారిదే. హెచ్–1బీ వర్క్ వీసా తొలుత మూడేళ్లపాటు చెల్లుబాటవుతుంది. తరువాత ఆరేళ్ల పొడిగించుకోవచ్చు.

యూకే ప్రొఫెసర్ ఓసీఐ హోదా రద్దు
లండన్: భారత సంతతికి చెందిన నితాషా కౌల్ అనే విద్యావేత్త ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) హోదాను కేంద్రం రద్దు చేసింది. భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై ఈ నిర్ణయం తీసుకుంది. ‘‘పలు అంతర్జాతీయ, సోషల్ మీడియా వేదికల్లో భారత్‌కు వ్యతిరేకంగా రాస్తున్నారు. ప్రసంగాలు చేస్తున్నారు. దేశ సార్వభౌమాధికారాన్ని, దేశంలోని సంస్థలను లక్ష్యంగా చేసుకుని దురుద్దేశంతో, వాస్తవాలను పూర్తిగా విస్మరించి, చరిత్ర పట్ల గౌరవం లేకుండా వ్యవహరిస్తున్న విషయం ప్రభుత్వ దృష్టికి వచ్చింది’’ అని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్రం పంపిన లేఖను కౌల్ ఆదివారం సోషల్ మీడియాలో పంచుకున్నారు. ‘‘విద్యా రంగంలో చేసిన కృషికి నన్నిలా శిక్షించారు. అత్యంత దారుణం. మోదీ ప్రభుత్వ మైనారిటీ వ్యతిరేక, అప్రజాస్వామిక విధానాలకు మరో నిదర్శనం’’ అంటూ ఆరోపణలు గుప్పించారు. విదేశీ పౌరసత్వమున్న భారత సంతతి వ్యక్తులకు కేంద్రం ఇచ్చే ప్రత్యేక హోదా ఓవర్సీస్ సిటిజన్‌షిప్ ఆఫ్ ఇండియా. ఇది జీవితకాలపు వీసా. ఇది ఉన్నవారు భారత్‌ను సందర్శించడానికి ఎలాంటి పరిమితులూ ఉండవు.విమానాశ్రయం నుంచే బహిష్కరణ‘ప్రజాస్వామ్యం– రాజ్యాంగ విలువలు’ అంశంపై ప్రసంగించేందుకు కర్నాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం గతేడాది కౌల్‌ను బెంగళూరుకు ఆహ్వానించింది. విమానాశ్రయంలో దిగగానే అధికారులు ఆమెను అడ్డుకుని 24 గంటల్లోనే బ్రిటన్‌కు తిప్పి పంపారు. ఆరెస్సెస్‌ను విమర్శి స్తున్నందుకే ఇలా చేశారని ఆమె అప్పట్లో ఆరోపించారు. ‘‘కర్నాటక ప్రభుత్వం ఆహ్వానంపై వస్తే కేంద్రం నాకు ప్రవేశం నిరాకరించింది. నా దగ్గర బ్రిటన్ పాస్‌పోర్ట్, ఓసీఐ కార్డు, ఇలా చెల్లుబా టయ్యే పత్రాలన్నీ ఉన్నాయి. ఇది నాకు మాత్రమే కాదు, నన్ను ఆహ్వానించిన బీజేపీ యేతర (కాంగ్రెస్) ప్రభుత్వానికి కూడా జరిగిన అవమానం’’ అని ఆక్షేపించారు. భారత్ విచ్ఛి న్నం కావాలని కోరుకునే కౌల్ వంటి ఓ పాక్ సానుభూ తిపరురాలిని ఆహ్వానించడం దారు ణమని బీజేపీ అప్పట్లో ఆరోపించింది. ఇలాంటి చర్యలతో కర్నాటక కాంగ్రెస్ సర్కారు దేశ ఐక్యత, సమగ్రతకు భంగం కలిగిస్తోందంటూ మండిపడింది.ఎవరీ కౌల్?నితాషా కౌల్ లండన్‌లోని వెస్ట్ మినిస్టర్ విశ్వవిద్యాలయంలో పాలిటిక్స్, అంతర్జాతీయ సంబంధాల విభాగంలో అధ్యాపకురాలు. జమ్మూ కశ్మీర్ నుంచి యూపీలోని గోరఖ్‌పూర్‌కు వలస వచ్చిన కశ్మీరీ పండిట్ల కుటుంబంలో జన్మించారు. ఢిల్లీలో పెరిగారు. ఢిల్లీ వర్సిటీలో ఆర్థిక శాస్త్రంలో బీఏ ఆనర్స్ చేశారు. 1997లో హల్ విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ చేయడానికి 21 ఏళ్ల వయసులో ఇంగ్లాండ్ వెళ్లారు. ఆర్థిక శాస్త్రంలో మాస్టర్స్, ఆర్థిక, తత్వశాస్త్రాల్లో పీహెచ్డీ చేశారు. బ్రిస్టల్ బిజినెస్ స్కూల్లో ఎకనామిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేశారు. 2010లో భూటాన్‌లోని రాయల్ థింఫు కళాశాలలో సృజనాత్మక రచనలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఆమె రచయిత్రి, కవయిత్రి కూడా.

పాక్ చెప్పిందంతా అబద్ధం
ఇస్లామాబాద్: రెండు నెలల క్రితం పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌లో జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలును హైజాక్ చేసిన ఉదంతంలో ఆ దేశ ప్రభుత్వం, సైన్యం చెప్పినదంతా అబద్ధమని బలూచిస్తాన్ వేర్పాటువాదుల గ్రూప్ అయిన బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) సోమవారం ప్రకటించింది. రైలు హైజాక్ ఘటనలో తమదే పైచేయి అని పేర్కొంటూ సాక్ష్యాధారాలతో సవివరంగా ఒక వీడియోను రూపొందించి తాజాగా విడుదలచేసింది. పాకిస్తాన్లో విస్తీర్ణంపరంగా అతిపెద్ద ప్రావిన్స్ అయినప్పటికీ అభివృద్ధిలో ఆమడదూరంలో నిలిచిపోయిన బలూచిస్తాన్ ప్రజలు ఏకమై తమ ప్రాంత స్వయంప్రతిపత్తే లక్ష్యంగా ఉద్యమిస్తున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఉద్యమంలో భాగంగా మార్చి 11వ తేదీన పెషావర్‌కు వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలును వందలాది మంది బలూచ్ సాయుధులు రైలు పట్టాలను పేల్చేశాక హైజాక్ చేయడం తెల్సిందే. అయితే ఈ ఘటనలో బలూచ్ మిలిటెంట్లను హతమార్చి వందల మంది ప్రయాణికులను కాపాడామని పాకిస్తాన్ ప్రభుత్వం, సైన్యం ప్రకటించాయి. అయితే అదంతా అబద్ధమంటూ 36 నిమిషాల వీడియోను బలూచ్ ఆర్మీ మీడియా విభాగం హక్కాల్ ఒక వీడియోను బయటపెట్టింది. అందులో దాడికి ముందే సుశిక్షితులైన వందలాది మంది బీఎల్ఏ ఫైటర్లు షూటింగ్ ప్రాక్టీస్ చేయడం, రైలును హైజాక్ చేశాక ఏ బోగీ జనాలను ఎటువైపు తీసుకెళ్లాలి? ఎవరి బాధ్యతలు ఏమిటి? వంటి వాటితోపాటు బందీలకు ఎలాంటి హానీ తలపెట్టకుండా జాగ్రత్తగా రైలు నుంచి దూరంగా తీసుకెళ్లిన దృశ్యాలు ఆ వీడియోలో కనిపించాయి. బందీలను చిత్రహింసలకు గురిచేసి కొందరిని చంపేశామన్న పాక్ సైన్యం వాదనల్లో నిజంలేదని బీఎల్ఏ ఈ వీడియోతో నిరూపించింది. బందీల్లో 200 మంది పాక్ పోలీసులు, అధికారులు ఉన్నారు. వాళ్లను రెండు రోజులపాటు బంధించిన దృశ్యాలు ఈ వీడియోలో ఉన్నాయి. మహిళలు, వృద్ధులు, చిన్నారులను హింసించారన్న వాదనలో వాస్తవం లేదని ఆ వీడియో చూస్తే తెలుస్తోంది. అసలు దాడి చేయడానికి గల కారణాలు, ఆవశ్యకతను బీఎల్ఏ సీనియర్ నేత ఒకరు ఈ వీడియో మొదట్లోనే స్పష్టంచేశారు. ‘‘మా పోరాటం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మా ఉద్యమం కీలకదశకు చేరుకుంటోంది. ఈ దశలో సంక్షిష్టమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచి్చంది. మా యువ ఫైటర్లు ఇలాంటి కఠిన నిర్ణయాలను అమలుచేయాల్సి వచి్చంది. ఇలాంటి నిర్ణయాలుకాకుండా మరే ప్రత్యామ్నాయాలు లేవని మా వాళ్లకూ అర్థమైంది. తుపాకీని నిలువరించాలంటే తుపాకీని పట్టుకోవాల్సిందే. తుపాకీ పేలుడు శబ్దం కూడా కొంత దూరం వరకే వినిపిస్తుంది. తన తండ్రి కోసం తనయుడు ప్రాణత్యానికైనా సిద్ధమయితే అదే కొడుకు కోసం తండ్రి కూడా ఎంతకైనా తెగిస్తాడు’’అని ఆయన చెప్పాడు. హైజాక్ ప్రణాళిక రచన, అమలు, ముందుండి నడిపించి ఫిదాయీ ఫైటర్ యూనిట్ మజీద్ బ్రిగేడ్ వివరాలు, ఫొటోలు, సభ్యుల స్పందనలను వీడియోకు జతచేశారు. పాక్ సైన్యం ప్రతిదాడిచేసినా అత్యల్ప స్థాయిలో తమ వైపు ప్రాణనష్టం జరిగిందంటూ వీరమరణం పొందిన వాళ్లకు నివాళులు అరి్పంచిన దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి. 30 గంటలపాటు సైనిక ఆపరేషన్ తర్వాత 33 మంది రెబల్స్‌ను మట్టుబెట్టామని పాక్ సైన్యం ఆనాడు ప్రకటించింది. బందీలను విడిపించే క్రమంలో 23 మంది జవాన్లు, ముగ్గురు రైల్వే ఉద్యోగులు, ఐదుగురు ప్రయాణికులు చనిపోయారని తెలిపింది. అయితే తాము మాత్రం బందీలుగా ఉన్న 214 మంది పాకిస్తాన్ పోలీసులందరినీ చంపేశామని రెబల్స్ ప్రకటించారు.

మాజీ ప్రధానిగా నటనకు ప్రశంసలు, హత్యాయత్నం కేసులో అందాల నటి
ఆమె ఒక అందాల నటి. తన నటనా చాతుర్యంతో అనేకమంది అభిమానులను సంపాదించుకుంది. తాజాగా ఒక హత్యాయత్నం కేసులో అరెస్ట్ అయింది. ఢాకాలోని షాజహాన్ లాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో హత్యాయత్నం కేసులో ఆదివారం ఆమెను అరెస్టు చేశారు. ఇంతకీ ఎవరా నటి? ఆమె చేసిన తప్పేంటి? పోలీసలు ఆమెపై ఎందుకు కన్నేశారు? తెలుసుకుందాం.హత్యాయత్నం కేసులో బంగ్లాదేశ్ నటి నుస్రత్ ఫరియాను అరెస్ట్ చేసిన పోలీసులు గట్టి భద్రత మధ్య కోర్టులో హాజరుపరిచారు. ఢాకాలోని స్థానిక కోర్టు జ్యుడీషియల్ కస్టడీకి తరలించడంతో ఆమెను జైలులోనే ఉండనుంది. దీనిపై నుస్రత్ ఫరియా న్యాయవాది బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. దీన్ని ఈ నెల(మే) 22న విచారిస్తుంది. గత సంవత్సరం షేక్ హసీనా ప్రభుత్వం కూల్చివేత, బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి దారితీసిన నిరసనలతో ఈ అరెస్ట్ ముడిపడి ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే నుస్రత్ ఫరియాపై అవామీ లీగ్‌కు నిధులు సమకూర్చారనే ఆరోపణలు ఉన్నాయి.నివేదికల ప్రకారం ఫరియా థాయిలాండ్‌కు వెళ్లాల్సి ఉండగా విమానాశ్రయంలో పోలీసులు అడ్డకున్నారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి హసీనా పాత్రను ఫరియా పోషించి పాపులర్ అయింది ఫరియా. బంగ్లాదేశ్ తొలి అధ్యక్షుడు బంగబంధు షేక్ ముజిబుర్ రెహమాన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన 'ముజిబ్ ది మేకింగ్ ఆఫ్ ఎ నేషన్' చిత్రంలో హసీనా పాత్ర ఫరియాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. 2023నాటి ఈ మూవీకి శ్యామ్ బెనెగల్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని బంగ్లాదేశ్ , భారతదేశం కలిసి నిర్మించగా అరిఫిన్ షువూ టైటిల్ పాత్రలో నటించారు.చదవండి: అనంత్-రాధిక సండే షాపింగ్ : లవ్‌బర్డ్స్ వీడియో వైరల్గత నెల వరకు,హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గత సంవత్సరం జరిగిన నిరసనలకు సంబంధించి కనీసం 137 మంది జర్నలిస్టులు 32 కేసుల్లో చిక్కుకున్నారు. కేసులోని వివరాల ప్రకారం నుస్రత్ ఫరియా, నటుడు అపు బిశ్వాస్, నిపున్ అక్తర్, అష్నా హబీబ్ భబ్నా, జాయెద్ ఖాన్ మరో 12 మందితో కలిసి భటారా ప్రాంతంలో జరిగిన వివక్ష వ్యతిరేక ఉద్యమం సందర్భంగా నమోదైన హత్యాయత్నం కేసులో నిందితులుగా ఉన్నారు. షేక్ హసీనా, 283 మందిపై కూడా ఇదే కేసులో ఆరోపణలు ఉన్నాయి. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని ఎన్నికల ద్వారా ఎన్నుకునే వరకు పాలనను నిర్ధారించేలా తాత్కాలికంగా ఏర్పాటు చేసిన తాత్కాలిక ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని, కొంతమందివ్యక్తులను, పత్రికలను లక్ష్యంగా చేసుకున్నట్లు పౌర హక్కుల సంస్థలు, నేతలు మండి పడుతున్నారు. హసీనా నేతృత్వంలోని ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయి, తాత్కాలిక ప్రభుత్వం వచ్చినప్పటి నుండీ ఉగ్రవాదులు జైలు నుండి విడుదలవుతున్నారు. ప్రస్తుత పాలనలో ఉగ్రవాదులకు మద్దతుగా, భారత వ్యతిరేక స్వరాలకు ఊతమిచ్చినట్టవుతోందనే విమర్శలు బాగా విని పిస్తున్నాయి. నుస్రత్ ఫరియా 2013లో టెలివిజన్ యాంకర్‌గా పనిచేసింది. అందుకు ముందు రేడియో జాకీగా తన కెరీర్ ను ప్రారంభించింది. ఆమె కొన్ని నాటకాల్లో కూడా నటించింది. 2015లో బంగ్లాదేశ్-భారత్ సంయుక్తంగా నిర్మితమైన ‘ఆషికి’ ద్వారా వెండితెరకు పరిచయం మంది. అరంగేట్రంలోనే అందరి దృష్టినీ తమనవైపు తిప్పుకుంది. అనేక సినిమాల్లో నటించింది. ఇదీ చదవండి: బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నారా? ఈ తొమ్మిది మస్ట్..!
జాతీయం

Pakistan: స్కూల్ బస్సుపై ఆత్మాహుతి దాడి.. ఐదుగురు మృతి
క్వెట్టా: పాకిస్తాన్(Pakistan)లోని నైరుతి ప్రాంతంలో బుధవారం ఒక స్కూల్ బస్సుపై జరిగిన ఆత్మాహుతి కారు బాంబు దాడిలో ముగ్గురు చిన్నారులతో సహా ఐదుగురు మృతి చెందారు. ఈ ఘటనలో 38 మంది గాయపడ్డారు. ఈ వివరాలను అసోసియేటెడ్ ప్రెస్ వెల్లడించింది. బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని ఖుజ్దార్ జిల్లాలో ఒక బస్సు చిన్నారులను పాఠశాలకు తీసుకెళ్తుండగా, ఈ దాడి జరిగిందని స్థానిక డిప్యూటీ కమిషనర్ యాసిర్ ఇక్బాల్ తెలిపారు. పలువురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.సమాచారం అందుకున్న భద్రతా దళాలు సంఘటనా స్థలానికి చేరుకుని, ఆ ప్రాంతాన్ని సీజ్ చేశాయి. గాయపడిన వారిని అంబులెన్స్(Ambulance)లలో సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఈ దాడికి ఏ గ్రూపు బాధ్యతను ప్రకటించలేదు. అయితే పోలీసులు బలూచ్ వేర్పాటువాద గ్రూపులను అనుమానిస్తున్నారు. ఈ ప్రావిన్స్‌లో జరిగిన దాడుల్లో ఎక్కువ శాతాన్ని బీఎల్ఏనే చేసింది. గత మార్చిలో బలూచిస్తాన్‌లో రైలుపై జరిగిన దాడిలో బీఎల్ఏ తిరుగుబాటుదారులు 33 మందిని హతమార్చారు.తాజాగా జరిగిన దాడిని పాకిస్తాన్ మంత్రి మొహ్సిన్ నఖ్వీ ఖండించారు. చిన్నారుల మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. దాడికి పాల్పడినవారిని మృగాలుగా అభివర్ణించారు. వారు ఎటువంటి దయకు అర్హులు కారని అన్నారు. ఇది అనాగరిక చర్య అని పేర్కొన్నారు. కాగా బలూచిస్తాన్‌లో చాలా కాలంగా వేర్పాటువాద హింస కొనసాగుతోంది. ఈ ప్రాంతంలో భద్రతపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. స్థానిక అధికారులు, భద్రతా దళాలు ఈ దాడులకు బాధ్యులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది కూడా చదవండి: ‘హార్ట్ ల్యాంప్’కు బుకర్ ప్రైజ్.. కన్నడ రచయిత్రి బాను ఏం రాశారు?

నేషనల్ హెరాల్డ్ కేసు.. సోనియా, రాహుల్‌పై ఈడీ సంచలన ఆరోపణ
సాక్షి, ఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఎన్ఫోర్స్మెంట్(ఈడీ) సంచలన ఆరోపణలు చేసింది. నేషనల్ హెరాల్డ్ ఆస్తుల ద్వారా రూ.142 కోట్లు ఆదాయాన్ని సోనియా, రాహుల్ గాంధీ వాడుకున్నారని తెలిపింది. నిందితులు నేరం ద్వారా వచ్చిన ఆదాయాన్ని అనుభవిస్తున్నారని పేర్కొంది.నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించి మనీ లాండరింగ్ అంశంపై ఢిల్లీ ప్రత్యేక కోర్టులో బుధవారం జరిగిన విచారణలో భాగంగా ఈడీ వాదన వినిపించింది. ఈ సందర్భంగా నేషనల్ హెరాల్డ్ ఆస్తుల ద్వారా రూ.142 కోట్లు ఆదాయాన్ని సోనియాగాంధీ, రాహుల్ గాంధీ వాడుకున్నారని ఈడీ తెలిపింది. AJLకి రూ.50 లక్షలు చెల్లించి యంగ్ ఇండియన్ కంపెనీ రూ.90.25 కోట్లు ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, సుమన్ దూబే , సామ్ పిట్రోడా నమ్మక ద్రోహానికి పాల్పడ్డారు. సోనియా, రాహుల్ యంగ్ ఇండియన్ కంపెనీలో 76% వాటాను కలిగి ఉన్నారు.నిందితులు నేషనల్ హెరాల్డ్ ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. నేషనల్ హెరాల్డ్ ఆస్తి నుండి వచ్చే అద్దె కూడా తీసుకున్నారు. నిందితులు నేరం చేయడం ద్వారా వచ్చిన ఆదాయాన్ని అనుభవిస్తున్నారు. నవంబర్ 2023లో ఆస్తులను అటాచ్ చేశాం. నేరం ద్వారా వచ్చిన ఆదాయాన్ని సంపాదించినప్పుడు, వారు ఆదాయాన్ని తమ వద్దే ఉంచుకోవడం కూడా మనీలాండరింగ్‌గా పరిగణించాలి. ఈ క్రమంలో వచ్చిన డబ్బులు స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీల పాత్రపై ప్రాథమిక ఆధారాలున్నాయి. ప్రాథమికంగా మనీలాండరింగ్ కేసు నమోదు చేశాం’ అని చెప్పుకొచ్చింది.మరోవైపు.. నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్, సోనియాపై ఈడీ ఛార్జ్ షీట్ పరిగణలోకి తీసుకునే అంశంపై రౌస్ అవెన్యూ కోర్టులో అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. ఈ కేసులో ప్రాథమిక విచారణ జరుగుతోందని జూలైకి విచారణకు వాయిదా వేయాలని కోరారు. సింఘ్వీ అభ్యర్థనను అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వ్యతిరేకించారు.The Rouse Avenue Court began hearing the National Herald money laundering case. Notices were issued to Sonia Gandhi, Rahul Gandhi, Sam Pitroda, and others.Special counsel for ED, Zoheb Hossain submitted that the property derived from any criminal activity is a proceed of crime.…— ANI (@ANI) May 21, 2025ఇదిలా ఉండగా.. నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించి మనీ లాండరింగ్ ఆరోపణలతో కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీని ఈడీ అధికారులు గతంలో పలుమార్లు విచారించిన విషయం తెలిసిందే. విదేశీ నిధులతో నేషనల్ హెరాల్డ్ పత్రికను పెంచి పోషించారన్న ఫిర్యాదుల మేరకు ఈడీ, సీబీఐ దర్యాప్తు చేశాయి. సీబీఐ విచారణ మధ్యలోనే నిలిచినప్పటికీ.. ఈడీ దర్యాప్తు మాత్రం కొనసాగుతోంది. ఈ కేసులో 2023, నవంబరులో జప్తు చేసిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్)కు చెందిన రూ.661 కోట్ల విలువైన ఆస్తుల స్వాధీనానికి చర్యలు ప్రారంభించింది.

‘హార్ట్ ల్యాంప్’కు బుకర్ ప్రైజ్.. కన్నడ రచయిత్రి బాను ఏం రాశారు?
బెంగళూరు: కర్ణాటకకు చెందిన ప్రముఖ రచయిత్రి బాను ముష్తాక్(Banu Mushtaq) రచించిన చిన్న కథల సంకలనం ‘హార్ట్ లాంప్’ 2025 అంతర్జాతీయ బుకర్ ప్రైజ్‌కు ఎంపికయ్యింది. దీపా భస్తి కన్నడ నుండి ఆంగ్లంలోకి ఈ పుస్తకాన్ని అనువదించారు. ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారం అందుకున్న మొట్టమొదటి కన్నడ పుస్తకంగా ‘హార్ట్ లాంప్’ గుర్తింపు పొందింది.‘హార్ట్ లాంప్’లో ముష్తాక్ రాసిన 12 చిన్న కథలు ఉన్నాయి. ఈ పుస్తకం 2024లో ఇంగ్లీష్ పెన్ అనువాద అవార్డును కూడా గెలుచుకుంది. ఈ పుస్తకం షార్టలిస్ట్కు ఎంపికైనప్పుడు ముష్తాక్ మాట్లాడుతూ ‘ఇది ఒక పెద్ద విజయం. నేను దీనిని పాఠకులకు, కన్నడ ప్రేమికులకు మంచి హృదయాలు కలిగిన భారతీయులకు అంకితం చేస్తున్నాను. నా కథలు సామాజిక సంక్షోభాలు, భావోద్వేగాలు, వ్యక్తిగత ప్రతిస్పందనల నుండి ఉద్భవించాయి. వీటిలో కొన్ని కథలు రాయడానికి ఒక వారం పట్టింది, కొన్నింటికి పది రోజులు పట్టింది. ప్రేరణ అవసరం లేదు. బాధ, నిస్సహాయత, కోపం మాత్రమే సరిపోతుంది. నేను ఏడుస్తున్నప్పుడు, కోపంగా ఉన్నప్పుడు కథలు రాశాను’ అని భాను ముషాక్ పేర్కొన్నారు. కాగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇన్స్టాగ్రామ్ ద్వారా బాను ముష్తాక్‌ను అభినందించారు.స్పష్టమైన కథనం, కథను నడిపించే తీరు ‘హార్ట్ ల్యాంప్’(‘Heart Lamp’)ను అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించేలా చేశాయి. కాగా బుకర్ ప్రైజ్ న్యాయ నిర్ణేతలు అనువాదకుల ప్రతిభను కూడా గుర్తిస్తారు. ఈ బహుమతి మొత్తం £50,000 (సుమారు రూ. 52,00,000)ను సమానంగా విభజిస్తారు. రచయితకు £25,000 (సుమారు రూ. 26,00,000) అనువాదకునికి £25,000 (సుమారు రూ.26,00,000) అందిస్తారు. న్యాయనిర్ణేతలు ప్రచురణకర్తలు సమర్పించిన 154 పుస్తకాల నుంచి ఉత్తమ పుస్తకాన్ని ఎంపిక చేస్తారు. ‘హార్ట్ లాంప్’ పుస్తకం దక్షిణ భారతదేశంలోని ముస్లిం సమాజంలోని మహిళలు, బాలికల దైనందిన జీవితాలను ప్రతిబింబిస్తుంది. 1990- 2023 మధ్య కాలంలో రాసిన ఈ పుస్తకంలో భావోద్వేగాలు, లోతైన సామాజిక ఉద్రిక్తతలు కనిపిస్తాయి.ఇది కూడా చదవండి: ‘మూడు నిముషాల్లో 13 శత్రు స్థావరాలు నేలమట్టం’

‘మూడు నిముషాల్లో 13 శత్రు స్థావరాలు నేలమట్టం’
న్యూఢిల్లీ: దాయాది దేశం పాకిస్తాన్ జరిపిన కాల్పులకు ప్రతిగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’(Operation Sindhur)లో సాధించిన విజయాలు వెలుగుచూస్తున్నాయి. ఈ ఆపరేషన్‌లో భాగంగా కేవలం మూడు నిమిషాల్లో 13 శత్రు స్థావరాలను భారత సైన్యం ధ్వంసం చేసిందని ఆర్మీకి చెందిన కల్నల్ ఒకరు మీడియాకు తెలిపారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘మే 6- 7 తేదీల మధ్య రాత్రి శత్రువులు రెండు మోర్టార్ బాంబులను(Mortar bombs) పేల్చారు. మేము ముందస్తు సమన్వయంతో కూడిన కాల్పుల ప్రణాళికతో శత్రువులకు చెందిన 13 పోస్టులను (బంకర్లు) నాశనం చేశాం. ఇందుకు మాకు కేవలం మూడు నిమిషాలు పట్టింది. ఆ సమయంలో ప్రతి జవాన్ సిద్ధంగా ఉన్నారని, కమాండర్, ఉన్నత ప్రధాన కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాలు అందరికీ అందాయని అన్నారు. అలాగే శత్రువులపై ఏ ఆయుధాలను ప్రయోగించాలో, వారికి గరిష్ట నష్టం కలిగించడానికి ఎంత సమయం పడుతుందో తమకు ముందుగానే తెలుసన్నారు.మే 6-7 తేదీల మధ్య రాత్రి వేళ తాము సాగించిన ప్రతీకార దాడులను చూసిన శత్రు సైన్యం, మళ్లీ ఇలాంటి తప్పు చేసేందుకు వందసార్లు ఆలోచించేలా బదులిచ్చామని ఆ కల్నల్ పేర్కొన్నారు. పహల్గామ్లో పాక్ ఉగ్రవాదులు 26 మంది పౌరుల ప్రాణాలను బలిగొన్నందుకు ప్రతిస్పందనగా భారత్ ఈ సైనిక చర్య చేపట్టింది. లష్కరే తోయిబా శాఖ అయిన రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్) ఈ దాడికి బాధ్యత వహించింది. ఈ ఘటన భారత్- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను మరింతగా పెంచింది. ఇది కూడా చదవండి: Rajiv death anniversary: ఆ రోజు ఏం జరిగింది? గంధపు దండే ప్రాణాలు తీసిందా?
ఎన్ఆర్ఐ

శంకర్ సుబ్రమోనియన్ తో SNUSA 'మీట్ అండ్ గ్రీట్' కార్యక్రమం
వాషింగ్టన్: శంకర నేత్రాలయ USA (SNUSA) అట్లాంటా విభాగం, ప్రముఖ దాత, IIT మద్రాస్ పూర్వ విద్యార్థి శ్రీ శంకర్ సుబ్రమోనియన్ గారిని సత్కరించేందుకు 2025 ఏప్రిల్ 26న (శనివారం) ఒక ప్రత్యేకమైన "మీట్ అండ్ గ్రీట్" కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది.శ్రీ శంకర్ సుబ్రమోనియన్ గారు అట్లాంటా నివాసితులు. సమాజానికి తిరిగి ఇవ్వాలనే భావనతో, అనేక సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ, అనేక సంస్థలకు ప్రోత్సాహక దాతగా నిలిచారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధన కేంద్రాలను స్థాపించడంలో మరియు కొనసాగించడంలో ఆయన పాత్ర విలువైనదిగా నిలిచింది.2022 లో కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ న్యూ బ్రున్స్విక్ వారు శ్రీ శంకర్ గారిని "ఇంజినీరింగ్ వాల్ ఆఫ్ ఫేమ్"లో చేర్చి సత్కరించారు. 2024 సెప్టెంబర్‌లో, IIT మద్రాస్ పూర్వ విద్యార్థుల సహకారంతో, డయాబెటిస్‌పై పరిశోధన కోసం "శంకర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్" ను స్థాపించారు. ఇది ఎమోరీ యూనివర్సిటీ యొక్క గ్లోబల్ డయాబెటిస్ రీసెర్చ్ సెంటర్ (EGDRC) తో భాగస్వామ్యంలో పనిచేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న మధుమేహ సమస్యకు శాస్త్రీయ పరిష్కారాలను అందించాలనే ఉద్దేశ్యంతో ఈ కేంద్రం ప్రారంభించబడింది.తమ సొంత ఊరైన ఎట్టాయపురం, తమిళనాడులోని గ్రామీణ ప్రాంత ప్రజల కోసం $350,000 విరాళం అందించి, మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ (MESU) ఏర్పాటు చేయడంలో శ్రీ శంకర్ గారు ముఖ్యపాత్ర పోషించారు. ఇది శంకర నేత్రాలయకు ఐదవ MESU యూనిట్ కాగా,2025 ఆగస్టులో ఇది పూర్తిగా సిద్ధమై తమిళనాడు మరియు కేరళకు సేవలు అందించనుంది. ఈ యూనిట్ ద్వారా ప్రతి సంవత్సరం 80 కన్ను శిబిరాలు నిర్వహించగలగడం వల్ల అనేకమందికి వెలుగు పంచే అవకాశం లభించనుంది.ఈ సందర్భంగా శ్రీ శంకర్ గారి కుటుంబ సభ్యులు — శ్రీమతి లక్ష్మీ శంకర్, కుమార్తె అంబికా శంకర్, కుమారుడు అశోక్ కుమార్ మరియు మనవడు — కార్యక్రమానికి హాజరయ్యారు.SNUSA అధ్యక్షుడు మరియు "శంకర రత్న" అవార్డు గ్రహీత శ్రీ బాలా ఇందుర్తి గారు, శ్రీ శంకర్ గారిని ఘనంగా సత్కరించి,SNUSA యొక్క బ్రాండ్ అంబాసడర్‌గా ఆయనను ప్రకటించారు. ఈ సందర్భంగా, వారి మానవతా దృక్పథానికి, లక్షలాది మంది కళ్లల్లో వెలుగు నింపాలనే శంకర నేత్రాలయ ఆశయానికి ఆయన అందిస్తున్న మద్దతుకు SNUSA తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపబడింది.ప్రస్తుతం శంకర నేత్రాలయ గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ యూనిట్ల ద్వారా కంటి శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు భారత ప్రభుత్వం నుండి అధికారికంగా అనుమతి పొందిన ఏకైక సంస్థ. ఇతర క్లిష్టమైన శస్త్రచికిత్సలు కూడా సమీపంలోని శంకర నేత్రాలయ ఆసుపత్రుల్లో పూర్తిగా ఉచితంగా అందించబడుతున్నాయి.ఈ కార్యక్రమాన్ని SNUSA అధ్యక్షుడు శ్రీ బాలా ఇందుర్తి, కోశాధికారి శ్రీ మూర్తి రేకపల్లి, ట్రస్టీలు శ్రీనీ వంగిమల్ల, మెహర్ లంకా, డా. మాధురి నాముదూరి, సాంస్కృతిక విభాగం నీలిమ గడ్డమనుగు, క్రీడా విభాగం రమేష్ చాపరాల, MESU “అడాప్ట్-ఎ విల్లేజ్” చైర్ డా. కిశోర్ రాసమళ్ళు, చాప్టర్ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ తాడికమల్లా, మీడియా చైర్ గిరి కోటగిరి, మరియు సభ్యులు శ్రీధర్ జూలపల్లి, పాడి రావు అట్మూరి, మరియు అట్లాంటా చాప్టర్ నాయకులు శ్రీనివాస్ దుర్గం, రామ్ దుర్వాసుల, శిల్ప ఉప్పులూరి, డా. జనార్ధన్ పన్నెల, రామరాజు గదిరాజు, వెంకీ నిలం, సందీప్ కౌత, దుర్గ గోరా, బిజు దాస్, మరియు యువత విభాగం చరిత్ర జూలపల్లి గారు కలిసి విజయవంతంగా నిర్వహించారు. సింగపూర్ నుండి శ్రీ రత్నకుమార్ కవుటూరు గారు మీడియా విభాగంలో ఎనలేని సేవలందిస్తున్నారని బాలగారు తన ప్రసంగంలో పేర్కొన్నారుఈ వేడుకలో మేటి నాట్య కళాకారులు — రేవతి కోమందూరి, శశికల పెనుమర్తి, నీలిమ గడ్డమనుగు, సోబియా కిషన్, జసోథ బాలసుబ్రమణ్యం — నేతృత్వంలో భరతనాట్యం, కూచిపూడి ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మాధవి ఉప్పులూరి మరియు ఉష మోచెర్ల లలిత సంగీతంతో పాటు, స్థానిక గాయనీ గాయకులు, జసోథ బాలసుబ్రమణ్యం విద్యార్థుల వాయిలిన్ వాయిద్య ప్రదర్శన కూడా ఆధ్యాత్మికతతో కూడిన మూడ్‌ను ఏర్పరిచిందివేదికపై శ్రీ శంకర్ గారు $350,000 చెక్కును SNUSA కోశాధికారి మూర్తి రేకపల్లి గారికి అందజేశారు,SN బృందం మరియు పూజారుల సమక్షంలో. కార్యక్రమం ప్రారంభం లో అట్లాంటా హిందూ టెంపుల్ ప్రధాన పూజారి శ్రీ గోపాల్ భట్టార్ మరియు నలుగురు పూజారులు వేద మంత్రాలతో దీపప్రజ్వలన చేశారు మరియు శంకర నేత్రాలయ సేవా మార్గానికి ఆశీర్వచనాలు అందించారు.కార్యక్రమం ముఖ్య అతిథులుగా డా. కిషోర్ చివుకుల (బోర్డ్ ఆఫ్ అడ్వైజర్ - ఆబర్న్, అలబామా), శ్రీ శ్యామ్ అప్పలి (ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ - లాస్ ఏంజలిస్), శ్రీ అధి మొర్రెడ్డి, శ్రీమతి రేఖా రెడ్డి (ఫీనిక్స్, AZ), శ్రీమతి భాను రామకృష్ణన్ (వాషింగ్టన్ DC), డా. కేశవ్ భట్ (రాలీ,NC), మరియు ఇతరులు పాల్గొన్నారు. మెహర్ లంకా కార్యక్రమ స్థల ఎంపిక మరియు అతిథుల ఆతిథ్య ఏర్పాట్లను సమర్థంగా నిర్వహించారు. నీలిమ గడ్డమనుగు పూజారులు, కొరియోగ్రాఫర్లు, గాయనీ గాయకులు మరియు అలంకరణ బృందంతో సమన్వయం చేసారు.ఈ సమావేశానికి హాజరైన ప్రముఖులు మరియు MESU దాతలు: డా. బీకే మోహన్, డా. సుజాత రెడ్డి,కోమటి మోహన్ రెడ్డి, రవి పోనంగి, మురళి రెడ్డి, రవి కందిమల్ల, అమర్ దుగ్గసాని, బాలరామిరెడ్డి, శ్రీకాంత్ కొండా, కిరణ్ పాశం, ప్రభాకర్ రెడ్డి ఎరగం, అనిల్ జాగర్లమూడి, భరత్ మదాడి, వంశీ మదాడి, తిరు చిల్లపల్లి, జగదీష్ చీమర్ల, నారాయణ రేకపల్లి, శీలా లింగం, అధి చిన్నతిమ్మ, గోపాల్ నాయర్, ఇందు నాయర్, ప్రవీణ్ ఆకుల, రవి గెల్లా, రాజ్ వుచాటు, రాఘవ తడవర్తి, కమల్ సాతులూరు, శ్రీరామ్ రెడ్డి పళ్ళా, మరియు డా. ప్రమోద్ రెడ్డి కైలా.ఈ వేడుకను విజయవంతంగా నిర్వహించిన మాస్టర్స్ ఆఫ్ సెరిమనీ: శ్రీ విజు చిలువేరు మరియు శ్రీ శ్యామ్ అప్పలి . ఫోటో/వీడియో కవరేజ్: శ్రీ వెంకట్ కుట్టువా. ఫుడ్ : అచిస్ రెస్టారెంట్. ఓటు ఆఫ్ థ్యాంక్స్: శ్రీ శ్యామ్ అప్పలి. ఫోటో గ్యాలరీ: https://sankaranethralayausa.org/meet-n-greet-shankar-subramonian/index.htmlమరిన్ని వివరాల కోసం దయచేసి మా వెబ్‌సైట్‌ను సందర్శించండి: www.SankaraNethralayaUSA.org

నాట్స్ డల్లాస్ విభాగం ఆధ్వర్యంలో ఫుడ్ డోనేషన్
భాషే రమ్యం.. సేవే గమ్యం అనే నినాదంతో పనిచేస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తన నినాదానికి తగ్గట్టుగా పేద దేశాల్లో పిల్లల ఆకలి తీర్చేందుకు ముందడుగు వేసింది. రిచర్డ్సన్ నగరంలో నాట్స్ డల్లాస్ విభాగం, ఫీడ్ మై స్టార్వింగ్ చిల్డ్రన్స్ సంస్థతో కలిసి తెలుగు చిన్నారులతో ఫుడ్ డోనేషన్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో నాట్స్ సభ్యులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని అత్యద్భుత సేవాస్ఫూర్తిని ప్రదర్శించారు. దాదాపుగా 30 మంది పిల్లలు, పది మంది పెద్దలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో మొత్తం 105 బాక్సులు ప్యాక్ చేయబడి, 22,680 భోజనాలు సిద్ధం చేశారు. ఈ ప్రయత్నం ద్వారా 62 మంది పిల్లలకు ఒక సంవత్సరం పాటు పోషకాహారం అందించగలిగే ఏర్పాటు జరిగింది. ఈ కార్యక్రమానికి నాట్స్ పూర్వ అధ్యక్షులు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ బాపు నూతి , నాట్స్ డల్లాస్ చాప్టర్ జట్టు కోఆర్డినేటర్లు స్వప్న కాట్రగడ్డ, శ్రావణ్ నిడిగంటిలు నాయకత్వం వహించారు. నిర్వాహకులుగా సౌజన్య రావెళ్ళ, పావని నున్న వ్యవహరించారు. నాట్స్ డల్లాస్ చాప్టర్ అడ్వైజర్ సురేంద్ర ధూళిపాళ్ల ఇందులో కీలక పాత్ర పోషించారు. ఈ సేవా కార్యక్రమంలో నాట్స్ జాతీయ జట్టు నుండి రాజేంద్ర మాదాల, రవి తాండ్ర , కిషోర్ నారె, సత్య శ్రీరామనేని మరియు డల్లాస్ చాప్టర్ జట్టు నుండి సుమతి మాదాల, శివ మాధవ్, బద్రి బియ్యపు, కిరణ్ నారె తదితరులు పాల్గొన్నారు. "ఒక చిన్న సహాయం ఒక జీవితాన్ని మారుస్తుంది" అనే నినాదంతో నాట్స్ సేవా కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయని, పిల్లల్లో సేవాభావాన్ని పెంపొందించటానికి ఇలాంటి కార్యక్రమాలు దోహద పడతాయని నాట్స్ పూర్వ అధ్యక్షులు బాపు నూతి అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలకి పెద్దలకి, దాతలకు నాట్స్ డల్లాస్ చాప్టర్ కోఆర్డినేటర్లు స్వప్న కాట్రగడ్డ మరియు శ్రావణ్ నిడిగంటిలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. డాలస్ చాప్టర్ టీం, సలహాదారు బృందం సభ్యుల సహకారం వల్ల ఈ కార్యక్రమం విజయవంతం కావడం పట్ల నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షులు మదన్ పాములపాటి హర్షం వ్యక్తం చేశారు. మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి

మిస్సోరిలో నాట్స్ ఉచిత వైద్య శిబిరం
అమెరికాలో తెలుగు వారి మేలు కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ .మిస్సోరీలో ప్రతి నెల ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటుచేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా నాట్స్ మిస్సోరి విభాగం బాల్విన్లోని మహాత్మగాంధీ సెంటర్లో ఆదివారం నాడు ఓ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించింది. ఈ శిబిరంలో నాట్స్ బోర్డు గౌరవ సభ్యులు డాక్టర్ సుధీర్ అట్లూరి ఉచిత వైద్య సేవలు అందించారు. రోగులను పరీక్షించిన సుధీర్ అట్లూరి వారికి విలువైన వైద్య సలహాలు ఇచ్చారు.. నాట్స్ మాజీ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మంచికలపూడి, నాట్స్ మిస్సోరి విభాగం కో ఆర్డినేటర్ సందీప్ కొల్లిపర ఈ వైద్య శిబిరం నిర్వహణకు సహకారం అందించారు.మరిన్ని ఎన్ఆర్ఐ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

శాంతా బయోటెక్, శంకర నేత్రాలయ ఆత్మీయ సమావేశం: భారీ విరాళం
అమెరికాలోని అట్లాంటా మహానగరంలో భారతీయ పారిశ్రామికవేత్త, శాస్త్రవేత్త, శాంతా బయోటెక్వ్యవస్థాపక చైర్మన్ పద్మ భూషణ్ డాక్టర్ కెఐ వరప్రసాద్ రెడ్డితో శంకర్ నేత్రాలయ ఒక ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించింది. శంకర నేత్రాలయ USA అధ్యక్షడు బాలారెడ్డి ఇందుర్తి ఆధ్వర్యంలో, కోశాధికారి మూర్తి రేకపల్లి, పాలకమండలి సభ్యులు శ్రీని వంగిమళ్ళ, ఉపేంద్ర రాచుపల్లి, నీలిమ గడ్డమణుగు, డా. కిషోర్ రసమల్లు, రాజేష్ తడికమల్ల ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ వరప్రసాద్ రెడ్డి శంకరనేత్రాలయ మేసు (MESU) కార్యక్రమాలను అభినందిస్తూ, తనవంతుగా రూ. 25 లక్షల విరాళాన్ని ప్రకటించారు. గత విరాళం రూ. 25 లక్షల కు తోడు, మొత్తం రూ. 50 లక్షలువిరాళాన్ని ఆయన శంకర నేత్రాలయ యుఎస్సే కు అందించారు. అలాగే 2026లో నెల్లూరులో మరో భారీ కంటి చికిత్సా శిబిరాన్ని నిర్వహించడానికి డా. వరప్రసాద్ రెడ్డి అంగీకరించారు. కాగా ఈ విరాళం ఐదు MESU Adopt-A-Village కంటి చికిత్సా శిబిరాలకు సాయం అందుతుందని అద్యక్షుడు బాలారెడ్డి ఇందుర్తి కొనియాడారు. అమెరికా పర్యటనలో భాగంగా ప్రసాద్‌రెడ్డి డాలస్ ను కూడా సందర్శించారు. ఆయన మిత్రుడుCTO EVP, LennoxInternational (బిలియన్-డాలర్ పబ్లిక్ కంపెనీ) ప్రకాశ్ ఆహ్వానం మేరకు , ఆయన స్వగృహంలొ15 మంది స్నేహితులతో ఇంకొక ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. వరప్రసాద్ ప్రసంగాలు, సంగీత సాహిత్య మేళవింపుగా ఇది ఈ సమావేశం హృద్యంగా సాగింది. డాలస్ నివాసి, శంకర నేత్రాలయ యుఎస్సే పాలక మండలి సబ్యులు డా. రెడ్డీ (NRU) ఊరిమిండి సంస్థ లక్ష్యాలను, సేవలనుపంచుకొన్నారు. ప్రకాశ్ బెడపూడి శంకరనేత్రాలయ సంస్థ సమగ్ర సేవలను అభినందిస్తూ తమ మిత్రుని గౌరవార్ధం యాభై వేల డాలర్ల విరాళాన్ని ప్రకటించారు. అక్కడకు విచ్చేసిన స్నేహితులు అదనంగా మరో రెండు MESUAdopt-A-Village కంటి చికిత్సా శిబిరాలకు మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ఇతర విరాళాలతో కలిపి డాలస్ కార్యక్రమంలో దాదాపు లక్ష డాలర్ల వరకు విరాళాలు ప్రకటించడం సంస్థకార్యక్రమాలకు ఉత్సాహాన్ని ఇచ్చిందని శంకర్‌నేత్రాలయ ప్రకటించింది.
క్రైమ్

ప్రేమించి పెళ్లాడి.. ఎస్ఐ భార్య ఆత్మహత్య
దొడ్డబళ్లాపురం/ కృష్ణరాజపురం: కొందరి జీవితం ఎలాంటి మలుపులు తిరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ఓ ఎస్సై భార్య ఆత్మహత్య చేసుకున్న సంఘటన బెంగళూరు హెచ్బీఆర్ లేఔట్‌లోని గణపతి దేవాలయం వద్ద చోటుచేసుకుంది. కాడుగొండనహళ్లి పోలీస్‌స్టేషన్‌లో ఎస్సైగా పనిచేసే నాగరాజు భార్య శాలిని (32) సోమవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకుని తనువు చాలించింది. గోవిందపుర పోలీసులు చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేశారు. మొదటి భర్తకు విడాకులు ఇచ్చి.. శాలిని, నాగరాజుది సినిమా కథను పోలిన కథ. ఇద్దరూ కూడా ఇల్కల్ వాసులు. స్కూలు, కాలేజీ రోజుల నుంచి పరిచయం ఉంది. శాలిని ఎమ్మెస్సీ చేయగా, నాగరాజు ఇంజినీరింగ్ చదివేవాడు. తరువాత ఎస్ఐ ఉద్యోగానికి సిద్ధమవుతానంటే శాలిని అతనికి ఆర్థిక సహాయం చేసింది. అలా నాగరాజు ఐదేళ్ల కిందట ఎస్ఐ పోస్టుకు ఎంపికై బెంగళూరులో పనిచేసేవాడు. శాలిని కూడా సిలికాన్ సిటీలో ఓ ప్రముఖ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఇద్దరి మధ్య గాఢమైన ప్రేమ చిగురించి, శాలిని తన భర్తకు విడాకులు ఇచ్చి నాగరాజును పెళ్లి చేసుకుంది. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణం కావచ్చని అనుమానాలున్నాయి.

విద్యుదాఘాతంతో ఆరుగురు మృతి
బయ్యారం/మిరుదొడ్డి (దుబ్బాక)/జగదేవ్‌పూర్ (గజ్వేల్)/పిట్లం (జుక్కల్)/ తొగుట (దుబ్బాక): విద్యుత్ తీగలు ప్రాణాలు తీశాయి. వేర్వేరుచోట్ల కరెంట్ షాక్‌కు గురై ఆరుగురు మృతిచెందారు. పెళ్లయిన 48 గంటలకే.. పెళ్లి బాజాలు...డీజే మోతలు మోగిన ఆ ఇంట చావు డప్పు మోగింది. ఈ విషాద ఘటన మహబూబాబాద్ జిల్లా య్యారం మండలం కోడిపుం జుల తండాలో చోటుచేసుకుంది. తండాకు చెందిన ఇస్లావత్ నరేశ్ (26)కు ఏపీలోని కృష్ణాజిల్లా కంచికచర్లకు చెందిన జాహ్నవితో ఆదివారం వివాహం జరిగింది. సోమవారం తండాకు దంపతులిద్దరూ వచ్చారు. మంగళవారం నరేశ్ ఇంటి వద్ద మోటార్‌ను ఆన్‌చేసే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో విద్యుదాఘాతానికి గుర య్యా డు. ఆస్పత్రికి తరలిస్తుండగానే మృతి చెందాడు. విద్యుత్ సర్వీస్ వైరుపైపడి.. కౌలు రైతు మృతి చెందిన ఘటన మండల పరిధిలోని పీర్లపల్లిలో మంగళవారం చోటు చేసుకుంది. జగదేవ్‌పూర్‌కు చెందిన మహ్మద్ షాదుల్ (25) మామిడితోటను కౌలుకు తీసుకున్నాడు. గ్రామంలో కోతుల బెడద ఎక్కువగా ఉండటంతో మామిడి చెట్టుకు ఇనుప స్టాండ్ వేసుకొని ఎక్కి వలను చుడుతున్నాడు. ఈ క్రమంలో స్టాండ్‌పై నుంచి జారి కిందున్న విద్యుత్ సర్వీస్ వైర్‌పై పడటంతో కరెంట్ షాక్ కొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదవశాత్తూ కరెంట్ తీగలు తగిలి.. విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లా అక్బర్పేట–భూంపల్లి మండల పరిధిలోని మోతెలో చోటు చేసుకుంది. భూంపల్లి ఎస్ఐ హరీశ్ కథనం మేరకు.. మోతె గ్రామానికి చెందిన మంగోరి కృష్ణ హరి (60) తనకున్న ఐదెకరాల్లో వ్యవసాయం చేస్తున్నాడు. మంగళవారం పొలం వద్దకు వెళ్లాడు. అయితే సోమవారం రాత్రి వీచిన గాలి వానకు పొలంలో కరెంటు స్తంభం పడిపోయి ఉంది. ఇది గమనించని కృష్ణ హరి వ్యవసాయ పనులు చేస్తుండగా తీగలు తగిలి విద్యుదాఘాతంతో మృతి చెందాడు. మోటారు తీస్తుండగా విద్యుత్ తీగలు తగిలి.. కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని కంబాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామ శివారులోని పొలంలో బోరు మోటారు పని చేయకపోవడంతో మంగళవారం గ్రామానికి చెందిన రాములు (42), హన్మయ్య (59) బోరు మోటారును తీయడానికి వెళ్లారు. మోటారును పైకి తీస్తున్న క్రమంలో మోటార్‌కు ఉన్న ఇనుప పైప్ పైన ఉన్న విద్యుత్ తీగలకు తగిలింది. దీంతో విద్యుత్‌షాక్‌తో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మత్తులో ట్రాన్స్ఫార్మర్ను ముట్టుకుని.. సిద్దిపేట జిల్లా తొగుటకు చెందిన రామారపు రాజు (36) కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. రోజూ మాదిరిగా మంగళవారం కూలి పనికి వెళ్లి.. సాయంత్రం మద్యం సేవించి ఇంటికొచ్చాడు. మత్తులో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ముట్టుకోగా కరెంట్ షాక్‌తో అక్కడికక్కడే మృతి చెందాడు.

వ్యభిచారం కేసులో ఒలింపిక్ చాంపియన్ అరెస్టు
కొలంబస్: అమెరికా స్టార్ రెజ్లర్ కైల్ స్నైడర్ వ్యభిచారం కేసులో అరెస్టయ్యాడు. 20 ఏళ్ల వయసులో రియో ఒలింపిక్స్ (2016)లో ఫ్రీస్టయిల్ 97 కేజీల విభాగంలో స్వర్ణ పతకం గెలిచిన స్నైడర్ టోక్యో ఒలింపిక్స్ (2020)లో రజత పతకం సాధించాడు. పిన్నవయసులో అమెరికా రెజ్లింగ్ చాంపియన్‌గా ఘనతకెక్కిన స్నైడర్‌ను వ్యభిచారం కేసులో ఈ నెల 9న అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో స్నైడర్ హోటల్ గదిలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. 29 ఏళ్ల స్నైడర్‌ను తాజాగా కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి అతనికి 250 అమెరికన్ డాలర్లు (రూ. 21,386) జరిమానా విధించడంతో పాటు లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి కోసం ఒక రోజంతా పని చేయాలని ఆదేశించారు. తీర్పు అనంతరం తన తప్పుపట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేసిన రెజ్లర్ ఇకపై సరైన నిర్ణయాలతో జీవితాన్ని కొనసాగిస్తానని, తన తప్పువల్ల కుటుంబం పడిన వేదన తనకు అర్థమైందని వాపోయాడు. అతని భార్య మ్యాడీ ఫుట్‌బాల్ ప్లేయర్! రెండు వరుస ఒలింపిక్స్‌లో పతకాలు గెలిచిన స్నైడర్ గతేడాది పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతక పోరులో ఓడి నాలుగో స్థానంలో నిలిచాడు. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్నైడర్ మూడు స్వర్ణ పతకాలు (2015, 2017, 2022), రెండు రజత పతకాలు (2018, 2021), రెండు కాంస్య పతకాలు (2019, 2023) సాధించాడు. అమెరికాలోని నేషనల్ కాలేజ్ అథ్లెటిక్ అసోసియేషన్ (ఎన్సీఏఏ) క్రీడల్లో మూడుసార్లు చాంపియన్‌గా నిలిచాడు. ఓవరాల్‌గా తన 12 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో స్నైడర్ 30 స్వర్ణ పతకాలు, 5 రజత పతకాలు, 7 కాంస్య పతకాలు గెలిచాడు. 199 బౌట్లలో నెగ్గి, 21 బౌట్లలో మాత్రమే ఓడిపోయాడు. ఇటీవలే అతను రియల్ అమెరికన్ ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ లీగ్‌లో పాల్గొనేందుకు కాంట్రాక్టు కుదుర్చుకున్నాడు.

స్పా ముసుగులో వ్యభిచారం
కర్ణాటక: మండ్య నగరంలోని బెంగళూరు -మైసూరు జాతీయ రహదారిలో క్లౌడ్ -11 పేరుతో నిర్వహిస్తున్న యూనిసెక్స్ సెలూన్ అండ్ స్పాపై ఒడనాడు సంస్థ సిబ్బంది, పోలీసులు సం యుక్తంగా దాడి చేశారు. ఇక్కడ వ్యభిచారం జరుగుతున్నట్లు గుర్తించి సెలూన్ యజమాని ఎలిజబెతో సహా ముగ్గురిని అరెస్ట్ చేశారు. నలుగురు మహిళలకు విముక్తి కల్పించారు.ఇతర ప్రాంతాల నుంచి మహిళలను తీసుకువచ్చి వారిని వ్యభిచారం ఊబిలోకి దింపారని పోలీసులు తెలిపారు. ఈ స్పా సమీపంలోనే విద్యా సంస్థలు ఉన్నాయి. స్పాలో చీకటి వ్యవహారాలు జరుగుతున్నట్లు ప్రజలనుంచి ఫిర్యాదులు రావడంతో ఒడనాడు సంస్థకు చెందిన స్వాన్లి పరశురామ్, సీఐ నవీన్ లు పోలీసులతో కలిసి దాడి చేశారు.