Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

TDP Leaders Attack Sakshi TV Journalist in Karempudi 1
పల్నాడులో అరాచకం .. సాక్షి జర్నలిస్ట్‌పై టీడీపీ గూండాల దాడి

పల్నాడు: కారంపూడిలో టీడీపీ నేతలు రౌడీయిజానికి పాల్పడ్డారు. గుంటూరు జిల్లా సాక్షి ప్రతినిధి అశోక్‌ వర్థన్‌పై దాడి చేశారు. అశోక్‌ వర్థన్‌పై పిడిగుద్దులతో విచక్షణారహితంగా దాడి దిగారు. కారంపూడి వైస్ ఎంపీపీ ఉప ఎన్నికకు వెళ్లకుండా వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలను టీడీపీ గుండాలు అడ్డుకున్నాయి. అయితే టీడీపీ గూండాల దాడిని చిత్రీకరించేందుకు సాక్షి జర్నలిస్ట్ అశోక్‌వర్థన్ కవరేజ్‌కు వెళ్లారు. కవరేజ్‌కు వెళ్లిన సాక్షి ప్రతినిధి అశోక్ వర్థన్‌పై టీడీపీ గూండాలు దాడి చేశాయి. దాడి చేసిన గూండాల్లో పంగులూరి అంజయ్య, చెప్పిడి రాము,గొల్ల సురేష్ యాదవ్‌,గోరంట్ల నాగేశ్వరరావు, తదితరులు ఉన్నట్లు తేలింది.

Dont Bring Local Politics Sharad Pawar To Sanjay Raut2
‘బ్రదర్.. ఇది ఉగ్రవాదంపై పోరు.. లోకల్ పాలిటిక్స్ పక్కనపెట్టు’

పుణె: ఉగ్రవాద మూకలను తన దేశంలోనే పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ దుశ్చర్యలను ఎండగట్టే క్రమంలో భారత ప్రజాప్రతినిధులను విదేశాలకు పంపే ప్రక్రియను ‘ ఇండియా కూటమి’ బాయ్ కాట్ చేయాలంటూ శివసేన(యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ధ్వజమెత్తారు. ఆదివారం సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యాలపై శరద్ పవార్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇక్కడ సంజయ్‌ రౌత్‌కు తన వ్యక్తిగత అభిప్రాయాన్ని చెప్పే హక్కు ఉందంటూనే బ్రెయిన్‌ వాష్‌ చేశారు శరద్‌ పవార్‌. అంతర్జాతీయ అంశాలకు స్థానిక రాజకీయాలను జత చేయొద్దంటూ క్లాస్ పీకారు. ఇది జాతీయంగా పరిష్కరించుకునే అంశం కాదని, అంతర్జాతీయ సమస్యను ఎలా చూడాలో అలానే చూడాలంటూ హితవు పలికారు శరద్ పవార్. ఇక్కడ తాను గతంలో ఒక ప్రతినిధి బృందంలో సభ్యుడిగా ఉన్న సంగతిని శరద్ పవార్ గుర్తు చేసుకున్నారు. పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో బీజేపీ నాయకుడు అటల్ బిహారీ వాజ్ పేయ్ నేతృత్వంలో ఏర్పాటైన ప్రతినిధి బృందంలో సభ్యునిగా ఉన్న సంగతిని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.బరామతిలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో శరద్ పవార్ మాట్లాడుతూ.. ‘ ఎప్పుడైనా అంతర్జాతీయ అంశాలపై దృష్టి సారించాల్సిన సమయంలో అంతా ఏకతాటిపై ఉండాలి. అంతేకానీ ఇక్కడ లోకల్ పాలిటిక్స్ చేయకూడదు. అంతర్జాతీయ వేదికపై భారత్ వాణి వినిపించేందుకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం కొంతమంది ప్రజాప్రతినిధుల్ని ఎంపిక చేసింది. పాకిస్తాన్ ఉగ్ర చర్యలను ప్రపంచ దేశాలకు తెలిపే బాధ్యతను ఆయా ప్రజాప్రతినిధులపై ఉంచింది. ఇలా ఒక్కొక్కరికి ఒక్కో దేశాన్ని అప్పగిస్తూ వస్తోంది. భారత్ నినాదం ఒక్కటే.. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమనేది మనం చెప్పాల్సింది. పాకిస్తాన్‌ తీరును అంతర్జాతీయ వేదికలపై ఎండగట్టడమే మన ముందున్న లక్ష్యం. అటువంటి తరుణంలో దీనిని బాయ్ కాట్ చేద్దామంటూ సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలు ఎంతమాత్రం సరికావు’ అంటూ శరద్ పవార్ క్లియర్ మెస్సేజ్ పంపారు.

Reasion Behind Gulzar House Tragedy Incident3
గుల్జార్‌హౌస్‌ అగ్నిప్రమాదానికి అసలు కారణం ఇదే.. తేల్చేసిన అధికారులు

సాక్షి, హైదరాబాద్: గుల్జార్‌హౌస్‌ అగ్నిప్రమాదానికి ఏసీ కంప్రెషర్ పేలుడే కారణమని విచారణ అధికారులు నిర్దారించారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న ఏసీలోని కంప్రెషర్లు పేలడంతో ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. కొన్ని రోజులుగా నిరంతరాయంగా ఏసీలను వినియోగించడంతో ఘటన చోటు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. గుల్జార్‌హౌస్‌ ప్రమాదానికి గల కారణాల్ని వెల్లడించారు. అధికారుల తెలిపిన వివరాల మేరకు.. గుల్జార్‌హౌస్‌ ప్రమాదానికి కారణంగా ఏసీ కంప్రెషర్లే. ఏసీ కంప్రెషర్లు పేలి పక్కనే ఉన్న ఎలక్ట్రికల్ మీటర్లకు మంటలు వ్యాపించాయి. ఫలితంగా గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉన్న పలు ఏసీల్లో ప్రమాదం జరగడంతో దట్టంగా పొగకమ్ముకుంది. ఫస్ట్‌, సెకండ్ ఫ్లోర్‌లో దట్టంగా పొగకమ్ముకోవడంతో కుటుంసభ్యులు బయటకు వెళ్లేందుకు ప్రయత్నించారు. టెర్రస్‌ నుంచి బయటకు రాలేక కిందకు వచ్చేందుకు ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో భాగంగా మెట్ల మార్గం వైపు రావడంతో మంటలు భారీగా ఎగసిపడ్డాయి. దీంతో ప్రాణభయంతో లోపలే ఉండిపోయారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వచ్చే సరికే అపస్మారస్థితిలోకి వెళ్లారు’ అని చెప్పారు. కాగా, గుల్జార్‌హౌస్ అగ్నిప్రమాదంలో 17 మంది మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి.

IPL 2025: Lucknow Super Giants vs Sunrisers Hyderabad Live Updates4
IPL 2025: లక్నో వర్సెస్‌ ఎస్‌ఆర్‌హెచ్‌ లైవ్‌ అప్‌డేట్స్‌

IPL 2025 LSG vs DC Live Updates: దూకుడుగా ఆడుతున్న మార్ష్‌..టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ దూకుడుగా ఆడుతోంది. 2 ఓవర్లు ముగిసే సరికి లక్నో వికెట్ నష్టపోకుండా 19 పరుగులు చేసింది. క్రీజులో మార్ష్‌(18), మార్‌క్రమ్‌(1) ఉన్నారు.ఐపీఎల్‌-2025లో భాగంగా ఏక్నా స్టేడియం వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌, ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ జ‌ట్లు త‌ల‌ప‌డతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఎస్ఆర్‌హెచ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఎస్ఆర్‌హెచ్‌తో మ్యాచ్ ల‌క్నోకు చాలా కీల‌కం. ప్లే ఆఫ్స్ రేసులో నిల‌వాలంటే ఈ మ్యాచ్‌లో పంత్ టీమ్ త‌ప్ప‌క గెల‌వాల్సిందే. మ‌రోవైపు ఇప్ప‌టికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్ర‌మించిన ఆరెంజ్ ఆర్మీ.. త‌మ ఆఖ‌రి మ్యాచ్‌లలో గెలిచి ప‌రువు నెల‌బెట్టుకోవాల‌ని భావిస్తోంది. ఈ మ్యాచ్‌కు ఎస్‌ఆర్‌హెచ్‌ స్టార్‌ ప్లేయర్‌ ట్రావిస్‌ హెడ్‌ కరోనా కారణంగా దూరమయ్యాడు.తుది జట్లులక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్(కెప్టెన్‌), ఆయుష్ బదోని, అబ్దుల్ సమద్, ఆకాష్ దీప్, అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్, దిగ్వేష్ సింగ్ రాఠీ, విలియం ఒరూర్కేసన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్‌), నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, కమిందు మెండిస్, పాట్ కమిన్స్(కెప్టెన్‌), హర్షల్ పటేల్, హర్ష్ దూబే, జీషన్ అన్సారీ, ఎషాన్ మలింగ

India Not A Dharamshala, Supreme Court Rejects Sri Lankan Tamil's Plea5
శరణార్థులపై.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు

ఢిల్లీ: శ్రీలంక శరణార్థుల అంశానికి సంబంధించి దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. శ్రీలంక శరణార్థులు పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు.. ప్రపంచంలోని నలుమూలల నుంచి వచ్చే శరణార్థులకు ఆతిథ్యం ఇచ్చేందుకు భారత్‌ ధర్మశాల కాదని స్పష్టం చేసింది. శ్రీలంక శరణార్థుల పిటిషన్‌పై సోమవారం(మే 19 వ తేదీ) విచారించిన ధర్మాసనం... విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది.ప్రపంచంలోని నలుమూలల నుంచి వచ్చే శరణార్థులకు ఆతిథ్యం ఇచ్చేందుకు భారత్‌ ధర్మశాల కాదని స్సష్టం చేసింది. ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే శరణార్థులకు భారత్‌ ఆతిథ్యం ఇవ్వాలా? భారత్‌లో 140 కోట్ల మంది జనాభా ఉన్నారు. అన్ని ప్రాంతాల నుండి వచ్చే విదేశీ పౌరులకు ఆతిథ్యం ఇచ్చేందుకు ధర్మశాల కాదు. వెంటనే దేశంలోని శరణార్థులు దేశం విడిచి వెళ్లాలని జస్టిస్ దీపాంకర్ దత్తా వ్యాఖ్యానించారు. కేసు పూర్వాపరాల్ని పరిశీలిస్తే.. శ్రీలంకలో ప్రత్యేక తమిళ ఈలమ్‌ కోసం పోరాడిన నిషేధిత తీవ్రవాద సంస్థ ఎల్టీటీఈ సానుభూతి పరుడైన శ్రీలంక జాతీయుడైన పిటిషనర్‌ మరో ఇద్దరు నిందితులతో కలిసి దేశంలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడంతో 2015లో ఆధారాలతో పోలీసులు అరెస్ట్ చేశారు. 2018లో పిటిషనర్‌ను దోషిగా పరిగణలోకి తీసుకున్న న్యాయ స్థానం 2018లో చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ)కింద పది సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించింది. జైలు శిక్ష కొనసాగుతున్న సమయంలో 2022లోమద్రాస్ హైకోర్టు అతని శిక్షను ఏడు సంవత్సరాలకు తగ్గించడమే కాకుండా, శిక్ష పూర్తయ్యాక వెంటనే భారత్ నుండి వెళ్లాలని, ఇక్కడ ఉండకూడదనే సూచించింది. మద్రాస్‌ ఇచ్చిన నాటి తీర్పుతో పిటిషనర్‌ మరికొద్ది రోజుల్లో దేశం విడిచి వెళ్లాల్సి ఉంది.India is not a "dharamshala" that can entertain refugees from all over the world, the Supreme Court orally observed, while refusing to interfere with the detention of a Sri Lankan Tamil national.Read more: https://t.co/LhaVOoiHtu#SupremeCourt pic.twitter.com/6fZD2EoiRq— Live Law (@LiveLawIndia) May 19, 2025 మద్రాస్‌ హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ కానీ తాను, భారత్‌ను విడిచి శ్రీలంకకు వెళ్లలేనని, తనని ఇక్కడే ఉండేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ మద్రాస్‌ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై సుప్రీంకోర్టు జస్టిస్‌ దీపాంకర్ దత్తా, కృష్ణన్ వినోద్ చంద్రన్ (K. Vinod Chandran) నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం(మే19) విచారణ చేపట్టింది. భారత్‌ ధర్మశాల కాదువిచారణ సందర్భంగా జస్టిస్‌ దీపాంకర్ దత్తా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోని నలుమూలల నుంచి వచ్చే శరణార్థులకు ఆతిథ్యం ఇచ్చేందుకు భారత్‌ ధర్మశాల కాదు. శరణార్థులకు ఇక్కడ ఆతిథ్యం ఇవ్వలేం. వెంటనే శరణార్థులు దేశం విడిచి వెళ్లాలని ఆదేశించారు. మద్రాస్‌కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ పిటిషనర్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. ‘మీకు ఇక్కడ స్థిరపడేందుకు ఎలాంటి హక్కు ఉంది?’అనంతరం, పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టులో తన వాదనలు వినిపించారు. పిటిషనర్‌ శ్రీలంక జాతీయుడు. శ్రీలంక నుంచి భారత్‌కు వీసాతో వచ్చాడు. తన దేశంలో ప్రాణ భయముందని అన్నారు. పిటిషనర్‌ మూడేళ్లపాటు జైలు కస్డడీలో ఉన్నారని, ఆ సమయంలో అతని దేశం నుంచి పంపించేందుకు ఎలాంటి చర్య తీసుకోలేదని ప్ర‍స్తావించారు. పిటిషనర్‌ తరుఫు న్యాయవాది వాదనలపై సుప్రీం జస్టిస్‌ దీపాంకర్ దత్తా..‘మీకు ఇక్కడ స్థిరపడేందుకు ఎలాంటి హక్కు ఉంది?’ అని ప్ర‌శ్నించారు.భారత్‌ కాకుండా వేరే దేశంలో స్థిరపడండిఅందుకు.. పిటిషనర్ న్యాయవాది స్పందిస్తూ.. ‘అతను శరణార్థి. అతని భార్య, పిల్లలు ఇక్కడే స్థిర‌ప‌డ్డార‌ని ప్ర‌క‌టించారు. పిటిషనర్ శ్రీలంకకు వెళితే తనకు ప్రాణ హాని ఉందన్న పిటిషనర్ అభ్యర్థనపై జస్టిస్ దీపాంకర్ దత్తా మాట్లాడుతూ.. పిటిషనర్‌కు తన దేశంలో ప్రాణ భయం ఉందని అన్నారు కదా.. భారత్‌యేతర దేశంలో స్థిరపడండి’ అని వ్యాఖ్యానించారు. సారీ.. దేశం విడిచి వెళ్లాల్సిందేఅదే సమయంలో పిటిషనర్‌ 2009లో శ్రీలంక యుద్ధంలో ఎల్‌టిటి సభ్యుడిగా పాల్గొన్నట్లు చెప్పారు. అందువల్ల తాను శ్రీలంకకు వెళితే మళ్లీ అరెస్ట్ అవ్వడంతో పాటు, తన ప్రాణానికి అపాయం వాటిల్లే అవకాశం ఉందని తెలిపారు. తన భార్య ఆరోగ్యపరమైన కారణాలతో బాధపడుతుండగా, తన కుమారుడు గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు పేర్కొన్నారు. చివరిగా ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు.. జైలు శిక్ష పూర్తయిన తర్వాత దేశం విడిచి వెళ్లాలన్న మద్రాస్‌ హైకోర్టు తీర్పును సమర్ధించింది. శ్రీలంకకు వెళ్లే అవసరం లేకుండా భారత్‌లో స్థిరపడేందుకు అవకాశం ఇవ్వాలని పిటిషనర్‌ అభ్యర్థనను సున్నితంగా తిరస్కరించింది.

Kommineni Srinivasa Rao Comments on Yellow Media 6
బోల్తా కొట్టిన ఎల్లోపిట్ట!

ఎల్లో మీడియా శోకాలు పెడుతోంది. అరచి గీపెట్టి మరీ రోదిస్తోంది. దాని బాధల్లా ఒకటే.. చంద్రబాబు హయాంలో ప్రభుత్వ ఆదాయం బాగానే ఉన్నా సాక్షి మీడియా దాన్ని తక్కువగా చేసి రాసిందీ అని! జగన్‌ ప్రభుత్వంలో కంటే ఆదాయం ఇప్పుడు ఎక్కువే ఉంటే ఆ మాట నేరుగా చంద్రబాబే ఢంకా బజాయించి మరీ చెప్పుకునేవాడు. ఆయన ఆ పని చేయలేదు కానీ.. ఆయన తరఫున ఆంధ్రజ్యోతి యజమాని రాధాకృష్ణ మాత్రం తెగ బాధపడిపోతున్నారు. ఆయనగారి పత్రికలో ఈ మధ్యే ‘సంపదపై శోకాలు’ అంటూ ‘జగన్ పత్రిక రోత రాతలు’ అన్న శీర్షికతో ఒక కథనం ప్రచురితమైంది.పచ్చి అబద్ధాలతో నిండిన ఇలాంటి కథనాలు నిత్యం వండి వారుస్తున్నందుకే.. వైసీపీ నేతలు.. సామాన్యులు చాలా మంది ఈ పత్రికను చంద్రజ్యోతిగాను, బూతు పత్రికగాను విమర్శిస్తుంటారు.రాధాకృష్ణ కాని, ఆయన సంపాదక బృందం కాని ఒకే ఒక్క ప్రశ్నకు సమాధానం చెబితే అందరం ఆయన కథనాలు సరైనవేనని ఒప్పేసుకుందాం. ఆ ప్రశ్న ఏమిటంటే... ఎన్నికలకు ముందు చంద్రబాబు చెప్పిందేమి? ఆ తరువాత ఏడాది కాలంలో ఆయన చేసిందేమిటి? ‘‘అప్పులు చేయబోను’’, ‘‘సంపద సృష్టి నాకు తెలుసు’’, ‘‘సూపర్‌ సిక్స్‌తోపాటు ఎన్నికల హామీలన్నీ అమలు చేసి చూపిస్తా’’ అని ఎన్నికల ముందుకు ఒకటికి పదిసార్లు హామీ ఇచ్చిన ఆ పెద్దమనిషి అధికారంలోకి వచ్చిన తరువాత.. ‘‘గల్లా పెట్టె ఖాళీగా కనబడుస్తా ఉంది’’, ‘‘అప్పులు పుట్టడం లేదు’’ ‘‘సంపద సృష్టించే మార్గముంటే చెవిలో చెప్పండి’’. ‘‘అప్పులు చేసి సంక్షేమానికి ఖర్చు చేయలేను’’ అని ప్లేటు ఫిరాయించిన విషయం తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయాలే. రాధాకృష్ణ భాషలో వీటిని శోకాలు అంటారా? లేదా? ఆయన రాసినట్లే చంద్రబాబు హయాంలో ఆదాయం ఎక్కువ ఉందని కాసేపు అనుకుందాం. అలాంటప్పుడు చంద్రబాబు ఖజానా ఖాళీగా కనబడుతోంది అని ఎందుకు అన్నట్టు? పైగా.. అప్పుల కోసం ఏకంగా ఖజానానే తనఖా పెట్టి చరిత్ర సృష్టించడం ఎందుకు? అప్పులు పుట్టడం లేదన్న బాబు మాట కూడా నిజమే అయితే ఏడాది కాలంలో రూ.1.5 లక్షల కోట్ల రుణం చేసిన రికార్డు మాటేమిటి? జగన్‌ హయాంలో ఆదాయం తక్కువగా ఉందనుకున్నా.. సంక్షేమ పథకాలన్నీ ఐదేళ్లూ చక్కగా అమలు చేశారు కదా? దానికి సమాధానం ఏమిటి? ఓడరేవులు, మెడికల్‌ కాలేజీలు, గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్‌ క్లినిక్స్‌, పాఠశాలల్లో ‘నాడు-నేడు’’ ఇలా బోలెడంత అభివృద్ధినికి ప్రజల కళ్లముందే నిలిపారు కదా? అయినా సరే.. జగన్‌ ఎప్పుడు బీద అరుపులు అరవలేదే? ఒకపక్క చంద్రబాబేమో ఖజానా ఖాళీ అంటారు.. ఇంకోపక్క రాధాకృష్ణ ఆదాయం భేష్‌ అంటారు. ఏది నిజం? ఈ ప్రశ్నకు సమాధానం కాగ్‌ లెక్కల్లో వెతుకుదాం.. జగన్‌ పాలన చివరి ఏడాది రాష్ట్ర రెవెన్యూ రాబడులు మొత్తం సుమారు రూ.1.74 లక్షల కోట్లు. ఆ తరువాత చంద్రబాబు (Chandrababu) పాలనలో తొలి ఏడాది (2024-2025) రూ.1.68 లక్షల కోట్లు! అయితే... ఆంధ్రజ్యోతి 2014-15కు సంబంధించిన రెవెన్యూ లోటు మొత్తాన్ని కేంద్రం 2023-24లో ఇవ్వడం వల్ల జగన్‌ హయాంలోని ఆదాయం ఎక్కువగా కనిపిస్తోందని అంటోంది. ఇదే నిజం అనుకుందాం. అప్పుడు కూడా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను సమర్థంగా రాబట్టడంలో జగన్‌ ప్రభుత్వం విజయం సాధించినట్లే అవుతుంది కదా? ఐదేళ్లు కేంద్రంలో భాగస్వామిగా ఉన్నా పది వేల కోట్ల రూపాయల మొత్తం కూడా కేంద్రం నుంచి రాబట్టుకోలేని అసహాయ స్థితిలో చంద్రబాబు ఉన్నట్లు రాధాకృష్ణ ఒప్పుకున్నట్లేనా? జగన్‌ ప్రభుత్వం 12వ ఆర్థిక సంఘం నిధులను కూడా రాబట్టుకుందని ఆంధ్రజ్యోతి చెబుతోంది. ఇది కూడా జగన్ గొప్పదనమే అవుతుంది కదా! ఈ స్థాయిలో కేంద్రం నుంచి చంద్రబాబు నిధులు ఎందుకు తెచ్చుకోలేకపోతున్నారు? ఈ రెండింటినీ మినహాయిస్తే జగన్ హయాం చివరి ఏడాది వచ్చిన రాబడి రూ.1.61 లక్షల కోట్లేనని, చంద్రబాబు తన తొలి ఏడాదిలో ఆదాయం రూ.1.68 లక్షల కోట్లు అని ఈ పత్రిక తెలిపింది.అలాంటప్పుడు చంద్రబాబు పదే, పదే ఎందుకు డబ్బులు లేవని వాపోతున్నారు? రూ.1.5 లక్షల కోట్ల అప్పు ఎందుకు చేశారు? ఈ మొత్తాన్ని ఎందుకోసం ఖర్చు చేశారు? జగన్ టైమ్ నాటికన్నా పదివేల కోట్లు ఎక్కువగా పన్ను ఆదాయం చంద్రబాబు ప్రభుత్వం పొందిందని ఎల్లో మీడియా చెబుతోంది. ఇదే నిజమైతే బాబు బీద అరుపుల మతలబు ఏమిటి? జీఎస్టీ వసూళ్లు రూ.2850 కోట్లు, ఎక్సైజ్ ఆదాయం రూ.3900 కోట్లు, కేంద్ర పన్నుల వాట రూ.ఐదు వేల కోట్ల మేర ఎక్కువ వచ్చిందని ఈ పత్రిక రాసింది. ఇంత భారీ ఎత్తున ఆదాయం వచ్చినా ఎందుకు ఒక్క స్కీమ్ అమలు చేయడం లేదు?జగన్‌ ప్రభుత్వం చివరి సంవత్సరంలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా రూ.9542 కోట్లు వచ్చినట్లు కాగ్‌ లెక్కలు చెబుతున్నాయి. చంద్రబాబు పాలనలో తొలి ఏడాది ఈ మొత్తం రూ.8837 కోట్లే! దీని అర్థం బాబు హయాంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం తగ్గినట్లే కదా? అమ్మకం పన్ను, పన్నేతర ఆదాయం మొదలైన వాటి పరిస్థితి కూడా ఇలాగే ఉందని కాగ్ గణాంకాలు చెబుతున్నాయి. జగన్‌ హయాంతో పోలిస్తే ఇప్పుడు రెవెన్యూ, ద్రవ్య లోటులు రెండూ సుమారు రూ.20 వేల కోట్లు ఎక్కువన్నది కూడా వాస్తవమే కదా? రాధాకృష్ణ ఏదో మసిపూసి మారేడుకాయ చేద్దామని ప్రయత్నించి సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లుగా ఉంది. ఆయన రాసింది వాస్తవమైతే చంద్రబాబు అబద్దాలు చెబుతున్నట్లు అవుతుంది. పైగా ఆదాయం బాగున్నా.. రూ.1.5 లక్షల కోట్లు అప్పు తెచ్చినా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలేవీ అమలు చేయకుండా ప్రజలను మోసం చేసినట్టు అవుతుంది. ఖజానా ఖాళీ అన్న చంద్రబాబు మాటలు నిజమైతే ఈ జాకీ పత్రిక రాసింది అవాస్తవమని అంగీకరించవలసి ఉంటుంది. ఏతావాతా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ శోకాలకు చంద్రబాబు సర్కారే బద్నాం అయ్యింది. కూటమి ప్రభుత్వానికి భజన చేద్దామని అనుకుని ఇలాంటి పిచ్చి రాతలు రాసి చంద్రబాబునే డిఫెన్స్ లో నెట్టేసినట్లయింది. ఆ విషయం అర్థమైందా?- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత

Govt Extends PMAY U Completion Deadline and Know Who is Eligible7
పీఎం ఆవాస్ యోజన గడువు పొడిగింపు

సొంతంగా ఇల్లు నిర్మించుకోవాలని అందరూ అనుకుంటారు. అయితే ఆర్ధిక ఇబ్బందుల కారణంగా.. ఇల్లు కట్టుకోవడం బహుశా అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అలాంటి వారికోసం కేంద్ర ప్రభుత్వం.. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన-అర్బన్ (PMAY-U) స్కీమ్ తీసుకొచ్చింది. ఈ పథకం గడువును పొడిగిస్తూ 'మినిస్ట్రీ ఆఫ్ హోసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్' (MoHUA) నిర్ణయం తీసుకుంది.జూన్ 25, 2015న ప్రారంభించిన ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అర్బన్ గడువును.. 2025 డిసెంబర్ 30, 2025 వరకు పొడిగించారు. దీనివల్ల మంజూరైన ఇళ్లను పూర్తి చేయడానికి ఎక్కువ సమయం లభిస్తుంది. లబ్ధిదారులు తమ గృహ ప్రయోజనాలను క్లెయిమ్ చేసుకోగలరు. 2022 మార్చి 31 నాటికి మంజూరైన ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడానికి ఈ గడువును పెంచడం జరిగింది.పీఎంఏవై-యూ 2.0ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-అర్బన్ 2.0 (PMAY-U 2.0) అనేది.. పట్టణ ప్రాంతాల్లో అర్హులైన ప్రజలు ఇళ్లను నిర్మించుకోవడానికి కేంద్ర సహాయం అందించే స్కీమ్. ఆర్థికంగా వెనుకబడినవారు, తక్కువ ఆదాయ మార్గాలు ఉన్నవారు, దేశంలో ఎక్కడా సొంత పక్కా ఇల్లు లేని కుటుంబాలు ఈ పథకానికి అర్హులు.ఇదీ చదవండి: అగ్ని ప్రమాదంలో నష్టపోయారా?: ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రాసెస్ ఇదే..PMAY 2.0 పథకానికి అర్హతను ఎలా చెక్ చేసుకోవాలంటే..➤https://pmay-urban.gov.in/ బ్‌సైట్ ఓపెన్ చేసి.. హోమ్‌పేజీలో కనిపించే.. అప్లై ఫర్ PMAY-U 2.0పై క్లిక్ చేయండి.➤సూచనలను పూర్తిగా చదివిన తరువాత.. క్లిక్ టు ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి➤మీ అర్హతను తెలుసుకోవడానికి ఫారమ్ ఫిల్ చేయండి. ➤చివరగా ఆధార్ నెంబర్, పేరును ఎంటర్ చేసిన తరువాత.. ఓటీపీ ఎంటర్ చేసి అర్హతను చెక్ చేసుకోవచ్చు.

Tamil actor Vishal is to marry actress Sai Dhanshika goes viral8
ఆ హీరోయిన్‌తో విశాల్ పెళ్లి.. త్వరలోనే ముహుర్తం ఫిక్స్!

కోలీవుడ్ స్టార్, నిర్మాత విశాల్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నట్లు తెలుస్తోంది. గతంలోనే పలు సార్లు ఆయన పెళ్లిపై వార్లలొచ్చినా ఇప్పటివరకు అలాంటిదేం జరగలేదు. నడిగర్ సంఘం భవనం నిర్మించాకే తన పెళ్లి ఉంటుందని గతంలో విశాల్ ప్రకటించారు. అయినప్పటికీ ఆయన పెళ్లి చర్చ ఆగడం లేదు. తాజాగా ఆయన పెళ్లిపై కోలీవుడ్‌లో మరోసారి చర్చ మొదలైంది.విశాల్ త్వరలోనే హీరోయిన్‌ సాయి ధన్సికను పెళ్లాడబోతున్నారంటూ టాక్‌ వినిపిస్తోంది. ఇప్పటికే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని కోలీవుడ్‌లో వార్త చక్కర్లు కొడుతోంది. అయితే తమపై వస్తున్న వార్తలపై ఇప్పటి వరకు సాయిధన్సిక కానీ.. విశాల్ కానీ స్పందిచంలేదు. దీనిపై వీరిద్దరిలో ఎవరో ఒకరూ స్పందిస్తేనే క్లారిటీ వస్తుంది. కాగా.. కోలీవుడ్‌కు చెందిన సాయి ధన్సిక తెలుగులో తెరకెక్కిన షికారు, అంతిమ తీర్పు, దక్షిణ వంటి చిత్రాల్లో హీరోయిన్‌గా నటించారు.ఇటీవల నడిగర్ సంఘం బిల్డింగ్ నిర్మాణం కూడా పూర్తయింది. ఇటీవల ఓ సమావేశంలో తన పెళ్లి గురించి మాట్లాడారు. త్వరలోనే పెళ్లి చేసుకుంటానని తెలిపారు. నాది ప్రేమ వివాహమేనని.. త్వరలోనే మరిన్ని వివరాలు తెలియజేస్తానని విశాల్ వెల్లడించారు. కాగా.. విశాల్‌కు గతంలో అనీషా అనే నటితో నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. కానీ ఆ తర్వాత వీరి నిశ్చితార్థం క్యాన్సిల్ అయింది. ఇవాళే ప్రకటిస్తాడా?..కోలీవుడ్‌లో రూమర్స్ వినిపిస్తోన్న వేళ విశాల్, సాయి ధన్షికతో వివాహం చేసుకోబోతున్నాడన్న వార్త నిజమేనని ఆయన సన్నిహిత వర్గాలు ధృవీకరించాయి. సోమవారం సాయంత్రం జరగనున్న సాయి ధన్షిక నటించిన యోగి దా సినిమా కార్యక్రమానికి విశాల్ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ ఈవెంట్‌లోనే తనతో సాయి ధన్సిక వివాహ ప్రకటన ఉండొచ్చనే వార్తలొస్తున్నాయి.

YSRCP Win Municipal And MPP Seats In AP9
వైఎస్సార్‌సీపీదే విజయం.. మున్సిపల్ చైర్‌పర్సన్‌ ఎన్నిక ఏకగ్రీవం

సాక్షి, కర్నూలు: కర్నూలులో కూటమి కుట్రలను పటాపంచలు చేశారు వైఎస్సార్‌సీపీ నేతలు. ఆదోని మున్సిపల్ చైర్ పర్సన్ పీఠాన్ని వైఎస్సార్‌సీపీ నిలబెట్టుకుంది. ఆదోని మున్సిపల్ చైర్ పర్సన్‌గా సీహెచ్ లోకేశ్వరి ఏకగ్రీవంగా ఎన్నిక‍య్యారు.వివరాల ప్రకారం.. ఆదోని మున్సిపల్ చైర్ పర్సన్‌ ఎన్నికలో కూటమి కుట్రలు ఫలించలేదు. ఈ క్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్‌గా వైఎస్సార్‌సీపీ సీహెచ్ లోకేశ్వరి ఏకగ్రీవంగా ఎన్నిక‍య్యారు. కూటమి నేతల ప్రలోభాలకు వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు తలొగ్గలేదు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌పై నమ్మకంతో కౌన్సిలర్లు లోకేశ్వరికి అండగా నిలిచారు. దీంతో, ఎన్నికల అధికారి సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్.. లోకేశ్వరి ఏకగీవ్రంగా ఎన్నికైనట్టు ప్రకటించారు. పశ్చిమగోదావరి జిల్లా..మరోవైపు.. పాలకొల్లు నియోజకవర్గం యలమంచిలి ఎంపీపీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించింది. ఎంపీపీ స్థానాన్ని కైవసం చేసుకుంది. మండల పరిషత్ అధ్యక్షురాలుగా ఇనుకొండ ధనలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంత్రి రామానాయుడు ఇలాకలో నాటకీయ పరిణామాల మధ్య ఎంపీపీ స్థానాన్ని వైఎస్సార్‌సీపీ దక్కించుకుంది. కూటమి నేతల కుట్రలకు, ప్రలోభాలకు వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలు లొంగలేదు. వైఎస్సార్‌సీపీకి చెందిన 12 మంది ఎంపీటీసీ సభ్యులతో పూర్తి మెజార్టీతో ఏకగ్రీవంగా ధనలక్ష్మి ఎన్నికయ్యారు.శ్రీ సత్యసాయి జిల్లా..రామగిరి ఎంపీపీ ఎన్నికలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. రామగిరి ఎంపీపీ స్థానం మహిళకు రిజర్వ్ కావడంతో టీడీపీకి మహిళా ఎంపీటీసీల మద్దతు దొరకలేదు. రామగిరిలో మొత్తం 10 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. వైఎస్సార్‌సీపీకి-8, టీడీపీకి-1 స్థానాలు ఉన్నాయి. ఒక్క స్థానం ఖాళీగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రలోభాలతో ఇద్దరు వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలను టీడీపీ పార్టీలో చేర్చుకుంది. మరోవైపు.. టీడీపీలో చేరడం ఇష్టంలేక పేరూర్‌ ఎంపీటీసీ భారతి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈరోజు జరిగిన రామగిరి ఎంపీపీ ఉప ఎన్నిక జరగ్గా.. ముగ్గురు పురుష ఎంపీటీసీలు హాజరయ్యారు. మహిళా ఎంపీటీసీల నుంచి నామినేషన్ రాకపోవడంతో రామగిరి ఎంపీపీ ఎన్నిక నిరవధికంగా వాయిదా పడింది. రామగిరి ఎంపీపీ ఎన్నికలను వైఎస్సార్‌సీపీ బహిష్కరించింది. టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రలోభాలకు మహిళా ఎంపీటీసీలు లొంగలేదు.

Hyderabad Gulzar House Incident Sensational Details10
పాతబస్తీ ప్రమాదంపై విస్తుపోయే విషయాలు.. అక్రమ కనెక్షన్‌ కారణమా?

సాక్షి, హైదరాబాద్: పాతబస్తీలోని గుల్జార్‌హౌస్‌ అగ్నిప్రమాదం వెనుక సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. అగ్నిప్రమాదం వెనక అక్రమ కరెంట్‌ కనెక్షన్‌ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ అక్రమ కరెంట్‌పై పోలీసులు, ఫైర్‌ సిబ్బంది దర్యాప్తు చేస్తున్నారు.వివరాల ‍ప్రకారం.. గుల్జార్‌హౌస్‌ అగ్నిప్రమాదం కారణంగా 17 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. కుటుంబానికి చెందిన 17 మంది మృత్యువాత పడ్డారు. ఈ దుర్ఘటన నగరాన్ని ఉలికిపాటుకు గురిచేసింది. ఈ నేపథ్యంలో ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. తాజాగా ఈ ఘటనకు సంబంధించిన పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అక్రమ కరెంట్‌ కనెక్షన్‌ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు, ఫైర్‌ సిబ్బంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.నగల దుకాణం మూసేయగానే హైటెన్షన్ వైర్‌ నుంచి.. కొక్కేల ద్వారా స్థానికులు కరెంట్‌ కనెక్షన్‌ తీసుకున్నారు. ఈ అక్రమ కరెంట్‌తో బాధిత కుటుంబం కరెంట్‌ మీటర్‌పై లోడ్‌ పడింది. ఆ కరెంట్‌ లోడ్‌తో బాధిత కుటుంబం మీటర్‌ బాక్స్‌లో మంటలు చెలరేగాయి. మీటర్‌ బాక్స్‌ పక్కన ఉన్న ఉడెన్‌ షోకేజ్‌కు మంటలు అంటుకున్నాయి. ఉడెన్‌ షోకేజ్‌ నుంచి ఏసీ కంప్రెషర్‌ను మంటలు తాకాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అక్రమ కరెంట్‌పై పోలీసులు, ఫైర్‌ సిబ్బంది దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా. గుల్జార్‌హౌజ్‌ అగ్ని ప్రమాదంలో 17 మంది చనిపోవడం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రథమం. మృతుల్లో ఎనిమిది మంది చిన్నారులు, నలుగురు మహిళలు, ఐదుగురు పురుషులున్నారు. అపస్మారకస్థితికి చేరిన నలుగురు ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స అనంతరం కోలుకున్నారు. ఈ పెనువిషాదం గురించి తెలిసిన వెంటనే రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్రమోదీ, గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ, సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్‌, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌, తదితరులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలతో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు, డీజీపీ జితేందర్‌ తదితరులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షలు, కేంద్రం రూ.2 లక్షల చొప్పున మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ప్రకటించాయి. ప్రమాదానికి షార్ట్‌సర్క్యూట్‌ కారణమని అగ్నిమాపక శాఖ అధికారులు ప్రకటించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ముఖ్యమంత్రి ఆదేశించారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement