Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

fire accident at mirchowk hyderabad1
పాతబస్తీలో అగ్ని ప్రమాదం..17కు చేరిన మరణాలు.. మృతులకు ప్రధాని మోదీ సంతాపం

Meer Chowk Fire Accident Live Updates:సాక్షి,హైదరాబాద్‌: పాతబస్తీ మీర్‌చౌక్‌లో పెను విషాదం చోటు చేసుకుంది. ఆదివారం ఉదయం గుల్జార్‌హౌస్‌ సమీపంలోని ఓ భవనం మొదటి అంతస్తులో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 17 మంది మృతి చెందారు. 👉మృతులకు ప్రధాని మోదీ సంతాపంపాత బస్తీ అగ్నిప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతిమృతులకు ప్రధాని మోదీ సంతాపంపీఎంఎన్‌ఆర్‌ఎఫ్ నుంచి అగ్ని ప్రమాద బాధితులకు ఎక్స్ గ్రేషియామృతులకు రూ.2లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేలు ఎక్స్ గ్రేషియాDeeply anguished by the loss of lives due to a fire tragedy in Hyderabad, Telangana. Condolences to those who have lost their loved ones. May the injured recover soon.An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased. The injured would be…— PMO India (@PMOIndia) May 18, 2025👉ప్రమాదంపై ఫైర్ డీజీ నాగిరెడ్డి మీడియాతో మాట్లాడారుఉదయం 6.16నిమిషాలకు ఫైర్ కాల్ వచ్చిందిసమాచారం వచ్చిన వెంటనే మొఘల్‌పూరా ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారుఆ తర్వాత 11 ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయిప్రమాదానికి కారణం భవనంలోకి వెళ్లే దారికి షార్ట్ సర్క్యూట్ జరిగిందిభవనంలో ఉన్న కృష్ణ పర్ల్స్‌,మోదీ పర్ల్స్ షాపులు అగ్నికి ఆహుతయ్యాయిఅగ్నిప్రమాదం తీవ్ర స్థాయిలో ఉండటానికి కారణం ఆ భవనాన్ని ఇటీవల ఉడెన్ ప్యానల్‌తో డిజైన్ చేశారుషార్ట్ సర్క్యూట్‌తో ఉడెన్ ప్యానల్ మొత్తం కాలి మంటలు వ్యాప్తి చెందాయిప్రమాదంతో ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్న 17 మందిని రెస్క్యూ చేసి వివిధ ఆస్పత్రులకు తరలించాంఒక నలుగురు ల్యాడర్ మీద నుంచి కిందకు వచ్చారు17మందిలో అందరూ చనిపోయినట్లు తెలుస్తోందిప్రమాదం జరగడానికి ప్రధాన కారణం ఎంట్రన్స్‌లో షార్ట్ సర్క్యూట్‌స్థానికంగా పని చేసేవారిని అడిగాను రెగ్యులర్‌గా షార్ట్ సర్క్యూట్ జరుగుతుందని చెప్పారుఇంటి లోపల ఫైర్ నిబంధనలు లేవుఈ బిల్డింగ్ జీప్లస్ 2,బయటకు జీప్లస్ వన్‌లాగా కనిపిస్తోందిఫస్ట్ ఫోర్ల్,సెకండ్ కంప్లీట్‌గా రెసిడెన్షియల్ ఏరియాగ్రౌండ్‌ఫ్లోర్‌లో అన్నీ షాప్స్ ఉన్నాయిఘటనా స్థలాన్ని పరిశీలిస్తే ఈ ప్రమాదం ఎసీ కంప్రెసర్ పేలడం వల్ల జరిగింది కాదు షార్ట్స్ సర్క్యూటే కారణం👉కేటీఆర్‌ దిగ్భ్రాంతిఓల్డ్ సిటీలోని గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదం పై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కేటీఆర్..అగ్ని ప్రమాదం జరగడం దురదృష్టం..చాలా బాధను గురిచేసింది..బాధితుల కుటుంబాలకు సంతాపం ప్రకటించిన కేటీఆర్..గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.మంటలు త్వరగా అదుపులోకి రావాలని ఆశిస్తున్నాను..సహాయక చర్యలకు BRS బృందం అందుబాటులో ఉంటుంది.Extremely shocked and pained!! Details emerging out of Gulzar House fire tragedy in Old City are very sadMy heartfelt condolences to the families of the victims of the tragedy. Wishing a speedy recovery to those injuredHoping and praying that this fire will be contained very…— KTR (@KTRBRS) May 18, 2025👉సీఎం రేవంత్‌ రెడ్డి దిగ్భ్రాంతిఅగ్ని ప్రమాద ఘటనపై సీఎం రేవంత్‌ రెడ్డి దిగ్భ్రాంతి. సహాయక చర్యలకు ముమ్మరం చేయాలని ఆదేశించారు. బాధితులకు అండగా ఉంటామని హామీ. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం. ప్రమాద ఘటన గురించి ఆరా తీసిన ముఖ్యమంత్రి ఘటనా స్థలానికి చేరుకున్న మంత్రి పొన్నం వివరాలు అడిగి తెలుసుకుంటున్న పొన్నం ప్రభాకర్‌ఆదివారం ఉదయం 6గంటలకు ప్రమాదం జరిగింది6.15కి అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుందిప్రమాదంలో ఎలాంటి కుట్ర కోణం లేదు👉కిషన్‌రెడ్డి పరామర్శఅగ్నిప్రమాదం జరగడం దురదృష్టకరం.ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు స్పందించి ఉంటే ప్రాణ నష్టం జరగకుండా ఉండేదిసమయానికి అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి రీచ్ కాలేదుబాధాకరమైన విషయం ఇదికేంద్రం తరఫున బాధిత కుటుంబానికి అండగా ఉంటాంఫైర్ శాఖ వద్ద సరైన ఫైర్ పరికరాలు లేకపోవడంతో తీవ్రత పెరిగిందిఫైర్‌ టెక్నాలజీని పెరుగుపరుచుకోవాలి.ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలి. ఒకే కుటుంబానికి చెందినవారు ఎంతో కాలం ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు. చార్మినార్‌ గుల్జార్‌హౌస్‌లో ఘోర అగ్ని ప్ర‌మాదం జ‌రిగింది. ఆదివారం ఉద‌యం 6.గంట‌ల‌కు షార్ట్ స‌ర్క్యూట్ కార‌ణంగా 17మంది మృతి చెందారు. షార్ట్స్‌ సర్క్యూట్‌ జరిగిన ప్రమాదంలో మొత్తం 17మందిని ఆస్పత్రికి తరలించారు. అగ్నిప్రమాదంలో మంటల్లో చిక్కుకున్న బాధితుల్ని రక్షించే ప్రయత్నం చేశారు. మంటల్లో చిక్కుకున్న మరికొంత మందిని రక్షించేందుకు అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు ప్రయత్నాల్ని కొనసాగిస్తున్నారు. బాధితులకు తక్షణ వైద్యం అందించేందుకు 14 అంబులెన్స్‌లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రమాదంతో పాతబస్తీలో ట్రాఫిక్‌ విభాగం ఆంక్షలు విధించింది. ట్రాఫిక్‌ను డైవర్ట్‌ చేస్తున్నట్లు తెలిపింది. మృతుల్లో ఏడుగురు చిన్నారులు, నలుగురు మహిళలు సహా మొత్తం 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న స్థానిక ఎమ్మెల్యే, మేయర్ విజయలక్ష్మి, అగ్నిపమాక డీజీ నాగిరెడ్డి, సౌత్‌జోన్ డీసీపీ స్నేహా మిశ్రా,హైడ్రా కమిషనర్ రంగనాథ్‌లు పరిశీలించారు. మృతుల వివరాలురాజేంద్రకుమార్‌ (67),అభిషేక్‌ మోదీ (30), సుమిత్ర (65), మున్నీబాయి (72), ఆరుషి జైన్‌ (17), శీతల్‌ జైన్‌ (37), ఇరాజ్‌ (2), హర్షాలీ గుప్తా (7), రజని అగర్వాల్‌, అన్య మోదీ, పంకజ్‌ మోదీ, వర్ష మోదీ, ఇద్దిక్కి మోదీ, రిషభ్‌, ప్రథమ్‌ అగర్వాల్‌, ప్రాంశు అగర్వాల్ ఉన్నారు. ఫైర్ యాక్సిడెంట్ చిన్నదే అయినా భవనంలో 30 మంది ఉండడంలో ప్రాణనష్టం భారీ ఎత్తున జరిగింది.

PM Modi Announces Ex Gratia On Hyderabad Old City Incident Victims2
పాతబస్తీ ప్రమాదంపై మోదీ ఆరా.. బాధితులకు రెండు లక్షల పరిహారం

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని చార్మినార్‌కు సమీపంలోని గుల్జార్ హౌస్‌లో భారీ అగ్నిప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మృతిచెందిన వారికి మోదీ సంతాపం తెలిపారు. ఇదే సమయంలో మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.పాతబస్తీలో జరిగిన అగ్ని ప్రమాదంపై ప్రధాని మోదీ ఆరా తీశారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ సంతాపాన్ని ప్రకటించారు. పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయల పరిహారం మోదీ ప్రకటించారు. గాయపడిన వారికి యాభై వేల రూపాయల సాయాన్ని అందించనున్నట్టు తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సౌకర్యం కల్పించాలని కోరారు. మృతుల కుటుంబాలు ఈ ఘటన నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులకు తక్షణమే కేంద్ర ప్రభుత్వం సాయం ప్రకటించిందని పీఎంవో ట్విట్టర్‌ వేదికగా పేర్కొంది.Deeply anguished by the loss of lives due to a fire tragedy in Hyderabad, Telangana. Condolences to those who have lost their loved ones. May the injured recover soon.An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased. The injured would be…— PMO India (@PMOIndia) May 18, 2025సీఎం రేవంత్‌ దిగ్భ్రాంతి..అగ్ని ప్రమాద ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో 17 మంది మృతి చెందడం బాధాకరమన్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు ఘటనా స్థలాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్‌ పరిశీలించారు. అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.ఇదిలా ఉండగా.. పాతబస్తీలో అగ్ని ప్రమాదం కారణంగా ఇప్పటి వరకు 17 మంది మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, నలుగురు మహిళలు ఉన్నారు. ప్రమాదంతో భవనంలో ఉన్న పలువురు ఊపిరి ఆడక స్పృహ కోల్పోయారు. దీంతో వారిని ఉస్మానియా, యశోద (మలక్‌పేట), డీఆర్డీవో అపోలో ఆస్పత్రులకు తరలించారు. కొందరు ఘటనాస్థలంలో.. మరికొందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ మృతిచెందారు. షార్ట్‌ సర్క్యూట్‌ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి అగ్నిమాపక, డీఆర్‌ఎఫ్‌, జీహెచ్‌ఎంసీ, పోలీసు సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు చేపట్టి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. భవనంలో ఉన్న మరికొందరిని బయటకు తీసుకొచ్చారు. గుల్జార్‌ హౌస్‌ పరిసరాల్లో దట్టంగా పొగ కమ్ముకోవడంతో శ్వాస తీసుకునేందుకు స్థానికులు ఇబ్బందులు పడ్డారు.మృతుల వివరాలు..రాజేంద్రకుమార్‌ (67)అభిషేక్‌ మోదీ (30)సుమిత్ర (65)మున్నీబాయి (72)ఆరుషి జైన్‌ (17)శీతల్‌ జైన్‌ (37)ఇరాజ్‌ (2)హర్షాలీ గుప్తా (7)రజని అగర్వాల్‌అన్య మోదీపంకజ్‌ మోదీవర్ష మోదీఇద్దిక్కి మోదీరిషభ్‌ప్రథమ్‌ అగర్వాల్‌ప్రాంశు అగర్వాల్‌.

Suresh Raina Urges Indian Government To Honour Virat Kohli With Bharat Ratna Award3
విరాట్‌ కోహ్లికి "భారతరత్న" అవార్డు..?

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లికి "భారతరత్న" అవార్డు ఇవ్వాలని భారత మాజీ క్రికెటర్‌ సురేశ్‌ రైనా భారత ప్రభుత్వాన్ని కోరాడు. భారత క్రికెట్‌కు చేసిన ఎనలేని సేవలకు గుర్తుగా విరాట్‌ను దేశ అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించాలని విజ్ఞప్తి చేశాడు. విశ్వ వేదికపై విరాట్‌ ఎన్నో అసాధారణ ఘనతలు సాధించి, త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడేలా చేశాడని అన్నాడు. భారతరత్న అవార్డుకు విరాట్‌ అన్ని విధాల అర్హుడని అభిప్రాయపడ్డాడు.ఫేర్‌వెల్‌ మ్యాచ్‌ కూడా ఏర్పాటు చేయండి..!కొద్ది రోజుల కిందట టెస్ట్‌ క్రికెట్‌కు అనూహ్య రీతిలో వీడ్కోలు పలికిన విరాట్‌కు తన సొంత మైదానమైన ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియంలో ఫేర్‌వెల్‌ మ్యాచ్‌ ఏర్పాటు చేయాలని రైనా డిమాండ్‌ చేశాడు. ఆ మ్యాచ్‌కు విరాట్‌ కుటుంబ సభ్యులు, అతని చిన్ననాటి కోచ్‌లను ఆహ్వానించాలని బీసీసీఐని కోరాడు. భారత క్రికెట్‌కు ఎంతో చేసిన విరాట్‌కు సకల మర్యాదలతో వీడ్కలు పలకాలని విజ్ఞప్తి చేశాడు.కాగా, విరాట్‌ కోహ్లి ఈ నెల 12వ తేదీన ఎవరూ ఊహించని రీతిలో టెస్ట్‌ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. త్వరలో ప్రారంభం కానున్న ఇంగ్లండ్‌ పర్యటనకు తన పేరును పరిశీలిస్తున్న వేల విరాట్‌ రిటైర్మెంట్‌ ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. విరాట్‌ అప్పుడే రిటైరయ్యాడేంటని భారత క్రికెట్‌ అభిమానులు తెగ బాధపడ్డారు. 36 ఏళ్ల విరాట్‌ తన 14 ఏళ్ల టెస్ట్‌ కెరీర్‌లో 123 మ్యాచ్‌లు ఆడి 46.9 సగటున 30సెంచరీలు, 31 హాఫ్‌ సెంచరీల సాయంతో 9230 పరుగులు చేశాడు. ఇందులో 7 డబుల్‌ సెంచరీలు ఉన్నాయి. విరాట్‌.. సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, రాహుల్ ద్రవిడ్ తర్వాత భారత్‌ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు చరిత్రలో నిలిచిపోయాడు. విరాట్‌.. భారత టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్ కూడా. అతని సారథ్యంలో టీమిండియా 68 మ్యాచ్‌ల్లో ఏకంగా 40 విజయాలు సాధించింది. 2024 టీ20 వరల్డ్‌కప్‌ తర్వాత పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన విరాట్‌ ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు.ప్రస్తుతానికి సచిన్‌ ఒక్కడికే..!ప్రస్తుతానికి భారతరత్న అవార్డు అందుకున్న ఏకైక క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ ఒక్కడే. సచిన్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన కొన్ని నెలల తర్వాత భారత ప్రభుత్వం అతన్ని భారతరత్న అవార్డుతో సత్కరించింది. సచిన్‌ 664 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించి 34,357 పరుగులు చేశాడు. ఇందులో 100 సెంచరీలు ఉన్నాయి. సెంచరీల సెంచరీ ఘనత భూగ్రహం మీద మరే ఇతర క్రికెటర్ సాధించలేదు.భారతరత్న ఎవరికి ఇస్తారు..?భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న అవార్డు సాహిత్యం, విజ్ఞానం, కళలు, ప్రజా సేవ, క్రీడలు వంటి రంగాలలో విశేష సేవలు చేసిన వారికి అందించబడుతుంది. భారత రాష్ట్రపతి ఈ అవార్డును ప్రదానం చేస్తారు.

Tadipatri SP Jagadeesh Letter To Kethireddy Peddareddy4
కేతిరెడ్డి పెద్దారెడ్డికి లేఖ.. వివాదాస్పదంగా తాడిపత్రి ఎస్పీ తీరు!

సాక్షి, అనంతపురం: వైఎస్సార్‌సీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి విషయంలో పోలీసులు మరోసారి చేతులెత్తేశారు. కేతిరెడ్డి పెద్దారెడ్డికి రక్షణ కల్పించలేమని స్వయంగా ఎస్పీ జగదీష్ లేఖ రాశారు. ఈ క్రమంలో తాడిపత్రి పర్యటనను వారం లేదా పది రోజులు వాయిదా వేసుకోవాలని ఎస్పీ జగదీష్ సూచించడం గమనార్హం.ఏపీలో కూటమి సర్కార్‌ పాలనలో పోలీసులు తీరు వివాదాస్పదంగా మారుతోంది. ఇప్పటకే ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ నేతలను అక్రమ కేసులతో టార్గెట్‌ చేసి అరెస్ట్‌ చేస్తుండగా.. మరోవైపు, భద్రత కల్పించడంలో కూడా పోలీసులు విఫలమవుతున్నారు. తాజాగా కేతిరెడ్డి పెద్దారెడ్డికి ఎస్పీ జగదీష్ రెండోసారి లేఖ రాశారు. లేఖలో పెద్దారెడ్డికి రక్షణ కల్పించలేమని తెలిపారు. తాడిపత్రి పర్యటనను వారం లేదా పది రోజులు వాయిదా వేసుకోవాలని మాజీ ఎమ్మెల్యేకు సూచించారు. టీడీపీ మహానాడు, రాప్తాడు జంట హత్యలు, ఎంపీపీ ఉప ఎన్నికల దృష్ట్యా భద్రత కల్పించలేమని చెప్పుకొచ్చారు.ఇదిలా ఉండగా.. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి తాడిపత్రి వెళ్లేందుకు భద్రత కల్పించాలని ఇప్పటికే హైకోర్టు ఆదేలిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పెద్దారెడ్డి తాను తాడిపత్రి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఇప్పటికే ఎస్పీకి తెలిపారు. అయిన్పటికీ ఎస్పీ ఇదే తీరుగా వ్యవహరిస్తూ వివాదంలో చిక్కుకుంటున్నారు. వివిధ కారణాలు చూపి భద్రత కల్పించలేమని చెప్పుకుంటూ వస్తున్నారు. ఇక, అంతకుముందు కూడా పెద్దారెడ్డి తాడిపత్రి పర్యటనకు భద్రత కల్పించలేమంటూ చేతులెత్తేశారు ఎస్పీ జగదీష్‌. ఈ నెల తొమ్మిదో తేదీన సీఎం చంద్రబాబు పర్యటన ఉన్నందున భద్రత ఇవ్వలేమని ఎస్పీ తెలిపారు. ఎస్పీ లేఖతో పెద్దారెడ్డి తాడిపత్రి పర్యటన వాయిదా పడింది.మరోవైపు.. తాడిపత్రి వస్తే అంతుచూస్తామంటూ తాడిపత్రి టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి పదేపదే బెదిరిస్తున్నారు. పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లడానికి హైకోర్టు అనుమతి ఇచ్చినా.. తాను మాత్రం దాడులు చేస్తానని జేసీ బహిరంగంగా సవాల్ చేశారు. పెద్దారెడ్డికి ఎవరూ మద్దత ఇవ్వొద్దని, తనకు పెద్దారెడ్డితో గొడవలు ఉన్నాయని, ఒకవేళ వస్తే తిరిగి వెళ్లడు అంటూ వార్నింగ్ ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. తాడిపత్రి వెళ్లడానికి హైకోర్టు అనుమతిచ్చిన క్రమంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇలా వ్యాఖ్యానించడం ఏంటో అర్థం కావడం లేదని పలువురు విమర్శిస్తున్నారు.

No India-Pakistan DGMO Talks Today, Confirms Indian Army, Ceasefire To Continue5
ఇండియన్‌ ఆర్మీ కీలక ప్రకటన

ఢిల్లీ: ఇండియన్‌ ఆర్మీ కీలక ప్రకటన చేసింది. పాక్‌తో కాల్పుల విరమణకు గడువు లేదని స్పష్టం చేసింది. ఈ రోజు డీజీఎంవో చర్చలు లేవని తెలిపింది. కాల్పుల విరమణ కొనసాగుతుందని పునరుద్ఘాటించింది.పహల్గాం ఉగ్రదాడి (Terrorist Attack) అనంతరం భారత్‌ చేపట్టిన ప్రతీకార దాడులతో పాకిస్తాన్‌ ఉక్కిరిబిక్కిరయ్యింది. ఆపరేషన్‌ సిందూర్‌తో దాయాది దేశం విలవిల్లాడింది. చివరకు ఉద్రిక్తతలు తగ్గించాలని పాక్‌ (Pakistan)శరణుగోరింది. పాక్‌ అర్జించడంతో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. మే 10న ఇరు దేశాల డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ మిలిటరీ ఆపరేషన్స్‌ (DGMOs) స్థాయిలో కాల్పుల విరమణ అవగాహనపై ఒప్పందం కుదర్చుకున్నాయి. ఈ తరుణంలో కాల్పుల విరమణ అవగాహనకు ముగింపు తేదీ లేదని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. Some media houses are reporting that the ceasefire between India and Pakistan is ending today. In addition, queries are also being received if a DGMO-level talk is scheduled today.According to the Indian Army, no DGMO talks are scheduled today. As far as the continuation of a…— ANI (@ANI) May 18, 2025

War Effects on Indian Real Estate6
రియల్‌ ఎస్టేట్‌.. యుద్ధం ఎఫెక్ట్‌..

దేశీయ స్థిరాస్తి రంగంపై దాయాదుల పోరు దెబ్బ పడింది. సాయుధ పోరాటాలు దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. యుద్ధాలతో ఆస్తి, ప్రాణ నష్టం కలగడమే కాకుండా దెబ్బతిన్న మౌలిక సదుపాయాలను పునర్‌నిర్మించుకోవడం కోసం పెద్ద ఎత్తున ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు భారంగా మారుతుంది. యుద్ధాలు నిర్మాణ రంగాన్ని కూడా నిలిపివేస్తాయి. తుది వినియోగదారులు, పెట్టుబడిదారుల విశ్వాసాన్ని తగ్గించడంతో పాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్‌ వంటి ప్రధాన నగరాల్లో స్థిరాస్తి లావాదేవీలపై ప్రభావాన్ని చూపిస్తుంది. గృహ కొనుగోలుదారులు తమ నిర్ణయాలను నిలిపివేస్తారు. బహుళ జాతి సంస్థలు కొత్త ఆఫీసుల ఏర్పాటు, విస్తరణ ప్రణాళికలను వాయిదా వేస్తారు. రిటైలర్లు తమ విస్తరణ ప్రణాళికలకు బ్రేక్‌లు వేస్తారు. అయితే ఈ అవరోధం తాత్కాలిక కాలమే.. – సాక్షి, సిటీబ్యూరో స్థిరాస్తి రంగంపై యుద్ధం ప్రభావం ఇలా..🔸నివాసం: ఢిల్లీ–ఎన్‌సీఆర్, ఉత్తర భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో ఇళ్ల కొనుగోళ్లు 5–10 శాతం మేర తగ్గవచ్చు. అయితే ఇది కొద్దికాలమే.. సాధారణంగా అనిశ్చితి సమయంలో లగ్జరీ గృహ కొనుగోలుదారులు కొనుగోలులో ఆలస్యం చేస్తారు. సాధారణ స్థితి పునరుద్ధరణ అయ్యాక ముందుగా మధ్య ఆదాయ వర్గాల గృహాలకు డిమాండ్‌ ఏర్పడుతుంది. అయితే ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే సిమెంటు, ఉక్కు ధరలు పెరుగుతూనే ఉంటాయి.🔸వాణిజ్యం: తాజా యుద్ధం ఇంకా కొనసాగితే కనుక బహుళ జాతి సంస్థలు మన దేశంలోకి ప్రవేశ, విస్తరణ ప్రణాళికలను తాత్కాలికంగా నిలిపివేస్తాయి. దీంతో ఆఫీసు స్పేస్‌ లీజులపై ప్రభావం పడుతుంది. దీర్ఘకాలిక డిమాండ్‌ కారణంగా గ్లోబల్‌ కేపబులిటీ సెంటర్లు(జీసీసీ), బీఎఫ్‌ఎస్‌ఐ, ఐటీ రంగాలలో ఆఫీసు స్పేస్‌ లీజులు, కొనుగోలు లావాదేవీలు 12 లేదా అంతకంటే తక్కువ సమయంలోనే తిరిగి పుంజుకుంటాయి.🔸రిటైల్‌: దీర్ఘకాలిక లీజులు, అద్దె మినహాయింపు నిబంధనల కారణంగా బ్రాండెడ్‌ మాల్స్‌పై పెద్దగా ప్రభావం పడదు. కానీ, మాల్స్‌లో జనసంచారం, రద్దీ తగ్గడంతో పాటు కొత్త స్టోర్‌ ప్రారంభాలు వాయిదా పడతాయి.🔸ఆతిథ్యం: యుద్ధంతో సహజంగానే ఢిల్లీ, కశీ్మర్‌ వంటి ఇతర ప్రభావిత ప్రాంతాలలో పర్యాటక ప్రాంతాల రద్దీ తగ్గుతుంది. ఆయా ప్రాంతాలలో హోటల్‌ ఆక్యుపెన్సీ 10–15 శాతం క్షీణిస్తుంది. ఇండో–పాక్‌ యుద్ధంతో.. 1971లో ఇండియా, పాకిస్తాన్‌ దేశాల మధ్య 13 రోజుల పాటు జరిగిన యుద్ధ కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. నిర్మాణ పనులు పూర్తిగా నిలిచిపోయాయి. స్థూల జాతీయోత్పత్తి(జీడీపీ) వృద్ధిలో భారీ తగ్గుదల నమోదైంది. 1970 ఆర్థిక సంవత్సరంలో 5.4 శాతంగా ఉన్న జీడీపీ.. 1972 నాటికి 1 శాతానికి పడిపోయింది. ద్రవ్యోల్బణం 11 శాతానికి పైగా దాటింది. నిర్మాణ పనులు సైనిక ప్రదేశాలకే పరిమితమయ్యాయి.🔸నివాసం: ఆర్థిక రాజధాని ముంబైలో(అప్పట్లో బొంబాయి) స్థానిక రాష్ట్ర ప్రభుత్వం సిమెంట్, ఉక్కుపై కఠిన నియంత్రణ విధించింది. నిర్మాణ సామగ్రి కొరత కారణంగా గృహ ప్రాజెక్ట్‌ల అనుమతులు 12 శాతం మేర తగ్గాయి. అద్దె నియంత్రణ చట్టం కారణంగా రెంట్లు స్థిరంగానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం అదుపు తప్పినప్పటికీ.. గృహాల అద్దెలు పెరగలేదు. ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు దాదాపు 10 శాతం మేర తగ్గాయి.🔸వాణిజ్యం: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ) చెప్పుకోదగిన స్థాయిలో రాలేదు. ప్రైవేట్‌ కార్యాలయ స్థలాల అభివృద్ధి పూర్తిగా ఆగిపోయింది. దేశంలో ఖరీదైన, డిమాండ్‌ కలిగిన ప్రాంతాలైన ముంబైలోని పోర్ట్, ఢిల్లీలోని కన్నాట్‌ ప్లేస్‌లలో భారీగా ఆఫీసు వేకెన్సీలు కనిపించాయి. అయితే పరిమిత సరఫరా, కఠినమైన నిబంధనల కారణంగా కార్యాలయాల అద్దెలు మాత్రం తగ్గలేదు.🔸రిటైల్‌: ఇప్పటి లాగా 1971లో దేశంలో హైస్ట్రీట్‌ రిటైల్‌ రంగం వ్యవస్థీకృతంగా లేదు. ఎక్కువగా అసంఘటిత రంగంగానే ఉండేది. కానీ పాత ఢిల్లీ, కోల్‌కతాలోని స్థానిక దుకాణాలకు జన సంచారం గణనీయంగా తగ్గింది. 1971 నుంచి అందుబాటులో ఉన్న కోర్టు రికార్డ్‌ల ప్రకారం అద్దెదారులలో పెరిగిన ఒత్తిడి కారణంగా ముంబైలో దుకాణాల అద్దె వివాదాలు 18 శాతం మేర పెరిగాయి.🔸ఆతిథ్యం: దేశీయ పర్యాటక రంగం యుద్ధంతో ప్రభావితమైంది. 1970లో 20.2 లక్షలుగా ఉన్న విదేశీ పర్యాటకుల రాకపోకలు.. 1971 నాటికి 19.6 లక్షలకు తగ్గింది. ఢిల్లీలో హోటళ్ల ఆక్యుపెన్సీ 45 శాతం కంటే తక్కువకు పడిపోయింది. ఆ రోజుల్లో హాస్పిటాలిటీ రంగంలో ప్రధాన సంస్థ అయిన ఇండియన్‌ హోటల్స్‌ కంపెనీ కూడా రెండంకెలలో ఆదాయం పడిపోయింది. ప్రత్యక్షంగా శ్రీనగర్‌ పర్యాటక ప్రాంతం ఎక్కువగా ప్రభావితమైంది.నాలుగు అంశాలపై ప్రతికూలత.. బంగ్లాదేశ్‌ విమోచనం ప్రధాన అంశంగా 1971లో ఇండియా–పాకిస్తాన్‌ మధ్య, అలాగే తీవ్రవాదులు నియంత్రణ రేఖ దాటి మన దేశంలోకి చొచ్చుకురావడంతో 1999లో కార్గిల్‌ యుద్ధం జరిగింది. ఈ రెండు సందర్భాల్లోనూ దాయాదుల పోరుతో స్థిరాస్తి రంగంలో నాలుగు కీలక విభాగాలైన నివాస, వాణిజ్య, రిటైల్, ఆతిథ్య రంగాలపై యుద్ధం ప్రభావం చూపించింది.🔸 వినియోగదారులు, పెట్టుబడిదారుల విశ్వాసం తగ్గుతుంది. గృహ కొనుగోలుదారులు కొనుగోళ్లను ఆలస్యం చేస్తారు. సంస్థలు తమ కార్యాలయాల విస్తరణ లీజు లావాదేవీలను వాయిదా వేస్తారు. పెట్టుబడిదారులు బంగారం, స్టాక్‌ మార్కెట్లు, క్రిప్టో కరెన్సీ వంటి ప్రత్యామ్నాయ పెట్టుబడుల వైపు ఆసక్తి చూపుతారు.🔸ఉక్కు, సిమెంటు, కాపర్, టైల్స్, శానిటరీ వేర్, రంగులు వంటి నిర్మాణ సామగ్రి ముడి పదార్థాల కొరత ఏర్పడుతుంది. దీంతో ఇన్‌పుట్‌ ధరలు పెరుగుతాయి.🔸ప్రభుత్వం సైన్యం కార్యకలాపాలను మరింత బలోపేతం చేసేందుకు రక్షణ రంగంపై ఖర్చును పెంచుతాయి. మౌలిక సదుపాయాలు, వినియోగదారుల రియల్‌ ఎస్టేట్‌పై ఖర్చును తగ్గిస్తాయి.🔸సాయుధ పోరాటాలు అద్దెలను పెద్దగా ప్రభావితం చేయకపోయినా.. డిమాండ్‌ తక్కువగా ఉండటం వల్ల గృహ మూలధన విలువలు దెబ్బతింటాయి.కార్గిల్‌ వార్‌తో.. 🔸 1999లో జరిగిన కార్గిల్‌ యుద్ధం స్వల్పకాలమైనా.. ఎక్కువ ప్రభావితమైంది. యుద్ధం కారణంగా మూడు నెలల పాటు మార్కెట్లు భయాందోళనకు దారితీసినా త్వరగానే కోలుకుంది.🔸 నివాసం: దేశీయ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ అప్పటికే ఆసియా ఆర్థిక సంక్షోభం ప్రభావంతో కొట్టుమిట్టాడుతోంది. దీంతో గృహ అద్దె విలువలు ప్రత్యక్షంగా దెబ్బతిన్నాయి. ఢిల్లీ, ముంబైలోని ప్రధాన నివాస ప్రాంతాల్లోని అద్దె విలువలు మూడు నెలల్లో 3–8 శాతం మేర పడిపోయాయి. 1999 చివరి నాటికి అట్టడుగు స్థాయికి క్షీణించాయి. ఆసక్తికరంగా కార్గిల్‌ యుద్ధ సమయంలో ముంబైలోని చారిత్రాత్మక, ప్రధాన వ్యాపార ప్రాంతమైన కఫ్‌ పరేడ్‌లో లగ్జరీ అపార్ట్‌మెంట్‌ ధర చ.అ.కు రూ.20,000–23,200 మధ్య అమ్ముడవడం కొసమెరుపు.🔸 వాణిజ్యం: 1999లో ప్రధాన నగరాల్లో సుమారు 48 లక్షల చ.అ. ఆఫీసు స్పేస్‌ సరఫరా అయింది. కన్నాట్‌ ప్లేస్‌ వంటి సెంట్రల్‌ బిజినెస్‌ డి్రస్టిక్ట్‌ ప్రాంతాలలో ఖాళీలు 11–15 శాతం మధ్య పెరిగాయి. అద్దెలు స్వల్పంగా తగ్గాయి. పెద్ద అంతర్జాతీయ కంపెనీలు లీజు లావాదేవీలు రద్దు చేయలేదు. కానీ.. కొంతకాలం పాటు వాయిదా వేశాయి. అప్పట్లో బెంగళూరు సిలికాన్‌ వ్యాలీ కాదు కానీ కోరమంగళం వంటి ప్రాంతాల్లో పూర్తిస్థాయి ఐటీ పార్క్‌లు ఉన్నాయి. వీటిల్లో అద్దె నెలకు చ.అ.కు రూ.35–65 మధ్య లీజుకు పోయాయి.🔸 రిటైల్‌: దేశంలో ప్రధాన మాల్స్‌ అయిన ముంబైలోని క్రాస్‌రోడ్స్, ఢిల్లీలోని అన్సల్‌ ప్లాజాల నిర్మాణ పనులు తుది దశలో ఉన్నాయి. 1999లో ప్రీమియం రిటైల్‌ రియల్‌ ఎస్టేట్‌ వాణిజ్య రియల్టీ కంటే ఎక్కువ అద్దెలను చవిచూసింది. కానీ, యుద్ధ వాతావరణంతో చాలా మంది రిటైలర్లు తమ స్టోర్‌ ఓపెనింగ్‌లను కొంతకాలం పాటు నిలిపివేశారు.🔸 ఆతిథ్యం: కార్గిల్‌ యుద్ధం సమయంలో ప్రత్యక్షంగా ప్రభావితమయ్యే ప్రాంతాలు మినహా పర్యాటక పరిశ్రమ గణనీయంగా బలంగా ఉంది. 1999లో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు 5.3 శాతం మేర పెరిగాయి. దీనికి ప్రధాన కారణం అప్పటి ప్రభుత్వం పర్యాటక రంగానికి ఇచి్చన ప్రోత్సాహం, రూపాయి విలువ తగ్గడమే. ఈ 3 నెలల్లో ఉత్తర భారతదేశంలో హోటళ్ల రద్దు 20–30 శాతం పెరిగాయి. ఎక్కువగా ఢిల్లీ, కశీ్మర్‌ లోని హోటళ్లు ప్రభావితమయ్యాయి. 2003 నాటికి పర్యాటకుల సంఖ్య ఏటా 44 వేలకు చేరింది.యుద్ధం తర్వాత ఏమైందంటే.. దాయాదుల మధ్య జరిగిన రెండు యుద్ధాల తర్వాత దేశీయ రియల్‌ ఎస్టేట్‌ రంగం మూడు ప్రధాన అంశాల నుంచి వేగంగా కోలుకుంది. గృహాలు, కార్యాలయాల అవసరం ఎప్పటిలాగే డిమాండ్‌ కొనసాగింది. యుద్ధంతో కొనుగోలుదారులు, పెట్టుబడిదారులలో నెలకొన్న భయాందోళలు తగ్గించేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) కఠిన రుణ నిబంధనలను సరళతరం చేసింది. అలాగే స్టాక్‌ మార్కెట్లు త్వరగా కోలుకున్నాయి. ఈ రెండు యుద్ధాలతో వివిధ పాయింట్లతో నిఫ్టీ సుమారు 5 శాతం పడిపోయినప్పటికీ.. సానుకూల రాబడిని అందించడానికి 5–6 నెలల్లోనే తిరిగి క్షీణించాయి.

Sakshi Editorial On TDP Irregularities7
ఇది స్టేట్‌ ఫ్యాక్షనిజం కాదా?

ప్రభుత్వ యంత్రాంగంలో ముఠా తత్వాన్ని ప్రవేశపెడితే ఎలా ఉంటుంది? అచ్చంగా నేటి ఆంధ్రప్రదేశ్‌ పరిపాలన మాదిరిగా ఉంటుంది. కక్షలూ, కార్పణ్యాలూ, ప్రత్యర్థుల వేటలే ప్రధానాంశాలుగా సర్కారు ఎజెండాను ఆక్రమించాయి. ప్రజా శ్రేయస్సు గురించి మాట్లాడడం కూడా ఇప్పుడు అప్రకటిత నిషేధిత జాబితాలో చేరిపోయినట్టుంది. ఏలినవారిచ్చిన హామీల అమలు గురించి ప్రశ్నించడం కూడా నేరమైపోతున్నది. కేసుల బెత్తం కళ్లెర్రజేస్తున్నది. జైళ్లు నోళ్లు తెరుస్తున్నాయి.వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి, నందిగం సురేశ్, సుధారాణి, కృష్ణవేణి, రవీందర్‌రెడ్డి... ఇలా ఎంతమంది గొంతుకలపైకి ఫ్యాక్షన్‌ సర్కార్‌ పంజా విసిరిందో చూస్తూనే ఉన్నాము. అస్మదీయ బూతు జాగిలాలు మాత్రం ఎంతయినా పెట్రేగిపోయే వెసులు బాటును కల్పించారు. మొక్కుబడిగా ఒక్క పచ్చి బూతు జాగి లాన్ని అత్తారింటికి పంపినట్టు ఓ నాలుగు రోజులు లోపలికి పంపించి, సగౌరవంగా విడిచిపెట్టేశారు. ఈ బూతుశ్రీ కంటే కరుడుగట్టిన తీవ్రవాదులా... వంశీ, పోసాని, నందిగం వగైరాలు?కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి కాకముందే చంద్రబాబు అరెస్టుకు ప్రతీకారం తీర్చుకోవాలన్న దుగ్ధ ప్రభుత్వ యంత్రాంగంలో కనిపిస్తున్నది. యెల్లో మీడియాలో జ్వలిస్తు న్నది. అందుకు అవకాశమున్నదా అనే మీమాంస అవసరం లేదు. తాము కోరుకున్నట్టుగా కేసులు రాసుకోవడానికి గత ప్రభుత్వం అమలుచేసిన మద్యం పాలసీని ఎంచుకున్నారు. నిజానికి జగన్‌ ప్రభుత్వ పాజిటివ్‌ అంశాల్లో మద్యం పాలసీ కూడా ఒకటి. ఒక పాజిటివ్‌ అంశాన్ని నెగెటివ్‌ కోణంలో చూపెట్టడానికి రోజుకో సారా మజిలీ కథను, పూటకో పుక్కిటి పురాణాన్ని ప్రభుత్వ యంత్రాంగం వండి వార్చడం, యెల్లో మీడియా వడ్డించడం ఒక దైనందిన దైవకార్యంగా చేపట్టినట్టు కనిపిస్తున్నది. తాజాగా రిమాండ్‌ రిపోర్టుల పేరుతో వెలువ రిస్తున్న ఫిక్షన్‌ సాహిత్యంతో కొంతమందినైనా గందరగోళానికి గురి చేయాలనే ఉద్దేశం కనిపిస్తున్నది.జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అమలుచేసిన మద్యం విధా నంలో గందరగోళానికి గురి కావలసినంత సంక్లిష్టత ఏమీ లేదు. సామాన్యుడికి కూడా అర్థమయ్యే సులభమైన విధానం అది. మద్యం మహమ్మారి విష ప్రవాహానికి సంసారాలు ఛిద్రమవు తున్నాయనే మహిళల ఆక్రందనను ‘పాదయాత్ర’ సందర్భంగా జగన్‌ గమనించారు. దీనికి ముగింపు పలకడం కోసం మద్య నిషేధం విధించాలనే ఆలోచన చేశారు. అయితే గత అనుభవాల దృష్ట్యా ఎకాయెకిన నిషేధించడం సాధ్యమయ్యే పని కాదని, ఆచరణాత్మక పద్ధతిలో దశలవారీ నిషేధాన్ని ఎంచుకున్నారు. మద్యం షాపుల సంఖ్యను తగ్గించారు. లాభాపేక్షతో దొంగ చాటు అమ్మకాలు, కల్తీ వంటివి జరగకుండా ప్రైవేట్‌ వ్యాపా రాన్ని తొలగించి ప్రభుత్వ పరిధిలోకి అమ్మకాలను తీసు కొచ్చారు. ఫలితంగా 43 వేల బెల్ట్‌షాపులను విజయవంతంగా మూసివేయడం సాధ్యపడింది. విచ్చలవిడిగా మద్యం తయారీని నిరుత్సాహపరచడానికి ఒక్క డిస్టిలరీకి కూడా కొత్తగా అనుమతి నీయలేదు. మద్యం దుకాణాల సంఖ్యను కూడా గణనీయంగా పది శాతం కంటే ఎక్కువగానే తగ్గించారు. వాటికి అనుబంధంగా ఉండే పర్మిట్‌ రూములూ మూతపడ్డాయి. దుకాణంలో అమ్మ కాలు జరిగే సమయాన్ని తగ్గించి, రాత్రి 9 గంటలకే మూసే శారు. టీడీపీ హయాంలో అనధికారికంగా 24 గంటలూ మద్యం అమ్మకాలు సాగేవి. వ్యాపారులంతా టీడీపీ అనుయాయులే కనుక, పైదాకా మామూళ్లు ఇచ్చేవారే కనుక ఈ వేళల నియంత్రణ సాధ్యం కాలేదు.జగన్‌ ప్రభుత్వ చర్యల పర్యవసానంగా మద్యం విక్రయాలు గణనీయంగా పడిపోయాయి. చంద్రబాబు సర్కార్‌ చివరి సంవత్సరంలో (2018–2019) ఐఎమ్‌ఎఫ్‌ఎల్, బీర్లు కలిపి 6 కోట్ల 61 లక్షల కేసుల అమ్మకాలు జరిగితే, జగన్‌ ప్రభుత్వ చివరి సంవత్సరానికి (2023–24) 4 కోట్ల 44 లక్షలకు పడిపోయింది. అంటే అమ్మకాల్లో మూడో వంతు తగ్గింది. దశలవారీ మద్య నిషేధం అనే జగన్‌ సర్కార్‌ పెట్టుకున్న ఒక లక్ష్యంలో దీన్నొక పెద్ద ముందడుగుగా పరిగణించాలి.వినియోగం ఇంత తగ్గినా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం తగ్గలేదు. పైపెచ్చు గణనీయంగా పెరిగింది. మద్యాన్ని తయారు చేసే డిస్టిలరీలకు కొత్తగా ఒక్క అనుమతిని కూడా జగన్‌ ప్రభుత్వం ఇవ్వలేదు. అధిక లాభాలకోసం విచ్చలవిడిగా అమ్మకాలు సాగించే ప్రైవేట్‌ వ్యక్తులను ఈ వ్యాపారం నుంచి తప్పించారు. మొత్తం విధానం ఇంత పారదర్శకంగా ఉన్న ప్పుడు స్కామ్‌ ఎక్కడ జరిగే అవకాశముందన్న ప్రశ్నల జోలికి కూటమి సర్కార్‌ గానీ, దర్యాప్తు చేస్తున్న సిట్‌ బృందం కానీ వెళ్లదలచుకోలేదు.జగన్‌ ప్రభుత్వ హయాంలో చంద్రబాబును అరెస్టు చేశారు కనుక, ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవలసిందే, కేసులు నడపాల్సిందే అన్నట్టుగా వారి వైఖరి కనబడుతున్నది. మద్యం అమ్మకాల్లో జగన్‌ ప్రభుత్వం 3 వేల కోట్ల స్కామ్‌కు పాల్పడిందని అధికారంలోకి వచ్చిన నెల రోజులకే చంద్రబాబు తేల్చిపారేశారు. జూలైలో శ్వేతపత్రం పేరుతో జరిగిన కార్యక్ర మంలో ఆయన ఈ లెక్క చెప్పారు. ఆయన నోటివెంట వచ్చిన ‘అంకె’ను నిజం చేయడానికి దర్యాప్తు బృందం ఇప్పుడు కథలు అల్లుతున్నట్టు కనిపిస్తున్నది. ఈ కేసులో ప్రభుత్వ ఖజానా నుంచి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడానికి తీసుకున్న నిర్ణయం ఏమన్నా ఉన్నదా? నిబంధనలకు విరుద్ధంగా ప్రజా ధనాన్ని ఎవరికైనా దోచిపెట్టిన అంశం ఇమిడి ఉన్నదా? లంచా లకు ఆశించి ప్రైవేట్‌ వ్యక్తులకు వనరుల్ని కట్టబెట్టిన వైనం ఈ కథలో కనబడుతున్నదా? మరి స్కామ్‌ ఎక్కడ?చంద్రబాబును అరెస్టు చేసిన స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ ఇందుకు పూర్తిగా భిన్నమైనది. రాష్ట్రంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోసం జర్మనీకి చెందిన సీమెన్స్‌ కంపెనీ ఉదారంగా సాయం చేస్తున్నదనీ, ఇందులో పది శాతం నిధుల్ని సమకూర్చితే వాళ్లు 90 శాతం విడుదల చేస్తారనీ ఓ కట్టుకథను అల్లిపెట్టారు. సీమెన్స్‌ కంపెనీ ఆ తదనంతర కాలంలో స్వయంగా ఖండించడం వల్ల ఇది కట్టుకథని రూఢి అయింది. పది శాతం కింద రూ.371 కోట్లను విడుదల చేయాలని ముఖ్యమంత్రి కార్యా లయం నుంచి ఆర్థిక శాఖకు ఆదేశాలు వెళ్లాయి. సదరు సీమెన్స్‌ నిధులను విడుదల చేయకముందే పది శాతాన్ని విడుదల చేయడం నిబంధనలకు విరుద్ధమన్న అభ్యంతరాలను తోసి పుచ్చి నిధుల విడుదలకు ముఖ్యమంత్రి కార్యాలయం ఒత్తిడి చేసింది.పైగా తాము చెబుతున్న సీమెన్స్‌ కంపెనీకి కాదు, మధ్యలో ఓ బ్రోకర్‌ కంపెనీకి ఈ నిధులు బదిలీ చేశారు. అక్కడి నుంచి అందులో 241 కోట్ల రూపాయలు పుణె, అహ్మదా బాదుల్లోని షెల్‌ కంపెనీల ద్వారా ప్రయాణించి దుబాయ్,సింగపూర్‌ కంపెనీలకు చేరుకున్నాయని, ఆ పిదప చేరాల్సిన చివరి మజిలీకి కూడా చేరుకున్నాయని సీఐడీ ఆధారాలతో నిరూపించింది. 241 కోట్లతో స్కిల్‌ డెవలప్‌మెంట్‌కు అవస రమైన పరికరాలు కొనుగోలు చేసినట్టు పుణె షెల్‌ కంపెనీ నకిలీ ఇన్‌వాయిస్‌లు సృష్టించి ఈడీకి దొరికిపోవడంతో ఈ బాగోతం డొంకంతా కదిలింది. చంద్రబాబు అరెస్టు వెనుక ఇంత నిరూ పణ ఉన్నది.జగన్‌మోహన్‌రెడ్డి తీసుకొచ్చిన మద్యం పాలసీలో ఒక లక్ష్యం ఉన్నది. ఒక సదుద్దేశం ఉన్నది. ఆ లక్ష్యసాధనలో అనుకున్న మేరకు విజయం సాధించారు కూడా! ఇందులో ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టే అంశం లేదు. స్కామ్‌ జరగ డానికి కూడా అవకాశాలు లేవు. చంద్రబాబు సర్కార్‌ 2015లో మద్యం దుకాణాలు, బార్లపై విధించే ప్రివిలేజ్‌ ఫీజును తొల గిస్తూ ఒక రహస్య జీవోను విడుదల చేసింది.ఇందులో దురుద్దేశం ఉన్నది. డబ్బు సంపాదించే లక్ష్యం కనిపిస్తున్నది. మద్యం దుకాణాలు గానీ, బార్లు గానీ వాటి ఏడాది టార్గెట్‌ను మించి అమ్మకాలు సాగిస్తే ఆ అదనపు అమ్మకాలపై ప్రభుత్వాలు ప్రివిలేజ్‌ ఫీజు వసూలు చేసేవి. ప్రభుత్వానికి ఇదొక ఆదాయ వనరుగా ఉండేది. చీకటి జీవో ద్వారా చంద్రబాబు ఆ ఫీజును మాఫీ చేశారు. తద్వారా నాలుగేళ్లలో ఖజానాకు 5 వేల కోట్లు నష్టం జరిగిందని అంచనా!ఖజానాకు గండి పడినందువలన ప్రైవేట్‌ వ్యాపారులు లాభపడ్డారు. తమకు లాభాలు తెచ్చిపెట్టే నిర్ణయాన్ని తీసుకు న్నందుకు ప్రైవేట్‌ వ్యక్తులు లంచాలు చెల్లించే అవకాశం ఉంటుందా? ఉండదా? దాన్ని స్కామ్‌ అంటారా, లేదా? అట్లాగే 2014–2019 మధ్యకాలంలో 200 రకాల దిక్కుమాలిన బ్రాండ్లు రంగప్రవేశం చేశాయి. దీనివల్ల లాభాలు పొందింది డిస్టిలరీల వాళ్లు! ఏపీకి మద్యం సరఫరా చేస్తున్న 20 డిస్టిలరీలలో 14 చంద్రబాబు హయాంలో అనుమతి తెచ్చుకున్నవేనని సమా చారం. మిగిలిన ఆరు వేర్వేరు సమయాల్లో అనుమతి పొందాయి.జగన్‌ అనుమతించిన డిస్టిలరీ ఒక్కటి కూడా లేదు. ఈ విషయాలను పరిశీలించినప్పుడు ఎవరిది పారదర్శక విధా నమో, ఎవరిది కుంభకోణ విధానమో గ్రహించడం బ్రహ్మ విద్యేమీ కాదు. ప్రస్తుత లిక్కర్‌ కేసు నమోదు వెనుక రాజకీయ దురుద్దేశా లున్నాయని పిటిషనర్లు ప్రాథమికంగా రుజువు చేయగలిగారని సర్వోన్నత న్యాయస్థానం కూడా శుక్రవారం నాడు వ్యాఖ్యానించినట్టు వార్తలు వచ్చాయి. సాక్షులనూ, సహ నిందితులనూ ఫలానా విధంగా వాఙ్మూలం ఇవ్వాలని ఒత్తిడి చేయడం గానీ, బెదిరించడం గానీ, ప్రలోభపెట్టడం గానీ చేయవద్దని ఏపీ సీఐడీని సర్వోన్నత న్యాయస్థానం హెచ్చరించింది.రిమాండ్‌ రిపోర్టుల పేరుతో స్వీయ కవితల్ని ప్రచారం చేస్తున్నారని వినిపిస్తున్న ఆరోపణలకు సుప్రీం వ్యాఖ్యలు బలం చేకూర్చి నట్లయింది. అసలు స్కామ్‌కు అవకాశమే లేనిచోట ఏదో తవ్వి తీస్తామని షో నడపడం వెనుక అసలు ఉద్దేశం వేరు. ఈ పేరుతో కీలక వ్యక్తులను అరెస్టు చేసి, ప్రధాన ప్రతిపక్ష శ్రేణుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడం మొదటిది. తమ పరిపాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చడం రెండవది.కూటమి ప్రభుత్వం ఏడాది పాలన ఓ వైఫల్యాల పుట్ట. అవినీతి విశృంఖలంగా మారింది. చిరువ్యాపారులు 30 పర్సెంట్‌ ‘యెల్లో ట్యాక్స్‌’ కట్టలేక అల్లాడుతున్నారు. చికెన్, మటన్‌ అమ్మేవాళ్లను కూడా వదిలిపెట్టడం లేదు. జీఎస్టీ దూరని చోటుకి కూడా ‘యెల్లో ట్యాక్స్‌’ దూసుకుపోతున్నది. రైతాంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతున్నది. లాభసాటి సంగతి దేవుడెరుగు, గిట్టుబాటు ధర కూడా దక్కలేదు. పేదవర్గాల పరిస్థితి మరింత దారుణం. ‘సంపద’ సృష్టించి సంక్షేమ పథకా లను అమలు చేస్తామని చెప్పారు. ఏడాది గడిచిపోయింది. ‘తల్లికి వందనం’ ఈ జూన్‌కు రెండేళ్ల బకాయి పడింది.80 లక్షల మంది బడిపిల్లలకు 30 వేల చొప్పున చెల్లించాల్సి ఉన్నది. ‘అన్నదాతా సుఖీభవ’ కింద ఇరవై వేల చొప్పున రెండేళ్ల నిధులను ఈ జూన్‌లో జమ చేయవలసి ఉన్నది. అలాగే ‘ఆడబిడ్డ నిధి’ కూడా! ‘పీ–ఫోర్‌’ పథకం తెచ్చాం, డబ్బున్న వాళ్లు తృణమో పణమో ధర్మం చేస్తే ‘ఆ సంక్షేమం’తో పండగ చేసుకోవచ్చని ఇవ్వాళ కర్నూలులో చంద్రబాబు చెప్పారు.స్వయానా శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ నియోజకవర్గంలో దశాబ్దాలుగా పేదలు నివాసముంటున్న గృహాలను అధికారులు నేలమట్టం చేస్తుంటే ఇదేమి అన్యాయమని ప్రశ్నించే దిక్కు కూడా లేదు. పేద బిడ్డలకు నాణ్యమైన విద్య కోసం గత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను అటకెక్కించారు. పేద ప్రజల వ్యతిరేక విధానాలు రాజ్యమేలుతున్నాయి. ఉద్దేశపూర్వ కంగానే రైతాంగాన్ని దివాళా తీయించి రోడ్డెక్కించే పాలసీ అమలవుతున్నది. క్షయరోగంతో తీసుకుంటున్నవాడి నెత్తిన కిరీటం పెడితే అతడు వెలిగిపోతాడా? అమరావతిలో నాలుగు బంగళాలు కడితే రాష్ట్రంలోని విశాల ప్రజానీకం అభివృద్ధి చెందినట్టేనా? ... ఇటువంటి ప్రశ్నలు వేసే గొంతులు నొక్కే రాజ్యవిధానం ఇప్పుడు ఏపీలో అమలవుతున్నది.రాజ్యమే ఒక ఫ్యాక్షనిస్టు అవతారమెత్తి పరిపాలిస్తున్నది. ఎదురు మాట్లాడితే కేసులతో, కటకటాలతో బెదిరిస్తున్నది. ఈ ఫ్యాక్ష నిజం కేవలం ప్రతిపక్ష రాజకీయ నేతల్నే టార్గెట్‌ చేయడం లేదు. గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన ఐఏఎస్, ఐపీఎస్‌ అధికా రులను కూడా వేటాడుతున్నది. ఇది భారతదేశంలో ఎన్నడూ, ఎక్కడా జరగని దారుణం. ముఠా తత్వానికి పరాకాష్ఠ. ఈ మూడేళ్లూ (జమిలితో 2028లో ఎన్నికలు జరిగే అవకాశం) ఎటువంటి ప్రతిఘటనా లేకుండా అమరావతి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం జరిగిపోవాలని ఫ్యాక్షన్‌ పాలన భావిస్తున్నది. అందుకు ఢిల్లీ ఆశీస్సుల కోసం యువనేత శని వారం నాడు కుటుంబ సమేతంగా ప్రధానిని కలిశారు. తమరు అనుమతిస్తే ఏడాది ఉత్సవాల వెంటనే పట్టాభిషేకం చేసుకుంటానని అందుకు ఆశీర్వాదం కావాలని అడిగి ఉంటారని అంచనా. కుదరకపోతే ఈ నెలాఖరున కడపలో జరిగే ‘మహా నాడు’లో పార్టీ అధ్యక్ష స్థానమైనా యువగళానికి దక్కుతుందంటున్నారు. ఆ వెంటనే కూటమి ఏడాది పండుగ. ఇటువంటి పర్వదినాలు నిర్విఘ్నంగా గడిచిపోవాలనీ, ఎటువంటి నిరస నలూ వినిపించకూడదనీ ‘నిశ్శబ్దీకరణ’ కార్యక్రమాన్ని ఫ్యాక్ష నిస్టు ప్రభుత్వం దీక్షతో అమలుచేస్తున్నది.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com

Vijay Kanakamedala Talk About Bhairavam Movie8
ముగ్గురు హీరోలతో కష్టం అనుకున్నా! : దర్శకుడు విజయ్‌ కనకమేడల

‘‘చాలామంది ఫ్రీమేక్‌లు చేస్తున్నారు. కానీ... మేం అధికారికంగా రీమేక్‌ (తమిళ హిట్‌ ఫిల్మ్‌ ‘గరుడన్‌’కు తెలుగు రీమేక్‌ ‘భైరవం’) చేశాం. అయినా ప్రేక్షకులు ఏ సినిమా బాగున్నా చూస్తారు. అది రీమేకా... ఫ్రీమేకా? అని పెద్దగా ఆలోచించరు. ‘భైరవం’(Bhairavam Movie) సినిమా తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుంది. నా ప్రతి సినిమాలో ఉండే ఓ సామాజిక సందేశం ఈ సినిమాలోనూ ఉంది’’ అని అన్నారు దర్శకుడు విజయ్‌ కనకమేడల(Vijay Kanakamedala). బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్‌ మంచు, నారా రోహిత్‌ హీరోలుగా నటించిన చిత్రం ‘భైరవం’. అదితీ శంకర్, ఆనంది, దివ్యా పిళ్ళై హీరోయిన్లుగా నటించారు. విజయ్‌ కనకమేడల దర్శకత్వంలో పెన్‌ స్టూడియోస్‌ అధినేత జయంతిలాల్‌ గడా సమర్పణలో కేకే రాధామోహన్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 30న రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా విజయ్‌ కనకమేడల మాట్లాడుతూ–‘‘తమిళ సినిమా ‘గరుడన్‌’ కథ కమర్షియల్‌గానూ నాకు నచ్చింది. తెలుగులోనూ ముగ్గురు హీరోలతో చేయొచ్చనిపించింది. కథ అనుకున్నప్పుడే సాయిగారిని హీరోగా ఫైనల్‌ చేశాం. రోహిత్, మనోజ్‌గార్లను ఆ తర్వాత కలిస్తే, వారూ ఓకే చెప్పారు. కథలో ఈ ముగ్గురు హీరోలకు సమ ప్రాధాన్యత ఉంటుంది. మొదట్లో ముగ్గురు హీరోలతో సినిమా చేయడం కష్టమేమో అనిపించింది. కానీ... ఈ ముగ్గురు ఆఫ్‌ స్క్రీన్‌లోనూ మంచి మిత్రులు. దాంతో నా పని సులువైంది. ఇక ‘భైరవం’ కథ విషయానికొస్తే... ముగ్గురు స్నేహితుల ఫ్యామిలీల మధ్య జరిగే కథ. ఒక గ్రామంలో గుడి ఉంటుంది. ఆ గుడికి క్షేత్రపాలకుడు భైరవుడు. ఆ భైరవుడి రూపం నుంచి సినిమాకి ‘భైరవం’ అని టైటిల్‌ పెట్టాం. కథలో ఒక హీరోకు (బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ పాత్రను ఉద్దేశించి) చిన్నప్పట్నుంచి కాలభైరవుడు పూనతాడు. ఎందుకు? ఏమిటి? అనేది సినిమా చూస్తే తెలుస్తుంది. సినిమాలో మంచి ఎమోషన్‌ ఉంది. యాక్షన్‌ సీక్వెన్స్‌లూ అలరిస్తాయి. నా తర్వాతి సినిమా ఇంకా ఖరారు కాలేదు. నా దగ్గర చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్‌గార్లకు తగిన కథలు ఉన్నాయి’’ అని అన్నారు.

TDP Govt Cheating AP Women: Andhra Pradesh9
‘ఆడబిడ్డ నిధి’కి సమాధి

సాక్షి ప్రతినిధి కర్నూలు/ సాక్షి, అమరావతి: సూపర్‌ సిక్స్‌ హామీల్లో ప్రధానమైన ‘ఆడబిడ్డ నిధి’ని ఇవ్వలేమని, ఇవ్వా­ల్సిన అవసరం లేదని సీఎం చంద్రబాబు చేతులెత్తేశారు. అప్పుడు, ఇప్పుడు అంటూ ఏడాది పాటు ఊరిస్తూ వచ్చి తీరా మోసం చేశారు. రాష్ట్రంలో 1.80 కోట్ల మంది మహిళల ఆశలపై నీళ్లు చల్లారు. తన ఆర్థిక సంస్కరణలతో సంపద సృష్టి జరిగిపోతోందని, పేదలందరూ బాగా డబ్బులు సంపాదిస్తున్నారని.. అందువల్ల ఈ నిధి అవసరం లేదని స్పష్టం చేశారు. 2029 నాటికి పేదరికాన్ని నిర్మూలిస్తానని మరోమారు ప్రతిన­బూనారు. ఒకవేళ అప్పటికి కూడా పేదరికం నుంచి మహిళలు గట్టెక్కకపోతే పీ–4తో ఆడబిడ్డ నిధిని అనుసంధానం చేస్తానని కర్నూలు సభలో చెప్పు­కొచ్చారు. చంద్రబాబు మాటలు విన్న మహిళలు ఒకరి మోహం మరొకరు చూసుకుంటూ నిశ్చేష్టుల­య్యారు. బాబు వ్యాఖ్యలు వైరల్‌ కావడంతో శనివారం సాయంత్రం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయం చర్చనీయాంశమైంది.ఎక్కడ నలుగురు మహిళలు కలిసినా కూటమి ప్రభుత్వ మోసం గురించి చర్చించుకుంటున్నారు. స్వచ్ఛ భారత్‌లో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం కర్నూలులో పర్యటించారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సభకు వేలాదిగా డ్వాక్రా మహిళలను తరలించారు. వీరందరి సమక్షంలోనే ‘ఆడబిడ్డి నిధి’ అమలుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ చర్యలతో పేదల ఆదాయం బాగా పెరిగిందని, పేదలు కూడా బాగా డబ్బు సంపాదిస్తున్నారని చెప్పారు. 2029 నాటికి రాష్ట్రంలో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలిస్తానని చెప్పారు.ఒకవేళ అప్పటికీ పేదరికం ఉంటే అప్పుడు ఆడబిడ్డ నిధిని పీ4 (పబ్లిక్‌ ప్రైవేటు పీపుల్స్‌ పార్టనర్‌షిప్‌)కు అనుసంధానం చేసే ఆలోచన చేస్తానని చెప్పారు. ఈ లెక్కన ఆడబిడ్డ నిధి పథకం అమలు చేసేది లేదని తేల్చి చెప్పారు. ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చిన గడువు ఐదేళ్లు మాత్రమే. 2029లో తిరిగి ప్రజాక్షేత్రంలో ఎన్నికలకు వెళ్లాలి. అప్పటి వరకు ఈ పథకం అమలు చేయరంటే పూర్తిగా ఎగనామం పెట్టినట్లే. చంద్రబాబు ప్రభుత్వం కొలువు దీరి ఏడాది అవుతోంది. ఏడాదిలో ఏ ఒక్క పథకాన్ని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదు.నాడు ఇంటింటా ఈ నిధి గురించి ప్రచారం 2024 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో మహాశక్తి ఆడబిడ్డ నిధి పేరుతో ప్రతి ఇంట్లో 18 ఏళ్లు నిండి 59 ఏళ్లలోపు ఉన్న మహిళలు ఎంత మంది ఉంటే అంత మందికీ నెలకు రూ.1,500 చొప్పున ఇస్తానని చంద్రబాబు ప్రకటించారు. కూటమి మేనిఫెస్టోలో కూడా ఈ అంశాన్ని పేర్కొన్నారు. కూటమి నేతలు ఇల్లిల్లూ తిరిగి ఈ మేరకు ప్రచారం చేశారు. దీంతో ఆశపడి మహిళలు ఆ పార్టీకి ఓట్లేశారు. ఇప్పుడు ఆ హామీని అమలు చేసే అవసరమే లేదని చంద్రబాబు నిర్భీతిగా ప్రకటించేయడం పరిశీలకులను సైతం విస్తుగొలుపుతోంది.1.80 కోట్ల మందికి ఎగనామం 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు ఓటు హక్కు ఉంటుంది. రాష్ట్రంలో 2.07 కోట్ల మంది మహిళలు 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేశారు. 60 ఏళ్లు పైబడిన వారిని మినహాయిస్తే 1.80 కోట్ల మంది మిగులుతారు. వీరికి చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు ఇవ్వాలి. అంటే ఏడాదికి రూ.32,400 కోట్లు బడ్జెట్‌లో కేటాయించాలి. గత బడ్జెట్‌లో ఈ పథకం ఊసే లేదు. ఒక్క రూపాయి నిధులు కూడా కేటాయించలేదు. మొన్నటి బడ్జెట్‌లోనూ ఆ విషయమే లేదు. అంటే ఇప్పటి వరకు రెండేళ్లకు కలిపి ఒక్కొక్కరికి రూ.32 వేల చొప్పున 1.80 కోట్ల మందికి రూ.64,800 కోట్లు కేటాయించాలి. అది జరగలేదు. దీన్నిబట్టి ఆడబిడ్డ నిధి పథకం అమలు చేసేది లేదని స్పష్టమైంది. ఈ విషయాన్నే ఇప్పుడు సీఎం చంద్రబాబు బహిరంగంగా స్పష్టం చేశారు.జగన్‌ చేశారు.. చంద్రబాబు చేతులెత్తేశారు 2024 ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలనే కాంక్షతో చంద్రబాబు అలవికాని హామీలు ఇచ్చారు. అప్పటి జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఇస్తున్న ప్రతీ పథకానికి పేరు మార్చి, నిధులు పెంచి అమలు చేస్తానని నమ్మబలికారు. అమ్మఒడిని తల్లికి వందనం పేరుతో, రైతు భరోసాను అన్నదాత సుఖీభవ పేరుతో.. వైఎస్సార్‌ చేయూతను ఆడబిడ్డ నిధి పేరుతో హామీ ఇచ్చారు. ‘చేయూత’ ద్వారా జగన్‌ ప్రభుత్వం 45–59 ఏళ్ల వయస్సున్న వారికి ఏడాదికి రూ.18,750 చొప్పున ఏటా వారి ఖాతాల్లో జమ చేసి.. మాట నిలుపుకుంది. ఇదే పథకానికి ఆడబిడ్డ నిధి పేరుతో నెలకు రూ.1500 చొప్పున ఏడాదికి రూ.1,800 ఇస్తామని చంద్రబాబు చెప్పారు. అంటే జగన్‌మోహన్‌రెడ్డి కంటే రూ.750 తక్కువే ఇస్తామన్నారు. సూపర్‌ సిక్స్‌లో అన్ని పథకాల కంటే అత్యధిక బడ్జెట్‌ కేటాయించాల్సిన పథకం ఇదే. అత్యంత ఎక్కువ మంది లబ్ధిదారులు ఉన్నదీ ఈ పథకానికే. ఇలాంటి పథకాన్ని అమలు చేయకుండా చంద్రబాబు చేతులెత్తేసి రాష్ట్రంలో 1.80 కోట్ల మంది మహిళలను నిలువునా మోసం చేశారు.బలవంతంగా దుకాణాల మూసివేత కర్నూలు నగరంలో స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు వస్తుండడంతో శనివారం దుకాణాలను మూసి వేయాలని పోలీసులు హుకుం జారీ చేశారు. ఉదయం 12 గంటలకు సీఎం రానున్న నేపథ్యంలో 9 గంటలకే షాపులన్నీ మూయించారు. దీంతో సీ క్యాంపు నుంచి నంద్యాల చెక్‌పోస్టు వరకు యజమానులు దుకాణాలు మూసివేసి వెళ్లిపోయారు. గత ప్రభుత్వంలో పరదాల మాటున సీఎం పర్యటనలు అని గగ్గోలు పెట్టిన పచ్చనేతలు.. ఇప్పుడు ఏకంగా తమ పర్యటనలకు దుకాణాలనే మూసి వేస్తుండటం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది. సీఎం సభకు పలు ప్రాంతాల నుంచి పొదుపు సంఘాల మహిళలను బలవంతంగా తరలించారు. పర్యటన ఆలస్యం కావడంతో ఎండ వేడిమికి తట్టుకోలేక చాలా మంది రేకుల షేడ్లలో, బంద్‌ చేసిన షాపుల నీడలో తల దాచుకోవాల్సి వచ్చింది. కనీస ఏర్పాట్లు చేపట్టక పోవడంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.నాడు ఆడ బిడ్డ నిధి హామీ ఇలాతెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక మహాశక్తి కింద ఐదు కార్యక్రమాలు అమలు చేస్తాం. 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల మధ్య మహిళలందరికీ... ఒక్కొక్కరికీ నెలకు రూ.1500 చొప్పున ఏడాదికి రూ.18000.. ఇంట్లో ఎంత మంది మహిళలు ఉంటే అందరికీ అందజేస్తాం.– 2024 మార్చి 13వ తేదీన టీడీపీ నిర్వహించిన ‘కలలకు రెక్కలు’ నినాదంతో వెబ్‌ పోర్టల్‌లో పేర్ల నమోదు కార్యక్రమంలో చంద్రబాబు (చంద్రబాబు మాట్లాడినట్టు ‘ఈనాడు’ దినపత్రిక క్లిపింగ్‌)⇒ రాష్ట్ర ప్రజల నేటి అవసరాలను తీరుస్తూ.. రేపటి ఆకాంక్షలను సాకారం చేసేలా రూపొందించిన ఈ మేనిఫెస్టోను పక్కాగా అమలు చేస్తాం.– 2024 ఏప్రిల్‌ 30న ఉమ్మడి మేనిఫెస్టో విడుదల సందర్భంగా పవన్‌ కళ్యాణ్‌ (మే 1వ తేదీ ఈనాడు క్లిప్లింగ్‌)⇒ భవిష్యత్‌కు గ్యారెంటీ–బాబు ష్యూరిటీ నినాదంతో ‘ఆడబిడ్డ నిధి’ నుంచి 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇస్తాం. – రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ–జనసేన నాయకులు ఇంటింటా కరపత్రాల ప్రచారంబకాయిలతో కలిపి ఇవ్వాలిచంద్రబాబునాయుడు ఎన్నికల్లో గెలిచేందుకు లేనిపోని హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకున్నారు. ఇన్నాళ్లూ నిధులు లేవు.. సంపద సృష్టించే మంత్రం ఉంటే చెవిలో చెప్పండి అన్నారు. ఇప్పుడు సంపద సృష్టించేశాం అంటున్నారు. పేదలు బాగా సంపాదిస్తున్నారట! ఇంకా నాలుగేళ్లకు పేదరికం పోకపోతే ఆడబిడ్డ నిధిని పీ4కు లింక్‌ చేస్తానని చెబుతున్నారు. పీ4 అంటే ప్రైవేటు వ్యక్తులు. వారికి ప్రభుత్వ పథకంతో ఏం సంబంధం? దీన్నిబట్టి పథకానికి పూర్తిగా మంగళం పాడినట్లే. మహిళలకు ఇచ్చిన హామీ మేరకు నెలకు రూ.1500 చొప్పున ఇవ్వాలి. ఇప్పటికే ఏడాది పూర్తయినందున బకాయిలతో కలిపి ఇవ్వాలి. – వి.భారతి, ఏపీ మహిళా సమాఖ్య నగర కార్యదర్శి, కర్నూలుప్రజలు మోసపోయారని తెలుస్తోంది2029లోపు పేదరికాన్ని నిర్మూలిస్తా.. అప్పటికీ పేదరికం ఉంటే అప్పుడు పీ4కు ఆడబిడ్డి నిధిని అనుసంధానం చేస్తానని చంద్రబాబు చెప్పడం సరికాదు. అంటే 2029 లోపు ఆడబిడ్డ నిధి అమలు చేయరా? మీకు ఇచ్చిన గడువే 2028 వరకు. 2029లో ఎన్నికలకు వెళ్లాలి. ఆడబిడ్డ నిధి అనేది ప్రభుత్వ పథకం. పీ4 అనేది పారిశ్రామిక వేత్తలు, ప్రైవేటు వ్యక్తులు చేసే సాయం. ఈ రెండిటిని కలపడం అంటే ఎలా? 18 ఏళ్లు నిండిన ప్రతీ ఆడబిడ్డకు డబ్బులు ఇవ్వాలి. చంద్రబాబు మాటలు వింటుంటే మరోమారు ప్రజలు మోసపోయారని తెలుస్తోంది. – ఎం.శిరీష, ఇందిరాగాంధీ నగర్, కర్నూలుబాబువన్నీ బూటకపు హామీలేగత ఎన్నికల సమయంలో చంద్రబాబునాయుడు రాష్ట్రంలోని 18 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి కింద ఏడాదికి రూ.18,000 ఇస్తానని నమ్మించి మహిళల ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చారు. ఇప్పటి వరకు ఆ ఊసే ఎత్తడం లేదు. ఇప్పుడు పీ–4 స్కీమ్‌తో అనుసంధానం చేస్తానని చెప్పడం చూస్తే ఇదొక మోసపూరిత హామీగా మిగలనుందని అర్థమవుతోంది. అధికారంలోకి రాక ముందు ఒకలా, అధికారంలోకి వచ్చాక మరోలా చంద్రబాబునాయుడు వ్యవహరిస్తున్నారు. మహిళలందరం వచ్చే ఎన్నికల్లో తగిన రీతిలో బుద్ధి చెప్పి తీరుతాం. – ఎస్‌కే మస్తాన్‌బీ, నెల్లూరుఆడబిడ్డ నిధి ఇవ్వరా?కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ హామీ­గానే ఉండిపోయింది. ఆడబిడ్డ నిధి ఇస్తానని చెప్పడంతో లక్షలాది మంది ఆడబిడ్డలు ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నారు. సంపద సృష్టించామని చెబుతున్నారుగా.. ఇవ్వండి మరి. మొత్తం బకాయిలతో కలిపి వెంటనే ఇవ్వాలి. – కె.కృష్ణవేణి, దెందులూరు, ఏలూరు జిల్లామాట నిలుపుకోవాలిఅధికారంలోకి రాగానే ఏడాదికి రూ.18,000 చొప్పున ఆడబిడ్డ నిధి పథకం కింద ఇస్తామ­న్నారు. ఏడాదవుతున్నా దాని ఊసే లేదు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ హామీని అమలు చేయడం లేదు. సూపర్‌ సిక్స్‌ పథకాల కోసం అందరం ఎదురు చూస్తున్నాం. కూటమి నేతలు మాటలు చెబుతూ కాలయాపన చేస్తున్నారే గానీ పథకాల గురించి పట్టించుకోవడం లేదు. మాట నిలుపుకోకుండా మోసం చేయడం సరికాదు. – డాలు మనీషా, చిన్న కనుమళ్ల, ప్రకాశం జిల్లా ఈ పథకం అమలు కాదికఆడబిడ్డ నిధి పథకాన్ని ఇప్పటి వరకు అమలు చేయలేదు. ఇంకా పేదరికం ఉంటే పీ4 ద్వారా అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉంది. దీని ప్రకారం దాతలు ముందుకు వస్తే వారికి నచ్చిన వ్యక్తులకే అమలు చేస్తారు. దీని వల్ల నిజమైన లబ్ధిదారులకు అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. అసలు ఇక ఈ పథకం అమలు కాదనిపిస్తోంది. – కర్రి వెంకటలక్ష్మి, సామర్లకోట, కాకినాడ జిల్లామరోసారి మోసం చేస్తున్నారుఅధికారంలోకి వస్తే 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి కింద ఏడాదికి రూ.18,000 చొçప్పున ఇస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా పథకం అమలు చేయలేదు. ఎప్పుడు ఇస్తారో కూడా చెప్పడం లేదు. ఇది చాలా అన్యాయం. పీ4తో ఆడ బిడ్డ నిధిని అనుసంధానిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం చూస్తే మహిళలను మరోసారి మోసం చేస్తున్నారని తెలుస్తోంది. – సూరెడ్డి హైమావతి, మెంటాడ, విజయనగరం జిల్లాప్రభుత్వంపై నమ్మకం పోయింది కూటమి ప్రభుత్వం 18 నుంచి 59 ఏళ్ల మహిళలందరికీ ఏడాదికి రూ.18,000 ఇస్తామని హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చి సంవత్సరం కావస్తున్నప్పటికీ దాని గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. ఎప్పుడు ఇస్తారో చెప్పలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి మాటలతో ఈ పథకం అమలయ్యే సూచనలే కనిపించడం లేదు. ఇలా చేయడం సరికాదు. ఈ ప్రభుత్వంపై నమ్మకం పోయింది. – పి యేసమ్మ, ప్రకాష్‌ నగర్, కడప

Lanette Canen and Johan Bodin Couple Sets Sail For 15 Year Cruise10
ఆ దంపతుల యావజ్జీవితం నౌకలోనే..!

‘అద్దె కట్టాలి, కరెంట్‌ బిల్లు కట్టాలి, గ్యాస్‌ బిల్లు కట్టాలి, పాల బిల్లు కట్టాలి, రేషన్‌ ఖర్చు, మెడికల్‌ ఖర్చు– అబ్బా! ఎలారా ఫ్యామిలీ మన్‌ అందరూ మ్యానేజ్‌ చేస్తున్నారు’ అనే సినిమా డైలాగ్‌ మాదిరిగానే చాలామంది ఫ్యామిలీని రన్‌ చేయడానికి చాలా కష్టాలు పడుతుంటారు. అయితే, అమెరికాలోని లానెట్, జోహాన్‌ అనే దంపతులు ఈ కష్టాలన్నింటికీ దూరంగా బతికేయడానికి ఒక ఉపాయం ఆలోచించారు. అదే నౌకాజీవితం. వారికున్న కార్లన్నీ ఆమ్మేసి, ప్రపంచయాత్ర చేసే నౌకలో యావజ్జీవిత యాత్రను ప్రారంభించారు. ఈ నౌక మూడున్నరేళ్లల్లో 147 దేశాలకు చెందిన 425 ఓడరేవులలో ఆగుతుంది. ఇప్పటికే ఈ దంపతులు 25 దేశాలను సందర్శించారు. ఇలానే తర్వాతి పదిహేనేళ్లు కూడా ఇందులోనే గడిపేయాలని నిర్ణయించుకున్నారు. అద్భుతమైన వారి నౌకాజీవితాన్ని ‘లివింగ్‌ లైఫ్‌ ఆఫ్‌ ఏ క్రూజ్‌’ పేరుతో యూట్యూబ్‌లో వీడియో పోస్ట్‌ చేసి, ‘ఇక్కడ మేము నెలకు రూ. 2.85 లక్షలు ఖర్చు చేస్తున్నాం. ఇది మా సాధారణ ఖర్చుల కంటే చాలా తక్కువ. పైగా వంట వండటం, బట్టలు ఉతకడం, రూమ్‌ క్లీనింగ్‌ ఇలా ఏ పనీ చేయాల్సిన పనిలేదు. పడుకున్న దుప్పట్లు కూడా వారే మడతేసి పెడతారు. కేవలం ఏం కావాలంటే అది ఆర్డర్‌ పెట్టుకొని తినడం, ఎంజాయ్‌ చేయటమే మా పని. ఇదే మా అడ్రస్‌. అయితే, అప్పుడప్పుడు భూమి మీదకు వెళ్లినప్పుడు నడవడానికి కాస్త ఇబ్బంది పడుతున్నాం’ అని చెప్పారు. (చదవండి: కళ్లు చెదిరే కాంతుల వేడుక..!)

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement