Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today

Top Stories

ప్రధాన వార్తలు

Top Court To Minister Vijay Shah For Colonel Qureshi Remark1
‘మిమ్మల్ని క్షమాపణలు ఎవరు అడిగారు?’

న్యూఢిల్లీ: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ లో కీలక భూమిక పోషించిన కల్నల్ ఖురేషీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ మంత్రి, బీజేపీ నేత విజయ్ షాపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈరోజు(సోమవారం, మే 19) విచారణలో భాగంగా విజయ్‌ షా చెప్పిన క్షమాపణలపై దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది.‘క్షమాపణలు ఏమిటి..?, అవి ఏ రకమైన క్షమాపణలు. క్షమాపణలు చెబుతున్నామంటే దానికి ఎంతో కొంత అర్థం ఉండాలి. ఇది విచారణ నుంచి బయటపడటానికి కార్చే మొసలి కన్నీరా?, మీకు ఎలాంటి క్షమాపణ ఉంది?, మిమ్మల్ని కోర్టు క్షమాపణలు చెప్పమని అడిగిందా?, మరి ఎందుకు క్షమాపణలు చెబుతున్నారు?, మీరు ఆ మహిళా అధికారిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన తర్వాత మీరు నిజాయితీగా క్షమాపణలు కోరిన సందర్భం ఏమైనా ఉందా?, మరి ఇక్కడ ఎందుకు మాకు క్షమాపణలు చెబుతున్నారు?’అంటూ జస్టిస్ సూర్యకాంత్ ఆధ్వర్యంలోని ధర్మాసనం ప్రశ్నల వర్షం కురిపించింది. అదే సమయంలో విజయ్ షాపై దర్యాప్తు చేపట్టేందుకు ముగ్గురు ఐపీఎస్ అధికారులతో కూడిన స్సెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీమ్(సిట్) ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఆ సిట్ ను రేపటి(మంగళవారం) ఉదయానికల్లా ఏర్పాటు చేయాలంటూ ఆదేశాల్లో పేర్కొంది. ఒక మహిళా అధికారిని నియమించి మే 28 నాటికి నివేదిక సమర్పించాలని కోర్టు స్పష్టం చేసింది.అసలేమిటీ వివాదం? మంత్రి విజయ్‌ షా గత మంగళవారం(మే 13వ తేదీ)ఓ సాంస్కృతిక కార్యక్రమంలో ప్రసంగించారు. కల్నల్‌ సోఫియా ఖురేషీ ఉగ్రవాదుల సోదరి అనే అర్థం వచ్చేలా మాట్లాడారు. ‘‘జమ్మూకశీ్మర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదులు హిందువుల బట్టలు విప్పి, మతం నిర్ధారించుకొని కాల్చి చంపారు. ఉగ్రవాదుల బట్టలు మనం విప్పలేకపోయాం. కాబట్టి వారి మతానికి చెందిన ఒక సోదరిని(సోఫియా ఖురేషీ) పంపించాం. మా సోదరీమణులను ఉగ్రవాదులు వితంతవులుగా మార్చారు.అందుకే మీ మతంలోని ఒక సోదరి మిమ్మల్ని వివస్త్రలుగా మారుస్తుంది. పహల్గాం ఉగ్రవాద దాడి పట్ల ప్రతీకారం తీర్చుకోవడానికి ఉగ్రవాదుల సోదరిని పాకిస్తాన్‌పైకి పంపవచ్చని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిరూపించారు’’అని విజయ్‌ షా పేర్కొన్నారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆయన వ్యాఖ్యల పట్ల దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీలకు అతీతంగా మాజీ సైనికాధికారులు కూడా ఖండించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు.

TDP Leaders Attack Sakshi TV Journalist in Karempudi 2
పల్నాడులో అరాచకం .. సాక్షి జర్నలిస్ట్‌పై టీడీపీ గూండాల దాడి

పల్నాడు: కారంపూడిలో టీడీపీ నేతలు రౌడీయిజానికి పాల్పడ్డారు. గుంటూరు జిల్లా సాక్షి ప్రతినిధి అశోక్‌ వర్థన్‌పై దాడి చేశారు. అశోక్‌ వర్థన్‌పై పిడిగుద్దులతో విచక్షణారహితంగా దాడి దిగారు. కారంపూడి వైస్ ఎంపీపీ ఉప ఎన్నికకు వెళ్లకుండా వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలను టీడీపీ గుండాలు అడ్డుకున్నాయి. అయితే టీడీపీ గూండాల దాడిని చిత్రీకరించేందుకు సాక్షి జర్నలిస్ట్ అశోక్‌వర్థన్ కవరేజ్‌కు వెళ్లారు. కవరేజ్‌కు వెళ్లిన సాక్షి ప్రతినిధి అశోక్ వర్థన్‌పై టీడీపీ గూండాలు దాడి చేశాయి. దాడి చేసిన గూండాల్లో పంగులూరి అంజయ్య, చెప్పిడి రాము,గొల్ల సురేష్ యాదవ్‌,గోరంట్ల నాగేశ్వరరావు, తదితరులు ఉన్నట్లు తేలింది.

DSP shuffled across Telangana3
Telangana Police: తెలంగాణలో భారీ ఎత్తున డీఎస్పీల బదిలీలు

సాక్షి,హైదరాబాద్‌: తెలంగాణలో భారీగా ఐపీఎస్‌లు బదిలీ అయ్యారు. సోమవారం డీజీపీ జితేందర్‌ రాష్ట్ర వ్యాప్తంగా 77 మంది డీఎస్పీలు, ఏసీపీలను బదిలీ చేశారు. అలాగే మరికొంతమందికి పోస్టింగ్‌లు ఇచ్చారు. ఈ మేరకు డీజీపీ జితేందర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.బాలానగర్ ఏసీపీగా పి నరేష్ రెడ్డి, శంషాబాద్ ఏసీపీగా శ్రీకాంత్ గౌడ్, చిక్కడపల్లి ఏసీపీగా సీహెచ్ శ్రీకాంత్, మాదాపూర్ ఏసీపీగా సీహెచ్ శ్రీధర్,మేడ్చల్ ఏసీపీగా సీహెచ్ శంకర్ రెడ్డి,సంతోష్ నగర్ ఏసీపీగా సుక్ దేవ్ సింగ్, మ‌ల‌క్ పేట్ ఏసీపీగా సుబ్బరామిరెడ్డి, గాంధీనగర్ ఏసీపీగా ఏ యాదగిరి, ఎస్ఆర్ న‌గ‌ర్‌ ఏసీపీగా ఎస్వీ రాఘవేంద్రరావు, కాచిగూడ ఏసీపీగా వై హరీష్ కుమార్, చాంద్రాయణగుట్ట ఏసీపీగా ఏ సుధాకర్, కూక‌ట్‌ప‌ల్లి ఏసీపీగా ఈ రవి కిరణ్ రెడ్డి, పేట్ బషీరాబాద్ ఏసీపీగా ఏసీ బాల గంగిరెడ్డి, పంజాగుట్ట ఏసీపీగా పి మురళీకృష్ణ, మహేశ్వరం ఏసీపీగా ఎస్ జానకి రెడ్డి, షాద్ న‌గ‌ర్ ఏసీపీగా ఎస్ లక్ష్మీనారాయణ,సైదాబాద్ ఏసీపీగా సోమ వెంకటరెడ్డి, గోషామహల్ ఏసీపీగా ఎస్ సుదర్శన్, కాచిగూడ ఏసీపీగా వై వెంకట్ రెడ్డి, చిలకలగూడ ఏసీపీగా శశాంక్ రెడ్డి, మహంకాళి ఏసీపీగా ఎస్ సైదయ్య, అబిడ్స్ ఏసీపీగా పి ప్రవీణ్ కుమార్‌ల‌ను డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేయాలని ఆదేశించారు.

Rich Dad Poor Dad Author Robert Kiyosaki Sounds Financial Crisis Alarm4
ఆర్థిక సంక్షోభం రాబోతోంది!.. రాబర్ట్ కియోసాకి హెచ్చరిక

అతిపెద్ద మార్కెట్ క్రాష్ జరుగుతుందని, బంగారం ధరలు భారీగా పెరుగుతాయని చెప్పిన 'రిచ్ డాడ్ పూర్ డాడ్' పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి.. ఇప్పుడు తాజాగా రాబోయే ప్రపంచ ఆర్థిక సంక్షోభం గురించి హెచ్చరికను జారీ చేశారు. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.1998లో వాల్ స్ట్రీట్ కలిసి హెడ్జ్ ఫండ్ LTCM: లాంగ్ టర్మ్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్‌ను బెయిల్ చేసింది. 2008లో సెంట్రల్ బ్యాంకులు వాల్ స్ట్రీట్‌ను బెయిల్ అవుట్ చేయడానికి కలిసి వచ్చాయి. 2025లో, చిరకాల స్నేహితుడు జిమ్ రికార్డ్స్, సెంట్రల్ బ్యాంకులను ఎవరు బెయిల్ అవుట్ చేయబోతున్నారని అడుగుతున్నాడు?, అని రాబర్ట్ కియోసాకి సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.ప్రపంచం ప్రస్తుతం ఎదుర్కొంటున్న సంక్లిష్ట సంక్షోభానికి మాజీ అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ కారణమని ఆయన ఆరోపించారు. ప్రతి సంక్షోభం పెద్దదిగా మారుతుంది, ఎందుకంటే అవి సమస్యను ఎప్పటికీ పరిష్కరించవు. 971లో నిక్సన్ యూఎస్ డాలర్‌ను బంగారు ప్రమాణం నుంచి తొలగించినప్పుడు ప్రారంభమైన సమస్య.. 1.6 ట్రిలియన్ డాలర్ల స్టూడెంట్ లోన్ ద్వారా ప్రేరేపితమైంది.ఇదీ చదవండి: ప్రభుత్వ పథకంతో రోజుకు రూ. 10వేలు సంపాదించొచ్చా?: పీఐబీ క్లారిటీ..నేను (రాబర్ట్ కియోసాకి) 25 సంవత్సరాల క్రితం రిచ్ డాడ్ పూర్ డాడ్‌లో చెప్పినట్లుగా.. ''ధనవంతులు డబ్బు కోసం పని చేయరు'', ''పొదుపు చేసేవారు ఓడిపోతారు''. మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఉత్తమ మార్గం డబ్బును ఆదా చేయడం కాదు. రాబోయే సంక్షోభం నుంచి బయటపడటానికి ఉత్తమ మార్గం.. బంగారం, వెండి, బిట్‌కాయిన్‌లను ఆదా చేయడం మాత్రమే. ప్రత్యామ్నాయ మార్గాలు లేవని ఆయన స్పష్టం చేశారు.2012లో రిచ్ డాడ్స్ ప్రాఫసీలో నేను హెచ్చరించిన క్రాష్ ప్రారంభమైంది. దయచేసి జాగ్రత్తగా ఉండండి. బంగారం, వెండి, బిట్‌కాయిన్‌లను ఆదా చేయడం ద్వారా మిమ్మల్ని మీరు రాబోయే సంక్షోభం నుంచి కాపాడుకోండని రాబర్ట్ కియోసాకి తన సుదీర్ఘ ట్వీట్ ముగించారు.In 1998 Wall Street got together and bailed out a hedge fund LTCM: Long Term Capital Management.In 2008 the Cental Banks got together to bail out Wall Street.In 2025, long time friend, Jim Rickards is asking who is going to bail out the Central Banks?In other words each…— Robert Kiyosaki (@theRealKiyosaki) May 18, 2025

Actress Sai Dhansika Official announcement on Marriage with Vishal5
'అనుకున్నదే అయింది.. విశాల్‌తో పెళ్లిపై హీరోయిన్ అఫీషియల్ ప్రకటన'

కోలీవుడ్ స్టార్ విశాల్, హీరోయిన్ సాయి ధన్సిక పెళ్లి బంధంతో ఒక్కటి కానున్నారు. తాజాగా విశాల్ పెళ్లిపై మరోసారి రూమర్స్ రావడంతో హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలోనే హీరోయిన్‌ సాయి ధన్సిక అభిమానులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. తన మూవీ యోగిదా ఈవెంట్‌లో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. తాను విశాల్‌ను పెళ్లి చేసుకోబోతున్నట్లు వేదికపై వెల్లడించింది.అవును.. నేను, విశాల్‌ మంచి స్నేహితులం.. మేమిద్దరం కలిసి నడవబోతున్నాం.. ఈ ఏడాది ఆగస్టు 29న పెళ్లి బంధంలోకి అడుగుపెడుతున్నాం అంటూ సంతోషం వ్యక్తం చేసింది సాయి ధన్సిక. ఈ ప్రకటనతో అటు విశాల్ ఫ్యాన్స్.. ఇటు సాయి ధన్సిక అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు విశాల్‌కు అభినందనలు తెలుపుతున్నారు. కాగా.. కోలీవుడ్‌కు చెందిన సాయి ధన్సిక తెలుగులో తెరకెక్కిన షికారు, అంతిమ తీర్పు, దక్షిణ వంటి చిత్రాల్లో హీరోయిన్‌గా నటించారు.ఇటీవలే హింట్ ఇచ్చిన విశాల్..ఇటీవల నడిగర్ సంఘం బిల్డింగ్ నిర్మాణం కూడా పూర్తయింది. ఇటీవల ఓ సమావేశంలో తన పెళ్లి గురించి మాట్లాడారు. త్వరలోనే పెళ్లి చేసుకుంటానని తెలిపారు. నాది ప్రేమ వివాహమేనని.. త్వరలోనే మరిన్ని వివరాలు తెలియజేస్తానని విశాల్ వెల్లడించారు. కాగా.. విశాల్‌కు గతంలో అనీషా అనే నటితో నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. కానీ ఆ తర్వాత వీరి నిశ్చితార్థం క్యాన్సిల్ అయింది. Official Actor #Vishal is going to marry #SaiDhanshika on August 29, 2025 💍♥️pic.twitter.com/ePWoIljAuA— Sugumar Srinivasan (@Sugumar_Tweetz) May 19, 2025

IPL 2025: Lucknow Super Giants vs Sunrisers Hyderabad Live Updates6
IPL 2025: లక్నో వర్సెస్‌ ఎస్‌ఆర్‌హెచ్‌ లైవ్‌ అప్‌డేట్స్‌

IPL 2025 LSG vs DC Live Updates:దూకుడుగా ఆడుతున్న అభిషేక్‌, కిష‌న్‌..4 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ వికెట్ న‌ష్టానికి 52 ప‌రుగులు చేసింది. క్రీజులో అభిషేక్ శర్మ‌(23), ఇషాన్ కిష‌న్‌(11) ఉన్నారు.ఎస్ఆర్‌హెచ్ తొలి వికెట్ డౌన్‌..206 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఎస్ఆర్‌హెచ్ తొలి వికెట్ కోల్పోయింది. 13 ప‌రుగులు చేసిన ఆధ‌ర్వ తైడే.. విలియం ఓరూర్క్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. 2 ఓవర్లకు సన్‌రైజర్స్‌ స్కోర్‌: 23/1చెలరేగిన లక్నో బ్యాటర్లు..ఐపీఎల్‌-2025లో ఏక్నా స్టేడియం వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ బ్యాట‌ర్లు జూలు విధిల్చారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ల‌క్నో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 205 ప‌రుగుల భారీ స్కోర్ చేసింది.ల‌క్నో బ్యాట‌ర్ల‌లో మిచెల్ మార్ష్‌(39 బంతుల్లో 6 ఫోర్లు 4 సిక్స్‌ల‌తో 65), మార్‌క్ర‌మ్‌(38 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌ల‌తో 61) హాఫ్ సెంచ‌రీలతో రాణించ‌గా.. నికోల‌స్ పూరన్‌(26 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్స‌ర్‌తో 45) మెరుపులు మెరిపించాడు. ఎస్ఆర్‌హెచ్ బౌల‌ర్ల‌లో ఇషాన్ మ‌లింగ రెండు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. దూబే, హ‌ర్ష‌ల్ ప‌టేల్‌, నితీష్ కుమార్ రెడ్డి త‌లా వికెట్ సాధించారు.లక్నో మూడో వికెట్‌ డౌన్‌..ఐడైన్‌ మార్‌క్రమ్‌ రూపంలో లక్నో మూడో వికెట్‌ కోల్పోయింది. 61 పరుగులు చేసిన మార్‌క్రమ్‌.. హర్షల్‌ పటేల్‌ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డయ్యాడు. 17 ఓవర్లు ముగిసే సరికి లక్నో.. 3 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది.15 ఓవ‌ర్ల‌కు ల‌క్నో స్కోర్‌: 146/215 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ రెండు వికెట్ల న‌ష్టానికి 150 ప‌రుగులు చేసింది. క్రీజులో మార్‌క్ర‌మ్‌(53), నికోల‌స్ పూర‌న్‌(16) ఉన్నారు.ల‌క్నో రెండో వికెట్ డౌన్‌..రిష‌బ్ పంత్ రూపంలో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ రెండో వికెట్ కోల్పోయింది. 7 ప‌రుగులు చేసిన పంత్‌.. ఇషాన్ మ‌లింగ బౌలింగ్‌లో పెవిలియ‌న్‌కు చేరాడు. 12 ఓవ‌ర్ల‌కు ల‌క్నో రెండు వికెట్ల న‌ష్టానికి 124 ప‌రుగులు చేసింది. క్రీజులో ఐడైన్ మార‌క్ర‌మ్‌(49), రిష‌బ్ పంత్‌(7) ఉన్నారు.ల‌క్నో తొలి వికెట్ డౌన్.. మార్ష్ ఔట్‌మిచెల్ మార్ష్ రూపంలో ల‌క్నో తొలి వికెట్ కోల్పోయింది. 65 ప‌రుగులు చేసిన మార్ష్‌.. హ‌ర్ష్ దూబే బౌలింగ్‌లో ఔట‌య్యాడు. 11 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ల‌క్నో వికెట్ న‌ష్టానికి 118 ప‌రుగులు చేసింది. క్రీజులో రిష‌బ్ పంత్‌(2), మార్‌క్ర‌మ్‌(48) ఉన్నారు.6 ఓవర్లకు లక్నో స్కోర్‌: 69/06 ఓవర్లు ముగిసే సరికి లక్నో వికెట్ నష్టపోకుండా 69 పరుగులు చేసింది. క్రీజులో మార్‌క్రమ్‌(26), మార్ష్‌(41) ఉన్నారు.దూకుడుగా ఆడుతున్న మార్ష్‌..టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ దూకుడుగా ఆడుతోంది. 2 ఓవర్లు ముగిసే సరికి లక్నో వికెట్ నష్టపోకుండా 19 పరుగులు చేసింది. క్రీజులో మార్ష్‌(18), మార్‌క్రమ్‌(1) ఉన్నారు.ఐపీఎల్‌-2025లో భాగంగా ఏక్నా స్టేడియం వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌, ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ జ‌ట్లు త‌ల‌ప‌డతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఎస్ఆర్‌హెచ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఎస్ఆర్‌హెచ్‌తో మ్యాచ్ ల‌క్నోకు చాలా కీల‌కం. ప్లే ఆఫ్స్ రేసులో నిల‌వాలంటే ఈ మ్యాచ్‌లో పంత్ టీమ్ త‌ప్ప‌క గెల‌వాల్సిందే. మ‌రోవైపు ఇప్ప‌టికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్ర‌మించిన ఆరెంజ్ ఆర్మీ.. త‌మ ఆఖ‌రి మ్యాచ్‌లలో గెలిచి ప‌రువు నెల‌బెట్టుకోవాల‌ని భావిస్తోంది. ఈ మ్యాచ్‌కు ఎస్‌ఆర్‌హెచ్‌ స్టార్‌ ప్లేయర్‌ ట్రావిస్‌ హెడ్‌ కరోనా కారణంగా దూరమయ్యాడు.తుది జట్లులక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్(కెప్టెన్‌), ఆయుష్ బదోని, అబ్దుల్ సమద్, ఆకాష్ దీప్, అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్, దిగ్వేష్ సింగ్ రాఠీ, విలియం ఒరూర్కేసన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్‌), నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, కమిందు మెండిస్, పాట్ కమిన్స్(కెప్టెన్‌), హర్షల్ పటేల్, హర్ష్ దూబే, జీషన్ అన్సారీ, ఎషాన్ మలింగ

YSRCP Win Municipal And MPP Seats In AP7
వైఎస్సార్‌సీపీదే విజయం.. మున్సిపల్ చైర్‌పర్సన్‌ ఎన్నిక ఏకగ్రీవం

సాక్షి, కర్నూలు: కర్నూలులో కూటమి కుట్రలను పటాపంచలు చేశారు వైఎస్సార్‌సీపీ నేతలు. ఆదోని మున్సిపల్ చైర్ పర్సన్ పీఠాన్ని వైఎస్సార్‌సీపీ నిలబెట్టుకుంది. ఆదోని మున్సిపల్ చైర్ పర్సన్‌గా సీహెచ్ లోకేశ్వరి ఏకగ్రీవంగా ఎన్నిక‍య్యారు.వివరాల ప్రకారం.. ఆదోని మున్సిపల్ చైర్ పర్సన్‌ ఎన్నికలో కూటమి కుట్రలు ఫలించలేదు. ఈ క్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్‌గా వైఎస్సార్‌సీపీ సీహెచ్ లోకేశ్వరి ఏకగ్రీవంగా ఎన్నిక‍య్యారు. కూటమి నేతల ప్రలోభాలకు వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు తలొగ్గలేదు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌పై నమ్మకంతో కౌన్సిలర్లు లోకేశ్వరికి అండగా నిలిచారు. దీంతో, ఎన్నికల అధికారి సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్.. లోకేశ్వరి ఏకగీవ్రంగా ఎన్నికైనట్టు ప్రకటించారు. పశ్చిమగోదావరి జిల్లా..మరోవైపు.. పాలకొల్లు నియోజకవర్గం యలమంచిలి ఎంపీపీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించింది. ఎంపీపీ స్థానాన్ని కైవసం చేసుకుంది. మండల పరిషత్ అధ్యక్షురాలుగా ఇనుకొండ ధనలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంత్రి రామానాయుడు ఇలాకలో నాటకీయ పరిణామాల మధ్య ఎంపీపీ స్థానాన్ని వైఎస్సార్‌సీపీ దక్కించుకుంది. కూటమి నేతల కుట్రలకు, ప్రలోభాలకు వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలు లొంగలేదు. వైఎస్సార్‌సీపీకి చెందిన 12 మంది ఎంపీటీసీ సభ్యులతో పూర్తి మెజార్టీతో ఏకగ్రీవంగా ధనలక్ష్మి ఎన్నికయ్యారు.శ్రీ సత్యసాయి జిల్లా..రామగిరి ఎంపీపీ ఎన్నికలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. రామగిరి ఎంపీపీ స్థానం మహిళకు రిజర్వ్ కావడంతో టీడీపీకి మహిళా ఎంపీటీసీల మద్దతు దొరకలేదు. రామగిరిలో మొత్తం 10 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. వైఎస్సార్‌సీపీకి-8, టీడీపీకి-1 స్థానాలు ఉన్నాయి. ఒక్క స్థానం ఖాళీగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రలోభాలతో ఇద్దరు వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలను టీడీపీ పార్టీలో చేర్చుకుంది. మరోవైపు.. టీడీపీలో చేరడం ఇష్టంలేక పేరూర్‌ ఎంపీటీసీ భారతి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈరోజు జరిగిన రామగిరి ఎంపీపీ ఉప ఎన్నిక జరగ్గా.. ముగ్గురు పురుష ఎంపీటీసీలు హాజరయ్యారు. మహిళా ఎంపీటీసీల నుంచి నామినేషన్ రాకపోవడంతో రామగిరి ఎంపీపీ ఎన్నిక నిరవధికంగా వాయిదా పడింది. రామగిరి ఎంపీపీ ఎన్నికలను వైఎస్సార్‌సీపీ బహిష్కరించింది. టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రలోభాలకు మహిళా ఎంపీటీసీలు లొంగలేదు.

Dont Bring Local Politics Sharad Pawar To Sanjay Raut8
‘బ్రదర్.. ఇది ఉగ్రవాదంపై పోరు.. లోకల్ పాలిటిక్స్ పక్కనపెట్టు’

పుణె: ఉగ్రవాద మూకలను తన దేశంలోనే పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ దుశ్చర్యలను ఎండగట్టే క్రమంలో భారత ప్రజాప్రతినిధులను విదేశాలకు పంపే ప్రక్రియను ‘ ఇండియా కూటమి’ బాయ్ కాట్ చేయాలంటూ శివసేన(యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ధ్వజమెత్తారు. ఆదివారం సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యాలపై శరద్ పవార్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇక్కడ సంజయ్‌ రౌత్‌కు తన వ్యక్తిగత అభిప్రాయాన్ని చెప్పే హక్కు ఉందంటూనే బ్రెయిన్‌ వాష్‌ చేశారు శరద్‌ పవార్‌. అంతర్జాతీయ అంశాలకు స్థానిక రాజకీయాలను జత చేయొద్దంటూ క్లాస్ పీకారు. ఇది జాతీయంగా పరిష్కరించుకునే అంశం కాదని, అంతర్జాతీయ సమస్యను ఎలా చూడాలో అలానే చూడాలంటూ హితవు పలికారు శరద్ పవార్. ఇక్కడ తాను గతంలో ఒక ప్రతినిధి బృందంలో సభ్యుడిగా ఉన్న సంగతిని శరద్ పవార్ గుర్తు చేసుకున్నారు. పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో బీజేపీ నాయకుడు అటల్ బిహారీ వాజ్ పేయ్ నేతృత్వంలో ఏర్పాటైన ప్రతినిధి బృందంలో సభ్యునిగా ఉన్న సంగతిని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.బరామతిలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో శరద్ పవార్ మాట్లాడుతూ.. ‘ ఎప్పుడైనా అంతర్జాతీయ అంశాలపై దృష్టి సారించాల్సిన సమయంలో అంతా ఏకతాటిపై ఉండాలి. అంతేకానీ ఇక్కడ లోకల్ పాలిటిక్స్ చేయకూడదు. అంతర్జాతీయ వేదికపై భారత్ వాణి వినిపించేందుకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం కొంతమంది ప్రజాప్రతినిధుల్ని ఎంపిక చేసింది. పాకిస్తాన్ ఉగ్ర చర్యలను ప్రపంచ దేశాలకు తెలిపే బాధ్యతను ఆయా ప్రజాప్రతినిధులపై ఉంచింది. ఇలా ఒక్కొక్కరికి ఒక్కో దేశాన్ని అప్పగిస్తూ వస్తోంది. భారత్ నినాదం ఒక్కటే.. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమనేది మనం చెప్పాల్సింది. పాకిస్తాన్‌ తీరును అంతర్జాతీయ వేదికలపై ఎండగట్టడమే మన ముందున్న లక్ష్యం. అటువంటి తరుణంలో దీనిని బాయ్ కాట్ చేద్దామంటూ సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలు ఎంతమాత్రం సరికావు’ అంటూ శరద్ పవార్ క్లియర్ మెస్సేజ్ పంపారు.

Reasion Behind Gulzar House Tragedy Incident9
గుల్జార్‌హౌస్‌ అగ్నిప్రమాదానికి అసలు కారణం ఇదే.. తేల్చేసిన అధికారులు

సాక్షి, హైదరాబాద్: గుల్జార్‌హౌస్‌ అగ్నిప్రమాదానికి ఏసీ కంప్రెషర్ పేలుడే కారణమని విచారణ అధికారులు నిర్దారించారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న ఏసీలోని కంప్రెషర్లు పేలడంతో ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. కొన్ని రోజులుగా నిరంతరాయంగా ఏసీలను వినియోగించడంతో ఘటన చోటు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. గుల్జార్‌హౌస్‌ ప్రమాదానికి గల కారణాల్ని వెల్లడించారు. అధికారుల తెలిపిన వివరాల మేరకు.. గుల్జార్‌హౌస్‌ ప్రమాదానికి కారణంగా ఏసీ కంప్రెషర్లే. ఏసీ కంప్రెషర్లు పేలి పక్కనే ఉన్న ఎలక్ట్రికల్ మీటర్లకు మంటలు వ్యాపించాయి. ఫలితంగా గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉన్న పలు ఏసీల్లో ప్రమాదం జరగడంతో దట్టంగా పొగకమ్ముకుంది. ఫస్ట్‌, సెకండ్ ఫ్లోర్‌లో దట్టంగా పొగకమ్ముకోవడంతో కుటుంసభ్యులు బయటకు వెళ్లేందుకు ప్రయత్నించారు. టెర్రస్‌ నుంచి బయటకు రాలేక కిందకు వచ్చేందుకు ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో భాగంగా మెట్ల మార్గం వైపు రావడంతో మంటలు భారీగా ఎగసిపడ్డాయి. దీంతో ప్రాణభయంతో లోపలే ఉండిపోయారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వచ్చే సరికే అపస్మారస్థితిలోకి వెళ్లారు’ అని చెప్పారు. కాగా, గుల్జార్‌హౌస్ అగ్నిప్రమాదంలో 17 మంది మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి.

Kommineni Srinivasa Rao Comments on Yellow Media 10
బోల్తా కొట్టిన ఎల్లోపిట్ట!

ఎల్లో మీడియా శోకాలు పెడుతోంది. అరచి గీపెట్టి మరీ రోదిస్తోంది. దాని బాధల్లా ఒకటే.. చంద్రబాబు హయాంలో ప్రభుత్వ ఆదాయం బాగానే ఉన్నా సాక్షి మీడియా దాన్ని తక్కువగా చేసి రాసిందీ అని! జగన్‌ ప్రభుత్వంలో కంటే ఆదాయం ఇప్పుడు ఎక్కువే ఉంటే ఆ మాట నేరుగా చంద్రబాబే ఢంకా బజాయించి మరీ చెప్పుకునేవాడు. ఆయన ఆ పని చేయలేదు కానీ.. ఆయన తరఫున ఆంధ్రజ్యోతి యజమాని రాధాకృష్ణ మాత్రం తెగ బాధపడిపోతున్నారు. ఆయనగారి పత్రికలో ఈ మధ్యే ‘సంపదపై శోకాలు’ అంటూ ‘జగన్ పత్రిక రోత రాతలు’ అన్న శీర్షికతో ఒక కథనం ప్రచురితమైంది.పచ్చి అబద్ధాలతో నిండిన ఇలాంటి కథనాలు నిత్యం వండి వారుస్తున్నందుకే.. వైసీపీ నేతలు.. సామాన్యులు చాలా మంది ఈ పత్రికను చంద్రజ్యోతిగాను, బూతు పత్రికగాను విమర్శిస్తుంటారు.రాధాకృష్ణ కాని, ఆయన సంపాదక బృందం కాని ఒకే ఒక్క ప్రశ్నకు సమాధానం చెబితే అందరం ఆయన కథనాలు సరైనవేనని ఒప్పేసుకుందాం. ఆ ప్రశ్న ఏమిటంటే... ఎన్నికలకు ముందు చంద్రబాబు చెప్పిందేమి? ఆ తరువాత ఏడాది కాలంలో ఆయన చేసిందేమిటి? ‘‘అప్పులు చేయబోను’’, ‘‘సంపద సృష్టి నాకు తెలుసు’’, ‘‘సూపర్‌ సిక్స్‌తోపాటు ఎన్నికల హామీలన్నీ అమలు చేసి చూపిస్తా’’ అని ఎన్నికల ముందుకు ఒకటికి పదిసార్లు హామీ ఇచ్చిన ఆ పెద్దమనిషి అధికారంలోకి వచ్చిన తరువాత.. ‘‘గల్లా పెట్టె ఖాళీగా కనబడుస్తా ఉంది’’, ‘‘అప్పులు పుట్టడం లేదు’’ ‘‘సంపద సృష్టించే మార్గముంటే చెవిలో చెప్పండి’’. ‘‘అప్పులు చేసి సంక్షేమానికి ఖర్చు చేయలేను’’ అని ప్లేటు ఫిరాయించిన విషయం తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయాలే. రాధాకృష్ణ భాషలో వీటిని శోకాలు అంటారా? లేదా? ఆయన రాసినట్లే చంద్రబాబు హయాంలో ఆదాయం ఎక్కువ ఉందని కాసేపు అనుకుందాం. అలాంటప్పుడు చంద్రబాబు ఖజానా ఖాళీగా కనబడుతోంది అని ఎందుకు అన్నట్టు? పైగా.. అప్పుల కోసం ఏకంగా ఖజానానే తనఖా పెట్టి చరిత్ర సృష్టించడం ఎందుకు? అప్పులు పుట్టడం లేదన్న బాబు మాట కూడా నిజమే అయితే ఏడాది కాలంలో రూ.1.5 లక్షల కోట్ల రుణం చేసిన రికార్డు మాటేమిటి? జగన్‌ హయాంలో ఆదాయం తక్కువగా ఉందనుకున్నా.. సంక్షేమ పథకాలన్నీ ఐదేళ్లూ చక్కగా అమలు చేశారు కదా? దానికి సమాధానం ఏమిటి? ఓడరేవులు, మెడికల్‌ కాలేజీలు, గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్‌ క్లినిక్స్‌, పాఠశాలల్లో ‘నాడు-నేడు’’ ఇలా బోలెడంత అభివృద్ధినికి ప్రజల కళ్లముందే నిలిపారు కదా? అయినా సరే.. జగన్‌ ఎప్పుడు బీద అరుపులు అరవలేదే? ఒకపక్క చంద్రబాబేమో ఖజానా ఖాళీ అంటారు.. ఇంకోపక్క రాధాకృష్ణ ఆదాయం భేష్‌ అంటారు. ఏది నిజం? ఈ ప్రశ్నకు సమాధానం కాగ్‌ లెక్కల్లో వెతుకుదాం.. జగన్‌ పాలన చివరి ఏడాది రాష్ట్ర రెవెన్యూ రాబడులు మొత్తం సుమారు రూ.1.74 లక్షల కోట్లు. ఆ తరువాత చంద్రబాబు (Chandrababu) పాలనలో తొలి ఏడాది (2024-2025) రూ.1.68 లక్షల కోట్లు! అయితే... ఆంధ్రజ్యోతి 2014-15కు సంబంధించిన రెవెన్యూ లోటు మొత్తాన్ని కేంద్రం 2023-24లో ఇవ్వడం వల్ల జగన్‌ హయాంలోని ఆదాయం ఎక్కువగా కనిపిస్తోందని అంటోంది. ఇదే నిజం అనుకుందాం. అప్పుడు కూడా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను సమర్థంగా రాబట్టడంలో జగన్‌ ప్రభుత్వం విజయం సాధించినట్లే అవుతుంది కదా? ఐదేళ్లు కేంద్రంలో భాగస్వామిగా ఉన్నా పది వేల కోట్ల రూపాయల మొత్తం కూడా కేంద్రం నుంచి రాబట్టుకోలేని అసహాయ స్థితిలో చంద్రబాబు ఉన్నట్లు రాధాకృష్ణ ఒప్పుకున్నట్లేనా? జగన్‌ ప్రభుత్వం 12వ ఆర్థిక సంఘం నిధులను కూడా రాబట్టుకుందని ఆంధ్రజ్యోతి చెబుతోంది. ఇది కూడా జగన్ గొప్పదనమే అవుతుంది కదా! ఈ స్థాయిలో కేంద్రం నుంచి చంద్రబాబు నిధులు ఎందుకు తెచ్చుకోలేకపోతున్నారు? ఈ రెండింటినీ మినహాయిస్తే జగన్ హయాం చివరి ఏడాది వచ్చిన రాబడి రూ.1.61 లక్షల కోట్లేనని, చంద్రబాబు తన తొలి ఏడాదిలో ఆదాయం రూ.1.68 లక్షల కోట్లు అని ఈ పత్రిక తెలిపింది.అలాంటప్పుడు చంద్రబాబు పదే, పదే ఎందుకు డబ్బులు లేవని వాపోతున్నారు? రూ.1.5 లక్షల కోట్ల అప్పు ఎందుకు చేశారు? ఈ మొత్తాన్ని ఎందుకోసం ఖర్చు చేశారు? జగన్ టైమ్ నాటికన్నా పదివేల కోట్లు ఎక్కువగా పన్ను ఆదాయం చంద్రబాబు ప్రభుత్వం పొందిందని ఎల్లో మీడియా చెబుతోంది. ఇదే నిజమైతే బాబు బీద అరుపుల మతలబు ఏమిటి? జీఎస్టీ వసూళ్లు రూ.2850 కోట్లు, ఎక్సైజ్ ఆదాయం రూ.3900 కోట్లు, కేంద్ర పన్నుల వాట రూ.ఐదు వేల కోట్ల మేర ఎక్కువ వచ్చిందని ఈ పత్రిక రాసింది. ఇంత భారీ ఎత్తున ఆదాయం వచ్చినా ఎందుకు ఒక్క స్కీమ్ అమలు చేయడం లేదు?జగన్‌ ప్రభుత్వం చివరి సంవత్సరంలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా రూ.9542 కోట్లు వచ్చినట్లు కాగ్‌ లెక్కలు చెబుతున్నాయి. చంద్రబాబు పాలనలో తొలి ఏడాది ఈ మొత్తం రూ.8837 కోట్లే! దీని అర్థం బాబు హయాంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం తగ్గినట్లే కదా? అమ్మకం పన్ను, పన్నేతర ఆదాయం మొదలైన వాటి పరిస్థితి కూడా ఇలాగే ఉందని కాగ్ గణాంకాలు చెబుతున్నాయి. జగన్‌ హయాంతో పోలిస్తే ఇప్పుడు రెవెన్యూ, ద్రవ్య లోటులు రెండూ సుమారు రూ.20 వేల కోట్లు ఎక్కువన్నది కూడా వాస్తవమే కదా? రాధాకృష్ణ ఏదో మసిపూసి మారేడుకాయ చేద్దామని ప్రయత్నించి సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లుగా ఉంది. ఆయన రాసింది వాస్తవమైతే చంద్రబాబు అబద్దాలు చెబుతున్నట్లు అవుతుంది. పైగా ఆదాయం బాగున్నా.. రూ.1.5 లక్షల కోట్లు అప్పు తెచ్చినా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలేవీ అమలు చేయకుండా ప్రజలను మోసం చేసినట్టు అవుతుంది. ఖజానా ఖాళీ అన్న చంద్రబాబు మాటలు నిజమైతే ఈ జాకీ పత్రిక రాసింది అవాస్తవమని అంగీకరించవలసి ఉంటుంది. ఏతావాతా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ శోకాలకు చంద్రబాబు సర్కారే బద్నాం అయ్యింది. కూటమి ప్రభుత్వానికి భజన చేద్దామని అనుకుని ఇలాంటి పిచ్చి రాతలు రాసి చంద్రబాబునే డిఫెన్స్ లో నెట్టేసినట్లయింది. ఆ విషయం అర్థమైందా?- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement