Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Kommineni Srinivasa Rao Comments on Yellow Media 1
బోల్తా కొట్టిన ఎల్లోపిట్ట!

ఎల్లో మీడియా శోకాలు పెడుతోంది. అరచి గీపెట్టి మరీ రోదిస్తోంది. దాని బాధల్లా ఒకటే.. చంద్రబాబు హయాంలో ప్రభుత్వ ఆదాయం బాగానే ఉన్నా సాక్షి మీడియా దాన్ని తక్కువగా చేసి రాసిందీ అని! జగన్‌ ప్రభుత్వంలో కంటే ఆదాయం ఇప్పుడు ఎక్కువే ఉంటే ఆ మాట నేరుగా చంద్రబాబే ఢంకా బజాయించి మరీ చెప్పుకునేవాడు. ఆయన ఆ పని చేయలేదు కానీ.. ఆయన తరఫున ఆంధ్రజ్యోతి యజమాని రాధాకృష్ణ మాత్రం తెగ బాధపడిపోతున్నారు. ఆయనగారి పత్రికలో ఈ మధ్యే ‘సంపదపై శోకాలు’ అంటూ ‘జగన్ పత్రిక రోత రాతలు’ అన్న శీర్షికతో ఒక కథనం ప్రచురితమైంది.పచ్చి అబద్ధాలతో నిండిన ఇలాంటి కథనాలు నిత్యం వండి వారుస్తున్నందుకే.. వైసీపీ నేతలు.. సామాన్యులు చాలా మంది ఈ పత్రికను చంద్రజ్యోతిగాను, బూతు పత్రికగాను విమర్శిస్తుంటారు.రాధాకృష్ణ కాని, ఆయన సంపాదక బృందం కాని ఒకే ఒక్క ప్రశ్నకు సమాధానం చెబితే అందరం ఆయన కథనాలు సరైనవేనని ఒప్పేసుకుందాం. ఆ ప్రశ్న ఏమిటంటే... ఎన్నికలకు ముందు చంద్రబాబు చెప్పిందేమి? ఆ తరువాత ఏడాది కాలంలో ఆయన చేసిందేమిటి? ‘‘అప్పులు చేయబోను’’, ‘‘సంపద సృష్టి నాకు తెలుసు’’, ‘‘సూపర్‌ సిక్స్‌తోపాటు ఎన్నికల హామీలన్నీ అమలు చేసి చూపిస్తా’’ అని ఎన్నికల ముందుకు ఒకటికి పదిసార్లు హామీ ఇచ్చిన ఆ పెద్దమనిషి అధికారంలోకి వచ్చిన తరువాత.. ‘‘గల్లా పెట్టె ఖాళీగా కనబడుస్తా ఉంది’’, ‘‘అప్పులు పుట్టడం లేదు’’ ‘‘సంపద సృష్టించే మార్గముంటే చెవిలో చెప్పండి’’. ‘‘అప్పులు చేసి సంక్షేమానికి ఖర్చు చేయలేను’’ అని ప్లేటు ఫిరాయించిన విషయం తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయాలే. రాధాకృష్ణ భాషలో వీటిని శోకాలు అంటారా? లేదా? ఆయన రాసినట్లే చంద్రబాబు హయాంలో ఆదాయం ఎక్కువ ఉందని కాసేపు అనుకుందాం. అలాంటప్పుడు చంద్రబాబు ఖజానా ఖాళీగా కనబడుతోంది అని ఎందుకు అన్నట్టు? పైగా.. అప్పుల కోసం ఏకంగా ఖజానానే తనఖా పెట్టి చరిత్ర సృష్టించడం ఎందుకు? అప్పులు పుట్టడం లేదన్న బాబు మాట కూడా నిజమే అయితే ఏడాది కాలంలో రూ.1.5 లక్షల కోట్ల రుణం చేసిన రికార్డు మాటేమిటి? జగన్‌ హయాంలో ఆదాయం తక్కువగా ఉందనుకున్నా.. సంక్షేమ పథకాలన్నీ ఐదేళ్లూ చక్కగా అమలు చేశారు కదా? దానికి సమాధానం ఏమిటి? ఓడరేవులు, మెడికల్‌ కాలేజీలు, గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్‌ క్లినిక్స్‌, పాఠశాలల్లో ‘నాడు-నేడు’’ ఇలా బోలెడంత అభివృద్ధినికి ప్రజల కళ్లముందే నిలిపారు కదా? అయినా సరే.. జగన్‌ ఎప్పుడు బీద అరుపులు అరవలేదే? ఒకపక్క చంద్రబాబేమో ఖజానా ఖాళీ అంటారు.. ఇంకోపక్క రాధాకృష్ణ ఆదాయబ భేష్‌ అంటారు. ఏది నిజం? ఈ ప్రశ్నకు సమాధానం కాగ్‌ లెక్కల్లో వెతుకుదాం...జగన్‌ పాలన చివరి ఏడాది రాష్ట్ర రెవెన్యూ రాబడులు మొత్తం సుమారు రూ.1.74 లక్షల కోట్లు. ఆ తరువాత చంద్రబాబు పాలనలో తొలి ఏడాది (2024-2025) రూ.1.68 లక్షల కోట్లు! అయితే... ఆంధ్రజ్యోతి 2014-15కు సంబంధించిన రెవెన్యూ లోటు మొత్తాన్ని కేంద్రం 2023-24లో ఇవ్వడం వల్ల జగన్‌ హయాంలోని ఆదాయం ఎక్కువగా కనిపిస్తోందని అంటోంది. ఇదే నిజం అనుకుందాం. అప్పుడు కూడా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను సమర్థంగా రాబట్టడంలో జగన్‌ ప్రభుత్వం విజయం సాధించినట్లే అవుతుంది కదా? ఐదేళ్లు కేంద్రంలో భాగస్వామిగా ఉన్నా పది వేల కోట్ల రూపాయల మొత్తం కూడా కేంద్రం నుంచి రాబట్టుకోలేని అసహాయ స్థితిలో చంద్రబాబు ఉన్నట్లు రాధాకృష్ణ ఒప్పుకున్నట్లేనా? జగన్‌ ప్రభుత్వం 12వ ఆర్థిక సంఘం నిధులను కూడా రాబట్టుకుందని ఆంధ్రజ్యోతి చెబుతోంది. ఇది కూడా జగన్ గొప్పదనమే అవుతుంది కదా! ఈ స్థాయిలో కేంద్రం నుంచి చంద్రబాబు నిధులు ఎందుకు తెచ్చుకోలేకపోతున్నారు? ఈ రెండింటినీ మినహాయిస్తే జగన్ హయాం చివరి ఏడాది వచ్చిన రాబడి రూ.1.61 లక్షల కోట్లేనని, చంద్రబాబు తన తొలి ఏడాదిలో ఆదాయం రూ.1.68 లక్షల కోట్లు అని ఈ పత్రిక తెలిపింది. అలాంటప్పుడు చంద్రబాబు పదే, పదే ఎందుకు డబ్బులు లేవని వాపోతున్నారు? రూ.1.5 లక్షల కోట్ల అప్పు ఎందుకు చేశారు? ఈ మొత్తాన్ని ఎందుకోసం ఖర్చు చేశారు? జగన్ టైమ్ నాటికన్నా పదివేల కోట్లు ఎక్కువగా పన్ను ఆదాయం చంద్రబాబు ప్రభుత్వం పొందిందని ఎల్లో మీడియా చెబుతోంది. ఇదే నిజమైతే బాబు బీద అరుపుల మతలబు ఏమిటి? జీఎస్టీ వసూళ్లు రూ.2850 కోట్లు, ఎక్సైజ్ ఆదాయం రూ.3900 కోట్లు, కేంద్ర పన్నుల వాట రూ.ఐదు వేల కోట్ల మేర ఎక్కువ వచ్చిందని ఈ పత్రిక రాసింది. ఇంత భారీ ఎత్తున ఆదాయం వచ్చినా ఎందుకు ఒక్క స్కీమ్ ఎందుకు అమలు చేయడం లేదు.జగన్‌ ప్రభుత్వం చివరి సంవత్సరంలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా రూ.9542 కోట్లు వచ్చినట్లు కాగ్‌ లెక్కలు చెబుతున్నాయి. చంద్రబాబు పాలనలో తొలి ఏడాది ఈ మొత్తం రూ.8837 కోట్లే! దీని అర్థం బాబు హయాంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం తగ్గినట్లే కదా? అమ్మకం పన్ను, పన్నేతర ఆదాయం మొదలైన వాటి పరిస్థితి కూడా ఇలాగే ఉందని కాగ్ గణాంకాలు చెబుతున్నాయి. జగన్‌ హయాంతో పోలిస్తే ఇప్పుడు రెవెన్యూ, ద్రవ్య లోటులు రెండూ సుమారు రూ.20 వేల కోట్లు ఎక్కువన్నది కూడా వాస్తవమే కదా? రాధాకృష్ణ ఏదో మసిపూసి మారేడుకాయ చేద్దామని ప్రయత్నించి సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లుగా ఉంది. ఆయన రాసింది వాస్తవమైతే చంద్రబాబు అబద్దాలు చెబుతున్నట్లు అవుతుంది. పైగా ఆదాయం బాగున్నా.. రూ.1.5 లక్షల కోట్లు అప్పు తెచ్చినా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలేవీ అమలు చేయకుండా ప్రజలను మోసం చేసినట్టు అవుతుంది. ఖజానా ఖాళీ అన్న చంద్రబాబు మాటలు నిజమైతే ఈ జాకీ పత్రిక రాసింది అవాస్తవమని అంగీకరించవలసి ఉంటుంది. ఏతావాతా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ శోకాలకు చంద్రబాబు సర్కారే బద్నాం అయ్యింది. కూటమి ప్రభుత్వానికిభజన చేద్దామని అనుకుని ఇలాంటి పిచ్చి రాతలు రాసి చంద్రబాబునే డిఫెన్స్ లో నెట్టేసినట్లయింది. ఆ విషయం అర్థమైందా?కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత

YSRCP Win Municipal And MPP Seats In AP2
వైఎస్సార్‌సీపీదే విజయం.. మున్సిపల్ చైర్‌పర్సన్‌ ఎన్నిక ఏకగ్రీవం

సాక్షి, కర్నూలు: కర్నూలులో కూటమి కుట్రలను పటాపంచలు చేశారు వైఎస్సార్‌సీపీ నేతలు. ఆదోని మున్సిపల్ చైర్ పర్సన్ పీఠాన్ని వైఎస్సార్‌సీపీ నిలబెట్టుకుంది. ఆదోని మున్సిపల్ చైర్ పర్సన్‌గా సీహెచ్ లోకేశ్వరి ఏకగ్రీవంగా ఎన్నిక‍య్యారు.వివరాల ప్రకారం.. ఆదోని మున్సిపల్ చైర్ పర్సన్‌ ఎన్నికలో కూటమి కుట్రలు ఫలించలేదు. ఈ క్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్‌గా వైఎస్సార్‌సీపీ సీహెచ్ లోకేశ్వరి ఏకగ్రీవంగా ఎన్నిక‍య్యారు. కూటమి నేతల ప్రలోభాలకు వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు తలొగ్గలేదు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌పై నమ్మకంతో కౌన్సిలర్లు లోకేశ్వరికి అండగా నిలిచారు. దీంతో, ఎన్నికల అధికారి సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్.. లోకేశ్వరి ఏకగీవ్రంగా ఎన్నికైనట్టు ప్రకటించారు. పశ్చిమగోదావరి జిల్లా..మరోవైపు.. పాలకొల్లు నియోజకవర్గం యలమంచిలి ఎంపీపీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించింది. ఎంపీపీ స్థానాన్ని కైవసం చేసుకుంది. మండల పరిషత్ అధ్యక్షురాలుగా ఇనుకొండ ధనలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంత్రి రామానాయుడు ఇలాకలో నాటకీయ పరిణామాల మధ్య ఎంపీపీ స్థానాన్ని వైఎస్సార్‌సీపీ దక్కించుకుంది. కూటమి నేతల కుట్రలకు, ప్రలోభాలకు వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలు లొంగలేదు. వైఎస్సార్‌సీపీకి చెందిన 12 మంది ఎంపీటీసీ సభ్యులతో పూర్తి మెజార్టీతో ఏకగ్రీవంగా ధనలక్ష్మి ఎన్నికయ్యారు.

BCCI Set To Pull Out From Asia Cup, As Pakistan Minister Heading Asian Cricket Body3
బీసీసీఐ కీలక నిర్ణయం.. ఆసియా కప్‌కు టీమిండియా దూరం

పాక్‌తో ఉ‍ద్రిక్త పరిస్థితలు నేపథ్యంలో భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్‌ మంత్రి నేతృత్వం వహిస్తున్న ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ (ఏసీసీ) నిర్వహించే ఈవెంట్లలో పాల్గొనకూడదని డిసైడ్‌ చేసుకుంది. ఏసీసీ ఆథ్వర్యంలో జరిగే ఈవెంట్లలో భారత క్రికెట్‌ జట్లు (పురుషులు, మహిళలు) పాల్గొనవని స్పష్టం చేసింది. వచ్చే నెలలో శ్రీలంకలో జరిగే మహిళల ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్‌,ఆ తర్వాత సెప్టెంబర్‌లో భారత్‌ వేదికగా జరగాల్సిన ద్వైవార్షిక పురుషుల ఆసియా కప్ నుండి వైదొలుగుతున్నట్లు పేర్కొంది. ఈ విషయాన్ని ఏసీసీకి కూడా తెలియజేసింది. క్రికెట్‌కు సంబంధించి పాక్‌ను ఒంటరి చేయడమే లక్ష్యంగా ఈ చర్యకు ఉపక్రమించినట్లు తెలుస్తుంది.కాగా, పాకిస్తాన్‌కు చెందిన మంత్రి మొహిసిన్‌ నఖ్వీ ఇటీవలే ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ (ఏసీసీ) చైర్మన్‌గా ఎన్నికయ్యాడు. నఖ్వీ పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డుకు (పీసీబీ) కూడా చైర్మన్‌గా వ్యవహరిస్తూ, జోడు పదవులను అనుభవిస్తున్నాడు. ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌లో భారత్‌, పాకిస్తాన్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌, ఆఫ్ఘనిస్తాన్‌ సభ్య దేశాలుగా ఉన్నాయి. రోస్టర్‌ విధానంలో ఏసీసీ చైర్మన్‌ ఎంపిక జరుగుతుంది. ఈ క్రమంలో ఈ దఫా పాకిస్తాన్‌కు అవకాశం వచ్చింది. అంత​కుముందు ఏసీసీ చైర్మన్‌గా ప్రస్తుత ఐసీసీ అధ్యక్షుడు జై షా ఉండేవాడు. షా.. ఐసీసీ పదవి చేపట్టాల్సి ఉండటంతో ఏసీసీ చైర్మన్‌గిరికి ముందుగానే రాజీనామా చేశాడు. ఇదిలా ఉంటే, భారత్‌ పురుషుల ఆసియా కప్‌ను బాయ్‌కాట్‌ చేయాలని నిర్ణయించుకోవడంతో ఆ టోర్నీపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ టోర్నీ భారత్‌లోనే జరగాల్సి ఉన్నా పాక్‌ మంత్రి ఏసీసీ చైర్మన్‌గా ఉన్నందుకు బీసీసీఐ ససేమిరా అంటుంది. ఆసియా కప్‌లో భారత్‌ పాల్గొనపోతే టోర్నీ జరగడం దాదాపుగా అసాధ్యం. ఎందుకంటే అంతర్జాతీయ క్రికెట్‌ ఈవెంట్లకు స్పాన్సర్లలో ఎక్కువ మంది భారత్‌కు చెందిన వారే ఉన్నారు. వీరు స్పాన్సర్‌షిప్‌కు ముందుకు రాకపోతే టోర్నీ జరుగదు.పెహల్గామ్‌ దాడితో మొదలు..ఏప్రిల్‌ 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో గల ప్రశాంత బైసరన్‌ లోయలో పాక్‌ ఉగ్రమూకలు కాల్పులకు తెగబడి 26 మంది పర్యాటకులను పొట్టన పెట్టుకున్నాయి. ఈ దాడి తర్వాత భారత్‌ ఆపరేషన్‌ సిందూర్‌ పేరిట పాక్‌లో తలదాచుకున్న ఉగ్రమూకలపై దాడి చేసింది. భారత్‌ దాడులకు పాక్‌ బదులిచ్చే ప్రయత్నం చేయగా.. భారత బలగాలు వారికి తగు రీతిలో బుద్ది చెప్పాయి. తదనంతరం పరిణామాల్లో భారత్‌, పాక్‌ కాల్పుల విరమణ ఒప్పందాన్ని చేసుకున్నాయి.

Kolikapudi Srinivasa Rao Over Acton AT Tiruvuru4
తిరువూరులో ఉద్రిక్తత.. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా

తిరువూరులో ఎన్నిక అప్‌డేట్‌.. 👉కూటమి కుట్రలతో తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా👉తిరువూరులో టీడీపీ నేతలు అరాచకం సృష్టించారు. ఎన్నిక జరగకుండా టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి హల్‌చల్‌ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ఎన్నికలకు హాజరుకాకుండా దాడికి యత్నం చేశారు. టీడీపీ కార్యకర్తలు పోలీసుల సమక్షంలోనే రెచ్చిపోయి దాడులకు తెగబడ్డారు. వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లపై చెప్పులు విసిరి, బాటిళ్లు విసురుతూ టీడీపీ కార్యకర్తలు కవ్వింపు చర్యలకు దిగారు. 👉తిరువూరులో పోలీసులు, టీడీపీ దౌర్జన్యానికి నిరసనగా వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు రోడ్డుపై భైఠాయించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ నినాదాలు చేస్తున్నారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు.👉టీడీపీ కార్యకర్తల దౌర్జన్యాన్ని చోద్యం చూస్తూ పోలీసులు అక్కడే నిలబడ్డారు. ఎన్నికలు జరగకుండా టీడీపీ నేతల వ్యూహానికి పోలీసులు సహకరిస్తున్నారు. రౌడీయిజం చేస్తున్న టీడీపీ కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టలేదు. బలం లేకపోయినా రౌడీయిజంతో గెలవడానికి టీడీపీ అల్లర్లు. తిరువూరులో టీడీపీ ఉద్రిక్తత సృష్టిస్తోంది.👉తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వేళ టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఓవరాక్షన్‌కు దిగారు. ఎమ్మెల్యే, టీడీపీ శ్రేణులు బారికేడ్లు తోసుకుని, పోలీసులను నెట్టుకుంటూ మున్సిపల్ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లారు. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ నేతలు, పార్టీ శ్రేణులతో వాగ్వాదానికి దిగారు.👉తిరువూరులో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ హల్‌చల్‌ చేశారు. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వేళ వైఎస్సార్‌సీపీ నేతలను మున్సిపల్ కార్యాలయంలోకి వెళ్లకుండా టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్, టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. ఇదే సమయంలో బారికేడ్లు తోసుకుని, పోలీసులను నెట్టుకుంటూ కొలికపూడి, టీడీపీ నేతలు మున్సిపల్ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లారు. పోలీసులు వారిని అడ్డుకున్నప్పటికీ వారినే బెదిరిస్తూ లోపలికి దూసుకెళ్లారు. దీంతో, వాగ్వాదం జరిగింది.👉మరోవైపు.. వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లకు మద్దతుగా పార్టీ నేతలు దేవినేని అవినాష్, మొండితోక అరుణ్ కుమార్, నల్లగట్ల స్వామిదాస్, షేక్ ఆసిఫ్ తిరువూరు చేరుకున్నారు. ఇదిలా ఉండగా.. నేడు.. తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. ఎన్నికల కోసం బలం లేకపోయినా గెలవాలని కూటమి కుట్రలు చేస్తో​ంది. మరోవైపు.. తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వేళ వైఎస్సార్‌సీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. తిరువూరు వెళ్లొద్దంటూ వైఎస్సార్‌సీపీ నేతలపై పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు.

Gold and Silver Price Today On May 19th 20255
మరింత ఖరీదైన బంగారం.. నేడు తులం..

దేశంలో బంగారం ధరలు (Gold Prices) మళ్లీ ఎగిశాయి. రెండు రోజులు నిలకడగా ఉన్న పసిడి ధరలు నేడు (మే 19) మరోసారి పెరుగుదల బాట పట్టాయి. దీంతో ఈరోజు కొనుగోలుదారులు కాస్త ఎక్కువ మొత్తం వెచ్చించాల్సి ఉంటుంది. మే 19 నాటికి దేశంలోని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్, 22 క్యారెట్ బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి..తెలుగు రాష్ట్రాల్లో..🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.95,510🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.87,550హైదరాబాద్‌, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, స్థానిక జ్యువెలరీ షాపుల్లో మేకింగ్ ఛార్జీలు,జీఎస్టీ కారణంగా కొంత వ్యత్యాసం కనిపిస్తుంది. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.380, రూ.350 పెరిగాయి.👉ఇది చదివారా? ఈ దేశాలు బంగారానికి పుట్టిళ్లు..!!చెన్నైలో..🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.95,510🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.87,550చెన్నైలో బంగారం ధరలు ఇతర నగరాలతో పోలిస్తే కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ పోర్ట్ సౌకర్యాలు, డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేస్తున్నాయి. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.380, రూ.350 పెరిగాయి. ఢిల్లీలో.. 🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.95,660🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.87,700ఢిల్లీలో బంగారం ధరలు రవాణా ఖర్చులు, స్థానిక ట్యాక్స్‌ల కారణంగా కొంత ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ నగరంలో బంగారం కొనుగోలుదారులు హాల్‌మార్క్ ఆభరణాలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.380, రూ.350 పెరిగాయి. ముంబైలో..🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.95,510🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.87,550ముంబైలో బంగారం ధరలు స్థానిక డిమాండ్, జ్యువెలరీ డిజైన్‌లపై ఆధారపడి మారుతూ ఉంటాయి. ఈ నగరంలో బంగారం కొనుగోలు చేసే ముందు పలు జ్యువెలరీ షాపుల ధరలను సరిపోల్చడం మంచిది. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.380, రూ.350 పెరిగాయి. బెంగళూరులో..🔸 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.95,510🔸 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.87,550బెంగళూరులో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి, కానీ స్థానిక ఆర్థిక పరిస్థితులు, ఫెస్టివల్ సీజన్ డిమాండ్ ఈ ధరలను ప్రభావితం చేయవచ్చు. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు నేడు వరుసగా రూ.380, రూ.350 పెరిగాయి.వెండి ధరలూ..దేశవ్యాప్తంగా వెండి ధరల్లో కూడా నేడు పెరుగుదల నమోదైంది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో నిన్నటితో పోలిస్తే ఈరోజు వెండి కేజీకి రూ.1000 పెరిగి రూ.1,08,000 వద్దకు చేరింది. అలాగే ఢిల్లీ ప్రాంతంలోనూ రూ.1000 ఎగిసి రూ. 98,000 లను తాకింది.(గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)

Heavy Rain Fall In Bengaluru Flood Videos Viral6
బెంగళూరులో భారీ వర్షం.. కర్ణాటక అతలాకుతలం.. షాకింగ్‌ వీడియోలు

బెంగళూరు: తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న ఐదు రోజులు పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు.. రెండు రోజులుగా కర్నాటకలో భారీ వర్షం కురుస్తోంది. ఆదివారం బెంగళూరు నగరంలో ఈ సీజన్‌లోనే అతిపెద్ద వర్ష పాతం నమోదైంది. దీంతో, రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ఈ క్రమంలో సహాయక చర్యలను పరిశీలించేందుకు వరద నీటిలోనే ఎమ్మెల్యే జేసీబీపై వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.కర్నాటకలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నగరంలోని అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎడతెరిపి లేకుండా వర్షం (rain) కురవడంతో వరదలు వచ్చాయి. మాన్యత టెక్ పార్క్, హంపీనగర, కాటన్ పేట్, అంజనాపుర, బాగలకుంటె, జక్కూరు, హొరమావు, శెట్టిహళ్లి, విశ్వేశ్వరపురా, విద్యాపీఠ, హెమ్మిగెపురా, సిల్క్ బోర్డులో ప్రాంతాలు నీట మునిగాయి. బెంగళూరు రూరల్, కోలార్, చిక్కబళ్లాపూర్, రామనగర, మైసూరు, హాసన్, తుమకూరు మరియు ఇతర జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. యలహంక, కేఆర్‌పురం, ఇతర ప్రాంతాల్లో నీరు ఇళ్లలోకి చేరడంతో నివాసితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.Silk Board Metro Station, Bengaluru…Congress is ruling the state so it’s ok…. pic.twitter.com/reKKwbMTdE— Mr Sinha (@MrSinha_) May 19, 2025 Today: Significant flooding in Bengaluru, Karnataka, India, leading to major traffic disruptions and impacting daily activities for residents. #BengaluruRains #KarnatakaRains pic.twitter.com/0Ph7vHBHUt— Weather Monitor (@WeatherMonitors) May 19, 2025భారీ వర్షాల నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే బస్వరావు సహాయక చర్యలను పరిశీలించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోకి జేసీబీపై వెళ్లారు. స్థానికులను పరామర్శించి.. వరద సహాయక చర్యల్లో పాల్గొన్నారు.After hiking the price of bus ride and metro fare ; Karnataka Congress Govt to launch FERRY SERVICE? Seems so.Congress CM Siddaramaiah has 'gifted' people of Karnataka and Bengaluru especially lakes in the form of water stagnation.This is Congress govt for you. They can't… pic.twitter.com/dKvPLqTnUx— Cons of Congress (@ConsOfCongress) May 19, 2025 #bengalururains #BangaloreRains Avoid Koramangala 80 feet road with knee deep water and bus stranded in it. Video footage time 8 AM. pic.twitter.com/ctyhefMwH9— Agan (@ngrjms) May 19, 202522 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌.. బెంగళూరు సహా 22 జిల్లాలకు వాతావరణ శాఖ ‘ఎల్లో అలర్ట్’ ప్రకటించింది. మే 22 వరకు ఉడిపి, బెలగావి, ధారవాడ, గడగ్, హవేరి ప్రాంతాల్లో 30-40 కిమీ వేగంతో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దాదాపు వారం రోజుల పాటు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు ప్రయాణించవద్దని సూచించింది. ಮುಂದಿನ 7 ದಿನಗಳ #ಹವಾಮಾನ #ಮುನ್ಸೂಚನೆ ಮತ್ತು #ಎಚ್ಚರಿಕೆಗಳು: (ಮೂಲ: IMD)ರಾಜ್ಯದಾದ್ಯಂತ ಅಲ್ಲಲ್ಲಿ ಗುಡುಗು, ಮಿಂಚು ಸಹಿತ ಕರಾವಳಿ ಜಿಲ್ಲೆಗಳಲ್ಲಿ ಚದುರಿದಿಂದ ವ್ಯಾಪಕವಾಗಿ ಸಾಧಾರಣ ಮಳೆ ಹಾಗೂ ಅಲ್ಲಲ್ಲಿ ಭಾರಿ ಮಳೆ, ದಕ್ಷಿಣ ಒಳನಾಡು ಜಿಲ್ಲೆಗಳಲ್ಲಿ ಇಂದು ಮತ್ತು ನಾಳೆ, ಉತ್ತರ ಒಳನಾಡು ಜಿಲ್ಲೆಗಳಲ್ಲಿ ಮೇ 19 ರಿಂದ 22 ರವರೆಗೆ ಹಾಗೂ pic.twitter.com/OHLsQQ5j6d— Karnataka State Natural Disaster Monitoring Centre (@KarnatakaSNDMC) May 19, 2025#BengaluruRains The Hennur-Bagalur Road, which is the alternative route to Kempegowda International airport in Bengaluru, was flooded. Motorists & traffic cops had a tough time. (📹 by TOI Syed Asif)@timesofindia pic.twitter.com/xZTRTU9Btv— TOI Bengaluru (@TOIBengaluru) May 19, 2025BANGALORE WATER PARK #Bengaluru #bengalurufloods #BengaluruRains pic.twitter.com/QpBqXmgl5T— Bihar Buzz (@buzz_bihar) May 19, 2025

Hydra Demolish Construction In Miyapur7
మియాపూర్‌లో హైడ్రా కూల్చివేతలు.. 70 ప్లాట్ల యజమానులు..

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. తాజాగా మియాపూర్‌లో హైడ్రా (Hydra) కూల్చివేతలు చేపట్టింది. హెచ్‌ఎండీఏ లేఅవుట్‌లోని అక్రమ నిర్మాణాలను అధికారులు తొలగించారు. పోలీసులు బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగాయి.వివరాల ప్రకారం.. మియాపూర్‌లోని హైదర్‌నగర్‌లో సోమవారం ఉదయం నుంచి హైడ్రా (Hydra) కూల్చివేతలు చేపట్టింది. తప్పుడు పత్రాలతో తమ భూమి కబ్జా చేశారని ఇటీవల 70 మంది ప్లాట్ల యజమానులు ఫిర్యాదు చేశారు. దీంతో, రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. హెచ్‌ఎండీఏ లేఅవుట్‌లోని అక్రమ నిర్మాణాలను అధికారులు తొలగించారు. హైకోర్టు ఆదేశాలతోనే అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నట్టు హైడ్రా అధికారులు తెలిపారు. ఇక, కబ్జాదారుల నుంచి భూములు విడిపించడంపై ప్లాట్ల యజమానులు హర్షం వ్యక్తం చేశారు.

Sobhita Dhulipala Will Get Chance In Pa Ranjith Movie8
స్టార్‌ డైరెక్టర్‌ సినిమాలో శోభితకు ఛాన్స్‌

నాగచైతన్యతో పెళ్లి తర్వాత ఇప్పుడిప్పుడే పలు కొత్త సినిమాలకు నటి శోభిత ధూళిపాళ ఓకే చెబుతుంది. పలు అందాల పోటీల్లో పాల్గొన్న ఆమె టాప్‌ మోడల్‌గా గుర్తింపు పొందారు. అలా పలు వాణిజ్య ప్రకటనల్లో నటించిన శోభిత 2016లో రామన్‌ రాఘవన్‌ 2.0 అనే హిందీ చిత్రం ద్వారా నటిగా రంగప్రవేశం చేశారు. ఆ తర్వాత తెలుగులో మేజర్‌ చిత్రంలో నటించి మంచి గుర్తింపు పొందారు. అలా హిందీ, తెలుగు, మలయాళం చిత్రాల్లో నటించిన శోభిత 2022లో మణిరత్నం సినిమా పొన్నియిన్‌ సెల్వన్‌ 1, 2 చిత్రాల్లో వానతి అనే పాత్రలో నటించి పేరు తెచ్చుకున్నారు. అదేవిధంగా హాలీవుడ్‌లో మంకీ మాన్‌ చిత్రంలో నటించి పాన్‌ వరల్డ్‌ నటిగా పేరు తెచ్చుకున్నారు. తాజాగా మరోసారి తమిళ ప్రేక్షకులను ఆలరించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. దర్శకుడు పా రంజిత్‌ దర్శకత్వం వహిస్తున్న వెట్టువన్‌ చిత్రంలో హీరోయిన్‌గా ఆమె నటిస్తున్నట్లు తెలిసింది. ఇంతకుముందు అట్టకత్తి, కబాలి, సార్పట్టా పరంపరై వంటి భారీ చిత్రాలను తెరకెక్కించిన పా.రంజిత్‌ ఇటీవల విక్రమ్‌ కథానాయకుడుగా తంగలాన్‌ చిత్రం చేశారు. తాజాగా వట్టువన్‌ అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు. గోల్డెన్‌ రేష్మియా ఫిలిమ్స్‌తో కలిసి నీలం స్టూడియోస్‌ సంస్థ నిర్మిస్తున్న ఇందులో అట్టకత్తి దినేష్‌ కథానాయకుడుగా, ఆర్య ప్రతి నాయకుడిగా నటిస్తున్నారు. ఈ చిత్రం గ్యాంగ్‌ స్టర్స్‌ ఇతివృత్తంతో రూపొందుతున్నట్లు సమాచారం. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్‌ మొదటి షెడ్యూల్‌ ప్రారంభమైంది. ప్రస్తుతం కారైక్కుడి ప్రాంతంలో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో శోభిత ధూళిపాళ నటిస్తున్న పాత్ర ఏమిటి అన్నది ఆసక్తికరంగా మారింది.

Hyderabad Gulzar House Incident Related Details9
పిల్లలను తీసుకుని ఇంటికి రా తల్లీ.. సరదాగా వెళ్లారు..

రాజేంద్రనగర్‌/మణికొండ/బంజారాహిల్స్‌: ఆదివారం ఉదయం గుల్జార్‌హౌస్‌ అగ్నిప్రమాదంలో మృతిచెందిన 17 మందిలో 10 మృతదేహాలకు ఆదివారం సాయంత్రం ఒకేసారి అంత్యక్రియలు నిర్వహించారు. కుటుంబ పెద్ద ప్రహ్లాద్‌ మోదీ, ఆయన భార్య మున్నీ, కుమారుడు పంకజ్, కోడలు వర్ష, తమ్ముడు రాజేందర్‌ మోదీ, మరదలు సుమిత్ర, తమ్ముని కుమారుడు అభిషేక్, మనుమలు, మనమరాళ్లు అనుయాన్, ఇదిక, ఐరాజ్‌ల మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రిలో పోస్ట్‌మార్టం అనంతరం పురానాపూల్‌లోని శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. కాగా, ఈ ప్రమాదంలో బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.3లో నివసించే ఏడేళ్ల బాలిక హర్షాలి గుప్తా కన్నుమూశారు. ఆమె శరీరం పూర్తిగా కాలిపోవటంతో కుటుంబ సభ్యులు అస్తికలకు ఆదివారం మధ్యాహ్నం పంజాగుట్ట స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.పుట్టింటికి వెళ్లి మృత్యువాతసనత్‌నగర్‌: వేసవి సెలవులు కదా..? పిల్లలను తీసుకుని ఇంటికి రా.. తల్లీ! అని ఆ తండ్రి ఆశగా అడగడంతో కొడుకును తీసుకుని తన పుట్టిల్లు అయిన గుల్జార్‌హౌస్‌కు వెళ్లింది. అదృష్టవశాత్తూ తండ్రి పిలుపు మేరకు కొడుకు ముందు రోజు రాత్రే వెళ్లిపోగా, తల్లి అగ్ని ప్రమాదంలో మృత్యువాత పడింది. దీంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. వస్త్ర వ్యాపారి వినోద్‌కుమార్‌ అగర్వాల్‌ తన భార్య రజనీ అగర్వాల్‌ (45), కొడుకు కుషాల్‌ అగర్వాల్, కుమార్తె తనూలతో కలిసి సనత్‌నగర్‌లో ఉంటున్నాడు. కుమార్తె ముంబైలో ఎంబీఏ చదువుతుండగా, కుమారుడు కుషాల్‌ ఇంటర్మీడియెట్‌ చదువుతున్నాడు. ఈ క్రమంలో కుమారుడు కుషాల్‌ను తీసుకుని రజని గుల్జార్‌ హౌస్‌కు వెళ్లింది. అయితే కుషాల్‌ ముందు రోజు రాత్రి ఇంటికి వచ్చేశాడు. అక్కడే ఉన్న రజని మాత్రం ఆదివారం జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించింది.సరదాగా వెళ్లారు.. శవాలై వచ్చారురహమత్‌నగర్‌: బంధువులతో సరదాగా గడపాలని వెళ్లారు. శవాలుగా తిరిగొచ్చారు. ఒకే కుటుంబంలో ముగ్గురు మృత్యువాత పడటం ఎర్రగడ్డ డివిజన్‌ రాజీవ్‌నగర్‌ బస్తీ వాసులను కలచి వేసింది. గుల్జార్‌ హౌస్‌ ఆగ్ని ప్రమాదంలో రాజీవ్‌నగర్‌కు చెందిన తల్లి, కొడుకు, కుమార్తె మృతి చెందారు. ఆటో మొబైల్స్‌ వ్యాపారం చేసే రాజేష్‌ జైన్‌ రాజీవ్‌నగర్‌లో ఉంటున్నారు. ఆయనకు భార్య శీతల్‌ (35), ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కాగా శనివారం ఉదయం శీతల్‌ తన తండ్రి ఇంటికి పిల్లల్ని తీసుకుని వెళ్లింది. అయితే పెద్ద కుమార్తె రాశి తాను చదువుకోవాలంటూ శనివారం సాయంత్రమే రాజీవ్‌నగర్‌ లోని తమ నివాసానికి తిరిగి వచ్చింది. అక్కడే ఉండిపోయిన శీతల్, అరుషి, రిషబ్‌ మాత్రం ప్రమాదంలో చనిపోయారు.

Anant Ambani Goes For Sunday Shopping Hand In Hand With Wife, Radhika Merchant10
అనంత్‌-రాధిక సండే షాపింగ్‌ : లవ్‌బర్డ్స్‌ వీడియో వైరల్‌

బాల్య ప్రేమికులు,గత ఏడాది జూలైలో వివాహం బంధంలోకి అడుగపెట్టిన లవ్‌బర్డ్స్‌ అనంత్ అంబానీ , రాధిక మర్చంట్ షాపింగ్‌లో సందడిగా కనిపించారు. జియో ప్లాజాలో భార్య రాధిక మర్చంట్ తో కలిసి అనంత్ అంబానీ ఆదివారం షాపింగ్‌ చేయడం సోషల్‌ మీడియాలో విశేషంగా నిలిచింది. అంబానీ అప్‌డేట్ పేజీ ఇన్‌స్టాలో షేర్‌ చేసిన వీడియో వైరల్‌ అవుతోంది.అనంత్ , రాధిక జియో వరల్డ్ ప్లాజా ప్రాంగణంలో షాపింగ్‌ చేశశారు. జియో వరల్డ్ ప్లాజాలోని భద్రతా సిబ్బంది వెంటరాగా ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని పెళ్లి అయ్యి దాదాపు ఏడాది కావస్తున్నా కొత్తజంటలా జియో షాపింగ్‌ మాల్‌లో సందడి చేశారు. అనంత్ కాల్‌లో బిజీగా ఉండగా, రాధిక చేయి పట్టుకుని ఉల్లాసంగా నడుస్తు, విలాసంగా కనిపించింది. అనంత్‌ నేవీ బ్లూ షర్ట్, త్రీ-ఫోర్త్స్ బ్లాక్ షార్ట్స్, బ్లాక్ సాక్స్, బ్లూ షూస్ ధరించాడు. ఇక అంబానీ చోటీ బహూ ఎప్పటిలాగానే తన సింపుల్‌ స్టైల్‌ను చాటుకుంది. రాధిక తెల్లటి స్లీవ్‌లెస్ క్రాప్ టాప్ ధరించి, గిరిజాలజుట్టును అలా వదిలేసి సైడ్‌ బ్యాగ్‌ వేసుకుని చాలా క్యాజువల్‌ స్టైల్‌లో కనిపించింది.అయితే జంట దేని కోసం షాపింగ్ చేశారో స్పష్టంగా తెలియదు. ఫ్యాన్స్‌కి మాత్రం అనంత్‌-రాధిక షాపింగ్‌ వీడియో తెగ నచ్చేసింది. View this post on Instagram A post shared by Ambani Family (@ambani_update)ఇదీ చదవండి: బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నారా? ఈ తొమ్మిది మస్ట్‌..! దేశీయ కార్పొరేట్‌ దిగ్గజం రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ, నీతా అంబానీ చిన్నకుమారుడు అనంత్‌ అంబానీ తన చిన్ని నాటి స్నేహితురాలు రాధిక మర్చంట్‌ను గత ఏడాది జైలూ12న పెళ్లాడాడు. ప్రపంచంలోనే కనీవినీ ఎరుగనిరీతిలో వివాహ వేడుకలు జరిగాయి. అంగరంగవైభవంగా జరిగిన ఈ వివాహానికి ఇండియాతో పాటు, ప్రపంచవ్యాప్తంగా అనేకమంది బిలియనీర్లు హాజరైన సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement