Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

fire accident at mirchowk hyderabad 1
పాతబస్తీ అగ్ని ప్రమాదంలో 17 మంది మృతి.. కిషన్‌రెడ్డి వ్యాఖ్యల్ని ఖండించిన ఫైర్‌ డీజీ

Meer Chowk Fire Accident Live Updates:సాక్షి,హైదరాబాద్‌: పాతబస్తీ మీర్‌చౌక్‌లో పెను విషాదం చోటు చేసుకుంది. ఆదివారం ఉదయం గుల్జార్‌హౌస్‌ సమీపంలోని ఓ భవనం మొదటి అంతస్తులో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 17 మంది మృతి చెందారు. అయితే, ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బందిపై కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని తెలంగాణ ఫైర్‌ డీజీ నాగిరెడ్డి ఖండించారు. ఆయన చేసిన వ్యాఖ్యల్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా’ అని అన్నారు. మరోవైపు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఎక్స్‌ గ్రేషియా ప్రకటించారు. 👉మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున పరిహారంపాతబస్తీ అగ్ని ప్రమాద ఘటన బాధాకరం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించిందిబాధిత కుటుంబసభ్యులతో సీఎం మాట్లాడారు.అగ్ని ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించాం👉సీఎం రేవంత్ రెడ్డికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఫోన్గుల్జార్‌ హౌస్‌ అగ్నిప్రమాదం వివరాలు అడిగి తెలుసుకున్న ఖర్గేఘటన వివరాలను ఖర్గేకు వివరించిన సీఎంఎప్పటికప్పుడు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నట్లు ఖర్గేకు తెలిపిన సీఎంమంత్రులు ఘటన స్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారని ఖర్గేకు వివరించిన సీఎం 👉మృతులకు ప్రధాని మోదీ సంతాపంపాత బస్తీ అగ్నిప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతిమృతులకు ప్రధాని మోదీ సంతాపంపీఎంఎన్‌ఆర్‌ఎఫ్ నుంచి అగ్ని ప్రమాద బాధితులకు ఎక్స్ గ్రేషియామృతులకు రూ.2లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేలు ఎక్స్ గ్రేషియాDeeply anguished by the loss of lives due to a fire tragedy in Hyderabad, Telangana. Condolences to those who have lost their loved ones. May the injured recover soon.An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased. The injured would be…— PMO India (@PMOIndia) May 18, 2025 👉కిషన్‌రెడ్డి విజ్ఞతకే వదిలేస్తున్నా.. ప్రమాదంపై ఫైర్ డీజీ నాగిరెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాటలను కండిస్తున్నసరైన సమయం లో ఫైర్ సిబ్బంది రాలేదు అనడం అవాస్తవం నేను దగ్గర ఉంది ఘటనను పరిశిలించాను మా దగ్గర అత్యాధునిక పరికరాలు లేవు అనేది అవాస్తవం అయన మాటలను అయన విజ్ఞతకే వదిలేస్తున్న👉ప్రమాదంపై ఫైర్ డీజీ నాగిరెడ్డి మీడియాతో మాట్లాడారుఉదయం 6.16నిమిషాలకు ఫైర్ కాల్ వచ్చిందిసమాచారం వచ్చిన వెంటనే మొఘల్‌పూరా ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారుఆ తర్వాత 11 ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయిప్రమాదానికి కారణం భవనంలోకి వెళ్లే దారికి షార్ట్ సర్క్యూట్ జరిగిందిభవనంలో ఉన్న కృష్ణ పర్ల్స్‌,మోదీ పర్ల్స్ షాపులు అగ్నికి ఆహుతయ్యాయిఅగ్నిప్రమాదం తీవ్ర స్థాయిలో ఉండటానికి కారణం ఆ భవనాన్ని ఇటీవల ఉడెన్ ప్యానల్‌తో డిజైన్ చేశారుషార్ట్ సర్క్యూట్‌తో ఉడెన్ ప్యానల్ మొత్తం కాలి మంటలు వ్యాప్తి చెందాయిప్రమాదంతో ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్న 17 మందిని రెస్క్యూ చేసి వివిధ ఆస్పత్రులకు తరలించాంఒక నలుగురు ల్యాడర్ మీద నుంచి కిందకు వచ్చారు17మందిలో అందరూ చనిపోయినట్లు తెలుస్తోందిప్రమాదం జరగడానికి ప్రధాన కారణం ఎంట్రన్స్‌లో షార్ట్ సర్క్యూట్‌స్థానికంగా పని చేసేవారిని అడిగాను రెగ్యులర్‌గా షార్ట్ సర్క్యూట్ జరుగుతుందని చెప్పారుఇంటి లోపల ఫైర్ నిబంధనలు లేవుఈ బిల్డింగ్ జీప్లస్ 2,బయటకు జీప్లస్ వన్‌లాగా కనిపిస్తోందిఫస్ట్ ఫోర్ల్,సెకండ్ కంప్లీట్‌గా రెసిడెన్షియల్ ఏరియాగ్రౌండ్‌ఫ్లోర్‌లో అన్నీ షాప్స్ ఉన్నాయిఘటనా స్థలాన్ని పరిశీలిస్తే ఈ ప్రమాదం ఎసీ కంప్రెసర్ పేలడం వల్ల జరిగింది కాదు షార్ట్స్ సర్క్యూటే కారణం ప్రమాదం జరిగిన అపార్ట్‌మెంట్‌లో ఒక మీటరు వెడల్పుతో మెట్లను నిర్మించారుదీంతో ప్రమాదం నుంచి బాధితులు బయటపడేందుకు మరో మార్గం లేదుప్రమాదం జరిగిన బిల్డింగ్ చాలా పాత బిల్డింగ్‌నాటి నిబంధనల ప్రకారం నిర్మించారుఫైర్ సేఫ్టీ నిబంధనలు లేకపోవడం భారీ అగ్నిప్రమాదం జరిగిందిఅగ్ని ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి ఆలస్యం రావడం, ఎక్విప్‌మెంట్ లేకపోవడంలో సరైన సహాచర్యలు చేపట్టలేదన్న కేంద్ర మంత్రి వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాంఆయన చేసిన వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాంప్రమాదం జరిగిన వెంటనే 11 ఫైరింజన్లు, 70 మంది ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారుబయట నుంచి చూస్తే 2మీటర్ల ఎంట్రన్స్ పూర్తిగా పొగకమ్ముకుందిఫస్ట్‌ఫ్లోర్‌కి వెళ్లే దారి వెడల్పు ఒక మీటరు మాత్రమే ఉంది6.16కి ప్రమాదంపై సమాచారం అందిందిప్రమాదం జరిగే సమయంలో చనిపోయిన 17 మంది కాకుండా మరో నలుగురు ఉన్నారని చెబుతున్నారువారిలో నలుగురు రెండవ ఫ్లోర్‌లో ఉన్నారు. అక్కడి నుంచి తప్పించుకున్నారుమంటల్ని ఎప్పుడో ఆర్పేశాంప్రమాదం జరిగిన సమయంలో అందరూ నిద్రలో ఉన్నారుఈ ప్రమాద బాధితుల్లో కొందరు వేసవి సెలవులు నిమిత్తం వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చారు👉తెలంగాణ ఫైట్ డిజాస్టర్ రెస్పాన్స్ టీంఅగ్నిమాపక కేంద్రాల నుండి 12 ఫైర్ పరికరాలతో రెస్క్యూ నిర్వహించాం.మొత్తం 11 వాహనాలు, 01 అగ్నిమాపక రోబో, 17 అగ్నిమాపక అధికారులు, 70 మంది సిబ్బంది మంటలను ఆర్పడంలో,చిక్కుకున్న వారిని రక్షించడంలో పాల్గొన్నారు.మంటలను ఆర్పడానికి మొత్తం 02 గంటలు పట్టింది చిక్కుకున్న వ్యక్తులను రక్షించడానికి, మంటలను ఆర్పడానికి, వ్యాపించకుండా నిరోధించడానికి అధికారులు, సిబ్బంది తీవ్రంగా కృషి చేశాంఅడ్వాన్స్‌డ్ ఫైర్ రోబోట్, బ్రోటో స్కైలిఫ్ట్ హైడ్రాలిక్ ప్లాట్‌ఫామ్‌ను ఆపరేషన్లలో ఉపయోగించాము.అగ్నిప్రమాదానికి గల కారణం తెలియాల్సి ఉంది,దర్యాప్తు చేస్తున్నాం..దెబ్బతిన్న ఆస్తి విలువ ఇంకా అంచనకు రాలేదు 👉కేటీఆర్‌ దిగ్భ్రాంతిఓల్డ్ సిటీలోని గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదం పై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కేటీఆర్..అగ్ని ప్రమాదం జరగడం దురదృష్టం..చాలా బాధను గురిచేసింది..బాధితుల కుటుంబాలకు సంతాపం ప్రకటించిన కేటీఆర్..గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.మంటలు త్వరగా అదుపులోకి రావాలని ఆశిస్తున్నాను..సహాయక చర్యలకు BRS బృందం అందుబాటులో ఉంటుంది.Extremely shocked and pained!! Details emerging out of Gulzar House fire tragedy in Old City are very sadMy heartfelt condolences to the families of the victims of the tragedy. Wishing a speedy recovery to those injuredHoping and praying that this fire will be contained very…— KTR (@KTRBRS) May 18, 2025👉సీఎం రేవంత్‌ రెడ్డి దిగ్భ్రాంతిఅగ్ని ప్రమాద ఘటనపై సీఎం రేవంత్‌ రెడ్డి దిగ్భ్రాంతి. సహాయక చర్యలకు ముమ్మరం చేయాలని ఆదేశించారు. బాధితులకు అండగా ఉంటామని హామీ. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం. ప్రమాద ఘటన గురించి ఆరా తీసిన ముఖ్యమంత్రి ఘటనా స్థలానికి చేరుకున్న మంత్రి పొన్నం వివరాలు అడిగి తెలుసుకుంటున్న పొన్నం ప్రభాకర్‌ఆదివారం ఉదయం 6గంటలకు ప్రమాదం జరిగింది6.15కి అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుందిప్రమాదంలో ఎలాంటి కుట్ర కోణం లేదు👉కిషన్‌రెడ్డి పరామర్శఅగ్నిప్రమాదం జరగడం దురదృష్టకరం.ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు స్పందించి ఉంటే ప్రాణ నష్టం జరగకుండా ఉండేదిసమయానికి అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి రీచ్ కాలేదుబాధాకరమైన విషయం ఇదికేంద్రం తరఫున బాధిత కుటుంబానికి అండగా ఉంటాంఫైర్ శాఖ వద్ద సరైన ఫైర్ పరికరాలు లేకపోవడంతో తీవ్రత పెరిగిందిఫైర్‌ టెక్నాలజీని పెరుగుపరుచుకోవాలి.ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలి. ఒకే కుటుంబానికి చెందినవారు ఎంతో కాలం ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు. గుల్జార్‌హౌస్‌లో ఘోర అగ్ని ప్ర‌మాదం..17మంది మృతిచార్మినార్‌ గుల్జార్‌హౌస్‌లో ఘోర అగ్ని ప్ర‌మాదం జ‌రిగింది. ఆదివారం ఉద‌యం 6.గంట‌ల‌కు షార్ట్ స‌ర్క్యూట్ కార‌ణంగా 17మంది మృతి చెందారు. షార్ట్స్‌ సర్క్యూట్‌ జరిగిన ప్రమాదంలో మొత్తం 17మందిని ఆస్పత్రికి తరలించారు. అగ్నిప్రమాదంలో మంటల్లో చిక్కుకున్న బాధితుల్ని రక్షించే ప్రయత్నం చేశారు. మంటల్లో చిక్కుకున్న మరికొంత మందిని రక్షించేందుకు అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు ప్రయత్నాల్ని కొనసాగిస్తున్నారు. బాధితులకు తక్షణ వైద్యం అందించేందుకు 14 అంబులెన్స్‌లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రమాదంతో పాతబస్తీలో ట్రాఫిక్‌ విభాగం ఆంక్షలు విధించింది. ట్రాఫిక్‌ను డైవర్ట్‌ చేస్తున్నట్లు తెలిపింది. మృతుల్లో ఏడుగురు చిన్నారులు, నలుగురు మహిళలు సహా మొత్తం 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న స్థానిక ఎమ్మెల్యే, మేయర్ విజయలక్ష్మి, అగ్నిపమాక డీజీ నాగిరెడ్డి, సౌత్‌జోన్ డీసీపీ స్నేహా మిశ్రా,హైడ్రా కమిషనర్ రంగనాథ్‌లు పరిశీలించారు. మృతుల వివరాలురాజేంద్రకుమార్‌ (67),అభిషేక్‌ మోదీ (30), సుమిత్ర (65), మున్నీబాయి (72), ఆరుషి జైన్‌ (17), శీతల్‌ జైన్‌ (37), ఇరాజ్‌ (2), హర్షాలీ గుప్తా (7), రజని అగర్వాల్‌, అన్య మోదీ, పంకజ్‌ మోదీ, వర్ష మోదీ, ఇద్దిక్కి మోదీ, రిషభ్‌, ప్రథమ్‌ అగర్వాల్‌, ప్రాంశు అగర్వాల్ ఉన్నారు. ఫైర్ యాక్సిడెంట్ చిన్నదే అయినా భవనంలో 30 మంది ఉండడంలో ప్రాణనష్టం భారీ ఎత్తున జరిగింది.

IPL 2025: Punjab Kings Won The Toss And Choose To Bat Against Rajasthan Royals2
IPL 2025: టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న పంజాబ్‌.. తుది జట్లు ఇవే..!

ఐపీఎల్‌ 2025లో భాగంగా ఇవాళ (మే 18) మధ్యాహ్నం సువాయ్‌ మాన్‌సింగ్‌ స్టేడియంలో (జైపూర్‌) జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌తో రాజస్థాన్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌ రీ ఎంట్రీ ఇచ్చాడు. గాయం కారణంగా శాంసన్‌ గత కొన్ని మ్యాచ్‌లుగా దూరంగా ఉన్నాడు. ఈ మ్యాచ్‌ కోసం రాయల్స్‌ రెండు మార్పులు చేసింది. గాయపడ్డ నితీశ్‌ రాణా స్థానంలో సంజూ శాంసన్‌.. జోఫ్రా ఆర్చర్‌ స్థానంలో క్వేనా మపాకా తుది జట్టులోకి వచ్చారు. పంజాబ్‌ విషయానికొస్తే.. ఈ జట్టు మూడు మార్పులు చేసింది. మిచెల్‌ ఓవెన్‌, మార్కో జన్సెన్‌, ఒమర్‌జాయ్‌ తుది జట్టులోకి వచ్చారు. కాగా, ఈ సీజన్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ ఇదివరకే ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌ ఆ జట్టుకు నామమాత్రమే. మరోవైపు పం​జాబ్‌ ప్లే ఆఫ్స్‌ రేసులో ముందువరుసలో ఉంది. ఆ జట్లు ఈ మ్యాచ్‌ గెలిస్తే, ప్లే ఆఫ్స్‌ రేసులో ముందుకెళ్తుంది.తుది జట్లు..రాజస్థాన్‌ రాయల్స్‌: వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్(c), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్(wk), షిమ్రాన్ హెట్మెయర్, వనిందు హసరంగ, తుషార్‌ దేశ్‌పాండే, ఆకాష్ మధ్వల్, ఫజల్‌హాక్ ఫరూఖీ, క్వేనా మఫాకా.ఇంపాక్ట్ సబ్స్: కుమార్ కార్తికేయ, శుభమ్ దూబే, అశోక్ శర్మ, కునాల్ సింగ్ రాథోడ్, యుధ్వీర్ సింగ్ చరక్పంజాబ్‌ కింగ్స్‌: ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (WK), ప్రియాంష్ ఆర్య, మిచ్ ఓవెన్, శ్రేయాస్ అయ్యర్ (c), నేహాల్ వధేరా, శశాంక్ సింగ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మార్కో జాన్సెన్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, జేవియర్ బార్ట్‌లెట్.ఇంపాక్ట్ సబ్స్‌: విజయ్‌కుమార్ వైషాక్, హర్‌ప్రీత్ బ్రార్, ప్రవీణ్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, ముషీర్ ఖాన్

YS Jagan Expresses Shock Over Mir Chowk Fire Incident3
పాతబస్తీ అగ్నిప్రమాదంపై వైఎస్‌ జగన్ దిగ్భ్రాంతి

సాక్షి,తాడేపల్లి: పాతబస్తీ అగ్నిప్రమాదంపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఇలాంటి దుర్ఘటన అత్యంత బాధాకారం. ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని వైఎస్‌ జగన్‌ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు.Shocked to hear about the fire incident at Gulzar House, Hyderabad. My heart felt condolences to the bereaved families who have lost their loved ones. Praying for healing and speedy recovery of those injured in this unfortunate incident.#GulzarHouse#Hyderabad— YS Jagan Mohan Reddy (@ysjagan) May 18, 2025చార్మినార్‌ గుల్జార్‌హౌస్‌లో ఘోర అగ్ని ప్ర‌మాదం జ‌రిగింది. ఆదివారం ఉద‌యం 6.15గంట‌ల‌కు షార్ట్ స‌ర్క్యూట్ జరిగింది. షార్ట్‌ సర్క్యూట్‌ కార‌ణంగా ఎనిమిది మంది చిన్నారులతో సహా మొత్తం 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో పలువురు వేసవి సెలవుల కోసం ఇక్కడికి వచ్చినట్లు సమాచారంమరోవైపు, ప్రమాదంపై అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రమాదానికి గల కారణాల్ని వివరించారు. ప్రమాదం జరిగిన బిల్డింగ్ ఎంట్రన్స్‌లో షార్ట్ సర్క్యూట్ ఏర్పడింది. ఇటీవల ఇంటిని చెక్క ప్యానెళ్లను ఏర్పాటు చేశారు. షార్ట్‌సర్క్యూట్ వల్ల చెలరేగిన మంటలకు చెక్క మొత్తం కాలి మంటలు వ్యాపించాయి. భారీ ఎత్తున ప్రాణ నష్టం జరిగిందని నాగిరెడ్డి తెలిపారు.

Was Congress Trying to Insult Shashi Tharoor,Here What He Said4
కాంగ్రెస్‌ మిమ్మల్ని అవమానిస్తోందా?.. ఎంపీ శశి థరూర్‌ రియాక్షన్‌ ఇదే

ఢిల్లీ: ఉగ్ర‌వాదుల‌కు అండ‌గా నిలుస్తున్న పాకిస్తాన్‌ను ప్ర‌పంచ దేశాల్లో ఎండ‌గ‌ట్టేందుకు ఏర్పాటు చేసిన అఖిలపక్ష నేతల్లో కేంద్ర ప్ర‌భుత్వం త‌నను ఎంపిక చేయ‌డంపై కాంగ్రెస్ ఎంపీ శ‌శిథ‌రూర్ స‌మ‌ర్థించుకున్నారు. తాను కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఏ రాజకీయ కోణంలో చూడడం లేదు. ఇది దేశానికి సేవ చేయాల్సిన సమయం’ అని స్పష్టం చేశారు.ఉగ్రవాదులకు అండగా నిలుస్తున్న పాకిస్తాన్‌ తీరును ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సహా ప్రపంచ దేశాల్లో ఎండగట్టడానికి, ఉగ్రవాదంపై భారత్‌ వైఖరిని వివరించడానికి కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష నేతలతో ఏడు బృందాలు ఏర్పాటు చేసింది. కాంగ్రెస్‌ ప్రతిపాదించిన నాలుగు పేర్లను పక్కనపెట్టి, ఆ పార్టీ ఎంపీ శశి థరూర్‌ను ఎంపిక చేయడం సంచలనాత్మకంగా మారింది. అంతేకాకుండా ఓ బృందానికి శశి థరూర్‌ నేతృత్వం వహిస్తారని ప్రకటించడం గమనార్హం. ఈ ఎంపికపై శ‌శిథ‌రూర్ స్పందించారు. ‘మాజీ విదేశాంగ వ్యవహారాల శాఖ అనుభవం కారణంగా కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తాను ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించాలని అడిగారు. కిరణ్ రిజిజు అడిగిన వెంటనే నేను అందుకు అంగీకరించాను. ఇది దేశ సేవకు సంబంధించింది. దేశం సంక్షోభంలో ఉన్నప్పుడు, కేంద్ర ప్రభుత్వం ఒక పౌరుడిని సహాయం కోరితే ఇంకేం సమాధానం ఇవ్వాలి?అని ప్రశ్నించారు. తాను తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ అసంతృప్తిగా ఉందా? అన్న ప్ర‌శ్న‌కు ఆ విషయం పార్టీకి, కేంద్రానికి సంబంధించింది. మీరు కాంగ్రెస్‌ను అడగాలి’ అని సూచించారు. పార్టీ మిమ్మల్ని అవమానించిందా? అన్న ప్ర‌శ్న‌కు.. నన్ను అంత తేలికగా అవమానించలేరు. నా విలువ నాకు తెలుసని సమాధానమిచ్చారు. దేశంపై దాడి జరిగినప్పుడు, అందరం ఒకే స్వరం వినిపించడం, ఐక్యతగా నిలబడటం దేశానికి మంచిది. కేంద్రం ఆయనను దేశ ప్రతినిధిగా ఎంపిక చేయడాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.

IMF 11 New Conditions For Pakistan After Operation Sindoor5
పాకిస్తాన్‌కు ఊహించని షాక్‌.. బిగ్‌ ట్విస్ట్‌ ఇచ్చిన IMF

ఇస్లామాబాద్‌: దాయాది దేశం పాకిస్తాన్‌కు బిగ్‌ షాక్‌ తగిలింది. భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత.. పాకిస్తాన్‌పై అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (IMF) ఫుల్‌ ఫోకస్‌ పెట్టింది. పాకిస్తాన్‌పై కొత్త ఆర్థికపరమైన షరతులను విధించింది. దీంతో, పాకిస్తాన్‌ ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్టు సమాచారం.వివరాల ప్రకారం.. పాకిస్తాన్‌పై మరో 11 కొత్త ఆర్థికపరమైన షరతులను ఐఎంఎఫ్‌ విధించింది. తాజాగా విధించిన షరతులతో ఐఎంఎఫ్‌ విధించిన షరతుల సంఖ్య 50కి చేరుకుంది. పాకిస్తాన్ రాబోయే ఆర్థిక సంవత్సరానికి రక్షణ బడ్జెట్‌ను రూ.2.414 ట్రిలియన్‌గా ప్రణాళిక వేస్తోంది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే రూ.252 బిలియన్లు అంటే 12% అధికం. ఈ నేపథ్యంలోనే ఐఎంఎఫ్‌ కొత్త షరతులు విధించినట్టు తెలుస్తోంది.కొత్త షరతులు ఇవే.. జూన్ 2025 లోగా ఐఎంఎఫ్‌ లక్ష్యాలకు అనుగుణంగా 2026 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను పార్లమెంటు ఆమోదించాలి. ఐఎంఎఫ్‌ సూచించిన గవర్నెన్స్ డయాగ్నొస్టిక్ అసెస్మెంట్ ఆధారంగా ప్రభుత్వ బలోపేతానికి చేపట్టే చర్యల ప్రణాళికను ప్రభుత్వం ప్రచురించాలి. అంతేకాకుండా 2027 తర్వాతి ఆర్థిక రంగం పరిపాలన, నియంత్రణ గురించి ప్రణాళిక రూపొందించాలి. ఇది 2028 నుండి సంస్థాగత మరియు నియంత్రణ వాతావరణాన్ని వివరిస్తుంది.🚨BREAKING: IMF imposes 11 new conditions on Pak, warns it against risks to bailout programme: Report#IndiaPakistanWar #IndiaPakistanTensions pic.twitter.com/CqBS9vF6eF— 8bit Market (@8bit_market) May 18, 2025అలాగే, జూన్ నెల లోపు నాలుగు రాష్ట్రాలు కొత్త వ్యవసాయ ఆదాయపు పన్ను చట్టాలను అమలు చేయాలి. దీని కోసం పన్ను ప్రక్రియ, రిజిస్ట్రేషన్, ప్రచార కార్యక్రమం ఇంకా వాటి అమలుకై ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి. ఎనర్జీ రంగంలో కొత్త షరతులను తీసుకురావాలని తెలిపింది. ఇందులో భాగంగా.. ఫిబ్రవరి 15, 2026 నాటికి గ్యాస్ చార్జీలను సవరించాలని, ఇంకా మే నెలాఖరులోపు ఈ ఆర్డినెన్స్‌ను శాశ్వత చట్టంగా మార్చాలని తెలిపింది.ఇంకా ప్రస్తుతం ఉన్న రూ.3.21 యూనిట్ పరిమితిని జూన్ లోపు తొలగించాలని తెలిపింది. వీటితోపాటు, 2035 నాటికి ప్రత్యేక పార్కులకు ఇచ్చే రాయితీలను పూర్తిగా తొలగించాల్సిందిగా పాకిస్తాన్‌ సర్కార్‌ను ఐఎంఎఫ్‌ కోరింది. దీని కోసం ఈ ఏడాది చివర్లో నివేదిక సమర్పించాలని తెలిపింది. అలాగే జూలై చివరి నాటికి, వాణిజ్య ప్రయోజనాల కోసం ఐదు సంవత్సరాలలోపు వాడిన కార్ల దిగుమతికి అనుమతి చట్టసభకు సమర్పించాలని తెలిపింది. ఈ క్రమంలో ఐఎంఎఫ్‌ విధించిన కొత్త షరతులతో పాకిస్తాన్‌కు టెన్షన్‌ మొదలైనట్టు తెలుస్తోంది.

Confirm Tatkal ticket Railway passengers should follow these 5 things6
కన్ఫర్మ్ తత్కాల్ టికెట్ దక్కాలంటే.. 5 సూత్రాలు

రైళ్లలో ప్రతిరోజూ కోట్లాది మంది ప్రయాణిస్తుంటారు. ఇక పండుగల సమయంలో అయితే రైలు ప్రయాణీకుల సంఖ్య చాలా రెట్లు పెరుగుతుంది. ఇటువంటి పరిస్థితిలో కన్ఫర్మ్ టికెట్ పొందాలంటే చాలా కష్టపడాలి. అప్పటికప్పుడు ప్రయాణాలు చేసేవారి కోసం తత్కాల్‌ బుకింగ్ (Tatkal ticket) ఆప్షన్ ఉన్నప్పటికీ కన్ఫర్మ్ టికెట్ దక్కడం అంత సులభం కాదు. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీకు కొన్ని చిట్కాలను తెలియజేస్తున్నాం. వీటిని పాటిస్తే మీరు ఇతరులకన్నా చాలా వేగంగా తత్కాల్ టికెట్లను బుక్ చేయవచ్చు. తద్వారా కన్ఫర్మ్‌ టికెట్‌ లభించే అవకాశం ఉంటుంది.👉 ఇంటర్నెట్ కనెక్షన్ చెక్‌ చేసుకోండిరైల్వే తత్కాల్ టికెట్లు బుక్ చేసే ముందు మీ ఇంటర్నెట్ కనెక్షన్‌ సక్రమంగా ఉందో లేదో చెక్‌ చేసుకోండి. తత్కాల్ టికెట్‌ చేస్తున్నప్పుడు 1-2 నిమిషాల సమయం కూడా లభించదు. అటువంటి పరిస్థితిలో మీ ఇంటర్నెట్ కనెక్షన్‌లో అంతరాయం కలిగితే టికెట్‌ బుకింగ్‌ ఆలస్యమై కన్ఫర్మ్‌ టికెట్‌ దక్కే అవకాశం ఉండదు.👉 సరైన సమయంలో లాగిన్ అవ్వాలితత్కాల్ బుకింగ్ చేసుకోవాలంటే సరైన సమయంలో లాగిన్ అవ్వాలి. ఏసీ కోచ్ కోసం తత్కాల్ బుకింగ్ ప్రతిరోజూ ఉదయం 10 గంటలకు, స్లీపర్ కోచ్ కోసం తత్కాల్ బుకింగ్ ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. కాబట్టి బుకింగ్ ప్రారంభానికి 2-3 నిమిషాల ముందుగానే లాగిన్ అవ్వాలి.👉 మాస్టర్ లిస్ట్ సిద్ధం చేసుకోండిఐఆర్‌సీటీసీలో కస్టమర్లకు మాస్టర్ లిస్ట్ అనే ప్రత్యేక ఫీచర్‌ అందుబాటులో ఉంది. ఇందులో ప్రయాణీకుల వివరాలను బుకింగ్ చేయడానికి ముందే నింపి సిద్ధంగా ఉంచుకోవచ్చు. ఇది బుకింగ్ చేసేటప్పుడు సమయాన్ని చాలా ఆదా చేస్తుంది.👉 యూపీఐ పేమెంట్తత్కాల్‌ బుకింగ్ సమయంలో టికెట్‌ మొత్తాన్ని చెల్లించేందుకు క్రెడిట్, డెబిట్ కార్డులకు బదులుగా యూపీఐ ద్వారా పేమెంట్ చేయవచ్చు. ఇది మీ సమయాన్ని ఆదా చేస్తుంది. దీంతో ప్రక్రియ వేగంగా పూర్తయి కన్ఫర్మ్‌ టికెట్‌ మీ సొంతమవుతుంది.👉 రైళ్లను ఎంచుకోవడంబుకింగ్ చేసే ముందు తత్కాల్ టికెట్లు పొందడానికి ఎక్కువ అవకాశం ఉన్న రైళ్లను ఎంచుకోవాలి. లాంగ్ జర్నీ రైళ్లకు బదులుగా మీరు ప్రయాణించాల్సిన స్టేషన్ల మధ్య మాత్రమే తిరిగే రైళ్లను ఉదాహరణకు ప్రత్యేక రైళ్లు ఎంచుకుంటే కన్ఫర్మ్‌ టిక్కెట్లు పొందే అవకాశాలు ఎక్కువుంటాయి.

PM Modi Announces Ex Gratia On Hyderabad Old City Incident Victims7
పాతబస్తీ ప్రమాదంపై మోదీ ఆరా.. బాధితులకు రెండు లక్షల పరిహారం

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని చార్మినార్‌కు సమీపంలోని గుల్జార్ హౌస్‌లో భారీ అగ్నిప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మృతిచెందిన వారికి మోదీ సంతాపం తెలిపారు. ఇదే సమయంలో మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.పాతబస్తీలో జరిగిన అగ్ని ప్రమాదంపై ప్రధాని మోదీ ఆరా తీశారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ సంతాపాన్ని ప్రకటించారు. పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయల పరిహారం మోదీ ప్రకటించారు. గాయపడిన వారికి యాభై వేల రూపాయల సాయాన్ని అందించనున్నట్టు తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సౌకర్యం కల్పించాలని కోరారు. మృతుల కుటుంబాలు ఈ ఘటన నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులకు తక్షణమే కేంద్ర ప్రభుత్వం సాయం ప్రకటించిందని పీఎంవో ట్విట్టర్‌ వేదికగా పేర్కొంది.Deeply anguished by the loss of lives due to a fire tragedy in Hyderabad, Telangana. Condolences to those who have lost their loved ones. May the injured recover soon.An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased. The injured would be…— PMO India (@PMOIndia) May 18, 2025సీఎం రేవంత్‌ దిగ్భ్రాంతి..అగ్ని ప్రమాద ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో 17 మంది మృతి చెందడం బాధాకరమన్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు ఘటనా స్థలాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్‌ పరిశీలించారు. అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.ఇదిలా ఉండగా.. పాతబస్తీలో అగ్ని ప్రమాదం కారణంగా ఇప్పటి వరకు 17 మంది మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, నలుగురు మహిళలు ఉన్నారు. ప్రమాదంతో భవనంలో ఉన్న పలువురు ఊపిరి ఆడక స్పృహ కోల్పోయారు. దీంతో వారిని ఉస్మానియా, యశోద (మలక్‌పేట), డీఆర్డీవో అపోలో ఆస్పత్రులకు తరలించారు. కొందరు ఘటనాస్థలంలో.. మరికొందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ మృతిచెందారు. షార్ట్‌ సర్క్యూట్‌ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి అగ్నిమాపక, డీఆర్‌ఎఫ్‌, జీహెచ్‌ఎంసీ, పోలీసు సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు చేపట్టి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. భవనంలో ఉన్న మరికొందరిని బయటకు తీసుకొచ్చారు. గుల్జార్‌ హౌస్‌ పరిసరాల్లో దట్టంగా పొగ కమ్ముకోవడంతో శ్వాస తీసుకునేందుకు స్థానికులు ఇబ్బందులు పడ్డారు.మృతుల వివరాలు..రాజేంద్రకుమార్‌ (67)అభిషేక్‌ మోదీ (30)సుమిత్ర (65)మున్నీబాయి (72)ఆరుషి జైన్‌ (17)శీతల్‌ జైన్‌ (37)ఇరాజ్‌ (2)హర్షాలీ గుప్తా (7)రజని అగర్వాల్‌అన్య మోదీపంకజ్‌ మోదీవర్ష మోదీఇద్దిక్కి మోదీరిషభ్‌ప్రథమ్‌ అగర్వాల్‌ప్రాంశు అగర్వాల్‌.

No India-Pakistan DGMO Talks Today, Confirms Indian Army, Ceasefire To Continue8
ఇండియన్‌ ఆర్మీ కీలక ప్రకటన

ఢిల్లీ: ఇండియన్‌ ఆర్మీ కీలక ప్రకటన చేసింది. పాక్‌తో కాల్పుల విరమణకు గడువు లేదని స్పష్టం చేసింది. ఈ రోజు డీజీఎంవో చర్చలు లేవని తెలిపింది. కాల్పుల విరమణ కొనసాగుతుందని పునరుద్ఘాటించింది.పహల్గాం ఉగ్రదాడి (Terrorist Attack) అనంతరం భారత్‌ చేపట్టిన ప్రతీకార దాడులతో పాకిస్తాన్‌ ఉక్కిరిబిక్కిరయ్యింది. ఆపరేషన్‌ సిందూర్‌తో దాయాది దేశం విలవిల్లాడింది. చివరకు ఉద్రిక్తతలు తగ్గించాలని పాక్‌ (Pakistan)శరణుగోరింది. పాక్‌ అర్జించడంతో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. మే 10న ఇరు దేశాల డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ మిలిటరీ ఆపరేషన్స్‌ (DGMOs) స్థాయిలో కాల్పుల విరమణ అవగాహనపై ఒప్పందం కుదర్చుకున్నాయి. ఈ తరుణంలో కాల్పుల విరమణ అవగాహనకు ముగింపు తేదీ లేదని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. Some media houses are reporting that the ceasefire between India and Pakistan is ending today. In addition, queries are also being received if a DGMO-level talk is scheduled today.According to the Indian Army, no DGMO talks are scheduled today. As far as the continuation of a…— ANI (@ANI) May 18, 2025

Tadipatri SP Jagadeesh Letter To Kethireddy Peddareddy9
కేతిరెడ్డి పెద్దారెడ్డికి లేఖ.. వివాదాస్పదంగా తాడిపత్రి ఎస్పీ తీరు!

సాక్షి, అనంతపురం: వైఎస్సార్‌సీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి విషయంలో పోలీసులు మరోసారి చేతులెత్తేశారు. కేతిరెడ్డి పెద్దారెడ్డికి రక్షణ కల్పించలేమని స్వయంగా ఎస్పీ జగదీష్ లేఖ రాశారు. ఈ క్రమంలో తాడిపత్రి పర్యటనను వారం లేదా పది రోజులు వాయిదా వేసుకోవాలని ఎస్పీ జగదీష్ సూచించడం గమనార్హం.ఏపీలో కూటమి సర్కార్‌ పాలనలో పోలీసులు తీరు వివాదాస్పదంగా మారుతోంది. ఇప్పటకే ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ నేతలను అక్రమ కేసులతో టార్గెట్‌ చేసి అరెస్ట్‌ చేస్తుండగా.. మరోవైపు, భద్రత కల్పించడంలో కూడా పోలీసులు విఫలమవుతున్నారు. తాజాగా కేతిరెడ్డి పెద్దారెడ్డికి ఎస్పీ జగదీష్ రెండోసారి లేఖ రాశారు. లేఖలో పెద్దారెడ్డికి రక్షణ కల్పించలేమని తెలిపారు. తాడిపత్రి పర్యటనను వారం లేదా పది రోజులు వాయిదా వేసుకోవాలని మాజీ ఎమ్మెల్యేకు సూచించారు. టీడీపీ మహానాడు, రాప్తాడు జంట హత్యలు, ఎంపీపీ ఉప ఎన్నికల దృష్ట్యా భద్రత కల్పించలేమని చెప్పుకొచ్చారు.ఇదిలా ఉండగా.. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి తాడిపత్రి వెళ్లేందుకు భద్రత కల్పించాలని ఇప్పటికే హైకోర్టు ఆదేలిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పెద్దారెడ్డి తాను తాడిపత్రి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఇప్పటికే ఎస్పీకి తెలిపారు. అయిన్పటికీ ఎస్పీ ఇదే తీరుగా వ్యవహరిస్తూ వివాదంలో చిక్కుకుంటున్నారు. వివిధ కారణాలు చూపి భద్రత కల్పించలేమని చెప్పుకుంటూ వస్తున్నారు. ఇక, అంతకుముందు కూడా పెద్దారెడ్డి తాడిపత్రి పర్యటనకు భద్రత కల్పించలేమంటూ చేతులెత్తేశారు ఎస్పీ జగదీష్‌. ఈ నెల తొమ్మిదో తేదీన సీఎం చంద్రబాబు పర్యటన ఉన్నందున భద్రత ఇవ్వలేమని ఎస్పీ తెలిపారు. ఎస్పీ లేఖతో పెద్దారెడ్డి తాడిపత్రి పర్యటన వాయిదా పడింది.మరోవైపు.. తాడిపత్రి వస్తే అంతుచూస్తామంటూ తాడిపత్రి టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి పదేపదే బెదిరిస్తున్నారు. పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లడానికి హైకోర్టు అనుమతి ఇచ్చినా.. తాను మాత్రం దాడులు చేస్తానని జేసీ బహిరంగంగా సవాల్ చేశారు. పెద్దారెడ్డికి ఎవరూ మద్దత ఇవ్వొద్దని, తనకు పెద్దారెడ్డితో గొడవలు ఉన్నాయని, ఒకవేళ వస్తే తిరిగి వెళ్లడు అంటూ వార్నింగ్ ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. తాడిపత్రి వెళ్లడానికి హైకోర్టు అనుమతిచ్చిన క్రమంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇలా వ్యాఖ్యానించడం ఏంటో అర్థం కావడం లేదని పలువురు విమర్శిస్తున్నారు.

Nandamuri Balakrishna Brand Is Brand Ambassador For Liquor Company: Raveena Tandon Comment Goes Viral10
బాలయ్యా, నీ హీరోయిన్ మద్యం ప్రచారంపై ఏమందో విన్నావా?

ఆయన ఓ ప్రముఖ సినీనటుడు,అంతేకాదు ఓ సీనియర్ రాజకీయ నాయకుడు.. అంతవరకు అయినా పర్లేదేమో కానీ నందమూరి బాలకృష్ణ పద్మ భూషణ్ పురస్కార గ్రహీత కూడా. అలాంటి నేపథ్యం వున్న బాలకృష్ణ(Nandamuri Balakrishna ) మాన్షన్ హౌస్ మద్యం ద్వారా పేరొందిన బ్రాండ్ కు సంబంధించిన ప్రకటనలో నటించడం వివాదాస్పదంగా మారింది. ఇటీవలే భారత ప్రభుత్వం నుంచి పద్మ భూషణ్ పురస్కారాన్ని అందుకున్న బాలకృష్ణ, అలాంటి గౌరవనీయమైన పురస్కారం పొందిన తర్వాత మద్యం ప్రకటనలో పాల్గొనడం అనుచితమని నెటిజన్లు విమర్శిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా పలువురు బాలకృష్ణను టార్గెట్ చేస్తూ ట్రోలింగ్ చేస్తున్నారు. “పద్మ భూషణ్ పొందిన వ్యక్తి ఇలాంటి వాణిజ్య ప్రకటనలు చేయడం ఎలా అనుమతిస్తారు? అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారుఇదిలా ఉండగా, బాలకృష్ణ నుంచి దీనిపై ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదు. అయితే ఈ వివాదం రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఒక ప్రజా ప్రతినిధిగా ఇలాంటి ప్రకటనల్లో నటించడం బాధ్యత లేనితనమే అని పలువురు అభిప్రాయపడుతున్నారు. బాలకృష్ణ మద్యం యాడ్ వివాదం సామాజిక మాధ్యమాల్లో చర్చలకు గతం లో ని కొన్ని విషయాల ప్రస్తావనకు దారి తీసిందిబాలకృష్ణ ఆ మద్యం బ్రాండ్ పై తన అభిమానాన్ని పదే పదే చాటు కోవడం పై అనేక రకాల విమర్శలు వచ్చాయి, అవేవీ పట్టించుకోకుండా ఇప్పుడు ఏకంగా ఆ బ్రాండ్ ని ప్రమోట్ చేయడo బాలకృష్ణ బరితెగింపు కి నిదర్శనం గా అనిపిస్తోంది. గతంలో ఈ తరహా మద్యం బ్రాండ్ల ప్రచారంలో సెలబ్రిటీలు పాల్గొనడం పై ఉవ్వెత్తున విమర్శలు రావడం దాంతో అనేకమంది స్టార్స్ ఇక తాము అలాంటి ప్రకటనల్లో కనిపించం అని నిర్ణయం తీసుకోవడాన్నీ పలువురు గుర్తు చేసుకుంటున్నారు.ఓ కూల్ డ్రింక్ బ్రాండ్ ప్రచారం చేసినందుకే చిరంజీవి పై విమర్శలు రావడం దాంతో అయన వెనక్కి తగ్గడం కూడా గుర్తు చేస్తున్నారు. అంతేకాదు ఒకనాటి బాలకృష్ణ హీరోయిన్, బంగారు బుల్లోడు సినిమా లో అయన సరసన నటించిన రవీనాటండన్(Raveena Tandon) తారల మద్యం ప్రచారం పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేయడం గమనార్హం. సెలబ్రిటీలుగా తమపై ఎక్కువ సామాజిక బాధ్యత ఉంటుందనీ, ఆల్కహాల్ ఉత్పత్తులకు తాము ప్రచారం చేయడం అంటే యువత ను తప్పుదారి పట్టించడమే అవుతుంది అని ఆమె వ్యాఖ్యనించారు.. మరి బాలయ్య కి ఇలాంటి మంచి మాటలు చెవికెక్కుతాయా... లేక మంచి చెడూ జాంతానై.. మా బ్లడ్డు బ్రీడు సపరేట్ హై.. అంటూ ఇలాగే కంటిన్యూ అయిపోతారా.. దీనికి ఆన్సర్ కోసం జనం మాత్రమే కాదు ఆయన్ను వరించిన పద్మ భూషణ్ కూడా ఆశగా ఎదురు చూస్తోంది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement