Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

YSRCP councilors from Thiruvur Nagar Panchayat in NTR district met YS Jagan1
కూటమి ప్రభుత్వ అరాచకాలను దీటుగా ఎదుర్కొందాం: వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి/తిరువూరు: రాష్ట్రంలో ప్రజా­స్వామ్యం ఖూనీ జరుగుతోందని.. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో మెజారిటీ లేకపోయినా కూటమి నేతలు బరితెగించి అనైతిక రాజకీయాలకు పాల్పడుతున్నారని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ అరాచకాలను దీటుగా ఎదుర్కొందామన్నారు. తాడేపల్లి­లోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం వైఎస్‌ జగన్‌ను ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరు నగర పంచాయతీ వైఎస్సార్‌సీపీ కౌన్సి­లర్లు కలిశారు. చైర్‌పర్సన్‌ ఎన్నిక సందర్భంగా తమపై టీడీపీ నాయకులు చేసిన దాడుల గురించి వివరించారు. పోలీసులు, కూటమి నేతలు, టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్‌ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించిన తీరును వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ అరాచకాలు, దాష్టీకాలను దీటుగా ఎదుర్కొందామని.. చట్టపరంగా, న్యాయపరంగా పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనేక ఇబ్బందులు పెట్టినా ధైర్యంగా నిలబడ్డారంటూ కౌన్సిలర్లను అభినందించారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్, తిరువూరు వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్‌ నల్లగట్ల స్వామిదాసు, కౌన్సిలర్లు తంగిరాల వెంకటరెడ్డి, పరసా శ్రీనివా­స­రావు, మోదుగు ప్రసాద్, ఇనపనూరి చిన్నారి, పాలం రమాదేవి, గుమ్మా వెంకటేశ్వరి, పరసా సత్యనారాయణ, వెలుగోటి విజయలక్ష్మి, షేక్‌ నదియా, రామవరపు మంజుల, జెడ్పీటీసీ సభ్యుడు యరమల రామచంద్రారెడ్డి, మాజీ జెడ్పీ చైర్‌పర్సన్‌ నల్లగట్ల సుధారాణి, వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు కలకొండ రవికుమార్, సీనియర్‌ నాయకులు మద్దిరెడ్డి సూర్యనారాయణరెడ్డి, నరెడ్ల వీరారెడ్డి, తిరువూరు మండలాధ్యక్షుడు తాళ్లూరి నవీన్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు

Maoist Party Supreme Commander dead in Crossfire2
నంబాల ఎన్‌కౌంటర్‌.. 27 మంది మృతి

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ సుప్రీం కమాండర్, జాతీయ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్‌ బసవరాజు (71) మృతి చెందారు. ఈ ఎదురుకాల్పుల్లో పలువురు కీలక నేతలు సహా మొత్తం 27 మంది మావోయిస్టులు కూడా మరణించారు. ఛత్తీస్‌గఢ్‌ లోని నారాయణపూర్‌–బీజాపూర్‌ జిల్లా సరిహద్దు అబూ జ్‌మఢ్‌ అడవుల్లో ఇంద్రావతి నది పరీవాహక ప్రాంతంలో బుధవారం ఉదయం ఈ ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఓ డీఆర్‌జీ జవాను కూడా మృతి చెందగా పలువురు గాయపడినట్లు ఛత్తీస్‌గఢ్‌ సీనియర్‌ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. కేశవరావు మరణాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ధ్రువీకరించారు. జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న ఓ మావోయిస్టు నేత ఎదురుకాల్పుల్లో మరణించడం ఇదే మొదటిసారని తెలిపారు. ప్రధాని మోదీ కూడా ఎన్‌కౌంటర్‌పై స్పందించారు. ‘ఇదో అసాధారణ విజయం’ అని పేర్కొన్నారు. కేశవరావు తలపై కోటిన్నర రూపాయల రివార్డు ఉన్నట్లు సమాచారం. కాగా మావోయిస్టు ఉద్యమానికి వెన్నెముక గా ఉన్న నంబాల మృతి మావోయిస్టు పారీ్టకి పెద్ద ఎదురుదెబ్బని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జి ల్లాలో జని్మంచిన కేశవరావు వరంగల్‌ ఆర్‌ఈసీ (ఇప్పటి నిట్‌)లో ఎంటెక్‌ చదువుతూ అజ్ఞాతంలోకి వెళ్లారు. పక్కా సమాచారంతో.. అబూజ్‌మఢ్‌ అడవుల్లో ఇంద్రావతి నది సమీపాన మావోయిస్టు అగ్రనేత షెల్టర్‌ తీసుకున్నారని, పార్టీ కేంద్ర కమిటీ, పొలిట్‌బ్యూరో సభ్యులతో పాటు మాడ్‌ డివిజన్‌ సీనియర్‌ కేడర్, పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ (పీఎల్‌జీఏ) సభ్యులు సైతం ఉన్నారని పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో సీఆర్‌పీఎఫ్, కోబ్రా బలగాలకు తోడు నారాయణపూర్, దంతెవాడ, బీజాపూర్, కొండగావ్‌ జిల్లాల డీఆర్‌జీ దళాలు మంగళవారం రాత్రి సెర్చ్‌ ఆపరేషన్‌ మొదలెట్టాయి. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున ఇరువర్గాల మధ్య మొదలైన కాల్పులు ఉదయం 11గంటల వరకు కొనసాగాయి. ఈ కాల్పుల్లో మధు, నవీన్‌ అనే డివిజన్‌ స్థాయిæ నేతలు కూడా మరణించినట్లు తెలుస్తోంది. మధు దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీ సభ్యుడు కాగా, నవీన్‌ మావోయిస్టు పార్టీ పత్రిక ‘జంగ్‌’ బాధ్యతలు చూస్తున్నట్లు సమాచారం. ఆపరేషన్‌ జరిగిన తీరుతెన్నులు, ఇతర మృతుల వివరాలను పోలీసులు ప్రకటించలేదు. అయితే 27 మంది మావోయిస్టుల మృతదేహాలతో పాటు పెద్ద సంఖ్యలో ఆయుధాలు స్వా«దీనం చేసుకున్నట్లు సమాచారం. కాగా మావోయిస్టుల కోసం గాలింపు ఇంకా కొనసాగుతోందని పోలీసులు చెప్పారు. ల్యాప్‌టాప్‌లు, కీలక డాక్యుమెంట్లు ఆధారంగా.. గతనెల 18న నారాయణ్‌పూర్‌ జిల్లాలో జరిగిన ఆపరేషన్‌లో మావోయిస్టులకు సంబంధించిన డంప్‌ను భద్రతా దళాలు కనుగొన్నాయి. ఇందులో కీలక డాక్యుమెంట్లు, పుస్తకాలతో పాటు 11 ల్యాప్‌టాప్‌లు లభించాయి. వాటిలో లభించిన వివరాల ఆధారంగానే ఏప్రిల్‌ 21న తెలంగాణ – ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులోని కర్రిగుట్టల్లో ఆపరేషన్‌ బ్లాక్‌ ఫారెస్ట్‌ భారీ స్థాయిలో మొదలైందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే కర్రిగుట్టల ఆపరేషన్‌తో భారీ ఫలితం రాబోతుందని ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు ప్రకటించారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. ఆపరేషన్‌ ముగిసేసరికి వేర్వేరు ఎన్‌కౌంటర్లలో 31 మంది సాధారణ స్థాయి మావోయిస్టులు చనిపోగా డంప్‌లు, ఆయుధ తయారీ పనిముట్లను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. మళ్లీ విశ్లేషించుకుని..‘వారి’ నుంచి సమాచారం తెప్పించుని.. డంప్‌లో లభించిన ల్యాప్‌టాప్‌లు, డాక్యుమెంట్లలో లభించిన సమాచారాన్ని విశ్లేషించుకోవడంలో జరిగిన పొరపాటు కారణంగానే కర్రిగుట్టలో ఆశించిన విజయం దక్కలేదని భావించిన దళాలు మరింత జాగ్రత్తగా సమాచారాన్ని విశ్లేషించుకున్నట్లు సమాచారం. అందులో భాగంగా నంబాల కేశవరావుకు రక్షణ కల్పించే 7వ నంబర్‌ కంపెనీలో పనిచేసి లొంగిపోయిన కొందరు మావోయిస్టుల నుంచి మరోసారి సమాచారం తెప్పించుకున్నట్టు తెలుస్తోంది. ఈ రెండింటినీ కచ్చితత్వంతో డీకోడ్‌ చేయడం ద్వారా నంబాల ఎక్కడున్నాడనే అంశాన్ని భద్రతా దళాలు పసిగట్టి మెరుపుదాడి చేసినట్టు తెలుస్తోంది. అంత ఈజీగా ఎలా? సాధారణంగా కేంద్ర కమిటీ సభ్యులకు మూడంచెల భద్రతా వ్యవస్థ ఉంటుంది. ఈ వలయాన్ని ఛేదించుకుని వారి దగ్గరికి చేరుకోవడం చాలా కష్టంతో కూడుకున్న పని. అయినా స్వల్ప నష్టంతోనే పోలీసులు నంబాల దగ్గరికి ఎలా చేరుకున్నారనేది మిస్టరీగా మారింది. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం.. ఏడాది క్రితం వరకు నంబాల కేశవరావుకు 70 మందితో కూడిన కంపెనీ రక్షణ కల్పించేది. ఇందులో కనీసం 40 మంది వద్ద ఏకే 47 లాంటి అత్యాధునిక ఆయుధాలు ఉంటాయని, తన చుట్టూ ఉన్న బృందం ఆధునిక ఆయుధాలతో ఉంటే నంబాల తన చేతిలో ఎప్పుడూ ల్యాప్‌టాప్‌తో ముందుకు సాగుతారని తెలుస్తోంది. తాగునీరు, ఆహారం విషయంలోనూ ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తారని, రాత్రి వేళ సైతం రెండు, మూడు గంటల కంటే ఎక్కువ నిద్రించరని సమాచారం. అయితే ఇటీవల పెరిగిన నిర్బంధం కారణంగా భద్రతను 28 మందికి కుదించినట్టు తెలుస్తోంది.

Rasi Phalalu: Daily Horoscope On 22-05-2025 In Telugu3
ఈ రాశి వారికి ఆకస్మిక ధన,వస్తులాభాలు

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు వైశాఖ మాసం, తిథి: బ.దశమి రా.8.47 వరకు, తదుపరి ఏకాదశి, నక్షత్రం: పూర్వాభాద్ర ప.1.49 వరకు, తదుపరి ఉత్తరాభాద్ర,వర్జ్యం: రా.10.54 నుండి 12.25 వరకు, దుర్ముహూర్తం: ఉ.9.48 నుండి 10.39 వరకు,తదుపరి ప.2.55 నుండి 3.46 వరకు,అమృత ఘడియలు: ఉ.6.10 నుండి 7.41 వరకు, హనుమజ్జయంతి.సూర్యోదయం : 5.30సూర్యాస్తమయం : 6.22రాహుకాలం : ప.1.30 నుండి 3.00 వరకుయమగండం : ఉ.6.00 నుండి 7.30 వరకు మేషం.... వ్యయప్రయాసలు. బంధువర్గంతో వైరం. అనుకోని ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. దైవదర్శనాలు. పనుల్లో నిరుత్సాహం. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.వృషభం... శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. యత్నకార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. మిత్రుల రాక సంతోషం కలిగిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.మిథునం... బంధువుల తోడ్పాటుతో ముందడుగు వేస్తారు. ఆకస్మిక ధన,వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విచిత్ర సంఘటనలు. నూతన పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత.కర్కాటకం... రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. ఆరోగ్యం మందగిస్తుంది. మానసిక ఆందోళన. ధనవ్యయం. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం.సింహం.... వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. రుణాలు చేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆరోగ్య సమస్యలు. సోదరులు, మిత్రుల నుండి సమస్యలు రావచ్చు. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.కన్య.... ఇంటాబయటా ప్రోత్సాహం. ఆకస్మిక ధన, వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.తుల.... దూరపు బంధువుల నుంచి ముఖ్య సమాచారం. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. స్థిరాస్తి వృద్ధి. ప్రముఖులతో పరిచయాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు కొత్త హోదాలు.వృశ్చికం... మిత్రులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. అనారోగ్యం. విద్యార్థుల యత్నాలలో అవాంతరాలు. వృత్తి, వ్యాపారాలు ముందుకు సాగవు.ధనుస్సు... పనుల్లో జాప్యం. ఆర్థిక విషయాలలో ఒడిదుడుకులు. అనారోగ్యం. దేవాలయ దర్శనాలు. మిత్రుల నుండి ఒత్తిడులు. లేనిపోని ఖర్చులు. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.మకరం.... ఆకస్మిక ధనప్రాప్తి. సంఘంలో ఎనలేని గౌరవం. ఆస్తి ఒప్పందాలు. సోదరులతో సఖ్యత. ఉద్యోగయోగం. మీ ఖ్యాతి విస్తరిస్తుంది. వాహనసౌఖ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉన్నతి.కుంభం... శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. దూరప్రయాణాలు. రుణాలు చేస్తారు. మిత్రులతో వివాదాలు. అనారోగ్యం. ఇంటాబయటా ఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలు అంతగా అనుకూలించవు.మీనం... ముఖ్య∙కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. కీలక నిర్ణయాలు, ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

Donald Trump unveils plans for Golden Dome defence system4
అగ్రరాజ్యానికో గోల్డెన్‌ డోమ్‌!

వాషింగ్టన్‌: ప్రపంచంలోనే అగ్రరాజ్యం, అతిపెద్ద ఆర్థికవ్యవస్థ, అమేయమైన సైనిక శక్తి.. ఇలా అన్నీ ఉన్నా అమెరికాను సువిశాలమైన, విస్తారమైన భూభాగం భయపెడుతోంది. భూమి ఎక్కువుంటే ఎందుకు భయపడాలనే సందేహం రావొచ్చు. దేశం ఓ మోస్తరు విస్తీర్ణంలో ఉండే ఉన్న భూభాగమంతటికీ సమగ్ర స్థాయిలో రక్షణ కల్పించొచ్చు. అదే విశాల భూభాగమైతే శత్రు దేశ క్షిపణులు ఎక్కడ పడతాయో ఊహించడం కూడా కష్టం. అమెరికాను వేధిస్తున్న ఈ సమస్యకు అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థతో చెక్‌ పెడతానని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ శ్వేతసౌధంలో ప్రకటించారు. మొత్తంగా 175 బిలియన్‌ డాలర్ల వ్యయంతో గోల్డెన్‌ డోమ్‌ మిస్సైల్‌ డిఫెన్స్‌ వ్యవస్థను ఏర్పాట్లుచేయనున్నట్లు ఆయన వెల్లడించారు. 2029 జనవరిలోగా ఈ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చి యావత్‌ అమెరికా భూభాగాన్ని శత్రు దుర్బేధ్యంగా మార్చేస్తానని ఆయన ప్రకటించారు. అయితే ఈ గోల్డెన్‌ డోమ్‌ వ్యవస్థను ఏర్పాటుచేయడం అత్యంత ఖర్చుతో కూడిన వ్యవహారమని కాంగ్రెషనల్‌ బడ్జెట్‌ ఆఫీస్‌ స్పష్టంచేసింది. భూమి మీదే కాదు ఆకాశంలోనూ ఇందుకు సంబంధించి లేజర్‌ కాంతిపుంజం వెదజల్లే వ్యవస్థలను ప్రవేశపెట్టాల్సి ఉంటుందని బడ్జెట్‌ ఆఫీస్‌ తెలిపింది. ఇంతటి సంక్లిష్టమైన అధునాతన సాంకేతికతతో కూడిన అసాధారణ వ్యవస్థ నిర్వహణకు రాబోయే 20 సంవత్సరాల్లో ఏకంగా 542 బిలియన్‌ డాలర్లు ఖర్చవుతుందని అంచనావేసింది. ప్రస్తుతానికి అమెరికా పార్లమెంట్‌లో ట్రంప్‌ తొలి దఫాగా ప్రాజెక్ట్‌ కోసం కేవలం 25 బిలియన్‌ డాలర్లు మాత్రమే ప్రతిపాదించారని బడ్జెట్‌ ఆఫీస్‌ తెలిపింది.ఏమిటీ గోల్డెమ్‌ డోమ్‌?ఆపరేషన్‌ సిందూర్‌ వేళ పాకిస్తాన్‌ క్షిపణులను మన భూభాగంపై మోహరించిన సుదర్శన చక్ర(ఎస్‌–400) గగనతల రక్షణ వ్యవస్థ విజయవంతంగా అడ్డుకుంది. మార్గమధ్యంలోనే ఆ మిస్సైళ్లను కూల్చేసింది. గాజా భూభాగం మీద నుంచి హమాస్‌ సాయుధులు సంధించిన వందలాది క్షిపణులను సైతం ఇజ్రాయెల్‌ ‘ఐరన్‌ డోమ్‌’ గగనతల రక్షణ వ్యవస్థ ఇలాగే నేలమట్టంచేసి తమ నేలను కాపాడుకుంది. ఎస్‌–400, ఐరన్‌డోమ్‌లు భూతలం మీద మొహరించిన రక్షణ వ్యవస్థలు. వాహనాలపై బిగించిన రాకెట్‌ లాంఛర్‌ ఇందులో కీలకం. అయితే అమెరికా సిద్ధంచేయబోతున్న గోల్డెన్‌ డోమ్‌ కాస్తంత భిన్నమైంది. ఇది భూతల, గగనతల రక్షణ వ్యవస్థల మేళవింపు. లేజర్‌ కాంతి ఎంతటి కఠినమైన లోహాలనైనా కోసి పారేస్తుంది. ఆకాశంలోని ఉపగ్రహం లాంటి వ్యవస్థ ఈ లేజర్‌ కాంతి పుంజాన్ని శత్రు క్షిపణులపై ప్రయోగించి వాటిని సెకన్ల వ్యవధిలో నాశనం చేస్తుంది. గోల్డెన్‌ డోమ్‌లో ఈ లేజర్‌కాంతి విభాగమే అత్యంత కీలకమైంది. గోల్డెన్‌డోమ్‌లో భాగంగా పెద్దసంఖ్యలో ఉపగ్రహాలను నింగిలోకి ప్రవేశపెట్టి వాటిని నిఘా, దాడి వ్యవస్థలుగా తీర్చిదిద్దనున్నారు.లేజర్‌ కాంతి, సెన్సార్లు, శాటిలైట్ల సమ్మేళనంఈ గోల్డెన్‌ డోమ్‌ను లేజర్‌ కాంతి, సెన్సార్లు, పలు ఉపగ్రహాల, క్షిపణుల సమ్మేళనంగా చెప్పొచ్చు. అన్నీ కలిసి ఏకకాలంలో సమన్వయంతో పనిచేస్తూ నవతరం ‘మిస్సైల్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌’గా నిలిచిపోనున్నాయి. కృత్రిమ మేధ సాయంతో పనిచేసే సెన్సార్లను భూతలం మీద ఉండే గగనతల రక్షణ వ్యవస్థతో అనుసంధానిస్తారు. ఫలానా ప్రాంతం నుంచి శత్రు క్షిపణి దూసుకొస్తున్న విషయాన్ని భూతల, గగనతల సమ్మిళిత వ్యవస్థలు గుర్తించి వెంటనే ఆకాశంలోని లేజర్‌ కాంతిపుంజ విభాగానికి చేరవేస్తాయి. లేజర్‌కాంతి అవసరంలేని సందర్భాల్లో శత్రు క్షిపణిని అడ్డుకునేందుకు వెనువెంటనే క్షిపణులను ప్రయోగిస్తారు. సొంత క్షిపణితో పనికాదని నిర్ధారించుకోగానే అత్యంత తీక్షణమైన లేజర్‌ కాంతిని ఆ శత్రు క్షిపణిపై ప్రసరింపజేస్తారు. నేల మీద మొబైల్‌ లాంఛర్‌ నుంచి, యుద్ధవిమానం నుంచి వచ్చే క్షిపణులనూ ఈ లేజర్‌కాంతి నాశనం చేయగలదు. అలా అమెరికా గగనతలంలో కీలకమైన చోట్ల ఈ లేజర్‌బీమ్‌ లైటింగ్‌ సిస్టమ్స్‌ను సిద్ధంచేస్తారు. ఈ బహుళ అంచెల వ్యవçస్థలన్నీ ఎల్లవేళలా సమన్వయంతో పనిచేస్తూ అమెరికాను కంటికి రెప్పలా కాపాడతాయి. గోల్డెన్‌ డోమ్‌ ముఖ్యంగా నాలుగు పనులు చేస్తుంది. 1. ఫలానా చోట శత్రు క్షిపణి క్రియాశీలకంగా మారిందని గుర్తించగానే అది లాంఛర్‌ను దాటి బయటికొచ్చేలోపే నాశనంచేస్తుంది. 2. ఒకవేళ అప్పటికే బయల్దేరితే తొలిదశలోనే అడ్డుకుంటుంది. 3. లేదంటే మార్గమధ్యంలో నేలకూలుస్తుంది. 4. అప్పటికీ చేయిదాటిపోతే అది లక్ష్యాన్ని ఢీకొట్టే చిట్టచివరి నిమిషంలోనైనా మిస్సైల్‌ను మట్టుబెడుతుంది. ఈ పనులను కృత్రిమమేధ ఆధారిత కమాండ్‌ సిస్టమ్‌ చూసుకుంటుంది.స్టార్‌వార్స్‌ సిద్ధాంతం నుంచి..అంతరిక్షం నుంచి కాంతిపుంజాన్ని ప్రయోగించడమనేది ఇంకా ప్రయోగదశలోనే ఉందని అమెరికా ఎయిర్‌ఫోర్స్‌ సెక్రటరీ ట్రాయ్‌ మెయింక్‌ మంగళవారం వెల్లడించారు. అమెరికా రక్షణ శాఖ, యూఎస్‌ నార్తర్న్‌ కమాండ్‌లు సమష్టిగా గోల్డెన్‌ డోమ్‌ ప్రాజెక్టుపై పనిచేస్తు న్నాయి. ‘‘ సంప్రదాయక క్రూయిజ్, బాలిస్టిక్, హైపర్‌సోనిక్‌ క్షిపణులు, డ్రోన్లతోపాటు అణ్వస్త్ర సామర్థ్య క్షిపణులనూ ఈ గోల్డెన్‌ డోమ్‌ విజయవంతంగా అడ్డుకుంటుంది’’ అని రక్షణ మంత్రి పీట్‌ హెగ్సత్‌ చెప్పారు. యూఎస్‌ స్పేస్‌ఫోర్స్‌ జనరల్‌ మైఖేల్‌ గెటెలిన్‌ ఈ ప్రాజెక్ట్‌కు సారథ్యంవహిస్తారు. ఫోర్‌స్టార్‌ జనరల్‌ అయిన గెటెటిన్‌కు వైమానిక రంగంలో 30 ఏళ్ల అనుభవం ఉంది. తాము సైతం ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వాములుగా చేరతామని కెనడా తన ఆసక్తిని వెల్లడించింది. ఆయుధరంగ దిగ్గజం ‘లాక్‌హీడ్‌ మార్టిన్‌’ సంస్థ గోల్డెన్‌ డోమ్‌ ఉపకరణాలను అభివృద్ధిచేయనుంది. 80వ దశకంలో అమెరికా అధ్యక్షునిగా సేవలందించిన రొనాల్డ్‌ రీగన్‌ ‘స్టార్‌వార్స్‌’ సిద్ధాంతం, ఇజ్రాయెల్‌ ఐరన్‌డోమ్‌ వ్యవస్థల నుంచే గోల్డెన్‌ డోమ్‌ ఆలోచన పురుడుపోసుకుంది. క్షిపణులను అడ్డుకునే టెర్మినల్‌ హై ఆల్టిట్యూడ్‌ ఏరియా డిఫెన్స్, ఏగిస్‌ సిస్టమ్‌లనూ గోల్డెన్‌ డోమ్‌లో వినియోగించనున్నారు.సందేహాలు, అనుమానాలుఇంతవరకు అంతరిక్షంలో పరీక్షించని ఈ వ్యవస్థను కేవలం నాలుగేళ్లలోపు ఎలా అందుబాటులోకి తెస్తారనే ప్రశ్న తలెత్తుతోంది. గోల్డెన్‌ డోమ్‌లో పెద్ద సంఖ్యలో కొత్త ఉపగ్రహాలు, ఏఐ సెన్సార్లు అవసరం. ప్రపంచంలోనే అత్యధిక రుణభారాన్ని మోస్తున్న అమెరికా సర్కార్‌ ఈస్థాయి కొత్త భారీ బడ్జెట్‌ను ఇంత తక్కువ సమయంలో సమకూర్చుకోగలదా? అసలు ఇది సమర్థవంతంగా పనిచేస్తుందా? అనే సందేహాలు ఎక్కువయ్యాయి. హమాస్‌–ఇజ్రాయెల్‌ యుద్ధం తొలినాళ్లలో ఒకేరోజు ఒకేసారి 20 నిమిషాల వ్యవధిలో హమాస్‌ 5,000 స్వల్పశ్రేణి క్షిపణులను ప్రయోగించింది. వాటిని అడ్డుకోవడంలో ఐరన్‌డోమ్‌ విఫలమైంది. ఈ నేపథ్యంలో ఒక సాయుధ సంస్థే ఇన్ని మిస్సైళ్లను ప్రయోగించగల్గితే పేద్ద యుద్ధమే వస్తే రష్యాలాంటి దేశం ఇంకెంత స్థాయిలో విరుచుకుపడుతుందో ఊహించడం కూడా కష్టం. ఈ నేపథ్యంలో గోల్డెన్‌ డోమ్‌ శక్తిసా మర్థ్యాలు ఏపాటివో అందుబాటులోకి వస్తేగానీ చెప్పలే మని అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడ్డారు.చైనా, రష్యా నుంచి ముప్పు..రష్యా, చైనా తమ ఉపగ్రహాలకు అధునాతన శక్తిసామర్థ్యాలను సంతరింపజేశాయి. అవి అమెరికా ఉపగ్రహాలను నిర్వీర్యంచేయగలవు. ఈ నేపథ్యంలో గోల్డెన్‌ డోమ్‌ అవసరం ఏర్పడిందని అమెరికా రక్షణ వర్గాలు తెలిపాయి. కేవలం అంతరిక్షంలో వాడేందుకు రష్యా ఒక కొత్తతరహా అణ్వాయుధాన్ని తయారుచేస్తోందని అమెరికా ఆరోపిస్తోంది. ఈ అణ్వాయుధం అంతరిక్షంలో సంచరిస్తూ విడతలవారీగా పేలుతూ సమీప శత్రుదేశ ఉపగ్రహాలను నాశనంచేయగలదని అమెరికా వాదిస్తోంది. అమెరికా గోల్డెన్‌ డోమ్‌ ఆలోచనను ఇప్పటికే రష్యా, చైనాలు తీవ్రంగా తప్పుబట్టాయి. శక్తివంతమైన లేజర్‌కాంతి వ్యవస్థలను అంతరిక్షంలో ఏర్పాటుచేసి ఉప గ్రహాలు సంచరించే కక్ష్యలను రణక్షేత్రాలుగా మార్చొద్దని ఇరు దేశాలు గోల్డెన్‌ డోమ్‌ ఆలోచనపై అభ్యంతరం వ్యక్తంచేశాయి.

Violation of rules in underground power line tenders5
తీగ కింద.. అవినీతిపైన

సాక్షి, అమరావతి: ఖజానాకు ధర్మకర్తగా వ్యవహరించాల్సిన వారే ప్రజాధనాన్ని అస్మదీయులకు దోచిపెడుతున్నారు. రాజధాని అమరావతి ప్రాంతంలో భూగర్భ విద్యుత్‌ (అండర్‌ గ్రౌండ్‌ కేబుల్‌) లైన్‌ పనుల టెండర్లలో ప్రభుత్వ పెద్దలు వ్యవహరించిన తీరే అందుకు నిదర్శనం. నిబంధనల్ని తుంగలో తొక్కి కాంట్రాక్టు విలువ కంటే 8.98 శాతం అధిక ధర కోట్‌ చేసిన సంస్థకు రూ.1,082.44 కోట్ల విలువైన పనులు కట్టబెట్టారు. 8.99 శాతం అధిక ధర కోట్‌ చేసిన మరో సంస్థకు రూ.390.06 కోట్ల విలువైన పనులు అప్పగించారు. ఈ రెండు టెండర్లలో సీఎం చంద్రబాబు సన్నిహితులకు రూ.114.68 కోట్లు దోచిపెడుతున్నారు. టెండర్ల వివరాలివీ రాజధాని ప్రాంతంలో ఎన్‌–10 రహదారి నుంచి ఎన్‌–13–ఈ–11 రహదారుల జంక్షన్‌ వరకూ 220 కేవీ ఎక్స్‌ట్రా హైవోల్టేజీ (ఈహెచ్‌వీ) లైన్‌ను అండర్‌ గ్రౌండ్‌(భూగర్భంలో)లో వేసేందుకు సంబంధించిన మిగిలిన పనులకు రూ.993.25 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్దేశించి సీఆర్‌డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ) ఒక ప్యాకేజీ కింద టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. మరోవైపు రాజధానిలో ఏపీ ట్రాన్స్‌కో 18 కి.మీ. పొడవున చేపట్టిన 400 కేవీ డీసీ (డైరెక్ట్‌ కరెంట్‌) లైన్స్‌లో మిగిలిన పనులు, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (పీజీసీఐఎల్‌) 20 కి.మీ. పొడవున చేపట్టిన 400 కేవీ డీసీ లైన్స్‌లో మిగిలిన పనుల పూర్తికి రూ.283.57 కోట్ల అంచనా వ్యయంతో మరో ప్యాకేజీ కింద సీఆర్‌డీఏ టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. 220 కేవీ ఈహెచ్‌వీ అండర్‌ గ్రౌండ్‌ లైన్‌లో పనుల పూర్తికి పిలిచిన టెండర్లలో కాంట్రాక్టు విలువ కంటే 8.98 శాతం అధిక ధరకు అంటే రూ.1,082.44 కోట్లకు కోట్‌ చేసిన బీఎస్సార్‌ ఇన్‌ఫ్రాటెక్‌ ఎల్‌–1గా నిలిచింది. ఏపీ ట్రాన్స్‌కో, పీజీసీఐఎల్‌ 400 కేవీ డీసీ లైన్స్‌లో మిగిలిన పనుల పూర్తికి పిలిచిన టెండర్‌లోనూ కాంట్రాక్టు విలువ కంటే 8.99 శాతం అధిక ధరకు కోట్‌ చేసిన పీవీఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌–కె.రామచంద్రరావు ట్రాన్స్‌మిషన్‌ అండ్‌ ప్రాజెక్ట్స్‌(జేవీ) ఎల్‌–1గా నిలిచింది. జీవో 133 ప్రకారం ఈ రెండు టెండర్లు రద్దు చేయాలి. కానీ.. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈనెల 11న జరిగిన సీఆర్‌డీఏ అథారిటీ 45వ సమావేశంలో ఆ రెండు టెండర్లకు ఆమోదముద్ర వేశారు. దాంతో ఆ రెండు సంస్థలకు ఆ పనులను కట్టబెట్టేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన టెండర్లలో అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి 2004 నవంబర్‌ 20న అప్పటి ప్రభుత్వం జీవో 133 జారీ చేసింది. ఆ జీవో ప్రకారం.. కాంట్రాక్టు విలువ కంటే 5 శాతానికి మించి అధిక మొత్తాన్ని కాంట్రాక్టర్లు కోట్‌ చేస్తే ఆ టెండర్‌ను రద్దు చేయాలి. మళ్లీ టెండర్‌ పిలవాలి. రెండుసార్లు టెండర్‌ పిలిచినా అదే పరిస్థితి పునరావృతమైతే ప్రభుత్వానికి నివేదించాలి. ప్రభుత్వం ఏర్పాటుచేసే కమిటీ ఆ టెండర్‌పై తగిన నిర్ణయం తీసుకుంటుంది.ఖజానాపైరూ. 114.68 కోట్ల భారంబీఎస్సార్‌ ఇన్‌ఫ్రా టెక్‌ సంస్థ బలుసు శ్రీనివాసరావుకు చెందినది. బెంగళూరులో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసే బలుసు శ్రీనివాసరావు సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. అందువల్లే నిబంధనలను తుంగలో తొక్కి 8.98 శాతం అధిక ధరకు కోట్‌ చేసిన ఆ సంస్థకు పనులు కట్టబెట్టారనే ఆరోపణలు బలంగా వ్యక్తమవుతున్నాయి. దీని­వల్ల ఖజానాపై అదనంగా రూ.89.19 కోట్ల భారం పడుతుంది. ఇక పీవీఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌–కె.రామచంద్రరావు ట్రాన్స్‌మిషన్‌ అండ్‌ ప్రాజెక్ట్స్‌(జేవీ)కి సంబంధించి కొల్లిపర రామచంద్రరావు కూడా సీఎం చంద్రబాబుకు సన్నిహితుడు. అందుకే ఆ సంస్థ 8.99 శాతం అధిక ధరకు కోట్‌ చేసినా టెండర్‌ ఆమోదించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనివల్ల ఖజానాపై అదనంగా రూ.25.49 కోట్ల భారం పడుతుంది. ఈ రెండు ప్యాకేజీల పను ల్లో నిబంధనలను తుంగలో తొక్కడం వల్ల ఖజానాపై అదనంగా రూ.114.68 కోట్ల భారం పడుతుంది. ఆ మేరకు తన సన్నిహితులకు సీఎం చంద్రబాబు ప్రయోజనం చేకూర్చారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంలో భారీగా కమీషన్లు చేతులు మారుతాయనే చర్చ అధికార వర్గాల్లో జోరుగా సాగుతోంది.

CM Revanth Comments On PM Narendra Modi6
పాక్‌కు బుద్ధి చెప్పడంలో ప్రధాని వెనకడుగు: సీఎం రేవంత్‌

సాక్షి, హైదరాబాద్‌: పహల్గాం దాడి ఘటన నేపథ్యంలో పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పడంలో ప్రధాని మోదీ వెనకడుగు వేశారని.. అదే ఇందిరమ్మ హయాంలో ఉగ్రవాదుల ముసుగులో భారత పౌరులపై దాడులకు తెగబడిన పాక్‌కు గట్టి గుణపాఠం చెప్పారని సీఎం రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని సచివాలయం ముందు ఆయన విగ్రహానికి రేవంత్‌ పుష్పాంజలి ఘటించారు. రాజీవ్‌ వర్ధంతి రోజున ‘ఉగ్రవాద వ్యతిరేక దినం’గా పాటిస్తున్న విషయాన్ని ఆయన గుర్తుచేస్తూ.. ఉగ్రవాదంపై పోరాటం చేయడం ప్రతి భారతీయుడి దృఢ సంకల్పమన్నారు. దేశ భద్రత, సమగ్రతను కాపాడే విషయంలో రాజకీయాలకు తావు లేకుండా కేంద్ర ప్రభుత్వానికి, భారత వీర జవాన్లకు ఎప్పుడూ అండగా నిలబడతామని చెప్పారు. కశ్మీర్‌లో పర్యాటకులపై కాల్పుల ఘటన, ఆపరేషన్‌ సిందూర్‌ సందర్భంగా పోరాటం చేస్తున్న వీర సైనికులకు అండగా తెలంగాణ ప్రభుత్వం మొట్టమొదటగా సంఘీభావ ర్యాలీ నిర్వహించిందని గుర్తుచేశారు. నాడు ఇందిర అంగీకరించలేదు...: ఉగ్రవాదులను నిర్మూలించడంలో ఇందిరమ్మ ఆదర్శంగా నిలిచారని, నాడు యుద్ధం సందర్భంగా ఆమెరికా లేదా ఇతర దేశాల మధ్యవర్తిత్వాన్ని ఆమె అంగీకరించలేదని రేవంత్‌రెడ్డి చెప్పారు. భారత దేశ భద్రతను కాపాడుకోవడంలో ఎవరి సూచనలు, మధ్యవర్తిత్వం అక్కర్లేదని స్పష్టంగా చెప్పారన్నారు. ట్రంప్‌ చెబితే కాల్పుల విరమణ చేసిన పరిస్థితి ఇప్పటి కేంద్ర ప్రభుత్వానిదని ఎద్దేవా చేశారు. కశ్మీర్‌ ఘటనలపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాందీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోపాటు అందరం కేంద్రానికి, పోరాటం చేస్తున్న వీర జవానులకు అండగా నిలబడ్డామన్నారు. –చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.. రాహుల్‌పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయాలకు తావివ్వకుండా దేశ ప్రయోజనాలకే ప్రాధాన్యతనివ్వాలని పిలుపునిచ్చారు. దేశ సమగ్రతను కాపాడటంలో కృషిచేసిన మహాత్మాగాందీ, ఇందిరా గాందీ, రాజీవ్‌ గాందీ, బీఆర్‌ అంబేడ్కర్, పీవీ నరసింహారావు విగ్రహాలతో ఈ ప్రాంతం భారతీయులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని చెప్పారు. దేశాభివృద్ధిలో రాజీవ్‌ గాంధీ పాత్ర మరువలేనిదని కొనియాడారు. ఓటు హక్కును 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించి యువతకు ఓటు హక్కు కల్పించారని, ఆధునిక సాంకేతిక నైపుణ్యంతో 21వ శతాబ్దంవైపు దేశాన్ని నడిపించారని గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ అనిల్‌ కుమార్‌ యాదవ్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌తోపాటు పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

SC played pivotal role in expanding scope of fundamental rights7
రాజ్యాంగం, ‘సుప్రీం’ మధ్య విడదీయరాని బంధం

న్యూఢిల్లీ: దేశంలో ప్రాథమిక హక్కుల పరిధిని మరింత విస్తరింపజేయడంలో సుప్రీంకోర్టు కీలక పాత్ర పోషిస్తోందని సీజేఐ జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌ చెప్పారు. 75 ఏళ్ల సుప్రీంకోర్టు ప్రయాణాన్ని భారత రాజ్యాంగం నుంచి విడదీసి చూడలేమని అన్నారు. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, మధ్యవర్తిత్వం, ఎన్నికల ప్రక్రియ వంటి ముఖ్యమైన అంశాల్లో మారుతున్న సామాజిక అవసరాలకు అనుగుణంగా న్యాయస్థానం తీర్పులు ఇస్తున్నట్లు వివరించారు. ప్రజా ప్రయోజన వ్యాజ్యాల ద్వారా సమాజంలో అట్టడుగు వర్గాలకు న్యాయం చేకూరుస్తున్నట్లు తెలిపారు. సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌ ప్రసంగించారు. సుప్రీంకోర్టు 75 ఏళ్ల స్మారక పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ ఏడాది మన రాజ్యాంగం, సుప్రీంకోర్టు 75 ఏళ్లు పూర్తి చేసుకున్నాయని, ఇది చరిత్రాత్మక సందర్భమని వ్యాఖ్యానించారు. రెండింటి మధ్య విడదీయరాని బంధం కొనసాగుతున్నట్లు స్పష్టంచేశారు. ఇవి ఒకే నాణేనికి రెండు ముఖాలు అని పేర్కొన్నారు. సుప్రీంకోర్టును రాజ్యాంగమే సృష్టించిందని, రాజ్యాంగ ఆదేశాల ప్రకారమే సుప్రీంకోర్టు పనిచేస్తోందని ఉద్ఘాటించారు. అదేసమయంలో రాజ్యాంగానికి సుప్రీంకోర్టు అత్యుత్తమ రక్షణ కవచంగా వ్యవహరిస్తోందని జస్టిస్‌ గవాయ్‌ వివరించారు. జస్టిస్‌ ఓకా పని రాక్షసుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అభయ్‌ ఎస్‌.ఓకా తనకు మంచి మిత్రుడు, పని రాక్షసుడు జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌ చెప్పారు. జస్టిస్‌ ఓకా ఈ నెల 24న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో బుధవారం సుప్రీంకోర్టు అడ్వొకేట్‌–ఆన్‌–రికార్డు అసోసియేషన్‌ ఆధ్వర్యంలో వీడ్కోలు సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జస్టిస్‌ గవాయ్‌ మాట్లాడారు. జస్టిస్‌ ఓకాతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. న్యాయ వ్యవస్థకు ఆయన అందించిన సేవలను ప్రశంసించారు. జస్టిస్‌ ఓకా మాట్లాడుతూ.. జస్టిస్‌ గవాయ్‌ అసలైన ప్రజాస్వామ్యవాది అని కొనియాడారు.

High Court issues key orders to DGP in wake of Pahalgam terror attack8
స్లీపర్‌ సెల్స్‌ సంగతి తేల్చండి

సాక్షి, అమరావతి: పహల్గాం ఉగ్రదాడి అనంతరం కేంద్ర ఇంటెలిజెన్స్‌ వర్గాల హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర డీజీపీకి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. స్లీపర్‌ సెల్స్‌ను గుర్తించే విషయంలో విచారణ జరపాలని డీజీపీని ఆదేశించింది. రాష్ట్రంలో స్లీపర్స్‌ సెల్స్‌కు సంబంధించి తదుపరి విచారణ నాటికి పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని తేల్చిచెప్పింది.ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ నూనెపల్లి హరినాథ్‌ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు.స్లీపర్‌ సెల్స్‌ ఉన్నా పట్టించుకోవడం లేదుపహల్గాం ఉగ్రదాడి తరువాత దేశవ్యాప్తంగా 20వేల మంది స్లీపర్‌ సెల్స్‌ రహస్యంగా పాకిస్థాన్‌ ఐఎస్‌ఐ కోసం పనిచేస్తున్నారని హైకోర్టు న్యాయవాది సూరపరెడ్డి గౌతమి, వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరుకి చెందిన ఎ.శివకుమార్‌ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లలో పేర్కొన్నారు. వీరిలో 1,200 మంది ఏపీలో­ని నంద్యాల, గుంటూరు, వైఎస్సార్‌ తదితర జిల్లాల్లో ఆశ్రయం పొందుతున్నారని, ఈ విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు నివేదికలిచ్చినా రాష్ట్ర హోంశాఖ, డీజీపీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పేర్కొన్నారు. ఈ పిటిషన్లపై జస్టిస్‌ హరినాథ్‌ ఇటీవల విచారణ జరిపారు. గౌతమి తరఫున కోనపల్లి నర్సిరెడ్డి, శివకుమార్‌ తరఫున బూదా­టి జ్ఞానేంద్ర కుమార్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. పహల్గాం ఉగ్రదాడి తరువాత కేంద్ర ఇంటెలిజెన్స్‌ వర్గాలు అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేశాయని తెలిపారు. దేశవ్యాప్తంగా 20వేల మంది స్లీపర్‌ సెల్స్‌ ఉన్నట్టు, వారంతా పాకిస్తాన్‌ ఐఎస్‌ఐ కోసం పనిచేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకొచ్చాయని న్యాయవాది నర్సిరెడ్డి పేర్కొన్నారు. ఏపీలో పోలీసు యంత్రాంగం ఈ హెచ్చరికలను పట్టించుకోవడం లేదన్నారు. ఉగ్రమూకలకు సహకరిస్తున్న వారి విషయంలో చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం దారుణంగా విఫలమైందన్నారు. అందువల్ల ఈ వ్యవహారంలో విచారణ నిమిత్తం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కు తగిన ఆదేశాలు జారీ చేయాలని కోర్టును అభ్యర్థించారు.ఎన్‌ఐఏకు నోటీసులుఈ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ)కు నోటీసులు జారీ చేశారు. పిటిషనర్లు సమర్పించిన వివరాలను పరిగణనలోకి తీసుకుని, స్లీపర్స్‌ సెల్స్‌ విషయంలో విచారణ జరిపి నివేదికను తమ ముందుంచాలని డీజీపీని ఆదేశించారు. బాంబు పేలుళ్లు సృష్టించేందుకు కుట్ర పన్నారంటూ విజయనగరానికి చెందిన సిరాజ్‌ ఉర్‌ రెహమాన్, తెలంగాణకు చెందిన సమీర్‌లను పోలీసులు అరెస్ట్‌ చేసిన నేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు ప్రాధాన్యత ఏర్పడింది.

Sakshi Editorial On Spying9
గూఢచర్యం జాడలివిగో!

గూఢచర్యానికి నిర్దిష్టమైన రూపురేఖలుండవు. దాన్ని సకాలంలో గుర్తించటం, కట్టడి చేయటం ఆషామాషీ కాదు. మన వేషభాషలతోనేవుంటూ, నిత్యం మనతో సన్నిహితంగా మెలగుతూ ప్రాణ ప్రదమైన మన రహస్యాలను బయటికి చేరేసేవారిని ఆనవాలు కట్టడం అంత సులభం కూడా కాదు. పహల్‌గామ్‌లో గత నెల 22న అమాయక పౌరులు 26 మందిని ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్నాక మన త్రివిధ దళాలు పాకిస్తాన్‌లోని ఉగ్ర స్థావరాలపై ఆపరేషన్‌ సిందూర్‌ పేరుతో దాడులు నిర్వ హించి దాదాపు వందమందిని మట్టుబెట్టాయి. సింధూ నదీజలాల ఒప్పందంనుంచి వెనక్కి రాదల్చుకున్నట్టు ప్రకటించటంతోసహా అనేక అంశాల్లో పాకిస్తాన్‌కు ఇన్ని దశాబ్దాలుగా అందుతున్న ప్రయోజనాలను మన దేశం నిలుపుచేసింది. దానికి అనుబంధంగా దేశంలో అధికార, విపక్షాల మధ్య వాగ్యుద్ధాలు సాగటం, పహల్‌గామ్‌లో భద్రతాలోపాలపై ప్రశ్నించినవారినీ, జవాబుదారీ తనాన్ని కోరినవారినీ ఉగ్రవాద సమర్థుకులుగా ముద్రేయటం మొదలైంది. ఇది అవాంఛనీయమైన పరిణామం. ఈ నేపథ్యంలో నిఘానేత్రాల కళ్లుగప్పి కీలకమైన సమాచారాన్ని పాకిస్తాన్‌కు చేరేస్తున్న 11 మందిని గుర్తించి అరెస్టు చేయటం కీలక మలుపు. అరెస్టయినవారిలో చాలామంది మధ్యతరగతి యువత. వారిలో జ్యోతి మల్హోత్రా అనే యువతి పాకిస్తాన్‌ గూఢచారి సంస్థలకు కీలకమైన సమా చారం అందించిందన్నది పోలీసుల అభియోగం. సామాజిక మాధ్యమాల సందడి పెరిగాక ఒక కొత్త తరం బయల్దేరింది. విచక్షణా జ్ఞానం లోపించటం, లోతైన సమాచారం లేకుండానే దేనిపైన అయినా అభిప్రాయాలు ఏర్పర్చుకోవటం, ఆధారాలున్నాయా లేదా అనేదాంతో నిమిత్తం లేకుండా సమాచారాన్ని వ్యాప్తిచేయటం, సామాజిక మాధ్యమాలపై మోజున్న యువతరానికి అలవాటుగా మారింది. సెల్‌ఫోన్‌తో దేన్నయినా చిత్రించటం, వెనకా ముందూ ఆలోచించకుండా అందరికీ చేరేయటం రివాజైంది. మనం కూడా ఏదో ఒకటి చేయాలన్న కుతూహలంతో మొదలై, అందరికన్నా ఎక్కువమంది వీక్షకుల్ని ఆకట్టుకోవటం లక్ష్యంగా మారటం, ప్రముఖ వ్యక్తిగా గుర్తింపు పొందటం, ప్రశంసలు, వాటి వెంబడే ఆదాయం మొదలవుతుంది. ఇక ఆ వ్యామోహం నుంచి వెనక్కిరావటం వాళ్లవల్ల కాదు. తాము చేసే పని ఏ మంచికి హాని చేస్తుందో, ఏ చెడును ప్రోత్సహిస్తుందో గ్రహించేంత సామర్థ్యం లేకపోవటం సామాజిక మాధ్యమాల్లో పాపులర్‌ అయిన అత్యధిక యువతలో కనబడే ప్రాథమిక లక్షణం. ఇలాంటివారిని ఆకట్టుకుని, వీరితో సంబంధ బాంధవ్యాలు నెరపి దగ్గరకావటం పొరుగు దేశ గూఢచార సంస్థలకు సులభం. జ్యోతి మల్హోత్రా విషయంలో జరిగింది అదే. ఆమె తగిన పత్రాలను సమర్పించి ప్రభుత్వానికి తెలిసే విధంగానే పాకిస్తాన్‌ వెళ్లింది. అక్కడ వేర్వేరు వ్యక్తుల్ని కలిసింది. పాకిస్తాన్‌ జాతీయ దినోత్సవంలో పాల్గొన్నది. అక్కడున్నవారిని పరిచయం చేసింది. వారితో మాట్లాడించింది. విదేశాలకు పోవటం, అక్కడి ప్రాంతాలను సందర్శించటం, వారితో సంభాషించటం వగైరాలు సహజంగానే సాధారణ వీక్షకులకు ఎంతో ఆసక్తి అనిపిస్తాయి. జ్యోతి నిర్వహించే యూట్యూబ్‌ చానెల్‌కు దాదాపు 4 లక్షలమంది చందాదార్లుండటం, ఫేస్‌బుక్‌లో 3 లక్షలమందిపైగా ఆమె ఎప్పటికప్పుడు పెట్టే వీడియోలను వీక్షించటం, ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు లక్షన్నరమంది చూడటం ఇందువల్లే. తమ అరకొర పరిజ్ఞానంతో గంటల తరబడి దేనిపైన అయినా అనర్గళంగా మాట్లాడటం నచ్చటంవల్లే ఇన్నేసి లక్షలమంది వారిని అనుసరిస్తుంటారు. శత్రు దేశాల మధ్య యుద్ధాలు సరిహద్దుల్లోనే జరగవు. అవి కేవలం సైనికుల మధ్యే సాగవు. అనేక రూపాల్లో నిరంతరం కొనసాగుతుంటాయి. కనీసం జ్యోతి ప్రభుత్వానికి తెలిసేవిధంగా పాకిస్తాన్‌ వెళ్లింది. కానీ చడీచప్పుడూ లేకుండానే శత్రుదేశానికి అత్యంత కీలకమైన సమాచారాన్ని చేరేసేవారుంటారు. పాకిస్తాన్‌ హైకమిషన్‌లో ఇటీవల వరకూ పనిచేసి బహిష్కరణకు గురైన డానిష్‌ అనే ఉద్యోగి అడిగిన సమాచారమంతా ఆమె అందించిందని నిఘా వర్గాలంటున్నాయి. ఆ పని చేయటం పర్యవసానంగా తోటి పౌరులే ప్రమాదాల్లో చిక్కుకుంటారని, అది దేశద్రోహమని వారికి అనిపించదు. డబ్బుకు ఆశపడటం ఒక్కటే ఇలాంటి కార్యకలాపాలకు కారణం అనుకోవటానికి లేదు. వేరే దేశానికి చెందినవారు వీడియోలను చూడటం, పొగడ్తలు గుప్పించటం, తమ ప్రాంతాలకొచ్చి అక్కడి విశేషాలను కూడా చూపాలని అడగటం వగైరాలు వారిని ఆకర్షిస్తాయి. తమ ఘనత అంతర్జాతీయ స్థాయికి చేరుకుందన్న భ్రమ వారిని నిలకడగా ఆలోచించనీయదు. గూఢచర్యం కేవలం అవతలి దేశాన్ని నష్టపరచటానికో, చికాకుపరచటానికో పరిమితం కాదు. వారి ఆయుధాగారాల్లో వచ్చి చేరుతున్న రక్షణ సామగ్రి సామర్థ్యం ఏమిటో, ఎక్కడెక్కడ వారి సైనిక స్థావరాలు పనిచేస్తున్నాయో తెలుసుకోవటంతోపాటు పారిశ్రామిక, ఆర్థిక, పరిశోధనారంగాల్లో ఆ దేశం ఏం చేస్తున్నదో సమాచారాన్ని సేకరిస్తుండటం గూఢచారుల పని. పహల్‌గామ్‌లో ఉగ్రదాడి తర్వాత ఎక్కడ మన వైఫల్యం వున్నదో, అందుకు కారణమేమిటో తెలుసుకునే పనిలో ప్రభుత్వం తలమునకలై వుండగా దేశభక్తి పేరిట కొందరు మత విద్వేషాలను రెచ్చగొట్ట జూశారు. ఇప్పుడు పట్టుబడినవారి నేపథ్యం గమనిస్తే ఫలానా మతంవారే దేశద్రోహానికి పాల్పడతారన్నది ఎంత బూటకమో తెలుస్తుంది. శత్రువు కీలకమైన సమాచారాన్ని ఒడుపుగా తస్కరించగలుగుతున్నాడంటే నిస్సందేహంగా అది మన వైఫల్యం. దాన్ని కప్పిపుచ్చి అసత్యాలు ప్రచారం చేయటానికి బదులు, లోపాలను సరిదిద్దుకుని పటిష్టమైన వ్యవస్థలు రూపొందించటం వర్తమాన అవసరం.

Mumbai Indians win by 59 runs against Delhi10
‘ప‍్లే ఆఫ్స్‌’కు ముంబై

తొలి ఐదు మ్యాచ్‌లలో నాలుగు పరాజయాలు... ఎప్పటిలాగే ముంబై ఇండియన్స్‌ తమ సీజన్‌ను నెమ్మదిగా మొదలు పెట్టింది... అయితే ఆ తర్వాత తమ స్థాయికి తగ్గ ఆటతో తర్వాతి ఎనిమిది మ్యాచ్‌లలో ఏడు విజయాలతో ముందంజ వేసింది. 2025 సీజన్‌లో ‘ప్లే ఆఫ్స్‌’లో చివరిదైన నాలుగో బెర్త్‌ను ఖరారు చేసుకుంది. సొంత మైదానంలో జరిగిన కీలక పోరులో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ముంబై పైచేయి సాధించింది. మరోవైపు వరుసగా నాలుగు విజయాలతో ఘనంగా సీజన్‌ను ప్రారంభించినా... ఆపై గతి తప్పిన ఆటతో వరుస ఓటములు ఎదుర్కొన్న ఢిల్లీ క్యాపిటల్స్‌ ‘ప్లే ఆఫ్స్‌’ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించింది. ముంబై: ఐపీఎల్‌లో ఐదుసార్లు చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ మరో టైటిల్‌ వేటలో నిలిచింది. ఈ సీజన్‌ ‘ప్లే ఆఫ్స్‌’లో మిగిలిన నాలుగో స్థానాన్ని ముంబై భర్తీ చేసింది. బుధవారం వాంఖెడే మైదానంలో జరిగిన పోరులో ముంబై 59 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై నెగ్గింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. సూర్యకుమార్‌ (43 బంతుల్లో 73 నాటౌట్‌; 7 ఫోర్లు, 4 సిక్స్‌లు) దూకుడైన బ్యాటింగ్‌తో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం ఢిల్లీ 18.2 ఓవర్లలో 121 పరుగులకే కుప్పకూలింది. సమీర్‌ రిజ్వీ (35 బంతుల్లో 39; 6 ఫోర్లు, 1 సిక్స్‌) మినహా మిగతా వారు విఫలమయ్యారు. బుమ్రా 3 వికెట్లతో ఢిల్లీని దెబ్బ తీశాడు. 2 ఓవర్లలో 48 పరుగులు... బంతి తక్కువ ఎత్తులో వస్తూ నెమ్మదిగా ఉన్న పిచ్‌పై పరుగులు చేయడంలో ముంబై బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. రోహిత్‌ శర్మ (5) విఫలం కాగా... రికెల్టన్‌ (18 బంతుల్లో 25; 2 సిక్స్‌లు), విల్‌ జాక్స్‌ (13 బంతుల్లో 21; 3 ఫోర్లు, 1 సిక్స్‌) ఫర్వాలేదనిపించారు. దాంతో పవర్‌ప్లే ముగిసేసరికి జట్టు స్కోరు 54 పరుగులకు చేరింది. కుల్దీప్‌ తన తొలి ఓవర్లోనే రికెల్టన్‌ను వెనక్కి పంపగా, తిలక్‌ వర్మ (27 బంతుల్లో 27; 1 ఫోర్, 1 సిక్స్‌) వేగంగా ఆడలేకపోయాడు.ఆరంభంలో సూర్యకుమార్‌ బ్యాటింగ్‌లో కూడా తడబాటు కనిపించగా, హార్దిక్‌ పాండ్యా (3) కూడా ఎక్కువసేపు నిలవలేదు. 18 ఓవర్లలో ముంబై స్కోరు 132/5 మాత్రమే. కనీసం 160 పరుగులు కూడా దాటడం అసాధ్యంగా అనిపించింది. అయితే ఆఖరి 2 ఓవర్లలో సూర్య, నమన్‌ ధీర్‌ (8 బంతుల్లో 24 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) పండగ చేసుకున్నారు. ముకేశ్‌ వేసిన 19వ ఓవర్‌ తొలి బంతికి సూర్య సిక్స్‌ బాది 36 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకోగా... చివరి నాలుగు బంతుల్లో నమన్‌ వరుసగా 4, 6, 6, 4 బాదడంతో మొత్తం 27 పరుగులు వచ్చాయి. చమీరా వేసిన ఆఖరి ఓవర్లో సూర్య ఒక్కడే 2 సిక్స్‌లు, 2 ఫోర్లు కొట్టడంతో 21 పరుగులు లభించాయి. టపటపా... ఛేదనలో ఢిల్లీ పూర్తిగా తలవంచింది. ఏ దశలోనూ జట్టు విజయం దిశగా వెళ్లలేకపోయింది. తొలి 5 ఓవర్లలోపే డుప్లెసిస్‌ (6), కేఎల్‌ రాహుల్‌ (11), అభిషే పొరేల్‌ (6) అవుట్‌ కావడంతోనే గెలుపుపై ఆశలు తగ్గిపోయాయి. ఆ తర్వాత విప్‌రాజ్‌ నిగమ్‌ (11 బంతుల్లో 20; 3 ఫోర్లు, 1 సిక్స్‌) ఎక్కువసేపు నిలవలేకపోగా, ట్రిస్టన్‌ స్టబ్స్‌ (2) కూడా విఫలం కావడంతో సగం ఓవర్లు ముగిసేసరికి స్కోరు 66/5కు చేరింది. మరో ఎండ్‌లో రిజ్వీ కొంత పోరాడినా లాభం లేకపోయింది. మరో 10 బంతులు మిగిలి ఉండగానే జట్టు ఇన్నింగ్స్‌ ముగిసింది. రెగ్యులర్‌ కెపె్టన్‌ అక్షర్‌ పటేల్‌ జ్వరంతో ఈ మ్యాచ్‌కు దూరం కావడంతో డుప్లెసిస్‌ ఢిల్లీకి సారథిగా వ్యవహరించాడు. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌: రికెల్టన్‌ (సి) మాధవ్‌ తివారి (బి) కుల్దీప్‌ 25; రోహిత్‌ (సి) పొరేల్‌ (బి) ముస్తఫిజుర్‌ 5; జాక్స్‌ (సి) నిగమ్‌ (బి) ముకేశ్‌ 21; సూర్యకుమార్‌ (నాటౌట్‌) 73; తిలక్‌ వర్మ (సి) రిజ్వీ (బి) ముకేశ్‌ 27; పాండ్యా (సి) ముకేశ్‌ (బి) చమీరా 3; నమన్‌ ధీర్‌ (నాటౌట్‌) 24; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 180. వికెట్ల పతనం: 1–23, 2–48, 3–58, 4–113, 5–123. బౌలింగ్‌: ముకేశ్‌ కుమార్‌ 4–0–48–2, చమీరా 4–0–54–1, ముస్తఫిజుర్‌ 4–0–30–1, విప్‌రాజ్‌ నిగమ్‌ 4–0–25–0, కుల్దీప్‌ యాదవ్‌ 4–0–22–1. ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌: కేఎల్‌ రాహుల్‌ (సి) రికెల్టన్‌ (బి) బౌల్ట్‌ 11; డుప్లెసిస్‌ (సి) సాంట్నర్‌ (బి) చహర్‌ 6; పొరేల్‌ (స్టంప్డ్‌) రికెల్టన్‌ (బి) జాక్స్‌ 6; రిజ్వీ (బి) సాంట్నర్‌ 39; నిగమ్‌ (సి అండ్‌ బి) సాంట్నర్‌ 20; స్టబ్స్‌ (ఎల్బీ) (బి) బుమ్రా 2; అశుతోష్‌ శర్మ (స్టంప్డ్‌) రికెల్టన్‌ (బి) సాంట్నర్‌ 18; మాధవ్‌ తివారి (బి) బుమ్రా 3; చమీరా (నాటౌట్‌) 8; కుల్దీప్‌ (సి) రాజ్‌ బావా (సబ్‌) (బి) కరణ్‌ శర్మ 7; ముస్తఫిజుర్‌ (బి) బుమ్రా 0; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (18.2 ఓవర్లలో ఆలౌట్‌) 121. వికెట్ల పతనం: 1–12, 2–20, 3–27, 4–55, 5–65, 6–103, 7–104, 8–108, 9–120, 10–121. బౌలింగ్‌: బౌల్ట్‌ 4–0–29–1, చహర్‌ 3–0–22–1, జాక్స్‌ 1–0–16–1, సాంట్నర్‌ 4–0– 11–3, బుమ్రా 3.2–0–12–3, కరణ్‌ శర్మ 3–0–31–1. ఐపీఎల్‌లో నేడుగుజరాత్‌ X లక్నోవేదిక: అహ్మదాబాద్‌∙రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement