Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Tiruvuru Counselors Meet YS Jagan1
తిరువూరు కౌన్సిలర్లను అభినందించిన వైఎస్‌ జగన్‌

తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని తిరువూరు కౌన్సిలర్లు బుధవారం కలిశారు. తిరువూరు నగర పంచాయతీ ఛైర్‌పర్సన్‌ ఎన్నిక సందర్భంగా తమపై టీడీపీ నాయకుల దాడి, దౌర్జన్యం గురించి వైఎస్‌ జగన్‌కు కౌన్సిలర్లు వివరించారు. పోలీసులు, కూటమి నేతలు, టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్‌ రాజ్యాంగ విరుద్దంగా వ్యవహరించిన తీరును పార్టీ నేతలు వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకొచ్చారు.ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో మెజారిటీ లేకపోయినా బరితెగించి అనైతిక రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వ అరాచకాలను, దాష్టికాలను ధీటుగా ఎదుర్కొందామన్నారు. చట్టపరంగా, న్యాయపరంగా పార్టీ అండగా ఉంటుందన్న వైఎస్‌ జగన్‌.. ఎన్ని ఇబ్బందులు పెట్టినా ధైర్యంగా నిలిచినందుకు అభినందనలు తెలిపారు.

IPL 2025: MI Beat DC And Confirm Playoff Berth2
IPL 2025: ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఘన విజయం.. ప్లే ఆఫ్స్‌కు చేరిన ముంబై

ఐపీఎల్‌ 2025లో భాగంగా ఇవాళ (మే 21) జరిగిన కీలక మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ముంబై ఇండియన్స్‌ ఘన విజయం సాధించింది. తద్వారా ముంబై ఇండియన్స్‌ ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ను ఖరారు చేసుకోగా.. ఢిల్లీ మరో మ్యాచ్‌ మిగిలుండగానే ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించింది. గుజరాత్‌, ఆర్సీబీ, పంజాబ్‌ ఇదివరకే ప్లే ఆఫ్స్‌ బెర్త్‌లు ఖరారు చేసుకున్న విషయం తెలిసిందే.ఢిల్లీతో మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. తొలి 18 ఓవర్లు పరుగులు సాధించేందుకు ఇబ్బంది పడిన ముంబై.. ఆఖరి రెండు ఓవర్లలో ఆకాశమే హద్దుగా చెలరేగింది. ఈ రెండు ఓవర్లలో సూర్యకుమార్‌ యాదవ్‌ (43 బంతుల్లో 73 నాటౌట్‌; 7 ఫోర్లు, 4 సిక్సర్లు), నమన్‌ ధిర్‌ (8 బంతుల్లో 24 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) విధ్వంసం సృష్టించారు. ముకేశ్‌ కుమార్‌, చమీరా వేసిన ఈ ఓవర్లలో ఏకంగా 48 పరుగులు పిండుకున్నారు. ముంబై ఇన్నింగ్స్‌లో రికెల్టన్‌ 25, రోహిత్‌ శర్మ 5, విల్‌ జాక్స్‌ 21, తిలక్‌ వర్మ 27, హార్దిక్‌ పాండ్యా 3 పరుగులు చేశారు. ఢిల్లీ బౌలర్లలో ముకేశ్‌ కుమార్‌ 2, దుష్మంత చమీరా, ముస్తాఫిజుర్‌, కుల్దీప్‌ యాదవ్‌ తలో వికెట్‌ పడగొట్టారు.అనంతరం 181 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ.. ఆది నుంచే వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ ఓటమి దిశగా సాగింది. ఆ జట్టు 18.2 ఓవర్లలో 121 పరుగులకు ఆలౌటై 59 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. ఈ మ్యాచ్‌లో ముంబై బౌలర్లు​ మూకుమ్మడిగా సత్తా చాటారు. సాంట్నర్‌, బుమ్రా చెరో 3 వికెట్లు పడగొట్టగా.. బౌల్ట్‌, చాహర్‌, జాక్స్‌, కర్ణ్‌ శర్మ తలో వికెట్‌ తీశారు. ఢిల్లీ ఇన్నింగ్స్‌లో సమీర్‌ రిజ్వి (39) టాప్‌ స్కోరర్‌ కాగా.. విప్రాజ్‌ నిగమ్‌ (20), అశుతోష్‌ శర్మ (18), కేఎల్‌ రాహుల్‌ (11) రెండంకెల స్కోర్లు చేయగలిగారు.

Sakshi Guest Column On AP Liquar Policy Issue3
ఆ వాఙ్మూలం ముమ్మాటికీ చెల్లదు!

ఆంధ్రప్రదేశ్‌ మద్యం విధానం కేసులో కె. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్‌ రెడ్డి, బాలాజీ గోవిందప్ప ముందస్తు బెయిల్‌ పిటిషన్లను కొట్టివేసే సమయంలో సహనిందితుల నేరాంగీకార వాఙ్మూలానికి సంబంధించి హైకోర్టు అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. కేవలం సహనిందితుడి నేరాంగీకారం ఆధారంగా ఒక వ్యక్తి బెయిల్‌పై నిర్ణయం తీసుకోరాదని వ్యాఖ్యానించింది. సీఆర్‌పీసీ 161 సెక్షన్‌ కింద ఇచ్చిన వాఙ్మూలాన్ని మరొకరికి వ్యతిరేకంగా ఉపయోగించరాదన్నది ప్రాథమిక సూత్రమని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. ‘భారతీయ సాక్ష్యాల చట్టం–1872’ సెక్షన్‌ 30 కింద తుది విచారణ సందర్భంగా ఏ వాఙ్మూలాలను అయితే పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందో, వాటిని ముందస్తు బెయిల్, బెయిల్‌ మంజూరు సమయంలో కూడా పరిగణనలోకి తీసుకోవచ్చని హైకోర్టు చెప్పడాన్ని సుప్రీంకోర్టు ఆక్షేపించింది.ఆంధ్రప్రదేశ్‌ మద్యం కేసులో పిటిషనర్లకు హైకోర్టు ముందస్తు బెయిల్‌ ఎందుకు నిరాకరించింది అనేది ముఖ్య మైన ప్రశ్న. రిజిస్టర్‌ చేసిన కేసులో ఆరోపణలు తీవ్రమైనవి. ఐపీసీ సెక్షన్‌ 409, 420, 12బి, రెడ్‌ విత్‌ సెక్షన్‌ 34, 37 కింద ఈ కేసు నమోదయ్యింది. అయితే, ముందస్తు బెయిల్‌ను కొట్టివేసే సమయంలో సహనిందితుని వాఙ్మూలానికి సంబంధించి ఇండియన్‌ ఎవిడెన్స్‌ యాక్ట్, సెక్షన్‌ 30కు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు అభిప్రాయాలను సుప్రీంకోర్టు తప్పుబట్టింది. సహనిందితుడి పోలీసు భయం ఆధారంగా నేరాంగీకార ప్రకటన నిలబడదనీ, కనుక అలాంటి అరెస్టు చెల్లదనీ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. చెప్పారా, చెప్పించారా?నేరాలు చేసినప్పుడు సాక్ష్యాలు దొరకవు. పరిశోధనలో, దర్యా ప్తులో కొన్ని సాక్ష్యాలు దొరుకుతాయి. పోలీసులు న్యాయంగా సాక్ష్యాలు సేకరిస్తే, అందులో లంచగొండితనం లేకపోతే నిజాలు రుజువయ్యే అవకాశం ఉంటుంది. కానీ మన లోకంలో, లౌక్యంలో ఏం చెప్పగలం? అందరికీ తెలుసు, పోలీసులు నాలుగు తగిలిస్తే తప్ప నిజాలను కక్కడం సాధ్యం కాదు అంటారు. చాలా వరకు నిజం. కానీ తన్నినప్పుడు చెబుతున్నారా, లేక తంతున్నప్పుడు దెబ్బలు భరించలేక నేరాన్ని ఒప్పుకొంటున్నారా? ఈ రెండిటికీ చాలా తేడా ఉంటుంది. ‘దెబ్బలు నా వల్ల కాదు’ అనుకున్నపుడు, దానికన్నా నేరం ఒప్పుకొంటే కోర్టుకు పోయేదాకా బతికిపోవచ్చు అనుకుంటారు. కనుకనే పోలీసుల హింసలో చెప్పిన అంశాలను కోర్టులో చూపినప్పుడు, ఆ నిందితుడు ఇదంతా హింసించడం వల్ల రాసిందే గానీ నిజం కాదని చెప్పినప్పుడే తగాదా మొదలవుతుంది. అక్కడే లాయర్లు వస్తారు. నేరం రుజువు కాదు. నేరాంగీకారం రుజువు కాదు. సహ నింద భరించే గతి!నేర విచారణలో ఒక నిందితుడు, మరొక వ్యక్తి కూడా ఆ నేరంలో పాలు పంచుకున్నాడని వాఙ్మూలం ఇస్తే, సంబంధిత రెండవ వ్యక్తి సహ నిందితుడు అవుతాడు. పోలీసులు చెప్పించుకున్న నేరాంగీ కారం వాడుకుని మొదటి వాడినీ, తరువాత రెండో వాడినీ కూడా జైలుకు పంపిస్తారు. అప్పుడు బెయిల్‌ కోసం పోరాటం ప్రారంభ మవుతుంది. అది లాయర్ల భారీ ఫీజు ఆధారంగా, కింది కోర్టు నుంచి సుప్రీంకోర్టుదాకా న్యాయ పోరాటం సాగుతూ ఉంటుంది. అందుకే తీర్పులు ఆలస్యమవుతాయి. వాయిదాలు వస్తాయి. అప్పీల్సు ఉంటాయి. మధ్యలో తాత్కాలిక ఆర్డర్స్‌ వస్తాయి. (అంటే అంతిమ నిర్ణయం వంటిది కాకుండా వచ్చే తాత్కాలిక ఉత్తర్వు ఇస్తారు. అక్కడ ఉన్నపుడే, తరువాతి స్థాయి, అంటే సెషన్స్‌ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టులలో అన్యాయంగా జైలుకు పోకుండా బెయిల్‌ హక్కుల్ని కాపా డుకుని విడుదల అవుతూ ఉంటారు. మన పత్రికా భాషలో ‘నిందితు డికి సుప్రీం నుంచి ఊరట’ అని అంటూ ఉంటాం.)సీఆర్‌పీసీ సెక్షన్‌ 161 కింద (ఇది పాత కేసు. పాత నేరం కావడం వల్ల కొత్త ఎన్‌డీఏ సర్కారు రచించిన భారతీయ న్యాయ చట్టాలను ఈ సందర్భంలో ఉటంకించడం లేదు. కూడదు. లేకపోతే అయోమ యంలో పడిపోతాం) అనుమానితుడి వాఙ్మూలానికి విలువ ఉన్న ప్పటికీ, పోలీసులకు చెప్పిన నేరాంగీకారాన్ని వాడుకుంటూ సహనిందితుడిని అరెస్టు చేయడం న్యాయమా? నేరారోపణ అనే గుడ్డ కాల్చి మొఖాన పారేసినప్పుడు జైల్లో పడేస్తారు. అందులో నిజా నిజాలు తేలకుండానే ఉన్నప్పుడు ఏం చేయాలి? బెయిల్‌ ఇవ్వాల్సిందే! రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయని చెప్పగలిగితే, ఆయా అంశాలను కోర్టు విశ్వసిస్తే, పోలీసులను నమ్మని దశలో బెయిల్‌ దొరుకుతుంది. అంటే పోలీసులు సాధించిన నేరాంగీకారాల ఆధారంగా నిందితులు, అనుమానితులు అనే పేరుతో అమాయకులను జైలుకు పంపిస్తే, కోర్టే దిక్కు. న్యాయమూర్తులు, జిల్లా స్థాయి న్యాయాధికారులు... మంత్రుల వంటి పెద్దల వీవీఐపీ కేసులని భయపడకుండా ఉత్తర్వులు ఇస్తేనే బెయిల్‌ దొరుకుతుంది. న్యాయం లభిస్తుంది. ఊరట లభిస్తుంది. ఇది అటువంటి కేసు! వారి ఆరోప ణలు నిజమో కాదో ఇప్పుడే చెప్పలేము. కానీ మొదటి దశలోనే పోలీసుల భయం ఆధారంగా వచ్చిన నేరాంగీకారాలు తీసుకుని అరెస్టు చేయకూడదు.మన ‘కొత్త’ నేర చట్టాలుమన ‘భారతీయ’ సాక్ష్య చట్టం కొత్తది కాదు. ఇది ఆంగ్లేయులు రాసిపెట్టిన సాక్ష్యాల చట్టం... ఇండియన్‌ ఎవిడెన్స్‌ యాక్ట్‌. భారతీయ సాక్ష్యాల చట్టం 1872 నుంచి... అంటే 153 ఏళ్ల నుంచి అమలులో ఉన్న చట్టం. (మనం అంతా కొత్త చట్టాలు చేశామని ప్రగల్భాలు పలుకుతున్నాం. పాత సాక్ష్య చట్టపు నియమం కొత్త న్యాయ చట్టంలోనూ ఉంది.) పోలీసుల ముందు నేరాన్ని ఒప్పుకొంటే అనుమానం ఉంటుంది. కనుక ఆ వాఙ్మూలానికి ఆమోద యోగ్యత ఉండదు. ఇది సెక్షన్లు 24, 25, 30 కింద అనుమానితమైన ప్రకటన అని 153 సంవత్సరాల నాటి సూత్రం. దీనిపైన ఎన్నో వందల కేసులలో సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చింది. నేరాంగీకారాన్ని అనుమానిస్తారు. పోలీసుల సమక్షంలో, లాకప్‌లో, లేదా మరెక్కడైనా సరే కొందరు పోలీసులు ఎదురుగా ఉండినప్పుడు ఈ అనుమానం బలవంతం అని అనుకుంటారు. చట్టం తెలియకపోయినా, సాధారణంగా మామూలు మనుషులకు కూడా ఈ విషయం తెలుసు. భారత శిక్షాస్మృతి (ఐపీసీ), భారతీయ సాక్ష్య చట్టం, క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ భారతదేశ న్యాయ వ్యవస్థలపైన, సమాజం పైన, న్యాయస్థానా ల్లోనూ ఇప్పటికీ నిలబడిన చట్టాలు. 153 సంవత్సరాల నుంచి ఈ సూత్రాలు ఇప్పటికీ ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే ఇవి మౌలిక మైన సూత్రాలు. ప్రపంచంలోని అనేక దేశాల్లో కూడా అమలు చేయ వలసిన సూత్రాలు. బ్రిటిష్‌ వారి సూత్రాలు కాబట్టి పనికిరావని అనుకోవడానికి వీల్లేని నియమాలు ఇవి. ఆ సూత్రాలను కాపాడుకుంటూ కొన్ని మార్పులు చేశారు. అయితే, ఈ చట్టాలు మన న్యాయ వ్యవస్థకు పునాదిగా ఉన్నప్పటికీ, ఆధునిక భారతదేశ సంక్లిష్టతలను పరిష్కరించడానికి ఇబ్బంది పడ్డాయి. అందుకే 2020లో ప్రొఫెసర్‌ (డాక్టర్‌) రణ్‌బీర్‌ సింగ్‌ అధ్యక్షత వహించిన ‘కమిటీ ఫర్‌ రిఫార్మ్స్‌ ఇన్‌ క్రిమినల్‌ లాస్‌’ (సీఆర్‌సీఎల్‌) ఏర్పాటు చేశారు. ఆ కమిటీ రూపొందించిన కొత్త చట్టాల పేర్లు ఇవి: భారతీయ న్యాయ సంహిత, భారతీయ సాక్ష్య అధినియమం, భారతీయ నాగరిక్‌ సురక్ష సంహిత.బెదిరిస్తే, ప్రలోభ పెడితే...నేరారోపణకు గురైన వ్యక్తి చేసిన అంగీకారం ఏదైనా ప్రేరేపణ లేదా బెదిరింపు లేదా లాభం చేస్తామనే వాగ్దానంతో జరిగినట్లు కనిపిస్తే, ఆ వ్యక్తి నేరాంగీకారం అసంబద్ధం. ఇది కీలకమైన సూత్రం. పోలీసు కస్టడీలో నేరాంగీకరణ విషయంలో ఇది కీలకమైన సుప్రీంకోర్టు తీర్పు. తాజాగా 2022లో కూడా ఇంద్రేశ్‌ కుమార్‌ కేసులో సీఆర్‌పీసీ సెక్షన్‌ 161 కింద ఇటువంటి నేరాంగీకారాన్ని ఒప్పుకోవడం కుదరదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. మద్యం కేసులో కృష్ణమోహన్‌ రెడ్డి, రిటైర్డ్‌ ఐఏఎస్‌ ధనుంజయ్‌ రెడ్డి, ‘వికాస్‌ సిమెంట్స్‌’ డైరెక్టర్‌ బాలాజీ గోవిందప్ప ముందస్తు బెయిల్‌కై హైకోర్టుకు వెళ్లారు. ఆపై సుప్రీంకు అప్పీలు చేశారు. ‘నేర విచారణ ప్రక్రియలో ఓ నిందితుడి వాఙ్మూలాన్ని సహనిందితుడికి వ్యతిరేకంగా ఉపయోగించరాదన్నది ప్రాథమిక సూత్రం’ అని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించడమే కాక, దీనిపై సంపూర్ణ వివరణ ఇచ్చింది. బెయిల్‌ మంజూరు సమయంలో కోర్టులు ఆ యా అంశాలను జాగ్రత్తగా పరిశీలించాలని నిర్దేశించింది. ముందస్తు బెయిల్, బెయిల్‌ మంజూరు సమయంలో సహనిందితుల వాఙ్మూలా లను పరిగణనలోకి తీసుకోవడానికి వీల్లేదని స్పష్టం చేసింది.మాడభూషి శ్రీధర్‌ వ్యాసకర్త మహేంద్ర యూనివర్సిటీ ‘స్కూల్‌ ఆఫ్‌ లా’ ప్రొఫెసర్‌

This is The Reason China Huddles With Pak Afghan4
అయ్యయ్యో చైనా.. ఎంత కష్టమొచ్చే?

శత్రువుకి శత్రువు.. మిత్రుడు. అలాగే శత్రువుకి మిత్రుడు కూడా శత్రువే కదా!. కానీ, ఆ శత్రువునే తమ మిత్రుడిగా మార్చుకునేందుకు ఆఘమేఘాల మీద చైనా చేస్తున్న ప్రయత్నాలపై ‘‘అయ్యో.. పాపం’’ అనే చర్చ నడుస్తోంది ఇప్పుడు. సీపీఈసీ ప్రాజెక్టును ఆప్ఘ‌నిస్థాన్ వ‌ర‌కు పొడిగించాల‌ని నిర్ణయించడమే ఇందుకు కారణం.పాక్‌, అఫ్గనిస్తాన్‌ ప్రతినిధుల మధ్య బుధవారం చైనా ఆధ్వర్యంలో ఓ సమావేశం జరిగింది. ఈ మీటింగ్‌కు చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీ మధ్యవర్తిత్వం వహించారు. ఈ భేటీ తర్వాత చైనా విదేశాంగ శాఖ ఒక ప్రకటన చేసింది. ఆ ఇరు దేశాలు దౌత్యపరమైన సంబంధాలను బలోపేతం చేసుకోవాలని భావిస్తున్నాయని ఆ ప్రకటన పేర్కొంది. ఇందుకుగానూ ఇరు దేశాల పరస్పరం రాయబారులను నియమించుకునేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపింది. సీపీఈసీ ప్రాజెక్టు ఒప్పందం అదే విషయం. అయితే.. పాక్‌-అఫ్గన్‌ దేశాల మధ్య బంధం ఎంతటి ధృడమైందో యావత్‌ ప్రపంచానికి తెలుసు. అఫ్గనిస్తాన్‌ను ఉగ్రవాదుల స్వర్గధామంగా పాక్‌ తరచూ అభివర్ణిస్తూ ఉంటుంది. అయితే అఫ్గన్‌ మాత్రం ఆ ఆరోపణలను తోసిపుచ్చుతూ వస్తోంది. ఇదిలా ఉంటే.. 2024 డిసెంబర్‌లో అఫ్గన్‌ పాక్టికా ప్రావిన్స్‌లో పాక్‌ వైమానిక దాడులు జరిపి 50 మందిని పొట్టనబెట్టుకుంది. ఈ ఘోరంలో మరణించింది ఎక్కువగా మహిళలు, పిల్లలే. అయితే తాము ఉగ్ర శిబిరాలపై దాడి చేశామంటూ పాక్‌ ప్రకటించుకోవడం గమనార్హం. ఈ పరిణామంపై అఫ్గన్‌ రగిలిపోతూ వస్తోంది. అలాంటిది.. ఇప్పుడు, ఈ ఇరు దేశాలు ఇప్పుడు దగ్గరయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయంటూ చైనా ప్రకటించడం ఆసక్తికర చర్చకు దారి తీసింది.ఎందుకీ తొందర?2021లో అమెరికా బలగాల ఉపసంహరణ తర్వాత తాలిబన్ల ప్రభుత్వం ఏర్పడింది. కానీ, ప్రపంచంలోని ఏ దేశం కూడా ఆ ప్రభుత్వానికి గుర్తింపు ఇవ్వలేదు. దీంతో అది తాత్కాలిక ప్రభుత్వంగానే కొనసాగుతోంది. అయితే చైనా, పాక్‌, రష్యా,ఇరాన్‌ దేశాలు సత్సంబంధాలు కొనసాగించేందుకు ప్రయత్నిస్తూ వస్తున్నాయి. ఉగ్రవాద లిస్ట్‌ నుంచి ఆ దేశాన్ని తొలగించాయి. అయితే తాలిబన్‌ సర్కార్‌కు గుర్తింపు ఇవ్వకున్నా.. ఆ దేశం తరఫున తమ దగ్గర రాయబారికి అనుమతించింది చైనా. ఇక..భారత్‌ అఫ్గన్‌ తాలిబన్‌ ప్రభుత్వానికి గుర్తింపు ఇవ్వలేదు. కానీ, వాళ్లు అధికారంలోకి వచ్చినప్పటి నుంచే సంబంధాలు కొనసాగిస్తూ వస్తోంది. ఈ క్రమంలో సరిహద్దు ప్రధానాంశంగా పలుమార్లు చర్చలు కూడా జరిపాయి. వాటిలో పురోగతి లేకున్నా.. మానవతా సాయం, అక్కడి పౌరుల బాగోగుల మీద దృష్టిసారిస్తూనే వస్తోంది. ఇది ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగు పడేందుకు దోహదపడ్డాయి. ఈ క్రమంలోనే.. దౌత్యపరమైన సమావేశాలు గత ఏడాది కాలంలో చాలానే జరిగాయి. ఈ ఏడాది జనవరిలో భారత విదేశాగం కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ, తాలిబన్ విదేశాంగ మంత్రి అమీర్‌ ఖాన్‌‌ ముట్టాఖితో దుబాయ్‌లో భేటీ అయి కీలక అంశాలపై చర్చించారు. తాజాగా భారత విదేశాంగ మంత్రి జై శంకర్‌ కూడా అమీర్‌ ఖాన్‌‌ ముట్టాఖితో కీలక సంప్రదింపులు జరిపారు. ఈ పరిణామం.. భారత్‌లో దౌత్యవేత్తల నియామకానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం, కాన్సులర్‌ సేవలతో పాటు పలు నగరాల్లో వ్యాపార, విద్య, వైద్యం కోసం వచ్చే అఫ్గన్‌ పౌరులకు సేవల అనుమతికి అంగీకారం తెలపడం లాంటి నిర్ణయాలకు వేదికైంది. ఇది ఓర్వలేక.. కుటిల బుద్ధితో.. భారత్‌ వ్యతిరేకిస్తున్న సీపెక్‌లో అఫ్గన్‌ను భాగం చేసిందని, హడావిడిగా తాలిబన్లకు చైనా ప్రాధాన్యం ఇస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది ఇప్పుడు.

Telangana Weather: Hyderabad Rain Updates May 21 20255
హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం

హైదరాబాద్‌, సాక్షి: నగరంలో పలుచోట్ల వర్షం దంచికొడుతోంది. సికింద్రాబాద్‌, బేగంపేట్‌, బోయిన్‌పల్లి, బంజారాహిల్స్‌, మోహిదీపట్నం, ఆసిఫ్‌నగర్‌, కార్వాన్‌, మలక్‌పేట్‌, సైదాబాద్‌, చాదర్‌ ఘాట్‌, మారేడుపల్లి, షేక్‌పేట్‌, మాదాపూర్‌, గచ్చిబౌలి, అత్తాపూర్‌, అంబర్‌పేట్‌, అత్తాపూర్‌, రాజేంద్రనగర్‌, నల్లకుంట, నాచారం, తార్నాక, తిరుమలగిరి, అల్వాల్‌, బొల్లారం, ఉప్పల్‌, రామంతాపూర్‌లో భారీ వర్షం కురుస్తోంది.ద్రోణి, ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాజధాని నగరం హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో బుధవారం మధ్యాహ్నాం నుంచి ఈదురు గాలులు, పిడుగులతో కూడిన వానలు పడుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం ‘రెయిన్‌ అలర్ట్‌’ జారీ చేసింది.ఉపరితల ద్రోణి ఉదయం నుంచి హైదరాబాద్‌-సికింద్రాబాద్‌ జంట నగరాలపై మేఘాలు కమ్ముకోగా.. మధ్యాహ్నాం నుంచి పలుచోట్ల ఈదురు గాలులతో వర్షం(Hyderabad Rains) కురుస్తోంది. కొన్ని చోట్ల చిరుజల్లులు, మరికొన్ని చోట్ల ఓ మోస్తరు వాన పడుతోంది. మలక్ పేట్, నాంపల్లి, చార్మినార్, దిల్‌సుఖ్ నగర్, కోఠి, రామంతపూర్, అబిడ్స్, అంబర్‌పేట్.. తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఖైరతాబాద్, లక్డీకాపూల్, రాజ్ భవన్, ట్యాంక్ బండ్ సమీపంలో స్వల్ప వర్షంతో మొదలై.. జడి వానగా మారింది. నగర శివారు ప్రాంతాల్లో చోట్ల చిరు జల్లులు పడుతున్నాయి. మరికొన్ని గంటల్లో జంట నగరాల వ్యాప్తంగా పూర్తి స్థాయిలో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. అలాగే.. రాత్రి సమయంలో హైదరాబాద్‌లో తీవ్రమైన తుఫాను(Cyclone) వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ(GHMC) అప్రమత్తం అయ్యింది. సాయంత్రం పనులు ముగించుకుని వెళ్లేవాళ్లను అప్రమత్తం చేస్తోంది. మ్యాన్‌ హోల్స్‌, కరెంట్‌ పోల్స్‌ విషయంలో జాగ్రత్తగా ఉండాలని నగర ప్రజలకు సూచించింది.ఇదిలా ఉంటే.. ద్రోణి, ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాజధాని నగరంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో(Telangana Rains) ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులపాటు ఈదురు గాలులు, పిడుగులతో కూడిన భారీ వానలు తప్పవని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాలకు ఇప్పటికే ఆరెంజ్‌ అలర్ట్‌లు జారీ చేసింది. ఇక పంట చేతికొచ్చే సమయం కావడంతో అప్రమత్తంగా ఉండాలని రైతులకు అధికార యంత్రాంగం సూచిస్తోంది. తెలంగాణకు రెయిన్‌ అలర్ట్‌వాతావరణ శాఖ భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. రాష్ట్ర వ్యాప్తంగా రెయిన్‌ అలర్ట్‌ జారీ చేసింది. సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉండడంతో.. అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ముందస్తు ప్రణాళికలతో సమన్వయం చేసుకోవాలని సూచించింది. అలాగే..ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బెటాలియన్లను సైతం అందుబాటులో ఉండాలని ఆదేశించింది.‘‘ఋతుపవనాలు ముందుగా రాబోతున్నాయి. అన్ని విభాగాలు అప్రమత్తంగా ఉండాలి. 2024లో కురిసిన భారీ వర్షాలకు NDRF అందుబాటులో లేకపోవడంతో గోల్డెన్ అవర్ కోల్పోయాం. 2024 సెప్టెంబర్ లాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కావొద్దు. జిల్లాల్లో కలెక్టర్లు ముందస్తు ప్రణాళికలు, సమన్వయం చేసుకోవాలి. సింగరేణి లో ప్రత్యేక శిక్షణ పొందిన రెస్క్యూ టీమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి’’ అని సర్క్యులర్‌లో డిజాస్టర్స్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ అరవింద్ కుమార్ పేర్కొన్నారు. సీఎం రేవంత్‌ కీలక ఆదేశాలుముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి బుధవారం సీఎస్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, వాతావరణ శాఖ ఇచ్చిన సూచనలకు అనుగుణంగా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ‘‘ధాన్యం కొనుగోలు కేంద్రాలు, మార్కెట్లలో ఉన్న ధాన్యం తడవకుండా తగిన రక్షణ చర్యలు చేపట్టాలి. కలెక్టర్లు.. కాంటాలు వేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలి. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బంది పడకుండా తగిన చర్యలు చేపట్టాలి.హైదరాబాద్ సిటీలో వర్షం కురుస్తున్న ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిల్వ లేకుండా చూడాలి. ట్రాఫిక్ ఇబ్బందులు, విద్యుత్తు సమస్యలు లేకుండా చూడాలి. జీహెచ్ఎంసీ, పోలీస్, హైడ్రా, ట్రాఫిక్, విద్యుత్తు విభాగాలు సమన్వయంతో పని చేయాలి. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలి’’ అని సీఎస్‌ను ఆదేశించారాయన. ఇదీ చదవండి: సూర్యుడిపైకి సాగర మేఘాలు

Indus River project, set fire to house of Sindh Home Minister Ziaul Hassan6
నీటి వివాదం.. పాక్‌ హోంమంత్రి ఇంటికి నిప్పు

ఇస్లామాబాద్‌: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌ను దెబ్బ కొడుతూ భారత్‌ తీసుకున్న కఠిన నిర్ణయాల్లో సింధూ నదీ జలాలతో ముడిపడిన అంశం ఒకటి. భారత్‌ తీసుకున్న నిర్ణయంతో పాకిస్తాన్‌ సింధ్ ప్రావిన్స్‌లో నిరసనలు మిన్నంటాయి. నీళ్లు లేకపోవడంతో పాక్‌ ప్రజలు ఎదురు తిరిగారు. పాక్‌ హోంమంత్రి జియా ఉల్‌ హసన్‌ ఇంటిని తగలబెట్టారు.ఈ సంఘటన భద్రత, ప్రజల ఆగ్రహాన్ని అదుపు చేయడంలో ప్రభుత్వ సామర్థ్యంపై తీవ్రమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నీటి కటకటతో నిరసనకారులు హోమంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బహిరంగంగా ఏకే 47 గన్నుతో గాల్లోకి కాల్పులు జరుపుతున్న వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. పాకిస్తాన్‌లో నీటి సంక్షోభంసింధు నది నుండి నీటిని మళ్లించి,పంజాబ్‌కు నీటి సరఫరాను పెంచేందుకు పాకిస్తాన్‌ ప్రభుత్వం కాలువను నిర్మించాలని యోచిస్తోంది. కానీ సింధ్‌లోని స్థానికులు ప్రభుత్వ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయం వల్ల తమ వ్యవసాయ భూములకు,తాగునీటికి ముప్పు వాటిల్లుతుందని,ఇప్పటికే నీటి కొరతను ఎదుర్కొంటున్నామని ఈ ప్రాజెక్ట్ పరిస్థితిని మరింత దిగజార్చుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అంతేకాదు,ఐఎంఎఫ్‌ ఒత్తిడితో పంటలకు కనీస మద్దతు ధర (MSP) నిలిపివేయడంకార్పొరేట్ వ్యవసాయం కోసం వారసత్వ భూములను బలవంతంగా సేకరించడంలాభం కోసం పాకిస్తాన్‌ సైన్యం సైతం వ్యవసాయంలో భాగస్వామ్యం కావడం.. వంటి అంశాలపై పాక్‌ ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికింది. తాజాగా, ప్రభుత్వ తీరును నిరసిస్తూ స్థానికులు జాతీయ రహదారిని దిగ్బంధించడానికి ప్రయత్నించారు. ఈ ప్రయత్నంతో అక్కడ నిరసనలు మిన్నంటాయి. పోలీసులు భారీ ఎత్తున మోహరించి ఆందోళనకు దారితీసింది. ఇది ఘర్షణలకు దారితీసింది. ఈ హింసాత్మక ఘటనలో ఇద్దరు పౌరులు మరణించారు.పోలీసు అధికారులతో సహా అనేక మంది గాయపడ్డారు. నిరసనకారులు మోరోలోని హోంమంత్రి ఇంటిపై కూడా దాడి చేసి తగలబెట్టారు. House of Sindh Interior Minister Ziaul Hasan🇵🇰 pic.twitter.com/hQdD02tBBj— ARIKA🇮🇳🚩 (@nidhisj2001) May 21, 2025పోలీసు చర్యకు ఆదేశించినందుకు స్థానికులు మంత్రిపై మండిపడుతున్నారు. నీటి కొరత కారణంగా సింధ్ విధ్వంసానికి దారితీసే విధానాలకు ఆయన మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. నిరసనకారులు ఆసుపత్రిలో గాయపడిన పోలీసు అధికారులపై దాడి చేయడంతో మరింత ఉద్రిక్తతకు దారి తీసింది. నిరసనకారులు యూరియా ఇతర ఎరువులతో వెళ్తున్న ట్రక్కులను దోచుకుని ఆపై వాటిని తగలబెట్టారు.స్పందించిన పాక్‌ ప్రభుత్వంఈ ఆందోళనపై పాక్‌ ప్రభుత్వం స్పందించింది. సింధ్‌లో భద్రతను బలోపేతం చేసే దిశగా పారామిలిటరీ దళాలను మోహరించారు. దాడులలో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. పహల్గాం ఉగ్రదాడితో పహల్గాంలో పర్యటకులపై ఉగ్రదాడి అనంతరం సింధూ జలాల ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు భారత్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. దాదాపు తొమ్మిదేళ్లపాటు విస్తతస్థాయి చర్చల తర్వాత 1960 సెప్టెంబర్‌ 19వ తేదీన నాటి భారత ప్రధాన మంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ, పాకిస్తాన్‌ అధ్యక్షుడు అయూబ్‌ఖాన్‌లు ఈ చరిత్రాత్మక ఒప్పందంపై సంతకాలు చేశారు.ఈ డీల్ ప్రకారం సింధు ఉప నదుల్లో తూర్పున పారే రావి, బియాస్, సట్లెజ్‌ నదులపై భారత్ కు హక్కులు లభించాయి. సింధూ నదితోపాటు దాని పశ్చిమ ఉపనదులైన జీలం, చీనాబ్‌లపై పాకిస్తాన్‌కు హక్కులు దక్కాయి. ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్‌కు బుద్ధి చెప్పేందుకు సింధూ నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది.దీంతో పాక్‌లో నీటి సమస్య ఉత్పన్నమవుతున్నాయి.

IPL 2025, MI VS DC: Kuldeep Yadav Completes 100 Wickets In IPL7
IPL 2025, MI VS DC: సెంచరీ పూర్తి చేసిన కుల్దీప్‌ యాదవ్‌

ఐపీఎల్‌ 2025లో భాగంగా ఇవాళ (మే 21) జరుగుతున్న అత్యంత​ కీలకమైన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ తలపడుతున్నాయి (ముంబైలో). ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకున్న ఢిల్లీ ముంబై ఇండియన్స్‌ను కట్టడి చేసింది.9 ఓవర్లు ముగిసే సమయానికి ముంబై 3 వికెట్లు కోల్పోయి 73 పరుగులు మాత్రమే చేసింది. రికెల్టన్‌ (25), రోహిత్‌ శర్మ (5), విల్‌ జాక్స్‌ (21) ఔట్‌ కాగా.. సూర్యకుమార్‌ యాదవ్‌ (13), తిలక్‌ వర్మ (7) క్రీజ్‌లో ఉన్నారు. ఢిల్లీ బౌలర్లలో ముకేశ్‌ కుమార్‌, ముస్తాఫిజుర్‌, కుల్దీప్‌ యాదవ్‌ తలో వికెట్‌ తీశారు.కుల్దీప్‌ సెంచరీఈ మ్యాచ్‌లో రికెల్టన్‌ వికెట్‌ తీయడంతో కుల్దీప్‌ ఐపీఎల్‌లో 100 వికెట్లు పూర్తి చేశాడు. ఈ ఘనతను కుల్దీప్‌ 97 మ్యాచ్‌ల్లో సాధించాడు. తద్వారా ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 100 వికెట్లు పూర్తి చేసిన టాప్‌-5 స్పిన్నర్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన స్పిన్నర్లుగా అమిత్‌ మిశ్రా, రషీద్‌ ఖాన్‌, వరుణ్‌ చక్రవర్తి ఉన్నారు. వీరు ముగ్గురు 83 ​మ్యాచ్‌ల్లో ఈ మైలురాయిని తాకారు. ఈ జాబితాలో చహల్‌ (84 మ్యాచ్‌లు), సునీల్‌ నరైన్‌ (86) రెండు, మూడు స్థానాల్లో ఉండగా.. కుల్దీప్‌ నాలుగో స్థానంలో నిలిచాడు.ప్లే ఆఫ్స్‌ సమీకరణలు ఇలా..ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో ఇప్పటికే మూడు ప్లే ఆఫ్స్‌ బెర్త్‌లు (గుజరాత్‌, ఆర్సీబీ, పంజాబ్‌) ఖరారయ్యాయి. మిగిలిన ఏకైక బెర్త్‌ కోసం ముంబై ఇండియన్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఇరు జట్లు తలో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్నా, వీరి ప్లే ఆఫ్స్‌ భవితవ్యం ఇవాల్టి మ్యాచ్‌తో దాదాపుగా డిసైడైపోతుంది.ఈ మ్యాచ్‌లో ముంబై గెలిస్తే ఇంకో మ్యాచ్‌తో సంబంధం లేకుండా ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ ఖరారు చేసుకుంటుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో ఢిల్లీ గెలిచినా ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ అప్పుడే ఖరారు కాదు. ఆ జట్టు తమ చివరి లీగ్‌ మ్యాచ్‌లో పంజాబ్‌పై (మే 24) కూడా గెలిస్తేనే ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ ఖరారవుతుంది.ఒకవేళ ఢిల్లీ.. ముంబైపై గెలిచి, పంజాబ్‌ చేతిలో ఓడినా ప్లే ఆఫ్స్‌ బెర్త్‌పై సందిగ్దత కొనసాగుతుంది. మే 26న జరిగే మ్యాచ్‌లో పంజాబ్‌పై గెలిస్తే ముంబై ప్లే ఆఫ్స్‌కు చేరుతుంది. ఒకవేళ ముంబై ఆ మ్యాచ్‌లో కూడా ఓడితే లీగ్‌ నుంచి నిష్క్రమిస్తుంది. ఢిల్లీ ప్లే ఆఫ్స్‌కు చేరుతుంది.

Massive Storm In Delhi May 21st 2025 Details Here8
భారీ తుపాను.. ఢిల్లీ అతలాకుతలం!

న్యూఢిల్లీ: భారీ తుపాను(Delhi Massive Storm) ధాటికి దేశ రాజధాని అతలాకుతలం అయ్యింది. బుధవారం సాయంత్రం నుంచి ధూళి, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. దీంతో జనజీవనం అస్తవ్యస్తం అయ్యింది. నిన్నమొన్నటి దాకా 40 డిగ్రీల ఉష్ణోగ్రలతో.. తీవ్ర ఉక్కపోతతో రాజధాని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే బుధవారం సాయంత్రం వాతావరణం చల్లబడిందని అనుకునేలోపే.. ధూళి తుపానుతో ఢిల్లీలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గంటకు 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. ఆ ధాటికి ఢిల్లీ, నోయిడాల్లో చాలా చోట్ల చెట్లు, హోర్డింగులు, కరెంట్‌ పోల్స్‌ నేలకొరిగాయి. చాలా ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రోడ్డుపైనే చెట్లు, హోర్డింగ్స్‌ పడిపోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆస్తి, ప్రాణ నష్టం వివరాలు రేపటికి తెలిసే అవకాశం ఉంది. మరోవైపు ప్రతికూల వాతావరణం కారణంగా విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉంటే.. ఢిల్లీతో పాటు హర్యానా, యూపీ రాష్ట్రాల్లోనూ పలుచోట్ల భారీ వర్షం కురిసింది. ఢిల్లీకి వర్షాలు ఉండడంతో.. వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. సోషల్‌ మీడియాలో తుపాను బీభత్సానికి సంబంధించిన దృశ్యాలు వైరల్‌ అవుతున్నాయి. #WATCH | Delhi-NCR experiences weather change. Visuals from Noida Sector 10 in Uttar Pradesh as it experiences dust storm. pic.twitter.com/gsqXxyFGhq— ANI (@ANI) May 21, 2025 #WATCH | Delhi: A tree uprooted at Janpath Road as the city received gusty wind, heavy rainfall and hailstorm. pic.twitter.com/GDVI1OpSz4— ANI (@ANI) May 21, 2025#WATCH | Delhi receives gusty wind, heavy rainfall and hailstorm. Visuals from Geeta Colony. pic.twitter.com/hTIXMzETgZ— ANI (@ANI) May 21, 2025

Operation Kagar: Who Is The Next Target Of The Security Forces9
ఆపరేషన్‌ కగార్‌.. భద్రత బలగాల నెక్ట్స్ టార్గెట్ అతడేనా?

ఛత్తీస్‌గఢ్‌: భద్రతా బలగాల కూంబింగ్‌ కొనసాగుతోంది. మావోయిస్టు పార్టీ అగ్రనేత నంబాల కేశవరావు మృతి చెందడంతో భద్రత బలగాలు మరింత దూకుడు పెంచాయి. పార్టీలో కీలక నేతగా ఉన్న మడావి హిడ్మా టార్గెట్‌గా కేంద్ర హోంశాఖ ఆపరేషన్ మొదలుపెట్టింది.అంబుజ్‌మడ్ దండకారణ్యంలో హిడ్మా కోసం రెండు వేల మంది భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే ఎన్‌ఐఏ హిట్ లిస్టులో హిడ్మా ఉండగా, మావోయిస్టు పార్టీలో 18 మంది కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నట్లు కేంద్ర హోంశాఖ గుర్తించినట్లు సమాచారం.రాబోయే 10 నెలలు కీలక నేతలు టార్గెట్‌గా ఆపరేషన్‌ కొనసాగుతోంది. ప్రస్తుతం మావోయిస్టు పార్టీ అగ్ర నేతలు ఎక్కడెక్కడ షెల్టర్ జోన్ తీసుకున్నారన్నదానిపై పూర్తి వివరాలను కేంద్ర హోంశాఖ సేకరిస్తోంది. మరో వైపు నంబాల కేశవరావు మృతిపై మావోయిస్ట్‌ పార్టీ ఎటువంటి ప్రకటన చేయలేదు. కేశవరావు మృతిని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధికారికంగా ప్రకటించారు. తాజా ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అత్యవసర సమావేశమైంది.

Dubai firm vanishes overnight without a trace Indian investors lose millions10
దుబాయ్‌లో కంపెనీ గల్లంతు.. రూ.కోట్లు నష్టపోయిన భారతీయులు

దుబాయ్‌కు చెందిన ఓ బ్రోకరేజీ సంస్థ రాత్రికి రాత్రే గల్లంతైంది. రూ.కోట్ల కొద్దీ ఇన్వెస్టర్ల సొమ్ముతో ఆచూకీ లేకుండా మాయమైంది. దుబాయ్ లోని బిజినెస్ బేలోని క్యాపిటల్ గోల్డెన్ టవర్‌లో అప్పటి వరకూ ఆ కంపెనీ ఉన్న ఆఫీస్‌ బయట ఒక బకెట్, అందులో ఒక మాప్, చెత్త సంచి మాత్రమే కనిపించాయి. కొన్ని వారాల క్రితం ఈ స్థలంలో గల్ఫ్ ఫస్ట్ కమర్షియల్ బ్రోకర్స్‌ కార్యాలయం ఉండేదని, అదే ఇప్పుడు అదృశ్యమైనట్లు కనిపిస్తోందని ఖలీజ్ టైమ్స్ నివేదిక తెలిపింది.గల్లంతైన సంస్థ..గత నెల వరకు గల్ఫ్ ఫస్ట్ దుబాయ్ సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ లోని క్యాపిటల్ గోల్డెన్ టవర్ 302, 305 సూట్ లలో సుమారు 40 మంది ఉద్యోగులతో కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉండేది. ఔత్సాహిక ఇన్వెస్టర్లను సంప్రదించడం, ఫారెక్స్ పెట్టుబడులను ప్రోత్సహించడం వారి పని.క్యాపిటల్ గోల్డెన్ టవర్‌లోని ఆ రెండు గదులు ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి. ఫోన్ లైన్లు తెగిపోయి ఫ్లోర్లు దుమ్ముతో నిండిపోయి ఉన్నాయి. తాళాలు తిరిగి ఇచ్చి, అన్నీ క్లియర్ చేసి హడావుడిగా వెళ్లిపోయారని క్యాపిటల్ గోల్డెన్ టవర్ సెక్యూరిటీ గార్డు ఒకరు మీడియాకు తెలిపారు. ఇప్పుడు రోజూ జనం వచ్చి వారి గురించి అడుగుతున్నారని చెప్పారు.నష్టపోయిన భారత ఇన్వెస్టర్లుగల్ఫ్ ఫస్ట్ బాధితుల్లో భారతీయ ఇన్వెస్టర్లు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. కంపెనీలో పెట్టుబడి పెట్టి కోట్లాది రూపాయలు నష్టపోయినట్లు బాధితులు చెబుతున్నారు. కేరళకు చెందిన మహ్మద్, ఫయాజ్ పొయిల్ గల్ఫ్ ఫస్ట్ కమర్షియల్ బ్రోకర్స్‌ బ్యాంకర్స్ ద్వారా 75,000 డాలర్లు అంటే రూ.64 లక్షలకు పైగా ఇన్వెస్ట్‌ చేసి మోసపోయారు.మరో భారతీయ ఇన్వెస్టర్‌ అయితే ఏకంగా 2,30,000 డాలర్లు భారతీయ కరెన్సీలో దాదాపు రూ.2 కోట్లు నష్టపోయారు. ఇన్వెస్ట్‌ చేసే సయమంలో కంపెనీ రిలేషన్‌షిప్ మేనేజర్‌ తనతో తన మాతృ భాష కన్నడంలో మాట్లాడారని చెప్పుకొచ్చారు. మొదట చిన్న చిన్న లాభాలను చూపించి డబ్బును ఉపసంహరించుకునేందుకు అవకాశం కల్పించిన కంపెనీ ఆ తర్వాత ఉపసంహరణలకు వీలు లేకుండా ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్‌ చేయించారని బాధితుడు పేర్కొన్నారు.కంపెనీ సిబ్బంది తనతో మాట్లాడేటప్పుడు గల్ఫ్ ఫస్ట్, సిగ్మా-వన్ పేర్లను మార్చి మార్చి చెప్పారని, అవి రెండూ ఒకే కంపెనీగా ఉన్నాయని 50,000 డాలర్లు (సుమారు రూ.42 లక్షలు) నష్టపోయిన మహమ్మద్ అనే మరో ఇన్వెస్టర్‌ వివరించారు. రెండు సంస్థలపై కేసు నమోదు చేసిన పోలీసులు సిగ్మా-వన్ క్యాపిటల్ కు డీఎఫ్ఎస్ఏ లేదా ఎస్‌సీఏ అనుమతి లేదని నిర్ధారించారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement