Top Stories
ప్రధాన వార్తలు

బీసీసీఐ కీలక నిర్ణయం.. ఆసియా కప్‌కు టీమిండియా దూరం
పాక్‌తో ఉద్రిక్త పరిస్థితలు నేపథ్యంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ మంత్రి నేతృత్వం వహిస్తున్న ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) నిర్వహించే ఈవెంట్లలో పాల్గొనకూడదని డిసైడ్ చేసుకుంది. ఏసీసీ ఆథ్వర్యంలో జరిగే ఈవెంట్లలో భారత క్రికెట్ జట్లు (పురుషులు, మహిళలు) పాల్గొనవని స్పష్టం చేసింది. వచ్చే నెలలో శ్రీలంకలో జరిగే మహిళల ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్,ఆ తర్వాత సెప్టెంబర్‌లో భారత్ వేదికగా జరగాల్సిన ద్వైవార్షిక పురుషుల ఆసియా కప్ నుండి వైదొలుగుతున్నట్లు పేర్కొంది. ఈ విషయాన్ని ఏసీసీకి కూడా తెలియజేసింది. క్రికెట్‌కు సంబంధించి పాక్‌ను ఒంటరి చేయడమే లక్ష్యంగా ఈ చర్యకు ఉపక్రమించినట్లు తెలుస్తుంది.కాగా, పాకిస్తాన్‌కు చెందిన మంత్రి మొహిసిన్ నఖ్వీ ఇటీవలే ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) చైర్మన్‌గా ఎన్నికయ్యాడు. నఖ్వీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు (పీసీబీ) కూడా చైర్మన్‌గా వ్యవహరిస్తూ, జోడు పదవులను అనుభవిస్తున్నాడు. ఆసియా క్రికెట్ కౌన్సిల్లో భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ సభ్య దేశాలుగా ఉన్నాయి. రోస్టర్ విధానంలో ఏసీసీ చైర్మన్ ఎంపిక జరుగుతుంది. ఈ క్రమంలో ఈ దఫా పాకిస్తాన్‌కు అవకాశం వచ్చింది. అంతకుముందు ఏసీసీ చైర్మన్‌గా ప్రస్తుత ఐసీసీ అధ్యక్షుడు జై షా ఉండేవాడు. షా.. ఐసీసీ పదవి చేపట్టాల్సి ఉండటంతో ఏసీసీ చైర్మన్‌గిరికి ముందుగానే రాజీనామా చేశాడు. ఇదిలా ఉంటే, భారత్ పురుషుల ఆసియా కప్‌ను బాయ్‌కాట్ చేయాలని నిర్ణయించుకోవడంతో ఆ టోర్నీపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ టోర్నీ భారత్‌లోనే జరగాల్సి ఉన్నా పాక్ మంత్రి ఏసీసీ చైర్మన్‌గా ఉన్నందుకు బీసీసీఐ ససేమిరా అంటుంది. ఆసియా కప్‌లో భారత్ పాల్గొనపోతే టోర్నీ జరగడం దాదాపుగా అసాధ్యం. ఎందుకంటే అంతర్జాతీయ క్రికెట్ ఈవెంట్లకు స్పాన్సర్లలో ఎక్కువ మంది భారత్‌కు చెందిన వారే ఉన్నారు. వీరు స్పాన్సర్షిప్కు ముందుకు రాకపోతే టోర్నీ జరుగదు.పెహల్గామ్ దాడితో మొదలు..ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్లో గల ప్రశాంత బైసరన్ లోయలో పాక్ ఉగ్రమూకలు కాల్పులకు తెగబడి 26 మంది పర్యాటకులను పొట్టన పెట్టుకున్నాయి. ఈ దాడి తర్వాత భారత్ ఆపరేషన్ సిందూర్ పేరిట పాక్‌లో తలదాచుకున్న ఉగ్రమూకలపై దాడి చేసింది. భారత్ దాడులకు పాక్ బదులిచ్చే ప్రయత్నం చేయగా.. భారత బలగాలు వారికి తగు రీతిలో బుద్ది చెప్పాయి. తదనంతరం పరిణామాల్లో భారత్, పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని చేసుకున్నాయి.

తిరువూరులో ఉద్రిక్తత.. కొలికపూడి, టీడీపీ కార్యకర్తల హల్చల్
తిరువూరులో ఎన్నిక అప్డేట్.. 👉తిరువూరులో టీడీపీ నేతలు అరాచకం సృష్టించారు. ఎన్నిక జరగకుండా టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి హల్చల్ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ఎన్నికలకు హాజరుకాకుండా దాడికి యత్నం చేశారు. టీడీపీ కార్యకర్తలు పోలీసుల సమక్షంలోనే రెచ్చిపోయి దాడులకు తెగబడ్డారు. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లపై చెప్పులు విసిరి, బాటిళ్లు విసురుతూ టీడీపీ కార్యకర్తలు కవ్వింపు చర్యలకు దిగారు. 👉తిరువూరులో పోలీసులు, టీడీపీ దౌర్జన్యానికి నిరసనగా వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు రోడ్డుపై భైఠాయించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ నినాదాలు చేస్తున్నారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు.👉టీడీపీ కార్యకర్తల దౌర్జన్యాన్ని చోద్యం చూస్తూ పోలీసులు అక్కడే నిలబడ్డారు. ఎన్నికలు జరగకుండా టీడీపీ నేతల వ్యూహానికి పోలీసులు సహకరిస్తున్నారు. రౌడీయిజం చేస్తున్న టీడీపీ కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టలేదు. బలం లేకపోయినా రౌడీయిజంతో గెలవడానికి టీడీపీ అల్లర్లు. తిరువూరులో టీడీపీ ఉద్రిక్తత సృష్టిస్తోంది.👉తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వేళ టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఓవరాక్షన్‌కు దిగారు. ఎమ్మెల్యే, టీడీపీ శ్రేణులు బారికేడ్లు తోసుకుని, పోలీసులను నెట్టుకుంటూ మున్సిపల్ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ నేతలు, పార్టీ శ్రేణులతో వాగ్వాదానికి దిగారు.👉తిరువూరులో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ హల్చల్ చేశారు. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వేళ వైఎస్సార్సీపీ నేతలను మున్సిపల్ కార్యాలయంలోకి వెళ్లకుండా టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్, టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. ఇదే సమయంలో బారికేడ్లు తోసుకుని, పోలీసులను నెట్టుకుంటూ కొలికపూడి, టీడీపీ నేతలు మున్సిపల్ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లారు. పోలీసులు వారిని అడ్డుకున్నప్పటికీ వారినే బెదిరిస్తూ లోపలికి దూసుకెళ్లారు. దీంతో, వాగ్వాదం జరిగింది.👉మరోవైపు.. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లకు మద్దతుగా పార్టీ నేతలు దేవినేని అవినాష్, మొండితోక అరుణ్ కుమార్, నల్లగట్ల స్వామిదాస్, షేక్ ఆసిఫ్ తిరువూరు చేరుకున్నారు. ఇదిలా ఉండగా.. నేడు.. తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. ఎన్నికల కోసం బలం లేకపోయినా గెలవాలని కూటమి కుట్రలు చేస్తోంది. మరోవైపు.. తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వేళ వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. తిరువూరు వెళ్లొద్దంటూ వైఎస్సార్సీపీ నేతలపై పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు.

జ్యోతి మల్హోత్రా కేసులో సంచలన విషయాలు.. హైదరాబాద్, పూరీలో ఏం జరిగింది?
ఢిల్లీ: దాయాది పాకిస్తాన్‌కు గూఢచర్యం చేస్తూ పలువురు భారతీయులు అరెస్ట్ అవుతున్నారు. ఇప్పటికే హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్ట్ కాగా, తాజాగా యూపీకి చెందిన షహజాద్ అనే వ్యక్తిని.. అధికారులు అరెస్టు చేశారు. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా విడుదల చేశారు. ఉత్తరప్రదేశ్‌లో ఉంటూ పాకిస్తాన్ కు కీలక సమాచారాన్ని అందిస్తున్నట్లు గుర్తించి అతన్ని అరెస్టు చేశారు. మరోవైపు.. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. హైదరాబాద్‌లోనూ జ్యోతి మల్హోత్రా జాడలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసు విచారణలో పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పహల్గాంలో ఉగ్రదాడి (Pahalgam Terror Attack) జరగడానికి కొన్ని నెలల ముందు ఆమె ఆ ప్రాంతానికి వెళ్లినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఒకసారి చైనాకూ వెళ్లొచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. పహల్గాం సమాచారాన్ని పాక్ ఏజెంట్లకు చేరవేసి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. పాకిస్తాన్ ఐఎస్ఐతో సంబంధాలున్న ఆ దేశ హైకమిషన్ ఉద్యోగి డానిష్‌తో జ్యోతికి సన్నిహిత సంబంధాలున్నట్లు తెలిసింది. ‘ఆపరేషన్ సిందూర్’ అనంతరం నెలకొన్న ఉద్రిక్తతల సమయంలో ఆమె ఢిల్లీలోని పాక్ రాయబార కార్యాలయంలోని అధికారి డానిష్‌తో టచ్‌లో ఉన్నట్లు నిర్ధరించారు. జ్యోతిని అతడు ట్రాప్ చేసినట్లు గుర్తించారు. దీనిపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. Jyoti Malhotra met Mariyam Nawaz in Pakistan, Hindu influencers are trapped by ISI, Sources claimed ISI motto is to prepare a Hindu to do terrorist attack in IndiaNaam : Jyoti MalhotraKaam : Gaddari A Woke Girl Can never be a True Patriot!!#JyotiMalhotra #YouTuber pic.twitter.com/7H5mPMgoeb— Sumit (@SumitHansd) May 17, 2025హైదరాబాద్‌తో టచ్‌లో..జ్యోతి మల్హోత్రా జాడలు హైదరాబాద్‌లోనూ కనిపించాయి. 2023 సెప్టెంబరులో ప్రధాని మోదీ వర్చువల్‌గా హైదరాబాద్-బెంగళూరు వందేభారత్ రైలును ప్రారంభించిన సమయంలో ఆమె హడావుడి చేశారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో అప్పటి గవర్నర్ తమిళిసైతోపాటు కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ పాల్గొన్న కార్యక్రమంలో యూట్యూబర్‌గా వీడియోలు చేస్తూ హల్చల్ చేశారు. తాజాగా ఆమె అరెస్ట్ కావడంతో అప్పటి ఆమె వీడియోలు, చిత్రాలు తాజాగా సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే, హైదరాబాద్ వచ్చిన సమయంలో ఆమె ఎవరినైనా కలిశారా? కలిస్తే అక్కడ ఏమైనా వీడియోలు తీశారా? అన్న కోణాల్లో నిఘా వర్గాలు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది.YouTuber से जासूस तक: Jyoti Malhotra का चौंकाने वाला सफर #JyotiMalhotraArrested #JyotiMalhotraYoutuber #jyotimalhotra pic.twitter.com/UJ2PkufpSA— Rubika liyaquat (@RubikaLiyakatFC) May 19, 2025పూరీలోనూ జాడలు..ఇదిలా ఉండగా.. తాజాగా జ్యోతి మల్హోత్రాతో పూరీకి చెందిన మరో యూట్యూబర్ ప్రియాంక సేనాపతికి ఉన్న సంబంధంపై ఒడిశా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పాక్‌కు గూఢచర్యం కేసులో జ్యోతితోపాటు ఆమెకు సహకరించిన మరో ఆరుగురిని హర్యానా పోలీసులు అరెస్టు చేశారు. నిందితురాలి సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించగా, ఆమెకు ఒడిశాలోని పూరీకి చెందిన ప్రియాంకతో సన్నిహిత సంబంధాలున్నట్లు గుర్తించారు. ఆ విషయాన్ని పూరీ పోలీసు యంత్రాంగానికి తెలియజేయడంతో ఎస్పీ వినీత్ అగర్వాల్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు.News Flash 🔴 ବେଶ୍ ନିବିଡ଼ ଥିଲା ଜ୍ୟୋତି ଓ ପ୍ରିୟଙ୍କାଙ୍କ ସମ୍ପର୍କ❗ପାକିସ୍ତାନ ପାଇଁ ଗୁପ୍ତଚରୀ ଅଭିଯୋଗରେ ଗିରଫ ୟୁଟ୍ୟୁବର ଜ୍ୟୋତି ମାଲହୋତ୍ରା ଲିଙ୍କର ଖୋଳତାଡ଼, ପୁରୀର ୟୁଟ୍ୟୁବର ପ୍ରିୟଙ୍କା ସେନାପତିଙ୍କୁ ଇଣ୍ଟେଲିଜେନ୍ସ ବ୍ୟୁରୋ ପରେ ପୁରୀ ପୋଲିସର ପଚରାଉଚରା ସୂଚନା #ONL #Jyoti #PriyankaSenapati #Puri #Odisha pic.twitter.com/WSbg7BziAi— OdishaNewsLive (@OdishaNews_Live) May 18, 2025 2024 సెప్టెంబరు 26న పూరీ వచ్చిన జ్యోతి.. ఇక్కడి శ్రీక్షేత్రాన్ని సందర్శించినట్లు తెలిసింది. స్థానికంగా ఓ హోటల్లో ఉన్న ఆమె దర్శనీయ ప్రాంతాలకు వెళ్లారు. ఆ సమయంలో ప్రియాంక ఆమెతో కలిసి తిరిగారు. శ్రీక్షేత్రంపై ఉగ్రవాదుల కళ్లున్నాయని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం ఉంది. ఈ పరిస్థితిలో జ్యోతి జగన్నాథస్వామి దర్శనానికి వచ్చారా? లేక రెక్కీ చేసి, పాక్‌కు ఏదైనా సమాచారం అందించారా? అన్న దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక, ప్రియాంక మూడు నెలల క్రితం పాక్‌లోని కర్తార్‌పుర్‌ను సందర్శించారు. ఈ నేపథ్యంలో ఆమె ఆ దేశానికి ఎందుకు వెళ్లారు? అక్కడ ఏం చేశారు? ఎవరెవర్ని కలిశారు? అన్న అంశాలు కీలకంగా మారాయి.Puri: IB questioned Odisha YouTuber Priyanka Senapati over suspected Pakistan ties, following Jyoti Malhotra's espionage arrest. Jyoti had visited Puri last year, including the Jagannath Temple, raised security concerns due to sensitive footage.#JyotiMalhotra #PriyankaSenapati pic.twitter.com/MTjO5EuYh8— Ishani K (@IshaniKrishnaa) May 18, 2025 BIG BREAKING 🚨#YouTuber Jyoti Malhotra was arrested on charges of Spying for Pakistan.📍Pakistan Link According to an FIR, #JyotiMalhotra met Ehsan-ur-Rahim alias Danish, a Pakistan High Commission staffer in New Delhi, in 2023. Danish, her alleged handler, connected her… pic.twitter.com/dNRKDq5ogP— তন্ময় l T͞anmoy l (@tanmoyofc) May 17, 2025

విత్తు.. సర్కారు ప్రణాళిక చిత్తు
గతంలో ఈపాటికే విత్తనాలిచ్చారునాకు నాలుగెకరాలు సొంత భూమి ఉంది. మరో నాలుగెకరాలు కౌలుకు తీసుకొని వేరుశనగ సాగు చేస్తున్నా. గతంలో ఈ పాటికే విత్తనాల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవడమే కాదు. విత్తనాలు పంపిణీ కూడా పూర్తయ్యేది. ఈ ఏడాది రైతు సేవా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవడం లేదు. విత్తనాలు ఎప్పుడు వస్తాయో కూడా చెప్పే నాథుడు లేడు. బయట మార్కెట్లో కొందామంటే ధరలు మండిపోతున్నాయి. పైగా నాణ్యమైనవి దొరుకుతాయో లేదో తెలియడం లేదు. – బోయ ఓబులేసు, ఉదిరిపికొండ, కూడేరు మండలం, అనంతపురం జిల్లా⇒ ఇతని పేరు బొంతల హరీష్. శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం లింగారెడ్డిపల్లె గ్రామం. సొంతంగా మూడెకరాలు, కౌలుకు రెండెకరాలు.. పూర్తిగా వర్షాధారంపై ఆధారపడి సాగు చేస్తున్నాడు. 15 ఏళ్లుగా వేరుశనగ పంట వేస్తున్నాడు. ఎకరాకు 80 నుంచి 100 కిలోల విత్తనం కావాలి. బహిరంగ మార్కెట్లో క్వింటా రూ.12 వేలకు పైగానే ఉంది. ఐదెకరాలకు రూ.60 వేలు ఖర్చు చేయాల్సి ఉంది. ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేసే పరిస్థితి ఇతనికి లేదు. గత ఖరీఫ్‌లో మే మొదటి వారంలోనే విత్తనాలు ఆర్బీకేల ద్వారా ఇచ్చారు. గతేడాది ఈపాటికే విత్తుకోవడం పూర్తయింది.పంట ఏపుగా ఎదిగినా కోతకొచ్చే సమయానికి వర్షాల కారణంగా పంట పూర్తిగా దెబ్బతిన్నది. ఐదెకరాలకు 3 క్వింటాళ్ల దిగుబడి కూడా రాలేదు. రూ.60 వేలకుపైగా నష్టపోయాడు. రబీలో పంట వేయలేదు. ఈ ఏడాది ప్రారంభంలోనే వర్షాలు పడుతుండడంతో అదును దాటిపోకుండా విత్తుకోవాలని చూస్తున్నాడు. ఇప్పటికే పలుమార్లు రైతు సేవా కేంద్రాల వద్దకు వెళ్లినా రిజి్రస్టేషన్ చేసుకోవడం లేదని, ఎప్పుడు ఇస్తారో కూడా చెప్పడం లేదని వాపోతున్నాడు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ పంటలు సాగు చేస్తున్న రైతులందరి పరిస్థితి ఈ విధంగానే ఉంది.సాక్షి, అమరావతి: అన్నదాతలకు అడుగడుగునా అండగా నిలవాల్సిన కూటమి ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వారిపై కక్ష కట్టినట్లు వ్యవహరిస్తోంది. అదును సమయంలో వారికి పెట్టుబడి సాయం అందించకపోగా, సబ్సిడీ విత్తనాలు సైతం ఇవ్వకుండా కష్టాలపాలు చేస్తోంది. మరో పది రోజుల్లో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాబోతున్నా, విత్తన సరఫరా మొదలు కాకపోవడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. నాన్ సబ్సిడీ విత్తన పంపిణీకి గతేడాది మంగళం పాడిన కూటమి ప్రభుత్వం.. ఈ ఏడాది సబ్సిడీ విత్తన పంపిణీలోనూ రైతులను ముప్పుతిప్పలు పెడుతోంది. దాదాపు ఆరు రకాల సబ్సిడీ విత్తనాల పంపిణీని నిలిపి వేయడమే కాకుండా, మిగిలిన సబ్సిడీ విత్తనాల పంపిణీలోనూ అడ్డగోలుగా కోత పెట్టింది. గతేడాది బకాయిలు చెల్లిస్తే కానీ విత్తన సరఫరా చేయలేమని ఓ వైపు కంపెనీలు తెగేసి చెబుతున్నాయి. దీంతో ఈ ఏడాది సబ్సిడీ విత్తనాలు రైతులకు దొరికే పరిస్థితి కనిపించడం లేదు. రైతుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును అధికార పార్టీ ఎమ్మెల్యేలు సైతం తప్పు పడుతున్నారంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గత ప్రభుత్వం ఏటా వ్యవసాయ సీజన్‌కు ముందే తొలి విడత పెట్టుబడి సాయం అందించడంతో పాటు ఎవరికి ఏ మేరకు విత్తనం కావాలో ముందుగానే ఆర్డర్ తీసుకుని ఆర్బీకేల ద్వారా సరఫరా చేసేదని రైతులు గుర్తు చేసుకుంటున్నారు. పెట్టుబడి సాయం రూ.13,500 కాకుండా ఏకంగా రూ.20 వేలు ఇస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం తమను మభ్యపెడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరిపడా సబ్సిడీ విత్తనం లేదు.. పెట్టుబడి సాయమూ లేదని ఊరూరా అన్నదాతలు బావురుమంటున్నారు. ఇంకా ఖరారు కాని సబ్సిడీలు ⇒ ఖరీఫ్ సాధారణ విస్తీర్ణం 77.87 లక్షల ఎకరాలు కాగా, ఈ ఏడాది 86.47 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యంగా నిర్ధేశించారు. ప్రధానంగా 38.87 లక్షల ఎకరాల్లో వరి, 14.30 లక్షల ఎకరాల్లో వేరుశనగ, 14.10 లక్షల ఎకరాల్లో పత్తి, 9.35 లక్షల ఎకరాల్లో అపరాలు సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏటా 40% సబ్సిడీపై వేరుశనగ, 30% సబ్సిడీపై పెసర, మినుము, కంది, 50% సబ్సిడీపై కొర్ర, రాగి, అండుకొర్రలు వంటి చిరుధాన్యపు విత్తనాలను సరఫరా చేస్తుంటారు. ⇒ వరి విత్తనాలను మాత్రం జాతీయ ఆహార ధాన్యాల భద్రతా పథకం అమలయ్యే జిల్లాల్లో కిలోకి రూ.10, ఇతర జిల్లాల్లో రూ.5 చొప్పున రాయితీతో సరఫరా చేస్తారు. ఏజెన్సీ జిల్లాలో మాత్రం 90% సబ్సిడీపై వరితో సహా అన్ని రకాల విత్తనాలను పంపిణీ చేస్తారు. ఏటా మార్చిలో పంటల వారీగా నిర్ధేశించిన సాగు లక్ష్యాలకనుగుణంగా జిల్లాల వారీగా ఇండెంట్ సేకరిస్తారు. ⇒ గ్రామీణ విత్తనోత్పత్తి పథకం కింద ఉత్పత్తి అయ్యే విత్తనాన్ని దృష్టిలో పెట్టుకొని మిగిలిన విత్తనాల కోసం టెండర్ల ద్వారా కంపెనీలను ఎంపిక చేస్తారు. ఇలా సేకరించిన విత్తనాలను ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్‌లలో సర్టీఫై చేసి, సీజన్‌కు ముందుగానే రైతు భరోసా కేంద్రాల్లో (ఆర్బీకే) రైతులకు అందుబాటులో ఉంచేవారు. సాధారణంగా ఏటా ఏప్రిల్‌లో పచ్చిరొట్ట విత్తనాలు పంపిణీ పూర్తి చేసేవారు. ⇒ షెడ్యూల్ ప్రకారం పంపిణీ చేసేవారు. గత ఐదేళ్లలో ఏ ఒక్క ఏడాది ఒక్కరంటే ఒక్క రైతు కూడా తమకు విత్తనం సకాలంలో అందలేదన్న మాట విని్పంచకుండా సరఫరా చేశారు. ఈ ఏడాది అదును ముంచుకొస్తున్నప్పటికీ విత్తన పంపిణీ షెడ్యూల్ కాదు కదా.. కనీసం సబ్సిడీలను కూడా ఖరారు చేయలేని దుస్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని రైతులు మండిపడుతున్నారు. సబ్సిడీ విత్తనంలో అడ్డగోలుగా కోత ⇒ వైఎస్ జగన్ ప్రభుత్వం ముందస్తుగా చేసిన ఏర్పాట్ల ఫలితంగా 2024–25 ఖరీఫ్‌లో 6.63 లక్షల క్వింటాళ్ల విత్తనం రైతులకు అందుబాటులో ఉండింది. వరి 2.29 లక్షల క్వింటాళ్లు, వేరుశనగ 3.16 లక్షల క్వింటాళ్లు, 94 వేల క్వింటాళ్ల పచ్చిరొట్ట, 15 వేల క్వింటాళ్ల అపరాల విత్తనాలను సీజన్‌కు ముందుగానే సర్టీఫై చేసి ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచగలిగారు. ⇒ ప్రస్తుత ఖరీఫ్–2025 సీజన్ కోసం జిల్లాల నుంచి వచ్చిన ఇండెంట్ ప్రకారం తొలుత 6,31,952 క్వింటాళ్ల విత్తనం అవసరమని ఏపీ సీడ్స్ అంచనా వేసింది. ప్రధానంగా 2.37 లక్షల క్వింటాళ్ల వరి, 2.95 లక్షల క్వింటాళ్ల వేరుశనగ, 69 వేల క్వింటాళ్ల పచ్చిరొట్ట, 12 వేల క్వింటాళ్ల కందులు సరఫరా చేయాలని నిర్ణయించారు. ఆ తర్వాత సబ్సిడీ విత్తనాన్ని కుదించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో కేవలం 5.18 లక్షల క్వింటాళ్లకు పరిమితం చేశారు. ⇒ ఇందులో 2.15 క్వింటాళ్ల విత్తనం గ్రామీణ విత్తనోత్పత్తి పథకం ద్వారా, మిగిలిన విత్తనాన్ని టెండర్ ప్రక్రియ ద్వారా సేకరించాలని నిర్ణయించారు. చివరికి 4.65 లక్షల క్వింటాళ్లకు మించి అమ్మకాలు ఉండవన్న అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నారు. పైగా గతంలో దాదాపు 16 రకాల విత్తనాలను సబ్సిడీపై సరఫరా చేసేవారు. అలాంటిది ఈ ఏడాది 10 రకాలకే పరిమితం చేశారు. ఈ లెక్కన 3 లక్షల క్వింటాళ్లకు మించి విత్తనాలు అందుబాటులో ఉండే అవకాశం లేదని అధికారులే చెబుతున్నారు.⇒ పిల్లిపెసర సహా సామెలు, ఊదలు, అలసందలు, రాజ్మా, ఉలవల సరఫరా నిలిపివేశారు. మిగిలిన వాటికి కూడా అడ్డగోలుగా కోత వేశారు. రాయలసీమ జిల్లాల్లో అత్యధిక విస్తీర్ణంలో సాగయ్యే వేరుశనగ పంట కోసం గతంలో ఏటా దాదాపు 3.80 లక్షల క్వింటాళ్లకు పైగా విత్తనం అందుబాటులో ఉంచేవారు. అలాంటిది ఈ ఏడాది తొలుత 2.95 లక్షల క్వింటాళ్లు అవసరమని అంచనా వేయగా, ఆ తర్వాత ప్రభుత్వాదేశాలతో 1.95 లక్షల క్వింటాళ్లకు పరిమితం చేయడం పట్ల సర్వత్రా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.బకాయిలు చెల్లించని కూటమి ప్రభుత్వం ⇒ గతంలో ఏటా క్రమం తప్పకుండా సీజన్‌కు ముందుగానే టెండర్ల ద్వారా విత్తనాలకు అవసరమైన మొత్తాన్ని బడ్జెట్లో కేటాయించడమే కాకుండా ఆ మొత్తాన్ని ఆయా కంపెనీలకు విడుదల చేసేవారు. దీంతో గత ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో ఏనాడు విత్తన సరఫరాలో ఎలాంటి ఆటంకం ఏర్పడ లేదు. 2024–25 ఖరీఫ్ సీజన్లో 6.63 లక్షల క్వింటాళ్లు, రబీలో 3.85 లక్షల క్వింటాళ్ల విత్తనం సరఫరా చేయగా, అందుకు సంబంధించిన సబ్సిడీ రూ.328.75 కోట్లు ప్రభుత్వం కంపెనీలకు చెల్లించలేదు.⇒ ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి రూ.213.78 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఎనిమిది నెలలుగా ఈ మేరకు పలుమార్లు పంపిన ప్రతిపాదనలను ప్రభుత్వం బుట్టదాఖలు చేసింది. దీంతో పచ్చిరొట్ట విత్తనాల సరఫరాకు ముందుకొచ్చిన ఐదు కంపెనీలు.. వేరుశనగ, వరి, శనగ, ఉలవలు, రాజ్మా తదితర విత్తనాల సరఫరాకు ముందుకొచ్చిన 12 కంపెనీలు గతేడాది బకాయిలు చెల్లిస్తే కానీ ఈ ఏడాది విత్తన సరఫరా చేసేది లేదని తెగేసి చెప్పాయి. దీంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో యంత్రాంగం ఉంది.⇒ అతికష్టమ్మీద ఒత్తిడి తీసుకురాగా జీలుగు.. జనుము (పచ్చిరొట్ట) విత్తనాలు కేవలం 23 వేల క్వింటాళ్లు (25%) జిల్లాలకు సరఫరా చేయగలిగారు. దీంతో పచ్చిరొట్ట విత్తనాలు దొరక్క రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. మరోవైపు ఈ పాటికే ప్రారంభం కావాల్సిన వేరుశనగ విత్తనం పంపిణీ ఎప్పుడు ప్రారంభమవుతుందో కూడా చెప్పలేకపోతున్నారు. మిగిలిన విత్తనాల పంపిణీ పరిస్థితి కూడా అలాగే ఉంది. ⇒ ఇదే అదునుగా ప్రైవేటు వ్యాపారులు అందినకాడికి దోచుకుంటున్నారు. గతేడాది ప్రభుత్వ చేతకాని తనం వల్ల నకిలీ విత్తనాలు రాజ్యమేలాయి. ఖరీఫ్‌లో ఎక్కువగా సాగయ్యే మిరప, పత్తి విత్తనాల్లో నకిలీలకు చెక్ పెట్టేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో 40 కంపెనీలతో ఒప్పందం చేసుకుని, కల్తీలకు ఆస్కారం లేని రీతిలో రైతులు కోరుకున్న కంపెనీలకు చెందిన నాన్ సబ్సిడీ విత్తనాలను ఆర్బీకేల ద్వారా సరఫరా చేసింది. గత సీజన్ నుంచి నాన్ సబ్సిడీ విత్తనాల పంపిణీకి ప్రస్తుత ప్రభుత్వం మంగళం పాడింది.విత్తనోత్పత్తికీ రాంరాం ⇒ సాధారణంగా సాగు విస్తీర్ణంలో 30 శాతం విస్తీర్ణానికి అవసరమైన విత్తనాన్ని ఏపీ సీడ్ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం సరఫరా చేస్తోంది. ఆ మేరకు అవసరమైన విత్తనం కోసం రబీ సీజన్లో జిల్లాల వారీగా గుర్తించిన రైతులకు విత్తనోత్పత్తి పథకం కింద 75 శాతం రాయితీపై మూల విత్తనాన్ని ఇచ్చి విత్తన సాగును ప్రోత్సహిస్తారు. మరొకవైపు ఏపీ సీడ్స్‌లో వాటాదారులుగా ఉన్న రైతులకు బ్రీడర్స్, ఫౌండేషన్ సీడ్స్ ఇచ్చి వారి ద్వారా విత్తనోత్పత్తి చేసి, ఆ విత్తనాన్ని ఖరీఫ్ సీజన్లో రైతుల డిమాండ్ మేరకు సేకరిస్తారు. ⇒ సాధారణంగా ఏపీ సీడ్స్ సరఫరా చేసే విత్తనంలో 50 శాతం ఈ విధంగా సేకరిస్తారు. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ఎవరైతే విత్తనం ఉత్పత్తి చేస్తారో ఆ రైతుల నుంచే ఈ–క్రాప్ ప్రామాణికంగా సేకరించేవారు. నిర్ధేశిత గడువులోగా వారికి బహిరంగ మార్కెట్ ధర కంటే 20–30 శాతం అదనంగా చెల్లించేవారు. ఈ వివరాలను సామాజిక తనిఖీలో భాగంగా ఆర్బీకేల్లో సైతం ప్రదర్శించేవారు. ⇒ దీంతో విత్తనోత్పత్తి చేసే రైతులు కూడా ఏపీ సీడ్స్‌కు ఇచ్చేందుకు ముందుకొచ్చేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. గడిచిన ఖరీఫ్‌లో విత్తనోత్పత్తి చేసే రైతుల నుంచి సేకరించిన విత్తనాలకు సంబంధించిన బకాయిలు దాదాపు 9 నెలలు గడిచినా చెల్లించని పరిస్థితి నెలకొంది. దీంతో ఈ రైతులెవ్వరూ తమ విత్తనాన్ని ఏపీ సీడ్స్‌కు ఇచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. బహిరంగ మార్కెట్ ధరలకే అమ్ముకుంటున్నారు. దీంతో ఏపీ సీడ్స్ పూర్తిగా టెండర్ల ద్వారానే విత్తనం సేకరించాల్సిన దుస్థితి ఏర్పడింది. అధికార పార్టీ ఎమ్మెల్యేలే పెదవి విరుపు⇒ విత్తన పంపిణీ విషయంలో ప్రభుత్వ తీరును అధికార పార్టీ ఎమ్మెల్యేలే తప్పు పడుతున్నారు. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుకు అధికార పార్టీకి చెందిన అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత రాసిన లేఖే నిదర్శనం. ⇒ వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఏటా 3 లక్షల క్వింటాళ్ల విత్తనం అందించారని ఆమె గుర్తు చేశారు. అలాంటిది ఖరీఫ్–2025 సీజన్‌కు కనీసం 2 లక్షల క్వింటాళ్ల విత్తనం తక్కువ కాకుండా కేటాయించాల్సి ఉండగా, కేవలం 1.10 లక్షల క్వింటాళ్ల విత్తనం కోసం జిల్లా అధికారులు ఇండెంట్ పెట్టడం దారుణం అన్నారు. వ్యవసాయ శాఖ కేవలం 50 వేల క్వింటాళ్ల విత్తనాన్ని మాత్రమే కేటాయించడం విస్మయానికి గురి చేస్తోందని ఆమె ఆ లేఖలో పేర్కొన్నారు. ఇదేనా మంచి ప్రభుత్వం అంటే? సబ్సిడీపై వేరుశనక్కాయల విత్తనాల గురించి సచివాలయానికి వెళ్లి అడిగితే తమకు ఆదేశాలు రాలేదంటున్నారు. పదెకరాల్లో సేద్యం చేసుకున్నా.. వర్షాలు పడుతున్నాయి.. త్వరలో విత్తుకోవాల్సి ఉందని చెప్పినా వినిపించుకునే వారే లేరు. మాది రైతు ప్రభుత్వం.. మంచి ప్రభుత్వం అంటున్నారు.. ఇదేనా మంచి ప్రభుత్వం అంటే? రైతు సేవా కేంద్రాల్లో మా పేర్లు కూడా నమోదు చేసుకోకపోవడం దారుణం. దీంతో విత్తనాలు అధిక ధరకు బయట కొనుక్కోవాల్సి వస్తోంది. – మునిరెడ్డి, బొందిమడుగుల, తుగ్గలి మండలం, కర్నూలు జిల్లా అన్ని విధాలుగా మోసం చేల్లో దుక్కి దున్నాం. ఇంత వరకు శనగ విత్తనాలు రాలేదు. సచివాలయంలో అడిగితే మాకు పై నుంచి ఆర్డర్స్ రాలేదంటున్నారు. గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఈపాటికే శనక్కాయల విత్తనాలు ఇచ్చేది. కానీ ఈ ఏడాది ఈ ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించడం లేదు. అదును దాటిపోతుంది. ఇంకెప్పుడు విత్తుకోవాలి? పెట్టుబడి సాయం కూడా ఇవ్వలేదు. రైతులను అన్ని విధాలుగా ముంచేస్తున్నారు. మీకు చిత్తశుద్ధి ఉంటే 90 శాతం సబ్సిడీపై శనక్కాయల విత్తనం ఇవ్వాలి. – రమణారెడ్డి, పొడరాగపల్లి, ముదిగుబ్బ మండలం, శ్రీ సత్యసాయి జిల్లా కౌలురైతులకు నూరు శాతం సబ్సిడీతో సర్టీఫైడ్ విత్తనాలివ్వాలిఏపీ కౌలురైతుల సంఘం డిమాండ్ సాక్షి, అమరావతి: కౌలురైతులకు నాణ్యమైన, సర్టీఫై చేసిన విత్తనాలను నూరు శాతం సబ్సిడీపై అందించాలని ఏపీ కౌలు రైతుల సంఘం ఆదివారం ఓ ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ప్రైవేట్ మార్కెట్లో విత్తనాల ధరలు విపరీతంగా పెంచేశారని, పైగా ప్రైవేటు కంపెనీలు విక్రయించే విత్తనాల్లో నాణ్యత ఉండటం లేదని సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎ.కాటమయ్య, పి.జమలయ్య పేర్కొన్నారు. ఈ ఏడాది సీజన్‌కు ముందు విత్తనాలను సిద్ధం చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తంచేశారు.

మియాపూర్‌లో హైడ్రా కూల్చివేతలు.. 70 ప్లాట్ల యజమానులు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. తాజాగా మియాపూర్‌లో హైడ్రా (Hydra) కూల్చివేతలు చేపట్టింది. హెచ్ఎండీఏ లేఅవుట్లోని అక్రమ నిర్మాణాలను అధికారులు తొలగించారు. పోలీసులు బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగాయి.వివరాల ప్రకారం.. మియాపూర్‌లోని హైదర్‌నగర్‌లో సోమవారం ఉదయం నుంచి హైడ్రా (Hydra) కూల్చివేతలు చేపట్టింది. తప్పుడు పత్రాలతో తమ భూమి కబ్జా చేశారని ఇటీవల 70 మంది ప్లాట్ల యజమానులు ఫిర్యాదు చేశారు. దీంతో, రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. హెచ్ఎండీఏ లేఅవుట్లోని అక్రమ నిర్మాణాలను అధికారులు తొలగించారు. హైకోర్టు ఆదేశాలతోనే అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నట్టు హైడ్రా అధికారులు తెలిపారు. ఇక, కబ్జాదారుల నుంచి భూములు విడిపించడంపై ప్లాట్ల యజమానులు హర్షం వ్యక్తం చేశారు.

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టీమిండియా యువ క్రికెటర్
టీమిండియా యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. లావుగా ఉన్నాడని విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కఠినమైన వ్యాయామాలతో పాటు ఆహారపు నియమాలు పాటించి ఆరు వారాల్లో 10 కిలోలు తగ్గాడు. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు ముందు ఫిట్నెస్ మెరుగుపర్చుకోవడమే ధ్యేయంగా పెట్టుకున్న సర్ఫరాజ్.. కఠోరమైన నియమనిబంధనలు పాటించి స్లిమ్‌గా తయారయ్యాడు. ఇంకా ఫిట్‌గా, బెటర్ క్రికెటర్‌గా తయారయ్యేందుకు ఇంకాస్త బరువు తగ్గుతానని సర్ఫరాజ్ అంటున్నాడు.కొత్త లుక్‌లో సర్ఫరాజ్ ఖాన్‌ను ఎవరూ పోల్చుకోలేకపోతున్నారు. సర్ఫరాజ్ న్యూ లుక్కు సంబంధించిన ఫోటోలు సోషల్‌మీడియాలో వైరవలువుతున్నాయి. బరువు తగ్గకముందు, బరువు తగ్గాక సర్ఫరాజ్‌లో స్పష్టమైన తేడా కనిపిస్తుంది. బరువు తగ్గాక సర్ఫరాజ్ ఎంతో ఉత్సాహంగా, స్మార్ట్‌గా కనిపిస్తున్నాడు.కాగా, 27 ఏళ్ల సర్ఫరాజ్ ఓవర్ వెయిట్ కారణంగా చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. అపారమైన నైపుణ్యమున్నప్పటికీ.. ఆ ఒక్కటీ (ఓవర్ వెయిట్) సర్ఫరాజ్‌ను టార్గెట్ చేసేలా ఉండింది. దీంతో ఇంగ్లండ్ పర్యటనకు ముందు అతను స్ట్రిక్ట్ డెసిషన్ తీసుకున్నాడు. ఎలాగైనా బరువు తగ్గాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా జిమ్‌లో జాయిన్ అయ్యాడు. న్యూట్రిషియన్‌ను పెట్టుకున్నాడు. ఉదయాన్నే గంట పాటు జాగింగ్, ఆతర్వాత అరగంట స్మిమ్మింగ్‌ను ప్రతి రోజు షెడ్యూల్ చేసుకున్నాడు.సర్ఫరాజ్‌తో పాటు అతని కుటుంబం మొత్తం వెయిట్ లాస్ ప్రక్రియకు పూనుకుంది. సర్ఫరాజ్ తండ్రి నౌషద్ ఖాన్, అతని చిన్న సోదరుడు మొయిన్ ఖాన్ కూడా ఓవర్ వెయిట్ ఉంటారు. సర్ఫరాజ్ రెండో సొదరుడు మునీర్ ఖాన్ ఫిట్‌గా ఉన్నప్పటికీ అతను కూడా ఈ వెయిట్ లాస్ ప్రోగ్రాంలో వారితో పాటే నడిచాడు. మొత్తానికి సర్ఫరాజ్ వెయిట్ లాస్ జర్నీ స్పూర్తిదాయకంగా ఉంది.ఇదిలా ఉంటే, సర్ఫరాజ్ వచ్చే నెలలో షెడ్యూలైన ఇంగ్లండ్ పర్యటన కోసం భారత-ఏ జట్టుకు ఎంపికయ్యాడు. ఈ పర్యటనలో భారత-ఏ జట్టు ఇంగ్లండ్ లయన్స్‌తో రెండు అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లు ఆడుతుంది. ఈ మ్యాచ్‌ల్లో ప్రదర్శన ఆధారంగా ఆతర్వాత ఇంగ్లండ్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ఎంపిక చేస్తారు. ఈ సిరీస్ సత్తా చాటి టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వాలని సర్ఫరాజ్ పట్టుదలగా ఉన్నాడు.గతేడాది ఇంగ్లండ్‌తో జరిగిన హొం టెస్ట్ సిరీస్‌లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన సర్ఫరాజ్.. తన డెబ్యూ మ్యాచ్‌లోనే రెండు అర్ద సెంచరీలు సాధించి (రెండు ఇన్నింగ్స్‌ల్లో) రికార్డుల్లోకెక్కాడు. అనంతరం గతేడాదే న్యూజిలాండ్‌పై 150 పరుగులు చేసిన సర్ఫరాజ్ తనలోని అత్యుత్తమ టాలెంట్‌ను వెలికి తీశాడు. అయితే తదనంతర పరిణామాల్లో (సీనియర్ల రాకతో) సర్ఫరాజ్‌కు టీమిండియాలో చోటు దక్కలేదు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఎంపిక కాలేదు. ఐపీఎల్ 2025 మెగా వేలంలోనూ అతనికి మొండిచెయ్యే ఎదురైంది. ఇంగ్లండ్ పర్యటనకు భారత్ ఏ జట్టు:అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కరుణ్ నాయర్, ధృవ్ జురెల్ (వైస్ కెప్టెన్), నితీష్ కుమార్ రెడ్డి, శార్దూల్ ఠాకూర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), మానవ్ సుతార్, తనుష్ కోటియన్, ముఖేష్ కుమార్, ఆకాశ్ దీప్, హర్షిత్ రాణా, అన్షుల్ కాంబోజ్, ఖలీల్ అహ్మద్, రుతురాజ్ గైక్వాడ్, సర్ఫరాజ్ ఖాన్, తుషార్ దేశ్‌పాండే, హర్ష్ దూబే

పిల్లలను తీసుకుని ఇంటికి రా తల్లీ.. సరదాగా వెళ్లారు..
రాజేంద్రనగర్/మణికొండ/బంజారాహిల్స్: ఆదివారం ఉదయం గుల్జార్‌హౌస్ అగ్నిప్రమాదంలో మృతిచెందిన 17 మందిలో 10 మృతదేహాలకు ఆదివారం సాయంత్రం ఒకేసారి అంత్యక్రియలు నిర్వహించారు. కుటుంబ పెద్ద ప్రహ్లాద్ మోదీ, ఆయన భార్య మున్నీ, కుమారుడు పంకజ్, కోడలు వర్ష, తమ్ముడు రాజేందర్ మోదీ, మరదలు సుమిత్ర, తమ్ముని కుమారుడు అభిషేక్, మనుమలు, మనమరాళ్లు అనుయాన్, ఇదిక, ఐరాజ్‌ల మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రిలో పోస్ట్‌మార్టం అనంతరం పురానాపూల్‌లోని శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. కాగా, ఈ ప్రమాదంలో బంజారాహిల్స్ రోడ్ నెం.3లో నివసించే ఏడేళ్ల బాలిక హర్షాలి గుప్తా కన్నుమూశారు. ఆమె శరీరం పూర్తిగా కాలిపోవటంతో కుటుంబ సభ్యులు అస్తికలకు ఆదివారం మధ్యాహ్నం పంజాగుట్ట స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.పుట్టింటికి వెళ్లి మృత్యువాతసనత్‌నగర్: వేసవి సెలవులు కదా..? పిల్లలను తీసుకుని ఇంటికి రా.. తల్లీ! అని ఆ తండ్రి ఆశగా అడగడంతో కొడుకును తీసుకుని తన పుట్టిల్లు అయిన గుల్జార్‌హౌస్‌కు వెళ్లింది. అదృష్టవశాత్తూ తండ్రి పిలుపు మేరకు కొడుకు ముందు రోజు రాత్రే వెళ్లిపోగా, తల్లి అగ్ని ప్రమాదంలో మృత్యువాత పడింది. దీంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. వస్త్ర వ్యాపారి వినోద్‌కుమార్ అగర్వాల్ తన భార్య రజనీ అగర్వాల్ (45), కొడుకు కుషాల్ అగర్వాల్, కుమార్తె తనూలతో కలిసి సనత్‌నగర్‌లో ఉంటున్నాడు. కుమార్తె ముంబైలో ఎంబీఏ చదువుతుండగా, కుమారుడు కుషాల్ ఇంటర్మీడియెట్ చదువుతున్నాడు. ఈ క్రమంలో కుమారుడు కుషాల్‌ను తీసుకుని రజని గుల్జార్ హౌస్‌కు వెళ్లింది. అయితే కుషాల్ ముందు రోజు రాత్రి ఇంటికి వచ్చేశాడు. అక్కడే ఉన్న రజని మాత్రం ఆదివారం జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించింది.సరదాగా వెళ్లారు.. శవాలై వచ్చారురహమత్‌నగర్: బంధువులతో సరదాగా గడపాలని వెళ్లారు. శవాలుగా తిరిగొచ్చారు. ఒకే కుటుంబంలో ముగ్గురు మృత్యువాత పడటం ఎర్రగడ్డ డివిజన్ రాజీవ్‌నగర్ బస్తీ వాసులను కలచి వేసింది. గుల్జార్ హౌస్ ఆగ్ని ప్రమాదంలో రాజీవ్‌నగర్‌కు చెందిన తల్లి, కొడుకు, కుమార్తె మృతి చెందారు. ఆటో మొబైల్స్ వ్యాపారం చేసే రాజేష్ జైన్ రాజీవ్‌నగర్‌లో ఉంటున్నారు. ఆయనకు భార్య శీతల్ (35), ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కాగా శనివారం ఉదయం శీతల్ తన తండ్రి ఇంటికి పిల్లల్ని తీసుకుని వెళ్లింది. అయితే పెద్ద కుమార్తె రాశి తాను చదువుకోవాలంటూ శనివారం సాయంత్రమే రాజీవ్‌నగర్ లోని తమ నివాసానికి తిరిగి వచ్చింది. అక్కడే ఉండిపోయిన శీతల్, అరుషి, రిషబ్ మాత్రం ప్రమాదంలో చనిపోయారు.

'రెట్రో' కలెక్షన్స్ విడుదల.. సూర్య కెరీర్లో ఇదే టాప్
రెట్రో సినిమాతో సూర్య భారీ హిట్ అందుకున్నాడు. తాజాగా ఈ సినిమా కలెక్షన్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. సూర్య కెరీర్లోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా రెట్రో రికార్డ్ క్రియేట్ చేసింది. గతేడాదిలో భారీ అంచనాలతో విడుదలైన ‘కంగువా’ చిత్రం సూర్య (Suriya)కు చేదు అనుభవాన్ని మిగిల్చినా రెట్రో మాత్రం ఆ లోటును తీర్చింది. అయితే, తెలుగులో అంతగా ఆకట్టుకోలేదని చెప్పవచ్చు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రొమాంటిక్ యాక్షన్ చిత్రంగా మే 1న రెట్రో విడుదలైంది. ఇందులో పూజా హెగ్డే (Pooja Hegde) హీరోయిన్గా నటించగా.. జోజూ జార్జ్, జయరామ్, నాజర్ తదితరులు కీలక పాత్రలలో కనిపించారు. యాక్షన్‌తో పాటు, ప్రేమ, భావోద్వేగాలతో కూడిన ఒక గ్యాంగ్‌స్టర్‌గా సూర్య ఇందులో నటించాడు.రెట్రో సినిమా 18 రోజుల్లో రూ. 235 కోట్లు రాబట్టినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇందులో అత్యధికంగా తమిళనాడులోనే ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి. సూర్య కెరీర్లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా మొదటి స్థానంలో రెట్రో ఉంది. ఆ తర్వాత 24 మూవీ రూ. 157 కోట్లు, సింగం2 రూ. 122 కోట్లు, కంగువా రూ. 106 కోట్లు, 7th సెన్స్ రూ. 113 కోట్లు, సికిందర్ రూ. 95 కోట్లతో వరుసగా ఉన్నాయి. రెట్రో సినిమాకు 'టూరిస్ట్ ఫ్యామిలీ' మూవీ భారీగానే దెబ్బ కొట్టింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం టాక్ బాగుండటంతో కోలీవుడ్‌లో మంచి కలెక్షన్స్ రాబట్టింది. లేదంటే రెట్రో కలెక్షన్స్ సులువుగా రూ. 300 కోట్లకు దగ్గర్లో ఉండేవని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి.Dear Audience and #AnbaanaFans, we're humbled by your immense love and support for #TheOne ‼️ Grateful for the glory, it's all because of you ❤#RETRO@Suriya_Offl #Jyotika @karthiksubbaraj @hegdepooja @Music_Santhosh @prakashraaj @C_I_N_E_M_A_A @rajsekarpandian… pic.twitter.com/wScjYwaqu4— 2D Entertainment (@2D_ENTPVTLTD) May 18, 2025

త్రీవీలర్ ఈవీలకు కేరాఫ్ భారత్!
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహనాలకు ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్‌గా భారత్ వరుసగా రెండో ఏడాది గుర్తింపును సొంతం చేసుకుంది. 2024లో వీటి అమ్మకాలు 20 శాతం పెరిగి 7 లక్షల యూనిట్లుగా ఉన్నట్టు ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఈఏ) తెలిపింది. ప్రపంచ ఈవీ మార్కెట్‌పై ఐఈఏ ఒక నివేదికను విడుదల చేసింది. ఇందులో భారత్ మార్కెట్ గురించి కీలకంగా ప్రస్తావించింది.అంతర్జాతీయంగా త్రిచక్ర ఈవీల వృద్ధిలో భారత్ ప్రముఖ పాత్ర పోషిస్తున్నట్టు తెలిపింది. 2024లో ప్రపంచవ్యాప్తంగా త్రిచక్ర వాహన అమ్మకాలు అంతకుముందు ఏడాదితో పోలి్చతే 5 శాతం క్షీణించినప్పటికీ.. తిచక్ర ఈవీల విక్రయాలు మాత్రం 10 శాతం పెరిగి మిలియన్ యూనిట్లను దాటినట్టు పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా సంప్రదాయ త్రిచక్ర వాహనాలతోపాటు త్రిచక్ర ఈవీల్లో 90 శాతం వాటా చైనా, భారత్ చేతుల్లోనే ఉన్నట్టు ఈ నివేదిక వెల్లడించింది.‘‘చైనాలో తిచక్ర వాహన అమ్మకాల్లో గత మూడేళ్ల నుంచి ఈవీలు 15 శాతంలోపే ఉంటున్నాయి. 2023లో చైనాను వెనక్కి నెట్టేసి ప్రపంచ అతిపెద్ద తిచక్ర ఈవీ మార్కెట్‌గా భారత్ అవతరించింది. 2024లోనూ 7 లక్షల త్రిచక్ర ఈవీ అమ్మకాలతో అతిపెద్ద మార్కెట్ స్థానాన్ని కాపాడుకుంది’’అని ఈ నివేదిక తెలిపింది. 2024లో ప్రపంచవ్యాప్త త్రిచక్ర ఈవీల అమ్మకాల్లో భారత్ వాటా 57 శాతంగా ఉన్నట్టు పేర్కొంది. 2023తో పోల్చి చూస్తే 3 శాతం వాటాను పెంచుకున్నట్టు తెలిపింది. పీఎం ఈ–డ్రైవ్ పథకం మద్దతును ప్రస్తావించింది. కేంద్ర సర్కారు ఈ పథకం ద్వారా ఈవీలకు సబ్సిడీ ప్రయోజనాలు అందిస్తుండడం తెలిసిందే. ద్వి, త్రిచక్ర వాహనాలకు బడా మార్కెట్ అంతర్జాతీయంగా ద్విచక్ర, త్రిచక్ర వాహన అమ్మకాల్లో చైనా, భారత్, దక్షిణాసియా దేశాలు 80 శాతం వాటా కలిగి ఉన్నట్టు ఐఈఏ నివేదిక వెల్లడించింది. ప్రైవేటు ప్యాసింజర్ రవాణాకు ఇవి ప్రాథమిక వినియోగంగా ఉన్నట్టు పేర్కొంది. ‘‘ఎలక్ట్రిక్ టూవీలర్లకు భారత్ చురుకైన మార్కెట్‌గా ఉంటోంది. 220కు పైగా ఓఈఎంలకు (వాహన తయారీ సంస్థలు) కేంద్రంగా ఉంది. 2023లో ఉన్న 180 కంటే పెరిగాయి. 2024లో మొత్తం ద్విచక్ర ఈవీల అమ్మకాలు 1.3 మిలియన్ యూనిట్లలో 80 శాతం వాటా టాప్–4 కంపెనీలు కలిగి ఉన్నాయి’’అని ఈ నివేదిక తెలిపింది.అధిక ధరలు, తీవ్ర పోటీ సంప్రదాయ ద్విచక్ర వాహనలతో పోల్చి చూసినప్పుడు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల కొనుగోలు ధర అధికంగా ఉన్నట్టు.. అదే సమయంలో పోటీ పెరగడంతో ఓఈఎంలు అందుబాటు ధరలపై మోడళ్లను ఆఫర్ చేస్తున్నట్టు తెలిపింది. ఓలా ఎస్1ఎక్స్ మోడల్‌ను నిదర్శనంగా పేర్కొంది. 2కిలోవాట్‌హవర్ బ్యాటరీ, 6కిలోవాట్ పీక్ పవర్ సామర్థ్యంతో 70,000కే అందిస్తున్నట్టు గుర్తు చేసింది.విధానపరమైన మద్దతు (సబ్సిడీలు) కూడా సంప్రదాయ, ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మధ్య ధరల అంతరాన్ని తగ్గిస్తున్నట్టు ఐఈఏ నివేదిక తెలిపింది. ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు 2024లో కేవలం 2 శాతం పెరిగి 1,00,000 యూనిట్లుగా ఉన్నట్టు వెల్లడించింది. ఇక ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు క్రితం ఏడాది మొదటి త్రైమాసికంతో పోల్చి చూస్తే 45 శాతం పెరిగి 35,000 యూనిట్లుగా ఉన్నట్టు తెలిపింది.

సాకులు వెతుక్కోకండి : విధి కూడా వంగి సలాం చేసే సంకల్పంతో..
చిన్నప్పుడే విద్యుత్ ప్రమాదంలో కాళ్లూ చేతులు పోగొట్టుకున్నాడు మునిపల్లి మండలం కంకోల్ గ్రామానికి చెందిన మధుకుమార్. అయితేనేం విధివక్రీకరించినా ఓటమిని ఒప్పుకోని సంకల్ప బలంతో ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు. దేహముంది, ప్రాణముంది.. నెత్తురుంది.. సత్తువుంది ఇంతకంటే సైన్యముండునా అనుకున్నాడు. విశ్రమించక శ్రమించాడు. ఆశయాల అశ్వమెక్కి అదుపులేని కదను తొక్కి అవధులన్నీ అధిగమించాడు. వైకల్యం శరీరానికే కాని మనసుకు కాదనుకుని నిరాశకే నిరాశ పుట్టించి ముందుకెళ్తున్న మధుకుమార్ జీవితంపై స్పెషల్ స్టోరీ.– బి. రాజశేఖర్, సంగారెడ్డి జోన్సంకల్పం ఉంటే వైకల్యం అడ్డు కాదని నిరూపించాడు. నోటితోనే పెయింటింగ్ వేసి అందరి ప్రశంసలు అందుకున్నాడు. ఆత్మవిశ్వాసం కోల్పోకుండా లక్ష్యసాధన వైపు ముందడుగు వేశాడు. ఇటీవల విడుదలైన పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో 86% మార్కులు సాధించి, ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిగా నిలిచాడు. విద్యుదాఘాతం తగిలి రెండు కాళ్లు, రెండు చేతులు కోల్పోయినా మనోధైర్యం కోల్పోలేదు. ఐఏఎస్ అయి ప్రజలకు సేవ చేయాలన్నదే తన కోరిక అని మునిపల్లి మండలం కంకోల్ గ్రామానికి చెందిన మధు కుమార్ ‘సాక్షి’తో చెప్పాడు. స్ఫూర్తిగా నిలిచి.. విధి వెక్కిరించినా అందరితో పాటు చదువులో ముందుకు సాగుతున్నాడు. ప్రతిరోజు తల్లిదండ్రులు, స్నేహితుల సహకారంతో వీల్ చైర్‌పై పాఠశాలకు వెళ్లేవాడు. తనకు ఉన్న వైకల్యాన్ని మరిచిపోయి అందరితో కలిసి, మెలిసి చదువుకున్నాడు. పరీక్షల సమయంలో ప్రణాళికాబద్ధంగా సమయం కేటాయించి చదువుకున్నాడు. పుస్తకాల్లోని పేజీలను తన నాలుకతో పాటు కోల్పోయిన కాలు చివరి భాగంతో మార్చుకుంటున్నాడు. ఈ విధంగా బాగా చదువుకుని స్నేహితుడి సహకారంతో పరీక్షలు రాశాడు. దివ్యాంగులకు ఒక సబ్జెక్టును మినహాయిస్తారు. దీంతో 500 మార్కులకు గాను 430 మార్కులు సాధించి అందరి నోట శభాష్ మధు అనిపించుకున్నాడు. ఇదీ చదవండి: ఫోర్బ్స్‌లో అనన్య పాండే, బాయ్ ఫ్రెండ్ రియాక్షన్ వైరల్ఉత్తమ ప్రతిభ కనబరిచిన మధు కుమార్‌ను కలెక్టర్ వల్లూరు క్రాంతి సన్మానించి అభినందించి, ల్యాప్ టాప్‌ను అందజేశారు. భవిష్యత్తులో చదువుకునేందుకు తమ వంతుగా పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. పాఠశాల తనిఖీ సమయంలో మధును గమనించిన కలెక్టర్ బాగా చదువుకొని ఉత్తమ ఫలితాలు సాధించాలని ప్రోత్సహించారు. చిరునవ్వుతో ముందడుగుమునిపల్లి మండల పరిధిలోని కంకోల్ గ్రామానికి చెందిన మధు కుమార్ అదే గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్నాడు. అందరితో కలిసి మెలిసి ఉంటూ చదువుతో పాటు పాఠశాలలో నిర్వహించే ప్రతి కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొనేవాడు. 2019 సెపె్టంబర్ 15న తోటి స్నేహితులతో సరదాగా ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో పక్కనే ఉన్న విద్యుత్ తీగలను గమనించకపోవడంతో రెండు చేతులు తీగలకు తగిలాయి. రెండు కాళ్లకు ఎర్తింగ్ వచ్చి షాక్ తగిలి కింద పడిపోయాడు. వెంటనే చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు రెండు కాళ్లు, రెండు చేతులు తీసేయాలని, అప్పటికీ మధు బతుకుతాడో లేదోనని చెప్పారు. మరణం అంచు వరకు వెళ్లిన కుర్రాడు ప్రాణాలతో బయటపడ్డాడు. తోటి వారి సహాయం లేకుండా కదలలేని స్థితిలో ఉన్నా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా సంకల్ప బలంతో ముందడుగు వేస్తూ జీవిస్తున్నాడు.నోటితో పెయింటింగ్..నోటితోనే పెయింటింగ్ వేసి అందరి ప్రశంసలు పొందుతున్నాడు. ప్రముఖ సినీ నటి సమంత నిర్వహించే సామ్ జామ్ షోకు హాజరై అక్కడ మెగాస్టార్ చిరంజీవి చిత్రపటాన్ని నోటితో గీసి ప్రశంసలు పొందాడు. అంతేకాకుండా ప్రముఖ స్టార్లు ప్రభాస్, వెంకటేష్ పవన్ కల్యాణ్, అల్లు అర్జున్‌లతో పాటు వివిధ రకాల చిత్రాలు వేసి అందరితో ప్రశంసలు అందుకున్నాడు.ఐఏఎస్ అవ్వడమే లక్ష్యం..కాళ్లు, చేతులు లేకపోయినా నా తల్లిదండ్రులు, గురువులు, స్నేహితుల సహకారంతో చదువుకోవటంతో పాటు అన్ని పనులు చేసుకోగలుగుతున్నా. ఉపాధ్యాయుల సూచనల మేరకు ప్రణాళికాబద్ధంగా చదువుకొని మంచి ఫలితాలు సాధించాను. అప్పటి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు పాఠశాలకు తనిఖీకి వచి్చన సమయంలో నిరుపేద విద్యార్థులకు, తనలాంటి వారిని పలకరించే విధానం, చేసే సహాయ గుణాలకు ఆకర్షితుడినయ్యాను. అలాగే ప్రస్తుత కలెక్టర్ వల్లూరు క్రాంతి సైతం విద్యార్థులను ప్రోత్సహించడం చూసి స్ఫూర్తి పొందాను. నేను కూడా ప్రతి ఒక్కరికీ సహాయపడాలని ఐఏఎస్ కావాలని లక్ష్యంగా పెట్టుకున్నా.– మధు కుమార్, విద్యార్థికంకోల్ గ్రామం, మునిపల్లి మండలం
మనం దెబ్బతిన్న ప్రతీసారి శాంతి చర్చలనడం మనకు ఆనవాయితీ సార్!
ఆ ఫుడ్..నాట్ గుడ్..!
బెంగళూరులో భారీ వర్షం.. కర్ణాటక అతలాకుతలం.. షాకింగ్ వీడియోలు
కలెక్టర్ చెబితే వినాలా..?
మెరిసిన చేనేత.. మురిసిన భామలు
బోల్తా కొట్టిన ఎల్లోపిట్ట!
మనసెంతో ప్రశాంతం..ఎంత ఖర్చైనా ఓకే!
బీసీసీఐ కీలక నిర్ణయం.. ఆసియా కప్‌కు టీమిండియా దూరం
చిట్టి తల్లి.. బుజ్జి కన్నా.!
స్టార్ డైరెక్టర్ సినిమాలో శోభితకు ఛాన్స్
కొత్త కరెన్సీ నోట్లు వస్తున్నాయి.. ఆర్బీఐ ప్రకటన
సీఎం గారూ.. యుద్ధంలో ఉన్నా.. రాలేకపోతన్న..
రోహిత్ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం.. మామగారి వెనుక దాక్కున్న రితిక!
బట్టతలపై వెంట్రుకలు సాధ్యమే! దువ్వెన్లు సిద్దం చేసుకోండి!
మళ్లీ కరోనా మహమ్మారీ పలుదేశాల్లో హై అలర్ట్
ఈ రాశి వారికి వ్యాపారాలు, ఉద్యోగాలలో అవాంతరాలు తొలగుతాయి.
అందుకే నా కొడుకుకు ఆయన పేరు పెట్టుకున్నా: అనసూయ పోస్ట్ వైరల్
ఇండియా ఇంత బలహీనమైనదా?
అనసూయ నూతన గృహప్రవేశం.. పూజా కార్యక్రమం (ఫోటోలు)
సంక్రాంతికి రఫ్ఫాడించేద్దాం
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
మసూద్ అజార్‌కు రూ.14 కోట్లు
ఇండియన్ ఆర్మీ కీలక ప్రకటన
కోట్ల విలువైన విల్లా కొనుగోలు చేసిన బిగ్‌బాస్ రోహిణి.. ధర ఎంతంటే?
బంగ్లా ప్లేయర్ విధ్వంసకర శతకం.. రికార్డులు బద్దలు
గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన స్టార్ హీరో కూతురు
రేపటి నుంచే భూముల రీసర్వే.. రెవెన్యూ వర్గాల ఆందోళన
హీరోయిన్‌తో కమల్ ముద్దు సీన్.. ఏజ్ గ్యాప్‌పై విమర్శలు
అదే విషయం చెప్పి చెప్పి నోరు నొప్పెడుతుందట!
ఓటీటీలోకి వచ్చేసిన సస్పెన్స్ థ్రిల్లర్.. తెలుగులో స్ట్రీమింగ్
మనం దెబ్బతిన్న ప్రతీసారి శాంతి చర్చలనడం మనకు ఆనవాయితీ సార్!
ఆ ఫుడ్..నాట్ గుడ్..!
బెంగళూరులో భారీ వర్షం.. కర్ణాటక అతలాకుతలం.. షాకింగ్ వీడియోలు
కలెక్టర్ చెబితే వినాలా..?
మెరిసిన చేనేత.. మురిసిన భామలు
బోల్తా కొట్టిన ఎల్లోపిట్ట!
మనసెంతో ప్రశాంతం..ఎంత ఖర్చైనా ఓకే!
బీసీసీఐ కీలక నిర్ణయం.. ఆసియా కప్‌కు టీమిండియా దూరం
చిట్టి తల్లి.. బుజ్జి కన్నా.!
స్టార్ డైరెక్టర్ సినిమాలో శోభితకు ఛాన్స్
కొత్త కరెన్సీ నోట్లు వస్తున్నాయి.. ఆర్బీఐ ప్రకటన
సీఎం గారూ.. యుద్ధంలో ఉన్నా.. రాలేకపోతన్న..
రోహిత్ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం.. మామగారి వెనుక దాక్కున్న రితిక!
బట్టతలపై వెంట్రుకలు సాధ్యమే! దువ్వెన్లు సిద్దం చేసుకోండి!
మళ్లీ కరోనా మహమ్మారీ పలుదేశాల్లో హై అలర్ట్
ఇండియా ఇంత బలహీనమైనదా?
అందుకే నా కొడుకుకు ఆయన పేరు పెట్టుకున్నా: అనసూయ పోస్ట్ వైరల్
ఈ రాశి వారికి వ్యాపారాలు, ఉద్యోగాలలో అవాంతరాలు తొలగుతాయి.
సంక్రాంతికి రఫ్ఫాడించేద్దాం
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
మసూద్ అజార్‌కు రూ.14 కోట్లు
ఇండియన్ ఆర్మీ కీలక ప్రకటన
కోట్ల విలువైన విల్లా కొనుగోలు చేసిన బిగ్‌బాస్ రోహిణి.. ధర ఎంతంటే?
బంగ్లా ప్లేయర్ విధ్వంసకర శతకం.. రికార్డులు బద్దలు
గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన స్టార్ హీరో కూతురు
రేపటి నుంచే భూముల రీసర్వే.. రెవెన్యూ వర్గాల ఆందోళన
హీరోయిన్‌తో కమల్ ముద్దు సీన్.. ఏజ్ గ్యాప్‌పై విమర్శలు
అదే విషయం చెప్పి చెప్పి నోరు నొప్పెడుతుందట!
ఓటీటీలోకి వచ్చేసిన సస్పెన్స్ థ్రిల్లర్.. తెలుగులో స్ట్రీమింగ్
నైనై తుర్కియే..! కేవలం రెండు రోజుల్లోనే..
సినిమా

చెల్లి పెళ్లిని గుర్తు చేసుకున్న బిగ్‌బాస్ బ్యూటీ హరితేజ..!
అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై తనదైన ముద్రని వేసుకున్న నటి, యాంకర్ హరితేజ. గతేడాది బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టి అభిమానులను అలరించింది. దాదాపు పదివారాల పాటు హౌస్‌లో ఉండి ఫ్యాన్స్‌ను అలరించింది. సీరియల్స్, సినిమాలతో పాపులర్ అయింది హరితేజ. బిగ్‌బాస్ మొదటి సీజన్లో అడుగుపెట్టి ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. గ్రాండ్ ఫినాలే వరకు చేరుకుని సెకండ్ రన్నరప్‌గా నిలిచింది. ఫిదా మీ ఫేవరెట్ స్టార్‌తో, పండగ చేస్కో, సూపర్ సింగర్, లక్కీ ఛాన్స్.. ఇలా పలు షోలకు యాంకర్‌గా వ్యవహరించింది. గతేడాది రిలీజైన దేవర సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్‌గా మెప్పించింది.అయితే తాజాగా తన చెల్లి పెళ్లిలో సందడి చేసింది హరితేజ. వివాహా వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. చెల్లి పెళ్లి వైభోగం అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది హరితేజ. అయితే తన సిస్టర్ పెళ్లి ఫిబ్రవరిలో జరగ్గా.. తాజాగా మరోసారి ఫోటోలను పంచుకుంది. కాగా.. హరితేజ కన్నడకు చెందిన దీపక్ అనే వ్యక్తిని 2015లో వివాహం చేసుకుంది. వీరిద్దరికీ 2021లో భూమి అనే కూతురు జన్మించింది. View this post on Instagram A post shared by Hari Teja (@actress_hariteja)

అందుకే నా కొడుకుకు ఆయన పేరు పెట్టుకున్నా: అనసూయ పోస్ట్ వైరల్
టాలీవుడ్ స్టార్ నటి అనసూయ ఇటీవల నూతన గృహ ప్రవేశం చేసింది. తన జీవితంలో మరో కొత్త అధ్యాయం అంటూ సోషల్ మీడియా వేదికగా ఫోటోలను పంచుకుంది. అంతేకాకుండా తన కలల సౌధానికి శ్రీరామసంజీవని అని పేరు కూడా పెట్టింది. ఈ సంతోషకర విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది.తాజాగా తన కొత్త ఇంటిలో జరిగిన పూజా కార్యక్రమం విశేషాలను వివరిస్తూ అనసూయ పోస్ట్ చేసింది. ఇంట్లో జరిగిన పూజా కార్యక్రమాలైన హోమాలు, శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం, మరకత లింగ రుద్రాభిషేకం గురించి వివరిస్తూ సుదీర్ఘమైన నోట్ రాసుకొచ్చింది. మా ఇంటికి సంజీవని అని పేరు పెట్టాలనుకున్నామని.. కానీ గురువు(పూజారి) సూచనలతో శ్రీరామసంజీవని అని పెట్టుకున్నామని తెలిపింది. ఆ రోజే మా ఇంటికి ఆంజనేయుడు వచ్చాడని గురువు తన ఫోన్లో ఫోటోను చూపించారని భావోద్వేగానికి గురైంది.నాకు ఊహ తెలిసినప్పటినుంచీ మా నాన్న గారి నుంచి నేర్చుకుంటున్న మొదటి గొప్ప విషయం గురించి అనసూయ రాసుకొచ్చింది. సంతోషంలో, విషాదంలో, భయాందోళనలో, అనారోగ్యంలో, ప్రేమలో ఉన్నా జైహనుమాన్ అని తలుచుకోకుండా నేనేమి చేయగలను అని తండ్రి చెప్పేవారని తెలిపింది. నా తండ్రి తర్వాత తండ్రిగా భావించేది ఆ హనుమంతుడినే.. అందుకే నా పెద్ద కొడుకుకు శౌర్య అని ఆయన పేరు పెట్టుకున్నాం అని వివరించింది. ముక్కోటి దేవతలకు వార్తాహరుడు అగ్ని దేవుడు (దూత) అని అంటారు.. అందుకే ఏ దేవుడికి ఏమైన గట్టిగా చెప్పుకోవాలన్న హోమం ద్వారానే చెప్పుకుంటాం.. ఈ విధంగా ఆ రోజు నా హనుమాన్ మా ఇంటి పేరుని.. మా ఇంటికి ఆహ్వానించాడనికి వచ్చాడంటూ సంతోషం వ్యక్తం చేసింది. అందరు ఆధ్యాత్మికంగా ఉండరు.. నాకు తెలుసు.. కానీ నా సత్యానుభవాన్ని మీ అందరితో పంచుకోవాలనిపించిందని అనసూయ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

ముగ్గురు హీరోల 'భైరవం'.. ట్రైలర్ ఎలా ఉందంటే?
మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'భైరవం'. గతేడాది డిసెంబరు నుంచి రిలీజ్ మాట వినిపిస్తుంది. మరి కారణాలేంటో తెలీదు గానీ వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈనెల 30న మూవీ థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలో తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఈ హీరోని గుర్తుపట్టారా? మహేశ్ కి బంధువు, స్టేట్ ప్లేయర్ కూడా) ముగ్గురు హీరోల సీన్స్ తో పాటు అటు యాక్షన్, ఇటు ఫ్యామిలీ ఎమోషన్స్ బ్యాలెన్స్ చేసేలా ట్రైలర్ కట్ చేశారు. చూస్తుంటే సినిమా వర్కౌట్ అయ్యేలా ఉంది. ఇందులో ఆనంది, దివ్య పిళ్లై, అదితీ శంకర్ హీరోయిన్లుగా నటించారు. ఇది తమిళ సినిమా 'గరుడన్'కి రీమేక్. ట్రైలర్ చూస్తుంటే తెలుగు ఫ్లేవర్ కి తగ్గట్లే సన్నివేశాల్లో చిన్న చిన్న మార్పులు చేసినట్లు అనిపించింది. 'నాంది' ఫేమ్ విజయ్ కనకమేడల దర్శకత్వం వహించాడు. మరి ఈ మూవీ ఎలా ఉండబోతుందో కొన్నిరోజుల్లో తెలుస్తుంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన సస్పెన్స్ థ్రిల్లర్.. తెలుగులో స్ట్రీమింగ్)

'విజయ్ దేవరకొండ మొహంలా ఉంది'.. ఆసక్తిగా తెలుగు ట్రైలర్
కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి , రుక్మిణీ జంటగా నటించిన తాజా చిత్రం 'ఏస్'. అరుముగ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు. 7సీఎస్ ఎంటర్టైన్మెంట్స్పై అరుముగ కుమార్ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 23న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు.ఇప్పటికే తమిళ ట్రైలర్ రిలీజ్ చేసిన మేకర్స్ ప్రమోషన్ల జోరు పెంచారు. తాజాగా ఏస్ మూవీ తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్ ఫుల్ కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. ఇప్పటికే ఈ సినిమా తెలుగు విడుదల హక్కుల్ని శ్రీ పద్మిణి సినిమాస్ దక్కించు కుంది. పద్మ సమర్పణలో శ్రీ పద్మిణి సినిమాస్ బ్యానర్‌పై బి.శివప్రసాద్ ఈ సినిమాని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయనున్నారు. దీంతో తమిళంతో పాటు తెలుగులోనూ ఓకే రోజు థియేటర్లలో విడుదల కానుంది. ఇంకేందుకు ఆలస్యం తెలుగు ట్రైలర్ చూసేయండి.
న్యూస్ పాడ్‌కాస్ట్
క్రీడలు

IPL 2025: గుజరాత్ దర్జాగా...
200 పరుగుల లక్ష్యం. ఛేదించే జట్టుకు ఏమాత్రం సులువు కానేకాదు. కానీ ఇద్దరే ఇద్దరు... గుజరాత్ ఓపెనర్లు దంచేశారు. అంతపెద్ద లక్ష్యాన్ని సులువుగా కరిగించేశారు. సాయి సుదర్శన్, శుబ్‌మన్ గిల్ పోటీపడ్డారు. పరుగు పెట్టేందుకు... ఫోర్లు బాదేందుకు... సిక్సర్లు కొట్టేందుకు ఇలా ప్రతిదానికి ఆఖరుదాకా పోటీపడి మరీ సాధించడంతో కఠిన లక్ష్యం కూడా ఓ ఓవర్‌కు ముందే కరిగిపోయింది. అంత చేసి కూడా ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమితో కుంగిపోయింది. అంతేకాదు గుజరాత్ దర్జాగా సాధించిన విజయంతో తమతోపాటే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), పంజాబ్ కింగ్స్ జట్లను కూడా ‘ప్లే ఆఫ్స్’కు తీసుకెళ్లింది. ఇక మిగిలింది ఒకే ఒక్క బెర్త్. దీని కోసం ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ కాచుకున్నాయి. మరి ఆఖరి బెర్త్ ఎవరిని వరిస్తుందో చూడాలి. న్యూఢిల్లీ: ఓపెనర్ల గర్జనతో గుజరాత్ టైటిల్స్ దర్జాగా ఐపీఎల్ 18వ సీజన్లో ప్లే ఆఫ్స్ దశకు అర్హత సంపాదించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సాయి సుదర్శన్ (61 బంతుల్లో 108 నాటౌట్; 12 ఫోర్లు, 4 సిక్స్‌లు), శుబ్‌మన్ గిల్ (53 బంతుల్లో 93 నాటౌట్; 3 ఫోర్లు, 7 సిక్స్‌లు) ఢిల్లీ బౌలింగ్‌ను దంచికొట్టారు. దీంతో టైటాన్స్ 10 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (65 బంతుల్లో 112 నాటౌట్; 14 ఫోర్లు, 4 సిక్స్‌లు) అజేయ సెంచరీతో కదంతొక్కాడు. అర్షద్, ప్రసిధ్‌కృష్ణ, సాయికిషోర్ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం గుజరాత్ టైటాన్స్ 19 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 205 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు సాయి సుదర్శన్, శుబ్‌మన్ గిల్ అజేయంగా, ఆకాశమే హద్దుగా చెలరేగారు. నెల నిషేధం ముగియడంతో గుజరాత్ తరఫున రబడ ఈ మ్యాచ్ బరిలోకి దిగాడు. రాహుల్ 112 నాటౌట్ క్యాపిటల్స్ ఇన్నింగ్స్‌ను ఆరంభం నుంచి ఆఖరుదాకా నడిపించింది... పరుగులు రాబట్టింది ఒకే ఒక్కడు రాహుల్. డుప్లెసిస్ (5)తో ఓపెనింగ్ వికెట్ ఎంతోసేపు నిలబడలేదు. ఆరంభంలో స్కోరులో ఏమాత్రం జోరు లేదు. 5 ఓవర్లలో ఢిల్లీ స్కోరు 28/1. పవర్‌ప్లేలో కనీసం బంతికో పరుగైనా చేయలేదు. అయితే ఆరో ఓవర్లో రాహుల్ రెండు సిక్స్‌లు, ఓ బౌండరీ బాదడంతో క్యాపిటల్స్ 45/1 స్కోరుతో కోలుకుంది. అభిషేక్ పొరెల్ (19 బంతుల్లో 30; 1 ఫోర్, 3 సిక్స్‌లు) అడపాదడపా భారీషాట్లు బాదాడు. రాహుల్ 35 బంతుల్లో ఫిఫ్టీ పూర్తిచేసుకున్నాడు. రబడ 11వ ఓవర్లో పొరెల్, రాహుల్ చెరో సిక్సర్ బాదడంతో 17 పరుగులు వచ్చాయి. దీంతో మరుసటి ఓవర్లోనే క్యాపిటల్స్ 100 మార్క్‌ను దాటింది. కానీ ఆఖరి బంతికి పొరెల్ వికెట్‌ను కోల్పోయింది. దీంతో రెండో వికెట్‌కు 90 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి కెపె్టన్ అక్షర్ పటేల్ (16 బంతుల్లో 25; 2 ఫోర్లు, 1 సిక్స్) రాగా... రాహుల్ ధాటిని పెంచాడు. 14వ ఓవర్లో వరుసగా 3 బౌండరీలు కొట్టాడు. అక్షర్ కూడా 4, 6తో దంచేపనిలో పడ్డాడు కానీ మరుసటి ఓవర్లోనే ప్రసి«ద్కృష్ణకు వికెట్ సమరి్పంచుకున్నాడు. 19వ ఓవర్లో 6, 4 బాదిన రాహుల్ 60 బంతుల్లో శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. స్టబ్స్ (10 బంతుల్లో 21 నాటౌట్; 2 సిక్స్‌లు) వేగంగా ఆడే ప్రయత్నం చేశాడు. ఆరంభం నుంచే ధనాధన్ తొలి ఓవర్లో సాయి సుదర్శన్ బౌండరీతో శుబ్‌మన్ సిక్స్‌తో తమ ఖాతా తెరవడం ద్వారా లక్ష్యానికి దీటైన ఆరంభమిచ్చారు. నటరాజన్ వేసిన రెండో ఓవర్‌ను సుదర్శన్ 6, 4, 4, 0, 2, 4లతో చితగ్గొట్టాడు. దీంతో 20 పరుగులు వచ్చాయి. అక్షర్ మూడో ఓవర్లో మరో రెండు బౌండరీలు బాదాడు. టైటాన్స్ 6 ఓవర్లలో 59/0 స్కోరు చేసింది. ఆ తర్వాత కూడా ఇద్దరు చక్కని సమన్వయంతో ఆడటంతో పరుగులకు పెద్దగా ఇబ్బంది లేకుండా పోయింది. ఈ క్రమంలో మొదట సుదర్శన్ 30 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకోగా... 10 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ 93/0 స్కోరు చేసింది. ఇక మిగిలిన 10 ఓవర్లలో 107 పరుగులు చేయాల్సిన దశలోనూ ఓపెనింగ్ జోడీ పరుగుల పయనం సాఫీగా సాగిపోయింది. దీంతో ఓవర్లు గడిచేకొద్దీ ఢిల్లీ బౌలర్లు కాస్తా డీలా బౌలర్లుగా మారిపోయారు. 33 బంతుల్లో గిల్ అర్ధసెంచరీ పూర్తవగా జట్టు స్కోరు 15వ ఓవర్లో 150 దాటింది. ఇక 30 బంతుల్లో 46 పరుగుల సమీకరణంతోనే... చేతిలో పది వికెట్లున్న టైటాన్స్ చేతుల్లోకే మ్యాచ్ వచ్చేసింది. ఈ లాంఛనాన్ని మరో బ్యాటర్‌కు ఇవ్వకుండా ఓపెనర్లే పూర్తి చేశారు. భారీ సిక్సర్‌తో సాయి సుదర్శన్ 56 బంతుల్లో సెంచరీ సాధించగా, చూడచక్కని బౌండరీలతో గిల్ కూడా శతకానికి చేరువయ్యాడు. కానీ ఈ లోపే 200 పరుగుల పెద్ద లక్ష్యం 19వ ఓవర్లోనే దిగిరావడంతో అతని సెంచరీకి అవకాశం లేకుండాపోయింది. స్కోరు వివరాలు ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: కేఎల్ రాహుల్ (నాటౌట్) 112; డుప్లెసిస్ (సి) సిరాజ్ (బి) అర్షద్ 5; పోరెల్ (సి) బట్లర్ (బి) సాయికిషోర్ 30; అక్షర్ (సి) సాయికిషోర్ (బి) ప్రసిధ్ కృష్ణ 25; స్టబ్స్ (నాటౌట్) 21; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 199. వికెట్ల పతనం: 1–16, 2–106, 3–151. బౌలింగ్: సిరాజ్ 4–0–37–0, అర్షద్ ఖాన్ 2–0–7–1, రబడా 2–0–34–0, ప్రసిద్‌కృష్ణ 4–0–40–1, రషీద్ ఖాన్ 4–0–32–0, సాయికిషోర్ 4–0–47–1. గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాయి సుదర్శన్ (నాటౌట్) 108; శుబ్‌మన్ గిల్ (నాటౌట్) 93; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (19 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 205. బౌలింగ్: అక్షర్ పటేల్ 3–0–35–0, నటరాజన్ 3–0–49–0, ముస్తాఫిజుర్ 3–0–24–0, చమీర 2–0–22–0, విప్రాజ్ 4–0–37–0, కుల్దీప్ 4–0–37–0.

IPL 2025: పంజాబ్ 11 ఏళ్ల తర్వాత...
జైపూర్: సుదీర్ఘ విరామం తర్వాత ఐపీఎల్ టోర్నిలో పంజాబ్ కింగ్స్ జట్టు ‘ప్లే ఆఫ్స్’ దశకు అర్హత సాధించింది. రాజస్తాన్ రాయల్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని పంజాబ్ కింగ్స్ జట్టు 10 పరుగుల తేడాతో గెలిచింది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్‌పై గుజరాత్ టైటాన్స్ జట్టు నెగ్గడంతో... పంజాబ్ కింగ్స్ జట్టుకు మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే ‘ప్లే ఆఫ్స్’ బెర్త్ ఖరారైంది. చివరిసారి పంజాబ్ కింగ్స్ జట్టు 2014లో ‘ప్లే ఆఫ్స్’కు చేరింది. రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మొదట పంజాబ్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. నేహల్ వధేరా (37 బంతుల్లో 70; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు), శశాంక్ సింగ్ (30 బంతుల్లో 59 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) దంచేశారు. అనంతరం భారీ లక్ష్యఛేదనకు దిగిన రాజస్తాన్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసి ఓడింది. ధ్రువ్ జురేల్ (31 బంతుల్లో 53; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), యశస్వి జైస్వాల్ (25 బంతుల్లో 50; 9 ఫోర్లు, 1 సిక్స్), వైభవ్ సూర్యవంశీ (15 బంతుల్లో 40; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) చెలరేగారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హర్‌ప్రీత్ బ్రార్ 3 వికెట్లు తీశాడు. ధనాధన్ ఆరంభం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్‌కు 4, 0, 4, 4, 6, 4లతో జైస్వాల్ తొలి ఓవర్లోనే దీటైన ఆరంభమిచ్చాడు. రెండో ఓవర్‌ను వైభవ్ బౌండరీ, రెండు సిక్స్‌లతో చితగ్గొట్టాడు. దీంతో 2.5 ఓవర్లోనే రాజస్తాన్ 50 స్కోరు చేసేసింది. వైభవ్ చేసిన 40 పరుగులు 4 ఫోర్లు, 4 సిక్స్‌లతోనే సాధించడం విశేషం. ఐదో ఓవర్లో వైభవ్ అవుటవడంతో 76 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం ముగిసింది. తర్వాత యశస్వి ధాటిగా ఆడుతున్నా... సామ్సన్ (20), పరాగ్ (13) వికెట్లు పారేసుకోవడం ప్రతికూలమైంది. అయినా ధ్రువ్ జురేల్ భారీషాట్లతో ఆశలు రేపాడు. కానీ ఇంపాక్ట్ బౌలర్ హర్‌ప్రీత్ బ్రార్ కీలక వికెట్లను తీసి రాజస్తాన్‌ను దెబ్బకొట్టాడు. స్కోరు వివరాలు పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రియాన్‡్ష (సి) హెట్‌మైర్ (బి) తుషార్ 9; ప్రభ్‌సిమ్రన్ (సి) సామ్సన్ (బి) తుషార్ 21; ఒవెన్ (సి) సామ్సన్ (బి) క్వెనా మఫాక 0; నేహల్ (సి) హెట్‌మైర్ (బి) ఆకాశ్ 70; శ్రేయస్ (సి) జైస్వాల్ (బి) పరాగ్ 30; శశాంక్ (నాటౌట్) 59; అజ్మతుల్లా (నాటౌట్) 21; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 219. వికెట్ల పతనం: 1–19, 2–34, 3–34, 4–101, 5–159. బౌలింగ్: ఫజల్హక్ 3–0–39–0, తుషార్ దేశ్‌పాండే 4–0–37–2, క్వెనా మఫాక 3–0–32 –1, పరాగ్ 3–0–26–1, హసరంగ 3–0–33–0, ఆకాశ్ మధ్వాల్ 4–0–48–1. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) ఒవెన్ (బి) హర్‌ప్రీత్ 50; వైభవ్ (సి) బార్ట్లెట్ (బి) హర్‌ప్రీత్ 40; సామ్సన్ (సి) యాన్సెన్ (బి) అజ్మతుల్లా 20; పరాగ్ (బి) హర్‌ప్రీత్ 13; జురేల్ (సి) ఒవెన్ (బి) యాన్సెన్ 53; హెట్‌మైర్ (సి) బార్ట్లెట్ (బి) అజ్మతుల్లా 11; దూబే (నాటౌట్) 7; హసరంగ (సి) ప్రభ్‌సిమ్రన్ (బి) యాన్సెన్ 0; క్వెన మఫాక (నాటౌట్) 8; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 209. వికెట్ల పతనం: 1–76, 2–109, 3–114, 4–144, 5–181, 6–200, 7–200. బౌలింగ్: అర్‡్షదీప్ 4–0–60–0, యాన్సెన్ 3–0–41–2, బార్ట్లెట్ 1–0–12–0, హర్‌ప్రీత్ బ్రార్ 4–0–22–3, చహల్ 4–0–30–0, అజ్మతుల్లా 4–0–44–2.

IPL 2025: ఢిల్లీపై ఘన విజయం.. ప్లే ఆఫ్స్‌కు గుజరాత్ టైటాన్స్
ఐపీఎల్-2025లో ప్లే ఆఫ్స్‌లో గుజరాత్ టైటాన్స్ అడుగుపెట్టింది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం అరుణ్‌జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో గుజరాత్ ఘన విజయం సాధించింది. దీంతో తమ ఫ్లే ఆఫ్స్ బెర్త్‌ను గుజరాత్ టీమ్ ఖారారు చేసుకుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో గుజరాత్(18 పాయింట్లు) అగ్రస్ధానంలో కొనసాగుతోంది. గుజరాత్ విజయంతో ఆర్సీబీ(17 పాయింట్లు), పంజాబ్ కింగ్స్(17 పాయింట్లు) సైతం ప్లే ఆఫ్స్‌కు ఆర్హత సాధించాయి. మరో స్ధానం కోసం ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు పోటీపడుతున్నాయి.ఓపెనర్ల విధ్వంసం..ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ధేశించిన 200 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ టైటాన్స్ వికెట్ నష్టపోకుండా 19 ఓవర్లలోనే ఊదిపడేసింది. గుజరాత్ ఓపెనర్లే మ్యాచ్‌ను ఫినిష్ చేశారు. సాయిసుదర్శన్(58 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్స్‌లతో 108 నాటౌట్) అద్బుతమైన సెంచరీతో చెలరేగగా.. శుబ్‌మన్ గిల్(53 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్‌లతో 93 నాటౌట్) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఢిల్లీ బౌలర్లలో ఒక్కరూ కనీసం వికెట్ సాధించలేకపోయారు.రాహుల్ సెంచరీ వృథా..ఇక తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో కేఎల్ రాహుల్ సూపర్ సెంచరీతో చెలరేగాడు. రాహుల్ 65 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్స్‌లతో 112 పరుగులు చేశాడు.రాహుల్‌కు ఇది ఐదో ఐపీఎల్ సెంచరీ. ఇక రాహుల్‌తో పాటు అభిషేక్ పోరెల్(30), అక్షర్ పటేల్(25), స్టబ్స్(21) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. గుజరాత్ బౌలర్లలో అర్షద్ ఖాన్, సాయికిషోర్, ప్రసిద్ద్ కష్ణ తలా వికెట్ సాధించారు.

ఉత్కంఠ పోరులో భారత్ విజయం..
సౌత్ ఆసియన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్(SAFF) అండర్-19 చాంపియన్‌షిప్ విజేతగా భారత్ అవతరించింది. ఆదివారం అరుణాచల్ ప్రదేశ్‌లోని గోల్డెన్ జూబ్లీ స్టేడియంలో జరిగిన ఫైనల్ పోరులో బంగ్లాను ఓడించి భారత్ టైటిల్‌ను కైవసం చేసుకుంది.ఆఖరి వరకు నువ్వానేనా అన్నట్లు సాగిన మ్యాచ్‌లో పెనాల్టీ షూటౌట్( 4-3)లో యంగ్ ఇండియా విజయం సాధించింది. ముందుగా నిర్ణీత సమయంలో ఇరు జట్లు చెరో గోల్‌తో సమంగా నిలిచారు. దీంతో ఫలితాన్ని తేల్చేందుకు పెనాల్టీ షూటౌట్‌ను నిర్వహించారు.పెనాల్టీ షూటౌట్లో కూడా ఆసక్తికరంగా సాగింది. పెనాల్టీ షూటౌట్లో 3-3తో సమంగా ఉన్నసమయంలో కెప్టెన్ షమీ సింగమాయుమ్ అద్బుతమైన గోల్ కొట్టి భారత్‌కు అద్బుతమైన విజయాన్ని అందించాడు. భారత్‌కు ఇది రెండవ శాఫ్ అండర్-19 టైటిల్ కావడం విశేషం.చదవండి: IPL 2025: చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్.. విరాట్ కోహ్లి రికార్డు బ్రేక్
బిజినెస్

పదేళ్ల చరిత్ర.. సెక్షన్ 80Cలో ఎన్నో ఆప్షన్లు
ఈ సెక్షన్ 80Cలో సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్లు, ఖర్చులు ఇలా ఎన్నో ఆప్షన్లు ఉన్నాయి. ఈ సెక్షన్‌కు పదేళ్ల చరిత్ర ఉంది. ఒకప్పుడు గరిష్ట పరిమితి రూ.1,00,000 ఉండేది. తరువాత రూ.1.50 లక్షలకి పెంచారు. అనంతరం ఎటువంటి మార్పులేదు. ఎప్పుటికప్పుడు ఈ పరిమితిని పెంచుతారని వదంతులు, పుకార్లు, ఎదురుచూపులు.. కానీ ప్రతిసారి నిరాశే ఎదురైంది. ఈ లక్షన్నర లిమిట్ ప్రస్తుతానికి అక్కడే ఆగిపోయింది. కారణం ఏమిటంటే ఈ సెక్షన్ పాత పద్ధతిలో పన్ను భారాన్ని ఎంచుకున్నవారికి మాత్రమే. కొత్త విధానం ఎంచుకున్న వారికి ఇది వర్తించదు.పాతవిధానాన్ని ఎంచుకున్న వారికి మాత్రమే 80C లో ఉన్న ఆప్షన్లు వర్తిస్తాయి. అవేమిటంటే ... 🔸 తన పేరు మీద, జీవిత భాగస్వామి .. పిల్లల పేర్ల మీద చెల్లించే జీవిత బీమా 🔸 డిఫర్డ్ యాన్యుటీ కోసం చేసిన చెల్లింపులు 🔸 ఈపీఎఫ్/జీపీఎఫ్/ సూపర్ యాన్యుయేషన్ ఫండ్‌కి చెల్లింపులు 🔸 సుకన్య సమృద్ధి అకౌంటులో డిపాజిట్లు 🔸 నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్లలో VIII, IX ఇష్యూలు 🔸 అయిదేళ్ల పైబడి కాలవ్యవధి కలిగిన డిపాజిట్లలో ఇన్వెస్ట్మెంట్లు 🔸 పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌లో జమలు 🔸 సీనియర్ సిటిజన్స్ స్కీము 2024లో పెట్టుబడులు 🔸 యూటీఐ యూలిప్ పాలసీ 1971కి జమలు, ఎల్ఐసీ జమలు 🔸 ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్‌కి జమలు 🔸 ఎల్ఐసీ యాన్యుటీ ప్లాన్/ ఇతర సంస్థల యాన్యుటీ ప్లాన్, కొత్త జీవన్‌ధార, కొత్త జీవన్ అక్షయ ఐఐ, ఐఐఐ ప్లాన్లు, జీవన్‌ధార అక్షయ 🔸 యూటీఐ స్కీం 1992/1999/2005కి సంబంధించిన మ్యూచువల్ ఫండ్ 🔸 నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (ఎన్‌హెచ్‌బీ) వారికి చేసిన చెల్లింపులు 🔸 బ్యాంకు/ఎల్ఐసీ/ఎన్‌హెచ్‌బీ/ ఇతర కంపెనీల నుంచి తీసుకున్న రుణాల తిరిగి చెల్లింపులు 🔸 పిల్లల స్కూల్ ఫీజు చెల్లింపులు (ఇద్దరికి మాత్రమే) 🔸 ఈక్విటీ షేర్లు/డిబెంచర్ల కోసం చెల్లింపులు 🔸 షెడ్యూల్డ్ బ్యాంకులు, పోస్ట్ ఆఫీసులో అయిదేళ్ల కాలవ్యవధితో చేసిన డిపాజిట్లు 🔸 నాబార్డు వారు జారీ చేసిన బాండ్ల కొనుగోళ్లు 🔸 ఇన్యూరెన్స్ పాలసీ (డిఫర్డ్ యాన్యుటీ పాలసీ మినహా) 🔸 ఇంటి రిజిస్టేషన్ కోసం చెల్లించే రిజిస్టేషన్ ఫీజులు, స్టాంప్ డ్యూటీ చెల్లింపులు. ఇలా సెక్షన్ 80Cలో 20 అంశాలు ప్రతిపాదించారు. వీటిలో కొన్నింటికి షరతులు విధించారు. షరతులకు లోబడితేనే ఆయా అంశాల ప్రకారం మినహాయింపు ఇస్తారు. ఇతరత్రా విషయాలు.. 🔸 ప్రావిడెండ్ ఫండ్‌కి చేసే చెల్లింపులు, లోన్ రీపేమెంట్లకు ఎటువంటి మినహాయింపు రాదు. 🔸 ఇంటి రిజిస్ట్రేషన్ విషయంలో వాటా కోసం చెల్లింపు, డిపాజిట్, ఇంటికి మార్పులు, రెనోవేషన్, రిపేరు ఖర్చులకు మినహాయింపు ఇవ్వరు. 🔸 ట్యూషన్ ఫీజుకే మినహాయింపులు. డెవలప్మెంట్, డొనేషన్స్ నిమిత్తం చెల్లించినందుకు మినహాయింపులు ఇవ్వరు. 🔸 లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపుల మీద ఆంక్షలున్నాయి. ఏడాది చెల్లింపులు సమ్ అష్యూర్డ్‌లో 10 శాతం దాటకూడదు. 🔸 సుకన్య సమృద్ధి అకౌంటు డిపాజిట్ల మీద వడ్డీ మినహాయింపు ఉంది.పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.com కు ఈ–మెయిల్ పంపించగలరు.

వజ్రాలను మించిపోయిన స్మార్ట్ఫోన్లు!
న్యూఢిల్లీ: స్మార్ట్ఫోన్ల ఎగుమతులు మంచి జోరు చూపిస్తున్నాయి. ముఖ్యంగా అమెరికాకు ఐదు రెట్లు, జపాన్‌కు నాలుగు రెట్లకు మించి స్మార్ట్ఫోన్ల ఎగుమతులు గత మూడేళ్లలో పెరిగినట్టు ప్రభుత్వ డేటా తెలియజేస్తోంది. పెట్రోలియం ఉత్పత్తులు, వజ్రాలను వెనక్కి నెట్టేసి ఎగుమతుల్లో టాప్ స్థానానికి స్మార్ట్ఫోన్లు చేసుకున్నాయి. 2024–25 ఆర్థిక సంవత్సరంలో 24.14 బిలియన్ డాలర్ల విలువైన (రూ.2.05 లక్షల కోట్లు) స్మార్ట్ఫోన్ల ఎగుమతులు నమోదయ్యాయి. 2023–24లో 15.57 బిలియన్ డాలర్ల ఎగుమతులతో పోల్చి చూస్తే 55 శాతం పెరిగాయి. 2022–23లో స్మార్ట్ ఫోన్ల ఎగుమతులు 10.96 బిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం. గత ఆర్థిక సంవత్సరంలో ప్రధానంగా యూఎస్, నెదర్లాండ్స్, ఇటలీ, జపాన్, చెక్ రిపబ్లిక్ దేశాలకు భారత స్మార్ట్ఫోన్ల ఎగుమతుల్లో అధిక వృద్ధి నమోదైంది. ఒక్క అమెరికాకే గత ఆర్థిక సంవత్సరంలో 10.6 బిలియన్ డాలర్ల స్మార్ట్ఫోన్ల ఎగుమతులు జరిగాయి. 2023–24లో 5.57 బిలియన్ డాలర్లుగా ఉంటే, 2022–23లో అమెరికాకు స్మార్ట్ ఫోన్ల ఎగుమతులు 2.16 బిలియన్ డాలర్ల చొప్పున ఉన్నాయి. జపాన్ విషయంలోనూ గణనీయమైన వృద్ధి నమోదైంది. 2022–23లో జపాన్‌కు స్మార్ట్ఫోన్ల ఎగుమతులు 120 మిలియన్ డాలర్లుగా ఉంటే, 2024–25లో 520 మిలియన్ డాలర్లకు పెరిగాయి. తయారీ, ఎగుమతులకు కేంద్రం దేశ అగ్రగామి ఎగుమతుల్లో స్మార్ట్ఫోన్లు కూడా చేరినట్టు, పెట్రెలియం ఉత్పత్తులు, వజ్రాల ఎగుమతులను మొదటిసారి అధిగమించినట్టు వాణిజ్య శాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు. ముఖ్యంగా గత మూడేళ్లలో బలమైన వృద్ధి నమోదైనట్టు.. దీంతో అంతర్జాతీయంగా స్మార్ట్ఫోన్ల తయారీ, ఎగుమతులకు భారత్ ప్రధాన కేంద్రంగా అవతరించినట్టు చెప్పారు. పీఎల్ఐ కింద స్మార్ట్ఫోన్ల తయారీకి కేంద్రం రాయితీలు ఇస్తుండడం తెలిసిందే. ఇక నెదర్లాండ్స్‌కు గత ఆర్థిక సంవత్సరంలో 2.2 బిలియన్ డాలర్ల స్మార్ట్ఫోన్ల ఎగుమతులు జరిగాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులు 1.07 బిలియన్ డాలర్లతో పోలి్చతే రెట్టింపయ్యాయి. ఇటలీకి సైతం 720 మిలియన్ డాలర్ల నుంచి గత ఆర్థిక సంవత్సరంలో 1.26 బిలియన్ డాలర్లకు పెరిగాయి. చెక్ రిపబ్లిక్కు 650 మిలియన్ డాలర్ల నుంచి 1.17 బిలియన్ డాలర్ల విలువైన స్మార్ట్ఫోన్ల ఎగుమతులు గత ఆర్థిక సంవత్సరంలో పెరిగినట్టు వాణిజ్య శాఖ డేటా తెలియజేస్తోంది.

ప్రపంచ పరిణామాలే దిక్సూచి
న్యూఢిల్లీ: దేశీ కార్పొరేట్ కంపెనీల ఆర్థిక ఫలితాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా జరిగే ఆర్థిక, రాజకీయ పరిణామాలు, విదేశీ ఇన్వెస్టర్ల నిధుల ప్రవాహం ఈ వారంలో మన స్టాక్ మార్కెట్లకు దిశానిర్దేశం చేయనున్నాయని విశ్లేషకులు పేర్కొన్నారు. ముఖ్యంగా అమెరికా సుంకాల నుంచి తప్పించుకునేందుకు వివిధ దేశాలు కుదుర్చుకోనున్న వాణిజ్య ఒప్పందాలపై తాజా సమాచారం, ప్రపంచ మార్కెట్లపై అది చూపే ప్రభావాన్ని ఇన్వెస్టర్లు నిశితంగా గమనించనున్నారు. ’భారత్–పాకిస్తాన్ ఉద్రిక్తతలు, తెరవెనుక భౌగోళిక–రాజకీయ సంఘటనలు ప్రస్తుతం శాంతించిన నేపథ్యంలో.. ఇన్వెస్టర్లు ఇప్పుడు క్యూ4 ఆర్థిక ఫలితాల సీజన్లో మిగిలిన కంపెనీల పనితీరుపై దృష్టిసారించే అవకాశం ఉంది. అంతేకాకుండా, భారత్–అమెరికా మధ్య ట్రేడ్ డీల్ అనుకున్నదాని కంటే ముందుగానే కుదరవచ్చన్న ఆశాభావం నెలకొంది. ఇది మార్కెట్ సెంటిమెంట్‌పై మరింత సానుకూల ప్రభావం చూపవచ్చు’ అని మాస్టర్ ట్రస్ట్ గ్రూప్ డైరెక్టర్ పునీత్ సింఘానియా అభిప్రాయపడ్డారు. దేశీ పరిణామాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా వెలువడే కీలక ఆర్థిక గణాంకాలు కూడా మన మార్కెట్‌కు దిక్సూచిగా నిలుస్తాయని ఆయన తెలిపారు. అమెరికా వస్తువులపై టారిఫ్‌లను పూర్తిగా ఎత్తివేసేందుకు భారత్ సుముఖంగా ఉందని యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి పేర్కొనడం తెలిసిందే. ఇరు దేశాల మధ్య త్వరలోనే వాణిజ్య ఒప్పందం కుదరనుందని కూడా ఆయన తాజాగా చెప్పారు.కీలక ఫలితాలు... ఈ వారంలో పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, హిందాల్కో, ఓఎన్జీసీ, సన్ ఫార్మా, ఐటీసీ, జేఎస్‌డబ్ల్యూ తదితర కీలక కంపెనీలు క్యూ4 ఆర్థిక ఫలితాలను ప్రకటించనున్నాయి. స్వల్పకాలానికి మన మార్కెట్ ట్రెండ్‌ను ఇవి నిర్దేశించే అవకాశం ఉంది. ‘ప్రపంచవ్యాప్తంగా చెప్పుకోదగిన ప్రధాన ఈవెంట్లు ఏవీ లేనందున ఇన్వెస్టర్ల దృష్టి మళ్లీ దేశీ కంపెనీల ఫలితాలపై ఉంటుంది. అలాగే కీలక ఆర్థిక గణాంకాలను కూడా నిశితంగా ట్రాక్ చేస్తారు. ప్రపంచ ట్రేడ్ డీల్స్‌పై అప్డేట్లు, ప్రపంచ మార్కెట్లు వాటికి ఎలా స్పందిస్తాయనేది కూడా ఇన్వెస్టర్లు జాగ్రత్తగా గమనిస్తారు’ అని రెలిగేర్ బ్రోకింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (రీసెర్చ్) అజిత్ మిశ్రా పేర్కొన్నారు. ప్రస్తుత ర్యాలీకి దన్నుగా నిలుస్తున్న విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడి ధోరణి కూడా మార్కెట్ గమనంపై ప్రభావం చూపుతుంది’ అని మిశ్రా వ్యాఖ్యానించారు. ‘అమెరికా–చైనా మధ్య ట్రేడ్ డీల్, ఇండో–పాక్ ఉద్రిక్తతలు సద్దుమణగడంతో ప్రపంచ వాణిజ్య రంగంలో సానుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. పెట్టుబడులు పుంజుకోవడానికి ఇది దోహదం చేస్తుంది’ అని జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయ్‌కుమార్ అభిప్రాయపడ్డారు. గతవారం ఇలా.. విదేశీ ఇన్వెస్టర్ల జోరు నేపథ్యంలో స్టాక్ మార్కెట్ తాజా ర్యాలీ గత వారంలో కూడా కొనసాగింది. బీఎస్ఈ సెన్సెక్స్ 2,876 పాయింట్లు (3.61 శాతం) దూసుకెళ్లి 82,331 వద్ద స్థిరపడింది. ఇకఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 1,012 పాయింట్లు (4.21 శాతం) జంప్ చేసి 25,020 వద్ద ముగిసింది.విదేశీ ఇన్వెస్టర్ల క్యూ... ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలఉ శాంతిస్తుండటంతో విదేశీ ఇన్వెస్టర్లు మళ్లీ పెట్టుబడుల బాట పడుతున్నారు. దేశీయంగా కూడా ఆర్థిక వ్యవస్థ మూలాలు మెరుగుపడుతుండటం కూడా ఇందుకు దోహదం చేస్తోంది. దీంతో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) తాజా ర్యాలీ కొనసాగుతోంది. మే నెలలో ఇప్పటిదాకా (16 నాటికి) దేశీ ఈక్విటీ మార్కెట్లో నికరంగా రూ.18,620 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. ఈ ఏడాది తొలి మూడు నెలల్లో భారీగా అమ్మకాలకు దిగిన ఎఫ్‌పీఐలు ఏప్రిల్‌లో తొలిసారి మళ్లీ నికర పెట్టుబడులు (రూ.4,223 కోట్లు) పెట్టడం తెలిసిందే. జనవరిలో ఏకంగా రూ.78,027 కోట్లు, మార్చిలో రూ.34,574 కోట్లు, మార్చిలో రూ.3,973 కోట్ల చొప్పున విదేశీ ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకోవడం గమనార్హం. ఏప్రిల్ మధ్య నుంచి మళ్లీ పెట్టుబడుల రూట్లోకి వచ్చిన ఎఫ్‌పీఐల దన్నుతో మార్కెట్లు కూడా యూ టర్న్ తీసుకుని దూసుకెళ్తున్నాయి. మొత్తంమీద మార్కెట్లో ఇన్వెస్టర్ల విశ్వాసం తిరిగి పుంజుకోవడానికి ఇది దారితీస్తోంది.

మీ పెట్టుబడి బంగారం గాను!
ఒకవైపు ఈక్విటీలు, క్రిప్టోలు అస్థిరతలను ఎదుర్కొంటున్నాయి. మరోవైపు రియల్ ఎస్టేట్ మార్కెట్లో డిమాండ్ నీరసించింది. ఇదే కాలంలో బంగారం సైలెంట్‌గా ర్యాలీ చేయడం చూశాం. ఈక్విటీలు దీర్ఘకాలంలో మెరుగైన రాబడులకు వేదిక అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ, అన్ని కాలాల్లోనూ అత్యుత్తమైన పెట్టుబడి సాధనం ఏదంటే..? అది బంగారమే. ఈ అర్థంలోనే దీన్ని ‘గోట్ అసెట్’గా చెబుతారు. గడిచిన రెండేళ్లలోనే కాదు.. గత రెండు దశాబ్దాల్లోనూ ఈక్విటీలకు మించి రాబడులను అందించిన పసిడిని ప్రతీ ఇన్వెస్టర్ తన పోర్ట్‌ఫోలియోలో చేర్చుకోవడం మంచి నిర్ణయంగా నిపుణులు చెబుతున్నారు. పెట్టుబడులకు రిస్క్ తగ్గించుకుని, వైవిధ్యం కోసం, రాబడుల స్థిరత్వం కోసం తప్పకుండా పుత్తడికి ప్రాధాన్యం ఇవ్వాల్సిందేనంటున్నారు.భారతీయుల్లో ఎక్కువ మంది బంగారాన్ని ఆభరణంగా, విలువైన సాధనంగానే చూస్తుంటారు. కానీ, ఇటీవలి కాలంలో పెట్టుబడుల పరంగానూ బంగారానికి ప్రాధాన్యం పెరుగుతోంది. అస్థిరతల్లో సురక్షిత సాధనంగా పసిడికి గుర్తింపు ఇప్పుడు వచ్చింది కాదు. చారిత్రకంగా ఎప్పటి నుంచో ఉన్నదే. కాకపోతే సెంట్రల్ బ్యాంక్‌లు (ఆర్బీఐ, ఇతరత్రా) రిజర్వ్ అసెట్‌గా బంగారానికి ఈ మధ్యకాలంలో అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఎడాపెడా కొనుగోలు చేస్తున్నాయి. దీనికితోడు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనంత పెరిగిపోవడం.. అంతర్జాతీయ వాణిజ్యం పరంగా రక్షణాత్మక ధోరణులు పెరిగిపోతున్న తరుణంలో పసిడి మరింత బలాన్ని సంతరించుకుంది. కనుక ప్రతి ఒక్కరి పెట్టుబడులకు పుత్తడి వన్నెతెస్తుందనేది నిపుణుల మాట. రాబడుల చరిత్ర.. గత 25 ఏళ్ల కాలంలో పసిడి ఎస్అండ్పీ 500తోపాటు నిఫ్టీ–50ని మించి రాబడులను ఇచ్చినట్టు ఈక్విటాస్ ఇన్వెస్ట్మెంట్స్ చెబుతోంది. 2000 సంవత్సరం నుంచి చూస్తే బంగారం డాలర్ మారకంలో 10 రెట్లు పెరిగింది. ఇదే కాలంలో ఎస్అండ్పీ 500 రాబడులు నాలుగున్నర రెట్లుగా ఉన్నాయి. రూపాయి మారకంలో చూసినా బంగారం గత 25 ఏళ్లలో 20 రెట్లు పెరగ్గా.. సెన్సెక్స్ ఇదే కాలంలో 16 రెట్లు ప్రతిఫలాన్నిచ్చింది. ఇక గత 15 ఏళ్లలో చూస్తే బంగారం ఏటా 12 శాతం రాబడులను సగటున ఇచ్చింది. ఇదే కాలంలో సెన్సెక్స్ రాబడి ఏటా 10–11 శాతం మధ్య ఉందన్నది ఈక్విటాస్ ఇన్వెస్ట్మెంట్స్ విశ్లేషణ. ‘‘2000 నుంచి నిఫ్టీ కంటే బంగారమే అధిక రాబడిని ఇచ్చింది. గోల్డ్ సీఎఫ్‌డీలు (ఫ్యూచర్ కాంట్రాక్టులు) 2,000 శాతం పెరగ్గా.. నిఫ్టీ–50 సూచీ రాబడి 1470 శాతంగా ఉంది’’ అని జెరోదా సహ వ్యవస్థాపకుడు నితిన్ కామత్ ఎక్స్ ప్లాట్ఫామ్లో చేసిన పోస్ట్‌లో వివరించారు. పెట్టుబడిలో పుత్తడికి వాటా పెట్టుబడుల్లో వైవిధ్యం దృష్ట్యా కొంత మొత్తాన్ని పసిడిలోనూ ఇన్వెస్ట్ చేసుకోవాలన్నది మెజారిటీ నిపుణుల సూచన. ఒకరు తమ మొత్తం పెట్టుబడుల్లో 10 నుంచి 15 శాతం వరకు బంగారంపై ఇన్వెస్ట్ చేసుకోవచ్చని క్వాంటమ్ మ్యూచువల్ ఫండ్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ చిరాగ్ మెహతా సూచించారు. పసిడే కాదు, వెండి కూడా దీర్ఘకాలంలో పెట్టుబడులను వృద్ధి చేస్తుందని స్టాక్స్‌కార్ట్ (డిస్కౌంట్ బ్రోకర్) సీఈవో ప్రణయ్ అగర్వాల్ అభిప్రాయం. ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల్లో 5–8 శాతం వరకు పసిడి, వెండికి కేటాయించుకోవచ్చని సూచించారు. ‘‘బంగారం ఒక ప్రత్యామ్నాయ సాధనం. కొత్త రిజర్వ్ కరెన్సీ అని, డాలర్లను భర్తీ చేస్తుందని ఎక్కడో చదివాను. అదే జరిగితే రూ.90,000 ధరకు అర్థమే లేదు’’ అని మార్కెట్ నిపుణుడు సునీల్ సుబ్రమణ్యం అభిప్రాయపడ్డారు. రిజర్వ్ కరెన్సీగా మారితే అప్పుడు బంగారం ఇంకా పెరగొచ్చన్నది ఆయన ఉద్దేశం. ఆర్బీఐ విదేశీ మారక నిల్వల్లో బంగారం వాటా 2024 సెప్టెంబర్ చివరికి 9.32 శాతంగా ఉంటే, 2025 మార్చి నాటికి 11.70 శాతానికి పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కేంద్ర బ్యాంక్‌లు ఇదే మాదిరి బంగారం నిల్వలు పెంచుకుంటున్నాయి.అన్ని కాలాల్లోనూ అత్యుత్తమం ఎందుకు? సురక్షిత సాధనం: ఆర్థిక సంక్షోభాలు, అనిశి్చతులు, యుద్ధాల వంటి పరిస్థితుల్లో బంగారానికి డిమాండ్ ఏర్పడుతుంది. ఆ సమయంలో ఇందులోకి అధిక పెట్టుబడులు రావడంతో పసిడి మరింత విలువను సంతరించుకుంటుంది. అలాంటి సంక్షోభాల్లో ఈక్విటీలు, రియల్ ఎస్టేట్ వంటి ప్రత్యామ్నాయ పెట్టుబడులు అమ్మకాల ఒత్తిడికి గురవుతుంటాయి. తాజా డిమాండ్ వెనక్కి వెళుతుంది. స్టోర్ ఆఫ్ వ్యాల్యూ: పసిడిని బీరువాలో ఉంచినా.. బ్యాంక్ లాకర్లో ఉంచినా కొంత కాలానికి దాని విలువ పెరిగేదే కానీ తరిగేది కాదు. అందుకే దీనికి స్టోర్ ఆఫ్ వ్యాల్యూ గుర్తింపు. అదే మిగిలిన పెట్టుబడులకు ద్రవ్యోల్బణం సెగ ఉంటుంది. పరిమిత సరఫరా: బంగారం ఉత్పత్తి ఏటేటా పెరిగేది కాదు. బంగారం మైనింగ్ అత్యంత సంక్లిష్టమైనది. దీని సరఫరా స్థిరంగానే ఉంటుంది. కానీ, డిమాండ్ మాత్రం ఏటేటా పెరుగుతోంది. ఈ డిమాండ్ పసిడి ధరలకు మద్దతుగా నిలుస్తుంది. వైవిధ్యం: పెట్టుబడులు అన్నీ ఒకే చోట ఉంటే.. ఆ విభాగంలో సమస్యాత్మక పరిస్థితులు ఏర్పడితే.. విలువకు నష్టం కలుగుతుంది. అందుకే పెట్టుబడులకు వైవిధ్యం కూడా అవసరమే. ఈ విషయంలో పుత్తడి ఒక ప్రత్యామ్నాయ పెట్టుబడి సాధనం. చిటికెలో రుణం: బంగారం కాయిన్లపై (బ్యాంకుల్లో కొనుగోలు చేసిన వాటికే ఇవ్వాలన్నది ఆర్బీఐ తాజా ప్రతిపాదన), ఆభరణాలపై 9–10 శాతం మేర వార్షిక వడ్డీపై బ్యాంకుల నుంచి సులభంగా రుణం లభిస్తుంది. పెట్టుబడి సాధనాలు.. బంగారంలో పెట్టుబడి భౌతికం కంటే డిజిటల్‌గానే సౌకర్యంగా ఉంటుంది. డిజిటల్ సాధనాల్లో గోల్డ్ ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్‌ను ఇన్వెస్టర్లు పరిశీలించొచ్చు. ఎంఎంటీసీ తదితర సంస్థల భాగస్వామ్యంతో ఫిన్‌టెక్ ప్లాట్‌ఫామ్‌లు డిజిటల్ గోల్డ్‌ను రూపాయి నుంచి కొనుగోలు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నాయి. గోల్డ్ ఈటీఎఫ్‌లు ఇవి స్టాక్ ఎక్సే్ఛంజ్‌ల్లో రోజువారీ ట్రేడ్ అవుతుంటాయి. మ్యూచువల్ ఫండ్స్ సంస్థలే వీటిని నిర్వహిస్తుంటాయి. షేర్ల మాదిరే ఏ పనిదినంలో అయినా కొనుగోలు, విక్రయాలు చేసుకోవచ్చు. డీమ్యాట్ ఖాతా అవసరం. ఇందులో పెట్టుబడి విలువపై ఫండ్ సంస్థకు ఎక్స్పెన్స్ రేషియో, కొనుగోలుపై బ్రోకర్లకు చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ఒక గోల్డ్ ఈటీఎఫ్ ధర గ్రాము బంగారం మార్కెట్ ధరను ప్రతిఫలిస్తుంది. గోల్డ్ ఈటీఎఫ్‌లను ఇప్పుడు చాలా సంస్థలు 0.01 గ్రాముల కింద ఆఫర్ చేస్తున్నాయి. కనుక రూ.90 నుంచి వీటిలో ఫ్రాక్షన్ యూనిట్‌ను కొనుగోలు చేసుకోవచ్చు. గోల్డ్ ఈటీఎఫ్‌లను నిర్వహించే సంస్థలు వాటి ఇష్యూ పరిమాణంకు అనుగుణంగా భౌతిక బంగారాన్ని కొనుగోలు చేసి భద్రపరుచుకోవడం తప్పనిసరి.గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో ఇవి ఇన్వెస్ట్ చేస్తుంటాయి. డీమ్యాట్ ఖాతాలేకపోయినా గోల్డ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవడం సానుకూలత. బ్రోకర్ల సాయం లేకుండా ఫండ్స్ సంస్థ నుంచే కొనుగోలు చేస్తున్నందున బ్రోకరేజీ చార్జీలు పడవు. కాకపోతే ఇందులోనూ ఎక్స్పెన్స్ రేషియో చెల్లించాలి. గోల్డ్ ఈటీఎఫ్‌లు, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ సెబీ నియంత్రణల పరిధిలోకి వస్తాయి. కనుక పెట్టుబడులు సురక్షితం. ఉదాహరణకు ఎస్బీఐ గోల్డ్ మ్యూచువల్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్‌లో గత పదేళ్లలో రాబడి వార్షికంగా 12.66 శాతంగా ఉంది. నిప్పన్ ఇండియా గోల్డ్ ఈటీఎఫ్, ఎస్బీఐ గోల్డ్ ఈటీఎఫ్‌లు గత పదేళ్లలో 8.5–9.5 శాతం మధ్య రాబడిని ఇచ్చినట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్‌లో అయితే సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా రూ.500 నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పన్ను బాధ్యత → బంగారం కాయిన్లు, బిస్కెట్లు, ఆభరణాలు తదితర భౌతిక రూపంలోని బంగారాన్ని కొనుగోలు చేసి రెండేళ్ల తర్వాత విక్రయించినట్టయితే వచ్చిన లాభం దీర్ఘకాల మూలధన లాభం అవుతుంది. దీనిపై 12.5% పన్ను చెల్లించాలి. రెండేళ్లలోపు విక్రయిస్తే వచ్చిన లాభం స్వల్పకాల మూలధన లాభం అవుతుంది. ఈ మొత్తాన్ని వార్షిక ఆదాయానికి కలిపి తమ మొత్తం ఆదాయానికి వర్తించే రేటు ప్రకారం పన్ను చెల్లించాలి. పాత ఆభరణాన్ని కొత్త ఆభరణంతో మార్చుకుంటే అప్పుడు పాత బంగారాన్ని విక్రయించినట్టుగానే చట్టం పరిగణిస్తుంది. కనుక పాత ఆభరణంపై వచ్చిన లాభంపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. → డిజిటల్ గోల్డ్‌కూ భౌతిక బంగారానికి మాదిరే పన్ను రేట్లు వర్తిస్తాయని ట్యాక్స్‌మ్యాన్ డాట్ కామ్ వైస్ ప్రెసిడెంట్ నవీన్ వాధ్వా తెలిపారు → గోల్డ్ మ్యూచువల్ ఫండ్‌కు సైతం భౌతిక బంగారం నిబంధనలే వర్తిస్తాయి. → గోల్డ్ ఈటీఎఫ్‌లను ఏడాదిలోపు విక్రయిస్తే వచ్చిన స్వల్పకాల మూలధన లాభం వార్షిక ఆదాయం కింద చూపించి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఏడాది తర్వాత విక్రయించినట్టయితే వచ్చిన దీర్ఘకాల మూలధన లాభంపై 12.5 శాతం పన్ను చెల్లిస్తే సరిపోతుంది. సమీప కాలంలో ధరలు ఎలా ఉండొచ్చు..? బంగారాన్ని స్వల్పకాల దృష్టితో కొనుగోలు చేయడం సూచనీయం కాదు. తమ అవసరాలు, పెట్టుబడుల కోణంలోనే దీర్ఘకాలానికి నిర్దేశిత పరిమితులకు లోబడి కొనుగోలు చేసుకోవాలి. కానీ, అమెరికా–చైనా మధ్య వాణిజ్య సయోధ్య, ఉక్రెయిన్–రష్యా మధ్య చర్చలకు సానుకూల త నేపథ్యంలో ఆల్‌టైమ్ గరిష్టాల నుంచి బంగారం ధరలు దిగొస్తున్నాయి. ఔన్స్‌కు అంతర్జాతీయంగా 3,510 డాలర్ల వరకు వెళ్లిన బంగారం ధర 3,180 డాలర్లకు తగ్గింది.ఇప్పటికీ దీర్ఘకాలానికి బంగారం పట్ల నిపుణులు బుల్లిష్ ధోరణినే వ్యక్తం చేస్తున్నారు. వచ్చే 30–40 రోజుల్లో ఔన్స్ బంగారం ధర 3,150 డాలర్ల స్థాయికి రావొచ్చన్నది మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ కమోడిటీస్ రీసెర్చ్ హెడ్ నవనీత్ దమాని అంచనా. దేశీయంగా 10 గ్రాములకు (24 క్యారెట్లు) రూ. 90,00–91,000 వరకు దిగిరావొచ్చన్నారు. 2,900–3,000 డాలర్ల స్థాయికి సైతం బంగారం అంతర్జాతీయ మార్కెట్లో తగ్గొచ్చని, కొంత కాలం స్థిరీకరణ చెందొచ్చన్న విశ్లేషణులు వినిపిస్తన్నాయి.భౌతిక బంగారం కొందరికి డిజిటల్ బంగారంలో పెట్టుబడి నచ్చకపోవచ్చు. భౌతికంగా చూసుకోవడమే ఇష్టం. అలాంటి వారు ఆభరణాలకు బదులు బ్యాంక్‌లు విక్రయించే కాయిన్లను పరిశీలించొచ్చు. భౌతిక బంగారం అయితే జాగ్రత్త పరుచుకోవడం కొంత రిస్‌్కతో కూడినది. కనుక మొదటి ప్రాధాన్యం డిజిటల్ బంగారానికే ఇవ్వాలి. కాయిన్లు, ఆభరణాల రూపంలో కొనుగోలు చేస్తే విలువపై 3 శాతం జీఎస్టీ చెల్లించాలి. అదే ఆభరణాలు అయితే జీఎస్టీకి అదనంగా తయారీ చార్జీల రూపంలో మరో 5–15 శాతం అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. తిరిగి అవే ఆభరణాలను మార్చుకోవాలనుకుంటే, వాటిని గతంలో కొనుగోలు చేసినప్పుడు చెల్లించిన తయారీ చార్జీలు, జీఎస్టీ మేర నష్టపోవాల్సి వస్తుంది. అంతేకాదు పాత ఆభరణాలను కొత్త వాటితో మారి్పడి చేసుకున్నప్పటికీ.. కొత్త ఆభరణం బరువు ప్రకారమే విలువపై జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. మార్చుకున్న పాత బంగారం మేర జీఎస్టీకి మినహాయింపు లేదు. డిజిటల్ గోల్డ్ ఫోన్‌పే, పేటీఎం తదితర సంస్థలు డిజిటల్ గోల్డ్‌ను ఆఫర్ చేస్తున్నాయి. రూపాయి నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. కానీ, మిగిలిన డిజిటల్ బంగారం సాధనాలు మాదిరిగా ఇవి సెబీ నియంత్రణలో పనిచేయవు. పైగా వీటి కొనుగోలు, విక్రయంపై చార్జీల విషయంలో పారదర్శకత లేదు. బంగారాన్ని ఇప్పుడు ఆభరణం కంటే ఎక్కువగా చూస్తున్నారు. సురక్షితమైన లిక్విడ్ అసెట్‌గా, అత్యవసరాల్లో హెడ్జింగ్‌గా పరిగణిస్తున్నారు. – పృద్వీ రాజ్ కొథారి, రిద్ధిసిద్ధి బులియన్స్ ఎండీభారతీయ గృహిణి అత్యంత తెలివైన ఫండ్ మేనేజర్ అనడానికి కాలక్రమంలో బంగారంపై రాబడే నిదర్శనం.– ఉదయ్ కోటక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ ఫౌండర్ – సాక్షి, బిజినెస్‌డెస్క్
ఫ్యామిలీ

వారాంతంలో సరదా సరదాగా ఈ స్కిల్స్ నేర్చుకుందాం..!
వారం రోజుల పాటు ఉద్యోగ బాధ్యతలు, వ్యాపార లావాదేవీలు, కుటుంబ వ్యవహారాలతో బిజీగా గడిపేస్తున్న హైదరాబాద నగర ప్రజలు వారాంతంలో మాత్రం ఏదైనా కొత్తగా ట్రై చేద్దామనే ఆలోచన చేస్తున్నారు. ఇటువంటి వారిని ఆకట్టుకోవడానికి వివిధ సంస్థల ఆధ్వర్యంలో మట్టి పాత్రల తయారీ, పెయింటింగ్స్, బేకింగ్, క్యాండిల్ తయారీ, రెసిన్ ఆర్ట్ తదితర రంగాల్లో వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి కొంత సమయం కేటాయిస్తున్నారు. ప్రవేశ రుసుముగా కొంత నామమాత్రపు ఫీజు సైతం వసూలు చేస్తారు. కొన్ని చోట్ల నిర్వాహకులే వస్తువుల తయారీకి అవసరమైన ముడి సరుకులు అందిస్తుండగా, మరికొన్ని సందర్భాల్లో మనమే తీసుకెళ్లాల్సి ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం వరకు ఈ వర్క్‌షాప్‌లు నడుస్తాయి. మట్టి పాత్రల తయారీమట్టి పాతల్ర తయారీపై హైదరాబాద్ నగరంలో పెద్దఎత్తున ఆదివారం వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి గచ్చిబౌలి హార్ట్‌కప్ కాఫీ, లాస్ట్ హౌస్ కాఫీ, హౌస్ ఆఫ్ గౌర్మెట్, తదతర ప్రాంతాల్లో లైవ్ వర్క్‌షాప్‌లు ప్రారంభమవుతాయి. మట్టితో మమేకం కావడం, ప్రకృతితో కలిసిపోవడం, ప్రశాంమైన వాతావరణంలో మట్టితో పాత్రలు తయారు చేయడం అనేది ప్రత్యేక అనుభూతినిస్తుందని నిర్వాహకులు పేర్కొంటున్నారు. ఒక్కో వ్యక్తికి గంట నుంచి 3 గంటల పాటు పాత్రలు తయారు చేయడానికి అవకాశం కల్పిస్తారు. తయారు చేసిన కుండలు, ఇతర పాత్రలు ఏవైనా మన వెంట తీసుకెళ్లిపోవచ్చు. ఇవి తీపి జ్ఞాపకాలుగా గుర్తుంటాయి. మట్టి, యంత్రాలు, అన్నీ నిర్వాహకులే సమకూర్చుతారు.కొవ్వొత్తుల తయారీలో శిక్షణజూబ్లీహిల్స్లోని మకావు కిచెన్ అండ్ బార్లో హేండ్ మేడ్ కొవ్వుత్తుల తయారీపై వర్క్‌షాప్ నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. మనకు నచి్చన డిజైన్, మోడల్స్‌లో కొవ్వుత్తులు తయారు చేసుకోవచ్చు. మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు వర్క్‌షాప్ ఉంటుంది. రెసిన్ ఆర్ట్రంగులు కలపడం, కొత్త డిజైన్లకు అంకురార్పన చేయడం, ఆర్ట్‌తో ప్రశాంతమైన వాతావరణాన్ని క్రియేట్ చేయడం, అద్భుతమైన, మెస్మరైజింగ్ రెసిన్ ఆర్ట్ వర్క్‌షాప్‌ను మాకోబ్రూ వరల్డ్ కాఫీ బార్, అమోరోసో హైదరాబాద్‌లలో ఏర్పాటు చేస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రెండు గంటల పాలు కొనసాగుతుంది. 8 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే ప్రవేశం ఉంటుంది. కేక్ తయారీపై.. నార్సింగిలోని మైథూస్ బ్రేవ్ పబ్ అండ్ కిచెన్ ఆధ్వర్యంలో కేక్ తయారీపై ఒక్కరోజు వర్క్‌షాప్ నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభమవుతుంది. తయారీ విధానంలో మెలుకువల నేర్చుకోవచ్చు. తదుపరిఇంటోనే కొత్త రుచులను పర్ఫెక్ట్గా సిద్ధంచేసుకునే కాని్ఫడెన్స్ లెవల్స్ పెరుగుతాయి. (చదవండి:

నైనై తుర్కియే..! కేవలం రెండు రోజుల్లోనే..
భారత్–పాకిస్తాన్ యుద్ధంలో పాకిస్తాన్‌కు మద్దతుగా నిలిచిన తుర్కియే, అజర్ బైజాన్లపై సర్వత్రా ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్‌తో సహా తెలుగు రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు టూర్లను రద్దు చేసుకున్నారు. ఈ రెండు రోజుల్లోనే భారీ ఎత్తున బుకింగ్స్ రద్దయినట్లు నగరానికి చెందిన టూర్ ఆపరేటర్లు, ట్రావెల్స్ సంస్థల నిర్వాహకులు తెలిపారు. వేసవి సెలవుల సందర్భంగా ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలోనే పర్యాటకులు తరలివెళ్తారు. ఈ సంవత్సరం కూడా సుమారు లక్ష మందికి పైగా పర్యాటకులు తుర్కియే, అజర్బైజాన్ల సందర్శనకు ప్రణాళికలను సిద్ధం చేసుకున్నట్లు అంచనా. తుర్కియే, అజర్బైజాన్ దేశాల్లో అందమైన పర్యాటక ప్రదేశాలు, ఆహ్లాదకరమైన వాతావరణం ఉండటం వల్ల చాలామంది కుటుంబాలతో సహా టూర్లకు వెళ్తుంటారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని స్వచ్ఛందంగానే ఈ రెండు దేశాల పర్యటనలను రద్దు చేసుకోవడం విశేషం. మరోవైపు ట్రావెల్ ఏజెన్సీస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సైతం తుర్కియే, అజర్బైజాన్ల బుకింగ్‌లను రద్దు చేయాలని అన్ని ప్రాంతాలకు చెందిన టూర్ ఆపరేటర్లకు సర్క్యూలర్‌ను విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన టూర్ ఆపరేటర్లు తమ వద్దకు వచ్చే బుకింగ్‌లను నిలిపివేస్తున్నట్లు నగరానికి చెందిన వాల్మీకి టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ వ్యవస్థాపకుడు హరికిషన్ తెలిపారు. రెండు, మూడు రోజులుగా నగరం నుంచి సుమారు 10 వేల మందికిపైగా పర్యాటకులు తమ టూర్లను రద్దు చేసుకున్నట్లు తెలిపారు. ఆ రెండు దేశాలకే ఎందుకు.. సాధారణంగా హైదరాబాద్ నుంచి ఎక్కువ మంది దుబాయ్, సింగపూర్, మలేíÙయా, శ్రీలంక, థాయ్‌లాండ్ పర్యటనలను ఎంపిక చేసుకుంటారు. కానీ కొంతకాలంగా తుర్కియే, అజర్‌బైజాన్‌లకు డిమాండ్ పెరిగింది. ఇక్కడ చారిత్రక ప్రదేశాలు, వైల్డ్ లైఫ్ టూర్లు, సాంస్కృతిక కేంద్రాలు, ఆకట్టుకొనే అందమైన పార్కులు ఉన్నాయి. తుర్కియేలో కేవలం సినిమా షూటింగ్లకే కాకుండా ప్రీ వెడ్డింగ్ షూట్లకు ఎన్నో అందమైన ప్రదేశాలు ఉన్నాయి. అలాగే చారిత్రక ఇస్తాంబుల్ నగరం పర్యాటకులకు ఒక గొప్ప అనుభూతి కలిగిస్తుంది. ఇక్కడ ఉన్న బ్లూ రివర్ ఒక ప్రత్యేకమైన ఆకర్షణ. హగీష్ సోఫియా చారిత్రక మ్యూజియం కూడా పర్యాటకులను ఎంతో ఆకట్టుకుంటుంది. పురాతన కట్టడాలు, కోటలు, గొప్ప ఆర్కిటెక్చర్‌తో నిర్మించిన భవనాలు ఎన్నో ఉన్నాయి. అలాగే అజర్‌బైజాన్‌లోని పాతనగరం బాకు మరో ప్రముఖ పర్యాటక కేంద్రం. వందల సంవత్సరాల నాటి చారిత్రక, సాంస్కృతిక విశేషాలకు ఇది నిలయం. హైదర్ అలియేవ్ కల్చరల్ సెంటర్, జొరాస్ట్రియన్ల చారిత్రక ఫైర్ టెంపుల్ వంటివి ఆకట్టుకొనే ప్రదేశాలు.షాపింగ్ సెంటర్.. మినీ చైనాగా పేరొందిన తుర్కియో నుంచి పెద్ద ఎత్తున వ్యాపార కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. మార్బుల్స్, ఫర్నీచర్, యాపిల్స్ దిగుమతి ఎక్కువగా ఉంది. అలాగే ఈ దేశానికి వెళ్లిన పర్యాటకులు కూడా తమకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేసేందుకు చాలా షాపింగ్ సెంటర్లు ఉన్నాయి. ఇస్తాంబుల్‌లోని గ్రాండ్ బజార్ అతి పెద్ద స్ట్రీట్ మార్కెట్. సుమారు 4 వేలకుపైగా షాపింగ్ మాల్స్ ఇక్కడ ఉన్నాయి. దేశ, విదేశాలకు చెందిన వివిధ రకాల వస్తువులు ఇక్కడ లభిస్తాయి. దుస్తులు, ఆభరణాలు, టర్కి, పర్షియన్ సంస్కృతిని ప్రతిబింబించే కళాత్మక వస్తువులు, కార్పెట్లు, డ్రైఫ్రూట్స్ లభిస్తాయి. అలాగే అంకారాలోని అంకామాల్, కెనెరాలోని ఆస్కార్బజార్ వంటి మార్కెట్లు, షాపింగ్ సెంటర్లు పర్యాటకులను ఆకట్టుకుంటాయి.ఉందిగా.. ప్రత్యామ్నాయం.. తుర్కియే, అజర్బైజాన్ టూర్లను స్వచ్ఛందంగా రద్దు చేసుకుంటున్న పర్యాటకులు ప్రత్యామ్నాయంగా వియత్నాం, దుబాయ్, మలేసియా, బ్యాంకాక్, ఇండోనేషియా తదితర దేశాలను సందర్శించేందుకు వెళ్తున్నారు. ‘ఆ రెండు దేశాల బుకింగ్స్ రద్దు చేసుకుంటున్న వారు ఎక్కువ మంది వియత్నాంను ఎంపిక చేసుకుంటున్నారు.’ కూకట్‌పల్లికి చెందిన ఓ ట్రావెల్స్ సంస్థ ప్రతినిధి తెలిపారు. (చదవండి: ముక్కడలి తీరం..! తొమ్మిది రోజుల దివ్యమైన యాత్ర)

ప్లీజ్..నో సప్లిమెంట్స్..!
మీకు విటమిన్ ఇ లోపం ఉంది.. మీకు ప్రోటీన్స్ సరిపోవడం లేదు.. ఈ సప్లిమెంట్స్ తీసుకోండి.. అంటూ సూచించే వైద్యులు, పోషకాహార నిపుణులతో పాటు వాటిని వినియోగించే నగరవాసులూ పెరిగిపోయారు. ఈ నేపథ్యంలో సప్లిమెంట్స్‌ను అతిగా వినియోగించవద్దని హైదరాబాద్ నగరానికి చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్(ఎన్ఐఎన్) ఇటీవల నిర్వహించిన ఓ పరిశోధన ఫలితం ఆధారంగా సూచిస్తోంది. అధిక సప్లిమెంట్స్ వాడకం హానికరం అంటున్న ఎన్ఐఎన్.. దానికి ప్రత్యామ్నాయ మార్గాలను కూడా సూచిస్తోంది. బలవర్థకమైన ఆహారాల నుంచి దొరకని పోషకాలను సప్లిమెంట్లు/మాత్రలు/క్యాప్సూల్స్ అందిస్తాయి అనేది నిజమే అయినా కొన్ని పోషకాలను సప్లిమెంట్లుగా తీసుకోవడం వల్ల ఇతర పోషకాల సహజ శోషణకు ఆటంకం కలుగుతుందని ఎన్ఐఎన్ హెచ్చరిస్తోంది. రోజువారీ పోషకాహార అవసరాలను తీర్చడానికి సప్లిమెంట్లపై అధికంగా ఆధారపడటం ఆరోగ్యానికి హానికరం అని స్పష్టం చేస్తోంది. తాము సూచించిన ‘మై ప్లేట్ ఫర్ ది డే’లో సూచించిన సమతుల ఆహారం ద్వారా అందేవి మరే ఏ విటమిన్ లేదా మినరల్ సప్లిమెంట్లు అందించలేవని స్పష్టం చేస్తోంది. ’మై ప్లేట్ ఫర్ ది డే’ మన రోజువారీ అవసరాలకు అనుగుణంగా అన్ని పోషకాలు మన శరీరానికి అందేందుకు మై ప్లేట్ ఫర్ ది డే అనే ఆసక్తికరమైన మెనూను ఎన్ఐఎన్ రూపొందించింది. ఇది మన ఆహారంలో అవసరమైన పోషకాహార స్పష్టతను అందిస్తుంది. రోజువారీ ఆహారం కోసం వివిధ ఆహార సమూహాల ఖచ్చితమైన నిష్పత్తులను అర్థం చేసుకోవడానికి ఇది మార్గనిర్దేశం చేస్తుంది. ఆరోగ్యకరమైన ఆహార పద్ధతులను ప్రోత్సహించడానికి ‘భారతీయుల పోషక అవసరాలు’ ఆధారంగా దీన్ని డిజైన్ చేశారు. రోజుకు 2వేల కేలరీలు.. అదే ఆరోగ్యానికి మేలు వ్యక్తులు(చిన్నారులు, వృద్ధులు, దీర్ఘకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కాకుండా) తమ పోషక అవసరాలను తీర్చుకునేందుకు రోజుకి 2 వేల కిలో కేలరీలు/ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుందని ‘మై ప్లేట్ ఫర్ ది డే’ చెబుతోంది. అయితే ఇది కేవలం కేలరీలు అందించే ఆహారం మాత్రమే కాకూడదని, దీనిలో శరీరానికి అవసరమైన అమైనో ఆమ్లాలు, కొవ్వు ఆమ్లాలు, ఖనిజాలు, ప్రొటీన్లు, విటమిన్లు ఇతర బయోయాక్టివ్ సమ్మేళనాలు.. ఇలా ఆరోగ్యపరమైన అవసరాలను తీర్చడానికి సరైన నిష్పత్తిలో ఉండాలని సూచిస్తోంది. రోజుకి 2వేల కిలో కేలరీల ఆహారం కోసం.. కూరగాయలు ఆకు కూరలు: 400 గ్రాములు(ముడి బరువు), మిల్లెట్లతో సహా తృణధాన్యాలు: 260 గ్రాములు, పండ్లు: 100 గ్రాములు, పప్పులు/గుడ్లు/మాంసపు ఆహారాలు: 85 గ్రాములు, గింజలు విత్తనాలు: 30 గ్రాములు, కొవ్వులు నూనె: 27 గ్రాములు, పాలు/పెరుగు: 300 మి.లీ.శోషించే ఆహారమే.. మేలు ఆరోగ్యకరమైన సహజ ఆహారాలను శరీరం బాగా గ్రహిస్తుంది. అంతేకాకుండా అవి ఎక్కువ జీవ లభ్యతను కలిగి ఉంటాయి. విటమిన్లు ఖనిజాల తీవ్రమైన కొరతతో బాధపడుతున్న వ్యక్తుల కోసం, అన్ని సూక్ష్మపోషకాలు, బయోయాక్టివ్ సమ్మేళనాలు, ఫంక్షనల్ ఫుడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు మొదలైన వాటిని తగినంతగా తీసుకోవడం మంచిదని ఎన్ఐఎన్ సూచిస్తోంది. ఈ నేపథ్యంలో అన్ని పోషకాలతో కూడిన ‘మై ప్లేట్ ఫర్ ది డే’ ఎలా ఉండాలో డిజైన్ చేసి అందిస్తోంది. స్నాక్స్.. ఆరోగ్యకరంగా.. అవసరమైన కేలరీలకు మించకుండా స్నాక్స్ తినడం వల్ల నష్టం లేదు. కొన్ని రకాల స్నాక్స్ బరువు తగ్గడానికి సహకరిస్తుంది అంటున్నారు పోషకాహార నిపుణులు డాక్టర్ రోహిణి పాటిల్. స్నాక్స్‌గా ఆయన గుప్పెడు కాలిఫోరి్నయా ఆల్మండ్స్ సూచిస్తున్నారు. ఈ బాదంలో ప్రోటీన్, మెగ్నీషియం, విటమిన్ ఇ జింక్ వంటి 15 ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. గుండె ఆరోగ్యం, చర్మ ఆరోగ్యం, బరువు నిర్వహణకు ఇవి బెస్ట్, అలాగే నూనె లేకుండా వండిన మూంగ్ దాల్ చిల్లా బరువు తగ్గడానికి అనుకూలమైనమరొక చిరుతిండి. మూంగ్ దాల్(పెసర పప్పు)లో పొటాషీయం, మెగ్నీషియం, ఇనుము, రాగి పుష్కలంగా ఉంటాయి. జీర్ణక్రియ, గుండె ఆరోగ్యం రెండింటికీ మంచిది. పెసర శనగల మొలకలతో తయారైన భేల్లో రుచికరమైన స్నాక్. దోసకాయ, టమోటాలు, పచ్చి మామిడి, నిమ్మరసంతో కలిపిన మొలకలు, భేల్ ఫైబర్, విటమిన్లు, ఖనిజాలను అందిస్తుంది. (చదవండి: చాయ్ చమక్కులు..! ఏమి'టీ' వింతలు!)

టేస్టీ టేస్టీ..రొయ్యల పాప్‌కార్న్, మ్యాంగో కేక్ చేద్దాం ఇలా..!
రొయ్యల పాప్కార్న్కావలసినవి: రొయ్యలు– 25 పైనే (మరీ చిన్నవి కాకుండా, నచ్చిన సైజ్ ఎంచుకోవచ్చు. తల, తోక తీసి, శుభ్రం చేసుకోవాలి)అల్లం–వెల్లుల్లి పేస్ట్– 2 టేబుల్ స్పూన్లుకారం– ఒక టీ స్పూన్ గరం మసాలా– ఒక టేబుల్ స్పూన్+ఒక టీ స్పూన్నిమ్మరసం– ఒక చెక్కమైదా, జీలకర్ర పొడి– ఒక టేబుల్ స్పూన్ చొప్పునబ్రెడ్ పౌడర్– పావు కప్పుపైనేగుడ్డు– 2 (2 టేబుల్ స్పూన్ల చిక్కటి పాలు కలుపుకుని పక్కనపెట్టుకోవాలి)ఉప్పు– తగినంతనూనె– డీప్ ఫ్రైకి సరిపడాతయారీ: ముందుగా రొయ్యలు ఒక గిన్నెలో తీసుకుని, అందులో అల్లం–వెల్లుల్లి పేస్ట్, కారం, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, తగినంత ఉప్పు, ఒక టీ స్పూన్ నూనె, నిమ్మరసం వేసి, ఆ మిశ్రమం రొయ్యలకు బాగా పట్టించి 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. అనంతరం ఒక చిన్న బౌల్లో బ్రెడ్ పౌడర్, జీలకర్ర పొడి, ఒక టీ స్పూన్ గరం మసాలా, మైదా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేడి చేసుకుని, ఒక్కో రొయ్యను మొదట గుడ్డు–పాల మిశ్రమంలో ముంచి, ఆపై బ్రెడ్ పౌడర్ పట్టించి నూనెలో దోరగా వేయించుకుంటే సరిపోతుంది.ట్రినిడాడ్ అండ్ టొబాగో మ్యాంగో కేక్కావలసినవి: గోధుమ పిండి– ఒకటిన్నర కప్పులుబేకింగ్ పౌడర్– ఒక టీ స్పూన్బేకింగ్ సోడా– అర టీ స్పూన్ఉప్పు– చిటికెడు గడ్డ పెరుగు– ఒక కప్పుపంచదార– ముప్పావు కప్పుపాలు, నూనె– అర కప్పు చొప్పునవెనీలా ఎసెన్స్– అర టీ స్పూన్మామిడి పండ్లు– 2 (బాగా పండి, తియ్యగా ఉండాలి, చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)నీళ్లు– కొద్దిగానిమ్మరసం– ఒక టేబుల్ స్పూన్మీగడ– అర కప్పువైట్ చాక్లెట్– 200 గ్రాములు (మార్కెట్లో దొరుకుతుంది)మ్యాంగో ఐస్‌క్రీమ్– పావు కప్పు పైనేతయారీ: ముందుగా ఒక పాత్రలో గోధుమ పిండి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఉప్పు వేసుకుని బాగా కలిపి, జల్లెడ పట్టుకోవాలి. ఈలోపు మరో గిన్నెలో పెరుగు, పంచదార వేసి బాగా కలపాలి. అనంతరం అందులో నూనె, వెనీలా ఎసెన్స్ వేసి మరోసారి కలపాలి. కావాలంటే కొద్దిగా నీళ్లు కలుపుకోవచ్చు. ఇప్పుడు గోధుమ మిశ్రమాన్ని, పెరుగు మిశ్రమాన్ని ఒక బౌల్లోకి వేసుకుని ఉండలు లేకుండా బాగా కలిపి, నెయ్యి పూసిన వెడల్పాటి పాత్రలో వేసుకుని, రెండు అంగుళాల మందంలో, సమానంగా ఉండేలా చూసుకోవాలి. దాన్ని ఓవెన్లో పెట్టుకుని, బేక్ చేసుకుని, చల్లారాక, çముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మామిడికాయ ముక్కలను మిక్సీలో వేసుకుని, వాటిలో నిమ్మరసం, కొద్దిగా నీళ్లు పోసుకుని జ్యూస్‌లా చేసుకోవాలి. ఆ జ్యూస్‌ని వడకట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మీగడను కరిగించి, దానిలో కరిగించిన వైట్ చాక్లెట్‌ను కలపాలి. దానిలో మామిడిపండు గుజ్జు వేసుకుని, క్రీమ్‌లా అయ్యే వరకూ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక కేక్ ముక్క తీసుకుని, దానిపై పెరుగు మిశ్రమాన్ని అర అంగుళం మందంలో పూసుకుని, దానిపైన కొద్దిగా ఐస్‌క్రీమ్ పావు అంగుళం మందంలో పరుచుకోవాలి. మరో కేక్ ముక్కను దానిపై పెట్టుకోవాలి. ఇదే మాదిరి అన్ని ముక్కలు పెట్టుకుని.. వాటిపై మరోసారి పెరుగు మిశ్రమం, ఐస్‌క్రీమ్‌తో నచ్చినవిధంగా గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి.అసోమీయా తిల్ పిఠాకావలసినవి: బియ్యం– ఒక కప్పుబెల్లం తురుము, నల్ల నువ్వులు– అర కప్పు చొప్పుననీళ్లు, నూనె, ఉప్పు– సరిపడాతయారీ: ముందుగా బియ్యాన్ని 3 లేదా 4 గంటలు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత నీళ్లు తీసేసి, ఒక గంట పాటు బియ్యాన్ని ఆరబెట్టుకోవాలి. ఆరిన బియ్యాన్ని మిక్సీలో మెత్తని పిండిలా చేసుకుని జల్లెడ పట్టుకోవాలి. ఈలోపు నల్ల నువ్వులను దోరగా వేయించి, కచ్చాబిచ్చా మిక్సీ పట్టుకోవాలి. అనంతరం ఆ నువ్వుల మిశ్రమాన్ని బెల్లం తురుములో వేసుకుని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత బియ్యప్పిండిలో సరిపడా ఉప్పు వేసుకుని, కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుని ఉండలు లేకుండా దోసెల పిండిలా కలుపుకోవాలి. ఆపై పాన్ మీద కొద్దికొద్దిగా నూనె వేడి చేసుకుని, చిన్న చిన్న అట్లు వేసుకోవాలి. అట్టు కొద్దిగా ఉడుకుతుండగా, మధ్యలో నువ్వులు–బెల్లం మిశ్రమాన్ని ఉంచి నచ్చిన విధంగా రోల్ చేసుకోవచ్చు. వీటిని వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి.
ఫొటోలు
అంతర్జాతీయం

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం.. యువతితో మస్క్‌పై పుతిన్ కుట్ర?
వాషింగ్టన్: సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంపై పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. యుద్ధం ప్రారంభంలో రహస్యాల్ని తెలుసుకునేందుకు అపర కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon musk)పై రష్యా యువతితో వలపు వల విసిరినట్లు మాజీ ఎఫ్‌బీఐ కౌంటర్ ఇంటెలిజెన్స్ స్పెషల్ ఏజెంట్ జోనాథన్ బౌమా సంచలన వ్యాఖ్యలు చేశారు.జర్మన్ బ్రాడ్‌కాస్టర్ జెడ్‌డీఎఫ్ తీసిన డాక్యుమెంటరీలో జోనాథ్ బౌమా మాట్లాడారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ యుద్ధానికి సంబంధించిన రహస్య సమాచారాన్ని సేకరించేందుకు ప్రయత్నించారు. ఇందులో భాగంగా రష్యా ఇంటెలిజెన్స్ సాయంతో ఎలాన్ మస్క్, పేపాల్ సహ వ్యవస్థాపకుడు పీటర్ థీల్‌పై ఓ యువతి ప్రయోగించారు. మస్క్‌కు ఉన్న జూదం,మత్తు పదార్ధాల వినియోగంలాంటి వీక్నెస్ను అడ్డం పెట్టుకుని యుద్ధం సమాచారం సేకరించే ప్రయత్నం చేసినట్లు వెల్లడించారు. పుతిన్‌కు ఆపరేషన్ గురించి తెలుసా?ఇక మస్క్, పీటర్ థీల్‌పై జరిగిన ఈ సీక్రెట్ ఆపరేషన్ పుతిన్ కనుసన్నల్లోనే జరిగింది. పుతిన్ అనుమతి లేకుండా స్పై చేయరు కదా? అని జోనాథన్ బౌమా అన్నారు. అయితే, రష్యా జరిపిన సీక్రెట్ ఆపరేషన్‌లో మస్క్, పీటర్ థీల్ చిక్కుకున్నారా? లేదా? అనే విషయాల్ని వెల్లడించేందుకు జోనాథన్ బౌమా విముఖత వ్యక్తం చేశారు.కాగా, ఎఫ్‌బీఐలో 16 ఏళ్లు పని చేసిన జోనాథ్ బౌమా ఓ మీడియా సంస్థకు రహస్య సమాచారాన్ని అందించారు. దీంతో అమెరికా ప్రభుత్వం జోనాథ్ బౌమాను అరెస్ట్ చేసింది. చివరకు లక్షడాలర్ల పూచికత్తుతో బెయిల్‌పై విడుదలయ్యారు.

మరో సౌరవ్యవస్థలో గడ్డ కట్టిన నీరు
వాషింగ్టన్: జీవుల మనుగడకు ప్రాణాధారమైన నీరు అంతరిక్షంలో మరెక్కడుందోననే ప్రశ్నకు సమాధానం వెతికినట్లు ప్రఖ్యాత జేమ్స్ వెబ్ అంతరిక్ష టెలిస్కోప్ తాజాగా ప్రకటించింది. మన సౌరమండలం తరహాలోనే ఇతర నక్షత్ర వ్యవస్థల్లో గడ్డ కట్టిన స్థితిలో నీరు ఉంటుందనే వాదనకు బలం చేకూరుస్తూ నాసా వారి జేమ్స్ వెబ్ టెలిస్కోప్ పలు సాక్ష్యాధారాలను సంపాదించింది. ఒక యువ నక్షత్ర మండలంలో గడ్డకట్టిన నీటి జాడలను కనిపెట్టినట్లు నాసా తాజాగా ప్రకటించింది. నక్షత్రం చుట్టూ తిరుగుతున్న దుమ్ము ధూళితో కూడిన అంతరిక్ష శిలలు, శకలాలు, శిథిలాల వలయాల్లో నీరు గడ్డకట్టి ఉందని నాసా వెల్లడించింది. మన సౌరవ్యవస్థ వయసుతో పోలిస్తే తక్కువ వయసున్న ఈ కొత్త నక్షత్ర మండలం ‘హెచ్డీ 181327’మన భూమికి 155 కాంతి సంవత్సరాల దూరంలో ఉందని నాసా తెలిపింది.వెబ్ టెలిస్కోప్ పంపిన ‘స్పె్రక్టా’డేటాలో ఇందుకు సంబంధించిన వివరాలు ఉన్నాయి. విశాల అంతరిక్షంలో ఎక్కడో ఓ చోట నీరు నిక్షిప్తమై ఉంటుందని నాసా వారి స్పిట్జర్ స్పేస్ టెలిస్కోప్ 2008లోనే కొంత డేటాను పంపించింది. ఆ తర్వాత జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఇలా నీటిజాడలను వెతికిపట్టడం ఇదే తొలిసారి. ‘‘కేవలం నీటిని మాత్రమేకాదు మరీముఖ్యంగా స్ఫటికాకృతిలో ఉండే గడ్డ కట్టిన నీటి జాడను వెబ్ టెలిస్కోప్ కనుగొంది. ఈ ధూళి వలయాల్లోని ప్రతి దుమ్ము కణంతో నీటి అణువులు కలిసిపోయి ఉన్నాయి. ఈ అణువులను సమీప–పరారుణ స్పెక్ట్రోగ్రాఫ్ ఉపకరణంతో చూసినప్పుడు ఇవన్నీ మంచు బంతుల్లా కనిపించాయి. గతంలో ఇలాంటి క్రిస్టల్ ఐస్‌ను మన సౌరవ్యవస్థలో శనిగ్రహ వలయాల్లో, క్యూపర్ బెల్ట్‌లో చూశాం’’అని ఈ పరిశోధనా పత్రం ముఖ్య రచయిత చెన్ గ్జీ చెప్పారు. చెన్ గ్జీ.. మేరిలాండ్‌లోని జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ(బాలీ్టమోర్)లో అసిస్టెంట్ రీసెర్చ్ సైంటిస్ట్‌గా సేవలందిస్తున్నారు. సంబంధిత వివరాలు ‘నేచర్’జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. నీరే కీలకం అంతరిక్షంలో నక్షత్రాల చుట్టూతా గ్రహ వ్యవస్థ పురుడుపోసుకోవడానికి నీరే ప్రధాన కారణం. యువ నక్షత్రాల చుట్టూతా పరుచుకున్న దుమ్ము, ధూళి వలయాల్లో ప్రధాన ముడి సరకు నీరే. ఒక రకంగా పట్టిఉంచే నీరు సైతం ధూళి, దుమ్మ గట్టిపడి గ్రహాల ఆవిర్భావానికి దారితీస్తుంది. తక్కువ గురుత్వాకర్షణ సందర్భాల్లో తోకచుక్కలు, గ్రహశకలాల వంటివి ఏర్పడతాయి. ఒకవేళ బలాలు బలపడితే ఇవన్నీ కలగలిసిపోయి పెద్ద గ్రహాలుగా రూపాంతరం చెందుతాయి. మన భూమి సైతం తొలినాళ్లలో ఇలాగే ఏర్పడింది. తాజాగా వెబ్ టెలిస్కోప్ సేకరించిన సమాచారంతో ఇతర ఖగోళ అధ్యయనకారులు సైతం నూతన నక్షత్రవ్యవస్థల్లో కొత్త గ్రహాలు ఎలా ఏర్పడతాయి వంటి అంశాలపై మరింత శోధన చేసేందుకు అవకాశం లభించనుందని మరో రచయిత క్రిస్టీన్ చెన్ చెప్పారు. ఈ ‘హెచ్డీ 181327’నక్షత్ర వ్యవస్థ కేవలం 2.3 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడింది. మన సూర్యుడు ఏకంగా 460 కోట్ల సంవత్సరాల క్రితం ఆవిర్భవించాడు. వయసులో చిన్నదైనా సరే ఈ యువ నక్షత్రం మన సూరీడి కంటే బరువు ఎక్కువగా ఉంది. వేడి కూడా మరింత ఎక్కువగా ఉన్నట్లు తేలింది.

భారత్–పాక్ మధ్య అణు యుద్ధం ఆపేశా..
వాషింగ్టన్: భారత్–పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ కోసం తానే చొరవ తీసుకున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి చెప్పుకొచ్చారు. ఆ క్రెడిట్ తనకే దక్కాలని పేర్కొన్నారు. ఆ రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ అమల్లోకి వచ్చి, ఉద్రిక్తతలు ఆగిపోవడం ఇప్పటిదాకా తాను సాధించిన అతిపెద్ద విజయాల్లో ఒకటి అని వ్యాఖ్యానించారు. ఆయన శుక్రవారం ఫాక్స్ న్యూస్ సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. తన జోక్యం వల్లే పాకిస్తాన్‌పై ఇండియా సైనిక చర్య నిలిచిపోయిందని వెల్లడించారు. ఇరు దేశాల మధ్య అణుయుద్ధాన్ని నివారించానని తెలిపారు. రెండు బలమైన దేశాలైన భారత్–పాక్ మధ్య మొదలైన ఘర్షణలు అతి తక్కువ సమయంలోనే అణుయుద్ధానికి దారితీసే పరిస్థితి ఏర్పడిందని, తాను కల్పించుకోవడంతో అది ఆగిపోయిందని వివరించారు. అయితే, పాకిస్తాన్‌తో కాల్పుల విరమణ వెనుక ట్రంప్ ప్రమేయం ఎంతమాత్రం లేదని భారత్ ఇప్పటికే తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. మూడో పక్షం జోక్యాన్ని తాము అంగీకరించే ప్రసక్తే లేదని భారత్ వెల్లడించింది. అయినప్పటికీ ట్రంప్ తన నోటి దురుసు తగ్గించుకోకపోవడం గమనార్హం. భారత్ కుండబద్దలు కొట్టినట్లు చెప్పినప్పటికీ ఈ అంశాన్ని పదేపదే ప్రస్తావించడం ద్వారా ఆయన ఏం సాధించదల్చుకున్నారో అర్థం కావడం లేదని నిపుణులు అంటున్నారు. టారిఫ్‌ల రద్దుకు ఇండియా సంసిద్ధత భారత్, పాక్ నడుమ ఉద్రిక్తతలు నివారించి, శాంతిని నెలకొల్పడానికి వాణిజ్యాన్ని ఆయుధంగా వాడుకున్నానని డొనాల్డ్ ట్రంప్ తెలియజేశారు. అమెరికా ఉత్పత్తులపై టారిఫ్‌లను 100 శాతం రద్దు చేయడానికి ఇండియా సంసిద్ధత వ్యక్తం చేసిందని పునరుద్ఘాటించారు. అమెరికా–ఇండియా మధ్య వాణిజ్య ఒప్పందం త్వరలోనే కుదరడం ఖాయమని తెలిపారు. అయితే, ఈ ఒప్పందం కోసం తాను తొందరపడడంలేదన్నారు. తమతో వాణిజ్య ఒప్పందం చేసుకోవాలని ఇప్పుడు ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని చెప్పారు. ఇప్పటిదాకా 150 దేశాలు ఇలాంటి ఒప్పందం కోసం ముందుకొచ్చాయన్నారు. ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు విధిస్తున్న దేశం ఇండియా అంటూ ట్రంప్ మరోసారి విమర్శించారు. వ్యాపారాలు చేయడం అసాధ్యం అనే పరిస్థితులు ఇండియాలో సృష్టించారని తప్పుపట్టారు. కానీ, అమెరికా ఉత్పత్తులపై టారిఫ్‌లు పూర్తిగా రద్దు చేయడానికి ఇండియా సుముఖంగా ఉందని వివరించారు. కేవలం అమెరికా కోసం ఇండియా ఈ మేలు చేయడానికి సిద్ధపడిందని అన్నారు.

ట్రంప్ ‘బిగ్‌బాస్’ షో!
వాషింగ్టన్: రిపబ్లికన్ పార్టీ అగ్రనేత డొనాల్డ్ ట్రంప్ ఏంచేసినా వినూత్నమే. వివాదాస్పదమే. అదే పరంపరను కొనసాగిస్తూ ట్రంప్ సొంతంగా సరికొత్త రియాలిటీ షోకు తెరలేపనున్నారన్న వార్త ఇప్పుడు అగ్రరాజ్యంలో చక్కర్లు కొడుతోంది. బిగ్‌బాస్ రియాలిటీ షో తరహాలో ఇందులో పాల్గొనేవారంతా భిన్న రకాలైన పనులు(టాస్క్ లు) పూర్తిచేయాల్సి ఉంటుంది. అయితే ఇందులో ప్రధానంగా అమెరికా జాతీయత కోణం దాగి ఉంది. మరీ ముఖ్యంగా ఇప్పటికే అనధికారికంగా అమెరికాకు పోటెత్తిన వలసదారులను మాత్రమే ఈ రియాలిటీ షోలో అభ్యర్థులుగా స్వీకరిస్తారు. గెలిచిన వారికి అమెరికా పౌరసత్వాన్ని కట్టబెడతారు. స్వదేశంలో అంతర్యుద్ధం, ప్రకృతి వైపరీత్యాలు వంటి అసాధారణ, అనివార్య పరిస్థితుల్లో కొందరు వలసదారులు తిరిగి స్వదేశానికి వెళ్లలేని పరిస్థితి ఉంది. అలాంటి వారిని ఎంపిక చేసి అమెరికా పౌరసత్వం ఇచ్చే అవకాశం ఉంది. ఈ ఎంపికకు రియాలిటీ షో మార్గాన్ని ట్రంప్ ప్రభుత్వం ఎంచుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రియాలిటీ షో వివరాలు ఇంకా బహిర్గత కాలేదు. ఇది ఇంకా అమెరికా ప్రభుత్వ వర్గాల వద్ద ప్రతిపాదన దశలోనే ఉందని తెలుస్తోంది. అన్ని రకాల అనుమతులు దాటుకుని ఈ రియాలిటీ షో వాస్తవరూపం దాల్చితే ఈ షోకు అనూహ్య ఆదరణ లభించడం ఖాయమని భావిస్తున్నారు. ఈ షోలో గెలిచిన విజేతకు మాత్రమే అమెరికా పౌరసత్వం బేషరతుగా ఇవ్వాలని ట్రంప్ ప్రభుత్వం యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఎవరిదీ ఆలోచన? కెనడియన్–అమెరికన్ నిర్మాత రాబ్ వార్సాఫ్ ఈ ప్రతిపాదన తెచ్చారు. రియాలిటీ షో నియమ నిబంధనలతో సమగ్రంగా 35 పేజీల్లో ఒక రిపోర్ట్‌ను తయారుచేసి అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ(డీహెచ్ఎస్) విభాగానికి సమరి్పంచారు. రాబ్ వార్సాఫ్ గతంలో సృష్టించిన ‘డక్ డినాస్టీ’, ‘ది మిలియనీర్ మ్యాచ్‌మేకర్’రియాలిటీ షోలు విజయవంతమైంది. ‘‘రాబ్ చేసిన ప్రతిపాదనను పరిశీలిస్తున్నాం. నిజంగా ఇదొక మంచి ఆలోచన. హక్కులతోపాటు అమెరికన్లలో దేశభక్తి, పౌరవిధులను మరోసారి స్పష్టంగా స్మరణకు తెచ్చేలా షో ఉంటే బాగుంటుంది’’అని హోంల్యాండ్ సెక్యూరిటీలో ప్రజాసంబంధాల మహిళా అసిస్టెంట్ సెక్రటరీ ట్రీసియా మెక్‌లానిన్ అన్నారు. ఈ ప్రతిపాదన ఇంకా పరిశీలన దశలోనే ఉందన్నారు. ఈ ప్రతిపాదన ప్రస్తుతం హోం ల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టీ నోయెమ్ వద్ద పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.ఎలాంటి టాస్క్ లు ఉండొచ్చు? ‘ది అమెరికన్’పేరిట జరగబోయే ఈ రియాలిటీ టీవీ షోలో వలసదారుల్లో దేశభక్తి పెంచడంతోపాటు బాధ్యతాయుత పౌరునిగా మెలగాలంటే ఉండాల్సిన అర్హతలు, లక్షణాలను స్మరణకు తెచ్చేలా టాస్క్ లు రూపొందించనున్నారు. వీటితోపాటు ఆద్యంతం ఆసక్తికరంగా, వినోదాత్మకంగా ఉండేందుకు పలు రకాల టాస్క్‌లు పెట్టనున్నారు. టెక్సాస్ లేదా ఫ్లోరిడాలో నాసా ప్రయోగకేంద్రాల వద్ద చిన్నపాటి రాకెట్ ఎగరేయడం, శాన్ఫ్రాన్సిస్కో గనిలో బంగారాన్ని తవ్వితీయడం(గోల్డ్ రష్), డెట్రాయిట్లో ఆటోమొబైల్ అసెంబ్లీ లైన్ల వద్ద మోడల్ ‘టి’కారు ఛాసిస్‌ను బిగించడం, కన్సాస్‌లో గుర్రపుస్వారీ చేస్తూ తపాలాలు భటా్వడా చేయడం వంటి వినూత్న టాస్క్‌లు వలసదారులు పూర్తిచేయాల్సి ఉంటుంది.
జాతీయం

గమ్యం చేరని నిఘానేత్రం
శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీఎస్ఎల్వీ–సీ61 ప్రయోగం లక్ష్యాన్ని సాధించకుండానే అర్ధాంతరంగా ముగిసింది. నిఘా అవసరాలకు ఉద్దేశించిన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (ఈఓఎస్–09)ను నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టడంలో రాకెట్ విఫలమైంది. ప్రయోగంలో తొలి రెండు దశలు విజయవంతమైనా మూడో దశలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఇస్రో అమ్ముల పొదిలో కీలక అస్త్రంగా భావించే పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్ఎల్) విఫలం కావడం అత్యంత అరుదు. ఇస్రో చరిత్రలో శ్రీహరికోట నుంచి జరిగిన ఈ 101 ప్రయోగం అనుకున్న ఫలితం ఇవ్వకపోవడం శాస్త్రవేత్తలను తీవ్రంగా నిరాశపర్చింది. ఈ వైఫల్యం నేపథ్యంలో మరిన్ని ప్రయోగాలు వాయిదా పడే అవకాశాలున్నాయి. 2018–2023 మధ్య ప్రపంచవ్యాప్తంగా 74 శాతం రాకెట్ ప్రయోగాల వైఫల్యానికి ప్రొపల్షన్, స్టేజ్–సపరేషన్ అంశాలే కారణమని గణాంకాలు చెబుతున్నాయి. గతి తప్పిన రాకెట్ శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్–షార్ మొదటి ప్రయోగ వేదిక నుంచి ఆదివారం ఉదయం 5.59 గంటలకు పీఎస్ఎల్వీ–సీ61 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. 110 సెకండ్ల వ్యవధిలో తొలి దశలో 70 కిలోమీటర్లు ఎత్తుకు, 261.8 సెకండ్లలో రెండో దశలో 232 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లింది. 262.9 సెకండ్లకు మూడో దశలో ఘన ఇంధన మోటార్ మండించే సమయంలో రాకెట్ గతి తప్పింది. సరిచేసేందుకు మిషన్ కంట్రోల్ సెంటర్ సిబ్బంది ప్రయతి్నంచినా లాభం లేకపోయింది. రాకెట్ సముద్రంలో పడిపోయి ఉంటుందని ఇస్రో రిటైర్డ్ అధికారి ఒకరు చెప్పారు. ప్రయోగం విఫలమైనట్లు ఇస్రో చైర్మన్ డాక్టర్ వి.నారాయణన్ ప్రకటించారు. మోటార్ కేస్‌లోని చాంబర్ ప్రెషర్లో లోపం తలెత్తినట్లు వెల్లడించారు.విచారణకు కమిటీ పీఎస్ఎల్వీ–సీ61 వైఫల్యానికి కారణాలు తెలిస్తేనే భావి ప్రయోగాల విషయంలో మరిన్ని జాగ్రత్తలకు ఆస్కారముంటుంది. అందుకే ఇస్రో నిపుణులు, ఇంజనీర్లు, సైంటిస్టులు, మిషన్ స్పెషలిస్టులతో తొలుత ఫెయిల్యూర్ అనాలిసిస్ కమిటీ(ఎఫ్ఏసీ)ని వేయనున్నారు. ప్రయోగ డేటాను ఇది క్షుణ్నంగా సమీక్షించి వైఫల్యానికి కారణాలను తేలుస్తుంది. కారణం సాంకేతికమా, మానవ తప్పిదమా, ప్రతికూల వాతావరణం వంటి బాహ్య అంశాలా అనేది నిర్ధారిస్తుంది. అవి పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలను సిఫార్సు చేస్తుంది.కారణం అదేనా? పీఎస్ఎల్వీ–సీ 61 వైఫల్యానికి కారణంపై ఇస్రో దృష్టి సారించింది. ప్రొపల్షన్ సిస్టమ్‌లో ఫ్లెక్స్ నాజిల్ కంట్రోల్ వ్యవస్థ సరిగా పనిచేయకపోవడం వల్లే రాకెట్ కూలినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. నాజిల్‌ను సరిచేసి ఇంధనాన్ని మండించడంలో ఈ వ్యవస్థదే కీలక పాత్ర. దీన్ని పొరలతో కూడిన ఎలాస్టోమెరిక్ మెటీరియల్స్‌తో తయారు చేస్తారు. ప్రయోగం మూడో దశలో హైడ్రాక్సిల్–టెరి్మనేటెడ్ పాలీబ్యుటాడీన్ (హెచ్టీపీబీ) ఇంధనాన్ని ఉపయోగించారు. ఇది 240 కిలోన్యూటన్ థ్రస్ట్‌ను ఉత్పన్నం చేయగలదు.ఇస్రో గెలుపుగుర్రం పీఎస్ఎల్వీ ఉపగ్రహ వాహక నౌక ఇస్రోకు అత్యంత నమ్మకమైనది. ఎర్త్ అబ్జర్వేషన్, జియో–స్టేషనరీ, నావిగేషన్ అనే మూడు రకాల పేలోడ్లను నింగిలోకి పంపేలా పీఎస్ఎల్వీని ఇస్రో అభివృద్ధి చేసింది. దీని ఎత్తు 44.5 మీటర్లు, వ్యాసం 2.8 మీటర్లు. ఒకేసారి 1,750 కిలోల పేలోడ్‌ను మోసుకెళ్లగలదు. భూమి నుంచి 600 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న సన్ సింక్రనస్ పోలార్ ఆర్బిట్‌కు చేరుకోగలదు. ఈ వాహక నౌక ఇస్రోకు ఎన్నో విజయాలు అందించి గెలుపు గుర్రంగా గుర్తింపు పొందింది. 2008లో చంద్రయాన్–1, 2013లో మార్స్ ఆర్బిటార్ స్పేస్‌క్రాఫ్ట్, 2023లో ఆదిత్య ఎల్1 మిషన్లను పీఎస్ఎల్వీ ద్వారానే ప్రయోగించారు. పీఎస్ఎల్వీ శ్రేణిలో ఇప్పటిదాకా చేపట్టిన 63 ప్రయోగాల్లో ఇది కేవలం మూడో వైఫల్యం. 1993 సెపె్టంబర్లో పీఎస్ఎల్వీ–డీ1 రాకెట్ ఐఆర్ఎస్–1ఈ ఉపగ్రహాన్ని, 2017 ఆగస్టులో పీఎస్ఎల్వీ–సీ39 రాకెట్ ఇండియన్ రీజినల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్(ఐఆర్ఎన్ఎస్ఎస్)ను కక్ష్యలోకి ప్రవేశపెట్టలేకపోయాయి.

ఆపరేషన్ సిందూర్ న్యూ వీడియో షేర్..!
న్యూఢిల్లీ: పాకిస్తాన్ లోని ఉగ్రమూకల్ని అంతమొందించడమే లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్ కు సంబంధించి మరో వీడియోను షేర్ చేసింది ఇండియన్ ఆర్మీ. పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయవంతమైన సంగతి తెలిసిందే.పాకిస్తాన్ లోని ఉగ్రస్థావరాలపై విరుచుకుపడిన భారత ఆర్మీ.. పాక్ లోని పలు ఎయిర్ బేస్ లను కూడా ధ్వంసం చేసింది. తొలుత ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత్ దాడులు చేస్తే పాకిస్తాన్ కవ్వింపు చర్యలు చేపట్టింది. దీనికి బదులుగా పాక్ లో ఎయిర్ బేస్ లపై భారత్ దాడి చేసి సత్తా ఏమిటో ప్రపంచానికి చాటి చెప్పింది.దీనికి సంబంధించి ఒక్కో వీడియోను భారత ఆర్మీ షేర్ చేస్తూ వస్తోంది. తాజాగా మరో వీడియోను భారత ఆర్మీ తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇది పహల్గామ్ లో సృష్టించిన మారణహోమానికి జరిగిన న్యాయం మాత్రమే ఇది.. ప్రతీకారం కాదు’ అని పేర్కొంది. ఈ వీడియోకు ఓ క్యాప్షన్ ను జోడించింది. ‘ప్రణాళిక.. శిక్షణ.. అమలు’ అంటూ ట్యాగ్ చేసింది భారత ఆర్మీ. #StrongAndCapable#OpSindoorPlanned, trained & executed.Justice served.@adgpi@prodefencechan1 pic.twitter.com/Hx42p0nnon— Western Command - Indian Army (@westerncomd_IA) May 18, 2025

కాంగ్రెస్ మిమ్మల్ని అవమానిస్తోందా?.. ఎంపీ శశి థరూర్ రియాక్షన్ ఇదే
ఢిల్లీ: ఉగ్రవాదులకు అండగా నిలుస్తున్న పాకిస్తాన్‌ను ప్రపంచ దేశాల్లో ఎండగట్టేందుకు ఏర్పాటు చేసిన అఖిలపక్ష నేతల్లో కేంద్ర ప్రభుత్వం తనను ఎంపిక చేయడంపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ సమర్థించుకున్నారు. తాను కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఏ రాజకీయ కోణంలో చూడడం లేదు. ఇది దేశానికి సేవ చేయాల్సిన సమయం’ అని స్పష్టం చేశారు.ఉగ్రవాదులకు అండగా నిలుస్తున్న పాకిస్తాన్ తీరును ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సహా ప్రపంచ దేశాల్లో ఎండగట్టడానికి, ఉగ్రవాదంపై భారత్ వైఖరిని వివరించడానికి కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష నేతలతో ఏడు బృందాలు ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ ప్రతిపాదించిన నాలుగు పేర్లను పక్కనపెట్టి, ఆ పార్టీ ఎంపీ శశి థరూర్‌ను ఎంపిక చేయడం సంచలనాత్మకంగా మారింది. అంతేకాకుండా ఓ బృందానికి శశి థరూర్ నేతృత్వం వహిస్తారని ప్రకటించడం గమనార్హం. ఈ ఎంపికపై శశిథరూర్ స్పందించారు. ‘మాజీ విదేశాంగ వ్యవహారాల శాఖ అనుభవం కారణంగా కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తాను ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించాలని అడిగారు. కిరణ్ రిజిజు అడిగిన వెంటనే నేను అందుకు అంగీకరించాను. ఇది దేశ సేవకు సంబంధించింది. దేశం సంక్షోభంలో ఉన్నప్పుడు, కేంద్ర ప్రభుత్వం ఒక పౌరుడిని సహాయం కోరితే ఇంకేం సమాధానం ఇవ్వాలి?అని ప్రశ్నించారు. తాను తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ అసంతృప్తిగా ఉందా? అన్న ప్రశ్నకు ఆ విషయం పార్టీకి, కేంద్రానికి సంబంధించింది. మీరు కాంగ్రెస్‌ను అడగాలి’ అని సూచించారు. పార్టీ మిమ్మల్ని అవమానించిందా? అన్న ప్రశ్నకు.. నన్ను అంత తేలికగా అవమానించలేరు. నా విలువ నాకు తెలుసని సమాధానమిచ్చారు. దేశంపై దాడి జరిగినప్పుడు, అందరం ఒకే స్వరం వినిపించడం, ఐక్యతగా నిలబడటం దేశానికి మంచిది. కేంద్రం ఆయనను దేశ ప్రతినిధిగా ఎంపిక చేయడాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఇండియన్ ఆర్మీ కీలక ప్రకటన
ఢిల్లీ: ఇండియన్ ఆర్మీ కీలక ప్రకటన చేసింది. పాక్‌తో కాల్పుల విరమణకు గడువు లేదని స్పష్టం చేసింది. ఈ రోజు డీజీఎంవో చర్చలు లేవని తెలిపింది. కాల్పుల విరమణ కొనసాగుతుందని పునరుద్ఘాటించింది.పహల్గాం ఉగ్రదాడి (Terrorist Attack) అనంతరం భారత్ చేపట్టిన ప్రతీకార దాడులతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరయ్యింది. ఆపరేషన్ సిందూర్‌తో దాయాది దేశం విలవిల్లాడింది. చివరకు ఉద్రిక్తతలు తగ్గించాలని పాక్ (Pakistan)శరణుగోరింది. పాక్ అర్జించడంతో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. మే 10న ఇరు దేశాల డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMOs) స్థాయిలో కాల్పుల విరమణ అవగాహనపై ఒప్పందం కుదర్చుకున్నాయి. ఈ తరుణంలో కాల్పుల విరమణ అవగాహనకు ముగింపు తేదీ లేదని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. Some media houses are reporting that the ceasefire between India and Pakistan is ending today. In addition, queries are also being received if a DGMO-level talk is scheduled today.According to the Indian Army, no DGMO talks are scheduled today. As far as the continuation of a…— ANI (@ANI) May 18, 2025
ఎన్ఆర్ఐ

తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ ఆధ్వర్యంలో మే డే సంబరాలు
తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ (TCSS) ఆధ్వర్యంలో కార్మికుల దినోత్సవం (మే డే) సందర్భంగా సొసైటీ అధ్యక్షులు గడప రమేష్ గారు సింగపూర్ లో పనిచేస్తున్న తెలంగాణ మరియు ఇతర కార్మికులకు అందరికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ మే డే సందర్భంగా సింగపూర్ లో మల్టీనేషనల్ కంపెనీ (Toa Corporation) లో పని చేస్తున్న అందరికీ దాదాపు 200 మంది కార్మికులకు పండ్లు, శీతల పానీయాలు అందజేసి ఆ కంపెనీకి అలాగే అందులో పని చేస్తున్న ప్రతి కార్మికుడికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన చెట్టిపల్లి మహేష్ తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ప్రతిఒక్కరికి సొసైటీ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి రాము బొందుగుల మరియు కోశాధికారి నంగునూరి వెంకట రమణ , సొసైటీ ఉపాధ్యక్షులు బసిక ప్రశాంత్ రెడ్డి, దుర్గ ప్రసాద్, భాస్కర్ గుప్త నల్ల, జూలూరి సంతోష్ కుమార్ ఉపాధ్యక్షురాలు మిర్యాల సునీత రెడ్డి, సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొడ్ల రోజా రమణి, నడికట్ల భాస్కర్, శశిధర్ రెడ్డి, రవి కృష్ణ విజాపూర్,సంతోష్ వర్మ మాదారపు మరియు కార్యవర్గ సభ్యులు శివ ప్రసాద్ ఆవుల, పెరుకు శివ రామ్ ప్రసాద్, రవి చైతన్య మైసా, భాస్కర్ రావు పులిగిళ్ల, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, మణికంఠ రెడ్డి, రావుల సుగుణాకర్ రెడ్డి ,చల్ల కృష్ణ మొదలగు వారు అందరికి శుభాకాంక్షలు తెలియజేసారు. మరిన్ని ఎన్ఆర్ఐ వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి

TANA: ‘ఆంధ్ర బాలానంద సంఘం’ ముచ్చట్లు విజయవంతం
డాలస్, టెక్సస్, అమెరికా: తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో “నెల నెలా తెలుగు వెలుగు” పేరిట ప్రతి నెల ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న కార్యక్రమాలలో భాగంగా “రేడియో అన్నయ్య, అక్కయ్య గార్ల స్మృతిలో – “85 వసంతాల ఆంధ్ర బాలానంద సంఘం ముచ్చట్లు” అనే అంశంపై జరిపిన 79 వ అంతర్జాల అంతర్జాతీయ దృశ్య సమావేశం పెద్దల ప్రసంగాలు, బాలానందం పిల్లల పాటలతో కోలాహలంగా జరిగింది.తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు పాల్గొన్న అతిథులందరికీ స్వాగతం పలుకుతూ, బాలలకోసం ఏర్పడిన ఒక సంస్థ 85 వసంతాలు జరుపుకోవడం వెనుక ఈ సంస్థ స్థాపకులైన రేడియో అన్నయ్య, రేడియో అక్కయ్య గార్ల కృషి ఎంతైనా ఉందని అన్నారు.తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు, డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “పిల్లలకు పసిప్రాయంలోనే గేయాలు, రూపకాలు, ఆటలు, పాటలతో తెలుగు భాష, సాహిత్యంపట్ల ఆసక్తి కల్గించి, వారిలో క్రమశిక్షణ, మానసిక వికాసం, విజ్ఞానం, సృజనాత్మకత, నాయకత్వ ప్రతిభను కల్గించడంలో ఆకాశవాణిలో కొన్ని దశాబ్దాలపాటు వారం వారం ‘బాలానందం’ కార్యక్రమంతో పిల్లలకు పెద్దపీట వేసిన రేడియో అన్నయ్య, రేడియో అక్కయ్య గార్ల కృషి అజరామరం అన్నారు. పిల్లలకు చిన్నవయస్సులోనే ఇలాంటి విషయాల పట్ల అవగాహన, ఆసక్తినికల్గించి సరైన దిశానిర్దేశం చెయ్యవలసిన బాధ్యత తల్లిదండ్రులదేనన్నారు. ప్రత్యేక అతిథులుగా పాల్గొన్న శారదా శ్రీనివాసన్ (రేడియో హీరోయిన్, సుప్రసిద్ధ ఆకాశవాణి కళాకారిణి), డా. మండలి బుద్ధప్రసాద్ (అవనిగడ్డ శాసనసభ్యులు, రేడియో అన్నయ్య, అక్కయ్యగార్లతో ప్రత్యక్ష పరిచయం ఉన్నవారు), పద్మభూషణ్ పురస్కార గ్రహీత డా. కె.ఐ. వరప్రసాదరెడ్డి (బాలానంద కార్యక్రమాలను ఆస్వాదించినవారు), డా. మోహన్ కందా, ఐ.ఎ.ఎస్ (ఆంధ్రప్రదేశ్ పూర్వ ప్రధాన కార్యదర్శి, బాలానంద సంఘ పూర్వసభ్యులు), జంధ్యాల కామేశ్వరి-పాప (రేడియో అన్నయ్య గారి మేనకోడలు, ఆంధ్ర బాలానంద సంఘం అధ్యక్షులు), కలగా కృష్ణమోహన్ (బాలానందం పూర్వ సభ్యులు, ఆంధ్ర బాలానంద సంఘం ఉపాధ్యక్షులు, ప్రముఖ గీత రచయిత, సంగీత దర్శకులు) బాలానందం కార్యక్రమంతోను, రేడియో అన్నయ్య, అక్కయ్య గార్లతో తమకున్న ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలతోపాటు ఎన్నో ఆసక్తికర విశేషాలను పంచుకుని వారికి ఘననివాళులర్పించారు. విశిష్టఅతిథులుగా - ఎన్.వి. అశోక్ (విశ్రాంత ఇంజనీర్, ‘బాలానందం’ పూర్వసభ్యులు), రావులపర్తి రాజేశ్వరి (విశ్రాంత బ్యాంకు అధికారి, ‘బాలానందం’ పూర్వ సభ్యురాలు),నండూరి సీతా సాయిరాం (విశ్రాంత ఉపాధ్యాయిని, ‘బాలానందం’ పూర్వ సభ్యురాలు),మాడభూషి బద్రినాథ్ (బాలానందం-నృత్య దర్శకులు), డా. ఆవుల హరిత (బాలానందం-కార్యవర్గ సభ్యురాలు), చినముత్తేవి కరుణ (బాలానందం-గాయకబృందం, శిక్షణా విభాగపు కార్యవర్గసభ్యురాలు), మాలెంపాటి నవ్య (ఐఐటి ఖర్గపూర్, ‘బాలానందం’ సంగీత, నృత్య కళాకారిణి), గోవిందు దేవరాజ (బాలానందం-గాయకబృందం, శిక్షణా విభాగపు కార్యవర్గసభ్యులు) పాల్గొని తమ స్వీయ అనుభవాలను, రేడియో అన్నయ్య, అక్కయ్య గార్లు ఎంతో దూరదృష్టితో స్థాపించిన ఆంధ్ర బాలానందం సంఘం తమ పిల్లల జీవితాలలో తీసుకువచ్చిన మార్పులను వివరించి వారిరువురికి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అన్నారు. తానా ప్రపంచసాహిత్యవేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ - ఒక సంస్థ ఎనిమిదన్నర దశాబ్దాలగా నిరాటంకంగా కొనసాగడం ఒక చరిత్ర అని, ఏ ఆశయంతో రేడియో అన్నయ్య, అక్కయ్య గార్లు ఈ బాలానందం స్థాపించారో, అదే స్ఫూర్తితో ఉత్సాహంగా ఆంధ్ర బాలానంద సంఘం నిర్వహిస్తున్న అధ్యక్షురాలు జంధ్యాల కామేశ్వరి (పాప) వారి కార్యవర్గ సభ్యులకు, ఈ నాటి కార్యక్రమంలో శ్రావ్యంగా పాటలు పాడి ఆనందపరిచిన 25 మందికి పైగా పిల్లలకు, పాల్గొన్న అతిథులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

స్వరలయ ఆర్ట్స్ సింగపూర్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ 6 వ వార్షికోత్సవ వేడుకలు
స్వరలయ ఆర్ట్స్ సింగపూర్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ 6 వ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్ లర్ ఆచార్య వెలుదండ నిత్యానందరావు హాజరయ్యారు. సింగపూర్ లోని తెలుగు వారంతా అన్ని విధాలా సుసంపన్నులని ఈ విధంగా లలిత కళలను ప్రోత్సహించడం ఆనంద దాయకమన్నారు. చిన్నారులు పాడిన పాటలు ఎంతో బాగున్నాయి అని , ఇంత చక్కగా నేర్పిన గురువును నేర్చుకున్న వారి శిష్యులను వారి తల్లిదండ్రులను ప్రశంసించారు. సంగీతం, నాట్యం వంటి కళల ద్వారా మనలో మృదుత్వం కలుగుతుందని, నేటి యాంత్రిక జీవితంలో ఈ మాధ్యమం ఎంతో ముఖ్యం అని కాబట్టి కళల పైన ఉన్న ఆసక్తిని తమ తమ ఆర్థిక సంపాదన రధ చక్రాల కింద పడి నలిగి పోనివ్వవద్దని కోరారు.ఈ కార్యక్రమానికి STS వైస్ ప్రెసిడెంట్ జ్యోతీశ్వర్ , శ్రీ సాంస్కృతిక కలసారథి అధ్యక్షులు కవుటూరు రత్న కుమార్,TCSS అధ్యక్షులు గడప రమేష్, TAS (మనం తెలుగు ) అసోసియేషన్ అనిత రెడ్డి , కమల క్లబ్ మాజీ అధ్యక్షులు, సారీ కనెక్షన్ అడ్మిన్ పద్మజ నాయుడు , మగువ మనసు అడ్మిన్ వీర మాంగోస్ ఉష , సింగపూర్ తెలుగు టీవి రాధాకృష్ణ గణేశ్న , జయంతి రామ, భాగవత ప్రచార సమితి భాస్కర్ ఊలపల్లి, H& H శ్యామల , విష్ణు ప్రియ , సింగపూర్ తెలుగు వనితలు అడ్మిన్స్ క్రాంతి, దేదీప్య, జయ, ప్రత్యూష , అమ్ములు గ్రూపు నుండి అడ్మిన్ సునీత రామ్, , KCAS దివ్య ఇంకా పలువురు సింగపూర్ తెలుగు కమ్యూనిటీ వ్యవస్థాపకులు హాజరయి అందరూ కలిసి వైస్ ఛాన్స్‌లర్‌ను సన్మానించారు. స్వరలయ ఆర్ట్స్, సింగపూర్ వ్యవస్థాపక అధ్యక్షురాలు యడవల్లి శేషుకుమారి వారి శిష్యులు,స్నేహితులు కీర్తనలను ఆలపించారు. పద్మజ నాయుడు మాట్లాడుతూ శేషు గాన కోకిల అని పొగడగా ఆచార్య నిత్యానందరావు గారు కోకిల ఒక కాలంలో మాత్రమే పాడుతుందని కాని ఈమె 365 రోజులు గానం ఆలపిస్తారు అన్నారు. శ్యామల మాట్లాడుతూ వారి వెంకటేశ్వర గానామృతం కార్యక్రమానికి శేషు కుమారి 70 పాటలు 40 రాగాలలో స్వర పరిచి మూడున్నర గంటల సేపు పాడి అందరినీ అలరించిన వైభవం గుర్తు చేసి ఈ రోజుకి ఆ పాటలు తమ చెవులలో ప్రతి ధ్వనిస్తూ పరవసింప చేస్తాయని ప్రశంసించారు.పొట్టి శ్రీరాములు, తెలుగు విశ్వవిద్యాలయం సర్టిఫికేట్ కోర్సు మొదటి వత్సరం, రెండవ సంవత్సరం పరీక్షల్లో ఉత్తీర్ణత పొందిన స్వరలయ ఆర్ట్స్ విద్యార్థులకు వైస్ ఛాన్స్ లర్ బహుమతి ప్రధానం చేశారు. అతిథులకు మొమెంటోలను బహుకరించారు ఈ నెల ఆరవ తారీఖున స్వరలయ ఆర్ట్స్ వారు నిర్వహించిన త్యాగ రాజ ఆరాధన ఉత్సవాలలో పాల్గొని తమతో కలిసి పంచరత్నాలు పాడిన సౌభాగ్య లక్ష్మి తంగిరాల, షర్మిల చిత్రాడ, సౌమ్య ఆలూరు, శరజ అన్నదానం, రాధికా నడదూర్, ప్రియ లకు మొమెంటోలను బహుకరించారు. శివ కుమార్ మృదంగం పై వాయిద్య సహకారం అందించారు ఈ కార్యక్రమానికి శ్రీమతి చైతన్య వ్యాఖ్యాతగా వ్యవహరించారు. పలువురినీ లలిత కళారంగంలో ఉత్సాహ పరుస్తూ ముందుకు నడిచే ఇటువంటి కార్యక్రమానికి దాదాపుగా 200 మంది హాజరు కావటమే కాకుండా, సాంఘిక మాధ్యమాల ద్వారా కూడా వీక్షించి విశేషస్పందనలను తెలియజేయటం అభినందనీయం.

9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు ’’ విశేష సంచిక ఆవిష్కారం
ఖతార్ దేశ రాజధాని దోహా మహానగరంలో 2024 నవంబర్‌లో జరిగిన "9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు" యొక్క సభా విశేష సంచిక అంతర్జాల మాధ్యమంలో ఆదివారం ఆవిష్కరించారు. 'వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా' ,'ఆంధ్ర కళా వేదిక - ఖతార్' సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహింపబడి, మధ్య ప్రాచ్య దేశాలలోనే తొలి సాహితీ సదస్సుగా రికార్డును సృష్టించిన ఈ '9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సులో పది దేశాల నుండి పాల్గొన్న వక్తలు, కవులు, రచయితలు ప్రసంగించిన అన్ని అంశాలను పొందుపరుస్తూ 380 పేజీలతో ఈ సభా విశేష సంచిక రూపొందించబడింది. ఈ ఉద్గ్రంధానికి సంపాదకులుగా రాధికా మంగిపూడి, విక్రమ్ సుఖవాసి, వంగూరి చిట్టెన్ రాజు, లక్ష్మి రాయవరపు, శాయి రాచకొండ వ్యవహరించారు.సదస్సు నిర్వాహకవర్గము, సంచిక సంపాదకులు, సదస్సులో వివిధ దేశాల నుండి పాల్గొన్న వక్తలు, రచయితలు అందరి సమక్షంలో ఈ పుస్తక ఆవిష్కరణ జరగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకించి అంతర్జాల మాధ్యమంలో ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు. మరిన్నిNRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి!వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వ్యవస్థాపకులు డా. వంగూరి చిట్టెన్ రాజు, ఖతార్ ఆంధ్ర కళా వేదిక నుండి విక్రమ్ సుఖవాసి ప్రధాన నిర్వాహకులుగా, వారి అధ్యక్షతన, రాధిక మంగిపూడి సభానిర్వహణలో దాదాపు మూడు గంటల పాటు ఆదివారం సాయంత్రం నిర్వహింపబడిన ఈ కార్యక్రమంలో భారత్, ఖతార్, అమెరికా, సౌదీ అరేబియా, బహరైన్, యూఏఈ, సింగపూర్ తదితర దేశాలనుండి వక్తలు, తెలుగు సంస్థల ప్రతినిధులు, రచయితలు పాల్గొన్నారు.అమెరికా నుండి చెరుకూరి రమాదేవి, శాయి రాచకొండ, భారత్ నుండి డా. వంశీ రామరాజు, డా. అద్దంకి శ్రీనివాస్, డా. బులుసు అపర్ణ, ఆచార్య అయ్యగారి సీతారత్నం, ఆచార్య త్రివేణి వంగారి, కస్తూరి అలివేణి, డా. దేవులపల్లి పద్మజ తదితరులు, బహరైన్ నుండి మురళీకృష్ణ, సౌదీ అరేబియా నుండి కోనేరు ఉమామహేశ్వరరావు, చివుకుల పట్టాభిరామ శర్మ, సింగపూర్ నుండి కవుటూరు రత్నకుమార్, యూఏఈ నుండి షేక్ రఫీ, డా. తాడేపల్లి రామలక్ష్మి, ఖతార్ నుండి శ్రీసుధ, గోవర్ధన్ రెడ్డి, మనీష్, మాధవి లలిత, గౌరీ బొమ్మన తదితరులు ఆసక్తిగా పాల్గొని సదస్సు యొక్క జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.ఈ సభా విశేష సంచికలో నిర్వాహక సంస్థల పరిచయాలు, అధ్యక్షుల, సంచాలకుల ముందుమాటలు, సదస్సు ప్రకటనలు, వక్తలందరి ఫోటోలు, వ్యాసాలు, కథలు, కవితలతో పాటు, సదస్సు అనంతరం అందరూ అందించిన స్పందనలు కూడా జోడించడం, ఆనందంగా ఉందని, జీవితంలో ఒక మధుర జ్ఞాపకంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ సంచిక ఉందంటూ సంపాదకులను నిర్వాహకులను అభినందించారు.డా. వంగూరి చిట్టెన్ రాజు మాట్లాడుతూ "మధ్యప్రాచ్య దేశాలలో తెలుగు సాహిత్య అభిమానులందరికీ ఈ సదస్సు కొత్త స్ఫూర్తిని అందించిందని, సదస్సు ప్రభావం వలన ఎంతోమంది సాహిత్యంపై చక్కటి ఆసక్తి పెంచుకోవడం, కొత్త రచయితలు జనించడం.. ఆనందదాయకమని తెలియజేశారు. ఇటువంటి సదస్సులు మరిన్ని జరగాలని, కొత్త రచయితలు యువతరం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. విక్రమ్ సుఖవాసి ఆంధ్ర కళావేదిక తరపున మరొకసారి అందరికీ తమ దేశానికి విచ్చేసి కార్యక్రమంలో పాల్గొన్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ తొలిసారి ప్రపంచ సదస్సుకు సంచాలకునిగా ఈ సంచికకు సహసంపాదకునిగా ఉండడం చాలా ఆనందంగా ఉందన్నారుఈ సంచికకు రూపకల్పన సహకారం అందించిన జేవి పబ్లికేషన్స్ అధినేత్రి జ్యోతి వలబోజు కూడా ఈ ఆవిష్కరణలో పాల్గొన్నారు. ఇతర మధ్యప్రాచ్య దేశాల సంస్థల ప్రతినిధులు మాట్లాడుతూ తమ దేశాలలో కూడా ఇటువంటి సాహిత్య సదస్సులు నిర్వహించడానికి తాము సిద్ధంగా ఉన్నామని 10వ ప్రపంచ సదస్సు జరపడానికి అవకాశం ఇమ్మని కోరుతూ తమ ఉత్సాహాన్ని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమం వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా యూట్యూబ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారమైంది.
క్రైమ్

ఏరో ఇంజినీర్ అనుమానాస్పద మృతి
దొడ్డబళ్లాపురం(కర్ణాటక): జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదగాల్సిన విద్యావంతురాలి జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది. ధర్మస్థలం నివాసి అయిన ఏరోస్పేస్ ఇంజినీర్ పంజాబ్‌లో అనుమానాస్పద రీతిలో చనిపోయింది. ఆకాంక్ష (23) మృతురాలు. ధర్మస్థలంలోని బోళియార్ నివాసులైన సురేంద్ర, సింధూదేవి దంపతుల కుమార్తె ఆకాంక్ష, పంజాబ్‌లోని ఫగ్వాడాలో ఎల్పీయూ విద్యాసంస్థలో ఉన్నత విద్యను పూర్తి చేసి, 6 నెలల నుంచి ఢిల్లీలో ఏరోస్పేస్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తోంది. తరువాత జపాన్‌లో ఉద్యోగం సంపాదించుకున్న ఆకాంక్ష తాను చదివిన కాలేజీలో కొన్ని సర్టిఫికెట్లు పొందడానికి పంజాబ్‌కు వెళ్లింది. శనివారం మధ్యాహ్నం సర్టిఫికెట్లు తీసుకున్నట్టు తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పింది. జలంధర్ నగరంలో ఉన్నట్లు తెలిపింది. కొన్ని గంటల వ్యవధిలోనే ఓ భవనంలో 3వ అంతస్తు పడి దుర్మరణం చెందింది. స్థానిక పోలీసులు ఆ మేరకు కుటుంబీకులకు సమాచారం ఇవ్వడంతో శోకసంద్రంలో మునిగిపోయారు. వెంటనే తల్లిదండ్రులు పంజాబ్‌కు వెళ్లారు. ఏదో దారుణం జరిగిందని, ఇది ప్రమాదం కాదని తల్లిదండ్రులు వాపోయారు.

ఉగ్రకుట్ర భగ్నం
సాక్షి,హైదరాబాద్/విజయనగరం/విజయనగరం క్రైమ్: తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్, ఏపీ పోలీసులు జాయింట్ ఆపరేషన్‌తో ఉగ్రకుట్రను భగ్నం చేశారు. సౌదీ అరేబియా కేంద్రంగా పనిచేస్తున్న పాకిస్తాన్ ప్రేరేపిత హ్యాండ్లర్ నెట్వర్క్ గుట్టురట్టు చేశారు. బాంబు పేలుళ్ల ప్రయోగాల కోసం పేలుడు పదార్థాలు సేకరిస్తున్న ఇద్దరిని వేర్వేరు చోట్ల అరెస్ట్ చేశారు. హైదరాబాద్ పోలీసుల సమాచారంతో తొలుత ఏపీలో విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహ్మాన్(29)ను పోలీసులు అరెస్ట్ చేశారు. తర్వాత సిరాజ్ విచారణలో చెప్పిన సమాచారాన్ని ఏపీ పోలీసులు తెలంగాణ పోలీసులతో పంచుకున్నారు. దీంతో తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు (సీఐ సెల్) హైదరాబాద్ బోయగూడలో ఉంటున్న సయ్యద్ సమీర్(28)ను అరెస్ట్ చేశారు. అనంతరం సమీర్‌ను విజయనగరం తరలించారు. డమ్మీ బ్లాస్ట్‌లకు కుట్ర విజయనగరానికి చెందిన సిరాజ్.. సయ్యద్ సమీర్ కలిసి ‘అల్ హింద్ ఇత్తెహబుల్ మిసిలెన’ (ఏహెచ్‌ఐఎమ్) పేరుతో పలు కార్యకలాపాలు చేస్తున్నట్లు పోలీసులకు కీలక అధారాలు లభించాయి. సౌదీ అరేబియాలోని ఓహ్యాండ్లర్ నుంచి హైదరాబాద్, ఏపీలోని సానుభూతిపరులకు ఆదేశాలు వస్తున్నట్లు గుర్తించారు. పేలుళ్ల కోసం ప్రయోగాలు చేసేందుకు సంబంధిత కెమికల్స్ కొనుగోలు చేసి హైదరాబాద్‌లో డమ్మీ బ్లాస్ట్‌లు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు ఆధారాలు సేకరించారు. ఇందుకోసం సిరాజ్ విజయనగరంలో పేలుడు పదార్థాలు కొనుగోలు చేసినట్లు సీఐ సెల్‌కు సమాచారం అందింది.దీంతో తెలంగాణ సీఐ సెల్ అధికారులు విజయనగరం పోలీసులను అప్రమత్తం చేశారు. సిరాజ్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. అతని ఇంట్లో పేలుళ్లకు వినియోగించే అమ్మోనియా, సల్ఫర్, అల్యూమినియం పౌడర్‌ను స్వాదీనం చేసుకున్నారు. ఎవరికీ అనుమానం రాదనే ఉద్దేశంతోనే విజయనగరంలో పేలుడు పదార్థాల కొనుగోలుకు పూనుకున్నట్టు సమాచారం. వీరి వెనుక ఉన్న ఉగ్రవాద సంస్థల గురించి ఆరా తీస్తున్నారు. హైదరాబాద్‌లో చదువుకున్నప్పుడే... సిరాజ్ 2018 సంవత్సరంలో హైదరాబాద్‌లో ఇంజనీరింగ్ విద్యనభ్యసిస్తున్న సమయంలో సమీర్‌తో పరిచయం ఏర్పడినట్టు నిఘా వర్గాల సమాచారం. వీరిద్దరూ ఐసిస్‌తో సంబంధాలు పెంచుకున్నట్టు తెలంగాణ ఇంటెలిజెన్స్ గుర్తించింది. తండ్రి, సోదరుడు పోలీస్ విభాగాల్లో వివిధ హోదాల్లో పనిచేస్తుండగా, సిరాజ్ మాత్రం ఉగ్రవాద భావజాలానికి ప్రేరేపితం కావడం పోలీసులను విస్మయపరుస్తోంది. వీరు రసాయనాలను ఎక్కడెక్కడ కొనుగోలుచేశారు, ఇంకా ఎక్కడ నిల్వ చేశారు, దీనితో ఎవరెవరికి సంబంధం ఉందన్న కోణంలో ఇంటెలిజెన్స్ అధికారులు విచారిస్తున్నట్లు విజయనగరం డీఎస్పీ ఎం.శ్రీనివాస్ తెలిపారు. నిందితులిద్దరినీ విజయనగరం కోర్టులో హాజరుపరిచి, రిమాండ్‌కు తరలించారు.

చిన్నారుల ఉసురు తీసిన కారు
విజయనగరం క్రైమ్: విజయనగరం జిల్లా కేంద్రానికి సమీపంలోని ద్వారపూడి గ్రామంలో విషాదం అలముకుంది. ఆటలాడుతూ కారులోకి ఎక్కిన నలుగురు చిన్నారులు ఊపిరాడక ప్రాణాలు విడిచారు. విజయనగరం రూరల్ పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ద్వారపూడి గ్రామం, బీసీ కాలనీలో ఆదివారం ఒక పెళ్లివేడుక జరిగింది పెళ్లి హడావిడిలో ఉన్న తల్లిదండ్రులను విడిచి, మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒకటో తరగతి చదువుతున్న కంది మణీశ్వరి (6), బూర్లె చారులత (7), 2వ తరగతి చదువుతున్న బూర్లె జాస్రిత (8), 3వ తరగతి చదువుతున్న పండి ఉదయ్ (7) సమీపంలోని నీళ్ల ట్యాంక్ వద్ద ఆడుకోవడానికి వచ్చారు. ఆటల్లో ఆటగా అక్కడే ఆగి ఉన్న ఒక కారులోకి ఎక్కారు. అకస్మాత్తుగా డోర్ లాక్ కావడంతో లోపల చిక్కుకుపోయారు. కేకలు వేసినా బయటకు వినపడక పోవడంతో నలుగురు చిన్నారులు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. పెళ్లి సందడిలో ఉన్న తల్లిదండ్రులు, ఎంతకూ తమ పిల్లలు కనిపించకపోవడంతో వెతకడం ప్రారంభించారు. సాయంత్రం 5 గంటల సమయంలో కారులో పిల్లలు ఉన్నట్టు గుర్తించారు.వెంటనే కారు అద్దాలు పగలగొట్టి పిల్లలను బయటకు తీశారు. కొన ఊపిరితో ఉన్నారన్న భావనతో 108 వాహనంలో విజయనగరం సర్వజన ఆస్పత్రికి తరలించారు. అప్పటికే నలుగురు చిన్నారులు మృతిచెందినట్టు వైద్యులు చెప్పడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. మృతుల్లో చారులత, జాస్రిత అక్కచెల్లెళ్లు. ఇద్దరు కుమార్తెలు మృతిచెందడంతో తండ్రి ఆనంద్ గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఈ సంఘటనలో గ్రామంలో తీవ్ర విషాదం అలముకుంది. రూరల్ ఎస్ఐ అశోక్ కుమార్, వన్‌టౌన్ ఎస్ఐ రామ్‌గణేష్ లు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆస్పత్రికి వెళ్లి వివరాలు సేకరించారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.

రోడ్డు పక్కన వదిలేస్తే చేరదీసింది.. అదే ఆమె పాలిట శాపమైంది!
రోడ్డు పక్కన అనాథగా పడి ఉన్న పసికందును మానవత్వంతో ఓ మహిళ చేరదీసింది. చదువు కూడా చెప్పించి.. ఆ బాలికను పెంచి పెద్ద చేసింది. అలా చేయడం.. ఆ మహిళకు శాపమైంది. చివరికి ప్రాణాలు కోల్పోయాంది. ప్రేమ మైకంలో ఓ బాలిక తన పెంపుడు తల్లిని హతమార్చింది. ఈ మర్డర్ మిస్టరీని పోలీసు అధికారులు ఛేదించారు. ఎస్పీ జ్యోతీంద్ర పండా ఆదర్శ పోలీసు స్టేషన్లో వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. స్థానిక తెలుగు సొండి వీధిలో రాజ్యలక్ష్మీ కోరో (54) గత నెల 26న అనుమానాస్పదంగా చనిపోయింది. మృతురాలి పెంపుడు కూతురు పర్లాకిమిడి ప్రభుత్వ ఆస్పత్రికి తన ప్రియుడు, స్నేహితుని సహాయంతో మృతదేహాన్ని తరలించింది.ఈ విషయం భువనేశ్వర్‌లో ఉన్న మృతురాలి సోదరుడు ప్రసాద్ మిశ్రాకు ఫోన్ చేసి తెలియజేశారు. ఈ లోగా పెంపుడు కూతురు, అతని ప్రియుడు కలిసి పోలీసు కేసు కాకుండా చూసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని అంబులెన్స్‌లో భువనేశ్వర్‌కు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. కూతురు కొద్ది నెలలుగా గణేష్ రథ్ (21) అనే వ్యక్తితో ప్రేమలో ఉంది. దీన్ని గమనించిన తల్లి ఆమెను మందలించింది. దీంతో ఆమె అడ్డు తొలగించుకోవడానికి ప్రియుడితో పాటు స్నేహితుడు దినేష్ సాహు అలియాస్ అమన్ సాయంతో తల్లిని చంపడానికి పథకం పన్నారు.పథకం ప్రకారం ఏప్రిల్ 26న ఆమె నిద్రిస్తున్న సమయంలో దిండు సహాయంతో ఇద్దరు స్నేహితులు చంపి, నగదు, బంగారం దొంగిలించి పారిపోయారు. సోదరి చనిపోయాక ఆమె పెంపుడు కూతురిలో మార్పులు గమనించిన ప్రసాద్ మిశ్రా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. వారు నిందితురాలిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు నిర్వహించారు.దీంతో హత్య జరిగినట్లు నిర్ధారించారు. నిందితులందరినీ గుర్తించి వారిని అరెస్టు చేసి విచారించగా రాజలక్ష్మీ కోరోకు మత్తు మందు ఇచ్చి ఎలా చంపారో వారే పోలీసులకు వివరించారు. మృతురాలి ఇంటి నుంచి 7 తులాల బంగారం వస్తువులు, రూ.60 వేలు నగదు చోరీ కాగా 2.6 గ్రాముల బంగారం, మూడు మొబైళ్లు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ జ్యోతీంద్రనాథ్ పండా విలేకరుల సమావేశంలో తెలియజేశారు. నిందితులు ఇద్దరు గణేష్ రోథో, దినేష్ సాహులను అరెస్టు చేసి కోర్టుకు తరలించారు.