Top Stories
ప్రధాన వార్తలు

‘ఆడబిడ్డ నిధి’కి సమాధి
సాక్షి ప్రతినిధి కర్నూలు/ సాక్షి, అమరావతి: సూపర్ సిక్స్ హామీల్లో ప్రధానమైన ‘ఆడబిడ్డ నిధి’ని ఇవ్వలేమని, ఇవ్వాల్సిన అవసరం లేదని సీఎం చంద్రబాబు చేతులెత్తేశారు. అప్పుడు, ఇప్పుడు అంటూ ఏడాది పాటు ఊరిస్తూ వచ్చి తీరా మోసం చేశారు. రాష్ట్రంలో 1.80 కోట్ల మంది మహిళల ఆశలపై నీళ్లు చల్లారు. తన ఆర్థిక సంస్కరణలతో సంపద సృష్టి జరిగిపోతోందని, పేదలందరూ బాగా డబ్బులు సంపాదిస్తున్నారని.. అందువల్ల ఈ నిధి అవసరం లేదని స్పష్టం చేశారు. 2029 నాటికి పేదరికాన్ని నిర్మూలిస్తానని మరోమారు ప్రతినబూనారు. ఒకవేళ అప్పటికి కూడా పేదరికం నుంచి మహిళలు గట్టెక్కకపోతే పీ–4తో ఆడబిడ్డ నిధిని అనుసంధానం చేస్తానని కర్నూలు సభలో చెప్పుకొచ్చారు. చంద్రబాబు మాటలు విన్న మహిళలు ఒకరి మోహం మరొకరు చూసుకుంటూ నిశ్చేష్టులయ్యారు. బాబు వ్యాఖ్యలు వైరల్ కావడంతో శనివారం సాయంత్రం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయం చర్చనీయాంశమైంది.ఎక్కడ నలుగురు మహిళలు కలిసినా కూటమి ప్రభుత్వ మోసం గురించి చర్చించుకుంటున్నారు. స్వచ్ఛ భారత్‌లో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం కర్నూలులో పర్యటించారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సభకు వేలాదిగా డ్వాక్రా మహిళలను తరలించారు. వీరందరి సమక్షంలోనే ‘ఆడబిడ్డి నిధి’ అమలుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ చర్యలతో పేదల ఆదాయం బాగా పెరిగిందని, పేదలు కూడా బాగా డబ్బు సంపాదిస్తున్నారని చెప్పారు. 2029 నాటికి రాష్ట్రంలో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలిస్తానని చెప్పారు.ఒకవేళ అప్పటికీ పేదరికం ఉంటే అప్పుడు ఆడబిడ్డ నిధిని పీ4 (పబ్లిక్ ప్రైవేటు పీపుల్స్ పార్టనర్షిప్)కు అనుసంధానం చేసే ఆలోచన చేస్తానని చెప్పారు. ఈ లెక్కన ఆడబిడ్డ నిధి పథకం అమలు చేసేది లేదని తేల్చి చెప్పారు. ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చిన గడువు ఐదేళ్లు మాత్రమే. 2029లో తిరిగి ప్రజాక్షేత్రంలో ఎన్నికలకు వెళ్లాలి. అప్పటి వరకు ఈ పథకం అమలు చేయరంటే పూర్తిగా ఎగనామం పెట్టినట్లే. చంద్రబాబు ప్రభుత్వం కొలువు దీరి ఏడాది అవుతోంది. ఏడాదిలో ఏ ఒక్క పథకాన్ని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదు.నాడు ఇంటింటా ఈ నిధి గురించి ప్రచారం 2024 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో మహాశక్తి ఆడబిడ్డ నిధి పేరుతో ప్రతి ఇంట్లో 18 ఏళ్లు నిండి 59 ఏళ్లలోపు ఉన్న మహిళలు ఎంత మంది ఉంటే అంత మందికీ నెలకు రూ.1,500 చొప్పున ఇస్తానని చంద్రబాబు ప్రకటించారు. కూటమి మేనిఫెస్టోలో కూడా ఈ అంశాన్ని పేర్కొన్నారు. కూటమి నేతలు ఇల్లిల్లూ తిరిగి ఈ మేరకు ప్రచారం చేశారు. దీంతో ఆశపడి మహిళలు ఆ పార్టీకి ఓట్లేశారు. ఇప్పుడు ఆ హామీని అమలు చేసే అవసరమే లేదని చంద్రబాబు నిర్భీతిగా ప్రకటించేయడం పరిశీలకులను సైతం విస్తుగొలుపుతోంది.1.80 కోట్ల మందికి ఎగనామం 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు ఓటు హక్కు ఉంటుంది. రాష్ట్రంలో 2.07 కోట్ల మంది మహిళలు 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేశారు. 60 ఏళ్లు పైబడిన వారిని మినహాయిస్తే 1.80 కోట్ల మంది మిగులుతారు. వీరికి చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు ఇవ్వాలి. అంటే ఏడాదికి రూ.32,400 కోట్లు బడ్జెట్లో కేటాయించాలి. గత బడ్జెట్లో ఈ పథకం ఊసే లేదు. ఒక్క రూపాయి నిధులు కూడా కేటాయించలేదు. మొన్నటి బడ్జెట్లోనూ ఆ విషయమే లేదు. అంటే ఇప్పటి వరకు రెండేళ్లకు కలిపి ఒక్కొక్కరికి రూ.32 వేల చొప్పున 1.80 కోట్ల మందికి రూ.64,800 కోట్లు కేటాయించాలి. అది జరగలేదు. దీన్నిబట్టి ఆడబిడ్డ నిధి పథకం అమలు చేసేది లేదని స్పష్టమైంది. ఈ విషయాన్నే ఇప్పుడు సీఎం చంద్రబాబు బహిరంగంగా స్పష్టం చేశారు.జగన్ చేశారు.. చంద్రబాబు చేతులెత్తేశారు 2024 ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలనే కాంక్షతో చంద్రబాబు అలవికాని హామీలు ఇచ్చారు. అప్పటి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఇస్తున్న ప్రతీ పథకానికి పేరు మార్చి, నిధులు పెంచి అమలు చేస్తానని నమ్మబలికారు. అమ్మఒడిని తల్లికి వందనం పేరుతో, రైతు భరోసాను అన్నదాత సుఖీభవ పేరుతో.. వైఎస్సార్ చేయూతను ఆడబిడ్డ నిధి పేరుతో హామీ ఇచ్చారు. ‘చేయూత’ ద్వారా జగన్ ప్రభుత్వం 45–59 ఏళ్ల వయస్సున్న వారికి ఏడాదికి రూ.18,750 చొప్పున ఏటా వారి ఖాతాల్లో జమ చేసి.. మాట నిలుపుకుంది. ఇదే పథకానికి ఆడబిడ్డ నిధి పేరుతో నెలకు రూ.1500 చొప్పున ఏడాదికి రూ.1,800 ఇస్తామని చంద్రబాబు చెప్పారు. అంటే జగన్మోహన్రెడ్డి కంటే రూ.750 తక్కువే ఇస్తామన్నారు. సూపర్ సిక్స్‌లో అన్ని పథకాల కంటే అత్యధిక బడ్జెట్ కేటాయించాల్సిన పథకం ఇదే. అత్యంత ఎక్కువ మంది లబ్ధిదారులు ఉన్నదీ ఈ పథకానికే. ఇలాంటి పథకాన్ని అమలు చేయకుండా చంద్రబాబు చేతులెత్తేసి రాష్ట్రంలో 1.80 కోట్ల మంది మహిళలను నిలువునా మోసం చేశారు.బలవంతంగా దుకాణాల మూసివేత కర్నూలు నగరంలో స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు వస్తుండడంతో శనివారం దుకాణాలను మూసి వేయాలని పోలీసులు హుకుం జారీ చేశారు. ఉదయం 12 గంటలకు సీఎం రానున్న నేపథ్యంలో 9 గంటలకే షాపులన్నీ మూయించారు. దీంతో సీ క్యాంపు నుంచి నంద్యాల చెక్‌పోస్టు వరకు యజమానులు దుకాణాలు మూసివేసి వెళ్లిపోయారు. గత ప్రభుత్వంలో పరదాల మాటున సీఎం పర్యటనలు అని గగ్గోలు పెట్టిన పచ్చనేతలు.. ఇప్పుడు ఏకంగా తమ పర్యటనలకు దుకాణాలనే మూసి వేస్తుండటం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది. సీఎం సభకు పలు ప్రాంతాల నుంచి పొదుపు సంఘాల మహిళలను బలవంతంగా తరలించారు. పర్యటన ఆలస్యం కావడంతో ఎండ వేడిమికి తట్టుకోలేక చాలా మంది రేకుల షేడ్లలో, బంద్ చేసిన షాపుల నీడలో తల దాచుకోవాల్సి వచ్చింది. కనీస ఏర్పాట్లు చేపట్టక పోవడంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.నాడు ఆడ బిడ్డ నిధి హామీ ఇలాతెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక మహాశక్తి కింద ఐదు కార్యక్రమాలు అమలు చేస్తాం. 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల మధ్య మహిళలందరికీ... ఒక్కొక్కరికీ నెలకు రూ.1500 చొప్పున ఏడాదికి రూ.18000.. ఇంట్లో ఎంత మంది మహిళలు ఉంటే అందరికీ అందజేస్తాం.– 2024 మార్చి 13వ తేదీన టీడీపీ నిర్వహించిన ‘కలలకు రెక్కలు’ నినాదంతో వెబ్ పోర్టల్‌లో పేర్ల నమోదు కార్యక్రమంలో చంద్రబాబు (చంద్రబాబు మాట్లాడినట్టు ‘ఈనాడు’ దినపత్రిక క్లిపింగ్)⇒ రాష్ట్ర ప్రజల నేటి అవసరాలను తీరుస్తూ.. రేపటి ఆకాంక్షలను సాకారం చేసేలా రూపొందించిన ఈ మేనిఫెస్టోను పక్కాగా అమలు చేస్తాం.– 2024 ఏప్రిల్ 30న ఉమ్మడి మేనిఫెస్టో విడుదల సందర్భంగా పవన్ కళ్యాణ్ (మే 1వ తేదీ ఈనాడు క్లిప్లింగ్)⇒ భవిష్యత్‌కు గ్యారెంటీ–బాబు ష్యూరిటీ నినాదంతో ‘ఆడబిడ్డ నిధి’ నుంచి 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇస్తాం. – రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ–జనసేన నాయకులు ఇంటింటా కరపత్రాల ప్రచారంబకాయిలతో కలిపి ఇవ్వాలిచంద్రబాబునాయుడు ఎన్నికల్లో గెలిచేందుకు లేనిపోని హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకున్నారు. ఇన్నాళ్లూ నిధులు లేవు.. సంపద సృష్టించే మంత్రం ఉంటే చెవిలో చెప్పండి అన్నారు. ఇప్పుడు సంపద సృష్టించేశాం అంటున్నారు. పేదలు బాగా సంపాదిస్తున్నారట! ఇంకా నాలుగేళ్లకు పేదరికం పోకపోతే ఆడబిడ్డ నిధిని పీ4కు లింక్ చేస్తానని చెబుతున్నారు. పీ4 అంటే ప్రైవేటు వ్యక్తులు. వారికి ప్రభుత్వ పథకంతో ఏం సంబంధం? దీన్నిబట్టి పథకానికి పూర్తిగా మంగళం పాడినట్లే. మహిళలకు ఇచ్చిన హామీ మేరకు నెలకు రూ.1500 చొప్పున ఇవ్వాలి. ఇప్పటికే ఏడాది పూర్తయినందున బకాయిలతో కలిపి ఇవ్వాలి. – వి.భారతి, ఏపీ మహిళా సమాఖ్య నగర కార్యదర్శి, కర్నూలుప్రజలు మోసపోయారని తెలుస్తోంది2029లోపు పేదరికాన్ని నిర్మూలిస్తా.. అప్పటికీ పేదరికం ఉంటే అప్పుడు పీ4కు ఆడబిడ్డి నిధిని అనుసంధానం చేస్తానని చంద్రబాబు చెప్పడం సరికాదు. అంటే 2029 లోపు ఆడబిడ్డ నిధి అమలు చేయరా? మీకు ఇచ్చిన గడువే 2028 వరకు. 2029లో ఎన్నికలకు వెళ్లాలి. ఆడబిడ్డ నిధి అనేది ప్రభుత్వ పథకం. పీ4 అనేది పారిశ్రామిక వేత్తలు, ప్రైవేటు వ్యక్తులు చేసే సాయం. ఈ రెండిటిని కలపడం అంటే ఎలా? 18 ఏళ్లు నిండిన ప్రతీ ఆడబిడ్డకు డబ్బులు ఇవ్వాలి. చంద్రబాబు మాటలు వింటుంటే మరోమారు ప్రజలు మోసపోయారని తెలుస్తోంది. – ఎం.శిరీష, ఇందిరాగాంధీ నగర్, కర్నూలుబాబువన్నీ బూటకపు హామీలేగత ఎన్నికల సమయంలో చంద్రబాబునాయుడు రాష్ట్రంలోని 18 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి కింద ఏడాదికి రూ.18,000 ఇస్తానని నమ్మించి మహిళల ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చారు. ఇప్పటి వరకు ఆ ఊసే ఎత్తడం లేదు. ఇప్పుడు పీ–4 స్కీమ్‌తో అనుసంధానం చేస్తానని చెప్పడం చూస్తే ఇదొక మోసపూరిత హామీగా మిగలనుందని అర్థమవుతోంది. అధికారంలోకి రాక ముందు ఒకలా, అధికారంలోకి వచ్చాక మరోలా చంద్రబాబునాయుడు వ్యవహరిస్తున్నారు. మహిళలందరం వచ్చే ఎన్నికల్లో తగిన రీతిలో బుద్ధి చెప్పి తీరుతాం. – ఎస్కే మస్తాన్‌బీ, నెల్లూరుఆడబిడ్డ నిధి ఇవ్వరా?కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ హామీగానే ఉండిపోయింది. ఆడబిడ్డ నిధి ఇస్తానని చెప్పడంతో లక్షలాది మంది ఆడబిడ్డలు ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నారు. సంపద సృష్టించామని చెబుతున్నారుగా.. ఇవ్వండి మరి. మొత్తం బకాయిలతో కలిపి వెంటనే ఇవ్వాలి. – కె.కృష్ణవేణి, దెందులూరు, ఏలూరు జిల్లామాట నిలుపుకోవాలిఅధికారంలోకి రాగానే ఏడాదికి రూ.18,000 చొప్పున ఆడబిడ్డ నిధి పథకం కింద ఇస్తామన్నారు. ఏడాదవుతున్నా దాని ఊసే లేదు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ హామీని అమలు చేయడం లేదు. సూపర్ సిక్స్ పథకాల కోసం అందరం ఎదురు చూస్తున్నాం. కూటమి నేతలు మాటలు చెబుతూ కాలయాపన చేస్తున్నారే గానీ పథకాల గురించి పట్టించుకోవడం లేదు. మాట నిలుపుకోకుండా మోసం చేయడం సరికాదు. – డాలు మనీషా, చిన్న కనుమళ్ల, ప్రకాశం జిల్లా ఈ పథకం అమలు కాదికఆడబిడ్డ నిధి పథకాన్ని ఇప్పటి వరకు అమలు చేయలేదు. ఇంకా పేదరికం ఉంటే పీ4 ద్వారా అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉంది. దీని ప్రకారం దాతలు ముందుకు వస్తే వారికి నచ్చిన వ్యక్తులకే అమలు చేస్తారు. దీని వల్ల నిజమైన లబ్ధిదారులకు అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. అసలు ఇక ఈ పథకం అమలు కాదనిపిస్తోంది. – కర్రి వెంకటలక్ష్మి, సామర్లకోట, కాకినాడ జిల్లామరోసారి మోసం చేస్తున్నారుఅధికారంలోకి వస్తే 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి కింద ఏడాదికి రూ.18,000 చొçప్పున ఇస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా పథకం అమలు చేయలేదు. ఎప్పుడు ఇస్తారో కూడా చెప్పడం లేదు. ఇది చాలా అన్యాయం. పీ4తో ఆడ బిడ్డ నిధిని అనుసంధానిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం చూస్తే మహిళలను మరోసారి మోసం చేస్తున్నారని తెలుస్తోంది. – సూరెడ్డి హైమావతి, మెంటాడ, విజయనగరం జిల్లాప్రభుత్వంపై నమ్మకం పోయింది కూటమి ప్రభుత్వం 18 నుంచి 59 ఏళ్ల మహిళలందరికీ ఏడాదికి రూ.18,000 ఇస్తామని హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చి సంవత్సరం కావస్తున్నప్పటికీ దాని గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. ఎప్పుడు ఇస్తారో చెప్పలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి మాటలతో ఈ పథకం అమలయ్యే సూచనలే కనిపించడం లేదు. ఇలా చేయడం సరికాదు. ఈ ప్రభుత్వంపై నమ్మకం పోయింది. – పి యేసమ్మ, ప్రకాష్ నగర్, కడప

పీఎస్ఎల్వీ-సీ61 ప్రయోగంలో సాంకేతిక సమస్య
శ్రీహరికోట: భారత అంతరిక్ష సంస్థ ఇస్రో చేపట్టిన పీఎస్ఎల్వీ-సీ61 ప్రయోగంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ మేరకు ఇస్రో ఓ ప్రకటనలో తెలిపింది. పీఎస్ఎల్వీ-సీ61 మూడో దశలో సమస్య తలెత్తినట్టు ఇస్రో చైర్మన్ నారాయణ వెల్లడించారు. వివరాల ప్రకారం.. ఇస్రో 101వ రాకెట్ ప్రయోగం పీఎస్ఎల్వీ-సీ61ను ఆదివారం తెల్లవారుజామున చేపట్టింది. ఈ ప్రయోగంలో భాగంగా ఈ ప్రయోగంలో భాగంగా రాకెట్ ఆకాశంలోకి దూసుకెళ్లిన కొంతసమయంలోనే సాంకేతిక సమస్యలు వచ్చాయి. ఈ క్రమంలో ఇస్రో చైర్మన్ స్పందిస్తూ.. పీఎస్ఎల్వీ-సీ61 ప్రయోగంలో మూడో దశలో సాంకేతిక సమస్య తలెత్తినట్టు చెప్పారు. ఈ మిషన్ అసంతృప్తిగా ముగిసిందని ప్రకటించారు. సమస్యపై విశ్లేషించి వివరాలను వెల్లడిస్తామన్నారు. #WATCH | Sriharikota, Andhra Pradesh | ISRO Chief V Narayanan says, "Today we attempted a launch of PSLV-C61 vehicle. The vehicle is a 4-stage vehicle. The first two stages performed as expected. During the 3rd stage, we are seeing observation...The mission could not be… pic.twitter.com/By7LZ8g0IZ— ANI (@ANI) May 18, 2025ఇక, ప్రయోగంలో అత్యంత అధునాతనమైన నిఘా ఉపగ్రహం ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (EOS-09)ను పీఎస్ఎల్వీ నింగిలోకి తీసుకెళ్లింది.ఈ ఉపగ్రహం ద్వారా ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా భూఉపరితలాన్ని స్పష్టంగా హైరిజల్యూషన్‌తో చిత్రీకరణ చేయగలదు. క్లిష్టమైన పరిస్థితుల్లోనూ పని చేయనుంది. దీని బరువు 1710 కిలోలు. EOS-09 నింగిలో నిఘానేత్రంగా పనిచేయనుంది. దేశ సరిహద్దుల్లో శత్రువుల కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టనుంది. అత్యంత చిన్న వస్తువులను కూడా గుర్తించగల అల్ట్రా హై రిజల్యూషన్ ఇమేజింగ్‌ను ఇస్రో శాస్త్రవేత్తలు ఇందులో అమర్చారు. #WATCH | Indian Space Research Organisation (ISRO) launches PSLV-C61, which carries the EOS-09 (Earth Observation Satellite-09) into a SSPO orbit, from Sriharikota, Andhra Pradesh. EOS-09 is a repeat satellite of EOS-04, designed with the mission objective to ensure remote… pic.twitter.com/4HVMZzXhP0— ANI (@ANI) May 18, 2025

చైనా అండతో రెచ్చిపోయిన బంగ్లాదేశ్.. బిగ్ షాకిచ్చిన భారత్
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ నుంచి వచ్చే రెడీమేడ్ దుస్తులు, కొన్ని ప్రాసెస్ట్ ఆహార వస్తువుల దిగుమతులపై నౌకాశ్రయాల్లో కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. వాణిజ్య శాఖ ఆధ్వర్యంలో పనిచేసే విదేశీ వాణిజ్యం డైరెక్టరేట్ జనరల్(డీజీఎఫ్టీ) ఇందుకు సంబంధించిన ఒక నోటిఫికేషన్‌ను శనివారం విడుదల చేసింది. అయితే, భారత్ మీదుగా నేపాల్, భూటాన్ మినహా ఇతర అన్ని దేశాలకు వెళ్లే వస్తువులకు ఈ ఆంక్షలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. బంగ్లాదేశ్ రెడీమేడ్ దుస్తుల దిగుమతులకు ఏ ల్యాండ్ పోర్టులోనూ అనుమతి లేదని కేంద్రం స్పష్టం చేసింది. వీటిని కోల్‌కతా, నవసేవా పోర్టుల్లో మాత్రమే అనుమతిస్తామని పేర్కొంది. ఫ్రూట్ ఫ్లేవర్డ్ కార్బొనేటెడ్ డ్రింకులు, బేక్డ్ గూడ్స్, స్నాక్స్, చిప్స్, కాటన్, కాటన్ యాన్న్ వేస్ట్, ప్లాస్టిక్, పీవీసీ ఫినిష్ట్ గూడ్స్, డైస్, గ్రాన్యుల్స్, వుడెన్ ఫరి్నచర్, వంటి వాటిని చంగ్రాబంధా, ఫుల్బారీ ల్యాండ్ కస్టమ్స్ స్టేషన్ల ద్వారాగానీ, అస్సాం, మణిపూర్, త్రిపుర, మిజోరంలలోని ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టుల ద్వారా గానీ అనుమతించబోమని తేల్చింది. చేపలు, ఎల్పీజీ, వంట నూనెల దిగుమతులకు పోర్టుల్లో ఆంక్షలు వర్తించవని స్పష్టం చేసింది. ఇవి తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రకటించింది. బంగ్లాదేశ్ ఆపద్ధర్మ ప్రభుత్వ చీఫ్ యూనుస్ ఇటీవల చైనా పర్యటన సమయంలో భారత్‌కు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యల పర్యవసానమే ఈ ఆంక్షలని పరిశీలకులు అంటున్నారు. నౌకల ద్వారా భారత్‌లోని పోర్టులకు తమ వస్తువులను తరలించుకుని, ఇక్కడి నుంచి విదేశాలకు ఎగు మతులు చేసుకునేలా బంగ్లాదేశ్‌కు 2020 మే నుంచి కేంద్రం వెసులుబాటు కల్పించింది. 🔴#BREAKING: India restricts garment imports from Bangladesh to Kolkata & Mumbai ports — land ports closed.Seen as a reciprocal move after Bangladesh curbed Indian cotton & rice exports.#India #Bangladesh #Trade #GarmentImports #Pakistan pic.twitter.com/3piBRtXfnh— TheWarPolitics (@TheWarPolitics0) May 17, 2025

ఇది స్టేట్ ఫ్యాక్షనిజం కాదా?
ప్రభుత్వ యంత్రాంగంలో ముఠా తత్వాన్ని ప్రవేశపెడితే ఎలా ఉంటుంది? అచ్చంగా నేటి ఆంధ్రప్రదేశ్ పరిపాలన మాదిరిగా ఉంటుంది. కక్షలూ, కార్పణ్యాలూ, ప్రత్యర్థుల వేటలే ప్రధానాంశాలుగా సర్కారు ఎజెండాను ఆక్రమించాయి. ప్రజా శ్రేయస్సు గురించి మాట్లాడడం కూడా ఇప్పుడు అప్రకటిత నిషేధిత జాబితాలో చేరిపోయినట్టుంది. ఏలినవారిచ్చిన హామీల అమలు గురించి ప్రశ్నించడం కూడా నేరమైపోతున్నది. కేసుల బెత్తం కళ్లెర్రజేస్తున్నది. జైళ్లు నోళ్లు తెరుస్తున్నాయి.వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి, నందిగం సురేశ్, సుధారాణి, కృష్ణవేణి, రవీందర్‌రెడ్డి... ఇలా ఎంతమంది గొంతుకలపైకి ఫ్యాక్షన్ సర్కార్ పంజా విసిరిందో చూస్తూనే ఉన్నాము. అస్మదీయ బూతు జాగిలాలు మాత్రం ఎంతయినా పెట్రేగిపోయే వెసులు బాటును కల్పించారు. మొక్కుబడిగా ఒక్క పచ్చి బూతు జాగి లాన్ని అత్తారింటికి పంపినట్టు ఓ నాలుగు రోజులు లోపలికి పంపించి, సగౌరవంగా విడిచిపెట్టేశారు. ఈ బూతుశ్రీ కంటే కరుడుగట్టిన తీవ్రవాదులా... వంశీ, పోసాని, నందిగం వగైరాలు?కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి కాకముందే చంద్రబాబు అరెస్టుకు ప్రతీకారం తీర్చుకోవాలన్న దుగ్ధ ప్రభుత్వ యంత్రాంగంలో కనిపిస్తున్నది. యెల్లో మీడియాలో జ్వలిస్తు న్నది. అందుకు అవకాశమున్నదా అనే మీమాంస అవసరం లేదు. తాము కోరుకున్నట్టుగా కేసులు రాసుకోవడానికి గత ప్రభుత్వం అమలుచేసిన మద్యం పాలసీని ఎంచుకున్నారు. నిజానికి జగన్ ప్రభుత్వ పాజిటివ్ అంశాల్లో మద్యం పాలసీ కూడా ఒకటి. ఒక పాజిటివ్ అంశాన్ని నెగెటివ్ కోణంలో చూపెట్టడానికి రోజుకో సారా మజిలీ కథను, పూటకో పుక్కిటి పురాణాన్ని ప్రభుత్వ యంత్రాంగం వండి వార్చడం, యెల్లో మీడియా వడ్డించడం ఒక దైనందిన దైవకార్యంగా చేపట్టినట్టు కనిపిస్తున్నది. తాజాగా రిమాండ్ రిపోర్టుల పేరుతో వెలువ రిస్తున్న ఫిక్షన్ సాహిత్యంతో కొంతమందినైనా గందరగోళానికి గురి చేయాలనే ఉద్దేశం కనిపిస్తున్నది.జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అమలుచేసిన మద్యం విధా నంలో గందరగోళానికి గురి కావలసినంత సంక్లిష్టత ఏమీ లేదు. సామాన్యుడికి కూడా అర్థమయ్యే సులభమైన విధానం అది. మద్యం మహమ్మారి విష ప్రవాహానికి సంసారాలు ఛిద్రమవు తున్నాయనే మహిళల ఆక్రందనను ‘పాదయాత్ర’ సందర్భంగా జగన్ గమనించారు. దీనికి ముగింపు పలకడం కోసం మద్య నిషేధం విధించాలనే ఆలోచన చేశారు. అయితే గత అనుభవాల దృష్ట్యా ఎకాయెకిన నిషేధించడం సాధ్యమయ్యే పని కాదని, ఆచరణాత్మక పద్ధతిలో దశలవారీ నిషేధాన్ని ఎంచుకున్నారు. మద్యం షాపుల సంఖ్యను తగ్గించారు. లాభాపేక్షతో దొంగ చాటు అమ్మకాలు, కల్తీ వంటివి జరగకుండా ప్రైవేట్ వ్యాపా రాన్ని తొలగించి ప్రభుత్వ పరిధిలోకి అమ్మకాలను తీసు కొచ్చారు. ఫలితంగా 43 వేల బెల్ట్‌షాపులను విజయవంతంగా మూసివేయడం సాధ్యపడింది. విచ్చలవిడిగా మద్యం తయారీని నిరుత్సాహపరచడానికి ఒక్క డిస్టిలరీకి కూడా కొత్తగా అనుమతి నీయలేదు. మద్యం దుకాణాల సంఖ్యను కూడా గణనీయంగా పది శాతం కంటే ఎక్కువగానే తగ్గించారు. వాటికి అనుబంధంగా ఉండే పర్మిట్ రూములూ మూతపడ్డాయి. దుకాణంలో అమ్మ కాలు జరిగే సమయాన్ని తగ్గించి, రాత్రి 9 గంటలకే మూసే శారు. టీడీపీ హయాంలో అనధికారికంగా 24 గంటలూ మద్యం అమ్మకాలు సాగేవి. వ్యాపారులంతా టీడీపీ అనుయాయులే కనుక, పైదాకా మామూళ్లు ఇచ్చేవారే కనుక ఈ వేళల నియంత్రణ సాధ్యం కాలేదు.జగన్ ప్రభుత్వ చర్యల పర్యవసానంగా మద్యం విక్రయాలు గణనీయంగా పడిపోయాయి. చంద్రబాబు సర్కార్ చివరి సంవత్సరంలో (2018–2019) ఐఎమ్ఎఫ్ఎల్, బీర్లు కలిపి 6 కోట్ల 61 లక్షల కేసుల అమ్మకాలు జరిగితే, జగన్ ప్రభుత్వ చివరి సంవత్సరానికి (2023–24) 4 కోట్ల 44 లక్షలకు పడిపోయింది. అంటే అమ్మకాల్లో మూడో వంతు తగ్గింది. దశలవారీ మద్య నిషేధం అనే జగన్ సర్కార్ పెట్టుకున్న ఒక లక్ష్యంలో దీన్నొక పెద్ద ముందడుగుగా పరిగణించాలి.వినియోగం ఇంత తగ్గినా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం తగ్గలేదు. పైపెచ్చు గణనీయంగా పెరిగింది. మద్యాన్ని తయారు చేసే డిస్టిలరీలకు కొత్తగా ఒక్క అనుమతిని కూడా జగన్ ప్రభుత్వం ఇవ్వలేదు. అధిక లాభాలకోసం విచ్చలవిడిగా అమ్మకాలు సాగించే ప్రైవేట్ వ్యక్తులను ఈ వ్యాపారం నుంచి తప్పించారు. మొత్తం విధానం ఇంత పారదర్శకంగా ఉన్న ప్పుడు స్కామ్ ఎక్కడ జరిగే అవకాశముందన్న ప్రశ్నల జోలికి కూటమి సర్కార్ గానీ, దర్యాప్తు చేస్తున్న సిట్ బృందం కానీ వెళ్లదలచుకోలేదు.జగన్ ప్రభుత్వ హయాంలో చంద్రబాబును అరెస్టు చేశారు కనుక, ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవలసిందే, కేసులు నడపాల్సిందే అన్నట్టుగా వారి వైఖరి కనబడుతున్నది. మద్యం అమ్మకాల్లో జగన్ ప్రభుత్వం 3 వేల కోట్ల స్కామ్‌కు పాల్పడిందని అధికారంలోకి వచ్చిన నెల రోజులకే చంద్రబాబు తేల్చిపారేశారు. జూలైలో శ్వేతపత్రం పేరుతో జరిగిన కార్యక్ర మంలో ఆయన ఈ లెక్క చెప్పారు. ఆయన నోటివెంట వచ్చిన ‘అంకె’ను నిజం చేయడానికి దర్యాప్తు బృందం ఇప్పుడు కథలు అల్లుతున్నట్టు కనిపిస్తున్నది. ఈ కేసులో ప్రభుత్వ ఖజానా నుంచి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడానికి తీసుకున్న నిర్ణయం ఏమన్నా ఉన్నదా? నిబంధనలకు విరుద్ధంగా ప్రజా ధనాన్ని ఎవరికైనా దోచిపెట్టిన అంశం ఇమిడి ఉన్నదా? లంచా లకు ఆశించి ప్రైవేట్ వ్యక్తులకు వనరుల్ని కట్టబెట్టిన వైనం ఈ కథలో కనబడుతున్నదా? మరి స్కామ్ ఎక్కడ?చంద్రబాబును అరెస్టు చేసిన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఇందుకు పూర్తిగా భిన్నమైనది. రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ కోసం జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీ ఉదారంగా సాయం చేస్తున్నదనీ, ఇందులో పది శాతం నిధుల్ని సమకూర్చితే వాళ్లు 90 శాతం విడుదల చేస్తారనీ ఓ కట్టుకథను అల్లిపెట్టారు. సీమెన్స్ కంపెనీ ఆ తదనంతర కాలంలో స్వయంగా ఖండించడం వల్ల ఇది కట్టుకథని రూఢి అయింది. పది శాతం కింద రూ.371 కోట్లను విడుదల చేయాలని ముఖ్యమంత్రి కార్యా లయం నుంచి ఆర్థిక శాఖకు ఆదేశాలు వెళ్లాయి. సదరు సీమెన్స్ నిధులను విడుదల చేయకముందే పది శాతాన్ని విడుదల చేయడం నిబంధనలకు విరుద్ధమన్న అభ్యంతరాలను తోసి పుచ్చి నిధుల విడుదలకు ముఖ్యమంత్రి కార్యాలయం ఒత్తిడి చేసింది.పైగా తాము చెబుతున్న సీమెన్స్ కంపెనీకి కాదు, మధ్యలో ఓ బ్రోకర్ కంపెనీకి ఈ నిధులు బదిలీ చేశారు. అక్కడి నుంచి అందులో 241 కోట్ల రూపాయలు పుణె, అహ్మదా బాదుల్లోని షెల్ కంపెనీల ద్వారా ప్రయాణించి దుబాయ్,సింగపూర్ కంపెనీలకు చేరుకున్నాయని, ఆ పిదప చేరాల్సిన చివరి మజిలీకి కూడా చేరుకున్నాయని సీఐడీ ఆధారాలతో నిరూపించింది. 241 కోట్లతో స్కిల్ డెవలప్మెంట్కు అవస రమైన పరికరాలు కొనుగోలు చేసినట్టు పుణె షెల్ కంపెనీ నకిలీ ఇన్వాయిస్లు సృష్టించి ఈడీకి దొరికిపోవడంతో ఈ బాగోతం డొంకంతా కదిలింది. చంద్రబాబు అరెస్టు వెనుక ఇంత నిరూ పణ ఉన్నది.జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన మద్యం పాలసీలో ఒక లక్ష్యం ఉన్నది. ఒక సదుద్దేశం ఉన్నది. ఆ లక్ష్యసాధనలో అనుకున్న మేరకు విజయం సాధించారు కూడా! ఇందులో ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టే అంశం లేదు. స్కామ్ జరగ డానికి కూడా అవకాశాలు లేవు. చంద్రబాబు సర్కార్ 2015లో మద్యం దుకాణాలు, బార్లపై విధించే ప్రివిలేజ్ ఫీజును తొల గిస్తూ ఒక రహస్య జీవోను విడుదల చేసింది.ఇందులో దురుద్దేశం ఉన్నది. డబ్బు సంపాదించే లక్ష్యం కనిపిస్తున్నది. మద్యం దుకాణాలు గానీ, బార్లు గానీ వాటి ఏడాది టార్గెట్‌ను మించి అమ్మకాలు సాగిస్తే ఆ అదనపు అమ్మకాలపై ప్రభుత్వాలు ప్రివిలేజ్ ఫీజు వసూలు చేసేవి. ప్రభుత్వానికి ఇదొక ఆదాయ వనరుగా ఉండేది. చీకటి జీవో ద్వారా చంద్రబాబు ఆ ఫీజును మాఫీ చేశారు. తద్వారా నాలుగేళ్లలో ఖజానాకు 5 వేల కోట్లు నష్టం జరిగిందని అంచనా!ఖజానాకు గండి పడినందువలన ప్రైవేట్ వ్యాపారులు లాభపడ్డారు. తమకు లాభాలు తెచ్చిపెట్టే నిర్ణయాన్ని తీసుకు న్నందుకు ప్రైవేట్ వ్యక్తులు లంచాలు చెల్లించే అవకాశం ఉంటుందా? ఉండదా? దాన్ని స్కామ్ అంటారా, లేదా? అట్లాగే 2014–2019 మధ్యకాలంలో 200 రకాల దిక్కుమాలిన బ్రాండ్లు రంగప్రవేశం చేశాయి. దీనివల్ల లాభాలు పొందింది డిస్టిలరీల వాళ్లు! ఏపీకి మద్యం సరఫరా చేస్తున్న 20 డిస్టిలరీలలో 14 చంద్రబాబు హయాంలో అనుమతి తెచ్చుకున్నవేనని సమా చారం. మిగిలిన ఆరు వేర్వేరు సమయాల్లో అనుమతి పొందాయి.జగన్ అనుమతించిన డిస్టిలరీ ఒక్కటి కూడా లేదు. ఈ విషయాలను పరిశీలించినప్పుడు ఎవరిది పారదర్శక విధా నమో, ఎవరిది కుంభకోణ విధానమో గ్రహించడం బ్రహ్మ విద్యేమీ కాదు. ప్రస్తుత లిక్కర్ కేసు నమోదు వెనుక రాజకీయ దురుద్దేశా లున్నాయని పిటిషనర్లు ప్రాథమికంగా రుజువు చేయగలిగారని సర్వోన్నత న్యాయస్థానం కూడా శుక్రవారం నాడు వ్యాఖ్యానించినట్టు వార్తలు వచ్చాయి. సాక్షులనూ, సహ నిందితులనూ ఫలానా విధంగా వాఙ్మూలం ఇవ్వాలని ఒత్తిడి చేయడం గానీ, బెదిరించడం గానీ, ప్రలోభపెట్టడం గానీ చేయవద్దని ఏపీ సీఐడీని సర్వోన్నత న్యాయస్థానం హెచ్చరించింది.రిమాండ్ రిపోర్టుల పేరుతో స్వీయ కవితల్ని ప్రచారం చేస్తున్నారని వినిపిస్తున్న ఆరోపణలకు సుప్రీం వ్యాఖ్యలు బలం చేకూర్చి నట్లయింది. అసలు స్కామ్‌కు అవకాశమే లేనిచోట ఏదో తవ్వి తీస్తామని షో నడపడం వెనుక అసలు ఉద్దేశం వేరు. ఈ పేరుతో కీలక వ్యక్తులను అరెస్టు చేసి, ప్రధాన ప్రతిపక్ష శ్రేణుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడం మొదటిది. తమ పరిపాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చడం రెండవది.కూటమి ప్రభుత్వం ఏడాది పాలన ఓ వైఫల్యాల పుట్ట. అవినీతి విశృంఖలంగా మారింది. చిరువ్యాపారులు 30 పర్సెంట్ ‘యెల్లో ట్యాక్స్’ కట్టలేక అల్లాడుతున్నారు. చికెన్, మటన్ అమ్మేవాళ్లను కూడా వదిలిపెట్టడం లేదు. జీఎస్టీ దూరని చోటుకి కూడా ‘యెల్లో ట్యాక్స్’ దూసుకుపోతున్నది. రైతాంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతున్నది. లాభసాటి సంగతి దేవుడెరుగు, గిట్టుబాటు ధర కూడా దక్కలేదు. పేదవర్గాల పరిస్థితి మరింత దారుణం. ‘సంపద’ సృష్టించి సంక్షేమ పథకా లను అమలు చేస్తామని చెప్పారు. ఏడాది గడిచిపోయింది. ‘తల్లికి వందనం’ ఈ జూన్‌కు రెండేళ్ల బకాయి పడింది.80 లక్షల మంది బడిపిల్లలకు 30 వేల చొప్పున చెల్లించాల్సి ఉన్నది. ‘అన్నదాతా సుఖీభవ’ కింద ఇరవై వేల చొప్పున రెండేళ్ల నిధులను ఈ జూన్‌లో జమ చేయవలసి ఉన్నది. అలాగే ‘ఆడబిడ్డ నిధి’ కూడా! ‘పీ–ఫోర్’ పథకం తెచ్చాం, డబ్బున్న వాళ్లు తృణమో పణమో ధర్మం చేస్తే ‘ఆ సంక్షేమం’తో పండగ చేసుకోవచ్చని ఇవ్వాళ కర్నూలులో చంద్రబాబు చెప్పారు.స్వయానా శాసనసభ డిప్యూటీ స్పీకర్ నియోజకవర్గంలో దశాబ్దాలుగా పేదలు నివాసముంటున్న గృహాలను అధికారులు నేలమట్టం చేస్తుంటే ఇదేమి అన్యాయమని ప్రశ్నించే దిక్కు కూడా లేదు. పేద బిడ్డలకు నాణ్యమైన విద్య కోసం గత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను అటకెక్కించారు. పేద ప్రజల వ్యతిరేక విధానాలు రాజ్యమేలుతున్నాయి. ఉద్దేశపూర్వ కంగానే రైతాంగాన్ని దివాళా తీయించి రోడ్డెక్కించే పాలసీ అమలవుతున్నది. క్షయరోగంతో తీసుకుంటున్నవాడి నెత్తిన కిరీటం పెడితే అతడు వెలిగిపోతాడా? అమరావతిలో నాలుగు బంగళాలు కడితే రాష్ట్రంలోని విశాల ప్రజానీకం అభివృద్ధి చెందినట్టేనా? ... ఇటువంటి ప్రశ్నలు వేసే గొంతులు నొక్కే రాజ్యవిధానం ఇప్పుడు ఏపీలో అమలవుతున్నది.రాజ్యమే ఒక ఫ్యాక్షనిస్టు అవతారమెత్తి పరిపాలిస్తున్నది. ఎదురు మాట్లాడితే కేసులతో, కటకటాలతో బెదిరిస్తున్నది. ఈ ఫ్యాక్ష నిజం కేవలం ప్రతిపక్ష రాజకీయ నేతల్నే టార్గెట్ చేయడం లేదు. గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన ఐఏఎస్, ఐపీఎస్ అధికా రులను కూడా వేటాడుతున్నది. ఇది భారతదేశంలో ఎన్నడూ, ఎక్కడా జరగని దారుణం. ముఠా తత్వానికి పరాకాష్ఠ. ఈ మూడేళ్లూ (జమిలితో 2028లో ఎన్నికలు జరిగే అవకాశం) ఎటువంటి ప్రతిఘటనా లేకుండా అమరావతి రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగిపోవాలని ఫ్యాక్షన్ పాలన భావిస్తున్నది. అందుకు ఢిల్లీ ఆశీస్సుల కోసం యువనేత శని వారం నాడు కుటుంబ సమేతంగా ప్రధానిని కలిశారు. తమరు అనుమతిస్తే ఏడాది ఉత్సవాల వెంటనే పట్టాభిషేకం చేసుకుంటానని అందుకు ఆశీర్వాదం కావాలని అడిగి ఉంటారని అంచనా. కుదరకపోతే ఈ నెలాఖరున కడపలో జరిగే ‘మహా నాడు’లో పార్టీ అధ్యక్ష స్థానమైనా యువగళానికి దక్కుతుందంటున్నారు. ఆ వెంటనే కూటమి ఏడాది పండుగ. ఇటువంటి పర్వదినాలు నిర్విఘ్నంగా గడిచిపోవాలనీ, ఎటువంటి నిరస నలూ వినిపించకూడదనీ ‘నిశ్శబ్దీకరణ’ కార్యక్రమాన్ని ఫ్యాక్ష నిస్టు ప్రభుత్వం దీక్షతో అమలుచేస్తున్నది.ఏపీకి మద్యం సరఫరా చేస్తున్న 20 డిస్టిలరీలలో 14 చంద్రబాబు హయాంలో అనుమతి తెచ్చుకున్నవేనని సమాచారం. మిగిలిన ఆరు వేర్వేరు సమయాల్లో అను మతి పొందాయి. జగన్ అనుమతించిన డిస్టిలరీ ఒక్కటి కూడా లేదు. ఈ విషయాలను పరిశీలించినప్పుడు ఎవరిది పారదర్శక విధానమో, ఎవరిది కుంభకోణ విధానమో గ్రహించడం బ్రహ్మ విద్యేమీ కాదు. ఈ కేసు నమోదు వెనుక రాజకీయ దురుద్దేశాలు న్నాయని పిటిషనర్లు ప్రాథమికంగా రుజువు చేయగలిగా రని సర్వోన్నత న్యాయస్థానం కూడా శుక్రవారం నాడు వ్యాఖ్యానించినట్టు వార్తలు వచ్చాయి.సాక్షులనూ, సహ నిందితులనూ ఫలానా విధంగా వాఙ్మూలం ఇవ్వాలని ఒత్తిడి చేయడం గానీ, బెదిరించడం గానీ, ప్రలోభ పెట్టడం గానీ చేయవద్దని ఏపీ సీఐడీని సర్వోన్నత న్యాయ స్థానం హెచ్చరించింది. రిమాండ్ రిపోర్టుల పేరుతో స్వీయ కవితల్ని ప్రచారం చేస్తున్నారని వినిపిస్తున్న ఆరోపణలకు సుప్రీం వ్యాఖ్యలు బలం చేకూర్చినట్లయింది. అసలు స్కామ్‌కు అవకాశమే లేనిచోట ఏదో తవ్వి తీస్తామని షో నడపడం వెనుక అసలు ఉద్దేశం వేరు. ఈ పేరుతో కీలక వ్యక్తులను అరెస్టు చేసి, ప్రధాన ప్రతిపక్ష శ్రేణుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడం మొదటిది. తమ పరిపాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చడం రెండవది.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com

రేపటి నుంచే భూముల రీసర్వే.. రెవెన్యూ వర్గాల ఆందోళన
సాక్షి, హైదరాబాద్: ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకొని పైలట్ పద్ధతిలో భూముల రీసర్వేకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడ్రనైజేషన్ ప్రోగ్రామ్ (డీఐఎల్ఆర్ఎంపీ) మార్గదర్శకాలకు అనుగుణంగా డ్రోన్లు లేదా ప్యూర్ గ్రౌండ్ ట్రూతింగ్ పద్ధతి ద్వారా ఎంపిక చేసిన ఐదు గ్రామాల్లో ఈ సర్వే సోమవారం నుంచి నిర్వహించనుంది.ఇందుకోసం ఆయా గ్రామాల్లో 4–5 రోజులుగా భూముల సరిహద్దుల నిర్ధారణ జరుగుతుండగా రేపట్నుంచి సర్వే బృందాలు అక్కడకు వెళ్లనున్నాయి. ముందుగా మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలం సలార్‌నగర్, జగిత్యాల జిల్లా భీర్పూర్ మండలం కొమ్మనాపల్లి (కొత్త), ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం ములుగుమడ గ్రామాల్లోనే సర్వే నిర్వహించాలనుకున్నా ఆ తర్వాత సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం సాహెబ్‌నగర్, ములుగు జిల్లా వెంకటాపురం మండలం నూగూరు గ్రామాలను కూడా కలిపారు. ఈ ఐదు గ్రామాల్లో పైలట్ సర్వే నిర్వహించేందుకు మూడు ఏజెన్సీలను ఎంపిక చేశారు. భూముల రీసర్వేను సర్వే, సెటిల్మెంట్ శాఖ పర్యవేక్షించనుంది.గ్రామ పటాలు, కమతాల పటాల తయారీ.. భూముల రీసర్వేకు ప్రస్తుతం ఎంపిక చేసిన ఐదు గ్రామాల పటాలతోపాటు ప్రతి కమతానికి సరిహద్దులు నిర్ధారించి ఆయా కమతాల పటాలు కూడా రూపొందించనున్నారు. ఇందుకోసం ఆ గ్రామంలో ఎంత భూమి ఉంది.. ఎన్ని సర్వే నంబర్లున్నాయనే వివరాల ఆధారంగా సర్వేయర్లను మోహరించి ప్రతి సర్వే, బైసర్వే నంబర్లలోని కమతాలకు విడివిడిగా పటాలను తయారు చేయనున్నారు. ఇప్పటికే గ్రామాల్లో అందుబాటులో ఉన్న ఛెస్సలా, ఖాస్రా పహాణీ రికార్డులతో వాటిని సరిపోల్చి వివాదాల్లేని కొత్త పటాలను రెవెన్యూ రికార్డుల్లో చేర్చనున్నారు. ఈ గ్రామాల్లో ఎదురయ్యే అనుభవాల ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా భూముల రీసర్వే మార్గదర్శకాలు తయారవుతాయని సర్వే శాఖ అధికారులు చెబుతున్నారు. ఆ గ్రామానికి నక్ష లేదు! భూముల రీసర్వే కోసం ప్రభుత్వం ఎంపిక చేసిన ఐదు గ్రామాల్లోని రెండు గ్రామాల స్థితిగతులపై ‘సాక్షి’క్షేత్రస్థాయి సమాచారం సేకరించింది. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం ములుగుమడ, మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలం సలార్‌నగర్ గ్రామాల్లో పరిస్థితుల గురించి స్థానిక రెవెన్యూ యంత్రాంగాన్ని అడిగి తెలుసుకుంది. ములుగుమడ గ్రామం తొలుత బ్రిటిష్ పాలన అమలైన నాటి ఆంధ్ర ప్రాంతంలో ఉండేది. అలాగే నిజాం పాలించిన తెలంగాణ ప్రాంతంలో ప్రస్తుత కంచికర్ల మండలంలో ఉన్న పరిటాల అనే గ్రామం ఉండేది. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు జిల్లాల సరిహద్దుల మార్పుల్లో భాగంగా పరిటాలను గుంటూరు జిల్లాలో చేర్చి ములుగుమడను ఖమ్మం జిల్లాలో చేర్చారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భించాక కూడా ములుగుమడ తెలంగాణకే వచ్చింది.అయితే, భూరికార్డుల ప్రక్షాళన జరిగే వరకు ఆ గ్రామంలో భూముల రికార్డులు సెంట్ల రూపంలోనే ఉండేవి. గుంటలు, ఎకరాలుగా ఉండేవి కావు. భూరికార్డుల ప్రక్షాళన తర్వాత దాన్ని గుంటల్లోకి మార్చారు. కానీ ఆ గ్రామ నక్షను అప్పటి నుంచి ఇప్పటిదాకా తయారు చేయలేదు. దీంతో ములుగుమడ గ్రామానికి అధికారికంగా గ్రామ సరిహద్దులే లేకుండా పోయాయి. ఇప్పుడు ఈ గ్రామాన్ని పైలట్ సర్వే కింద ప్రభుత్వం ఎంపిక చేసింది. మొదటగా స్థానిక రెవెన్యూ యంత్రాంగం గ్రామ సరిహద్దులను నిర్ధారించింది. ఈ మేరకు గ్రామ నక్షను కూడా తయారు చేయనున్నాయి. ఈ గ్రామంలో మొత్తం 103 సర్వే నంబర్లకు 845 ఎకరాల వరకు భూమి ఉంది.ఈ భూమిలోని ప్రతి కమతాన్ని సర్వే, బైసర్వే నంబర్లవారీగా రీసర్వే నిర్వహించి ఆయా కమతాల హద్దులు నిర్ధారించి పటాలు తయారు చేయనున్నారు. ఇక మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలం సలార్‌నగర్ అనే గ్రామానిక నక్షతోపాటు ఇతర రెవెన్యూ రికార్డులన్నీ ఉన్నాయి. ఈ గ్రామంలోనూ ఇతర గ్రామాలతో సరిహద్దులను గుర్తించారు. ఈ గ్రామంలో 122 సర్వే నంబర్లలో 422 ఎకరాల భూమి ఉంది. సోమవారం నుంచి ఈ భూమిని కమతాల వారీగా సర్వే నిర్వహించి హద్దుల నిర్ధారణ ద్వారా కమతాలవారీగా పటాలు రూపొందించనున్నారు. ఏమవుతుందో... ఏమో? భూముల రీసర్వే విషయంలో రెవెన్యూ వర్గాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. తెలంగాణలో నెలకొన్న భౌగోళిక పరిస్థితులు, రెవెన్యూ రికార్డులను బట్టి సర్వే జరిపితే ప్రతి గ్రామంలో వందల సంఖ్యలో సమస్యలు వస్తాయని అంటున్నారు. ఈ విషయమై ఓ తహసీల్దార్ ‘సాక్షి’తో మాట్లాడుతూ ‘ఓ గ్రామంలోని 311 సర్వే నంబర్లో 200 ఎకరాలకు రికార్డు ఉంది. కానీ ఆ సర్వే నంబర్లో 300 ఎకరాల భూమి ఉంది. ఆ మేరకు రైతులకు 300 ఎకరాలకు పాసుపుస్తకాలున్నాయి.కానీ, రెవెన్యూ రికార్డును మార్చలేకపోతున్నాం’అని అన్నారు. మరోవైపు భూకబ్జా ఓ సర్వే నంబర్లో ఉంటే రికార్డు మరో సర్వే నంబర్లో ఉంటుందని.. రాష్ట్రంలోని మొత్తం భూముల్లో 35–40 శాతం భూములకు ఇదే సమస్య వస్తుందన్నారు. రీసర్వేలో ఇదే విషయం తేలితే ఆయా గ్రామాల్లోని రికార్డులు, రైతుల పాసుపుస్తకాలన్నింటినీ మార్చాల్సి వస్తుందని చెప్పారు. రీసర్వే సులభమైనప్పటికీ అనంతరం ఎదురయ్యే సమస్యల పరిష్కారమే పెద్ద సవాల్ అని అభిప్రాయపడ్డారు.

బాబుకు ఈనాడు నిత్య సన్మానం పాత్రికేయానికి తీరని అవమానం
సాక్షి, అమరావతి: ఎద్దు ఈనిందంటే గాటికి కట్టేయండన్న చందంగా తయారైంది ఎల్లో మీడియా. ప్రజలు ఏమనుకుంటారన్న సిగ్గూ, ఎగ్గూ లేకుండా చంద్రబాబు కోసం ఎంతగా బరితెగించడానికైనా సై అంటోంది. వలువలూడదీసుకుని పచ్చి అబద్ధాలను అచ్చేస్తోంది. వ్యవసాయానికి పగటి పూట 9 గంటల పాటు ఉచిత విద్యుత్‌ను 30 ఏళ్ల పాటు హక్కుగా అందించాలని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం.. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈసీఐ–సెకీ)తో కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై విషం చిమ్ముతూనే ఉంది. ఈ ఒప్పందానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) వరకు అన్ని విధాలుగా ఆమోదం లభించింది. అయినా గత ప్రభుత్వంపై బుదర జల్లాలి.. జగన్‌పై నిందలు వేయాలి.. ఒప్పందంపై విషం గక్కాలి.. అనే అజెండాతో అర్థం లేని ఆరోపణలు చేస్తూ టీడీపీ కరపత్రం ఈనాడు, ఎల్లో మీడియా అసత్య కథనాలను వండివారుస్తూనే ఉంది. తాజాగా సెకీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) రామేశ్వర్ ప్రసాద్ గుప్తాను కేంద్ర ప్రభుత్వం ఆ పదవి నుంచి తప్పించడాన్ని వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందంతో ముడిపెట్టి ఈనాడు పచ్చి అబద్ధాలతో శనివారం ఓ తప్పుడు కథనాన్ని అచ్చేసింది.ఎప్పుడో 2021లో జరిగిన ఒప్పందానికి 2023లో సీఎండీగా చేరిన అధికారికి సంబంధం ఏమిటనే కనీస ఇంగిత జ్ఞానం లేకుండా దిగజారుడు రాతలతో తన నైజాన్ని చాటుకుంది. ‘సెకీ’తో ఒప్పందం కారణంగా విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లపై ఆరి్ధక భారం పడుతుందని, అంతర్ రాష్ట్ర ప్రసార చార్జీ (ఐఎఎస్‌టీఎస్)ల నుంచి మినహాయింపు లభించదని ఇప్పటికే అనేక సార్లు అసత్య కథనాలను రాసి భంగపడ్డ టీడీపీ కరపత్రం ఇప్పుడు అభూత కల్పనలతో ప్రజలను ఏమార్చాలని చూస్తోంది. యూనిట్ రూ.2.49 చవక ధరకే సౌర విద్యుత్‌ను అందించే సెకీ ఒప్పందంపై ఇంతగా విషం చిమ్ముతున్న ఈనాడు.. అంతకు దాదాపు రెట్టింపు ధర యూనిట్ రూ.4.60తో చంద్రబాబు ప్రభుత్వం యాక్సిస్ అనే ప్రైవేటు సంస్థ నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుంటే మాత్రం కళ్లున్న గుడ్డి వాడిలా నటిస్తోంది. ముడుపులకు ఆస్కారం ఎక్కడ? ⇒ వైఎస్ జగన్ ప్రభుత్వానికి రైతుల పట్ల ఉన్న నిబద్ధత చూసి, యూనిట్ రూ.2.49 చవక ధరకే సౌర విద్యుత్‌ను అందిస్తామంటూ 2021 సెపె్టంబర్ 15న సెకీ లేఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన చేసింది. ప్రాజెక్టు వాణిజ్య కార్యకలాపాల (కమర్షియల్ ఆపరేషన్ డేట్)తో సంబంధం లేకుండా ప్రత్యేక ప్రోత్సాహకంగా ఐఎస్టీఎస్ చార్జీల నుంచి కేంద్ర ప్రభుత్వం మినహాయింపు ఇచి్చందని ఆ లేఖలో సెకీ స్పష్టంగా పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అలాంటి చార్జీలు వర్తించవని లేఖలో వివరంగా చెప్పింది. రెండు నెలల సుదీర్ఘ చర్చలు, సమగ్ర అధ్యయనం తర్వాత సెకీతో గత ప్రభుత్వం, డిస్కంలు మధ్య త్రైపాక్షిక విద్యుత్ కొనుగోలు ఒప్పందం జరిగింది. ఇందులో ఎలాంటి రహస్యం లేదు. రాష్ట్ర మంత్రి మండలితో పాటు ఏపీఈఆర్సీ ఆమోదంతో అత్యంత పారదర్శకంగా బహిరంగంగానే ఈ ఒప్పందం జరిగింది. ⇒ సెకీతో ఒప్పందం వల్ల రాష్ట్రానికి 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్ యూనిట్ రూ.2.49కే పాతికేళ్ల పాటు సరఫరా అవుతుంది. ఈ ధర అప్పటికి ఎనీ్టపీసీ సరఫరా చేస్తున్న సౌర ధర రూ.2.79 కన్నా 30 పైసలు తక్కువ. ప్రస్తుతం చంద్రబాబు కుదుర్చుకున్న రూ.4.60 కన్నా రూ.2.11 తక్కువ. ⇒ ప్రస్తుతం రాష్ట్రం కొనుగోలు చేస్తున్న విద్యుత్ యూనిట్‌కు సగటున రూ.5.10 ఖర్చు అవుతోంది. ఈ లెక్కన ఏటా దాదాపు రూ.3,750 కోట్లు సెకీ విద్యుత్ వల్ల ఆదా అవుతుంది. కానీ ఈ ఒప్పందంలో ముడుపుల వ్యవహారం వల్లే సెకీ సీఎండీని కేంద్రం తప్పించిందంటూ ఈనాడు వక్ర భాష్యం చెప్పింది. ముడుపులే కావాలనుకుంటే చంద్రబాబులా ప్రైవేటు సంస్థలతోనే ఒప్పందం కుదుర్చుకునేవారు కదా..? ఇంత చిన్న లాజిక్ కూడా ఈనాడుకు తెలియదా? ⇒ అదీకాక 2021లో ఒప్పందం జరిగినప్పుడు గుప్తా సెకీ సీఎండీనే కాదు. ఆయన ఆ పదవి చేపట్టిందే 2023 జూన్‌లో. ఈనెల 10న ఆయ న్ను పదవి నుంచి తొలగించారు. అంటే సెకీ ఒప్పందం జరిగినప్పుడు ఆయన పదవిలోనే లేరు. అలాంటిది ఆ ఒప్పందంతో ఆయనకు ఎలా ముడిపెడతారనే కనీస జ్ఞానం కూడా టీడీపీ కరపత్రానికి లేకుండా పోయిందని విద్యుత్ రంగ నిపుణులు విస్తుపోతున్నారు. బురదజల్లడమే పని⇒ ఈ ఒప్పందంలో రైతుల పట్ల జగన్‌కు నిబద్ధత తప్ప స్వప్రయోజనం అనేది మచ్చుకైనా కనిపించదు. అయితే ఈ ఒప్పందంలో ఏ మాత్రం ప్రమేయం లేని అదానీ నుంచి లంచాలందాయంటూ గత ముఖ్యమంత్రి వ్యక్తిత్వాన్ని హననం చేస్తోంది కూటమి ప్రభుత్వం. అమెరికాలో అదానీ సంస్థపై అభియోగాలు నమోదైతే దానికి జగన్‌కు ముడిపెట్టి అత్యుత్సాహంతో విష ప్రచారం చేస్తూ.. పుంఖానుపుంఖాలుగా అసత్యాలు వండి వార్చింది టీడీపీ అనుబంధ పత్రిక ఈనాడు. ⇒ వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఉన్న జనాదరణను తగ్గించకపోతే చంద్రబాబుకు మళ్లీ వానప్రస్థం తప్పదని భయపడుతున్న ఈనాడు.. అమెరికాలో నమోదైన కేసులో జగన్ పేరు లేకపోయినా ఉందంటూ పచ్చి అబద్దాన్ని ప్రచారం చేస్తోంది. దానికి అనుబంధంగానే సెకీ చైర్మన్ తొలగింపునూ ఈ ఒప్పందానికి ముడి పెడుతూ కుట్రలు పన్నుతోంది. దాదాపు 18 లక్షల మంది రైతులకు ఉచిత విద్యుత్తు అందటమే మహాపరాధంగా చిత్రీకరిస్తోంది. ⇒ గతేడాది నవంబర్‌లో గౌతమ్ అదానీ, ఇతర కార్యనిర్వాహకులపై లంచం తీసుకున్నారని అమెరికా ప్రాసిక్యూటర్లు అభియోగం మోపినప్పుడు, వాటికి ఎలాంటి ఆధారాలు లేనందున సెకీ ఆ ఆరోపణలపై ఎలాంటి విచారణ చేపట్టదని గుప్తా ప్రకటించారు. తాను ఎటువంటి తప్పు చేయలేదని, తనకు ఎలాంటి సంబంధం లేదని కూడా ఖండించారు. గతేడాది నవంబర్ 6న, నకిలీ పత్రాలను సమరి్పంచారనే ఆరోపణలతో రిలయన్స్ పవర్, దాని అనుబంధ సంస్థ రిలయన్స్ ఎన్యు బిఇఎస్‌ఎస్‌ను మూడు సంవత్సరాల పాటు టెండర్లలో పాల్గొనకుండా సెకీ నిషేధించింది. ⇒ కానీ ఢిల్లీ హైకోర్టు ఆదేశం తర్వాత ఆ నిషేధాన్ని ఉపసంహరించుకుంది. ఈ ఏడాది మేలో, రిలయన్స్ అనుబంధ సంస్థ రిలయన్స్ ఎన్యు సన్‌టెక్ ప్రైవేట్ లిమిటెడ్‌తో 25 ఏళ్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందం (సీపీఏ)పై సెకీ సంతకం చేసింది. దీనికి తప్పుడు ధృవపత్రాలను సృష్టించారనే ఆరోపణలు వెల్లువెత్తడంతోనే కేంద్రం నెల రోజుల్లో పదవీ విరమణ చేయనున్న గుప్తాను ఉన్నపళంగా తొలగించిందంటూ జాతీయ మీడియా ఇప్పటికే అనేక కథనాల్లో వెల్లడించింది. ఈ వాస్తవాన్ని ఈనాడు నిస్సిగ్గుగా దాస్తోంది. అది జర్నలిజమా? లేక బ్రోకరిజమా? ఈనాడుపై వైఎస్సార్సీపీ మండిపాటు‘వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వ హననం కోసం పత్రిక పేరుతో ఇంతగా దిగజారిపోతారా? నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలు రాస్తారా? ఈనాడుది జర్నలిజమా? లేక బ్రోకరిజమా?’ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్నించింది. సెకీ విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై ఈనాడు పత్రిక చేస్తున్న అసత్యాలను ఖండిస్తూ ‘ఎక్స్’లో ఆ పార్టీ ఈ మేరకు పోస్టు చేసింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందం 2021 డిసెంబర్లో జరిగిందని, 2023లో సెకీ సీఎండీగా రామేశ్వర్ గుప్తాను నియమించారని తెలిపింది. అలాంటప్పుడు ఏపీ–సెకీ ఒప్పందానికి ఏం సంబంధం ఉంటుందని ఆ పార్టీ ప్రశ్నించింది.‘సెకీకి రామేశ్వర్ గుప్తా సీఎండీ కాక ముందు కేంద్ర పర్యావరణ శాఖ సెక్రటరీగా పనిచేశారు. అనిల్ అంబానీ కంపెనీ ఫేక్ డాక్యుమెంట్లతో బిడ్డింగ్ వేశారన్న ఆరోపణల నేపథ్యంలో రామేశ్వర్ గుప్తాను తొలగించినట్టుగా ఐదారు రోజుల క్రితమే జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ వార్తలను వక్రీకరించి ఏపీ సెకీ ఒప్పందానికి లింకు పెడుతూ నిస్సిగ్గుగా ఎల్లో పత్రిక ఈనాడు పచ్చి అబద్ధాలు రాసింది. ఈనాడుకు ధైర్యం ఉంటే సెకీతో ఒప్పందాన్ని రద్దు చేయమని మీ గ్యాంగ్ లీడర్ చంద్రబాబుకు చెప్పు. ఈనాడులో రూ.1.90కే యూనిట్ సౌర విద్యుత్ వస్తుందని రాశారు. మరలాంటప్పుడు మొన్న యాక్సిస్‌తో రూ.4.60కి కొనుగోలు చేస్తూ ఎందుకు ఒప్పందం చేసుకున్నావని దమ్ముంటే చంద్రబాబును ప్రశ్నించు. లేదా తప్పుడు రాతలు రాసినందుకు ప్రజల్ని క్షమాపణలు కోరాలి’ అంటూ ఈనాడు రాసిన ఫేక్ న్యూస్ కథనాన్ని జత చేసి, శనివారం ఎక్స్ పోస్ట్‌లో వైఎస్సార్సీపీ నిలదీసింది.

‘ప్లే ఆఫ్స్’ లక్ష్యంగా పంజాబ్ కింగ్స్
జైపూర్: ఐపీఎల్లో అనూహ్యంగా ఆగిపోయిన తమ ప్రస్థానాన్ని మళ్లీ మొదలు పెట్టేందుకు పంజాబ్ కింగ్స్ సిద్ధమైంది. మే 9న ధర్మశాలలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ సందర్భంగా శుభారంభం చేసిన తర్వాత మ్యాచ్ అర్ధాంతరంగా ఆగిపోవడంతో పంజాబ్ గెలుపు అవకాశం చేజార్చుకుంది. ఇప్పుడు లీగ్‌లో బలహీన జట్టుపై గెలిచి ‘ప్లే ఆఫ్స్’కు మరింత చేరువ కావాలని జట్టు భావిస్తోంది. నేడు జరిగే పోరులో రాజస్తాన్ రాయల్స్‌తో పంజాబ్ తలపడుతుంది. ‘ప్లే ఆఫ్స్’ అవకాశాలు ఇప్పటికే కోల్పోయిన రాజస్తాన్ లీగ్‌లో చివరి స్థానంలో నిలవకుండా ఉండాలని కోరుకుంటోంది. తొలిసారి మిచ్ ఓవెన్... ఐపీఎల్ వాయిదా పడటంతో పంజాబ్ ఇద్దరు కీలక ఆటగాళ్లను కోల్పోయింది. ఆసీస్ ఆటగాళ్లు స్టొయినిస్, ఇన్‌గ్లిస్ తిరిగి రావడానికి విముఖత చూపారు. దాంతో ఇప్పుడు తప్పనిసరి స్థితిలో తుది జట్టులో మార్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మ్యాక్స్‌వెల్ గాయంతో తప్పుకోవడంతో జట్టులోకి వచ్చిన మిచెల్ ఒవెన్ తొలిసారి ఐపీఎల్ బరిలోకి దిగడం ఖాయమైంది. విధ్వంసకర బ్యాటర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఒవెన్ గత ఏడాది బిగ్‌బాష్ లీగ్‌లో టాప్ స్కోరర్‌గా నిలవడంతో పాటు హోబర్ట్ హరికేన్స్ టైటిల్ గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే టాపార్డర్ బ్యాటర్ అయిన ఒవెన్... ప్రస్తుతం పంజాబ్ ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్, ప్రియాన్‡్ష ఆర్య అద్భుతంగా ఆడుతుండటంతో మిడిలార్డర్లో ఆడాల్సి రావచ్చు. బౌలింగ్‌ను పటిష్టపర్చుకోవడంలో భాగంగా కివీస్ పేసర్ కైల్ జేమీసన్‌ను పంజాబ్ ఆడించే అవకాశం ఉంది. శ్రేయస్, వధేరా, శశాంక్‌లతో జట్టు బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. చహల్, అర్‡్షదీప్ ఫామ్‌లో ఉండటంతో పాటు మార్కో యాన్సెన్ కూడా మెరుగ్గా రాణిస్తుండటం పంజాబ్‌కు సానుకూలాంశం. బరిలోకి సంజు సామ్సన్... రాజస్తాన్ పేలవ ఆటతో చాలా ముందే ప్లే ఆఫ్స్ అవకాశాలు చేజార్చుకుంది. జట్టు 12 మ్యాచ్‌లలో 3 మ్యాచ్‌లే గెలిచింది. మిగిలిన మ్యాచ్‌లలోనైనా రాణించి పరువు కాపాడుకోవాలని టీమ్ భావిస్తోంది. నెల రోజుల క్రితం తన ఆఖరి ఐపీఎల్ మ్యాచ్ ఆడిన సంజు సామ్సన్ కోలుకొని ఇప్పుడు మళ్లీ బరిలోకి దిగుతున్నాడు. జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ ఓపెనర్లుగా రాణిస్తుండటంతో అతను మూడో స్థానంలో ఆడతాడు. పరాగ్, జురేల్ కూడా రాణిస్తే రాయల్స్ మెరుగైన స్థితిలో నిలుస్తుంది. విదేశీ ఆటగాళ్లు హెట్‌మైర్, హసరంగ, తీక్షణ జట్టుతో చేరారు. అయితే టోర్నీ ఆరంభంనుంచి చాలా బలహీనంగా ఉన్న రాజస్తాన్ పేస్ బృందం ఆర్చర్, సందీప్ శర్మ దూరం కావడంతో ఇప్పుడు మరింత బలహీనంగా మారింది. తుషార్ దేశ్‌పాండే, ఆకాశ్ మధ్వాల్, నాండ్రే బర్గర్ పంజాబ్ బ్యాటర్లను ఎలా నిలువరిస్తారో చూడాలి.

ట్రంప్ ‘బిగ్‌బాస్’ షో!
వాషింగ్టన్: రిపబ్లికన్ పార్టీ అగ్రనేత డొనాల్డ్ ట్రంప్ ఏంచేసినా వినూత్నమే. వివాదాస్పదమే. అదే పరంపరను కొనసాగిస్తూ ట్రంప్ సొంతంగా సరికొత్త రియాలిటీ షోకు తెరలేపనున్నారన్న వార్త ఇప్పుడు అగ్రరాజ్యంలో చక్కర్లు కొడుతోంది. బిగ్‌బాస్ రియాలిటీ షో తరహాలో ఇందులో పాల్గొనేవారంతా భిన్న రకాలైన పనులు(టాస్క్ లు) పూర్తిచేయాల్సి ఉంటుంది. అయితే ఇందులో ప్రధానంగా అమెరికా జాతీయత కోణం దాగి ఉంది. మరీ ముఖ్యంగా ఇప్పటికే అనధికారికంగా అమెరికాకు పోటెత్తిన వలసదారులను మాత్రమే ఈ రియాలిటీ షోలో అభ్యర్థులుగా స్వీకరిస్తారు. గెలిచిన వారికి అమెరికా పౌరసత్వాన్ని కట్టబెడతారు. స్వదేశంలో అంతర్యుద్ధం, ప్రకృతి వైపరీత్యాలు వంటి అసాధారణ, అనివార్య పరిస్థితుల్లో కొందరు వలసదారులు తిరిగి స్వదేశానికి వెళ్లలేని పరిస్థితి ఉంది. అలాంటి వారిని ఎంపిక చేసి అమెరికా పౌరసత్వం ఇచ్చే అవకాశం ఉంది. ఈ ఎంపికకు రియాలిటీ షో మార్గాన్ని ట్రంప్ ప్రభుత్వం ఎంచుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రియాలిటీ షో వివరాలు ఇంకా బహిర్గత కాలేదు. ఇది ఇంకా అమెరికా ప్రభుత్వ వర్గాల వద్ద ప్రతిపాదన దశలోనే ఉందని తెలుస్తోంది. అన్ని రకాల అనుమతులు దాటుకుని ఈ రియాలిటీ షో వాస్తవరూపం దాల్చితే ఈ షోకు అనూహ్య ఆదరణ లభించడం ఖాయమని భావిస్తున్నారు. ఈ షోలో గెలిచిన విజేతకు మాత్రమే అమెరికా పౌరసత్వం బేషరతుగా ఇవ్వాలని ట్రంప్ ప్రభుత్వం యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఎవరిదీ ఆలోచన? కెనడియన్–అమెరికన్ నిర్మాత రాబ్ వార్సాఫ్ ఈ ప్రతిపాదన తెచ్చారు. రియాలిటీ షో నియమ నిబంధనలతో సమగ్రంగా 35 పేజీల్లో ఒక రిపోర్ట్‌ను తయారుచేసి అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ(డీహెచ్ఎస్) విభాగానికి సమరి్పంచారు. రాబ్ వార్సాఫ్ గతంలో సృష్టించిన ‘డక్ డినాస్టీ’, ‘ది మిలియనీర్ మ్యాచ్‌మేకర్’రియాలిటీ షోలు విజయవంతమైంది. ‘‘రాబ్ చేసిన ప్రతిపాదనను పరిశీలిస్తున్నాం. నిజంగా ఇదొక మంచి ఆలోచన. హక్కులతోపాటు అమెరికన్లలో దేశభక్తి, పౌరవిధులను మరోసారి స్పష్టంగా స్మరణకు తెచ్చేలా షో ఉంటే బాగుంటుంది’’అని హోంల్యాండ్ సెక్యూరిటీలో ప్రజాసంబంధాల మహిళా అసిస్టెంట్ సెక్రటరీ ట్రీసియా మెక్‌లానిన్ అన్నారు. ఈ ప్రతిపాదన ఇంకా పరిశీలన దశలోనే ఉందన్నారు. ఈ ప్రతిపాదన ప్రస్తుతం హోం ల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టీ నోయెమ్ వద్ద పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.ఎలాంటి టాస్క్ లు ఉండొచ్చు? ‘ది అమెరికన్’పేరిట జరగబోయే ఈ రియాలిటీ టీవీ షోలో వలసదారుల్లో దేశభక్తి పెంచడంతోపాటు బాధ్యతాయుత పౌరునిగా మెలగాలంటే ఉండాల్సిన అర్హతలు, లక్షణాలను స్మరణకు తెచ్చేలా టాస్క్ లు రూపొందించనున్నారు. వీటితోపాటు ఆద్యంతం ఆసక్తికరంగా, వినోదాత్మకంగా ఉండేందుకు పలు రకాల టాస్క్‌లు పెట్టనున్నారు. టెక్సాస్ లేదా ఫ్లోరిడాలో నాసా ప్రయోగకేంద్రాల వద్ద చిన్నపాటి రాకెట్ ఎగరేయడం, శాన్ఫ్రాన్సిస్కో గనిలో బంగారాన్ని తవ్వితీయడం(గోల్డ్ రష్), డెట్రాయిట్లో ఆటోమొబైల్ అసెంబ్లీ లైన్ల వద్ద మోడల్ ‘టి’కారు ఛాసిస్‌ను బిగించడం, కన్సాస్‌లో గుర్రపుస్వారీ చేస్తూ తపాలాలు భటా్వడా చేయడం వంటి వినూత్న టాస్క్‌లు వలసదారులు పూర్తిచేయాల్సి ఉంటుంది.

మరో సౌరవ్యవస్థలో గడ్డ కట్టిన నీరు
వాషింగ్టన్: జీవుల మనుగడకు ప్రాణాధారమైన నీరు అంతరిక్షంలో మరెక్కడుందోననే ప్రశ్నకు సమాధానం వెతికినట్లు ప్రఖ్యాత జేమ్స్ వెబ్ అంతరిక్ష టెలిస్కోప్ తాజాగా ప్రకటించింది. మన సౌరమండలం తరహాలోనే ఇతర నక్షత్ర వ్యవస్థల్లో గడ్డ కట్టిన స్థితిలో నీరు ఉంటుందనే వాదనకు బలం చేకూరుస్తూ నాసా వారి జేమ్స్ వెబ్ టెలిస్కోప్ పలు సాక్ష్యాధారాలను సంపాదించింది. ఒక యువ నక్షత్ర మండలంలో గడ్డకట్టిన నీటి జాడలను కనిపెట్టినట్లు నాసా తాజాగా ప్రకటించింది. నక్షత్రం చుట్టూ తిరుగుతున్న దుమ్ము ధూళితో కూడిన అంతరిక్ష శిలలు, శకలాలు, శిథిలాల వలయాల్లో నీరు గడ్డకట్టి ఉందని నాసా వెల్లడించింది. మన సౌరవ్యవస్థ వయసుతో పోలిస్తే తక్కువ వయసున్న ఈ కొత్త నక్షత్ర మండలం ‘హెచ్డీ 181327’మన భూమికి 155 కాంతి సంవత్సరాల దూరంలో ఉందని నాసా తెలిపింది.వెబ్ టెలిస్కోప్ పంపిన ‘స్పె్రక్టా’డేటాలో ఇందుకు సంబంధించిన వివరాలు ఉన్నాయి. విశాల అంతరిక్షంలో ఎక్కడో ఓ చోట నీరు నిక్షిప్తమై ఉంటుందని నాసా వారి స్పిట్జర్ స్పేస్ టెలిస్కోప్ 2008లోనే కొంత డేటాను పంపించింది. ఆ తర్వాత జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఇలా నీటిజాడలను వెతికిపట్టడం ఇదే తొలిసారి. ‘‘కేవలం నీటిని మాత్రమేకాదు మరీముఖ్యంగా స్ఫటికాకృతిలో ఉండే గడ్డ కట్టిన నీటి జాడను వెబ్ టెలిస్కోప్ కనుగొంది. ఈ ధూళి వలయాల్లోని ప్రతి దుమ్ము కణంతో నీటి అణువులు కలిసిపోయి ఉన్నాయి. ఈ అణువులను సమీప–పరారుణ స్పెక్ట్రోగ్రాఫ్ ఉపకరణంతో చూసినప్పుడు ఇవన్నీ మంచు బంతుల్లా కనిపించాయి. గతంలో ఇలాంటి క్రిస్టల్ ఐస్‌ను మన సౌరవ్యవస్థలో శనిగ్రహ వలయాల్లో, క్యూపర్ బెల్ట్‌లో చూశాం’’అని ఈ పరిశోధనా పత్రం ముఖ్య రచయిత చెన్ గ్జీ చెప్పారు. చెన్ గ్జీ.. మేరిలాండ్‌లోని జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ(బాలీ్టమోర్)లో అసిస్టెంట్ రీసెర్చ్ సైంటిస్ట్‌గా సేవలందిస్తున్నారు. సంబంధిత వివరాలు ‘నేచర్’జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. నీరే కీలకం అంతరిక్షంలో నక్షత్రాల చుట్టూతా గ్రహ వ్యవస్థ పురుడుపోసుకోవడానికి నీరే ప్రధాన కారణం. యువ నక్షత్రాల చుట్టూతా పరుచుకున్న దుమ్ము, ధూళి వలయాల్లో ప్రధాన ముడి సరకు నీరే. ఒక రకంగా పట్టిఉంచే నీరు సైతం ధూళి, దుమ్మ గట్టిపడి గ్రహాల ఆవిర్భావానికి దారితీస్తుంది. తక్కువ గురుత్వాకర్షణ సందర్భాల్లో తోకచుక్కలు, గ్రహశకలాల వంటివి ఏర్పడతాయి. ఒకవేళ బలాలు బలపడితే ఇవన్నీ కలగలిసిపోయి పెద్ద గ్రహాలుగా రూపాంతరం చెందుతాయి. మన భూమి సైతం తొలినాళ్లలో ఇలాగే ఏర్పడింది. తాజాగా వెబ్ టెలిస్కోప్ సేకరించిన సమాచారంతో ఇతర ఖగోళ అధ్యయనకారులు సైతం నూతన నక్షత్రవ్యవస్థల్లో కొత్త గ్రహాలు ఎలా ఏర్పడతాయి వంటి అంశాలపై మరింత శోధన చేసేందుకు అవకాశం లభించనుందని మరో రచయిత క్రిస్టీన్ చెన్ చెప్పారు. ఈ ‘హెచ్డీ 181327’నక్షత్ర వ్యవస్థ కేవలం 2.3 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడింది. మన సూర్యుడు ఏకంగా 460 కోట్ల సంవత్సరాల క్రితం ఆవిర్భవించాడు. వయసులో చిన్నదైనా సరే ఈ యువ నక్షత్రం మన సూరీడి కంటే బరువు ఎక్కువగా ఉంది. వేడి కూడా మరింత ఎక్కువగా ఉన్నట్లు తేలింది.

ఈ రాశి వారికి వ్యాపారాలు లాభిస్తాయి.. ఉద్యోగాలలో నూతనోత్సాహం.
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,ఉత్తరాయణం, వసంత ఋతువు వైశాఖ మాసం, తిథి: బ.షష్ఠి రా.2.26 వరకు తదుపరి సప్తమి, నక్షత్రం: ఉత్తరాషాఢ ప.3.48 వరకు, తదుపరి శ్రవణం,వర్జ్యం: రా.7.49 నుండి 9.25 వరకు, దుర్ముహూర్తం: సా.4.38 నుండి 5.30 వరకు, అమృత ఘడియలు: ఉ.9.11 నుండి 10.50 వరకు, తిరిగి తె.5.24 నుండి 7.02 వరకు (తెల్లవారితే సోమవారం).సూర్యోదయం : 5.31సూర్యాస్తమయం : 6.21రాహుకాలం : సా.4.30 నుంచి 6.00 వరకుయమగండం : ప.12.00 నుంచి 1.30 వరకుమేషం: శ్రమలిస్తుంది. నూతన విద్యావకాశాలు. ఆస్తులు కొనుగోలు చేస్తారు. పరిచయాలు పెరుగుతాయి. దైవదర్శనాలు. అనుకున్న పనులలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.వృషభం: వ్యవహారాలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. నిర్ణయాలలో మార్పులు. సోదరుల నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాల విస్తరణ వాయిదా. ఉద్యోగాలలో చికాకులు.మిథునం: కుటుంబంలో ఒత్తిడులు. అనుకోని ప్రయాణాలు. కొన్ని సమస్యలు చికాకు పరుస్తాయి. బంధువులతో వివాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో స్వల్ప ఆటంకాలు.కర్కాటకం: శుభవర్తమానాలు. ఆకస్మిక ధనలాభం. చిన్ననాటి మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.సింహం: దీర్ఘకాలిక సమస్యలు తీరతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం.కన్య: వ్యవహారాలలో ప్రతిబంధకాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం.నిర్ణయాలు మార్చుకుంటారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.తుల: రాబడి కొంత తగ్గవచ్చు. దూరప్రయాణాలు సంభవం. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.వృశ్చికం: ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆశ్చర్యకర సంఘటనలు. ఆకస్మిక ధనలబ్ధి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి.ధనుస్సు: కుటుంబంలో చికాకులు. ఆరోగ్య సమస్యలు. పనుల్లో ఆటంకాలు. బంధువులతో తగాదాలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి.మకరం: వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. చిన్ననాటి మిత్రులతో కష్టసుఖాలు విచారిస్తారు. వ్యాపారాలు వృద్ధి. ఉద్యోగాలలో సమస్యలు తీరే సమయం.కుంభం: కుటుంబంలో కొన్ని సమస్యలు. ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. దైవదర్శనాలు. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.మీనం: ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. శ్రమకు ఫలితం దక్కుతుంది. నూతన వస్తులాభాలు. ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. పరపతి పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.
సీఎం గారూ.. యుద్ధంలో ఉన్నా.. రాలేకపోతన్న..
రేపటి నుంచే భూముల రీసర్వే.. రెవెన్యూ వర్గాల ఆందోళన
టాటా హైస్పీడ్ చార్జింగ్ స్టేషన్లు.. 15 నిమిషాల్లోనే 150 కి.మీ. రేంజ్!
చైనా అండతో రెచ్చిపోయిన బంగ్లాదేశ్.. బిగ్ షాకిచ్చిన భారత్
Telangana: రైతును నదిలోకి లాక్కెళ్లిన మొసలి
హైదరాబాద్‌లో మెట్‌లైఫ్ టెక్నాలజీ హబ్
తొలిసారి ఖాకీ డ్రెస్‌లో కనిపించనున్న నయనతార
పెను విషాదం.. బావిలోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురు మృతి
మరో సౌరవ్యవస్థలో గడ్డ కట్టిన నీరు
భారత్–పాక్ మధ్య అణు యుద్ధం ఆపేశా..
కోటి ఇస్తావా.. ఫొటోలు అప్లోడ్ చేయమంటావా?
‘పాకిస్తాన్ వద్దే కాదు.. చైనాకు కూడా ఆ సామర్థ్యం లేదు’
కొత్త కరెన్సీ నోట్లు వస్తున్నాయి.. ఆర్బీఐ ప్రకటన
'పద్మ భూషణ్' చేయాల్సిన పనులేనా..? బాలకృష్ణపై విమర్శలు
నెల్లూరులో ప్రసిద్ధ ఆలయం..శనివారం ఒక్కరోజే భక్తులకు దర్శనం (ఫొటోలు)
ఇంగ్లండ్ టూర్‌కు భారత జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
విజయవాడలో బోర్డు తిప్పేసిన నాగరాజు కన్సల్టెన్సీ సంస్థ
మళ్లీ కరోనా మహమ్మారీ పలుదేశాల్లో హై అలర్ట్
..పన్లోపని తుర్కియే అధ్యక్షుడిని కూడా పిలుద్దాం సార్! కొంతకాలం పాలన చూసుకోమని చెబుదాం!
ఈ రాశి వారికి వ్యాపారాలు, ఉద్యోగాలలో అవాంతరాలు తొలగుతాయి.
ఇప్పటికైనా తెలిసిందా సార్!.. మీరెంత పేదరికంలో బతుకుతున్నారో!
ఈ రాశి వారికి వ్యాపారాలలో ఊహించని లాభాలు.. ఉద్యోగాలలో హోదాలు
కడప మేయర్ పదవి.. ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు
టాలీవుడ్ మూవీలో అలేఖ్య చిట్టి పికిల్స్ ఫేమ్.. ఈవెంట్లో సందడి!
బట్టతలపై వెంట్రుకలు సాధ్యమే! దువ్వెన్లు సిద్దం చేసుకోండి!
రోహిత్ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం.. మామగారి వెనుక దాక్కున్న రితిక!
అదే విషయం చెప్పి చెప్పి నోరు నొప్పెడుతుందట!
కంబాలపల్లి C/O ప్రభుత్వోద్యోగులు
మాట తప్పారు!.. ఆర్సీబీకి తిరిగి ఆడాలని అనుకోలేదు: పాటిదార్
రెండు రోజుల్లో ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు
సీఎం గారూ.. యుద్ధంలో ఉన్నా.. రాలేకపోతన్న..
రేపటి నుంచే భూముల రీసర్వే.. రెవెన్యూ వర్గాల ఆందోళన
టాటా హైస్పీడ్ చార్జింగ్ స్టేషన్లు.. 15 నిమిషాల్లోనే 150 కి.మీ. రేంజ్!
చైనా అండతో రెచ్చిపోయిన బంగ్లాదేశ్.. బిగ్ షాకిచ్చిన భారత్
Telangana: రైతును నదిలోకి లాక్కెళ్లిన మొసలి
హైదరాబాద్‌లో మెట్‌లైఫ్ టెక్నాలజీ హబ్
తొలిసారి ఖాకీ డ్రెస్‌లో కనిపించనున్న నయనతార
పెను విషాదం.. బావిలోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురు మృతి
మరో సౌరవ్యవస్థలో గడ్డ కట్టిన నీరు
భారత్–పాక్ మధ్య అణు యుద్ధం ఆపేశా..
కోటి ఇస్తావా.. ఫొటోలు అప్లోడ్ చేయమంటావా?
‘పాకిస్తాన్ వద్దే కాదు.. చైనాకు కూడా ఆ సామర్థ్యం లేదు’
కొత్త కరెన్సీ నోట్లు వస్తున్నాయి.. ఆర్బీఐ ప్రకటన
'పద్మ భూషణ్' చేయాల్సిన పనులేనా..? బాలకృష్ణపై విమర్శలు
ఇంగ్లండ్ టూర్‌కు భారత జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
విజయవాడలో బోర్డు తిప్పేసిన నాగరాజు కన్సల్టెన్సీ సంస్థ
మళ్లీ కరోనా మహమ్మారీ పలుదేశాల్లో హై అలర్ట్
..పన్లోపని తుర్కియే అధ్యక్షుడిని కూడా పిలుద్దాం సార్! కొంతకాలం పాలన చూసుకోమని చెబుదాం!
ఈ రాశి వారికి వ్యాపారాలు, ఉద్యోగాలలో అవాంతరాలు తొలగుతాయి.
ఇప్పటికైనా తెలిసిందా సార్!.. మీరెంత పేదరికంలో బతుకుతున్నారో!
ఈ రాశి వారికి వ్యాపారాలలో ఊహించని లాభాలు.. ఉద్యోగాలలో హోదాలు
కడప మేయర్ పదవి.. ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు
టాలీవుడ్ మూవీలో అలేఖ్య చిట్టి పికిల్స్ ఫేమ్.. ఈవెంట్లో సందడి!
బట్టతలపై వెంట్రుకలు సాధ్యమే! దువ్వెన్లు సిద్దం చేసుకోండి!
రోహిత్ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం.. మామగారి వెనుక దాక్కున్న రితిక!
అదే విషయం చెప్పి చెప్పి నోరు నొప్పెడుతుందట!
కంబాలపల్లి C/O ప్రభుత్వోద్యోగులు
మాట తప్పారు!.. ఆర్సీబీకి తిరిగి ఆడాలని అనుకోలేదు: పాటిదార్
రెండు రోజుల్లో ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు
తిరుమల శ్రీవారికి సంజీవ్ గోయెంక భారీ విరాళం..
సినిమా

ఓటీటీలోకి కన్నడ మిస్టరీ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
రీసెంట్ టైంలో ప్రతి భాషలోనూ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ సినిమాల్ని తీస్తున్నారు. చాలా వరకు అవి హిట్ అవుతున్నాయి. ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి కూడా. అలా ఇప్పుడు కన్నడ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. స్ట్రీమింగ్ తేదీని ఫిక్స్ చేశారు. ఇంతకీ ఏంటా సినిమా? ఎప్పుడు రిలీజ్ కానుంది?సాధారణంగా థ్రిల్లర్స్ అంటే ఎక్కువగా మలయాళ ఇండస్ట్రీ పేరు వినిపిస్తుంది. తాజాగా కన్నడ చిత్రసీమ నుంచి వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ 'అజ్ఞాతవాసి'. ఏప్రిల్ 11న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ.. ప్రశంసలతో పాటు మంచి కలెక్షన్స్ కూడా అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రాన్ని జీ5 ఓటీటీలోకి తీసుకురానున్నట్లు అధికారికంగా ప్రకటించారు.(ఇదీ చదవండి: మరో ఓటీటీలోకి కల్యాణ్ రాణ్ కొత్త సినిమా) మే 28 నుంచి కన్నడతో పాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ చేయనున్నారు. 25 ఏళ్లుగా అసలు నేరాలే జరగని ఓ ఊరిలో అనుమానాస్పద రీతిలో ఓ వ్యక్తిని చంపేస్తే ఏమైందనే కాన్సెప్ట్ తో 'అజ్ఞాతవాసి' తీశారు. థ్రిల్లర్స్ అంటే ఆసక్తి ఉంటే దీన్ని అస్సలు మిస్ కావొద్దు.అజ్ఞాతవాసి విషయానికొస్తే.. ఓ ఊరిలో గత 25 ఏళ్లుగా ఒక్క క్రైమ్ కూడా జరగదు. అలాంటి ఊరికి గోవిందు అనే పోలీస్.. బదిలీపై వస్తాడు. అంతా ప్రశాంతంగా ఉంది అనుకున్న టైంలో ఊరి పెద్ద హత్యకు గురవుతాడు. పంకజ, రోహిత్, శ్రీనివాసయ్య అనే ముగ్గురిపై గోవిందు అనుమానం వ్యక్తం చేస్తాడు. ఇంతకీ హంతకుడు ఎవరు? 1970లో ఇదే ఊరిలో జరిగిన సంఘటనకు ఈ హత్యకు సంబంధమేంటి? అనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి :రెండు రోజుల్లో ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు)

మృణాల్ చాలా పద్ధతిగా.. మీనాక్షి నెవ్వర్ బిఫోర్ లుక్
పద్ధతిగా క్యూట్ లుక్స్ లో మృణాల్ ఠాకుర్నాభి అందాలతో షాకిచ్చిన మీనాక్షి చౌదరిఫ్రెండ్స్ తో ట్రిప్ లో కల్యాణి ప్రియదర్శన్చీరలో మరింత అందంగా సమంతజీన్స్ లో మెరిసిపోతున్న యాంకర్ అనసూయజిమ్.. ఫుడ్ క్రేవింగ్స్ వీడియోతో తృప్తి దిమ్రి View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Malvika Sharma (@malvikasharmaofficial) View this post on Instagram A post shared by Kalyani Priyadarshan (@kalyanipriyadarshan) View this post on Instagram A post shared by Triptii Dimri (@tripti_dimri) View this post on Instagram A post shared by Amritha - Thendral (@amritha_aiyer) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Kavya Thapar (@kavyathapar20) View this post on Instagram A post shared by Face Magazine (@facemag.in) View this post on Instagram A post shared by Ananya 🌙 (@ananyapanday)

కమల్ హాసన్ 'థగ్ లైఫ్' ట్రైలర్ రిలీజ్
తమిళ స్టార్ హీరో కమల్ హాసన్.. దాదాపు 36 సంవత్సరాల తర్వాత స్టార్ డైరెక్టర్ మణిరత్నంతో కలిసి పనిచేశాడు. అదే 'థగ్ లైఫ్' సినిమా. జూన్ 5న థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ మొదలుపెట్టగా.. తాజాగా తెలుగు, తమిళ ట్రైలర్స్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: 'చుట్టమల్లే' సాంగ్.. నాకు గుర్తింపు దక్కలేదు: కొరియోగ్రాఫర్) ట్రైలర్ బట్టి చూస్తే ఇదో గ్యాంగ్ స్టర్ డ్రామా అని క్లారిటీ వచ్చేసింది. కమల్ హాసన్ గ్యాంగ్ స్టర్ కాగా.. అతడి దగ్గర శింబు పెరిగి పెద్దవాడవుతాడు. కానీ పెద్దయ్యాక కమల్-శింబు మధ్య గ్యాప్ వస్తుంది. కొన్నాళ్ల పాటు కనిపించకుండా పోయిన కమల్.. తిరిగొస్తే ఏం జరిగింది? అనేదే స్టోరీలా అనిపిస్తుంది.ఇందులో కమల్ హాసన్ కి జోడీగా అభిరామి, త్రిష నటించారు. శింబు సరసన సన్య మల్హోత్రా చేసింది. వీళ్లు కాకుండా ఐశ్వర్య లక్ష్మీ, జోజూ జార్జ్, నాజర్, గౌతమ్ కార్తీక్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఏఆర్ రెహమాన్ సంగీతమందించాడు. ట్రైలర్ చూస్తే మంచి రిచ్ గా ఉంది. చూస్తుంటే 'విక్రమ్'లా కమల్ మరో హిట్ కొడతాడనిపిస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో?(ఇదీ చదవండి: 'సీతారామం' నటి కారులో భారీ చోరీ)

'సీతారామం' నటి కారులో భారీ చోరీ
'సీతారామం' సినిమాలో నటించిన రుక్మిణి విజయ్ కుమార్ కారులో భారీ చోరీ జరిగింది. దాదాపు రూ.23 లక్షలు విలువైన వస్తువుల్ని దొంగిలించారు. ఈ విషయమై కేసు నమోదు చేసిన పోలీసులు.. అసలేం జరిగిందో కనుక్కొని డ్రైవర్ ముహమ్మద్ మస్తాన్ ని అదుపులోకి తీసుకున్నారు.ఇంతకీ ఏమైంది?ఈ నెల 11న మార్నింగ్ వాకింగ్ కోసం బెంగళూరు చిన్నస్వామి స్టేడియంకి రుక్మిణి వెళ్లింది. ఓ గేట్ దగ్గర తన కారు పార్క్ చేసి లోపలికి వెళ్లిపోయింది. ఈ హడావుడిలో తన కారు లాక్ చేసుకోవడం మర్చిపోయింది. అదే కారులో ఖరీదైన హ్యండ్ బ్యాగ్స్, పర్స్, రెండు వజ్రపు ఉంగరాలు, రోలెక్స్ వాచ్ తదితర విలువైన వస్తువులు ఉన్నాయి.(ఇదీ చదవండి: రక్తం పంచుకుని పుట్టినోళ్లే నా పతనాన్ని.. ప్రభాస్ మాత్రం: మంచు విష్ణు)రుక్మిణి కారుకి లాక్ వేయని విషయాన్ని గమనించిన ట్యాక్సీ డ్రైవర్ మస్తాన్.. కారులోని రూ.23 లక్షలు విలువ చేసే వస్తువుల్ని దొంగిలించాడు. దీంతో నటి రుక్మిణి.. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సీసీటీవీ ఫుటేజీ పరిశీలించారు. నిందితుడు మస్తాన్ ని అరెస్ట్ చేసి, దొంగిలించిన వాటిని స్వాధీనం చేసుకున్నారు.స్వతహాగా కన్నడ అమ్మాయి అయిన రుక్మిణి.. తొలుత కొరియోగ్రాఫర్ గా కెరీర్ ఆరంభించింది. కన్నడతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేసింది. 'సీతారామం'లో హీరోయిన్ ఫ్రెండ్ రేఖ పాత్రలో నటించి గుర్తింపు తెచ్చుకుంది.(ఇదీ చదవండి: 'చుట్టమల్లే' సాంగ్.. నాకు గుర్తింపు దక్కలేదు: కొరియోగ్రాఫర్)
న్యూస్ పాడ్‌కాస్ట్
క్రీడలు

‘ప్లే ఆఫ్స్’ లక్ష్యంగా పంజాబ్ కింగ్స్
జైపూర్: ఐపీఎల్లో అనూహ్యంగా ఆగిపోయిన తమ ప్రస్థానాన్ని మళ్లీ మొదలు పెట్టేందుకు పంజాబ్ కింగ్స్ సిద్ధమైంది. మే 9న ధర్మశాలలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ సందర్భంగా శుభారంభం చేసిన తర్వాత మ్యాచ్ అర్ధాంతరంగా ఆగిపోవడంతో పంజాబ్ గెలుపు అవకాశం చేజార్చుకుంది. ఇప్పుడు లీగ్‌లో బలహీన జట్టుపై గెలిచి ‘ప్లే ఆఫ్స్’కు మరింత చేరువ కావాలని జట్టు భావిస్తోంది. నేడు జరిగే పోరులో రాజస్తాన్ రాయల్స్‌తో పంజాబ్ తలపడుతుంది. ‘ప్లే ఆఫ్స్’ అవకాశాలు ఇప్పటికే కోల్పోయిన రాజస్తాన్ లీగ్‌లో చివరి స్థానంలో నిలవకుండా ఉండాలని కోరుకుంటోంది. తొలిసారి మిచ్ ఓవెన్... ఐపీఎల్ వాయిదా పడటంతో పంజాబ్ ఇద్దరు కీలక ఆటగాళ్లను కోల్పోయింది. ఆసీస్ ఆటగాళ్లు స్టొయినిస్, ఇన్‌గ్లిస్ తిరిగి రావడానికి విముఖత చూపారు. దాంతో ఇప్పుడు తప్పనిసరి స్థితిలో తుది జట్టులో మార్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మ్యాక్స్‌వెల్ గాయంతో తప్పుకోవడంతో జట్టులోకి వచ్చిన మిచెల్ ఒవెన్ తొలిసారి ఐపీఎల్ బరిలోకి దిగడం ఖాయమైంది. విధ్వంసకర బ్యాటర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఒవెన్ గత ఏడాది బిగ్‌బాష్ లీగ్‌లో టాప్ స్కోరర్‌గా నిలవడంతో పాటు హోబర్ట్ హరికేన్స్ టైటిల్ గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే టాపార్డర్ బ్యాటర్ అయిన ఒవెన్... ప్రస్తుతం పంజాబ్ ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్, ప్రియాన్‡్ష ఆర్య అద్భుతంగా ఆడుతుండటంతో మిడిలార్డర్లో ఆడాల్సి రావచ్చు. బౌలింగ్‌ను పటిష్టపర్చుకోవడంలో భాగంగా కివీస్ పేసర్ కైల్ జేమీసన్‌ను పంజాబ్ ఆడించే అవకాశం ఉంది. శ్రేయస్, వధేరా, శశాంక్‌లతో జట్టు బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. చహల్, అర్‡్షదీప్ ఫామ్‌లో ఉండటంతో పాటు మార్కో యాన్సెన్ కూడా మెరుగ్గా రాణిస్తుండటం పంజాబ్‌కు సానుకూలాంశం. బరిలోకి సంజు సామ్సన్... రాజస్తాన్ పేలవ ఆటతో చాలా ముందే ప్లే ఆఫ్స్ అవకాశాలు చేజార్చుకుంది. జట్టు 12 మ్యాచ్‌లలో 3 మ్యాచ్‌లే గెలిచింది. మిగిలిన మ్యాచ్‌లలోనైనా రాణించి పరువు కాపాడుకోవాలని టీమ్ భావిస్తోంది. నెల రోజుల క్రితం తన ఆఖరి ఐపీఎల్ మ్యాచ్ ఆడిన సంజు సామ్సన్ కోలుకొని ఇప్పుడు మళ్లీ బరిలోకి దిగుతున్నాడు. జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ ఓపెనర్లుగా రాణిస్తుండటంతో అతను మూడో స్థానంలో ఆడతాడు. పరాగ్, జురేల్ కూడా రాణిస్తే రాయల్స్ మెరుగైన స్థితిలో నిలుస్తుంది. విదేశీ ఆటగాళ్లు హెట్‌మైర్, హసరంగ, తీక్షణ జట్టుతో చేరారు. అయితే టోర్నీ ఆరంభంనుంచి చాలా బలహీనంగా ఉన్న రాజస్తాన్ పేస్ బృందం ఆర్చర్, సందీప్ శర్మ దూరం కావడంతో ఇప్పుడు మరింత బలహీనంగా మారింది. తుషార్ దేశ్‌పాండే, ఆకాశ్ మధ్వాల్, నాండ్రే బర్గర్ పంజాబ్ బ్యాటర్లను ఎలా నిలువరిస్తారో చూడాలి.

ఆర్సీబీతో మ్యాచ్ రద్దు.. ప్లే ఆఫ్స్ రేసు నుంచి కేకేఆర్ ఔట్
ఐపీఎల్-2025 పున ప్రారంభానికి వరుణుడు ఆటంకం కలిగించాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద ఎడతెరిపి లేకుండా వర్షం కురువడంతో టాస్ పడకుండానే మ్యాచ్‌ను అంపైర్లు రద్దు చేశారు. ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. దీంతో కేకేఆర్ ప్లే ఆఫ్స్ ఆశలు ఆవిరయ్యాయి. ప్లే ఆఫ్స్ రేసులో కేకేఆర్ నిలవాలంటే ఆర్సీబీపై కచ్చితంగా గెలవాల్సి ఉండేది. కానీ ఇప్పుడు ఏకంగా మ్యాచ్ రద్దు కావడంతో ప్లే ఆఫ్స్ రేసు నుంచి కోల్‌కతా నిష్క్రమించింది. ఈ టోర్నీలో ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు ఆడిన కేకేఆర్ 12 పాయింట్లతో టోర్నీ నుంచి ఇంటిముఖం పట్టింది. మరోవైపు ఆర్సీబీ ఖాతాలో ఒక్క పాయింట్ చేరింది. ఆర్సీబీ 17 పాయింట్లతో అగ్రస్ధానానికి దూసుకెళ్లింది. ఈ క్రమంలో ప్లే ఆఫ్స్ చెరేందుకు బెంగళూరు జట్టు అడుగు దూరంలో నిలిచింది. చివరి రెండు మ్యాచ్‌ల్లో ఆర్సీబీ ఒక దాంట్లో గెలిచినా చాలు ప్లే ఆఫ్స్‌కు ఆర్హత సాధిస్తోంది. ఒకవేళ ఓడినా కూడా ఆర్సీబీకి ప్లే ఆఫ్స్‌కు చేరే అవకాశముంటుంది. అయితే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది.

ఆర్సీబీ ఫైనల్‌కు వెళ్తే భారత్‌కు వస్తా: ఏబీ డివిలియర్స్
ఐపీఎల్-2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తోంది. గత రెండు మూడు సీజన్లతో పోలిస్తే ఈ ఏడాది మాత్రం ఆర్సీబీ అందరి అంచనాలకు భిన్నంగా వరుస విజయాలతో దూసుకుపోతుంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో పాటిదార్ సేన దుమ్ములేపుతోంది.బ్యాటింగ్‌లో విరాట్ కోహ్లి, ఫిల్ సాల్ట్, టిమ్ డేవిడ్, పాటిదార్ చెలరేగుతుంటే.. బౌలింగ్‌లో జోష్ హాజిల్‌వుడ్, కృనాల్ పాండ్యా,భువనేశ్వర్ కుమార్ వంటి వారు అదరగొడుతున్నారు. ఈ క్రమంలో బెంగళూరు జట్టు ఫ్లే ఆఫ్స్‌కు చేరేందుకు అడుగు దూరంలో నిలిచింది. ఈ ఏడాది సీజన్లో ఆర్సీబీకి ఇంకా మూడు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఇందులో ఒక మ్యాచ్‌లో గెలిచినా చాలు ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు ఆర్హత సాధిస్తోంది. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్, ఆర్సీబీ దిగ్గజం ఏబీ డివిలియర్స్ ఆసక్తికర ప్రకటన చేశాడు. ఈ ఏడాది సీజన్లో ఆర్సీబీ ఫైనల్స్‌కు చేరుకుంటే తను ఆ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు భారత్‌కు వస్తానని డివిలియర్స్ వాగ్ధానం చేశాడు."ఆర్సీబీ ఫైనల్‌కు చేరుకుంటే, నేను ఆ స్టేడియంలో కచ్చితంగా ఉంటాను. విరాట్ కోహ్లితో కలిసి ఐపీఎల్ ట్రోఫీని అందుకోవడం కంటే నాకు గొప్ప అనుభూతి అంటూ మరొకటి ఉండదు. ఆర్సీబీ చాలా ఏళ్లుగా ఐపీఎల్ టైటిల్ కోసం ప్రయత్నిస్తోంది" అంటూ డివిలియర్స్ ఓ వీడియో రిలీజ్ చేశాడు.కాగా ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఐపీఎల్ అరంగేట్రం చేసిన ఏబీ డివిలియర్స్.. 2011లో ఏబీ డివిలియర్స్ ఆర్సీబీ జట్టులో చేరాడు. ఆ తర్వాత రిటైర్ అయ్యే వరకు 11 సీజన్ల పాటు ఈ ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహించాడు. విరాట్ కోహ్లికి, ఏబీడీకి మంచి స్నేహ బంధం ఉంది.చదవండి: టీమిండియా తదుపరి టెస్టు కెప్టెన్ అతడే: సునీల్ గవాస్కర్

టీమిండియా తదుపరి టెస్టు కెప్టెన్ అతడే: సునీల్ గవాస్కర్
ఇంగ్లండ్ టూర్‌కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడం బీసీసీఐ సెలక్షన్ కమిటీకి పెద్ద తలనొప్పిగా మారింది. భారత జట్టుకు కొత్త టెస్టు కెప్టెన్‌ను ఎంపిక చేసేందుకు సెలక్టర్లు మల్లుగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది.టెస్టు కెప్టెన్సీ రేసులో యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ ముందుంజలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నప్పటికి.. బీసీసీఐ నుంచి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. కెప్టెన్సీ రేసులో గిల్‌తో పాటు రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్ పేర్లు కూడా వినిపిస్తున్నాడు.తాజాగా ఇదే విషయంపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ తన అభిప్రయాన్ని వెల్లడించాడు. వీరి ముగ్గురిలో శుబ్‌మన్ గిల్‌కే గవాస్కర్ ఓటేశాడు. కాగా ఇంగ్లండ్ పర్యటనకు భారత జట్టును బీసీసీఐ మే 23న ప్రకటించే అవకాశముంది. అదే రోజున కొత్త టెస్టు కెప్టెన్ పేరును బీసీసీఐ వెల్లడించనుంది."ప్రస్తుతం కెప్టెన్సీ బాధ్యతలు ఎవరికి అప్పగించినా మన సూపర్ లీడర్స్ ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి స్ధాయికి చేరుకోవడానికి కచ్చితంగా రెండేళ్లు పడుతోంది. ఈ ముగ్గురు టెస్టు కెప్టెన్సీకి సరికొత్త అర్ధాన్ని తీసుకొచ్చారు. భారత కెప్టెన్సీకి ప్రధాన పోటీదారులైన గిల్, అయ్యర్, పంత్‌లను చూస్తుంటే, నాకు ధోని, రోహిత్, విరాట్ గుర్తుస్తున్నారు. బహుశా అయ్యర్, పంత్ కంటే గిల్‌కే కెప్టెన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా న్నాయి. గిల్‌కు అద్బుతమైన కెప్టెన్సీ స్కిల్స్ ఉన్నాయి. అంతేకాకుండా మైదానంలో చాలా చురుగ్గా ఉంటూ వ్యూహాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటున్నాడు" అని గవాస్కర్ పేర్కొన్నాడు.చదవండి: ఇది ‘ఇండియన్’ ప్రీమియర్ లీగ్: ఫారన్ ప్లేయర్లకు శ్రేయస్ కౌంటర్?
బిజినెస్

టెలికంలో కొలువుల మేళా..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీ టెలికం రంగంలో భారీ స్థాయిలో నియామకాలు పెరుగుతున్నాయి. 2025 ప్రథమార్ధంలో కంపెనీలు 45 శాతం మంది ఫ్రెషర్లను తీసుకునే యోచనలో ఉన్నాయి. టీమ్‌లీజ్ ఎడ్టెక్ కెరియర్ ఔట్లుక్ నివేదిక (2025 జనవరి–జూన్ ప్రథమార్ధం)లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం, టెలికం రంగం వేగంగా 5జీ నెట్వర్క్, క్లౌడ్ సిస్టమ్స్ వైపు మళ్లుతూ, సైబర్ సెక్యూరిటీకి పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితుల నేపథ్యంలో ఈ పరిశ్రమలో ఉద్యోగాల కల్పన గణనీయంగా ఉంటోంది. హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ, బెంగళూరులో ఫ్రెషర్ల హైరింగ్ స్థిరంగా కొనసాగుతోంది. నైపుణ్యాలకు ప్రాధాన్యత ప్రత్యేక నైపుణ్యాలకు ప్రాధాన్యతనిస్తూ ఆర్ఎఫ్ ఇంజినీర్లు, నెట్వర్క్ సెక్యూరిటీ అనలిస్టులు, ఫీల్డ్ టెక్నికల్ ఇంజినీర్లు, జూనియర్ డెవాప్స్ ఇంజినీర్లు, క్లౌడ్ నెట్వర్క్ ఇంజినీర్లు మొదలైన వారికి డిమాండ్ ఉంటోంది. హైరింగ్‌పై కంపెనీల ఆసక్తి, గతేడాది ద్వితీయార్థంలో (జులై–డిసెంబర్) నమోదైన 48 శాతం నుంచి స్వల్పంగా కాస్త తగ్గినప్పటికీ నియామకాల జోరు మాత్రం కొనసాగుతోంది. ఆర్ఎఫ్ ఇంజినీర్లకు ఢిల్లీ (49 శాతం), అహ్మదాబాద్ (41 శాతం), కోయంబత్తూర్‌లో (35 శాతం) అత్యధికంగా డిమాండ్ నెలకొంది. నెట్వర్క్ సెక్యూరిటీ అనలిస్టులకు బెంగళూరు, ముంబై, నాగ్‌పూర్‌లో వరుసగా 48 శాతం, 43 శాతం, 38 శాతం మేర డిమాండ్ ఉంది. ఇక ఫీల్డ్ టెక్నికల్ ఇంజినీర్లకు హైదరాబాద్ (55 శాతం), కోల్‌కతా (48 శాతం), ఇండోర్‌లో (43 శాతం) ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. జూనియర్ డెవాప్స్ ఇంజినీర్లకు పుణె (44 శాతం), గురుగ్రాం (40 శాతం), కొచి్చలో (35 శాతం) డిమాండ్ ఉంది. అటు క్లౌడ్ నెట్వర్క్ ఇంజినీర్లకు చెన్నై (51 శాతం), నాగ్‌పూర్ (45 శాతం), చండీగఢ్‌లో (37 శాతం) అత్యధికంగా నియామక అవకాశాలు నమోదయ్యాయి. డొమైన్ సర్టిఫికేషన్లు కావాలి.. ఫ్రెషర్లకు టెలికం రంగంలో వివిధ విభాగాలవ్యాప్తంగా ఉద్యోగావకాశాలు ఉంటున్నప్పటికీ, నెట్వర్క్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, డెవాప్స్లాంటి నిర్దిష్ట డొమైన్ నైపుణ్యాలకు ప్రాధాన్యత ఉంటోంది. ఆర్ఎఫ్ వైర్లెస్ ఇంజినీరింగ్, సైబర్‌సెక్యూరిటీ, క్లౌడ్ నెట్వర్క్ ఆర్కిటెక్చర్లో సర్టీఫికేషన్లకు డిమాండ్ నెలకొంది. సంక్లిష్టమైన నెట్వర్క్ వినియోగాన్ని క్రమబద్ధీకరణ, మేనేజ్మెంట్ కార్యకలాపాల నిర్వహణకు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్, టాస్క్ ట్రాకింగ్ ప్లాట్‌ఫాంలు లాంటి టెక్నాలజీ టూల్స్ వినియోగం కీలకంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో కేవలం సాంకేతిక నైపుణ్యాలతో సరిపెట్టుకోకుండా, ఉద్యోగార్థులు అనలిటికల్ రీజనింగ్, పరిస్థితులకు తగ్గట్లుగా తమను తాము మల్చుకోవడం, ఇంటర్‌పర్సనల్ కమ్యూనికేషన్ సహా సాఫ్ట్ స్కిల్స్‌పై కూడా దృష్టి పెట్టాలని టీమ్‌లీజ్ ఎడ్టెక్ వ్యవస్థపకుడు, సీఈవో శంతను రూజ్ తెలిపారు. ‘‘టెలికం పరిశ్రమ వృద్ధి చెందుతున్నప్పటికీ, కంపెనీలు కేవలం కార్యకలాపాల విస్తరణ కోసమే ఉద్యోగులను తీసుకోవడం లేదు. విశిష్టమైన నైపుణ్యాలున్న ప్రతిభావంతులను తీసుకోవడం ద్వారా భవిష్యత్ అవసరాలకు కూడా సర్వసన్నద్ధంగా ఉండాలని భావిస్తున్నాయి. ఆర్ఎఫ్, సైబర్‌సెక్యూరిటీ, క్లౌడ్ ఎకోసిస్టమ్స్లాంటి అంశాల్లో సర్టిఫికేషన్లు ఉన్న ఫ్రెషర్లు అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. ప్రస్తుతం టెలికం విధుల్లో ఐటీ, డేటా కార్యకలాపాలు కూడా కలిసి ఉంటున్నాయి. కొన్నేళ్ల క్రితం ఇలా ఉండేది కాదు. ఇలా మారిన పరిస్థితులను బట్టి బోధనాంశాలను కూడా సవరించడంపై విద్యా సంస్థలు దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అలాగే ఉద్యోగార్థులు కూడా తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలి’’ అని చెప్పారు.

'అమెరికాలో ఉంటున్న భారతీయులకు హెచ్చరిక'
భారతదేశంలోని యూఎస్ రాయబార కార్యాలయం.. అమెరికాలో ఉంటున్న భారతీయులను ఉద్దేశించి కీలక ప్రకటన చేసింది. నిర్దిష్ట గడువు దాటిన తరువాత కూడా అక్కడే (అమెరికాలో) ఉంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.నిర్దిష్ట గడువు తరువాత కూడా అమెరికాలో ఉంటే.. వారిపై బహిష్కరణ వేటు ఉంటుంది. అంతే కాకుండా భవిష్యత్తులో మళ్ళీ అమెరికాలో అడుగు పెట్టడానికి సాధ్యం కాదు, అంటే శాశ్వత నిషేధం ఎదుర్కోవాల్సి వస్తుందని తన ఎక్స్ ఖాతాలో యూఎస్ ఎంబసీ ఇండియా వెల్లడించింది.యూఎస్ ఎంబసీ ఇండియా చేసిన ప్రకటన.. అమెరికాలో విద్యార్థి, పర్యాటక, వర్క్ పర్మిట్ వంటి వీసాలతో ఉంటున్న భారతీయులకు వర్తిస్తుంది. ఆదేశాలను ఉల్లంఘించి ఎవరైనా అక్కడే ఉంటే.. వారు భవిష్యత్తులో ఎప్పుడూ మళ్ళీ అమెరికాలో అడుగుపెట్టలేరు. నిర్దిష్ట గడువు తరువాత.. ఏవైనా అనుకోని ఇబ్బందులు ఎదురైతే, చట్టపరమైన చర్యల నుంచి బయటపడటానికి యూఎస్సీఐఎస్ (U.S. Citizenship and Immigration Services) ని సంప్రదించాలని, యూఎస్ ఎంబసీ ఇండియా పేర్కొంది.ఇదీ చదవండి: ఇదీ పాకిస్తాన్ పరిస్థితి..!వీసా గడువు ముగిసిన తరువాత కూడా దేశంలో ఉంటున్నవారు యూఎస్ విడిచి వెళ్లిపోవాలని.. హోంల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టి నోయెమ్ ఏప్రిల్‌లోనే చెప్పారు. గడువు దాటిన 30 రోజుల వరకు కూడా దేశంలోనే ఉన్నవారు ఫెడరల్ గవర్నమెంట్ వద్ద రిజిస్టర్ చేసుకోవాలి. లేకుంటే.. అలాంటి వారిని క్రిమినల్ కేసులు కింద అరెస్ట్ చేసి జైలులో ఉంచే అవకాశం ఉంది. జరిమానా కూడా విధించవచ్చు.If you remain in the United States beyond your authorized period of stay, you could be deported and could face a permanent ban on traveling to the United States in the future. pic.twitter.com/VQSD8HmOEp— U.S. Embassy India (@USAndIndia) May 17, 2025

ఇలా చేస్తే ఇంటి విలువ తగ్గుతుంది
హైదరాబాద్‌లో ఓ హైరైజ్ అపార్ట్మెంటది. దాదాపు పదేళ్ల క్రితం నిర్మాణం పూర్తి చేసి.. నివాసిత సంఘానికి అప్పగించేసింది నిర్మాణ సంస్థ. రెండు మూడేళ్లు బాగానే ఉన్నా.. ఆ తర్వాతే ఒకరిద్దరు ప్రతికూల సభ్యులతో నివాసిత సంఘం సర్వనాశనమైంది. పదేళ్ల క్రితం డెవలపర్ వసూలు చేసిన రూ.3.2 కోట్ల కార్పస్ ఫండ్.. ప్రస్తుతం వడ్డీతో సహా కలిపి రూ.4–5 కోట్ల వరకుంది. ఏం లాభం ప్రాజెక్ట్ నిర్వహణ చేసుకునే స్థితిలో అసోసియేషన్ లేదు. మధ్యలో ఓసారి కమ్యూనిటీ బాధ్యతలు చేపట్టేందుకు మహిళా సభ్యులు ధైర్యంగా ముందుకొస్తే.. వాళ్ల మీద లేనిపోని పోలీసు కేసులు పెట్టడంతో మనకొచ్చిన గొడవెందుకులే అని వాళ్లూ వెనుదిరిగారు. ఫలితంగా ఆ అపార్ట్మెంట్ రంగులు వెలిసి, రోడ్లు పాడైపోయి బోసిపోయింది. దీంతో ప్రస్తుతం అక్కడ అపార్ట్మెంట్ ధర చ.అ.కు రూ.5 వేలు ఉంటే.. ఈ ప్రాజెక్ట్‌లో మాత్రం రూ.3,500లకు మించి పలకట్లేదు. – సాక్షి, సిటీబ్యూరోరెసిడెన్షియల్ అసోసియేషన్లలో ఒకరిద్దరు సభ్యులతో కలిగే నష్టాలకు ఇదొక ఉదాహరణ మాత్రమే. నగరంలోని కమ్యూనిటీ అసోసియేషన్ల లో 50 శాతం వరకు ఇలాంటివే ఉంటాయంటే ఆశ్చర్యం లేదు. వార్షిక నిర్వహణ బాధ్యత నివాసిత సంఘాలదే అన్న ప్రాథమిక సూత్రాన్ని విస్మరిస్తే.. తగ్గేది మనం ఉండే ఇంటి విలువే.ప్రతీది బిల్డరే చేయాలంటే ఎలా?ప్రతి ఒక్కరూ కష్టపడినే సొమ్ముతోనే ఇల్లు కొనుక్కుంటారు. పండుగలకు, ప్రత్యేక సందర్భాలలో ఇంటిని అందంగా తీర్చిదిద్దుకోమా? నాలుగైదేండ్లకు ఒకసారి రంగులు వేసుకోవటం, పగుళ్లు వచ్చినా, డ్రైనేజీ, బోర్, లిఫ్ట్ వంటి వాటిల్లో సమస్యలొస్తే రిపేరు చేసుకోమా? అలాగే అపార్ట్మెంట్లలో ఉండే వాళ్లూ అంతే అసోసియేషన్ సభ్యులు అందరూ కలిసి చేసుకోవాలే తప్ప.. ప్రాజెక్ట్‌లో ఏ నిర్వహణ పనులైనా బిల్డరే చేయించాలని పట్టుబడుతూ కూర్చుంటే పాడైపోయేది మీరు ఉండే ఇళ్లేనని గుర్తుంచుకోండి. నిర్వహణ వ్యయాన్ని కార్పస్ ఫండ్ నుంచి ఖర్చు పెట్టుకోవాలే గానీ అన్నింటికీ బిల్డరే చేయాలని కూర్చుంటే మూర్ఖత్వమే అవుతుంది. ఎవరి ప్రాపరీ్టని వాళ్లే కాపాడుకోవాలి.పైన పటారం.. లోన లొటారం..‘పైన పటారం లోన లొటారం’ అన్న చందంగా.. భవనం బయట నుంచి చూస్తే రంగులు వెలిసి, రోడ్లు పాడైపోయి వికారంగా కనిపిస్తుంటుంది గానీ అదే అపార్ట్మెంట్ లోపలికి వెళ్లి చూస్తే మాత్రం అందమైన ఇంటీరియర్‌తో లగ్జరీగా బాగుంటుంది. అయినా ఏం లాభం బయటి నిర్మాణం అంద విహీనంగా కనిపిస్తుంటే ఇంటి విలువ తగ్గుతుంది. పాజిటివ్ మైండ్‌సెట్ ఉన్న సభ్యులనే ఎన్నుకొని ప్రాజెక్ట్‌ను అభివృద్ధి పరుచుకోవాలని పరిశ్రమ నిపుణులు సూచిస్తున్నారు.నివాసిత సంఘానికి సప్త సూత్రాలు!➤పాజిటివ్ మైండ్ ఉన్న వాళ్లనే అధ్యక్షులుగా ఎన్నుకోవాలి. నిర్వహణ కోసం వారిని ప్రోత్సహించాలి. వాళ్ల పనులకు అడ్డుపడుతూ, లోపాలను ఎంచకూడదు.➤ఇదేమీ వేతనం వచ్చే పదవి కాదు. సామాజిక సేవ లాంటిదే. అలాంటప్పుడు వాళ్ల పనులు వదిలేసి మన ప్రాజెక్ట్ బాగుండాలని, అభివృద్ధి చేయాలనే సదుద్దేశంతో ముందుకొస్తే లేనిపో ని మాటలతో, అభాండాలను వేయకూడదు.➤ప్రతి అసోసియేషన్‌లో 2 శాతం నెగిటివ్ మైండ్‌సెట్ ఉన్న సభ్యులుంటారు. వాళ్లను వదిలేసి మెజారిటీ సభ్యుల ఆమోదం మేరకు నిర్ణయాలను తీసుకోవాలి. ఒకరిద్దరు సభ్యుల చెప్పుడు మాటలు విని తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు.➤కమ్యూనిటీ అంతా ఒక కుటుంబంలా ఉంటే.. ఆనందం, ఆరోగ్యంతో పాటు బయటి వాళ్లలో కమ్యూనిటీ పట్ల మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. దీంతో ప్రాజెక్ట్ విలువ పెరుగుతుంది.➤పిల్లలు ఉంటే వీకెండ్స్, సెలవు రోజుల్లో ఆటలు, సాంసృతిక పోటీల వంటివి నిర్వహించాలి. పెద్దల కోసం తీర్థయాత్రలు, వన భోజనాల వంటివి ఏర్పాటు చేయాలి.➤రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ వ్యవస్థలను క్రమం తప్పకుండా చెక్ చేపించాలి. పార్క్, గ్రీనరీ, లిఫ్ట్, జనరేటర్ వంటి వసతులను నిర్వహణ చేసుకోవాలి. ఇందుకోసం అయ్యే వ్యయాలను సభ్యులు అందరూ కలిసి పంచుకోవాలి.

జియో యూజర్లకు శుభవార్త: రూ.100 రీఛార్జ్‌తో ఎన్నో బెనిఫిట్స్!
భారతదేశంలో ఎక్కువ మంది వినియోగదారులతో అగ్రగామిగా ఉన్న టెలికాం ఆపరేటర్ రిలయన్స్ 'జియో'.. రూ.100 ప్లాన్‌లో రూ.299 విలువైన ఓటీటీ బెనిఫిట్స్ అందించే ఒక కొత్త ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్ ముఖ్యంగా మొబైల్ లేదా టీవీలో స్ట్రీమింగ్ కంటెంట్‌ను ఆస్వాదించే వినియోగదారుల చాలా ఉపయోగకరంగా ఉంటుంది.రూ.100 ప్లాన్జియో కొత్తగా ప్రవేశపెట్టిన రూ.100 ప్లాన్.. సాధారణంగా రూ.299 ప్లాన్‌లో కనిపించే ప్రయోజనాలను అందిస్తుంది. ఈ ప్లాన్ 90 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. మొత్తం డేటా 5 జీబీ మాత్రమే. జియో సినిమా ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. ప్రీమియం సబ్స్క్రిప్షన్లపై ఎక్కువ ఖర్చు చేయకుండా సినిమాలు, వెబ్ సిరీస్‌లు, స్పోర్ట్స్ వంటి వాటిని ఆస్వాదించాలనుకునే వారికి ఈ ప్లాన్ సరిపోతుంది.బేస్ ప్లాన్ రీఛార్జ్ తప్పనిసరిజియో వినియోగదారులు ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే.. 100 రూపాయల ప్లాన్ ద్వారా బెనిఫిట్స్ పొందాలంటే.. జియో నంబర్లో యాక్టివ్ బేస్ ప్లాన్ రీఛార్జ్ చేసుకుని ఉండాల్సిందే. బేస్ ప్లాన్ రీఛార్జ్ చేసుకోకుండా.. రూ. 100 రీఛార్జ్ ద్వారా ప్రయోజనాలను పొందలేరు.
ఫ్యామిలీ

వరల్డ్ స్ట్రెంత్ గేమ్స్‌కి రెడీ అంటున్న 70 ఏళ్ల వెయిట్ లిఫ్టర్
కుమారుడితో కలిసి దిల్లీలో ఉంటున్న రోషిణికి ఎడమ కాలి మోకాలినొప్పి మొదలైంది. మెట్లు ఎక్కడం, నడవడం కష్టంగా మారింది. ఆమె ఎడమ మోకాలికి ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్నట్లు గుర్తించారు. కుడి చూపుడు వేలు బలహీన పడింది.ఫిజియో థెరపీ మొదలు పెట్టింది. ‘ఈ టైమ్‌లో అమ్మకు జిమ్ అవసరం ఉంది’ అనుకున్నాడు ఆమె కుమారుడు, ఫిట్నెస్ కోచ్ అయిన అజయ్. 68 సంవత్సరాల వయసులో తొలిసారిగా జిమ్‌లోకి అడుగు పెట్టింది రోషిణి.మెల్ల మెల్లగా ఆమెకు సాంత్వన చేకూరింది.స్ట్రెచ్చింగ్, మూమెంట్ ఎక్సర్‌సైజ్‌లతో మొదలుపెట్టి వర్కవుట్స్‌ను ఎంజాయ్ చేయడం మొదలుపెట్టింది. రెగ్యులర్ ట్రైనింగ్ వల్ల చేయి బలపడింది. రోజువారీ పనులు కష్టంగా అనిపించేవి కాదు. 在 Instagram 查看这篇帖子 Choudhary Ajay Sangwan (@weightliftermummy) 分享的 జిమ్ ఉత్సాహం ఆమెను వెయిట్ లిఫ్టింగ్ వైపు తీసుకువచ్చింది.ఇప్పుడు రోషిణి ట్రాప్బార్ డెడ్‌లిఫ్ట్‌లో 97 కేజీల బరువు ఎత్తుతుంది. 80 కేజీల కన్వెన్షల్ డెడ్‌లిఫ్ట్స్ చేస్తుంది. 50 కేజీల స్క్వాట్స్ చేస్తుంది. 120 కేజీల లెగ్ ప్రెస్ చేస్తుంది. 4 నిమిషాల పాటు ప్లాంక్ పట్టుకోగలదు. ప్రతిరోజూ రెండు గంటలు స్ట్రెంత్ ట్రైనింగ్, కార్డియో చేస్తుంది. ‘దువ్వెన పట్టుకోవడం కూడా కష్టమే అని ఒకప్పుడు డాక్టర్లు అమ్మ గురించి చెప్పారు’ అని గతాన్ని గుర్తు చేసుకున్నాడు అజయ్. జిమ్‌లో వర్కవుట్స్ పుణ్యమా అని ఇప్పుడు రోషిణికి ఇన్‌స్టాగ్రామ్‌లో వేలాదిమంది ఫాలోవర్స్ ఉన్నారు. వారు ఆమెను ప్రేమగా ‘వెయిట్‌లిఫ్టర్ మమ్మీ’ అని పిలుచుకుంటారు.ఇదీ చదవండి:Cannes Film Festival 2025: కాన్స్‌లో మెరిసిన 17 ఏళ్ల యువతార, బాలీవుడ్ అగ్ర హీరోయిన్లను..!డైట్ విషయానికి వస్తే...‘ఎలాంటి రిస్ట్రిక్షన్లు లేవు. నాకు దహి బల్లే అంటే చాలా ఇష్టం. అలా అని అదేపనిగా తినను. అప్పుడప్పుడు మాత్రమే తింటాను. ఏదైనా ఎక్కువ తీసుకోవడం మంచిది కాదు’ అంటుంది ఇంటి భోజనాన్ని ఇష్టపడే రోషిణి. వచ్చే సంవత్సరం అమెరికాలో జరిగే ‘వరల్డ్ స్ట్రెంత్ గేమ్స్’కి ఆమెకు ఆహ్వానం అందింది.ప్రస్తుతం రోషిణి ఆ ఈవెంట్ కోసం ప్రాక్టీస్ చేస్తోంది. ‘ఒకప్పుడు నేను ఇంటికే పరిమితమయ్యేదాన్ని. ఇప్పుడు మాత్రం బయటికి వెళుతున్నాను. రకరకాల కార్యక్రమాలలో పాల్గొంటున్నాను. ఇప్పుడు సంతోషంగా ఉంది’ అంటుంది రోషిణి. ‘సీనియర్ సిటిజన్స్ జిమ్‌లో వ్యాయామాలు చేసినప్పుడు అది వాళ్లకు సంబంధించిన విషయం మాత్రమే కాదు. వారి నుంచి యువతరానికి సందేశం అందుతుంది’ అంటున్నాడు అజయ్. అరవై ఎనిమిది సంవత్సరాల వయసులో జిమ్‌లోకి అడుగు పెట్టిన రోషిణి... ఇప్పుడు ఎన్నో వ్యాయామాలలో ఆరి తేరింది. వెయిట్ లిఫ్టింగ్‌లో పట్టు సాధించింది. అమెరికాలో జరగబోయే ‘వరల్డ్ స్ట్రెంత్ గేమ్స్’లో పాల్గొనడానికి రెడీ అవుతోంది 70 సంవత్సరాల రోషిణి. ఇదీ చదవండి: బిగ్ బాస్ విన్నర్ లివర్‌లో టెన్నిస్ బాల్ అంత కణితి : వైరల్ పోస్ట్

అందాల పోటీ అంటే..మనల్ని మనం తెలుసుకోవడమే..!
హైదరాబాద్‌లో జరిగే 72వ మిస్ వరల్డ్ ఫెస్టివల్లో చెక్ రిపబ్లిక్కు ప్రాతినిధ్యం వహిస్తుంది అడెలా స్ట్రొఫెకోవా.21 ఏళ్ల ఈ బ్యూటీ మోడల్, ఫిట్నెస్ ట్రైనర్, ఈవెంట్ ఏజెన్సీ మేనేజింగ్ డైరెక్టర్‌గా కూడా పనిచేస్తోంది. కనెక్టింగ్ హార్ట్స్ అక్రాస్ జనరేషన్స్ పేరుతో రెండు, మూడు తరాల వారిని ఒకచోట చేర్చడం, ప్రేమ, దయ, స్నేహపూరిత వాతావరణాన్ని వ్యాప్తి చేయడంపై దృష్టి పెడుతుంది. ఏదైనా సాధించాలనుకోవడానికి ముందు తమకు నిజంగా ఏం కావాలో తెలుసుకోవడం ముఖ్యం’ అంటూ తన గురించి తెలియజేసింది. ‘‘అందాల కిరీటం అనేది ఒక ఏడాది వరకే. కానీ, చాలామందితో కనెక్ట్ అవ్వచ్చు. నా కల ఒక్కటే! మిస్ వరల్డ్‌గా నన్ను నేను చూసుకోవాలి. నా చిన్నప్పటి నుంచే ఈ ఆలోచన ఉండేది. మా అమ్మ మేకప్ వస్తువులన్నీ నేనే వాడేసేదాన్ని. అమ్మ డ్రెస్సులు, హీల్స్ వేసుకొని ఇంట్లో తిరిగేదాన్ని. పదిహేనేళ్ల వయసు నుంచి అందాల పోటీలలో పాల్గొంటూ వచ్చాను. పదిహేడేళ్ల వయసులో మొదటి సారి ప్రపంచ పోటీలో పాల్గొన్నాను.ఇదీ చదవండి: బిగ్ బాస్ విన్నర్ లివర్‌లో టెన్నిస్ బాల్ అంత కణితి : వైరల్ పోస్ట్విజయసాధనకు..బ్యూటీ కాంటెస్ట్‌లో చాలా ఛాలెంజెస్ ఉంటాయి. వివిధ రంగాలలో మమ్మల్ని పరీక్షిస్తారు. వాటిలో పాల్గొన్నప్పుడు కొంత ఆందోళనగా కూడా ఉంటుంది. కానీ, నన్ను నేను నిరూపించుకోవడానికి ముఖ్యమైన సమయం అదే. మిస్ బ్యూటీ కావాలని కలలు కనే యువతులు అనుకరించడం కాదు. ముందు తామేం కావాలని కోరుకుంటున్నారో తెలుసుకోవడం ముఖ్యం. నిజంగా ఏదైనా కోరుకుంటే 200 శాతం ప్రయత్నించాలి. అప్పుడే విజయం సాధించగలం. ఒక్క మిస్ విషయమే కాదు నేను ఏదైనా కోరుకున్నప్పుడు విజయం కోసం నా వంతుగా మొత్తం ప్రాణం పెట్టేస్తాను. అలాగే, విజయాలూ సాధించాను. కోరుకున్నది పొందాలంటే సరైన సమయం, శక్తి, దృష్టి పెడితే అదే మనకు అదృష్టంగా మారుతుంది. అందాల పోటీలలో పాల్గొనడమంటే అన్ని విధాల తమని తాము మానసికంగా, శారీరకంగా సంసిద్ధులను చేసుకోవడమే. ఇదీ చదవండి: Cannes Film Festival 2025: కాన్స్‌లో మెరిసిన 17 ఏళ్ల యువతార, బాలీవుడ్ అగ్ర హీరోయిన్లను..!ఫిట్నెస్ ట్రైనర్ నాకు చిన్నప్పటి నుంచి క్రీడలంటే చాలా ఇష్టం. స్విమ్, రన్నింగ్, హార్స్ రైడింగ్ చేస్తాను. మోడలింగ్ నా కెరియర్. జీవనాధారం కూడా అదే. ఫిట్నెస్ ట్రైనర్‌గా కోచింగ్ ఇస్తాను. ఆ సమయంలో చాలా ఆనందిస్తాను. ఫిట్నెస్ గురించి నేను చెప్పే విషయాలు వినడమే కాదు, వాళ్లు ఆచరణలో పెడతారు. ఓ గొప్ప సమాజమే నాతోపాటు ఉందనిపిస్తుంది. వారితో నా అనుభవాలను పంచుకోవడం కూడా నాకు చాలా ఇష్టం. వారానికి కనీసం రెండుసార్లు ఫిట్నెస్ గ్రూప్‌లకు కోచ్‌గా పనిచేస్తాను. నాకు ప్రస్తుతం ఉన్న క్షణం చాలా ముఖ్యమైనది. అందుకే ఈ క్షణంలో మాత్రమే జీవిస్తాను. సాధ్యమైనంత వరకు ప్రపంచాన్ని తెలుసుకోవాలి అనుకుంటాను.ఫ్యాషన్ గురించి ఒక వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని తను ధరించే దుస్తుల ద్వారానే వ్యక్తపరచగలడు. మేం చెక్ రిపబ్లిక్లో స్థిరపడినా వివిధ దేశాలకు సంబంధించిన దుస్తుల్లో నన్ను నేను చూసుకుంటాను’’ అని వివరించారీ బ్యూటీ.అందాల పోటీలలో పాల్గొనడమంటే అన్ని విధాల తమని తాము మానసికంగా, శారీరకంగా సంసిద్ధులను చేసుకోవడమే-అడెలా స్ట్రొఫెకోవా, చెక్ రిపబ్లిక్ – నిర్మలారెడ్డిఫొటోలు: ఎస్.ఎస్. ఠాకూర్

చెమట కంపు... వదిలించుకోండిలా...!
వేసవిలో చెమట వాసన అత్యంత అసౌకర్యంగా అనిపిస్తుంది. ఇది సాధారణమే అయినప్పటికీ కాలేజీ అయినా, ఆఫీసు అయినా, పార్టీ అయినా, ఫంక్షన్ హౌస్ అయినా చెమట దుర్వాసన వ్యక్తిత్వంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. దాదాపు అందరూ చెమట వాసన రాకుండా ఉండేందుకు పెర్ఫ్యూమ్లు, డియోడరెంట్లు వంటి వివిధ రకాల సువాసనలను ఉపయోగిస్తారు. కానీ కొంత మంది పెర్ఫ్యూమ్, డియోల నుంచి వచ్చే ఘాటైన వాసనను తట్టుకోలేరు. అలెర్జీ కూడా కలిగిస్తుంది.బ్రిటన్‌లోని యూనివర్శిటీ ఆఫ్ యార్క్ పరిశోధన ప్రకారం.. చెమట వాసనకు గల కారణాలలో ముఖ్యమైనది ఎంజైమ్. ఇది ప్రధానంగా చంకలలో కనిపించే బ్యాక్టీరియా ద్వారా ఉత్పత్తి అవుతుంది. వీటి మూలాన్ని తొలగించడం వల్ల చెమట దుర్వాసన తొలగించుకోవచ్చు.చెమట వాసన ఎంజైమ్‌లను తొలగించడానికి ఇంటి నివారణలు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. నిమ్మ, టమోటా, కొబ్బరి నూనె వంటి కొన్ని గృహోపకరణాల ద్వారా చెమట దుర్వాసనను సులభంగా వదిలించుకోవచ్చు. రెండు నిమ్మకాయలను కట్ చేసి చెమట పట్టిన ప్రదేశంలో రుద్దాలి. కొద్దిసేపటి తర్వాత నిమ్మరసం ఆరి΄ోయినట్లు అవుతుంది. ఇప్పుడు ఆ ప్రాంతాన్ని నీటితో కడగాలి. ఇలా రోజుకి ఒకసారి చేస్తే చెమట దుర్వాసన ఇట్టే పోతుంది.ప్రతిరోజూ స్నానానికి ముందు టొమాటోను కట్ చేసి.. దీని రసాన్ని శరీరంలోని చెమట ఉన్న భాగాలపై రాసుకోవాలి. కనీసం 15 నిమిషాల పాటు అలాగే ఉంచి తర్వాత స్నానం చేయాలి. ఇలా రోజూ చేస్తే చెమట వాసన దూరం అవుతుంది.చెమట దుర్వాసనను తగ్గించడంలో కొబ్బరి నూనె చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇందులోని లారిక్ యాసిడ్ చెమటలో దుర్వాసన కలిగించే బ్యాక్టీరియాను చంపుతుంది. అలాగే స్నానం చేసే నీటిలో ఒక చెంచా తేనె కలుపుకుని, ఆ నీటితో స్నానం చేస్తే చెమట వాసన రానేరాదు.

బట్టతలపై వెంట్రుకలు సాధ్యమే! దువ్వెన్లు సిద్దం చేసుకోండి!
వయసు మీరుతున్న కొద్దీ తలపై జుట్టూడిపోవడం సాధారణం. కానీ.. కొంతమందికి చిన్న వయసులోనే బట్టతల వచ్చేస్తుంటుంది. మళ్లీ జుట్టు కావాలని అనుకుంటే హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ వంటి వ్యయ ప్రయాసలతో కూడిన పద్ధతులు మాత్రమే ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అయితే త్వరలోనే ఈ సమస్య తీరి పోతుందంటున్నారు హార్వర్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. జుట్టు రాలడాన్ని తగ్గించడమే కాకుండా... రాలిపోయిన జుట్టు స్థానంలో సరికొత్తగా వెంట్రుకలు మొలిచేలా కూడా చేసేందుకు తాము ఓ కొత్త పద్ధతిని ఆవిష్కరించామని వీరు చెబుతున్నారు. నొప్పి ఏమాత్రం కలిగించని, అతిసూక్ష్మమైన సూదులతో కూడిన పట్టీని అతికించి.. ఆ సూదుల ద్వారా ఒక మందును నెత్తికి అందించడం ద్వారా ఇది సాధ్యమని వారు వివరించారు. ఎలుకలపై తాము ఇప్పటికే కొన్ని ప్రయోగాలు చేశామని, సత్ఫలితాలు సాధించామని తెలిపారు.అలొపీసియాకు కారణాలు కచ్చితంగా తెలియవు కానీ.. ఇది ఒక ఆటో ఇమ్యూన్ వ్యాధి. అంటే.. శరీర రోగ నిరోధక వ్యవస్థే.. బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులు దాడి చేశాయని పొరబడి మన శరీరానికి నష్టం చేయడాన్నే ఆటో ఇమ్యూన్ వ్యాధి అంటారు. అలోపీసియా విషయంలో రోగ నిరోధక వ్యవస్థలోని టీ–కణాలు వెంట్రుకల కుదుళ్లపై దాడి చేస్తాయన్న మాట. ఫలితంగా వెంట్రుకలు అక్కడక్కడా రాలిపోవడం మొదలవుతుంది. కొంతమందిలో రాలిపోయిన తరువాత ఒకసారి పెరిగే అవకాశం ఉంటుంది కానీ.. మిగిలిన వారికి ఆ అదృష్టం ఉండదు. ఇదీ చదవండి: బిగ్ బాస్ విన్నర్ లివర్‌లో టెన్నిస్ బాల్ అంత కణితి : వైరల్ పోస్ట్‌ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. కీళ్లనొప్పులు, తామర వంటివి ఆటో ఇమ్యూన్ వ్యాధులు కావడం... చికిత్సకు మందులు (రోగ నిరోధక వ్యవస్థను అణచివేసేవి) ఉపయోగించినప్పుడు జుట్టు మొలవడం! మందులు వాడటం నిలిపేసిన వెంటనే జుట్టు రాలడమూ మొదలవుతూ ఉండటాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో ఈ మందుల్లోనే ఏదో మర్మముందన్న సందేహంతో శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేయడం మొదలుపెట్టారు. ఇదీ చదవండి: వెండి గాజుల కోసం.. తల్లి చితిపై పడుకుని..కొడుకు కాదు!మందులు కేవలం వెంట్రుకల కుదుళ్లపై దాడి చేస్తున్న టీ–కణాలే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. దీంతో మైక్రో నీడిల్ ప్యాచ్ ద్వారా ఈ మందులు నేరుగా వెంట్రుకల కుదుళ్లకు మాత్రమే అందేలా చేశారు. ఎలుకలతో ప్రయోగాలు చేసినప్పుడు మూడు వారాల్లోపు పదిసార్లు ΄్యాచ్‌లు మార్చి.. ఇంకో ఎనిమిది వారాలు వాటిని గమనించారు. మూడు వారాల తరువాత వెంట్రుకలు పెరగడం మొదలైంది. పదివారాలపాటు పెరుగుతూనే ఉన్నాయి. సో... సమీప భవిష్యత్తులోనే బట్టతల కలవారందరూ ఎంచక్కా జేబులో దువ్వెన పెట్టుకుని తిరిగే అవకాశం ఉందన్నమాట!
ఫొటోలు
అంతర్జాతీయం

పార్లమెంట్లో ప్రసంగం.. నవ్వుల పాలైన పాక్ ఉప ప్రధాని ఇషాక్ దార్
ఇస్లామాబాద్: పాక్ ఉప ప్రధాని ఇషాక్‌దార్ మరోసారి నవ్వుల పాలయ్యారు. ఫేక్ వార్తను పార్లమెంట్లో చదివి వినిపించి గొప్పలు చెప్పుకున్నారు. పాక్ ఎయిర్‌ఫోర్స్‌ను విదేశీ మీడియా ప్రశంచిందంటూ ప్రకటించుకున్నారు. అయితే విదేశీ మీడియా తమ ఎయిర్‌ఫోర్స్ గురించి నిజంగా ప్రశంసలు కురిపించిందా? అని పాకిస్తాన్ మీడియా సంస్థ ‘డాన్’ నిజనిర్ధారణ చేసింది. అందులో విదేశీ మీడియా కథనం బూటకమని తేల్చి చెప్పింది. అసలు ఇషాక్ దార్ చెప్పినట్లుగా సదరు మీడియా సంస్థ సైన్యానికి సంబంధించిన ఎలాంటి వార్తల్ని ప్రచురించలేదని తెలిపింది.ఇంతకీ ఏం జరిగిందంటే? పాకిస్తాన్‌పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌ను కీర్తిస్తూ అంతర్జాతీయ మీడియా సంస్థలు పలు కథనాల్ని ప్రచురించాయి. ఈ క్రమంలో బ్రిటన్‌కు చెందిన డైలీ టెలిగ్రాఫ్ అందుకు భిన్నంగా ‘ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ ఎయిర్‌ఫోర్స్ వ్యవహరించిన తీరును ప్రశంసంపై ఓ కథనాన్ని ప్రచురించింది’ అంటూ డైలీ టెలిగ్రాఫ్ హెడ్‌లైన్‌ను పార్లమెంట్లో ఇషాక్ దార్ ప్రస్తావించారు. అసలు విషయం ఏంటంటే?Pakistan's Deputy Prime Minister and Foreign Minister Ishaq Dar falsely told the Senate that The Telegraph headlined the PAF as the ‘Undisputed King of the Skies’—a far-fetched claim that even Dawn News felt compelled to fact-check him. pic.twitter.com/piho3z9Zha— DD India (@DDIndialive) May 16, 2025 ‘గగనతల రారాజు పాక్ ఎయిర్‌ఫోర్స్’ వాస్తవానికి డైలీ టెలిగ్రాఫ్ ఆ హెడ్‌లైన్‌ను రాయలేదు. పాకిస్తానీయులే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో తప్పుడు వార్తను సృష్టించారు. దాన్నే నిజమనుకుని ఇషాక్‌దార్ భ్రమపడ్డారు. ‘గగనతల రారాజు పాక్ ఎయిర్‌ఫోర్స్’ అంటూ విదేశీ మీడియా కీర్తించిందని ప్రకటన చేశారు. దీంతో కంగుతిన్న డైలీ టెలిగ్రాఫ్ .. అసలు తాము అలాంటి హెడ్లైన్ పెట్టలేదని స్పష్టం చేసింది. డైలీ టెలిగ్రాఫ్ మాత్రమే కాదు.. పాక్ దేశ మీడియా సంస్థ డాన్‌న్యూస్ సైతం ఇదే విషయాన్ని చెప్పింది. పాకిస్తాన్ పార్లమెంట్ సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యల్ని ఖండించింది.ఇషాక్ దార్‌వి పచ్చి అబద్ధాలు ‘పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఆకాశాలలో తిరుగులేని రాజు’ అని పేర్కొంటూ డైలీ టెలిగ్రాఫ్ వార్త రాసిందా? లేదా? అని డాన్ మీడియా ప్రతినిధులు పరిశీలించారు. ఇషాక్ దార్ చెప్పినట్లుగా సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్నట్లుగా మే 10న ది డైలీ టెలిగ్రాఫ్ ఫ్రంట్ పేజీలో ఉన్న వార్తకి.. ఇషాక్ దార్ చదివి వినిపించిన హెడ్‌లైన్‌కు పొంతన లేదని తేలింది. ఆ పత్రిక ఎప్పుడూ అలాంటి కథనాల్ని ప్రచురించలేదని డాన్ తేల్చింది. దీంతో పాక్ ఉప ప్రధాని ఇషాక్ దార్‌పై నెటిజన్లు చూసికోవాలని కదాయ్యా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Earthquake: చైనాలో భూకంపం
బీజింగ్: చైనాలో భూకంపం సంభవించింది. శుక్రవారం ఉదయం రిక్టర్ స్కేలుపై 4.5 తీవ్రతతో భూకంపం సంభవించినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (NCS) వెల్లడించింది.భారత కాలమానం ప్రకారం ఉదయం 6:29 గంటలకు ఈ ప్రకంపనలు సంభవించాయి. భూమి లోతులో 10 కిలోమీటర్ల లోపల భూకంపం నమోదైనట్లు ఎన్సీఎస్ అధికారులు తెలిపారు. ఈ మేరకు భూకంప వివరాలను ఎన్సీఎస్ తమ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈనెల మే 12న తెల్లవారుజామున 2:41 గంటలకు టిబెట్, చైనా పలు ప్రాంతాల్లో 5.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆ భూకంపం భూమిలో 9 కిలోమీటర్ల లోతులో నమోదైంది.EQ of M: 4.5, On: 16/05/2025 06:29:51 IST, Lat: 25.05 N, Long: 99.72 E, Depth: 10 Km, Location: China. For more information Download the BhooKamp App https://t.co/5gCOtjcVGs @DrJitendraSingh @OfficeOfDrJS @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia pic.twitter.com/08mQNfOwyd— National Center for Seismology (@NCS_Earthquake) May 16, 2025

ఆపరేషన్ సిందూర్‌కి ముందు ట్రంప్,పాక్‌ల మధ్య చీకటి ఒప్పందం?
వాష్టింగన్: పహల్గాంలో ఉగ్రదాడి, ఆ దాడిపై భారత చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’కు ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. పాకిస్తాన్ ప్రభుత్వంతో జరిపిన ఓ చీకటి ఒప్పందం బట్టబయలైంది. ఆ చీకటి ఒప్పందానికి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌కు సైతం సంబంధం ఉండడం మరింత అనుమానాలకు తెరతీసింది. అమెరికాకు చెందిన ప్రైవేట్ క్రిప్టోకరెన్సీ కంపెనీ వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్, పాకిస్తాన్ క్రిప్టో కౌన్సిల్ మధ్య జరిగింది. పాకిస్తాన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నెల రోజుల వయసున్న (అప్పటికి ఏర్పాటు చేసి నెలరోజులే) క్రిప్టో కౌన్సిల్‌తో కుదుర్చుకున్న ఈ కంపెనీలో ట్రంప్ కుమారులు ఎరిక్ ట్రంప్, డొనాల్డ్ ట్రంప్ జూనియర్, అల్లుడు జారెడ్ కుష్నర్ కలిపి 60శాతం వాటా ఉంది. గత నెలలో వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్, పాకిస్తాన్ క్రిప్టో కౌన్సిల్‌తో ఒప్పందం చేసుకున్నారని తెలిపే లెటర్ ఆఫ్ ఇంటెంట్ సైతం ఉంది.ఆఘమేఘాల మీదఈ ఒప్పందం తర్వాత వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ సంస్థకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేలా కొద్ది రోజుల వ్యవధిలోనే పాకిస్తాన్ క్రిప్టో కౌన్సిల్ తమ సలహాదారుగా బైనాన్స్ వ్యవస్థాపకుడు ఛాంగ్‌పెంగ్ జావోను పాక్ ప్రభుత్వం నియమించింది. ఘన స్వాగతం పలికిన ఆసిమ్ మునీర్ ఈ ఒప్పందంలో భాగంగా అమెరికా నుంచి పాకిస్తాన్‌కు వచ్చిన ఓ ప్రతినిధి బృందానికి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ స్వయంగా ఆ అమెరికన్ బృందానికి నాయకత్వం వహించింది మరెవరో కాదు ట్రంప్ అత్యంత సన్నిహితుడు,వ్యాపార భాగస్వామి స్టీవ్ విట్కాఫ్ కుమారుడు జాకరీ విట్కాఫ్. జాకరీ విట్కాఫ్ ప్రస్తుతంప్రస్తుత మిడిల్ ఈస్ట్‌కు అమెరికా ప్రత్యేక రాయబారిగా ఉన్నారు. జాకరీ విట్కాఫ్ బృందం పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌తో రహస్య సమావేశం సైతం నిర్వహించింది. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థలో ఈ ఒప్పందం ప్రకారం, పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థలో బ్లాక్‌చైన్ టెక్నాలజీని ప్రవేశపెట్టడం, ఆస్తుల టోకనైజేషన్, స్టేబుల్‌కాయిన్ అభివృద్ధి, డిసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ పై పైలట్ ప్రాజెక్టులకు అనుమతి లభించనుంది. దీని ద్వారా పాకిస్తాన్లో డిజిటల్ ఫైనాన్స్ విస్తరణతో పాటు బ్యాంకింగ్, క్రెడిట్, ఇన్సూరెన్స్, పెట్టుబడులు, పెన్షన్ వంటి సేవల్ని అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేలా ఒప్పందం జరిగినట్లు సమాచారం. పాక్-ట్రంప్ చీకటి ఒప్పందంపై అనుమానంపహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఈ ఒప్పందంపై ప్రశ్నలు ఉత్పన్నం కావడంతో, వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ ఓ ప్రకటన విడుదల చేసింది. పాకిస్తాన్ ప్రభుత్వంతో తాము కుదుర్చుకున్న ఒప్పందానికి వెనుక ఎలాంటి దురుద్దేశాలు లేవని స్పష్టం చేసింది. అయితే, ఈ ఒప్పందంపై అటు ట్రంప్ కుటుంబం, ఇటు వైట్ హౌస్ ఎలాంటి ప్రకటన చేయలేదు.

మేపలేక ‘తెల్ల ఏనుగు’.. ట్రంప్ ముఖాన డంప్!
ప్రపంచంలో సొంతంగా అతి పెద్ద ప్రైవేట్ జెట్స్ శ్రేణి కలిగిన యజమానుల్లో ఖతార్ రాజకుటుంబం ఒకటి. తమకు ఆర్థిక భారంగా పరిణమించిన కొన్ని భారీ విమానాలను అది తాపీగా వదిలించుకుంటోంది. ప్రయోజనం లేని, నిర్వహణ భారం మితిమీరిన ‘తెల్ల ఏనుగు’ లాంటి తమ ‘బోయింగ్ 747 జంబో’ను అచ్చం రాజకుటుంబం లాగే పోషించగల డొనాల్డ్ ట్రంప్ లాంటి సరైన వ్యక్తిని ఖతార్ రాజకుటుంబం ఎట్టకేలకు పట్టుకోగలిగింది!. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నుంచి లబ్ధి పొందడానికే ఖతార్ అత్యంత విలాసవంతమైన విమానాన్ని ఆయనకు బహుమతిగా ఇస్తోందని ఊహాగానాలు వినిపించినా ఈ వ్యవహారం వెనక అసలు కారణం.. ఖతార్ రాజవంశీయులకు ఆ విమానంతో అవసరం తీరిపోవడం!. నిజానికి వారు 2020లోనే ఆ విమానాన్ని అమ్మకానికి పెట్టారు. కానీ, కొనుగోలుదారు దొరక్క విక్రయంలో విఫలమయ్యారు. తమకు అవసరం లేని ఆ ‘చెత్త’ విమానాన్ని ఇప్పుడు ట్రంప్ ముఖాన ‘డంప్’ చేస్తున్నారు కనుక వారికి నిర్వహణ ఖర్చులు, స్టోరేజి వ్యయం బాగానే తగ్గుతాయని వైమానికరంగ నిపుణులు అంటున్నారు. ‘ఒక దెబ్బకు రెండు పిట్టలు’ అన్నట్టు.. అలా అటు ఖతార్ రాజకుటుంబానికి ఖర్చూ తగ్గింది, ఇటు ట్రంప్ కూడా ఫ్రీ గిఫ్టుతో ఉబ్పితబ్బిబ్బవుతున్నారు. మొత్తానికి ఖతార్ ఒక బోయింగ్ 747 జంబో పీడను ఇలా వదిలించుకుంది.ఇంకా ఇలాంటివే మరో రెండు విమానాలు దాని దగ్గరున్నాయి. పరిమాణంలో పెద్దవైన, సుందరంగా అలంకరించిన, వాడకపోయినా నిరంతరం సరైన స్థితిలో (కండిషన్లో) ఉంచాల్సిన, ఇంధనం విపరీతంగా తాగే, పూర్తిగా వ్యక్తిగత అవసరాలకు ఉద్దేశించిన ఇలాంటి విమానాలకు డిమాండ్ పడిపోయిందని తాజా ఉదంతం చాటుతోంది. బహిరంగ మార్కెట్లో ప్రస్తుతం ఈ విమానాలను కొనేవారు లేరు. అందుకే రాజకుటుంబాలు, ఆయా దేశాల ప్రభుత్వాలు దశాబ్ద కాలంగా ఈ ‘తెల్ల ఏనుగు’లను వదిలించుకునే పనిలో ఉన్నాయి.Qatar gifted this Boeing 747 Jumbo Jet to the US defence department during the visit of Presidnet Donald Trump. pic.twitter.com/d5ad0k2Q0M— Aftab Chaudhry (@AftabCh81) May 15, 2025ఇతర ఆధునిక దేశాల మాదిరిగానే ఖతార్ కూడా ప్రస్తుతం నాజూకైన, బహుళ ప్రయోజనకర, ఆర్థిక అంశాలు కలిసొచ్చే, అధికారిక ప్రయాణాలకు అనువుగా ఉండే విమానాల వైపు మొగ్గు చూపుతోందని దుబాయ్ కేంద్రంగా పనిచేసే ఏవియేషన్ కన్సల్టింగ్ సంస్థ ‘బీఏఏ & పార్టనర్స్’ మేనేజింగ్ డైరెక్టర్ లైనస్ బాయర్ ‘ఫోర్బ్స్’కు వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడికి బోయింగ్ 747-8 విమానాన్ని ఖతార్ అప్పగించడాన్ని ఓ ‘సృజనాత్మక పరిష్కార వ్యూహం’గా, ‘ఆకాశంలో పోటాపోటీ బలప్రదర్శన అనే గతించిన నమూనాకు వీడ్కోలు’గా బాయర్ అభివర్ణించారు.అంతా ‘ఆయిల్ అండ్ గ్యాస్’ మహిమ!సౌదీ అరేబియా పక్కనే పర్షియన్ సింధుశాఖలో సుమారుగా అమెరికాలోని కనెక్టికట్ రాష్ట్ర భూభాగం సైజులో ఉంటుంది ఖతార్ ద్వీపకల్పం. చమురు, సహజ వాయువు నిక్షేపాలు తెచ్చిపెట్టిన సంపద ఈ దేశాన్ని తలసరి జీడీపీ పరంగా ప్రపంచంలోనే నాలుగో స్థానంలో నిలబెట్టింది. అటు ఖతార్ పాలకులనూ ఆగర్భ శ్రీమంతులను చేసింది. అలా ఖతార్ ఎమిర్ తమిమ్ బిన్ హమద్ అల్ థాని కుటుంబం సిరి సంపదలతో అలరారుతోంది. దీంతో దాదాపు డజను ఎయిర్ బస్, బోయింగ్ విమానాల శ్రేణిని థాని కుటుంబం సమకూర్చుకుంది. కొద్దిమంది వ్యక్తులు విలాసవంతమైన ప్రయాణాలు చేయడానికి వీలుగా ఆ విమానాలకు మార్పులు చేయించారు.ఇవి కాకుండా రాజ కుటుంబానికి చిన్నపాటి బంబార్డియర్, డసాల్ట్ బిజినెస్ జెట్స్ ఎలాగూ ఉన్నాయి. ట్రంప్ కు బహూకరించిన 747 విమానం తోకపై ‘ఏ7-హెచ్బీజే’ (A7-HBJ) అని ఉంటుంది. 2007 నుంచి 2013 వరకు ఖతార్ ప్రధానమంత్రిగా వ్యవహరించిన హమద్ బిన్ జసిమ్ బిన్ జబర్ అల్ థాని పేరులోని తొలి మూడు పదాల ప్రధమ అక్షరాలను ‘హెచ్బీజే’ (HBJ) స్ఫురింపజేస్తుంది.ప్రస్తుతం ఖతార్ ‘రాజ’ విమానాల శ్రేణిలో ఉన్న మూడు 747-8 విమానాల్లో ఈ విమానం ఒకటి. ‘ఖతార్ అమీరీ ఫ్లైట్’ సంస్థ దీని నిర్వహణను చూస్తోంది. 13 ఏళ్ల కిందట 2012లో కొనుగోలు చేసినప్పుడు ఈ విమానం ఖరీదు 367 మిలియన్ డాలర్లు. అంటే రూ.3,130 కోట్లు. కొన్న తర్వాత మూడేళ్లపాటు వందల కోట్లు కుమ్మరించి విమానం లోపలి స్వరూపాన్ని (ఇంటీరియర్) సుందరంగా తీర్చిదిద్దారు. సాధారణ బోయింగ్ 747-8 విమానంలో 467 మంది ప్రయాణించవచ్చు. కానీ ‘ఎగిరే ప్యాలెస్’గా అభివర్ణిస్తున్న ‘హెచ్బీజే’లో 89 మంది మాత్రమే ప్రయాణించేలా మార్పులు చేసి హంగులు అద్దారు. రెండు పడక గదులు, వినోద గది, సమావేశ గదులు అందులో ఉన్నాయి.ఎగిరితే గంటకు రూ.20 లక్షల ఖర్చు!బోయింగ్ తయారుచేసే 747 సిరీస్ విమానాలు 1970 నుంచి ప్రపంచవ్యాప్తంగా సేవలు అందిస్తున్నాయి. వైమానిక దూర ప్రయాణాలను అవి ఎక్కువ మందికి అందుబాటులోకి తెచ్చాయి. అయితే పెరుగుతున్న ఇంధనం ధర ఆకాశవీధిలో ఈ నాలుగు భారీ ఇంజిన్ల విమానం ప్రయాణాన్ని వ్యయభరితంగా మార్చింది. ‘కార్పొరేట్ జెట్ ఇన్వెస్టర్’ అంచనా ప్రకారం 747-8 వీఐపీ వెర్షన్ విమానాన్ని ఆపరేట్ చేయడానికి గంటకు 23 వేల డాలర్లు (రూ.20 లక్షలు) ఖర్చవుతుంది. వ్యయభారం తట్టుకోలేక గత దశాబ్ద కాలంగా పలు విమానయాన సంస్థలు బోయింగ్ 747, నాలుగు ఇంజిన్ల ఎయిర్ బస్ ఏ340 విమానాలను సేవల నుంచి తప్పిస్తున్నాయి. వీటి బదులుగా రెండు ఇంజిన్లు గల వెడల్పాటి బోయింగ్ 787, ఎయిర్ బస్ ఏ350 విమానాలపై ఆధారపడుతున్నాయి. నాలుగు ఇంజిన్ల 747 సిరీస్ విమానాలు ఇంధనాన్ని విపరీతంగా తాగుతాయి!.ఈ ‘ఎగిరే భవనాలు’ను ఒక్క ఖతారే కాదు.. సౌదీ అరేబియా, బ్రూనై, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, జర్మనీ కూడా క్రమంగా వదిలించుకుంటున్నాయి. తక్కువ ఇంధన సామర్థ్యం అటుంచి పెద్ద విమానాలతో భద్రతాపరమైన సమస్యలున్నాయని, వాటిని పెద్ద లక్ష్యాలుగా ఎంచుకునే ప్రమాదం ఉందని ఏరోడైనమిక్ అడ్వైజరీ మేనేజింగ్ డైరెక్టర్ రిచర్డ్ అబౌలాఫియా చెప్పారు. పెద్ద విమానాలు దిగాలంటే పొడవైన రన్ వేలు కావాలని, దాంతో ఆ విమానాల వినియోగం పరిమితమేనని వివరించారు. సన్నటి విమానాలకైతే చాలా ఎయిర్ పోర్టులు, సంప్రదాయ బిజినెస్ జెట్స్ అయితే మరిన్ని విమానాశ్రాయాలు అందుబాటులో ఉంటాయన్నారు. 2020లో మార్కెట్లో అమ్మకానికి పెట్టడానికి ముందు ఐదేళ్లలో ఖతారీ విమానం ప్రయాణించింది మొత్తం కలిపి 1,059 గంటలే.ఇక ఖతార్ దగ్గరున్న మిగతా రెండు వీఐపీ 747-8 విమానాల్లో ఒకదాన్ని పూర్తిగా క్రియాశీల సేవల తప్పించారని లైనస్ బాయర్ తెలిపారు. 2018లో ఖతార్ ఇలాంటి 747-8 విమానాన్నే తుర్కియే అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్డోగన్ కు కూడా ఇచ్చింది. మరో పాత 747-ఎస్పీ విమానాన్ని ఓ అసెట్ మేనేజ్మెంట్ సంస్థకు అప్పగించగా దాన్ని ఆ సంస్థ స్టోరేజికి తరలించింది. ఇలాంటి ఉదాహరణలు బోలెడు. సౌదీ యువరాజు సుల్తాన్ బిన్ అబ్దులజీజ్ అల్ సాద్ 2011లో మరణించాడు. అతడి మరణానికి ముందు ఓ విలాసవంతమైన 747-8 విమానాన్ని అతడి కోసం సేవల్లోకి తీసుకున్నారు. కేవలం 42 గంటలే ప్రయాణించిన ఆ విమానాన్ని చివరికి 2022లో తుక్కు కింద ముక్కలు చేశారు. ప్రస్తుతం సౌదీలో రాజకుటుంబ ఉపయోగంలో ఉన్న 747 విమానాల శ్రేణిని ఒకే ఒక విమానానికి కుదించారు. సౌదీ యువరాజు మఃహమ్మద్ బిన్ సాల్మన్ ప్రస్తుతం బోయింగ్ 737, 787-8 వంటి చిన్న విమానాలు వినియోగిస్తున్నారు.అయితే లోపల ఖాళీ ప్రదేశం అధికం కనుక బోయింగ్ 747-8లకు సరకు రవాణా (కార్గో) రంగంలో మంచి డిమాండ్ ఉంది. 2023లో కర్మాగారం నుంచి బయటికొచ్చిన చివరి 747-8తో కలిపి బోయింగ్ ఇప్పటివరకు మొత్తం 155 విమానాలను విక్రయించగా వాటిలో రెండొంతులు సరకు రవాణాలోనే నిమగ్నమయ్యాయి. కేవలం కొద్దిమంది దూర ప్రయాణాల కోసమని స్వరూపం పరంగా, యాంత్రికంగా, కస్టమ్ ఇంటీరియర్స్ పరంగా మార్పులు చేసిన ఖతారీ 747-8 విమానాలను కార్గో విమానాల రూపంలోకి తేవడం కష్టమని బాయర్ అభిప్రాయం వెలిబుచ్చారు. ఇక బహుమతిగా ట్రంప్ స్వీకరిస్తున్న ఖతార్ విమానాన్ని పరికిస్తే... భద్రతపరమైన నిబంధనలను సడలిస్తే తప్ప... ఆ విమానాన్ని విడదీసి పునర్నిర్మించడానికి కనీసం ఐదేళ్లు పడుతుందని రిచర్డ్ అబౌలాఫియా అంచనా. అంటే అప్పటికి అధ్యక్షుడిగా ట్రంప్ రెండో విడత పుణ్యకాలం... ఆ విమానంలో తిరగాలనే ఆయన బులపాటం తీరకుండానే ముగిసిపోతుంది! - జమ్ముల శ్రీకాంత్ Source: Forbes
జాతీయం

పాక్‌కు భారత్ చెక్.. ఏడుగురు ఎంపీలతో దౌత్య యుద్ధం!
ఢిల్లీ: ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నందుకు పాకిస్తాన్ తీరు ఎండగట్టేందుకు భారత్ పక్కా ప్లాన్‌తో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగానే పాక్ ఉగ్ర కుట్రలను ప్రపంచదేశాలకు వివరించడం కోసం ఏడు అఖిలపక్ష బృందాలను ఏర్పాటు చేసింది. విదేశాలకు భారత ప్రతినిధి బృందాలను పంపేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ప్రభుత్వం ఏర్పాటుచేసిన మొత్తం ఏడు గ్రూపులు 10 రోజుల వ్యవధిలో ఐదు దేశాలకు వెళ్తాయి. ఈ మేరకు ప్రతినిధుల బృందాలకు సంబంధించిన వివరాలను కేంద్రం శనివారం వెల్లడించింది.అఖిలపక్ష ప్రతినిధుల బృందాలకు నాయకత్వం వహించే ఏడుగురు ఎంపీల పేర్లను కేంద్రం ప్రకటించింది. వీరిలో ఎంపీలు శశిథరూర్ (కాంగ్రెస్), సుప్రియా సూలే (ఎన్సీపీ -ఎస్పీ), కనిమొళి (డీఎంకే), రవిశంకర్ ప్రసాద్(బీజేపీ), బైజయంత్ పాండా (బీజేపీ) సంజయ్ కుమార్ ఝా(జేడీయూ), శ్రీకాంత్ శిందే (శివసేన) విదేశాల్లో భారత బృందాలకు నాయకత్వం వహించనున్నట్లు కేంద్రం వెల్లడించింది. వీరంతా.. మే 22న విదేశాలకు బయలుదేరి జూన్ మొదటి వారంలో తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోని దేశాలు, ఇతర కీలక దేశాలను అఖిలపక్ష బృందం సందర్శించనుంది. ఉగ్రవాదం అణిచివేతకు భారత్ అనుసరిస్తున్న జీరో టాలరెన్స్ విధానాన్ని అఖిలపక్ష నేతలు వివరించనున్నారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దాన్ని వ్యతిరేకించాల్సిందే అనేది భారత విధానమని చెప్పనున్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ ఏకతాటిపై నిలబడిందని సందేశం ఇచ్చేందుకు అఖిలపక్షం ఏర్పాటైంది. ఉగ్రవాద కార్యకలాపాలకు పాక్ ఏవిధంగా మద్దతు పలుకుతోందనే విషయాన్ని.. ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)తో ఉగ్రవాదంపై భారత్ జరిపిన పోరాటాన్ని పలు ఆధారాల ద్వారా విదేశాలకు వివరించనున్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ఉగ్రవాదులకు సహకరించడంలో ఎన్నో ఏళ్లుగా పాకిస్తాన్ అనుసరిస్తున్న పాత్రను.. దానివల్ల ప్రపంచదేశాలకు పొంచిఉన్న ముప్పును వివరించనుంది. భవిష్యత్తులో భారత్‌పై ఉగ్రదాడులు జరిగితే ప్రభుత్వం తీసుకునే చర్యలపై స్పష్టత ఇవ్వనుంది. ఆపరేషన్ సిందూర్ చేపట్టడానికి కారణమైన పాక్ రెచ్చగొట్టే చర్యలు, పాక్ బెదిరింపులకు ధీటుగా భారత్ ఆపరేషన్ సిందూర్‌ను ఎలా చేపట్టిందో వివరణ ఇవ్వనుంది. ఆపరేషన్ సమయంలో ఉగ్రవాద స్థావరాలను మాత్రమే కచ్చితంగా లక్ష్యంగా చేసుకొని దాడులు చేశామని, పౌరులకు ఎలాంటి హానీ చేయలేదని ఆధారాలు చూపించనున్నారు. Union Minister Kiren Rijiju tweets "In moments that matter most, Bharat stands united. Seven All-Party Delegations will soon visit key partner nations, carrying our shared message of zero-tolerance to terrorism. A powerful reflection of national unity above politics, beyond… pic.twitter.com/yYiQF4ufEF— ANI (@ANI) May 17, 2025కాంగ్రెస్ లిస్టులో నో శశిథరూర్.. చివరకు ట్విస్ట్..ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ పంపిన జాబితాలో అసలు థరూర్ పేరు లేకపోవడం గమనార్హం. పాక్‌ను ఎండగట్టేందుకు పంపే బృందం కోసం పేర్లు పంపాలని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు మే 16న కాంగ్రెస్‌ను కోరగా, అదే రోజున హస్తం పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ నాలుగు పేర్లు పంపారు. వారిలో కేంద్ర మాజీ మంత్రి ఆనంద్ శర్మ, రాజ్యసభ ఎంపీ డాక్టర్ సయ్యద్ నజీర్ హుస్సేన్, లోక్‌సభ ఎంపీ రాజా బ్రార్, మరో నేత గౌరవ్ గొగొయ్ ఉన్నారని ఆ పార్టీ నేత జైరాం రమేశ్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఆ లిస్ట్‌లో థరూర్ పేరు లేదు. అయితే ఈ రోజు కేంద్రం విడుదల చేసిన తుది జాబితాలో వారి పేర్లేవీ లేవు. కానీ తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌కు మాత్రం అనూహ్యంగా చోటు దక్కింది.మరోవైపు, శశిథరూర్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..‘ఇటీవలి పరిణామాలపై దేశం విధానాన్ని వివిధ దేశాలకు వివరించేందుకు వెళ్తున్న బృందానికి నాయకత్వం వహించడం గౌరవంగా భావిస్తున్నాను. దేశ ప్రయోజనాలతో ముడిపడిన సందర్భాల్లో అక్కడ నా అవసరం ఉంటే.. నేను అందుబాటులో ఉంటా. జైహింద్’ అంటూ వ్యాఖ్యలు చేశారు. Yesterday morning, the Minister of Parliamentary Affairs Kiren Rijiju spoke with the Congress President and the Leader of the Opposition in the Lok Sabha. The INC was asked to submit names of 4 MPs for the delegations to be sent abroad to explain India's stance on terrorism from…— Jairam Ramesh (@Jairam_Ramesh) May 17, 2025

భారత్ దిశగా చైనా గూఢచార నౌక
న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్ర ఘటన అనంతరం భారత్, పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ డ్రాగన్ దేశం కపటబుద్ధి మరోసారి బయట పెట్టుకుంది. ఆ దేశానికి చెందిన గూఢచార నౌక ‘ద యాంగ్ యి హవో’ భారత్ దిశగా వస్తోంది. ఈ విషయాన్ని డామియెన్ సిమోన్ అనే ఓపెన్‌సోర్స్ ఇంటెలిజెన్స్ నిపుణుడు తెలిపారు. చైనాకున్న గూఢచార నౌకల్లో ఇదొకటి. వీటిని పరిశోధన నౌకలని చైనా చెప్పుకుంటున్నప్పటికీ, వీటిని నిఘా నౌకలుగానే భారత్ తదితర దేశాలు పరిగణిస్తున్నాయి. శాస్త్రీయ పరిశోధనలతో పాటు పౌర, సైనిక అవసరాలను తీర్చేలా వీటిని రూపొందించారు. సముద్ర జలాల్లో పరిశోధనలు, సముద్ర గర్భం మ్యాపింగ్, ఖనిజ, జీవ వనరుల అన్వేషణ పేరుతో సంచరించే ఈ నౌకలు క్షిపణుల గమనాన్ని ట్రాక్ చేయగలవు, సబ్మెరీన్ల కదలికలను పసిగట్టడం వంటివి చేయగలవు. తాజాగా, మలక్కా నుంచి బయలుదేరిన ఈ నౌక శ్రీలంక దక్షిణ తీరం దిశగా సాగుతున్నట్లు మ్యాప్‌ను బట్టి సిమోన్ విశ్లేషించారు. ఈ నౌకతో ప్రమాదమేమంటే.. ఇందులో మనుషులతో అవసరం లేకుండా సముద్రం అడుగున సంచరిస్తూ నిఘా కార్యకలాపాలను నిర్వహించే వాహనాలుంటాయి. సముద్రం అడుగున మందుపాతరలు, ఇతర సైనిక కార్యకలాపాలను కనిపెట్టి మ్యాపింగ్ చేస్తాయి. భారత్‌లో క్షిపణి పరీక్షలు, ఇతర సైనిక కార్యకలాపాల సమయంలో చైనా నిఘా నౌకలు పొరుగుదేశాలకు చేరుకుని గూఛచర్యం చేయడం ఇటీవలి కాలంలో మామూలై పోయింది. గతేడాది ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి అగ్ని–5ను ప్రయోగించిన సమయంలో చైనాకే చెందిన జియాంగ్ యాంగ్ హాంగ్ 01 అనే గూఢచర్య మన దేశ సమీపానికి వచ్చింది. ఒడిశాలోని బాలాసోర్ తీరం వెంబడి క్షిపణి పరీక్షలప్పుడు సైతం చైనా నిఘా నౌకలు తూర్పు తీరానికి సమీపంలోకి వచ్చినట్లు తెలిసింది. విశాఖ తీరంలోని సబ్మెరీన్లలోని అణు క్షిపణుల సిగ్నళ్లను సైతం ఇవి కనిపెట్టే అవకాశముందని సమాచారం.

హరే కృష్ణ మందిరం ఇస్కాన్–బెంగళూరుదే
న్యూఢిల్లీ: కర్ణాటక రాజధాని బెంగళూరులోని ప్రఖ్యాత హరే కృష్ణ మందిరం బెంగళూరు ఇస్కాన్ సొసైటీకే చెందుతుందని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఈ మేరకు కీలక తీర్పు వెలువరించింది. రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న వివాదానికి ముగింపు పలికింది. ఈ మందిరం ముంబై ఇస్కాన్ సొసైటీకి చెందుతుందని కర్ణాటక హైకోర్టు గతంలో ఉత్తర్వు జారీ చేయగా, దీన్ని సవాలు చేస్తూ బెంగళూరు ఇస్కాన్ సొసైటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అభయ్ ఎస్.ఓకా, జస్టిస్ అగస్టీన్ జార్జీ మాసిహ్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. శుక్రవారం తీర్పు వెలువరించింది. కర్ణాటక హైకోర్టు ఇచి్చన ఉత్తర్వును తోసిపుచ్చింది. హరే కృష్ణా మందిరంపై ముంబై ఇస్కాన్ సొసైటీకి హక్కులు ఉన్నాయని చెప్పడానికి ఆ సంస్థ ఎలాంటి ఆధారాలు సమర్పించలేదని పేర్కొంది. మందిరం స్థలానికి సంబంధించిన సేల్ డీడ్ బెంగళూరు సొసైటీకి అనుకూలంగా ఉన్నట్లు తెలిపింది. సేల్ డీడ్‌ను బెంగళూరు సొసైటీ సభ్యులు మధు పండిత దాస, భక్తిలతా దేవి, చంచలపాటి దాస, చమారిదేవి తారుమారు చేశారంటూ వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని స్పష్టంచేసింది. ఆలయానికి సంబంధించిన కీలక పత్రాల్లో బెంగళూరు సొసైటీ రబ్బర్ స్టాంప్ ఉన్నట్లు తెలియజేసింది. షెడ్యూల్ ‘ఎ’లో ఉన్న ఆ ఆస్తిని బెంగళూరు డెవలప్మెంట్ అథారిటీ ఇస్కాన్ బెంగళూరు సొసైటీకి కేటాయించినట్లు చెప్పడానికి స్పష్టమైన సాక్ష్యాధారాలు ఉన్నట్లు ధర్మాసనం తన తీర్పులో ఉద్ఘాటించింది. బెంగళూరు సొసైటీని కర్ణాటక సొసైటీస్ రిజి్రస్టేషన్ చట్టం కింద స్వతంత్ర సొసైటీగా రిజిస్టర్ చేసినట్లు వివరించింది. ముంబై సొసైటీకి బెంగళూరు సొసైటీ ఒక శాఖ అని హైకోర్టు చెప్పడం సరైంది కాదని అభిప్రాయపడింది. అందుకే హైకోర్టు తీర్పును పక్కనపెడుతున్నట్లు తేల్చిచెప్పింది. బెంగళూరు సొసైటీ హరే కృష్ణా మందిరంతోపాటు ఒక విద్యాసంస్థను కూడా నిర్వహిస్తోంది. ఈ మందిరం ముంబై సొసైటీదే అంటూ కర్ణాటక హైకోర్టు ఉత్తర్వు జారీ చేయగా, బెంగళూరు సొసైటీ ఆఫీసు–బేరస్ కోదండరామ దాస 2011 జూన్ 2న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తీర్పు పట్ల బెంగళూరు ఇస్కాన్ సొసైటీ అధ్యక్షుడు మధు పండిత్ దాస హర్షం వ్యక్తంచేశారు.

భారత్, అఫ్గాన్ స్నేహ గీతం
శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్లుగా భారత్, అఫ్గానిస్తాన్ దేశాలు స్నేహగీతం పాడుకుంటున్నాయి. శతాబ్దాల క్రితం అఖండ భారత్‌లో భాగమైన రెండు దేశాల మధ్య మళ్లీ సంబంధాలు బలపడే సూచనలు కనిపిస్తున్నాయి. భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ తాజాగా అఫ్గానిస్తాన్ విదేశాంగ మంత్రితో మాట్లాడారు. పహల్గాం ఉగ్రవాద దాడిని ఖండించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. 2021 ఆగస్టులో తాలిబన్లు అఫ్గానిస్తాన్‌ను మరోసారి ఆక్రమించిన తర్వాత అక్కడి మంత్రితో అధికారికంగా మాట్లాడడం ఇదే మొదటిసారి కావడం విశేషం. భవిష్యత్తులో రెండు దేశాల మధ్య సంబంధాలు బలపడడం ఖాయమని చెప్పడానికి ఇదొక నిదర్శనమని నిపుణులు పేర్కొంటున్నారు. అఫ్గాన్‌లోని తాలిబన్ ప్రభుత్వం పట్ల భారత్ ఇటీవల సానుకూల వైఖరి ప్రదర్శిస్తోంది. ఇది మున్ముందు పూర్తిస్థాయి వ్యూహాత్మక ద్వైపాక్షిక బంధంగా మారిన ఆశ్చర్యం లేదు. 1999లో ఉగ్రవాదులు భారత విమానాన్ని హైజాక్ చేసి, అఫ్గానిస్తాన్‌లోని కాందహార్‌లో దించిన సంగతి తెలిసిందే. ప్రయాణికులను రక్షించడానికి సైనిక ఆపరేషన్ చేపట్టేందుకు భారత్ సిద్ధపడగా, అప్పటి తాలిబన్ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. దాంతో ఇరుదేశాల మధ్య సంబంధాలు చాలావరకు తెగిపోయాయి. తదనంతర పరిణామాల నేపథ్యంలో రెండు దేశాలు మళ్లీ ఒక్కటవుతున్నాయి. తాలిబన్ల రాకతో దెబ్బతిన్న సంబంధాలు శతాబ్దాల పాటు అఖండ భారత్‌లో అంతర్భాగంగా కొనసాగిన అఫ్గనిస్తాన్ 18వ శతాబ్దంలో ప్రత్యేక దేశంగా విడిపోయిందని చరిత్రకారులు చెబుతుంటారు. అమెరికా, రష్యా మధ్య ఆధిపత్య పోరుకు అఫ్గాన్ ఒక వేదికగా మారింది. చాలా ఏళ్లపాటు ఈ పోరాటం కొనసాగింది. 1973లో అఫ్గాన్ రిపబ్లిక్ దేశంగా అవతరించింది. అఫ్గాన్‌ను భారత్ అధికారికంగా గుర్తించింది. తమ మిత్రదేశంగా ప్రకటించింది. 1996 దాకా ఇరుదేశాల మధ్య ఎలాంటి విభేదాలు తలెత్తలేదు. సాధ్యమైనంత వరకు పరస్పరం సహకరించుకున్నాయి. 1996లో తాలిబన్ల ప్రాబల్యం మొదలైంది. పాకిస్తాన్ అండతో తాలిబన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అఫ్గాన్‌లో తాలిబన్ సర్కార్‌ను గుర్తించేందుకు భారత్ నిరాకరించింది. విమానం హైజాక్ ఘటన తర్వాత పరిస్థితి దిగజారింది. భారత్–అఫ్గాన్ సంబంధాలు పూర్తిగా చెడిపోయాయి. ఆ తర్వాత అమెరికాలో ప్రపంచ వాణిజ్య కేంద్రంపై అల్‌ఖైదా ఉగ్రవాదుల దాడి, అఫ్గాన్‌పై అమెరికా యుద్ధం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. అమెరికా మద్దతుతో అఫ్గాన్‌లో ప్రజా ప్రభుత్వం ఏర్పడింది. 2021లో అమెరికా తన సేనలను అఫ్గాన్ నుంచి ఉపసంహరించుకోవడంతో తాలిబన్లు గద్దెనెక్కారు. ఇన్నాళ్లూ రహస్యంగా చర్చలు! మళ్లీ అధికారంలోకి వచి్చన తాలిబన్లతో భారత ప్రభుత్వం తొలుత అంటీముట్టనట్లుగానే వ్యవహరించింది. వేచి చూసే ధోరణి అవలంబించింది. భారత్–అఫ్గాన్ మధ్య సంబంధాలు మానవతా సాయం, సాంస్కృతిక, క్రీడల రంగానికే పరిమితం అయ్యాయి. అఫ్గాన్ క్రికెటర్లు ఇండియాలో పోటీల్లో పాల్గొన్నారు. ఇరుదేశాల మధ్య చాలాసార్లు రహస్యంగా చర్చలు జరిగినట్లు వార్తలు వచ్చాయి. కానీ, భారత్ వాటిని ఖండించింది. మరోవైపు సంబంధాలు మెరుగవుతున్న సూచనలు స్పష్టంగా కనిపించాయి. ఈ ఏడాది జనవరి 8వ తేదీన భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రం మిస్రీ అఫ్గాన్ విదేశాంగ మంత్రితో సమావేశమయ్యారు. పహల్గాం ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ సైతం అఫ్గాన్ విదేశాంగ మంత్రితో మాట్లాడారు. ప్రాంతీయ ప్రయోజనాల కోణంలో అఫ్గాన్‌ను సన్నిహిత దేశంగా మార్చుకోవాలని భారత్ భావిస్తున్నట్లు సమాచారం. పాకిస్తాన్‌కు ఇక ముసళ్ల పండుగే జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో గత నెల 22వ తేదీన ఉగ్రవాదులు 26 మంది పర్యాటకులను పొట్టనపెట్టుకున్నారు. ఈ దాడికి పాకిస్తాన్ నుంచే కుట్ర జరిగినట్లు భారత్ గుర్తించింది. ఉగ్రవాదులను, వారి మద్దతుదారులను అంతం చేయాలన్న లక్ష్యంతో ఆపరేషన్ సిందూర్ ప్రారంభించింది. పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలను, వైమానిక స్థావరాలను నేలమట్టం చేసింది. ఉగ్రవాదం పీడను శాశ్వతంగా వదిలించుకోవడంతోపాటు దక్షిణాసియాలో తనకు తలనొప్పిగా మారిన పాకిస్తాన్‌ను ఏకాకిని చేసే దిశగా భారత్ అడుగులు వేస్తోంది. వ్యూహాలకు పదును పెడుతోంది. అందులో భాగంగానే అఫ్గానిస్తాన్‌కు స్నేహహస్తం అందిస్తోంది. రాబోయే రోజుల్లో భారత్, అఫ్గాన్ మరింత సన్నిహితంగా మారితే పాకిస్తాన్‌కు ఇక్కట్లు తప్పవని నిపుణులు అంటున్నారు. ఆర్థిక, వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసుకోవాలని భారత్, అఫ్గాన్ నిర్ణయానికి వచి్చనట్లు తెలుస్తోంది. పాక్–అఫ్గాన్ మధ్య రగులుతున్న విభేదాలు తాలిబన్లకు తండ్రి లాంటి పాకిస్తాన్, తాలిబన్ల పాలనలో ఉన్న అఫ్గానిస్తాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో విభేదాలు రగులుతున్నాయి. ఇరుదేశాల మధ్య సరిహద్దు గొడవలు ముదురుతున్నాయి. తాలిబన్లు తమ చెప్పుచేతల్లో ఉండకుండా స్వతంత్రంగా వ్యవహరిస్తుండడం పాకిస్తాన్ జీరి్ణంచుకోలేకపోతోంది. ఇస్లామాబాద్, కాబూల్ నడుమ సంబంధాలు వేగంగా పతనమవుతున్నాయి. తెహ్రీక్–ఇ–తాలిబన్ పాకిస్తాన్(టీటీపీ) అనే సంస్థ పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తూంక్వా, బలూచిస్తాన్ ప్రావిన్స్‌ల్లో ఇటీవల దాడులకు పాల్పడింది. టీటీపీకి తాలిబన్ సర్కారు అండదండలు ఉన్నాయని పాక్ ఆరోపిస్తోంది. అఫ్గాన్ గడ్డపైనుంచే టీటీపీ కార్యకలాపాలు సాగిస్తోందని మండిపడుతోంది. టీటీపీ దాడులకు ప్రతీకారంగా గత ఏడాది డిసెంబర్లో పాక్ సైన్యం అఫ్గాన్‌లోని పాక్తీకా ప్రావిన్స్‌లో వైమానిక దాడులు నిర్వహించింది. ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేశామని పాక్ ప్రకటించింది. ఈ దాడుల పట్ల తాలిబన్లు తీవ్రంగా స్పందించారు. పాకిస్తాన్‌కు తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. మరోవైపు సరిహ ద్దుల్లో కంచె వేసేందుకు పాక్ ప్రయతి్నస్తుండగా, తాలిబన్లు అడ్డుకుంటున్నారు. బ్రిటిష్ పాలకులు నిర్ధారించిన డురాండ్ లైన్‌ను సరిహద్దు రేఖగా ఇస్లామాబాద్ గుర్తిస్తుండగా, అఫ్గాన్ అందుకు ఒప్పుకోవడం లేదు. మరోవైపు 2023లో వేలాది మంది అఫ్గాన్ శరణార్థులను పాక్ ప్రభుత్వం బలవంతంగా బ యటకు వెళ్లగొట్టింది. ఈ వ్యవహారంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. సాక్షి, నేషనల్ డెస్క్
ఎన్ఆర్ఐ

TANA: ‘ఆంధ్ర బాలానంద సంఘం’ ముచ్చట్లు విజయవంతం
డాలస్, టెక్సస్, అమెరికా: తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో “నెల నెలా తెలుగు వెలుగు” పేరిట ప్రతి నెల ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న కార్యక్రమాలలో భాగంగా “రేడియో అన్నయ్య, అక్కయ్య గార్ల స్మృతిలో – “85 వసంతాల ఆంధ్ర బాలానంద సంఘం ముచ్చట్లు” అనే అంశంపై జరిపిన 79 వ అంతర్జాల అంతర్జాతీయ దృశ్య సమావేశం పెద్దల ప్రసంగాలు, బాలానందం పిల్లల పాటలతో కోలాహలంగా జరిగింది.తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు పాల్గొన్న అతిథులందరికీ స్వాగతం పలుకుతూ, బాలలకోసం ఏర్పడిన ఒక సంస్థ 85 వసంతాలు జరుపుకోవడం వెనుక ఈ సంస్థ స్థాపకులైన రేడియో అన్నయ్య, రేడియో అక్కయ్య గార్ల కృషి ఎంతైనా ఉందని అన్నారు.తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు, డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “పిల్లలకు పసిప్రాయంలోనే గేయాలు, రూపకాలు, ఆటలు, పాటలతో తెలుగు భాష, సాహిత్యంపట్ల ఆసక్తి కల్గించి, వారిలో క్రమశిక్షణ, మానసిక వికాసం, విజ్ఞానం, సృజనాత్మకత, నాయకత్వ ప్రతిభను కల్గించడంలో ఆకాశవాణిలో కొన్ని దశాబ్దాలపాటు వారం వారం ‘బాలానందం’ కార్యక్రమంతో పిల్లలకు పెద్దపీట వేసిన రేడియో అన్నయ్య, రేడియో అక్కయ్య గార్ల కృషి అజరామరం అన్నారు. పిల్లలకు చిన్నవయస్సులోనే ఇలాంటి విషయాల పట్ల అవగాహన, ఆసక్తినికల్గించి సరైన దిశానిర్దేశం చెయ్యవలసిన బాధ్యత తల్లిదండ్రులదేనన్నారు. ప్రత్యేక అతిథులుగా పాల్గొన్న శారదా శ్రీనివాసన్ (రేడియో హీరోయిన్, సుప్రసిద్ధ ఆకాశవాణి కళాకారిణి), డా. మండలి బుద్ధప్రసాద్ (అవనిగడ్డ శాసనసభ్యులు, రేడియో అన్నయ్య, అక్కయ్యగార్లతో ప్రత్యక్ష పరిచయం ఉన్నవారు), పద్మభూషణ్ పురస్కార గ్రహీత డా. కె.ఐ. వరప్రసాదరెడ్డి (బాలానంద కార్యక్రమాలను ఆస్వాదించినవారు), డా. మోహన్ కందా, ఐ.ఎ.ఎస్ (ఆంధ్రప్రదేశ్ పూర్వ ప్రధాన కార్యదర్శి, బాలానంద సంఘ పూర్వసభ్యులు), జంధ్యాల కామేశ్వరి-పాప (రేడియో అన్నయ్య గారి మేనకోడలు, ఆంధ్ర బాలానంద సంఘం అధ్యక్షులు), కలగా కృష్ణమోహన్ (బాలానందం పూర్వ సభ్యులు, ఆంధ్ర బాలానంద సంఘం ఉపాధ్యక్షులు, ప్రముఖ గీత రచయిత, సంగీత దర్శకులు) బాలానందం కార్యక్రమంతోను, రేడియో అన్నయ్య, అక్కయ్య గార్లతో తమకున్న ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలతోపాటు ఎన్నో ఆసక్తికర విశేషాలను పంచుకుని వారికి ఘననివాళులర్పించారు. విశిష్టఅతిథులుగా - ఎన్.వి. అశోక్ (విశ్రాంత ఇంజనీర్, ‘బాలానందం’ పూర్వసభ్యులు), రావులపర్తి రాజేశ్వరి (విశ్రాంత బ్యాంకు అధికారి, ‘బాలానందం’ పూర్వ సభ్యురాలు),నండూరి సీతా సాయిరాం (విశ్రాంత ఉపాధ్యాయిని, ‘బాలానందం’ పూర్వ సభ్యురాలు),మాడభూషి బద్రినాథ్ (బాలానందం-నృత్య దర్శకులు), డా. ఆవుల హరిత (బాలానందం-కార్యవర్గ సభ్యురాలు), చినముత్తేవి కరుణ (బాలానందం-గాయకబృందం, శిక్షణా విభాగపు కార్యవర్గసభ్యురాలు), మాలెంపాటి నవ్య (ఐఐటి ఖర్గపూర్, ‘బాలానందం’ సంగీత, నృత్య కళాకారిణి), గోవిందు దేవరాజ (బాలానందం-గాయకబృందం, శిక్షణా విభాగపు కార్యవర్గసభ్యులు) పాల్గొని తమ స్వీయ అనుభవాలను, రేడియో అన్నయ్య, అక్కయ్య గార్లు ఎంతో దూరదృష్టితో స్థాపించిన ఆంధ్ర బాలానందం సంఘం తమ పిల్లల జీవితాలలో తీసుకువచ్చిన మార్పులను వివరించి వారిరువురికి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అన్నారు. తానా ప్రపంచసాహిత్యవేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ - ఒక సంస్థ ఎనిమిదన్నర దశాబ్దాలగా నిరాటంకంగా కొనసాగడం ఒక చరిత్ర అని, ఏ ఆశయంతో రేడియో అన్నయ్య, అక్కయ్య గార్లు ఈ బాలానందం స్థాపించారో, అదే స్ఫూర్తితో ఉత్సాహంగా ఆంధ్ర బాలానంద సంఘం నిర్వహిస్తున్న అధ్యక్షురాలు జంధ్యాల కామేశ్వరి (పాప) వారి కార్యవర్గ సభ్యులకు, ఈ నాటి కార్యక్రమంలో శ్రావ్యంగా పాటలు పాడి ఆనందపరిచిన 25 మందికి పైగా పిల్లలకు, పాల్గొన్న అతిథులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

స్వరలయ ఆర్ట్స్ సింగపూర్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ 6 వ వార్షికోత్సవ వేడుకలు
స్వరలయ ఆర్ట్స్ సింగపూర్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ 6 వ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్ లర్ ఆచార్య వెలుదండ నిత్యానందరావు హాజరయ్యారు. సింగపూర్ లోని తెలుగు వారంతా అన్ని విధాలా సుసంపన్నులని ఈ విధంగా లలిత కళలను ప్రోత్సహించడం ఆనంద దాయకమన్నారు. చిన్నారులు పాడిన పాటలు ఎంతో బాగున్నాయి అని , ఇంత చక్కగా నేర్పిన గురువును నేర్చుకున్న వారి శిష్యులను వారి తల్లిదండ్రులను ప్రశంసించారు. సంగీతం, నాట్యం వంటి కళల ద్వారా మనలో మృదుత్వం కలుగుతుందని, నేటి యాంత్రిక జీవితంలో ఈ మాధ్యమం ఎంతో ముఖ్యం అని కాబట్టి కళల పైన ఉన్న ఆసక్తిని తమ తమ ఆర్థిక సంపాదన రధ చక్రాల కింద పడి నలిగి పోనివ్వవద్దని కోరారు.ఈ కార్యక్రమానికి STS వైస్ ప్రెసిడెంట్ జ్యోతీశ్వర్ , శ్రీ సాంస్కృతిక కలసారథి అధ్యక్షులు కవుటూరు రత్న కుమార్,TCSS అధ్యక్షులు గడప రమేష్, TAS (మనం తెలుగు ) అసోసియేషన్ అనిత రెడ్డి , కమల క్లబ్ మాజీ అధ్యక్షులు, సారీ కనెక్షన్ అడ్మిన్ పద్మజ నాయుడు , మగువ మనసు అడ్మిన్ వీర మాంగోస్ ఉష , సింగపూర్ తెలుగు టీవి రాధాకృష్ణ గణేశ్న , జయంతి రామ, భాగవత ప్రచార సమితి భాస్కర్ ఊలపల్లి, H& H శ్యామల , విష్ణు ప్రియ , సింగపూర్ తెలుగు వనితలు అడ్మిన్స్ క్రాంతి, దేదీప్య, జయ, ప్రత్యూష , అమ్ములు గ్రూపు నుండి అడ్మిన్ సునీత రామ్, , KCAS దివ్య ఇంకా పలువురు సింగపూర్ తెలుగు కమ్యూనిటీ వ్యవస్థాపకులు హాజరయి అందరూ కలిసి వైస్ ఛాన్స్‌లర్‌ను సన్మానించారు. స్వరలయ ఆర్ట్స్, సింగపూర్ వ్యవస్థాపక అధ్యక్షురాలు యడవల్లి శేషుకుమారి వారి శిష్యులు,స్నేహితులు కీర్తనలను ఆలపించారు. పద్మజ నాయుడు మాట్లాడుతూ శేషు గాన కోకిల అని పొగడగా ఆచార్య నిత్యానందరావు గారు కోకిల ఒక కాలంలో మాత్రమే పాడుతుందని కాని ఈమె 365 రోజులు గానం ఆలపిస్తారు అన్నారు. శ్యామల మాట్లాడుతూ వారి వెంకటేశ్వర గానామృతం కార్యక్రమానికి శేషు కుమారి 70 పాటలు 40 రాగాలలో స్వర పరిచి మూడున్నర గంటల సేపు పాడి అందరినీ అలరించిన వైభవం గుర్తు చేసి ఈ రోజుకి ఆ పాటలు తమ చెవులలో ప్రతి ధ్వనిస్తూ పరవసింప చేస్తాయని ప్రశంసించారు.పొట్టి శ్రీరాములు, తెలుగు విశ్వవిద్యాలయం సర్టిఫికేట్ కోర్సు మొదటి వత్సరం, రెండవ సంవత్సరం పరీక్షల్లో ఉత్తీర్ణత పొందిన స్వరలయ ఆర్ట్స్ విద్యార్థులకు వైస్ ఛాన్స్ లర్ బహుమతి ప్రధానం చేశారు. అతిథులకు మొమెంటోలను బహుకరించారు ఈ నెల ఆరవ తారీఖున స్వరలయ ఆర్ట్స్ వారు నిర్వహించిన త్యాగ రాజ ఆరాధన ఉత్సవాలలో పాల్గొని తమతో కలిసి పంచరత్నాలు పాడిన సౌభాగ్య లక్ష్మి తంగిరాల, షర్మిల చిత్రాడ, సౌమ్య ఆలూరు, శరజ అన్నదానం, రాధికా నడదూర్, ప్రియ లకు మొమెంటోలను బహుకరించారు. శివ కుమార్ మృదంగం పై వాయిద్య సహకారం అందించారు ఈ కార్యక్రమానికి శ్రీమతి చైతన్య వ్యాఖ్యాతగా వ్యవహరించారు. పలువురినీ లలిత కళారంగంలో ఉత్సాహ పరుస్తూ ముందుకు నడిచే ఇటువంటి కార్యక్రమానికి దాదాపుగా 200 మంది హాజరు కావటమే కాకుండా, సాంఘిక మాధ్యమాల ద్వారా కూడా వీక్షించి విశేషస్పందనలను తెలియజేయటం అభినందనీయం.

9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు ’’ విశేష సంచిక ఆవిష్కారం
ఖతార్ దేశ రాజధాని దోహా మహానగరంలో 2024 నవంబర్‌లో జరిగిన "9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు" యొక్క సభా విశేష సంచిక అంతర్జాల మాధ్యమంలో ఆదివారం ఆవిష్కరించారు. 'వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా' ,'ఆంధ్ర కళా వేదిక - ఖతార్' సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహింపబడి, మధ్య ప్రాచ్య దేశాలలోనే తొలి సాహితీ సదస్సుగా రికార్డును సృష్టించిన ఈ '9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సులో పది దేశాల నుండి పాల్గొన్న వక్తలు, కవులు, రచయితలు ప్రసంగించిన అన్ని అంశాలను పొందుపరుస్తూ 380 పేజీలతో ఈ సభా విశేష సంచిక రూపొందించబడింది. ఈ ఉద్గ్రంధానికి సంపాదకులుగా రాధికా మంగిపూడి, విక్రమ్ సుఖవాసి, వంగూరి చిట్టెన్ రాజు, లక్ష్మి రాయవరపు, శాయి రాచకొండ వ్యవహరించారు.సదస్సు నిర్వాహకవర్గము, సంచిక సంపాదకులు, సదస్సులో వివిధ దేశాల నుండి పాల్గొన్న వక్తలు, రచయితలు అందరి సమక్షంలో ఈ పుస్తక ఆవిష్కరణ జరగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకించి అంతర్జాల మాధ్యమంలో ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు. మరిన్నిNRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి!వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వ్యవస్థాపకులు డా. వంగూరి చిట్టెన్ రాజు, ఖతార్ ఆంధ్ర కళా వేదిక నుండి విక్రమ్ సుఖవాసి ప్రధాన నిర్వాహకులుగా, వారి అధ్యక్షతన, రాధిక మంగిపూడి సభానిర్వహణలో దాదాపు మూడు గంటల పాటు ఆదివారం సాయంత్రం నిర్వహింపబడిన ఈ కార్యక్రమంలో భారత్, ఖతార్, అమెరికా, సౌదీ అరేబియా, బహరైన్, యూఏఈ, సింగపూర్ తదితర దేశాలనుండి వక్తలు, తెలుగు సంస్థల ప్రతినిధులు, రచయితలు పాల్గొన్నారు.అమెరికా నుండి చెరుకూరి రమాదేవి, శాయి రాచకొండ, భారత్ నుండి డా. వంశీ రామరాజు, డా. అద్దంకి శ్రీనివాస్, డా. బులుసు అపర్ణ, ఆచార్య అయ్యగారి సీతారత్నం, ఆచార్య త్రివేణి వంగారి, కస్తూరి అలివేణి, డా. దేవులపల్లి పద్మజ తదితరులు, బహరైన్ నుండి మురళీకృష్ణ, సౌదీ అరేబియా నుండి కోనేరు ఉమామహేశ్వరరావు, చివుకుల పట్టాభిరామ శర్మ, సింగపూర్ నుండి కవుటూరు రత్నకుమార్, యూఏఈ నుండి షేక్ రఫీ, డా. తాడేపల్లి రామలక్ష్మి, ఖతార్ నుండి శ్రీసుధ, గోవర్ధన్ రెడ్డి, మనీష్, మాధవి లలిత, గౌరీ బొమ్మన తదితరులు ఆసక్తిగా పాల్గొని సదస్సు యొక్క జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.ఈ సభా విశేష సంచికలో నిర్వాహక సంస్థల పరిచయాలు, అధ్యక్షుల, సంచాలకుల ముందుమాటలు, సదస్సు ప్రకటనలు, వక్తలందరి ఫోటోలు, వ్యాసాలు, కథలు, కవితలతో పాటు, సదస్సు అనంతరం అందరూ అందించిన స్పందనలు కూడా జోడించడం, ఆనందంగా ఉందని, జీవితంలో ఒక మధుర జ్ఞాపకంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ సంచిక ఉందంటూ సంపాదకులను నిర్వాహకులను అభినందించారు.డా. వంగూరి చిట్టెన్ రాజు మాట్లాడుతూ "మధ్యప్రాచ్య దేశాలలో తెలుగు సాహిత్య అభిమానులందరికీ ఈ సదస్సు కొత్త స్ఫూర్తిని అందించిందని, సదస్సు ప్రభావం వలన ఎంతోమంది సాహిత్యంపై చక్కటి ఆసక్తి పెంచుకోవడం, కొత్త రచయితలు జనించడం.. ఆనందదాయకమని తెలియజేశారు. ఇటువంటి సదస్సులు మరిన్ని జరగాలని, కొత్త రచయితలు యువతరం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. విక్రమ్ సుఖవాసి ఆంధ్ర కళావేదిక తరపున మరొకసారి అందరికీ తమ దేశానికి విచ్చేసి కార్యక్రమంలో పాల్గొన్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ తొలిసారి ప్రపంచ సదస్సుకు సంచాలకునిగా ఈ సంచికకు సహసంపాదకునిగా ఉండడం చాలా ఆనందంగా ఉందన్నారుఈ సంచికకు రూపకల్పన సహకారం అందించిన జేవి పబ్లికేషన్స్ అధినేత్రి జ్యోతి వలబోజు కూడా ఈ ఆవిష్కరణలో పాల్గొన్నారు. ఇతర మధ్యప్రాచ్య దేశాల సంస్థల ప్రతినిధులు మాట్లాడుతూ తమ దేశాలలో కూడా ఇటువంటి సాహిత్య సదస్సులు నిర్వహించడానికి తాము సిద్ధంగా ఉన్నామని 10వ ప్రపంచ సదస్సు జరపడానికి అవకాశం ఇమ్మని కోరుతూ తమ ఉత్సాహాన్ని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమం వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా యూట్యూబ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారమైంది.

న్యూజెర్సీ, పార్సిప్పనీలో వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం
న్యూజెర్సీలోని పార్సిప్పనీలో శ్రీ సీతారాముల కల్యాణం రమణీయంగా, కమనీయంగా సాగింది. న్యూయార్క్‌లోని శ్రీ రంగనాథ ఆలయం నుంచి స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను తీసుకొచ్చారు. వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ ఊరేగింపుగా కల్యాణ మండపానికి స్వర్ణ సింహాసనంపై స్వామివారిని, అమ్మవారిని ఆసీనులను చేశారు. కళ్యాణం సందర్భంగా భక్తులు చేయించిన అభరణాలను వధూవరులకు ధరింపజేశారు. రాముల వారికి, సీతమ్మ వారికి పట్టు వస్త్రాలు, తాళిబొట్టు, మెట్టలు, ఆభరణాలు, ముత్యాల తలంభ్రాలను సమర్పించారు. మేళంతో ఊరేగింపుగా పట్ట వస్త్రాలను తీసువచ్చారు. సీతమ్మ, రామయ్యల ఎదుర్కోలు ఘట్టం కనులారా తిలకించిన భక్తులు ఆనందపరవశులయ్యారు. భక్తజనంతో న్యూజెర్సీలో పండగ వాతావరణం నెలకొంది. సంస్కృతి, సంప్రదాయలకు అనుగుణంగా వివాహ వ్యవస్థపై కృష్ణ దేశిక జీయర్ స్వామిజీ చేసిన వ్యాఖ్యానం విశేషంగా ఆకట్టుకుంది. దండలు మార్చుకునే క్రమంలో అర్చకులు నృత్య ప్రదర్శన చేసి సంప్రదాయాన్ని గుర్తు చేశారు. మరిన్నిNRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి!అనంతరం గణపతి పూజ, విశ్వక్సేన ఆరాధన, మహాసంకల్పం, మంగళఅష్టకాలు, కన్యాదానం, తలంబ్రాల ఘట్టం, పూలదండల మార్పు, మహా హారతి, నివేదన తదితర ఘట్టాలు శాస్త్రోక్తంగా జరిగాయి. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, భక్తుల జయజయధ్వానాల నడుమ జగదభిరాముడు జానమ్మను మనువాడారు. కోదండ రాముడు సీతమ్మ మెడలో మూడుముళ్లు వేసిన వేళ, రఘునందనుడి దోసిట తలంబ్రాలు ఆణిముత్యాలే నీలపురాశులుగా, జగన్మాత లోకపావని సీతమ్మ దోసిట అక్షింతలు మణిమాణిక్యాలై సాక్షాత్కారించిన వేళ కల్యాణ ప్రాంగణం భక్తిపారవశ్యంతో ఓలలాడింది.ఈ సీతారాముల కాళ్యానికి పార్సిప్పనీకి మేయర్ జేమ్స్ బార్బెరియోతో పాటు 300 మందికి ప్రవాస తెలుగువారు సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేశారు. దాదాపు అందరూ సంప్రదాయబద్ధంగా తయారై కళ్యాణంలో పాల్గొన్నారు. 72 పైగా జంటలు ఈ కళ్యాణ మహోత్సవంలో పాలు పంచుకున్నాయి. ఈ కల్యాణాన్ని ప్రవాసులు కన్నులారా వీక్షిం చి తరించారు. ఈ ఉత్సవం.. భద్రాచల రాముల వారి కళ్యాణమహోత్సవాన్ని తలపించింది. కల్యాణం అనంతరం ఉత్సవ మూర్తులను భక్తులు దర్శనం చేసుకున్నారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు, అక్షింతలు అందజేశారు.
క్రైమ్

రేణిగుంటలో 24.5 కిలోల గంజాయి స్వాధీనం
రేణిగుంట (శ్రీకాళహస్తి రూరల్): ఒడిశా నుంచి కేరళకు గంజాయి తరలించేందుకు ప్రయత్నించిన ఇద్దరు పశ్చిమ బెంగాల్ మహిళలను రేణిగుంట పోలీసులు గురువారం అరెస్టు చేశారు. రేణిగుంట లాడ్జిలో ఉన్న వారి వద్ద నుంచి 24.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గురువారం తిరుపతి జిల్లా ఏఎస్పీ రవిమనోహరాచారి తెలిపిన వివరాల మేరకు.. పోలీసులకు వచ్చిన రహస్య సమాచారం మేరకు రైల్వేస్టేషన్ సమీపంలోని ఎస్బీఎస్ లాడ్జిలోని 207 గదిలో డీఎస్పీ శ్రీనివాసరావు పర్యవేక్షణలో సీఐ జయచంద్ర, ఎస్ఐ అరుణ్‌కుమార్‌రెడ్డి సిబ్బందితో సోదాలు నిర్వహించారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన మమోని మొండాల్ (31), నమితా మొండాల్ (37) లను అదుపులోకి తీసుకుని, రెండు సూట్‌కేస్‌లలో ఉన్న రూ.2.45 లక్షల విలువ చేసే 24.5 కిలోల గంజాయిని స్వాదీనం చేసుకున్నారు. ఈ గంజాయిని ఒడిశా నుంచి రైల్లో కేరళ తీసుకెళుతుండగా వారి సంబం«దీకుల నుంచి సూచన రావడంతో రేణిగుంటలో దిగి లాడ్జిలో బస చేశారు.వారిద్దరినీ అరెస్టుచేసి కోర్టులో హాజరుపరిచారు. విచారణలో వారు చెప్పిన ఇద్దరు అంతర్ రాష్ట్ర స్మగ్లర్లను అరెస్ట్ చేయాల్సి ఉంది. ఈ కేసుకు సంబంధించి సీఐ జయచంద్ర, సిబ్బందిని ఎస్పీ హర్షవర్ధన్‌రాజు అభినందించినట్లు ఏఎస్పీ తెలిపారు.

అర్ధరాత్రి క్షుద్రపూజల కలకలం..!
కర్నూలు: పట్టణంలోని కర్నూలు – బెంగళూరు జాతీయ రహదారి పక్కన చెరుకులపాడు క్రాస్ రోడ్డులోని ఓ ఇంట్లో క్షుద్రపూజలు చేసి న ఫొటోలు, వీడియో లు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి. ఓ వ్యక్తి మీద చేతబడి ప్రయోగించినట్లుగా తెలుస్తోంది. ఇందుకు పట్టణానికి చెందిన వ్యక్తి సూత్రధారిగా ఉండి కొందరి ఫొటోలతో, భయానక చేతబడి చేస్తున్నప్పటి ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి. సేకరించిన సమాచారం మేరకు.. పట్టణానికి చెందిన వ్యక్తి సిఫారసుతో చెరుకులపాడు క్రాస్ రోడ్డులోని ఓ ఇంటిని అద్దెకు తీసుకున్న వారు అందులో చేతబడులు చేస్తూ, గుప్తనిధుల వేటగాళ్లకు ఆసరాగా ఉంటున్నట్లుగా తెలుస్తోంది. ఎమ్మిగనూరుకు చెందిన వ్యక్తికి అప్పు ఉండ గా అప్పు ఎగ్గొట్టేందుకు ఏకంగా ఆ వ్యక్తిపై చేతబడి ప్రయోగం చేసినట్లు సమాచారం. ఇందులో పట్టణానికి చెందిన పంచాయతీ కార్యాలయంలో అనధికారికంగా పనిచేస్తున్నకార్మికుడి ఫొటో ఉంది. ఇటీవల ఉలిందకొండకు చెందిన వ్యక్తిపై కూడా ఇక్కడి నుంచే చేతబడి ప్రయోగం చేసినట్లుగా తెలుసుకున్న ఉలిందకొండ వారు ఈ ఇంటికి చేరుకుని ఇంట్లో ఉన్నవారితో గొడవ పడినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఈ ఇళ్లు కేంద్రంగా రెండు నెలల పాటు మండలం వ్యాప్తంగా గుప్తనిధుల వేట కొనసాగినట్లుగా సైతం తెలుస్తోంది. పోలీసులకు సైతం సమాచారం అందినా చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది.

భర్త మరణాన్ని జీర్ణించుకోలేక భార్య ఆత్మహత్య
ఉయ్యాలవాడ: విధి ఆటలో ఓ చిన్నారి అనాథగా మారింది. అభంశుభం తెలియని పసిపాప తొమ్మిది రోజుల వ్యవధిలో తల్లిదండ్రులను కోల్పోయింది. ఈ విషాద ఘటన ఆర్. పాంపల్లె గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పొగాకు నారాయణ కూలీ పనులకు వెళుతూ జీవనం కొనసాగించేవాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 6వ తేదీన గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి చెందిన మట్టి మిద్దె పనులకు వెళ్లాడు. ఆ సమయంలో ప్రమాదవశాత్తూ మిద్దె కూలి శిథిలాలు నారాయణపై పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అప్పటి నుంచి అతని భార్య లలిత (40) తీవ్ర మనోవేదనకు గురైంది. మనస్తాపంతో వారం రోజులుగా ఆహారం తీసుకోకుండా భర్త గురించే ఆలోచించింది. తన 45 రోజుల చిన్నారికి కూడా పోతపాలు తాపింది. చివరకు జీవితంపై విరక్తి చెంది బుధవారం ఉదయం లలిత రసాయన పౌడర్‌ను నీళ్లలో కలుపుకుని అపస్మారక స్థితిలో పడిపోయింది. గమనించిన బంధువులు, స్థానికులు చికిత్స నిమిత్తం 108లో ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం నంద్యాలకు తరలిస్తుండగా మార్గమధ్యలో లలిత మృతి చెందింది. తల్లిదండ్రుల మృతి చెంద డంతో 45 రోజుల చిన్నారి అనాథగా మిగిలింది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పసిపాపకు తల్లిదండ్రులు లేకపోవడంతో నాయనమ్మ శివమ్మ దిక్కైంది. అమ్మపాల కోసం ఏడస్తున్న చిన్నారిని చూసి పలువురు కంటతడి పెట్టారు. కాగా నారాయణ మొదటి భార్య విజయలక్ష్మి ఐదేళ్ల క్రితం కుటుంబ కలహాలతో క్రిమి సంహారక మందు తాగి మృతి చెందింది. రెండేళ్ల క్రితం లలితను రెండవ వివాహం చేసుకున్నాడు. మృతురాలి తల్లి నారాయణమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్.. ఇటీవల జిల్లాలో పలువురు ఆత్మహత్యకు కల్లాపికి ఉపయోగించే పేడ రంగును నీళ్లలో కలుపుకుని తాగి మృతి చెందుతుండటంతో కలెక్టర్ రాజకుమారి నెల క్రితం పేడ రంగు విక్రయాలను నిషేధించారు. అయినా కొందరు కిరాణ దుకాణ వ్యాపారులు విక్రయిస్తున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. పేడ రంగు విక్రయించకుండా అధికారులు దుకాణాలపై దాడులు చేయా లని గ్రామస్తులు కోరుతున్నారు.

తాళిబొట్లు తెంచి పడేసి హిజ్రాల ఆవేదన..!
తమిళనాడు: కూవాగంలో గత కొద్ది రోజులు సందడి చేసిన హిజ్రాలు బుధవారం విషాదంతో స్వస్థలాలకు తిరుగు పయనం అయ్యారు. మంగళవారం ఎంతో ఆనందంగా కట్టుకున్న మంగళ సూత్రాలను తెంచి పడేసి ఒప్పారి పెట్టారు. తెల్ల చీరలు ధరించి వితంతువులుగా మారి కూవాగం నుంచి తిరుగు పయనం అయ్యారు. ముందుగా ఉదయం కూత్తాండవర్ రథోత్సవం అత్యంత వేడుకగా జరిగింది. రాష్ట్రంలోని కళ్లకురిచ్చి జిల్లా ఉలుందూర్ పేట సమీపంలోని కూవాగం గ్రామంలోని కూత్తాండవర్ ఆలయంలో రెండు వారాల పాటు చిత్తిరై ఉత్సవాలు అత్యంత వేడుకగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా గత మూడు రోజులు హిజ్రాల సందడితో కూవాగం కళకళలాడింది. భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి, ఆలయ పూజారి చేతుల మీదుగా మంగళవారం హిజ్రాలు తాళిబొట్లు కట్టించుకున్నారు. రాత్రంతా ఆట పాటలతో సందడి చేశారు. రథోత్సవం బుధవారం ఉదయం కూత్తాండవర్ రథోత్సవం ఘనంగా జరిగింది. ఈ రథోత్సవాన్ని తిలకించేందుకు వేలాదిగా జనసందోహం తరలివచ్చారు. ఈ వేడుక కోసం కూవాగం, పందలాడి, కిలక్కు కుప్పం, శిరులాయం కుళం గ్రామాల నుంచి ప్రజలు చేతులు, కాళ్లు, భుజాలు, శిరస్సు ఆకారాలను తీసుకొచ్చి రథంపై ఉంచారు. బ్రహ్మాండంగా కూత్తాండవర్ రథోత్సవ సేవ జరిగింది. అనంతరం బలిదానం జరిగింది. బలిదానంలో తమ ఆరాధ్యుడు బలి కావడంతో తమ భర్తను కోల్పోయినంతగా తీవ్ర వేదనతో ఒక్కసారిగా హిజ్రాలు విషాదంలో మునిగారు. తాము కట్టుకున్న మంగళ సూత్రాలను తెంచి పడేసి కన్నీటి సంద్రంలో మునిగారు. ఏడుపులు, పెడ»ొబ్బలతో ఒప్పారి పెట్టారు. అక్కడి కొలనులో స్నానం చేసి తెల్ల చీరల్ని ధరించి తమ స్వస్థలాలకు తిరుగు పయనమయ్యారు.