Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today

Top Stories

ప్రధాన వార్తలు

AP govt failed to supply seeds1
విత్తు.. సర్కారు ప్రణాళిక చిత్తు

గతంలో ఈపాటికే విత్తనాలిచ్చారునాకు నాలుగెకరాలు సొంత భూమి ఉంది. మరో నాలుగెకరాలు కౌలుకు తీసుకొని వేరుశనగ సాగు చేస్తున్నా. గతంలో ఈ పాటికే విత్తనాల కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకోవడమే కాదు. విత్తనాలు పంపిణీ కూడా పూర్తయ్యేది. ఈ ఏడాది రైతు సేవా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్‌ చేయించుకోవడం లేదు. విత్తనాలు ఎప్పుడు వస్తాయో కూడా చెప్పే నాథుడు లేడు. బయట మార్కెట్‌లో కొందామంటే ధరలు మండిపోతున్నాయి. పైగా నాణ్యమైనవి దొరుకుతాయో లేదో తెలియడం లేదు. – బోయ ఓబులేసు, ఉదిరిపికొండ, కూడేరు మండలం, అనంతపురం జిల్లా⇒ ఇతని పేరు బొంతల హరీష్. శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం లింగారెడ్డిపల్లె గ్రామం. సొంతంగా మూడెకరాలు, కౌలుకు రెండెకరాలు.. పూర్తిగా వర్షాధారంపై ఆధారపడి సాగు చేస్తున్నాడు. 15 ఏళ్లుగా వేరుశనగ పంట వేస్తున్నాడు. ఎకరాకు 80 నుంచి 100 కిలోల విత్తనం కావాలి. బహిరంగ మార్కెట్‌లో క్వింటా రూ.12 వేలకు పైగానే ఉంది. ఐదెకరాలకు రూ.60 వేలు ఖర్చు చేయాల్సి ఉంది. ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేసే పరిస్థితి ఇతనికి లేదు. గత ఖరీఫ్‌లో మే మొదటి వారంలోనే విత్తనాలు ఆర్బీకేల ద్వారా ఇచ్చారు. గతేడాది ఈపాటికే విత్తుకోవడం పూర్తయింది.పంట ఏపుగా ఎదిగినా కోతకొచ్చే సమయానికి వర్షాల కారణంగా పంట పూర్తిగా దెబ్బతిన్నది. ఐదెకరాలకు 3 క్వింటాళ్ల దిగుబడి కూడా రాలేదు. రూ.60 వేలకుపైగా నష్టపోయాడు. రబీలో పంట వేయలేదు. ఈ ఏడాది ప్రారంభంలోనే వర్షాలు పడుతుండడంతో అదును దాటిపోకుండా విత్తుకోవాలని చూస్తున్నాడు. ఇప్పటికే పలుమార్లు రైతు సేవా కేంద్రాల వద్దకు వెళ్లినా రిజి్రస్టేషన్‌ చేసుకోవడం లేదని, ఎప్పుడు ఇస్తారో కూడా చెప్పడం లేదని వాపోతున్నాడు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ పంటలు సాగు చేస్తున్న రైతులందరి పరిస్థితి ఈ విధంగానే ఉంది.సాక్షి, అమరావతి: అన్నదాతలకు అడుగడుగునా అండగా నిలవాల్సిన కూటమి ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వారిపై కక్ష కట్టినట్లు వ్యవహరిస్తోంది. అదును సమయంలో వారికి పెట్టుబడి సాయం అందించకపోగా, సబ్సిడీ విత్తనాలు సైతం ఇవ్వకుండా కష్టాలపాలు చేస్తోంది. మరో పది రోజుల్లో ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం కాబోతున్నా, విత్తన సరఫరా మొదలు కాకపోవడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. నాన్‌ సబ్సిడీ విత్తన పంపిణీకి గతేడాది మంగళం పాడిన కూటమి ప్రభుత్వం.. ఈ ఏడాది సబ్సిడీ విత్తన పంపిణీలోనూ రైతులను ముప్పుతిప్పలు పెడుతోంది. దాదాపు ఆరు రకాల సబ్సిడీ విత్తనాల పంపిణీని నిలిపి వేయడమే కాకుండా, మిగిలిన సబ్సిడీ విత్తనాల పంపిణీలోనూ అడ్డగోలుగా కోత పెట్టింది. గతేడాది బకాయిలు చెల్లిస్తే కానీ విత్తన సరఫరా చేయలేమని ఓ వైపు కంపెనీలు తెగేసి చెబుతున్నాయి. దీంతో ఈ ఏడాది సబ్సిడీ విత్తనాలు రైతులకు దొరికే పరిస్థితి కనిపించడం లేదు. రైతుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును అధికార పార్టీ ఎమ్మెల్యేలు సైతం తప్పు పడుతున్నారంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గత ప్రభుత్వం ఏటా వ్యవసాయ సీజన్‌కు ముందే తొలి విడత పెట్టుబడి సాయం అందించడంతో పాటు ఎవరికి ఏ మేరకు విత్తనం కావాలో ముందుగానే ఆర్డర్‌ తీసుకుని ఆర్బీకేల ద్వారా సరఫరా చేసేదని రైతులు గుర్తు చేసుకుంటున్నారు. పెట్టుబడి సాయం రూ.13,500 కాకుండా ఏకంగా రూ.20 వేలు ఇస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం తమను మభ్యపెడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరిపడా సబ్సిడీ విత్తనం లేదు.. పెట్టుబడి సాయమూ లేదని ఊరూరా అన్నదాతలు బావురుమంటున్నారు. ఇంకా ఖరారు కాని సబ్సిడీలు ⇒ ఖరీఫ్‌ సాధారణ విస్తీర్ణం 77.87 లక్షల ఎకరాలు కాగా, ఈ ఏడాది 86.47 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యంగా నిర్ధేశించారు. ప్రధానంగా 38.87 లక్షల ఎకరాల్లో వరి, 14.30 లక్షల ఎకరాల్లో వేరుశనగ, 14.10 లక్షల ఎకరాల్లో పత్తి, 9.35 లక్షల ఎకరాల్లో అపరాలు సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏటా 40% సబ్సిడీపై వేరుశనగ, 30% సబ్సిడీపై పెసర, మినుము, కంది, 50% సబ్సిడీపై కొర్ర, రాగి, అండుకొర్రలు వంటి చిరుధాన్యపు విత్తనాలను సరఫరా చేస్తుంటారు. ⇒ వరి విత్తనాలను మాత్రం జాతీయ ఆహార ధాన్యాల భద్రతా పథకం అమలయ్యే జిల్లాల్లో కిలోకి రూ.10, ఇతర జిల్లాల్లో రూ.5 చొప్పున రాయితీతో సరఫరా చేస్తారు. ఏజెన్సీ జిల్లాలో మాత్రం 90% సబ్సిడీపై వరితో సహా అన్ని రకాల విత్తనాలను పంపిణీ చేస్తారు. ఏటా మార్చిలో పంటల వారీగా నిర్ధేశించిన సాగు లక్ష్యాలకనుగుణంగా జిల్లాల వారీగా ఇండెంట్‌ సేకరిస్తారు. ⇒ గ్రామీణ విత్తనోత్పత్తి పథకం కింద ఉత్పత్తి అయ్యే విత్తనాన్ని దృష్టిలో పెట్టుకొని మిగిలిన విత్తనాల కోసం టెండర్ల ద్వారా కంపెనీలను ఎంపిక చేస్తారు. ఇలా సేకరించిన విత్తనాలను ఇంటిగ్రేటెడ్‌ అగ్రి ల్యాబ్‌లలో సర్టీఫై చేసి, సీజన్‌కు ముందుగానే రైతు భరోసా కేంద్రాల్లో (ఆర్బీకే) రైతులకు అందుబాటులో ఉంచేవారు. సాధారణంగా ఏటా ఏప్రిల్‌లో పచ్చిరొట్ట విత్తనాలు పంపిణీ పూర్తి చేసేవారు. ⇒ షెడ్యూల్‌ ప్రకారం పంపిణీ చేసేవారు. గత ఐదేళ్లలో ఏ ఒక్క ఏడాది ఒక్కరంటే ఒక్క రైతు కూడా తమకు విత్తనం సకాలంలో అందలేదన్న మాట విని్పంచకుండా సరఫరా చేశారు. ఈ ఏడాది అదును ముంచుకొస్తున్నప్పటికీ విత్తన పంపిణీ షెడ్యూల్‌ కాదు కదా.. కనీసం సబ్సిడీలను కూడా ఖరారు చేయలేని దుస్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని రైతులు మండిపడుతున్నారు. సబ్సిడీ విత్తనంలో అడ్డగోలుగా కోత ⇒ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ముందస్తుగా చేసిన ఏర్పాట్ల ఫలితంగా 2024–25 ఖరీఫ్‌లో 6.63 లక్షల క్వింటాళ్ల విత్తనం రైతులకు అందుబాటులో ఉండింది. వరి 2.29 లక్షల క్వింటాళ్లు, వేరుశనగ 3.16 లక్షల క్వింటాళ్లు, 94 వేల క్వింటాళ్ల పచ్చిరొట్ట, 15 వేల క్వింటాళ్ల అపరాల విత్తనాలను సీజన్‌కు ముందుగానే సర్టీఫై చేసి ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచగలిగారు. ⇒ ప్రస్తుత ఖరీఫ్‌–2025 సీజన్‌ కోసం జిల్లాల నుంచి వచ్చిన ఇండెంట్‌ ప్రకారం తొలుత 6,31,952 క్వింటాళ్ల విత్తనం అవసరమని ఏపీ సీడ్స్‌ అంచనా వేసింది. ప్రధానంగా 2.37 లక్షల క్వింటాళ్ల వరి, 2.95 లక్షల క్వింటాళ్ల వేరుశనగ, 69 వేల క్వింటాళ్ల పచ్చిరొట్ట, 12 వేల క్వింటాళ్ల కందులు సరఫరా చేయాలని నిర్ణయించారు. ఆ తర్వాత సబ్సిడీ విత్తనాన్ని కుదించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో కేవలం 5.18 లక్షల క్వింటాళ్లకు పరిమితం చేశారు. ⇒ ఇందులో 2.15 క్వింటాళ్ల విత్తనం గ్రామీణ విత్తనోత్పత్తి పథకం ద్వారా, మిగిలిన విత్తనాన్ని టెండర్‌ ప్రక్రియ ద్వారా సేకరించాలని నిర్ణయించారు. చివరికి 4.65 లక్షల క్వింటాళ్లకు మించి అమ్మకాలు ఉండవన్న అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నారు. పైగా గతంలో దాదాపు 16 రకాల విత్తనాలను సబ్సిడీపై సరఫరా చేసేవారు. అలాంటిది ఈ ఏడాది 10 రకాలకే పరిమితం చేశారు. ఈ లెక్కన 3 లక్షల క్వింటాళ్లకు మించి విత్తనాలు అందుబాటులో ఉండే అవకాశం లేదని అధికారులే చెబుతున్నారు.⇒ పిల్లిపెసర సహా సామెలు, ఊదలు, అలసందలు, రాజ్మా, ఉలవల సరఫరా నిలిపివేశారు. మిగిలిన వాటికి కూడా అడ్డగోలుగా కోత వేశారు. రాయలసీమ జిల్లాల్లో అత్యధిక విస్తీర్ణంలో సాగయ్యే వేరుశనగ పంట కోసం గతంలో ఏటా దాదాపు 3.80 లక్షల క్వింటాళ్లకు పైగా విత్తనం అందుబాటులో ఉంచేవారు. అలాంటిది ఈ ఏడాది తొలుత 2.95 లక్షల క్వింటాళ్లు అవసరమని అంచనా వేయగా, ఆ తర్వాత ప్రభుత్వాదేశాలతో 1.95 లక్షల క్వింటాళ్లకు పరిమితం చేయడం పట్ల సర్వత్రా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.బకాయిలు చెల్లించని కూటమి ప్రభుత్వం ⇒ గతంలో ఏటా క్రమం తప్పకుండా సీజన్‌కు ముందుగానే టెండర్ల ద్వారా విత్తనాలకు అవసరమైన మొత్తాన్ని బడ్జెట్‌లో కేటాయించడమే కాకుండా ఆ మొత్తాన్ని ఆయా కంపెనీలకు విడుదల చేసేవారు. దీంతో గత ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో ఏనాడు విత్తన సరఫరాలో ఎలాంటి ఆటంకం ఏర్పడ లేదు. 2024–25 ఖరీఫ్‌ సీజన్‌లో 6.63 లక్షల క్వింటాళ్లు, రబీలో 3.85 లక్షల క్వింటాళ్ల విత్తనం సరఫరా చేయగా, అందుకు సంబంధించిన సబ్సిడీ రూ.328.75 కోట్లు ప్రభుత్వం కంపెనీలకు చెల్లించలేదు.⇒ ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి రూ.213.78 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఎనిమిది నెలలుగా ఈ మేరకు పలుమార్లు పంపిన ప్రతిపాదనలను ప్రభుత్వం బుట్టదాఖలు చేసింది. దీంతో పచ్చిరొట్ట విత్తనాల సరఫరాకు ముందుకొచ్చిన ఐదు కంపెనీలు.. వేరుశనగ, వరి, శనగ, ఉలవలు, రాజ్మా తదితర విత్తనాల సరఫరాకు ముందుకొచ్చిన 12 కంపెనీలు గతేడాది బకాయిలు చెల్లిస్తే కానీ ఈ ఏడాది విత్తన సరఫరా చేసేది లేదని తెగేసి చెప్పాయి. దీంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో యంత్రాంగం ఉంది.⇒ అతికష్టమ్మీద ఒత్తిడి తీసుకురాగా జీలుగు.. జనుము (పచ్చిరొట్ట) విత్తనాలు కేవలం 23 వేల క్వింటాళ్లు (25%) జిల్లాలకు సరఫరా చేయగలిగారు. దీంతో పచ్చిరొట్ట విత్తనాలు దొరక్క రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. మరోవైపు ఈ పాటికే ప్రారంభం కావాల్సిన వేరుశనగ విత్తనం పంపిణీ ఎప్పుడు ప్రారంభమవుతుందో కూడా చెప్పలేకపోతున్నారు. మిగిలిన విత్తనాల పంపిణీ పరిస్థితి కూడా అలాగే ఉంది. ⇒ ఇదే అదునుగా ప్రైవేటు వ్యాపారులు అందినకాడికి దోచుకుంటున్నారు. గతేడాది ప్రభుత్వ చేతకాని తనం వల్ల నకిలీ విత్తనాలు రాజ్యమేలాయి. ఖరీఫ్‌లో ఎక్కువగా సాగయ్యే మిరప, పత్తి విత్తనాల్లో నకిలీలకు చెక్‌ పెట్టేందుకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ హయాంలో 40 కంపెనీలతో ఒప్పందం చేసుకుని, కల్తీలకు ఆస్కారం లేని రీతిలో రైతులు కోరుకున్న కంపెనీలకు చెందిన నాన్‌ సబ్సిడీ విత్తనాలను ఆర్బీకేల ద్వారా సరఫరా చేసింది. గత సీజన్‌ నుంచి నాన్‌ సబ్సిడీ విత్తనాల పంపిణీకి ప్రస్తుత ప్రభుత్వం మంగళం పాడింది.విత్తనోత్పత్తికీ రాంరాం ⇒ సాధారణంగా సాగు విస్తీర్ణంలో 30 శాతం విస్తీర్ణానికి అవసరమైన విత్తనాన్ని ఏపీ సీడ్‌ కార్పొరేషన్‌ ద్వారా ప్రభుత్వం సరఫరా చేస్తోంది. ఆ మేరకు అవసరమైన విత్తనం కోసం రబీ సీజన్‌లో జిల్లాల వారీగా గుర్తించిన రైతులకు విత్తనోత్పత్తి పథకం కింద 75 శాతం రాయితీపై మూల విత్తనాన్ని ఇచ్చి విత్తన సాగును ప్రోత్సహిస్తారు. మరొకవైపు ఏపీ సీడ్స్‌లో వాటాదారులుగా ఉన్న రైతులకు బ్రీడర్స్, ఫౌండేషన్‌ సీడ్స్‌ ఇచ్చి వారి ద్వారా విత్తనోత్పత్తి చేసి, ఆ విత్తనాన్ని ఖరీఫ్‌ సీజన్‌లో రైతుల డిమాండ్‌ మేరకు సేకరిస్తారు. ⇒ సాధారణంగా ఏపీ సీడ్స్‌ సరఫరా చేసే విత్తనంలో 50 శాతం ఈ విధంగా సేకరిస్తారు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ హయాంలో ఎవరైతే విత్తనం ఉత్పత్తి చేస్తారో ఆ రైతుల నుంచే ఈ–క్రాప్‌ ప్రామాణికంగా సేకరించేవారు. నిర్ధేశిత గడువులోగా వారికి బహిరంగ మార్కెట్‌ ధర కంటే 20–30 శాతం అదనంగా చెల్లించేవారు. ఈ వివరాలను సామాజిక తనిఖీలో భాగంగా ఆర్బీకేల్లో సైతం ప్రదర్శించేవారు. ⇒ దీంతో విత్తనోత్పత్తి చేసే రైతులు కూడా ఏపీ సీడ్స్‌కు ఇచ్చేందుకు ముందుకొచ్చేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. గడిచిన ఖరీఫ్‌లో విత్తనోత్పత్తి చేసే రైతుల నుంచి సేకరించిన విత్తనాలకు సంబంధించిన బకాయిలు దాదాపు 9 నెలలు గడిచినా చెల్లించని పరిస్థితి నెలకొంది. దీంతో ఈ రైతులెవ్వరూ తమ విత్తనాన్ని ఏపీ సీడ్స్‌కు ఇచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. బహిరంగ మార్కెట్‌ ధరలకే అమ్ముకుంటున్నారు. దీంతో ఏపీ సీడ్స్‌ పూర్తిగా టెండర్ల ద్వారానే విత్తనం సేకరించాల్సిన దుస్థితి ఏర్పడింది. అధికార పార్టీ ఎమ్మెల్యేలే పెదవి విరుపు⇒ విత్తన పంపిణీ విషయంలో ప్రభుత్వ తీరును అధికార పార్టీ ఎమ్మెల్యేలే తప్పు పడుతున్నారు. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుకు అధికార పార్టీకి చెందిన అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత రాసిన లేఖే నిదర్శనం. ⇒ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఏటా 3 లక్షల క్వింటాళ్ల విత్తనం అందించారని ఆమె గుర్తు చేశారు. అలాంటిది ఖరీఫ్‌–2025 సీజన్‌కు కనీసం 2 లక్షల క్వింటాళ్ల విత్తనం తక్కువ కాకుండా కేటాయించాల్సి ఉండగా, కేవలం 1.10 లక్షల క్వింటాళ్ల విత్తనం కోసం జిల్లా అధికారులు ఇండెంట్‌ పెట్టడం దారుణం అన్నారు. వ్యవసాయ శాఖ కేవలం 50 వేల క్వింటాళ్ల విత్తనాన్ని మాత్రమే కేటాయించడం విస్మయానికి గురి చేస్తోందని ఆమె ఆ లేఖలో పేర్కొన్నారు. ఇదేనా మంచి ప్రభుత్వం అంటే? సబ్సిడీపై వేరుశనక్కాయల విత్తనాల గురించి సచివాలయానికి వెళ్లి అడిగితే తమకు ఆదేశాలు రాలేదంటున్నారు. పదెకరాల్లో సేద్యం చేసుకున్నా.. వర్షాలు పడుతున్నాయి.. త్వరలో విత్తుకోవాల్సి ఉందని చెప్పినా వినిపించుకునే వారే లేరు. మాది రైతు ప్రభుత్వం.. మంచి ప్రభుత్వం అంటున్నారు.. ఇదేనా మంచి ప్రభుత్వం అంటే? రైతు సేవా కేంద్రాల్లో మా పేర్లు కూడా నమోదు చేసుకోకపోవడం దారుణం. దీంతో విత్తనాలు అధిక ధరకు బయట కొనుక్కోవాల్సి వస్తోంది. – మునిరెడ్డి, బొందిమడుగుల, తుగ్గలి మండలం, కర్నూలు జిల్లా అన్ని విధాలుగా మోసం చేల్లో దుక్కి దున్నాం. ఇంత వరకు శనగ విత్తనాలు రాలేదు. సచివాలయంలో అడిగితే మాకు పై నుంచి ఆర్డర్స్‌ రాలేదంటున్నారు. గతంలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఈపాటికే శనక్కాయల విత్తనాలు ఇచ్చేది. కానీ ఈ ఏడాది ఈ ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించడం లేదు. అదును దాటిపోతుంది. ఇంకెప్పుడు విత్తుకోవాలి? పెట్టుబడి సాయం కూడా ఇవ్వలేదు. రైతులను అన్ని విధాలుగా ముంచేస్తున్నారు. మీకు చిత్తశుద్ధి ఉంటే 90 శాతం సబ్సిడీపై శనక్కాయల విత్తనం ఇవ్వాలి. – రమణారెడ్డి, పొడరాగపల్లి, ముదిగుబ్బ మండలం, శ్రీ సత్యసాయి జిల్లా కౌలురైతులకు నూరు శాతం సబ్సిడీతో సర్టీఫైడ్‌ విత్తనాలివ్వాలిఏపీ కౌలురైతుల సంఘం డిమాండ్‌ సాక్షి, అమరావతి: కౌలురైతులకు నాణ్యమైన, సర్టీఫై చేసిన విత్తనాలను నూరు శాతం సబ్సిడీపై అందించాలని ఏపీ కౌలు రైతుల సంఘం ఆదివారం ఓ ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. ప్రైవేట్‌ మార్కెట్లో విత్తనాల ధరలు విపరీతంగా పెంచేశారని, పైగా ప్రైవేటు కంపెనీలు విక్రయించే విత్తనాల్లో నాణ్యత ఉండటం లేదని సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎ.కాటమయ్య, పి.జమలయ్య పేర్కొన్నారు. ఈ ఏడాది సీజన్‌కు ముందు విత్తనాలను సిద్ధం చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తంచేశారు.

YSRCP Leaders House Arrest In AP2
తిరువూరు ఎన్నిక.. వైఎస్సార్‌సీపీ నేతలు హౌస్ట్‌ అరెస్ట్‌

సాక్షి, ఎన్టీఆర్‌: నేడు తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. ఎన్నికల కోసం బలం లేకపోయినా గెలవాలని కూటమి కుట్రలు చేస్తో​ంది. మరోవైపు.. తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వేళ వైఎస్సార్‌సీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. తిరువూరు వెళ్లొద్దంటూ వైఎస్సార్‌సీపీ నేతలపై పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు.వివరాల ప్రకారం.. తిరువూరు మున్సిపల్ చైర్మన్ రాజీనామా చేయడంతో నేడు చైర్మన్ పదవికి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ నేతలు తిరువూరు వెళ్లకుండా పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. శాంతిభద్రతల సాకుతో వైఎస్సార్‌సీపీ నేతల ఇళ్ల వద్ద పోలీసులు పహారా కాస్తున్నారు. వైఎస్సార్‌సీపీ నేతలను టార్గెట్‌ చేసి హౌస్‌ అరెస్ట్‌ చేస్తున్నారు. ఎన్నికల్లో బలం లేకపోయినా గెలవాలని కూటమి కుట్రలు చేస్తోంది. కూటమి ప్రభుత్వ వైఖరి, పోలీసుల తీరుపై వైఎస్సార్‌సీపీ నేతలు మండిపడుతున్నారు.మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ..‘తిరువూరులో బలం లేకపోయినా గెలవాలని చూస్తున్నారు. వైఎస్సార్‌సీపీకి 17 మంది కౌన్సిలర్ల బలం ఉంది. టీడీపీకి ఉన్నది కేవలం ముగ్గురు కౌన్సిలర్లు మాత్రమే. ముగ్గురు కౌన్సిలర్లతో ఏవిధంగా గెలవాలనుకుంటున్నారు. అధికార బలంతో మున్సిపాల్టీ, నగర పాలక సంస్థలను కైవసం చేసుకోవాలని చూస్తున్నారు. ఎన్నికల్లో మీరు ఏం చెప్పి గెలిచారు. రాష్ట్రమంతా అభివృద్ధి చేస్తామని ఇప్పుడు మీరు చేస్తున్నదేంటి?. తిరువూరు వెళ్లొద్దని మా పై ఆంక్షలు పెట్టడమేంటి?. వెళితే అరెస్ట్ చేస్తామని వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తున్నారు. ఏపీలో పోలీసు రాజ్యం నడిపిస్తున్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా తిరువూరు వెళ్లి తీరుతాం. తిరువూరు మున్సిపాల్టీపై వైఎస్సార్‌సీపీ జెండా ఎగురవేస్తాం’ అని అన్నారు. మరోవైపు.. సోమవారం ఉదయమే మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇంఛార్జి తన్నీరు నాగేశ్వరరావును పోలీసులు హౌస్ అరెస్ట్‌ చేశారు. ఈ సందర్బంగా తన్నీరు నాగేశ్వరరావు మాట్లాడుతూ..‘శాంతి భద్రతల సమస్యను సాకుగా చూపించి వైఎస్సార్‌సీపీ నేతలను హౌస్ అరెస్టు చేయటం కరెక్ట్‌ కాదు. రాజ్యాంగ హక్కులను కూటమి ప్రభుత్వం కాలరాయటమే అవుతుంది. వైఎస్సార్‌సీపీకి 17 మంది కౌన్సిలర్ల మద్దతు ఉండగా తెలుగుదేశం పార్టీకి కేవలం ముగ్గురు కౌన్సిలర్లు మాత్రమే ఉన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకొని కూటమి ప్రభుత్వం తిరువూరు మున్సిపాలిటీ కైవసం చేసుకోవాలని చూస్తోంది. ఫలితం మాత్రం శూన్యం’ అని అన్నారు. ఇక, వైఎస్సార్‌సీపీ తరఫున 17 మంది కౌన్సిలర్లు ఉండగా, టీడీపీ నుంచి ముగ్గురు గెలుపొందారు. ఎన్నికల్లో గెలించేందుకు బలం లేకపోయినప్పటికీ టీడీపీ కుట్రలకు పాల్పడుతోంది. వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లను ప్రలోభాలకు గురిచేస్తూ తమ వైపు తిప్పుకునేందుకు కూటమి నేతలు ప్రయత్నిస్తున్నారు.

temple razed during tdp rule: Andhra pradesh3
కూటమి పాలన.. ఆలయంలోని ఏడు విగ్రహాలు ధ్వంసం

గార: కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక ఆలయాల్లో జరుగుతున్న వరుస ఘటనలు హిందూవుల మనసులను కలచివేస్తున్నాయి. భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయి. ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి రోజున తిరుపతిలో టోకెన్ల జారీ సమయంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మరణించిన విషయం తెలిసిందే. ఏప్రిల్‌ నెలలో శ్రీకాకుళం జిల్లా గార మండలం శ్రీకూర్మంలో రెండురోజుల వ్యవధిలో 15 నక్షత్ర తాబేళ్లు మృత్యువాతపడడం, ఆ తర్వాత విశాఖపట్నం జిల్లా సింహాచలంలో చందనోత్సవ సమయంలో గోడ కూలిన దుర్ఘటనలో ఏడుగురు భక్తులు మరణించడం వంటి హృదయ విదారక ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపాయి.ఈ విషాద ఘటనలు మరువక ముందే శ్రీకాకుళం జిల్లా గార మండలం కళింగపట్నం పెద్ద పల్లిపేటలోని కోదండ రామాలయంలో మరో ఘోర అపచారం జరిగింది. ఈ గుడిలోని బాలశశిశేఖర ఆలయం (వైష్ణవాలయం)లో శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఏడు విగ్రహాలను ధ్వంసం చేశారు. దాదాపు 300 ఏళ్ల చరిత్ర గల ఈ ఆలయం గర్భగుడిని స్థానికులు విరాళాలు పోగు చేసి బాగు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా గుడి చుట్టూ దశావతారాలను సిమెంట్‌ విగ్రహాలతో ఏర్పాటు చేశారు. వీటిలో వామనావతరం విగ్రహాన్ని దుండగులు పూర్తిగా పెకిలించి వేశారు. కలి్క, బలరామ, శ్రీరాముడు, పరశురామ, నరసింహ, శ్రీకృష్ణుడు విగ్రహాల చేతులు విరిగిపోయి ఉన్నాయి. కొన్ని విగ్రహాలకు కత్తి, నాగలి, పిల్లనగ్రోవి వంటివి పాడైపోయాయి. ఎవరో కావాలనే ఈ పని చేశారని అనుమానిస్తున్నారు. ఈ ఆలయానికి ఒకవైపు పిచ్చి మొక్కలు పెరిగి ఉన్నాయి. ఇక్కడ మందుబాబులు ఎక్కువగా ఉంటారని స్థానికులు చెబుతున్నారు. ఆదివారం ఉదయం స్వీపర్‌ గొండు చిన్నమ్మడు వెనుక వైపు వెళ్లి చూడగా విగ్రహాలన్నీ కొన్ని చోట్ల విరిగిపోయి ఉండటం గమనించి అర్చకులకు తెలియజేసింది. అర్చకులు మహేంద్రాడ లక్ష్మణమూర్తి, కోదండరామాచార్యులు, చామర్తి రామగోపాలచార్యులు ఆలయ ఈఓకు, స్థానిక పెద్దలకు తెలియజేశారు. వాళ్లు పోలీసులకు సమాచారం అందజేశారు. రెండు ఆలయాల్లోని రెండు సీసీ కెమెరాలు గత పదిహేనురోజులుగా పనిచేయడం లేదు. ఘటన జరిగిన తర్వాత విరిగిపోయిన విగ్రహాలకు వెంటనే మరమ్మతులు చేపట్టడం సర్వత్రా చర్చనీయాంశమైంది. నరసన్నపేట గ్రూప్‌ టెంపుల్స్‌ ఇన్‌చార్జి ఈఓ మాధవి విగ్రహాల ధ్వంసంపై గార పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. హిందూ సంఘాల నిరసనఆలయాన్ని శ్రీకాకుళం డీఎస్పీ సీహెచ్‌ వివేకానంద పరిశీలించారు. విగ్రహాలను ధ్వంసం చేసిన వారిని గుర్తించి త్వరలోనే పట్టుకుంటామని పేర్కొన్నారు. ఆలయం చుట్టూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఆయన వెంట ఒకటో పట్టణ సీఐ పైడపునాయుడు, ఇన్‌చార్జి ఎస్‌ఐ ఎం.హరికృష్ణ ఉన్నారు. జిల్లా దేవదాయ ధర్మాదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ ప్రసాద్‌ పటా్నయిక్‌ ఆలయాన్ని పరిశీలించారు. విగ్రహాల ధ్వంసంపై విశ్వహిందూ పరిషత్, భజరంగదళ్‌ సభ్యులు ఆలయం వద్ద నిరసన చేపట్టారు. బీజేపీ మండల అధ్యక్షురాలు మైలపల్లి లక్ష్మీజనార్దన్, రాష్ట్ర నాయకులు పండి యోగీశ్వరరావు ఆలయాన్ని పరిశీలించారు.

Hyderabad Gulzar House Incident Related Details4
పిల్లలను తీసుకుని ఇంటికి రా తల్లీ.. సరదాగా వెళ్లారు..

రాజేంద్రనగర్‌/మణికొండ/బంజారాహిల్స్‌: ఆదివారం ఉదయం గుల్జార్‌హౌస్‌ అగ్నిప్రమాదంలో మృతిచెందిన 17 మందిలో 10 మృతదేహాలకు ఆదివారం సాయంత్రం ఒకేసారి అంత్యక్రియలు నిర్వహించారు. కుటుంబ పెద్ద ప్రహ్లాద్‌ మోదీ, ఆయన భార్య మున్నీ, కుమారుడు పంకజ్, కోడలు వర్ష, తమ్ముడు రాజేందర్‌ మోదీ, మరదలు సుమిత్ర, తమ్ముని కుమారుడు అభిషేక్, మనుమలు, మనమరాళ్లు అనుయాన్, ఇదిక, ఐరాజ్‌ల మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రిలో పోస్ట్‌మార్టం అనంతరం పురానాపూల్‌లోని శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. కాగా, ఈ ప్రమాదంలో బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.3లో నివసించే ఏడేళ్ల బాలిక హర్షాలి గుప్తా కన్నుమూశారు. ఆమె శరీరం పూర్తిగా కాలిపోవటంతో కుటుంబ సభ్యులు అస్తికలకు ఆదివారం మధ్యాహ్నం పంజాగుట్ట స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.పుట్టింటికి వెళ్లి మృత్యువాతసనత్‌నగర్‌: వేసవి సెలవులు కదా..? పిల్లలను తీసుకుని ఇంటికి రా.. తల్లీ! అని ఆ తండ్రి ఆశగా అడగడంతో కొడుకును తీసుకుని తన పుట్టిల్లు అయిన గుల్జార్‌హౌస్‌కు వెళ్లింది. అదృష్టవశాత్తూ తండ్రి పిలుపు మేరకు కొడుకు ముందు రోజు రాత్రే వెళ్లిపోగా, తల్లి అగ్ని ప్రమాదంలో మృత్యువాత పడింది. దీంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. వస్త్ర వ్యాపారి వినోద్‌కుమార్‌ అగర్వాల్‌ తన భార్య రజనీ అగర్వాల్‌ (45), కొడుకు కుషాల్‌ అగర్వాల్, కుమార్తె తనూలతో కలిసి సనత్‌నగర్‌లో ఉంటున్నాడు. కుమార్తె ముంబైలో ఎంబీఏ చదువుతుండగా, కుమారుడు కుషాల్‌ ఇంటర్మీడియెట్‌ చదువుతున్నాడు. ఈ క్రమంలో కుమారుడు కుషాల్‌ను తీసుకుని రజని గుల్జార్‌ హౌస్‌కు వెళ్లింది. అయితే కుషాల్‌ ముందు రోజు రాత్రి ఇంటికి వచ్చేశాడు. అక్కడే ఉన్న రజని మాత్రం ఆదివారం జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించింది.సరదాగా వెళ్లారు.. శవాలై వచ్చారురహమత్‌నగర్‌: బంధువులతో సరదాగా గడపాలని వెళ్లారు. శవాలుగా తిరిగొచ్చారు. ఒకే కుటుంబంలో ముగ్గురు మృత్యువాత పడటం ఎర్రగడ్డ డివిజన్‌ రాజీవ్‌నగర్‌ బస్తీ వాసులను కలచి వేసింది. గుల్జార్‌ హౌస్‌ ఆగ్ని ప్రమాదంలో రాజీవ్‌నగర్‌కు చెందిన తల్లి, కొడుకు, కుమార్తె మృతి చెందారు. ఆటో మొబైల్స్‌ వ్యాపారం చేసే రాజేష్‌ జైన్‌ రాజీవ్‌నగర్‌లో ఉంటున్నారు. ఆయనకు భార్య శీతల్‌ (35), ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కాగా శనివారం ఉదయం శీతల్‌ తన తండ్రి ఇంటికి పిల్లల్ని తీసుకుని వెళ్లింది. అయితే పెద్ద కుమార్తె రాశి తాను చదువుకోవాలంటూ శనివారం సాయంత్రమే రాజీవ్‌నగర్‌ లోని తమ నివాసానికి తిరిగి వచ్చింది. అక్కడే ఉండిపోయిన శీతల్, అరుషి, రిషబ్‌ మాత్రం ప్రమాదంలో చనిపోయారు.

IPL 2025: Shreyas Iyer Creates History After Punjab Kings Qualify For Playoffs Following Win Over Rajasthan Royals5
IPL 2025: చరిత్ర సృష్టించిన శ్రేయస్‌ అయ్యర్‌

ఐపీఎల్‌ చరిత్రలో అత్యంత విజయవంతమైన సారధుల్లో ఒకడైన శ్రేయస్‌ అయ్యర్‌ మరో కలికితురాయిని తన కీర్తి కిరీటంపై అమర్చుకున్నాడు. ఐపీఎల్‌ చరిత్రలో మూడు వేర్వేరు ఫ్రాంచైజీలను ప్లే ఆఫ్స్‌కు చేర్చిన తొలి, ఏకైక కెప్టెన్‌గా రికార్డు సాధించాడు. 2020 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను రన్నరప్‌గా నిలబెట్టిన శ్రేయస్‌.. గత సీజన్‌లో (2024) కేకేఆర్‌ను ఛాంపియన్‌గా నిలిపాడు. ఈ సీజన్‌లో పంజాబ్‌ ఫ్రాంచైజీ శ్రేయస్‌పై భారీ అంచనాలతో ఐపీఎల్‌ చరిత్రలోనే రెండో అత్యధిక ధర (రూ. 26.75 కోట్లు) వెచ్చించి సొంతం చేసుకుంది. అంచనాలకు తగ్గట్టుగానే శ్రేయస్‌ తన తొలి ప్రయత్నంలోనే పంజాబ్‌ను ప్లే ఆఫ్స్‌కు చేర్చాడు. నిన్న (మే 18) రాజస్థాన్‌ రాయల్స్‌పై విజయం సాధించడంతో పంజాబ్‌ ప్లే ఆఫ్స్‌కు చేరింది. ఆ జట్టు 11 ఏళ్ల తర్వాత ఈ ఘనత సాధించింది. చివరిగా 2014 సీజన్‌లో పంజాబ్‌ ప్లే ఆఫ్స్‌కు చేరింది. ఇప్పుడు తిరిగి శ్రేయస్‌ నేతృత్వంలో మరోసారి నాకౌట్‌ దశకు అర్హత సాధించింది. శ్రేయస్‌ తనుకు మాత్రమే సాధ్యమైన వైవిధ్యభరితమైన కెప్టెన్సీతో పంజాబ్‌ను ప్లే ఆఫ్స్‌కు చేర్చాడు. ఈ సీజన్‌లో పంజాబ్‌ శ్రేయస్‌ నేతృత్వంలో ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచ్‌ల్లో 8 విజయాలు (ఓ మ్యాచ్‌ రద్దు) సాధించి 17 పాయింట్లతో (0.389) పట్టికలో మూడో స్థానంలో ఉంది. ప్లే ఆఫ్స్‌కు ముందు ఆ జట్టు మరో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లు పట్టికలో పంజాబ్‌ స్థానాన్ని డిసైడ్‌ చేస్తాయి. పంజాబ్‌ తమ చివరి రెండు లీగ్‌ మ్యాచ్‌ల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌ (మే 24), ముంబై ఇండియన్స్‌తో (మే 26) తలపడాల్సి ఉంది.కాగా, నిన్న రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ 10 పరుగుల తేడాతో విజయం సాధించి, సీజన్‌లో ఎనిమిదో విజయం నమోదు చేసింది. ఈ సీజన్‌లో చాలా మ్యాచ్‌ల్లో లాగే రాజస్థాన్‌ ఈ మ్యాచ్‌లోనూ గెలిచే స్థితిలో ఉండి ఓటమిపాలైంది. చివరి రెండు ఓవర్లలో కేవలం 30 పరుగులు మాత్రమే చేయాల్సి ఉండగా.. 19 పరుగులకు మాత్రమే పరిమితమైంది.బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌పై తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ భారీ స్కోర్‌ (219/5) చేసింది. నేహల్‌ వధేరా (37 బంతుల్లో 70; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు), శశాంక్‌ సింగ్‌ (30 బంతుల్లో 59 నాటౌట్‌; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) దంచి కొట్టారు. ప్రభ్‌సిమ్రన్‌ (21), శ్రేయస్‌ అయ్యర్‌ (30), అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌ (21 నాటౌట్‌) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించగా.. ప్రియాంశ్‌ ఆర్య (9), మిచెల్‌ ఓవెన్‌ (0) విఫలమయ్యారు. రాయల్స్‌ బౌలర్లలో తుషార్‌ దేశ్‌పాండే 2, మపాకా, రియాన్‌ పరాగ్‌, ఆకాశ్‌ మధ్వాల్‌ తలో వికెట్‌ తీశారు.అనంతరం భారీ లక్ష్యఛేదనకు దిగిన రాజస్తాన్‌ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసి ఓడింది. ధ్రువ్‌ జురేల్‌ (31 బంతుల్లో 53; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), యశస్వి జైస్వాల్‌ (25 బంతుల్లో 50; 9 ఫోర్లు, 1 సిక్స్‌), వైభవ్‌ సూర్యవంశీ (15 బంతుల్లో 40; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) రాయల్స్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. అయితే ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ హర్‌ప్రీత్‌ బ్రార్‌ 3 వికెట్లు తీసి ఆ జట్టును దెబ్బకొట్టాడు. జన్సెన్‌, ఒమర్‌జాయ్‌ తలో రెండు వికెట్లు తీసి రాయల్స్‌ను దెబ్బకొట్టడంలో తమవంతు పాత్ర పోషించారు.

US Joe Biden Diagnosed With Aggressive Prostate Cancer6
బైడెన్‌కు ప్రొస్టేట్‌ క్యాన్సర్‌.. స్పందించిన ట్రంప్‌, కమలాహారిస్‌

వాషింగ్టన్‌: అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Biden) క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. బైడెన్‌ ప్రొస్టేట్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు తాజాగా ఆయన కార్యాలయం వెల్లడించింది. ఇటీవల ఆయనకు జరిపిన ఆరోగ్య పరీక్షల్లో క్యాన్సర్‌ నిర్ధరణ అయినట్లు చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు ట్రంప్‌ స్పందిస్తూ.. బైడెన్‌ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.వివరాల ప్రకారం.. అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రొస్టేట్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఇటీవల బైడెన్‌కు లక్షణాలు కనిపించడంతో పరీక్షలు నిర్వహించగా ఆయన ప్రొస్టేట్‌లో చిన్న కణతి ఏర్పడినట్లు గుర్తించారు. దీంతో, పరీక్షల్లో క్యాన్సర్‌ నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు ఆయన కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ క్యాన్సర్‌ తీవ్రత ఎక్కువగా ఉందని అందులో వెల్లడించింది. దీనికి సంబంధించి చికిత్స అందించే అంశంపై బైడెన్‌ కుటుంబసభ్యులు వైద్యులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది.ఈ నేపథ్యంలో అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలాహారిస్‌ స్పందించారు. బైడెన్‌ క్యాన్సర్‌ అనే విషయం తనను కలచి వేసిందని ట్విట్టర్‌ వేదికగా పేర్కొన్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో బైడెన్‌ కుటుంబానికి తాము అండగా ఉంటామని, ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. బైడెన్‌ పోరాట యోధుడని పేర్కొన్న ఆమె.. ఈ క్యాన్సర్‌ను ఆయన ధైర్యంగా ఎదుర్కొంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.Doug and I are saddened to learn of President Biden’s prostate cancer diagnosis. We are keeping him, Dr. Biden, and their entire family in our hearts and prayers during this time. Joe is a fighter — and I know he will face this challenge with the same strength, resilience, and… pic.twitter.com/gG5nB0GMPp— Kamala Harris (@KamalaHarris) May 18, 2025మరోవైపు.. బైడెన్‌కు క్యాన్సర్‌ నిర్ధారణ కావడంపై ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పందించారు. ఈ సందర్భంగా ట్రంప్‌.. ‘జో బైడెన్‌కు క్యాన్సర్‌ నిర్ధారణ కావడం దురదృష్టకరం. ఈ విషయం తెలిసి నేను, మెలానియా చాలా బాధపడ్డాం. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను’ అని చెప్పుకొచ్చారు. "Melania and I are saddened to hear about @JoeBiden’s recent medical diagnosis. We extend our warmest and best wishes to Jill and the family, and we wish Joe a fast and successful recovery." –President Donald J. Trump 🇺🇸 pic.twitter.com/6HjermTGK7— The White House (@WhiteHouse) May 18, 2025

ISRO 101st Mission fails as PSLV rocket suffers malfunction7
నాజిల్ సమస్యే!.. నాలుగో దశను కూల్చివేసిన ఇస్రో

పీఎస్ఎల్వీ.. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఇది నాలుగు అంచెల రాకెట్. ఈ రాకెట్‌లో తొలి, మూడో దశల్లో ఘన ఇంధనం వాడతారు. ఇక రెండు, నాలుగో దశల్లో ద్రవ ఇంధనం వినియోగిస్తారు. 101వ ఉపగ్రహం ‘రీశాట్-1బి’ని రోదసికి పంపేందుకు నేటి ‘శతాధిక’ ప్రయోగంతో కలిపి పీఎస్ఎల్వీతో ఇస్రో 63 ప్రయోగాలు నిర్వహించింది. వీటిలో ఈ రాకెట్ విఫలమైన సందర్భాలు మూడు. 2017 తర్వాత రాకెట్లో లోపం కనిపించడం ఇదే తొలిసారి. నిజానికి మూడో దశలో రాకెట్ ఫెయిల్ కావడం అరుదు. 114 సెకండ్లపాటు సాగే ఈ మూడో దశలో హెచ్టీపీబీ (హైడ్రాక్సిల్-టర్మినేటెడ్ పాలీబ్యూటడీన్) ఘన ఇంధన మోటార్ వాడతారు. ఈ ఇంధనం ఆదర్శ స్థితిలో 240 కిలో న్యూటన్ల చోదకశక్తి ఇస్తుంది. తాజా ప్రయోగ వైఫల్య కారణాలను నిగ్గుతేల్చేందుకు ఇస్రో నుంచి ఒకటి, ప్రభుత్వం నుంచి మరొకటి వంతున రెండు కమిటీలు రంగంలోకి దిగాయి. రాకెట్ వేగం, ఎత్తు, ఇంజిన్ల పనితీరు అంశాలపై అవి అధ్యయనం చేస్తాయి. మోటారులో ఇంధన ప్రవాహం సరిగా లేదా? నాజిల్ సమస్యలు తలెత్తాయా? మోటారు డిజైన్/తయారీపరమైన లోపాలున్నాయా? ఇలా పలు కోణాల్లో విశ్లేషణ కొనసాగనుంది. కచ్చితమైన కారణం ఇంకా తెలియనప్పటికీ... రాకెట్ మూడో దశలో మోటార్ కేస్ లోపలి చాంబర్ ప్రెజర్లో అకస్మాత్తుగా పీడనం తగ్గడానికి ఫ్లెక్స్ నాజిల్ నియంత్రణ వ్యవస్థలో తలెత్తిన లోపమే కారణమని ఇస్రో ప్రాథమిక నిర్ధారణకు వచ్చింది. రాకెట్ వేగం, చోదక దిశలను నిర్దేశించేది ఈ కీలక భాగమే. ‘కంబశ్చన్ చాంబర్’లో ఇంధనం దహనమై విపరీత పీడనంతో వేడి వాయువులు నాజిల్ గుండా వెలుపలికి తన్నుకొస్తేనే రాకెట్ ప్రయాణం ముందుకు (పైకి) సాగుతుంది. ఈ ‘చర్యకు ప్రతిచర్య’ అనే మౌలిక సూత్రం ఆధారంగానే రాకెట్ పనిచేస్తుంది. రబ్బరు లాంటి స్థితిస్థాపక గుణం (లేయర్డ్ ఎలాస్టోమెరిక్) గల పదార్థాల పొరలతో ఫ్లెక్సిబుల్ నాజిల్స్ తయారవుతాయి. హైడ్రాలిక్ శక్తిని యాంత్రిక శక్తిగా మార్చి తద్వారా వాల్వులను కదిలిస్తూ ద్రవ/వాయు ప్రవాహాలను నియంత్రించేందుకు సాధారణంగా హైడ్రాలిక్ యాక్చువేటర్లను వినియోగిస్తుంటారు. వీటి పనితీరు సంక్లిష్టంగా ఉంటుంది. అందుకే పీఎస్ఎల్వీ రాకెట్ మూడో దశ మోటారులో హైడ్రాలిక్ యాక్చువేటర్లు కాకుండా… పరిమిత కోణాల్లోనే అయినప్పటికీ అన్ని దిశల్లో కదులుతూ కచ్చితమైన చోదకశక్తిని అందించేందుకు ఫ్లెక్సిబుల్ బేరింగ్ గల ఫ్లెక్స్ నాజిల్స్ ఉపయోగిస్తున్నారు. ఈ వ్యవస్థలో ఉత్పన్నమైన సమస్య వల్లనే తాజా ప్రయోగం విఫలమైనట్టు అనుమానిస్తున్నారు. నాజిల్ యాక్చువేటర్లు, ఫ్లెక్సిబుల్ జాయింట్, కంట్రోల్ సిగ్నల్స్... వీటిలో ఏదో ఒక సమస్య ఏర్పడి చాంబర్ ప్రెజర్లో పీడనం తగ్గి, మరింత ఎత్తుకు ప్రయాణించడానికి చాలినంత చోదకశక్తి లభించక రాకెట్ గతి తప్పడం ఆరంభించింది. దాన్ని అలాగే వదిలేస్తే జనావాసాలపై కూలి ప్రాణ-ఆస్తి నష్టం సంభవించే అవకాశముంది. అందుకే భద్రతా నిబంధనల ప్రకారం ఇస్రో దాన్ని ‘మిడ్ ఎయిర్-అబార్ట్’ చేసింది. అంటే... రాకెట్లో పేలోడ్ (ఉపగ్రహం) ఉన్న చివరిదైన నాలుగో దశను వేరే దారి లేక ఇస్రో కూల్చివేయాల్సి వచ్చింది.-జమ్మల శ్రీకాంత్‌..

Naveen Polishetty Will BE Next Movie With Maniratnam8
నవీన్‌ పోలిశెట్టికి లక్కీచాన్స్‌ వరించనుందా..?

టాలీవుడ్ హీరో‌ నవీన్‌ పోలిశెట్టి జాక్‌పాట్‌ కొట్టబోతున్నారా? ఈ యువ నటుడికి డైరెక్టర్‌ మణిరత్నం దర్శకత్వంలో నటించే లక్కీచాన్స్‌ వరించనుందా..? ఈ క్రేజీ చిత్రంలో ఆ స్టార్‌ కథానాయకి నటించి ఉన్నారా..? దీనికి సంబంధించిన వార్తనే ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఇండియన్‌ సినిమా బుక్‌లో దర్శకుడు మణిరత్నం పేరు ఎప్పటికీ ప్రముఖంగానే ఉంటుంది. రజనీకాంత్, కమలహాసన్‌ వంటి ప్రముఖ నటులతో చిత్రాలు చేసి విజయాన్ని సాధించారు. ప్రస్తుతం కమలహాసన్, శింబు, త్రిష, అభిరామి వంటి ప్రముఖ నటీనటులు నటించిన థగ్‌ లైఫ్‌ చిత్రాన్ని తెరకెక్కించారు. ఏఆర్‌ రెహమాన్‌ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమం పూర్తి చేసుకుని జూన్‌ 5న ప్రపంచవ్యాప్తంగా తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. దీంతో తర్వాత చిత్రం ఏమిటన్న ప్రశ్నలకు పలు రకాల ప్రచారాలు సామాజిక మాధ్యమాల్లో హాల్‌చల్‌ చేస్తున్నాయి. తాజాగా నవీన్‌ పోలిశెట్టి హీరోగా తెలుగు, తమిళ భాషల్లో ఒక యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ కథా చిత్రాన్ని తెరకెక్కించడానికి మణిరత్నం సిద్ధం అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. నవీన్‌ పోలిశెట్టి ఇంతకుముందు తెలుగులో సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతిరత్నాలు, మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి వంటి సక్సెస్‌ చిత్రాల్లో నటించారు. తాజాగా మణిరత్నం దర్శకత్వం వహించే ద్విభాషా చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరో విషయం ఏమిటంటే ఇందులో సాయిపల్లవి కథానాయకిగా నటింపచేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. అయితే ఇందులో నిజం ఎంత అన్నది అధికారిక పర్యటన వెలువడే వరకు వేచి చూడాల్సిందే.

India smartphone exports soar surpassing petroleum diamonds in FY259
వజ్రాలను మించిపోయిన స్మార్ట్‌ఫోన్లు!

న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్ల ఎగుమతులు మంచి జోరు చూపిస్తున్నాయి. ముఖ్యంగా అమెరికాకు ఐదు రెట్లు, జపాన్‌కు నాలుగు రెట్లకు మించి స్మార్ట్‌ఫోన్ల ఎగుమతులు గత మూడేళ్లలో పెరిగినట్టు ప్రభుత్వ డేటా తెలియజేస్తోంది. పెట్రోలియం ఉత్పత్తులు, వజ్రాలను వెనక్కి నెట్టేసి ఎగుమతుల్లో టాప్‌ స్థానానికి స్మార్ట్‌ఫోన్లు చేసుకున్నాయి. 2024–25 ఆర్థిక సంవత్సరంలో 24.14 బిలియన్‌ డాలర్ల విలువైన (రూ.2.05 లక్షల కోట్లు) స్మార్ట్‌ఫోన్ల ఎగుమతులు నమోదయ్యాయి. 2023–24లో 15.57 బిలియన్‌ డాలర్ల ఎగుమతులతో పోల్చి చూస్తే 55 శాతం పెరిగాయి. 2022–23లో స్మార్ట్‌ ఫోన్ల ఎగుమతులు 10.96 బిలియన్‌ డాలర్లుగా ఉండడం గమనార్హం. గత ఆర్థిక సంవత్సరంలో ప్రధానంగా యూఎస్, నెదర్లాండ్స్, ఇటలీ, జపాన్, చెక్‌ రిపబ్లిక్‌ దేశాలకు భారత స్మార్ట్‌ఫోన్ల ఎగుమతుల్లో అధిక వృద్ధి నమోదైంది. ఒక్క అమెరికాకే గత ఆర్థిక సంవత్సరంలో 10.6 బిలియన్‌ డాలర్ల స్మార్ట్‌ఫోన్ల ఎగుమతులు జరిగాయి. 2023–24లో 5.57 బిలియన్‌ డాలర్లుగా ఉంటే, 2022–23లో అమెరికాకు స్మార్ట్‌ ఫోన్ల ఎగుమతులు 2.16 బిలియన్‌ డాలర్ల చొప్పున ఉన్నాయి. జపాన్‌ విషయంలోనూ గణనీయమైన వృద్ధి నమోదైంది. 2022–23లో జపాన్‌కు స్మార్ట్‌ఫోన్ల ఎగుమతులు 120 మిలియన్‌ డాలర్లుగా ఉంటే, 2024–25లో 520 మిలియన్‌ డాలర్లకు పెరిగాయి. తయారీ, ఎగుమతులకు కేంద్రం దేశ అగ్రగామి ఎగుమతుల్లో స్మార్ట్‌ఫోన్లు కూడా చేరినట్టు, పెట్రెలియం ఉత్పత్తులు, వజ్రాల ఎగుమతులను మొదటిసారి అధిగమించినట్టు వాణిజ్య శాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు. ముఖ్యంగా గత మూడేళ్లలో బలమైన వృద్ధి నమోదైనట్టు.. దీంతో అంతర్జాతీయంగా స్మార్ట్‌ఫోన్ల తయారీ, ఎగుమతులకు భారత్‌ ప్రధాన కేంద్రంగా అవతరించినట్టు చెప్పారు. పీఎల్‌ఐ కింద స్మార్ట్‌ఫోన్ల తయారీకి కేంద్రం రాయితీలు ఇస్తుండడం తెలిసిందే. ఇక నెదర్లాండ్స్‌కు గత ఆర్థిక సంవత్సరంలో 2.2 బిలియన్‌ డాలర్ల స్మార్ట్‌ఫోన్ల ఎగుమతులు జరిగాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులు 1.07 బిలియన్‌ డాలర్లతో పోలి్చతే రెట్టింపయ్యాయి. ఇటలీకి సైతం 720 మిలియన్‌ డాలర్ల నుంచి గత ఆర్థిక సంవత్సరంలో 1.26 బిలియన్‌ డాలర్లకు పెరిగాయి. చెక్‌ రిపబ్లిక్‌కు 650 మిలియన్‌ డాలర్ల నుంచి 1.17 బిలియన్‌ డాలర్ల విలువైన స్మార్ట్‌ఫోన్ల ఎగుమతులు గత ఆర్థిక సంవత్సరంలో పెరిగినట్టు వాణిజ్య శాఖ డేటా తెలియజేస్తోంది.

Farmer Desperate Bid To Save Crop Amid Rain10
వీడియో: కంటతడి పెట్టించిన రైతు కష్టం.. స్పందించిన కేంద్రమంత్రి

ముంబై: ఇటీవల కురుస్తున్న అకాల వర్షాల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆరుగాలం కష్టించి పంట చేతికి వచ్చిన సమయంలో వర్షాలు కురుస్తుండటంతో పంటను కాపాడుకునేందుకు ఎంతో కష్టపడుతున్నారు. తాజాగా వర్షం నీటిలో కొట్టుకుపోతున్న పంటను కాపాడేందుకు ఓ రైతు పడిన కష్టం వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియోపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ స్పందించారు. ఈ క్రమంలో బాధితుడితో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు.వివరాల ‍ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన రైతు గౌరవ్‌ పన్వార్‌ తన వేరుశనగ పంటను అమ్ముకోవడానికి వాషిమ్‌ మార్కెట్‌కు తీసుకొచ్చాడు. ఈ సందర్భంగా భారీ వర్షం కురవడంతో పంట నీటిలో కొట్టుకొనిపోయింది. దీంతో రైతు గౌరవ్‌ భారీ వర్షంలో తడుస్తూనే కొట్టుకుపోతున్న వేరుశనగను కాపాడేందుకు శాయశక్తులా ప్రయత్నించాడు. కానీ, వరద నీటిలో పంట కొట్టుకొనిపోయింది. ఈ హృదయవిదారక వీడియో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ దృష్టికి రావడంతో.. స్వయంగా ఆయనే బాధిత రైతుకు ఫోన్‌ చేసి మాట్లాడారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.ఈ సందర్భంగా మంత్రి శివరాజ్‌ సింగ్‌ వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేశారు. వీడియోలో మాట్లాడుతూ..‘ఈ విషయం నన్ను చాలా బాధించింది. నష్టపోయిన పంటకు పరిహారం చెల్లిస్తాం. మీరు, మీ కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడకుండా చూస్తాం. మహారాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యలపై చాలా సున్నితంగా వ్యవహరిస్తోంది. దీనిపై సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి, జిల్లా కలెక్టర్‌తో మాట్లాడాను. అంతా మంచే జరుగుతుంది’ అని అన్నారు. ▶️ This video will touch your heart.➡️ Union Minister for Agriculture and Farmers' Welfare and Rural Development, Shivraj Singh Chouhan says - “Seeing Gaurav Panwar’s video shook my heart. I spoke to him and assured support. No farmer will be left unheard - we stand… pic.twitter.com/N96OAq3zNO— Saurabh Dandariyal (@DandariyalUk) May 18, 2025

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement