Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

BCCI Set To Pull Out From Asia Cup, As Pakistan Minister Heading Asian Cricket Body1
బీసీసీఐ కీలక నిర్ణయం.. ఆసియా కప్‌కు టీమిండియా దూరం

పాక్‌తో ఉ‍ద్రిక్త పరిస్థితలు నేపథ్యంలో భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్‌ మంత్రి నేతృత్వం వహిస్తున్న ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ (ఏసీసీ) నిర్వహించే ఈవెంట్లలో పాల్గొనకూడదని డిసైడ్‌ చేసుకుంది. ఏసీసీ ఆథ్వర్యంలో జరిగే ఈవెంట్లలో భారత క్రికెట్‌ జట్లు (పురుషులు, మహిళలు) పాల్గొనవని స్పష్టం చేసింది. వచ్చే నెలలో శ్రీలంకలో జరిగే మహిళల ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్‌,ఆ తర్వాత సెప్టెంబర్‌లో భారత్‌ వేదికగా జరగాల్సిన ద్వైవార్షిక పురుషుల ఆసియా కప్ నుండి వైదొలుగుతున్నట్లు పేర్కొంది. ఈ విషయాన్ని ఏసీసీకి కూడా తెలియజేసింది. క్రికెట్‌కు సంబంధించి పాక్‌ను ఒంటరి చేయడమే లక్ష్యంగా ఈ చర్యకు ఉపక్రమించినట్లు తెలుస్తుంది.కాగా, పాకిస్తాన్‌కు చెందిన మంత్రి మొహిసిన్‌ నఖ్వీ ఇటీవలే ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ (ఏసీసీ) చైర్మన్‌గా ఎన్నికయ్యాడు. నఖ్వీ పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డుకు (పీసీబీ) కూడా చైర్మన్‌గా వ్యవహరిస్తూ, జోడు పదవులను అనుభవిస్తున్నాడు. ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌లో భారత్‌, పాకిస్తాన్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌, ఆఫ్ఘనిస్తాన్‌ సభ్య దేశాలుగా ఉన్నాయి. రోస్టర్‌ విధానంలో ఏసీసీ చైర్మన్‌ ఎంపిక జరుగుతుంది. ఈ క్రమంలో ఈ దఫా పాకిస్తాన్‌కు అవకాశం వచ్చింది. అంత​కుముందు ఏసీసీ చైర్మన్‌గా ప్రస్తుత ఐసీసీ అధ్యక్షుడు జై షా ఉండేవాడు. షా.. ఐసీసీ పదవి చేపట్టాల్సి ఉండటంతో ఏసీసీ చైర్మన్‌గిరికి ముందుగానే రాజీనామా చేశాడు. ఇదిలా ఉంటే, భారత్‌ పురుషుల ఆసియా కప్‌ను బాయ్‌కాట్‌ చేయాలని నిర్ణయించుకోవడంతో ఆ టోర్నీపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ టోర్నీ భారత్‌లోనే జరగాల్సి ఉన్నా పాక్‌ మంత్రి ఏసీసీ చైర్మన్‌గా ఉన్నందుకు బీసీసీఐ ససేమిరా అంటుంది. ఆసియా కప్‌లో భారత్‌ పాల్గొనపోతే టోర్నీ జరగడం దాదాపుగా అసాధ్యం. ఎందుకంటే అంతర్జాతీయ క్రికెట్‌ ఈవెంట్లకు స్పాన్సర్లలో ఎక్కువ మంది భారత్‌కు చెందిన వారే ఉన్నారు. వీరు స్పాన్సర్‌షిప్‌కు ముందుకు రాకపోతే టోర్నీ జరుగదు.పెహల్గామ్‌ దాడితో మొదలు..ఏప్రిల్‌ 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో గల ప్రశాంత బైసరన్‌ లోయలో పాక్‌ ఉగ్రమూకలు కాల్పులకు తెగబడి 26 మంది పర్యాటకులను పొట్టన పెట్టుకున్నాయి. ఈ దాడి తర్వాత భారత్‌ ఆపరేషన్‌ సిందూర్‌ పేరిట పాక్‌లో తలదాచుకున్న ఉగ్రమూకలపై దాడి చేసింది. భారత్‌ దాడులకు పాక్‌ బదులిచ్చే ప్రయత్నం చేయగా.. భారత బలగాలు వారికి తగు రీతిలో బుద్ది చెప్పాయి. తదనంతరం పరిణామాల్లో భారత్‌, పాక్‌ కాల్పుల విరమణ ఒప్పందాన్ని చేసుకున్నాయి.

Kolikapudi Srinivasa Rao Over Acton AT Tiruvuru2
తిరువూరులో ఎమ్మెల్యే కొలికపూడి హల్‌చల్‌

సాక్షి, ఎన్టీఆర్: తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వేళ టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఓవరాక్షన్‌కు దిగారు. ఎమ్మెల్యే, టీడీపీ శ్రేణులు బారికేడ్లు తోసుకుని, పోలీసులను నెట్టుకుంటూ మున్సిపల్ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లారు. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ నేతలు, పార్టీ శ్రేణులతో వాగ్వాదానికి దిగారు.తిరువూరులో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ హల్‌చల్‌ చేశారు. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వేళ వైఎస్సార్‌సీపీ నేతలను మున్సిపల్ కార్యాలయంలోకి వెళ్లకుండా టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్, టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. ఇదే సమయంలో బారికేడ్లు తోసుకుని, పోలీసులను నెట్టుకుంటూ కొలికపూడి, టీడీపీ నేతలు మున్సిపల్ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లారు. పోలీసులు వారిని అడ్డుకున్నప్పటికీ వారినే బెదిరిస్తూ లోపలికి దూసుకెళ్లారు. దీంతో, వాగ్వాదం జరిగింది.మరోవైపు.. వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లకు మద్దతుగా పార్టీ నేతలు దేవినేని అవినాష్, మొండితోక అరుణ్ కుమార్, నల్లగట్ల స్వామిదాస్, షేక్ ఆసిఫ్ తిరువూరు చేరుకున్నారు. ఇదిలా ఉండగా.. నేడు.. తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. ఎన్నికల కోసం బలం లేకపోయినా గెలవాలని కూటమి కుట్రలు చేస్తో​ంది. మరోవైపు.. తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వేళ వైఎస్సార్‌సీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. తిరువూరు వెళ్లొద్దంటూ వైఎస్సార్‌సీపీ నేతలపై పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు.

Pak Spy YouTuber Jyoti Malhotra Case Full Details3
జ్యోతి మల్హోత్రా కేసులో సంచలన విషయాలు.. హైదరాబాద్‌, పూరీలో ఏం జరిగింది?

ఢిల్లీ: దాయాది పాకిస్తాన్‌కు గూఢచర్యం చేస్తూ పలువురు భారతీయులు అరెస్ట్‌ అవుతున్నారు. ఇప్పటికే హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్ట్‌ కాగా, తాజాగా యూపీకి చెందిన షహజాద్ అనే వ్యక్తిని.. అధికారులు అరెస్టు చేశారు. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా విడుదల చేశారు. ఉత్తరప్రదేశ్‌లో ఉంటూ పాకిస్తాన్ కు కీలక సమాచారాన్ని అందిస్తున్నట్లు గుర్తించి అతన్ని అరెస్టు చేశారు. మరోవైపు.. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. హైదరాబాద్‌లోనూ జ్యోతి మల్హోత్రా జాడలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసు విచారణలో పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పహల్గాంలో ఉగ్రదాడి (Pahalgam Terror Attack) జరగడానికి కొన్ని నెలల ముందు ఆమె ఆ ప్రాంతానికి వెళ్లినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఒకసారి చైనాకూ వెళ్లొచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. పహల్గాం సమాచారాన్ని పాక్‌ ఏజెంట్లకు చేరవేసి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. పాకిస్తాన్‌ ఐఎస్‌ఐతో సంబంధాలున్న ఆ దేశ హైకమిషన్‌ ఉద్యోగి డానిష్‌తో జ్యోతికి సన్నిహిత సంబంధాలున్నట్లు తెలిసింది. ‘ఆపరేషన్‌ సిందూర్‌’ అనంతరం నెలకొన్న ఉద్రిక్తతల సమయంలో ఆమె ఢిల్లీలోని పాక్‌ రాయబార కార్యాలయంలోని అధికారి డానిష్‌తో టచ్‌లో ఉన్నట్లు నిర్ధరించారు. జ్యోతిని అతడు ట్రాప్‌ చేసినట్లు గుర్తించారు. దీనిపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. Jyoti Malhotra met Mariyam Nawaz in Pakistan, Hindu influencers are trapped by ISI, Sources claimed ISI motto is to prepare a Hindu to do terrorist attack in IndiaNaam : Jyoti MalhotraKaam : Gaddari A Woke Girl Can never be a True Patriot!!#JyotiMalhotra #YouTuber pic.twitter.com/7H5mPMgoeb— Sumit (@SumitHansd) May 17, 2025హైదరాబాద్‌తో టచ్‌లో..జ్యోతి మల్హోత్రా జాడలు హైదరాబాద్‌లోనూ కనిపించాయి. 2023 సెప్టెంబరులో ప్రధాని మోదీ వర్చువల్‌గా హైదరాబాద్‌-బెంగళూరు వందేభారత్‌ రైలును ప్రారంభించిన సమయంలో ఆమె హడావుడి చేశారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో అప్పటి గవర్నర్‌ తమిళిసైతోపాటు కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ పాల్గొన్న కార్యక్రమంలో యూట్యూబర్‌గా వీడియోలు చేస్తూ హల్‌చల్‌ చేశారు. తాజాగా ఆమె అరెస్ట్‌ కావడంతో అప్పటి ఆమె వీడియోలు, చిత్రాలు తాజాగా సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే, హైదరాబాద్‌ వచ్చిన సమయంలో ఆమె ఎవరినైనా కలిశారా? కలిస్తే అక్కడ ఏమైనా వీడియోలు తీశారా? అన్న కోణాల్లో నిఘా వర్గాలు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది.YouTuber से जासूस तक: Jyoti Malhotra का चौंकाने वाला सफर #JyotiMalhotraArrested #JyotiMalhotraYoutuber #jyotimalhotra pic.twitter.com/UJ2PkufpSA— Rubika liyaquat (@RubikaLiyakatFC) May 19, 2025పూరీలోనూ జాడలు..ఇదిలా ఉండగా.. తాజాగా జ్యోతి మల్హోత్రాతో పూరీకి చెందిన మరో యూట్యూబర్‌ ప్రియాంక సేనాపతికి ఉన్న సంబంధంపై ఒడిశా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పాక్‌కు గూఢచర్యం కేసులో జ్యోతితోపాటు ఆమెకు సహకరించిన మరో ఆరుగురిని హర్యానా పోలీసులు అరెస్టు చేశారు. నిందితురాలి సోషల్‌ మీడియా ఖాతాలను పరిశీలించగా, ఆమెకు ఒడిశాలోని పూరీకి చెందిన ప్రియాంకతో సన్నిహిత సంబంధాలున్నట్లు గుర్తించారు. ఆ విషయాన్ని పూరీ పోలీసు యంత్రాంగానికి తెలియజేయడంతో ఎస్పీ వినీత్‌ అగర్వాల్‌ ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు.News Flash 🔴 ବେଶ୍ ନିବିଡ଼ ଥିଲା ଜ୍ୟୋତି ଓ ପ୍ରିୟଙ୍କାଙ୍କ ସମ୍ପର୍କ❗ପାକିସ୍ତାନ ପାଇଁ ଗୁପ୍ତଚରୀ ଅଭିଯୋଗରେ ଗିରଫ ୟୁଟ୍ୟୁବର ଜ୍ୟୋତି ମାଲହୋତ୍ରା ଲିଙ୍କର ଖୋଳତାଡ଼, ପୁରୀର ୟୁଟ୍ୟୁବର ପ୍ରିୟଙ୍କା ସେନାପତିଙ୍କୁ ଇଣ୍ଟେଲିଜେନ୍ସ ବ୍ୟୁରୋ ପରେ ପୁରୀ ପୋଲିସର ପଚରାଉଚରା ସୂଚନା #ONL #Jyoti #PriyankaSenapati #Puri #Odisha pic.twitter.com/WSbg7BziAi— OdishaNewsLive (@OdishaNews_Live) May 18, 2025 2024 సెప్టెంబరు 26న పూరీ వచ్చిన జ్యోతి.. ఇక్కడి శ్రీక్షేత్రాన్ని సందర్శించినట్లు తెలిసింది. స్థానికంగా ఓ హోటల్లో ఉన్న ఆమె దర్శనీయ ప్రాంతాలకు వెళ్లారు. ఆ సమయంలో ప్రియాంక ఆమెతో కలిసి తిరిగారు. శ్రీక్షేత్రంపై ఉగ్రవాదుల కళ్లున్నాయని కేంద్ర ఇంటెలిజెన్స్‌ వర్గాలకు సమాచారం ఉంది. ఈ పరిస్థితిలో జ్యోతి జగన్నాథస్వామి దర్శనానికి వచ్చారా? లేక రెక్కీ చేసి, పాక్‌కు ఏదైనా సమాచారం అందించారా? అన్న దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక, ప్రియాంక మూడు నెలల క్రితం పాక్‌లోని కర్తార్‌పుర్‌ను సందర్శించారు. ఈ నేపథ్యంలో ఆమె ఆ దేశానికి ఎందుకు వెళ్లారు? అక్కడ ఏం చేశారు? ఎవరెవర్ని కలిశారు? అన్న అంశాలు కీలకంగా మారాయి.Puri: IB questioned Odisha YouTuber Priyanka Senapati over suspected Pakistan ties, following Jyoti Malhotra's espionage arrest. Jyoti had visited Puri last year, including the Jagannath Temple, raised security concerns due to sensitive footage.#JyotiMalhotra #PriyankaSenapati pic.twitter.com/MTjO5EuYh8— Ishani K (@IshaniKrishnaa) May 18, 2025 BIG BREAKING 🚨#YouTuber Jyoti Malhotra was arrested on charges of Spying for Pakistan.📍Pakistan Link According to an FIR, #JyotiMalhotra met Ehsan-ur-Rahim alias Danish, a Pakistan High Commission staffer in New Delhi, in 2023. Danish, her alleged handler, connected her… pic.twitter.com/dNRKDq5ogP— তন্ময় l T͞anmoy l (@tanmoyofc) May 17, 2025

AP govt failed to supply seeds4
విత్తు.. సర్కారు ప్రణాళిక చిత్తు

గతంలో ఈపాటికే విత్తనాలిచ్చారునాకు నాలుగెకరాలు సొంత భూమి ఉంది. మరో నాలుగెకరాలు కౌలుకు తీసుకొని వేరుశనగ సాగు చేస్తున్నా. గతంలో ఈ పాటికే విత్తనాల కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకోవడమే కాదు. విత్తనాలు పంపిణీ కూడా పూర్తయ్యేది. ఈ ఏడాది రైతు సేవా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్‌ చేయించుకోవడం లేదు. విత్తనాలు ఎప్పుడు వస్తాయో కూడా చెప్పే నాథుడు లేడు. బయట మార్కెట్‌లో కొందామంటే ధరలు మండిపోతున్నాయి. పైగా నాణ్యమైనవి దొరుకుతాయో లేదో తెలియడం లేదు. – బోయ ఓబులేసు, ఉదిరిపికొండ, కూడేరు మండలం, అనంతపురం జిల్లా⇒ ఇతని పేరు బొంతల హరీష్. శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం లింగారెడ్డిపల్లె గ్రామం. సొంతంగా మూడెకరాలు, కౌలుకు రెండెకరాలు.. పూర్తిగా వర్షాధారంపై ఆధారపడి సాగు చేస్తున్నాడు. 15 ఏళ్లుగా వేరుశనగ పంట వేస్తున్నాడు. ఎకరాకు 80 నుంచి 100 కిలోల విత్తనం కావాలి. బహిరంగ మార్కెట్‌లో క్వింటా రూ.12 వేలకు పైగానే ఉంది. ఐదెకరాలకు రూ.60 వేలు ఖర్చు చేయాల్సి ఉంది. ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేసే పరిస్థితి ఇతనికి లేదు. గత ఖరీఫ్‌లో మే మొదటి వారంలోనే విత్తనాలు ఆర్బీకేల ద్వారా ఇచ్చారు. గతేడాది ఈపాటికే విత్తుకోవడం పూర్తయింది.పంట ఏపుగా ఎదిగినా కోతకొచ్చే సమయానికి వర్షాల కారణంగా పంట పూర్తిగా దెబ్బతిన్నది. ఐదెకరాలకు 3 క్వింటాళ్ల దిగుబడి కూడా రాలేదు. రూ.60 వేలకుపైగా నష్టపోయాడు. రబీలో పంట వేయలేదు. ఈ ఏడాది ప్రారంభంలోనే వర్షాలు పడుతుండడంతో అదును దాటిపోకుండా విత్తుకోవాలని చూస్తున్నాడు. ఇప్పటికే పలుమార్లు రైతు సేవా కేంద్రాల వద్దకు వెళ్లినా రిజి్రస్టేషన్‌ చేసుకోవడం లేదని, ఎప్పుడు ఇస్తారో కూడా చెప్పడం లేదని వాపోతున్నాడు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ పంటలు సాగు చేస్తున్న రైతులందరి పరిస్థితి ఈ విధంగానే ఉంది.సాక్షి, అమరావతి: అన్నదాతలకు అడుగడుగునా అండగా నిలవాల్సిన కూటమి ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వారిపై కక్ష కట్టినట్లు వ్యవహరిస్తోంది. అదును సమయంలో వారికి పెట్టుబడి సాయం అందించకపోగా, సబ్సిడీ విత్తనాలు సైతం ఇవ్వకుండా కష్టాలపాలు చేస్తోంది. మరో పది రోజుల్లో ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం కాబోతున్నా, విత్తన సరఫరా మొదలు కాకపోవడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. నాన్‌ సబ్సిడీ విత్తన పంపిణీకి గతేడాది మంగళం పాడిన కూటమి ప్రభుత్వం.. ఈ ఏడాది సబ్సిడీ విత్తన పంపిణీలోనూ రైతులను ముప్పుతిప్పలు పెడుతోంది. దాదాపు ఆరు రకాల సబ్సిడీ విత్తనాల పంపిణీని నిలిపి వేయడమే కాకుండా, మిగిలిన సబ్సిడీ విత్తనాల పంపిణీలోనూ అడ్డగోలుగా కోత పెట్టింది. గతేడాది బకాయిలు చెల్లిస్తే కానీ విత్తన సరఫరా చేయలేమని ఓ వైపు కంపెనీలు తెగేసి చెబుతున్నాయి. దీంతో ఈ ఏడాది సబ్సిడీ విత్తనాలు రైతులకు దొరికే పరిస్థితి కనిపించడం లేదు. రైతుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును అధికార పార్టీ ఎమ్మెల్యేలు సైతం తప్పు పడుతున్నారంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గత ప్రభుత్వం ఏటా వ్యవసాయ సీజన్‌కు ముందే తొలి విడత పెట్టుబడి సాయం అందించడంతో పాటు ఎవరికి ఏ మేరకు విత్తనం కావాలో ముందుగానే ఆర్డర్‌ తీసుకుని ఆర్బీకేల ద్వారా సరఫరా చేసేదని రైతులు గుర్తు చేసుకుంటున్నారు. పెట్టుబడి సాయం రూ.13,500 కాకుండా ఏకంగా రూ.20 వేలు ఇస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం తమను మభ్యపెడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరిపడా సబ్సిడీ విత్తనం లేదు.. పెట్టుబడి సాయమూ లేదని ఊరూరా అన్నదాతలు బావురుమంటున్నారు. ఇంకా ఖరారు కాని సబ్సిడీలు ⇒ ఖరీఫ్‌ సాధారణ విస్తీర్ణం 77.87 లక్షల ఎకరాలు కాగా, ఈ ఏడాది 86.47 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యంగా నిర్ధేశించారు. ప్రధానంగా 38.87 లక్షల ఎకరాల్లో వరి, 14.30 లక్షల ఎకరాల్లో వేరుశనగ, 14.10 లక్షల ఎకరాల్లో పత్తి, 9.35 లక్షల ఎకరాల్లో అపరాలు సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏటా 40% సబ్సిడీపై వేరుశనగ, 30% సబ్సిడీపై పెసర, మినుము, కంది, 50% సబ్సిడీపై కొర్ర, రాగి, అండుకొర్రలు వంటి చిరుధాన్యపు విత్తనాలను సరఫరా చేస్తుంటారు. ⇒ వరి విత్తనాలను మాత్రం జాతీయ ఆహార ధాన్యాల భద్రతా పథకం అమలయ్యే జిల్లాల్లో కిలోకి రూ.10, ఇతర జిల్లాల్లో రూ.5 చొప్పున రాయితీతో సరఫరా చేస్తారు. ఏజెన్సీ జిల్లాలో మాత్రం 90% సబ్సిడీపై వరితో సహా అన్ని రకాల విత్తనాలను పంపిణీ చేస్తారు. ఏటా మార్చిలో పంటల వారీగా నిర్ధేశించిన సాగు లక్ష్యాలకనుగుణంగా జిల్లాల వారీగా ఇండెంట్‌ సేకరిస్తారు. ⇒ గ్రామీణ విత్తనోత్పత్తి పథకం కింద ఉత్పత్తి అయ్యే విత్తనాన్ని దృష్టిలో పెట్టుకొని మిగిలిన విత్తనాల కోసం టెండర్ల ద్వారా కంపెనీలను ఎంపిక చేస్తారు. ఇలా సేకరించిన విత్తనాలను ఇంటిగ్రేటెడ్‌ అగ్రి ల్యాబ్‌లలో సర్టీఫై చేసి, సీజన్‌కు ముందుగానే రైతు భరోసా కేంద్రాల్లో (ఆర్బీకే) రైతులకు అందుబాటులో ఉంచేవారు. సాధారణంగా ఏటా ఏప్రిల్‌లో పచ్చిరొట్ట విత్తనాలు పంపిణీ పూర్తి చేసేవారు. ⇒ షెడ్యూల్‌ ప్రకారం పంపిణీ చేసేవారు. గత ఐదేళ్లలో ఏ ఒక్క ఏడాది ఒక్కరంటే ఒక్క రైతు కూడా తమకు విత్తనం సకాలంలో అందలేదన్న మాట విని్పంచకుండా సరఫరా చేశారు. ఈ ఏడాది అదును ముంచుకొస్తున్నప్పటికీ విత్తన పంపిణీ షెడ్యూల్‌ కాదు కదా.. కనీసం సబ్సిడీలను కూడా ఖరారు చేయలేని దుస్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని రైతులు మండిపడుతున్నారు. సబ్సిడీ విత్తనంలో అడ్డగోలుగా కోత ⇒ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ముందస్తుగా చేసిన ఏర్పాట్ల ఫలితంగా 2024–25 ఖరీఫ్‌లో 6.63 లక్షల క్వింటాళ్ల విత్తనం రైతులకు అందుబాటులో ఉండింది. వరి 2.29 లక్షల క్వింటాళ్లు, వేరుశనగ 3.16 లక్షల క్వింటాళ్లు, 94 వేల క్వింటాళ్ల పచ్చిరొట్ట, 15 వేల క్వింటాళ్ల అపరాల విత్తనాలను సీజన్‌కు ముందుగానే సర్టీఫై చేసి ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచగలిగారు. ⇒ ప్రస్తుత ఖరీఫ్‌–2025 సీజన్‌ కోసం జిల్లాల నుంచి వచ్చిన ఇండెంట్‌ ప్రకారం తొలుత 6,31,952 క్వింటాళ్ల విత్తనం అవసరమని ఏపీ సీడ్స్‌ అంచనా వేసింది. ప్రధానంగా 2.37 లక్షల క్వింటాళ్ల వరి, 2.95 లక్షల క్వింటాళ్ల వేరుశనగ, 69 వేల క్వింటాళ్ల పచ్చిరొట్ట, 12 వేల క్వింటాళ్ల కందులు సరఫరా చేయాలని నిర్ణయించారు. ఆ తర్వాత సబ్సిడీ విత్తనాన్ని కుదించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో కేవలం 5.18 లక్షల క్వింటాళ్లకు పరిమితం చేశారు. ⇒ ఇందులో 2.15 క్వింటాళ్ల విత్తనం గ్రామీణ విత్తనోత్పత్తి పథకం ద్వారా, మిగిలిన విత్తనాన్ని టెండర్‌ ప్రక్రియ ద్వారా సేకరించాలని నిర్ణయించారు. చివరికి 4.65 లక్షల క్వింటాళ్లకు మించి అమ్మకాలు ఉండవన్న అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నారు. పైగా గతంలో దాదాపు 16 రకాల విత్తనాలను సబ్సిడీపై సరఫరా చేసేవారు. అలాంటిది ఈ ఏడాది 10 రకాలకే పరిమితం చేశారు. ఈ లెక్కన 3 లక్షల క్వింటాళ్లకు మించి విత్తనాలు అందుబాటులో ఉండే అవకాశం లేదని అధికారులే చెబుతున్నారు.⇒ పిల్లిపెసర సహా సామెలు, ఊదలు, అలసందలు, రాజ్మా, ఉలవల సరఫరా నిలిపివేశారు. మిగిలిన వాటికి కూడా అడ్డగోలుగా కోత వేశారు. రాయలసీమ జిల్లాల్లో అత్యధిక విస్తీర్ణంలో సాగయ్యే వేరుశనగ పంట కోసం గతంలో ఏటా దాదాపు 3.80 లక్షల క్వింటాళ్లకు పైగా విత్తనం అందుబాటులో ఉంచేవారు. అలాంటిది ఈ ఏడాది తొలుత 2.95 లక్షల క్వింటాళ్లు అవసరమని అంచనా వేయగా, ఆ తర్వాత ప్రభుత్వాదేశాలతో 1.95 లక్షల క్వింటాళ్లకు పరిమితం చేయడం పట్ల సర్వత్రా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.బకాయిలు చెల్లించని కూటమి ప్రభుత్వం ⇒ గతంలో ఏటా క్రమం తప్పకుండా సీజన్‌కు ముందుగానే టెండర్ల ద్వారా విత్తనాలకు అవసరమైన మొత్తాన్ని బడ్జెట్‌లో కేటాయించడమే కాకుండా ఆ మొత్తాన్ని ఆయా కంపెనీలకు విడుదల చేసేవారు. దీంతో గత ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో ఏనాడు విత్తన సరఫరాలో ఎలాంటి ఆటంకం ఏర్పడ లేదు. 2024–25 ఖరీఫ్‌ సీజన్‌లో 6.63 లక్షల క్వింటాళ్లు, రబీలో 3.85 లక్షల క్వింటాళ్ల విత్తనం సరఫరా చేయగా, అందుకు సంబంధించిన సబ్సిడీ రూ.328.75 కోట్లు ప్రభుత్వం కంపెనీలకు చెల్లించలేదు.⇒ ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి రూ.213.78 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఎనిమిది నెలలుగా ఈ మేరకు పలుమార్లు పంపిన ప్రతిపాదనలను ప్రభుత్వం బుట్టదాఖలు చేసింది. దీంతో పచ్చిరొట్ట విత్తనాల సరఫరాకు ముందుకొచ్చిన ఐదు కంపెనీలు.. వేరుశనగ, వరి, శనగ, ఉలవలు, రాజ్మా తదితర విత్తనాల సరఫరాకు ముందుకొచ్చిన 12 కంపెనీలు గతేడాది బకాయిలు చెల్లిస్తే కానీ ఈ ఏడాది విత్తన సరఫరా చేసేది లేదని తెగేసి చెప్పాయి. దీంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో యంత్రాంగం ఉంది.⇒ అతికష్టమ్మీద ఒత్తిడి తీసుకురాగా జీలుగు.. జనుము (పచ్చిరొట్ట) విత్తనాలు కేవలం 23 వేల క్వింటాళ్లు (25%) జిల్లాలకు సరఫరా చేయగలిగారు. దీంతో పచ్చిరొట్ట విత్తనాలు దొరక్క రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. మరోవైపు ఈ పాటికే ప్రారంభం కావాల్సిన వేరుశనగ విత్తనం పంపిణీ ఎప్పుడు ప్రారంభమవుతుందో కూడా చెప్పలేకపోతున్నారు. మిగిలిన విత్తనాల పంపిణీ పరిస్థితి కూడా అలాగే ఉంది. ⇒ ఇదే అదునుగా ప్రైవేటు వ్యాపారులు అందినకాడికి దోచుకుంటున్నారు. గతేడాది ప్రభుత్వ చేతకాని తనం వల్ల నకిలీ విత్తనాలు రాజ్యమేలాయి. ఖరీఫ్‌లో ఎక్కువగా సాగయ్యే మిరప, పత్తి విత్తనాల్లో నకిలీలకు చెక్‌ పెట్టేందుకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ హయాంలో 40 కంపెనీలతో ఒప్పందం చేసుకుని, కల్తీలకు ఆస్కారం లేని రీతిలో రైతులు కోరుకున్న కంపెనీలకు చెందిన నాన్‌ సబ్సిడీ విత్తనాలను ఆర్బీకేల ద్వారా సరఫరా చేసింది. గత సీజన్‌ నుంచి నాన్‌ సబ్సిడీ విత్తనాల పంపిణీకి ప్రస్తుత ప్రభుత్వం మంగళం పాడింది.విత్తనోత్పత్తికీ రాంరాం ⇒ సాధారణంగా సాగు విస్తీర్ణంలో 30 శాతం విస్తీర్ణానికి అవసరమైన విత్తనాన్ని ఏపీ సీడ్‌ కార్పొరేషన్‌ ద్వారా ప్రభుత్వం సరఫరా చేస్తోంది. ఆ మేరకు అవసరమైన విత్తనం కోసం రబీ సీజన్‌లో జిల్లాల వారీగా గుర్తించిన రైతులకు విత్తనోత్పత్తి పథకం కింద 75 శాతం రాయితీపై మూల విత్తనాన్ని ఇచ్చి విత్తన సాగును ప్రోత్సహిస్తారు. మరొకవైపు ఏపీ సీడ్స్‌లో వాటాదారులుగా ఉన్న రైతులకు బ్రీడర్స్, ఫౌండేషన్‌ సీడ్స్‌ ఇచ్చి వారి ద్వారా విత్తనోత్పత్తి చేసి, ఆ విత్తనాన్ని ఖరీఫ్‌ సీజన్‌లో రైతుల డిమాండ్‌ మేరకు సేకరిస్తారు. ⇒ సాధారణంగా ఏపీ సీడ్స్‌ సరఫరా చేసే విత్తనంలో 50 శాతం ఈ విధంగా సేకరిస్తారు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ హయాంలో ఎవరైతే విత్తనం ఉత్పత్తి చేస్తారో ఆ రైతుల నుంచే ఈ–క్రాప్‌ ప్రామాణికంగా సేకరించేవారు. నిర్ధేశిత గడువులోగా వారికి బహిరంగ మార్కెట్‌ ధర కంటే 20–30 శాతం అదనంగా చెల్లించేవారు. ఈ వివరాలను సామాజిక తనిఖీలో భాగంగా ఆర్బీకేల్లో సైతం ప్రదర్శించేవారు. ⇒ దీంతో విత్తనోత్పత్తి చేసే రైతులు కూడా ఏపీ సీడ్స్‌కు ఇచ్చేందుకు ముందుకొచ్చేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. గడిచిన ఖరీఫ్‌లో విత్తనోత్పత్తి చేసే రైతుల నుంచి సేకరించిన విత్తనాలకు సంబంధించిన బకాయిలు దాదాపు 9 నెలలు గడిచినా చెల్లించని పరిస్థితి నెలకొంది. దీంతో ఈ రైతులెవ్వరూ తమ విత్తనాన్ని ఏపీ సీడ్స్‌కు ఇచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. బహిరంగ మార్కెట్‌ ధరలకే అమ్ముకుంటున్నారు. దీంతో ఏపీ సీడ్స్‌ పూర్తిగా టెండర్ల ద్వారానే విత్తనం సేకరించాల్సిన దుస్థితి ఏర్పడింది. అధికార పార్టీ ఎమ్మెల్యేలే పెదవి విరుపు⇒ విత్తన పంపిణీ విషయంలో ప్రభుత్వ తీరును అధికార పార్టీ ఎమ్మెల్యేలే తప్పు పడుతున్నారు. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుకు అధికార పార్టీకి చెందిన అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత రాసిన లేఖే నిదర్శనం. ⇒ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఏటా 3 లక్షల క్వింటాళ్ల విత్తనం అందించారని ఆమె గుర్తు చేశారు. అలాంటిది ఖరీఫ్‌–2025 సీజన్‌కు కనీసం 2 లక్షల క్వింటాళ్ల విత్తనం తక్కువ కాకుండా కేటాయించాల్సి ఉండగా, కేవలం 1.10 లక్షల క్వింటాళ్ల విత్తనం కోసం జిల్లా అధికారులు ఇండెంట్‌ పెట్టడం దారుణం అన్నారు. వ్యవసాయ శాఖ కేవలం 50 వేల క్వింటాళ్ల విత్తనాన్ని మాత్రమే కేటాయించడం విస్మయానికి గురి చేస్తోందని ఆమె ఆ లేఖలో పేర్కొన్నారు. ఇదేనా మంచి ప్రభుత్వం అంటే? సబ్సిడీపై వేరుశనక్కాయల విత్తనాల గురించి సచివాలయానికి వెళ్లి అడిగితే తమకు ఆదేశాలు రాలేదంటున్నారు. పదెకరాల్లో సేద్యం చేసుకున్నా.. వర్షాలు పడుతున్నాయి.. త్వరలో విత్తుకోవాల్సి ఉందని చెప్పినా వినిపించుకునే వారే లేరు. మాది రైతు ప్రభుత్వం.. మంచి ప్రభుత్వం అంటున్నారు.. ఇదేనా మంచి ప్రభుత్వం అంటే? రైతు సేవా కేంద్రాల్లో మా పేర్లు కూడా నమోదు చేసుకోకపోవడం దారుణం. దీంతో విత్తనాలు అధిక ధరకు బయట కొనుక్కోవాల్సి వస్తోంది. – మునిరెడ్డి, బొందిమడుగుల, తుగ్గలి మండలం, కర్నూలు జిల్లా అన్ని విధాలుగా మోసం చేల్లో దుక్కి దున్నాం. ఇంత వరకు శనగ విత్తనాలు రాలేదు. సచివాలయంలో అడిగితే మాకు పై నుంచి ఆర్డర్స్‌ రాలేదంటున్నారు. గతంలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఈపాటికే శనక్కాయల విత్తనాలు ఇచ్చేది. కానీ ఈ ఏడాది ఈ ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించడం లేదు. అదును దాటిపోతుంది. ఇంకెప్పుడు విత్తుకోవాలి? పెట్టుబడి సాయం కూడా ఇవ్వలేదు. రైతులను అన్ని విధాలుగా ముంచేస్తున్నారు. మీకు చిత్తశుద్ధి ఉంటే 90 శాతం సబ్సిడీపై శనక్కాయల విత్తనం ఇవ్వాలి. – రమణారెడ్డి, పొడరాగపల్లి, ముదిగుబ్బ మండలం, శ్రీ సత్యసాయి జిల్లా కౌలురైతులకు నూరు శాతం సబ్సిడీతో సర్టీఫైడ్‌ విత్తనాలివ్వాలిఏపీ కౌలురైతుల సంఘం డిమాండ్‌ సాక్షి, అమరావతి: కౌలురైతులకు నాణ్యమైన, సర్టీఫై చేసిన విత్తనాలను నూరు శాతం సబ్సిడీపై అందించాలని ఏపీ కౌలు రైతుల సంఘం ఆదివారం ఓ ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. ప్రైవేట్‌ మార్కెట్లో విత్తనాల ధరలు విపరీతంగా పెంచేశారని, పైగా ప్రైవేటు కంపెనీలు విక్రయించే విత్తనాల్లో నాణ్యత ఉండటం లేదని సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎ.కాటమయ్య, పి.జమలయ్య పేర్కొన్నారు. ఈ ఏడాది సీజన్‌కు ముందు విత్తనాలను సిద్ధం చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తంచేశారు.

Hydra Demolish Construction In Miyapur5
మియాపూర్‌లో హైడ్రా కూల్చివేతలు.. 70 ప్లాట్ల యజమానులు..

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. తాజాగా మియాపూర్‌లో హైడ్రా (Hydra) కూల్చివేతలు చేపట్టింది. హెచ్‌ఎండీఏ లేఅవుట్‌లోని అక్రమ నిర్మాణాలను అధికారులు తొలగించారు. పోలీసులు బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగాయి.వివరాల ప్రకారం.. మియాపూర్‌లోని హైదర్‌నగర్‌లో సోమవారం ఉదయం నుంచి హైడ్రా (Hydra) కూల్చివేతలు చేపట్టింది. తప్పుడు పత్రాలతో తమ భూమి కబ్జా చేశారని ఇటీవల 70 మంది ప్లాట్ల యజమానులు ఫిర్యాదు చేశారు. దీంతో, రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. హెచ్‌ఎండీఏ లేఅవుట్‌లోని అక్రమ నిర్మాణాలను అధికారులు తొలగించారు. హైకోర్టు ఆదేశాలతోనే అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నట్టు హైడ్రా అధికారులు తెలిపారు. ఇక, కబ్జాదారుల నుంచి భూములు విడిపించడంపై ప్లాట్ల యజమానులు హర్షం వ్యక్తం చేశారు.

Sarfaraz Khan Sheds 10 Kg Ahead Of England Test Series After Criticism Over Weight6
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టీమిండియా యువ క్రికెటర్‌

టీమిండియా యువ క్రికెటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. లావుగా ఉన్నాడని విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కఠినమైన వ్యాయామాలతో పాటు ఆహారపు నియమాలు పాటించి ఆరు వారాల్లో 10 కిలోలు తగ్గాడు. ఇంగ్లండ్‌తో టెస్ట్‌ సిరీస్‌కు ముందు ఫిట్‌నెస్‌ మెరుగుపర్చుకోవడమే ధ్యేయంగా పెట్టుకున్న సర్ఫరాజ్‌.. కఠోరమైన నియమనిబంధనలు పాటించి స్లిమ్‌గా తయారయ్యాడు. ఇంకా ఫిట్‌గా, బెటర్‌ క్రికెటర్‌గా తయారయ్యేందుకు ఇంకాస్త బరువు తగ్గుతానని సర్ఫరాజ్‌ అంటున్నాడు.కొత్త లుక్‌లో సర్ఫరాజ్‌ ఖాన్‌ను ఎవరూ పోల్చుకోలేకపోతున్నారు. సర్ఫరాజ్‌ న్యూ లుక్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్‌మీడియాలో వైరవలువుతున్నాయి. బరువు తగ్గకముందు, బరువు తగ్గాక సర్ఫరాజ్‌లో స్పష్టమైన తేడా కనిపిస్తుంది. బరువు తగ్గాక సర్ఫరాజ్‌ ఎంతో ఉత్సాహంగా, స్మార్ట్‌గా కనిపిస్తున్నాడు.కాగా, 27 ఏళ్ల సర్ఫరాజ్‌ ఓవర్‌ వెయిట్‌ కారణంగా చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. అపారమైన నైపుణ్యమున్నప్పటికీ.. ఆ ఒక్కటీ (ఓవర్‌ వెయిట్‌) సర్ఫరాజ్‌ను టార్గెట్‌ చేసేలా ఉండింది. దీంతో ఇంగ్లండ్‌ పర్యటనకు ముందు అతను స్ట్రిక్ట్‌ డెసిషన్‌ తీసుకున్నాడు. ఎలాగైనా బరువు తగ్గాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా జిమ్‌లో జాయిన్‌ అయ్యాడు. న్యూట్రిషియన్‌ను పెట్టుకున్నాడు. ఉదయాన్నే గంట పాటు జాగింగ్‌, ఆతర్వాత అరగంట స్మిమ్మింగ్‌ను ప్రతి రోజు షెడ్యూల్‌ చేసుకున్నాడు.సర్ఫరాజ్‌తో పాటు అతని కుటుంబం మొత్తం వెయిట్‌ లాస్‌ ప్రక్రియకు పూనుకుంది. సర్ఫరాజ్‌ తండ్రి నౌషద్‌ ఖాన్‌, అతని చిన్న సోదరుడు మొయిన్‌ ఖాన్‌ కూడా ఓవర్‌ వెయిట్‌ ఉంటారు. సర్ఫరాజ్‌ రెండో సొదరుడు మునీర్‌ ఖాన్‌ ఫిట్‌గా ఉన్నప్పటికీ అతను కూడా ఈ వెయిట్‌ లాస్‌ ప్రోగ్రాంలో వారితో పాటే నడిచాడు. మొత్తానికి సర్ఫరాజ్‌ వెయిట్‌ లాస్‌ జర్నీ స్పూర్తిదాయకంగా ఉంది.ఇదిలా ఉంటే, సర్ఫరాజ్‌ వచ్చే నెలలో షెడ్యూలైన ఇంగ్లండ్‌ పర్యటన కోసం భారత-ఏ జట్టుకు ఎంపికయ్యాడు. ఈ పర్యటనలో భారత-ఏ జట్టు ఇంగ్లండ్‌ లయన్స్‌తో రెండు అనధికారిక టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడుతుంది. ఈ మ్యాచ్‌ల్లో ప్రదర్శన ఆధారంగా ఆతర్వాత ఇంగ్లండ్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌కు భారత జట్టును ఎంపిక చేస్తారు. ఈ సిరీస్‌ సత్తా చాటి టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వాలని సర్ఫరాజ్‌ పట్టుదలగా ఉన్నాడు.గతేడాది ఇంగ్లండ్‌తో జరిగిన హొం టెస్ట్‌ సిరీస్‌లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన సర్ఫరాజ్‌.. తన డెబ్యూ మ్యాచ్‌లోనే రెండు అర్ద సెంచరీలు సాధించి (రెండు ఇన్నింగ్స్‌ల్లో) రికార్డుల్లోకెక్కాడు. అనంతరం గతేడాదే న్యూజిలాండ్‌పై 150 పరుగులు చేసిన సర్ఫరాజ్‌ తనలోని అత్యుత్తమ టాలెంట్‌ను వెలికి తీశాడు. అయితే తదనంతర పరిణామాల్లో (సీనియర్ల రాకతో) సర్ఫరాజ్‌కు టీమిండియాలో చోటు దక్కలేదు. బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీకి ఎంపిక కాలేదు. ఐపీఎల్‌ 2025 మెగా వేలంలోనూ అతనికి మొండిచెయ్యే ఎదురైంది. ఇంగ్లండ్‌ పర్యటనకు భారత్‌ ఏ జట్టు:అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, కరుణ్ నాయర్, ధృవ్ జురెల్ (వైస్ కెప్టెన్‌), నితీష్ కుమార్ రెడ్డి, శార్దూల్ ఠాకూర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్‌), మానవ్ సుతార్, తనుష్ కోటియన్, ముఖేష్ కుమార్, ఆకాశ్ దీప్, హర్షిత్ రాణా, అన్షుల్ కాంబోజ్, ఖలీల్ అహ్మద్, రుతురాజ్ గైక్వాడ్, సర్ఫరాజ్ ఖాన్, తుషార్ దేశ్‌పాండే, హర్ష్ దూబే

Hyderabad Gulzar House Incident Related Details7
పిల్లలను తీసుకుని ఇంటికి రా తల్లీ.. సరదాగా వెళ్లారు..

రాజేంద్రనగర్‌/మణికొండ/బంజారాహిల్స్‌: ఆదివారం ఉదయం గుల్జార్‌హౌస్‌ అగ్నిప్రమాదంలో మృతిచెందిన 17 మందిలో 10 మృతదేహాలకు ఆదివారం సాయంత్రం ఒకేసారి అంత్యక్రియలు నిర్వహించారు. కుటుంబ పెద్ద ప్రహ్లాద్‌ మోదీ, ఆయన భార్య మున్నీ, కుమారుడు పంకజ్, కోడలు వర్ష, తమ్ముడు రాజేందర్‌ మోదీ, మరదలు సుమిత్ర, తమ్ముని కుమారుడు అభిషేక్, మనుమలు, మనమరాళ్లు అనుయాన్, ఇదిక, ఐరాజ్‌ల మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రిలో పోస్ట్‌మార్టం అనంతరం పురానాపూల్‌లోని శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. కాగా, ఈ ప్రమాదంలో బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.3లో నివసించే ఏడేళ్ల బాలిక హర్షాలి గుప్తా కన్నుమూశారు. ఆమె శరీరం పూర్తిగా కాలిపోవటంతో కుటుంబ సభ్యులు అస్తికలకు ఆదివారం మధ్యాహ్నం పంజాగుట్ట స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.పుట్టింటికి వెళ్లి మృత్యువాతసనత్‌నగర్‌: వేసవి సెలవులు కదా..? పిల్లలను తీసుకుని ఇంటికి రా.. తల్లీ! అని ఆ తండ్రి ఆశగా అడగడంతో కొడుకును తీసుకుని తన పుట్టిల్లు అయిన గుల్జార్‌హౌస్‌కు వెళ్లింది. అదృష్టవశాత్తూ తండ్రి పిలుపు మేరకు కొడుకు ముందు రోజు రాత్రే వెళ్లిపోగా, తల్లి అగ్ని ప్రమాదంలో మృత్యువాత పడింది. దీంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. వస్త్ర వ్యాపారి వినోద్‌కుమార్‌ అగర్వాల్‌ తన భార్య రజనీ అగర్వాల్‌ (45), కొడుకు కుషాల్‌ అగర్వాల్, కుమార్తె తనూలతో కలిసి సనత్‌నగర్‌లో ఉంటున్నాడు. కుమార్తె ముంబైలో ఎంబీఏ చదువుతుండగా, కుమారుడు కుషాల్‌ ఇంటర్మీడియెట్‌ చదువుతున్నాడు. ఈ క్రమంలో కుమారుడు కుషాల్‌ను తీసుకుని రజని గుల్జార్‌ హౌస్‌కు వెళ్లింది. అయితే కుషాల్‌ ముందు రోజు రాత్రి ఇంటికి వచ్చేశాడు. అక్కడే ఉన్న రజని మాత్రం ఆదివారం జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించింది.సరదాగా వెళ్లారు.. శవాలై వచ్చారురహమత్‌నగర్‌: బంధువులతో సరదాగా గడపాలని వెళ్లారు. శవాలుగా తిరిగొచ్చారు. ఒకే కుటుంబంలో ముగ్గురు మృత్యువాత పడటం ఎర్రగడ్డ డివిజన్‌ రాజీవ్‌నగర్‌ బస్తీ వాసులను కలచి వేసింది. గుల్జార్‌ హౌస్‌ ఆగ్ని ప్రమాదంలో రాజీవ్‌నగర్‌కు చెందిన తల్లి, కొడుకు, కుమార్తె మృతి చెందారు. ఆటో మొబైల్స్‌ వ్యాపారం చేసే రాజేష్‌ జైన్‌ రాజీవ్‌నగర్‌లో ఉంటున్నారు. ఆయనకు భార్య శీతల్‌ (35), ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కాగా శనివారం ఉదయం శీతల్‌ తన తండ్రి ఇంటికి పిల్లల్ని తీసుకుని వెళ్లింది. అయితే పెద్ద కుమార్తె రాశి తాను చదువుకోవాలంటూ శనివారం సాయంత్రమే రాజీవ్‌నగర్‌ లోని తమ నివాసానికి తిరిగి వచ్చింది. అక్కడే ఉండిపోయిన శీతల్, అరుషి, రిషబ్‌ మాత్రం ప్రమాదంలో చనిపోయారు.

Suriya Retro Movie Final Collections8
'రెట్రో' కలెక్షన్స్‌ విడుదల.. సూర్య కెరీర్‌లో ఇదే టాప్‌

రెట్రో సినిమాతో సూర్య భారీ హిట్‌ అందుకున్నాడు. తాజాగా ఈ సినిమా కలెక్షన్స్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. సూర్య కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్స్‌ సాధించిన చిత్రంగా రెట్రో రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. గతేడాదిలో భారీ అంచనాలతో విడుదలైన ‘కంగువా’ చిత్రం సూర్య (Suriya)కు చేదు అనుభవాన్ని మిగిల్చినా రెట్రో మాత్రం ఆ లోటును తీర్చింది. అయితే, తెలుగులో అంతగా ఆకట్టుకోలేదని చెప్పవచ్చు. కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో రొమాంటిక్‌ యాక్షన్‌ చిత్రంగా మే 1న రెట్రో విడుదలైంది. ఇందులో పూజా హెగ్డే (Pooja Hegde) హీరోయిన్‌గా నటించగా.. జోజూ జార్జ్‌, జయరామ్‌, నాజర్‌ తదితరులు కీలక పాత్రలలో కనిపించారు. యాక్షన్‌తో పాటు, ప్రేమ, భావోద్వేగాలతో కూడిన ఒక గ్యాంగ్‌స్టర్‌గా సూర్య ఇందులో నటించాడు.రెట్రో సినిమా 18 రోజుల్లో రూ. 235 కోట్లు రాబట్టినట్లు మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. ఇందులో అత్యధికంగా తమిళనాడులోనే ఎక్కువ కలెక్షన్స్‌ వచ్చాయి. సూర్య కెరీర్‌లో అత్యధిక కలెక్షన్స్‌ రాబట్టిన చిత్రంగా మొదటి స్థానంలో రెట్రో ఉంది. ఆ తర్వాత 24 మూవీ రూ. 157 కోట్లు, సింగం2 రూ. 122 కోట్లు, కంగువా రూ. 106 కోట్లు, 7th సెన్స్‌ రూ. 113 కోట్లు, సికిందర్ రూ. 95 కోట్లతో వరుసగా ఉన్నాయి. రెట్రో సినిమాకు 'టూరిస్ట్ ఫ్యామిలీ' మూవీ భారీగానే దెబ్బ కొట్టింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం టాక్‌ బాగుండటంతో కోలీవుడ్‌లో మంచి కలెక్షన్స్‌ రాబట్టింది. లేదంటే రెట్రో కలెక్షన్స్‌ సులువుగా రూ. 300 కోట్లకు దగ్గర్లో ఉండేవని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేశాయి.Dear Audience and #AnbaanaFans, we're humbled by your immense love and support for #TheOne ‼️ Grateful for the glory, it's all because of you ❤#RETRO@Suriya_Offl #Jyotika @karthiksubbaraj @hegdepooja @Music_Santhosh @prakashraaj @C_I_N_E_M_A_A @rajsekarpandian… pic.twitter.com/wScjYwaqu4— 2D Entertainment (@2D_ENTPVTLTD) May 18, 2025

India continues to be largest market for electric 3 wheelers IEA9
త్రీవీలర్‌ ఈవీలకు కేరాఫ్‌ భారత్‌!

న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్‌ త్రిచక్ర వాహనాలకు ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్‌గా భారత్‌ వరుసగా రెండో ఏడాది గుర్తింపును సొంతం చేసుకుంది. 2024లో వీటి అమ్మకాలు 20 శాతం పెరిగి 7 లక్షల యూనిట్లుగా ఉన్నట్టు ఇంటర్నేషనల్‌ ఎనర్జీ ఏజెన్సీ (ఐఈఏ) తెలిపింది. ప్రపంచ ఈవీ మార్కెట్‌పై ఐఈఏ ఒక నివేదికను విడుదల చేసింది. ఇందులో భారత్‌ మార్కెట్‌ గురించి కీలకంగా ప్రస్తావించింది.అంతర్జాతీయంగా త్రిచక్ర ఈవీల వృద్ధిలో భారత్‌ ప్రముఖ పాత్ర పోషిస్తున్నట్టు తెలిపింది. 2024లో ప్రపంచవ్యాప్తంగా త్రిచక్ర వాహన అమ్మకాలు అంతకుముందు ఏడాదితో పోలి్చతే 5 శాతం క్షీణించినప్పటికీ.. తిచక్ర ఈవీల విక్రయాలు మాత్రం 10 శాతం పెరిగి మిలియన్‌ యూనిట్లను దాటినట్టు పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా సంప్రదాయ త్రిచక్ర వాహనాలతోపాటు త్రిచక్ర ఈవీల్లో 90 శాతం వాటా చైనా, భారత్‌ చేతుల్లోనే ఉన్నట్టు ఈ నివేదిక వెల్లడించింది.‘‘చైనాలో తిచక్ర వాహన అమ్మకాల్లో గత మూడేళ్ల నుంచి ఈవీలు 15 శాతంలోపే ఉంటున్నాయి. 2023లో చైనాను వెనక్కి నెట్టేసి ప్రపంచ అతిపెద్ద తిచక్ర ఈవీ మార్కెట్‌గా భారత్‌ అవతరించింది. 2024లోనూ 7 లక్షల త్రిచక్ర ఈవీ అమ్మకాలతో అతిపెద్ద మార్కెట్‌ స్థానాన్ని కాపాడుకుంది’’అని ఈ నివేదిక తెలిపింది. 2024లో ప్రపంచవ్యాప్త త్రిచక్ర ఈవీల అమ్మకాల్లో భారత్‌ వాటా 57 శాతంగా ఉన్నట్టు పేర్కొంది. 2023తో పోల్చి చూస్తే 3 శాతం వాటాను పెంచుకున్నట్టు తెలిపింది. పీఎం ఈ–డ్రైవ్‌ పథకం మద్దతును ప్రస్తావించింది. కేంద్ర సర్కారు ఈ పథకం ద్వారా ఈవీలకు సబ్సిడీ ప్రయోజనాలు అందిస్తుండడం తెలిసిందే. ద్వి, త్రిచక్ర వాహనాలకు బడా మార్కెట్‌ అంతర్జాతీయంగా ద్విచక్ర, త్రిచక్ర వాహన అమ్మకాల్లో చైనా, భారత్, దక్షిణాసియా దేశాలు 80 శాతం వాటా కలిగి ఉన్నట్టు ఐఈఏ నివేదిక వెల్లడించింది. ప్రైవేటు ప్యాసింజర్‌ రవాణాకు ఇవి ప్రాథమిక వినియోగంగా ఉన్నట్టు పేర్కొంది. ‘‘ఎలక్ట్రిక్‌ టూవీలర్లకు భారత్‌ చురుకైన మార్కెట్‌గా ఉంటోంది. 220కు పైగా ఓఈఎంలకు (వాహన తయారీ సంస్థలు) కేంద్రంగా ఉంది. 2023లో ఉన్న 180 కంటే పెరిగాయి. 2024లో మొత్తం ద్విచక్ర ఈవీల అమ్మకాలు 1.3 మిలియన్‌ యూనిట్లలో 80 శాతం వాటా టాప్‌–4 కంపెనీలు కలిగి ఉన్నాయి’’అని ఈ నివేదిక తెలిపింది.అధిక ధరలు, తీవ్ర పోటీ సంప్రదాయ ద్విచక్ర వాహనలతో పోల్చి చూసినప్పుడు ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాల కొనుగోలు ధర అధికంగా ఉన్నట్టు.. అదే సమయంలో పోటీ పెరగడంతో ఓఈఎంలు అందుబాటు ధరలపై మోడళ్లను ఆఫర్‌ చేస్తున్నట్టు తెలిపింది. ఓలా ఎస్‌1ఎక్స్‌ మోడల్‌ను నిదర్శనంగా పేర్కొంది. 2కిలోవాట్‌హవర్‌ బ్యాటరీ, 6కిలోవాట్‌ పీక్‌ పవర్‌ సామర్థ్యంతో 70,000కే అందిస్తున్నట్టు గుర్తు చేసింది.విధానపరమైన మద్దతు (సబ్సిడీలు) కూడా సంప్రదాయ, ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాల మధ్య ధరల అంతరాన్ని తగ్గిస్తున్నట్టు ఐఈఏ నివేదిక తెలిపింది. ఎలక్ట్రిక్‌ కార్ల అమ్మకాలు 2024లో కేవలం 2 శాతం పెరిగి 1,00,000 యూనిట్లుగా ఉన్నట్టు వెల్లడించింది. ఇక ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో ఎలక్ట్రిక్‌ కార్ల అమ్మకాలు క్రితం ఏడాది మొదటి త్రైమాసికంతో పోల్చి చూస్తే 45 శాతం పెరిగి 35,000 యూనిట్లుగా ఉన్నట్టు తెలిపింది.

Meet who defeated fate with determination10
సాకులు వెతుక్కోకండి : విధి కూడా వంగి సలాం చేసే సంకల్పంతో..

చిన్నప్పుడే విద్యుత్‌ ప్రమాదంలో కాళ్లూ చేతులు పోగొట్టుకున్నాడు మునిపల్లి మండలం కంకోల్‌ గ్రామానికి చెందిన మధుకుమార్‌. అయితేనేం విధివక్రీకరించినా ఓటమిని ఒప్పుకోని సంకల్ప బలంతో ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు. దేహముంది, ప్రాణముంది.. నెత్తురుంది.. సత్తువుంది ఇంతకంటే సైన్యముండునా అనుకున్నాడు. విశ్రమించక శ్రమించాడు. ఆశయాల అశ్వమెక్కి అదుపులేని కదను తొక్కి అవధులన్నీ అధిగమించాడు. వైకల్యం శరీరానికే కాని మనసుకు కాదనుకుని నిరాశకే నిరాశ పుట్టించి ముందుకెళ్తున్న మధుకుమార్‌ జీవితంపై స్పెషల్‌ స్టోరీ.– బి. రాజశేఖర్, సంగారెడ్డి జోన్‌సంకల్పం ఉంటే వైకల్యం అడ్డు కాదని నిరూపించాడు. నోటితోనే పెయింటింగ్‌ వేసి అందరి ప్రశంసలు అందుకున్నాడు. ఆత్మవిశ్వాసం కోల్పోకుండా లక్ష్యసాధన వైపు ముందడుగు వేశాడు. ఇటీవల విడుదలైన పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో 86% మార్కులు సాధించి, ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిగా నిలిచాడు. విద్యుదాఘాతం తగిలి రెండు కాళ్లు, రెండు చేతులు కోల్పోయినా మనోధైర్యం కోల్పోలేదు. ఐఏఎస్‌ అయి ప్రజలకు సేవ చేయాలన్నదే తన కోరిక అని మునిపల్లి మండలం కంకోల్‌ గ్రామానికి చెందిన మధు కుమార్‌ ‘సాక్షి’తో చెప్పాడు. స్ఫూర్తిగా నిలిచి.. విధి వెక్కిరించినా అందరితో పాటు చదువులో ముందుకు సాగుతున్నాడు. ప్రతిరోజు తల్లిదండ్రులు, స్నేహితుల సహకారంతో వీల్‌ చైర్‌పై పాఠశాలకు వెళ్లేవాడు. తనకు ఉన్న వైకల్యాన్ని మరిచిపోయి అందరితో కలిసి, మెలిసి చదువుకున్నాడు. పరీక్షల సమయంలో ప్రణాళికాబద్ధంగా సమయం కేటాయించి చదువుకున్నాడు. పుస్తకాల్లోని పేజీలను తన నాలుకతో పాటు కోల్పోయిన కాలు చివరి భాగంతో మార్చుకుంటున్నాడు. ఈ విధంగా బాగా చదువుకుని స్నేహితుడి సహకారంతో పరీక్షలు రాశాడు. దివ్యాంగులకు ఒక సబ్జెక్టును మినహాయిస్తారు. దీంతో 500 మార్కులకు గాను 430 మార్కులు సాధించి అందరి నోట శభాష్‌ మధు అనిపించుకున్నాడు. ఇదీ చదవండి: ఫోర్బ్స్‌లో అనన్య పాండే, బాయ్‌ ఫ్రెండ్‌ రియాక్షన్‌ వైరల్‌ఉత్తమ ప్రతిభ కనబరిచిన మధు కుమార్‌ను కలెక్టర్‌ వల్లూరు క్రాంతి సన్మానించి అభినందించి, ల్యాప్‌ టాప్‌ను అందజేశారు. భవిష్యత్తులో చదువుకునేందుకు తమ వంతుగా పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. పాఠశాల తనిఖీ సమయంలో మధును గమనించిన కలెక్టర్‌ బాగా చదువుకొని ఉత్తమ ఫలితాలు సాధించాలని ప్రోత్సహించారు. చిరునవ్వుతో ముందడుగుమునిపల్లి మండల పరిధిలోని కంకోల్‌ గ్రామానికి చెందిన మధు కుమార్‌ అదే గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్నాడు. అందరితో కలిసి మెలిసి ఉంటూ చదువుతో పాటు పాఠశాలలో నిర్వహించే ప్రతి కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొనేవాడు. 2019 సెపె్టంబర్‌ 15న తోటి స్నేహితులతో సరదాగా ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో పక్కనే ఉన్న విద్యుత్‌ తీగలను గమనించకపోవడంతో రెండు చేతులు తీగలకు తగిలాయి. రెండు కాళ్లకు ఎర్తింగ్‌ వచ్చి షాక్‌ తగిలి కింద పడిపోయాడు. వెంటనే చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు రెండు కాళ్లు, రెండు చేతులు తీసేయాలని, అప్పటికీ మధు బతుకుతాడో లేదోనని చెప్పారు. మరణం అంచు వరకు వెళ్లిన కుర్రాడు ప్రాణాలతో బయటపడ్డాడు. తోటి వారి సహాయం లేకుండా కదలలేని స్థితిలో ఉన్నా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా సంకల్ప బలంతో ముందడుగు వేస్తూ జీవిస్తున్నాడు.నోటితో పెయింటింగ్‌..నోటితోనే పెయింటింగ్‌ వేసి అందరి ప్రశంసలు పొందుతున్నాడు. ప్రముఖ సినీ నటి సమంత నిర్వహించే సామ్‌ జామ్‌ షోకు హాజరై అక్కడ మెగాస్టార్‌ చిరంజీవి చిత్రపటాన్ని నోటితో గీసి ప్రశంసలు పొందాడు. అంతేకాకుండా ప్రముఖ స్టార్‌లు ప్రభాస్, వెంకటేష్‌ పవన్‌ కల్యాణ్, అల్లు అర్జున్‌లతో పాటు వివిధ రకాల చిత్రాలు వేసి అందరితో ప్రశంసలు అందుకున్నాడు.ఐఏఎస్‌ అవ్వడమే లక్ష్యం..కాళ్లు, చేతులు లేకపోయినా నా తల్లిదండ్రులు, గురువులు, స్నేహితుల సహకారంతో చదువుకోవటంతో పాటు అన్ని పనులు చేసుకోగలుగుతున్నా. ఉపాధ్యాయుల సూచనల మేరకు ప్రణాళికాబద్ధంగా చదువుకొని మంచి ఫలితాలు సాధించాను. అప్పటి సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ హనుమంతరావు పాఠశాలకు తనిఖీకి వచి్చన సమయంలో నిరుపేద విద్యార్థులకు, తనలాంటి వారిని పలకరించే విధానం, చేసే సహాయ గుణాలకు ఆకర్షితుడినయ్యాను. అలాగే ప్రస్తుత కలెక్టర్‌ వల్లూరు క్రాంతి సైతం విద్యార్థులను ప్రోత్సహించడం చూసి స్ఫూర్తి పొందాను. నేను కూడా ప్రతి ఒక్కరికీ సహాయపడాలని ఐఏఎస్‌ కావాలని లక్ష్యంగా పెట్టుకున్నా.– మధు కుమార్, విద్యార్థికంకోల్‌ గ్రామం, మునిపల్లి మండలం

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement