Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

TDP Govt Cheating AP Women: Andhra Pradesh1
‘ఆడబిడ్డ నిధి’కి సమాధి

సాక్షి ప్రతినిధి కర్నూలు/ సాక్షి, అమరావతి: సూపర్‌ సిక్స్‌ హామీల్లో ప్రధానమైన ‘ఆడబిడ్డ నిధి’ని ఇవ్వలేమని, ఇవ్వా­ల్సిన అవసరం లేదని సీఎం చంద్రబాబు చేతులెత్తేశారు. అప్పుడు, ఇప్పుడు అంటూ ఏడాది పాటు ఊరిస్తూ వచ్చి తీరా మోసం చేశారు. రాష్ట్రంలో 1.80 కోట్ల మంది మహిళల ఆశలపై నీళ్లు చల్లారు. తన ఆర్థిక సంస్కరణలతో సంపద సృష్టి జరిగిపోతోందని, పేదలందరూ బాగా డబ్బులు సంపాదిస్తున్నారని.. అందువల్ల ఈ నిధి అవసరం లేదని స్పష్టం చేశారు. 2029 నాటికి పేదరికాన్ని నిర్మూలిస్తానని మరోమారు ప్రతిన­బూనారు. ఒకవేళ అప్పటికి కూడా పేదరికం నుంచి మహిళలు గట్టెక్కకపోతే పీ–4తో ఆడబిడ్డ నిధిని అనుసంధానం చేస్తానని కర్నూలు సభలో చెప్పు­కొచ్చారు. చంద్రబాబు మాటలు విన్న మహిళలు ఒకరి మోహం మరొకరు చూసుకుంటూ నిశ్చేష్టుల­య్యారు. బాబు వ్యాఖ్యలు వైరల్‌ కావడంతో శనివారం సాయంత్రం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయం చర్చనీయాంశమైంది.ఎక్కడ నలుగురు మహిళలు కలిసినా కూటమి ప్రభుత్వ మోసం గురించి చర్చించుకుంటున్నారు. స్వచ్ఛ భారత్‌లో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం కర్నూలులో పర్యటించారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సభకు వేలాదిగా డ్వాక్రా మహిళలను తరలించారు. వీరందరి సమక్షంలోనే ‘ఆడబిడ్డి నిధి’ అమలుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ చర్యలతో పేదల ఆదాయం బాగా పెరిగిందని, పేదలు కూడా బాగా డబ్బు సంపాదిస్తున్నారని చెప్పారు. 2029 నాటికి రాష్ట్రంలో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలిస్తానని చెప్పారు.ఒకవేళ అప్పటికీ పేదరికం ఉంటే అప్పుడు ఆడబిడ్డ నిధిని పీ4 (పబ్లిక్‌ ప్రైవేటు పీపుల్స్‌ పార్టనర్‌షిప్‌)కు అనుసంధానం చేసే ఆలోచన చేస్తానని చెప్పారు. ఈ లెక్కన ఆడబిడ్డ నిధి పథకం అమలు చేసేది లేదని తేల్చి చెప్పారు. ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చిన గడువు ఐదేళ్లు మాత్రమే. 2029లో తిరిగి ప్రజాక్షేత్రంలో ఎన్నికలకు వెళ్లాలి. అప్పటి వరకు ఈ పథకం అమలు చేయరంటే పూర్తిగా ఎగనామం పెట్టినట్లే. చంద్రబాబు ప్రభుత్వం కొలువు దీరి ఏడాది అవుతోంది. ఏడాదిలో ఏ ఒక్క పథకాన్ని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదు.నాడు ఇంటింటా ఈ నిధి గురించి ప్రచారం 2024 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో మహాశక్తి ఆడబిడ్డ నిధి పేరుతో ప్రతి ఇంట్లో 18 ఏళ్లు నిండి 59 ఏళ్లలోపు ఉన్న మహిళలు ఎంత మంది ఉంటే అంత మందికీ నెలకు రూ.1,500 చొప్పున ఇస్తానని చంద్రబాబు ప్రకటించారు. కూటమి మేనిఫెస్టోలో కూడా ఈ అంశాన్ని పేర్కొన్నారు. కూటమి నేతలు ఇల్లిల్లూ తిరిగి ఈ మేరకు ప్రచారం చేశారు. దీంతో ఆశపడి మహిళలు ఆ పార్టీకి ఓట్లేశారు. ఇప్పుడు ఆ హామీని అమలు చేసే అవసరమే లేదని చంద్రబాబు నిర్భీతిగా ప్రకటించేయడం పరిశీలకులను సైతం విస్తుగొలుపుతోంది.1.80 కోట్ల మందికి ఎగనామం 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు ఓటు హక్కు ఉంటుంది. రాష్ట్రంలో 2.07 కోట్ల మంది మహిళలు 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేశారు. 60 ఏళ్లు పైబడిన వారిని మినహాయిస్తే 1.80 కోట్ల మంది మిగులుతారు. వీరికి చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు ఇవ్వాలి. అంటే ఏడాదికి రూ.32,400 కోట్లు బడ్జెట్‌లో కేటాయించాలి. గత బడ్జెట్‌లో ఈ పథకం ఊసే లేదు. ఒక్క రూపాయి నిధులు కూడా కేటాయించలేదు. మొన్నటి బడ్జెట్‌లోనూ ఆ విషయమే లేదు. అంటే ఇప్పటి వరకు రెండేళ్లకు కలిపి ఒక్కొక్కరికి రూ.32 వేల చొప్పున 1.80 కోట్ల మందికి రూ.64,800 కోట్లు కేటాయించాలి. అది జరగలేదు. దీన్నిబట్టి ఆడబిడ్డ నిధి పథకం అమలు చేసేది లేదని స్పష్టమైంది. ఈ విషయాన్నే ఇప్పుడు సీఎం చంద్రబాబు బహిరంగంగా స్పష్టం చేశారు.జగన్‌ చేశారు.. చంద్రబాబు చేతులెత్తేశారు 2024 ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలనే కాంక్షతో చంద్రబాబు అలవికాని హామీలు ఇచ్చారు. అప్పటి జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఇస్తున్న ప్రతీ పథకానికి పేరు మార్చి, నిధులు పెంచి అమలు చేస్తానని నమ్మబలికారు. అమ్మఒడిని తల్లికి వందనం పేరుతో, రైతు భరోసాను అన్నదాత సుఖీభవ పేరుతో.. వైఎస్సార్‌ చేయూతను ఆడబిడ్డ నిధి పేరుతో హామీ ఇచ్చారు. ‘చేయూత’ ద్వారా జగన్‌ ప్రభుత్వం 45–59 ఏళ్ల వయస్సున్న వారికి ఏడాదికి రూ.18,750 చొప్పున ఏటా వారి ఖాతాల్లో జమ చేసి.. మాట నిలుపుకుంది. ఇదే పథకానికి ఆడబిడ్డ నిధి పేరుతో నెలకు రూ.1500 చొప్పున ఏడాదికి రూ.1,800 ఇస్తామని చంద్రబాబు చెప్పారు. అంటే జగన్‌మోహన్‌రెడ్డి కంటే రూ.750 తక్కువే ఇస్తామన్నారు. సూపర్‌ సిక్స్‌లో అన్ని పథకాల కంటే అత్యధిక బడ్జెట్‌ కేటాయించాల్సిన పథకం ఇదే. అత్యంత ఎక్కువ మంది లబ్ధిదారులు ఉన్నదీ ఈ పథకానికే. ఇలాంటి పథకాన్ని అమలు చేయకుండా చంద్రబాబు చేతులెత్తేసి రాష్ట్రంలో 1.80 కోట్ల మంది మహిళలను నిలువునా మోసం చేశారు.బలవంతంగా దుకాణాల మూసివేత కర్నూలు నగరంలో స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు వస్తుండడంతో శనివారం దుకాణాలను మూసి వేయాలని పోలీసులు హుకుం జారీ చేశారు. ఉదయం 12 గంటలకు సీఎం రానున్న నేపథ్యంలో 9 గంటలకే షాపులన్నీ మూయించారు. దీంతో సీ క్యాంపు నుంచి నంద్యాల చెక్‌పోస్టు వరకు యజమానులు దుకాణాలు మూసివేసి వెళ్లిపోయారు. గత ప్రభుత్వంలో పరదాల మాటున సీఎం పర్యటనలు అని గగ్గోలు పెట్టిన పచ్చనేతలు.. ఇప్పుడు ఏకంగా తమ పర్యటనలకు దుకాణాలనే మూసి వేస్తుండటం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది. సీఎం సభకు పలు ప్రాంతాల నుంచి పొదుపు సంఘాల మహిళలను బలవంతంగా తరలించారు. పర్యటన ఆలస్యం కావడంతో ఎండ వేడిమికి తట్టుకోలేక చాలా మంది రేకుల షేడ్లలో, బంద్‌ చేసిన షాపుల నీడలో తల దాచుకోవాల్సి వచ్చింది. కనీస ఏర్పాట్లు చేపట్టక పోవడంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.నాడు ఆడ బిడ్డ నిధి హామీ ఇలాతెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక మహాశక్తి కింద ఐదు కార్యక్రమాలు అమలు చేస్తాం. 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల మధ్య మహిళలందరికీ... ఒక్కొక్కరికీ నెలకు రూ.1500 చొప్పున ఏడాదికి రూ.18000.. ఇంట్లో ఎంత మంది మహిళలు ఉంటే అందరికీ అందజేస్తాం.– 2024 మార్చి 13వ తేదీన టీడీపీ నిర్వహించిన ‘కలలకు రెక్కలు’ నినాదంతో వెబ్‌ పోర్టల్‌లో పేర్ల నమోదు కార్యక్రమంలో చంద్రబాబు (చంద్రబాబు మాట్లాడినట్టు ‘ఈనాడు’ దినపత్రిక క్లిపింగ్‌)⇒ రాష్ట్ర ప్రజల నేటి అవసరాలను తీరుస్తూ.. రేపటి ఆకాంక్షలను సాకారం చేసేలా రూపొందించిన ఈ మేనిఫెస్టోను పక్కాగా అమలు చేస్తాం.– 2024 ఏప్రిల్‌ 30న ఉమ్మడి మేనిఫెస్టో విడుదల సందర్భంగా పవన్‌ కళ్యాణ్‌ (మే 1వ తేదీ ఈనాడు క్లిప్లింగ్‌)⇒ భవిష్యత్‌కు గ్యారెంటీ–బాబు ష్యూరిటీ నినాదంతో ‘ఆడబిడ్డ నిధి’ నుంచి 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇస్తాం. – రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ–జనసేన నాయకులు ఇంటింటా కరపత్రాల ప్రచారంబకాయిలతో కలిపి ఇవ్వాలిచంద్రబాబునాయుడు ఎన్నికల్లో గెలిచేందుకు లేనిపోని హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకున్నారు. ఇన్నాళ్లూ నిధులు లేవు.. సంపద సృష్టించే మంత్రం ఉంటే చెవిలో చెప్పండి అన్నారు. ఇప్పుడు సంపద సృష్టించేశాం అంటున్నారు. పేదలు బాగా సంపాదిస్తున్నారట! ఇంకా నాలుగేళ్లకు పేదరికం పోకపోతే ఆడబిడ్డ నిధిని పీ4కు లింక్‌ చేస్తానని చెబుతున్నారు. పీ4 అంటే ప్రైవేటు వ్యక్తులు. వారికి ప్రభుత్వ పథకంతో ఏం సంబంధం? దీన్నిబట్టి పథకానికి పూర్తిగా మంగళం పాడినట్లే. మహిళలకు ఇచ్చిన హామీ మేరకు నెలకు రూ.1500 చొప్పున ఇవ్వాలి. ఇప్పటికే ఏడాది పూర్తయినందున బకాయిలతో కలిపి ఇవ్వాలి. – వి.భారతి, ఏపీ మహిళా సమాఖ్య నగర కార్యదర్శి, కర్నూలుప్రజలు మోసపోయారని తెలుస్తోంది2029లోపు పేదరికాన్ని నిర్మూలిస్తా.. అప్పటికీ పేదరికం ఉంటే అప్పుడు పీ4కు ఆడబిడ్డి నిధిని అనుసంధానం చేస్తానని చంద్రబాబు చెప్పడం సరికాదు. అంటే 2029 లోపు ఆడబిడ్డ నిధి అమలు చేయరా? మీకు ఇచ్చిన గడువే 2028 వరకు. 2029లో ఎన్నికలకు వెళ్లాలి. ఆడబిడ్డ నిధి అనేది ప్రభుత్వ పథకం. పీ4 అనేది పారిశ్రామిక వేత్తలు, ప్రైవేటు వ్యక్తులు చేసే సాయం. ఈ రెండిటిని కలపడం అంటే ఎలా? 18 ఏళ్లు నిండిన ప్రతీ ఆడబిడ్డకు డబ్బులు ఇవ్వాలి. చంద్రబాబు మాటలు వింటుంటే మరోమారు ప్రజలు మోసపోయారని తెలుస్తోంది. – ఎం.శిరీష, ఇందిరాగాంధీ నగర్, కర్నూలుబాబువన్నీ బూటకపు హామీలేగత ఎన్నికల సమయంలో చంద్రబాబునాయుడు రాష్ట్రంలోని 18 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి కింద ఏడాదికి రూ.18,000 ఇస్తానని నమ్మించి మహిళల ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చారు. ఇప్పటి వరకు ఆ ఊసే ఎత్తడం లేదు. ఇప్పుడు పీ–4 స్కీమ్‌తో అనుసంధానం చేస్తానని చెప్పడం చూస్తే ఇదొక మోసపూరిత హామీగా మిగలనుందని అర్థమవుతోంది. అధికారంలోకి రాక ముందు ఒకలా, అధికారంలోకి వచ్చాక మరోలా చంద్రబాబునాయుడు వ్యవహరిస్తున్నారు. మహిళలందరం వచ్చే ఎన్నికల్లో తగిన రీతిలో బుద్ధి చెప్పి తీరుతాం. – ఎస్‌కే మస్తాన్‌బీ, నెల్లూరుఆడబిడ్డ నిధి ఇవ్వరా?కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ హామీ­గానే ఉండిపోయింది. ఆడబిడ్డ నిధి ఇస్తానని చెప్పడంతో లక్షలాది మంది ఆడబిడ్డలు ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నారు. సంపద సృష్టించామని చెబుతున్నారుగా.. ఇవ్వండి మరి. మొత్తం బకాయిలతో కలిపి వెంటనే ఇవ్వాలి. – కె.కృష్ణవేణి, దెందులూరు, ఏలూరు జిల్లామాట నిలుపుకోవాలిఅధికారంలోకి రాగానే ఏడాదికి రూ.18,000 చొప్పున ఆడబిడ్డ నిధి పథకం కింద ఇస్తామ­న్నారు. ఏడాదవుతున్నా దాని ఊసే లేదు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ హామీని అమలు చేయడం లేదు. సూపర్‌ సిక్స్‌ పథకాల కోసం అందరం ఎదురు చూస్తున్నాం. కూటమి నేతలు మాటలు చెబుతూ కాలయాపన చేస్తున్నారే గానీ పథకాల గురించి పట్టించుకోవడం లేదు. మాట నిలుపుకోకుండా మోసం చేయడం సరికాదు. – డాలు మనీషా, చిన్న కనుమళ్ల, ప్రకాశం జిల్లా ఈ పథకం అమలు కాదికఆడబిడ్డ నిధి పథకాన్ని ఇప్పటి వరకు అమలు చేయలేదు. ఇంకా పేదరికం ఉంటే పీ4 ద్వారా అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉంది. దీని ప్రకారం దాతలు ముందుకు వస్తే వారికి నచ్చిన వ్యక్తులకే అమలు చేస్తారు. దీని వల్ల నిజమైన లబ్ధిదారులకు అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. అసలు ఇక ఈ పథకం అమలు కాదనిపిస్తోంది. – కర్రి వెంకటలక్ష్మి, సామర్లకోట, కాకినాడ జిల్లామరోసారి మోసం చేస్తున్నారుఅధికారంలోకి వస్తే 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి కింద ఏడాదికి రూ.18,000 చొçప్పున ఇస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా పథకం అమలు చేయలేదు. ఎప్పుడు ఇస్తారో కూడా చెప్పడం లేదు. ఇది చాలా అన్యాయం. పీ4తో ఆడ బిడ్డ నిధిని అనుసంధానిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం చూస్తే మహిళలను మరోసారి మోసం చేస్తున్నారని తెలుస్తోంది. – సూరెడ్డి హైమావతి, మెంటాడ, విజయనగరం జిల్లాప్రభుత్వంపై నమ్మకం పోయింది కూటమి ప్రభుత్వం 18 నుంచి 59 ఏళ్ల మహిళలందరికీ ఏడాదికి రూ.18,000 ఇస్తామని హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చి సంవత్సరం కావస్తున్నప్పటికీ దాని గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. ఎప్పుడు ఇస్తారో చెప్పలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి మాటలతో ఈ పథకం అమలయ్యే సూచనలే కనిపించడం లేదు. ఇలా చేయడం సరికాదు. ఈ ప్రభుత్వంపై నమ్మకం పోయింది. – పి యేసమ్మ, ప్రకాష్‌ నగర్, కడప

fire accident at mirchowk hyderabad2
పెను విషాదం.. మీర్‌చౌక్‌లో భారీ అగ్నిప్రమాదం.. 9 మంది మృతి

సాక్షి,హైదరాబాద్‌: పాతబస్తీ మీర్‌చౌక్‌లో పెను విషాదం చోటు చేసుకుంది. ఆదివారం ఉదయం గుల్జార్‌హౌస్‌ సమీపంలో ఓ భవనంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 9మంది మృతి చెందారు. ప్రమాద సమయంలో ముగ్గురు చిన్నారులు సహా మొత్తం 16 మంది తీవ్రంగా గాయాపడ్డారు. గాయపడ్డ క్షతగాత్రుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అగ్నిమాద బాధితుల్ని రక్షించేందుకు అగ్నిమాపక సిబ్బంది సహాయ చర్యలు ముమ్మరం చేశారు. మంటల్లో చిక్కుకున్న బాధితుల్ని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే మంటల్లో చిక్కుకుని అస్వస్థతకు గురైన బాధితులకు వైద్యం కొనసాగుతుండగా.. మంటల్లో చిక్కుకున్న మరికొంత మందిని రక్షించేందుకు అగ్నిమాపక సిబ్బంది,స్థానికులు ప్రయత్నాల్ని కొనసాగిస్తున్నారు. బాధితులకు తక్షణ వైద్యం అందించేందుకు 14 అంబులెన్స్‌లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రమాదంతో పాతబస్తీలో ట్రాఫిక్‌ విభాగం ఆంక్షలు విధించింది. ట్రాఫిక్‌ను డైవర్ట్‌ చేస్తున్నట్లు తెలిపింది.

Russian Spies Targeted Elon Musk Russian Spies After War In Ukraine Began3
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం.. యువతితో మస్క్‌పై పుతిన్‌ కుట్ర?

వాషింగ్టన్‌: సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంపై పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. యుద్ధం ప్రారంభంలో రహస్యాల్ని తెలుసుకునేందుకు అపర కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ (Elon musk)పై రష్యా యువతితో వలపు వల విసిరినట్లు మాజీ ఎఫ్‌బీఐ కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ స్పెషల్‌ ఏజెంట్‌ జోనాథన్ బౌమా సంచలన వ్యాఖ్యలు చేశారు.జర్మన్‌ బ్రాడ్‌కాస్టర్‌ జెడ్‌డీఎఫ్‌ తీసిన డాక్యుమెంటరీలో జోనాథ్‌ బౌమా మాట్లాడారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్‌ పుతిన్‌ యుద్ధానికి సంబంధించిన రహస్య సమాచారాన్ని సేకరించేందుకు ప్రయత్నించారు. ఇందులో భాగంగా రష్యా ఇంటెలిజెన్స్‌ సాయంతో ఎలాన్‌ మస్క్‌, పేపాల్ సహ వ్యవస్థాపకుడు పీటర్ థీల్‌పై ఓ యువతి ప్రయోగించారు. మస్క్‌కు ఉన్న జూదం,మత్తు పదార్ధాల వినియోగంలాంటి వీక్నెస్‌ను అడ్డం పెట్టుకుని యుద్ధం సమాచారం సేకరించే ప్రయత్నం చేసినట్లు వెల్లడించారు. పుతిన్‌కు ఆపరేషన్ గురించి తెలుసా?ఇక మస్క్‌, పీటర్‌ థీల్‌పై జరిగిన ఈ సీక్రెట్‌ ఆపరేషన్‌ పుతిన్‌ కనుసన్నల్లోనే జరిగింది. పుతిన్‌ అనుమతి లేకుండా స్పై చేయరు కదా? అని జోనాథన్ బౌమా అన్నారు. అయితే, రష్యా జరిపిన సీక్రెట్‌ ఆపరేషన్‌లో మస్క్‌, పీటర్‌ థీల్‌ చిక్కుకున్నారా? లేదా? అనే విషయాల్ని వెల్లడించేందుకు జోనాథన్ బౌమా విముఖత వ్యక్తం చేశారు.కాగా, ఎఫ్‌బీఐలో 16 ఏళ్లు పని చేసిన జోనాథ్‌ బౌమా ఓ మీడియా సంస్థకు రహస్య సమాచారాన్ని అందించారు. దీంతో అమెరికా ప్రభుత్వం జోనాథ్‌ బౌమాను అరెస్ట్‌ చేసింది. చివరకు లక్షడాలర్ల పూచికత్తుతో బెయిల్‌పై విడుదలయ్యారు.

india ban bangladesh exports4
చైనా అండతో రెచ్చిపోయిన బంగ్లాదేశ్‌.. బిగ్‌ షాకిచ్చిన భారత్‌

న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌ నుంచి వచ్చే రెడీమేడ్‌ దుస్తులు, కొన్ని ప్రాసెస్ట్‌ ఆహార వస్తువుల దిగుమతులపై నౌకాశ్రయాల్లో కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. వాణిజ్య శాఖ ఆధ్వర్యంలో పనిచేసే విదేశీ వాణిజ్యం డైరెక్టరేట్‌ జనరల్‌(డీజీఎఫ్‌టీ) ఇందుకు సంబంధించిన ఒక నోటిఫికేషన్‌ను శనివారం విడుదల చేసింది. అయితే, భారత్‌ మీదుగా నేపాల్, భూటాన్‌ మినహా ఇతర అన్ని దేశాలకు వెళ్లే వస్తువులకు ఈ ఆంక్షలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. బంగ్లాదేశ్‌ రెడీమేడ్‌ దుస్తుల దిగుమతులకు ఏ ల్యాండ్‌ పోర్టులోనూ అనుమతి లేదని కేంద్రం స్పష్టం చేసింది. వీటిని కోల్‌కతా, నవసేవా పోర్టుల్లో మాత్రమే అనుమతిస్తామని పేర్కొంది. ఫ్రూట్‌ ఫ్లేవర్డ్‌ కార్బొనేటెడ్‌ డ్రింకులు, బేక్డ్‌ గూడ్స్, స్నాక్స్, చిప్స్, కాటన్, కాటన్‌ యాన్న్‌ వేస్ట్, ప్లాస్టిక్, పీవీసీ ఫినిష్ట్‌ గూడ్స్, డైస్, గ్రాన్యుల్స్, వుడెన్‌ ఫరి్నచర్, వంటి వాటిని చంగ్రాబంధా, ఫుల్బారీ ల్యాండ్‌ కస్టమ్స్‌ స్టేషన్ల ద్వారాగానీ, అస్సాం, మణిపూర్, త్రిపుర, మిజోరంలలోని ఇంటిగ్రేటెడ్‌ చెక్‌ పోస్టుల ద్వారా గానీ అనుమతించబోమని తేల్చింది. చేపలు, ఎల్పీజీ, వంట నూనెల దిగుమతులకు పోర్టుల్లో ఆంక్షలు వర్తించవని స్పష్టం చేసింది. ఇవి తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రకటించింది. బంగ్లాదేశ్‌ ఆపద్ధర్మ ప్రభుత్వ చీఫ్‌ యూనుస్‌ ఇటీవల చైనా పర్యటన సమయంలో భారత్‌కు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యల పర్యవసానమే ఈ ఆంక్షలని పరిశీలకులు అంటున్నారు. నౌకల ద్వారా భారత్‌లోని పోర్టులకు తమ వస్తువులను తరలించుకుని, ఇక్కడి నుంచి విదేశాలకు ఎగు మతులు చేసుకునేలా బంగ్లాదేశ్‌కు 2020 మే నుంచి కేంద్రం వెసులుబాటు కల్పించింది. 🔴#BREAKING: India restricts garment imports from Bangladesh to Kolkata & Mumbai ports — land ports closed.Seen as a reciprocal move after Bangladesh curbed Indian cotton & rice exports.#India #Bangladesh #Trade #GarmentImports #Pakistan pic.twitter.com/3piBRtXfnh— TheWarPolitics (@TheWarPolitics0) May 17, 2025

Sakshi Editorial On TDP Irregularities5
ఇది స్టేట్‌ ఫ్యాక్షనిజం కాదా?

ప్రభుత్వ యంత్రాంగంలో ముఠా తత్వాన్ని ప్రవేశపెడితే ఎలా ఉంటుంది? అచ్చంగా నేటి ఆంధ్రప్రదేశ్‌ పరిపాలన మాదిరిగా ఉంటుంది. కక్షలూ, కార్పణ్యాలూ, ప్రత్యర్థుల వేటలే ప్రధానాంశాలుగా సర్కారు ఎజెండాను ఆక్రమించాయి. ప్రజా శ్రేయస్సు గురించి మాట్లాడడం కూడా ఇప్పుడు అప్రకటిత నిషేధిత జాబితాలో చేరిపోయినట్టుంది. ఏలినవారిచ్చిన హామీల అమలు గురించి ప్రశ్నించడం కూడా నేరమైపోతున్నది. కేసుల బెత్తం కళ్లెర్రజేస్తున్నది. జైళ్లు నోళ్లు తెరుస్తున్నాయి.వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి, నందిగం సురేశ్, సుధారాణి, కృష్ణవేణి, రవీందర్‌రెడ్డి... ఇలా ఎంతమంది గొంతుకలపైకి ఫ్యాక్షన్‌ సర్కార్‌ పంజా విసిరిందో చూస్తూనే ఉన్నాము. అస్మదీయ బూతు జాగిలాలు మాత్రం ఎంతయినా పెట్రేగిపోయే వెసులు బాటును కల్పించారు. మొక్కుబడిగా ఒక్క పచ్చి బూతు జాగి లాన్ని అత్తారింటికి పంపినట్టు ఓ నాలుగు రోజులు లోపలికి పంపించి, సగౌరవంగా విడిచిపెట్టేశారు. ఈ బూతుశ్రీ కంటే కరుడుగట్టిన తీవ్రవాదులా... వంశీ, పోసాని, నందిగం వగైరాలు?కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి కాకముందే చంద్రబాబు అరెస్టుకు ప్రతీకారం తీర్చుకోవాలన్న దుగ్ధ ప్రభుత్వ యంత్రాంగంలో కనిపిస్తున్నది. యెల్లో మీడియాలో జ్వలిస్తు న్నది. అందుకు అవకాశమున్నదా అనే మీమాంస అవసరం లేదు. తాము కోరుకున్నట్టుగా కేసులు రాసుకోవడానికి గత ప్రభుత్వం అమలుచేసిన మద్యం పాలసీని ఎంచుకున్నారు. నిజానికి జగన్‌ ప్రభుత్వ పాజిటివ్‌ అంశాల్లో మద్యం పాలసీ కూడా ఒకటి. ఒక పాజిటివ్‌ అంశాన్ని నెగెటివ్‌ కోణంలో చూపెట్టడానికి రోజుకో సారా మజిలీ కథను, పూటకో పుక్కిటి పురాణాన్ని ప్రభుత్వ యంత్రాంగం వండి వార్చడం, యెల్లో మీడియా వడ్డించడం ఒక దైనందిన దైవకార్యంగా చేపట్టినట్టు కనిపిస్తున్నది. తాజాగా రిమాండ్‌ రిపోర్టుల పేరుతో వెలువ రిస్తున్న ఫిక్షన్‌ సాహిత్యంతో కొంతమందినైనా గందరగోళానికి గురి చేయాలనే ఉద్దేశం కనిపిస్తున్నది.జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అమలుచేసిన మద్యం విధా నంలో గందరగోళానికి గురి కావలసినంత సంక్లిష్టత ఏమీ లేదు. సామాన్యుడికి కూడా అర్థమయ్యే సులభమైన విధానం అది. మద్యం మహమ్మారి విష ప్రవాహానికి సంసారాలు ఛిద్రమవు తున్నాయనే మహిళల ఆక్రందనను ‘పాదయాత్ర’ సందర్భంగా జగన్‌ గమనించారు. దీనికి ముగింపు పలకడం కోసం మద్య నిషేధం విధించాలనే ఆలోచన చేశారు. అయితే గత అనుభవాల దృష్ట్యా ఎకాయెకిన నిషేధించడం సాధ్యమయ్యే పని కాదని, ఆచరణాత్మక పద్ధతిలో దశలవారీ నిషేధాన్ని ఎంచుకున్నారు. మద్యం షాపుల సంఖ్యను తగ్గించారు. లాభాపేక్షతో దొంగ చాటు అమ్మకాలు, కల్తీ వంటివి జరగకుండా ప్రైవేట్‌ వ్యాపా రాన్ని తొలగించి ప్రభుత్వ పరిధిలోకి అమ్మకాలను తీసు కొచ్చారు. ఫలితంగా 43 వేల బెల్ట్‌షాపులను విజయవంతంగా మూసివేయడం సాధ్యపడింది. విచ్చలవిడిగా మద్యం తయారీని నిరుత్సాహపరచడానికి ఒక్క డిస్టిలరీకి కూడా కొత్తగా అనుమతి నీయలేదు. మద్యం దుకాణాల సంఖ్యను కూడా గణనీయంగా పది శాతం కంటే ఎక్కువగానే తగ్గించారు. వాటికి అనుబంధంగా ఉండే పర్మిట్‌ రూములూ మూతపడ్డాయి. దుకాణంలో అమ్మ కాలు జరిగే సమయాన్ని తగ్గించి, రాత్రి 9 గంటలకే మూసే శారు. టీడీపీ హయాంలో అనధికారికంగా 24 గంటలూ మద్యం అమ్మకాలు సాగేవి. వ్యాపారులంతా టీడీపీ అనుయాయులే కనుక, పైదాకా మామూళ్లు ఇచ్చేవారే కనుక ఈ వేళల నియంత్రణ సాధ్యం కాలేదు.జగన్‌ ప్రభుత్వ చర్యల పర్యవసానంగా మద్యం విక్రయాలు గణనీయంగా పడిపోయాయి. చంద్రబాబు సర్కార్‌ చివరి సంవత్సరంలో (2018–2019) ఐఎమ్‌ఎఫ్‌ఎల్, బీర్లు కలిపి 6 కోట్ల 61 లక్షల కేసుల అమ్మకాలు జరిగితే, జగన్‌ ప్రభుత్వ చివరి సంవత్సరానికి (2023–24) 4 కోట్ల 44 లక్షలకు పడిపోయింది. అంటే అమ్మకాల్లో మూడో వంతు తగ్గింది. దశలవారీ మద్య నిషేధం అనే జగన్‌ సర్కార్‌ పెట్టుకున్న ఒక లక్ష్యంలో దీన్నొక పెద్ద ముందడుగుగా పరిగణించాలి.వినియోగం ఇంత తగ్గినా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం తగ్గలేదు. పైపెచ్చు గణనీయంగా పెరిగింది. మద్యాన్ని తయారు చేసే డిస్టిలరీలకు కొత్తగా ఒక్క అనుమతిని కూడా జగన్‌ ప్రభుత్వం ఇవ్వలేదు. అధిక లాభాలకోసం విచ్చలవిడిగా అమ్మకాలు సాగించే ప్రైవేట్‌ వ్యక్తులను ఈ వ్యాపారం నుంచి తప్పించారు. మొత్తం విధానం ఇంత పారదర్శకంగా ఉన్న ప్పుడు స్కామ్‌ ఎక్కడ జరిగే అవకాశముందన్న ప్రశ్నల జోలికి కూటమి సర్కార్‌ గానీ, దర్యాప్తు చేస్తున్న సిట్‌ బృందం కానీ వెళ్లదలచుకోలేదు.జగన్‌ ప్రభుత్వ హయాంలో చంద్రబాబును అరెస్టు చేశారు కనుక, ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవలసిందే, కేసులు నడపాల్సిందే అన్నట్టుగా వారి వైఖరి కనబడుతున్నది. మద్యం అమ్మకాల్లో జగన్‌ ప్రభుత్వం 3 వేల కోట్ల స్కామ్‌కు పాల్పడిందని అధికారంలోకి వచ్చిన నెల రోజులకే చంద్రబాబు తేల్చిపారేశారు. జూలైలో శ్వేతపత్రం పేరుతో జరిగిన కార్యక్ర మంలో ఆయన ఈ లెక్క చెప్పారు. ఆయన నోటివెంట వచ్చిన ‘అంకె’ను నిజం చేయడానికి దర్యాప్తు బృందం ఇప్పుడు కథలు అల్లుతున్నట్టు కనిపిస్తున్నది. ఈ కేసులో ప్రభుత్వ ఖజానా నుంచి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడానికి తీసుకున్న నిర్ణయం ఏమన్నా ఉన్నదా? నిబంధనలకు విరుద్ధంగా ప్రజా ధనాన్ని ఎవరికైనా దోచిపెట్టిన అంశం ఇమిడి ఉన్నదా? లంచా లకు ఆశించి ప్రైవేట్‌ వ్యక్తులకు వనరుల్ని కట్టబెట్టిన వైనం ఈ కథలో కనబడుతున్నదా? మరి స్కామ్‌ ఎక్కడ?చంద్రబాబును అరెస్టు చేసిన స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ ఇందుకు పూర్తిగా భిన్నమైనది. రాష్ట్రంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోసం జర్మనీకి చెందిన సీమెన్స్‌ కంపెనీ ఉదారంగా సాయం చేస్తున్నదనీ, ఇందులో పది శాతం నిధుల్ని సమకూర్చితే వాళ్లు 90 శాతం విడుదల చేస్తారనీ ఓ కట్టుకథను అల్లిపెట్టారు. సీమెన్స్‌ కంపెనీ ఆ తదనంతర కాలంలో స్వయంగా ఖండించడం వల్ల ఇది కట్టుకథని రూఢి అయింది. పది శాతం కింద రూ.371 కోట్లను విడుదల చేయాలని ముఖ్యమంత్రి కార్యా లయం నుంచి ఆర్థిక శాఖకు ఆదేశాలు వెళ్లాయి. సదరు సీమెన్స్‌ నిధులను విడుదల చేయకముందే పది శాతాన్ని విడుదల చేయడం నిబంధనలకు విరుద్ధమన్న అభ్యంతరాలను తోసి పుచ్చి నిధుల విడుదలకు ముఖ్యమంత్రి కార్యాలయం ఒత్తిడి చేసింది.పైగా తాము చెబుతున్న సీమెన్స్‌ కంపెనీకి కాదు, మధ్యలో ఓ బ్రోకర్‌ కంపెనీకి ఈ నిధులు బదిలీ చేశారు. అక్కడి నుంచి అందులో 241 కోట్ల రూపాయలు పుణె, అహ్మదా బాదుల్లోని షెల్‌ కంపెనీల ద్వారా ప్రయాణించి దుబాయ్,సింగపూర్‌ కంపెనీలకు చేరుకున్నాయని, ఆ పిదప చేరాల్సిన చివరి మజిలీకి కూడా చేరుకున్నాయని సీఐడీ ఆధారాలతో నిరూపించింది. 241 కోట్లతో స్కిల్‌ డెవలప్‌మెంట్‌కు అవస రమైన పరికరాలు కొనుగోలు చేసినట్టు పుణె షెల్‌ కంపెనీ నకిలీ ఇన్‌వాయిస్‌లు సృష్టించి ఈడీకి దొరికిపోవడంతో ఈ బాగోతం డొంకంతా కదిలింది. చంద్రబాబు అరెస్టు వెనుక ఇంత నిరూ పణ ఉన్నది.జగన్‌మోహన్‌రెడ్డి తీసుకొచ్చిన మద్యం పాలసీలో ఒక లక్ష్యం ఉన్నది. ఒక సదుద్దేశం ఉన్నది. ఆ లక్ష్యసాధనలో అనుకున్న మేరకు విజయం సాధించారు కూడా! ఇందులో ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టే అంశం లేదు. స్కామ్‌ జరగ డానికి కూడా అవకాశాలు లేవు. చంద్రబాబు సర్కార్‌ 2015లో మద్యం దుకాణాలు, బార్లపై విధించే ప్రివిలేజ్‌ ఫీజును తొల గిస్తూ ఒక రహస్య జీవోను విడుదల చేసింది.ఇందులో దురుద్దేశం ఉన్నది. డబ్బు సంపాదించే లక్ష్యం కనిపిస్తున్నది. మద్యం దుకాణాలు గానీ, బార్లు గానీ వాటి ఏడాది టార్గెట్‌ను మించి అమ్మకాలు సాగిస్తే ఆ అదనపు అమ్మకాలపై ప్రభుత్వాలు ప్రివిలేజ్‌ ఫీజు వసూలు చేసేవి. ప్రభుత్వానికి ఇదొక ఆదాయ వనరుగా ఉండేది. చీకటి జీవో ద్వారా చంద్రబాబు ఆ ఫీజును మాఫీ చేశారు. తద్వారా నాలుగేళ్లలో ఖజానాకు 5 వేల కోట్లు నష్టం జరిగిందని అంచనా!ఖజానాకు గండి పడినందువలన ప్రైవేట్‌ వ్యాపారులు లాభపడ్డారు. తమకు లాభాలు తెచ్చిపెట్టే నిర్ణయాన్ని తీసుకు న్నందుకు ప్రైవేట్‌ వ్యక్తులు లంచాలు చెల్లించే అవకాశం ఉంటుందా? ఉండదా? దాన్ని స్కామ్‌ అంటారా, లేదా? అట్లాగే 2014–2019 మధ్యకాలంలో 200 రకాల దిక్కుమాలిన బ్రాండ్లు రంగప్రవేశం చేశాయి. దీనివల్ల లాభాలు పొందింది డిస్టిలరీల వాళ్లు! ఏపీకి మద్యం సరఫరా చేస్తున్న 20 డిస్టిలరీలలో 14 చంద్రబాబు హయాంలో అనుమతి తెచ్చుకున్నవేనని సమా చారం. మిగిలిన ఆరు వేర్వేరు సమయాల్లో అనుమతి పొందాయి.జగన్‌ అనుమతించిన డిస్టిలరీ ఒక్కటి కూడా లేదు. ఈ విషయాలను పరిశీలించినప్పుడు ఎవరిది పారదర్శక విధా నమో, ఎవరిది కుంభకోణ విధానమో గ్రహించడం బ్రహ్మ విద్యేమీ కాదు. ప్రస్తుత లిక్కర్‌ కేసు నమోదు వెనుక రాజకీయ దురుద్దేశా లున్నాయని పిటిషనర్లు ప్రాథమికంగా రుజువు చేయగలిగారని సర్వోన్నత న్యాయస్థానం కూడా శుక్రవారం నాడు వ్యాఖ్యానించినట్టు వార్తలు వచ్చాయి. సాక్షులనూ, సహ నిందితులనూ ఫలానా విధంగా వాఙ్మూలం ఇవ్వాలని ఒత్తిడి చేయడం గానీ, బెదిరించడం గానీ, ప్రలోభపెట్టడం గానీ చేయవద్దని ఏపీ సీఐడీని సర్వోన్నత న్యాయస్థానం హెచ్చరించింది.రిమాండ్‌ రిపోర్టుల పేరుతో స్వీయ కవితల్ని ప్రచారం చేస్తున్నారని వినిపిస్తున్న ఆరోపణలకు సుప్రీం వ్యాఖ్యలు బలం చేకూర్చి నట్లయింది. అసలు స్కామ్‌కు అవకాశమే లేనిచోట ఏదో తవ్వి తీస్తామని షో నడపడం వెనుక అసలు ఉద్దేశం వేరు. ఈ పేరుతో కీలక వ్యక్తులను అరెస్టు చేసి, ప్రధాన ప్రతిపక్ష శ్రేణుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడం మొదటిది. తమ పరిపాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చడం రెండవది.కూటమి ప్రభుత్వం ఏడాది పాలన ఓ వైఫల్యాల పుట్ట. అవినీతి విశృంఖలంగా మారింది. చిరువ్యాపారులు 30 పర్సెంట్‌ ‘యెల్లో ట్యాక్స్‌’ కట్టలేక అల్లాడుతున్నారు. చికెన్, మటన్‌ అమ్మేవాళ్లను కూడా వదిలిపెట్టడం లేదు. జీఎస్టీ దూరని చోటుకి కూడా ‘యెల్లో ట్యాక్స్‌’ దూసుకుపోతున్నది. రైతాంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతున్నది. లాభసాటి సంగతి దేవుడెరుగు, గిట్టుబాటు ధర కూడా దక్కలేదు. పేదవర్గాల పరిస్థితి మరింత దారుణం. ‘సంపద’ సృష్టించి సంక్షేమ పథకా లను అమలు చేస్తామని చెప్పారు. ఏడాది గడిచిపోయింది. ‘తల్లికి వందనం’ ఈ జూన్‌కు రెండేళ్ల బకాయి పడింది.80 లక్షల మంది బడిపిల్లలకు 30 వేల చొప్పున చెల్లించాల్సి ఉన్నది. ‘అన్నదాతా సుఖీభవ’ కింద ఇరవై వేల చొప్పున రెండేళ్ల నిధులను ఈ జూన్‌లో జమ చేయవలసి ఉన్నది. అలాగే ‘ఆడబిడ్డ నిధి’ కూడా! ‘పీ–ఫోర్‌’ పథకం తెచ్చాం, డబ్బున్న వాళ్లు తృణమో పణమో ధర్మం చేస్తే ‘ఆ సంక్షేమం’తో పండగ చేసుకోవచ్చని ఇవ్వాళ కర్నూలులో చంద్రబాబు చెప్పారు.స్వయానా శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ నియోజకవర్గంలో దశాబ్దాలుగా పేదలు నివాసముంటున్న గృహాలను అధికారులు నేలమట్టం చేస్తుంటే ఇదేమి అన్యాయమని ప్రశ్నించే దిక్కు కూడా లేదు. పేద బిడ్డలకు నాణ్యమైన విద్య కోసం గత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను అటకెక్కించారు. పేద ప్రజల వ్యతిరేక విధానాలు రాజ్యమేలుతున్నాయి. ఉద్దేశపూర్వ కంగానే రైతాంగాన్ని దివాళా తీయించి రోడ్డెక్కించే పాలసీ అమలవుతున్నది. క్షయరోగంతో తీసుకుంటున్నవాడి నెత్తిన కిరీటం పెడితే అతడు వెలిగిపోతాడా? అమరావతిలో నాలుగు బంగళాలు కడితే రాష్ట్రంలోని విశాల ప్రజానీకం అభివృద్ధి చెందినట్టేనా? ... ఇటువంటి ప్రశ్నలు వేసే గొంతులు నొక్కే రాజ్యవిధానం ఇప్పుడు ఏపీలో అమలవుతున్నది.రాజ్యమే ఒక ఫ్యాక్షనిస్టు అవతారమెత్తి పరిపాలిస్తున్నది. ఎదురు మాట్లాడితే కేసులతో, కటకటాలతో బెదిరిస్తున్నది. ఈ ఫ్యాక్ష నిజం కేవలం ప్రతిపక్ష రాజకీయ నేతల్నే టార్గెట్‌ చేయడం లేదు. గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన ఐఏఎస్, ఐపీఎస్‌ అధికా రులను కూడా వేటాడుతున్నది. ఇది భారతదేశంలో ఎన్నడూ, ఎక్కడా జరగని దారుణం. ముఠా తత్వానికి పరాకాష్ఠ. ఈ మూడేళ్లూ (జమిలితో 2028లో ఎన్నికలు జరిగే అవకాశం) ఎటువంటి ప్రతిఘటనా లేకుండా అమరావతి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం జరిగిపోవాలని ఫ్యాక్షన్‌ పాలన భావిస్తున్నది. అందుకు ఢిల్లీ ఆశీస్సుల కోసం యువనేత శని వారం నాడు కుటుంబ సమేతంగా ప్రధానిని కలిశారు. తమరు అనుమతిస్తే ఏడాది ఉత్సవాల వెంటనే పట్టాభిషేకం చేసుకుంటానని అందుకు ఆశీర్వాదం కావాలని అడిగి ఉంటారని అంచనా. కుదరకపోతే ఈ నెలాఖరున కడపలో జరిగే ‘మహా నాడు’లో పార్టీ అధ్యక్ష స్థానమైనా యువగళానికి దక్కుతుందంటున్నారు. ఆ వెంటనే కూటమి ఏడాది పండుగ. ఇటువంటి పర్వదినాలు నిర్విఘ్నంగా గడిచిపోవాలనీ, ఎటువంటి నిరస నలూ వినిపించకూడదనీ ‘నిశ్శబ్దీకరణ’ కార్యక్రమాన్ని ఫ్యాక్ష నిస్టు ప్రభుత్వం దీక్షతో అమలుచేస్తున్నది.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com

Operation Sindoor T-shirts Trending In Social Media6
ఆపరేషన్‌ సిందూర్‌ తడాఖా.. దేశ భక్తిపై భారత్‌లో నయా ట్రెండ్‌..

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్‌ ఆపరేషన్‌ సిందూర్‌ చేపట్టింది. ఈ ఆపరేషన్‌తో పాకిస్తాన్‌కు చుక్కలు కనిపించాయి. పాక్ ఉగ్రస్థావరాలపై భారత సైన్యం విరుచుకుపడింది. భారత్‌ దాడుల్లో పాకిస్తాన్‌ ఎయిర్‌బేస్‌లు సైతం దెబ్బతిన్నాయి. తీవ్ర నష్టం జరగడంతో పాక్ కాల్పుల విరమణకు అంగీకరించింది. ఈ నేపథ్యంలో ఆపరేషన్‌ సిందూర్‌పై భారతీయులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పాక్‌పై భారత్‌ సాధించిన విజయానికి గుర్తుగా ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించిన టీషర్టులపై సైనిక నినాదాలు, వాయుసేన ఫొటోలు ముద్రించి దేశభక్తిని చాటుకుంటున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.ఇక, ఆపరేషన్‌ సిందూర్‌ విజయానికి గుర్తుగా దేశవ్యాప్తంగా తిరంగా ర్యాలీలు నిర్వహించారు. ఇక యువత సైతం ఆపరేషన్ సిందూర్ గొప్పతనాన్ని చాటేందుకు వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు. ఆపరేషన్ సిందూర్, వాయుసేనకు సంబంధించిన ఫొటోలు ముద్రించిన టీషర్ట్స్‌ని ధరించి.. గర్వంతో ఉప్పొంగిపోతున్నారు. సైన్యానికి, భారత సైనికులకు సెల్యూట్ చేస్తున్నారు. కేవలం ఫొటోలు మాత్రమే కాకుండా నినాదాలు, భారత వాయుసేనకు సంబంధించిన ఫైటర్ జెట్ ఫొటోలను ముద్రించిన టీషర్ట్స్‌ బయటకు వచ్చాయి. ఇవి యూత్‌ను బాగా ఆకట్టుకుంటున్నాయి."Our job is to hit the target, not to count the body bags!"#OperationSindoor was conceptualised with a clear military aim — to punish the perpetrators and planners of terror, and to destroy their terror infrastructure. - Command pic.twitter.com/oEY3cBXwEP— Ramraje Shinde (@ramraje_shinde) May 12, 2025ఈ టీషర్ట్స్‌పై ‘లక్ష్యాలను ఛేదించడమే మా పని.. శవాల మూటలు ఎన్నో లెక్కజెప్పడం కాదు..’, ‘కినారా హిల్స్‌లో ఏముందో మాకు తెలియదు. తెలిసిందల్లా పని చేసుకుంటూ పోవడమే’ లాంటి నినాదాలు ఉన్నాయి. పలు కంపెనీలు ఇలాంటి టీషర్ట్స్‌ను విడుదల చేశాయి. దీంతో, ఇవన్నీ హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్నాయి. పలు కంపెనీల ఈ ట్రెండ్‌ని ఫాలో అవుతున్నాయి. దేశ భక్తిని చాటేలా.. మన సైనిక శక్తి సామర్థ్యాలను తెలియజేసేలా టీషర్ట్స్ డిజైన్ చేస్తున్నారు. యువత వీటిని ధరించి.. ఇండియన్ ఆర్మీ గొప్పతనాన్ని చాటుతున్నారు. ఇప్పుడిదే ట్రెండ్ నడుస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.@IAF_MCC Proud to wear this. 💕💘🥰😍---@major_madhan In your operation sindoor video, explaining the sequence of events, there was a special series on Airmarshal AK Bharti., in which you spoke of his statement being printed on T-shirt. I got one today. pic.twitter.com/tA8qAmWRCZ— pandurangavittal.vn (@vittal_vn) May 17, 2025 Overnight this statement has become a rage and T shirts are getting printed now.Think and brood over it … why..!~Air Marshal AK Bharati~architect behind #OperationSindoor pic.twitter.com/StLqSazaX9— Braj Mohan Singh (@brajjourno) May 12, 2025 New India. New rules. No mercy.This is Bharat’s new normal: Strike first, strike hard.#OperationSindoor pic.twitter.com/FadCVJVRil— Oxomiya Jiyori 🇮🇳 (@SouleFacts) May 11, 2025

PBKS resume push for playoffs, Samson set to return for knocked-out RR7
‘ప్లే ఆఫ్స్‌’ లక్ష్యంగా  పంజాబ్‌ కింగ్స్‌

జైపూర్‌: ఐపీఎల్‌లో అనూహ్యంగా ఆగిపోయిన తమ ప్రస్థానాన్ని మళ్లీ మొదలు పెట్టేందుకు పంజాబ్‌ కింగ్స్‌ సిద్ధమైంది. మే 9న ధర్మశాలలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా శుభారంభం చేసిన తర్వాత మ్యాచ్‌ అర్ధాంతరంగా ఆగిపోవడంతో పంజాబ్‌ గెలుపు అవకాశం చేజార్చుకుంది. ఇప్పుడు లీగ్‌లో బలహీన జట్టుపై గెలిచి ‘ప్లే ఆఫ్స్‌’కు మరింత చేరువ కావాలని జట్టు భావిస్తోంది. నేడు జరిగే పోరులో రాజస్తాన్‌ రాయల్స్‌తో పంజాబ్‌ తలపడుతుంది. ‘ప్లే ఆఫ్స్‌’ అవకాశాలు ఇప్పటికే కోల్పోయిన రాజస్తాన్‌ లీగ్‌లో చివరి స్థానంలో నిలవకుండా ఉండాలని కోరుకుంటోంది. తొలిసారి మిచ్‌ ఓవెన్‌... ఐపీఎల్‌ వాయిదా పడటంతో పంజాబ్‌ ఇద్దరు కీలక ఆటగాళ్లను కోల్పోయింది. ఆసీస్‌ ఆటగాళ్లు స్టొయినిస్, ఇన్‌గ్లిస్‌ తిరిగి రావడానికి విముఖత చూపారు. దాంతో ఇప్పుడు తప్పనిసరి స్థితిలో తుది జట్టులో మార్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మ్యాక్స్‌వెల్‌ గాయంతో తప్పుకోవడంతో జట్టులోకి వచ్చిన మిచెల్‌ ఒవెన్‌ తొలిసారి ఐపీఎల్‌ బరిలోకి దిగడం ఖాయమైంది. విధ్వంసకర బ్యాటర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఒవెన్‌ గత ఏడాది బిగ్‌బాష్‌ లీగ్‌లో టాప్‌ స్కోరర్‌గా నిలవడంతో పాటు హోబర్ట్‌ హరికేన్స్‌ టైటిల్‌ గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే టాపార్డర్‌ బ్యాటర్‌ అయిన ఒవెన్‌... ప్రస్తుతం పంజాబ్‌ ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్, ప్రియాన్‌‡్ష ఆర్య అద్భుతంగా ఆడుతుండటంతో మిడిలార్డర్‌లో ఆడాల్సి రావచ్చు. బౌలింగ్‌ను పటిష్టపర్చుకోవడంలో భాగంగా కివీస్‌ పేసర్‌ కైల్‌ జేమీసన్‌ను పంజాబ్‌ ఆడించే అవకాశం ఉంది. శ్రేయస్, వధేరా, శశాంక్‌లతో జట్టు బ్యాటింగ్‌ పటిష్టంగా ఉంది. చహల్, అర్‌‡్షదీప్‌ ఫామ్‌లో ఉండటంతో పాటు మార్కో యాన్సెన్‌ కూడా మెరుగ్గా రాణిస్తుండటం పంజాబ్‌కు సానుకూలాంశం. బరిలోకి సంజు సామ్సన్‌... రాజస్తాన్‌ పేలవ ఆటతో చాలా ముందే ప్లే ఆఫ్స్‌ అవకాశాలు చేజార్చుకుంది. జట్టు 12 మ్యాచ్‌లలో 3 మ్యాచ్‌లే గెలిచింది. మిగిలిన మ్యాచ్‌లలోనైనా రాణించి పరువు కాపాడుకోవాలని టీమ్‌ భావిస్తోంది. నెల రోజుల క్రితం తన ఆఖరి ఐపీఎల్‌ మ్యాచ్‌ ఆడిన సంజు సామ్సన్‌ కోలుకొని ఇప్పుడు మళ్లీ బరిలోకి దిగుతున్నాడు. జైస్వాల్, వైభవ్‌ సూర్యవంశీ ఓపెనర్లుగా రాణిస్తుండటంతో అతను మూడో స్థానంలో ఆడతాడు. పరాగ్, జురేల్‌ కూడా రాణిస్తే రాయల్స్‌ మెరుగైన స్థితిలో నిలుస్తుంది. విదేశీ ఆటగాళ్లు హెట్‌మైర్, హసరంగ, తీక్షణ జట్టుతో చేరారు. అయితే టోర్నీ ఆరంభంనుంచి చాలా బలహీనంగా ఉన్న రాజస్తాన్‌ పేస్‌ బృందం ఆర్చర్, సందీప్‌ శర్మ దూరం కావడంతో ఇప్పుడు మరింత బలహీనంగా మారింది. తుషార్‌ దేశ్‌పాండే, ఆకాశ్‌ మధ్వాల్, నాండ్రే బర్గర్‌ పంజాబ్‌ బ్యాటర్లను ఎలా నిలువరిస్తారో చూడాలి.

Nayantara Dual Role Play For This Movie8
తొలిసారి ఖాకీ డ్రెస్‌లో కనిపించనున్న నయనతార

సౌత్‌ ఇండియా స్టార్‌ నటి నయనతార మంచి విజయాన్ని చూసి చాలా కాలమే అయ్యింది. ఆ మధ్య హిందీలో షారుక్‌ఖాన్‌కు జంటగా నటించిన జవాన్‌ చిత్రం సూపర్‌ హిట్‌ అయ్యింది. అయితే తమిళంలో ఈమె ఇటీవల నటించినా ఏ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. అంతేకాదు నయనతారను ప్రేక్షకులు తెరపై చూసి చాలా కాలమే అయ్యింది. ఆ మధ్య ఉమన్స్‌ సెంట్రిక్‌ కథా పాత్రలో నటించినా అన్నపూరిణి చిత్రం, ఇటీవల మాధవన్, సిద్ధార్థ్‌తో కలిసి నటించిన టెస్ట్‌ చిత్రాలు ఓటీటీకే పరిమితం అయ్యాయి. అవి కూడా పూర్తిగా నిరాశ పరిచాయి. దీంతో ఆమెను వెండి తెరపై చూడడానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈమె చేతిలో ప్రస్తుతం అర డజన్‌కు పైగా చిత్రాలు ఉన్నా, ఇప్పట్లో ఏదీ తెరపైకి వచ్చేలా కనిపించడం లేదు. కాగా ప్రస్తుతం నయనతార నటిస్తున్న చిత్రాల్లో మూక్కుత్తి అమ్మన్‌ 2 (అమ్మోరు2) ఒకటి. సక్సెస్‌ఫుల్‌ చిత్రాల దర్శకుడు సుందర్‌ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వేల్‌ ఫిలిమ్స్‌ ఇంటర్నేషనల్‌ పతాకంపై ఐసరి గణేష్‌ నిర్మిస్తున్నా రు. ఇది రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రం అని సమాచారం. కాగా ఇంతకు ముందు మూక్కుత్తి అమ్మన్‌ చిత్రంలో నయనతార దేవతగా నటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా దానికి సీక్వెల్‌గా రూపొందుతున్న మూక్కుత్తి అమ్మన్‌2 చిత్రంలో నయనతార ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం. అందులో ఒకటి దేవత పాత్ర కాగా, మరొకటి పోలీస్‌ అధికారి పాత్ర అని తెలిసింది. దీంతో ఈమె తొలిసారిగా ఖాకీ డ్రెస్‌లో కనిపించబోతున్నారన్నమాట. ఇంతకుముందు హిందీ చిత్రం జవాన్‌లో పోలీస్‌ అధికారిగా నటించిన అందులో ఖాకీ దుస్తులు ధరించలేదు. అలాగే నయనతార ద్విపాత్రాభినయం చేయడం ఇది రెండోసారి. ఇంతకుముందు ఐరా చిత్రంలో ద్విపాత్రాభియం చేశారు. కాగా మూక్కుత్తి అమ్మన్‌ 2 చిత్రంలో నయనతారతో పాటు ఇండియా యోగిబాబు సింగం పులి కన్నడ నటుడు దునియా విజయ్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. చిత్రంలో గ్రాఫిక్స్‌ సన్నివేశాలు మరో హైలెట్‌గా ఉంటాయని సమాచారం.

SBI Card Apollo Health launch co branded health focused credit card9
ఎస్‌బీఐ-అపోలో కొత్త క్రెడిట్‌ కార్డు.. బెనిఫిట్స్‌ ఇవే..

న్యూఢిల్లీ: ప్రముఖ క్రెడిట్‌ కార్డుల జారీ సంస్థ ఎస్‌బీఐ కార్డ్, దిగ్గజ రిటైల్‌ ఫార్మసీ చెయిన్‌ అపోలో హెల్త్‌కో కీలక భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగా అపోలో ఎస్‌బీఐ కార్డ్‌ సెలెక్ట్‌ కార్డ్‌ను ఆవిష్కరించాయి. ఈ కార్డ్‌ ద్వారా అపోలో ఫార్మసీతో పాటు అపోలో 24/7 యాప్‌లో ఆకర్షణీయమైన ఆఫర్లు పొందవచ్చు. ఫార్మసీ ఉత్పత్తులు, ఆరోగ్య పరీక్షలు, ఇతర పలు రకాల సేవలకు చెల్లింపులు చేయొచ్చు.అపోలో ఎస్‌బీఐ సెలెక్ట్‌ క్రెడిట్‌ కార్డును రూపే, మాస్టర్‌కార్డ్‌ ప్లాట్‌ఫామ్స్‌పై తీసుకొచ్చారు. ఈ కార్డ్‌ ద్వారా ఎంపిక చేసిన హెల్త్‌, వెల్‌నెస్‌ ఉత్పత్తుల కొనుగోలుపై 25 శాతం వరకూ ఆదా చేసుకోవచ్చు. అలాగే అపోలో 24|7 యాప్‌, రిటైల్‌ స్టోర్లలో కొనుగోలుపై రివార్డ్స్‌ పాయింట్స్‌గా 10 శాతం, హెల్త్‌ క్రెడిట్స్‌ రూపంలో 15 శాతం వరకూ తిరిగి పొందవచ్చు. అలాగే వెల్‌కమ్‌ గిఫ్ట్‌ కింద రూ.1,500 విలువ చేసే ఇ–గిఫ్ట్‌ వోచర్‌ లభిస్తుంది.అపోలో 24|7 యాప్‌, ఎస్‌బీఐ కార్డ్‌ వెబ్‌సైట్‌లలో డిజిటల్‌గా ఈ అపోలో ఎస్‌బీఐ సెలెక్ట్‌ క్రెడిట్‌ కార్డును పొందవచ్చు. అలాగే కొన్ని ఎంపిక చేసిన అపోలో ఫార్మసీ స్టోర్లలో వ్యక్తిగతంగానూ వీటిని తీసుకోవచ్చు. ఈ కార్డ్‌ వార్షిక ఫీజు రూ.1499. దీనికి ట్యాక్స్‌లు అదనం.సంవత్సరానికి రూ.3 లక్షలకు మించి ఖర్చు చేస్తే వార్షిక ఫీజు మినహాయింపు పొందవచ్చు.

International Tea Day 2025: The United Nations created a special day to honor tea10
చాయ్‌ చమక్కులు..! ఏమి'టీ' వింతలు!

‘ఏ చాయ్‌ చటుక్కున తాగరా భాయ్‌/ ఈ చాయ్‌ చమక్కులే చూడరా భాయ్‌’ అనే సినీగీతం చాలామందికి తెలిసినదే! చాయ్‌ చమక్కులు చాలానే ఉన్నాయి. చాయ్‌ చరిత్ర కూడా చాలానే ఉంది. మే 21న ప్రపంచ తేనీటి దినోత్సవం సందర్భంగా కొన్ని చాయ్‌ చమక్కులు మీ కోసం...చాయ్, టీ అనే పదాలతో పిలుచుకునే తేనీరు చాలామందికి అభిమాన పానీయం. చాయ్, టీ– ఈ రెండు పదాలూ తేయాకుకు పుట్టినిల్లయిన చైనాలోనే పుట్టాయి. ఓడమార్గం వర్తకుల ద్వారా ‘టీ’ అనే మాట పాశ్చాత్య ప్రపంచంలో ప్రాచుర్యం పొందింది. ‘చాయ్‌’ అనే మాట సిల్క్‌రూట్‌ ద్వారా భారత్‌ సహా పలు ఆసియన్‌ దేశాలకు వ్యాపించింది. తొలి రోజుల్లో డచ్‌ వర్తకులు చైనాతో నౌకా వాణిజ్యం సాగించేవారు. వారు ఎక్కువగా చైనా తీర ప్రాంతంలోని ఫుజియన్‌ మాండలికం మాట్లాడే వర్తకులతో లావాదేవీలు జరిపేవారు. వారు తేయాకుకు, తేనీటికి ‘టీ’ అనే మాటను ఉపయోగించేవారు. వారి ద్వారా ఈ మాట ఇంగ్లిష్‌ సహా పలు యూరోపియన్‌ భాషలకు చేరింది. భూమార్గంలో సిల్క్‌రూట్‌ గుండా చైనాకు వచ్చే విదేశీ వర్తకులు ఎక్కువగా చైనాలో మాండరిన్‌ చైనీస్‌ భాష మాట్లాడే వర్తకులతో లావాదేవీలు సాగించేవారు. వారి ద్వారా ‘చాయ్‌’ మాట భారత్‌ సహా పలు ఆసియా దేశాలకు, అరబ్‌ దేశాలకు వ్యాపించింది. ఎన్నో రకాలు.. ఎన్నో రుచులుప్రపంచవ్యాప్తంగా మూడువేలకు పైగా తేయాకు రకాలు ఉన్నాయి. వీటిలో ఆరు రకాలు బాగా ప్రాచుర్యం పొందాయి. బ్లాక్‌ టీ, గ్రీన్‌ టీ, ఉలాంగ్‌ టీ, వైట్‌ టీ, పూఎయిర్‌ టీ, యెల్లో టీ రకాలు ఎక్కువగా వాడుకలో ఉన్నాయి. ఈ ఆరురకాలు మాత్రమే కాకుండా, రకరకాల తేయాకుల నుంచి రకరకాల రుచులతో తయారు చేసే తేనీటి పానీయాలు కూడా వాడుకలో ఉన్నాయి. ప్రపంచంలో విస్తృత ప్రాచుర్యం పొందిన రకాలు, అరుదైన రకాల తేనీటి పానీయాలు కొన్నింటి గురించి తెలుసుకుందాం...పూఎయిర్‌ టీచైనాలో దొరికే అరుదైన తేయాకుతో దీనిని తయారు చేస్తారు. క్రీస్తుశకం ఏడో శతాబ్ది నుంచి ఇది వాడుకలో ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి. ఈ రకం తేయాకు ఎంత పాతబడితే దీనితో తయారు చేసే టీ అంత రుచిగా ఉంటుందని చైనీయుల నమ్మకం. పూఎయిర్‌ టీని ‘గోంగ్‌ఫు చా’ అని కూడా అంటారు. వేడి నీటితో శుభ్రం చేసిన పాత్రలో ముందుగా ఈ రకం తేయాకును వేసి, అందులో మరుగుతున్న నీటిని పోస్తారు. తేయాకు మరుగునీటిలో ఐదు నిమిషాలు నానిన తర్వాత వడగట్టి, కప్పుల్లో పోసుకుని తాగుతారు. చైనాలోని యునాన్‌ ప్రావిన్స్‌లో ఈ రకం తేయాకు ఎక్కువగా దొరుకుతుంది. యునాన్‌ ప్రావిన్స్‌లో ఈ తేనీటిని పులియబెట్టి, తాగే ముందు మరిగించి సేవించే పద్ధతి కూడా ఉంది. ఇది జీర్ణసమస్యలకు విరుగుడుగా పనిచేస్తుందని చైనీయుల నమ్మకం.బటర్‌ టీఇది టిబెట్‌ ప్రాంతంలో బాగా ప్రాచుర్యంలో పొందిన సంప్రదాయ పానీయం. జడలబర్రె వెన్నకు, కొద్దిగా బార్లీ పొడి, ఉప్పు జోడించి, వెన్నను బాగా చిలికి, మరుగుతున్న బ్లాక్‌ టీలో వేస్తారు. కొందరు ఇందులో పాలు, పంచదార కూడా జోడిస్తారు. పొద్దున్నే ఈ బటర్‌ టీ తాగితే రోజంతా ఉత్సాహంగా ఉంటుందని, ఒంట్లోని శక్తి తరిగిపోకుండా ఉంటుందని చెబుతారు. ఇటీవలి కాలంలో డెయిరీ ఫామ్స్‌లో దొరికే వెన్నను ఉపయోగించి కూడా బటర్‌ టీని తయారు చేస్తున్నారు.చా యెన్‌ఇది థాయ్‌లాండ్‌లో ప్రసిద్ధి పొందిన పానీయం. గాఢంగా తయారు చేసిన బ్లాక్‌టీలో చక్కెర, పాలు కలిపి, అనాసపువ్వు వంటి సుగంధ ద్రవ్యాలను జోడించి మరిగిస్తారు. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులో మంచుముక్కలు వేసుకుని శీతల పానీయంలా సేవిస్తారు. కొందరు దీనికి పసుపు, నారింజ ఫుడ్‌కలర్స్‌ను కూడా జత చేస్తారు.చాయ్‌ఇది మన భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందిన పానీయం. చాయ్‌ అన్నా, టీ అన్నా మనకు తెలిసిన పద్ధతి ఒకటే! తేయాకు పొడివేసి మరిగించిన నీటిలో పాలు, పంచదార కలిపి తయారు చేస్తారు. కొన్ని చోట్ల ఈ తేనీటికి బాగా దంచిన అల్లం జోడించి అల్లం టీ తయారు చేస్తారు. ఇంకొన్ని చోట్ల సుగంధ ద్రవ్యాల పొడులు జోడించి, మసాలా చాయ్‌ తయారు చేస్తారు. చాయ్‌ ఒకరకంగా మన జాతీయ పానీయం అనే చెప్పుకోవాలి!రూయిబోస్‌నిజానికి ఇది తేయాకుతో తయారు చేసే టీ కాదు. ‘రూయిబోస్‌’ అంటే ఎర్రని పొద అని అర్థం. దక్షిణాఫ్రికాలో పెరిగే రూయిబోస్‌ ఆకులతో దీనిని తయారు చేస్తారు. మరుగుతున్న నీటిలో ఈ ఆకులను వేసి, మరికాసేపు మరిగిన తర్వాత వడగట్టి కప్పుల్లో పోసుకుని వేడి వేడిగా సేవిస్తారు. ఇందులో కెఫీన్‌ ఉండదు. కెఫీన్‌ వద్దనుకునేవారికి ఇది మంచి ప్రత్యామ్నాయం అని చెబుతారు. రూయిబోస్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయని చెబుతారు.వైట్‌ టీఇది చాలా అరుదైన రకం పానీయం. తేయాకు మొక్కల్లో అత్యంత అరుదైన ‘కేమెలియా సైనెసిస్‌’ అనే మొక్క నుంచి లేత చిగురుటాకులను, మొగ్గలను సేకరించి, వాటితో వైట్‌ టీ తయారు చేస్తారు. వైట్‌ టీ కోసం లేత చిగురుటాకులను, మొగ్గలను వసంతకాలం ప్రారంభమయ్యే సమయంలో సేకరిస్తారు. బ్లాక్‌ టీ, గ్రీన్‌ టీల కంటే వైట్‌ టీ గాఢత చాలా తక్కువగా ఉంటుంది. చైనాలోని ఫుజియన్‌ ప్రావిన్స్‌లో ఈ అరుదైన తేయాకు ఎక్కువగా దొరుకుతుంది. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని, ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, వాపులను తగ్గించే ఔషధ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని పలు పరిశోధనలు చెబుతున్నాయి.యెల్లో టీతేయాకు మొక్కల నుంచి సేకరించిన లేత ఆకులను ప్రత్యేకమైన పద్ధతిలో ఆరబెట్టి యెల్లో టీకి తగిన తేయాకును తయారు చేస్తారు. కొరియాలో యెల్లో టీ వినియోగం ఎక్కువ. కొరియన్లు దీనిని ‘హ్వాంగ్‌ చా’ అని, చైనీయులు దీనిని ‘హువాంగ్‌ చా’ అని అంటారు. తయారీ పద్ధతిలోని కష్టనష్టాల కారణంగా దీని ఖరీదు చాలా ఎక్కువగా ఉంటుంది. మరుగుతున్న నీటిలో ఈ ఆకులను వేసి తేనీటిని తయారు చేస్తారు. ఇది పారదర్శకమైన లేత పసుపు రంగులో ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెబుతారు.∙∙ పురాతన చరిత్రటీ ఆధునిక పానీయమని చాలామంది పొరబడతారు. ఇలా పొరబడటానికి కారణం లేకపోలేదు. మధ్యయుగాల వరకు తేయాకు వినియోగం కేవలం చైనాకు మాత్రమే పరిమితమైంది. డచ్‌ వర్తకులు, పోర్చుగీసు వర్తకులు క్రీస్తుశకం పదిహేడో శతాబ్ది తొలినాళ్లలో తేయాకును యూరోప్‌కు పరిచయం చేశారు. క్రమంగా ఇది ఇంగ్లండ్‌కు, అక్కడి నుంచి బ్రిటిష్‌ వలస రాజ్యాలకు చేరింది. అయితే, తేనీటి వినియోగం క్రీస్తుపూర్వం 2732 నాటికే చైనాలో మొదలైనట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఒక అనుకోని సంఘటన వల్ల ఆనాటి చైనా చక్రవర్తి షెన్‌ నుంగ్‌కు తేయాకు మహిమ తెలిసివచ్చిందట! ఒకనాడు ఆయన ఆరుబయట కూర్చుని, నీరు మరిగిస్తున్నప్పుడు ఆ నీటిలో ఒక చెట్టు నుంచి రాలిన ఆకులు పడ్డాయి. ఆ నీటిని ఆయన సేవించాడు. దాని రుచి, పరిమళం ఆయనకు తెగ నచ్చాయి. అంతేకాదు, ఆ పానీయం తన శరీరంలోని అణువణువును శోధిస్తున్న అనుభూతి కూడా కలిగిందట! అందుకే ఆయన ఈ పానీయానికి ‘చా’ అని పేరుపెట్టాడు. చైనీస్‌ భాషలో ‘చా’ అంటే శోధించడం లేదా తనిఖీ చేయడం అని అర్థం. క్రీస్తుశకం పద్నాలుగో శతాబ్దిలో బౌద్ధ గురువు డెంగ్యో దైషీ తొలిసారిగా జపాన్‌కు తేయాకును పరిచయం చేశాడు. ఆయన ద్వారా అనతికాలంలోనే తేనీరు జపనీయుల అభిమాన పానీయంగా మారింది. మిగిలిన ప్రపంచానికి ఇది పరిచయం కావడానికి మాత్రం మరికొన్ని శతాబ్దాల కాలం పట్టింది. ఇరవయ్యో శతాబ్ది నాటికి తేనీటి మహిమ ప్రపంచమంతటికీ తెలిసివచ్చింది. తేయాకు మొక్కలు సాధారణంగా పొదలుగా పెరగడమే చూస్తుంటాం. నిజానికి ఇవి మొక్కలు కావు, చెట్లు. ఇవి వంద అడుగుల ఎత్తువరకు పెరగగలవు. వీటి జీవితకాలం యాభైఏళ్లకు పైగానే ఉంటుంది.గ్రీన్‌ టీ కోసం సాధారణంగా ఆరబెట్టిన తేయాకునే వాడతారు. జపాన్‌లో అత్యంత అరుదుగా కొందరు తాజా తేయాకును నేరుగా మరిగించి, గ్రీన్‌ టీ తయారు చేస్తారు. దీనిని ‘టెన్చా’ అంటారు.చైనాలో తడిపి ఆరబెట్టిన తేయాకును ఒత్తిడికి గురిచేసి, కేకుల్లా మార్చి నిల్వచేసేవారు. వీటిని రెండేళ్ల నుంచి యాభయ్యేళ్ల వరకు నిల్వ ఉంచి, తేనీటి తయారీకి వినియోగించేవారు. వీటితో తయారు చేసిన తేనీటిని ‘కొంబూచా’ అంటారు. అలాగే, ఈ తేయాకు కేకులను నగదుగా కూడా ఉపయోగించే వారు.తేయాకు యూరోప్‌కు పరిచయమైన కొత్తరోజుల్లో దీని ఖరీదు చాలా ఎక్కువగా ఉండేది. ఇంగ్లండ్‌లో తేనీటి సేవనం రాచవంశీకులకు, సంపన్నులకు మాత్రమే పరిమితమై ఉండేది. పద్దెనిమిదో శతాబ్దిలో తేయాకు తోటల్లో విందులు జరుపుకోవడం సంపన్నుల వేడుకగా ఉండేది.తేయాకు కోసం బ్రిటన్‌కు, చైనాకు యుద్ధం కూడా జరిగింది. బ్రిటన్‌లో తేయాకుకు గిరాకీ విపరీతంగా పెరిగింది. దిగుమతి చేసుకోవాలంటే, చైనా మాత్రమే ఆధారం. తేయాకు కోసం వెండి రూపంలోనే చెల్లింపులు జరపాలని చైనా బిగదీసుకుంది. బ్రిటిష్‌ ఖజానాలోని వెండి నిల్వలన్నీ తేయాకుకే ఖర్చవుతుండటంతో బ్రిటిష్‌ సైన్యం చైనాతో యుద్ధం చేసింది. ‘మొదటి నల్లమందు యుద్ధం’ పేరుతో 1839–42 వరకు చరిత్రలో నమోదైన ఈ యుద్ధానికి అసలు కారణం తేయాకు గిరాకీనే! (చదవండి: వ్యోమయాత్రకు భారతీయుడు)

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement