Top Stories
ప్రధాన వార్తలు

తిరుపతిలో దళిత విద్యార్థిపై దాడి ఘటన.. వైఎస్ జగన్ ఆగ్రహం
సాక్షి, తాడేపల్లి: తిరుపతిలో దళిత విద్యార్థి జేమ్స్‌పై దాడి ఘటనపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంజినీరింగ్ దళిత విద్యార్థి జేమ్స్‌పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానంటూ ట్వీట్ చేశారు. ‘‘రాష్ట్రంలో దిగజారిపోయిన శాంతి భద్రతలకు, దళితులపై తీవ్రమవుతున్న దాడులకు ఈ ఘటన ఒక ఉదాహరణ. దళితులు, తమ గొంతు గట్టిగా వినిపించలేని వర్గాల వారికి ఈ రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయింది’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.‘‘చంద్రబాబు, అధికార పార్టీ నాయకుల డైరెక్షన్లో కక్ష సాధింపు చర్యల్లో మునిగి తేలుతున్న పోలీసు యంత్రాంగం పౌరులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యతను పూర్తిగా విస్మరించడంవల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట దళితులపైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. పోలీస్ స్టేషన్లకు వెళ్తే న్యాయం జరుగుతుందన్న నమ్మకం పోవడమే కాదు.. ఫిర్యాదు దారులమీదే ఎదురు కేసులు పెట్టడం పరిపాటిగా మారింది...జేమ్స్‌పై దాడి ఘటనలో పోలీసు యంత్రాంగం వైఫల్యమే కాదు, రాజకీయ జోక్యంతో కనీసం ఫిర్యాదునుకూడా స్వీకరించలేని పరిస్థితి. తిరుపతి ఘటనకు కారకులైన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను’’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.తిరుపతిలో ఇంజినీరింగ్ దళిత విద్యార్థి జేమ్స్‌పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాష్ట్రంలో దిగజారిపోయిన శాంతి భద్రతలకు, దళితులపై తీవ్రమవుతున్న దాడులకు ఈ ఘటన ఒక ఉదాహరణ. దళితులు, తమ గొంతు గట్టిగా వినిపించలేని వర్గాల వారికి ఈ రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయింది. @ncbn, అధికారపార్టీ…— YS Jagan Mohan Reddy (@ysjagan) May 18, 2025

చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్.. విరాట్ కోహ్లి రికార్డు బ్రేక్
టీమిండియా స్టార్ బ్యాటర్, ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు కేఎల్ రాహుల్ అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో అత్యంత వేగంగా 8,000 పరుగులు మైలు రాయిని అందుకున్న భారత ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఐపీఎల్-2025లో ఢిల్లీ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 33 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఈ రికార్డును రాహుల్ సాధించాడు. రాహుల్ 224 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్‌ను అందుకున్నాడు. ఇప్పటివరకు ఈ రికార్డు టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి పేరిట ఉండేది. కోహ్లి 243 ఇన్నింగ్స్‌ల్లో 8 వేల పరుగుల మైలు స్టోన్‌ను అందుకున్నాడు. తాజా మ్యాచ్‌తో కోహ్లి రికార్డును కేఎల్ బ్రేక్ చేశాడు.ఓవరాల్‌గా ఈ ఫీట్ సాధించిన జాబితాలో వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం (213 ఇన్నింగ్స్‌లు) అగ్రస్థానంలో ఉండగా.. రెండో స్ధానంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం(218) కొనసాగుతున్నాడు. తర్వాతి స్థానాల్లో వరుసగా కేఎల్ రాహుల్, కోహ్లి, పాక్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ (244) ఉన్నారు.రాహుల్ సూపర్ సెంచరీ..ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ సూపర్ సెంచరీతో చెలరేగాడు. రాహుల్ 65 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్స్‌లతో 112 పరుగులు చేశాడు. రాహుల్‌కు ఇది ఐదో ఐపీఎల్ సెంచరీ. రాహుల్ అద్బుత ఇన్నింగ్స్ ఫలితంగా ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. రాహుల్‌తో పాటు అభిషేక్ పోరెల్(30), అక్షర్ పటేల్(25), స్టబ్స్(21) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. గుజరాత్ బౌలర్లలో అర్షద్ ఖాన్, సాయికిషోర్, ప్రసిద్ద్ కష్ణ తలా వికెట్ సాధించారు.చదవండి: IPL 2025: రాజస్తాన్‌పై విజయం.. ప్లే ఆఫ్స్‌కు చేరువలో పంజాబ్

తీవ్ర విషాదం.. కారు డోర్ లాక్ పడి నలుగురు చిన్నారుల మృత్యువాత
విజయనగరం: జిల్లాలోని ద్వారపూడి గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కారు డోర్ లాక్ పడటంతో నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం ఉదయం ఈ నలుగురు చిన్నారులు ఆడుకునేందుకు బయటకు వెళ్లారు. తల్లిదండ్రులంతా ఉదయం నుంచి వెతికినప్పటికీ కనిపించలేదు.అయితే గ్రామంలో మహిళా మండల కార్యాలయం వద్ద ఆగి ఉన్న ఒక కారులోకి నలుగురు చిన్నారులు సరదాగా కూర్చునేందుకు వెళ్లి కారు డోర్ వేశారు. దీంతో కారు డోర్ లాక్ పడడంతో ఊపిరి ఆడక మంగి బుచ్చిబాబు, భవాని దంపతుల కుమారుడు ఉదయ్ (8), బుర్లు ఆనంద్ ఉమా దంపతుల ఇద్దరు కుమార్తెలు చారుమతి (8) చరిష్మా (6), కంది సురేష్ అరుణ దంపతుల కుమార్తె మనస్విని మృతి చెందారు. ఉదయం ఆడుకోవడానికి వెళ్లిన చిన్నారులు ఇలా మృత్యువాత పడటంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. తమ బిడ్డలు చనిపోవడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. మృతిచెందిన చిన్నారులపై పడి వారు రోదిస్తున్న తీరు వర్ణనాతీతం. చిన్నారుల తల్లిదండ్రుల్ని బంధువులు ఓదార్చడానికి ప్రయత్నిస్తున్నా వారిని ఆపడం కష్టసాధ్యంగా మారింది.

హత్యాయత్నం కేసు.. ప్రముఖ నటి అరెస్ట్
బంగ్లాదేశ్ కు చెందిన ప్రముఖ నటి నుసారత్ ఫరియాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ హత్యాయత్నం కేసుకు సంబంధించి ఆమెను అరెస్ట్ చేశారు ఆ దేశ పోలీసులు. ఆమె థాయ్ లాండ్ కు వెళుతున్న క్రమంలో ఢాకా షహజలాల్ అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ లో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. . ఇమిగ్రేషన్ చెక్ పాయింట్ వద్ద ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు బంగ్లాదేశ్ మీడియా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.గతేడాది ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన అల్లర్లలో ఆమెతో పాటు మరో 17 మందిపై హత్యాయత్నం అభియోగాలు నమోదయ్యాయిఇమ్మిగ్రేషన్ అధికారుల సమాచారం ఆధారంగా తమ బృందం విమానాశ్రయంలో ఆమెను అదుపులోకి తీసుకోవడానికి వెళ్లినట్లు పోలీస్ అధికారి సుజన్ హక్ తెలిపారు. కోర్టు కూడా ఆమెపై హత్యాయత్నం కేసు అభియోగాన్ని సమర్థించిన విషయాన్ని సదరు పోలీస్ అధికారి తెలిపారు. ప్రస్తుతం ఆమెపై పతరా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైనట్లు తెలిపారు. గతేడాది బంగ్లాదేశ్ లో జరిగిన అల్లర్ల కారణంగా షేక్ హసీనా ప్రధాని పదవిని కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇక 2023లో తెరకెక్కిన ముజిబ్: ద మేకింగ్ ఆఫ్ నేషన్ చిత్రంలో షేక్ హసీనా పాత్రలో నటించింది నుసారత్ ఫరియా.

ప్రపంచంలోనే తొలి AI హాస్పిటల్: డాక్టర్లు, నర్సులు అంతా రోబోలే..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రాజ్యమేలుతోంది. దాదాపు అన్ని రంగాల్లో కృత్రిమ మేధ హవా కొనసాగుతోంది. ఇప్పటికే చాలా రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఏఐ.. వైద్య రంగంలో కూడా అద్భుతాలు సృష్టిస్తోంది. ఆధునిక వైద్య శాస్త్రాన్ని పునర్నిర్వచించగల చర్యలో భాగంగా.. చైనా ప్రపంచంలోనే మొట్టమొదటి పూర్తి AI ఆధారిత ఆసుపత్రి (ఏజెంట్ హాస్పిటల్)ని ప్రారంభించింది.సింఘువా యూనివర్సిటీ పరిశోధకులు ఏఐ బేస్డ్ "ఏజెంట్ హాస్పిటల్"ను సృష్టించారు. ఇక్కడ ఉన్న డాక్టర్లు, నర్సులు అన్నీ కూడా రోబోలే. ఇక్కడ ఏఐ డాక్టర్లు.. ఉబ్బసం, గొంతునొప్పి వంటి సుమారు 30 రకాల జబ్బులకు చికిత్స అందిస్తాయి. ఈ వినూత్న ప్రయత్నం వైద్య చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది.ఏజెంట్ హాస్పిటల్ రీసర్చ్ టీమ్ లీడర్ 'లియు యాంగ్' మాట్లాడుతూ.. ఏఐ డాక్టర్లు రోగులకు చికిత్స చేయడానికి మాత్రమే కాకుండా.. వైద్య విద్యార్థులకు మెరుగైన శిక్షణను అందించడానికి కూడా ఉపయోగపడతాయని అన్నారు. ఎందుకంటే.. ఈ ఏఐ ఏజెంట్లు యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామ్ (USMLE)లో 93.06 శాతం స్కోర్ సాధించాయని పేర్కొన్నారు.కొన్ని వారాలలోనే.. సంవత్సరాల క్లినిక్ అనుభవాన్ని పొందగల ఏఐ డాక్టర్లు రోగ నిర్దారణలో కూడా ప్రావీణ్యం పొంది ఉన్నాయని అన్నారు. ఏఐ వైద్య సిబ్బంది.. లైసెన్సింగ్ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించగలిగితే.. శస్త్రచికిత్సలు సైతం చేయగలవు. ఏజెంట్ హాస్పిటల్లో 14 మంది ఏఐ డాక్టర్లు, నలుగురు ఏఐ నర్సులతో కూడిన సిబ్బంది ఉన్నారు. వీరందరూ.. రోజుకు 3000 మంది రోగులతో.. పరస్పర చర్య చేయగలరని లియు యాంగ్ అన్నారు.ఇదీ చదవండి: 'అమెరికాలో ఉంటున్న భారతీయులకు హెచ్చరిక'టెక్నాలజీ అభివృద్ధి చెందటం.. వైద్య రంగంలో ఏఐ డాక్టర్లు పుట్టుకురావడం బాగానే ఉంది. ఇవన్నీ యంత్రాలు కాబట్టి.. ఇవి భావోద్వేగాలకు అతీతం. కాబట్టి ఏదైనా చిన్న పొరపాటు జరిగినా.. రోగుల ప్రాణాలు పోయే అవకాశం ఉంది. కాబట్టి వైద్య రంగంలో సహాయకులుగా, వైద్య విద్యార్థులు బోధించడానికి ఏఐ సిబ్బంది ఉపయోగపడినప్పటికీ, ఆపరేషన్స్ చేయడం వంటివి ఏ మాత్రం సమంజసం?.. అనేది ఆలోచించాలి.

లష్కరే టాప్ టెర్రరిస్ట్ సైఫుల్లా ఖలీద్ హతం
లష్కరే టాప్ టెర్రరిస్ట్ సైఫుల్లా ఖలీద్ హతమయ్యాడు పాకిస్థాన్‌లో ఖలీద్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. తన నివాసం నుంచి ఆదివారం మధ్యాహ్నం బయటకు వెళ్లిన ఖలీద్‌ను దాడి చేసి హతమార్చారు. లష్కరే కమాండర్లతో కలిసి ఖలీద్ పనిచేశాడు. 2006లో నాగపూర్ ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయంపై దాడి ఘటనలో ఖలీద్ సూత్రధారి.నాగపూర్, రాంపూర్, బెంగుళూరు దాడుల్లో ఖలీద్ హస్తం ఉంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఖలీద్‌కు పాకిస్థాన్ సర్కార్ భద్రత కల్పించింది. నేపాల్‌లో ఉంటూ లష్కరే కార్యకలాపాలు నిర్వహించిన ఖలీద్.. ఇటీవల సింధ్ ప్రావిన్స్‌లోని బాదిక్ జిల్లాకు మకాం మార్చాడు. ఇవాళ అక్కడే హతమయ్యాడు. 2001లో రాంపుర్లోని సీఆర్పీఎఫ్ శిబిరంపై, 2005లో బెంగళూరులోని ఐఐఎస్‌సీపై జరిగిన దాడుల్లోనూ ఖలీద్ హస్తం ఉంది.

బాబు సర్కార్ కక్ష సాధింపు.. మరోసారి నందిగం సురేష్ అరెస్ట్
గుంటూరు: మాజీ ఎంపీ నందిగం సురేష్‌పై చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగింది. మరోసారి ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. టీడీపీ కార్యకర్త ఇసుకపల్లి రాజు నిన్న(శనివారం) నందిగం సురేష్ ఇంటి దగ్గర తాగి వీరంగం సృష్టించాడు. నందిగం సురేష్ కుటుంబ సభ్యులను దూషించిన రాజు.. సురేష్‌ను చంపేస్తే తనకున్న ఆస్తుల్లో కొంత భాగం రాసిస్తానంటూ హడావుడి చేశాడు.నందిగం సురేష్ కార్లపైన రాజు దాడి చేశాడు. ఎందుకు వీరంగం సృష్టిస్తున్నావంటూ రాజును నందిగం సురేష్ అనుచరులు ప్రశ్నించారు. దీంతో రాజు, నందిగామ సురేష్ అనుచరులకు మధ్య గొడవ జరిగింది. తనపై దాడి చేశారంటూ రాజు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. రాజు తమ కారులపై దాడి చేసి తమ కుటుంబ సభ్యులను దూషించాడని.. నందిగం సురేష్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.నందిగం సురేష్ కుటుంబ సభ్యుల ఫిర్యాదును పట్టించుకోని పోలీసులు.. రాజు ఇచ్చిన ఫిర్యాదుతో సురేష్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. అధికార పార్టీ నేతల ప్రోద్భలంతో నందిగం సురేష్‌తో పాటు ఆయన అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. నందిగం సురేష్‌ని అరెస్ట్ చేసి తుళ్లూరు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు.

సంగారెడ్డిలో ఉగ్రమూలాల కలకలం.. పాక్‌కు సమాచారం చేరవేత?
సంగారెడ్డి: జిల్లాలో ఉగ్రమూలాల కలకలం రేగింది. కొండాపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో అస్సాం రాష్ట్రానికి చెందిన ఇస్లాం(19) అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించే క్రమంలో షాకింగ్ విషయాలు బయడపడినట్లు తెలుస్తోంది. అస్సాం పోలీసుల ఆపరేషన్ ఘోస్ట్ సిమ్ లో భాగంగా ఇస్లాం బాగోతం వెలుగులోకి వచ్చింది.అస్సాంలో గుర్తింపు కార్డులు లేకుండా సిమ్ కార్డులు తీసుకుని సంగారెడ్డి జిల్లాలో పలువురికి విక్రయిస్తున్నట్లు తెలిసింది. గతంలో అస్సాంలో మొబైల్ షాపులో పని చేసిన ఇస్లాం.. అక్కడే కొందరి గుర్తింపు కార్డులతో నకిలీ సిమ్ లు తీసుకుని అధిక ధరకు విక్రయించాడు.ప్రస్తుతం గొల్లపల్లిలో తాపీ మేస్త్రీగా పని చేస్తున్నాడు. అదే సమయంలో తన వద్ద ఉన్న నకిలీ సిమ్ కార్డులను పాకిస్తానీయులకు అమ్మినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. భారత్ ఫోన్ నెంబర్లతో పాకిస్తాన్ లో వాట్పాప్ అకౌంట్ లు క్రియేట్ కావడంతో ఈ కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు పోలీసులు.ఇటీవల జరిగిన భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధంలో భాగంగా మీడియాలో వచ్చిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆ గ్రూపుల్లో పోస్టు చేస్తున్నట్లు సమాచారం.దేశ వ్యాప్తంగా ఏడుగురు అరెస్ట్.. అంతా అస్సాం వారేఆపరేషన్ ఘోస్ట్ సిమ్ లో భాగంగా దేశ వ్యాప్తంగా ఏడుగుర్ని పోలీసులు అదుపులోకి తీసుకోగా, అంతా అస్సాం రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు. ఈ ఏడుగురు అనుమానితులువివిధ రాష్ట్రాల్లో ఉంటూ దేశ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పాకిస్తాన్ లోని తమ మిత్రులకు సమాచారం చేరవేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి సంగారెడ్డిలో మకాం వేసిన అస్సాం పోలీసులు తమ దర్యాప్తును అత్యంత గోప్యంగా సాగిస్తున్నట్లు సమాచారం.#OperationGhostSIMAssam police has arrested 7 people for helping people from Pakistan to use WhatsApp from Indian numbers by sharing OTPs.7 arrested, 948 SIMs seized.These SIMs were being used for cyber crimes and anti-national operations. pic.twitter.com/crLN5LMmpO— Incognito (@Incognito_qfs) May 18, 2025 Assam Police busts major fake SIM racket in ‘Operation GHOST SIM’; 7 arrested, 948 SIMs seized; WhatsApp OTPs linked to Pakistan. The public is urged to stay alert.Read Full Story: https://t.co/zhwxJLa7Cm#AssamPolice #OperationGhostSim #Crime #SimCardRacket pic.twitter.com/BU94CVK9o1— Pratidin Time (@pratidintime) May 17, 2025

పాతబస్తీ అగ్ని ప్రమాదంలో 17 మంది మృతి.. కిషన్‌రెడ్డి వ్యాఖ్యల్ని ఖండించిన ఫైర్ డీజీ
Meer Chowk Fire Accident Live Updates:సాక్షి,హైదరాబాద్: పాతబస్తీ మీర్చౌక్లో పెను విషాదం చోటు చేసుకుంది. ఆదివారం ఉదయం గుల్జార్‌హౌస్ సమీపంలోని ఓ భవనం మొదటి అంతస్తులో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 17 మంది మృతి చెందారు. అయితే, ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బందిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని తెలంగాణ ఫైర్ డీజీ నాగిరెడ్డి ఖండించారు. ఆయన చేసిన వ్యాఖ్యల్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా’ అని అన్నారు. మరోవైపు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. 👉అగ్ని ప్రమాదంపై విచారణకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశంమృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎంఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించటంతో భారీ ప్రాణనష్టం తప్పింది.అగ్నిమాపక సిబ్బంది దాదాపు 40 మందిని ప్రాణాపాచస్థితి నుండి సురక్షితంగా బయటకు తీసుకురాగలిగారన్న సీఎం 👉మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున పరిహారంపాతబస్తీ అగ్ని ప్రమాద ఘటన బాధాకరం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించిందిబాధిత కుటుంబసభ్యులతో సీఎం మాట్లాడారు.అగ్ని ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించాం👉సీఎం రేవంత్ రెడ్డికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఫోన్గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదం వివరాలు అడిగి తెలుసుకున్న ఖర్గేఘటన వివరాలను ఖర్గేకు వివరించిన సీఎంఎప్పటికప్పుడు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నట్లు ఖర్గేకు తెలిపిన సీఎంమంత్రులు ఘటన స్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారని ఖర్గేకు వివరించిన సీఎం 👉మృతులకు ప్రధాని మోదీ సంతాపంపాత బస్తీ అగ్నిప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతిమృతులకు ప్రధాని మోదీ సంతాపంపీఎంఎన్‌ఆర్‌ఎఫ్ నుంచి అగ్ని ప్రమాద బాధితులకు ఎక్స్ గ్రేషియామృతులకు రూ.2లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేలు ఎక్స్ గ్రేషియాDeeply anguished by the loss of lives due to a fire tragedy in Hyderabad, Telangana. Condolences to those who have lost their loved ones. May the injured recover soon.An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased. The injured would be…— PMO India (@PMOIndia) May 18, 2025 👉కిషన్‌రెడ్డి విజ్ఞతకే వదిలేస్తున్నా.. ప్రమాదంపై ఫైర్ డీజీ నాగిరెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాటలను కండిస్తున్నసరైన సమయం లో ఫైర్ సిబ్బంది రాలేదు అనడం అవాస్తవం నేను దగ్గర ఉంది ఘటనను పరిశిలించాను మా దగ్గర అత్యాధునిక పరికరాలు లేవు అనేది అవాస్తవం అయన మాటలను అయన విజ్ఞతకే వదిలేస్తున్న👉ప్రమాదంపై ఫైర్ డీజీ నాగిరెడ్డి మీడియాతో మాట్లాడారుఉదయం 6.16నిమిషాలకు ఫైర్ కాల్ వచ్చిందిసమాచారం వచ్చిన వెంటనే మొఘల్‌పూరా ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారుఆ తర్వాత 11 ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయిప్రమాదానికి కారణం భవనంలోకి వెళ్లే దారికి షార్ట్ సర్క్యూట్ జరిగిందిభవనంలో ఉన్న కృష్ణ పర్ల్స్,మోదీ పర్ల్స్ షాపులు అగ్నికి ఆహుతయ్యాయిఅగ్నిప్రమాదం తీవ్ర స్థాయిలో ఉండటానికి కారణం ఆ భవనాన్ని ఇటీవల ఉడెన్ ప్యానల్‌తో డిజైన్ చేశారుషార్ట్ సర్క్యూట్‌తో ఉడెన్ ప్యానల్ మొత్తం కాలి మంటలు వ్యాప్తి చెందాయిప్రమాదంతో ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న 17 మందిని రెస్క్యూ చేసి వివిధ ఆస్పత్రులకు తరలించాంఒక నలుగురు ల్యాడర్ మీద నుంచి కిందకు వచ్చారు17మందిలో అందరూ చనిపోయినట్లు తెలుస్తోందిప్రమాదం జరగడానికి ప్రధాన కారణం ఎంట్రన్స్‌లో షార్ట్ సర్క్యూట్‌స్థానికంగా పని చేసేవారిని అడిగాను రెగ్యులర్‌గా షార్ట్ సర్క్యూట్ జరుగుతుందని చెప్పారుఇంటి లోపల ఫైర్ నిబంధనలు లేవుఈ బిల్డింగ్ జీప్లస్ 2,బయటకు జీప్లస్ వన్‌లాగా కనిపిస్తోందిఫస్ట్ ఫోర్ల్,సెకండ్ కంప్లీట్‌గా రెసిడెన్షియల్ ఏరియాగ్రౌండ్‌ఫ్లోర్‌లో అన్నీ షాప్స్ ఉన్నాయిఘటనా స్థలాన్ని పరిశీలిస్తే ఈ ప్రమాదం ఎసీ కంప్రెసర్ పేలడం వల్ల జరిగింది కాదు షార్ట్స్ సర్క్యూటే కారణం ప్రమాదం జరిగిన అపార్ట్మెంట్లో ఒక మీటరు వెడల్పుతో మెట్లను నిర్మించారుదీంతో ప్రమాదం నుంచి బాధితులు బయటపడేందుకు మరో మార్గం లేదుప్రమాదం జరిగిన బిల్డింగ్ చాలా పాత బిల్డింగ్‌నాటి నిబంధనల ప్రకారం నిర్మించారుఫైర్ సేఫ్టీ నిబంధనలు లేకపోవడం భారీ అగ్నిప్రమాదం జరిగిందిఅగ్ని ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి ఆలస్యం రావడం, ఎక్విప్మెంట్ లేకపోవడంలో సరైన సహాచర్యలు చేపట్టలేదన్న కేంద్ర మంత్రి వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాంఆయన చేసిన వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాంప్రమాదం జరిగిన వెంటనే 11 ఫైరింజన్లు, 70 మంది ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారుబయట నుంచి చూస్తే 2మీటర్ల ఎంట్రన్స్ పూర్తిగా పొగకమ్ముకుందిఫస్ట్‌ఫ్లోర్‌కి వెళ్లే దారి వెడల్పు ఒక మీటరు మాత్రమే ఉంది6.16కి ప్రమాదంపై సమాచారం అందిందిప్రమాదం జరిగే సమయంలో చనిపోయిన 17 మంది కాకుండా మరో నలుగురు ఉన్నారని చెబుతున్నారువారిలో నలుగురు రెండవ ఫ్లోర్లో ఉన్నారు. అక్కడి నుంచి తప్పించుకున్నారుమంటల్ని ఎప్పుడో ఆర్పేశాంప్రమాదం జరిగిన సమయంలో అందరూ నిద్రలో ఉన్నారుఈ ప్రమాద బాధితుల్లో కొందరు వేసవి సెలవులు నిమిత్తం వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చారు👉తెలంగాణ ఫైట్ డిజాస్టర్ రెస్పాన్స్ టీంఅగ్నిమాపక కేంద్రాల నుండి 12 ఫైర్ పరికరాలతో రెస్క్యూ నిర్వహించాం.మొత్తం 11 వాహనాలు, 01 అగ్నిమాపక రోబో, 17 అగ్నిమాపక అధికారులు, 70 మంది సిబ్బంది మంటలను ఆర్పడంలో,చిక్కుకున్న వారిని రక్షించడంలో పాల్గొన్నారు.మంటలను ఆర్పడానికి మొత్తం 02 గంటలు పట్టింది చిక్కుకున్న వ్యక్తులను రక్షించడానికి, మంటలను ఆర్పడానికి, వ్యాపించకుండా నిరోధించడానికి అధికారులు, సిబ్బంది తీవ్రంగా కృషి చేశాంఅడ్వాన్స్‌డ్ ఫైర్ రోబోట్, బ్రోటో స్కైలిఫ్ట్ హైడ్రాలిక్ ప్లాట్‌ఫామ్‌ను ఆపరేషన్లలో ఉపయోగించాము.అగ్నిప్రమాదానికి గల కారణం తెలియాల్సి ఉంది,దర్యాప్తు చేస్తున్నాం..దెబ్బతిన్న ఆస్తి విలువ ఇంకా అంచనకు రాలేదు 👉కేటీఆర్ దిగ్భ్రాంతిఓల్డ్ సిటీలోని గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదం పై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కేటీఆర్..అగ్ని ప్రమాదం జరగడం దురదృష్టం..చాలా బాధను గురిచేసింది..బాధితుల కుటుంబాలకు సంతాపం ప్రకటించిన కేటీఆర్..గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.మంటలు త్వరగా అదుపులోకి రావాలని ఆశిస్తున్నాను..సహాయక చర్యలకు BRS బృందం అందుబాటులో ఉంటుంది.Extremely shocked and pained!! Details emerging out of Gulzar House fire tragedy in Old City are very sadMy heartfelt condolences to the families of the victims of the tragedy. Wishing a speedy recovery to those injuredHoping and praying that this fire will be contained very…— KTR (@KTRBRS) May 18, 2025👉సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతిఅగ్ని ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి. సహాయక చర్యలకు ముమ్మరం చేయాలని ఆదేశించారు. బాధితులకు అండగా ఉంటామని హామీ. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం. ప్రమాద ఘటన గురించి ఆరా తీసిన ముఖ్యమంత్రి ఘటనా స్థలానికి చేరుకున్న మంత్రి పొన్నం వివరాలు అడిగి తెలుసుకుంటున్న పొన్నం ప్రభాకర్‌ఆదివారం ఉదయం 6గంటలకు ప్రమాదం జరిగింది6.15కి అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుందిప్రమాదంలో ఎలాంటి కుట్ర కోణం లేదు👉కిషన్‌రెడ్డి పరామర్శఅగ్నిప్రమాదం జరగడం దురదృష్టకరం.ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు స్పందించి ఉంటే ప్రాణ నష్టం జరగకుండా ఉండేదిసమయానికి అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి రీచ్ కాలేదుబాధాకరమైన విషయం ఇదికేంద్రం తరఫున బాధిత కుటుంబానికి అండగా ఉంటాంఫైర్ శాఖ వద్ద సరైన ఫైర్ పరికరాలు లేకపోవడంతో తీవ్రత పెరిగిందిఫైర్ టెక్నాలజీని పెరుగుపరుచుకోవాలి.ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలి. ఒకే కుటుంబానికి చెందినవారు ఎంతో కాలం ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు. గుల్జార్‌హౌస్‌లో ఘోర అగ్ని ప్రమాదం..17మంది మృతిచార్మినార్ గుల్జార్‌హౌస్‌లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం 6.గంటలకు షార్ట్ సర్క్యూట్ కారణంగా 17మంది మృతి చెందారు. షార్ట్స్ సర్క్యూట్ జరిగిన ప్రమాదంలో మొత్తం 17మందిని ఆస్పత్రికి తరలించారు. అగ్నిప్రమాదంలో మంటల్లో చిక్కుకున్న బాధితుల్ని రక్షించే ప్రయత్నం చేశారు. మంటల్లో చిక్కుకున్న మరికొంత మందిని రక్షించేందుకు అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు ప్రయత్నాల్ని కొనసాగిస్తున్నారు. బాధితులకు తక్షణ వైద్యం అందించేందుకు 14 అంబులెన్స్‌లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రమాదంతో పాతబస్తీలో ట్రాఫిక్ విభాగం ఆంక్షలు విధించింది. ట్రాఫిక్‌ను డైవర్ట్ చేస్తున్నట్లు తెలిపింది. మృతుల్లో ఏడుగురు చిన్నారులు, నలుగురు మహిళలు సహా మొత్తం 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న స్థానిక ఎమ్మెల్యే, మేయర్ విజయలక్ష్మి, అగ్నిపమాక డీజీ నాగిరెడ్డి, సౌత్‌జోన్ డీసీపీ స్నేహా మిశ్రా,హైడ్రా కమిషనర్ రంగనాథ్‌లు పరిశీలించారు. మృతుల వివరాలురాజేంద్రకుమార్ (67),అభిషేక్ మోదీ (30), సుమిత్ర (65), మున్నీబాయి (72), ఆరుషి జైన్ (17), శీతల్ జైన్ (37), ఇరాజ్ (2), హర్షాలీ గుప్తా (7), రజని అగర్వాల్, అన్య మోదీ, పంకజ్ మోదీ, వర్ష మోదీ, ఇద్దిక్కి మోదీ, రిషభ్, ప్రథమ్ అగర్వాల్, ప్రాంశు అగర్వాల్ ఉన్నారు. ఫైర్ యాక్సిడెంట్ చిన్నదే అయినా భవనంలో 30 మంది ఉండడంలో ప్రాణనష్టం భారీ ఎత్తున జరిగింది.

వారికి నా కంటే అందగాడు కనిపించలేదేమో!
హైదరాబాద్: ఉగ్రవాదంపై భారత్ జరుపుతున్న పోరులో భాగంగా తన వంతు పాత్రను సమర్దవంతంగా పోషిస్తున్న హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ.. పాకిస్తాన్ ట్రోలర్స్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇస్లాంలో హింసకు తావులేదని పదే పదే చెబుతున్న అసదుద్దీన్ పై పాకిస్తాన్ కు చెందిన పలువురు ట్రోలింగ్‌కు దిగారు. దీనికి ఓవైసీ నవ్వుతూనే అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. ‘ పాకిస్తాన్ లో ఉన్న వారికి భారత్ లో ఉన్న నేను మాత్రమే కనిపిస్తున్నాను. నా కంటే అందగాడు వారికి కనిపించలేదేమో. అందుకే నా ప్రసంగాలు వింటూ ఉన్నారు. నా ప్రసంగాలు విని మీ మెదడులో ఉన్న చెత్తను తీసేయండి. అది అందరికీ మంచిది. మీ అజ్ఞానం కూడా అంతమవుతుంది’ అని అసదుద్దీన్ తెలిపారు.‘ ‘మీపై పాకిస్తాన్ ట్రోలింగ్ ఎక్కువైంది కదా’’ ? అని మీడియా అడిగిన ప్రశ్నకు ఓవైసీ నవ్వుతూ స్పందించారు. వారికి తన కంటే అందగాడు భారత్ లో కనిపించలేదేమో. అందుకే నా ప్రసంగాలను ట్రోల్స్ చేస్తున్నారు’ అంటూ చమత్కరించారు.పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం చోటు చేసుకున్న పరిణామాల్లో భాగంగా అంతర్జాతీయ వేదికపై ఉగ్రవాదంపై భారత్ సాగిస్తున్న పోరాటానికి ఓవైసీ సిద్ధమవుతున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత, ఆపై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ కు ముందు జరిగిన అఖిలపక్ష సమావేశానికి ఓవైసీకి ఆహ్వానం చివరి నిమిషంలో అందింది. తొలుత ఓవైసీకి ఆహ్వానం అందలేదనే వార్తల నేపథ్యంలో హోంమంత్రి అమిత్ షా స్వయంగా ఫోన్ చేసి ఓవైసీని అఖిలపక్ష సమావేశానికి రమ్మని ఆహ్వానించారు. అప్పట్నుంచీ పాకిస్తాన్ దుశ్చర్యలను ఎండగడుతూనే ఉన్నారు అసదుద్దీన్ ఓవైసీ. పాకిస్తాన్ ఓ ఉగ్రవాద దేశంగా మారిపోయిందని, ఆ దేశం అర్థ శతాబ్దం వెనక్కి పోయిందంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఇలా సమయం వచ్చినప్పుడల్లా పాకిస్తాన్ తీరుపై ధ్వజమెత్తుతూనే ఉన్నారు ఓవైసీ.ఇదీ చదవండి:నీ తల్లికి తూటా దింపిందెవరు?
కేఎల్ రాహుల్ విధ్వంసం.. 14 ఫోర్లు, 4 సిక్స్‌లతో సూపర్ సెంచరీ
మైథలాజికల్ మూవీగా 'వసుదేవ సుతం'.. ఆసక్తిగా గ్లింప్స్
యూకేలో ప్రపంచ సాంస్కృతిక వైవిధ్య దినోత్సవ వేడుకలు
365 రోజుల వ్యాలిడిటీ: వోడాఫోన్ ఐడియా కొత్త ప్లాన్
తీవ్ర విషాదం.. నీటి కుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృతి
చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్.. విరాట్ కోహ్లి రికార్డు బ్రేక్
చెల్లి పెళ్లిని గుర్తు చేసుకున్న బిగ్‌బాస్ బ్యూటీ హరితేజ..!
గుల్జార్‌హౌస్ అగ్ని ప్రమాదంపై విచారణకు సీఎం ఆదేశం
రాజస్తాన్‌పై విజయం.. ప్లే ఆఫ్స్‌కు చేరువలో పంజాబ్
అందుకే నా కొడుకుకు ఆయన పేరు పెట్టుకున్నా: అనసూయ పోస్ట్ వైరల్
కోటి ఇస్తావా.. ఫొటోలు అప్లోడ్ చేయమంటావా?
కొత్త కరెన్సీ నోట్లు వస్తున్నాయి.. ఆర్బీఐ ప్రకటన
‘పాకిస్తాన్ వద్దే కాదు.. చైనాకు కూడా ఆ సామర్థ్యం లేదు’
నెల్లూరులో ప్రసిద్ధ ఆలయం..శనివారం ఒక్కరోజే భక్తులకు దర్శనం (ఫొటోలు)
'పద్మ భూషణ్' చేయాల్సిన పనులేనా..? బాలకృష్ణపై విమర్శలు
ఇంగ్లండ్ టూర్‌కు భారత జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
విజయవాడలో బోర్డు తిప్పేసిన నాగరాజు కన్సల్టెన్సీ సంస్థ
రోహిత్ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం.. మామగారి వెనుక దాక్కున్న రితిక!
సీఎం గారూ.. యుద్ధంలో ఉన్నా.. రాలేకపోతన్న..
మళ్లీ కరోనా మహమ్మారీ పలుదేశాల్లో హై అలర్ట్
బట్టతలపై వెంట్రుకలు సాధ్యమే! దువ్వెన్లు సిద్దం చేసుకోండి!
..పన్లోపని తుర్కియే అధ్యక్షుడిని కూడా పిలుద్దాం సార్! కొంతకాలం పాలన చూసుకోమని చెబుదాం!
ఈ రాశి వారికి వ్యాపారాలు, ఉద్యోగాలలో అవాంతరాలు తొలగుతాయి.
ఇప్పటికైనా తెలిసిందా సార్!.. మీరెంత పేదరికంలో బతుకుతున్నారో!
టాలీవుడ్ మూవీలో అలేఖ్య చిట్టి పికిల్స్ ఫేమ్.. ఈవెంట్లో సందడి!
కడప మేయర్ పదవి.. ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు
ఈ రాశి వారికి వ్యాపారాలలో ఊహించని లాభాలు.. ఉద్యోగాలలో హోదాలు
కంబాలపల్లి C/O ప్రభుత్వోద్యోగులు
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
మసూద్ అజార్‌కు రూ.14 కోట్లు
కేఎల్ రాహుల్ విధ్వంసం.. 14 ఫోర్లు, 4 సిక్స్‌లతో సూపర్ సెంచరీ
మైథలాజికల్ మూవీగా 'వసుదేవ సుతం'.. ఆసక్తిగా గ్లింప్స్
యూకేలో ప్రపంచ సాంస్కృతిక వైవిధ్య దినోత్సవ వేడుకలు
365 రోజుల వ్యాలిడిటీ: వోడాఫోన్ ఐడియా కొత్త ప్లాన్
తీవ్ర విషాదం.. నీటి కుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృతి
చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్.. విరాట్ కోహ్లి రికార్డు బ్రేక్
చెల్లి పెళ్లిని గుర్తు చేసుకున్న బిగ్‌బాస్ బ్యూటీ హరితేజ..!
గుల్జార్‌హౌస్ అగ్ని ప్రమాదంపై విచారణకు సీఎం ఆదేశం
రాజస్తాన్‌పై విజయం.. ప్లే ఆఫ్స్‌కు చేరువలో పంజాబ్
అందుకే నా కొడుకుకు ఆయన పేరు పెట్టుకున్నా: అనసూయ పోస్ట్ వైరల్
కోటి ఇస్తావా.. ఫొటోలు అప్లోడ్ చేయమంటావా?
కొత్త కరెన్సీ నోట్లు వస్తున్నాయి.. ఆర్బీఐ ప్రకటన
‘పాకిస్తాన్ వద్దే కాదు.. చైనాకు కూడా ఆ సామర్థ్యం లేదు’
'పద్మ భూషణ్' చేయాల్సిన పనులేనా..? బాలకృష్ణపై విమర్శలు
ఇంగ్లండ్ టూర్‌కు భారత జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
విజయవాడలో బోర్డు తిప్పేసిన నాగరాజు కన్సల్టెన్సీ సంస్థ
రోహిత్ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం.. మామగారి వెనుక దాక్కున్న రితిక!
సీఎం గారూ.. యుద్ధంలో ఉన్నా.. రాలేకపోతన్న..
మళ్లీ కరోనా మహమ్మారీ పలుదేశాల్లో హై అలర్ట్
బట్టతలపై వెంట్రుకలు సాధ్యమే! దువ్వెన్లు సిద్దం చేసుకోండి!
..పన్లోపని తుర్కియే అధ్యక్షుడిని కూడా పిలుద్దాం సార్! కొంతకాలం పాలన చూసుకోమని చెబుదాం!
ఈ రాశి వారికి వ్యాపారాలు, ఉద్యోగాలలో అవాంతరాలు తొలగుతాయి.
ఇప్పటికైనా తెలిసిందా సార్!.. మీరెంత పేదరికంలో బతుకుతున్నారో!
టాలీవుడ్ మూవీలో అలేఖ్య చిట్టి పికిల్స్ ఫేమ్.. ఈవెంట్లో సందడి!
కడప మేయర్ పదవి.. ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు
ఈ రాశి వారికి వ్యాపారాలలో ఊహించని లాభాలు.. ఉద్యోగాలలో హోదాలు
కంబాలపల్లి C/O ప్రభుత్వోద్యోగులు
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
మసూద్ అజార్‌కు రూ.14 కోట్లు
సంక్రాంతికి రఫ్ఫాడించేద్దాం
సినిమా

ఎర్రని బుగ్గలతో సుప్రీత.. రెడ్ శారీలో సంయుక్త
ఎర్రని బుగ్గలతో యంగ్ బ్యూటీ సుప్రీతచుడీదార్ లో పద్ధతిగా కనిపించిన కేతిక శర్మరెడ్ శారీలో హాట్ హాట్ గా సంయుక్త స్టిల్స్40ల్లోనూ అందంతో కేక పుట్టిస్తున్న శ్రియహైదరాబాద్ లో బాలీవుడ్ నిర్మాత భార్య దివ్య ఖోస్లాడ్యాన్స్ తో రచ్చ లేపుతున్న మృణాల్ ఠాకుర్చీరలో కవ్విస్తున్న కీర్తి సురేశ్.. ఐశ్వర్య రాజేశ్ కూడా View this post on Instagram A post shared by Miheeka Daggubati (@miheeka) View this post on Instagram A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by Ketika (@ketikasharma) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Esha Chawla (@eshachawla63) View this post on Instagram A post shared by Samyuktha (@iamsamyuktha_) View this post on Instagram A post shared by Shivani Rajashekar (@shivani_rajashekar1)

ఈ హీరోని గుర్తుపట్టారా? మహేశ్ కి బంధువు, స్టేట్ ప్లేయర్ కూడా
డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యానని చాలామంది అంటూ ఉంటారు. అయితే ఇతడు మాత్రం స్వతహాగా బ్యాడ్మింటన్ ప్లేయర్.. స్టేట్ లెవల్ కి ఆడాడు. కానీ మరి మనసు ఎక్కడ మారిందో ఏమో గానీ హీరో అయిపోయాడు. ప్రస్తుతం నటిస్తూనే నిర్మాతగానూ వ్యవహరిస్తున్నాడు. ఇంతలా చెప్పాం కదా ఎవరో కనిపెట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా? పైన ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు సుధీర్ బాబు. 'ఏ మాయ చేశావె'లో సమంతకు అన్నగా యాక్ట్ చేసి ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. 'ఎస్ఎమ్ఎస్' మూవీతో హీరోగా మారాడు. సమ్మోహనం, ప్రేమకథాచిత్రమ్ తదితర సినిమాలతో హిట్స్ కొట్టాడు. తర్వాత నుంచి చాలా మూవీస్ చేస్తున్నాడు గానీ ప్రేక్షకుల్ని అలరించలేకపోతున్నాడు.వ్యక్తిగత విషయానికొస్తే మహేశ్ బాబు సోదరి ప్రియదర్శినిని సుధీర్ బాబు.. సినిమాల్లోకి రాకముందే పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. వీళ్లలో పెద్దోడు తండ్రి బాటలో హీరో అయ్యే పనిలో బిజీ ఉన్నాడు. (ఇదీ చదవండి: నాలుగే సినిమాలు తీసిన తెలుగు దర్శకుడికి రజినీ ఛాన్స్?) మరోవైపు సుధీర్ బాబు నటుడి కాకముందు బ్యాడ్మింటన్ ప్లేయర్. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక తరఫున ప్రాతినిధ్యం వహించాడు. ప్రముఖ కోచ్ పుల్లెల గోపీచంద్ తో కలిసి అప్పట్లో డబుల్స్ ఆడాడు. తన స్నేహితుడు బయోపిక్ లో సుధీర్ బాబు నటిస్తాడనే రూమర్స్ వచ్చాయి. కానీ ఈ ప్రాజెక్ట్ ఎందుకో అలా ఆలస్యమవుతూ వస్తోంది.సరే ఈ ఫొటో విషయానికొస్తే.. తన తొలి ఫొటోషూట్ లో తీసుకున్న పిక్ ఇది అని సుధీర్ బాబు తన ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. దీన్ని చూసిన చాలామంది ఇప్పటికి అప్పటికీ ఎంత మార్పో అని మాట్లాడుకుంటున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన సస్పెన్స్ థ్రిల్లర్.. తెలుగులో స్ట్రీమింగ్)

తెలుగు రాష్ట్రాల ఎగ్జిబిటర్లు షాకింగ్ నిర్ణయం..!
తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో సమావేశమైన తెలంగాణ, ఆంధ్రా ఎగ్జిబిటర్లు థియేటర్లు బంద్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ సమావేశంలో ప్రముఖ నిర్మాతలు దిల్‌రాజు, సురేశ్ బాబుతో పాటు 60 మంది ఎగ్జిబిటర్లు పాల్గొన్నారు.ఈ సమావేశంలో పాల్గొన్న ఎగ్జిబిటర్లు అద్దె ప్రాతిపాదికన సినిమాలను ప్రదర్శించలేమని తేల్చిచెప్పారు. పర్సంటెజీ రూపంలో చెల్లిస్తేనే సినిమాలను ప్రదర్శిస్తామని నిర్మాతలకు లేఖ రాయాలని ఎగ్జిబిటర్ల తీర్మానం చేశారు. తాజా నిర్ణయంతో వచ్చేనెల విడుదలయ్యే చిత్రాలపై తీవ్ర ప్రభావం పడనుంది. ఈ నేపథ్యంలో ఎగ్జిబిటర్ల నిర్ణయం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది.

నాలుగే సినిమాలు తీసిన తెలుగు దర్శకుడికి రజినీ ఛాన్స్?
ఒకప్పటితో పోలీస్తే సీనియర్ హీరోలు.. ప్రస్తుతం యువ దర్శకులతో పనిచేసేందుకే ఎక్కువ ఇష్టపడుతున్నారు. ట్రెండ్ కి తగ్గ స్టోరీలతో మూవీస్ చేస్తుండటమే ఇందుకు కారణం. ఇప్పుడు అలా సూపర్ స్టార్ రజినీకాంత్.. ఓ తెలుగు యువ దర్శకుడితో కలిసి పనిచేయబోతున్నారనే న్యూస్ బయటకొచ్చింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన సస్పెన్స్ థ్రిల్లర్.. తెలుగులో స్ట్రీమింగ్) ప్రస్తుతం లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో 'కూలీ' చేస్తున్న రజినీకాంత్.. మరోవైపు నెల్సన్ తీస్తున్న 'జైలర్ 2' కూడా చేస్తున్నారు. దీని తర్వాత ఇంకా ఎవరికీ కమిట్ మెంట్ ఇవ్వలేదు. అలానే తెలుగు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ దగ్గర రజినీ డేట్స్ ఉన్నాయి. ఈ క్రమంలోనే రీసెంట్ గా వివేక్ ఆత్రేయ వెళ్లి ఆయనకు కథ చెప్పాడని తెలుస్తోంది.2017లో 'మెంటల్ మదిలో' అనే సినిమాతో వివేక్ ఆత్రేయ దర్శకుడిగా పరిచయమయ్యాడు. తర్వాత 'బ్రోచేవారెవరురా' తీశాడు. నానితో అంటే సుందరానికీ, సరిపోదా శనివారం చిత్రాల్ని తెరకెక్కించాడు. కేవలం నాలుగే సినిమాలు తీసిన అనుభవమున్న వివేక్.. ఒకవేళ రజినీతో మూవీ చేస్తే మాత్రం జాక్ పాట్ కొట్టినట్లే.(ఇదీ చదవండి: కోలుకున్న హీరో విశాల్.. విజయ్ సేతుపతితో కలిసి)
న్యూస్ పాడ్‌కాస్ట్
క్రీడలు

IPL 2025: ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ గుజరాత్ లైవ్ అప్డేట్స్
IPL 2025 DC vs GT Live Updates: ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడతున్నాయి.7 ఓవర్లకు గుజరాత్ స్కోర్: 63/07 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ టైటాన్స్ వికెట్ నష్టపోకుండా 63 పరుగులు చేసింది. క్రీజులో సాయిసుదర్శన్(46), శుబ్‌మన్ గిల్(17) ఉన్నారు.దూకుడుగా ఆడుతున్న గుజరాత్200 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ దూకుడుగా ఆడుతోంది. 2 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ టైటాన్స్ వికెట్ నష్టపోకుండా 31 పరుగులు చేసింది. క్రీజులో సాయిసుదర్శన్(25), శుబ్‌మన్ గిల్(6) ఉన్నారు.కేఎల్ రాహుల్ సెంచరీ.. గుజరాత్ ముందు భారీ లక్ష్యంఐపీఎల్-2025లో అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు దంచి కొట్టారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో కేఎల్ రాహుల్ సూపర్ సెంచరీతో చెలరేగాడు. రాహుల్ 65 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్స్‌లతో 112 పరుగులు చేశాడు. రాహుల్‌కు ఇది ఐదో ఐపీఎల్ సెంచరీ. ఇక రాహుల్‌తో పాటు అభిషేక్ పోరెల్(30), అక్షర్ పటేల్(25), స్టబ్స్(21) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. గుజరాత్ బౌలర్లలో అర్షద్ ఖాన్, సాయికిషోర్, ప్రసిద్ద్ కష్ణ తలా వికెట్ సాధించారు.ఢిల్లీ రెండో వికెట్ డౌన్అభిషేక్ పోరెల్ రూపంలో ఢిల్లీ క్యాపిటల్స్ రెండో వికెట్ కోల్పోయింది. 30 పరుగులు చేసిన పోరెల్.. సాయికిషోర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.కేఎల్ రాహుల్ ఫిప్టీ..అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ సాధించాడు. 65 పరుగులతో రాహుల్ తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. 11 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ వికెట్ నష్టానికి 98 పరుగులు చేసింది.6 ఓవర్లకు ఢిల్లీ స్కోర్: 44/16 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ నష్టానికి 44 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్(36), అభిషేక్ పోరెల్(1) ఉన్నారు.ఢిల్లీ తొలి వికెట్ డౌన్..ఫాఫ్ డుప్లెసిస్ రూపంలో ఢిల్లీ క్యాపిటల్స్ తొలి వికెట్ కోల్పోయింది. 5 పరుగులు చేసిన డుప్లెసిస్.. అర్షద్ ఖాన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆచితూచి ఆడుతున్న ఢిల్లీ ఓపెనర్లు..టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిలకడగా ఆడుతోంది. 3 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ వికెట్ నష్టపోకుండా 14పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్(9), ఫాఫ్ డుప్లెసిస్(3) ఉన్నారు.ఐపీఎల్-2025లో కీలక పోరుకు సమయం అసన్నమైంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.తుది జట్లుగుజరాత్ టైటాన్స్ ప్లేయింగ్ XI: శుభమన్ గిల్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, కగిసో రబడ, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, అర్షద్ ఖాన్, ప్రసిధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ XI: ఫాఫ్ డు ప్లెసిస్ , అభిషేక్ పోరెల్, సమీర్ రిజ్వీ, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, టి నటరాజన్, కుల్దీప్ యాదవ్, ముస్తాఫిజుర్ రెహమాన్

చరిత్ర సృష్టించిన పంజాబ్ కింగ్స్.. ముంబై రికార్డు బద్దలు
ఐపీఎల్-2025లో పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు మరోసారి చెలరేగారు. జైపూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌టో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆరంభంలో 34 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన పంజాబ్ ఆ తర్వాత తిరిగి పుంజుకుంది. రాజస్తాన్ బౌలర్లపై పంజాబ్ బ్యాటర్లు విరుచుకుపడ్డారు. పంజాబ్ బ్యాటర్లలో నేహాల్ వధేరా( 37 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 70) టాప్ స్కోరర్‌గా నిలవగా.. శశాంక్ సింగ్(30 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 59 నాటౌట్), శ్రేయస్ అయ్యర్(30), ఓమర్జాయ్(21), ప్రభుసిమ్రాన్ సింగ్(21) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ఈ క్రమంలో పంజాబ్ కింగ్స్ ఓ అరుదైన రికార్డును తమ ఖాతాలో వేసుకుంది. జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో అత్యధిక ఐపీఎల్ స్కోర్ సాధించిన జట్టుగా పంజాబ్ నిలిచింది. ఇప్పటివరకు ఈ రికార్డు ముంబై ఇండియన్స్ పేరిట ఉండేది. ఈ వేదికపై గతంలో రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 2 వికెట్లు కోల్పోయి 217 పరుగులు చేసింది. తాజా మ్యాచ్‌తో ముంబై రికార్డును శ్రేయస్ సేన బ్రేక్ చేసింది.అదేవిధంగా ఐపీఎల్ ఇన్నింగ్స్‌లో మిడిలార్డర్ నంబర్ 4 నుంచి నంబర్ 7 వరకు మొత్తం కలిపి అత్యధిక పరుగులు చేసిన జట్టుగా పంజాబ్ నిలిచింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ బ్యాటర్లు నంబర్ 4 నుంచి నంబర్ 7 వరకు కలిపి మొత్తంగా 180 పరుగులు చేశారు. ఇంతకుముందు ఈ రికార్డు ముంబై ఇండియన్స్(174) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో ముంబైని పంజాబ్ అధిగమించింది.చదవండి: 'ధోనీకి మాత్రమే రియల్ ఫ్యాన్స్.. మిగిలినందరికీ ఉన్నది పెయిడ్ ఫ్యాన్సే'

'ధోనీకి మాత్రమే రియల్ ఫ్యాన్స్.. మిగిలినందరికీ ఉన్నది పెయిడ్ ఫ్యాన్సే'
క్రికెటర్ల ఫ్యాన్ బేస్‌పై భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. టీమిండియా దిగ్గజం ఎంఎస్ ధోనికి మాత్రమే నిజమైన అభిమానులు ఉన్నారని, మిగతా క్రికెటర్లందరికి ఉన్నది పెయిడ్ ఫ్యాన్సేనని భజ్జీ వివాదస్పద కామెంట్స్ చేశాడు.ఆర్సీబీ, కేకేఆర్ మ్యాచ్ సందర్భంగా స్టార్ స్పోర్ట్స్ ఛానెల్లో జరిగిన చర్చా కార్యక్రమంలో హర్భజన్ ఈ వ్యాఖ్యలు చేశాడు. కాగా ఐపీఎల్-2025 తర్వాత ధోనికి రిటైర్ అయ్యే ఆలోచన లేదని ఇప్పటికే తన నిర్ణయాన్ని సీఎస్కే యాజమాన్యానికి తెలియజేశాడని శనివారం వార్తలు వినిపించాయి. ఈ క్రమంలోనే హర్భజన్ తన మనసులోని మాటను బయటపెట్టాడు."ఎంఎస్ ధోని తను ఎప్పటివరకు ఆడాలనుకుంటే అప్పటి వరకు ఐపీఎల్లో కొనసాగుతాడు. ఒకవేళ సీఎస్కే యాజమాని నేనే అయితే ధోని విషయంలో వేరే నిర్ణయం తీసుకునేవాడిని. నా వరకు అయితే.. ధోనికి ఒక్కడికే అసలైన అభిమానులు ఉన్నారు. మిగిలిన క్రికెటర్లందరికి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఉన్నారు. అందులో కూడా కొంతమంది పెయిడ్ ఫ్యాన్సే. వారి గురించి మాట్లాడటం అనవసరం. అటువంటి వారి మాట్లాడితే ఈ చర్చ పక్కదారి పడుతుంది" అని హార్భజన్ క్రిక్‌బజ్ షోలో పేర్కొన్నాడు.ఈ క్రమంలో హార్భజన్ అనుచిత వ్యాఖ్యలపై విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ధోనిని కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. ఎంఎస్ ధోని దేశద్రోహి అంటూ ఎక్స్‌లో ప్రచారం చేస్తున్నారు. "SHAME ON DESHDROHI DHONI" అనే కీవర్డ్ ఎక్స్‌లో ట్రెండ్ అవుతోంది.చదవండి: IPL 2025: అంత అన్నారు.. ఇంత అన్నారు! ఆఖరికి అరంగేట్రంలోనే డకౌట్

వధేరా, శశాంక్ మెరుపులు.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
ఐపీఎల్-2025లో జైపూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ బ్యాటర్లు దుమ్ములేపారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆరంభంలోనే ఇన్ ఫామ్ బ్యాటర్ ప్రియాన్ష్ ఆర్య(9) వికెట్ కోల్పోయినప్పటికి.. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు ఒక మిచెల్ ఓవెన్ తప్ప మిగితా అందరూ తమ పని తాము చేసుకుపోయారు.పంజాబ్ బ్యాటర్లలో నేహాల్ వధేరా( 37 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 70), శశాంక్ సింగ్(30 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 59 నాటౌట్) అద్భుతమైన హాఫ్ సెంచరీలతో చెలరేగగా.. శ్రేయస్ అయ్యర్(30), ఓమర్జాయ్(21), ప్రభుసిమ్రాన్ సింగ్(21) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. రాజస్తాన్ బౌలర్లలో తుషార్ దేశ్‌పాండే రెండు, మఫాక, పరాగ్, మధ్వాల్ తలా వికెట్ సాధించారు.తుది జట్లు..రాజస్థాన్ రాయల్స్: వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్(కెప్టెన్), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), షిమ్రాన్ హెట్మెయర్, వనిందు హసరంగ, తుషార్ దేశ్‌పాండే, ఆకాష్ మధ్వల్, ఫజల్హాక్ ఫరూఖీ, క్వేనా మఫాకా.ఇంపాక్ట్ సబ్స్: కుమార్ కార్తికేయ, శుభమ్ దూబే, అశోక్ శర్మ, కునాల్ సింగ్ రాథోడ్, యుధ్వీర్ సింగ్ చరక్పంజాబ్ కింగ్స్: ప్రభ్సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), ప్రియాంష్ ఆర్య, మిచ్ ఓవెన్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), నేహాల్ వధేరా, శశాంక్ సింగ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మార్కో జాన్సెన్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, జేవియర్ బార్ట్లెట్.ఇంపాక్ట్ సబ్స్: విజయ్‌కుమార్ వైషాక్, హర్‌ప్రీత్ బ్రార్, ప్రవీణ్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, ముషీర్ ఖాన్
బిజినెస్

కొత్త మార్కెట్‌కు తెరలేపిన ఆర్బీఐ నిర్ణయం
మొబైల్ వాడకం కోవిడ్–19 తరువాత భారత్‌లో గణనీయంగా పెరిగింది. డేటా ఫర్ ఇండియా 2025 ఫిబ్రవరి నివేదిక ప్రకారం.. ఈ విషయంలో 10–19 ఏళ్ల వయసువారు ముందంజలో ఉన్నారు. మొబైల్ వినియోగంలో నైపుణ్యత పట్టణ ధనిక వర్గం పిల్లలకే పరిమితం కాలేదు. గ్రామాల్లోనూ పెరిగింది. ఇప్పటికే మైనర్లు పరిమితులతో కూడిన మొబైల్ వాలెట్స్, పాకెట్ మనీ డిజిటల్ వాలెట్స్, యూపీఐ సర్కిల్‌ను విరివిగా వాడుతున్నారు. 10 ఏళ్లకుపైబడిన మైనర్లు వారి సేవింగ్స్, టర్మ్ డిపాజిట్ ఖాతాలను వ్యక్తిగతంగా తెరిచి, నిర్వహించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇటీవలే అనుమతించింది. ఈ నేపథ్యంలో డిజిటల్ పేమెంట్లు మరింత ఊపందుకుంటాయని బ్యాంకింగ్ నిపుణులు భావిస్తున్నారు. – సాక్షి, స్పెషల్ డెస్క్కేంద్ర ప్రభుత్వ యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్–2024 (అసర్) నివేదిక ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లోని 14–16 ఏళ్ల వయసున్న 75 శాతంపైగా పిల్లలు డిజిటల్ హోమ్ వర్క్‌ను పూర్తి చేయడానికి స్మార్ట్ఫోన్లను విజయవంతంగా వినియోగిస్తున్నారు. విద్య, వినోద అంశాలతోపాటు, యూపీఐ పేమెంట్లకు కూడా స్మార్ట్ ఫోన్ల వాడకం పెరిగింది. ఇప్పుడు ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయం ఈ వాస్తవిక పరిస్థితికి అద్దం పడుతోంది. అంతేకాదు డిజిటల్ పేమెంట్స్ రంగంలో కొత్త మార్కెట్‌కు తెరలేపింది. భవిష్యత్ కస్టమర్ల సంఖ్యను పెంచుకునేందుకు బ్యాంకులకు మార్గం ఏర్పడింది. మైనర్లను బ్యాంకింగ్ వైపునకు తీసుకురావడానికి ఫిన్ టెక్ కంపెనీలు, ఆర్థిక సంస్థలు పోటీపడడం ఖాయంగా కనిపిస్తోంది.తల్లిదండ్రులు/సంరక్షకుల ద్వారా మైనర్లకు బ్యాంక్ ఖాతా తెరిచే అవకాశం ఇప్పటికే ఉంది. అయితే మైనర్లు వ్యక్తిగతంగా ఖాతాను నిర్వహించడం వల్ల గతంలో లేని పలు అదనపు ప్రయోజనాలు ఇప్పుడు ఉన్నాయి. సొంత ఖాతా ఉంటే యూపీఐ చెల్లింపులు సులభం అవుతాయి. అంతేకాదు, తరచూ చిన్నపాటి కొనుగోళ్లు జరిపే 14–18 ఏళ్ల పిల్లలు ఈ మార్పు వల్ల ప్రయోజనం పొందుతారు. స్కూల్ లేదా ట్యూషన్ క్లాస్ నుంచి ఇంటికి చేరేందుకు బైకులను యాప్‌ల ద్వారా బుక్ చేసుకోవడం, క్యాంటీన్లో ఆహారం, స్టేషనరీ కొనుక్కోవడం.. ఇలాంటి వాటికి వీలవుతుంది. దీనివల్ల మైనర్లు చేసే డిజిటల్ లావాదేవీలు మరింత పెరుగుతాయనేది సుస్పష్టం. కాగా, యువత రుణం అందుకోవడం, పెట్టుబడుల విషయంలో డిజిటల్ వేదికలు పెను మార్పులు తెచ్చాయి. చిన్నచిన్న రుణాలకు యువ కస్టమర్లు పెద్ద ఎత్తున ఫిన్ టెక్ కంపెనీలు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల తలుపు తడుతున్నారు.ఇప్పటికే మైనర్ల కోసం..బ్యాంకులు ఇప్పటికే.. తల్లిదండ్రులతో కలిసి సంయుక్తంగా నిర్వహించే మైనర్ ఖాతాలకు అనుసంధానించిన డెబిట్ కార్డులు, మొబైల్ యాప్స్‌ను అందిస్తున్నాయి. అలాగే 13–18 ఏళ్ల వయసున్న వారి కోసం గూగుల్ పే వాలెట్స్ వంటి పరిమితులతో ఉపయోగించే మొబైల్ వాలెట్స్, బ్యాంక్ ఖాతా అవసరం లేని జూనియో, ఫ్యామ్‌పే, ఫైప్ తదితర పాకెట్ మనీ డిజిటల్ వాలెట్స్ కూడా మైనర్ల కోసం కొలువుదీరాయి. ప్రాథమిక యూపీఐ వినియోగదారుకు చెందిన బ్యాంక్ ఖాతా నుంచి యూపీఐ సర్కిల్ ఫీచర్ ద్వారా ద్వితీయ వినియోగదారు లావాదేవీలు నిర్వహించవచ్చు. ద్వితీయ వినియోగదారుకు స్వంత బ్యాంక్ ఖాతా లేకపోయినా.. ప్రాథమిక వినియోగదారు తరపున చెల్లింపులు చేయవచ్చు. పరిమితులు, అనుమతులను నిర్ధేశించడం ద్వారా ప్రాథమిక వినియోగదారుడు ఈ లావాదేవీలను నియంత్రించవచ్చు.ఆర్థిక అక్షరాస్యతలో..ఆర్బీఐ 2023లో చేపట్టిన సర్వేలో పెద్దవారితో పోలిస్తే 30 ఏళ్లలోపు వారిలో ఆర్థిక అక్షరాస్యత తక్కువగా ఉందని తేలింది. నేషనల్ కౌన్సిల్ ఫర్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ సర్వే–2019 ప్రకారం 18–29 ఏళ్ల వయసువారిలో 30 శాతం మందికి మాత్రమే ఆర్థిక అక్షరాస్యత ఉంది. 10 ఏళ్లకు పైబడ్డ మైనర్లను బ్యాంకింగ్ వ్యవస్థలోకి అనుమతించడం ఆర్థిక అక్షరాస్యత పెంచే కార్యక్రమాల్లో ఒకటిగానే చూడాలన్నది నిపుణుల భావన. సొంత ఖాతాకు, ఆర్థిక లావాదేవీలకు చిన్నతనంలోనే యాజమాన్య హక్కులు దక్కడం వల్ల అవసరాలకు తగ్గట్టుగా నిధులు కేటాయించడంతోపాటు డబ్బులు దాచుకుంటారు. ఆర్థిక క్రమశిక్షణ అలవాటు అవుతుంది.

కన్ఫర్మ్ తత్కాల్ టికెట్ దక్కాలంటే.. 5 సూత్రాలు
రైళ్లలో ప్రతిరోజూ కోట్లాది మంది ప్రయాణిస్తుంటారు. ఇక పండుగల సమయంలో అయితే రైలు ప్రయాణీకుల సంఖ్య చాలా రెట్లు పెరుగుతుంది. ఇటువంటి పరిస్థితిలో కన్ఫర్మ్ టికెట్ పొందాలంటే చాలా కష్టపడాలి. అప్పటికప్పుడు ప్రయాణాలు చేసేవారి కోసం తత్కాల్ బుకింగ్ (Tatkal ticket) ఆప్షన్ ఉన్నప్పటికీ కన్ఫర్మ్ టికెట్ దక్కడం అంత సులభం కాదు. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీకు కొన్ని చిట్కాలను తెలియజేస్తున్నాం. వీటిని పాటిస్తే మీరు ఇతరులకన్నా చాలా వేగంగా తత్కాల్ టికెట్లను బుక్ చేయవచ్చు. తద్వారా కన్ఫర్మ్ టికెట్ లభించే అవకాశం ఉంటుంది.👉 ఇంటర్నెట్ కనెక్షన్ చెక్ చేసుకోండిరైల్వే తత్కాల్ టికెట్లు బుక్ చేసే ముందు మీ ఇంటర్నెట్ కనెక్షన్ సక్రమంగా ఉందో లేదో చెక్ చేసుకోండి. తత్కాల్ టికెట్ చేస్తున్నప్పుడు 1-2 నిమిషాల సమయం కూడా లభించదు. అటువంటి పరిస్థితిలో మీ ఇంటర్నెట్ కనెక్షన్లో అంతరాయం కలిగితే టికెట్ బుకింగ్ ఆలస్యమై కన్ఫర్మ్ టికెట్ దక్కే అవకాశం ఉండదు.👉 సరైన సమయంలో లాగిన్ అవ్వాలితత్కాల్ బుకింగ్ చేసుకోవాలంటే సరైన సమయంలో లాగిన్ అవ్వాలి. ఏసీ కోచ్ కోసం తత్కాల్ బుకింగ్ ప్రతిరోజూ ఉదయం 10 గంటలకు, స్లీపర్ కోచ్ కోసం తత్కాల్ బుకింగ్ ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. కాబట్టి బుకింగ్ ప్రారంభానికి 2-3 నిమిషాల ముందుగానే లాగిన్ అవ్వాలి.👉 మాస్టర్ లిస్ట్ సిద్ధం చేసుకోండిఐఆర్సీటీసీలో కస్టమర్లకు మాస్టర్ లిస్ట్ అనే ప్రత్యేక ఫీచర్ అందుబాటులో ఉంది. ఇందులో ప్రయాణీకుల వివరాలను బుకింగ్ చేయడానికి ముందే నింపి సిద్ధంగా ఉంచుకోవచ్చు. ఇది బుకింగ్ చేసేటప్పుడు సమయాన్ని చాలా ఆదా చేస్తుంది.👉 యూపీఐ పేమెంట్తత్కాల్ బుకింగ్ సమయంలో టికెట్ మొత్తాన్ని చెల్లించేందుకు క్రెడిట్, డెబిట్ కార్డులకు బదులుగా యూపీఐ ద్వారా పేమెంట్ చేయవచ్చు. ఇది మీ సమయాన్ని ఆదా చేస్తుంది. దీంతో ప్రక్రియ వేగంగా పూర్తయి కన్ఫర్మ్ టికెట్ మీ సొంతమవుతుంది.👉 రైళ్లను ఎంచుకోవడంబుకింగ్ చేసే ముందు తత్కాల్ టికెట్లు పొందడానికి ఎక్కువ అవకాశం ఉన్న రైళ్లను ఎంచుకోవాలి. లాంగ్ జర్నీ రైళ్లకు బదులుగా మీరు ప్రయాణించాల్సిన స్టేషన్ల మధ్య మాత్రమే తిరిగే రైళ్లను ఉదాహరణకు ప్రత్యేక రైళ్లు ఎంచుకుంటే కన్ఫర్మ్ టిక్కెట్లు పొందే అవకాశాలు ఎక్కువుంటాయి.

భారత్.. మంచి కాఫీలాంటి మార్కెట్!
‘కొండ ప్రాంతాల్లో పంట. బాగా మగ్గిన కాఫీ చెర్రీస్ సేకరణ, గ్రేడింగ్ సైతం చేతితోనే.. భారత్ మినహా ప్రపంచంలో మరెక్కడా ఈ ప్రత్యేకత లేదు. అంతేకాదు నాణ్యతలోనూ మనది విశిష్ట స్థానమే. అందుకే ఖరీదైన ‘స్పెషాలిటీ కాఫీ’లభించే దేశాల జాబితాలో భారత్ నిలిచింది. కొన్ని ఎస్టేట్స్‌లో పండిన కాఫీ 100 శాతం ప్రీమియంతో అమ్ముడైన సందర్భాలు ఎన్నో. యూరప్‌కు చెందిన దిగ్గజ బ్రాండ్స్‌కు మన కాఫీయే కావాలని చెబుతారు. ఉత్పత్తిలో ప్రపంచంలో 7వ స్థానంలో నిలిచిన భారత్‌లో 2023–24లో 3,74,200 టన్నుల కాఫీ పండింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కాఫీ ప్రియులు భారతీయ అరోమాను ప్రతిరోజూ ఆస్వాదిస్తున్నారు. నాణ్యత, పోటీ ధర, సర్వీస్‌తో భారత కాఫీ అంతర్జాతీయంగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రభుత్వ ప్రోత్సాహం మరింత పెరిగితే కాఫీ రంగంలో మన దేశం అద్భుతాలు సృష్టిస్తుంది’అంటారు ప్రైవేట్ లేబుల్ కాఫీ తయారీలో ప్రపంచ దిగ్గజం సీసీఎల్ ప్రొడక్ట్స్ వ్యవస్థాపకులు చల్లా రాజేంద్ర ప్రసాద్. ఆయనింకా ఏమన్నారంటే.. -సాక్షి, స్పెషల్ డెస్క్వినియోగం పెరిగింది గతంలో భారత్‌లో కాఫీ వినియోగం ఏటా 50 టన్నులు మాత్రమే. నేడు 1,25,000 టన్నుల స్థాయికి చేరుకున్నాం. ఉత్పత్తి అధికం అయితే కాఫీ వినియోగం పెరుగుతుంది. దేశీయంగా 10,00,000 టన్నుల కాఫీ విక్రయించేంతగా అవకాశాలు ఉన్నాయి. 1960–70 ప్రాంతంలో ఇన్స్టంట్ కాఫీ తయారీ సామర్థ్యం కేవలం 1,600 టన్నులు మాత్రమే. ఇప్పుడు ఏకంగా 70,000 టన్నులతో ప్రపంచంలో మూడవ స్థానంలో నిలిచాం. ఇందులో సీసీఎల్ వాటా 40,000 టన్నులు. అన్ని కంపెనీలకూ రెండింతలు ఉత్పత్తి చేయగల అదనపు సామర్థ్యం ఉంది. సాంకేతికతను అందిపుచ్చుకుని కాఫీకి విలువ జోడించడం ద్వారా ప్రపంచ పటంలో భారత్ నిలిచింది. ఇన్స్టంట్ కాఫీలో బ్రెజిల్ 90,000 టన్నులు, యూరప్ దేశాలు 80,000 టన్నులతో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఒక్క అరకులోనే..: ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ, పన్నులు లేవు.. అందుకే కాఫీ ఉత్పత్తిలో వియత్నాం 20–25 ఏళ్లలో ప్రపంచంలో రెండో స్థానానికి చేరింది. మనదేశంలోనూ కాఫీ పంటకు అనువైన ప్రాంతాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని అరకులో 5,000 టన్నులు పండుతోంది. దీనిని 1,00,000 టన్నుల స్థాయికి చేర్చవచ్చు. కావాల్సిందల్లా ప్రభుత్వ ప్రోత్సాహమే. స్థానికులకు ఉపాధి అవకాశాలతోపాటు ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. అనుబంధ కంపెనీలూ వస్తాయి. 5–10 ఏళ్లు కష్టపడితే చాలు. కాఫీ స్టార్టప్స్..: యువ వ్యాపారవేత్తలు త్వరితగతిన డబ్బులు అందుకోవాలని చూస్తున్నారు. ఇదే సమస్యకు కారణం. సుస్థిరత, దీర్ఘకాల కోసం వ్యాపార సంస్థలు ప్రణాళిక చేసుకోవాలి. ఏ స్టార్టప్ అయినా, ఉత్పాదన ఏదైనా.. వినూత్నంగా ఉంటేనే నిలదొక్కుకుంటాయి. కాఫీ రంగంలోనూ ఎన్నో స్టార్టప్స్ వచ్చాయి. నాణ్యతలో స్థిరత్వం లేదు. ఆహార సంబంధ వ్యాపారంలో అపార అవకాశాలు ఉన్నాయి. ప్రజల సగటు ఆదాయం పెరిగింది. వినియోగదార్లు ఆహారాన్ని ఆస్వాదించడంలో ప్రయోగాలకు సిద్ధపడుతున్నారు. అప్పు తీర్చే వరకు విస్తరణ వద్దు.. ఏ కంపెనీ అయినా అప్పు తీర్చేవరకు విస్తరణ చేపట్టకపోవడమే మంచింది. అప్పు తీసుకుని మొహం చాటేయడం మంచి పద్ధతి కాదు. వ్యాపారవేత్తలు తమ వైఫల్యాన్ని ఒప్పుకోవాలి. ఆర్థిక క్రమశిక్షణ ఉండాల్సిందే. లాభంలో 50 శాతం ఆదా చేయాల్సిందే. ఈజీ మనీ అనే ఆలోచనే రాకూడదు. నా చిన్ననాటితో పోలిస్తే నేటి సమాజంలో ప్రేమ, ఆప్యాయతలు తగ్గిపోయాయి. ఒకరిపట్ల ఒకరికి నమ్మకం తగ్గింది. తల్లిదండ్రులు అంటే దేవుడి తరువాతి స్థానం. అలాంటిది ఇప్పుడు యాంత్రికంగా జీవిస్తున్నారు. కల్చర్ సైతం మారిపోయింది. డబ్బుకు ఒక దశ తరువాత విలువ ఉండదు. మనసు స్వచ్ఛంగా ఉండాలి. డబ్బు విషయంలో దురాశ సమస్యలను తెచి్చపెడుతుంది.ప్రభుత్వ జోక్యం ఉండరాదు.. కంపెనీల కార్యకలాపాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే బాగుంటుంది. లైసెన్స్ రాజ్ ఉండకూడదు. నిబంధనలు పెట్టడం వరకే ప్రభుత్వం పరిమితం కావాలి. కంపెనీలు తప్పు చేశాక ప్రభుత్వం రావడం కాదు.. తప్పు చేయక ముందే ప్రభుత్వం మేల్కొనాలి. దేశంలోని కోర్టుల్లో 75 శాతం ప్రభుత్వ వ్యాజ్యాలే. 100కు పైగా దేశాల్లో... ప్రారంభించిన కొన్నాళ్లకే నష్టాలు ఎదురైనా.. కంపెనీని తిరిగి గాడిలో పెట్టి కాఫీ ప్రపంచంలో తెలుగువారి సత్తా చాటుతున్న తొలితరం వ్యాపారవేత్త చల్లా రాజేంద్ర ప్రసాద్. స్వచ్ఛంద కార్యక్రమాల కోసం రూ.కోట్లు వెచి్చస్తున్న పెద్ద చేయి ఆయనది. ఉస్మానియా వర్సిటీ నుంచి 1975లో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ప్యాకేజింగ్ మెటీరియల్, ట్యూబ్స్, డక్ట్స్, ఐటీ, రియల్టీ, నిర్మాణ రంగంలోనూ తనదైన ముద్రవేశారు. 1989 నుంచి కాఫీ వ్యాపారంలో ఉన్నారు. ఔత్సాహిక యువతను భుజం తట్టి వ్యాపారం వైపు ప్రోత్సహిస్తున్నారు. భారత కాఫీ బోర్డు సభ్యుడిగా నాలుగుసార్లు, ప్రత్యేక ఆహ్వానితుడిగా ఒకసారి పనిచేశారు. ఇంటర్నేషనల్ ఇన్స్టంట్ కాఫీ మాన్యుఫ్యాక్చరర్స్ నుంచి 2019లో జీవన సాఫల్య పురస్కారం అందుకున్నారు. సీసీఎల్ ప్రొడక్ట్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.10,160 కోట్లకుపైనే.100కిపైగా దేశాల్లోని విభిన్న బ్రాండ్స్‌కు కాఫీ సరఫరా చేస్తోంది. సొంత బ్రాండ్ అయిన ‘కాంటినెంటల్ కాఫీ’కి మంచి డిమాండ్ ఉంది.

రియల్ ఎస్టేట్.. యుద్ధం ఎఫెక్ట్..
దేశీయ స్థిరాస్తి రంగంపై దాయాదుల పోరు దెబ్బ పడింది. సాయుధ పోరాటాలు దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. యుద్ధాలతో ఆస్తి, ప్రాణ నష్టం కలగడమే కాకుండా దెబ్బతిన్న మౌలిక సదుపాయాలను పునర్నిర్మించుకోవడం కోసం పెద్ద ఎత్తున ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు భారంగా మారుతుంది. యుద్ధాలు నిర్మాణ రంగాన్ని కూడా నిలిపివేస్తాయి. తుది వినియోగదారులు, పెట్టుబడిదారుల విశ్వాసాన్ని తగ్గించడంతో పాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో స్థిరాస్తి లావాదేవీలపై ప్రభావాన్ని చూపిస్తుంది. గృహ కొనుగోలుదారులు తమ నిర్ణయాలను నిలిపివేస్తారు. బహుళ జాతి సంస్థలు కొత్త ఆఫీసుల ఏర్పాటు, విస్తరణ ప్రణాళికలను వాయిదా వేస్తారు. రిటైలర్లు తమ విస్తరణ ప్రణాళికలకు బ్రేక్‌లు వేస్తారు. అయితే ఈ అవరోధం తాత్కాలిక కాలమే.. – సాక్షి, సిటీబ్యూరో స్థిరాస్తి రంగంపై యుద్ధం ప్రభావం ఇలా..🔸నివాసం: ఢిల్లీ–ఎన్సీఆర్, ఉత్తర భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో ఇళ్ల కొనుగోళ్లు 5–10 శాతం మేర తగ్గవచ్చు. అయితే ఇది కొద్దికాలమే.. సాధారణంగా అనిశ్చితి సమయంలో లగ్జరీ గృహ కొనుగోలుదారులు కొనుగోలులో ఆలస్యం చేస్తారు. సాధారణ స్థితి పునరుద్ధరణ అయ్యాక ముందుగా మధ్య ఆదాయ వర్గాల గృహాలకు డిమాండ్ ఏర్పడుతుంది. అయితే ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే సిమెంటు, ఉక్కు ధరలు పెరుగుతూనే ఉంటాయి.🔸వాణిజ్యం: తాజా యుద్ధం ఇంకా కొనసాగితే కనుక బహుళ జాతి సంస్థలు మన దేశంలోకి ప్రవేశ, విస్తరణ ప్రణాళికలను తాత్కాలికంగా నిలిపివేస్తాయి. దీంతో ఆఫీసు స్పేస్ లీజులపై ప్రభావం పడుతుంది. దీర్ఘకాలిక డిమాండ్ కారణంగా గ్లోబల్ కేపబులిటీ సెంటర్లు(జీసీసీ), బీఎఫ్ఎస్ఐ, ఐటీ రంగాలలో ఆఫీసు స్పేస్ లీజులు, కొనుగోలు లావాదేవీలు 12 లేదా అంతకంటే తక్కువ సమయంలోనే తిరిగి పుంజుకుంటాయి.🔸రిటైల్: దీర్ఘకాలిక లీజులు, అద్దె మినహాయింపు నిబంధనల కారణంగా బ్రాండెడ్ మాల్స్‌పై పెద్దగా ప్రభావం పడదు. కానీ, మాల్స్‌లో జనసంచారం, రద్దీ తగ్గడంతో పాటు కొత్త స్టోర్ ప్రారంభాలు వాయిదా పడతాయి.🔸ఆతిథ్యం: యుద్ధంతో సహజంగానే ఢిల్లీ, కశీ్మర్ వంటి ఇతర ప్రభావిత ప్రాంతాలలో పర్యాటక ప్రాంతాల రద్దీ తగ్గుతుంది. ఆయా ప్రాంతాలలో హోటల్ ఆక్యుపెన్సీ 10–15 శాతం క్షీణిస్తుంది. ఇండో–పాక్ యుద్ధంతో.. 1971లో ఇండియా, పాకిస్తాన్ దేశాల మధ్య 13 రోజుల పాటు జరిగిన యుద్ధ కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. నిర్మాణ పనులు పూర్తిగా నిలిచిపోయాయి. స్థూల జాతీయోత్పత్తి(జీడీపీ) వృద్ధిలో భారీ తగ్గుదల నమోదైంది. 1970 ఆర్థిక సంవత్సరంలో 5.4 శాతంగా ఉన్న జీడీపీ.. 1972 నాటికి 1 శాతానికి పడిపోయింది. ద్రవ్యోల్బణం 11 శాతానికి పైగా దాటింది. నిర్మాణ పనులు సైనిక ప్రదేశాలకే పరిమితమయ్యాయి.🔸నివాసం: ఆర్థిక రాజధాని ముంబైలో(అప్పట్లో బొంబాయి) స్థానిక రాష్ట్ర ప్రభుత్వం సిమెంట్, ఉక్కుపై కఠిన నియంత్రణ విధించింది. నిర్మాణ సామగ్రి కొరత కారణంగా గృహ ప్రాజెక్ట్‌ల అనుమతులు 12 శాతం మేర తగ్గాయి. అద్దె నియంత్రణ చట్టం కారణంగా రెంట్లు స్థిరంగానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం అదుపు తప్పినప్పటికీ.. గృహాల అద్దెలు పెరగలేదు. ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు దాదాపు 10 శాతం మేర తగ్గాయి.🔸వాణిజ్యం: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ) చెప్పుకోదగిన స్థాయిలో రాలేదు. ప్రైవేట్ కార్యాలయ స్థలాల అభివృద్ధి పూర్తిగా ఆగిపోయింది. దేశంలో ఖరీదైన, డిమాండ్ కలిగిన ప్రాంతాలైన ముంబైలోని పోర్ట్, ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లలో భారీగా ఆఫీసు వేకెన్సీలు కనిపించాయి. అయితే పరిమిత సరఫరా, కఠినమైన నిబంధనల కారణంగా కార్యాలయాల అద్దెలు మాత్రం తగ్గలేదు.🔸రిటైల్: ఇప్పటి లాగా 1971లో దేశంలో హైస్ట్రీట్ రిటైల్ రంగం వ్యవస్థీకృతంగా లేదు. ఎక్కువగా అసంఘటిత రంగంగానే ఉండేది. కానీ పాత ఢిల్లీ, కోల్‌కతాలోని స్థానిక దుకాణాలకు జన సంచారం గణనీయంగా తగ్గింది. 1971 నుంచి అందుబాటులో ఉన్న కోర్టు రికార్డ్ల ప్రకారం అద్దెదారులలో పెరిగిన ఒత్తిడి కారణంగా ముంబైలో దుకాణాల అద్దె వివాదాలు 18 శాతం మేర పెరిగాయి.🔸ఆతిథ్యం: దేశీయ పర్యాటక రంగం యుద్ధంతో ప్రభావితమైంది. 1970లో 20.2 లక్షలుగా ఉన్న విదేశీ పర్యాటకుల రాకపోకలు.. 1971 నాటికి 19.6 లక్షలకు తగ్గింది. ఢిల్లీలో హోటళ్ల ఆక్యుపెన్సీ 45 శాతం కంటే తక్కువకు పడిపోయింది. ఆ రోజుల్లో హాస్పిటాలిటీ రంగంలో ప్రధాన సంస్థ అయిన ఇండియన్ హోటల్స్ కంపెనీ కూడా రెండంకెలలో ఆదాయం పడిపోయింది. ప్రత్యక్షంగా శ్రీనగర్ పర్యాటక ప్రాంతం ఎక్కువగా ప్రభావితమైంది.నాలుగు అంశాలపై ప్రతికూలత.. బంగ్లాదేశ్ విమోచనం ప్రధాన అంశంగా 1971లో ఇండియా–పాకిస్తాన్ మధ్య, అలాగే తీవ్రవాదులు నియంత్రణ రేఖ దాటి మన దేశంలోకి చొచ్చుకురావడంతో 1999లో కార్గిల్ యుద్ధం జరిగింది. ఈ రెండు సందర్భాల్లోనూ దాయాదుల పోరుతో స్థిరాస్తి రంగంలో నాలుగు కీలక విభాగాలైన నివాస, వాణిజ్య, రిటైల్, ఆతిథ్య రంగాలపై యుద్ధం ప్రభావం చూపించింది.🔸 వినియోగదారులు, పెట్టుబడిదారుల విశ్వాసం తగ్గుతుంది. గృహ కొనుగోలుదారులు కొనుగోళ్లను ఆలస్యం చేస్తారు. సంస్థలు తమ కార్యాలయాల విస్తరణ లీజు లావాదేవీలను వాయిదా వేస్తారు. పెట్టుబడిదారులు బంగారం, స్టాక్ మార్కెట్లు, క్రిప్టో కరెన్సీ వంటి ప్రత్యామ్నాయ పెట్టుబడుల వైపు ఆసక్తి చూపుతారు.🔸ఉక్కు, సిమెంటు, కాపర్, టైల్స్, శానిటరీ వేర్, రంగులు వంటి నిర్మాణ సామగ్రి ముడి పదార్థాల కొరత ఏర్పడుతుంది. దీంతో ఇన్పుట్ ధరలు పెరుగుతాయి.🔸ప్రభుత్వం సైన్యం కార్యకలాపాలను మరింత బలోపేతం చేసేందుకు రక్షణ రంగంపై ఖర్చును పెంచుతాయి. మౌలిక సదుపాయాలు, వినియోగదారుల రియల్ ఎస్టేట్‌పై ఖర్చును తగ్గిస్తాయి.🔸సాయుధ పోరాటాలు అద్దెలను పెద్దగా ప్రభావితం చేయకపోయినా.. డిమాండ్ తక్కువగా ఉండటం వల్ల గృహ మూలధన విలువలు దెబ్బతింటాయి.కార్గిల్ వార్తో.. 🔸 1999లో జరిగిన కార్గిల్ యుద్ధం స్వల్పకాలమైనా.. ఎక్కువ ప్రభావితమైంది. యుద్ధం కారణంగా మూడు నెలల పాటు మార్కెట్లు భయాందోళనకు దారితీసినా త్వరగానే కోలుకుంది.🔸 నివాసం: దేశీయ రియల్ ఎస్టేట్ మార్కెట్ అప్పటికే ఆసియా ఆర్థిక సంక్షోభం ప్రభావంతో కొట్టుమిట్టాడుతోంది. దీంతో గృహ అద్దె విలువలు ప్రత్యక్షంగా దెబ్బతిన్నాయి. ఢిల్లీ, ముంబైలోని ప్రధాన నివాస ప్రాంతాల్లోని అద్దె విలువలు మూడు నెలల్లో 3–8 శాతం మేర పడిపోయాయి. 1999 చివరి నాటికి అట్టడుగు స్థాయికి క్షీణించాయి. ఆసక్తికరంగా కార్గిల్ యుద్ధ సమయంలో ముంబైలోని చారిత్రాత్మక, ప్రధాన వ్యాపార ప్రాంతమైన కఫ్ పరేడ్‌లో లగ్జరీ అపార్ట్మెంట్ ధర చ.అ.కు రూ.20,000–23,200 మధ్య అమ్ముడవడం కొసమెరుపు.🔸 వాణిజ్యం: 1999లో ప్రధాన నగరాల్లో సుమారు 48 లక్షల చ.అ. ఆఫీసు స్పేస్ సరఫరా అయింది. కన్నాట్ ప్లేస్ వంటి సెంట్రల్ బిజినెస్ డి్రస్టిక్ట్ ప్రాంతాలలో ఖాళీలు 11–15 శాతం మధ్య పెరిగాయి. అద్దెలు స్వల్పంగా తగ్గాయి. పెద్ద అంతర్జాతీయ కంపెనీలు లీజు లావాదేవీలు రద్దు చేయలేదు. కానీ.. కొంతకాలం పాటు వాయిదా వేశాయి. అప్పట్లో బెంగళూరు సిలికాన్ వ్యాలీ కాదు కానీ కోరమంగళం వంటి ప్రాంతాల్లో పూర్తిస్థాయి ఐటీ పార్క్‌లు ఉన్నాయి. వీటిల్లో అద్దె నెలకు చ.అ.కు రూ.35–65 మధ్య లీజుకు పోయాయి.🔸 రిటైల్: దేశంలో ప్రధాన మాల్స్ అయిన ముంబైలోని క్రాస్‌రోడ్స్, ఢిల్లీలోని అన్సల్ ప్లాజాల నిర్మాణ పనులు తుది దశలో ఉన్నాయి. 1999లో ప్రీమియం రిటైల్ రియల్ ఎస్టేట్ వాణిజ్య రియల్టీ కంటే ఎక్కువ అద్దెలను చవిచూసింది. కానీ, యుద్ధ వాతావరణంతో చాలా మంది రిటైలర్లు తమ స్టోర్ ఓపెనింగ్లను కొంతకాలం పాటు నిలిపివేశారు.🔸 ఆతిథ్యం: కార్గిల్ యుద్ధం సమయంలో ప్రత్యక్షంగా ప్రభావితమయ్యే ప్రాంతాలు మినహా పర్యాటక పరిశ్రమ గణనీయంగా బలంగా ఉంది. 1999లో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు 5.3 శాతం మేర పెరిగాయి. దీనికి ప్రధాన కారణం అప్పటి ప్రభుత్వం పర్యాటక రంగానికి ఇచి్చన ప్రోత్సాహం, రూపాయి విలువ తగ్గడమే. ఈ 3 నెలల్లో ఉత్తర భారతదేశంలో హోటళ్ల రద్దు 20–30 శాతం పెరిగాయి. ఎక్కువగా ఢిల్లీ, కశీ్మర్ లోని హోటళ్లు ప్రభావితమయ్యాయి. 2003 నాటికి పర్యాటకుల సంఖ్య ఏటా 44 వేలకు చేరింది.యుద్ధం తర్వాత ఏమైందంటే.. దాయాదుల మధ్య జరిగిన రెండు యుద్ధాల తర్వాత దేశీయ రియల్ ఎస్టేట్ రంగం మూడు ప్రధాన అంశాల నుంచి వేగంగా కోలుకుంది. గృహాలు, కార్యాలయాల అవసరం ఎప్పటిలాగే డిమాండ్ కొనసాగింది. యుద్ధంతో కొనుగోలుదారులు, పెట్టుబడిదారులలో నెలకొన్న భయాందోళలు తగ్గించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) కఠిన రుణ నిబంధనలను సరళతరం చేసింది. అలాగే స్టాక్ మార్కెట్లు త్వరగా కోలుకున్నాయి. ఈ రెండు యుద్ధాలతో వివిధ పాయింట్లతో నిఫ్టీ సుమారు 5 శాతం పడిపోయినప్పటికీ.. సానుకూల రాబడిని అందించడానికి 5–6 నెలల్లోనే తిరిగి క్షీణించాయి.
ఫ్యామిలీ

ఆ దంపతుల యావజ్జీవితం నౌకలోనే..!
‘అద్దె కట్టాలి, కరెంట్ బిల్లు కట్టాలి, గ్యాస్ బిల్లు కట్టాలి, పాల బిల్లు కట్టాలి, రేషన్ ఖర్చు, మెడికల్ ఖర్చు– అబ్బా! ఎలారా ఫ్యామిలీ మన్ అందరూ మ్యానేజ్ చేస్తున్నారు’ అనే సినిమా డైలాగ్ మాదిరిగానే చాలామంది ఫ్యామిలీని రన్ చేయడానికి చాలా కష్టాలు పడుతుంటారు. అయితే, అమెరికాలోని లానెట్, జోహాన్ అనే దంపతులు ఈ కష్టాలన్నింటికీ దూరంగా బతికేయడానికి ఒక ఉపాయం ఆలోచించారు. అదే నౌకాజీవితం. వారికున్న కార్లన్నీ ఆమ్మేసి, ప్రపంచయాత్ర చేసే నౌకలో యావజ్జీవిత యాత్రను ప్రారంభించారు. ఈ నౌక మూడున్నరేళ్లల్లో 147 దేశాలకు చెందిన 425 ఓడరేవులలో ఆగుతుంది. ఇప్పటికే ఈ దంపతులు 25 దేశాలను సందర్శించారు. ఇలానే తర్వాతి పదిహేనేళ్లు కూడా ఇందులోనే గడిపేయాలని నిర్ణయించుకున్నారు. అద్భుతమైన వారి నౌకాజీవితాన్ని ‘లివింగ్ లైఫ్ ఆఫ్ ఏ క్రూజ్’ పేరుతో యూట్యూబ్‌లో వీడియో పోస్ట్ చేసి, ‘ఇక్కడ మేము నెలకు రూ. 2.85 లక్షలు ఖర్చు చేస్తున్నాం. ఇది మా సాధారణ ఖర్చుల కంటే చాలా తక్కువ. పైగా వంట వండటం, బట్టలు ఉతకడం, రూమ్ క్లీనింగ్ ఇలా ఏ పనీ చేయాల్సిన పనిలేదు. పడుకున్న దుప్పట్లు కూడా వారే మడతేసి పెడతారు. కేవలం ఏం కావాలంటే అది ఆర్డర్ పెట్టుకొని తినడం, ఎంజాయ్ చేయటమే మా పని. ఇదే మా అడ్రస్. అయితే, అప్పుడప్పుడు భూమి మీదకు వెళ్లినప్పుడు నడవడానికి కాస్త ఇబ్బంది పడుతున్నాం’ అని చెప్పారు. (చదవండి: కళ్లు చెదిరే కాంతుల వేడుక..!)

ముద్దుగుమ్మ రాశీ ఖన్నా ఇష్టపడే ఫ్యాషన్ బ్రాండ్స్ ఇవే..!
గ్లామర్, గ్రేస్, క్లాస్, క్యూట్... ఇలా అందాన్ని పొగిడే ఎన్ని పదాలున్నా, అన్నింటినీ కలిపి ఒకేసారి వాడినా కూడా నటి రాశీ ఖన్నా ఫ్యాషన్ లుక్స్‌ని నిర్వచించలేం. ట్రెడిషనల్ నుంచి జెండర్ ఫ్లూయిడ్ ఫ్యాషన్ వరకు ప్రతి స్టయిలింగ్లోనూ తన ఫ్యాషన్ స్టేట్మెంట్ స్కోర్ సెంచరీనే! అలాంటి ఒక ఫస్ట్‌క్లాస్ లుక్, ఇందుకోసం తను ఎంచుకున్న ఫ్యాషన్ బ్రాండ్స్ అండ్ టిప్స్ ఏంటో ఇక్కడ చూసేయండి. చెవి కప్పేస్తే కళ్లకందం దుద్దులు, బుట్టకమ్మలు, జూకాలు– ఇలా ఎన్ని రకాల కర్ణాభరణాలున్నా, వేటి గొప్ప వాటికే ఉంటుంది. అలా ఒకప్పటి గొప్ప ఆభరణం. ఇప్పుడు మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చింది. అదే ఫుల్ కవర్డ్ ఇయర్ కఫ్స్. ఇవి సాధారణ ఇయర్ కఫ్స్లాగా సపరేట్గా ఉండవు. కింద కమ్మలతోపాటే, కఫ్ రెండూ కలిపి ఒకే తరహా డిజైన్‌లో ఉంటాయి. వీటిని చెవికి పెట్టుకోకుండా హుక్తో తగిలించుకుంటే చాలు. సంప్రదాయ దుస్తులకు ఇది సరైన జోడీ. వేడుకల్లో వీటిని ధరిస్తే ప్రత్యేక ఆకర్షణగా మీరే నిలుస్తారు. అయితే, ఇలాంటి ఇయర్ కఫ్స్ వేసుకునేటప్పుడు మెడను బోసిగా ఉంచుకోవాలి. అప్పుడే వీటి లుక్ ఎలివేట్ అవుతుంది. హెయిర్ స్టయిల్ కూడా బన్ లేదా సెంటర్ బన్ వేసుకోవాలి. వేవీ లేదా లూస్ హెయిర్ స్టయిల్ అస్సలు నప్పదు దీనికి. అలాగే మరో చిన్న టిప్ ఏంటంటే, మొత్తం ఎఫర్ట్ చెవులకే కాకుండా, కాస్త చేతులకు కూడా ఇవ్వండి. అంటే చేతికి మీ డ్రెస్‌కు తగ్గట్టు మ్యాచింగ్ గాజులు వేసుకుని లుక్‌ని కాస్త బ్రైట్ చేయండి. అచ్చం నటి రాశీ ఖన్నా లాగా.. "ఫ్యాషన్‌లో లెస్ ఈజ్ మోర్ అనే ఫిలాసఫీని నమ్ముతా. అలాగని, ఫ్యాషన్‌లో ప్రయోగాలు చేయడానికి భయపడను. ఎలాంటి దుస్తులనైనా ఆత్మవిశ్వాసంతో ధరిస్తే, అందంగా కనిపిస్తారు." అంటోంది రాశీ ఖన్న. ఇక్కడ రాశీ కన్నా ధరించిన ఇయర్ రింగ్స్ బ్రాండ్: కోహర్ బై కనికాధర రూ. 6,500/-.(చదవండి: 'వాటర్ బర్త్' అంటే..? నటి కల్కి కోచ్లిన్ ప్రసవ అనుభవం..)

వీరవాహనుడికి వశిష్ఠుడు చెప్పిన కథ
పూర్వం విరాధ నగరాన్ని వీరవాహనుడు పాలించేవాడు. అతడు గొప్ప ధర్మాత్ముడు, దానశీలి, సత్యవాది. ఒకనాడు అతడు వేట కోసం అడవికి వెళ్లాడు. అదే అడవిలో వశిష్ఠ మహర్షి ఆశ్రమం ఉందని తెలుసుకుని, ఆయనను దర్శించుకుని, ధర్మసందేహాలను నివృత్తి చేసుకోవాలని తలచి, అక్కడకు వెళ్లాడు. ఆశ్రమంలో వశిష్ఠుడిని దర్శించుకుని, ఆయనకు పాదాభివందనం చేశాడు. పరస్పర కుశల ప్రశ్నలయ్యాక వీరవాహనానుడు ‘మహర్షీ! యథాశక్తిగా నేను ఎన్నో ధర్మకార్యాలను చేస్తూనే ఉన్నాను. అయినా నాకు నరక భయం తొలగిపోవడం లేదు. యమధర్మరాజును గాని, నరకాన్ని గాని చూడకుండా, నరకబాధలు లేకుండా మరణానంతర జీవనం గడిపే వీలుందా?’ అని అడిగాడు.‘మహారాజా! మన మునివరేణ్యులు ఎన్నో ధర్మాలను ప్రవచించినా, కర్మ మోహితులైన జనాలు వాటిని పెద్దగా పట్టించుకోరు. దానం, తీర్థం, తపస్సు, యజ్ఞం, పితృకార్యం, సన్యాసం– ఇవన్నీ గొప్ప ధర్మాలు. చివరిగా వృషోత్సర్గం– అంటే, ఆబోతును యథావిధిగా విడిచిపెట్టడం గొప్ప మహిమాన్వితమైన ధర్మకార్యం. మరణానంతరం అపరకర్మలు జరిపేటప్పుడు పుత్రులు గాని, ఇతరులు గాని వృషోత్సర్గం చేయకపోతే, ఆ మృతజీవుడు ఎప్పటికీ ప్రేతంగానే మిగిలిపోతాడు. అందువల్ల మహారాజా! నువ్వు కూడా ఒక ఆబోతును విడిచిపెట్టు. వృషోత్సర్గ మహిమ నీకు తెలియాలంటే, ఒక కథ చెబుతాను విను’ అని వశిష్ఠుడు ఇలా చెప్పసాగాడు:ఒకప్పుడు విదేహ నగరంలో ధర్మవత్సుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన గొప్ప విష్ణుభక్తుడు, విద్వాంసుడు. ఒకనాడు ఆయన పితృకార్యం కోసం దర్భలను, మోదుగు ఆకులను సేకరించడానికి అడవికి వెళ్లాడు. అడవిలో తిరుగుతూ ఆయన వాటిని సేకరిస్తుండగా, అకస్మాత్తుగా ఆయన ఎదుట నలుగురు దివ్యపురుషులు ప్రత్యక్షమయ్యారు. వారు ఆయనను ఆకాశమార్గాన తీసుకుపోయి, విశాలమైన వనం మధ్యనున్న ఒక నగరంలో వదిలారు. అద్భుతమైన ఆ నగరంలో ధర్మవత్సుడికి రెండు రకాల మనుషులు కనిపించారు. కొందరు మలిన వస్త్రాలు ధరించి, దీనులై, నీరసులై ఉన్నారు. మరికొందరు ధగధగలాడే నగలు, రంగురంగుల వస్త్రాలు ధరించి, ఉల్లాసంగా ఉత్సాహంగా సంచరిస్తూ ఉన్నారు. ఇదంతా చూసి, అతడు ‘కలయా, వైష్ణవ మాయా’ అనుకున్నాడు. ఇంతలో అతణ్ణి అక్కడకు తీసుకువచ్చిన నలుగురు దివ్యపురుషులు అతడిని మహారాజు వద్దకు తీసుకుపోయారు. అక్కడ ఒక మహారాజు రత్నఖచిత సింహాసనంపై ఆసీనుడై ఉన్నాడు. చుట్టూ వందిమాగధులు, పరిజనం, ఎదురుగా సభాసదులు కొలువుతీరి ఉన్నారు. అంతటి మహారాజు కూడా ధర్మవత్సుడిని చూడగానే, సింహాసనం మీద నుంచి లేచి వచ్చి, అతడిని తన సింహాసనంపై కూర్చోబెట్టాడు. ‘విప్రవర్యా! మీవంటి విష్ణుభక్తుని దర్శనంతో నేడు నా జన్మ సఫలమైంది, నా వంశం పవిత్రమైంది’ అంటూ నమస్కరించాడు. ఘనంగా కానుకలు సమర్పించి, సత్కరించాడు.ధర్మవత్సుడు కాస్త తేరుకుని, ‘మహారాజా! ఇది ఏ దేశం. ఇక్కడి జనాల్లో కొందరు దీనులై ఉంటే, ఇంకొందరు సంతోషంగా ఉంటున్నారు. ఇలా ఎందుకు జరుగుతోంది. దేవేంద్ర వైభవంతో నువ్వు విరాజిల్లుతుండటానికి కారణమేంటి? నన్నెందుకు ఇక్కడకు తీసుకువచ్చారు?’ అని అడిగాడు.‘విప్రోత్తమా! నా చరిత్రను వర్ణించి చెప్పే సామర్థ్యం నాకు లేదు. అందుకు మా మంత్రివర్యులే తగినవారు’ అని పలికాడు మహారాజు. మహారాజు మనసెరిగిన మంత్రి ఇలా చెప్పడం ప్రారంభించాడు: ‘భూసురోత్తమా! గతజన్మలో మా మహారాజు విధిరా నగరంలో వైశ్యునిగా జన్మించారు. గోబ్రాహ్మణ సేవ చేస్తూ, నిత్యాగ్నిహోత్రుడై, అతిథి పూజ చేస్తూ, ధర్మబద్ధమైన జీవనం సాగించేవారు. ఒకనాడు ఆయన తీర్థయాత్రలు పూర్తి చేసుకుని, స్వస్థలానికి తిరిగి వస్తుండగా, తోవలో లోమశ మహర్షి దర్శనం లభించింది. వెంటనే ఆయన లోమశ మహర్షికి సాష్టాంగ నమస్కారం చేశారు. కుశల ప్రశ్నలయ్యాక, ‘మహర్షీ! నా యాత్రా ఫలం వెంటనే కనిపించింది. మీ దర్శన భాగ్యం లభించింది. నాదో చిన్న కోరిక! అంతర్బాహ్య స్థితులలో ఒకేలా ఉండే శుద్ధతను, కష్టసుఖాలను ఒకేలా స్వీకరించే స్థితప్రజ్ఞను పొందే సాధనమేదో తెలపండి’ అని కోరారు. అప్పుడు లోమశ మహర్షి, ‘వైశ్యవర్యా! సత్సాంగత్యం, సాధన, భక్తి, సద్విచారం ద్వారా మాత్రమే మనసు అదుపులో ఉంటుంది. మానవ జన్మలోని పాపకర్మల నుంచి విముక్తి పొందాలంటే వృషోత్సర్గం చేయాలి. వృషోత్సర్గం చేయనిదే పురుషార్థాలు నెరవేరవు. వెంటనే పుష్కర తీర్థానికి పోయి, వృషోత్సర్గం చేయి’ అని ఆదేశించాడు. లోమశుని ఆదేశంతో గతజన్మలో వైశ్యునిగా ఉన్న మా మహారాజు వరాహస్వామి వెలసిన పుష్కరతీర్థానికి వెళ్లి, అక్కడ వృషోత్సర్గం చేశారు. ఆ తర్వాత లోమశుని సమక్షంలో అనేక యజ్ఞాలను ఆచరించారు. ఆ పుణ్యఫలం వల్ల చాలాకాలం దివ్యలోకాలలో సకల భోగాలను అనుభవించారు. తిరిగి భూమ్మీద పుట్టవలసి వచ్చినప్పుడు వీరసేన రాజవంశంలో జన్మించి మాకందరికీ మహారాజు అయ్యారు’ అని చెప్పాడు మంత్రి. ‘ఈ విప్రోత్తములను ఎక్కడి నుంచి తీసుకు వచ్చారో అక్కడ సురక్షితంగా దిగవిడిచి రండి’ అని మహారాజు తన భటులను ఆదేశించాడు.ధర్మవత్సుడు ఆశ్చర్యపోయి, ‘అకస్మాత్తుగా ఎందుకు తీసుకొచ్చారు? మళ్లీ ఎందుకు పంపేస్తున్నారు?’ అని అడిగాడు. ‘విప్రోత్తమా! మీ వంటి విష్ణుభక్తులను నా సన్నిధికి పిలిపించి, సత్కరించడం నాకు అలవాటు. ఇందులో మీకు అసౌకర్యం కలిగించి ఉంటే మన్నించండి’ అని వినయంగా ప్రార్థించాడు మహారాజు. ధర్మవత్సుడు మహారాజును, ఆయన పరివారాన్ని ఆశీర్వదించి, ఆయన భటులతో కలిసి ఇంటికి వెళ్లాడు.∙సాంఖ్యాయన (చదవండి: అజ్ఞాత ప్రేమికుడు..!)

కళ్లు చెదిరే కాంతుల వేడుక..!
ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరాల అందాలను చూడటం కోసం ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు ఎగబడుతుంటారు. పారమాట నది ఒడ్డునున్న సిడ్నీ అందాలు చూడటానికి సుమనోహరంగా ఉంటాయి. అయితే, సిడ్నీ అందాలను మరింత ప్రత్యేకంగా చూడాలంటే, వివిడ్ సిడ్నీ ఫెస్టివల్‌కి వెళ్లాల్సిందే! ఈ వేడుకలు మే 23 నుంచి ప్రారంభమై జూన్ 14 వరకు దాదాపు మూడు వారాల పాటు కొనసాగుతాయి. ఇక్కడ కనిపించే ప్రతి కట్టడం, చీకటిపడితే విద్యుత్ వెలుగులతో మిరుమిట్లు గొలుపుతాయి. సిడ్నీ ఒపెరా హౌస్, హార్బర్ బ్రిడ్జ్ వంటి ప్రదేశాలు అద్భుతమైన కాంతి ప్రదర్శనలతో కళ్లుచెదిరే కళాఖండాలుగా మారుతాయి. అంతేకాదు, నగరమంతా ఏర్పాటు చేసే విద్యుద్దీపాలంకరణ మంత్రముగ్ధుల్ని చేస్తుంది.ఈ వేడుక కేవలం కాంతులకే పరిమితం కాదు. ఇక్కడ ప్రపంచ ప్రఖ్యాత కళాకారులు, సంగీత విద్వాంసుల ప్రదర్శనలుంటాయి. వినూత్న ఆలోచనలు పంచుకునే చర్చలు, చవులూరించే ఆహార వేదికలు కూడా ఈ ఉత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. కొన్నిసార్లు ప్రత్యేకంగా నీటిపై విజువల్ ఎఫెక్ట్లు కూడా ఉంటాయి. హార్బర్లో ప్రయాణించే పడవలు కూడా లైట్లతో అలంకరించడంతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ వేడుకకు స్థానికులతో పాటు దేశ విదేశాల నుంచి కూడా పర్యాటకులు పెద్దసంఖ్యలో సిడ్నీకి విచ్చేస్తుంటారు. ఈ వేడుకకు 2023లో రికార్డు స్థాయిలో 32.8 లక్షలమంది హాజరయ్యారు. దాంతో ఈ ఏడాది కూడా అదే స్థాయి అంచనాలున్నాయి. (చదవండి: డ్రాగన్స్ సృష్టించిన అద్భుతం!)
ఫొటోలు
అంతర్జాతీయం

‘86 47’ సంకేతం వెనుక ఏముంది?
వాషింగ్టన్: ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్‌బీఐ) మాజీ బాస్ జేమ్స్ కొమీ సోషల్ మీడియాలో పెట్టిన ‘86 47’సంకేత పోస్ట్‌పై దర్యాప్తు చేపట్టామని హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టి నోమ్ గురువారం వెల్లడించారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను హత్య చేసేందుకు పన్నిన కుట్రలో ఇదో భాగమని భావిస్తున్నట్లు ఆమెతోపాటు పలువురు రిపబ్లిక్ పార్టీ నేతలు ఆరోపణలు చేశారు. అంతకుముందు కోమీ ఇన్‌స్టా పోస్ట్‌లో ‘బీచ్‌లో నడుస్తుండగా నత్త గుల్లలు ‘86 47’ఆకారంలో కనిపించాయి’అంటూ ఓ ఫొటోను షేర్ చేశారు. ఇందులోని 86ను తొలగించడం, వదిలించుకోవడం అనే అర్థమొచ్చేలా వాడుతారు. 47ను ట్రంప్‌ను సూచిస్తూ వాడిన రహస్య సంఖ్య. ఆయన అమెరికాకు 47వ అధ్యక్షుడు. మొత్తమ్మీద అధ్యక్షుడిని హత్య చేసేలా ప్రేరేపించడమే దీని వెనుక అర్థమని ట్రంప్ ప్రభుత్వంలోని పలువురు ఉన్నతాధికారులు అంటున్నారు. దీనిపై డీహెచ్ఎస్, సీక్రెట్ సరీ్వస్ దర్యాప్తు చేపట్టి తగు రీతిలో స్పందిస్తాయని నోమ్ పేర్కొన్నారు. డొనాల్డ్ ట్రంప్ జూనియర్ కూడా తన తండ్రిని చంపాలని పిలుపునిస్తూ కొమీ ఈ పోస్ట్ పెట్టారని తీవ్ర ఆరోపణలు చేశారు. సీక్రెట్ సర్వీస్ ఈ వ్యవహారంపై దర్యాప్తు జరుపుతోందని ఎఫ్‌బీఐ చీఫ్, భారత సంతతికి చెందిన కాశ్ పటేల్ తెలిపారు. పశి్చమాసియాలో అధ్యక్షుడు ట్రంప్ పర్యటిస్తున్న సమయంలో ఆయన్ను చంపాలని ఉగ్రవాదులకు ఈ సంకేతం ద్వారా కొమీ ప్రేరేపించారని వైట్ హౌస్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జేమ్స్ బ్లయిర్ ఆరోపించారు. నేషనల్ ఇంటెలిజెన్స్ చీఫ్ తుల్సి గబ్బార్డ్ కూడా ఇదే రకమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘ఈ పోస్ట్‌ను తీసిపారేయరాదు. ఇది చాలా ప్రమాదకరమైన పోస్ట్. అధ్యక్షుడు ట్రంప్‌పై ఇప్పటికే రెండుసార్లు హత్యాయత్నాలు జరిగాయి’అని ఆమె అన్నారు. ఈ ఆరోపణలపై జేమ్స్ కొమీ స్పందించారు. ‘రాజకీయ ఉద్దేశంతో పెట్టిన పోస్ట్‌పై హింసను ప్రేరేపించేలా ఉందంటూ కొందరు విపరీతార్థాలు తీస్తారని నేను ఊహించలేదు. హింసకు నేను పూర్తిగా వ్యతిరేకిని’అంటూ ఆయన తన పోస్ట్‌ను తొలగించారు. 2013–2017 మధ్య కాలంలో జేమ్స్ కొమీ ఎఫ్‌బీఐ చీఫ్‌గా పనిచేశారు.

కరోనా వల్ల 1.8 ఏళ్లు తగ్గిపోయిన సగటు జీవితకాలం
న్యూయార్క్: కోవిడ్–19 సృష్టించిన విలయం మర్చిపోలేనిది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ఈ మహమ్మారి బలి తీసుకుంది. కరోనా వల్ల ప్రపంచవ్యాప్తంగా మనుషుల సగటు జీవిత కాలం 1.8 సంవత్సరాలు పడిపోయినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించింది. ఈ తాజాగా ‘ప్రపంచ ఆరోగ్య గణాంకాలు–2025’ నివేదికను విడుదల చేసింది. మహమ్మారి ప్రజల ప్రాణాలను హరించడమే కాదు, జీవన నాణ్యతను సైతం దెబ్బతీసినట్లు నివేదిక పేర్కొంది. 2019 నుంచి 2021 మధ్య సగటు జీవిత కాలం 1.8 ఏళ్లు పడిపోయిందని, చరిత్రలో ఇదే అతిపెద్ద పతనమని స్పష్టంచేసింది. నివేదికలోని ముఖ్యాంశాలు... → కరోనా విపత్తు సమయంలో కేవలం ఆందోళన, కుంగుబాటు వల్ల ఆరోగ్యకరమైన సగటు జీవితకాలం ఆరు వారాలు పడిపోయింది. → ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య రంగంలో కొంత ప్రగతి నమోదైనప్పటికీ, సాధించాల్సింది ఇంకెంతో ఉంది. → పొగ తాగడం తగ్గించుకోవడం, మెరుగైన వాయు నాణ్యత, సురక్షితమైన తాగునీరు, పారిశుధ్య వసతులు అందుబాటులోకి రావడం వల్ల 1.4 బిలియన్ల మంది ఆరోగ్యంగా జీవిస్తున్నారు. → మరోవైపు అత్యవసర వైద్య సేవలు పొందడం వేగంగా మెరుగుపడడం లేదు. కేవలం 431 మిలియన్ల మంది మాత్రమే ఈ సేవలు పొందగలుగుతున్నారు. → మాత, శిశు మరణాలు ఆశించిన స్థాయిలో తగ్గడం లేదు. 2000 నుంచి 2023 దాకా ఈ విషయంలో కొంత ప్రగతి సాధ్యమైంది. బాలింతల మరణాలు 40 శాతం తగ్గాయి. → ఆరోగ్య రంగానికి ప్రభుత్వాలను తగనన్ని నిధులు కేటాయించడం లేదు. నైపుణ్యం కలిగిన వైద్య సిబ్బంది కొరత వేధిస్తోంది. → ఇప్పటికైనా దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే 2030 నాటికి అదనంగా 7 లక్షల మాత మరణాలు, 80 లక్షల శిశు మరణాలు సంభవించే ప్రమాదం ఉంది. → ప్రస్తుతం 70 ఏళ్లలోపు వయసున్న వారిలో అత్యధిక మరణాలకు హృదయ సంబంధిత వ్యాధులు, గుండె పోటు, క్యాన్సర్, డయాబెటిస్ కారణమవుతున్నాయి. → చైల్డ్‌హుడ్ వ్యాక్సినేషన్ రేటు కోవిడ్‌కు ముందున్న స్థాయికి ఇంకా చేరుకోలేదు. దీనివల్ల బాలలకు ముప్పు పొంచి ఉంది.

యుద్ధ ఖైదీల మార్పిడి
ఇస్తాంబుల్: సర్వత్రా ఆసక్తి రేపిన రష్యా, ఉక్రెయిన్ యుద్ధ విరమణ చర్చలు ఆశాజనకంగా మొదలయ్యాయి. వెయ్యి మంది యుద్ధ ఖైదీల పరస్పర మార్పిడికి అంగీకారం కుదిరింది. రష్యా ప్రతినిధి వ్లాదిమిర్ మెడిన్స్కీ ఈ మేరకు వెల్లడించారు. వాటిమధ్య దాదాపు మూడేళ్లుగా సాగుతున్న యుద్ధంలో ఇదే అతి పెద్ద ఖైదీల మార్పిడి కానుంది. రష్యా, ఉక్రెయిన్ ప్రతినిధులు శుక్రవారం ఇస్తాంబుల్‌లో సమావేశమై తమ తమ డిమాండ్లు వినిపించారు. 2022లో యుద్ధం మొదలయ్యాక వాటి మధ్య ఇది తొలి ముఖాముఖి కావడం విశేషం. ఉక్రెయిన్ ప్రతినిధి వర్గానికి రక్షణ మంత్రి రుస్తెం ఉమెరోవ్, రష్యా బృందానికి అధ్యక్షుడు పుతిన్ సహాయకుడు మెడిన్స్కీ సారథ్యం వహించారు. తుర్కియే విదేశాంగ మంత్రి హకన్ ఫిదాన్ చర్చలను ప్రారంభించారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇరు పక్షాలను కోరారు. తక్షణం కాల్పుల విరమణ ఒప్పందం కుదరడం ముఖ్యమన్నారు. ‘‘కాల్పుల విరమణ ప్రతిపాదనలను పరస్పరం ఇచ్చిపుచ్చుకోవాలని నిర్ణయించాం. పుతిన్, జెలెన్స్కీ భేటీ ఏర్పాటు చేయాలన్న ఉక్రెయిన్ విజ్ఞప్తిని పరిశీలిస్తామని చెప్పాం. చర్చలను కొనసాగించేందుకు రష్యా సిద్ధంగా ఉంది’’ అని మెడిన్స్కీ వెల్లడించారు. కీలకాంశాలను పరిష్కరించుకుని, చర్చల్లో పురోగతి సాధించాలని సూత్రప్రాయంగా అభిప్రాయానికి వచ్చినట్టు ఉక్రెయిన్ అధికారి ఒకరు తెలిపారు. అయితే రష్యా ముందెన్నడూ ప్రస్తావించని డిమాండ్లను ముందుకు తెచ్చిందని విమర్శించారు. కాల్పుల విరమణ పూర్తిస్థాయిలో అమలవాలంటే ఆక్రమిత ప్రాంతాల నుంచి ఉక్రెయిన్ సైన్యాలను ఉపసంహరించాలన్నది అందులో ఉన్నట్టు చెప్పారు. రెండు గంటల్లోపే చర్చలు ముగిసినట్టు తుర్కియే పేర్కొంది.పుతిన్‌కు ఆసక్తి లేదు: జెలెన్స్కీచర్చల పురోగతిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పెదవి విరిచారు. కాల్పుల విరమణకు కూడా అంగీకారం కుదరలేదంటే దౌత్య మార్గంపై పుతిన్‌కు విశ్వాసం లేదని అర్థమన్నారు. అల్బేనియా రాజధాని టిరానాలో 47 యూరప్ దేశాల నేతలతో ఆయన సమావేశమయ్యారు. చర్చల్లో రష్యా ప్రతిపాదనలు అంగీకారయోగ్యంగా లేవని బ్రిటన్ ప్రధాని కియర్ స్టార్మర్ పేర్కొన్నారు. ‘‘చర్చలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో జెలెన్స్కీ ఫోన్లో చర్చించారు. ఈ విషయంలో మేమంతా సహకారంతో సాగుతాం. సమష్టి బాధ్యత వహిస్తాం. ట్రంప్‌తో చర్చించి తీసుకున్న నిర్ణయాన్ని ఫ్రాన్స్, జర్మనీ, పోలండ్ కూడా ఆమోదించాయి’’ అని వెల్లడించారు.త్వరలో పుతిన్‌తో భేటీ: ట్రంప్రష్యా ఉక్రెయిన్ చర్చలపై ట్రంప్ స్పందించారు. పుతిన్‌తో తాను అతి త్వరలో భేటీ అయ్యే అవకాశముందన్నారు. ‘‘మా భేటీతో యుద్ధం ముగియవచ్చు, ముగియకపోవచ్చు. అయితే యుద్ధం కొనసాగితే మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంటుంది’’ అంటూ గమ్మత్తైన వ్యాఖ్యలు చేశారు. ఇస్తాంబుల్ చర్చలకు తాను వెళ్లని కారణంగానే పుతిన్ కూడా హాజరవలేదని ట్రంప్ గురువారం పేర్కొనడం తెల్సిందే. తన కుమార్తె టిఫానీకి కొడుకు పుట్టిన కారణంగానే ఉన్నట్టుండి అమెరికా వెళ్లిపోవాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. ‘అందమైన నా మనవడిని చూడాలనుంది’ అని పేర్కొన్నారు. పుతిన్, ట్రంప్ భేటీకి వేళైందని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ కూడా అన్నారు. వారి శిఖరాగ్రానికి ఏర్పాట్లకు సమయం పడుతుందని చెప్పారు.

ఎన్నారైలపై ట్రంప్ మరో పిడుగు
మీరు అమెరికాలో ఉంటున్నారా? భారత్‌లోని మీ కుటుంబానికి ప్రతి నెలా డబ్బులు పంపుతున్నారా? అయితే ఇకపై మరో పన్ను బాదుడుకు సిద్ధంగా ఉండండి. అలా పంపే ప్రతి లక్ష రూపాయలకూ రూ.5 వేల చొప్పున ట్రంప్ ముక్కు పిండి మరీ వసూలు చేయనున్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ భారత అమెరికన్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్న అధ్యక్షుడు ఈ మేరకు ప్రతిపాదనను తాజాగా తెరపైకి తెచ్చారు. దాని ప్రకారం అమెరికాలోని వలసదారులు (Migrants) తమ మాతృదేశాలకు పంపే మొత్తాలపై 5 శాతం పన్ను విధించనున్నారు. అమెరికా పౌరులు కానివారందరికీ ఇది వర్తిస్తుంది. గ్రీన్‌కార్డుదారులతో పాటు హెచ్–1బీ, ఎఫ్–1 లేదా జే–1 తదితర వీసాలపై అక్కడ ఉంటున్న భారతీయులంతా ఈ నిర్ణయంతో తీవ్రంగా ప్రభావితులవుతారు. ట్రంప్ దీనికి ‘వన్ బిగ్, బ్యూటిఫుల్ బిల్’ అని పేరు పెట్టుకుని మురిసిపోతున్నారు. ఈ బిల్లుకు అధికార రిపబ్లికన్లు మద్దతిస్తుండగా ఎన్నారైల (NRIs) మద్దుతుదారుగా పేరున్న విపక్ష డెమొక్రటిక్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. బిల్లు ప్రస్తుతం ప్రతినిధుల సభ పరిశీలనలో ఉంది. అక్కడ, అనంతరం సెనేట్‌లో ఆమోదముద్ర పడితే జూలై 4 నుంచి అమల్లోకి వస్తుంది. మనోళ్లకు పెద్ద దెబ్బ అమెరికాలో ఉంటున్న భారతీయుల సంఖ్య 45 లక్షల పై చిలుకే. వారిలో చాలామంది ఉన్నత స్థాయి ఉద్యోగులు, వ్యాపారవేత్తలు తదితరులే. వాళ్లు భారత్‌కు ఏటా భారీ మొత్తాలు పంపుతుంటారు. మామూలు ఉద్యోగులు చేసేవాళ్లు కూడా భారత్‌లోని తమ కుటుంబాల పోషణ, తల్లిదండ్రుల వైద్య ఖర్చులు తదితరాల నిమిత్తం ప్రతి నెలా టంచనుగా డబ్బులు పంపుతుంటారు. ఇక్కడ రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెడుతుంటారు.రెమిటెన్స్ పన్ను (remittance tax) దెబ్బకు ఇకపై మనవాళ్లు పంపే మొత్తాలు భారీగా తగ్గడం ఖాయమని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫలితంగా మన విదేశీ మారకద్రక్య నిల్వలపైనా ప్రతికూల ప్రభావం పడవచ్చంటున్నారు. ‘‘భారత్ తిరిగొచ్చి ఇక్కడే స్థిరపడాలని భావించే అమెరికా ఎన్నారైలు సంపాదించే ప్రతి డాలర్‌పైనా 5 శాతం కోత పడ్డట్టే లెక్క. భారీ మొత్తాలు పంపే ఆలోచనలో ఉన్నవాళ్లు జూలైకి ముందే ముగించుకోవడం మేలు’’ అని సూచిస్తున్నారు.జీవనాధారంపై దెబ్బ రెమిటెన్సుల పన్ను వర్తింపు విషయమై ప్రతిపాదనలో ఎలాంటి మినహాయింపులూ ప్రతిపాదించలేదు. కనుక ఎంత తక్కువ మొత్తం పంపినా బాదుడు ఖాయమే. దాంతో వాటిపైనే ఆధారపడే ఎన్నో భారత కుటుంబాలను ఇది తీవ్రంగా ప్రభావితం చేయనుంది. ‘‘పిల్లల్ని అమెరికా పంపిన తల్లిదండ్రుల్లో చాలామంది వారిపైనే ఆధారపడి ఉంటారు. ఇంటి అద్దె, లేదా ఈఎంఐలు మొదలుకుని వైద్య ఖర్చుల దాకా పిల్లలు నెల నెలా పంపే డబ్బులే ఆధారం. రెమిటెన్సులంటే కేవలం ఆర్థిక కార్యకలాపాలు కావు. లక్షలాది మందికి జీవనాధారాలు. దీన్ని ఆ మానవీయ కోణం నుంచి చూడాలి. కానీ ట్రంప్ పక్కా వ్యాపార ధోరణితో వ్యవహరిస్తున్నారు’’ అంటూ ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నారై రెమిటెన్సులపై బాగా ఆధారపడే మన రియల్ ఎస్టేట్, బ్యాంకింగ్ తదితర రంగాలపై ప్రతికూల ప్రభావం ఖాయమని చెబుతున్నారు.రెమిటెన్సుల్లో భారతే టాప్ → ప్రపంచం మొత్తంలో విదేశాల నుంచి అత్యధికంగా రెమిటెన్సులు వచ్చేది భారత్‌కే. → 2024లో వాటి మొత్తం ఏకంగా 130 బిలియన్ డాలర్లు! అంటే దాదాపు రూ.10.7 లక్షల కోట్లు. → అందులో 28 శాతం, అంటే రూ.3 లక్షల కోట్ల (32 బిలియన్ డాలర్ల) మేరకు వాటా భారత అమెరికన్లదే. → ఆ లెక్కన 5 శాతం రెమిటెన్సు పన్ను రూపేణా అమెరికాకు ఏటా ఒక్క ఎన్నారైల మీదే అప్పనంగా రూ.15 వేల కోట్ల ఆదాయం సమకూరనుంది! అక్రమ పన్నే! రెమిటెన్స్ పన్ను విధింపు చట్టారీత్యా చూసినా సరికాదన్నది ఆర్థిక నిపుణుల వాదన. ‘‘ఇది చాలా అన్యాయమైన ప్రతిపాదన. వేలాది మైళ్లు వలస వెళ్లి అనేక కష్టాలకోర్చి తమవారికి అండగా నిలుస్తున్నందుకు, స్వదేశాల్లో పెట్టుబడులు పెడుతున్నందుకు శిక్షిస్తున్నట్టుగా ఉంది. పైగా అమెరికాకు అన్ని రకాల కేంద్ర, రాష్ట్ర పన్నులు చెల్లించిన మీదట మిగుల్చుకున్న మొత్తంపై దీన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఇది కచ్చితంగా అక్రమమే. ఇందులో రాజకీయ ఉద్దేశాలు కొట్టొచ్చినట్టు కన్పిస్తున్నాయి’’ అని వారంటున్నారు. ఈ ప్రతిపాదనపై డెమొక్రాట్ సభ్యులు కాంగ్రెస్‌లో తీవ్ర అభ్యంతరాలు వెలిబుచ్చారు. వలస సమాజాలను, ముఖ్యంగా అల్పాదాయ కుటుంబాలను ఈ పన్ను అన్యాయంగా పీల్చి పిప్పి చేస్తుందని వాదించారు. మితవాద రిపబ్లికన్లు కూడా వారితో గొంతు కలుపుతున్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్
జాతీయం

నీట్ ఫలితాలపై మద్రాస్ హైకోర్టు స్టే
చెన్నై: నీట్ ఫలితాల విడుదలకు సంబంధించి మద్రాస్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఫలితాలను విడుదల చేయొద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేస్తూ.. తదుపరి విచారణ జూన్ 2వ తేదీకి వాయిదా వేసింది. కాగా ఇప్పటికే నీట్ ఫలితాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కూడా స్టే విధించింది.తమ ఎగ్జామ్ సెంటర్లో విద్యుత్ అంతరాయం కారణంగా.. పరీక్ష సరిగ్గా రాయలేకపోయామని కొంతమంది విద్యార్థులు ఫిటిషన్ దాఖలు చేశారు. పరీక్ష కేంద్రంలో విద్యుత్ అంతరాయం కలిగినప్పుడు, ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేయలేదని వారు పేర్కొన్నారు. దీంతో హైకోర్టు ఫలితాలను నిలిపివేయాలని ఆదేశించింది. ఫలితాలు ప్రస్తుతానికి వాయిదా పడ్డాయి. కాగా రిజల్ట్స్ విడుదలకు సంబంధించిన తేదీపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.2024 - 25 సంవత్సరానికి దేశ వ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీలలో ప్రవేశాలకై నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ మే 4న పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షకు 23 లక్షలమంది అప్లై చేసుకోగా.. 20.8 లక్షలమంది పరీక్షకు హాజరయ్యారు. ఇక ఈ పరీక్ష ఫలితాలు విడుదల కావాల్సి ఉంది.

పాకిస్థాన్ స్పైగా హర్యానా యూట్యూబర్.. జ్యోతి మల్హోత్రా అరెస్ట్
ఢిల్లీ: హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. పాక్‌లో ఐఎస్ఐ ఏజెంట్‌గా పనిచేస్తున్నట్టు గుర్తించారు. జ్యోతి మల్హోత్రాతో పాటు మరో ఆరుగురి అరెస్ట్‌ను చేశారు. భారత సైనిక సమాచారాన్ని పాక్‌కు చేరవేసిన జ్యోతి మల్హోత్రా.. ఇటీవల ట్రావెల్ వీసాపై పాకిస్థాన్‌లో రెండుసార్లు పర్యటించారు. పాకిస్తాన్ అధికారి ఎహ్సాన్ రహీంను కలిసిన జ్యోతి మల్హోత్రా.. ఆ దేశానికి కీలక సమాచారం చేరవేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.ఈ నెట్వర్క్ హర్యానా, పంజాబ్ అంతటా విస్తరించినట్లు తేలింది. వీరంతా పాక్ ఐఎస్ఐకి ఏజెంట్లుగా, ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నట్లు గుర్తించారు. జ్యోతి.. ‘ట్రావెల్ విత్ జో’ పేరుతో యూట్యూబ్ ఛానెల్ నడుపుతోంది. ఆమె ఎవరికీ అనుమానం రాకుండా పాక్ అధికారులకు సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తున్నట్లు తేలింది. ఈ కేసులో జ్యోతి మల్హోత్రా ట్రావెల్ వ్లాగర్‌తో కలిసి పని చేస్తున్నట్లు గుర్తించారు. మరో ఐదుగురితో కలిసి ముఠాగా ఏర్పడి హర్యానా, పంజాబ్ నుంచి ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్ ఉద్యోగి ఎహ్సాన్-ఉర్-రహీం అలియాస్ డానిష్‌తో జ్యోతి మల్హోత్రా పరిచయాలు పెంచుకుంది.డానిష్‌ను ప్రభుత్వం ఇటీవేల బహిష్కరించిన విషయం తెలిసిందే. డానిష్ గురించి కూపీ లాగడంతో జ్యోతి గూఢచార్యం సంగతి బట్టబయలైంది. పాకిస్థానీ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్‌లకు జ్యోతి మల్హోత్రాను డానిష్ పరిచయం చేసినట్లు తేలింది. వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్‌చాట్ వంటి ఎన్‌క్రిప్ట్ చేసిన ప్లాట్‌ఫామ్‌ల ద్వారా పాక్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్‌లతో నిత్యం టచ్‌లో ఉంటున్నట్లు తేలింది.ఈ ప్లాట్‌ఫామ్స్ ద్వారానే భారత్‌కు చెందిన కీలక సమాచారాన్ని పాక్ అధికారులకు చేరవేసినట్లు సమాచారం. ‘జాట్ రంధావా’ అని సేవ్ చేసుకున్న ఓ పేరు షకీర్ అలియాస్ రాణా షాబాజ్ అనే పాకిస్థాన్ వ్యక్తిదిగా అధికారులు గుర్తించారు. గడిచిన రెండేళ్లలో మూడు సార్లు పాకిస్తాన్‌కు వెళ్లిన జ్యోతి.. యూట్యూబ్ వీడియోల కోసం చైనా, బంగ్లాదేశ్, థాయిలాండ్, నేపాల్, భూటాన్, యూఏఈ దేశాల్లో కూడా పర్యటించింది.పాక్ ఇంటలిజెన్స్ అధికారితో సన్నిహిత పెంచుకుని ఇద్దరూ ఇటీవల ఒక వారం పాటు ఇండోనేషియాలోని బాలి వెళ్లినట్లు గుర్తించిన అధికారులు. జ్యోతి మల్హోత్రాను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మరింత సమాచారం సేకరించే పనిలో పడ్డారు.

భారత్‌కు ద్రోహం.. పాక్‌కు గూఢచర్యం చేస్తున్న విద్యార్థి అరెస్ట్
ఛండీగఢ్: దేశ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొంటూ, పాకిస్తాన్‌కు గూఢచర్యం చేస్తున్న విద్యార్థిని హర్యానా పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని విచారించగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పాక్ అధికారులు పెద్దమొత్తంలో డబ్బు ముట్టజెప్పినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు.వివరాల ప్రకారం.. నిందితుడు దేవేంద్ర సింగ్ ధిల్లాన్ హర్యానాలో పాటియాలలో ఉన్న ఖల్సా కళాశాలలో పొలిటికల్ సైన్స్ చదువుతున్నాడు. అయితే, మే 12న ధిల్లాన్.. తన ఫేస్బుక్ ఖాతాలో గన్, పిస్టోల్ చిత్రాలను పోస్టు చేశాడు. ఈ విషయం పోలీసులు దృష్టికి చేరడంతో.. కాలేజీకి వెళ్లి ఆరా తీశారు. అనంతరం, అతడిని పోలీసులు అరెస్టు చేశారు. దేవేంద్రసింగ్ ఫోన్‌ను స్వాధీనం చేసుకొని ఫోరెన్సిక్ దర్యాప్తునకు పంపించారు. ఈ క్రమంలో ధిల్లాన్ విచారించగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.విచారణలో భాగంగా.. ధిల్లాన్ గతేడాది నవంబరులో కర్తార్‌పూర్ కారిడార్ ద్వారా పాకిస్తాన్‌కు వెళ్లినట్టు గుర్తించారు. ఈ సందర్భంగా అక్కడి ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అధికారులతో భారత్‌కు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పంచుకున్నట్లు తేలిపింది. ఈ మేరకు నిందితుడు అంగీకరించాడు. అందుకు పాక్ అధికారులు పెద్దమొత్తంలో డబ్బు ముట్టజెప్పినట్లు తెలిపాడు. పటియాలా మిలిటరీ కంటోన్మెంట్‌కు సంబంధించిన చిత్రాలను సైతం అతడు పాక్ అధికారులకు అందించాడు. దీంతో, డబ్బు లావాదేవీలకు సంబంధించిన సమాచారం సేకరిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. దీనిపై పూర్తి దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు.Kaithal, Haryana! Pak ISI spy Devendra Singh Dhillon arrested! Devendra sent army camps and other sensitive information to Pakistan ISI! Devendra went to Pakistan for a religious trip in 2024, during which an ISI agent caught him in a girl's honey trap. Police investigation is on pic.twitter.com/gnTVuHUDXh— Kalu Singh Chouhan (@kscChouhan) May 17, 2025ఇదిలా ఉండగా.. ఇటీవల ఉత్తరప్రదేశ్ చెందిన రవీంద్రకుమార్‌కు సైతం ఇలాగే పోలీసులు అరెస్ట్ చేశారు. పాకిస్తాన్‌లోని ఐఎస్ఐకు గూఢచర్యం చేస్తున్న కారణంగా రవీంద్రకుమార్‌ను విచారిస్తున్నారు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో మెకానిక్‌గా పనిచేస్తున్న రవీంద్రకుమార్ ఓ అమ్మాయితో హానీట్రాప్‌లో చిక్కి.. భారత సైన్యం ఆయుధాలకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాక్ అధికారులకు చేరవేశాడు. ఐఎస్ఐ సభ్యులతోనూ అతడు నేరుగా టచ్‌లో ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. దీంతో, అతడి అంశంలో మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు.

రోడ్డు పక్కన వదిలేస్తే చేరదీసింది.. అదే ఆమె పాలిట శాపమైంది!
రోడ్డు పక్కన అనాథగా పడి ఉన్న పసికందును మానవత్వంతో ఓ మహిళ చేరదీసింది. చదువు కూడా చెప్పించి.. ఆ బాలికను పెంచి పెద్ద చేసింది. అలా చేయడం.. ఆ మహిళకు శాపమైంది. చివరికి ప్రాణాలు కోల్పోయాంది. ప్రేమ మైకంలో ఓ బాలిక తన పెంపుడు తల్లిని హతమార్చింది. ఈ మర్డర్ మిస్టరీని పోలీసు అధికారులు ఛేదించారు. ఎస్పీ జ్యోతీంద్ర పండా ఆదర్శ పోలీసు స్టేషన్లో వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. స్థానిక తెలుగు సొండి వీధిలో రాజ్యలక్ష్మీ కోరో (54) గత నెల 26న అనుమానాస్పదంగా చనిపోయింది. మృతురాలి పెంపుడు కూతురు పర్లాకిమిడి ప్రభుత్వ ఆస్పత్రికి తన ప్రియుడు, స్నేహితుని సహాయంతో మృతదేహాన్ని తరలించింది.ఈ విషయం భువనేశ్వర్‌లో ఉన్న మృతురాలి సోదరుడు ప్రసాద్ మిశ్రాకు ఫోన్ చేసి తెలియజేశారు. ఈ లోగా పెంపుడు కూతురు, అతని ప్రియుడు కలిసి పోలీసు కేసు కాకుండా చూసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని అంబులెన్స్‌లో భువనేశ్వర్‌కు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. కూతురు కొద్ది నెలలుగా గణేష్ రథ్ (21) అనే వ్యక్తితో ప్రేమలో ఉంది. దీన్ని గమనించిన తల్లి ఆమెను మందలించింది. దీంతో ఆమె అడ్డు తొలగించుకోవడానికి ప్రియుడితో పాటు స్నేహితుడు దినేష్ సాహు అలియాస్ అమన్ సాయంతో తల్లిని చంపడానికి పథకం పన్నారు.పథకం ప్రకారం ఏప్రిల్ 26న ఆమె నిద్రిస్తున్న సమయంలో దిండు సహాయంతో ఇద్దరు స్నేహితులు చంపి, నగదు, బంగారం దొంగిలించి పారిపోయారు. సోదరి చనిపోయాక ఆమె పెంపుడు కూతురిలో మార్పులు గమనించిన ప్రసాద్ మిశ్రా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. వారు నిందితురాలిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు నిర్వహించారు.దీంతో హత్య జరిగినట్లు నిర్ధారించారు. నిందితులందరినీ గుర్తించి వారిని అరెస్టు చేసి విచారించగా రాజలక్ష్మీ కోరోకు మత్తు మందు ఇచ్చి ఎలా చంపారో వారే పోలీసులకు వివరించారు. మృతురాలి ఇంటి నుంచి 7 తులాల బంగారం వస్తువులు, రూ.60 వేలు నగదు చోరీ కాగా 2.6 గ్రాముల బంగారం, మూడు మొబైళ్లు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ జ్యోతీంద్రనాథ్ పండా విలేకరుల సమావేశంలో తెలియజేశారు. నిందితులు ఇద్దరు గణేష్ రోథో, దినేష్ సాహులను అరెస్టు చేసి కోర్టుకు తరలించారు.
ఎన్ఆర్ఐ

తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ ఆధ్వర్యంలో మే డే సంబరాలు
తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ (TCSS) ఆధ్వర్యంలో కార్మికుల దినోత్సవం (మే డే) సందర్భంగా సొసైటీ అధ్యక్షులు గడప రమేష్ గారు సింగపూర్ లో పనిచేస్తున్న తెలంగాణ మరియు ఇతర కార్మికులకు అందరికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ మే డే సందర్భంగా సింగపూర్ లో మల్టీనేషనల్ కంపెనీ (Toa Corporation) లో పని చేస్తున్న అందరికీ దాదాపు 200 మంది కార్మికులకు పండ్లు, శీతల పానీయాలు అందజేసి ఆ కంపెనీకి అలాగే అందులో పని చేస్తున్న ప్రతి కార్మికుడికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన చెట్టిపల్లి మహేష్ తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ప్రతిఒక్కరికి సొసైటీ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి రాము బొందుగుల మరియు కోశాధికారి నంగునూరి వెంకట రమణ , సొసైటీ ఉపాధ్యక్షులు బసిక ప్రశాంత్ రెడ్డి, దుర్గ ప్రసాద్, భాస్కర్ గుప్త నల్ల, జూలూరి సంతోష్ కుమార్ ఉపాధ్యక్షురాలు మిర్యాల సునీత రెడ్డి, సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొడ్ల రోజా రమణి, నడికట్ల భాస్కర్, శశిధర్ రెడ్డి, రవి కృష్ణ విజాపూర్,సంతోష్ వర్మ మాదారపు మరియు కార్యవర్గ సభ్యులు శివ ప్రసాద్ ఆవుల, పెరుకు శివ రామ్ ప్రసాద్, రవి చైతన్య మైసా, భాస్కర్ రావు పులిగిళ్ల, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, మణికంఠ రెడ్డి, రావుల సుగుణాకర్ రెడ్డి ,చల్ల కృష్ణ మొదలగు వారు అందరికి శుభాకాంక్షలు తెలియజేసారు. మరిన్ని ఎన్ఆర్ఐ వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి

TANA: ‘ఆంధ్ర బాలానంద సంఘం’ ముచ్చట్లు విజయవంతం
డాలస్, టెక్సస్, అమెరికా: తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో “నెల నెలా తెలుగు వెలుగు” పేరిట ప్రతి నెల ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న కార్యక్రమాలలో భాగంగా “రేడియో అన్నయ్య, అక్కయ్య గార్ల స్మృతిలో – “85 వసంతాల ఆంధ్ర బాలానంద సంఘం ముచ్చట్లు” అనే అంశంపై జరిపిన 79 వ అంతర్జాల అంతర్జాతీయ దృశ్య సమావేశం పెద్దల ప్రసంగాలు, బాలానందం పిల్లల పాటలతో కోలాహలంగా జరిగింది.తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు పాల్గొన్న అతిథులందరికీ స్వాగతం పలుకుతూ, బాలలకోసం ఏర్పడిన ఒక సంస్థ 85 వసంతాలు జరుపుకోవడం వెనుక ఈ సంస్థ స్థాపకులైన రేడియో అన్నయ్య, రేడియో అక్కయ్య గార్ల కృషి ఎంతైనా ఉందని అన్నారు.తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు, డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “పిల్లలకు పసిప్రాయంలోనే గేయాలు, రూపకాలు, ఆటలు, పాటలతో తెలుగు భాష, సాహిత్యంపట్ల ఆసక్తి కల్గించి, వారిలో క్రమశిక్షణ, మానసిక వికాసం, విజ్ఞానం, సృజనాత్మకత, నాయకత్వ ప్రతిభను కల్గించడంలో ఆకాశవాణిలో కొన్ని దశాబ్దాలపాటు వారం వారం ‘బాలానందం’ కార్యక్రమంతో పిల్లలకు పెద్దపీట వేసిన రేడియో అన్నయ్య, రేడియో అక్కయ్య గార్ల కృషి అజరామరం అన్నారు. పిల్లలకు చిన్నవయస్సులోనే ఇలాంటి విషయాల పట్ల అవగాహన, ఆసక్తినికల్గించి సరైన దిశానిర్దేశం చెయ్యవలసిన బాధ్యత తల్లిదండ్రులదేనన్నారు. ప్రత్యేక అతిథులుగా పాల్గొన్న శారదా శ్రీనివాసన్ (రేడియో హీరోయిన్, సుప్రసిద్ధ ఆకాశవాణి కళాకారిణి), డా. మండలి బుద్ధప్రసాద్ (అవనిగడ్డ శాసనసభ్యులు, రేడియో అన్నయ్య, అక్కయ్యగార్లతో ప్రత్యక్ష పరిచయం ఉన్నవారు), పద్మభూషణ్ పురస్కార గ్రహీత డా. కె.ఐ. వరప్రసాదరెడ్డి (బాలానంద కార్యక్రమాలను ఆస్వాదించినవారు), డా. మోహన్ కందా, ఐ.ఎ.ఎస్ (ఆంధ్రప్రదేశ్ పూర్వ ప్రధాన కార్యదర్శి, బాలానంద సంఘ పూర్వసభ్యులు), జంధ్యాల కామేశ్వరి-పాప (రేడియో అన్నయ్య గారి మేనకోడలు, ఆంధ్ర బాలానంద సంఘం అధ్యక్షులు), కలగా కృష్ణమోహన్ (బాలానందం పూర్వ సభ్యులు, ఆంధ్ర బాలానంద సంఘం ఉపాధ్యక్షులు, ప్రముఖ గీత రచయిత, సంగీత దర్శకులు) బాలానందం కార్యక్రమంతోను, రేడియో అన్నయ్య, అక్కయ్య గార్లతో తమకున్న ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలతోపాటు ఎన్నో ఆసక్తికర విశేషాలను పంచుకుని వారికి ఘననివాళులర్పించారు. విశిష్టఅతిథులుగా - ఎన్.వి. అశోక్ (విశ్రాంత ఇంజనీర్, ‘బాలానందం’ పూర్వసభ్యులు), రావులపర్తి రాజేశ్వరి (విశ్రాంత బ్యాంకు అధికారి, ‘బాలానందం’ పూర్వ సభ్యురాలు),నండూరి సీతా సాయిరాం (విశ్రాంత ఉపాధ్యాయిని, ‘బాలానందం’ పూర్వ సభ్యురాలు),మాడభూషి బద్రినాథ్ (బాలానందం-నృత్య దర్శకులు), డా. ఆవుల హరిత (బాలానందం-కార్యవర్గ సభ్యురాలు), చినముత్తేవి కరుణ (బాలానందం-గాయకబృందం, శిక్షణా విభాగపు కార్యవర్గసభ్యురాలు), మాలెంపాటి నవ్య (ఐఐటి ఖర్గపూర్, ‘బాలానందం’ సంగీత, నృత్య కళాకారిణి), గోవిందు దేవరాజ (బాలానందం-గాయకబృందం, శిక్షణా విభాగపు కార్యవర్గసభ్యులు) పాల్గొని తమ స్వీయ అనుభవాలను, రేడియో అన్నయ్య, అక్కయ్య గార్లు ఎంతో దూరదృష్టితో స్థాపించిన ఆంధ్ర బాలానందం సంఘం తమ పిల్లల జీవితాలలో తీసుకువచ్చిన మార్పులను వివరించి వారిరువురికి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అన్నారు. తానా ప్రపంచసాహిత్యవేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ - ఒక సంస్థ ఎనిమిదన్నర దశాబ్దాలగా నిరాటంకంగా కొనసాగడం ఒక చరిత్ర అని, ఏ ఆశయంతో రేడియో అన్నయ్య, అక్కయ్య గార్లు ఈ బాలానందం స్థాపించారో, అదే స్ఫూర్తితో ఉత్సాహంగా ఆంధ్ర బాలానంద సంఘం నిర్వహిస్తున్న అధ్యక్షురాలు జంధ్యాల కామేశ్వరి (పాప) వారి కార్యవర్గ సభ్యులకు, ఈ నాటి కార్యక్రమంలో శ్రావ్యంగా పాటలు పాడి ఆనందపరిచిన 25 మందికి పైగా పిల్లలకు, పాల్గొన్న అతిథులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

స్వరలయ ఆర్ట్స్ సింగపూర్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ 6 వ వార్షికోత్సవ వేడుకలు
స్వరలయ ఆర్ట్స్ సింగపూర్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ 6 వ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్ లర్ ఆచార్య వెలుదండ నిత్యానందరావు హాజరయ్యారు. సింగపూర్ లోని తెలుగు వారంతా అన్ని విధాలా సుసంపన్నులని ఈ విధంగా లలిత కళలను ప్రోత్సహించడం ఆనంద దాయకమన్నారు. చిన్నారులు పాడిన పాటలు ఎంతో బాగున్నాయి అని , ఇంత చక్కగా నేర్పిన గురువును నేర్చుకున్న వారి శిష్యులను వారి తల్లిదండ్రులను ప్రశంసించారు. సంగీతం, నాట్యం వంటి కళల ద్వారా మనలో మృదుత్వం కలుగుతుందని, నేటి యాంత్రిక జీవితంలో ఈ మాధ్యమం ఎంతో ముఖ్యం అని కాబట్టి కళల పైన ఉన్న ఆసక్తిని తమ తమ ఆర్థిక సంపాదన రధ చక్రాల కింద పడి నలిగి పోనివ్వవద్దని కోరారు.ఈ కార్యక్రమానికి STS వైస్ ప్రెసిడెంట్ జ్యోతీశ్వర్ , శ్రీ సాంస్కృతిక కలసారథి అధ్యక్షులు కవుటూరు రత్న కుమార్,TCSS అధ్యక్షులు గడప రమేష్, TAS (మనం తెలుగు ) అసోసియేషన్ అనిత రెడ్డి , కమల క్లబ్ మాజీ అధ్యక్షులు, సారీ కనెక్షన్ అడ్మిన్ పద్మజ నాయుడు , మగువ మనసు అడ్మిన్ వీర మాంగోస్ ఉష , సింగపూర్ తెలుగు టీవి రాధాకృష్ణ గణేశ్న , జయంతి రామ, భాగవత ప్రచార సమితి భాస్కర్ ఊలపల్లి, H& H శ్యామల , విష్ణు ప్రియ , సింగపూర్ తెలుగు వనితలు అడ్మిన్స్ క్రాంతి, దేదీప్య, జయ, ప్రత్యూష , అమ్ములు గ్రూపు నుండి అడ్మిన్ సునీత రామ్, , KCAS దివ్య ఇంకా పలువురు సింగపూర్ తెలుగు కమ్యూనిటీ వ్యవస్థాపకులు హాజరయి అందరూ కలిసి వైస్ ఛాన్స్‌లర్‌ను సన్మానించారు. స్వరలయ ఆర్ట్స్, సింగపూర్ వ్యవస్థాపక అధ్యక్షురాలు యడవల్లి శేషుకుమారి వారి శిష్యులు,స్నేహితులు కీర్తనలను ఆలపించారు. పద్మజ నాయుడు మాట్లాడుతూ శేషు గాన కోకిల అని పొగడగా ఆచార్య నిత్యానందరావు గారు కోకిల ఒక కాలంలో మాత్రమే పాడుతుందని కాని ఈమె 365 రోజులు గానం ఆలపిస్తారు అన్నారు. శ్యామల మాట్లాడుతూ వారి వెంకటేశ్వర గానామృతం కార్యక్రమానికి శేషు కుమారి 70 పాటలు 40 రాగాలలో స్వర పరిచి మూడున్నర గంటల సేపు పాడి అందరినీ అలరించిన వైభవం గుర్తు చేసి ఈ రోజుకి ఆ పాటలు తమ చెవులలో ప్రతి ధ్వనిస్తూ పరవసింప చేస్తాయని ప్రశంసించారు.పొట్టి శ్రీరాములు, తెలుగు విశ్వవిద్యాలయం సర్టిఫికేట్ కోర్సు మొదటి వత్సరం, రెండవ సంవత్సరం పరీక్షల్లో ఉత్తీర్ణత పొందిన స్వరలయ ఆర్ట్స్ విద్యార్థులకు వైస్ ఛాన్స్ లర్ బహుమతి ప్రధానం చేశారు. అతిథులకు మొమెంటోలను బహుకరించారు ఈ నెల ఆరవ తారీఖున స్వరలయ ఆర్ట్స్ వారు నిర్వహించిన త్యాగ రాజ ఆరాధన ఉత్సవాలలో పాల్గొని తమతో కలిసి పంచరత్నాలు పాడిన సౌభాగ్య లక్ష్మి తంగిరాల, షర్మిల చిత్రాడ, సౌమ్య ఆలూరు, శరజ అన్నదానం, రాధికా నడదూర్, ప్రియ లకు మొమెంటోలను బహుకరించారు. శివ కుమార్ మృదంగం పై వాయిద్య సహకారం అందించారు ఈ కార్యక్రమానికి శ్రీమతి చైతన్య వ్యాఖ్యాతగా వ్యవహరించారు. పలువురినీ లలిత కళారంగంలో ఉత్సాహ పరుస్తూ ముందుకు నడిచే ఇటువంటి కార్యక్రమానికి దాదాపుగా 200 మంది హాజరు కావటమే కాకుండా, సాంఘిక మాధ్యమాల ద్వారా కూడా వీక్షించి విశేషస్పందనలను తెలియజేయటం అభినందనీయం.

9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు ’’ విశేష సంచిక ఆవిష్కారం
ఖతార్ దేశ రాజధాని దోహా మహానగరంలో 2024 నవంబర్‌లో జరిగిన "9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు" యొక్క సభా విశేష సంచిక అంతర్జాల మాధ్యమంలో ఆదివారం ఆవిష్కరించారు. 'వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా' ,'ఆంధ్ర కళా వేదిక - ఖతార్' సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహింపబడి, మధ్య ప్రాచ్య దేశాలలోనే తొలి సాహితీ సదస్సుగా రికార్డును సృష్టించిన ఈ '9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సులో పది దేశాల నుండి పాల్గొన్న వక్తలు, కవులు, రచయితలు ప్రసంగించిన అన్ని అంశాలను పొందుపరుస్తూ 380 పేజీలతో ఈ సభా విశేష సంచిక రూపొందించబడింది. ఈ ఉద్గ్రంధానికి సంపాదకులుగా రాధికా మంగిపూడి, విక్రమ్ సుఖవాసి, వంగూరి చిట్టెన్ రాజు, లక్ష్మి రాయవరపు, శాయి రాచకొండ వ్యవహరించారు.సదస్సు నిర్వాహకవర్గము, సంచిక సంపాదకులు, సదస్సులో వివిధ దేశాల నుండి పాల్గొన్న వక్తలు, రచయితలు అందరి సమక్షంలో ఈ పుస్తక ఆవిష్కరణ జరగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకించి అంతర్జాల మాధ్యమంలో ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు. మరిన్నిNRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి!వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వ్యవస్థాపకులు డా. వంగూరి చిట్టెన్ రాజు, ఖతార్ ఆంధ్ర కళా వేదిక నుండి విక్రమ్ సుఖవాసి ప్రధాన నిర్వాహకులుగా, వారి అధ్యక్షతన, రాధిక మంగిపూడి సభానిర్వహణలో దాదాపు మూడు గంటల పాటు ఆదివారం సాయంత్రం నిర్వహింపబడిన ఈ కార్యక్రమంలో భారత్, ఖతార్, అమెరికా, సౌదీ అరేబియా, బహరైన్, యూఏఈ, సింగపూర్ తదితర దేశాలనుండి వక్తలు, తెలుగు సంస్థల ప్రతినిధులు, రచయితలు పాల్గొన్నారు.అమెరికా నుండి చెరుకూరి రమాదేవి, శాయి రాచకొండ, భారత్ నుండి డా. వంశీ రామరాజు, డా. అద్దంకి శ్రీనివాస్, డా. బులుసు అపర్ణ, ఆచార్య అయ్యగారి సీతారత్నం, ఆచార్య త్రివేణి వంగారి, కస్తూరి అలివేణి, డా. దేవులపల్లి పద్మజ తదితరులు, బహరైన్ నుండి మురళీకృష్ణ, సౌదీ అరేబియా నుండి కోనేరు ఉమామహేశ్వరరావు, చివుకుల పట్టాభిరామ శర్మ, సింగపూర్ నుండి కవుటూరు రత్నకుమార్, యూఏఈ నుండి షేక్ రఫీ, డా. తాడేపల్లి రామలక్ష్మి, ఖతార్ నుండి శ్రీసుధ, గోవర్ధన్ రెడ్డి, మనీష్, మాధవి లలిత, గౌరీ బొమ్మన తదితరులు ఆసక్తిగా పాల్గొని సదస్సు యొక్క జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.ఈ సభా విశేష సంచికలో నిర్వాహక సంస్థల పరిచయాలు, అధ్యక్షుల, సంచాలకుల ముందుమాటలు, సదస్సు ప్రకటనలు, వక్తలందరి ఫోటోలు, వ్యాసాలు, కథలు, కవితలతో పాటు, సదస్సు అనంతరం అందరూ అందించిన స్పందనలు కూడా జోడించడం, ఆనందంగా ఉందని, జీవితంలో ఒక మధుర జ్ఞాపకంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ సంచిక ఉందంటూ సంపాదకులను నిర్వాహకులను అభినందించారు.డా. వంగూరి చిట్టెన్ రాజు మాట్లాడుతూ "మధ్యప్రాచ్య దేశాలలో తెలుగు సాహిత్య అభిమానులందరికీ ఈ సదస్సు కొత్త స్ఫూర్తిని అందించిందని, సదస్సు ప్రభావం వలన ఎంతోమంది సాహిత్యంపై చక్కటి ఆసక్తి పెంచుకోవడం, కొత్త రచయితలు జనించడం.. ఆనందదాయకమని తెలియజేశారు. ఇటువంటి సదస్సులు మరిన్ని జరగాలని, కొత్త రచయితలు యువతరం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. విక్రమ్ సుఖవాసి ఆంధ్ర కళావేదిక తరపున మరొకసారి అందరికీ తమ దేశానికి విచ్చేసి కార్యక్రమంలో పాల్గొన్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ తొలిసారి ప్రపంచ సదస్సుకు సంచాలకునిగా ఈ సంచికకు సహసంపాదకునిగా ఉండడం చాలా ఆనందంగా ఉందన్నారుఈ సంచికకు రూపకల్పన సహకారం అందించిన జేవి పబ్లికేషన్స్ అధినేత్రి జ్యోతి వలబోజు కూడా ఈ ఆవిష్కరణలో పాల్గొన్నారు. ఇతర మధ్యప్రాచ్య దేశాల సంస్థల ప్రతినిధులు మాట్లాడుతూ తమ దేశాలలో కూడా ఇటువంటి సాహిత్య సదస్సులు నిర్వహించడానికి తాము సిద్ధంగా ఉన్నామని 10వ ప్రపంచ సదస్సు జరపడానికి అవకాశం ఇమ్మని కోరుతూ తమ ఉత్సాహాన్ని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమం వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా యూట్యూబ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారమైంది.
క్రైమ్

రేణిగుంటలో 24.5 కిలోల గంజాయి స్వాధీనం
రేణిగుంట (శ్రీకాళహస్తి రూరల్): ఒడిశా నుంచి కేరళకు గంజాయి తరలించేందుకు ప్రయత్నించిన ఇద్దరు పశ్చిమ బెంగాల్ మహిళలను రేణిగుంట పోలీసులు గురువారం అరెస్టు చేశారు. రేణిగుంట లాడ్జిలో ఉన్న వారి వద్ద నుంచి 24.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గురువారం తిరుపతి జిల్లా ఏఎస్పీ రవిమనోహరాచారి తెలిపిన వివరాల మేరకు.. పోలీసులకు వచ్చిన రహస్య సమాచారం మేరకు రైల్వేస్టేషన్ సమీపంలోని ఎస్బీఎస్ లాడ్జిలోని 207 గదిలో డీఎస్పీ శ్రీనివాసరావు పర్యవేక్షణలో సీఐ జయచంద్ర, ఎస్ఐ అరుణ్‌కుమార్‌రెడ్డి సిబ్బందితో సోదాలు నిర్వహించారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన మమోని మొండాల్ (31), నమితా మొండాల్ (37) లను అదుపులోకి తీసుకుని, రెండు సూట్‌కేస్‌లలో ఉన్న రూ.2.45 లక్షల విలువ చేసే 24.5 కిలోల గంజాయిని స్వాదీనం చేసుకున్నారు. ఈ గంజాయిని ఒడిశా నుంచి రైల్లో కేరళ తీసుకెళుతుండగా వారి సంబం«దీకుల నుంచి సూచన రావడంతో రేణిగుంటలో దిగి లాడ్జిలో బస చేశారు.వారిద్దరినీ అరెస్టుచేసి కోర్టులో హాజరుపరిచారు. విచారణలో వారు చెప్పిన ఇద్దరు అంతర్ రాష్ట్ర స్మగ్లర్లను అరెస్ట్ చేయాల్సి ఉంది. ఈ కేసుకు సంబంధించి సీఐ జయచంద్ర, సిబ్బందిని ఎస్పీ హర్షవర్ధన్‌రాజు అభినందించినట్లు ఏఎస్పీ తెలిపారు.

అర్ధరాత్రి క్షుద్రపూజల కలకలం..!
కర్నూలు: పట్టణంలోని కర్నూలు – బెంగళూరు జాతీయ రహదారి పక్కన చెరుకులపాడు క్రాస్ రోడ్డులోని ఓ ఇంట్లో క్షుద్రపూజలు చేసి న ఫొటోలు, వీడియో లు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి. ఓ వ్యక్తి మీద చేతబడి ప్రయోగించినట్లుగా తెలుస్తోంది. ఇందుకు పట్టణానికి చెందిన వ్యక్తి సూత్రధారిగా ఉండి కొందరి ఫొటోలతో, భయానక చేతబడి చేస్తున్నప్పటి ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి. సేకరించిన సమాచారం మేరకు.. పట్టణానికి చెందిన వ్యక్తి సిఫారసుతో చెరుకులపాడు క్రాస్ రోడ్డులోని ఓ ఇంటిని అద్దెకు తీసుకున్న వారు అందులో చేతబడులు చేస్తూ, గుప్తనిధుల వేటగాళ్లకు ఆసరాగా ఉంటున్నట్లుగా తెలుస్తోంది. ఎమ్మిగనూరుకు చెందిన వ్యక్తికి అప్పు ఉండ గా అప్పు ఎగ్గొట్టేందుకు ఏకంగా ఆ వ్యక్తిపై చేతబడి ప్రయోగం చేసినట్లు సమాచారం. ఇందులో పట్టణానికి చెందిన పంచాయతీ కార్యాలయంలో అనధికారికంగా పనిచేస్తున్నకార్మికుడి ఫొటో ఉంది. ఇటీవల ఉలిందకొండకు చెందిన వ్యక్తిపై కూడా ఇక్కడి నుంచే చేతబడి ప్రయోగం చేసినట్లుగా తెలుసుకున్న ఉలిందకొండ వారు ఈ ఇంటికి చేరుకుని ఇంట్లో ఉన్నవారితో గొడవ పడినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఈ ఇళ్లు కేంద్రంగా రెండు నెలల పాటు మండలం వ్యాప్తంగా గుప్తనిధుల వేట కొనసాగినట్లుగా సైతం తెలుస్తోంది. పోలీసులకు సైతం సమాచారం అందినా చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది.

భర్త మరణాన్ని జీర్ణించుకోలేక భార్య ఆత్మహత్య
ఉయ్యాలవాడ: విధి ఆటలో ఓ చిన్నారి అనాథగా మారింది. అభంశుభం తెలియని పసిపాప తొమ్మిది రోజుల వ్యవధిలో తల్లిదండ్రులను కోల్పోయింది. ఈ విషాద ఘటన ఆర్. పాంపల్లె గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పొగాకు నారాయణ కూలీ పనులకు వెళుతూ జీవనం కొనసాగించేవాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 6వ తేదీన గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి చెందిన మట్టి మిద్దె పనులకు వెళ్లాడు. ఆ సమయంలో ప్రమాదవశాత్తూ మిద్దె కూలి శిథిలాలు నారాయణపై పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అప్పటి నుంచి అతని భార్య లలిత (40) తీవ్ర మనోవేదనకు గురైంది. మనస్తాపంతో వారం రోజులుగా ఆహారం తీసుకోకుండా భర్త గురించే ఆలోచించింది. తన 45 రోజుల చిన్నారికి కూడా పోతపాలు తాపింది. చివరకు జీవితంపై విరక్తి చెంది బుధవారం ఉదయం లలిత రసాయన పౌడర్‌ను నీళ్లలో కలుపుకుని అపస్మారక స్థితిలో పడిపోయింది. గమనించిన బంధువులు, స్థానికులు చికిత్స నిమిత్తం 108లో ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం నంద్యాలకు తరలిస్తుండగా మార్గమధ్యలో లలిత మృతి చెందింది. తల్లిదండ్రుల మృతి చెంద డంతో 45 రోజుల చిన్నారి అనాథగా మిగిలింది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పసిపాపకు తల్లిదండ్రులు లేకపోవడంతో నాయనమ్మ శివమ్మ దిక్కైంది. అమ్మపాల కోసం ఏడస్తున్న చిన్నారిని చూసి పలువురు కంటతడి పెట్టారు. కాగా నారాయణ మొదటి భార్య విజయలక్ష్మి ఐదేళ్ల క్రితం కుటుంబ కలహాలతో క్రిమి సంహారక మందు తాగి మృతి చెందింది. రెండేళ్ల క్రితం లలితను రెండవ వివాహం చేసుకున్నాడు. మృతురాలి తల్లి నారాయణమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్.. ఇటీవల జిల్లాలో పలువురు ఆత్మహత్యకు కల్లాపికి ఉపయోగించే పేడ రంగును నీళ్లలో కలుపుకుని తాగి మృతి చెందుతుండటంతో కలెక్టర్ రాజకుమారి నెల క్రితం పేడ రంగు విక్రయాలను నిషేధించారు. అయినా కొందరు కిరాణ దుకాణ వ్యాపారులు విక్రయిస్తున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. పేడ రంగు విక్రయించకుండా అధికారులు దుకాణాలపై దాడులు చేయా లని గ్రామస్తులు కోరుతున్నారు.

తాళిబొట్లు తెంచి పడేసి హిజ్రాల ఆవేదన..!
తమిళనాడు: కూవాగంలో గత కొద్ది రోజులు సందడి చేసిన హిజ్రాలు బుధవారం విషాదంతో స్వస్థలాలకు తిరుగు పయనం అయ్యారు. మంగళవారం ఎంతో ఆనందంగా కట్టుకున్న మంగళ సూత్రాలను తెంచి పడేసి ఒప్పారి పెట్టారు. తెల్ల చీరలు ధరించి వితంతువులుగా మారి కూవాగం నుంచి తిరుగు పయనం అయ్యారు. ముందుగా ఉదయం కూత్తాండవర్ రథోత్సవం అత్యంత వేడుకగా జరిగింది. రాష్ట్రంలోని కళ్లకురిచ్చి జిల్లా ఉలుందూర్ పేట సమీపంలోని కూవాగం గ్రామంలోని కూత్తాండవర్ ఆలయంలో రెండు వారాల పాటు చిత్తిరై ఉత్సవాలు అత్యంత వేడుకగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా గత మూడు రోజులు హిజ్రాల సందడితో కూవాగం కళకళలాడింది. భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి, ఆలయ పూజారి చేతుల మీదుగా మంగళవారం హిజ్రాలు తాళిబొట్లు కట్టించుకున్నారు. రాత్రంతా ఆట పాటలతో సందడి చేశారు. రథోత్సవం బుధవారం ఉదయం కూత్తాండవర్ రథోత్సవం ఘనంగా జరిగింది. ఈ రథోత్సవాన్ని తిలకించేందుకు వేలాదిగా జనసందోహం తరలివచ్చారు. ఈ వేడుక కోసం కూవాగం, పందలాడి, కిలక్కు కుప్పం, శిరులాయం కుళం గ్రామాల నుంచి ప్రజలు చేతులు, కాళ్లు, భుజాలు, శిరస్సు ఆకారాలను తీసుకొచ్చి రథంపై ఉంచారు. బ్రహ్మాండంగా కూత్తాండవర్ రథోత్సవ సేవ జరిగింది. అనంతరం బలిదానం జరిగింది. బలిదానంలో తమ ఆరాధ్యుడు బలి కావడంతో తమ భర్తను కోల్పోయినంతగా తీవ్ర వేదనతో ఒక్కసారిగా హిజ్రాలు విషాదంలో మునిగారు. తాము కట్టుకున్న మంగళ సూత్రాలను తెంచి పడేసి కన్నీటి సంద్రంలో మునిగారు. ఏడుపులు, పెడ»ొబ్బలతో ఒప్పారి పెట్టారు. అక్కడి కొలనులో స్నానం చేసి తెల్ల చీరల్ని ధరించి తమ స్వస్థలాలకు తిరుగు పయనమయ్యారు.