Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today

Top Stories

ప్రధాన వార్తలు

Ys Jagan Serious On Attack Incident On Dalit Student In Tirupati1
తిరుపతిలో దళిత విద్యార్థిపై దాడి ఘటన.. వైఎస్‌ జగన్‌ ఆగ్రహం

సాక్షి, తాడేపల్లి: తిరుపతిలో దళిత విద్యార్థి జేమ్స్‌పై దాడి ఘటనపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంజినీరింగ్‌ దళిత విద్యార్థి జేమ్స్‌పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానంటూ ట్వీట్‌ చేశారు. ‘‘రాష్ట్రంలో దిగజారిపోయిన శాంతి భద్రతలకు, దళితులపై తీవ్రమవుతున్న దాడులకు ఈ ఘటన ఒక ఉదాహరణ. దళితులు, తమ గొంతు గట్టిగా వినిపించలేని వర్గాల వారికి ఈ రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయింది’’ అని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.‘‘చంద్రబాబు, అధికార పార్టీ నాయకుల డైరెక్షన్‌లో కక్ష సాధింపు చర్యల్లో మునిగి తేలుతున్న పోలీసు యంత్రాంగం పౌరులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యతను పూర్తిగా విస్మరించడంవల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట దళితులపైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. పోలీస్‌ స్టేషన్లకు వెళ్తే న్యాయం జరుగుతుందన్న నమ్మకం పోవడమే కాదు.. ఫిర్యాదు దారులమీదే ఎదురు కేసులు పెట్టడం పరిపాటిగా మారింది...జేమ్స్‌పై దాడి ఘటనలో పోలీసు యంత్రాంగం వైఫల్యమే కాదు, రాజకీయ జోక్యంతో కనీసం ఫిర్యాదునుకూడా స్వీకరించలేని పరిస్థితి. తిరుపతి ఘటనకు కారకులైన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాను’’ అని వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.తిరుపతిలో ఇంజినీరింగ్‌ దళిత విద్యార్థి జేమ్స్‌పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాష్ట్రంలో దిగజారిపోయిన శాంతి భద్రతలకు, దళితులపై తీవ్రమవుతున్న దాడులకు ఈ ఘటన ఒక ఉదాహరణ. దళితులు, తమ గొంతు గట్టిగా వినిపించలేని వర్గాల వారికి ఈ రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయింది. @ncbn, అధికారపార్టీ…— YS Jagan Mohan Reddy (@ysjagan) May 18, 2025

Former Mp Nandigam Suresh Arrested2
బాబు సర్కార్‌ కక్ష సాధింపు.. మరోసారి నందిగం సురేష్‌ అరెస్ట్‌

గుంటూరు: మాజీ ఎంపీ నందిగం సురేష్‌పై చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగింది. మరోసారి ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. టీడీపీ కార్యకర్త ఇసుకపల్లి రాజు నిన్న(శనివారం) నందిగం సురేష్ ఇంటి దగ్గర తాగి వీరంగం సృష్టించాడు. నందిగం సురేష్‌ కుటుంబ సభ్యులను దూషించిన రాజు.. సురేష్‌ను చంపేస్తే తనకున్న ఆస్తుల్లో కొంత భాగం రాసిస్తానంటూ హడావుడి చేశాడు.నందిగం సురేష్ కార్లపైన రాజు దాడి చేశాడు. ఎందుకు వీరంగం సృష్టిస్తున్నావంటూ రాజును నందిగం సురేష్ అనుచరులు ప్రశ్నించారు. దీంతో రాజు, నందిగామ సురేష్ అనుచరులకు మధ్య గొడవ జరిగింది. తనపై దాడి చేశారంటూ రాజు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. రాజు తమ కారులపై దాడి చేసి తమ కుటుంబ సభ్యులను దూషించాడని.. నందిగం సురేష్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.నందిగం సురేష్ కుటుంబ సభ్యుల ఫిర్యాదును పట్టించుకోని పోలీసులు.. రాజు ఇచ్చిన ఫిర్యాదుతో సురేష్‌ని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అధికార పార్టీ నేతల ప్రోద్భలంతో నందిగం సురేష్‌తో పాటు ఆయన అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. నందిగం సురేష్‌ని అరెస్ట్ చేసి తుళ్లూరు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు.

Is Indian Information passed to Pakistan Through Sim Cards3
సంగారెడ్డిలో ఉగ్రమూలాల కలకలం.. పాక్‌కు సమాచారం చేరవేత?

సంగారెడ్డి: జిల్లాలో ఉగ్రమూలాల కలకలం రేగింది. కొండాపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో అస్సాం రాష్ట్రానికి చెందిన ఇస్లాం(19) అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించే క్రమంలో షాకింగ్ విషయాలు బయడపడినట్లు తెలుస్తోంది. అస్సాం పోలీసుల ఆపరేషన్ ఘోస్ట్ సిమ్ లో భాగంగా ఇస్లాం బాగోతం వెలుగులోకి వచ్చింది.అస్సాంలో గుర్తింపు కార్డులు లేకుండా సిమ్ కార్డులు తీసుకుని సంగారెడ్డి జిల్లాలో పలువురికి విక్రయిస్తున్నట్లు తెలిసింది. గతంలో అస్సాంలో మొబైల్ షాపులో పని చేసిన ఇస్లాం.. అక్కడే కొందరి గుర్తింపు కార్డులతో నకిలీ సిమ్ లు తీసుకుని అధిక ధరకు విక్రయించాడు.ప్రస్తుతం గొల్లపల్లిలో తాపీ మేస్త్రీగా పని చేస్తున్నాడు. అదే సమయంలో తన వద్ద ఉన్న నకిలీ సిమ్ కార్డులను పాకిస్తానీయులకు అమ్మినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. భారత్ ఫోన్ నెంబర్లతో పాకిస్తాన్ లో వాట్పాప్ అకౌంట్ లు క్రియేట్ కావడంతో ఈ కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు పోలీసులు.ఇటీవల జరిగిన భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధంలో భాగంగా మీడియాలో వచ్చిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆ గ్రూపుల్లో పోస్టు చేస్తున్నట్లు సమాచారం.దేశ వ్యాప్తంగా ఏడుగురు అరెస్ట్.. అంతా అస్సాం వారేఆపరేషన్ ఘోస్ట్ సిమ్ లో భాగంగా దేశ వ్యాప్తంగా ఏడుగుర్ని పోలీసులు అదుపులోకి తీసుకోగా, అంతా అస్సాం రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు. ఈ ఏడుగురు అనుమానితులువివిధ రాష్ట్రాల్లో ఉంటూ దేశ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పాకిస్తాన్ లోని తమ మిత్రులకు సమాచారం చేరవేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి సంగారెడ్డిలో మకాం వేసిన అస్సాం పోలీసులు తమ దర్యాప్తును అత్యంత గోప్యంగా సాగిస్తున్నట్లు సమాచారం.#OperationGhostSIMAssam police has arrested 7 people for helping people from Pakistan to use WhatsApp from Indian numbers by sharing OTPs.7 arrested, 948 SIMs seized.These SIMs were being used for cyber crimes and anti-national operations. pic.twitter.com/crLN5LMmpO— Incognito (@Incognito_qfs) May 18, 2025 Assam Police busts major fake SIM racket in ‘Operation GHOST SIM’; 7 arrested, 948 SIMs seized; WhatsApp OTPs linked to Pakistan. The public is urged to stay alert.Read Full Story: https://t.co/zhwxJLa7Cm#AssamPolice #OperationGhostSim #Crime #SimCardRacket pic.twitter.com/BU94CVK9o1— Pratidin Time (@pratidintime) May 17, 2025

Mitchell Owen brings PSL form into IPL, Silver duck on Punjab Kings debut4
అంత అన్నారు.. ఇంత అన్నారు! ఆఖరికి అరంగేట్రంలోనే డ‌కౌట్‌

ఆస్ట్రేలియా య‌వ ఆల్‌రౌండ‌ర్ మిచెల్ ఓవెన్ త‌న ఐపీఎల్ కెరీర్‌ను పేల‌వంగా ఆరంభించాడు. ఐపీఎల్‌-2025లో భాగంగా జైపూర్ వేదిక‌గా రాజ‌స్తాన్ రాయ‌ల్స్ జ‌రుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ త‌ర‌పున ఓవెన్ అరంగేట్రం చేశాడు. అయితే త‌న తొలి మ్యాచ్‌లో మిచెల్ తీవ్ర నిరాశ‌ప‌రిచాడు.కేవ‌లం రెండు బంతులు మాత్ర‌మే ఎదుర్కొని ఖాతా తెర‌వ‌కుండానే మిచెల్ పెవిలియ‌న్‌కు చేరాడు. రాజ‌స్తాన్ యువ పేస‌ర్ క్వేనా మఫాకా బౌలింగ్‌లో సంజూ శాంస‌న్‌కు క్యాచ్ ఇచ్చి ఓవెన్ పెవిలియ‌న్‌కు చేరాడు. కాగా మ‌రో ఆసీస్ స్టార్ ఆల్‌రౌండ‌ర్ గ్లెన్ మాక్స్‌వెల్ స్ధానంలో పంజాబ్ జ‌ట్టులోకి ఓవెన్ వ‌చ్చాడు.ఈ టోర్నీలో మిగిలిన మ్యాచ్‌ల‌కు మాక్సీ గాయం కార‌ణంగా దూరం కావ‌డంతో.. మిచెల్ ఓవెన్ రూ.3 కోట్ల‌కు పంజాబ్ సొంతం చేసుకుంది. పంజాబ్ ఈ యువ ఆట‌గాడిపై ఎన్నో ఆశ‌లు పెట్టుకుంది. కానీ ఓవెన్ మాత్రం త‌న మొద‌టి మ్యాచ్‌లోనే తుస్సుమ‌న్పించాడు.అంత‌కంటే ముందు మాక్స్‌వెల్ సైతం ఇదే త‌ర‌హా ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. ఇప్పుడు మాక్సీ స్థానంలో వ‌చ్చిన ఓవెన్ కూడా అదే తీరును క‌న‌బ‌రిస్తున్నాడు. అరంగేట్రంలోనే డౌక‌టైన ఓవెన్‌ను నెటిజ‌న్లు ట్రోలు చేస్తున్నారు. మ‌రో మాక్స్‌వెల్ జ‌ట్టులోకి వ‌చ్చాడ‌ని వ్యంగ్యంగా పోస్టులు పెడుతున్నారు. కాగా ఓవెన్‌కు మాత్రం టీ20ల్లో మెరుగైన రికార్డు ఉంది.ఈ టాస్మానియా ఆల్‌రౌండ‌ర్ ఇప్ప‌టివ‌ర‌కు 35 టీ20 మ్యాచ్‌లు ఆడి 646 పరుగులు చేశాడు. ఇందులో రెండు శతకాలు ఉండగా.. అత్యధిక స్కోరు 108. ఓవెన్‌ ఖాతాలో పది టీ20 వికెట్లు కూడా ఉన్నాయి. పంజాబ్ జ‌ట్టులో చేర‌క‌ముందు ఓవెన్‌ పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌లో పెషావర్‌ జల్మీకి ప్రాతినిథ్యం వ‌హించాడు. ఐపీఎల్ నుంచి ఆఫ‌ర్ రావ‌డంతో పీఎస్ఎల్ మ‌ధ్య‌లోనే అత‌డు వైదొలిగాడు.Kwena Maphaka gets Mitchell Owen 0(2). ☝️Not a good start for Owen in the IPL. pic.twitter.com/XJtfKQtJpf— Rishabh Singh Parmar (@irishabhparmar) May 18, 2025

Pakistan Cant Find Anyone So Handsom To Me Asaduddin5
వారికి నా కంటే అందగాడు కనిపించలేదేమో!

హైదరాబాద్: ఉగ్రవాదంపై భారత్ జరుపుతున్న పోరులో భాగంగా తన వంతు పాత్రను సమర్దవంతంగా పోషిస్తున్న హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ.. పాకిస్తాన్ ట్రోలర్స్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇస్లాంలో హింసకు తావులేదని పదే పదే చెబుతున్న అసదుద్దీన్ పై పాకిస్తాన్ కు చెందిన పలువురు ట్రోలింగ్‌కు దిగారు. దీనికి ఓవైసీ నవ్వుతూనే అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. ‘ పాకిస్తాన్ లో ఉన్న వారికి భారత్ లో ఉన్న నేను మాత్రమే కనిపిస్తున్నాను. నా కంటే అందగాడు వారికి కనిపించలేదేమో. అందుకే నా ప్రసంగాలు వింటూ ఉన్నారు. నా ప్రసంగాలు విని మీ మెదడులో ఉన్న చెత్తను తీసేయండి. అది అందరికీ మంచిది. మీ అజ్ఞానం కూడా అంతమవుతుంది’ అని అసదుద్దీన్‌ తెలిపారు.‘ ‘మీపై పాకిస్తాన్ ట్రోలింగ్ ఎక్కువైంది కదా’’ ? అని మీడియా అడిగిన ప్రశ్నకు ఓవైసీ నవ్వుతూ స్పందించారు. వారికి తన కంటే అందగాడు భారత్ లో కనిపించలేదేమో. అందుకే నా ప్రసంగాలను ట్రోల్స్ చేస్తున్నారు’ అంటూ చమత్కరించారు.పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం చోటు చేసుకున్న పరిణామాల్లో భాగంగా అంతర్జాతీయ వేదికపై ఉగ్రవాదంపై భారత్ సాగిస్తున్న పోరాటానికి ఓవైసీ సిద్ధమవుతున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత, ఆపై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ కు ముందు జరిగిన అఖిలపక్ష సమావేశానికి ఓవైసీకి ఆహ్వానం చివరి నిమిషంలో అందింది. తొలుత ఓవైసీకి ఆహ్వానం అందలేదనే వార్తల నేపథ్యంలో హోంమంత్రి అమిత్ షా స్వయంగా ఫోన్ చేసి ఓవైసీని అఖిలపక్ష సమావేశానికి రమ్మని ఆహ్వానించారు. అప్పట్నుంచీ పాకిస్తాన్ దుశ్చర్యలను ఎండగడుతూనే ఉన్నారు అసదుద్దీన్ ఓవైసీ. పాకిస్తాన్ ఓ ఉగ్రవాద దేశంగా మారిపోయిందని, ఆ దేశం అర్థ శతాబ్దం వెనక్కి పోయిందంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఇలా సమయం వచ్చినప్పుడల్లా పాకిస్తాన్ తీరుపై ధ్వజమెత్తుతూనే ఉన్నారు ఓవైసీ.ఇదీ చదవండి:నీ తల్లికి తూటా దింపిందెవరు?

Tollywood Movie Exhibitors Taken Shocking Decision On Movie Theatres6
తెలుగు రాష్ట్రాల ఎగ్జిబిటర్లు షాకింగ్ నిర్ణయం..!

తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌లో సమావేశమైన తెలంగాణ, ఆంధ్రా ఎగ్జిబిటర్లు థియేటర్లు బంద్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ సమావేశంలో ప్రముఖ నిర్మాతలు దిల్‌రాజు, సురేశ్ బాబుతో పాటు 60 మంది ఎగ్జిబిటర్లు పాల్గొన్నారు.ఈ సమావేశంలో పాల్గొన్న ఎగ్జిబిటర్లు అద్దె ప్రాతిపాదికన సినిమాలను ప్రదర్శించలేమని తేల్చిచెప్పారు. పర్సంటెజీ రూపంలో చెల్లిస్తేనే సినిమాలను ప్రదర్శిస్తామని నిర్మాతలకు లేఖ రాయాలని ఎగ్జిబిటర్ల తీర్మానం చేశారు. తాజా నిర్ణయంతో వచ్చేనెల విడుదలయ్యే చిత్రాలపై తీవ్ర ప్రభావం పడనుంది. ఈ నేపథ్యంలో ఎగ్జిబిటర్ల నిర్ణయం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

Liquor Price Hike In Telangana7
మందు బాబులకు బిగ్‌షాక్‌.. తెలంగాణలో మద్యం ధరలు పెంపు

హైదరాబాద్‌: తెలంగాణలో మందుబాబులకు బిగ్‌ షాక్‌ తగిలింది. మద్యం ధరలను ప్రభుత్వం భారీగా పెంచేసింది. మద్యం ధరలను పెంచుతున్నట్లు దుకాణాలకు ఎక్సైజ్‌ శాఖ సర్క్యులర్‌ జారీ చేసింది. క్వార్టర్‌ మద్యం బాటిల్‌పై రూ.10, హాఫ్‌ బాటిల్‌పై రూ.20, ఫుల్‌బాటిల్‌పై రూ.40 పెంచింది.కాగా, ఇటీవలే బీర్ల ధరలు పెంచేసిన తెలంగాణ సర్కార్‌.. ఇప్పుడు ఇతర లిక్కర్‌ ధరలను కూడా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే. కొన్ని బ్రాండ్ల మీదనే ప్రభుత్వం ధరలు పెంచింది. పెరిగిన ధరలు ఈ రోజు అర్ధరాత్రి నుంచి అందుబాటులోకి రానున్నాయి. 2020లో అప్పటి ప్రభుత్వం.. తెలంగాణ స్పెషల్ ఎక్సైజ్ సెస్‌ను ప్రవేశపెట్టింది. మళ్లీ స్పెషల్ ఎక్సైజ్ సెస్‌ను ప్రవేశపెట్టిన క్సైజ్ శాఖ.. మద్యం బాటిళ్లపై సెస్‌ను పెంచింది. స్పెషల్ ఎక్సైజ్ సెస్‌ను ఎక్సైజ్ శాఖ మళ్లీ పునరుద్దరించింది.

The EPFO Introduced New Rules With 5 Major Changes For All EPF Members Check Here For Details8
EPFOలో ఐదు కీలక మార్పులు

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఈ ఏడాది.. తన చందాదారుల కోసం కొన్ని కీలక మార్పులు చేసింది. ఇవన్నీ ఉద్యోగులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. రాబోయే రోజుల్లో మరిన్ని మార్పులు చేసే అవకాశం ఉంది. ఈ కథనంలో ఈపీఎఫ్ఓలో 2025లో జరిగిన ఐదు కీలక మార్పుల గురించి వివరంగా తెలుసుకుందాం.ప్రొఫైల్ అప్‌డేట్ఈ ఏడాది ఈపీఎఫ్ఓలో జరిగిన ప్రధానమైన మార్పులలో ప్రొఫైల్ అప్‌డేట్ ఒకటి. ఈ అప్డేట్ ద్వారా.. ప్రొఫైల్ అప్డేట్ చాలా సులభతరమైపోయింది. మీ యూఏఎన్ నెంబర్.. ఆధార్‌తో లింక్ అయి ఉంటే.. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, లింగం, నేషనాలిటీ, వైవాహిక స్థితి, జీవిత భాగస్వామి పేరు, ఉద్యోగం ప్రారంభించిన తేదీ వంటి వివరాలను ఎటువంటి పత్రాలతో అవసరం లేకుండానే అప్డేట్ చేసుకోవచ్చు.పీఎఫ్ బదిలీగతంలో, ఉద్యోగాలు మారినప్పుడు పీఎఫ్ బదిలీ చేయడం.. చాలా సుదీర్ఘమైన ప్రక్రియగా ఉండేది. ఇప్పుడిది.. చాలా సులభమైపోయింది. పీఎఫ్ బదిలీకి పాత లేదా కొత్త యజమాని ఆమోదం అవసరం లేదు. దీంతో పీఎఫ్ డబ్బు కొత్త ఖాతాకు వేగంగా.. సులభంగా బదిలీ అవుతుంది.జాయింట్ డిక్లరేషన్జనవరి 16, 2025 నుంచి వర్తించే కొత్త నిబంధనల ప్రకారం.. ఈపీఎఫ్ఓ ​​జాయింట్ డిక్లరేషన్ ప్రక్రియ డిజిటల్‌గా మారింది. మీ యూఏఎన్ ఆధార్‌తో లింక్ అయి ఉంటే.. జాయింట్ డిక్లరేషన్‌ను ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేయవచ్చు.పెన్షన్ పేమెంట్స్ఈపీఎఫ్ఓ జనవరి 1, 2025 నుంచి కేంద్రీకృత పెన్షన్ చెల్లింపు వ్యవస్థ (CPPS)ను ప్రారంభించింది. దీని కింద ఇప్పుడు పెన్షన్ 'నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా' ప్లాట్‌ఫామ్ ద్వారా నేరుగా ఏదైనా బ్యాంకు ఖాతాకు పంపడం జరుగుతుంది. గతంలో పెన్షన్ చెల్లింపు ఆర్డర్‌లను ఒక ప్రాంతీయ కార్యాలయం నుంచి మరొక ప్రాంతీయ కార్యాలయానికి బదిలీ చేయాల్సి వచ్చింది. దీని వల్ల పెన్షన్ చెల్లింపు ఆలస్యం అయ్యేది. ఇప్పుడు ఈ విధానం పూర్తిగా రద్దు అయింది.ఇదీ చదవండి: 'అమెరికాలో ఉంటున్న భారతీయులకు హెచ్చరిక'జీతంపై పెన్షన్ ప్రక్రియఅధిక జీతంతో పెన్షన్ పొందాలనుకునే ఉద్యోగుల కోసం.. ఈపీఎఫ్ఓ ​​ఇప్పుడు మొత్తం ప్రక్రియను సులభతరం చేసింది. ఇప్పుడు అందరికీ ఒకే విధమైన పద్ధతిని అవలంబించనున్నారు. ఒక ఉద్యోగి జీతం నిర్దేశించిన పరిమితి కంటే ఎక్కువగా ఉండి, దానిపై పెన్షన్ కోరుకుంటే ఈ విధానం ఉపయోగపడుతుంది. దీనితో పాటు, ఈపీఎఫ్ఓ ​​పరిధిలోకి రాని లేదా వారి స్వంత ప్రైవేట్ ట్రస్ట్ పథకాన్ని నిర్వహించని సంస్థలు కూడా ట్రస్ట్ నియమాల ప్రకారం ఈ ప్రక్రియను అనుసరించాల్సి ఉంటుంది.

fire accident at mirchowk hyderabad 9
పాతబస్తీ అగ్ని ప్రమాదంలో 17 మంది మృతి.. కిషన్‌రెడ్డి వ్యాఖ్యల్ని ఖండించిన ఫైర్‌ డీజీ

Meer Chowk Fire Accident Live Updates:సాక్షి,హైదరాబాద్‌: పాతబస్తీ మీర్‌చౌక్‌లో పెను విషాదం చోటు చేసుకుంది. ఆదివారం ఉదయం గుల్జార్‌హౌస్‌ సమీపంలోని ఓ భవనం మొదటి అంతస్తులో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 17 మంది మృతి చెందారు. అయితే, ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బందిపై కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని తెలంగాణ ఫైర్‌ డీజీ నాగిరెడ్డి ఖండించారు. ఆయన చేసిన వ్యాఖ్యల్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా’ అని అన్నారు. మరోవైపు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఎక్స్‌ గ్రేషియా ప్రకటించారు. 👉మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున పరిహారంపాతబస్తీ అగ్ని ప్రమాద ఘటన బాధాకరం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించిందిబాధిత కుటుంబసభ్యులతో సీఎం మాట్లాడారు.అగ్ని ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించాం👉సీఎం రేవంత్ రెడ్డికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఫోన్గుల్జార్‌ హౌస్‌ అగ్నిప్రమాదం వివరాలు అడిగి తెలుసుకున్న ఖర్గేఘటన వివరాలను ఖర్గేకు వివరించిన సీఎంఎప్పటికప్పుడు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నట్లు ఖర్గేకు తెలిపిన సీఎంమంత్రులు ఘటన స్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారని ఖర్గేకు వివరించిన సీఎం 👉మృతులకు ప్రధాని మోదీ సంతాపంపాత బస్తీ అగ్నిప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతిమృతులకు ప్రధాని మోదీ సంతాపంపీఎంఎన్‌ఆర్‌ఎఫ్ నుంచి అగ్ని ప్రమాద బాధితులకు ఎక్స్ గ్రేషియామృతులకు రూ.2లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేలు ఎక్స్ గ్రేషియాDeeply anguished by the loss of lives due to a fire tragedy in Hyderabad, Telangana. Condolences to those who have lost their loved ones. May the injured recover soon.An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased. The injured would be…— PMO India (@PMOIndia) May 18, 2025 👉కిషన్‌రెడ్డి విజ్ఞతకే వదిలేస్తున్నా.. ప్రమాదంపై ఫైర్ డీజీ నాగిరెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాటలను కండిస్తున్నసరైన సమయం లో ఫైర్ సిబ్బంది రాలేదు అనడం అవాస్తవం నేను దగ్గర ఉంది ఘటనను పరిశిలించాను మా దగ్గర అత్యాధునిక పరికరాలు లేవు అనేది అవాస్తవం అయన మాటలను అయన విజ్ఞతకే వదిలేస్తున్న👉ప్రమాదంపై ఫైర్ డీజీ నాగిరెడ్డి మీడియాతో మాట్లాడారుఉదయం 6.16నిమిషాలకు ఫైర్ కాల్ వచ్చిందిసమాచారం వచ్చిన వెంటనే మొఘల్‌పూరా ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారుఆ తర్వాత 11 ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయిప్రమాదానికి కారణం భవనంలోకి వెళ్లే దారికి షార్ట్ సర్క్యూట్ జరిగిందిభవనంలో ఉన్న కృష్ణ పర్ల్స్‌,మోదీ పర్ల్స్ షాపులు అగ్నికి ఆహుతయ్యాయిఅగ్నిప్రమాదం తీవ్ర స్థాయిలో ఉండటానికి కారణం ఆ భవనాన్ని ఇటీవల ఉడెన్ ప్యానల్‌తో డిజైన్ చేశారుషార్ట్ సర్క్యూట్‌తో ఉడెన్ ప్యానల్ మొత్తం కాలి మంటలు వ్యాప్తి చెందాయిప్రమాదంతో ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్న 17 మందిని రెస్క్యూ చేసి వివిధ ఆస్పత్రులకు తరలించాంఒక నలుగురు ల్యాడర్ మీద నుంచి కిందకు వచ్చారు17మందిలో అందరూ చనిపోయినట్లు తెలుస్తోందిప్రమాదం జరగడానికి ప్రధాన కారణం ఎంట్రన్స్‌లో షార్ట్ సర్క్యూట్‌స్థానికంగా పని చేసేవారిని అడిగాను రెగ్యులర్‌గా షార్ట్ సర్క్యూట్ జరుగుతుందని చెప్పారుఇంటి లోపల ఫైర్ నిబంధనలు లేవుఈ బిల్డింగ్ జీప్లస్ 2,బయటకు జీప్లస్ వన్‌లాగా కనిపిస్తోందిఫస్ట్ ఫోర్ల్,సెకండ్ కంప్లీట్‌గా రెసిడెన్షియల్ ఏరియాగ్రౌండ్‌ఫ్లోర్‌లో అన్నీ షాప్స్ ఉన్నాయిఘటనా స్థలాన్ని పరిశీలిస్తే ఈ ప్రమాదం ఎసీ కంప్రెసర్ పేలడం వల్ల జరిగింది కాదు షార్ట్స్ సర్క్యూటే కారణం ప్రమాదం జరిగిన అపార్ట్‌మెంట్‌లో ఒక మీటరు వెడల్పుతో మెట్లను నిర్మించారుదీంతో ప్రమాదం నుంచి బాధితులు బయటపడేందుకు మరో మార్గం లేదుప్రమాదం జరిగిన బిల్డింగ్ చాలా పాత బిల్డింగ్‌నాటి నిబంధనల ప్రకారం నిర్మించారుఫైర్ సేఫ్టీ నిబంధనలు లేకపోవడం భారీ అగ్నిప్రమాదం జరిగిందిఅగ్ని ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి ఆలస్యం రావడం, ఎక్విప్‌మెంట్ లేకపోవడంలో సరైన సహాచర్యలు చేపట్టలేదన్న కేంద్ర మంత్రి వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాంఆయన చేసిన వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాంప్రమాదం జరిగిన వెంటనే 11 ఫైరింజన్లు, 70 మంది ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారుబయట నుంచి చూస్తే 2మీటర్ల ఎంట్రన్స్ పూర్తిగా పొగకమ్ముకుందిఫస్ట్‌ఫ్లోర్‌కి వెళ్లే దారి వెడల్పు ఒక మీటరు మాత్రమే ఉంది6.16కి ప్రమాదంపై సమాచారం అందిందిప్రమాదం జరిగే సమయంలో చనిపోయిన 17 మంది కాకుండా మరో నలుగురు ఉన్నారని చెబుతున్నారువారిలో నలుగురు రెండవ ఫ్లోర్‌లో ఉన్నారు. అక్కడి నుంచి తప్పించుకున్నారుమంటల్ని ఎప్పుడో ఆర్పేశాంప్రమాదం జరిగిన సమయంలో అందరూ నిద్రలో ఉన్నారుఈ ప్రమాద బాధితుల్లో కొందరు వేసవి సెలవులు నిమిత్తం వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చారు👉తెలంగాణ ఫైట్ డిజాస్టర్ రెస్పాన్స్ టీంఅగ్నిమాపక కేంద్రాల నుండి 12 ఫైర్ పరికరాలతో రెస్క్యూ నిర్వహించాం.మొత్తం 11 వాహనాలు, 01 అగ్నిమాపక రోబో, 17 అగ్నిమాపక అధికారులు, 70 మంది సిబ్బంది మంటలను ఆర్పడంలో,చిక్కుకున్న వారిని రక్షించడంలో పాల్గొన్నారు.మంటలను ఆర్పడానికి మొత్తం 02 గంటలు పట్టింది చిక్కుకున్న వ్యక్తులను రక్షించడానికి, మంటలను ఆర్పడానికి, వ్యాపించకుండా నిరోధించడానికి అధికారులు, సిబ్బంది తీవ్రంగా కృషి చేశాంఅడ్వాన్స్‌డ్ ఫైర్ రోబోట్, బ్రోటో స్కైలిఫ్ట్ హైడ్రాలిక్ ప్లాట్‌ఫామ్‌ను ఆపరేషన్లలో ఉపయోగించాము.అగ్నిప్రమాదానికి గల కారణం తెలియాల్సి ఉంది,దర్యాప్తు చేస్తున్నాం..దెబ్బతిన్న ఆస్తి విలువ ఇంకా అంచనకు రాలేదు 👉కేటీఆర్‌ దిగ్భ్రాంతిఓల్డ్ సిటీలోని గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదం పై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కేటీఆర్..అగ్ని ప్రమాదం జరగడం దురదృష్టం..చాలా బాధను గురిచేసింది..బాధితుల కుటుంబాలకు సంతాపం ప్రకటించిన కేటీఆర్..గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.మంటలు త్వరగా అదుపులోకి రావాలని ఆశిస్తున్నాను..సహాయక చర్యలకు BRS బృందం అందుబాటులో ఉంటుంది.Extremely shocked and pained!! Details emerging out of Gulzar House fire tragedy in Old City are very sadMy heartfelt condolences to the families of the victims of the tragedy. Wishing a speedy recovery to those injuredHoping and praying that this fire will be contained very…— KTR (@KTRBRS) May 18, 2025👉సీఎం రేవంత్‌ రెడ్డి దిగ్భ్రాంతిఅగ్ని ప్రమాద ఘటనపై సీఎం రేవంత్‌ రెడ్డి దిగ్భ్రాంతి. సహాయక చర్యలకు ముమ్మరం చేయాలని ఆదేశించారు. బాధితులకు అండగా ఉంటామని హామీ. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం. ప్రమాద ఘటన గురించి ఆరా తీసిన ముఖ్యమంత్రి ఘటనా స్థలానికి చేరుకున్న మంత్రి పొన్నం వివరాలు అడిగి తెలుసుకుంటున్న పొన్నం ప్రభాకర్‌ఆదివారం ఉదయం 6గంటలకు ప్రమాదం జరిగింది6.15కి అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుందిప్రమాదంలో ఎలాంటి కుట్ర కోణం లేదు👉కిషన్‌రెడ్డి పరామర్శఅగ్నిప్రమాదం జరగడం దురదృష్టకరం.ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు స్పందించి ఉంటే ప్రాణ నష్టం జరగకుండా ఉండేదిసమయానికి అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి రీచ్ కాలేదుబాధాకరమైన విషయం ఇదికేంద్రం తరఫున బాధిత కుటుంబానికి అండగా ఉంటాంఫైర్ శాఖ వద్ద సరైన ఫైర్ పరికరాలు లేకపోవడంతో తీవ్రత పెరిగిందిఫైర్‌ టెక్నాలజీని పెరుగుపరుచుకోవాలి.ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలి. ఒకే కుటుంబానికి చెందినవారు ఎంతో కాలం ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు. గుల్జార్‌హౌస్‌లో ఘోర అగ్ని ప్ర‌మాదం..17మంది మృతిచార్మినార్‌ గుల్జార్‌హౌస్‌లో ఘోర అగ్ని ప్ర‌మాదం జ‌రిగింది. ఆదివారం ఉద‌యం 6.గంట‌ల‌కు షార్ట్ స‌ర్క్యూట్ కార‌ణంగా 17మంది మృతి చెందారు. షార్ట్స్‌ సర్క్యూట్‌ జరిగిన ప్రమాదంలో మొత్తం 17మందిని ఆస్పత్రికి తరలించారు. అగ్నిప్రమాదంలో మంటల్లో చిక్కుకున్న బాధితుల్ని రక్షించే ప్రయత్నం చేశారు. మంటల్లో చిక్కుకున్న మరికొంత మందిని రక్షించేందుకు అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు ప్రయత్నాల్ని కొనసాగిస్తున్నారు. బాధితులకు తక్షణ వైద్యం అందించేందుకు 14 అంబులెన్స్‌లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రమాదంతో పాతబస్తీలో ట్రాఫిక్‌ విభాగం ఆంక్షలు విధించింది. ట్రాఫిక్‌ను డైవర్ట్‌ చేస్తున్నట్లు తెలిపింది. మృతుల్లో ఏడుగురు చిన్నారులు, నలుగురు మహిళలు సహా మొత్తం 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న స్థానిక ఎమ్మెల్యే, మేయర్ విజయలక్ష్మి, అగ్నిపమాక డీజీ నాగిరెడ్డి, సౌత్‌జోన్ డీసీపీ స్నేహా మిశ్రా,హైడ్రా కమిషనర్ రంగనాథ్‌లు పరిశీలించారు. మృతుల వివరాలురాజేంద్రకుమార్‌ (67),అభిషేక్‌ మోదీ (30), సుమిత్ర (65), మున్నీబాయి (72), ఆరుషి జైన్‌ (17), శీతల్‌ జైన్‌ (37), ఇరాజ్‌ (2), హర్షాలీ గుప్తా (7), రజని అగర్వాల్‌, అన్య మోదీ, పంకజ్‌ మోదీ, వర్ష మోదీ, ఇద్దిక్కి మోదీ, రిషభ్‌, ప్రథమ్‌ అగర్వాల్‌, ప్రాంశు అగర్వాల్ ఉన్నారు. ఫైర్ యాక్సిడెంట్ చిన్నదే అయినా భవనంలో 30 మంది ఉండడంలో ప్రాణనష్టం భారీ ఎత్తున జరిగింది.

Was Congress Trying to Insult Shashi Tharoor,Here What He Said10
కాంగ్రెస్‌ మిమ్మల్ని అవమానిస్తోందా?.. ఎంపీ శశి థరూర్‌ రియాక్షన్‌ ఇదే

ఢిల్లీ: ఉగ్ర‌వాదుల‌కు అండ‌గా నిలుస్తున్న పాకిస్తాన్‌ను ప్ర‌పంచ దేశాల్లో ఎండ‌గ‌ట్టేందుకు ఏర్పాటు చేసిన అఖిలపక్ష నేతల్లో కేంద్ర ప్ర‌భుత్వం త‌నను ఎంపిక చేయ‌డంపై కాంగ్రెస్ ఎంపీ శ‌శిథ‌రూర్ స‌మ‌ర్థించుకున్నారు. తాను కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఏ రాజకీయ కోణంలో చూడడం లేదు. ఇది దేశానికి సేవ చేయాల్సిన సమయం’ అని స్పష్టం చేశారు.ఉగ్రవాదులకు అండగా నిలుస్తున్న పాకిస్తాన్‌ తీరును ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సహా ప్రపంచ దేశాల్లో ఎండగట్టడానికి, ఉగ్రవాదంపై భారత్‌ వైఖరిని వివరించడానికి కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష నేతలతో ఏడు బృందాలు ఏర్పాటు చేసింది. కాంగ్రెస్‌ ప్రతిపాదించిన నాలుగు పేర్లను పక్కనపెట్టి, ఆ పార్టీ ఎంపీ శశి థరూర్‌ను ఎంపిక చేయడం సంచలనాత్మకంగా మారింది. అంతేకాకుండా ఓ బృందానికి శశి థరూర్‌ నేతృత్వం వహిస్తారని ప్రకటించడం గమనార్హం. ఈ ఎంపికపై శ‌శిథ‌రూర్ స్పందించారు. ‘మాజీ విదేశాంగ వ్యవహారాల శాఖ అనుభవం కారణంగా కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తాను ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించాలని అడిగారు. కిరణ్ రిజిజు అడిగిన వెంటనే నేను అందుకు అంగీకరించాను. ఇది దేశ సేవకు సంబంధించింది. దేశం సంక్షోభంలో ఉన్నప్పుడు, కేంద్ర ప్రభుత్వం ఒక పౌరుడిని సహాయం కోరితే ఇంకేం సమాధానం ఇవ్వాలి?అని ప్రశ్నించారు. తాను తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ అసంతృప్తిగా ఉందా? అన్న ప్ర‌శ్న‌కు ఆ విషయం పార్టీకి, కేంద్రానికి సంబంధించింది. మీరు కాంగ్రెస్‌ను అడగాలి’ అని సూచించారు. పార్టీ మిమ్మల్ని అవమానించిందా? అన్న ప్ర‌శ్న‌కు.. నన్ను అంత తేలికగా అవమానించలేరు. నా విలువ నాకు తెలుసని సమాధానమిచ్చారు. దేశంపై దాడి జరిగినప్పుడు, అందరం ఒకే స్వరం వినిపించడం, ఐక్యతగా నిలబడటం దేశానికి మంచిది. కేంద్రం ఆయనను దేశ ప్రతినిధిగా ఎంపిక చేయడాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement