Top Stories
ప్రధాన వార్తలు

పాతబస్తీలో అగ్ని ప్రమాదం..17కు చేరిన మరణాలు.. మృతులకు ప్రధాని మోదీ సంతాపం
Meer Chowk Fire Accident Live Updates:సాక్షి,హైదరాబాద్: పాతబస్తీ మీర్చౌక్లో పెను విషాదం చోటు చేసుకుంది. ఆదివారం ఉదయం గుల్జార్‌హౌస్ సమీపంలోని ఓ భవనం మొదటి అంతస్తులో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 17 మంది మృతి చెందారు. 👉మృతులకు ప్రధాని మోదీ సంతాపంపాత బస్తీ అగ్నిప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతిమృతులకు ప్రధాని మోదీ సంతాపంపీఎంఎన్‌ఆర్‌ఎఫ్ నుంచి అగ్ని ప్రమాద బాధితులకు ఎక్స్ గ్రేషియామృతులకు రూ.2లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేలు ఎక్స్ గ్రేషియాDeeply anguished by the loss of lives due to a fire tragedy in Hyderabad, Telangana. Condolences to those who have lost their loved ones. May the injured recover soon.An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased. The injured would be…— PMO India (@PMOIndia) May 18, 2025👉కేటీఆర్ దిగ్భ్రాంతి ఓల్డ్ సిటీలోని గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదం పై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కేటీఆర్..అగ్ని ప్రమాదం జరగడం దురదృష్టం..చాలా బాధను గురిచేసింది..బాధితుల కుటుంబాలకు సంతాపం ప్రకటించిన కేటీఆర్..గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.మంటలు త్వరగా అదుపులోకి రావాలని ఆశిస్తున్నాను..సహాయక చర్యలకు BRS బృందం అందుబాటులో ఉంటుంది.Extremely shocked and pained!! Details emerging out of Gulzar House fire tragedy in Old City are very sadMy heartfelt condolences to the families of the victims of the tragedy. Wishing a speedy recovery to those injuredHoping and praying that this fire will be contained very…— KTR (@KTRBRS) May 18, 2025👉సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతిఅగ్ని ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి. సహాయక చర్యలకు ముమ్మరం చేయాలని ఆదేశించారు. బాధితులకు అండగా ఉంటామని హామీ. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం. ప్రమాద ఘటన గురించి ఆరా తీసిన ముఖ్యమంత్రి ఘటనా స్థలానికి చేరుకున్న మంత్రి పొన్నం వివరాలు అడిగి తెలుసుకుంటున్న పొన్నం ప్రభాకర్‌ఆదివారం ఉదయం 6గంటలకు ప్రమాదం జరిగింది6.15కి అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుందిప్రమాదంలో ఎలాంటి కుట్ర కోణం లేదు👉కిషన్‌రెడ్డి పరామర్శఅగ్నిప్రమాదం జరగడం దురదృష్టకరం.ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు స్పందించి ఉంటే ప్రాణ నష్టం జరగకుండా ఉండేదిసమయానికి అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి రీచ్ కాలేదుబాధాకరమైన విషయం ఇదికేంద్రం తరఫున బాధిత కుటుంబానికి అండగా ఉంటాంఫైర్ శాఖ వద్ద సరైన ఫైర్ పరికరాలు లేకపోవడంతో తీవ్రత పెరిగిందిఫైర్ టెక్నాలజీని పెరుగుపరుచుకోవాలి.ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలి. ఒకే కుటుంబానికి చెందినవారు ఎంతో కాలం ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు.👉పాతబస్తీ మీర్చౌక్లో పెను విషాదం చోటు చేసుకుంది. ఆదివారం ఉదయం గుల్జార్‌హౌస్ మొదటి అంతస్తులో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 17మంది మృతి చెందారు. 👉అగ్నిప్రమాదంలో ఏసీ కంప్రెసర్ పేలింది. ఈ దుర్ఘటనలో ఘటనా స్థలంలో ముగ్గురు మృతి చెందగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఆరుగురు మరణించారు. మరణించిన వారిలో ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు సమాచారం. ఫైర్ యాక్సిడెంట్ చిన్నదే అయినా భవనంలో 30 మంది ఉండడంలో ప్రాణనష్టం భారీ ఎత్తున జరిగింది. 👉ప్రమాద సమయంలో ముగ్గురు చిన్నారులు సహా మొత్తం 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ క్షతగాత్రుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అగ్నిమాద బాధితుల్ని రక్షించేందుకు అగ్నిమాపక సిబ్బంది సహాయ చర్యలు ముమ్మరం చేశారు. 👉ప్రమాదంపై ఫైర్ డీజీ నాగి రెడ్డి మాట్లాడారు. ఫైర్ సిబ్బంది 25 మందికి పైగా కాపాడారు. అపస్మారక స్థితిలో ఉన్న 9 మందిని హాస్పిటల్‌కి తరలించాము. పొగ వల్ల ప్రమాద తీవ్రత పెరిగిందని అన్నారు. మృతుల వివరాలుఅగ్ని ప్రమాదంలో మరణించిన వారిలో అభిషేక్ మోదీ,ఆరుషి జైన్,హర్షాలి గుప్తా,రాజేంద్ర కుమార్,సుమిత్రా,మున్నీ భాయ్,ఇరాజ్లు ఉన్నారు. మృతి చెందిన మరో బాధితుని వివరాలు తెలియాల్సి ఉంది. 👉అగ్నిప్రమాదంలో మంటల్లో చిక్కుకున్న బాధితుల్ని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే మంటల్లో చిక్కుకుని అస్వస్థతకు గురైన బాధితులకు వైద్యం కొనసాగుతుండగా.. మంటల్లో చిక్కుకున్న మరికొంత మందిని రక్షించేందుకు అగ్నిమాపక సిబ్బంది,స్థానికులు ప్రయత్నాల్ని కొనసాగిస్తున్నారు. బాధితులకు తక్షణ వైద్యం అందించేందుకు 14 అంబులెన్స్‌లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రమాదంతో పాతబస్తీలో ట్రాఫిక్ విభాగం ఆంక్షలు విధించింది. ట్రాఫిక్‌ను డైవర్ట్ చేస్తున్నట్లు తెలిపింది.

‘ఆడబిడ్డ నిధి’కి సమాధి
సాక్షి ప్రతినిధి కర్నూలు/ సాక్షి, అమరావతి: సూపర్ సిక్స్ హామీల్లో ప్రధానమైన ‘ఆడబిడ్డ నిధి’ని ఇవ్వలేమని, ఇవ్వాల్సిన అవసరం లేదని సీఎం చంద్రబాబు చేతులెత్తేశారు. అప్పుడు, ఇప్పుడు అంటూ ఏడాది పాటు ఊరిస్తూ వచ్చి తీరా మోసం చేశారు. రాష్ట్రంలో 1.80 కోట్ల మంది మహిళల ఆశలపై నీళ్లు చల్లారు. తన ఆర్థిక సంస్కరణలతో సంపద సృష్టి జరిగిపోతోందని, పేదలందరూ బాగా డబ్బులు సంపాదిస్తున్నారని.. అందువల్ల ఈ నిధి అవసరం లేదని స్పష్టం చేశారు. 2029 నాటికి పేదరికాన్ని నిర్మూలిస్తానని మరోమారు ప్రతినబూనారు. ఒకవేళ అప్పటికి కూడా పేదరికం నుంచి మహిళలు గట్టెక్కకపోతే పీ–4తో ఆడబిడ్డ నిధిని అనుసంధానం చేస్తానని కర్నూలు సభలో చెప్పుకొచ్చారు. చంద్రబాబు మాటలు విన్న మహిళలు ఒకరి మోహం మరొకరు చూసుకుంటూ నిశ్చేష్టులయ్యారు. బాబు వ్యాఖ్యలు వైరల్ కావడంతో శనివారం సాయంత్రం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయం చర్చనీయాంశమైంది.ఎక్కడ నలుగురు మహిళలు కలిసినా కూటమి ప్రభుత్వ మోసం గురించి చర్చించుకుంటున్నారు. స్వచ్ఛ భారత్‌లో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం కర్నూలులో పర్యటించారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సభకు వేలాదిగా డ్వాక్రా మహిళలను తరలించారు. వీరందరి సమక్షంలోనే ‘ఆడబిడ్డి నిధి’ అమలుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ చర్యలతో పేదల ఆదాయం బాగా పెరిగిందని, పేదలు కూడా బాగా డబ్బు సంపాదిస్తున్నారని చెప్పారు. 2029 నాటికి రాష్ట్రంలో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలిస్తానని చెప్పారు.ఒకవేళ అప్పటికీ పేదరికం ఉంటే అప్పుడు ఆడబిడ్డ నిధిని పీ4 (పబ్లిక్ ప్రైవేటు పీపుల్స్ పార్టనర్షిప్)కు అనుసంధానం చేసే ఆలోచన చేస్తానని చెప్పారు. ఈ లెక్కన ఆడబిడ్డ నిధి పథకం అమలు చేసేది లేదని తేల్చి చెప్పారు. ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చిన గడువు ఐదేళ్లు మాత్రమే. 2029లో తిరిగి ప్రజాక్షేత్రంలో ఎన్నికలకు వెళ్లాలి. అప్పటి వరకు ఈ పథకం అమలు చేయరంటే పూర్తిగా ఎగనామం పెట్టినట్లే. చంద్రబాబు ప్రభుత్వం కొలువు దీరి ఏడాది అవుతోంది. ఏడాదిలో ఏ ఒక్క పథకాన్ని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదు.నాడు ఇంటింటా ఈ నిధి గురించి ప్రచారం 2024 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో మహాశక్తి ఆడబిడ్డ నిధి పేరుతో ప్రతి ఇంట్లో 18 ఏళ్లు నిండి 59 ఏళ్లలోపు ఉన్న మహిళలు ఎంత మంది ఉంటే అంత మందికీ నెలకు రూ.1,500 చొప్పున ఇస్తానని చంద్రబాబు ప్రకటించారు. కూటమి మేనిఫెస్టోలో కూడా ఈ అంశాన్ని పేర్కొన్నారు. కూటమి నేతలు ఇల్లిల్లూ తిరిగి ఈ మేరకు ప్రచారం చేశారు. దీంతో ఆశపడి మహిళలు ఆ పార్టీకి ఓట్లేశారు. ఇప్పుడు ఆ హామీని అమలు చేసే అవసరమే లేదని చంద్రబాబు నిర్భీతిగా ప్రకటించేయడం పరిశీలకులను సైతం విస్తుగొలుపుతోంది.1.80 కోట్ల మందికి ఎగనామం 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు ఓటు హక్కు ఉంటుంది. రాష్ట్రంలో 2.07 కోట్ల మంది మహిళలు 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేశారు. 60 ఏళ్లు పైబడిన వారిని మినహాయిస్తే 1.80 కోట్ల మంది మిగులుతారు. వీరికి చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు ఇవ్వాలి. అంటే ఏడాదికి రూ.32,400 కోట్లు బడ్జెట్లో కేటాయించాలి. గత బడ్జెట్లో ఈ పథకం ఊసే లేదు. ఒక్క రూపాయి నిధులు కూడా కేటాయించలేదు. మొన్నటి బడ్జెట్లోనూ ఆ విషయమే లేదు. అంటే ఇప్పటి వరకు రెండేళ్లకు కలిపి ఒక్కొక్కరికి రూ.32 వేల చొప్పున 1.80 కోట్ల మందికి రూ.64,800 కోట్లు కేటాయించాలి. అది జరగలేదు. దీన్నిబట్టి ఆడబిడ్డ నిధి పథకం అమలు చేసేది లేదని స్పష్టమైంది. ఈ విషయాన్నే ఇప్పుడు సీఎం చంద్రబాబు బహిరంగంగా స్పష్టం చేశారు.జగన్ చేశారు.. చంద్రబాబు చేతులెత్తేశారు 2024 ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలనే కాంక్షతో చంద్రబాబు అలవికాని హామీలు ఇచ్చారు. అప్పటి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఇస్తున్న ప్రతీ పథకానికి పేరు మార్చి, నిధులు పెంచి అమలు చేస్తానని నమ్మబలికారు. అమ్మఒడిని తల్లికి వందనం పేరుతో, రైతు భరోసాను అన్నదాత సుఖీభవ పేరుతో.. వైఎస్సార్ చేయూతను ఆడబిడ్డ నిధి పేరుతో హామీ ఇచ్చారు. ‘చేయూత’ ద్వారా జగన్ ప్రభుత్వం 45–59 ఏళ్ల వయస్సున్న వారికి ఏడాదికి రూ.18,750 చొప్పున ఏటా వారి ఖాతాల్లో జమ చేసి.. మాట నిలుపుకుంది. ఇదే పథకానికి ఆడబిడ్డ నిధి పేరుతో నెలకు రూ.1500 చొప్పున ఏడాదికి రూ.1,800 ఇస్తామని చంద్రబాబు చెప్పారు. అంటే జగన్మోహన్రెడ్డి కంటే రూ.750 తక్కువే ఇస్తామన్నారు. సూపర్ సిక్స్‌లో అన్ని పథకాల కంటే అత్యధిక బడ్జెట్ కేటాయించాల్సిన పథకం ఇదే. అత్యంత ఎక్కువ మంది లబ్ధిదారులు ఉన్నదీ ఈ పథకానికే. ఇలాంటి పథకాన్ని అమలు చేయకుండా చంద్రబాబు చేతులెత్తేసి రాష్ట్రంలో 1.80 కోట్ల మంది మహిళలను నిలువునా మోసం చేశారు.బలవంతంగా దుకాణాల మూసివేత కర్నూలు నగరంలో స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు వస్తుండడంతో శనివారం దుకాణాలను మూసి వేయాలని పోలీసులు హుకుం జారీ చేశారు. ఉదయం 12 గంటలకు సీఎం రానున్న నేపథ్యంలో 9 గంటలకే షాపులన్నీ మూయించారు. దీంతో సీ క్యాంపు నుంచి నంద్యాల చెక్‌పోస్టు వరకు యజమానులు దుకాణాలు మూసివేసి వెళ్లిపోయారు. గత ప్రభుత్వంలో పరదాల మాటున సీఎం పర్యటనలు అని గగ్గోలు పెట్టిన పచ్చనేతలు.. ఇప్పుడు ఏకంగా తమ పర్యటనలకు దుకాణాలనే మూసి వేస్తుండటం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది. సీఎం సభకు పలు ప్రాంతాల నుంచి పొదుపు సంఘాల మహిళలను బలవంతంగా తరలించారు. పర్యటన ఆలస్యం కావడంతో ఎండ వేడిమికి తట్టుకోలేక చాలా మంది రేకుల షేడ్లలో, బంద్ చేసిన షాపుల నీడలో తల దాచుకోవాల్సి వచ్చింది. కనీస ఏర్పాట్లు చేపట్టక పోవడంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.నాడు ఆడ బిడ్డ నిధి హామీ ఇలాతెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక మహాశక్తి కింద ఐదు కార్యక్రమాలు అమలు చేస్తాం. 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల మధ్య మహిళలందరికీ... ఒక్కొక్కరికీ నెలకు రూ.1500 చొప్పున ఏడాదికి రూ.18000.. ఇంట్లో ఎంత మంది మహిళలు ఉంటే అందరికీ అందజేస్తాం.– 2024 మార్చి 13వ తేదీన టీడీపీ నిర్వహించిన ‘కలలకు రెక్కలు’ నినాదంతో వెబ్ పోర్టల్‌లో పేర్ల నమోదు కార్యక్రమంలో చంద్రబాబు (చంద్రబాబు మాట్లాడినట్టు ‘ఈనాడు’ దినపత్రిక క్లిపింగ్)⇒ రాష్ట్ర ప్రజల నేటి అవసరాలను తీరుస్తూ.. రేపటి ఆకాంక్షలను సాకారం చేసేలా రూపొందించిన ఈ మేనిఫెస్టోను పక్కాగా అమలు చేస్తాం.– 2024 ఏప్రిల్ 30న ఉమ్మడి మేనిఫెస్టో విడుదల సందర్భంగా పవన్ కళ్యాణ్ (మే 1వ తేదీ ఈనాడు క్లిప్లింగ్)⇒ భవిష్యత్‌కు గ్యారెంటీ–బాబు ష్యూరిటీ నినాదంతో ‘ఆడబిడ్డ నిధి’ నుంచి 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇస్తాం. – రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ–జనసేన నాయకులు ఇంటింటా కరపత్రాల ప్రచారంబకాయిలతో కలిపి ఇవ్వాలిచంద్రబాబునాయుడు ఎన్నికల్లో గెలిచేందుకు లేనిపోని హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకున్నారు. ఇన్నాళ్లూ నిధులు లేవు.. సంపద సృష్టించే మంత్రం ఉంటే చెవిలో చెప్పండి అన్నారు. ఇప్పుడు సంపద సృష్టించేశాం అంటున్నారు. పేదలు బాగా సంపాదిస్తున్నారట! ఇంకా నాలుగేళ్లకు పేదరికం పోకపోతే ఆడబిడ్డ నిధిని పీ4కు లింక్ చేస్తానని చెబుతున్నారు. పీ4 అంటే ప్రైవేటు వ్యక్తులు. వారికి ప్రభుత్వ పథకంతో ఏం సంబంధం? దీన్నిబట్టి పథకానికి పూర్తిగా మంగళం పాడినట్లే. మహిళలకు ఇచ్చిన హామీ మేరకు నెలకు రూ.1500 చొప్పున ఇవ్వాలి. ఇప్పటికే ఏడాది పూర్తయినందున బకాయిలతో కలిపి ఇవ్వాలి. – వి.భారతి, ఏపీ మహిళా సమాఖ్య నగర కార్యదర్శి, కర్నూలుప్రజలు మోసపోయారని తెలుస్తోంది2029లోపు పేదరికాన్ని నిర్మూలిస్తా.. అప్పటికీ పేదరికం ఉంటే అప్పుడు పీ4కు ఆడబిడ్డి నిధిని అనుసంధానం చేస్తానని చంద్రబాబు చెప్పడం సరికాదు. అంటే 2029 లోపు ఆడబిడ్డ నిధి అమలు చేయరా? మీకు ఇచ్చిన గడువే 2028 వరకు. 2029లో ఎన్నికలకు వెళ్లాలి. ఆడబిడ్డ నిధి అనేది ప్రభుత్వ పథకం. పీ4 అనేది పారిశ్రామిక వేత్తలు, ప్రైవేటు వ్యక్తులు చేసే సాయం. ఈ రెండిటిని కలపడం అంటే ఎలా? 18 ఏళ్లు నిండిన ప్రతీ ఆడబిడ్డకు డబ్బులు ఇవ్వాలి. చంద్రబాబు మాటలు వింటుంటే మరోమారు ప్రజలు మోసపోయారని తెలుస్తోంది. – ఎం.శిరీష, ఇందిరాగాంధీ నగర్, కర్నూలుబాబువన్నీ బూటకపు హామీలేగత ఎన్నికల సమయంలో చంద్రబాబునాయుడు రాష్ట్రంలోని 18 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి కింద ఏడాదికి రూ.18,000 ఇస్తానని నమ్మించి మహిళల ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చారు. ఇప్పటి వరకు ఆ ఊసే ఎత్తడం లేదు. ఇప్పుడు పీ–4 స్కీమ్‌తో అనుసంధానం చేస్తానని చెప్పడం చూస్తే ఇదొక మోసపూరిత హామీగా మిగలనుందని అర్థమవుతోంది. అధికారంలోకి రాక ముందు ఒకలా, అధికారంలోకి వచ్చాక మరోలా చంద్రబాబునాయుడు వ్యవహరిస్తున్నారు. మహిళలందరం వచ్చే ఎన్నికల్లో తగిన రీతిలో బుద్ధి చెప్పి తీరుతాం. – ఎస్కే మస్తాన్‌బీ, నెల్లూరుఆడబిడ్డ నిధి ఇవ్వరా?కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ హామీగానే ఉండిపోయింది. ఆడబిడ్డ నిధి ఇస్తానని చెప్పడంతో లక్షలాది మంది ఆడబిడ్డలు ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నారు. సంపద సృష్టించామని చెబుతున్నారుగా.. ఇవ్వండి మరి. మొత్తం బకాయిలతో కలిపి వెంటనే ఇవ్వాలి. – కె.కృష్ణవేణి, దెందులూరు, ఏలూరు జిల్లామాట నిలుపుకోవాలిఅధికారంలోకి రాగానే ఏడాదికి రూ.18,000 చొప్పున ఆడబిడ్డ నిధి పథకం కింద ఇస్తామన్నారు. ఏడాదవుతున్నా దాని ఊసే లేదు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ హామీని అమలు చేయడం లేదు. సూపర్ సిక్స్ పథకాల కోసం అందరం ఎదురు చూస్తున్నాం. కూటమి నేతలు మాటలు చెబుతూ కాలయాపన చేస్తున్నారే గానీ పథకాల గురించి పట్టించుకోవడం లేదు. మాట నిలుపుకోకుండా మోసం చేయడం సరికాదు. – డాలు మనీషా, చిన్న కనుమళ్ల, ప్రకాశం జిల్లా ఈ పథకం అమలు కాదికఆడబిడ్డ నిధి పథకాన్ని ఇప్పటి వరకు అమలు చేయలేదు. ఇంకా పేదరికం ఉంటే పీ4 ద్వారా అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉంది. దీని ప్రకారం దాతలు ముందుకు వస్తే వారికి నచ్చిన వ్యక్తులకే అమలు చేస్తారు. దీని వల్ల నిజమైన లబ్ధిదారులకు అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. అసలు ఇక ఈ పథకం అమలు కాదనిపిస్తోంది. – కర్రి వెంకటలక్ష్మి, సామర్లకోట, కాకినాడ జిల్లామరోసారి మోసం చేస్తున్నారుఅధికారంలోకి వస్తే 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి కింద ఏడాదికి రూ.18,000 చొçప్పున ఇస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా పథకం అమలు చేయలేదు. ఎప్పుడు ఇస్తారో కూడా చెప్పడం లేదు. ఇది చాలా అన్యాయం. పీ4తో ఆడ బిడ్డ నిధిని అనుసంధానిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం చూస్తే మహిళలను మరోసారి మోసం చేస్తున్నారని తెలుస్తోంది. – సూరెడ్డి హైమావతి, మెంటాడ, విజయనగరం జిల్లాప్రభుత్వంపై నమ్మకం పోయింది కూటమి ప్రభుత్వం 18 నుంచి 59 ఏళ్ల మహిళలందరికీ ఏడాదికి రూ.18,000 ఇస్తామని హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చి సంవత్సరం కావస్తున్నప్పటికీ దాని గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. ఎప్పుడు ఇస్తారో చెప్పలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి మాటలతో ఈ పథకం అమలయ్యే సూచనలే కనిపించడం లేదు. ఇలా చేయడం సరికాదు. ఈ ప్రభుత్వంపై నమ్మకం పోయింది. – పి యేసమ్మ, ప్రకాష్ నగర్, కడప

ఇండియన్ ఆర్మీ కీలక ప్రకటన
ఢిల్లీ: ఇండియన్ ఆర్మీ కీలక ప్రకటన చేసింది. పాక్‌తో కాల్పుల విరమణకు గడువు లేదని స్పష్టం చేసింది. ఈ రోజు డీజీఎంవో చర్చలు లేవని తెలిపింది. కాల్పుల విరమణ కొనసాగుతుందని పునరుద్ఘాటించింది.పహల్గాం ఉగ్రదాడి (Terrorist Attack) అనంతరం భారత్ చేపట్టిన ప్రతీకార దాడులతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరయ్యింది. ఆపరేషన్ సిందూర్‌తో దాయాది దేశం విలవిల్లాడింది. చివరకు ఉద్రిక్తతలు తగ్గించాలని పాక్ (Pakistan)శరణుగోరింది. పాక్ అర్జించడంతో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. మే 10న ఇరు దేశాల డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMOs) స్థాయిలో కాల్పుల విరమణ అవగాహనపై ఒప్పందం కుదర్చుకున్నాయి. ఈ తరుణంలో కాల్పుల విరమణ అవగాహనకు ముగింపు తేదీ లేదని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. Some media houses are reporting that the ceasefire between India and Pakistan is ending today. In addition, queries are also being received if a DGMO-level talk is scheduled today.According to the Indian Army, no DGMO talks are scheduled today. As far as the continuation of a…— ANI (@ANI) May 18, 2025

కేతిరెడ్డి పెద్దారెడ్డికి లేఖ.. వివాదాస్పదంగా తాడిపత్రి ఎస్పీ తీరు!
సాక్షి, అనంతపురం: వైఎస్సార్సీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి విషయంలో పోలీసులు మరోసారి చేతులెత్తేశారు. కేతిరెడ్డి పెద్దారెడ్డికి రక్షణ కల్పించలేమని స్వయంగా ఎస్పీ జగదీష్ లేఖ రాశారు. ఈ క్రమంలో తాడిపత్రి పర్యటనను వారం లేదా పది రోజులు వాయిదా వేసుకోవాలని ఎస్పీ జగదీష్ సూచించడం గమనార్హం.ఏపీలో కూటమి సర్కార్ పాలనలో పోలీసులు తీరు వివాదాస్పదంగా మారుతోంది. ఇప్పటకే ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నేతలను అక్రమ కేసులతో టార్గెట్ చేసి అరెస్ట్ చేస్తుండగా.. మరోవైపు, భద్రత కల్పించడంలో కూడా పోలీసులు విఫలమవుతున్నారు. తాజాగా కేతిరెడ్డి పెద్దారెడ్డికి ఎస్పీ జగదీష్ రెండోసారి లేఖ రాశారు. లేఖలో పెద్దారెడ్డికి రక్షణ కల్పించలేమని తెలిపారు. తాడిపత్రి పర్యటనను వారం లేదా పది రోజులు వాయిదా వేసుకోవాలని మాజీ ఎమ్మెల్యేకు సూచించారు. టీడీపీ మహానాడు, రాప్తాడు జంట హత్యలు, ఎంపీపీ ఉప ఎన్నికల దృష్ట్యా భద్రత కల్పించలేమని చెప్పుకొచ్చారు.ఇదిలా ఉండగా.. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి తాడిపత్రి వెళ్లేందుకు భద్రత కల్పించాలని ఇప్పటికే హైకోర్టు ఆదేలిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పెద్దారెడ్డి తాను తాడిపత్రి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఇప్పటికే ఎస్పీకి తెలిపారు. అయిన్పటికీ ఎస్పీ ఇదే తీరుగా వ్యవహరిస్తూ వివాదంలో చిక్కుకుంటున్నారు. వివిధ కారణాలు చూపి భద్రత కల్పించలేమని చెప్పుకుంటూ వస్తున్నారు. ఇక, అంతకుముందు కూడా పెద్దారెడ్డి తాడిపత్రి పర్యటనకు భద్రత కల్పించలేమంటూ చేతులెత్తేశారు ఎస్పీ జగదీష్. ఈ నెల తొమ్మిదో తేదీన సీఎం చంద్రబాబు పర్యటన ఉన్నందున భద్రత ఇవ్వలేమని ఎస్పీ తెలిపారు. ఎస్పీ లేఖతో పెద్దారెడ్డి తాడిపత్రి పర్యటన వాయిదా పడింది.మరోవైపు.. తాడిపత్రి వస్తే అంతుచూస్తామంటూ తాడిపత్రి టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి పదేపదే బెదిరిస్తున్నారు. పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లడానికి హైకోర్టు అనుమతి ఇచ్చినా.. తాను మాత్రం దాడులు చేస్తానని జేసీ బహిరంగంగా సవాల్ చేశారు. పెద్దారెడ్డికి ఎవరూ మద్దత ఇవ్వొద్దని, తనకు పెద్దారెడ్డితో గొడవలు ఉన్నాయని, ఒకవేళ వస్తే తిరిగి వెళ్లడు అంటూ వార్నింగ్ ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. తాడిపత్రి వెళ్లడానికి హైకోర్టు అనుమతిచ్చిన క్రమంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇలా వ్యాఖ్యానించడం ఏంటో అర్థం కావడం లేదని పలువురు విమర్శిస్తున్నారు.

పరాయి దేశానికి ఆడుతూ సెంచరీల మోత మోగించిన భారత బ్యాటర్లు
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ లీగ్-2 2023-27లో భాగంగా నిన్న (మే 17) కెనడాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో యూఎస్ఏ ప్రాతినిథ్యం వహిస్తున్న భారత క్రికెటర్లు స్మిట్ పటేల్, మిలింద్ కుమార్ సెంచరీలతో చెలరేగిపోయారు. ఫ్లోరిడా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన అమెరికా.. ఓపెనర్ స్మిట్ పటేల్ (137 బంతుల్లో 152 నాటౌట్; 12 ఫోర్లు, 4 సిక్సర్లు), ఐదో నంబర్ ఆటగాడు మిలింగ్ కుమార్ (67 బంతుల్లో 115 నాటౌట్; 12 ఫోర్లు, 5 సిక్సర్లు అజేయ సెంచరీలతో శివాలెత్తిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 361 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన కెనడా.. సంజయ్ కృష్ణమూర్తి (3.2-0-10-3), కెంజిగే (10-0-41-2), మిలింద్ కుమార్ (9-0-40-2), హర్మీత్ సింగ్ (10-1-38-2), జస్దీప్ సింగ్ (7-0-35-1) సత్తా చాటడంతో 46.2 ఓవర్లలో 192 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా యూఎస్ఏ 169 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.ఈ మ్యాచ్‌లో మిలింద్, స్మిట్ పటేల్ రికార్డు సెంచరీలతో కదంతొక్కడంతో యూఎస్ఏ వన్డేల్లో తమ అత్యధిక స్కోర్‌ను (361) నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో 60 బంతుల్లో సెంచరీ పూర్తి చేసిన మిలింద్.. వన్డేల్లో యూఎస్ఏ తరఫున వేగవంతమైన సెంచరీని నమోదు చేశాడు. ఈ క్రమంలో మిలింద్ టీమిండియా మాజీ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్ రికార్డును సమం చేశాడు. వన్డేల్లో రెండో వేగవంతమైన సెంచరీ చేసిన ఇండియన్ బార్న్ బ్యాటర్‌గా సెహ్వాగ్ సరసన నిలిచాడు. సెహ్వాగ్ 2009లో న్యూజిలాండ్‌పై 60 బంతుల్లో సెంచరీ చేశాడు. వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఇండియన్ బార్న్ ప్లేయర్ రికార్డు విరాట్ కోహ్లి (52 బంతులు) పేరిట ఉంది.ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ పూర్తి చేసేందుకు 44 బంతులు తీసుకున్న మిలింద్.. ఆతర్వాత హాఫ్ సెంచరీని కేవలం 16 బంతుల్లో పూర్తి చేశాడు. ఈ క్రమంలో మిలింద్ ఓ ఓవర్లో (48వ ఓవర్లో) 4 సిక్సర్లు, 2 ఫోర్లు సహా 30 పరుగులు పిండుకున్నాడు. స్మిట్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో అతను చేసిన అజేయమైన 152 పరుగుల స్కోర్ క్రికెట్ వరల్డ్‌కప్ లీగ్-2 చరిత్రలోనే రెండో అత్యుత్తమం.

Vidyapati Review: వీడు మామూలోడు కాదు
ఓటీటీలో ఇది చూడొచ్చు అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో కన్నడ చిత్రం విద్యాపతి ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.ఎవరికైనా ఆశ ఉండొచ్చు, అత్యాశ పనికి రాదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ చాలామంది తమ తక్షణ అవసరాల కోసం అత్యాశకు పోయి అనర్థాలు కొని తెచ్చుకుంటుంటారు. ఆ తరువాత బాధ పడుతుంటారు. వాళ్ళలో కొద్దిమంది మాత్రమే తాము చేసిన తప్పులను సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఆ కోవకు చెందిన కథే ‘విద్యాపతి’(Vidyapati ). ఇది ఓ కన్నడ సినిమా. ఇషాన్ ఖాన్, హసీమ్ ఖాన్ సంయుక్తంగా దర్శకత్వం వహించిన చిత్రం ‘విద్యాపతి’. నాగభూషణ, మలైకా వసుపాల్ ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించారు. ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమా తెలుగులోనూ లభ్యమవుతోంది. యాక్షన్ కామెడీ నేపథ్యంలో సాగే చిత్రం ఇది. దర్శకులు ఈ స్క్రీన్‌ప్లేని సరదా సరదాగా తీసుకువెళ్ళారు. అసలీ ‘విద్యాపతి’ సినిమా కథేంటంటే... విద్య అనే సినిమా హీరోయిన్ పెద్ద స్టార్. ఆ హీరోయిన్ని అల్లరి చిల్లరగా తిరిగే హీరో మోసం చేసి పెళ్ళి చేసుకుంటాడు. అంతేనా... పెళ్ళి చేసుకుని ఆ అమ్మాయికి సంబంధించిన సినిమా వ్యవహారాలతోపాటు ఆస్తి పైన అప్పనంగా పెత్తనం చెలాయిస్తుంటాడు. అలా చెలాయిస్తూనే తన పేరును విద్యకు అనుసంధానంగా విద్యాపతిగా మార్చుకుని చెలామణి అవుతాడు. కానీ ఎప్పుడూ టైమ్ ఒకేలా ఉండదు కదా. విద్యకి విద్యాపతి చేసిన మోసం తెలిసి, తన ఇంటి నుండి గెంటేస్తుంది. అప్పటిదాకా ఫైవ్ స్టార్ భోగాలు అనుభవించిన విద్యాపతి తినడానికి, ఉండడానికి కూడా గతి లేక తన ఇంటికి వెళతాడు. విద్యాపతి తండ్రి బిరియానీ బండి నడుపుతుంటాడు. ఇంటికి తిరిగి వచ్చిన కొడుకును అసహ్యించుకుంటాడు. తెలివొచ్చే టైమ్‌లో అన్నీ తెలిసొస్తాయన్నట్టు మన విద్యాపతి కళ్ళు నేల మీదకు వచ్చి విద్య దగ్గర తన లవ్‌ను ప్రూవ్ చేసుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. మరి... విద్యాపతి ప్రయత్నం ఫలించిందా లేక బెడిసికొట్టిందా అనేది మాత్రం సినిమాలోనే చూడాలి. ఓ మంచి లైన్‌తో దర్శకులు చక్కటి హ్యూమర్‌ను జోడించి, సినిమాను సరదాగా రూపొందించారు. గుడ్ మూవీ ఫర్ ది వీకెండ్. – హరికృష్ణ ఇంటూరు

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం.. యువతితో మస్క్‌పై పుతిన్ కుట్ర?
వాషింగ్టన్: సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంపై పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. యుద్ధం ప్రారంభంలో రహస్యాల్ని తెలుసుకునేందుకు అపర కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon musk)పై రష్యా యువతితో వలపు వల విసిరినట్లు మాజీ ఎఫ్‌బీఐ కౌంటర్ ఇంటెలిజెన్స్ స్పెషల్ ఏజెంట్ జోనాథన్ బౌమా సంచలన వ్యాఖ్యలు చేశారు.జర్మన్ బ్రాడ్‌కాస్టర్ జెడ్‌డీఎఫ్ తీసిన డాక్యుమెంటరీలో జోనాథ్ బౌమా మాట్లాడారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ యుద్ధానికి సంబంధించిన రహస్య సమాచారాన్ని సేకరించేందుకు ప్రయత్నించారు. ఇందులో భాగంగా రష్యా ఇంటెలిజెన్స్ సాయంతో ఎలాన్ మస్క్, పేపాల్ సహ వ్యవస్థాపకుడు పీటర్ థీల్‌పై ఓ యువతి ప్రయోగించారు. మస్క్‌కు ఉన్న జూదం,మత్తు పదార్ధాల వినియోగంలాంటి వీక్నెస్ను అడ్డం పెట్టుకుని యుద్ధం సమాచారం సేకరించే ప్రయత్నం చేసినట్లు వెల్లడించారు. పుతిన్‌కు ఆపరేషన్ గురించి తెలుసా?ఇక మస్క్, పీటర్ థీల్‌పై జరిగిన ఈ సీక్రెట్ ఆపరేషన్ పుతిన్ కనుసన్నల్లోనే జరిగింది. పుతిన్ అనుమతి లేకుండా స్పై చేయరు కదా? అని జోనాథన్ బౌమా అన్నారు. అయితే, రష్యా జరిపిన సీక్రెట్ ఆపరేషన్‌లో మస్క్, పీటర్ థీల్ చిక్కుకున్నారా? లేదా? అనే విషయాల్ని వెల్లడించేందుకు జోనాథన్ బౌమా విముఖత వ్యక్తం చేశారు.కాగా, ఎఫ్‌బీఐలో 16 ఏళ్లు పని చేసిన జోనాథ్ బౌమా ఓ మీడియా సంస్థకు రహస్య సమాచారాన్ని అందించారు. దీంతో అమెరికా ప్రభుత్వం జోనాథ్ బౌమాను అరెస్ట్ చేసింది. చివరకు లక్షడాలర్ల పూచికత్తుతో బెయిల్‌పై విడుదలయ్యారు.

ఎస్బీఐ-అపోలో కొత్త క్రెడిట్ కార్డు.. బెనిఫిట్స్ ఇవే..
న్యూఢిల్లీ: ప్రముఖ క్రెడిట్ కార్డుల జారీ సంస్థ ఎస్బీఐ కార్డ్, దిగ్గజ రిటైల్ ఫార్మసీ చెయిన్ అపోలో హెల్త్‌కో కీలక భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగా అపోలో ఎస్బీఐ కార్డ్ సెలెక్ట్ కార్డ్‌ను ఆవిష్కరించాయి. ఈ కార్డ్ ద్వారా అపోలో ఫార్మసీతో పాటు అపోలో 24/7 యాప్‌లో ఆకర్షణీయమైన ఆఫర్లు పొందవచ్చు. ఫార్మసీ ఉత్పత్తులు, ఆరోగ్య పరీక్షలు, ఇతర పలు రకాల సేవలకు చెల్లింపులు చేయొచ్చు.అపోలో ఎస్బీఐ సెలెక్ట్ క్రెడిట్ కార్డును రూపే, మాస్టర్‌కార్డ్ ప్లాట్‌ఫామ్స్‌పై తీసుకొచ్చారు. ఈ కార్డ్ ద్వారా ఎంపిక చేసిన హెల్త్, వెల్నెస్ ఉత్పత్తుల కొనుగోలుపై 25 శాతం వరకూ ఆదా చేసుకోవచ్చు. అలాగే అపోలో 24|7 యాప్, రిటైల్ స్టోర్లలో కొనుగోలుపై రివార్డ్స్ పాయింట్స్‌గా 10 శాతం, హెల్త్ క్రెడిట్స్ రూపంలో 15 శాతం వరకూ తిరిగి పొందవచ్చు. అలాగే వెల్కమ్ గిఫ్ట్ కింద రూ.1,500 విలువ చేసే ఇ–గిఫ్ట్ వోచర్ లభిస్తుంది.అపోలో 24|7 యాప్, ఎస్బీఐ కార్డ్ వెబ్సైట్లలో డిజిటల్‌గా ఈ అపోలో ఎస్బీఐ సెలెక్ట్ క్రెడిట్ కార్డును పొందవచ్చు. అలాగే కొన్ని ఎంపిక చేసిన అపోలో ఫార్మసీ స్టోర్లలో వ్యక్తిగతంగానూ వీటిని తీసుకోవచ్చు. ఈ కార్డ్ వార్షిక ఫీజు రూ.1499. దీనికి ట్యాక్స్‌లు అదనం.సంవత్సరానికి రూ.3 లక్షలకు మించి ఖర్చు చేస్తే వార్షిక ఫీజు మినహాయింపు పొందవచ్చు.

ఇది స్టేట్ ఫ్యాక్షనిజం కాదా?
ప్రభుత్వ యంత్రాంగంలో ముఠా తత్వాన్ని ప్రవేశపెడితే ఎలా ఉంటుంది? అచ్చంగా నేటి ఆంధ్రప్రదేశ్ పరిపాలన మాదిరిగా ఉంటుంది. కక్షలూ, కార్పణ్యాలూ, ప్రత్యర్థుల వేటలే ప్రధానాంశాలుగా సర్కారు ఎజెండాను ఆక్రమించాయి. ప్రజా శ్రేయస్సు గురించి మాట్లాడడం కూడా ఇప్పుడు అప్రకటిత నిషేధిత జాబితాలో చేరిపోయినట్టుంది. ఏలినవారిచ్చిన హామీల అమలు గురించి ప్రశ్నించడం కూడా నేరమైపోతున్నది. కేసుల బెత్తం కళ్లెర్రజేస్తున్నది. జైళ్లు నోళ్లు తెరుస్తున్నాయి.వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి, నందిగం సురేశ్, సుధారాణి, కృష్ణవేణి, రవీందర్‌రెడ్డి... ఇలా ఎంతమంది గొంతుకలపైకి ఫ్యాక్షన్ సర్కార్ పంజా విసిరిందో చూస్తూనే ఉన్నాము. అస్మదీయ బూతు జాగిలాలు మాత్రం ఎంతయినా పెట్రేగిపోయే వెసులు బాటును కల్పించారు. మొక్కుబడిగా ఒక్క పచ్చి బూతు జాగి లాన్ని అత్తారింటికి పంపినట్టు ఓ నాలుగు రోజులు లోపలికి పంపించి, సగౌరవంగా విడిచిపెట్టేశారు. ఈ బూతుశ్రీ కంటే కరుడుగట్టిన తీవ్రవాదులా... వంశీ, పోసాని, నందిగం వగైరాలు?కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి కాకముందే చంద్రబాబు అరెస్టుకు ప్రతీకారం తీర్చుకోవాలన్న దుగ్ధ ప్రభుత్వ యంత్రాంగంలో కనిపిస్తున్నది. యెల్లో మీడియాలో జ్వలిస్తు న్నది. అందుకు అవకాశమున్నదా అనే మీమాంస అవసరం లేదు. తాము కోరుకున్నట్టుగా కేసులు రాసుకోవడానికి గత ప్రభుత్వం అమలుచేసిన మద్యం పాలసీని ఎంచుకున్నారు. నిజానికి జగన్ ప్రభుత్వ పాజిటివ్ అంశాల్లో మద్యం పాలసీ కూడా ఒకటి. ఒక పాజిటివ్ అంశాన్ని నెగెటివ్ కోణంలో చూపెట్టడానికి రోజుకో సారా మజిలీ కథను, పూటకో పుక్కిటి పురాణాన్ని ప్రభుత్వ యంత్రాంగం వండి వార్చడం, యెల్లో మీడియా వడ్డించడం ఒక దైనందిన దైవకార్యంగా చేపట్టినట్టు కనిపిస్తున్నది. తాజాగా రిమాండ్ రిపోర్టుల పేరుతో వెలువ రిస్తున్న ఫిక్షన్ సాహిత్యంతో కొంతమందినైనా గందరగోళానికి గురి చేయాలనే ఉద్దేశం కనిపిస్తున్నది.జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అమలుచేసిన మద్యం విధా నంలో గందరగోళానికి గురి కావలసినంత సంక్లిష్టత ఏమీ లేదు. సామాన్యుడికి కూడా అర్థమయ్యే సులభమైన విధానం అది. మద్యం మహమ్మారి విష ప్రవాహానికి సంసారాలు ఛిద్రమవు తున్నాయనే మహిళల ఆక్రందనను ‘పాదయాత్ర’ సందర్భంగా జగన్ గమనించారు. దీనికి ముగింపు పలకడం కోసం మద్య నిషేధం విధించాలనే ఆలోచన చేశారు. అయితే గత అనుభవాల దృష్ట్యా ఎకాయెకిన నిషేధించడం సాధ్యమయ్యే పని కాదని, ఆచరణాత్మక పద్ధతిలో దశలవారీ నిషేధాన్ని ఎంచుకున్నారు. మద్యం షాపుల సంఖ్యను తగ్గించారు. లాభాపేక్షతో దొంగ చాటు అమ్మకాలు, కల్తీ వంటివి జరగకుండా ప్రైవేట్ వ్యాపా రాన్ని తొలగించి ప్రభుత్వ పరిధిలోకి అమ్మకాలను తీసు కొచ్చారు. ఫలితంగా 43 వేల బెల్ట్‌షాపులను విజయవంతంగా మూసివేయడం సాధ్యపడింది. విచ్చలవిడిగా మద్యం తయారీని నిరుత్సాహపరచడానికి ఒక్క డిస్టిలరీకి కూడా కొత్తగా అనుమతి నీయలేదు. మద్యం దుకాణాల సంఖ్యను కూడా గణనీయంగా పది శాతం కంటే ఎక్కువగానే తగ్గించారు. వాటికి అనుబంధంగా ఉండే పర్మిట్ రూములూ మూతపడ్డాయి. దుకాణంలో అమ్మ కాలు జరిగే సమయాన్ని తగ్గించి, రాత్రి 9 గంటలకే మూసే శారు. టీడీపీ హయాంలో అనధికారికంగా 24 గంటలూ మద్యం అమ్మకాలు సాగేవి. వ్యాపారులంతా టీడీపీ అనుయాయులే కనుక, పైదాకా మామూళ్లు ఇచ్చేవారే కనుక ఈ వేళల నియంత్రణ సాధ్యం కాలేదు.జగన్ ప్రభుత్వ చర్యల పర్యవసానంగా మద్యం విక్రయాలు గణనీయంగా పడిపోయాయి. చంద్రబాబు సర్కార్ చివరి సంవత్సరంలో (2018–2019) ఐఎమ్ఎఫ్ఎల్, బీర్లు కలిపి 6 కోట్ల 61 లక్షల కేసుల అమ్మకాలు జరిగితే, జగన్ ప్రభుత్వ చివరి సంవత్సరానికి (2023–24) 4 కోట్ల 44 లక్షలకు పడిపోయింది. అంటే అమ్మకాల్లో మూడో వంతు తగ్గింది. దశలవారీ మద్య నిషేధం అనే జగన్ సర్కార్ పెట్టుకున్న ఒక లక్ష్యంలో దీన్నొక పెద్ద ముందడుగుగా పరిగణించాలి.వినియోగం ఇంత తగ్గినా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం తగ్గలేదు. పైపెచ్చు గణనీయంగా పెరిగింది. మద్యాన్ని తయారు చేసే డిస్టిలరీలకు కొత్తగా ఒక్క అనుమతిని కూడా జగన్ ప్రభుత్వం ఇవ్వలేదు. అధిక లాభాలకోసం విచ్చలవిడిగా అమ్మకాలు సాగించే ప్రైవేట్ వ్యక్తులను ఈ వ్యాపారం నుంచి తప్పించారు. మొత్తం విధానం ఇంత పారదర్శకంగా ఉన్న ప్పుడు స్కామ్ ఎక్కడ జరిగే అవకాశముందన్న ప్రశ్నల జోలికి కూటమి సర్కార్ గానీ, దర్యాప్తు చేస్తున్న సిట్ బృందం కానీ వెళ్లదలచుకోలేదు.జగన్ ప్రభుత్వ హయాంలో చంద్రబాబును అరెస్టు చేశారు కనుక, ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవలసిందే, కేసులు నడపాల్సిందే అన్నట్టుగా వారి వైఖరి కనబడుతున్నది. మద్యం అమ్మకాల్లో జగన్ ప్రభుత్వం 3 వేల కోట్ల స్కామ్‌కు పాల్పడిందని అధికారంలోకి వచ్చిన నెల రోజులకే చంద్రబాబు తేల్చిపారేశారు. జూలైలో శ్వేతపత్రం పేరుతో జరిగిన కార్యక్ర మంలో ఆయన ఈ లెక్క చెప్పారు. ఆయన నోటివెంట వచ్చిన ‘అంకె’ను నిజం చేయడానికి దర్యాప్తు బృందం ఇప్పుడు కథలు అల్లుతున్నట్టు కనిపిస్తున్నది. ఈ కేసులో ప్రభుత్వ ఖజానా నుంచి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడానికి తీసుకున్న నిర్ణయం ఏమన్నా ఉన్నదా? నిబంధనలకు విరుద్ధంగా ప్రజా ధనాన్ని ఎవరికైనా దోచిపెట్టిన అంశం ఇమిడి ఉన్నదా? లంచా లకు ఆశించి ప్రైవేట్ వ్యక్తులకు వనరుల్ని కట్టబెట్టిన వైనం ఈ కథలో కనబడుతున్నదా? మరి స్కామ్ ఎక్కడ?చంద్రబాబును అరెస్టు చేసిన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఇందుకు పూర్తిగా భిన్నమైనది. రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ కోసం జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీ ఉదారంగా సాయం చేస్తున్నదనీ, ఇందులో పది శాతం నిధుల్ని సమకూర్చితే వాళ్లు 90 శాతం విడుదల చేస్తారనీ ఓ కట్టుకథను అల్లిపెట్టారు. సీమెన్స్ కంపెనీ ఆ తదనంతర కాలంలో స్వయంగా ఖండించడం వల్ల ఇది కట్టుకథని రూఢి అయింది. పది శాతం కింద రూ.371 కోట్లను విడుదల చేయాలని ముఖ్యమంత్రి కార్యా లయం నుంచి ఆర్థిక శాఖకు ఆదేశాలు వెళ్లాయి. సదరు సీమెన్స్ నిధులను విడుదల చేయకముందే పది శాతాన్ని విడుదల చేయడం నిబంధనలకు విరుద్ధమన్న అభ్యంతరాలను తోసి పుచ్చి నిధుల విడుదలకు ముఖ్యమంత్రి కార్యాలయం ఒత్తిడి చేసింది.పైగా తాము చెబుతున్న సీమెన్స్ కంపెనీకి కాదు, మధ్యలో ఓ బ్రోకర్ కంపెనీకి ఈ నిధులు బదిలీ చేశారు. అక్కడి నుంచి అందులో 241 కోట్ల రూపాయలు పుణె, అహ్మదా బాదుల్లోని షెల్ కంపెనీల ద్వారా ప్రయాణించి దుబాయ్,సింగపూర్ కంపెనీలకు చేరుకున్నాయని, ఆ పిదప చేరాల్సిన చివరి మజిలీకి కూడా చేరుకున్నాయని సీఐడీ ఆధారాలతో నిరూపించింది. 241 కోట్లతో స్కిల్ డెవలప్మెంట్కు అవస రమైన పరికరాలు కొనుగోలు చేసినట్టు పుణె షెల్ కంపెనీ నకిలీ ఇన్వాయిస్లు సృష్టించి ఈడీకి దొరికిపోవడంతో ఈ బాగోతం డొంకంతా కదిలింది. చంద్రబాబు అరెస్టు వెనుక ఇంత నిరూ పణ ఉన్నది.జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన మద్యం పాలసీలో ఒక లక్ష్యం ఉన్నది. ఒక సదుద్దేశం ఉన్నది. ఆ లక్ష్యసాధనలో అనుకున్న మేరకు విజయం సాధించారు కూడా! ఇందులో ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టే అంశం లేదు. స్కామ్ జరగ డానికి కూడా అవకాశాలు లేవు. చంద్రబాబు సర్కార్ 2015లో మద్యం దుకాణాలు, బార్లపై విధించే ప్రివిలేజ్ ఫీజును తొల గిస్తూ ఒక రహస్య జీవోను విడుదల చేసింది.ఇందులో దురుద్దేశం ఉన్నది. డబ్బు సంపాదించే లక్ష్యం కనిపిస్తున్నది. మద్యం దుకాణాలు గానీ, బార్లు గానీ వాటి ఏడాది టార్గెట్‌ను మించి అమ్మకాలు సాగిస్తే ఆ అదనపు అమ్మకాలపై ప్రభుత్వాలు ప్రివిలేజ్ ఫీజు వసూలు చేసేవి. ప్రభుత్వానికి ఇదొక ఆదాయ వనరుగా ఉండేది. చీకటి జీవో ద్వారా చంద్రబాబు ఆ ఫీజును మాఫీ చేశారు. తద్వారా నాలుగేళ్లలో ఖజానాకు 5 వేల కోట్లు నష్టం జరిగిందని అంచనా!ఖజానాకు గండి పడినందువలన ప్రైవేట్ వ్యాపారులు లాభపడ్డారు. తమకు లాభాలు తెచ్చిపెట్టే నిర్ణయాన్ని తీసుకు న్నందుకు ప్రైవేట్ వ్యక్తులు లంచాలు చెల్లించే అవకాశం ఉంటుందా? ఉండదా? దాన్ని స్కామ్ అంటారా, లేదా? అట్లాగే 2014–2019 మధ్యకాలంలో 200 రకాల దిక్కుమాలిన బ్రాండ్లు రంగప్రవేశం చేశాయి. దీనివల్ల లాభాలు పొందింది డిస్టిలరీల వాళ్లు! ఏపీకి మద్యం సరఫరా చేస్తున్న 20 డిస్టిలరీలలో 14 చంద్రబాబు హయాంలో అనుమతి తెచ్చుకున్నవేనని సమా చారం. మిగిలిన ఆరు వేర్వేరు సమయాల్లో అనుమతి పొందాయి.జగన్ అనుమతించిన డిస్టిలరీ ఒక్కటి కూడా లేదు. ఈ విషయాలను పరిశీలించినప్పుడు ఎవరిది పారదర్శక విధా నమో, ఎవరిది కుంభకోణ విధానమో గ్రహించడం బ్రహ్మ విద్యేమీ కాదు. ప్రస్తుత లిక్కర్ కేసు నమోదు వెనుక రాజకీయ దురుద్దేశా లున్నాయని పిటిషనర్లు ప్రాథమికంగా రుజువు చేయగలిగారని సర్వోన్నత న్యాయస్థానం కూడా శుక్రవారం నాడు వ్యాఖ్యానించినట్టు వార్తలు వచ్చాయి. సాక్షులనూ, సహ నిందితులనూ ఫలానా విధంగా వాఙ్మూలం ఇవ్వాలని ఒత్తిడి చేయడం గానీ, బెదిరించడం గానీ, ప్రలోభపెట్టడం గానీ చేయవద్దని ఏపీ సీఐడీని సర్వోన్నత న్యాయస్థానం హెచ్చరించింది.రిమాండ్ రిపోర్టుల పేరుతో స్వీయ కవితల్ని ప్రచారం చేస్తున్నారని వినిపిస్తున్న ఆరోపణలకు సుప్రీం వ్యాఖ్యలు బలం చేకూర్చి నట్లయింది. అసలు స్కామ్‌కు అవకాశమే లేనిచోట ఏదో తవ్వి తీస్తామని షో నడపడం వెనుక అసలు ఉద్దేశం వేరు. ఈ పేరుతో కీలక వ్యక్తులను అరెస్టు చేసి, ప్రధాన ప్రతిపక్ష శ్రేణుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడం మొదటిది. తమ పరిపాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చడం రెండవది.కూటమి ప్రభుత్వం ఏడాది పాలన ఓ వైఫల్యాల పుట్ట. అవినీతి విశృంఖలంగా మారింది. చిరువ్యాపారులు 30 పర్సెంట్ ‘యెల్లో ట్యాక్స్’ కట్టలేక అల్లాడుతున్నారు. చికెన్, మటన్ అమ్మేవాళ్లను కూడా వదిలిపెట్టడం లేదు. జీఎస్టీ దూరని చోటుకి కూడా ‘యెల్లో ట్యాక్స్’ దూసుకుపోతున్నది. రైతాంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతున్నది. లాభసాటి సంగతి దేవుడెరుగు, గిట్టుబాటు ధర కూడా దక్కలేదు. పేదవర్గాల పరిస్థితి మరింత దారుణం. ‘సంపద’ సృష్టించి సంక్షేమ పథకా లను అమలు చేస్తామని చెప్పారు. ఏడాది గడిచిపోయింది. ‘తల్లికి వందనం’ ఈ జూన్‌కు రెండేళ్ల బకాయి పడింది.80 లక్షల మంది బడిపిల్లలకు 30 వేల చొప్పున చెల్లించాల్సి ఉన్నది. ‘అన్నదాతా సుఖీభవ’ కింద ఇరవై వేల చొప్పున రెండేళ్ల నిధులను ఈ జూన్‌లో జమ చేయవలసి ఉన్నది. అలాగే ‘ఆడబిడ్డ నిధి’ కూడా! ‘పీ–ఫోర్’ పథకం తెచ్చాం, డబ్బున్న వాళ్లు తృణమో పణమో ధర్మం చేస్తే ‘ఆ సంక్షేమం’తో పండగ చేసుకోవచ్చని ఇవ్వాళ కర్నూలులో చంద్రబాబు చెప్పారు.స్వయానా శాసనసభ డిప్యూటీ స్పీకర్ నియోజకవర్గంలో దశాబ్దాలుగా పేదలు నివాసముంటున్న గృహాలను అధికారులు నేలమట్టం చేస్తుంటే ఇదేమి అన్యాయమని ప్రశ్నించే దిక్కు కూడా లేదు. పేద బిడ్డలకు నాణ్యమైన విద్య కోసం గత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను అటకెక్కించారు. పేద ప్రజల వ్యతిరేక విధానాలు రాజ్యమేలుతున్నాయి. ఉద్దేశపూర్వ కంగానే రైతాంగాన్ని దివాళా తీయించి రోడ్డెక్కించే పాలసీ అమలవుతున్నది. క్షయరోగంతో తీసుకుంటున్నవాడి నెత్తిన కిరీటం పెడితే అతడు వెలిగిపోతాడా? అమరావతిలో నాలుగు బంగళాలు కడితే రాష్ట్రంలోని విశాల ప్రజానీకం అభివృద్ధి చెందినట్టేనా? ... ఇటువంటి ప్రశ్నలు వేసే గొంతులు నొక్కే రాజ్యవిధానం ఇప్పుడు ఏపీలో అమలవుతున్నది.రాజ్యమే ఒక ఫ్యాక్షనిస్టు అవతారమెత్తి పరిపాలిస్తున్నది. ఎదురు మాట్లాడితే కేసులతో, కటకటాలతో బెదిరిస్తున్నది. ఈ ఫ్యాక్ష నిజం కేవలం ప్రతిపక్ష రాజకీయ నేతల్నే టార్గెట్ చేయడం లేదు. గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన ఐఏఎస్, ఐపీఎస్ అధికా రులను కూడా వేటాడుతున్నది. ఇది భారతదేశంలో ఎన్నడూ, ఎక్కడా జరగని దారుణం. ముఠా తత్వానికి పరాకాష్ఠ. ఈ మూడేళ్లూ (జమిలితో 2028లో ఎన్నికలు జరిగే అవకాశం) ఎటువంటి ప్రతిఘటనా లేకుండా అమరావతి రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగిపోవాలని ఫ్యాక్షన్ పాలన భావిస్తున్నది. అందుకు ఢిల్లీ ఆశీస్సుల కోసం యువనేత శని వారం నాడు కుటుంబ సమేతంగా ప్రధానిని కలిశారు. తమరు అనుమతిస్తే ఏడాది ఉత్సవాల వెంటనే పట్టాభిషేకం చేసుకుంటానని అందుకు ఆశీర్వాదం కావాలని అడిగి ఉంటారని అంచనా. కుదరకపోతే ఈ నెలాఖరున కడపలో జరిగే ‘మహా నాడు’లో పార్టీ అధ్యక్ష స్థానమైనా యువగళానికి దక్కుతుందంటున్నారు. ఆ వెంటనే కూటమి ఏడాది పండుగ. ఇటువంటి పర్వదినాలు నిర్విఘ్నంగా గడిచిపోవాలనీ, ఎటువంటి నిరస నలూ వినిపించకూడదనీ ‘నిశ్శబ్దీకరణ’ కార్యక్రమాన్ని ఫ్యాక్ష నిస్టు ప్రభుత్వం దీక్షతో అమలుచేస్తున్నది.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com

చాయ్ చమక్కులు..! ఏమి'టీ' వింతలు!
‘ఏ చాయ్ చటుక్కున తాగరా భాయ్/ ఈ చాయ్ చమక్కులే చూడరా భాయ్’ అనే సినీగీతం చాలామందికి తెలిసినదే! చాయ్ చమక్కులు చాలానే ఉన్నాయి. చాయ్ చరిత్ర కూడా చాలానే ఉంది. మే 21న ప్రపంచ తేనీటి దినోత్సవం సందర్భంగా కొన్ని చాయ్ చమక్కులు మీ కోసం...చాయ్, టీ అనే పదాలతో పిలుచుకునే తేనీరు చాలామందికి అభిమాన పానీయం. చాయ్, టీ– ఈ రెండు పదాలూ తేయాకుకు పుట్టినిల్లయిన చైనాలోనే పుట్టాయి. ఓడమార్గం వర్తకుల ద్వారా ‘టీ’ అనే మాట పాశ్చాత్య ప్రపంచంలో ప్రాచుర్యం పొందింది. ‘చాయ్’ అనే మాట సిల్క్‌రూట్ ద్వారా భారత్ సహా పలు ఆసియన్ దేశాలకు వ్యాపించింది. తొలి రోజుల్లో డచ్ వర్తకులు చైనాతో నౌకా వాణిజ్యం సాగించేవారు. వారు ఎక్కువగా చైనా తీర ప్రాంతంలోని ఫుజియన్ మాండలికం మాట్లాడే వర్తకులతో లావాదేవీలు జరిపేవారు. వారు తేయాకుకు, తేనీటికి ‘టీ’ అనే మాటను ఉపయోగించేవారు. వారి ద్వారా ఈ మాట ఇంగ్లిష్ సహా పలు యూరోపియన్ భాషలకు చేరింది. భూమార్గంలో సిల్క్‌రూట్ గుండా చైనాకు వచ్చే విదేశీ వర్తకులు ఎక్కువగా చైనాలో మాండరిన్ చైనీస్ భాష మాట్లాడే వర్తకులతో లావాదేవీలు సాగించేవారు. వారి ద్వారా ‘చాయ్’ మాట భారత్ సహా పలు ఆసియా దేశాలకు, అరబ్ దేశాలకు వ్యాపించింది. ఎన్నో రకాలు.. ఎన్నో రుచులుప్రపంచవ్యాప్తంగా మూడువేలకు పైగా తేయాకు రకాలు ఉన్నాయి. వీటిలో ఆరు రకాలు బాగా ప్రాచుర్యం పొందాయి. బ్లాక్ టీ, గ్రీన్ టీ, ఉలాంగ్ టీ, వైట్ టీ, పూఎయిర్ టీ, యెల్లో టీ రకాలు ఎక్కువగా వాడుకలో ఉన్నాయి. ఈ ఆరురకాలు మాత్రమే కాకుండా, రకరకాల తేయాకుల నుంచి రకరకాల రుచులతో తయారు చేసే తేనీటి పానీయాలు కూడా వాడుకలో ఉన్నాయి. ప్రపంచంలో విస్తృత ప్రాచుర్యం పొందిన రకాలు, అరుదైన రకాల తేనీటి పానీయాలు కొన్నింటి గురించి తెలుసుకుందాం...పూఎయిర్ టీచైనాలో దొరికే అరుదైన తేయాకుతో దీనిని తయారు చేస్తారు. క్రీస్తుశకం ఏడో శతాబ్ది నుంచి ఇది వాడుకలో ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి. ఈ రకం తేయాకు ఎంత పాతబడితే దీనితో తయారు చేసే టీ అంత రుచిగా ఉంటుందని చైనీయుల నమ్మకం. పూఎయిర్ టీని ‘గోంగ్‌ఫు చా’ అని కూడా అంటారు. వేడి నీటితో శుభ్రం చేసిన పాత్రలో ముందుగా ఈ రకం తేయాకును వేసి, అందులో మరుగుతున్న నీటిని పోస్తారు. తేయాకు మరుగునీటిలో ఐదు నిమిషాలు నానిన తర్వాత వడగట్టి, కప్పుల్లో పోసుకుని తాగుతారు. చైనాలోని యునాన్ ప్రావిన్స్‌లో ఈ రకం తేయాకు ఎక్కువగా దొరుకుతుంది. యునాన్ ప్రావిన్స్‌లో ఈ తేనీటిని పులియబెట్టి, తాగే ముందు మరిగించి సేవించే పద్ధతి కూడా ఉంది. ఇది జీర్ణసమస్యలకు విరుగుడుగా పనిచేస్తుందని చైనీయుల నమ్మకం.బటర్ టీఇది టిబెట్ ప్రాంతంలో బాగా ప్రాచుర్యంలో పొందిన సంప్రదాయ పానీయం. జడలబర్రె వెన్నకు, కొద్దిగా బార్లీ పొడి, ఉప్పు జోడించి, వెన్నను బాగా చిలికి, మరుగుతున్న బ్లాక్ టీలో వేస్తారు. కొందరు ఇందులో పాలు, పంచదార కూడా జోడిస్తారు. పొద్దున్నే ఈ బటర్ టీ తాగితే రోజంతా ఉత్సాహంగా ఉంటుందని, ఒంట్లోని శక్తి తరిగిపోకుండా ఉంటుందని చెబుతారు. ఇటీవలి కాలంలో డెయిరీ ఫామ్స్‌లో దొరికే వెన్నను ఉపయోగించి కూడా బటర్ టీని తయారు చేస్తున్నారు.చా యెన్ఇది థాయ్‌లాండ్‌లో ప్రసిద్ధి పొందిన పానీయం. గాఢంగా తయారు చేసిన బ్లాక్‌టీలో చక్కెర, పాలు కలిపి, అనాసపువ్వు వంటి సుగంధ ద్రవ్యాలను జోడించి మరిగిస్తారు. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులో మంచుముక్కలు వేసుకుని శీతల పానీయంలా సేవిస్తారు. కొందరు దీనికి పసుపు, నారింజ ఫుడ్‌కలర్స్‌ను కూడా జత చేస్తారు.చాయ్ఇది మన భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందిన పానీయం. చాయ్ అన్నా, టీ అన్నా మనకు తెలిసిన పద్ధతి ఒకటే! తేయాకు పొడివేసి మరిగించిన నీటిలో పాలు, పంచదార కలిపి తయారు చేస్తారు. కొన్ని చోట్ల ఈ తేనీటికి బాగా దంచిన అల్లం జోడించి అల్లం టీ తయారు చేస్తారు. ఇంకొన్ని చోట్ల సుగంధ ద్రవ్యాల పొడులు జోడించి, మసాలా చాయ్ తయారు చేస్తారు. చాయ్ ఒకరకంగా మన జాతీయ పానీయం అనే చెప్పుకోవాలి!రూయిబోస్నిజానికి ఇది తేయాకుతో తయారు చేసే టీ కాదు. ‘రూయిబోస్’ అంటే ఎర్రని పొద అని అర్థం. దక్షిణాఫ్రికాలో పెరిగే రూయిబోస్ ఆకులతో దీనిని తయారు చేస్తారు. మరుగుతున్న నీటిలో ఈ ఆకులను వేసి, మరికాసేపు మరిగిన తర్వాత వడగట్టి కప్పుల్లో పోసుకుని వేడి వేడిగా సేవిస్తారు. ఇందులో కెఫీన్ ఉండదు. కెఫీన్ వద్దనుకునేవారికి ఇది మంచి ప్రత్యామ్నాయం అని చెబుతారు. రూయిబోస్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయని చెబుతారు.వైట్ టీఇది చాలా అరుదైన రకం పానీయం. తేయాకు మొక్కల్లో అత్యంత అరుదైన ‘కేమెలియా సైనెసిస్’ అనే మొక్క నుంచి లేత చిగురుటాకులను, మొగ్గలను సేకరించి, వాటితో వైట్ టీ తయారు చేస్తారు. వైట్ టీ కోసం లేత చిగురుటాకులను, మొగ్గలను వసంతకాలం ప్రారంభమయ్యే సమయంలో సేకరిస్తారు. బ్లాక్ టీ, గ్రీన్ టీల కంటే వైట్ టీ గాఢత చాలా తక్కువగా ఉంటుంది. చైనాలోని ఫుజియన్ ప్రావిన్స్‌లో ఈ అరుదైన తేయాకు ఎక్కువగా దొరుకుతుంది. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని, ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, వాపులను తగ్గించే ఔషధ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని పలు పరిశోధనలు చెబుతున్నాయి.యెల్లో టీతేయాకు మొక్కల నుంచి సేకరించిన లేత ఆకులను ప్రత్యేకమైన పద్ధతిలో ఆరబెట్టి యెల్లో టీకి తగిన తేయాకును తయారు చేస్తారు. కొరియాలో యెల్లో టీ వినియోగం ఎక్కువ. కొరియన్లు దీనిని ‘హ్వాంగ్ చా’ అని, చైనీయులు దీనిని ‘హువాంగ్ చా’ అని అంటారు. తయారీ పద్ధతిలోని కష్టనష్టాల కారణంగా దీని ఖరీదు చాలా ఎక్కువగా ఉంటుంది. మరుగుతున్న నీటిలో ఈ ఆకులను వేసి తేనీటిని తయారు చేస్తారు. ఇది పారదర్శకమైన లేత పసుపు రంగులో ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెబుతారు.∙∙ పురాతన చరిత్రటీ ఆధునిక పానీయమని చాలామంది పొరబడతారు. ఇలా పొరబడటానికి కారణం లేకపోలేదు. మధ్యయుగాల వరకు తేయాకు వినియోగం కేవలం చైనాకు మాత్రమే పరిమితమైంది. డచ్ వర్తకులు, పోర్చుగీసు వర్తకులు క్రీస్తుశకం పదిహేడో శతాబ్ది తొలినాళ్లలో తేయాకును యూరోప్‌కు పరిచయం చేశారు. క్రమంగా ఇది ఇంగ్లండ్‌కు, అక్కడి నుంచి బ్రిటిష్ వలస రాజ్యాలకు చేరింది. అయితే, తేనీటి వినియోగం క్రీస్తుపూర్వం 2732 నాటికే చైనాలో మొదలైనట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఒక అనుకోని సంఘటన వల్ల ఆనాటి చైనా చక్రవర్తి షెన్ నుంగ్కు తేయాకు మహిమ తెలిసివచ్చిందట! ఒకనాడు ఆయన ఆరుబయట కూర్చుని, నీరు మరిగిస్తున్నప్పుడు ఆ నీటిలో ఒక చెట్టు నుంచి రాలిన ఆకులు పడ్డాయి. ఆ నీటిని ఆయన సేవించాడు. దాని రుచి, పరిమళం ఆయనకు తెగ నచ్చాయి. అంతేకాదు, ఆ పానీయం తన శరీరంలోని అణువణువును శోధిస్తున్న అనుభూతి కూడా కలిగిందట! అందుకే ఆయన ఈ పానీయానికి ‘చా’ అని పేరుపెట్టాడు. చైనీస్ భాషలో ‘చా’ అంటే శోధించడం లేదా తనిఖీ చేయడం అని అర్థం. క్రీస్తుశకం పద్నాలుగో శతాబ్దిలో బౌద్ధ గురువు డెంగ్యో దైషీ తొలిసారిగా జపాన్‌కు తేయాకును పరిచయం చేశాడు. ఆయన ద్వారా అనతికాలంలోనే తేనీరు జపనీయుల అభిమాన పానీయంగా మారింది. మిగిలిన ప్రపంచానికి ఇది పరిచయం కావడానికి మాత్రం మరికొన్ని శతాబ్దాల కాలం పట్టింది. ఇరవయ్యో శతాబ్ది నాటికి తేనీటి మహిమ ప్రపంచమంతటికీ తెలిసివచ్చింది. తేయాకు మొక్కలు సాధారణంగా పొదలుగా పెరగడమే చూస్తుంటాం. నిజానికి ఇవి మొక్కలు కావు, చెట్లు. ఇవి వంద అడుగుల ఎత్తువరకు పెరగగలవు. వీటి జీవితకాలం యాభైఏళ్లకు పైగానే ఉంటుంది.గ్రీన్ టీ కోసం సాధారణంగా ఆరబెట్టిన తేయాకునే వాడతారు. జపాన్‌లో అత్యంత అరుదుగా కొందరు తాజా తేయాకును నేరుగా మరిగించి, గ్రీన్ టీ తయారు చేస్తారు. దీనిని ‘టెన్చా’ అంటారు.చైనాలో తడిపి ఆరబెట్టిన తేయాకును ఒత్తిడికి గురిచేసి, కేకుల్లా మార్చి నిల్వచేసేవారు. వీటిని రెండేళ్ల నుంచి యాభయ్యేళ్ల వరకు నిల్వ ఉంచి, తేనీటి తయారీకి వినియోగించేవారు. వీటితో తయారు చేసిన తేనీటిని ‘కొంబూచా’ అంటారు. అలాగే, ఈ తేయాకు కేకులను నగదుగా కూడా ఉపయోగించే వారు.తేయాకు యూరోప్‌కు పరిచయమైన కొత్తరోజుల్లో దీని ఖరీదు చాలా ఎక్కువగా ఉండేది. ఇంగ్లండ్‌లో తేనీటి సేవనం రాచవంశీకులకు, సంపన్నులకు మాత్రమే పరిమితమై ఉండేది. పద్దెనిమిదో శతాబ్దిలో తేయాకు తోటల్లో విందులు జరుపుకోవడం సంపన్నుల వేడుకగా ఉండేది.తేయాకు కోసం బ్రిటన్‌కు, చైనాకు యుద్ధం కూడా జరిగింది. బ్రిటన్‌లో తేయాకుకు గిరాకీ విపరీతంగా పెరిగింది. దిగుమతి చేసుకోవాలంటే, చైనా మాత్రమే ఆధారం. తేయాకు కోసం వెండి రూపంలోనే చెల్లింపులు జరపాలని చైనా బిగదీసుకుంది. బ్రిటిష్ ఖజానాలోని వెండి నిల్వలన్నీ తేయాకుకే ఖర్చవుతుండటంతో బ్రిటిష్ సైన్యం చైనాతో యుద్ధం చేసింది. ‘మొదటి నల్లమందు యుద్ధం’ పేరుతో 1839–42 వరకు చరిత్రలో నమోదైన ఈ యుద్ధానికి అసలు కారణం తేయాకు గిరాకీనే! (చదవండి: వ్యోమయాత్రకు భారతీయుడు)
పాతబస్తీ ప్రమాదంపై మోదీ ఆరా.. బాధితులకు రెండు లక్షల పరిహారం
విరాట్ కోహ్లికి "భారతరత్న" అవార్డు..?
జస్ట్ కాఫీతో బయటపడ్డ నేరం..! కానీ పోలీసులే విస్తుపోయేలా..
తెలంగాణ పోలీసుల ఆపరేషన్.. భారీ పేలుళ్ల కుట్ర భగ్నం
సీజనల్ సైకాలజీ: వేసవి ప్రభావం దీర్ఘకాలం..
టీచర్ పెళ్లిలో ట్విస్ట్.. నేను ప్రేమిస్తున్నా అంటూ ఉపాధ్యాయుడు..
ఆ దంపతుల యావజ్జీవితం నౌకలోనే..!
IPL 2025: ఆర్సీబీ-కేకేఆర్ మ్యాచ్ రద్దు.. రికార్డుల్లోకెక్కిన బెంగళూరు స్టేడియం
'షష్టి పూర్తి' పాటలో సందడిగా రాజేంద్ర ప్రసాద్, అర్చన
శ్రీవారి సేవలో ఆది పినిశెట్టి- నిక్కీ
కోటి ఇస్తావా.. ఫొటోలు అప్లోడ్ చేయమంటావా?
‘పాకిస్తాన్ వద్దే కాదు.. చైనాకు కూడా ఆ సామర్థ్యం లేదు’
కొత్త కరెన్సీ నోట్లు వస్తున్నాయి.. ఆర్బీఐ ప్రకటన
'పద్మ భూషణ్' చేయాల్సిన పనులేనా..? బాలకృష్ణపై విమర్శలు
నెల్లూరులో ప్రసిద్ధ ఆలయం..శనివారం ఒక్కరోజే భక్తులకు దర్శనం (ఫొటోలు)
ఇంగ్లండ్ టూర్‌కు భారత జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
విజయవాడలో బోర్డు తిప్పేసిన నాగరాజు కన్సల్టెన్సీ సంస్థ
మళ్లీ కరోనా మహమ్మారీ పలుదేశాల్లో హై అలర్ట్
..పన్లోపని తుర్కియే అధ్యక్షుడిని కూడా పిలుద్దాం సార్! కొంతకాలం పాలన చూసుకోమని చెబుదాం!
ఈ రాశి వారికి వ్యాపారాలు, ఉద్యోగాలలో అవాంతరాలు తొలగుతాయి.
రోహిత్ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం.. మామగారి వెనుక దాక్కున్న రితిక!
ఇప్పటికైనా తెలిసిందా సార్!.. మీరెంత పేదరికంలో బతుకుతున్నారో!
బట్టతలపై వెంట్రుకలు సాధ్యమే! దువ్వెన్లు సిద్దం చేసుకోండి!
కడప మేయర్ పదవి.. ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు
ఈ రాశి వారికి వ్యాపారాలలో ఊహించని లాభాలు.. ఉద్యోగాలలో హోదాలు
టాలీవుడ్ మూవీలో అలేఖ్య చిట్టి పికిల్స్ ఫేమ్.. ఈవెంట్లో సందడి!
కంబాలపల్లి C/O ప్రభుత్వోద్యోగులు
అదే విషయం చెప్పి చెప్పి నోరు నొప్పెడుతుందట!
రెండు రోజుల్లో ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
పాతబస్తీ ప్రమాదంపై మోదీ ఆరా.. బాధితులకు రెండు లక్షల పరిహారం
విరాట్ కోహ్లికి "భారతరత్న" అవార్డు..?
జస్ట్ కాఫీతో బయటపడ్డ నేరం..! కానీ పోలీసులే విస్తుపోయేలా..
తెలంగాణ పోలీసుల ఆపరేషన్.. భారీ పేలుళ్ల కుట్ర భగ్నం
సీజనల్ సైకాలజీ: వేసవి ప్రభావం దీర్ఘకాలం..
టీచర్ పెళ్లిలో ట్విస్ట్.. నేను ప్రేమిస్తున్నా అంటూ ఉపాధ్యాయుడు..
ఆ దంపతుల యావజ్జీవితం నౌకలోనే..!
IPL 2025: ఆర్సీబీ-కేకేఆర్ మ్యాచ్ రద్దు.. రికార్డుల్లోకెక్కిన బెంగళూరు స్టేడియం
'షష్టి పూర్తి' పాటలో సందడిగా రాజేంద్ర ప్రసాద్, అర్చన
శ్రీవారి సేవలో ఆది పినిశెట్టి- నిక్కీ
కోటి ఇస్తావా.. ఫొటోలు అప్లోడ్ చేయమంటావా?
‘పాకిస్తాన్ వద్దే కాదు.. చైనాకు కూడా ఆ సామర్థ్యం లేదు’
కొత్త కరెన్సీ నోట్లు వస్తున్నాయి.. ఆర్బీఐ ప్రకటన
'పద్మ భూషణ్' చేయాల్సిన పనులేనా..? బాలకృష్ణపై విమర్శలు
ఇంగ్లండ్ టూర్‌కు భారత జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
విజయవాడలో బోర్డు తిప్పేసిన నాగరాజు కన్సల్టెన్సీ సంస్థ
మళ్లీ కరోనా మహమ్మారీ పలుదేశాల్లో హై అలర్ట్
..పన్లోపని తుర్కియే అధ్యక్షుడిని కూడా పిలుద్దాం సార్! కొంతకాలం పాలన చూసుకోమని చెబుదాం!
ఈ రాశి వారికి వ్యాపారాలు, ఉద్యోగాలలో అవాంతరాలు తొలగుతాయి.
రోహిత్ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం.. మామగారి వెనుక దాక్కున్న రితిక!
ఇప్పటికైనా తెలిసిందా సార్!.. మీరెంత పేదరికంలో బతుకుతున్నారో!
బట్టతలపై వెంట్రుకలు సాధ్యమే! దువ్వెన్లు సిద్దం చేసుకోండి!
కడప మేయర్ పదవి.. ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు
ఈ రాశి వారికి వ్యాపారాలలో ఊహించని లాభాలు.. ఉద్యోగాలలో హోదాలు
టాలీవుడ్ మూవీలో అలేఖ్య చిట్టి పికిల్స్ ఫేమ్.. ఈవెంట్లో సందడి!
కంబాలపల్లి C/O ప్రభుత్వోద్యోగులు
అదే విషయం చెప్పి చెప్పి నోరు నొప్పెడుతుందట!
రెండు రోజుల్లో ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
మసూద్ అజార్‌కు రూ.14 కోట్లు
సినిమా

తొలిసారి ఖాకీ డ్రెస్‌లో కనిపించనున్న నయనతార
సౌత్ ఇండియా స్టార్ నటి నయనతార మంచి విజయాన్ని చూసి చాలా కాలమే అయ్యింది. ఆ మధ్య హిందీలో షారుక్‌ఖాన్‌కు జంటగా నటించిన జవాన్ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. అయితే తమిళంలో ఈమె ఇటీవల నటించినా ఏ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. అంతేకాదు నయనతారను ప్రేక్షకులు తెరపై చూసి చాలా కాలమే అయ్యింది. ఆ మధ్య ఉమన్స్ సెంట్రిక్ కథా పాత్రలో నటించినా అన్నపూరిణి చిత్రం, ఇటీవల మాధవన్, సిద్ధార్థ్‌తో కలిసి నటించిన టెస్ట్ చిత్రాలు ఓటీటీకే పరిమితం అయ్యాయి. అవి కూడా పూర్తిగా నిరాశ పరిచాయి. దీంతో ఆమెను వెండి తెరపై చూడడానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈమె చేతిలో ప్రస్తుతం అర డజన్‌కు పైగా చిత్రాలు ఉన్నా, ఇప్పట్లో ఏదీ తెరపైకి వచ్చేలా కనిపించడం లేదు. కాగా ప్రస్తుతం నయనతార నటిస్తున్న చిత్రాల్లో మూక్కుత్తి అమ్మన్ 2 (అమ్మోరు2) ఒకటి. సక్సెస్ఫుల్ చిత్రాల దర్శకుడు సుందర్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వేల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరి గణేష్ నిర్మిస్తున్నా రు. ఇది రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రం అని సమాచారం. కాగా ఇంతకు ముందు మూక్కుత్తి అమ్మన్ చిత్రంలో నయనతార దేవతగా నటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా దానికి సీక్వెల్‌గా రూపొందుతున్న మూక్కుత్తి అమ్మన్2 చిత్రంలో నయనతార ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం. అందులో ఒకటి దేవత పాత్ర కాగా, మరొకటి పోలీస్ అధికారి పాత్ర అని తెలిసింది. దీంతో ఈమె తొలిసారిగా ఖాకీ డ్రెస్‌లో కనిపించబోతున్నారన్నమాట. ఇంతకుముందు హిందీ చిత్రం జవాన్‌లో పోలీస్ అధికారిగా నటించిన అందులో ఖాకీ దుస్తులు ధరించలేదు. అలాగే నయనతార ద్విపాత్రాభినయం చేయడం ఇది రెండోసారి. ఇంతకుముందు ఐరా చిత్రంలో ద్విపాత్రాభియం చేశారు. కాగా మూక్కుత్తి అమ్మన్ 2 చిత్రంలో నయనతారతో పాటు ఇండియా యోగిబాబు సింగం పులి కన్నడ నటుడు దునియా విజయ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. చిత్రంలో గ్రాఫిక్స్ సన్నివేశాలు మరో హైలెట్‌గా ఉంటాయని సమాచారం.

నో అప్డేట్!
హీరోల పుట్టినరోజు వస్తోందంటే అభిమానుల జోష్ మామూలుగా ఉండదు. తమ అభిమాన హీరో నటిస్తున్న సినిమాల నుంచి కొత్తపోస్టర్, టైటిల్, టీజర్... ఇలా ఏదో ఒక అప్డేట్ వస్తుందని ఆశిస్తుంటారు. అయితే ఈసారి ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు ఈ హీరో నటిస్తున్న తెలుగు సినిమా అప్డేట్ ఏమీ ఉండదు. ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎన్టీఆర్ నీల్’ (వర్కింగ్ టైటిల్).ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టి. సిరీస్ ఫిల్మ్స్ సమర్పణలో కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్నారు. కాగా ఈ నెల 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ‘ఎన్టీఆర్ నీల్’ నుంచి అప్డేట్ ఉంటుందని ఫ్యాన్స్ ఆశించారు. అయితే.. ఆ రోజు ఎటువంటి అప్డేట్ ఉండదని మేకర్స్ స్పష్టం చేశారు.హృతిక్ రోషన్, ఎన్టీఆర్ నటించిన హిందీ చిత్రం ‘వార్ 2’ నుంచి ఎన్టీఆర్ అప్డేట్ రానుండటంతో ‘ఎన్టీఆర్ నీల్’ అప్డేట్నిపోస్ట్΄ోన్ చేసినట్లు ప్రకటించారు. ఇక ‘వార్’ ఈ ఏడాది ఆగస్టు 14న, ‘ఎన్టీఆర్ నీల్’ 2026 జూన్ 25న రిలీజ్ కానున్నాయి. ఇదిలా ఉంటే... ఎన్టీఆర్, ప్రియమణి జంటగా, మోహన్‌బాబు, మమతా మోహన్‌దాస్ కీలకపాత్రల్లో రూపొందిన చిత్రం ‘యమదొంగ’. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాని ఎన్టీఆర్ బర్త్ డేని పురస్కరించుకుని నేడు రీ రిలీజ్ చేస్తున్నారు.

సంక్రాంతికి రఫ్ఫాడించేద్దాం
చిరంజీవి హీరోగా రూపొందనున్న తాజా చిత్రం ‘మెగా 157’ (వర్కింగ్ టైటిల్). అనిల్ రావిపూడి దర్శకత్వంలో అర్చన సమర్పణలో సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మించనున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్గా నయనతారను ఖరారు చేసినట్లు ప్రకటించి, స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియోలో నయనతార... తన టీమ్‌తో తెలుగులో మాట్లాడటం, కారు ప్రయాణంలో చిరంజీవి క్లాసిక్పాటలు వినడం, ‘హలో మాస్టర్... కెమేరా కొంచెం రైట్ టర్నింగ్ ఇచ్చుకోమ్మా’ అని చెప్పడం ఆకట్టుకున్నాయి.ఫైనల్‌గా అనిల్ రావిపూడి, నయనతార కలిసి సంక్రాంతికి రఫ్ఫాడించేద్దాం అని చెప్పడంతో ఈ వీడియో ముగిసింది. ‘‘సైరా నరసింహారెడ్డి, గాడ్‌ఫాదర్’ చిత్రాల తర్వాత చిరంజీవి–నయనతార కలిసి మూడోసారి నటించనున్న చిత్రమిది. ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్గా ఉంటుంది. చాలాకాలం తర్వాత చిరంజీవి కంప్లీట్ హ్యూమరస్ రోల్లో కనిపించనున్నారు. త్వరలో షూటింగ్ ఆరంభిస్తాం’’ అని యూనిట్ తెలిపింది. 2026 సంక్రాంతికి రిలీజ్ కానున్న ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమేరా: సమీర్ రెడ్డి.

సాహసం శ్వాసగా సాగిపో...
లక్ష్య సాధన కోసం అడవికి వెళ్తున్నారు హీరోలు. ఒకరిది నిధి అన్వేషణ అయితే, మరొకరిదిపోరాటం. ఇంకొకరిది ఆధిపత్యం... ఇలా తెలుగు హీరోలు తమ తమ లక్ష్య సాధన కోసం అడవి బాట పట్టారు. సాహసమే శ్వాసగా ముందుకు సాగుతున్నారు. ఇలా అడవి మాదే... శత్రువుల వేట మాదే అంటున్న కొందరు తెలుగు హీరోలపై ఓ లుక్ వేద్దాం.ఫారెస్ట్‌లో అడ్వెంచర్ ఫారెస్ట్‌లో మహేశ్‌బాబు ఏదో నిధి కోసం అన్వేషించనున్నారట. మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఓ ఫారెస్ట్ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామా మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రియాంకా చోప్రా, మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఇతర లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఈ సినిమా ఆఫ్రికన్ ఫారెస్ట్ నేపథ్యంలో సాగుతుందని, ఈ చిత్రకథా రచయిత విజయేంద్ర ప్రసాద్ ఓ సందర్భంలో పేర్కొన్నారు. సో... ఈ సినిమాలోని మేజర్ కథను మలుపు తిప్పే కీలక సన్నివేశాలు ఫారెస్ట్ నేపథ్యంతోనే ముడిపడి ఉంటాయనే టాక్ వినిపిస్తోంది.అలాగే ఇటీవల ఈ సినిమాకు చెందిన ఓ భారీ షెడ్యూల్ చిత్రీకరణ హైదరాబాద్‌లో పూర్తయింది. ఓ భారీ సెట్లో ఈ షెడ్యూల్‌ను పూర్తి చేశారు. ఈ షెడ్యూల్లో అడవి బ్యాక్‌డ్రాప్‌లో ఉండే కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారని తెలిసింది. ఇంకా ఈ సినిమా షూటింగ్‌కు ముందు రాజమౌళి కెన్యా వెళ్లి, అక్కడ కొన్ని లొకేషన్స్‌ను చూసి వచ్చారు. ఇలా ఈ సినిమా చిత్రీకరణ విదేశీ అడవుల్లోనూ ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం మహేశ్‌బాబు, రాజమౌళి వేసవి బ్రేక్‌లో ఉన్నారు. ఈ బ్రేక్ పూర్తవగానే మళ్లీ ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభిస్తారు. జూన్ రెండో వారంలో ఈ సినిమా చిత్రీకరణ తిరిగి ప్రారంభం కావొచ్చు.నెక్ట్స్ షెడ్యూల్ కోసం వారణాసిని తలపించేలా హైదరాబాద్ శివార్లలో ఓ భారీ సెట్‌ను తీర్చిదిద్దుతున్నారని, ఈ సెట్లోనే ఈ సినిమా షూటింగ్ ఉంటుందని ఫిల్మ్‌నగర్ సమాచారం. ఈ సినిమాకు విజయేంద్రప్రసాద్, దేవ కట్టా డైలాగ్స్ అందిస్తున్నారు. ఇంగ్లిష్ డైలాగ్స్ కోసం ఓ హాలీవుడ్ రైటర్‌ను నియమించుకోవాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నారట. భారీ బడ్జెట్‌తో కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమా 2027లో విడుదల కానుందని సమాచారం.వీరమల్లు అన్వేషణ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన హిస్టారికల్ ఫిల్మ్ ‘హరిహర వీరమల్లు’. 17వ శతాబ్దం నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుంది. ఈ చారిత్రాత్మక చిత్రంలో పవన్ కల్యాణ్ టైటిల్ రోల్ చేయగా, పంచమి అనేపాత్రలో హీరోయిన్గా నిధీ అగర్వాల్ నటించారు. కాగా ఈ సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలు అడవి నేపథ్యంతో ఉంటాయని తెలిసింది. ఓ నిధి అన్వేషణ కోసం వీరమల్లు తన బృందంతో కలిసి అడవికి వెళ్తాడని, ఆ సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయని ఫిల్మ్‌నగర్ భోగట్టా. ‘హరిహర వీరమల్లు’ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. తొలి భాగం ‘హరిహర వీరమల్లు: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ చిత్రం జూన్ 12న విడుదల కానుంది. క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఏఏమ్ రత్నం సమర్పణలో అద్దంకి దయాకర్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.అడవిలో డ్రాగన్ ఫారెస్ట్‌లో అదిరిపోయే చేజింగ్ ఫైట్ చేస్తున్నారు హీరో ఎన్టీఆర్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ మూవీ ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్). ఇటీవల కర్ణాటక లొకేషన్స్‌లో ప్రారంభమైన ఈ సినిమా చిత్రీకరణలో ఓ ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్ యాక్షన్ సీన్ తీశారని తెలిసింది. ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో ఈ ఫారెస్ట్ చేజింగ్ యాక్షన్ సీక్వెన్స్ ఓ హైలైట్‌గా ఉంటుందని, హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్స్ ఈ యాక్షన్ సీక్వెన్ని డిజైన్ చేశారని తెలిసింది. కాగా లండన్‌లోని ప్రఖ్యాత రాయల్ ఆల్బర్ట్ హాల్లో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా స్క్రీనింగ్‌కి హాజరయ్యారు ఎన్టీఆర్, అలాగే ఈ నెల 20న ఎన్టీఆర్ బర్త్ డే. సో... ఈ రెండు కారణాల వల్ల ఎన్టీఆర్ ‘డ్రాగన్’ సినిమా షూటింగ్‌కు తాత్కాలిక బ్రేక్ ఇచ్చారు.బర్త్ డే సెలబ్రేషన్స్ పూర్తి కాగానే ఎన్టీఆర్ తిరిగి ‘డ్రాగన్’ సినిమా షూటింగ్లోపాల్గొంటారు. ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారని, రష్మికా మందన్నా ఓ కీలకపాత్ర చేయనున్నారని, మలయాళ నటుడు టొవినో థామస్ విలన్‌గా కనిపిస్తారనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక కల్యాణ్‌రామ్, కె. హరికృష్ణ, నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2026 జూన్ 25న విడుదల కానుంది. మరోవైపు ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ‘దేవర’ సినిమాలో కొన్ని ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్ సన్నివేశాలు ఉన్నట్లుగా చూశాం. ఇటీవల ‘దేవర 2’ సినిమాను ఓ సందర్భంగా కన్ఫార్మ్ చేశారు ఎన్టీఆర్. ఇలా వచ్చే ఏడాది ‘దేవర 2’ సినిమా కూడా సెట్స్‌పైకి వెళుతుందని ఊహింవచ్చు. సో... ‘దేవర 2’లోనూ ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉంటాయని ఊహించవచ్చు.అడవిలో జాతర రవితేజ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ మూవీ ‘మాస్ జాతర’. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్నారు. రవితేజ కెరీర్‌లోని ఈ 75వ సినిమాకు భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో లక్ష్మణ్ భేరి అనే పవర్‌ఫుల్‌పోలీస్ ఆఫీసర్‌పాత్రలో రవితేజ కనిపిస్తారు. కాగా ఈ సినిమాలో కూడా అడవి నేపథ్యంతో కూడిన సన్నివేశాలు ఉన్నాయని సమాచారం. అరకు,పాడేరు, ఆంధ్రా–ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల లొకేషన్స్‌లో ‘మాస్ జాతర’ సినిమా చిత్రీకరణ జరిగిందని తెలిసింది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమా టాకీపార్ట్ చిత్రీకరణ దాదాపు పూర్తయింది. సాంగ్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. అతి త్వరలోనే ఈ సాంగ్ షూటింగ్స్ని కూడా పూర్తి చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ‘మాస్ జాతర’ సినిమా జూలై చివర్లో లేదా ఆగస్టులో రిలీజ్ కావొచ్చు.భక్త కన్నప్ప మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’. ఈ సినిమాలో తిన్నడుపాత్రలో కనిపిస్తారు విష్ణు మంచు. దైవత్వాన్ని నమ్మని తిన్నడు శివుడికి ఎలా వీరభక్తుడు అయ్యాడు? భక్త కన్నప్పగా ఎలా ప్రఖ్యాతి చెందాడు? అనే అంశాల ఆధారంగా ‘కన్నప్ప’ సినిమా ఉంటుందని తెలుస్తోంది. కథ రీత్యా ఈ సినిమా మేజర్‌పార్ట్ అంతా అడవి నేపథ్యంతోనే ఉంటుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ఫస్ట్ లుక్పోస్టర్స్.. వంటి ప్రమోషనల్ కంటెంట్... ‘కన్నప్ప’ సినిమా ఫారెస్ట్ నేపథ్యంతోనే సాగుతుందన్న విషయాన్ని మరింతగా స్పష్టం చేస్తున్నాయి. ప్రీతీ ముకుందన్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నారు. మోహన్‌బాబు, మోహన్‌లాల్, ఆర్. శరత్‌కుమార్, బ్రహ్మానందం, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, బ్రహ్మాజీ, రఘుబాబు తదితరులు ఇతర ప్రధానపాత్రల్లో నటించారు. ముఖేష్ కుమార్ దర్శకత్వంలో మోహన్‌బాబు నిర్మించిన ‘కన్నప్ప’ చిత్రం జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.నిధి వేట నిధి వేటలో ఉన్నారట అర్జున్. నాగచైతన్య హీరోగా ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో మిస్టిక్ థ్రిల్లర్ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘వృషకర్మ’తోపాటు మరో రెండు టైటిల్స్‌ను పరిశీలిస్తున్నారట. ఈ చిత్రంలో నిధిని అన్వేషించే అర్జున్‌పాత్రలో నాగచైతన్య, పురావస్తు శాస్త్రవేత్తగా మీనాక్షీ చౌదరి కనిపిస్తారు. ఇలా నిధి అన్వేషణలో భాగంగా అర్జున్ ఫారెస్ట్‌కి వెళతాడట. అక్కడ ఫారెస్ట్‌లో కొన్ని సాహసాలు చేస్తాడట. ఈ సినిమా కోసం ఓ గుహ సెట్‌ను రెడీ చేశారు మేకర్స్. ఈ గుహ సెట్లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ ఈ సినిమాలో చాలా కీలకంగా ఉంటుందని, ఈ సీక్వెన్స్ దాదాపు ఇరవై నిమిషాలు ఉంటుందని తెలిసింది. బాపినీడు సమర్పణలో సుకుమార్, బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది మే లేదా జూన్‌లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.అరణ్యంలో భోగి హీరో శర్వానంద్, దర్శకుడు సంపత్ నంది కాంబినేషన్లో రూపొందుతున్న పీరియాడికల్ రూరల్ యాక్షన్ డ్రామా ఫిల్మ్ ‘భోగి’. 1960 నేపథ్యంలో సాగే ఈ మూవీలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తుండగా, డింపుల్ హయతి మరో కీలకపాత్రలో నటిస్తున్నారు. ఉత్తర తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా కథనం ఉంటుంది. ఈ సినిమా కోసం దాదాపు ఇరవై ఎకరాల్లో ప్రత్యేకమైన విలేజ్ సెట్‌ను ఏర్పాటు చేశారు మేకర్స్. కాగా ఈ సినిమాలోని కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లు, కొంత భాగం అడవి నేపథ్యంలోనే ఉంటాయని తెలిసింది. ఈ మూవీ కోసం శర్వానంద్ ప్రత్యేకంగా మేకోవర్ అయ్యారు. లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో కేకే రాధామోహన్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ద్వితియార్ధంలో రిలీజ్ కావొచ్చు.పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.కిష్కింధపురిలో ఏం జరిగింది? ‘కిష్కింధపురికి’ ప్రేక్షకులను తీసుకు వెళ్లనున్నారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న మిస్టరీ అండ్ హారర్ థ్రిల్లర్ మూవీ ‘కిష్కింధపురి’. ఇటీవల ‘కిష్కింధపురి’ సినిమా గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్ రాత్రివేళ అడవిలోకి వెళ్లడం, అక్కడ వీరిద్దరూ ఎందుకోసమో వెతుకాలడంట వంటి విజువల్స్ కనిపించాయి. చూస్తుంటే... ‘కిష్కింధపురి’ మేజర్ సీన్స్‌లు అడవి నేపథ్యంలో ఉంటాయని, అది కూడా రాత్రివేళ సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయనీ తెలుస్తోంది.అర్చన సమర్పణలో సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాదిలోనే విడుదల కానుంది. అలాగే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ‘హైందవ’ అనే మూవీ రూపొందుతోంది. లుధీర్ బైరెడ్డి దర్శకత్వంలో మహేశ్ చందు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నాలుగువందల ఏళ్ల క్రితం నాటి గుడి నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందట. ఈ సినిమాలోనూ ఫారెస్ట్ ఎపిసోడ్స్ ఉన్నాయని తెలిసింది. ఈ ఏడాదే ఈ సినిమా విడుదల కానుంది.కింగ్డమ్ విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఇది. ఈ సినిమా రెండు డిఫరెంట్ టైమ్ లైన్స్‌లో జరుగుతుందని, ఫ్లాష్ బ్యాక్ టైమ్‌లైన్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు అడవి నేపథ్యంతోనే ఉంటాయని ఫిల్మ్ నగర్ సమాచారం. పైగా ‘కింగ్డమ్’ సినిమా టీజర్లోనూ అడవిని తలపించే కొన్ని షాట్స్ కనిపించాయి. అలాగే ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ క్యారెక్టరైజేషన్లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయని తెలిసింది. ఈ చిత్రంలో భాగ్యశ్రీ భోర్సే హీరోయిన్గా నటిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం జూలై 4న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. ఇలా అడవి నేపథ్యం, అడవి సన్నివేశాలు కీలకంగా సాగే మరికొన్ని సినిమాలు ఉన్నాయి. – ముసిమి శివాంజనేయులు
న్యూస్ పాడ్‌కాస్ట్
క్రీడలు

‘మరింత మంది కోహ్లిలు వస్తారు’
హైదరాబాద్: భారత క్రికెట్లో విరాట్ కోహ్లిది ఒక ప్రత్యేక అధ్యాయమని, అతని బాటలో మరెంతో మంది యువ క్రికెటర్లు వెలుగులోకి వస్తారని హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ అభిప్రాయపడ్డారు. ఇటీవలే టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లిపై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. ‘కోహ్లి అద్భుతమైన ఆటగాడు. అతని కవర్‌డ్రైవ్ ఎంతో చూడముచ్చటగా ఉంటుంది. ఇకపై టెస్టుల్లో అలాంటివి చూడలేము. బౌలర్ల తల మీదుగా అతను ఆడే స్ట్రెయిట్ షాట్ కూడా నాకు చాలా నచ్చుతుంది. అయితే మన దేశంలో ప్రతిభకు కొదవ లేదు.ఎంతో మంది కోహ్లిలు ఉన్నారు. వారంతా మున్ముందు వెలుగులోకి వచ్చి దేశానికి ఆడతారు’ అని ఒవైసీ వ్యాఖ్యానించారు. ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) విద్యార్థిగా ఉన్నప్పుడు మీడియం పేసర్‌గా సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ అండర్–25 టోర్నీలో ఆడిన ఒవైసీ... జాతీయ స్థాయి యూనివర్సిటీ వన్డే టోర్నీ విజ్జీ ట్రోఫీలో కూడా ఓయూకు ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిపోవడంతో క్రికెట్ కెరీర్ ముగిసింది. భారత క్రికెట్లో ఇప్పుడు గొప్ప దశ నడుస్తోందని, ప్రతిభ ఉంటే చాలు ఏ స్థాయికైనా చేరవచ్చని హైదరాబాదీ పేస్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ చూపించాడని ఒవైసీ అన్నారు. ‘పేదరిక నేపథ్యం నుంచి వచ్చిన సిరాజ్ తన కఠోర శ్రమతో ఈ స్థాయికి చేరాడు. టెస్టుల్లో 100 వికెట్ల మైలురాయిని అందుకోగలిగిన అతనిది గొప్ప ప్రస్థానం. ఎందరికో స్ఫూర్తిదాయకం. సిరాజ్ భారత్‌కు మరిన్ని విజయాలు అందించాలి’ అని ఒవైసీ ఆకాంక్షించారు.

నిధి నాయకత్వంలో...
బెంగళూరు: ఈ ఏడాది డిసెంబర్లో జరిగే మహిళల జూనియర్ ప్రపంచకప్ టోర్నమెంట్‌కు సన్నాహాల్లో భాగంగా భారత జట్టు ఈ నెలలో నాలుగు దేశాల టోర్నీలో పోటీపడనుంది. అర్జెంటీనాలోని రొసారియా నగరంలో ఈనెల 25 నుంచి జూన్ 2వ తేదీ వరకు జరిగే ఈ టోర్నీలో భారత్‌తోపాటు అర్జెంటీనా, చిలీ, ఉరుగ్వే జట్లు పాల్గొంటున్నాయి. ఈ టోర్నీలో ఆడనున్న భారత జట్టును శనివారం హాకీ ఇండియా ప్రకటించింది. 24 మంది సభ్యులతో కూడిన టీమిండియాకు గోల్‌కీపర్ నిధి నాయకత్వం వహిస్తుంది. డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరిగే ఈ టోర్నీలో భారత జట్టు తమ తొలి మ్యాచ్‌ను మే 25న చిలీతో ఆడుతుంది. ఆ తర్వాత టీమిండియా వరుసగా ఉరుగ్వేతో (మే 26న), అర్జెంటీనాతో (మే 28న), చిలీతో (మే 30న), ఉరుగ్వేతో (జూన్ 1న), అర్జెంటీనాతో (జూన్ 2న) తలపడతుంది. ‘ఈ టోర్నీ ద్వారా మా అత్యుత్తమ క్రీడాకారిణులు ఎవరో గుర్తిస్తాము. మరో ఆరు నెలల్లో జూనియర్ ప్రపంచకప్ జరగనుంది. తాజా టోర్నీ మన అమ్మాయలకు అంతర్జాతీయ అనుభవం కలిపిస్తుంది’ అని భారత జూనియర్ జట్టు కోచ్ తుషార్ ఖాండ్కర్ తెలిపారు. భారత జూనియర్ మహిళల హాకీ జట్టు: నిధి (కెప్టెన్, గోల్‌కీపర్), ఏంజిల్ హర్షరాణి మింజ్ (గోల్‌కీపర్), మమితా ఓరమ్, లాల్తట్లుయాంగి, మనీషా, పూజా సాహూ, పార్వతి టొప్నో, నందిని, సాక్షి శుక్లా (డిఫెండర్లు), ప్రియాంక యాదవ్, అనీషా సాహూ, రజని కెర్కెట్టా, బినిమా ధన్, ఖైడెమ్ షిలీమా చాను, సంజన హోరో, సుప్రియా కుజుర్, ప్రియాంక డోగ్రా (మిడ్ ఫీల్డర్లు), హీనా బానో, సోనమ్, సుఖ్వీర్ కౌర్, గీతా యాదవ్, లాల్రిన్పుయ్, కనిక సివాచ్, కర్మన్ప్రీత్ కౌర్ (ఫార్వర్డ్లు). స్టాండ్‌బై: విద్యశ్రీ, హుదా ఖాన్, ముని్మని దాస్, సెలెస్టినా హోరో.

విజేత ప్రజ్ఞానంద
బుకారెస్ట్: గ్రాండ్ చెస్ టూర్లో భాగంగా నిర్వహించిన సూపర్‌బెట్ క్లాసిక్ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్ ఆర్.ప్రజ్ఞానంద చాంపియన్‌గా అవతరించాడు. పది మంది మేటి గ్రాండ్‌మాస్టర్ల మధ్య తొమ్మిది రౌండ్లపాటు ఈ టోర్నీ జరిగింది. నిర్ణిత తొమ్మిది రౌండ్ల తర్వాత ప్రజ్ఞానంద, మాక్సిమి లాగ్రెవ్ (ఫ్రాన్స్), అలీరెజా ఫిరూజా (ఫ్రాన్స్) 5.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. దాంతో విజేతను నిర్ణయించేందుకు వీరిద్దరి మధ్య టైబ్రేక్ గేమ్‌లు నిర్వహించారు. అలీరెజాతో గేమ్‌ను ‘డ్రా’ చేసుకున్న ప్రజ్ఞానంద.. లాగ్రెవ్పై గెలిచి 1.5 పాయింట్లతో టైటిల్‌ను ఖరారు చేసుకున్నాడు. విజేత ప్రజ్ఞానందకు 77,667 డాలర్లు (రూ. 66 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ప్రపంచ చాంపియన్, భారత గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ నాలుగు పాయింట్లతో తొమ్మిదో స్థానంలో నిలిచాడు.

ఢిల్లీ క్యాపిటల్స్ కోలుకునేనా!
న్యూఢిల్లీ: ఐపీఎల్–2025ను ఢిల్లీ క్యాపిటల్స్ ఘనంగా ప్రారంభించింది. తొలి 4 మ్యాచ్‌లలో వరుస విజయాలు సాధించి జోరు ప్రదర్శించింది. అయితే తర్వాత జట్టు ఫామ్ ఒక్కసారిగా తిరోగమించింది. తర్వాత 7 మ్యాచ్‌లలో ఢిల్లీ కేవలం 2 మాత్రమే గెలవగలిగింది. హైదరాబాద్‌లో జరిగిన తమ చివరి పోరులో కూడా క్యాపిటల్స్ 133 పరుగులకే పరిమితమై ఓటమికి బాటలు వేసుకుంది. అయితే అదృష్టవశాత్తూ వర్షంతో ఆ మ్యాచ్ రద్దు కావడంతో ఊపిరి పీల్చుకుంది. ఇప్పుడు మిగిలిన 3 మ్యాచ్‌లలో గెలిస్తే ఇతర సమీకరణాలతో సంబంధం లేకుండా ‘ప్లే ఆఫ్స్’కు చేరుకునే అవకాశం ఉంటుంది. మరోవైపు గుజరాత్ టైటాన్స్ నిలకడకు మారుపేరులా ఆడుతూ ముందంజ వేసేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండోస్థానంలో ఉన్న ఆ టీమ్ మరో మ్యాచ్ గెలిస్తే చాలు అధికారికంగా ప్లే ఆఫ్స్‌కు చేరుతుంది. ఈ మ్యాచ్‌లోనే దానిని అందుకోవాలని గిల్ బృందం భావిస్తోంది. ముస్తఫిజుర్ దూరం... ఐపీఎల్ కొత్త షెడ్యూల్ కారణంగా ఢిల్లీ ప్రణాళికలు కూడా మారాయి. కీలక సమయంలో జట్టును గెలిపించే సత్తా ఉన్న ప్రధాన పేసర్ మిచెల్ స్టార్క్ ఆ్రస్టేలియాకు వెళ్లిపోయాడు. అతని స్థానంలో బంగ్లాదేశ్ బౌలర్ ముస్తఫిజుర్‌ను ఢిల్లీ ఎంచుకుంది. అయితే శనివారం షార్జాలో టి20 మ్యాచ్ ఆడిన అతను తిరిగి వచ్చి ఈ మ్యాచ్ బరిలోకి దిగే అవకాశం లేదు. దాంతో తుది జట్టులో ముగ్గురు విదేశీయులే ఉండనున్నారు. డుప్లెసిస్, స్టబ్స్ పునరాగమనంతో జట్టు బ్యాటింగ్ బలంగా కనిపిస్తుండగా, పేసర్ చమీరా కూడా ఆడనున్నాడు. అయితే జట్టు విజయావకాశాలు భారత ఆటగాళ్లు పొరేల్, కరుణ్ నాయర్, రాహుల్, కెప్టెన్ అక్షర్ ప్రదర్శనపైనే ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి. విప్రాజ్, అశుతోష్ మిడిలార్డ్‌లో చెలరేగాల్సి ఉండగా... కుల్దీప్ యాదవ్ ఎప్పటిలాగే తన పదును చూపిస్తే ప్రత్యర్థిని కట్టిపడేయవచ్చు. మార్పుల్లేకుండా... టోర్నీ వాయిదా తర్వాత ఎలాంటి ఇబ్బందీ లేకుండా దాదాపు అదే ప్రధాన ఆటగాళ్లతో జట్టును సిద్ధం చేసుకోవడంలో గుజరాత్ సఫలం కావడం విశేషం. మరో మ్యాచ్ గెలిస్తే ముందంజ వేసే టీమ్ మరో రెండు కూడా నెగ్గి టాప్ స్థానంపై గురి పెట్టింది. లీగ్ దశ వరకు బట్లర్, రూథర్‌ఫర్డ్, రబడ, కొయెట్జీ అందుబాటులో ఉంటుండటంతో టైటాన్స్ మేనేజ్మెంట్ ధీమాగా ఉంది. ఓపెనర్లు గిల్, సుదర్శన్ అందిస్తున్న చక్కటి ఆరంభాలు జట్టును ముందంజలో నిలిపాయి. ఆ తర్వాత బట్లర్ మిగిలిన పని పూర్తి చేస్తున్నాడు. సీజన్లో 500 పరుగులు దాటిన టాప్–5లో ముగ్గురు టైటాన్స్ సుదర్శన్, గిల్, బట్లర్ ఉండటం విశేషం. షారుఖ్, తెవాటియా చివర్లో అదనపు పరుగులు జోడించగలరు. ముగ్గురు పేసర్లు ప్రసిధ్, సిరాజ్, అర్షద్ చక్కటి బౌలింగ్ ప్రదర్శన కనబరుస్తుండగా... స్పిన్నర్లు సాయికిషోర్, రషీద్ ఖాన్ తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. బలాబలాలపరంగా చూస్తే టైటాన్స్‌దే పైచేయిగా కనిపిస్తోంది.
బిజినెస్

కన్సల్టెంట్లకు డిమాండ్
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా అనిశ్చితి, జాబ్ మార్కెట్లో అప్రమత్తత నెలకొన్నప్పటికీ తాత్కాలిక ప్రాతిపదికన సేవలందించే కన్సల్టెంట్లు, ఫ్రీలాన్సర్లకు డిమాండ్ గణనీయంగా పెరిగింది. గత ఆర్థిక సంవత్సరంలో కన్సల్టెంట్లకు, ప్రాజెక్ట్‌లవారీగా సేవలందించే వారికి డిమాండ్ 38 శాతం పెరిగింది. అంతక్రితం రెండేళ్లు ఇది సగటున 17 శాతంగానే నమోదైంది. వైట్ కాలర్ గిగ్ సరీ్వసుల ప్లాట్‌ఫాం ‘ఫ్లెక్సింగ్ ఇట్’ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. సాధారణంగా సేవల రంగంలోనే ఫ్రీలాన్సర్లకు ప్రాధాన్యం ఉండేది. కానీ ప్రస్తుతం పారిశ్రామిక, తయారీ రంగాలు కూడా వారి సర్వీసులను పొందడంపై ఆసక్తి చూపుతున్నాయి. గిగ్ వర్కర్లను ఎక్కువగా తీసుకుంటున్న టాప్ –3 రంగాల్లో ఈ రెండూ కూడా వచ్చి చేరాయి. ఎఫ్ఎంసీజీ, కన్సల్టింగ్, బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా), హెల్త్‌కేర్ రంగాల్లో డిమాండ్ పటిష్టంగా కొనసాగుతుండగా.. కొత్తగా పరిశ్రమలు, తయారీ రంగాలు కూడా వారి సేవలను వినియోగించుకోవడానికి ముందుకు వస్తుండటం సానుకూలాంశమని ఫ్లెక్సింగ్ ఇట్ పేర్కొంది. మారుతున్న హైరింగ్ తీరు .. కొత్త టెక్నాలజీలు, మారిపోతున్న మార్కెట్ పరిస్థితులకు వ్యాపార సంస్థలు తమను తాము మల్చుకునే క్రమంలో నియామకాలపరమైన అవసరాలు మారుతున్నాయి. పరిస్థితిని బట్టి అప్పటికప్పుడు నిపుణులను నియమించుకోవడమనేది ప్రత్యర్థి సంస్థలతో పోటీపడటంలో ముందుండేందుకు ఉపయోగపడుతోంది. పలు కంపెనీలు తమ రిక్రూట్మెంట్ విధానాల్లో మార్పులు, చేర్పులు చేస్తున్నాయని ఫ్లెక్సింగ్ ఇట్ పేర్కొంది. పెద్ద ఎత్తున ఫ్రీలాన్సర్ల సేవలు తీసుకుంటున్నాయని వివరించింది. స్పెషలిస్ట్ నైపుణ్యాలున్న వారు అందుబాటులో ఉండటం, వేగవంతంగా అవకాశాలను అందిపుచ్చుకునేందుకు వెసులుబాటు లభిస్తుండటమనేది ఇందుకు దోహదపడుతోందని పేర్కొంది. ఫ్లెక్సింగ్ ఇట్ ప్లాట్‌ఫాంలో వివిధ నైపుణ్యాలున్న 1,00,000 మంది పైగా కన్సల్టెంట్లు అందుబాటులో ఉన్నారు. రిమోట్ వర్కింగ్ వైపు మొగ్గు.. ఉద్యోగులను ఆఫీసులకు రప్పించాలా లేదా ఇంటి నుంచే పని చేసే విధానాన్ని కొనసాగించాలా అనే అంశాలపై కంపెనీలు ఇంకా డైలమాలో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ.. ఫ్రీలాన్సింగ్ విషయంలో రిమోట్ వర్కింగ్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఉంటోంది. ప్రతి నాలుగు ప్రాజెక్టుల్లో ఒకటి పూర్తిగా రిమోట్ ప్రాజెక్టుగా ఉంటోంది. స్ట్రాటెజీ, టెక్నాలజీ, మార్కెటింగ్ విభాగాల్లో పట్టున్న భారతీయ కన్సల్టెంట్లు ఎక్కువగా గ్లోబల్ క్లయింట్లకు సరీ్వసులు అందిస్తున్నారు. ఇలాంటి ప్రాజెక్టుల విషయంలో ఎక్కడి నుంచి పనిచేస్తున్నారు అనే దానికన్నా నైపుణ్యాలే కీలకంగా ఉంటుండటంతో రిమోట్ వర్కింగ్‌కి ప్రాధాన్యత ఉంటోంది. టెక్నాలజీలో అత్యధికం ఫ్రీలాన్సర్లకు డిమాండ్ ఎక్కువగా ఉన్న రంగాల్లో వరుసగా మూడో ఏడాది టెక్నాలజీ విభాగం (25 శాతం) అగ్రస్థానంలో నిల్చింది. కృత్రిమ మేథ వినియోగం, డేటా ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం, డిజిటల్ పరివర్తన ధోరణి పెరుగుతుండటం ఇందుకు కారణం. ఇక స్ట్రాటెజీ..బిజినెస్ డెవలప్మెంట్ (15 శాతం) రెండో స్థానంలో, ఫైనాన్స్ (11 శాతం) మూడో స్థానంలో ఉన్నాయి. ఫ్రీలాన్సింగ్ అనేది కేవలం ప్రత్యేక నైపుణ్యాలు, టెక్నాలజీకి మాత్రమే పరిమితం కావడం లేదని, ఇతరత్రా విభాగాల్లోనూ పెరుగుతోందనేందుకు ఇది నిదర్శనమని ఫ్లెక్సింగ్ ఇట్ తెలిపింది. మరోవైపు, ఫ్రీలాన్సర్ల లభ్యత కూడా గణనీయంగా పెరుగుతోంది. గత రెండేళ్లలో కన్సల్టెంట్ల రిజిస్ట్రేషన్లు 127 శాతం పెరిగాయి. వీరిలో 59 శాతం మందికి పదేళ్ల లోపు అనుభవమే ఉంది. సంప్రదాయ పద్ధతిలో ఒక్కో మెట్టు ఎదుగుతూ పైకెళ్లడం కన్నా స్వతంత్రతను, రకరకాల ప్రాజెక్టులు చేయడం ద్వారా అనుభవాన్ని గడించేందుకు ప్రొఫెషనల్స్ ప్రాధాన్యతనిస్తున్నారు. ఈ ధోరణికి మిలీనియల్స్ శ్రీకారం చుట్టగా, జెన్ జడ్ తరం దాన్ని వేగంగా అందిపుచ్చుకుంటోంది. గతంలో మధ్య స్థాయి, సీనియర్ ప్రొఫెషనల్స్ ఇలా ఫ్రీలాన్సింగ్ బాట పట్టే వారు. కానీ టెక్నాలజీ, మార్కెటింగ్, ఫైనాన్స్‌లాంటి రంగాల్లో నైపుణ్యాలున్న యువత ఫ్రీలాన్సింగ్ వైపు మొగ్గు చూపే ధోరణి పెరుగుతోంది. గత ఆర్థిక సంవత్సరం కన్సల్టెంట్లుగా కొత్తగా రిజిస్టర్ చేసుకున్నవారిలో 38 శాతం మంది మహిళలు ఉన్నారు.

ఏఐ నిపుణులు @ 4 లక్షలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా కృత్రిమ మేథ (ఏఐ) నిపుణుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రస్తుతం వీరి సంఖ్య 4.16 లక్షలకు చేరింది. అయితే నిపుణులు లభిస్తున్నప్పటికీ, డిమాండ్–సరఫరా మధఅయ ఏకంగా 51 శాతం అంతరం ఉంటోంది. భవిష్యత్ అవసరాలకు సన్నద్ధతను పెంచుకోవాల్సిన ఆవశ్యకతను ఇది సూచిస్తోందని స్టాఫింగ్ సేవల సంస్థ క్వెస్ కార్ప్ ఒక నివేదికలో వివరించింది. దీని ప్రకారం ఏఐ నిపుణుల నియామకాలు 2017 నుంచి ఎనిమిది రెట్లు పెరిగాయి. గతేడాది మార్చి నుంచి ఈ ఏడాది మార్చి మధ్య కాలంలో ఏఐ, డేటా నిపుణులకు డిమాండ్ దాదాపు 45 శాతం పెరిగినట్లు క్వెస్ ఐటీ స్టాఫింగ్ సీఈవో కపిల్ జోషి తెలిపారు. జెన్ఏఐ ఇంజినీరింగ్‌లో పది ఉద్యోగావకాశాలు ఉంటే అన్ని అర్హతలు కలిగిన నిపుణుడు ఒక్కరే ఉంటున్నారని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయంగా ఏఐ విప్లవానికి సార్థ్యం వహించే సామర్థ్యాలు భారత్‌కి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయని చెప్పారు. అయితే దీన్ని అందిపుచ్చుకోవాలంటే వ్యాపారవేత్తలు, విద్యావేత్తలు, విధానకర్తలు ఆ దిశగా త్వరితగతిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఆకర్షణీయ వేతనాలు.. ఎంట్రీ లెవెల్ నిపుణులకు వార్షికంగా రూ. 8–12 లక్షల స్థాయిలో వేతనాలు ఉంటున్నాయి. ఇక ఎన్ఎల్పీ, జెన్ఏఐలో 5–8 ఏళ్ల అనుభవమున్న వారికి రూ. 25–35 లక్షల వరకు జీతభత్యాలు ఉంటున్నాయి. అటు ప్రోడక్ట్ సంస్థలు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లలో (జీసీసీ) సీనియర్ ప్రొఫెషనల్స్ రూ. 45 లక్షల పైగా అందుకుంటున్నారు. → ఏఐ నియామకాల్లో బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా (బీఎఫ్ఎస్ఐ) రంగం ముందు వరుసలో ఉంటోంది. దేశీయంగా మొత్తం ఏఐ డిమాండ్‌లో ఈ రంగం వాటా 24 శాతంగా ఉంటోంది. ఆ తర్వాత స్థానాల్లో ఐటీ సరీ్వసులు, హెల్త్‌కేర్ ఉన్నాయి. → డేటా సైంటిస్టులు, ఎంఎల్ ఇంజినీర్లు, ఏఐ డెవలపర్లు, ఏఐ రీసెర్చర్లకు అత్యధికంగా డిమాండ్ ఉంటోంది. ఏఐ ప్రోడక్ట్ మేనేజర్లు, బిజినెస్ అనలిస్టులకు కూడా హైరింగ్ అవకాశాలు బాగుంటున్నాయి. → నైపుణ్యాలపరంగా చూస్తే పైథాన్ ల్యాంగ్వేజ్ ఆధి పత్యం కొనసాగుతోంది. అలాగే టెన్సర్‌ఫ్లో, పై టార్చ్, కేరాస్లాంటి ఫ్రేమ్‌వర్క్‌లకు ప్రాధా న్యం ఉంటోంది. ఎన్ఎల్పీ, కంప్యూటర్ విజన్, జెనరేటివ్ ఏఐ, క్లౌడ్ (ఏడబ్ల్యూఎస్, అజూర్, జీసీపీ), ఎంఎల్ఆప్స్ నైపుణ్యాలను కంపెనీలు కోరుకుంటున్నాయి. → జెన్ఏఐపరమైన నియామకా>ల్లో బెంగళూరు, ఢిల్లీ–ఎన్సీఆర్, హైదరాబాద్ ముందు వరుసలో ఉంటున్నాయి. మెట్రోల పరిధిని దాటి ఏఐ టాలెంట్ హబ్‌లు ఎదుగుతున్నాయనడానికి నిదర్శనంగా మొత్తం ఏఐ డిమాండ్‌లో ద్వితీయ శ్రేణి నగరాల వాటా ఇప్పుడు 14–16 శాతంగా ఉంది. వీటిలోనూ కొచ్చి, అహ్మదాబాద్, కోయంబత్తూర్ నగరాల వాటా 70 శాతంగా ఉంది. → జీసీసీల నుంచి జెన్‌ఏఐకి డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. దేశీయంగా మొత్తం ఏఐ హైరింగ్‌లో జీసీసీల వాటా23 శాతంగా ఉంది. → దేశీయంగా ఏఐ నైపుణ్యాలను పెంపొందించేందుకు మరిన్ని చర్యలు తీసుకోవాలి. విద్యారంగం, పరిశ్రమ వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందాలతో కలిసి పని చేయాలి. పరిస్థితులకు తగ్గట్లుగా నైపుణ్యాలను పెంపొందించే ప్రోగ్రాంలను రూపొందించాలి.

టెలికంలో కొలువుల మేళా..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీ టెలికం రంగంలో భారీ స్థాయిలో నియామకాలు పెరుగుతున్నాయి. 2025 ప్రథమార్ధంలో కంపెనీలు 45 శాతం మంది ఫ్రెషర్లను తీసుకునే యోచనలో ఉన్నాయి. టీమ్‌లీజ్ ఎడ్టెక్ కెరియర్ ఔట్లుక్ నివేదిక (2025 జనవరి–జూన్ ప్రథమార్ధం)లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం, టెలికం రంగం వేగంగా 5జీ నెట్వర్క్, క్లౌడ్ సిస్టమ్స్ వైపు మళ్లుతూ, సైబర్ సెక్యూరిటీకి పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితుల నేపథ్యంలో ఈ పరిశ్రమలో ఉద్యోగాల కల్పన గణనీయంగా ఉంటోంది. హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ, బెంగళూరులో ఫ్రెషర్ల హైరింగ్ స్థిరంగా కొనసాగుతోంది. నైపుణ్యాలకు ప్రాధాన్యత ప్రత్యేక నైపుణ్యాలకు ప్రాధాన్యతనిస్తూ ఆర్ఎఫ్ ఇంజినీర్లు, నెట్వర్క్ సెక్యూరిటీ అనలిస్టులు, ఫీల్డ్ టెక్నికల్ ఇంజినీర్లు, జూనియర్ డెవాప్స్ ఇంజినీర్లు, క్లౌడ్ నెట్వర్క్ ఇంజినీర్లు మొదలైన వారికి డిమాండ్ ఉంటోంది. హైరింగ్‌పై కంపెనీల ఆసక్తి, గతేడాది ద్వితీయార్థంలో (జులై–డిసెంబర్) నమోదైన 48 శాతం నుంచి స్వల్పంగా కాస్త తగ్గినప్పటికీ నియామకాల జోరు మాత్రం కొనసాగుతోంది. ఆర్ఎఫ్ ఇంజినీర్లకు ఢిల్లీ (49 శాతం), అహ్మదాబాద్ (41 శాతం), కోయంబత్తూర్‌లో (35 శాతం) అత్యధికంగా డిమాండ్ నెలకొంది. నెట్వర్క్ సెక్యూరిటీ అనలిస్టులకు బెంగళూరు, ముంబై, నాగ్‌పూర్‌లో వరుసగా 48 శాతం, 43 శాతం, 38 శాతం మేర డిమాండ్ ఉంది. ఇక ఫీల్డ్ టెక్నికల్ ఇంజినీర్లకు హైదరాబాద్ (55 శాతం), కోల్‌కతా (48 శాతం), ఇండోర్‌లో (43 శాతం) ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. జూనియర్ డెవాప్స్ ఇంజినీర్లకు పుణె (44 శాతం), గురుగ్రాం (40 శాతం), కొచి్చలో (35 శాతం) డిమాండ్ ఉంది. అటు క్లౌడ్ నెట్వర్క్ ఇంజినీర్లకు చెన్నై (51 శాతం), నాగ్‌పూర్ (45 శాతం), చండీగఢ్‌లో (37 శాతం) అత్యధికంగా నియామక అవకాశాలు నమోదయ్యాయి. డొమైన్ సర్టిఫికేషన్లు కావాలి.. ఫ్రెషర్లకు టెలికం రంగంలో వివిధ విభాగాలవ్యాప్తంగా ఉద్యోగావకాశాలు ఉంటున్నప్పటికీ, నెట్వర్క్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, డెవాప్స్లాంటి నిర్దిష్ట డొమైన్ నైపుణ్యాలకు ప్రాధాన్యత ఉంటోంది. ఆర్ఎఫ్ వైర్లెస్ ఇంజినీరింగ్, సైబర్‌సెక్యూరిటీ, క్లౌడ్ నెట్వర్క్ ఆర్కిటెక్చర్లో సర్టీఫికేషన్లకు డిమాండ్ నెలకొంది. సంక్లిష్టమైన నెట్వర్క్ వినియోగాన్ని క్రమబద్ధీకరణ, మేనేజ్మెంట్ కార్యకలాపాల నిర్వహణకు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్, టాస్క్ ట్రాకింగ్ ప్లాట్‌ఫాంలు లాంటి టెక్నాలజీ టూల్స్ వినియోగం కీలకంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో కేవలం సాంకేతిక నైపుణ్యాలతో సరిపెట్టుకోకుండా, ఉద్యోగార్థులు అనలిటికల్ రీజనింగ్, పరిస్థితులకు తగ్గట్లుగా తమను తాము మల్చుకోవడం, ఇంటర్‌పర్సనల్ కమ్యూనికేషన్ సహా సాఫ్ట్ స్కిల్స్‌పై కూడా దృష్టి పెట్టాలని టీమ్‌లీజ్ ఎడ్టెక్ వ్యవస్థపకుడు, సీఈవో శంతను రూజ్ తెలిపారు. ‘‘టెలికం పరిశ్రమ వృద్ధి చెందుతున్నప్పటికీ, కంపెనీలు కేవలం కార్యకలాపాల విస్తరణ కోసమే ఉద్యోగులను తీసుకోవడం లేదు. విశిష్టమైన నైపుణ్యాలున్న ప్రతిభావంతులను తీసుకోవడం ద్వారా భవిష్యత్ అవసరాలకు కూడా సర్వసన్నద్ధంగా ఉండాలని భావిస్తున్నాయి. ఆర్ఎఫ్, సైబర్‌సెక్యూరిటీ, క్లౌడ్ ఎకోసిస్టమ్స్లాంటి అంశాల్లో సర్టిఫికేషన్లు ఉన్న ఫ్రెషర్లు అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. ప్రస్తుతం టెలికం విధుల్లో ఐటీ, డేటా కార్యకలాపాలు కూడా కలిసి ఉంటున్నాయి. కొన్నేళ్ల క్రితం ఇలా ఉండేది కాదు. ఇలా మారిన పరిస్థితులను బట్టి బోధనాంశాలను కూడా సవరించడంపై విద్యా సంస్థలు దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అలాగే ఉద్యోగార్థులు కూడా తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలి’’ అని చెప్పారు.

'అమెరికాలో ఉంటున్న భారతీయులకు హెచ్చరిక'
భారతదేశంలోని యూఎస్ రాయబార కార్యాలయం.. అమెరికాలో ఉంటున్న భారతీయులను ఉద్దేశించి కీలక ప్రకటన చేసింది. నిర్దిష్ట గడువు దాటిన తరువాత కూడా అక్కడే (అమెరికాలో) ఉంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.నిర్దిష్ట గడువు తరువాత కూడా అమెరికాలో ఉంటే.. వారిపై బహిష్కరణ వేటు ఉంటుంది. అంతే కాకుండా భవిష్యత్తులో మళ్ళీ అమెరికాలో అడుగు పెట్టడానికి సాధ్యం కాదు, అంటే శాశ్వత నిషేధం ఎదుర్కోవాల్సి వస్తుందని తన ఎక్స్ ఖాతాలో యూఎస్ ఎంబసీ ఇండియా వెల్లడించింది.యూఎస్ ఎంబసీ ఇండియా చేసిన ప్రకటన.. అమెరికాలో విద్యార్థి, పర్యాటక, వర్క్ పర్మిట్ వంటి వీసాలతో ఉంటున్న భారతీయులకు వర్తిస్తుంది. ఆదేశాలను ఉల్లంఘించి ఎవరైనా అక్కడే ఉంటే.. వారు భవిష్యత్తులో ఎప్పుడూ మళ్ళీ అమెరికాలో అడుగుపెట్టలేరు. నిర్దిష్ట గడువు తరువాత.. ఏవైనా అనుకోని ఇబ్బందులు ఎదురైతే, చట్టపరమైన చర్యల నుంచి బయటపడటానికి యూఎస్సీఐఎస్ (U.S. Citizenship and Immigration Services) ని సంప్రదించాలని, యూఎస్ ఎంబసీ ఇండియా పేర్కొంది.ఇదీ చదవండి: ఇదీ పాకిస్తాన్ పరిస్థితి..!వీసా గడువు ముగిసిన తరువాత కూడా దేశంలో ఉంటున్నవారు యూఎస్ విడిచి వెళ్లిపోవాలని.. హోంల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టి నోయెమ్ ఏప్రిల్‌లోనే చెప్పారు. గడువు దాటిన 30 రోజుల వరకు కూడా దేశంలోనే ఉన్నవారు ఫెడరల్ గవర్నమెంట్ వద్ద రిజిస్టర్ చేసుకోవాలి. లేకుంటే.. అలాంటి వారిని క్రిమినల్ కేసులు కింద అరెస్ట్ చేసి జైలులో ఉంచే అవకాశం ఉంది. జరిమానా కూడా విధించవచ్చు.If you remain in the United States beyond your authorized period of stay, you could be deported and could face a permanent ban on traveling to the United States in the future. pic.twitter.com/VQSD8HmOEp— U.S. Embassy India (@USAndIndia) May 17, 2025
ఫ్యామిలీ

వ్యోమయాత్రకు భారతీయుడు
పన్యాల జగన్నాథదాసు..ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అంతరిక్ష ప్రయోగాలకు కేంద్రబిందువుగా ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) తొలిసారిగా ఒక భారతీయుడు వెళ్లనున్నారు. భారతీయ వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన గ్రూప్ కమాండర్ శుభాంశు శుక్లా(Subhanshu Shukla)కు ఈ అరుదైన అవకాశం దక్కింది. సోవియట్ సోయుజ్ టీ–11 ద్వారా రాకేశ్ శర్మ 1984లో తొలిసారిగా అంతరిక్షయానం చేసి వచ్చారు. ఆయన తర్వాత ఇప్పటి వరకు భారత్ నుంచి వ్యోమగాములు ఎవరూ లేరు. ఇన్నాళ్లకు శుభాంశు శుక్లాకు అంతర్జాతీయ బృందంతో కలసి అంతరిక్షయానం చేసే అవకాశం రావడం విశేషం.మే 29న ఐఎస్ఎస్కు బయలుదేరనున్న వ్యోమగాముల బృందంలో శుక్లాతో పాటు అమెరికన్ జాతీయ అంతరిక్ష సంస్థలో (నాసా) పనిచేసిన వ్యోమగామి పెగ్గీ విట్సన్, పోలిష్ అంతరిక్ష సంస్థ (పోల్సా) సభ్యుడు స్లావోజ్ ఉజ్నాన్స్కీ, హంగేరియన్ అంతరిక్ష పరిశోధక సంస్థ (హెచ్‌ఎస్‌ఓ) సభ్యుడు టైబర్ కాపు కూడా ఉన్నారు. ‘పోల్సా’, ‘హెచ్‌ఎస్‌ఓ’లకు ఈ మిషన్‌లో యురోపియన్ అంతరిక్ష సంస్థ (ఈఎస్ఏ) సహకారం అందిస్తోంది. ఈ బృందం మే 29న ఐఎస్ఎస్కు చేరుకోనుంది. ‘ఏక్సియమ్ మిషన్–4 (ఏఎక్స్–4)’ పేరిట చేపడుతున్న కార్యక్రమంలో భాగంగా ఐఎస్ఎస్ చేరుకోనున్న ఈ బృందం అక్కడ ఏడు ప్రయోగాలను చేపట్టనుంది.ఏఎక్స్–4 భారత్ వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపడానికి స్వయంగా చేపట్టనున్న ‘గగన్‌యాన్’ ప్రయోగానికి బాగా ఉపకరించగలదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. శుభాంశు శుక్లా ఏఎక్స్–4 మిషన్‌లో భాగంగా ఐఎస్ఎస్కు వెళుతుండటం వల్ల ఆయన పొందే ఆచరణాత్మక అనుభవం భారత్ చేపట్టనున్న ‘గగన్‌యాన్’కు ఎంతగానో ఉపయోగపడుతుందని భారత అంతరిక్ష పరిశోధక సంస్థ (ఇస్రో) మైక్రోగ్రావిటీ ప్లాట్‌ఫామ్స్ గ్రూప్ హెడ్ తుషార్ ఫడ్నిస్ తెలిపారు.ఏఎక్స్–4 మిషన్అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) చేరుకునేందుకు తాజాగా చేపడుతున్న ఏఎక్స్–4 మిషన్ భారత్‌తో పాటు పోలండ్, హంగరీ దేశాలకు కూడా గొప్ప మైలురాయి కాగలదు. దశాబ్దాల తర్వాత ఈ దేశాలకు చెందిన వ్యోమగాములు అంతరిక్షయాత్రకు వెళుతుండటమే దీనికి కారణం. ఈ ఏఎక్స్–4 మిషన్‌లో భాగంగా ఐఎస్ఎస్లో శాస్త్ర సాంకేతిక పరిశోధనలు చేపట్టనున్నారు. ఇక్కడ చేపట్టనున్న దాదాపు అరవైకి పైగా ప్రయోగాల్లో 31 దేశాలు భాగస్వామ్యం కలిగి ఉన్నాయి. శాస్త్ర సాంకేతిక పరిశోధనలతో పాటు అంతరిక్ష పర్యాటకం వంటి కార్యకలాపాలను నిర్వహించేందుకు వీలుగా, భూమి చుట్టూ రెండువేల కిలోమీటర్ల దూరాన ఉండే భూ నిమ్న కక్ష్యలో (లో ఎర్త్ ఆర్బిట్–ఎల్ఈఓ) వాణిజ్యపరంగా అంతరిక్ష కేంద్రాలను నిర్మించే వెసులుబాటును ఏఎక్స్–4 మిషన్‌లో అధ్యయనం చేయనున్నారు.అమెరికాకు చెందిన ప్రైవేటు సంస్థ ‘ఏక్సియమ్ స్పేస్’ మరో ప్రైవేటు సంస్థ ‘స్పేస్ ఎక్స్’తోను, అమెరికా జాతీయ అంతరిక్ష సంస్థ ‘నాసా’తోను కలసి ఈ ఏఎక్స్–4 మిషన్ చేపడుతోంది. ఈ మిషన్‌కు అమెరికన్ మహిళా వ్యోమగామి పెగ్గీ విట్సన్ దీనికి కమాండర్‌గా నాయకత్వం వహిస్తున్నారు. ‘ఇస్రో’ తరఫున భారత వైమానికదళం గ్రూప్ కమాండర్ శుభాంశు శుక్లా పైలట్‌గా వ్యవహరించనున్నారు.మిషన్ స్పెషలిస్టులుగా యూరోపియన్ అంతరిక్ష సంస్థ (ఈఎస్ఏ) తరఫున పోలండ్‌కు చెందిన స్లావోజ్ ఉజ్నాన్స్కీ, హంగేరియన్ అంతరిక్ష పరిశోధక సంస్థ (హెచ్‌ఎస్‌ఓ) తరఫున టైబర్ కాపు ఇందులో పాల్గొంటున్నారు. ఈ మిషన్‌తో పెగ్గీ విట్సన్ ఐదోసారి అంతరిక్షయాత్రకు వెళుతుంటే, శుభాంశు శుక్లా సహా మిగిలినవారికి ఇదే తొలి అంతరిక్షయాత్ర కావడం విశేషం. స్పేస్ ఎక్స్ పాత్రఏక్సియమ్ మిషన్–4లో ఎలాన్ మస్క్ స్థాపించిన అమెరికన్ అంతరిక్ష సాంకేతిక పరిశోధనల సంస్థ ‘స్పేస్ ఎక్స్’ కీలక పాత్ర పోషిస్తోంది. ఏఎక్స్–4 మిషన్(AX-4 mission) కోసం స్పేస్ ఎక్స్ ‘ఫాల్కన్ 9 బ్లాక్ 5’ రాకెట్‌ను, క్రూ డ్రాగన్ సీ213 వ్యోమనౌకను ప్రత్యేకంగా సిద్ధం చేసింది. అమెరికాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ లాంచ్ కాంప్లెక్స్ 39ఏ నుంచి ఏఎక్స్–4 మిషన్ మే 29న భారతీయ కాలమానం ప్రకారం రాత్రి 10.33 గంటలకు అంతరిక్ష యాత్ర ప్రారంభం కానుంది.ఇక్కడి నుంచి ఫాల్కన్ 9 బ్లాక్5 రాకెట్ నలుగురు వ్యోమగాములతో కూడిన క్రూ డ్రాగన్ సీ213 వ్యోమనౌకను భూ నిమ్న కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది. క్రూ డ్రాగన్ సీ213 ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) చేరుకోనున్న వ్యోమగాములు అక్కడ రెండు నుంచి మూడు వారాల పాటు పరిశోధనలు సాగించనున్నారు. ఏఎక్స్–4 మిషన్ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన క్రూ డ్రాగన్ సీ213 వ్యోమనౌకకు ఇదే మొట్టమొదటి అంతరిక్ష ప్రయాణం.అ‘ద్వితీయుడు’ గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో పుట్టి పెరిగారు. భారతీయ వైమానిక దళానికి 2006లో ఎంపికయ్యారు. యుద్ధ విమానాలను నడపడంలో విశేష అనుభవం ఉన్న శుభాంశు శుక్లాను ఏఎక్స్–4 మిషన్ ఏరి కోరి పైలట్‌గా ఎంపిక చేసింది. దాదాపు నాలుగు దశాబ్దాల కిందట– 1984లో రాకేశ్ శర్మ అంతరిక్ష యాత్ర చేసి, తొలి భారతీయ వ్యోమగామిగా రికార్డులకెక్కారు. అప్పటి సోవియట్ రష్యా చేపట్టిన ‘సోయుజ్ టీ–11’ మిషన్‌లో భాగంగా రాకేశ్ శర్మ అంతర్జాతీయ బృందంతో కలసి, సాల్యూట్–7 అంతరిక్ష కేంద్రానికి చేరుకుని, అక్కడ వారం రోజులు గడిపి వచ్చారు. ‘సోయుజ్ టీ–11’ మిషన్‌కు సోవియట్ వ్యోమగామి యూరీ మాలెషెవ్ పైలట్‌గా వ్యవహరించారు.అయితే, ఇప్పుడు ఏఎక్స్–4 మిషన్‌లో శుభాంశు శుక్లాకు పైలట్‌గా అవకాశం లభించింది. అంతర్జాతీయ వ్యోమగాముల బృందం జరిపే అంతరిక్ష యాత్రకు ఒక భారతీయుడు పైలట్ కావడం ఇదే తొలిసారి. శుక్లాను ‘ఇస్రో’ 2019లో భారత్ తరఫున వ్యోమగామిగా ఎంపిక చేసింది. అంతరిక్ష యాత్ర చేయడానికి తగిన శిక్షణను పొందడానికి శుక్లా రష్యా వెళ్లారు. మాస్కోలో స్టార్ సిటీలోని యూరీ గాగరిన్ వ్యోమగాముల శిక్షణ కేంద్రంలో శిక్షణ పొంది వచ్చారు. ప్రస్తుతం ఆయన ఏఎక్స్–4 మిషన్‌లో భాగంగా ఐఎస్ఎస్కు వెళ్లడానికి సర్వసన్నద్ధంగా ఉన్నారు. ‘ఇస్రో’, ఇతర భారతీయ సాంకేతిక సంస్థలు రూపకల్పన చేసిన ప్రయోగాలను శుక్లా ఐఎస్ఎస్లో చేపట్టనున్నారు.ఈ ప్రయోగాల్లో భాగంగా ఆయన అంతరిక్షంలో సూక్ష్మజీవుల మనుగడకు గల అవకాశాలు, గురుత్వాకర్షణ లేని అంతరిక్ష పరిస్థితుల్లో ఏర్పడే కండరాల క్షీణత, తెరపై దృశ్యాలను చూడటం వల్ల మెదడుపై ఏర్పడే దుష్ప్రభావాలు తదితర అంశాలను అధ్యయనం చేయనున్నారు. ఏఎక్స్–4 మిషన్‌లో భాగంగా ఐఎస్ఎస్లో శుక్లా సాగించబోయే ప్రయోగాలు త్వరలోనే భారత్ చేపట్టనున్న ‘గగన్‌యాన్’ ప్రయోగానికి బాగా ఉపయోగపడగలదని ‘ఇస్రో’ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. శుక్లా ప్రస్థానంభారతీయ వైమానిక దళం (ఐఏఎఫ్) నుంచి అంతరిక్ష యానానికి ఎంపిక కావడం వరకు శుభాంశు శుక్లా ప్రస్థానంపై అనేక కథనాలు వచ్చాయి. లక్నోలోని సిటీ మాంటిసోరీ స్కూల్లో సాదా సీదా విద్యార్థిగా ఉన్న శుక్లా ఐఏఎఫ్‌లో చేరడం చాలా యాదృచ్ఛికంగా జరిగింది. స్కూల్లో ఉన్నప్పుడు ఒక మిత్రుడు నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ) దరఖాస్తు తెచ్చివ్వడంతో శుక్లా తన పదహారో ఏట ఎన్డీఏకు దరఖాస్తు చేసుకున్నారు. ఆ సంగతిని ఇంట్లో తల్లిదండ్రులకు కూడా చెప్పలేదు. అనుకోకుండా రాసిన పరీక్షలో నెగ్గి, 2006 జూన్ 17న ఐఏఎఫ్‌కు ఎంపికయ్యారు.ఎన్డీఏలో సైనిక శిక్షణ పొందుతూనే, ఉన్నత విద్యను కొనసాగించారు. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) నుంచి ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌లో ఎంటెక్ పూర్తి చేశారు. ఐఏఎఫ్‌లో అంచెలంచెలుగా, గ్రూప్ కెప్టెన్ స్థాయికి ఎదిగారు. ప్రధాని నరేంద్ర మోదీ 2018 స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా భారత్ ‘గగన్‌యాన్’ చేపట్టనున్నట్లు ప్రకటించారు. ‘గగన్‌యాన్’ కోసం ‘ఇస్రో’ ఎంపిక ప్రక్రియ ప్రారంభించినప్పుడు 2019లో శుక్లా దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో భాగంగా ఇండియన్ ఏరోస్పేస్ మెడిసిన్ (ఐఏఎం) నిర్వహించిన పరీక్షలో ఎంపికైన నలుగురిలో శుక్లా కూడా ఉన్నారు.ఐఏఎం ఎంపిక చేసిన నలుగురినీ ‘ఇస్రో’ పరీక్షించి, చివరిగా శుక్లాను ‘గగన్‌యాన్’కు ఎంపిక చేసింది. అంతరిక్షయాత్రల్లో శిక్షణ కోసం రష్యాలోని యూరీ గాగరిన్ కాస్మోనాట్ ట్రైనింగ్ సెంటర్‌కు పంపింది. రష్యా నుంచి ప్రాథమిక శిక్షణ పొంది 2021లో తిరిగి వచ్చేశాక, ‘ఇస్రో’ ఆయనను బెంగళూరులోని వ్యోమగాముల శిక్షణ కేంద్రానికి పంపింది. అక్కడ కూడా శుక్లా విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్నారు. ‘గగన్‌యాన్’ ప్రారంభానికి ముందే ‘ఏఎక్స్–4’ మిషన్‌లో పైలట్‌గా అవకాశం రావడంతో తొలి అంతరిక్షయాత్రకు వెళుతున్నారు.గగన్‌యాన్ సన్నాహాలుభారత అంతరిక్ష పరిశోధక సంస్థ ‘ఇస్రో’ ఇప్పటి వరకు అనేక ప్రయోగాలు చేపట్టింది. ‘ఇస్రో’ ఇప్పటి వరకు అంతరిక్షంలోకి పంపిన వ్యోమనౌకలన్నీ మానవరహితమైనవే! మనుషులను అంతరిక్షంలోకి పంపాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వం ‘గగన్‌యాన్’ను తలపెట్టింది. ప్రతిష్ఠాత్మకమైన ‘గగన్‌యాన్’ కోసం ‘ఇస్రో’ సన్నాహాలను ముమ్మరంగా కొనసాగిస్తోంది. ‘గగన్‌యాన్’లో అంతరిక్షానికి వెళ్లే వ్యోమగాముల పేర్లను ప్రధాని మోదీ గత ఏడాది ఫిబ్రవరి 27న ప్రకటించారు. వారిలో శుభాంశు శుక్లాతో పాటు ఐఏఎఫ్ గ్రూప్ కెప్టెన్లు ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అజిత్ కృష్ణన్, అంగద్ ప్రతాప్ ఉన్నారు. ‘గగన్‌యాన్’లో చేపట్టడానికి ‘ఇస్రో’ ఇప్పటికే ఐదు ప్రయోగాలను ఎంపిక చేసింది.నిజానికి ‘గగన్‌యాన్’ ప్రయోగాన్ని గత ఏడాదిలోనే చేపట్టాలని ప్రభుత్వం తలపెట్టినా, అనివార్య కారణాల వల్ల ఇందులో జాప్యం ఏర్పడింది. ఈ జాప్యానికి ముఖ్య కారణం ‘కోవిడ్–19’ మహమ్మారేనని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ రాణా పార్లమెంటులో వెల్లడించారు. ‘గగన్‌యాన్’ సన్నాహాల్లో భాగంగా ‘ఇస్రో’ ఈ ఏడాదిలో ఆరుసార్లు ఆర్బిటల్ క్యాప్సూల్స్‌ను అంతరిక్షంలోకి పంపుతోంది. ఒకరు లేదా ముగ్గురు వ్యోమగాములతో 2027లో ‘గగన్‌యాన్’ అంతరిక్షయాత్ర చేపట్టడానికి ఏర్పాట్లు చేసుకుంటోంది. అయితే, ఈ తేదీని ఇంకా ఖరారు చేయలేదు.ఇదిలా ఉంటే, ‘గగన్‌యాన్’ ప్రయోగాన్ని 2027 సంవత్సరం మొదటి త్రైమాసికంలోనే చేపట్టనున్నట్లు మంత్రి జితేంద్ర సింగ్ కొద్దిరోజుల కిందట జరిపిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ‘ఇస్రో’ చైర్మన్ వి.నారాయణన్‌తో కలసి ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ‘గగన్‌యాన్’ ప్రయోగాల్లో భాగంగా వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపడానికి ముందు మహిళా రోబో ‘వ్యోమమిత్ర’ను అంతరిక్షానికి పంపనున్నట్లు తెలిపారు. అంతరిక్షంలో మన సొంత అంతరిక్ష కేంద్రం ‘భారతీయ అంతరిక్ష కేంద్రం’ ఏర్పాటుకు ‘గగన్‌యాన్’ ప్రయోగం బాటలు వేయగలదని ‘ఇస్రో’ చైర్మన్ నారాయణన్ ఆశాభావం వ్యక్తం చేశారు. తొలుత రూ.10 వేల కోట్లుగా అంచనా వేసిన ‘గగన్‌యాన్’ బడ్జెట్‌ను ప్రభుత్వం రూ.20.193 కోట్లకు పెంచిందని ఆయన తెలిపారు.అంతరిక్ష ప్రయోగాలతో పాటు సముద్రగర్భంలో కూడా భారత్ ప్రయోగాలు చేపట్టనుందని, ఈ ప్రయోగాల్లో ‘ఇస్రో’కు దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీలు, ఐఐఎస్సీ, వైమానిక, నావికా దళాలు కీలక సహకారాన్ని అందిస్తున్నాయని వెల్లడించారు. ‘గగన్‌యాన్’ తొలివిడత ప్రయోగంలో మన వ్యోమగాములు మూడురోజుల పాటు అంతరిక్షంలోని భూనిమ్న కక్ష్యలో గడిపి తిరిగి రానున్నారు. దీనివల్ల అంతరిక్ష ప్రయోగాలను చేపట్టడంలో భారత్‌కు గల స్వయంసమృద్ధి, ప్రతిభాపాటవాలు ప్రపంచానికి వెల్లడవుతాయి. అంతరిక్షంలో మరిన్ని అన్వేషణలు, ప్రయోగాలు చేపట్టడానికి ‘గగన్‌యాన్’ వీలు కల్పిస్తుంది. అంతరిక్ష ప్రయోగాలు చేపడుతున్న ఇతర అగ్రరాజ్యాలకు దీటైన శక్తిగా భారత్ ఎదిగేందుకు దోహదపడుతుంది.ఏక్స్–4 బృందంలో మిగిలినవారుపెగ్గీ విట్సన్అమెరికన్ వ్యోమగామి. ఏక్స్–4 మిషన్‌కు కమాండర్. ‘నాసా’ తరఫున మూడుసార్లు, ‘ఏక్సియమ్’ తరఫున ఒకసారి అంతరిక్షానికి వెళ్లి వచ్చిన అనుభవం ఉంది. ఐఎస్ఎస్కు తొలి మహిళా కమాండర్ అయిన ఘనత ఆమెకే దక్కుతుంది. అంతరిక్షంలో అత్యధిక కాలం గడిపిన వ్యోమగామిగా అరుదైన రికార్డు కూడా ఆమెకు ఉంది. ‘నాసా’ నుంచి 2018లో రిటైరైన తర్వాత పెగ్గీ ‘ఏక్సియమ్’లో చేరారు. ‘ఏక్సియమ్’ చేపట్టిన ఏఎక్స్–2 మిషన్‌లో కమాండర్‌గా ఐఎస్ఎస్కు వెళ్లి వచ్చారు. ఇప్పుడు ఏఎక్స్–4 మిషన్‌లో ఐదోసారి అంతరిక్షయాత్రకు నాయకత్వం వహించనున్నారు.స్లావోజ్ ఉజ్నాన్స్కీయూరోపియన్ స్పేస్ ఏజెన్సీలో (ఈఎస్ఏ) పనిచేస్తున్న పోలిష్ ఇంజినీర్. ఏఎక్స్–4 మిషన్‌లో తొలిసారిగా అంతరిక్షయాత్రకు వెళ్లనున్నారు. సోవియట్ చేపట్టిన ‘సోయుజ్–30’ మిషన్‌లో పోలిష్ వ్యోమగామి మిరోస్లా హెర్మాస్జెవ్స్కీ 1978లో అంతరిక్షయాత్రకు వెళ్లారు. ఆ తర్వాత ఉజ్నాన్స్కీ అంతరిక్షానికి వెళ్లనున్న రెండో పోలిష్ వ్యోమగామి కానున్నారు. పోలిష్ అంతరిక్ష కేంద్రం ‘పోల్సా’, ఈఎస్ఏ చేపడుతున్న ‘ఇగ్నిస్’ అంతరిక్షయాత్రకు ఎంపికైన బృందంలో ఉజ్నాన్స్కీ కూడా ఉన్నారు. ఏఎక్స్–4 మిషన్‌లో భాగంగా ఐఎస్ఎస్ చేరుకోనున్న ఉజ్నాన్స్కీ, అక్కడ సాంకేతిక, జీవశాస్త్ర సంబంధిత ప్రయోగాలు చేయనున్నారు.టైబర్ కాపుసోవియట్ రష్యా చరిత్ర ముగిసిన తర్వాత తొలిసారిగా అంతరిక్షంలోకి వెళ్లనున్న హంగేరియన్ వ్యోమగామి. మెకానికల్ ఇంజినీర్ అయిన టైబర్ కాపును హంగేరియన్ ప్రభుత్వం 2021లో ‘హనార్’– హంగేరియన్ టు ఆర్బిట్ ప్రయోగం కోసం ఎంపిక చేసింది. సోవియట్ హయాంలో హంగేరియన్ వ్యోమగామి బెర్టాలన్ ఫర్కాస్ ‘సోయుజ్–36’లో తొలిసారిగా 1980లో అంతరిక్షయాత్ర చేశారు. ఆ తర్వాత అంతరిక్ష యాత్ర చేయనున్న రెండో హంగేరియన్ వ్యోమగామి టైబర్ కాపు కావడం విశేషం. ఏఎక్స్–4 మిషన్‌లో ఐఎస్ఎస్కు వెళ్లనున్న టైబర్ కాపు, అక్కడ పలు సాంకేతిక ప్రయోగాలు చేయనున్నారు.

Sheetal Devi and Ananya Panday: వింటి ‘నారి’
‘రెండు చేతులు లేవు కదా... విల్లు ఎలా పడతావు?’ అని అడిగారు. ఆ ప్రశ్నకు తన విల్‌పవర్‌తోనే సమాధానం చెప్పిన శీతల్ దేవి ఆర్చర్‌గా అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తోంది. స్కూల్ రోజుల నుంచి వెటకారాలు ఎదుర్కొన్న అనన్య పాండే చిత్రసీమలోకి అడుగు పెట్టిన తరువాత ట్రోలింగ్ బారిన పడింది. ఆ వెటకారాలకు తన పనితీరుతోనే సమాధానం చెప్పిన అనన్య పాండే ప్రస్తుతం ఆసియాలోని ప్రసిద్ధ బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్. ‘ఫోర్బ్స్ 30 అండర్ 30 ఆసియా 2025’ జాబితాలో చోటు సాధించిన శీతల్‌దేవి, అనన్య పాండేల గురించి...‘విజేతలు తమ దగ్గర లేని వాటి గురించి ఆలోచించరు. ఉన్నదాన్ని గురించే ఆలోచిస్తారు. దాంట్లో నుంచే శక్తి పుట్టిస్తారు’ అవును. జమ్ముకశ్మీర్‌కు చెందిన శీతల్‌కు ఫోకోమేలియా అనే అరుదైన వ్యాధి కారణంగా రెండు చేతులు లేవు. కిస్తావర్‌లోని తన గ్రామంలో మేకలు కాసేది. శీతల్‌కు రెండు చేతులు లేకపోవచ్చు. అయితే అసాధారణమైన చురుకుదనం ఉంది. ఆ చురుకుదనమే భారత సైన్యం నిర్వహించిన ఆటల పోటీల్లో పాల్గొనేలా చేసింది.ఆ ఆటల్లో ఆర్చరీ శీతల్‌ను బాగా ఆకట్టుకుంది. ‘ఆర్చర్ కావాలనుకుంటున్నాను’ అన్నప్పుడు...‘రెండు చేతులు లేవు కదా...అది ఎలా సాధ్యం?’ అన్నారు అక్కడ ఉన్నవాళ్లు. తన కాళ్ల వైపు చూసింది. అవును... తన కాళ్లనే చేతులుగా మలుచుకొని చిన్న పల్లె, జిల్లా, రాష్ట్రం దాటి అంతర్జాతీయ స్థాయిలో ఆర్చరీలో ఎన్నో అద్భుత విజయాలు సాధించింది. పారాలింపిక్ మెడలిస్ట్గా చరిత్ర సృష్టించింది ఆర్చర్ శీతల్ దేవి.‘ఆర్చరీ నా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఆర్చరీకి ముందు నేనెవరో ఎవరికీ తెలియదు. ఇప్పుడు మన దేశంలో ఎంతోమందికి నేను తెలుసు. ఆర్చరీలోలో ఎంతోమందిని చూసి స్ఫూర్తి పొందాను. ఇప్పుడు నన్ను చూసి స్ఫూర్తి పొందుతున్న వాళ్లను చూస్తే సంతోషంగా ఉంది’ అంటుంది స్టార్ ఆర్చర్ శీతల్‌దేవి.ఆర్చరీలోలో ఎంతోమందిని చూసి స్ఫూర్తి పొందాను. ఇప్పుడు నన్ను చూసి పొందుతున్న వాళ్లను చూసి సంతోషంగా ఉంది జేమ్స్ ‘బ్రాండ్’‘వెక్కిరింపులు, వెటకారాలకు తల ఒగ్గితే ఎప్పటికీ తల ఎత్తలేవు’ స్కూల్ రోజుల్లో అనన్య పాండేను తోటి పిల్లలు ‘టూత్‌పిక్ లెగ్స్’ ‘ఫ్లాట్ స్క్రీన్’లాంటి నిక్‌నేమ్‌లతో వెక్కిరించేవాళ్లు. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో ఆమె పేరు ముందు ‘గ్లామర్ డాల్’ అనే విశేషణం తప్పనిసరిగా ఉండేది. ‘నెపో బేబీ’ అని కూడా అంటుండేవారు. సోషల్ మీడియాలో ట్రోలింగ్ సరే సరి.నటనకు సంబంధించిన విమర్శలు కూడా వచ్చేవి. సినిమాలకు ముందు పాండే ఏ ఫిల్మ్ స్కూల్లో చేరలేదు. చిన్నప్పుడు సినిమా సెట్స్‌కు వెళ్లింది కూడా లేదు. నిర్మాణాత్మక విమర్శలు వినబడిన తరువాత మాత్రం తన నటనను మరింత మెరుగుపరుచుకోవడంపై దృష్టి పెట్టింది. ‘అనన్య నటన అద్భుతం’ అనే ప్రశంస వినిపించడానికి ఎంతో కాలం పట్టలేదు.వెటకారాలు, విమర్శలకు బాధ పడి ఉంటే....అనన్య పాండే ఎక్కడో ఆగిపోయేది. ‘విమర్శలు, వెటకారాలను సీరియస్‌గా తీసుకుంటే అది మోయలేనంత భారం అవుతుంది. ఆ భారం మనల్ని ముందుకు వెళ్లకుండా నిలువరిస్తుంది’ అంటుంది అనన్య పాండే.‘మొదట్లో తన ప్రత్యేకత కనిపించేది కాదు. ఎందుకంటే గతంలో ఎంతోమంది చేసిన పాత్రలే అనన్య పాండే చేసింది. కానీ ఇప్పుడు అలా కాదు. తాను మాత్రమే చేయగలిగే పాత్రలు చేస్తోంది’ అంటుంది ఫిలిమ్ క్రిటిక్ అనుపమ చోప్రా ఇప్పుడు ఫేమస్ బ్రాండ్లకు పాండే ఫేవరెట్ స్టార్ అయింది. ఫ్రెంచ్ ఫ్యాషన్ హౌజ్ ‘చానల్’, నెట్‌ఫ్లిక్స్, మాస్ ఓరియెంటెడ్ ‘స్కెచర్’కు మన దేశం నుంచి తొలి బ్రాండ్ అంబాసిడర్‌గా తన ప్రత్యేకతను చాటుకుంది. ప్రస్తుతం అనన్య పాండే దక్షిణ ఆసియాలోని ఎన్నో లగ్జరీ బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంది.

కాన్స్‌లో గర్వంగా.. అందంగా : ఈ బ్యూటీ డ్రెస్ స్పెషల్ ఏంటో తెలిస్తే..!
ప్రతిష్టాత్మక కాన్స్ ఫిలిం ఫెస్టివల్లో (CannesFilmFestival-2025) నటి , వ్యవస్థాపకు రాలు పరుల్ గులాటి(Parul Gulati) బోల్డ్‌గా అరంగేట్రం చేసింది. 78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రముఖ దర్శకుడు అరి ఆస్టర్ తాజా చిత్రం ఎడింగ్టన్ ప్రపంచ ప్రీమియర్‌కు హాజరైన అందర్నీ ఆశ్చర్యపర్చింది. పరుల్ గులాటి తన సొంత హెయిర్ ఎక్స్టెన్షన్ బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తూ, ప్రదర్శిస్తూ రెడ్ కార్పెట్‌పై నడిచింది. అత్యంత ప్రతిష్టాత్మకమైన రెడ్ కార్పెట్ మీద అందం, ధైర్యం, వ్యాపారాన్ని మిళితం చేసి జుట్టుతో ప్రత్యేకంగా తయారుచేసిన దుస్తులతో ఐకానిక్ అరంగేట్రం విశేషంగా నిలిచింది. పరుల్, అత్యంత ప్రత్యేకమైన, విచిత్రమైన దుస్తులలో అందరి దృష్టిని ఆకర్షించింది. కస్టమ్-మేడ్ డ్రెస్‌లో స్టైలిష్‌గా కనిపించింది. పూర్తిగా జుట్టుతో తయారు చేసిన స్ట్రాప్‌లెస్ బ్లాక్ డ్రెస్‌లో పరుల్ రెడ్ కార్పెట్‌పై అడుగుపెట్టింది. ఈ దుస్తులను రూపొందించడానికి నెల కంటే ఎక్కువ సమయం పట్టిందని, దీనికి 12 మంది నైపుణ్యం కలిగిన కళాకారులు శ్రమించిఆరు. ఈ డ్రెస్‌తో పాటు, స్టేట్మెంట్ డైమండ్ చెవిపోగులు, బోల్డ్ చంకీ రింగ్, ఓపెన్-టో బ్లాక్ హీల్స్‌తో హుందాగా అడుగులు వేసింది. ఈ స్పెషల్ కాస్ట్యూమ్‌కు రిద్ధి బన్సాల్ తో పాటు ప్రఖ్యాత స్టైలిష్ , డిజైనర్ మోహిత్ రాయ్ కూడా జీవం పోశారుతన లుక్ వెనుక ఉన్న భావోద్వేగ , సృజనాత్మక ఉద్దేశ్యాన్ని వివరించింది ఈ బ్యూటీ.- " పూర్తిగా మానవ జుట్టుతో తయారు చేసిన దుస్తులను ధరించడం అంటే ఫ్యాషన్ సరిహద్దులను దాటడం మాత్రమే కాదు. ఇది నేనే అని చాలా బిగ్గరగా మాట్లాడే దుస్తులు.. నేను ‘నిష్ హెయిర్’ వ్యవస్థాపకురాలిగా నా స్వంత బ్రాండ్ జుట్టును ధరిస్తున్నాను. నా దృష్టికి ప్రాణం పోసిన నా డిజైనర్ స్నేహితుడు మోహిత్ రాయ్ తో కలిసి..జడను జడగా అల్లిన కథ ఇది. కాన్స్ వంటి ఐకానిక్ వేదికపై నా సృజనాత్మక, వ్యాపారానికి ప్రాతినిధ్యం వహించడం నేను ఎప్పటికీ మర్చిపోలేని క్షణం. రెడ్ కార్పెట్ తన కల’’ అని పేర్కొంది.ఈ ప్రత్యేకమైన హెయిర్-మేడ్ డ్రెస్‌తో పరుల్ ప్రత్యేకంగా నిలబడటం మాత్రమే కాదు, మహిళలు తమ అందాన్ని నమ్మకంగా స్వీకరించేలా, ఒక వ్యవస్థాపకురాలిగా పరుల్ ప్రయాణానికి సింబాలిక్‌గా ఉందంటున్నారు ఫ్యాషన్ ప్రియులు.

నో డుమ్మా.. రోజంతా పనే : బెంగుళూరు పనిమనుషుల రూటే వేరు!
నగరాల్లో ప్రస్తుతం భార్యా భర్తా ఇద్దరూ ఉద్యోగులైన మధ్యతరగతి కుటుంబాలను, వేధించే ప్రధానమైన సమస్య ల్లో ముందు వరుసలో ఉంటుంది హౌస్ మెయిడ్/పనిమనిషి అని చెప్పొచ్చు. ఒక్కరోజు పనిమనిషి రాదు అని తెలిస్తే గృహిణుల గుండెల్లో రైళ్లు పరుగులు తీస్తాయి. ఇలాంటి పరిస్థితులు ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లోనూ ఉన్నాయి. ఈ నేపధ్యంలోనే...బెంగళూరు వాసులు పనిమనిషికి ఓ చక్కని ప్రత్యామ్నాయాన్ని ఎంచుకుంటున్నారు. అది ఏమిటో ఊహించగలరా? ప్రముఖ మీడియా సంస్థ బెంగుళూర్లోని కొన్ని కుటుంబాలను కలిసి సేకరించిన సమాచారం ప్రకారం... ఆ నగరంలో పనిమనిషి స్థానం వేగంగా భర్తీ అవుతోంది. ఇల్లు శుభ్రం చేయడం దగ్గర నుంచి వంట చేయడం దాకా.. దాదాపుగా అన్ని పనుల్లోనూ పనిమనిషి అవసరాన్ని ఈ కుటుంబాలకు దూరం చేస్తున్నాయి ఇంటి పనులలో సహాయపడే రోబోట్లు. వీటిని వినియోగిస్తున్న కొన్ని కుటుంబాల గురించి చెప్పుకుందాం...బెంగుళూర్లోని హెబ్బాళ్ నివాసి అయిన 35 ఏళ్ల మనీషా రాయ్ ఏడు నెలల క్రితం తన వంటవాడి స్థానంలో వంటగది రోబోట్‌ను పెట్టుకుంది. ఇది తమకు సంబంధించినంత వరకూ సానుకూల మార్పు అని ఆమె చెప్పింది. ఆమె భర్త నవీన్ వారి చిన్న కుమార్తె నక్షత్రతో సహా ఆమె కుటుంబం ఇప్పుడు రోబోట్–వండిన పోహా, పావ్ భాజీ రాజ్మా రైస్ వంటి వెరైటీ వంటలను ఇష్టపడుతున్నారు. శుభ్రంగా తింటున్నారు. దశలవారీ సూచనల ద్వారా మార్గనిర్దేశం చేసే మొబైల్ యాప్‌ని ఉపయోగించి మనీషా ఆ రోబోట్‌ను నియంత్రిస్తున్నారు. అయితే ఆమె కేవలం కలపవలసిన పదార్థాలను మాత్రమే చెబుతుంది. జోడిస్తుంది రోబోట్ యంత్రం ఆమె పర్యవేక్షణ లేకుండానే మిగతావన్నీ – కోయడం, వేయించడం, ఆవిరి చేయడం కూడా సర్వం తానై చేసేస్తుంది. అంతేకాదు సదరు రోబోట్ ఆమె ఇతర పనులను చేసుకోవడాన్ని రకరకాలుగా సులభతరం చేస్తుంది. వ్యయం పరంగా చూసినా, వంటవాడిని ఉంచడం కంటే ఇది మరింత సరసమైనదిగా మనీషా చెబుతున్నారు. తాను కొన్న రోబోట్ ధర 40,000 ఉన్నప్పటికీ, ఆదా అయే మొత్తంతో పోలిస్తే చాలా తక్కువేనన్నారామె.అదేవిధంగా, నగరంలో ఆర్కిటెక్ట్ అయిన మీరా వాసుదేవ్ 18 నెలలుగా పనిమనిషి లేకుండానే పనులు చక్కబెట్టుకుంటున్నారు. ఆమె రోజువారీగా ఇల్లు శుభ్రపరచడానికి రోబోటిక్ వాక్యూమ్, మాపింగ్ పరికరాలను ఉపయోగిస్తుంది. పైగా ఈ యంత్రాలు మందపాటి కార్పెట్లు వంటివి శుభ్రపరిచే పనులకు బాగా ఉపకరిస్తాయని ఆమె అంటున్నారు. కోరమంగళ నుంచి బెంగుళూర్‌కు ఇటీవలే వచ్చిన రేణుకా గురునాథన్ వంటి ఇతర నివాసితులు డిష్వాషర్లు రోబోటిక్ స్వీపర్లను వినియోగిస్తున్నారు ఈ స్మార్ట్ పరికరాలు ఇంటిలో బాధ్యతలను ఇంటి యజమానులు నిర్వహించే పాత్రలను కూడా మారుస్తున్నాయి. ఆధునిక సాంకేతికత పట్ల ఆసక్తి చూపే మగవాళ్లు వీటిని ఉపయోగించేందుకు ఉత్సాహం చూపుతూ ఇంటి పనుల్లో ఎక్కువగా పాల్గొంటున్నారు. తన భర్త ఇప్పుడు రోబోతో వంట చేయించడాన్ని కూడా ఆనందిస్తున్నాడని మనీషా చెప్పడం గమనార్హం.తుషారా నయన్ వంటి గృహిణులు కూడా మారారు. పనిమనిషిని భర్తీ చేయడం గురించి ఆమె కుటుంబం మొదట్లో అంగీకరించలేదు. కానీ వారు ఇప్పుడు రోబోట్ భోజనాన్ని ఆస్వాదిస్తున్నారు. ఈ సాంకేతికతలు రోజువారీ జీవితాన్ని సులభతరం చేస్తున్నప్పటికీ, అవి మానవ సేవల్ని పూర్తిగా భర్తీ చేయలేవని కొందరు నమ్ముతారు. మరోవైపు సామాజిక కార్యకర్త గీతా మీనన్ మాట్లాడుతూ, గృహ కార్మికుల హక్కులను రక్షించడంపై స్టార్టప్‌లు దృష్టి పెట్టాలనీ, వారికి ప్రత్యామ్నాయాలను తయారు చేయడం కాదు. కార్మికులకు మద్దతు ఇచ్చే సాధనాలను వేతన కాలిక్యులేటర్లు లేదా డిజిటల్ పేస్లిప్లు వంటివి టెక్ తరం అన్వేషించాలని సూచిస్తున్నారు
ఫొటోలు
అంతర్జాతీయం

‘పాకిస్తాన్ వద్దే కాదు.. చైనాకు కూడా ఆ సామర్థ్యం లేదు’
వాషింగ్టన్: ప్రపంచ దేశాల్లో అత్యంత శక్తిమంతమైన రక్షణ వ్యవస్థ కల్గిన దేశాల జాబితాలో భారత్ కు ప్రత్యేక స్థానం ఉందనే విషయం ఆపరేషన్ సిందూర్ తో మరోసారి నిరూపితమైంది. అత్యంత శక్తిమంతమైన ఆర్మీ కల్గిన దేశాల జాబితాలో భారత్‌ది నాల్గో స్థానం. ఇక్కడ చైనా కంటే భారత్ ఒక స్థానం కిందే ఉంది. టాప్ 5లో ఉన్న దేశాల్లో అమెరికా, రష్యా, చైనా, భారత్, దక్షిణకొరియాలు ఉన్నాయి. అయితే పాకిస్తాన్‌తో ఉద్రిక్త పరిస్థితుల నడుమ భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తో భారత్ బలం మరింత పెరిగిందని అంటున్నారు యుద్ధ రంగ నిపుణులు. అది కూడా అమెరికాకు చెందిన యుద్ధ రంగ నిపుణుడు రిటైర్డ్ కల్నల్ జాన్ స్పెన్సాన్ ఈ వ్యాఖ్యలు చేశారు.పాకిస్తాన్‌తో యుద్ధంలో భారత్ యుద్ధ నైపుణ్యంలో తిరుగులేదని నిరూపించుకుందన్నారు. అటు ఎఫెన్స్, ఇటు డిఫెన్స్ అయినా భారత్ శక్తి అమోఘమని కొనియాడారు. ఇక్కడ ప్రధానంగా భారత్ కు చెందిన బ్రహ్మోస్ క్షిపణిపై ప్రశంసలు కురిపించారు. భారత్ రక్షణ అమ్ముల పొదిలో ఉన్న బ్రహ్మోస్ పని తీరును ఎంత పొగిడినా తక్కువే అంటూ కితాబిచ్చారు. బ్రహ్మోస్ తరహా క్షిపణులు అటు పాకిస్తాన్ లోనే కాదు, చైనాకు కూడా లేవని బల్లగుద్దీ మరీ చెప్పారు. చైనా, పాకిస్తాన్ రక్షణ వ్యవస్థలో భారత్ లో ఉన్న బ్రహ్మోస్ తో సరిపోల్చే క్షిపణులు కానీ ఆయుధ సామాగ్రి గానీ లేవన్నారు జాన్ స్పెన్సార్.. ఈ విషయాల్ని జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడేకు ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు జాన్ స్పెన్సార్.‘ చైనా వైమానికి రక్షణ వ్యవస్థలు కానీ పాకిస్తాన్ రక్షణ వ్యవస్థలు కానీ భారతదేశ రక్షణ వ్యవస్థలతో పోలిస్తే చాలా తక్కువ సామర్థ్యం కల్గి ఉన్నాయి. భారత్ బ్రహ్మోస్ క్షిపణి.. చైనా, పాకిస్తాన్ రక్షణ వ్యవస్థల్లో ఉన్న దానికంటే అధికరెట్లు బలంగా ఉంది. పాకిస్తాన్ లో ఉగ్ర స్థావరాలను, ఎయిర్ బేస్ లను భారత్ సునాయాసంగా ఛేదించడంలో బ్రహ్మోస్ కీలక పాత్ర పోషించింది. ఇక్కడ భారత్ క్లియర్ మెస్సేజ్ ఇచ్చింది. పాకిస్తాన్ లోని ఏ ప్రదేశాన్నైనా సునాయాసంగా ఛేదించగలదనే సందేశాన్ని భారత్ చాలా క్లియర్ గా పంపింది’ అని ఆయన పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: మోస్ట్ పవర్ ఫుల్ ఆర్మీ కల్గిన దేశాలు ఇవే..

వింత డ్యాన్స్‌తో ట్రంప్‌కు స్వాగతం.. వీడియో వైరల్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పశ్చిమ దేశాల పర్యటనలో ఉన్నారు. ఇందులో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కు చేరుకున్నారు. ట్రంప్‌కు యూఏఈలో ఘన స్వాగతం లభించింది. ఆయనకు అక్కడి సంప్రదాయ నృత్యం అల్ అయ్యాలా (Al-Ayyala)తో స్వాగతం పలికారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇదేం డ్యాన్స్ అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.వివరాల ప్రకారం.. అధ్యక్షుడు ట్రంప్ యూఏఈ (UAE) చేరుకున్నాక అధ్యక్షుడు మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ స్వాగతం పలికారు. అనంతరం, ఇద్దరు నేతలు కలిసి అధ్యక్ష భవనం ఖషర్ అల్-వాటన్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలోనే పలువురు బాలికలు జుట్టు విరబోసుకొని సంప్రదాయ సంగీతానికి అనుగుణంగా తలలు ఊపుతూ ట్రంప్‌నకు స్వాగతం పలికారు. పక్కనే కొందరు డబ్బులు వాయిస్తుండగా ఇద్దరు నేతలు ముందుకు కదిలారు. వారి డ్యాన్స్ చూసిన ట్రంప్.. ఒక్కసారిగా షాకయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.In a symbolic gesture of respect, the #UAE welcomed Donald Trump with the traditional Al-Ayyala dance — a beautiful display of heritage, unity, and yes, the iconic hair-flippic.twitter.com/rjYe0y0VJu— Jordan Kyle (@_Jordan_Kyle_) May 15, 2025ఇదిలా ఉండగా, యునెస్కో (UNESCO)ప్రకారం.. అల్- అయ్యాలా అనేది యూఏఈ, ఒమన్లలో ప్రసిద్ధి చెందిన సంప్రదాయ నృత్యం. సంప్రదాయ దుస్తులు ధరించిన బాలికలు వారి పొడవాటి జుట్టును విరబోసుకొని.. సంగీతానికి అనుగుణంగా తలలను ఊపుతుంటారు. వేడుకలు, వివాహాల సమయాల్లో అల్- అయ్యాలాను ఎక్కువగా ప్రదర్శిస్తుంటారు. వయసు, లింగం, సామాజిక బేధం వంటి తేడాలు లేకుండా అందరినీ ఒకచోట చేర్చేదిగా దీన్ని భావిస్తారు. వీరంతా తలలు ఊపుకుంటూ డ్యాన్స్ చేసినట్టుగా ఊగిపోతారు.It is actually a traditional Emirati dance called Al Ayyala or Al Razfa depending on the region. The hair movement by the women symbolizes pride and beauty and is part of a heritage performance that reflects unity and strength. What you saw was not just a show. It was culture. pic.twitter.com/JKcAlXOmGd— Khalid Alkaabi (@alyarwani) May 15, 2025

పార్లమెంట్లో ప్రసంగం.. నవ్వుల పాలైన పాక్ ఉప ప్రధాని ఇషాక్ దార్
ఇస్లామాబాద్: పాక్ ఉప ప్రధాని ఇషాక్‌దార్ మరోసారి నవ్వుల పాలయ్యారు. ఫేక్ వార్తను పార్లమెంట్లో చదివి వినిపించి గొప్పలు చెప్పుకున్నారు. పాక్ ఎయిర్‌ఫోర్స్‌ను విదేశీ మీడియా ప్రశంచిందంటూ ప్రకటించుకున్నారు. అయితే విదేశీ మీడియా తమ ఎయిర్‌ఫోర్స్ గురించి నిజంగా ప్రశంసలు కురిపించిందా? అని పాకిస్తాన్ మీడియా సంస్థ ‘డాన్’ నిజనిర్ధారణ చేసింది. అందులో విదేశీ మీడియా కథనం బూటకమని తేల్చి చెప్పింది. అసలు ఇషాక్ దార్ చెప్పినట్లుగా సదరు మీడియా సంస్థ సైన్యానికి సంబంధించిన ఎలాంటి వార్తల్ని ప్రచురించలేదని తెలిపింది.ఇంతకీ ఏం జరిగిందంటే? పాకిస్తాన్‌పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌ను కీర్తిస్తూ అంతర్జాతీయ మీడియా సంస్థలు పలు కథనాల్ని ప్రచురించాయి. ఈ క్రమంలో బ్రిటన్‌కు చెందిన డైలీ టెలిగ్రాఫ్ అందుకు భిన్నంగా ‘ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ ఎయిర్‌ఫోర్స్ వ్యవహరించిన తీరును ప్రశంసంపై ఓ కథనాన్ని ప్రచురించింది’ అంటూ డైలీ టెలిగ్రాఫ్ హెడ్‌లైన్‌ను పార్లమెంట్లో ఇషాక్ దార్ ప్రస్తావించారు. అసలు విషయం ఏంటంటే?Pakistan's Deputy Prime Minister and Foreign Minister Ishaq Dar falsely told the Senate that The Telegraph headlined the PAF as the ‘Undisputed King of the Skies’—a far-fetched claim that even Dawn News felt compelled to fact-check him. pic.twitter.com/piho3z9Zha— DD India (@DDIndialive) May 16, 2025 ‘గగనతల రారాజు పాక్ ఎయిర్‌ఫోర్స్’ వాస్తవానికి డైలీ టెలిగ్రాఫ్ ఆ హెడ్‌లైన్‌ను రాయలేదు. పాకిస్తానీయులే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో తప్పుడు వార్తను సృష్టించారు. దాన్నే నిజమనుకుని ఇషాక్‌దార్ భ్రమపడ్డారు. ‘గగనతల రారాజు పాక్ ఎయిర్‌ఫోర్స్’ అంటూ విదేశీ మీడియా కీర్తించిందని ప్రకటన చేశారు. దీంతో కంగుతిన్న డైలీ టెలిగ్రాఫ్ .. అసలు తాము అలాంటి హెడ్లైన్ పెట్టలేదని స్పష్టం చేసింది. డైలీ టెలిగ్రాఫ్ మాత్రమే కాదు.. పాక్ దేశ మీడియా సంస్థ డాన్‌న్యూస్ సైతం ఇదే విషయాన్ని చెప్పింది. పాకిస్తాన్ పార్లమెంట్ సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యల్ని ఖండించింది.ఇషాక్ దార్‌వి పచ్చి అబద్ధాలు ‘పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఆకాశాలలో తిరుగులేని రాజు’ అని పేర్కొంటూ డైలీ టెలిగ్రాఫ్ వార్త రాసిందా? లేదా? అని డాన్ మీడియా ప్రతినిధులు పరిశీలించారు. ఇషాక్ దార్ చెప్పినట్లుగా సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్నట్లుగా మే 10న ది డైలీ టెలిగ్రాఫ్ ఫ్రంట్ పేజీలో ఉన్న వార్తకి.. ఇషాక్ దార్ చదివి వినిపించిన హెడ్‌లైన్‌కు పొంతన లేదని తేలింది. ఆ పత్రిక ఎప్పుడూ అలాంటి కథనాల్ని ప్రచురించలేదని డాన్ తేల్చింది. దీంతో పాక్ ఉప ప్రధాని ఇషాక్ దార్‌పై నెటిజన్లు చూసికోవాలని కదాయ్యా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Earthquake: చైనాలో భూకంపం
బీజింగ్: చైనాలో భూకంపం సంభవించింది. శుక్రవారం ఉదయం రిక్టర్ స్కేలుపై 4.5 తీవ్రతతో భూకంపం సంభవించినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (NCS) వెల్లడించింది.భారత కాలమానం ప్రకారం ఉదయం 6:29 గంటలకు ఈ ప్రకంపనలు సంభవించాయి. భూమి లోతులో 10 కిలోమీటర్ల లోపల భూకంపం నమోదైనట్లు ఎన్సీఎస్ అధికారులు తెలిపారు. ఈ మేరకు భూకంప వివరాలను ఎన్సీఎస్ తమ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈనెల మే 12న తెల్లవారుజామున 2:41 గంటలకు టిబెట్, చైనా పలు ప్రాంతాల్లో 5.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆ భూకంపం భూమిలో 9 కిలోమీటర్ల లోతులో నమోదైంది.EQ of M: 4.5, On: 16/05/2025 06:29:51 IST, Lat: 25.05 N, Long: 99.72 E, Depth: 10 Km, Location: China. For more information Download the BhooKamp App https://t.co/5gCOtjcVGs @DrJitendraSingh @OfficeOfDrJS @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia pic.twitter.com/08mQNfOwyd— National Center for Seismology (@NCS_Earthquake) May 16, 2025
జాతీయం

భారత్‌కు ద్రోహం.. పాక్‌కు గూఢచర్యం చేస్తున్న విద్యార్థి అరెస్ట్
ఛండీగఢ్: దేశ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొంటూ, పాకిస్తాన్‌కు గూఢచర్యం చేస్తున్న విద్యార్థిని హర్యానా పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని విచారించగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పాక్ అధికారులు పెద్దమొత్తంలో డబ్బు ముట్టజెప్పినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు.వివరాల ప్రకారం.. నిందితుడు దేవేంద్ర సింగ్ ధిల్లాన్ హర్యానాలో పాటియాలలో ఉన్న ఖల్సా కళాశాలలో పొలిటికల్ సైన్స్ చదువుతున్నాడు. అయితే, మే 12న ధిల్లాన్.. తన ఫేస్బుక్ ఖాతాలో గన్, పిస్టోల్ చిత్రాలను పోస్టు చేశాడు. ఈ విషయం పోలీసులు దృష్టికి చేరడంతో.. కాలేజీకి వెళ్లి ఆరా తీశారు. అనంతరం, అతడిని పోలీసులు అరెస్టు చేశారు. దేవేంద్రసింగ్ ఫోన్‌ను స్వాధీనం చేసుకొని ఫోరెన్సిక్ దర్యాప్తునకు పంపించారు. ఈ క్రమంలో ధిల్లాన్ విచారించగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.విచారణలో భాగంగా.. ధిల్లాన్ గతేడాది నవంబరులో కర్తార్‌పూర్ కారిడార్ ద్వారా పాకిస్తాన్‌కు వెళ్లినట్టు గుర్తించారు. ఈ సందర్భంగా అక్కడి ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అధికారులతో భారత్‌కు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పంచుకున్నట్లు తేలిపింది. ఈ మేరకు నిందితుడు అంగీకరించాడు. అందుకు పాక్ అధికారులు పెద్దమొత్తంలో డబ్బు ముట్టజెప్పినట్లు తెలిపాడు. పటియాలా మిలిటరీ కంటోన్మెంట్‌కు సంబంధించిన చిత్రాలను సైతం అతడు పాక్ అధికారులకు అందించాడు. దీంతో, డబ్బు లావాదేవీలకు సంబంధించిన సమాచారం సేకరిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. దీనిపై పూర్తి దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు.Kaithal, Haryana! Pak ISI spy Devendra Singh Dhillon arrested! Devendra sent army camps and other sensitive information to Pakistan ISI! Devendra went to Pakistan for a religious trip in 2024, during which an ISI agent caught him in a girl's honey trap. Police investigation is on pic.twitter.com/gnTVuHUDXh— Kalu Singh Chouhan (@kscChouhan) May 17, 2025ఇదిలా ఉండగా.. ఇటీవల ఉత్తరప్రదేశ్ చెందిన రవీంద్రకుమార్‌కు సైతం ఇలాగే పోలీసులు అరెస్ట్ చేశారు. పాకిస్తాన్‌లోని ఐఎస్ఐకు గూఢచర్యం చేస్తున్న కారణంగా రవీంద్రకుమార్‌ను విచారిస్తున్నారు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో మెకానిక్‌గా పనిచేస్తున్న రవీంద్రకుమార్ ఓ అమ్మాయితో హానీట్రాప్‌లో చిక్కి.. భారత సైన్యం ఆయుధాలకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాక్ అధికారులకు చేరవేశాడు. ఐఎస్ఐ సభ్యులతోనూ అతడు నేరుగా టచ్‌లో ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. దీంతో, అతడి అంశంలో మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు.

రోడ్డు పక్కన వదిలేస్తే చేరదీసింది.. అదే ఆమె పాలిట శాపమైంది!
రోడ్డు పక్కన అనాథగా పడి ఉన్న పసికందును మానవత్వంతో ఓ మహిళ చేరదీసింది. చదువు కూడా చెప్పించి.. ఆ బాలికను పెంచి పెద్ద చేసింది. అలా చేయడం.. ఆ మహిళకు శాపమైంది. చివరికి ప్రాణాలు కోల్పోయాంది. ప్రేమ మైకంలో ఓ బాలిక తన పెంపుడు తల్లిని హతమార్చింది. ఈ మర్డర్ మిస్టరీని పోలీసు అధికారులు ఛేదించారు. ఎస్పీ జ్యోతీంద్ర పండా ఆదర్శ పోలీసు స్టేషన్లో వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. స్థానిక తెలుగు సొండి వీధిలో రాజ్యలక్ష్మీ కోరో (54) గత నెల 26న అనుమానాస్పదంగా చనిపోయింది. మృతురాలి పెంపుడు కూతురు పర్లాకిమిడి ప్రభుత్వ ఆస్పత్రికి తన ప్రియుడు, స్నేహితుని సహాయంతో మృతదేహాన్ని తరలించింది.ఈ విషయం భువనేశ్వర్‌లో ఉన్న మృతురాలి సోదరుడు ప్రసాద్ మిశ్రాకు ఫోన్ చేసి తెలియజేశారు. ఈ లోగా పెంపుడు కూతురు, అతని ప్రియుడు కలిసి పోలీసు కేసు కాకుండా చూసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని అంబులెన్స్‌లో భువనేశ్వర్‌కు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. కూతురు కొద్ది నెలలుగా గణేష్ రథ్ (21) అనే వ్యక్తితో ప్రేమలో ఉంది. దీన్ని గమనించిన తల్లి ఆమెను మందలించింది. దీంతో ఆమె అడ్డు తొలగించుకోవడానికి ప్రియుడితో పాటు స్నేహితుడు దినేష్ సాహు అలియాస్ అమన్ సాయంతో తల్లిని చంపడానికి పథకం పన్నారు.పథకం ప్రకారం ఏప్రిల్ 26న ఆమె నిద్రిస్తున్న సమయంలో దిండు సహాయంతో ఇద్దరు స్నేహితులు చంపి, నగదు, బంగారం దొంగిలించి పారిపోయారు. సోదరి చనిపోయాక ఆమె పెంపుడు కూతురిలో మార్పులు గమనించిన ప్రసాద్ మిశ్రా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. వారు నిందితురాలిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు నిర్వహించారు.దీంతో హత్య జరిగినట్లు నిర్ధారించారు. నిందితులందరినీ గుర్తించి వారిని అరెస్టు చేసి విచారించగా రాజలక్ష్మీ కోరోకు మత్తు మందు ఇచ్చి ఎలా చంపారో వారే పోలీసులకు వివరించారు. మృతురాలి ఇంటి నుంచి 7 తులాల బంగారం వస్తువులు, రూ.60 వేలు నగదు చోరీ కాగా 2.6 గ్రాముల బంగారం, మూడు మొబైళ్లు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ జ్యోతీంద్రనాథ్ పండా విలేకరుల సమావేశంలో తెలియజేశారు. నిందితులు ఇద్దరు గణేష్ రోథో, దినేష్ సాహులను అరెస్టు చేసి కోర్టుకు తరలించారు.

పాక్‌కు భారత్ చెక్.. ఏడుగురు ఎంపీలతో దౌత్య యుద్ధం!
ఢిల్లీ: ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నందుకు పాకిస్తాన్ తీరు ఎండగట్టేందుకు భారత్ పక్కా ప్లాన్‌తో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగానే పాక్ ఉగ్ర కుట్రలను ప్రపంచదేశాలకు వివరించడం కోసం ఏడు అఖిలపక్ష బృందాలను ఏర్పాటు చేసింది. విదేశాలకు భారత ప్రతినిధి బృందాలను పంపేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ప్రభుత్వం ఏర్పాటుచేసిన మొత్తం ఏడు గ్రూపులు 10 రోజుల వ్యవధిలో ఐదు దేశాలకు వెళ్తాయి. ఈ మేరకు ప్రతినిధుల బృందాలకు సంబంధించిన వివరాలను కేంద్రం శనివారం వెల్లడించింది.అఖిలపక్ష ప్రతినిధుల బృందాలకు నాయకత్వం వహించే ఏడుగురు ఎంపీల పేర్లను కేంద్రం ప్రకటించింది. వీరిలో ఎంపీలు శశిథరూర్ (కాంగ్రెస్), సుప్రియా సూలే (ఎన్సీపీ -ఎస్పీ), కనిమొళి (డీఎంకే), రవిశంకర్ ప్రసాద్(బీజేపీ), బైజయంత్ పాండా (బీజేపీ) సంజయ్ కుమార్ ఝా(జేడీయూ), శ్రీకాంత్ శిందే (శివసేన) విదేశాల్లో భారత బృందాలకు నాయకత్వం వహించనున్నట్లు కేంద్రం వెల్లడించింది. వీరంతా.. మే 22న విదేశాలకు బయలుదేరి జూన్ మొదటి వారంలో తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోని దేశాలు, ఇతర కీలక దేశాలను అఖిలపక్ష బృందం సందర్శించనుంది. ఉగ్రవాదం అణిచివేతకు భారత్ అనుసరిస్తున్న జీరో టాలరెన్స్ విధానాన్ని అఖిలపక్ష నేతలు వివరించనున్నారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దాన్ని వ్యతిరేకించాల్సిందే అనేది భారత విధానమని చెప్పనున్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ ఏకతాటిపై నిలబడిందని సందేశం ఇచ్చేందుకు అఖిలపక్షం ఏర్పాటైంది. ఉగ్రవాద కార్యకలాపాలకు పాక్ ఏవిధంగా మద్దతు పలుకుతోందనే విషయాన్ని.. ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)తో ఉగ్రవాదంపై భారత్ జరిపిన పోరాటాన్ని పలు ఆధారాల ద్వారా విదేశాలకు వివరించనున్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ఉగ్రవాదులకు సహకరించడంలో ఎన్నో ఏళ్లుగా పాకిస్తాన్ అనుసరిస్తున్న పాత్రను.. దానివల్ల ప్రపంచదేశాలకు పొంచిఉన్న ముప్పును వివరించనుంది. భవిష్యత్తులో భారత్‌పై ఉగ్రదాడులు జరిగితే ప్రభుత్వం తీసుకునే చర్యలపై స్పష్టత ఇవ్వనుంది. ఆపరేషన్ సిందూర్ చేపట్టడానికి కారణమైన పాక్ రెచ్చగొట్టే చర్యలు, పాక్ బెదిరింపులకు ధీటుగా భారత్ ఆపరేషన్ సిందూర్‌ను ఎలా చేపట్టిందో వివరణ ఇవ్వనుంది. ఆపరేషన్ సమయంలో ఉగ్రవాద స్థావరాలను మాత్రమే కచ్చితంగా లక్ష్యంగా చేసుకొని దాడులు చేశామని, పౌరులకు ఎలాంటి హానీ చేయలేదని ఆధారాలు చూపించనున్నారు. Union Minister Kiren Rijiju tweets "In moments that matter most, Bharat stands united. Seven All-Party Delegations will soon visit key partner nations, carrying our shared message of zero-tolerance to terrorism. A powerful reflection of national unity above politics, beyond… pic.twitter.com/yYiQF4ufEF— ANI (@ANI) May 17, 2025కాంగ్రెస్ లిస్టులో నో శశిథరూర్.. చివరకు ట్విస్ట్..ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ పంపిన జాబితాలో అసలు థరూర్ పేరు లేకపోవడం గమనార్హం. పాక్‌ను ఎండగట్టేందుకు పంపే బృందం కోసం పేర్లు పంపాలని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు మే 16న కాంగ్రెస్‌ను కోరగా, అదే రోజున హస్తం పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ నాలుగు పేర్లు పంపారు. వారిలో కేంద్ర మాజీ మంత్రి ఆనంద్ శర్మ, రాజ్యసభ ఎంపీ డాక్టర్ సయ్యద్ నజీర్ హుస్సేన్, లోక్‌సభ ఎంపీ రాజా బ్రార్, మరో నేత గౌరవ్ గొగొయ్ ఉన్నారని ఆ పార్టీ నేత జైరాం రమేశ్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఆ లిస్ట్‌లో థరూర్ పేరు లేదు. అయితే ఈ రోజు కేంద్రం విడుదల చేసిన తుది జాబితాలో వారి పేర్లేవీ లేవు. కానీ తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌కు మాత్రం అనూహ్యంగా చోటు దక్కింది.మరోవైపు, శశిథరూర్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..‘ఇటీవలి పరిణామాలపై దేశం విధానాన్ని వివిధ దేశాలకు వివరించేందుకు వెళ్తున్న బృందానికి నాయకత్వం వహించడం గౌరవంగా భావిస్తున్నాను. దేశ ప్రయోజనాలతో ముడిపడిన సందర్భాల్లో అక్కడ నా అవసరం ఉంటే.. నేను అందుబాటులో ఉంటా. జైహింద్’ అంటూ వ్యాఖ్యలు చేశారు. Yesterday morning, the Minister of Parliamentary Affairs Kiren Rijiju spoke with the Congress President and the Leader of the Opposition in the Lok Sabha. The INC was asked to submit names of 4 MPs for the delegations to be sent abroad to explain India's stance on terrorism from…— Jairam Ramesh (@Jairam_Ramesh) May 17, 2025

భారత్ దిశగా చైనా గూఢచార నౌక
న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్ర ఘటన అనంతరం భారత్, పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ డ్రాగన్ దేశం కపటబుద్ధి మరోసారి బయట పెట్టుకుంది. ఆ దేశానికి చెందిన గూఢచార నౌక ‘ద యాంగ్ యి హవో’ భారత్ దిశగా వస్తోంది. ఈ విషయాన్ని డామియెన్ సిమోన్ అనే ఓపెన్‌సోర్స్ ఇంటెలిజెన్స్ నిపుణుడు తెలిపారు. చైనాకున్న గూఢచార నౌకల్లో ఇదొకటి. వీటిని పరిశోధన నౌకలని చైనా చెప్పుకుంటున్నప్పటికీ, వీటిని నిఘా నౌకలుగానే భారత్ తదితర దేశాలు పరిగణిస్తున్నాయి. శాస్త్రీయ పరిశోధనలతో పాటు పౌర, సైనిక అవసరాలను తీర్చేలా వీటిని రూపొందించారు. సముద్ర జలాల్లో పరిశోధనలు, సముద్ర గర్భం మ్యాపింగ్, ఖనిజ, జీవ వనరుల అన్వేషణ పేరుతో సంచరించే ఈ నౌకలు క్షిపణుల గమనాన్ని ట్రాక్ చేయగలవు, సబ్మెరీన్ల కదలికలను పసిగట్టడం వంటివి చేయగలవు. తాజాగా, మలక్కా నుంచి బయలుదేరిన ఈ నౌక శ్రీలంక దక్షిణ తీరం దిశగా సాగుతున్నట్లు మ్యాప్‌ను బట్టి సిమోన్ విశ్లేషించారు. ఈ నౌకతో ప్రమాదమేమంటే.. ఇందులో మనుషులతో అవసరం లేకుండా సముద్రం అడుగున సంచరిస్తూ నిఘా కార్యకలాపాలను నిర్వహించే వాహనాలుంటాయి. సముద్రం అడుగున మందుపాతరలు, ఇతర సైనిక కార్యకలాపాలను కనిపెట్టి మ్యాపింగ్ చేస్తాయి. భారత్‌లో క్షిపణి పరీక్షలు, ఇతర సైనిక కార్యకలాపాల సమయంలో చైనా నిఘా నౌకలు పొరుగుదేశాలకు చేరుకుని గూఛచర్యం చేయడం ఇటీవలి కాలంలో మామూలై పోయింది. గతేడాది ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి అగ్ని–5ను ప్రయోగించిన సమయంలో చైనాకే చెందిన జియాంగ్ యాంగ్ హాంగ్ 01 అనే గూఢచర్య మన దేశ సమీపానికి వచ్చింది. ఒడిశాలోని బాలాసోర్ తీరం వెంబడి క్షిపణి పరీక్షలప్పుడు సైతం చైనా నిఘా నౌకలు తూర్పు తీరానికి సమీపంలోకి వచ్చినట్లు తెలిసింది. విశాఖ తీరంలోని సబ్మెరీన్లలోని అణు క్షిపణుల సిగ్నళ్లను సైతం ఇవి కనిపెట్టే అవకాశముందని సమాచారం.
ఎన్ఆర్ఐ

TANA: ‘ఆంధ్ర బాలానంద సంఘం’ ముచ్చట్లు విజయవంతం
డాలస్, టెక్సస్, అమెరికా: తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో “నెల నెలా తెలుగు వెలుగు” పేరిట ప్రతి నెల ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న కార్యక్రమాలలో భాగంగా “రేడియో అన్నయ్య, అక్కయ్య గార్ల స్మృతిలో – “85 వసంతాల ఆంధ్ర బాలానంద సంఘం ముచ్చట్లు” అనే అంశంపై జరిపిన 79 వ అంతర్జాల అంతర్జాతీయ దృశ్య సమావేశం పెద్దల ప్రసంగాలు, బాలానందం పిల్లల పాటలతో కోలాహలంగా జరిగింది.తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు పాల్గొన్న అతిథులందరికీ స్వాగతం పలుకుతూ, బాలలకోసం ఏర్పడిన ఒక సంస్థ 85 వసంతాలు జరుపుకోవడం వెనుక ఈ సంస్థ స్థాపకులైన రేడియో అన్నయ్య, రేడియో అక్కయ్య గార్ల కృషి ఎంతైనా ఉందని అన్నారు.తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు, డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “పిల్లలకు పసిప్రాయంలోనే గేయాలు, రూపకాలు, ఆటలు, పాటలతో తెలుగు భాష, సాహిత్యంపట్ల ఆసక్తి కల్గించి, వారిలో క్రమశిక్షణ, మానసిక వికాసం, విజ్ఞానం, సృజనాత్మకత, నాయకత్వ ప్రతిభను కల్గించడంలో ఆకాశవాణిలో కొన్ని దశాబ్దాలపాటు వారం వారం ‘బాలానందం’ కార్యక్రమంతో పిల్లలకు పెద్దపీట వేసిన రేడియో అన్నయ్య, రేడియో అక్కయ్య గార్ల కృషి అజరామరం అన్నారు. పిల్లలకు చిన్నవయస్సులోనే ఇలాంటి విషయాల పట్ల అవగాహన, ఆసక్తినికల్గించి సరైన దిశానిర్దేశం చెయ్యవలసిన బాధ్యత తల్లిదండ్రులదేనన్నారు. ప్రత్యేక అతిథులుగా పాల్గొన్న శారదా శ్రీనివాసన్ (రేడియో హీరోయిన్, సుప్రసిద్ధ ఆకాశవాణి కళాకారిణి), డా. మండలి బుద్ధప్రసాద్ (అవనిగడ్డ శాసనసభ్యులు, రేడియో అన్నయ్య, అక్కయ్యగార్లతో ప్రత్యక్ష పరిచయం ఉన్నవారు), పద్మభూషణ్ పురస్కార గ్రహీత డా. కె.ఐ. వరప్రసాదరెడ్డి (బాలానంద కార్యక్రమాలను ఆస్వాదించినవారు), డా. మోహన్ కందా, ఐ.ఎ.ఎస్ (ఆంధ్రప్రదేశ్ పూర్వ ప్రధాన కార్యదర్శి, బాలానంద సంఘ పూర్వసభ్యులు), జంధ్యాల కామేశ్వరి-పాప (రేడియో అన్నయ్య గారి మేనకోడలు, ఆంధ్ర బాలానంద సంఘం అధ్యక్షులు), కలగా కృష్ణమోహన్ (బాలానందం పూర్వ సభ్యులు, ఆంధ్ర బాలానంద సంఘం ఉపాధ్యక్షులు, ప్రముఖ గీత రచయిత, సంగీత దర్శకులు) బాలానందం కార్యక్రమంతోను, రేడియో అన్నయ్య, అక్కయ్య గార్లతో తమకున్న ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలతోపాటు ఎన్నో ఆసక్తికర విశేషాలను పంచుకుని వారికి ఘననివాళులర్పించారు. విశిష్టఅతిథులుగా - ఎన్.వి. అశోక్ (విశ్రాంత ఇంజనీర్, ‘బాలానందం’ పూర్వసభ్యులు), రావులపర్తి రాజేశ్వరి (విశ్రాంత బ్యాంకు అధికారి, ‘బాలానందం’ పూర్వ సభ్యురాలు),నండూరి సీతా సాయిరాం (విశ్రాంత ఉపాధ్యాయిని, ‘బాలానందం’ పూర్వ సభ్యురాలు),మాడభూషి బద్రినాథ్ (బాలానందం-నృత్య దర్శకులు), డా. ఆవుల హరిత (బాలానందం-కార్యవర్గ సభ్యురాలు), చినముత్తేవి కరుణ (బాలానందం-గాయకబృందం, శిక్షణా విభాగపు కార్యవర్గసభ్యురాలు), మాలెంపాటి నవ్య (ఐఐటి ఖర్గపూర్, ‘బాలానందం’ సంగీత, నృత్య కళాకారిణి), గోవిందు దేవరాజ (బాలానందం-గాయకబృందం, శిక్షణా విభాగపు కార్యవర్గసభ్యులు) పాల్గొని తమ స్వీయ అనుభవాలను, రేడియో అన్నయ్య, అక్కయ్య గార్లు ఎంతో దూరదృష్టితో స్థాపించిన ఆంధ్ర బాలానందం సంఘం తమ పిల్లల జీవితాలలో తీసుకువచ్చిన మార్పులను వివరించి వారిరువురికి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అన్నారు. తానా ప్రపంచసాహిత్యవేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ - ఒక సంస్థ ఎనిమిదన్నర దశాబ్దాలగా నిరాటంకంగా కొనసాగడం ఒక చరిత్ర అని, ఏ ఆశయంతో రేడియో అన్నయ్య, అక్కయ్య గార్లు ఈ బాలానందం స్థాపించారో, అదే స్ఫూర్తితో ఉత్సాహంగా ఆంధ్ర బాలానంద సంఘం నిర్వహిస్తున్న అధ్యక్షురాలు జంధ్యాల కామేశ్వరి (పాప) వారి కార్యవర్గ సభ్యులకు, ఈ నాటి కార్యక్రమంలో శ్రావ్యంగా పాటలు పాడి ఆనందపరిచిన 25 మందికి పైగా పిల్లలకు, పాల్గొన్న అతిథులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

స్వరలయ ఆర్ట్స్ సింగపూర్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ 6 వ వార్షికోత్సవ వేడుకలు
స్వరలయ ఆర్ట్స్ సింగపూర్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ 6 వ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్ లర్ ఆచార్య వెలుదండ నిత్యానందరావు హాజరయ్యారు. సింగపూర్ లోని తెలుగు వారంతా అన్ని విధాలా సుసంపన్నులని ఈ విధంగా లలిత కళలను ప్రోత్సహించడం ఆనంద దాయకమన్నారు. చిన్నారులు పాడిన పాటలు ఎంతో బాగున్నాయి అని , ఇంత చక్కగా నేర్పిన గురువును నేర్చుకున్న వారి శిష్యులను వారి తల్లిదండ్రులను ప్రశంసించారు. సంగీతం, నాట్యం వంటి కళల ద్వారా మనలో మృదుత్వం కలుగుతుందని, నేటి యాంత్రిక జీవితంలో ఈ మాధ్యమం ఎంతో ముఖ్యం అని కాబట్టి కళల పైన ఉన్న ఆసక్తిని తమ తమ ఆర్థిక సంపాదన రధ చక్రాల కింద పడి నలిగి పోనివ్వవద్దని కోరారు.ఈ కార్యక్రమానికి STS వైస్ ప్రెసిడెంట్ జ్యోతీశ్వర్ , శ్రీ సాంస్కృతిక కలసారథి అధ్యక్షులు కవుటూరు రత్న కుమార్,TCSS అధ్యక్షులు గడప రమేష్, TAS (మనం తెలుగు ) అసోసియేషన్ అనిత రెడ్డి , కమల క్లబ్ మాజీ అధ్యక్షులు, సారీ కనెక్షన్ అడ్మిన్ పద్మజ నాయుడు , మగువ మనసు అడ్మిన్ వీర మాంగోస్ ఉష , సింగపూర్ తెలుగు టీవి రాధాకృష్ణ గణేశ్న , జయంతి రామ, భాగవత ప్రచార సమితి భాస్కర్ ఊలపల్లి, H& H శ్యామల , విష్ణు ప్రియ , సింగపూర్ తెలుగు వనితలు అడ్మిన్స్ క్రాంతి, దేదీప్య, జయ, ప్రత్యూష , అమ్ములు గ్రూపు నుండి అడ్మిన్ సునీత రామ్, , KCAS దివ్య ఇంకా పలువురు సింగపూర్ తెలుగు కమ్యూనిటీ వ్యవస్థాపకులు హాజరయి అందరూ కలిసి వైస్ ఛాన్స్‌లర్‌ను సన్మానించారు. స్వరలయ ఆర్ట్స్, సింగపూర్ వ్యవస్థాపక అధ్యక్షురాలు యడవల్లి శేషుకుమారి వారి శిష్యులు,స్నేహితులు కీర్తనలను ఆలపించారు. పద్మజ నాయుడు మాట్లాడుతూ శేషు గాన కోకిల అని పొగడగా ఆచార్య నిత్యానందరావు గారు కోకిల ఒక కాలంలో మాత్రమే పాడుతుందని కాని ఈమె 365 రోజులు గానం ఆలపిస్తారు అన్నారు. శ్యామల మాట్లాడుతూ వారి వెంకటేశ్వర గానామృతం కార్యక్రమానికి శేషు కుమారి 70 పాటలు 40 రాగాలలో స్వర పరిచి మూడున్నర గంటల సేపు పాడి అందరినీ అలరించిన వైభవం గుర్తు చేసి ఈ రోజుకి ఆ పాటలు తమ చెవులలో ప్రతి ధ్వనిస్తూ పరవసింప చేస్తాయని ప్రశంసించారు.పొట్టి శ్రీరాములు, తెలుగు విశ్వవిద్యాలయం సర్టిఫికేట్ కోర్సు మొదటి వత్సరం, రెండవ సంవత్సరం పరీక్షల్లో ఉత్తీర్ణత పొందిన స్వరలయ ఆర్ట్స్ విద్యార్థులకు వైస్ ఛాన్స్ లర్ బహుమతి ప్రధానం చేశారు. అతిథులకు మొమెంటోలను బహుకరించారు ఈ నెల ఆరవ తారీఖున స్వరలయ ఆర్ట్స్ వారు నిర్వహించిన త్యాగ రాజ ఆరాధన ఉత్సవాలలో పాల్గొని తమతో కలిసి పంచరత్నాలు పాడిన సౌభాగ్య లక్ష్మి తంగిరాల, షర్మిల చిత్రాడ, సౌమ్య ఆలూరు, శరజ అన్నదానం, రాధికా నడదూర్, ప్రియ లకు మొమెంటోలను బహుకరించారు. శివ కుమార్ మృదంగం పై వాయిద్య సహకారం అందించారు ఈ కార్యక్రమానికి శ్రీమతి చైతన్య వ్యాఖ్యాతగా వ్యవహరించారు. పలువురినీ లలిత కళారంగంలో ఉత్సాహ పరుస్తూ ముందుకు నడిచే ఇటువంటి కార్యక్రమానికి దాదాపుగా 200 మంది హాజరు కావటమే కాకుండా, సాంఘిక మాధ్యమాల ద్వారా కూడా వీక్షించి విశేషస్పందనలను తెలియజేయటం అభినందనీయం.

9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు ’’ విశేష సంచిక ఆవిష్కారం
ఖతార్ దేశ రాజధాని దోహా మహానగరంలో 2024 నవంబర్‌లో జరిగిన "9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు" యొక్క సభా విశేష సంచిక అంతర్జాల మాధ్యమంలో ఆదివారం ఆవిష్కరించారు. 'వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా' ,'ఆంధ్ర కళా వేదిక - ఖతార్' సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహింపబడి, మధ్య ప్రాచ్య దేశాలలోనే తొలి సాహితీ సదస్సుగా రికార్డును సృష్టించిన ఈ '9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సులో పది దేశాల నుండి పాల్గొన్న వక్తలు, కవులు, రచయితలు ప్రసంగించిన అన్ని అంశాలను పొందుపరుస్తూ 380 పేజీలతో ఈ సభా విశేష సంచిక రూపొందించబడింది. ఈ ఉద్గ్రంధానికి సంపాదకులుగా రాధికా మంగిపూడి, విక్రమ్ సుఖవాసి, వంగూరి చిట్టెన్ రాజు, లక్ష్మి రాయవరపు, శాయి రాచకొండ వ్యవహరించారు.సదస్సు నిర్వాహకవర్గము, సంచిక సంపాదకులు, సదస్సులో వివిధ దేశాల నుండి పాల్గొన్న వక్తలు, రచయితలు అందరి సమక్షంలో ఈ పుస్తక ఆవిష్కరణ జరగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకించి అంతర్జాల మాధ్యమంలో ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు. మరిన్నిNRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి!వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వ్యవస్థాపకులు డా. వంగూరి చిట్టెన్ రాజు, ఖతార్ ఆంధ్ర కళా వేదిక నుండి విక్రమ్ సుఖవాసి ప్రధాన నిర్వాహకులుగా, వారి అధ్యక్షతన, రాధిక మంగిపూడి సభానిర్వహణలో దాదాపు మూడు గంటల పాటు ఆదివారం సాయంత్రం నిర్వహింపబడిన ఈ కార్యక్రమంలో భారత్, ఖతార్, అమెరికా, సౌదీ అరేబియా, బహరైన్, యూఏఈ, సింగపూర్ తదితర దేశాలనుండి వక్తలు, తెలుగు సంస్థల ప్రతినిధులు, రచయితలు పాల్గొన్నారు.అమెరికా నుండి చెరుకూరి రమాదేవి, శాయి రాచకొండ, భారత్ నుండి డా. వంశీ రామరాజు, డా. అద్దంకి శ్రీనివాస్, డా. బులుసు అపర్ణ, ఆచార్య అయ్యగారి సీతారత్నం, ఆచార్య త్రివేణి వంగారి, కస్తూరి అలివేణి, డా. దేవులపల్లి పద్మజ తదితరులు, బహరైన్ నుండి మురళీకృష్ణ, సౌదీ అరేబియా నుండి కోనేరు ఉమామహేశ్వరరావు, చివుకుల పట్టాభిరామ శర్మ, సింగపూర్ నుండి కవుటూరు రత్నకుమార్, యూఏఈ నుండి షేక్ రఫీ, డా. తాడేపల్లి రామలక్ష్మి, ఖతార్ నుండి శ్రీసుధ, గోవర్ధన్ రెడ్డి, మనీష్, మాధవి లలిత, గౌరీ బొమ్మన తదితరులు ఆసక్తిగా పాల్గొని సదస్సు యొక్క జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.ఈ సభా విశేష సంచికలో నిర్వాహక సంస్థల పరిచయాలు, అధ్యక్షుల, సంచాలకుల ముందుమాటలు, సదస్సు ప్రకటనలు, వక్తలందరి ఫోటోలు, వ్యాసాలు, కథలు, కవితలతో పాటు, సదస్సు అనంతరం అందరూ అందించిన స్పందనలు కూడా జోడించడం, ఆనందంగా ఉందని, జీవితంలో ఒక మధుర జ్ఞాపకంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ సంచిక ఉందంటూ సంపాదకులను నిర్వాహకులను అభినందించారు.డా. వంగూరి చిట్టెన్ రాజు మాట్లాడుతూ "మధ్యప్రాచ్య దేశాలలో తెలుగు సాహిత్య అభిమానులందరికీ ఈ సదస్సు కొత్త స్ఫూర్తిని అందించిందని, సదస్సు ప్రభావం వలన ఎంతోమంది సాహిత్యంపై చక్కటి ఆసక్తి పెంచుకోవడం, కొత్త రచయితలు జనించడం.. ఆనందదాయకమని తెలియజేశారు. ఇటువంటి సదస్సులు మరిన్ని జరగాలని, కొత్త రచయితలు యువతరం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. విక్రమ్ సుఖవాసి ఆంధ్ర కళావేదిక తరపున మరొకసారి అందరికీ తమ దేశానికి విచ్చేసి కార్యక్రమంలో పాల్గొన్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ తొలిసారి ప్రపంచ సదస్సుకు సంచాలకునిగా ఈ సంచికకు సహసంపాదకునిగా ఉండడం చాలా ఆనందంగా ఉందన్నారుఈ సంచికకు రూపకల్పన సహకారం అందించిన జేవి పబ్లికేషన్స్ అధినేత్రి జ్యోతి వలబోజు కూడా ఈ ఆవిష్కరణలో పాల్గొన్నారు. ఇతర మధ్యప్రాచ్య దేశాల సంస్థల ప్రతినిధులు మాట్లాడుతూ తమ దేశాలలో కూడా ఇటువంటి సాహిత్య సదస్సులు నిర్వహించడానికి తాము సిద్ధంగా ఉన్నామని 10వ ప్రపంచ సదస్సు జరపడానికి అవకాశం ఇమ్మని కోరుతూ తమ ఉత్సాహాన్ని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమం వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా యూట్యూబ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారమైంది.

న్యూజెర్సీ, పార్సిప్పనీలో వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం
న్యూజెర్సీలోని పార్సిప్పనీలో శ్రీ సీతారాముల కల్యాణం రమణీయంగా, కమనీయంగా సాగింది. న్యూయార్క్‌లోని శ్రీ రంగనాథ ఆలయం నుంచి స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను తీసుకొచ్చారు. వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ ఊరేగింపుగా కల్యాణ మండపానికి స్వర్ణ సింహాసనంపై స్వామివారిని, అమ్మవారిని ఆసీనులను చేశారు. కళ్యాణం సందర్భంగా భక్తులు చేయించిన అభరణాలను వధూవరులకు ధరింపజేశారు. రాముల వారికి, సీతమ్మ వారికి పట్టు వస్త్రాలు, తాళిబొట్టు, మెట్టలు, ఆభరణాలు, ముత్యాల తలంభ్రాలను సమర్పించారు. మేళంతో ఊరేగింపుగా పట్ట వస్త్రాలను తీసువచ్చారు. సీతమ్మ, రామయ్యల ఎదుర్కోలు ఘట్టం కనులారా తిలకించిన భక్తులు ఆనందపరవశులయ్యారు. భక్తజనంతో న్యూజెర్సీలో పండగ వాతావరణం నెలకొంది. సంస్కృతి, సంప్రదాయలకు అనుగుణంగా వివాహ వ్యవస్థపై కృష్ణ దేశిక జీయర్ స్వామిజీ చేసిన వ్యాఖ్యానం విశేషంగా ఆకట్టుకుంది. దండలు మార్చుకునే క్రమంలో అర్చకులు నృత్య ప్రదర్శన చేసి సంప్రదాయాన్ని గుర్తు చేశారు. మరిన్నిNRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి!అనంతరం గణపతి పూజ, విశ్వక్సేన ఆరాధన, మహాసంకల్పం, మంగళఅష్టకాలు, కన్యాదానం, తలంబ్రాల ఘట్టం, పూలదండల మార్పు, మహా హారతి, నివేదన తదితర ఘట్టాలు శాస్త్రోక్తంగా జరిగాయి. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, భక్తుల జయజయధ్వానాల నడుమ జగదభిరాముడు జానమ్మను మనువాడారు. కోదండ రాముడు సీతమ్మ మెడలో మూడుముళ్లు వేసిన వేళ, రఘునందనుడి దోసిట తలంబ్రాలు ఆణిముత్యాలే నీలపురాశులుగా, జగన్మాత లోకపావని సీతమ్మ దోసిట అక్షింతలు మణిమాణిక్యాలై సాక్షాత్కారించిన వేళ కల్యాణ ప్రాంగణం భక్తిపారవశ్యంతో ఓలలాడింది.ఈ సీతారాముల కాళ్యానికి పార్సిప్పనీకి మేయర్ జేమ్స్ బార్బెరియోతో పాటు 300 మందికి ప్రవాస తెలుగువారు సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేశారు. దాదాపు అందరూ సంప్రదాయబద్ధంగా తయారై కళ్యాణంలో పాల్గొన్నారు. 72 పైగా జంటలు ఈ కళ్యాణ మహోత్సవంలో పాలు పంచుకున్నాయి. ఈ కల్యాణాన్ని ప్రవాసులు కన్నులారా వీక్షిం చి తరించారు. ఈ ఉత్సవం.. భద్రాచల రాముల వారి కళ్యాణమహోత్సవాన్ని తలపించింది. కల్యాణం అనంతరం ఉత్సవ మూర్తులను భక్తులు దర్శనం చేసుకున్నారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు, అక్షింతలు అందజేశారు.
క్రైమ్

రేణిగుంటలో 24.5 కిలోల గంజాయి స్వాధీనం
రేణిగుంట (శ్రీకాళహస్తి రూరల్): ఒడిశా నుంచి కేరళకు గంజాయి తరలించేందుకు ప్రయత్నించిన ఇద్దరు పశ్చిమ బెంగాల్ మహిళలను రేణిగుంట పోలీసులు గురువారం అరెస్టు చేశారు. రేణిగుంట లాడ్జిలో ఉన్న వారి వద్ద నుంచి 24.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గురువారం తిరుపతి జిల్లా ఏఎస్పీ రవిమనోహరాచారి తెలిపిన వివరాల మేరకు.. పోలీసులకు వచ్చిన రహస్య సమాచారం మేరకు రైల్వేస్టేషన్ సమీపంలోని ఎస్బీఎస్ లాడ్జిలోని 207 గదిలో డీఎస్పీ శ్రీనివాసరావు పర్యవేక్షణలో సీఐ జయచంద్ర, ఎస్ఐ అరుణ్‌కుమార్‌రెడ్డి సిబ్బందితో సోదాలు నిర్వహించారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన మమోని మొండాల్ (31), నమితా మొండాల్ (37) లను అదుపులోకి తీసుకుని, రెండు సూట్‌కేస్‌లలో ఉన్న రూ.2.45 లక్షల విలువ చేసే 24.5 కిలోల గంజాయిని స్వాదీనం చేసుకున్నారు. ఈ గంజాయిని ఒడిశా నుంచి రైల్లో కేరళ తీసుకెళుతుండగా వారి సంబం«దీకుల నుంచి సూచన రావడంతో రేణిగుంటలో దిగి లాడ్జిలో బస చేశారు.వారిద్దరినీ అరెస్టుచేసి కోర్టులో హాజరుపరిచారు. విచారణలో వారు చెప్పిన ఇద్దరు అంతర్ రాష్ట్ర స్మగ్లర్లను అరెస్ట్ చేయాల్సి ఉంది. ఈ కేసుకు సంబంధించి సీఐ జయచంద్ర, సిబ్బందిని ఎస్పీ హర్షవర్ధన్‌రాజు అభినందించినట్లు ఏఎస్పీ తెలిపారు.

అర్ధరాత్రి క్షుద్రపూజల కలకలం..!
కర్నూలు: పట్టణంలోని కర్నూలు – బెంగళూరు జాతీయ రహదారి పక్కన చెరుకులపాడు క్రాస్ రోడ్డులోని ఓ ఇంట్లో క్షుద్రపూజలు చేసి న ఫొటోలు, వీడియో లు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి. ఓ వ్యక్తి మీద చేతబడి ప్రయోగించినట్లుగా తెలుస్తోంది. ఇందుకు పట్టణానికి చెందిన వ్యక్తి సూత్రధారిగా ఉండి కొందరి ఫొటోలతో, భయానక చేతబడి చేస్తున్నప్పటి ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి. సేకరించిన సమాచారం మేరకు.. పట్టణానికి చెందిన వ్యక్తి సిఫారసుతో చెరుకులపాడు క్రాస్ రోడ్డులోని ఓ ఇంటిని అద్దెకు తీసుకున్న వారు అందులో చేతబడులు చేస్తూ, గుప్తనిధుల వేటగాళ్లకు ఆసరాగా ఉంటున్నట్లుగా తెలుస్తోంది. ఎమ్మిగనూరుకు చెందిన వ్యక్తికి అప్పు ఉండ గా అప్పు ఎగ్గొట్టేందుకు ఏకంగా ఆ వ్యక్తిపై చేతబడి ప్రయోగం చేసినట్లు సమాచారం. ఇందులో పట్టణానికి చెందిన పంచాయతీ కార్యాలయంలో అనధికారికంగా పనిచేస్తున్నకార్మికుడి ఫొటో ఉంది. ఇటీవల ఉలిందకొండకు చెందిన వ్యక్తిపై కూడా ఇక్కడి నుంచే చేతబడి ప్రయోగం చేసినట్లుగా తెలుసుకున్న ఉలిందకొండ వారు ఈ ఇంటికి చేరుకుని ఇంట్లో ఉన్నవారితో గొడవ పడినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఈ ఇళ్లు కేంద్రంగా రెండు నెలల పాటు మండలం వ్యాప్తంగా గుప్తనిధుల వేట కొనసాగినట్లుగా సైతం తెలుస్తోంది. పోలీసులకు సైతం సమాచారం అందినా చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది.

భర్త మరణాన్ని జీర్ణించుకోలేక భార్య ఆత్మహత్య
ఉయ్యాలవాడ: విధి ఆటలో ఓ చిన్నారి అనాథగా మారింది. అభంశుభం తెలియని పసిపాప తొమ్మిది రోజుల వ్యవధిలో తల్లిదండ్రులను కోల్పోయింది. ఈ విషాద ఘటన ఆర్. పాంపల్లె గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పొగాకు నారాయణ కూలీ పనులకు వెళుతూ జీవనం కొనసాగించేవాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 6వ తేదీన గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి చెందిన మట్టి మిద్దె పనులకు వెళ్లాడు. ఆ సమయంలో ప్రమాదవశాత్తూ మిద్దె కూలి శిథిలాలు నారాయణపై పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అప్పటి నుంచి అతని భార్య లలిత (40) తీవ్ర మనోవేదనకు గురైంది. మనస్తాపంతో వారం రోజులుగా ఆహారం తీసుకోకుండా భర్త గురించే ఆలోచించింది. తన 45 రోజుల చిన్నారికి కూడా పోతపాలు తాపింది. చివరకు జీవితంపై విరక్తి చెంది బుధవారం ఉదయం లలిత రసాయన పౌడర్‌ను నీళ్లలో కలుపుకుని అపస్మారక స్థితిలో పడిపోయింది. గమనించిన బంధువులు, స్థానికులు చికిత్స నిమిత్తం 108లో ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం నంద్యాలకు తరలిస్తుండగా మార్గమధ్యలో లలిత మృతి చెందింది. తల్లిదండ్రుల మృతి చెంద డంతో 45 రోజుల చిన్నారి అనాథగా మిగిలింది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పసిపాపకు తల్లిదండ్రులు లేకపోవడంతో నాయనమ్మ శివమ్మ దిక్కైంది. అమ్మపాల కోసం ఏడస్తున్న చిన్నారిని చూసి పలువురు కంటతడి పెట్టారు. కాగా నారాయణ మొదటి భార్య విజయలక్ష్మి ఐదేళ్ల క్రితం కుటుంబ కలహాలతో క్రిమి సంహారక మందు తాగి మృతి చెందింది. రెండేళ్ల క్రితం లలితను రెండవ వివాహం చేసుకున్నాడు. మృతురాలి తల్లి నారాయణమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్.. ఇటీవల జిల్లాలో పలువురు ఆత్మహత్యకు కల్లాపికి ఉపయోగించే పేడ రంగును నీళ్లలో కలుపుకుని తాగి మృతి చెందుతుండటంతో కలెక్టర్ రాజకుమారి నెల క్రితం పేడ రంగు విక్రయాలను నిషేధించారు. అయినా కొందరు కిరాణ దుకాణ వ్యాపారులు విక్రయిస్తున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. పేడ రంగు విక్రయించకుండా అధికారులు దుకాణాలపై దాడులు చేయా లని గ్రామస్తులు కోరుతున్నారు.

తాళిబొట్లు తెంచి పడేసి హిజ్రాల ఆవేదన..!
తమిళనాడు: కూవాగంలో గత కొద్ది రోజులు సందడి చేసిన హిజ్రాలు బుధవారం విషాదంతో స్వస్థలాలకు తిరుగు పయనం అయ్యారు. మంగళవారం ఎంతో ఆనందంగా కట్టుకున్న మంగళ సూత్రాలను తెంచి పడేసి ఒప్పారి పెట్టారు. తెల్ల చీరలు ధరించి వితంతువులుగా మారి కూవాగం నుంచి తిరుగు పయనం అయ్యారు. ముందుగా ఉదయం కూత్తాండవర్ రథోత్సవం అత్యంత వేడుకగా జరిగింది. రాష్ట్రంలోని కళ్లకురిచ్చి జిల్లా ఉలుందూర్ పేట సమీపంలోని కూవాగం గ్రామంలోని కూత్తాండవర్ ఆలయంలో రెండు వారాల పాటు చిత్తిరై ఉత్సవాలు అత్యంత వేడుకగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా గత మూడు రోజులు హిజ్రాల సందడితో కూవాగం కళకళలాడింది. భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి, ఆలయ పూజారి చేతుల మీదుగా మంగళవారం హిజ్రాలు తాళిబొట్లు కట్టించుకున్నారు. రాత్రంతా ఆట పాటలతో సందడి చేశారు. రథోత్సవం బుధవారం ఉదయం కూత్తాండవర్ రథోత్సవం ఘనంగా జరిగింది. ఈ రథోత్సవాన్ని తిలకించేందుకు వేలాదిగా జనసందోహం తరలివచ్చారు. ఈ వేడుక కోసం కూవాగం, పందలాడి, కిలక్కు కుప్పం, శిరులాయం కుళం గ్రామాల నుంచి ప్రజలు చేతులు, కాళ్లు, భుజాలు, శిరస్సు ఆకారాలను తీసుకొచ్చి రథంపై ఉంచారు. బ్రహ్మాండంగా కూత్తాండవర్ రథోత్సవ సేవ జరిగింది. అనంతరం బలిదానం జరిగింది. బలిదానంలో తమ ఆరాధ్యుడు బలి కావడంతో తమ భర్తను కోల్పోయినంతగా తీవ్ర వేదనతో ఒక్కసారిగా హిజ్రాలు విషాదంలో మునిగారు. తాము కట్టుకున్న మంగళ సూత్రాలను తెంచి పడేసి కన్నీటి సంద్రంలో మునిగారు. ఏడుపులు, పెడ»ొబ్బలతో ఒప్పారి పెట్టారు. అక్కడి కొలనులో స్నానం చేసి తెల్ల చీరల్ని ధరించి తమ స్వస్థలాలకు తిరుగు పయనమయ్యారు.