Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Pakistan Again Nuclear Warning To India1
అదే జరిగితే.. భారత్‌కు పాక్‌ మరోసారి అణు బెదిరింపులు

మాస్కో: పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత్‌ చేపడుతున్న చర్యలు.. పాక్‌ను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఈ క్రమంలో మేకపోతే గాంభీర్యం ప్రదర్శిస్తోంది. తాజాగా రష్యాలోని పాక్‌ దౌత్యవేత్త మహమ్మద్‌ ఖలీద్‌ జమాలీ అణు బూచిని భారత్‌కు చూపించి బెదిరించే యత్నం చేశారు. ఒక వేళ న్యూఢిల్లీ తమపై దాడి చేస్తే.. అణ్వాయుధాలు సహా పూర్తి శక్తిని వినియోగిస్తామని పేర్కొన్నారు. రష్యా ఛానల్‌ ఆర్‌టీకి ఇంటర్వ్యూ ఇస్తూ.. భారత్‌కు చెందిన బాధ్యతారాహిత్య మీడియా నుంచి వస్తున్న ప్రకటనలు మమ్మల్ని తప్పనిసరిగా స్పందించేలా చేస్తున్నాయి. ఇటీవల లీకైనట్లు చెబుతున్న పత్రాల్లో భారత్‌ కొన్ని చోట్ల కచ్చితంగా దాడులు చేయబోతున్నట్లు తెలిసింది. ఆ దేశంతో యుద్ధం విషయానికి వస్తే ప్రజల మద్దతుతో మా సంప్రదాయ, అణు బలంతో పూర్తిస్థాయిలో స్పందిస్తాం’’ అని జమాలీ పేర్కొన్నారు. గత వారం ఆ దేశ రైల్వేశాఖ మంత్రి హనీఫ్ అబ్బాసీ మాట్లాడుతూ తమ వద్ద ఉన్న ఘజన్నవీ, ఘోరీ, షహీన్‌ క్షిపణులు, 130 అణ్వాయుధాలు భారత్‌ కోసమే ఉంచినట్లు ప్రకటించారు. పాక్‌ ప్రేరిత ఉగ్రవాదులు పహల్గాంలోని బైసరన్‌ లోయలో దాడి చేసి 26 మంది అమాయకుల ప్రాణాలు తీయడం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ టెర్రరిస్టులు పాక్‌ జాతీయులని తేలింది. దీంతో భారత్‌ ప్రతిచర్యలకు దిగింది. ఇప్పటికే సింధుజలాల ఒప్పందాన్ని నిలిపివేసి ఇస్లామాబాద్‌కు భారత్‌ కోలుకోలేని షాక్‌ ఇచ్చింది. ఉగ్రవాదులు, ఆ మూకలకు మద్దతు ఇచ్చే వారిపై చర్యలు తీసుకొనే విషయంలో భద్రతా దళాలకు ప్రధాని మోదీ పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. ఎక్కడ, ఎప్పుడు ఎలా దెబ్బకొట్టాలో వారే నిర్ణయిస్తారన్నారు. సైనిక చర్య కూడా ఉండొచ్చన్న ఆందోళనతో.. యుద్ధం వస్తే తాము అణ్వాయుధాలు వాడతామంటూ పాక్‌ ప్రకటనలు గుప్పిస్తోంది.

Kadapa Muslims JAC Shocks TDP Leaders2
ఏంటి డ్రామాలా?.. టీడీపీ నేతలకు షాక్‌

వైఎస్సార్‌ జిల్లా, సాక్షి: కడపలో తెలుగు దేశం పార్టీ నేతలకు చేదు అనుభవం ఎదురైంది. వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా చేపట్టిన లాంగ్ మార్చ్‌కు మద్దతు తెలిపేందుకు వెళ్లగా.. టీడీపీ నేతలు డ్రామాలు ఆపాలంటూ నిర్వాహకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. చట్టానికి మద్దతు తెలిపి టీడీపీ ముస్లింల గొంతు కోసిందని మండిపడ్డారు. వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కడపలో జేఏసీ ఆధ్వర్యంలో భారీ లాంగ్ మార్చ్ చేపట్టింది. అయితే ర్యాలీ ప్రారంభం కాకముందే.. టీడీపీ నేత అమీర్‌ బాబు కొందరు కార్యకర్తలతో అక్కడికి చేరుకున్నారు. అయితే వాళ్లను నిర్వాహకులు అడ్డుకున్నారు. పార్లమెంటులో బిల్లుకు మద్దతు తెలిపి ఇక్కడ డ్రామాలు వద్దంటూ నినాదాలు చేశారు. టీడీపీ ఎంపీలు రాజీనామా చేశాకే ఇలాంటి ర్యాలీలకు రావాలంటూ స్పష్టం చేశారు. ఈ క్రమంలో.. నినాదాలు హోరెత్తడంతో చేసేదేమీ లేక అమీర్‌బాబు తన అనుచర గణంతో వెనుదిరిగి వెళ్లిపోయారు.

Gujarati Man Breaks into Seema Haider House Then Happend This Next3
సీమా హైదర్‌ ఇంట్లోకి చొరబడి మరీ..

న్యూఢిల్లీ: పహల్గాం దాడి తర్వాత పాక్‌-భారత్‌ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. ఇరు దేశాల పౌరులను సొంత దేశాలకు వెళ్లాలంటూ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. తాజాగా ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.సరిగ్గా రెండేళ్ల కిందట.. భారతదేశంలోని ప్రియుడి కోసం భర్తను వదిలేసి నలుగురు పిల్లలతో మరీ భారత్‌కు వచ్చేసింది సీమా హైదర్‌(37). అంతేకాదు.. ప్రియుడు సచిన్‌ మీనాను పెళ్లాడి ఓ బిడ్డను సైతం కన్నది. అయితే ప్రస్తుత పరిస్థితుల నడుమ ఆమెను పాక్‌కు పంపించాలా? వద్దా? అనేదానిపై అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. అయితే తాను మాత్రం ఇక్కడి కోడలినేనని, తనను వెనక్కి పంపించొద్దంటూ ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగిని ఆమె వేడుకుంటోంది. ఈలోపు..ఓ వ్యక్తి సీమా హైదర్‌ ఇంట్లోకి చొరబడ్డాడు. వెనుక నుంచి వెళ్లి ఆమెపై దాడికి ప్రయత్నించబోయాడు. అయితే అది గమనించిన ఆమె భర్త సచిన్‌.. ఆ ఆగంతకుడ్ని నిలువరించగలిగాడు. స్థానికుల సాయంతో పోలీసులకు అప్పగించాడు. సదరు నిందితుడి తేజాస్‌గా పోలీసులు నిర్ధారించారు.గుజరాత్‌ సురేందర్‌ నగర్‌కు చెందిన తేజస్‌.. న్యూఢిల్లీకి రైలు ద్వారా వచ్చాడు. అక్కడి నుంచి బస్సులోసీమా హైదర్‌ ఉంటున్న గ్రేటర్‌ నోయిడా ప్రాంతానికి చేరాడు. అతని ఫోన్‌లో సీమా హైదర్‌కు చెందిన ఫొటోల స్క్రీన్‌ షాట్స్‌ ఉన్నాయి. అతను ఏ ఉద్దేశంతో ఆ ఇంట్లోకి చొరబడ్డాడు అనేది తెలియాల్సి ఉంది అని పోలీసులు చెబుతున్నారు. అయితే సీమా హైదర్ తనపై చేతబడి చేస్తోందని.. అందుకే ఆమెను కట్టడి చేయడానికి ఇచ్చానని తేజస్‌ చెబుతున్నాడు. ఇది నమ్మశక్యంగా లేదని పోలీసులు చెబుతున్నారు. అతని మానసిక స్థితి బాగోలేదా? కావాలనే‌ ఇలా చేస్తున్నాడా? అనేది నిర్ధారించుకోవాల్సి ఉందని చెబుతున్నారు.

Baloch rebels capture major city And seize in Pakistan4
భారత్‌తో టెన్షన్‌ వేళ పాక్‌కు షాక్‌.. ఊహించని దెబ్బకొట్టిన బీఏల్‌ఏ

క్వెట్టా: పహల్గాం ఘటన తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ దాయాది దేశానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. పాకిస్తాన్ సైన్యానికి బలోచ్ లిబరేషన్ ఆర్మీ నుంచి ఊహించని షాక్‌ తగిలింది. పాక్‌ సైన్యానికి సవాల్‌ విసురుతూ కీలకమైన మంగుచోర్ పట్టణాన్ని బీఎల్ఏ స్వాధీనం చేసుకుంది. ఇదే సమయంలో సైనిక, ప్రభుత్వ అధికారులను సైతం బందీలుగా పట్టుకుంది. అలాగే, బీఎల్‌ఏ బలగాలు.. క్వెట్టా నగరం దిశగా వెళ్తున్నట్టు తెలుస్తోంది.వివరాల ప్రకారం.. ఇటీవలి కాలంలో పాకిస్తాన్‌ ప్రభుత్వం, సైన్యాన్ని టార్గెట్‌ చేసిన బీఎల్‌ఏ దాడులు చేసింది. ఇక, తాజాగా పాక్‌ సైన్యంపై తిరుగుబాటు చేసింది. పాకిస్తాన్ ప్రభుత్వం, సైన్యంపై బలోచ్ లిబరేషన్ ఆర్మీ సవాల్ విసిరింది. కీలకమైన మంగుచోర్ పట్టణాన్ని బీఎల్ఏ స్వాధీనం చేసుకుంది. బీఎల్ఏకు చెందిన అత్యంత క్రూరమైన, ప్రత్యేక శిక్షణ పొందిన 'డెత్ స్క్వాడ్' బృందం ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నట్లు సమాచారం. ఈ బృందం మంగుచోర్ పట్టణంలోకి చొచ్చుకెళ్లి, అక్కడ ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలను, భద్రతా సంస్థల ప్రాంగణాలను తమ అదుపులోకి తీసుకుంది. ఇంతటితో ఆగకుండా, పట్టణంలో విధులు నిర్వహిస్తున్న కొంతమంది ఉన్నత స్థాయి సైనిక, ప్రభుత్వ అధికారులను సైతం బందీలుగా చేసుకుంది.బలుచిస్తాన్‌ను ప్రత్యేక దేశంగా ప్రకటించాలని బీఎల్‌ఏ పోరాడుతోంది. ఈ క్రమంలో బీఎల్‌ఏ వరుస దాడులతో బలూచిస్తాన్‌పై పాకిస్తాన్‌ నియంత్రణ కోల్పోతోంది. ఇక, ఇప్పటికే బీఎల్‌ఏ దాడుల్లో వందలాదిమంది పాక్‌ సైనికులు మృతి చెందారు. కొన్ని రోజుల క్రితం పాక్‌ సైనికులు వెళుతున్న ట్రైన్‌ని హైజాక్‌ చేసిన బీఎల్‌ఏ.. పాక్‌ సైనికులను హతమార్చింది. కొద్ది రోజుల క్రితం బీఎల్‌ఏ పాక్‌ సైన్యం కాన్వాయ్‌పై ఐఈడీ దాడి చేయడంతో ఏకంగా 10 మంది పాకిస్తాన్ సైనికులు మరణించారు. ఈ పరిణామాల నేపథ్యంలో వారు ఎంత దూకుడుగా వ్యవహరించడానికి సిద్ధంగా ఉన్నారో పాక్ ప్రభుత్వానికి హెచ్చరికలు చేస్తున్నారు.Baloch sarmachars are roaming openly through Mangocher city, seizing control of banks, as well as government and military assets. Certain handles suggest that government personnel have been forced to evacuate, and that several state institutions are no longer operational.… https://t.co/h9KewE0JZc pic.twitter.com/P4mdw3l6aG— Char (@cqc_coffee_guns) May 3, 2025ఇదిలా ఉండగా.. పాకిస్తాన్‌లోని నైరుతి ప్రాంతమే బలూచిస్తాన్‌. ఇది పాక్‌లో ఒక ప్రావిన్స్‌గా ఉంది. పాకిస్తాన్‌ మొత్తం విస్తీర్ణంలో 44 శాతం బలూచిస్తాన్ ఉంటుంది. విస్తీర్ణంపరంగా పాకిస్థాన్‌లో అతి పెద్ద ప్రావిన్స్‌గా బలూచిస్తాన్‌ ఉంది. అలాగే మిగతా అన్ని ప్రావిన్స్‌లో కెల్లా అతి తక్కువ జనాభా ఉన్న ప్రావిన్స్‌ కూడా బలూచిస్తానే. బలూచిస్తాన్‌లో చమురు, బొగ్గు, బంగారం, రాగి, సహజ వాయువు వనరులు పుష్కలంగా ఉన్నాయి. బ్రిటిష్‌ ఇండియాలో విలీనం చేయకముందువరకు బలూచిస్తాన్‌ స్వతంత్ర దేశంగానే ఉండేది. బ్రిటిష్‌ వారి నుంచి మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత దేశ విభజన తర్వాత పాకిస్తాన్‌లో భాగమైంది. ఆ తర్వాత కొంత కాలానికి స్వతంత్ర దేశం కోసం బలూచిస్తాన్‌ నుంచి డిమాండ్‌ పుట్టుకొచ్చింది.అలాగే ఆ ప్రావిన్స్‌లో పాక్‌ సాగిస్తున్న మారణకాండ కూడా తిరుగుబాటుకు మరో కారణం. 2011 నుంచి 2024 జనవరి వరకు పాక్‌లో మొత్తం 10,078 మంది అదృశ్యం అయ్యారు. అదృశ్యమైనవారిలో 2,752 మంది బలూచ్‌ పౌరులే. 2001-2017 మధ్య 5,228 మంది బలూచ్‌ పౌరులు అదృశ్యం కావడం గమనార్హం. ప్రస్తుతం బీఎల్‌ఏ యాక్టివ్‌గా వేర్పాటువాద కార్యకలాపాలు సాగిస్తోంది. బలూచిస్తాన్‌ స్వతంత్ర దేశం కావాలనే డిమాండ్‌తో బీఎల్‌ఏ ఏర్పాటైంది. దశాబ్ద కాలంగా పాకిస్తాన్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తోంది.

IPL 2025: Dhoni Comments After Losing To RCB At Bengaluru5
RCB VS CSK: ఓటమికి నాదే బాధ్యత.. అతను గొప్పగా ఆడాడు: ధోని

నిన్న (మే 3) ఆర్సీబీ చేతిలో (బెంగళూరులో) ఎదురైన ఓటమికి సీఎస్‌కే స్టాండ్‌ ఇన్‌ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని బాధ్యత తీసుకున్నాడు. మ్యాచ్‌ అనంతరం మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పాడు. ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే 214 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదిస్తూ చివరి బంతి వరకు పోరాడింది. ధోని క్రీజ్‌లోకి వచ్చే సమయానికి సీఎస్‌కే గెలుపుకు 21 బంతుల్లో 42 పరుగులు కావాలి. 17వ ఓవర్‌లో జడేజా ఓ సిక్సర్‌ బాదడంతో సమీకరణలు 18 బంతుల్లో 35 పరుగులకు మారాయి. అప్పటికి వరకు మ్యాచ్‌ సీఎస్‌కే చేతుల్లోనే ఉండింది. అప్పటికే మ్యాచ్‌లో 22 సిక్సర్లు నమోదై ఉండటం, మంచు కూడా బ్యాటర్లకు అనుకూలంగా ప్రభావం​ చూపిస్తుండటంతో సీఎస్‌కే సునాయాసంగా గెలుస్తుందని అంతా అనుకున్నారు. అయితే అప్పటికే క్రీజ్‌లో సెట్‌ అయిన జడేజా, అప్పుడే వచ్చిన ధోని 18వ ఓవర్‌ వేసిన సుయాశ్‌ శర్మను డీల్‌ చేయలేకపోయారు. వీరిద్దరు ఈ ఓవర్‌లో కేవలం​ 6 పరుగులు మాత్రమే సాధించారు. దీంతో చివరి రెండు ఓవర్లలో సీఎస్‌కే గెలుపుకు 29 పరుగులు అవసరమయ్యాయి. భువీ వేసిన 19వ ఓవర్‌ను జడేజా బౌండరీతో మొదలుపెట్టాడు. ఆతర్వాత ఐదో బంతికి ధోని సిక్సర్‌ కొట్టాడు. ఈ ఓవర్‌లో సీఎస్‌కే 14 పరుగులు రాబట్టి గెలుపు దిశగా పయనించింది.చివరి ఓవర్‌లో ఆ జట్టు గెలుపుకు 15 పరుగులు అవసరమయ్యాయి. క్రీజ్‌లో ధోని, జడేజా ఉండటంతో సీఎస్‌కే గెలుపు ఖాయమే అని అంతా అనుకున్నారు. అయితే ఈ ఓవర్‌లో దయాల్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేసి ధోని వికెట్‌ తీయడమే కాకుండా సీఎస్‌కేను​ 12 పరుగులకే పరిమితం చేశాడు. ఫలితంగా సీఎస్‌కే లక్ష్యానికి మూడు పరుగుల దూరంలో నిలిచిపోయింది. మూడో బంతికి ధోని ఔటయ్యాక కూడా సీఎస్‌కే మ్యాచ్‌లో ఉండింది. నాలుగో బంతికి దూబే సిక్సర్‌ బాదాడు. ఆ బంతి నో బాల్‌ కూడా అయ్యింది. దీంతో చివరి మూడు బంతుల్లో కేవలం​ ఆరు పరుగులే అవసరమయ్యాయి. ఈ దశలో దయాల్‌ అత్యద్భుంగా బౌలింగ్‌ చేసి మూడు బంతులకు మూడు సింగిల్స్‌ మాత్రమే ఇచ్చాడు. దీంతో సీఎస్‌కే 2 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.మ్యాచ్‌ అనంతరం ధోని మాట్లాడుతూ ఓటమికి తనే బాధ్యత తీసుకుంటున్నానని చెప్పాడు. తాను క్రీజ్‌లోకి వచ్చిన సమయానికి సీఎస్‌కేకు విజయావకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డాడు. ఆ సమయంలో తాను మరిన్ని షాట్లు ఆడాల్సిందని తెలిపాడు. తద్వారా సీఎస్‌కేపై ఒత్తిడి తగ్గేదని అన్నాడు.వాస్తవానికి ఈ మ్యాచ్‌ను సీఎస్‌కే రెండు ఇన్నింగ్స్‌లలో చివరి ఓవర్లలో కోల్పోయింది. బౌలింగ్‌ చేస్తూ తొలుత భారీగా పరుగులు సమర్పించుకున్నా.. పతిరణ (4-0-36-3), నూర్‌ అహ్మద్‌ (4-0-26-1) మధ్య ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. అయితే సీఎస్‌కేకు భారీ డ్యామేజీ చివరి రెండు ఓవర్లలో జరిగింది. రొమారియో షెపర్డ్‌ ఆకాశమే హద్దుగా చెలరేగి ఆ రెండు ఓవర్లలో ఏకంగా 54 పరుగులు రాబట్టాడు.భారీ లక్ష్య ఛేదనలోనూ సీఎస్‌కే చివరి నాలుగు ఓవర్ల వరకు విజయం దిశగా సాగింది. ఆయుశ్‌ మాత్రే (48 బంతుల్లో 94; 9 ఫోర్లు, 5 సిక్సర్లు), రవీంద్ర జడేజా (45 బంతుల్లో 77 నాటౌట్‌; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) అద్భుతమైన ఇన్నింగ్స్‌ల సాయంతో అప్పటి వరకు కంఫర్ట్‌ జోన్‌లోనే ఉండింది. అయితే ఇక్కడే ఆర్సీబీ బౌలర్లు కమ్‌ బ్యాక్‌ ఇచ్చారు. 17వ ఓవర్‌లో ఎంగిడి వరుస బంతుల్లో ఆయుశ్‌ మాత్రే, బ్రెవిస్‌ను ఔట్‌ చేశాడు. ఆతర్వాత వచ్చిన ధోని శాయక్తులా ప్రయత్నించినా సీఎస్‌కే గెలవలేకపోయింది.ఆర్సీబీ గెలుపుకు రొమారియోకు క్రెడిట్‌ ఇచ్చాడు ధోని. తమ బౌలర్లు ఎలా బౌలింగ్‌ చేసినా రొమారియో నిర్దాక్షిణ్యంగా బాదాడని అన్నాడు. చివరి ఓవర్లలో యార్కర్లు వేసుంటే బాగుండేదని అభిప్రాయపడ్డాడు. యార్కర్లు కాకపోతే లో ఫుల్‌ టాస్‌ బంతులైనా వేసుండాల్సిందని అన్నాడు. యార్కర్లు, లో ఫుల్‌ టాస్‌ బంతులు వేయడంలో తాము ఇంకాస్త మెరుగవ్వాలని తెలిపాడు.

do you know Pakistan total debt6
పాకిస్థాన్‌ మొత్తం అప్పు ఎంతో తెలుసా..?

ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తోన్న దేశంగా పాకిస్థాన్‌కు ప్రపంచంలో బహు గొప్ప పేరే ఉంది. బరాక్‌ ఒబామా పాలనలో యూఎస్‌ ఆర్మీ 2011లో అల్‌-ఖైదా నాయకుడు బిన్‌లాడెన్‌ను పాకిస్థాన్‌లోని అబత్తాబాద్‌లో చంపేశారు. మోస్ట్‌వాంటెడ్‌ క్రిమినల్‌ తమకు తెలియకుండానే అక్కడ తలదాచుకున్నాడని అప్పట్లోనే పాక్‌ ప్రపంచ దేశాల చెవిలో పూలు పెట్టేందుకు ప్రయత్నించింది. పాక్‌ ఉగ్రవాదాన్ని పోషిస్తోందనే ముసుగును తొలగించుకునేందుకు ఎనాడూ ఎలాంటి ప్రయత్నం చేయలేదు. అక్కడి ప్రజలైనా ఆర్థికంగా, సమాజికంగా మెరుగువుతున్నారా అంటే దేశం అప్పులు భారీగా పెరుగుతున్నాయి. ఇదే అదనుగా చైనా అధిక వడ్డీలకు పాక్‌కు అప్పులిచ్చి, తనకు భవిష్యత్తులో అవసరమయ్యే మౌలిక సదుపాయాలను మాత్రం అభివృద్ధి చేస్తోంది. దీన్ని పాక్‌ గ్రహించినా చేసేదేమిలేక మిన్నకుండిపోతుంది. పాక్‌ అప్పుల చిట్టా రూ.లక్షల కోట్లకు పెరిగింది.పాకిస్థాన్‌ మొత్తం రుణం పాక్‌ రూపాయి(పీకేఆర్‌)ల్లో 70.36 ట్రిలియన్లకు (భారత కరెన్సీలో సుమారు రూ.21.15 లక్షల కోట్లు) చేరింది. ఇందులో దేశీయ, ఇతర దేశాల నుంచి తీసుకొచ్చిన అప్పులు రెండూ ఉన్నాయి. వీటిలో గణనీయమైన భాగం చైనాకు చెందినవే. పాక్‌ మొత్తం అప్పుల్లో సుమారు 22 శాతం చైనా సమకూర్చినవే కావడం గమనార్హం.పాక్‌ విదేశీ రుణం: 130 బిలియన్ డాలర్లు(సుమారు రూ.10.7 లక్షల కోట్లు).స్వల్పకాలిక విదేశీ చెల్లింపులు: వచ్చే ఏడాదిలో 30.6 బిలియన్ డాలర్లు(సుమారు రూ.2.53 లక్షల కోట్లు).రుణ-జీడీపీ నిష్పత్తి: ప్రభుత్వ ఆదాయంలో 50-60% వడ్డీ చెల్లింపులకు ఖర్చు చేయడంతో 70% పైగా ఉంది.ఐఎంఎఫ్ బెయిలవుట్: ఐఎంఎఫ్ బెయిలవుట్ అనేది అధిక రుణం, కరెన్సీ అస్థిరత లేదా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ సమస్యలు వంటి తీవ్రమైన ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కొంటున్న దేశాలకు అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) అందించే ఆర్థిక సహాయ ప్యాకేజీ. ఈ బెయిలవుట్లు సాధారణంగా రుణాల రూపంలో వస్తాయి. అందుకు తరుచూ దేశం తన ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడానికి కఠినమైన ఆర్థిక సంస్కరణలను అమలు చేయవలసి ఉంటుంది. అందులో భాగంగా గ్యాస్ టారిఫ్ పెంపు, కొత్త పన్నులు వంటి కఠిన షరతులతో 2023లో పాకిస్థాన్ 7 బిలియన్ డాలర్ల ఐఎంఎఫ్‌ బెయిలవుట్‌ ప్యాకేజీని పొందింది.విదేశీ నిల్వలు: 2025 ఏప్రిల్ నాటికి 15.4 బిలియన్ డాలర్లు(రూ.1.27 లక్షల కోట్లు). ఇది మూడు నెలల దిగుమతులకు సరిపోదు.సైనిక వ్యయంపై ప్రభావం: పెరుగుతున్న అప్పుల కారణంగా పాకిస్థాన్‌ సైన్యానికి అందించే రేషన్‌ను తగ్గించింది. ఇంధన కొరత కారణంగా సైనిక విన్యాసాలను రద్దు చేయవలసి వచ్చింది.ఇదీ చదవండి: డబుల్‌ ప్రాఫిట్‌!ఆర్థిక సవాళ్లుపాకిస్థాన్ నుంచి ప్రత్యక్షంగా, పరోక్షంగా దిగుమతులను భారత్ నిలిపివేయడంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మరింత కుదేలైంది. ప్రస్తుతం పాకిస్థాన్‌ రూపాయి విలువ అమెరికా డాలర్‌తో పోలిస్తే రూ.281గా ఉంది. ఇది రాబోయే రోజుల్లో రూ.400కు పడిపోతుందనే భయాందోళనలు నెలకొన్నాయి. ఇటీవలి భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్థాన్‌కు ఐఎంఎఫ్ సాయాన్ని భారత్ వ్యతిరేకిస్తోంది. పరిమిత విదేశీ నిల్వలు, పెరుగుతున్న తిరిగి చెల్లించే అప్పులతో పాకిస్థాన్ రుణ సంక్షోభం తీవ్రమవుతోంది.

APTDC Employee CCTV Footage Viral At Vijayawada7
ఏపీటీడీసీలో ఉద్యోగి రాసలీలలు

సాక్షి, విజయవాడ: ఏపీటీడీసీ డివిజనల్‌ కార్యాలయంలో ఓ అధికారి రాసలీలల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఆఫీసు వేళలు ముగిసిన తర్వాత సదరు అధికారి.. ఓ మహిళతో ఏకాంతంగా గడిపిన విషయం బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఆఫీసులో సీసీ ఫుటేజీని పరిశీలించిన అధికారులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు.వివరాల ప్రకారం.. విజయవాడలోని బందరురోడ్డు వెంబడి లైలా కాంప్లెక్స్‌లో ఏపీటీడీసీ డివిజనల్‌ కార్యాలయంలోని కీలక విభాగంలో బాధ్యతలు నిర్వహిస్తున్న ఉద్యోగి రాసలీలల వ్యవహారం బయటకు వచ్చింది. సదరు ఉద్యోగి.. ఆఫీసు వేళలు ముగిసిన తర్వాత ప్రతీ రోజూ రాత్రిపూట తన ద్విచక్రవాహనంపై ఓ మహిళను తీసుకుని ఆఫీసుకు రావడం పలు అనుమానాలకు తావిచ్చింది. అయితే, పర్యాటకాభివృద్ధి సంస్థ ఉద్యోగి కావటంతో సెక్యూరిటీ సిబ్బంది.. ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేయలేదు.రోజూ ఇలాగే చేస్తున్న క్రమంలో అనుమానం వచ్చిన సెక్యూరిటీ సిబ్బంది విషయాన్ని ఏపీటీడీసీ అధికారులకు తెలియజేశారు. దీంతో, రంగంలోకి దిగిన అధికారులు.. ఆఫీసులో ఏం జరుగుతుందని తెలుసుకునే ప్రయత్నం చేశారు. అనంతరం, ఆఫీసులో ఉన్న సీసీ ఫుటేజీని పరిశీలించగా వారిద్దరూ అడ్డంగా దొరికిపోయారు. రాత్రి సమయంలో ఉద్యోగి బైకుపై ఓ మహిళ రావడం రికార్డు అయ్యింది. ఆఫీసు వద్ద బైక్‌ పార్కు చేసి ఆమెను లోపలికి తీసుకెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. కార్యాలయం తాళం తెరిచి, ఆ మహిళను లోపలికి తీసుకెళ్లి తిరిగి తలుపులు వేయడం, అరగంట తర్వాత బయటకు రావడాన్ని అధికారులు గుర్తించారు. అనంతరం, వారిద్దరూ బైక్‌పై వెళ్లిన ఆధారాలను సీసీ ఫుటేజీ ద్వారా సేకరించారు. దీంతో, ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది తెలియాల్సి ఉంది.ఇదిలా ఉండగా.. గతంలోనూ సదరు అధికారిపై ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి. హరిత బెర్మ్‌పార్క్‌లోని స్టాఫ్‌ రూమ్‌లో కూడా ఇలాంటి వ్యవహారమే నడిపినట్టు తెలిసింది. పార్క్‌లో వాకింగ్‌ కోసం వచ్చిన మహిళను తరచూ స్టాఫ్‌రూమ్‌లోకి తీసుకెళ్లేవాడు. సిబ్బందిని బయటకు పంపేసి రాసలీలలు సాగించేవాడని సిబ్బంది చెప్పుకొచ్చారు. అనంతరం, సీక్రెట్‌ కెమెరా పెట్టి మరీ ఈ విషయాన్ని సిబ్బందే వెలుగులోకి తెచ్చారు. ఇక, ఈయన విషయంలో ఇంత జరుగుతున్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.

Hit 3 Movie 3rd Day Collection Out Now8
'హిట్‌3' కలెక్షన్స్‌ ప్రకటన.. రూ. 100 కోట్లకు చేరువలో నాని

'హిట్‌3: ది థర్డ్‌ కేస్‌' సినిమా మూడురోజుల్లోనే భారీ కలెక్షన్స్‌ సాధించి రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. వీకెండ్‌లో బాక్సాఫీస్‌ వద్ద హీరో నాని దుమ్మురేపుతున్నాడు. మొదటిరోజే భారీ ఓపెనింగ్స్‌ రాబట్టిన ఈ మూవీ రెండోరోజు కూడా సత్తా చాటింది. అయితే, తాజాగా మూడోరోజు కలెక్షన్స్‌ వివరాలను మేకర్స్‌ ప్రకటించారు. ఈమేరకు తాజాగా ఒక పోస్టర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. శైలేష్‌ కొలను దర్శకత్వంలో వాల్‌ పోస్టర్‌ సినిమా, నాని యూనానిమస్‌ ప్రోడక్షన్స్‌ బ్యానర్స్‌ పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ చిత్రం మే 1న విడుదలైంది. ఈ చిత్రంలో శ్రీనిధీ శెట్టి హీరోయిన్‌గా నటించారు.హిట్‌3 సినిమా మూడురోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 82 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ రాబట్టినట్లు మేకర్స్‌ ప్రకటించారు. ఫస్ట్‌ డే రూ. 43 కోట్లు, సెకండ్‌ డే రూ. 19 కోట్లు రాబడితే.. మూడోరోజు రూ. 20 కోట్లు రాబట్టింది. నేడు ఆదివారం సెలవు కాబట్టి సులువుగా రూ. 100 కోట్లు సాధించే ఛాన్స్‌ ఉంటుందని అంటున్నారు. గత రెండు రోజులుగా థియేటర్స్‌ ఫ్యామిలీ ఆడియెన్స్‌ వస్తున్నారు. నానీని అర్జున్‌ సర్కార్‌లాంటి వైవిధ్యమైన పాత్రలో చూడటానికి వారు ఆసక్తి చూపుతున్నారు. చిత్ర యూనిట్‌ అంచనాలకు మించి కుటుంబ ప్రేక్షకులు రావడం, వారి స్పందనను చూసి దర్శకుడు, నిర్మాతలు సర్‌ప్రైజింగ్‌గా ఫీల్‌ అవుతున్నారు.చాగంటి కోటేశ్వరరావుగారికి నచ్చి వాయిస్‌ ఇచ్చారు: శైలేష్‌ కొలను‘హిట్‌: ది థర్డ్‌ కేస్‌’లో అర్జున్‌ సర్కార్‌గా నాని పాత్ర ఎలా ఉంటుందో ‘హిట్‌ 2’ చివర్లో గ్లింప్స్‌లా చూపించా. అప్పుడే ఆడియన్స్‌కి ఓ అవగాహన వచ్చింది. అర్జున్‌ సర్కార్‌ పాత్రపై నాకు, నానీగారికి మొదటినుంచీ నమ్మకం ఉంది. ఇక మా మూవీ ఐడియాని చాగంటి కోటేశ్వరరావుగారికి చెబితే నచ్చి, వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారు. డార్క్‌ వెబ్‌ అనేది ప్రస్తుతం ఇండియాలో పెద్ద సమస్య. ఎన్నో చట్టవ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. సైబర్‌ డిపార్ట్‌మెంట్‌ దీని మీద వర్క్‌ చేస్తోంది. తెలంగాణ, ఏపీ పోలీసులు డార్క్‌ వెబ్‌ గురించి మాకు చాలా సమాచారం ఇచ్చారు. 82+ CRORES GROSS WORLDWIDE for #HIT3 in 3 days ❤‍🔥It's SARKAAR SHOW at the box office 💥💥Book your tickets now!🎟️ https://t.co/8HrBsV0jItA sensational Sunday loading with massive bookings all over. #BoxOfficeKaSarkaar pic.twitter.com/dsRvH3lpFG— Wall Poster Cinema (@walpostercinema) May 4, 2025

Sakshi Editorial On Chandrababu Govt Amaravati Capital Event9
వేదనలో రాజ్యం... వేడుకలో రాజధాని!

‘‘ఠండా మతలబ్‌ కోకాకోలా...’’ ఇండియాలో బాగా పాపులరయిన వాణిజ్య ప్రకటనల్లో ఒకటి. మరి కోకాకోలా మతలబు? రెండొందల మిల్లీలీటర్ల కోక్‌ తయారు చేయడానికి గరిష్ఠంగా యాభై పైసలు ఖర్చవుతాయని మార్కెట్‌ టాక్‌. పది పైసల కంటే ఎక్కువ కాదనే వాళ్లు కూడా ఉన్నారు. కానీ మనం గరిష్ఠాన్నే లెక్కేసుకుందాం. దానికి పదింతలు ఎక్కువ ఖర్చు పెట్టి మార్కెటింగ్‌ నైపుణ్యాన్ని జోడిస్తారు. వినియోగదారుకు ఇరవై రూపాయలకు అమ్ముతారు. రవాణా ఖర్చులు, కమీషన్లు తీసేసినా మినిమమ్‌ నూటా యాభై శాతం లాభాలు కంపెనీ గల్లా పెట్టెలో పడతాయి. దీన్నే బ్రాండ్‌ బిల్డింగ్, మార్కెటింగ్‌ టెక్నిక్‌ వంటి పేర్లతో ఘనంగా చెప్పుకుంటారు.ఈ ధోరణి రాజకీయాల్లోకి, ప్రభుత్వ పాలనలోకి కూడా దిగుమతయింది. ఇందులో ఉద్దండులైన ఇద్దరు అగ్ర నాయ కులు నిన్న ఉద్దండరాయునిపాలెం సమీపంలో అమరావతి బ్రాండ్‌ షూటింగ్‌ను పునఃపునఃప్రారంభించారు. ప్రధాని సంగతి తెలిసిందే. భారతీయ వ్యాపార రంగంలో ఆరితేరిన వారైన గుజరాతీల ముద్దుబిడ్డ. అంతటా దొరికే వస్తువుపై కూడా అరుదైన సరుకుగా ముద్రవేసి అమ్మగల నేర్పరులు వారు. లేకపోతే, ఓ పిడికెడు మంది మినహా సమస్త ప్రజల్లో ఉండే సహజ లక్షణాలైన దేశభక్తి, దైవభక్తి వంటి అంశాలపై కూడా తమకే పేటెంట్‌ హక్కులున్నాయని ఎలా ప్రకటించు కోగలరు?ఏపీ ముఖ్యమంత్రి కూడా ప్రధానికి దీటైనవారే. నిజం చెప్పాలంటే కొంచెం ఎక్కువ కూడా! మీడియా ప్రచారంతో ముఖ్యమంత్రి స్థాయికి ఎదగవచ్చన్న కిటుకును ఆయన తొలి రోజుల్లోనే కనిపెట్టారు. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మీద, సెల్‌ఫోన్‌ల మీదా తనకే పేటెంట్‌ దక్కాలని చిరకాలంగా ఆయన పోరాటం చేస్తున్నారు. ఇద్దరూ కలిసి అమరావతి షోలో పాల్గొని అమరా వతి బ్రాండ్‌ వ్యాల్యూ పెంచే ప్రయత్నాన్ని చేశారు. ఈ షో జరగడానికి ముందునుంచే అమరావతి ప్రమోషన్‌ కార్యక్రమాన్ని ఏకసూత్ర పథకంగా భావించి, పరిపాలన సైతం పక్కన పెట్టి చంద్రబాబు ప్రయాసపడుతున్నారు. అప్పిచ్చువాడి కోసం డప్పు కొడుతూనే ఉన్నారు. ప్రపంచబ్యాంకూ, మరో రెండు సంస్థలూ 31 వేల కోట్ల షరతులతో కూడిన అప్పును మంజూరు చేసిన వెంటనే 47 వేల కోట్లకు టెండర్లను పిలవనే పిలిచారు. ఇందులో భారీ కమీషన్ల కోసం అంచనాలను అసహజంగా పెంచేశారన్న విమర్శలు వినిపించాయి.ఇందులో చాలా పనులకు ఏడేళ్ల కింద కూడా టెండర్లను పిలిచారు. అప్పటి అంచనా వ్యయానికీ, ప్రస్తుతానికీ పోలికే లేదు. ఒక్క సెక్రటేరియట్‌ టవర్ల అంచనాయే నూరు శాతం పెరిగింది. 2018లో సెక్రటేరియట్‌ నాలుగు టవర్లూ, సీఎం కార్యాలయానికి కలిపి అంచనా వ్యయం 2,271 కోట్లుంటే ఇప్పుడది 4,688 కోట్లకు ఎగబాకింది. ఏడేళ్లలో నూరు శాతం ద్రవ్యోల్బణం పెరిగిందా? నిర్మాణ రంగంలో ప్రధాన పద్దులైన సిమెంటు, ఇనుము ధరలు పెరక్కపోగా అంతో ఇంతో తగ్గాయని మార్కెట్‌ సమాచారం. అమరావతి బ్రాండ్‌ బాజా మిరు మిట్లలో ఇటువంటి వాస్తవాలు మరుగున పడిపోవాలని పాల కుల ఉద్దేశం కావచ్చు.అమరావతి కాసుల వేటలో పడి ప్రజాపాలనను పడకేయించిన పర్యవసానం ఎలా ఉన్నదో మచ్చుకు ఒక సన్నివేశాన్ని పరిశీలిద్దాం. రైతు పండించిన పంటలకు మార్కెట్‌లో పలికిన ధరలేమిటో ఒకసారి గమనించండి. మిరపకు జగన్‌ పాలనలో పలికిన సగటు ధర 24 వేల రూపాయలైతే, ఇప్పుడు 6,500. పత్తికి నాడు 10,500 పలికితే నేటి సగటు ధర 4,900. కందులు నాడు 11 వేలు, నేడు 5,850. పసుపు, మినుము, పెసలు, శనగలు, మొక్కజొన్న, సజ్జలు, రాగులు, పొగాకు, చీనీపండ్లు, అరటి, బొప్పాయి, టమాటా, ఉల్లి... ఇలా ఏ వ్యవసాయిక ఉత్పత్తినైనా తీసుకొని పరిశీలించండి. ఒకే రకమైన రాజధాని పనులకు ఏడేళ్ల కాలంలో కాంట్రాక్టర్లకు ఇస్తున్న సొమ్ము నూరు శాతం ఎట్లా పెరిగింది? ఆరుగాలం కష్టించిన రైతన్నకు లభిస్తున్న ధర ఏడాది కాలంలోనే నూరు శాతం ఎట్లా పడి పోయింది? ఇదేమి రాజ్యం? అదేమి రాజధాని? పైగా అది ప్రజా రాజధానట! జన జీవితాల మీద ఇంతకంటే క్రూరమైన పరిహాసం ఇంకొకటి ఉంటుందా?ఈ రాజధాని నిర్మాణానికి అర్జెంటుగా ఇంకో 47 వేల కోట్లు కావాలట! మరో 44 వేల ఎకరాలు సమీకరించాలట! అప్పుడు గానీ ఈ వ్యవహారం ఓ కొలిక్కి రాదట! పనుల పునఃప్రారంభం నాటికే రాష్ట్ర వ్యవసాయ రంగం వెన్ను విరిగింది. ఆ పనులన్నీ కొలిక్కి వస్తే ఇంకెన్ని దారుణాలు చూడాలో! గిట్టుబాటు ధర లేకపోవడం ఒక్కటే కాదు. రైతు కుటుంబాల మీద ఏడాది పొడుగునా పిడుగులే కురుస్తున్నాయి. రైతు భరోసా లేదు. అప్పిచ్చువాడి గడప తొక్కక తప్పలేదు. పంటల బీమా లేదు. దేవుడి మీదే భారం. ఇన్‌పుట్‌ సబ్సిడీ, కరువు సాయం బకాయీల ఊసెత్తితే ఒట్టు. ఆర్‌బీకేలు అలంకార ప్రాయంగా మారి ఆసరా ఇవ్వడం లేదు. ఒక్క అమరావతి కలవరింత తప్ప, సాధారణ పరిపాలనపైన కూడా ఈ ప్రభుత్వం పట్టు కోల్పో యింది. విజయవాడ వరదలు, తిరుపతి తొక్కిసలాట, సింహా చలం దుర్ఘటన వగైరాలు పాలనా వైఫల్యానికి నిదర్శనాలు.అదే రాష్ట్రం, అవే వనరులు, అదే ఆదాయం. ఏ ఖర్చయినా అందులోంచే పెట్టాలి. ఏ అప్పయినా అందులోంచే చెల్లించాలి. లేదంటే మరిన్ని అప్పులు చేయాలి. ఎన్నికల ముందు చంద్ర బాబు హామీ ఇచ్చిన అద్భుతం ఆవిష్కృతం కాలేదు. సంపద సృష్టి జరగలేదు. ఎప్పుడు సృష్టిస్తారో కూడా చెప్పడం లేదు. రాజధాని మీద లక్ష కోట్ల దాకా ఖర్చు పెట్టాలని చెబుతున్నారు. ఆ ఖర్చుకు అప్పులే మార్గం. ఉన్న ఆదాయ వనరుల్లోంచే ఈ అప్పులు తీర్చాలి. అమరావతే తన అప్పుల్ని తీర్చుకుంటుందని మొదట్లో ఊదరగొట్టారు. ఎన్ని వేల ఎకరాలను అభివృద్ధి చేసి అమ్మితే అంత అప్పును తీర్చాలి? అన్ని వేల ఎకరాలను ఎగబడి కొనేందుకు ఎవరు ముందుకొస్తారు? ఇది జరగడానికి ఎన్ని పుష్కరాలు పడుతుంది? ఇటువంటి సందేహాలకు సమాధానా లేవీ ఇంతవరకు రాలేదు.ఈలోగా ఒక్క ఏడాదిలోనే వ్యవసాయ రంగం కుదేలైంది. రాజధాని కోసం భూములను ‘త్యాగం’ చేసిన 28 వేల మంది రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లయినా దక్కుతాయని చెబు తున్నారు. కానీ, అమరావతి పేరుతో ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురవుతున్న రాష్ట్రంలోని 60 లక్షల మంది రైతుల త్యాగానికి ఎవరు వెల కట్టాలి? వ్యవసాయం తర్వాత ఎక్కువ మందికి ఉపాధినిస్తున్న ఎం.ఎస్‌. ఎం.ఈ. రంగంలో ఈ సంవత్సరం 20 లక్షల మంది ఉపాధి కోల్పోయారని పార్లమెంటుకిచ్చిన సమా ధానంలో కేంద్రం తెలియజేసింది. ఈ లెక్కన అమరావతి నిర్మాణం కోసం ఇంకెన్ని సెక్షన్లు బలవ్వాలి? ఎంత విధ్వంసం జరగాలి? ‘‘మా కండలు పిండిన నెత్తురు, మీ పెండ్లికి చిలికిన అత్తరు’’ అన్నాడు ఒక కవి. అమరావతి కోసం ఆంధ్రదేశమంతా ఈ పాట పాడుకోవాలేమో?శుభమా అని రాజధాని పనులు ప్రారంభిస్తుంటే ఈ కుశంకలేమిటనే వారు లేకపోలేదు. కుశంకలు కావు, వాస్తవాల పునా దులపై తలెత్తుతున్న సందేహాలు ఇవి. రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, ఇల్లాలు ఏడ్చిన ఇల్లు బాగుపడవంటారు. రైతు ఇప్పుడు దుఃఖిస్తున్నాడు అన్నది ఒక వాస్తవం. రాష్ట్రంలోని మహిళలకు ‘సూపర్‌ సిక్స్‌’ పేరుతో పాలక కూటమి ఎన్నో ఆశలు పెట్టిందన్నది ఒక వాస్తవం. ఏడాది తర్వాత కూడా వారి ఆశలు అడియాసలుగానే మిగిలాయన్నది ఒక వాస్తవం. సంపద సృష్టి పేరు చెప్పి ఎడాపెడా అప్పులతో రాష్ట్రాన్ని ఊబి లోకి తోస్తున్న మాట వాస్తవం. ఈ అప్పుల ఊబి నుంచి బయట పడే మార్గం ఏమిటో ఇప్పటిదాకా ప్రభుత్వం విడమరచి చెప్ప లేకపోయిన మాట కూడా వాస్తవం.రమారమి 500 కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించి నిన్న అమరా వతిలో ‘పునరపి జననం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధానమంత్రిని తీసుకొచ్చి పొగడ్తల్లో ముంచారు. స్తోత్రకై వారాలు గావించారు. ఈ దేశ ప్రధానిని గౌరవించడం తప్పేమీ కాదు. గౌరవించాలి కూడా! అదే సందర్భంలో రాష్ట్ర ముఖ్య మంత్రి కూడా రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవ ప్రతీకగా నిలబడాలి. తమ నాయకుడు సాగిలపడ్డంత పనిచేయడాన్ని, నంగి నంగి మాట్లాడటాన్ని ప్రజలు హర్షించరు. బిల్లు మంజూరు చేసే అధి కారి తనిఖీకి వచ్చినప్పుడు చిన్నపాటి కాంట్రాక్టర్లు వ్యవహరించినట్టుగా బాడీ లాంగ్వేజ్‌ ఉండకూడదు. బహిరంగ సభల్లో బీజేపీ నాయకులు జనం చేత మూడుసార్లు ‘వందేమాతరం’ అనిపించడం చాలాకాలంగా వస్తున్న సంప్రదాయం. ఆ దీక్షను కూడా చంద్రబాబు ఈ సభలో స్వీకరించారు. నిజానికి తెలుగు దేశం పార్టీలో ఈ ఆచారం లేదు.ఆరేళ్ల క్రింద నరేంద్ర మోదీని ఉద్దేశించి చంద్రబాబు చేసిన విపరీత విమర్శలు చాలామందికి ఇంకా గుర్తున్నాయి. కానీ, అటువంటిదేమీ జరగనట్టుగానే సభలో ఆయన ప్రవర్తన కనిపించింది. సాధారణంగా ఐటీ రంగానికి సంబంధించినంత వరకు ఘనత అంతా తనకే దక్కాలని కోరుకుంటారు. దాన్ని ఇంకెవరితోనూ పంచుకోవడానికి ఇష్టపడరు. కానీ ఆశ్చర్యకరంగా నిన్నటి సభలో ‘‘టెక్నాలజీ అంటే మోదీ, మోదీ అంటే టెక్నాలజీ’’ అని పొగిడేశారు. ఈ భజన కార్యక్రమం వెనుకనున్న ఉద్దేశం ఏమిటో గాని ప్రధాని మాట్లాడుతున్నప్పుడు అమరావతి కోసం అదనంగా తానేం చేస్తానన్నది మాత్రం చెప్పలేదు. చంద్రబాబు పొగడ్తలకు పొగడ్తలతోనే ఆయన సమాధానం చెప్పారు. మొదటి ప్రారంభానికి వచ్చినప్పుడు మట్టి–నీళ్లు తెచ్చిన ప్రధాని, ఈసారి పవన్‌ కల్యాణ్‌కు మాత్రమే ఒక చాక్లెట్‌ తీసుకువచ్చారు.ఏదో వ్యూహం ప్రకారమే లోకేశ్‌తో ఈ సభలో మాట్లాడించి నట్టుగా కనిపించింది. తన కుమారుడికి మోదీ ఆశీస్సులు లభించవలసిన సమయం ఆసన్నమైందని బాబు భావిస్తుండవచ్చు. ప్రసంగం ప్రారంభానికి ముందు లోకేశ్‌ ‘నమో నమః’ అంటూ మూడుసార్లు సంబోధించారు. ఆ నమస్కారం మోదీ కోసమే అనే సంగతి ఆయనకు అర్థమైందో లేదోనన్న అనుమానం కలిగి నట్టుంది. మోదీని గురించి చెప్పాల్సిన ప్రతి చోట ‘నమో గారు, నమో గారు’ అంటూనే మాట్లాడారు. ‘‘వంద పాకిస్తాన్లు దండెత్తి వచ్చినా నమో మిస్సైల్‌ ముందు బలాదూర్‌’’ అన్నారు. ప్రధాన మంత్రిని లోకేశ్‌ పొగుడుతున్నంతసేపు చంద్రబాబు ఉత్కంఠగా కనిపించారు. లోకేశ్‌ పొగడ్తలు ప్రధానికి అర్థమవుతున్నాయో లేదో తెలుసుకోవాలన్న కుతూహలం ఆయన మోములో కనిపించింది. అనూహ్యంగా ఆయన చాలాసార్లు చిరునవ్వులు చిందించారు. ఇటువంటి సైడ్‌ లైట్స్‌ తప్ప ఈ సభ గురించి చెప్పు కోవడానికి ఇంకో విశేషం లేదు. అమరావతికి బ్రాండ్‌ వ్యాల్యూ పెంచడానికి జరిగిన ఒక ఈవెంట్‌గా మాత్రమే ఇది చరిత్రలో మిగిలిపోతుంది. రాజ్యమంతటా ఆవేదన అలుముకుంటున్న వేళ వేడుకలు చేసుకున్న రాజధానిగా కూడా చరిత్రలో అమరా వతి స్థానం సంపాదించుకుంటుంది.వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com

Health Tips: Summertime is the best time to lose weight10
బరువు తగ్గేందుకు బెస్ట్‌ సీజన్‌..! ఎలాంటి ఫుడ్‌ తీసుకోవాలంటే..

వేసవిలో పెరిగే ఉష్ణోగ్రతలు శరీరంలోని నీటిని ఆవిరి చేస్తుంటాయి. ఎన్నిసార్లు నీళ్లు తాగినా దాహం తీరదు. ఆకలిగానూ అనిపించదు. అలసట, నీరసంతో రోజంతా చికాకు. ఈ సమస్యలకు పరిష్కారం మన చేతిలోనే ఉందంటున్నారు పోషకాహార నిపుణులు సుజాతా స్టీఫెన్‌. ‘శరీరం త్వరగా డీ–హైడ్రేట్‌ అయ్యే కాలం ఇది. తినే పదార్థాల ఎంపిక సరిగా లేకపోతే జీర్ణవ్యవస్థ గాడి తప్పుతుంది. ఇలాంటప్పుడు... కూరగాయలతో చేసిన సలాడ్స్, సాంబార్, రసం.. వంటివి రెగ్యులర్‌ డైట్‌లో చేర్చుకోవాలి.రెండు గంటలకు ఒకసారి గ్లాసుడు నీళ్లు, వేడి ఎక్కువగా ఉన్నప్పుడు అరగంటకు ఒకసారి నీళ్లు తాగాలి. అకస్మాత్తుగా తలనొప్పి, భావోద్వేగాలలో మార్పు, నీరసం, ఇరిటేషన్‌.. వంటివీ తలెత్తుతుంటాయి. దీనిని సైలెంట్‌ డీ–హైడ్రేషన్‌ సమస్యగా గుర్తించి నీళ్లు తాగి, కొన్ని నిమిషాలు విశ్రాంతి తీసుకోవాలి. నిమ్మరసం, సబ్జా గింజలతో తయారు చేసుకున్న లస్సీ ఒంటికి మేలు చే స్తుంది. నిమ్మరసంలో షుగర్‌కు బదులు కొద్దిగా ఉప్పు, సోడా కలుపుకొని తాగచ్చు. మధుమేహులు ఒకేసారి ఎక్కువ మొత్తం తింటే, శరీరంలో గ్లూకోజ్‌ లెవల్స్‌ పెరుగుతాయి. అందుకని టైమ్‌ ప్రకారం ఏదో ఒకటి మితంగా తినాలి. గర్భిణులకు ప్రత్యేకంఈ కాలం గర్భిణులు ఏ కొంచెం తిన్నా ఆయాసం వస్తుంటుంది. ఇలాంటప్పుడు మసాలా ఉన్న ఆహారం కాకుండా పండ్లు, జ్యూసులు, సలాడ్స్‌ పైన దృష్టి పెట్టాలి. దీని వల్ల కడుపులో హెవీగా ఉన్నట్టు అనిపించదు. ఆయాసం సమస్య తలెత్తదు. వయసు పైబడిన వాళ్లు పగటివేళ ఎండగా ఉన్న సమయాల్లో బయటకు వెళ్లకుండా ఉంటేనే మంచిది. తప్పనిసరి అయితే వెంట నీళ్లు, పండ్లు తీసుకెళ్లాలి. డీ హైడ్రేట్‌ అయితే బీపీ డౌన్‌ అయ్యి కళ్లు తిరిగి పడి΄ోయే ప్రమాదం ఉంటుంది. అందుకని వారి వెంట మరొకరు తోడుండాలి. రీ హైడ్రేషన్‌ వేసవిలో యూరిన్‌ పసుపు రంగులో వస్తుందంటే శరీరంలో నీటిశాతం తగ్గిందని అర్ధం. రీ హైడ్రేషన్‌ కోసం నీళ్లు, నిమ్మరసం సరైన ఎంపిక. ఫ్లేవర్డ్, షుగర్‌ లెస్‌ మెడికేటెడ్‌ ఓఆర్‌ఎస్‌లను ఎంచుకోవచ్చు. ఇది మంచి సీజన్‌బరువు తగ్గాలనుకునేవారికి ఇది మంచి సీజన్‌. వేడికి ఎక్కువ ఆహారం తినబుద్ది కాదు.. పండ్లు, కూరగాయలు, జ్యూస్, నీళ్లు ఎక్కువ తీసుకుంటాం. ఇదంతా లో క్యాలరీ ఫుడ్‌. దీనివల్ల బరువు సులువుగా తగ్గచ్చు. వాకింగ్, జాగింగ్, వ్యాయామాలకు ఉదయం వేళ ఎంచుకోవడమే మంచిది. వేసవిలో పార్టీలకు వెళ్లినప్పుడు తినే మసాలా ఫుడ్స్‌ మరుసటి రోజు కూడా ప్రభావం చూపుతుంది. పడుకునేటప్పుడు మజ్జిగ తాగితే అసౌకర్యం తగ్గుతుంది.కూల్‌ సలాడ్‌కీరా, దోస, పుదీనా, కొత్తిమీర, ఉల్లిపాయ, క్యాప్సికమ్‌ వంటివి సన్నని ముక్కలుగా తరిగి, నిమ్మరసం, ఉప్పు, మిరియాలపొడి కలిపి సలాడ్‌ తయారు చేసుకోవాలి. దీనిని ఫ్రిజ్‌లో పెట్టి, రోజులో రెండు మూడుసార్లు తింటే, తేలికగా అనిపిస్తుంది. సొరకాయ జ్యూస్, పుదీనా, కొత్తిమీర షర్బత్‌లు, చట్నీలు, రాగి జావ వంటివి.. ఒంటికి మేలు చేస్తాయి.మాంసాహారులు తాజాగా తయారు చేసుకున్నవి, నూనె తక్కువగా ఉపయోగించినవి తీసుకోవాలి. – సుజాతా స్టీఫెన్, న్యూట్రిషనిస్ట్‌ (చదవండి: బుల్లితెర నటి అస్మిత హెల్తీ డైట్‌ ప్లాన్‌ ఇదే..! 20 ఏళ్లుగా..)

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement