కోల్‌కతా : వేసవి తాపంతో ఉక్కిరిబిక్కిరవుతున్న క్రమంలో కోల్‌కతాలో ఓ ఆటో డ్రైవర్ వినూత్న ఆలోచనతో ముందుకొచ్చాడు. తన ఆటో పైన ఏకంగా ఓ గార్డెన్‌నే ఏర్పాటు చేశాడు. కోల్‌కతాకు చెందిన విజయ్ పాల్ తన ఆటో టాప్‌పై పచ్చని గడ్డిని పరిచి దానిపై పలు రకాల మొక్కలను పెంచాడు. తన ఆకుపచ్చని ఆటోపై రూఫ్‌టాప్ గార్డెన్‌తో విజయ్ పాల్ వెళుతున్న చిత్రాలు ట్విటర్‌లో వైరల్ అవుతున్నాయి.
ఈ ఆటో ఆకుపచ్చని రంగులో ఉండటమే కాకుండా పర్యావరణ హితమైన ఎల్‌పీజీతో దీన్ని నడిపిస్తున్నానని పాల్ చెబుతున్నాడు. రూఫ్‌టాప్ గార్డెన్‌లో ‘చెట్లను కాపాడండి...జీవితాలను కాపాడండి’ అనే నినాదాలను గార్డెన్ మధ్యలో బెంగాలీలో ఆయన రాయించాడు. ఆటోపైన ఏర్పాటు చేసిన గార్డెన్‌పై పాల్ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తాడు..గార్డెన్‌కు రోజూ నీరు పెట్టడంతో పాటు తన సంపాదనలో ఎక్కువ మొత్తం దీనిపై వెచ్చిస్తున్నాడు. తన ఆటోను వినూత్నంగా ప్రజల్లోకి తేవడం ద్వారా ప్రయాణీకులకు పాల్ అమూల్యమైన సందేశాన్నీ అందిస్తున్నాడంటూ పలువురు ప్రశంసిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment