Archive Page | Sakshi
Sakshi News home page

Movies

  • యాంకర్ కమ్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న అనసూయ.. గురువారం తన పుట్టినరోజుని కాస్త డిఫరెంట్ గా సెలబ్రేట్ చేసుకుంది. హైదరాబాద్ లోని ఓ అనాథ శరణాలయానికి భర్తతో కలిసి వెళ్లిన ఈమె.. అక్కడి చిన్నారులతో ఆడుతూపాడుతూ కనిపించింది. ఇందుకు సంబంధించి ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది.

    (ఇదీ చదవండి: డేటింగ్‌లో సమంత.. స్పందించిన మేనేజర్)

    సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఓ పోస్ట్ పెడుతూ ఫాలోవర్స్ ని అలరించే అనసూయ.. మూడు నాలుగు రోజుల క్రితమే కొత్త ఇంట్లోకి కూడా అడుగుపెట్టింది. లగ్జరీగా కట్టుకున్న ఇంటి ఫొటోల్ని కూడా ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఇది జరిగిన రెండు రోజులకే తన పుట్టనరోజు రావడంతో అనాథలకు పుస్తకాలు, ఫుడ్ పెట్టడంతో పాటు వాళ్లతో కలిసి డ్యాన్సులు కూడా వేసింది.

    అనసూయ కెరీర్ విషయానికొస్తే.. చివరగా పుష్ప 2 మూవీలో కనిపించింది. ప్రస్తుతానికైతే ఈమె చేతిలో కొత్త సినిమాలేం లేనట్లు తెలుస్తోంది. టీవీలో ఒకటి రెండు రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తోంది. ఎప్పటికప్పుడు గ్లామరస్ ఫొటోలతో ట్రెండ్ అవుతూనే ఉంటుంది.

    (ఇదీ చదవండి :రెండు రోజుల్లో ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు)

  • విజయశాంతి (Vijayashanthi), నందమూరి కల్యాణ్‌రామ్‌ (Nandamuri Kalyan Ram) తల్లీ కుమారులుగా నటించిన సినిమా ‘అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి’ (Arjun son of Vyjayanthi) తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. భారీ యాక్షన్‌ కాన్సెప్ట్‌తో నూతన దర్శకుడు ప్రదీప్‌ చిలుకూరి(Pradeep Chilukuri) ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.  అశోక క్రియేషన్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌పై అశోక్‌ వర్ధన్‌, సునీల్‌  నిర్మించారు. అమ్మ కోసం మనం ఎన్ని త్యాగాలైనా చేయొచ్చు అని చెప్పే అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతిని  ఈ వీకెండ్‌లో ఇంట్లోనే చూసేయండి.

    ఏప్రిల్‌ 18న విడుదలైన అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి తాజాగా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. ఇప్పుడు భారత్‌లో ఉచితంగానే స్ట్రీమింగ్‌ అవుతుంది. కొద్దిరోజుల క్రితం యూకేలో ఉన్నవాళ్లు అద్దె విధానంలో మాత్రమే చూసే అవకాశం కల్పిస్తూ ఓటీటీలో విడుదల చేశారు. అయితే, ఇప్పుడు సడెన్‌గా భారత్‌లో కూడా అందుబాటులోకి వచ్చేసింది. దీంతో అభిమానులు నెట్టింట షేర్‌ చేస్తున్నారు.

    ‍అర్జున్ సన్నాఫ్ వైజయంతి కథ విషయానికొస్తే.. సీన్సియర్ పోలీస్ ఆఫీసర్  వైజయంతి (విజయశాంతి). ఈమెకు ఓ కొడుకు అర్జున్ (కల్యాణ్ రామ్). ఐపీఎస్ అవ్వడానికి రెడీగా ఉన్న ఇతడు.. తండ్రిని ఓ క్రిమినల్ చంపేశాడని పగతో రగిలిపోతుంటాడు. తల్లికి ఇదంతా ఇష్టముండదు. అనుకోని పరిస్థితిలో అర్జున్ ఆ హంతకుడిని అందరూ చూస్తుండగా చంపుతాడు. అప్పటి నుంచీ తల్లీకొడుకుల మధ్య దూరం పెరుగుతుంది. చివరకు వారిద్దరూ ఎలా కలుసుకున్నారు..? తల్లి కోసం కొడుకు చేసిన త్యాగం ఏంటి? అనేదే మిగతా స్టోరీ.

  • మరో వీకెండ్ వచ్చేసింది. ఈసారి థియేటర్లలో 'ఎలెవన్' ‍అనే చిన్న సినిమా తప్పితే చెప్పుకోదగ్గ రిలీజులు ఏం లేవు. మరోవైపు ఓటీటీలో మాత్రం 24 కొత్త మూవీస్-వెబ్ సిరీసులు వచ్చేశాయి. ఇవన్నీ రెండు రోజుల్లోనే స్ట్రీమింగ్ కావడం విశేషం.

    (ఇదీ చదవండి: డేటింగ్‌లో సమంత.. స్పందించిన మేనేజర్)

    ఓటీటీల్లోకి వచ్చిన వాటిలో మరణమాస్, ‍అర్జున్ సన్నాఫ్ వైజయంతి, గేంజర్స్, జాలీ ఓ జింఖానా చిత్రాలు ఉన్నంతలో చూడదగ్గవి. ఇవి కాకుండా మరికొన్ని ఇంగ్లీష్, హిందీ మూవీస్ కూడా స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇంతకీ ఏ ఓటీటీలోకి ఏ మూవీ వచ్చిందంటే?

    ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చిన సినిమాలు (మే 16)

    అమెజాన్ ప్రైమ్

    • అర్జున్ సన్నాఫ్ వైజయంతి - తెలుగు మూవీ

    • భోల్ చుక్ మాఫ్ - హిందీ సినిమా

    • ఏ వర్కింగ్ మ్యాన్ - తెలుగు డబ్బింగ్ మూవీ

    • గేంజర్స్ - తెలుగు డబ్బింగ్ సినిమా

    • లవ్ ఆఫ్ రెప్లికా సీజన్ 1 - చైనీస్ సిరీస్

    • వైట్ ఔట్ - ఇంగ్లీష్ మూవీ (రెంట్)

    • వన్ ఆఫ్ దెమ్ డేస్ - ఇంగ్లీష్ సినిమా

    • సలాటే సలనాటే - మరాఠీ మూవీ

    • వన్ లైఫ్ - ఇంగ్లీష్ సినిమా

    • మనడ కడలు - కన్నడ మూవీ

    సోనీ లివ్ 

    • మరణమాస్ - తెలుగు డబ్బింగ్ సినిమా

    నెట్ ఫ్లిక్స్

    • ద క్విల్టర్స్ - ఇంగ్లీష్ మూవీ

    • బెట్ - తెలుగు డబ్బింగ్ సిరీస్

    • ఐ సా ద టీవీ గ్లో - ఇంగ్లీష్ మూవీ

    • జానెట్ ప్లానెట్ - ఇంగ్లీష్ సినిమా

    • సాసాకీ అండ్ పీప్స్ - జపనీస్ సిరీస్

    • వినీ జూనియర్ - పోర్చుగీస్ మూవీ

    హాట్ స్టార్

    • డస్టర్ - ఇంగ్లీష్ సిరీస్

    • హే జునూన్ - హిందీ సిరీస్

    • వుల్ఫ్ మ్యాన్ - ఇంగ్లీష్ మూవీ (మే 17)

    సన్ నెక్స్ట్

    • నెసిప్పయ - తమిళ మూవీ

    ఆపిల్ ప్లస్ టీవీ

    • డియర్ ప్రెసిడెంట్ నౌ - ఇంగ్లీష్ సినిమా

    • మర్డర్ బాట్ - ఇంగ్లీష్ సిరీస్

    ఆహా

    • జాలీ ఓ జింఖానా - తెలుగు డబ్బింగ్ సినిమా

    (ఇదీ చదవండి: 'పద్మ భూషణ్‌' చేయాల్సిన పనులేనా..? బాలకృష్ణపై విమర్శలు)

  • జూనియర్‌ ఎన్టీఆర్‌, హృతిక్‌ రోషన్ నటిస్తున్న 'వార్‌2' సినిమా కోసం దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. వారందరి కోసం తాజాగా హృతిక్‌ ఒక శుభవార్త చెప్పారు. టీజర్‌ ఎప్పుడు విడుదలౌతుందో ప్రకటించారు. పాన్‌ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో  ఆదిత్యా చోప్రా ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా  కియారా అద్వానీ నటిస్తున్నారు. తన పాత్రకూ కొన్ని యాక్షన్‌ సీక్వెన్స్‌లు ఉన్నాయని తెలిసింది.

    హృతిక్‌ రోషన్‌(Hrithik Roshan) తాజాగా తారక్‌ను ట్యాగ్‌ చేస్తూ సోషల్‌మీడియాలో ఒక పోస్ట్‌ షేర్‌ చేశారు. 'హాయ్‌.. తారక్‌ ఈ సంవత్సరం మే 20న ప్రత్యేకత ఏంటో మీకు తెలుసా..? సిద్ధంగా ఉండు నువ్వు ఊహించలేని గిఫ్ట్‌ ఉంటుంది' అని ఆయన పంచుకున్నారు. ఈ సారాంశాన్ని చూస్తే వార్‌2 టీజర్‌ ఆరోజున విడుదల కావచ్చని తెలుస్తోంది. మే 20 ఎన్టీఆర్‌ పుట్టినరోజు ఉంది. కాబట్టి ఆరోజు ఈ సినిమా నుంచి తప్పకుండా టీజర్‌ విడుదల కా 2019లో హిట్‌గా నిలిచిన హిందీ చిత్రం ‘వార్‌’కు సీక్వెల్‌గా ‘వార్‌ 2’ తెరకెక్కుతుంది. ఈ సినిమాపై టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌ అభిమానులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు.

    దాదాపు షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉంది. ఆగష్టు 14న విడుదల కానుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ రా ఏజెంట్‌గా నటించనున్నారని బాలీవుడ్‌ మీడియా పేర్కొంది. గతంలో షారుక్‌ఖాన్‌, సల్మాన్‌ఖాన్‌, హృతిక్‌ రోషన్‌లు రా ఏజెంట్‌ పాత్రలలో నటించి అక్కడ మంచి గుర్తింపుతో పాటు విజయాన్ని అందుకున్నారు.  అయితే, వార్‌2లో వీటన్నింటికంటే భిన్నంగా ఎన్టీఆర్‌ పాత్ర ఉందని తెలుస్తోంది. ఆపై ఈ మూవీలో హృతిక్‌ - ఎన్టీఆర్‌లపై అదిరిపోయే సాంగ్‌ను ప్లాన్‌ చేశారట . దాదాపు 500మంది డ్యాన్సర్లుతో వారు స్టెప్పులేశారట.

  • నవీన్ చంద్ర హీరోగా నటించిన తాజా చిత్రం ‘లెవన్’. సుందర్ సి వద్ద కలకలప్పు 2, వంద రాజవతాన్ వరువేన్, యాక్షన్ వంటి చిత్రాలకు అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసిన లోకేశ్ అజ్ల్స్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.  AR ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అజ్మల్ ఖాన్,రేయా హరి నిర్మించిన ఈ చిత్రం నేడు(మే 16) తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

    ‘లెవన్‌’ కథేంటంటే.. 
    అరవింద్‌(నవీన్‌ చంద్ర) ) ఓ సిన్సియర్‌ పోలీసాఫీసర్‌. ఏసీపీ హోదాలో వైజాగ్‌కి ట్రాన్స్‌ఫర్‌ అవుతాడు. వచ్చీరావడంతోనే ఓ దొంగతనం కేసును ఈజీగా సాల్వ్‌ చేస్తాడు. అదే సమయంలో వైజాగ్‌లో వరుస హత్యలు జరుగుతుంటాయి. తొలుత ఈ కేసును ఏసీసీ రంజిత్‌ కుమార్‌ (శశాంక్‌) డీల్‌ చేస్తాడు. విచారణ మధ్యలోనే అతనికి యాక్సిడెంట్‌ అవుతుంది. దీంతో ఈ కేసు అరవింద్‌ చేతికి వస్తుంది. అతనికి సహాయంగా ఎస్సై మనోహర్‌ ఉంటాడు. వీరిద్దరు కలిసి చేసిన విచారణలో చనిపోయినవారంతా కవలలు అని, ఇద్దరిలో ఒకరిని మాత్రమే చంపుతున్నారని తేలుతుంది. ఈ హత్యలు చేస్తున్న సీరియల్‌ కిల్లర్‌ ఎవరు? ఎందుకు చేస్తున్నాడు? ట్విన్స్‌లో ఒకరిని మాత్రమే ఎందుకు చంపుతున్నాడు? వారితో సీరియల్‌ కిల్లర్‌కు ఉన్న సంబంధం ఏంటి? ఏసీపీ అరవింద్‌ ఈ కేసును ఎలా డీల్‌ చేశాడు? చివరకు హంతకుడిని పట్టుకున్నారా? లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

    ఎలా ఉందంటే.. 
    విలన్‌ క్రైమ్‌ చేయడం... పోలీసు అయిన హీరో ఆ కిల్లర్‌ని పట్టుకోవడం..అతనికో ప్లాష్‌ బ్యాక్‌ స్టోరీ..ఇలా ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్ల ఫార్మాట్‌ దాదాపు ఒకేలా ఉంటుంది. దీంట్లో క్రైమ్‌ జరిగిన తీరు.. వాటి చుట్టు అల్లుకున్న మైండ్‌ గేమ్‌, హీరో ఎంత తెలివిగా ఈ కేసును ఛేధించాడనే అంశాలపై సినిమా విజయం ఆధారపడి ఉంటుంది. ఇలాంటి సినిమాలకు బిగిస‌డ‌ల‌ని స్క్రీన్‌ప్లే అవసరం. ప్రేక్షకుడు ఒక్క క్షణం కూడా తలను పక్కకు తిప్పుకోకుండా ఉత్కంఠ కలిగించే సన్నివేశాలతో కథనాన్ని నడిపించాలి. ‘లెవన్‌’ ఈ విషయంలో ఇది కొంతవరకు సఫలం అయింది. 

    విలన్‌ ప్లాట్‌ రొటీన్‌గా ఉన్న ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్‌ కొత్తగా ఉంటుంది. ఈ సినిమాలో వచ్చే ట్విస్టులను ముందుగా డీకోడ్‌ చేయ‌డం కొంతవరకు కష్టమే. క్రైమ్‌ థ్రిల్లర్‌ సినిమాలను రెగ్యులర్‌గా చూసేవాళ్లు విలన్‌ ఎవరనేది కనిపెట్టినా.. వాళ్ల మైండ్‌తో కూడా గేమ్‌ ఆడేలా స్క్రీన్‌ప్లే ఉంటుంది.  

    సినిమా ప్రారంభంలో కథనం కాస్త నెమ్మదిగా సాగుతుంది. సీరియల్‌ కిల్లింగ్‌ కేసు హీరో చేతికి వచ్చిన తర్వాత కథనంపై ఆసక్తి పెరుగుతుంది. అదే సమయంలో హీరోహీరోయిన్ల మధ్య వచ్చే లవ్‌ ట్రాక్‌ ఇరికించినట్లుగా అనిపిస్తుంది. ప్రీఇంటర్వెల్‌ నుంచి కథనం మరింత ఆసక్తికరంగా సాగుతుంది. ఇంటర్వెల్‌ సీన్‌ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితియార్థంలో ఇన్వెస్టిగేషన్‌ ప్రాసెస్‌ ఉత్కంఠభరితంగా సాగుతుంది. మధ్యలో వచ్చే ప్లాష్‌బ్యాక్‌ స్టోరీ హృదయాలను హత్తుకుంటుంది. ఇక చివరిలో వచ్చే ట్విస్టులు అదిరిపోతాయి. ఈ కథకి లెవన్‌ అనే టైటిల్‌ ఎందుకు పెట్టారనేదానితో పాటు ప్రతి సీన్‌కి లాజిక్‌ ఉంటుంది. మొత్తంగా ‘లెవన్‌’ సినిమా రొటీన్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ కథే అయినా.. కథనం మాత్రం ఆసక్తికరంగా ఉంటుంది. 

    ఎవరెలా చేశారంటే.. 
    నవీన్‌ చంద్రకు పోలీసు పాత్రలు చేయడం కొత్త కాదు. ఈ మధ్య ఆయన ఎక్కువ ఇలాంటి పాత్రలే చేశాడు. ఇందులో ఏసీపీ అరవింద్‌గా తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఆయన బాడీలాంగ్వేజ్‌, లుక్‌ నిజమైన పోలీసుల అధికారిని గుర్తు చేసేలా ఉంటుంది. హీరోయిన్‌ రియా హరి పాత్ర నిడివి తక్కువే అయినా ఉన్నంతలో చక్కగా నటించింది. ఎస్సై మనోహర్‌గా దిలీపన్‌, పోలీసు ఉన్నతాధికారిగా ఆడుకాలం నరేన్‌, ఏసీపీ రంజిత్‌ కుమార్‌గా శశాంక్‌ తమ పాత్రలకు న్యాయం చేశారు. కిరీటీ, రవివర్మతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. 

    సాంకేతికంగా సినిమా బాగుంది. డి ఇమాన్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ సినిమాకు ప్లస్‌ అయింది. తనదైన బీజీఎంతో అదరగొట్టేశాడు. పాటలు ఓకే. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్‌ పనితీరు బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నంతా ఉన్నాయి. 

  • ‘ఆపరేషన్‌ సిందూర్‌’లో మీరమరణం పొందిన మన తెలుగుబిడ్డ మురళీనాయక్‌పై సింగర్‌ మంగ్లీ ఒక పాట పాడారు. తన జ్ఞాపకాలను ఒక పాట రూపంలో మంగ్లీ తెలిపారు. ప్రతి ఒక్కరికి కన్నీళ్లు తెప్పించేలా ఆ సాంగ్‌ ఉందంటూ నెటిజన్లు  అభిప్రాయపడుతున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా  గోరంట్ల మండలంలోని గడ్డం తాండ పంచాయతీ కల్లి తాండా గ్రామానికి చెందిన మురళీ నాయక్ ఆపరేషన్‌ సిందూర్‌లో భాగంగా సరిహద్దుల్లో దేశమాత కోసం పోరాడుతూ నేలకొరిగాడు. 

    ఈ వార్తతో ఆ కుటుంబం తల్లడిల్లిపోయింది. వారికి అండగా రెండు తెలుగురాష్ట్రాల ప్రజలు నిలిచారు. ఈ క్రమంలో మురళీ నాయక్‌ తల్లిదండ్రులను మంగ్లీ కూడా కలిసి ఓదార్చారు.  దేశంలోని మహిళల సిందూరం కాపాడేందుకు  తన ప్రాణాలను అర్పించాడని ఆమె కొనియాడారు. దేశంలోని ప్రతి మహిళ సిందూరంలో మురళీనాయక్‌ నిలిచి ఉంటాడని మంగ్లీ భావోద్వగభరితంగా చెప్పారు. ఇప్పుడు తాజాగా తన పాట రూపంలో ప్రపంచానికి తెలిపారు.  
     

  • ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే,  నందమూరి బాలకృష్ణ (Balakrishna) పేరు సరసన కొద్దిరోజుల క్రితమే 'పద్మ భూషణ్‌' చేరిన విషయం తెలిసిందే.  రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారం అందుకున్నారు. భారత రత్న, పద్మ విభూషణ్ తర్వాత ఈ అవార్డ్‌ ప్రాముఖ్యతలో దేశంలోనే మూడవ స్థానం ఉంది. ఏరంగంలోనైనా సరే ఉన్నత స్థాయి విశిష్ట సేవకు గుర్తుగా ఈ అవార్డుతో కేంద్రప్రభుత్వం గుర్తిస్తుంది. దేశంలో మూడో అత్యున్నత​ అవార్డును అందుకున్న బాలయ్య తాజాగా ఒక లిక్కర్‌ (మద్యం) కంపెనీకి సంబంధించిన యాడ్‌లో నటించడం సోషల్‌మీడియాలో విమర్శలకు దారితీసింది.

    తాను మద్యం తీసుకుంటానని పలు వేదికల మీద బాలకృష్ణ చెప్పిన విషయం తెలిసిందే. తన ఫేవరెట్ బ్రాండ్ ఏంటనేది కూడా  ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ విషయాన్ని ఆయన చాలాసార్లు ప్రకటించారు కూడా.. పలుమార్లు సినిమా వేడుకల సమయంలో తన కుర్చీ పక్కనే మద్యం మిక్స్‌ చేసిన బాటిల్‌ కనిపించిన సందర్భాలు ఉన్నాయి.  ఓటీటీలో బాలకృష్ణ చేసిన ఒక టాక్‌ షోకు కూడా తనకు ఇష్టమైన బ్రాండ్ కంపెనీనే స్పాన్సర్‌ చేసింది. అలా బాలయ్యకు ఆ బ్రాండ్‌తో చాలా అనుబంధం ఉంది. అంతవరకు ఫర్వాలేదు, దానిని  ఎవరూ తప్పబట్టాల్సిన పనిలేదని చెప్పవచ్చు. కానీ, ప్రస్తుతం అదే బ్రాండ్‌కు ఆయన ప్రచార కర్తగా ఒక యాడ్‌ను షూట్‌ చేసి సంతోషంగా మద్యం తాగేయండి అంటూ వీడియో విడుదల చేశారు.

    ఒక  సినీ నటుడిగా బాలకృష్ణ ఇలాంటి యాడ్‌ చేయడాన్ని ఎవరూ తప్పబట్టరు.. ఎందుకంటే చాలామంది సినీ సెలబ్రిటీలు చేశారు. కానీ, ఇప్పుడు వారందరితో బాలయ్యను పోల్చలేం కదా.. ఎందుకంటే ఆయనొక ఎమ్మెల్యే ఆపై అన్నింటికి మించి దేశంలోనే మూడో అత్యున్నత​ అవార్డు 'పద్మ భూషణ్‌'ను రీసెంట్‌గానే అందుకున్నారు. పేరు పక్కన అంతటి గౌరవం దక్కిన తర్వాత కనీసం కొంత అయినా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అభిమానులతో పాటు సామాన్య ప్రజలు కూడా ఆశిస్తారు. 

    కావాల్సినంత డబ్బు, పేరు ఉన్నాయి కదా.. మరీ ఇలాంటి హానికరమైన ఉత్పత్తులను ప్రమోట్‌ చేయడం ఎందుకంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే విషయంలో బాలకృష్ణపై  విమర్శలు వస్తున్నాయి.  పద్మభూషణ్ అవార్డు అందుకొని నెల కూడా కాలేదు ఇంతలోనే ఒక లిక్కర్ కంపెనీ కోసం యాడ్ చేయడం ఏంటి అంటూ తప్పబడుతున్నారు. బాలయ్య కాస్త అవార్డుకైనా విలువ ఇవ్వవయ్యా అంటూ ట్వీట్లు చేస్తున్నారు.

  • సౌత్‌ ఇండియా పాపులర్‌ నటి సమంత డేటింగ్‌లో ఉన్నారని జరుగుతున్న ప్రచారంపై తన మేనేజర్‌ స్పందించారు. తాజాగా తన నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్‌ పిక్చర్స్‌లో నిర్మించిన తొలి సినిమా ‘శుభం’ (Subham) విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో సమంత అతిథి పాత్రలో నటించారు. మూవీ విడుదల సమయంలో ప్రమోషన్స్‌లో భాగంగా ఆ చిత్ర యూనిట్‌తో పాటు దర్శకుడు రాజ్‌ నిడిమోరుతో సమంత కలిసి దిగిన ఫొటోలు నెట్టింట వైరల్‌ అయ్యాయి. రాజ్‌- సమంత ఇటీవల తరచూ ఒకే చోట కనిపించడంతో కొద్దిరోజులుగా రూమర్స్‌ వచ్చాయి. తాజా ఫొటోతో నెట్టింట మళ్లీ చర్చ మొదలైంది. వారు డేటింగ్‌లో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని ప్రచారం జరుగుతుంది. ఈ రూమర్స్‌పై సమంత మేనేజర్‌ స్పందించారు.

    డైరెక్టర్ రాజ్ నిడమోరుతో సమంత డేటింగ్ చేస్తున్నారనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆమె మేనేజర్‌ అన్నారు. అవన్నీ కేవలం పుకార్లు మాత్రమేనంటూ తెలిపారు. సమంత నిర్మించిన శుభం సినిమా ప్రమోషన్స్‌ సమయంలో తీసిన ఫోటోలను ఇలా తప్పుడు వార్తలకు లింక్‌ చేస్తూ వైరల్‌ చేస్తున్నారని పేర్కొన్నారు. రాజ్‌ తన కూతురితో పాటు సమంతతో కలిసి ఉండాలని అనుకుంటున్నాడని వచ్చిన ప్రచారం పూర్తిగా అవాస్తవమని అన్నారు. అసలు ఆయనకు కూతురే లేదన్నారు. తనతో పాటు ఉన్న అమ్మాయి కోడైరెక్టర్ కృష్ణ డీకే కూతురని చెప్పుకొచ్చారు. తప్పుడు వార్తలు ప్రచారం చేసి ఎవరినీ ఇబ్బంది పెట్టొద్దని సమంత మేనేజర్‌ కోరారు.

  • సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు- దర్శకుడు రాజమౌళి కలయికలో మొదలైన సినిమా ఇప్పటికే షూటింగ్‌ ప్రారంభమైంది. భారీ బడ్జెట్‌తో కె.ఎల్‌. నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే, తాజాగా కోలీవుడ్‌ నుంచి స్టార్‌ యాక్టర్‌ కూడా ఇందులో భాగం కానున్నారని తెలుస్తోంది. త్వరలోనే ఆయన సెట్స్ పైకి కూడా వస్తాడనేది నెట్టింట వైరల్‌ అవుతుంది.

    ‘ఎస్‌ఎస్‌ఎంబీ29’ వర్కింగ్‌ టైటిల్‌తో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్‌లోకి తమిళ స్టార్‌ హీరో విక్రమ్‌ జాయిన్‌ కాబోతున్నాడని సమాచారం. ఈమేరకు ఆయనతో ఇప్పటికే చర్చలు కూడా పూర్తి అయ్యాయట. గతంలో కూడా  పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ఎంట్రీ గురించి మొదట రూమర్స్‌తోనే ప్రారంభమయిన విషయం తెలిసిందే. కొంతకాలానికి అదే నిజమైంది. ఇప్పుడు విక్రమ్‌ విషయంలో కూడా ఇదే జరగబోతుందని ఇండస్ట్రీలో టాక్‌ మొదలైంది. మే నుంచి జూన్‌ వరకు ఈ సినిమా షూటింగ్‌ మళ్లీ ప్రారంభం కానుంది. దీనికోసం  హైదరాబాద్‌లో ఓ భారీ సెట్‌ను సిద్ధం చేస్తున్నారని సమాచారం. ప్రముఖ హాలీవుడ్‌ స్టంట్‌ డైరెక్టర్స్‌ నేతృత్వంలో బిగ్‌ యాక్షన్‌  ఎపిసోడ్‌ను తెరకెక్కించనున్నారని తెలిసింది. ఈ సీన్‌ నుంచే విక్రమ్‌ ఎంట్రీ ఉంటుందని అభిమానులు అంచనా వేస్తున్నారు.

    ‘ఎస్‌ఎస్‌ఎంబీ29’లో విక్రమ్‌ నటించబోతున్నట్లు గతేడాదిలోనే ఈ రూమర్స్‌ వచ్చాయి. అప్పుడు స్వయంగా విక్రమ్ ఇలా స్పందించాడు. 'రాజమౌళి, నేను రెగ్యూలర్‌గానే టచ్‌లో ఉంటాం. రాజమౌళి దర్శకత్వంలో నా సినిమా తప్పకుండా ఉంటుంది. కానీ,  మహేష్ మూవీ గురించి మా మధ్య ప్రస్తుతానికి చర్చలు జరగలేదు' అని ఆయన తెలిపారు. గతంలో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కూడా తనపై రూమర్స్‌ వచ్చినప్పుడు ఇలానే రియాక్ట్‌ అయ్యాడు. ‍కొంత కాలానికి మహేష్‌ సినిమాలో తాను భాగం కాబోతున్నట్లు ప్రకటించారు. కాబట్టి విక్రమ్ విషయంలో కూడా ఇదే  జరుగుతుందని ఫ్యాన్స్‌ భావిస్తున్నారు. 

Family

  • మన దేశ వ్యవసాయ రంగంలో ఇటీవల సంచలనం సృష్టిస్తున్న అధునాతన సాంకేతికత ‘జీన్‌ ఎడిటింగ్‌ – జి.ఇ.’. జన్యు సవరణ అనేది శాస్త్రవేత్తలు మొక్కలు, జంతువులు, బ్యాక్టీరియాతో సహా సకల జీవుల లక్షణాలను మెరుగుపరచడానికి అనుమతించే సరికొత్త బ్రీడింగ్‌ పద్ధతుల్లో ఒకటి. జన్యు సవరణ కోసం ఉపయోగించే సాంకేతికతలు కత్తెర లాగా పనిచేస్తాయి. డి.ఎన్‌.ఎ. అంటే డీఆక్సీరైబో కేంద్రక ఆమ్లం. ముఖ్యంగా క్రోమోజోముల్లో ఉంటుంది. మైటోకాండ్రియాలలో చాలా కొద్దిగా కనిపిస్తుంది. జీవులన్నింటిలో డి.ఎన్‌.ఎ. ముఖ్యమైన జన్యు పదార్థంగా వ్యవహరిస్తుంది. జీవుల్లో అనువంశికానికి డి.ఎన్‌.ఎ. మూలాధారం. ఒక నిర్దిష్ట ప్రదేశంలో డి.ఎన్‌.ఎ.ను కత్తిరించడం, కత్తిరించిన లేదా తెలిసిన డి.ఎన్‌.ఎ. శ్రేణులను తొలగించడం, జోడించడం లేదా భర్తీ చేయడం వంటివి చేస్తాయి. ఒక్కమాటలో చెప్పాలంటే.. పంటల డిఎన్‌ఎలోని జన్యువుక్రమంలో ఆశించిన అవసరం మేరకు అందుకు సంబంధించిన జన్యువును కత్తిరించటం ద్వారా ఆశించిన ఫలితాలను రాబట్టుకోవటమే జన్యు సవరణ ప్రక్రియ లక్ష్యం.

    జీన్‌ ఎడిటింగ్‌ సింథటిక్‌ బయాలజీలో ఒక భాగం. ఇది జీవశాస్త్రం, ఇంజనీరింగ్, కంప్యూటర్‌ సైన్స్‌ సూత్రాలను కలిపి కొత్త జీవ వ్యవస్థలను సృష్టించడానికి, ఉన్న వాటిని సవరించడానికి ఉపయోగపడుతుంది. సింథటిక్‌ బయాలజీ (Synthetic biology) అనేది సాపేక్షంగా కొత్త రంగం. ఈ సంకేతికతకు ఉన్న విస్తారమైన సామర్థ్యం కారణంగా ఇటీవలి సంవత్సరాలలో గణనీయమైన రీతిలో ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. మొక్కలు, బ్యాక్టీరియా వంటి జీవుల జన్యువుల్లో మార్పులు చేయడం ద్వారా నిర్దిష్ట విధులను నిర్వర్తించగల కొత్త జీవ వ్యవస్థలను సృష్టించవచ్చు. జీనోమ్‌ ఇంజనీరింగ్‌ను వ్యవసాయం, వైద్యం, బయోటెక్నాలజీ (Biotechnology) సహా వివిధ రంగాల్లో ఉపయోగించవచ్చు. వ్యవసాయాన్ని మరింత సుస్థిరమైన, సమర్థవంతమైన, పర్యావరణ హితమైన రంగంగా మార్చుకోవచ్చు. ఈ సాంకేతికత వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తేగల సామర్థ్యాన్ని కలిగి ఉంది.  

    సింథటిక్‌ బయాలజీ పద్ధతుల్లో జన్యు సవరణ ఒకటి
    సింథటిక్‌ బయాలజీలో ఉపయోగించే పద్ధతులు అనేకం ఉన్నాయి. డిఎన్‌ఎ సంశ్లేషణ – అసెంబ్లీ, జీనోమ్‌ ఎడిటింగ్, ప్రోటీన్‌ ఇంజనీరింగ్, జీవక్రియ ఇంజనీరింగ్, సిస్టమ్స్‌ బయాలజీ వంటివి అందులో ముఖ్యమైనవి. జన్యు సవరణలో క్రిస్పర్‌ – కాస్‌9 వంటి పద్ధతులను ఉపయోగిస్తున్నారు. ఇది నిర్దిష్ట డిఎన్‌ఎ శ్రేణులను కత్తిరించడానికి, సవరించడానికి డిఎన్‌ఎ గైడెడ్‌ న్యూక్లియస్‌లను ఉపయోగిస్తుంది. తెగుళ్లు, పర్యావరణ ఒత్తిడి, పంట దిగుబడితో సంబంధం ఉన్న జన్యువుల సవరణల ద్వారా వైద్యం, వ్యవసాయం వంటి రంగాల్లో జీనోమ్‌ ఎడిటింగ్‌ (Genome Editing) విప్లవాత్మక మార్పులను తేగలిగిన స్థితిలో ఉంది.  

    జన్యు సవరణ ప్రయోజనాలు

    ఖచ్చితమైన నియంత్రణతో జీవ వ్యవస్థలను రూపొందించే, నిర్మించే సామర్థ్యం కలిగి ఉండటం జన్యు సవరణ వంటి సింథటిక్‌ బయాలజీ సాంకేతికతల ప్రాథమిక ప్రయోజనాల్లో ఒకటి.

    వ్యవసాయం, వైద్య చికిత్సలు, పర్యావరణ కాలుష్య నివారణ, పారిశ్రామిక అప్లికేషన్లకు ఈ సాంకేతితక కొత్త మార్గాలను తెరుస్తుంది.

    ఉదాహరణకు, నిర్దిష్ట వ్యాధులను లక్ష్యంగా చేసుకోగల ప్రత్యేక ఔషధాలను రూపొందించడానికి లేదా పర్యావరణంలోని కాలుష్య కారకాలను విచ్ఛిన్నం చేయగల సూక్ష్మజీవులను రూపొందించడానికి సింథటిక్‌ బయాలజీని ఉపయోగించవచ్చు.

    ఆహార భద్రత, ఇంధనం, వాతావరణ మార్పు వంటి విశ్వవ్యాప్త సవాళ్లకు స్థిరమైన పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి కూడా సింథటిక్‌ బయాలజీని ఉపయోగించవచ్చు.

    ఉదాహరణకు, సింథటిక్‌ బయాలజీ వాతావరణ మార్పులను దీటుగా తట్టుకునే పంటలను అభివృద్ధి చేయవచ్చు. పురుగుమందులు, కలుపు మందుల వాడకాన్ని తగ్గించడానికి, పంటల దిగుబడిని పెంపొందించడానికి సహాయపడుతుంది.

    జన్యు సవరణ ప్రతికూలతలు
    జన్యు సవరణ వంటి సింథటిక్‌ బయాలజీ సాంకేతికత వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నప్పటికీ, దానికి వుండే సమస్యలు దానికి ఉన్నాయి. జీవుల జన్యువుల్లో మార్పులు చేయటంలో భద్రత, నైతిక చిక్కులు ఇమిడి ఉన్నాయి.

    ఈ సాంకేతికతను బాధ్యతాయుతంగా, సురక్షితంగా ఉపయోగించుకోవాలి. అందుకు జాగ్రత్తగా నియంత్రణ, పర్యవేక్షణ అవసరం.

    చ‌ద‌వండి: జ‌న్యు స‌వ‌ర‌ణ వ‌రి వంగ‌డాల‌ను ఆవిష్క‌రించిన ఐసీఏఆర్‌

    అధిక ధర, సంక్లిష్టత దీనికి ఉన్న పెద్ద ప్రతికూలత. ప్రత్యేకమైన పరికరాలు, సుశిక్షితులైన సిబ్బంది అవసరం. ఇందుకు భారీ పెట్టుబడి అవసరం, దీని వలన చిన్న తరహా ప్రాజెక్టులను చేపట్టటం కష్టంగా మారుతుంది.

    ఊహించని పరిణామాలు సంభవించే ప్రమాదం ఉంది. జన్యు మార్పులకు లోనైన జీవులు సహజ వాతావరణంతో అనూహ్య విధాలుగా ప్రతిస్పందించే అవకాశం ఉంది. 

  • లాపతా  లేడీస్‌ సినిమాతో లైమ్‌లైట్‌లోకి వచ్చిన యంగ్‌హీరోయిన్‌ నితాన్షి గోయల్ (Nitanshi Goel). ఈ మూవీలో తనదైన నటనతో అటు విమర్శకులు, ఇటు అభిమానుల  హృదయాలను గెలుచుకుంది. 2024లో అత్యంత ప్రజాదరణ పొందిన సినిమాల్లో ఒకటైన లాపతా లేడీస్‌లోని  ఫూల్‌ పాత్రతో అభిమానులను కట్టిపడేసింది.  ఇన్‌స్టాలో అత్యధిక సంఖ్యలో ఫాలోవర్లను కలిగి ఉన్న అతి పిన్న వయస్కురాలైన నటి కూడా నితాన్షి కావడం విశేషం.

    ఇపుడు మరో విశేషం ఏమిటంటే... నితాన్షి 78వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో  అరంగేట్రం చేసింది.  అరంగేట్రం చేయడం మాత్రమే కాదు కాన్స్‌లో తన లుక్స్‌తో వావ్‌ అనిపించింది.  17 ఏళ్ల యువతార బ్లాక్‌ అండ్‌ గోల్డ్‌ గౌన్‌తో  తళుక్కున మెరిసి అభిమానులను ఫిదా చేసింది.  ఆమె లుక్‌కు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఆమె డిజైనర్‌ దుస్తులు, స్టైల్‌,  సీనియర్‌ నటీమణులకు ఆమె ఇచ్చిన గౌరవం   స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచాయి.  అందరి దృష్టి నితాన్షి గోయల్ జుట్టుపైనే ఉంది, ఆమె రేఖ-మధుబాలతోపాటు, శ్రీదేవికి  లాంటి స్టార్లను తన జడలో చుట్టేసుకుంది.

    నితాన్షి లుక్‌లో ప్రధాన ఆకర్షణ,  ముత్యాల జడలో 
    కేన్స్ 2025లో తన ముత్యాల జుట్టుతో 8 మంది బాలీవుడ్ నటీమణులకు నివాళి అర్పించింది. నితాన్షి గోయెల్ అలనాటి  బాలీవుడ్‌ అందాల తారలు మధుబాల, నర్గీస్, మీనా కుమారి, నూతన్, వహీదా రెహ్మాన్, ఆశా పరేఖ్, వైజయంతిమాల, హేమ మాలిని, రేఖ , శ్రీదేవి వంటి ప్రముఖ బాలీవుడ్ నటీమణుల సూక్ష్మ ఫోటో ఫ్రేమ్‌లున్న (miniature photo frames)  కస్టమ్-మేడ్ హెయిర్‌ యాక్సెసరీతో అదరగొట్టేసింది. హిందీ సినిమా ప్రపంచంలో చెరిగిపోని ముద్ర వేసుకున్న నటీమణులపై తన ప్రేమను చాటుకున్న  వైనం పలువుర్ని ఆకట్టుకుంది. కాన్స్ 2025కి ఈ డ్రెస్ వేసుకోవాలని నిర్ణయించుకోవడానికి తనకు 10-15 నిమిషాలు పట్టిందని చెప్పింది.

    చదవండి: 2027లో సుప్రీంకోర్టు చరిత్రలోనే రికార్డు సృష్టించనున్నది ఎవరో తెలుసా?

    ముత్యాల చీర,
    పూసలు, ముత్యాలు,  సీక్విన్లతో తయారు చేసిన  ప్రీ-డ్రేప్డ్ చీరలో  అందంగా ముస్తామైంది. దానిపై  మల్టీ లేయర్ల , 3D వర్క్‌ , ఇంకా దీనికి భారీ పల్లూ కూడా ఉంది. ఈ చీరకు  ముత్యాలు పొదిగిన స్ట్రాపీ బ్లౌజ్‌ను జత చేసింది. తన ఫ్యాషన్ ఐకాన్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ అని చెప్పిన నితాన్షి, కాన్స్‌లో ఉన్నప్పుడు అలియా భట్‌ ధీటుగా ఉండాలని కోరుకున్నానని వెల్లడించింది. నితాన్షి లుక్  డిస్నీడాల్‌గా చాలా ముద్దుగా ఉంది.

    నితాన్షి రికార్డు
    లాపతా లేడీస్ చిత్రంలో  ఉత్తమ నటి అవార్డును అందుకున్న అతి పిన్న వయస్కురాలిగా రికార్డ్‌. లోరల్ పారిస్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ, ఆమె గురువారం కాన్స్ రెడ్ కార్పెట్‌లోకి అడుగుపెట్టింది,  ఈఘనతను సాధించిన అతి పిన్న వయస్కురాలైన భారతీయ నటిగా నిలిచింది.
     

    ఇదీ చదవండి: మాయమైపోతున్న మనిషి కోసం..శాలిని


     

  • ఇది మామిడి సీజన్‌ – ఎండల వేడితో పాటూ దక్కే తీపి రుచులు మామిడి పండ్లు. ఈ సీజన్‌లో మామిడి పండ్లు తింటాం కానీ.. తొక్క మాత్రం తీసి విసిరేస్తాం. కానీ మీకు తెలుసా? మామిడి తొక్క కూడా ఓ పోషకవంతమైన ఆహారం కావచ్చు. అవును – మామిడి తొక్క తినదగినదే, కొన్ని సందర్భాల్లో ఆరోగ్యానికి మంచిది కూడా అంటున్నారు పోషకాహార నిపుణులు..

    తొక్క తినడం సురక్షితమేనా?
    సాంకేతికంగా చూస్తే, అవును. మామిడి తొక్క విషమేమీ కాదు. ఇది ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు,  మాంగిఫెరిన్, క్వెర్సిటిన్, కెరోటినాయిడ్లు వంటి బయోయాక్టివ్‌ పదార్థాలతో నిండివుంది. అయితే  మామిడి తొక్క మందంగా, కొద్దిగా చేదుగా, కొన్నిసార్లు కొబ్బరి తరహాల ఉంటుంది. అందువల్ల చాలా మందికి నచ్చదు.అంతేకాదు  కొంత మందికి మామిడి తొక్కలోని కొన్ని పదార్థాలు అలెర్జీ కలిగించొచ్చు మామిడిని తీసేటప్పుడు మురికితో పాటు చర్మంపై మంట వచ్చినట్లయితే, తొక్క తినకుండా ఉండటమే మంచిది.

    తొక్కలో పోషకాలు...
    ఇందులోని ఫైబర్‌: జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తుంది. యాంటీఆక్సిడెంట్లు మాంగిఫెరిన్‌ వంటి పదార్థాలు శరీరంలో అలర్జీలు, వృద్ధాప్య లక్షణాలను తగ్గిస్తాయి. చర్మ ఆరోగ్యానికి మేలు చేసే కెరోటినాయిడ్లు, విటమిన్‌ ఇ చర్మాన్ని కాంతి వంతం చేస్తుంది. అలాగే కొన్ని పరిశోధనలు మామిడి తొక్క బ్లడ్‌ షుగర్‌ను నియంత్రించడంలో సహాయపడవచ్చని చెబుతున్నాయి. 

    రుచికరంగా తినే విధాలు:

    మామిడి తొక్క చట్నీ:
    2 మామిడిల తొక్క (శుభ్రంగా కడగాలి)
    ఒక పచ్చిమిరపకాయ ఒక టేబుల్‌ స్పూన్‌ తురిమిన కొబ్బరి
    అల్లం చిన్న ముక్క, తగినంత ఉప్పు,కొద్దిగా నిమ్మరసం తీసుకోవాలి. 
    ఈ పదార్థాలన్నింటినీ మిక్సీలో కొద్దిగా  మిక్స్‌ చేయండి. కావాలంటే మస్టర్డ్‌ గింజలు, కరివేపాకు టాంపర్‌ చేయొచ్చు.

    ఎండబెట్టి పొడి తయారు చేయడం:
    మామిడి తొక్కని ఎండలో లేదా ఓవెన్‌ లో బాగా ఎండబెట్టి పొడి చేసి, స్మూతీల్లో లేదా మసాలా మిశ్రమాలలో కలుపుకోవచ్చు. 

    • ఒక చిన్న ముక్క మామిడి తొక్క పండిన మామిడి, అరటిపండు, యోగర్ట్‌తో కలిపి మేళవిస్తే.. తీపి, చేదు మధ్య బ్యాలెన్స్‌ అవుతుంది. 

    • తొక్కని తరిగి, నీళ్ళలో నానబెట్టి, కొన్ని రోజులు ఫెర్మెంటేషన్‌కు ఉంచండి. స్వచ్చమైన వెనిగర్‌ లాగా తయారవుతుంది. సలాడ్‌ డ్రెస్సింగ్‌కు బాగా సరిపోతుంది.

    • శుభ్రంగా కడిగిన మామిడి తొక్కని వేడి నీటిలో లేదా గ్రీన్‌ టీ లో వేసి మరిగించండి. హల్కా రుచి, యాంటీ ఆక్సిడెంట్ల తేలికపాటి పౌష్టికత మీకు లభిస్తుంది.

    జాగ్రత్తలు...
    పండే మామిడి తొక్కపై పురుగుమందుల శేషాలు ఉండొచ్చు. తొక్క తినాలంటే ఆర్గానిక్‌ మామిడిని మాత్రమే ఎంచుకోవాలి. అలా దొరకని పక్షంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి అవేంటంటే..

    • నీళ్ళలో 1 టీస్పూన్‌ ఉప్పు, టీస్పూన్‌ పసుపు కలిపి 10–15 నిమిషాలు  నానబెట్టి, తరువాత శుభ్రంగా కడగడం ద్వారా కాయపై అలుముకున్న పెస్టిసైడ్స్‌ ఏవైనా ఉంటే తొలగించవచ్చు. 

    • అలాగే  ఒక బౌల్‌ నీటిలో 1 టేబుల్‌ స్పూన్‌ బేకింగ్‌ సోడా వేసి 15 నిమిషాలు నానబెట్టి, తరువాత మంచి నీటితో కడగడం  

    • 1:3 నిష్పత్తిలో వెనిగర్‌ : నీటిలో కలిపి 15–20 నిమిషాలు నానబెట్టి శుభ్రంగా కడగాలి. 

    • అలాగే తినాలనుకుంటే మామిడి తొక్కని మృదువైన బ్రష్‌ లేదా గుడ్డతో సున్నితంగా తోమి శుభ్రం చేయాలి.

    (చదవండి: Miss World 2025: మెక్సికన్‌ 'మే'నూ..! అందుబాటులో అంతర్జాతీయ వంటకాలు..)

  • ధృతరాష్ట్రుడు విదురుడితో మాట్లాడుతూ ‘మనుషుల ఆయువు వంద సంవత్సరాలైనా అతి తక్కువ మందే వందేళ్ళు జీవిస్తున్నారు. ఎక్కువ మంది వందేళ్ళ లోపే మరణిస్తున్నారు. ఎందుకు? దీని గురించి నీకేమైనా తెలిస్తే చెప్పు’ అన్నాడు.

    అందుకు విదురుడు, ఆరు అంశాలే మనిషి ఆయుష్షును తగ్గిస్తున్నా యన్నాడు. అవి – అహంకారం, అదే పనిగా వాగుతూ ఉండటం, త్యాగ గుణం లేకపోవడం, కోపావేశాలు, స్వార్థబుద్ధి, మిత్రులకు నమ్మక ద్రోహం చేయడం! ఏ విధంగా చూసినా ఈ ఆరూ ఎవరికీ మంచివి కావన్నాడు. ‘నేనే గట్టివాడిని, నేనే ధనవంతుడిని, నేనే దాతను, నేనే మంచివాడిని, ఇతరులు దుష్టులు’ అని అనుకోవడంతో గర్వం తలకె క్కుతుంది. గర్విష్టిని భగవంతుడు శీఘ్రమే అంతం చేసేస్తాడు. కనుక గర్వం లేకుండా ఉండటానికి తన లోని లోపాలను, తప్పులను చూసుకోవాలి. అదేపనిగా మాట్లాడేవాడు అనవసరమైన విషయాలను గురించి మాట్లాడి లేని పోని కయ్యాలకు కాలుదువ్వుతాడు. అందుకే పరమాత్మ భగవద్గీతలో ‘పరుషమైన మాటలు మాట్లాడకపోవడం మంచిది. నిజమైనది ఏదో, ప్రియమైనది ఏదో, మంచిది ఏదో తెలుసుకుని మాట్లాడాలి’ అన్నాడు.

    అన్నింటినీ మనమే అనుభవించాలనే ఆశ వల్ల మనలో త్యాగం చేయాలనే ఆలోచన పుట్టదు. ‘మనం ఈ ప్రపంచంలో పుట్టిందే మన కోసం కాదు, ఇతరులకు సాయం చేయడానికే’ అని తెలుసుకుంటే త్యాగ గుణం అలవడుతుంది. 

    మనిషికి ప్రథమ శత్రువు కోపం. కోపాన్ని జయించిన వాడే యోగి. అతనే ప్రపంచంలో సుఖపడతాడు. ఎవరు చెడు చేసినా ఎవరు మనల్ని కోపగించుకున్నా వాటిని సహించడం అలవాటు చేసుకోవాలి. స్వార్థమే అన్ని చెడులకూ కారణం. దీని నుంచి ఇవతలకు రావాలంటే మనలో మానవత్వం రవ్వంతైనా ఉండాలి. ఇక చివరగా, మిత్రులకు నమ్మక ద్రోహం చేయడం ఏ విధంగానూ సబబు కాదు. భగవంతుడు గీతలో చెప్పినట్లు అందరితోనూ మంచిగా ఉండాలి. ద్రోహచింతన తగదు. కరుణ ఉండాలి.
    – యామిజాల జగదీశ్‌

  • ఇటీవల కాలంలో కొందరు స్వలింగ వివాహం చేసుకుంటున్నారు. అయితే వాటిని సమాజం, పెద్దలు అంగీకరించకపోవడంతో.. ఎక్కడో విదేశాల్లో జీవనం సాగిస్తున్నారు. కొన్ని దేశాలు ఈ వివాహాలకు చట్టబద్ధత కల్పిస్తున్నాయి కూడా. కానీ మన దేశంలో ఈ వివాహంపై పలు అభ్యంతరలు ఉన్నాయి. ఈ తరుణంలో ఓ తల్లిదండ్రులు తమ కూతురి స్వలింగ వివాహం గురించి ఏ మాత్రం సంకోచించకుండా సగర్వంగా చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచారు. అది చాలా సర్వసాధరణమైన విషయంగానే మాట్లాడారు. ప్రస్తుతం ఇది నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది. నెటిజన్లు సైతం ఆశ్యర్యపోతూ..అందరూ ఇలా అంగీకరిస్తే బాగుండని చెబుతుండటం విశేషం.

    భారత సంతతికి చెందిన క్వీర్‌ మహిళ తన స్వలింగ వివాహాన్ని తల్లిందండ్రులు అంగీకరించిన విధానాన్ని నెట్టింట షేర్‌  చేసుకుంది. తన భార్య టీనాతో కెనడాలో నివసిస్తున్న సుభిక్ష సుబ్రమణి ఇన్‌స్టా వేదికగా ఈ విషయాన్ని షేర్‌ చేసుకున్నారు. ఓ గృహ ప్రవేశ వేడుకలో తన తల్లిందండ్రుల తమ వివాహాన్ని అంగీకరించిన సంఘటనను వీడియో తీసి మరీ పోస్ట్‌ చేశారు. 

    ఆ తంతు నిర్వహించేందుకు భారతదేశం నుంచి ఒక హిందూ పూజారి కెనడాకు వచ్చినట్లు ఆ వీడియోలో తెలిపింది సుబ్రమణి. ఆ వేడుకకు సుబ్రమణి తల్లిదండ్రులు కూడా హాజరయ్యారు. పూజకు సంబంధించిన ఆచారాల్లో భాగంగా సుబ్రమణిని కొన్ని ప్రశ్నలు అడిగారు పూజరి. దానికి సుబ్రమణి తల్లిదండ్రులు, సంకోచం లేకుండా.. గర్వంగా మా కుమార్తె టీనాను వివాహం చేసుకుందని చెప్పారు. సుబ్రమణి కూడా ఒక్కసారిగా షాకయ్యారు. ఎందుకంటే తల్లిందండ్రుల స్పందన ఇలా ఉంటుదని ఊహించలేదామె.  

    నిజంగానే ఇలా స్పందిస్తారని అస్సలు ఊహించలేదని, ఇది మర్చిపోలేని అత్యంత మధురమైన క్షణం ?అంటూ సుబ్రమణి సంతోషంగా చెప్పుకొచ్చింది వీడియోలో. అంతేగాదు ఆ వీడియోకి "పూజారి ఇలాంటి ప్రశ్నలు మిమ్మల్ని అడిగితే ఎలా స్పందిస్తారు?" అనే క్యాప్షన్‌ ఇచ్చి మరీ షేర్‌ చేశారు సుబ్రమణి. ఇక ఈ వీడియోకి ఏడు లక్షలకు పైగా వ్యూస్‌, రెండు లక్ష్లలకు పైగా లైక్‌లు వచ్చాయి.

    వీడియో కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి:

    (చదవండి: జస్ట్‌ డ్రెస్సింగ్‌ మాత్రమే కాదు..ట్రెండ్‌కి తగ్గ ఆభరణాలతో మెరవండిలా..!)

     

     

  • వెంట్రుక వాసిలో పతకాలు చేజారిపోయే పిస్టల్‌ షూటింగ్‌లో అద్భుత ప్రతిభ కనబరుస్తూ గుంటూరుకు చెందిన ముఖేశ్‌ నేలపల్లి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నాడు. జూనియర్‌ పిస్టల్‌ షూటింగ్‌లో పతకాలతో భవిష్యత్‌ తారగా ఎదిగాడు.... 

    గత ఏడాది పెరూలో జరిగిన వరల్డ్‌ జూనియర్‌ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో మొత్తం 5 బంగారు, 2 కాంస్య పతకాలు సాధించి ముఖేశ్‌ రికార్డు సృష్టించాడు. ఈ నెల 17 నుంచి 26 వరకు జర్మనీలోని సుహుల్‌లో జరగనున్న జూనియర్‌ వరల్డ్‌ కప్‌ షూటింగ్‌ పోటీలకు సిద్ధమయ్యాడు. ప్రస్తుతం ఢిల్లీలో నిర్వహిస్తున్న జాతీయ శిక్షణ శిబిరంలో ముఖేశ్‌ సాధన చేస్తున్నాడు. 

    11 ఏళ్ల  వయస్సులో స్కూల్‌ నిర్వహించిన వేసవి శిబిరంలో బాస్కెట్‌బాల్‌ సాధన కోసం ముఖేశ్‌ చేరాడు. కోచ్‌ సూచనతో అనుకోని విధంగా పిస్టల్‌ షూటింగ్‌ శిక్షణలో అన్న హితేశ్‌తో కలిసి సాధన  ప్రారంభించాడు. కొద్ది రోజులకే ముఖేశ్‌ పతకాలు సాధించడంతో తండ్రి శ్రీనివాసరావు 2018లో స్థానికంగా అందుబాటులో ఉన్న అంతర్జాతీయ కోచ్, ఇండియన్‌ అకాడమీ ఆఫ్‌ షూటింగ్‌ స్పోర్ట్‌ చీఫ్‌ కోచ్‌ నగిశెట్టి సుబ్రమణ్యం దగ్గర శిక్షణలో చేర్పించారు. తన ప్రతిభకు మరింత మెరుగులు దిద్దుకునేందుకు ముఖేశ్‌పుణేకు మకాం మార్చాడు. లండన్‌ ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత గగన్‌ నారంగ్‌ పుణేలో నిర్వహిస్తున్న ‘గన్‌ ఫర్‌ గ్లోరీ’ షూటింగ్‌ అకాడమీలో చేరాడు.   10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్, 25 మీటర్ల స్పోర్ట్స్‌ పిస్టల్, ర్యాపిడ్‌ ఫైర్‌ పిస్టల్, స్టాండర్డ్‌ పిస్టల్, 50 మీటర్ల పిస్టల్‌లో విభాగాలలో ముఖేశ్‌ నిలకడగా రాణిస్తున్నాడు. జాతీయ స్థాయిలో 80కుపైగా పతకాలు సాధించిన ముఖేష్‌ భారత రైఫిల్‌ షూటింగ్‌ శిబిరానికి ఎంపికయ్యాడు.

    ఒలింపిక్స్‌ లక్ష్యం
    భారత జట్టు తరపున సీనియర్‌ విభాగంలో ఒలింపిక్స్‌లో పతకం సాధించడమే నా లక్ష్యం. జర్మనీలో జరగనున్న పోటీల్లో 25 మీటర్ల ర్యాపిడ్‌ ఫైర్‌ పిస్టల్‌ ఈవెంట్‌లో పోటీపడుతున్నాను. పతకాలతో తిరిగి వస్తానని ఆత్మవిశ్వాసంతో ఉన్నాను. – ముఖేశ్‌

    – మురమళ్ళశ్రీనివాసరావు, సాక్షి స్పోర్ట్స్, గుంటూరు
     

  • బస్సెక్కినా రైలెక్కినా విమానం ఎక్కినా మనకు కావలసింది ఏది? కిటికీ పక్కన సీటు? ఎందుకు? బయటకు చూస్తుంటే బాగుంటుంది. ఎందుకు బాగుంటుంది? కొత్త ప్రాంతాలు కాబట్టి. పిల్లలూ... మనిషి పుట్టింది ఉన్న చోట ఉండటానికి కాదు. ప్రయాణించడానికి. తిరిగి లోకం చూడాలి. కొత్త మనుషులను కలవాలి. ప్రయాణాల్లో ఏం చూశారో, ఏం తెలుసుకున్నారో రాయాలి. అప్పుడు మీరు ‘ట్రావెల్‌ రైటర్‌’ అవుతారు. ‘యాత్రికుడు’ అనిపించుకుంటారు.

    పిల్లలూ! వేసవి సెలవుల్లో అమ్మా నాన్నలు మిమ్మల్ని ఏదో ఒక ఊరు తీసుకెళతారు. కొత్త ప్రదేశాలు చూపిస్తారు. మీరు అక్కడి వింతలు, విశేషాలు చూసి ఆనందిస్తారు. కొన్ని ఫొటోలు దిగి, తర్వాత ఇంటికి వచ్చేస్తారు. అక్కడితో ఆ పర్యటన ఓ గుర్తుగా మారుతుంది. అంతటితో సరేనా? దాన్ని మరింత పదిలం చేసుకోవాలని మీకు ఉండదా? మరి దానికేంటి మార్గం? ఒక్కటే. మీ పర్యటనలో మీకు ఎదురైన అనుభవాలను రాయడం. వాటిని రికార్డు చేసి పదిలంగా దాచుకోవడం.

    ట్రావెల్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఎందుకు రాయాలి?
    ట్రావెలర్స్‌ ట్రావెల్‌ చేసి పొందిన అనుభవాలను రాయడం కొత్త విషయమేమీ కాదు. గతంలో ఎంతోమంది తాము చేసిన యాత్రల వివరాలు, విశేషాలను పుస్తకాల రూపంలో రాశారు. వాటిని ‘యాత్రా కథనాలు’ అంటారు. వాటిని చదవడం వల్ల అక్కడకు పోలేని వారికి ఆ ప్రాంతాల చరిత్ర, విశిష్టత, కల్చర్, లైఫ్‌స్టైల్‌ గురించి అవగాహన ఏర్పడుతుంది. కొత్త ప్రదేశాల్లో ఉండే వైవిధ్యం తెలుస్తుంది. ఇదే మీరూ చేయొచ్చు. మీరు చూసిన ప్రదేశాల తాలూకు విశేషాలను వ్యాసంగా రాయొచ్చు. దాన్ని మీ స్నేహితులకు, టీచర్లకు చూపించొచ్చు. దీనివల్ల మీ అనుభవాలకు విలువ ఏర్పడుతుంది. అందరిలోనూ ప్రత్యేకంగా నిలుస్తారు.

    యాత్రాకథనాలు రాయడం వల్ల కలిగే లాభాలు
    యాత్రాకథనాలు రాయడంలో మీ ఎక్స్‌ప్రెషన్‌దీ లాంగ్వేజ్‌దీ కీలకమైన పాత్ర. కొత్త ప్రాంతంలో మనకు ఎదురైన అనుభవాలను మన మాటల్లో పెట్టడం వల్ల మనసులోని భావాలను ఎలా వ్యక్తీకరించాలో తెలుస్తుంది. దీనివల్ల స్పష్టమైన దృక్పథం ఏర్పడుతుంది. నచ్చింది నచ్చనిది చెప్పడం చేతనవుతుంది. ఉదాహరణకు మీరు ఊటీ వెళ్లారనుకోండి. క్యాబ్‌డ్రైవర్‌ మీతో మంచిగా వ్యవహరిస్తే ఆ సంగతి రాస్తారు. ర్యాష్‌గా ఉంటే ‘ఊటి వెళ్లినప్పుడు మీరు సరైన డ్రైవర్‌ను ఎంచుకోండి. లేకుంటే ఇబ్బంది పడతారు’ అని రాస్తారు. అది చదివి మిగిలిన వారు అలర్ట్‌ అవుతారు.

    జ్ఞాపకశక్తి పెరుగుతుంది
    మీరు ట్రావెలింగ్‌లో చూసిన విషయాలు అప్పటికప్పుడు పుస్తకంలో రాసుకోవచ్చు లేదా వాటిని గుర్తు పెట్టుకొని ఇంటికి వచ్చాక రాసుకోవచ్చు. లేదా అక్కడే చిన్నచిన్న పాయింట్ల రూపంలో రాసుకొని, ఇంటికి వచ్చాక విస్తరించి రాయొచ్చు. ఇలా చేయడం వల్ల మీ జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మీ ఆలోచనాధోరణి పదునెక్కుతుంది.

    చారిత్రక, సాంస్కృతిక అవగాహన
    మీరు చూసిన ప్రదేశాల గురించి రాయాలని అనుకున్నప్పుడు తప్పనిసరిగా ఆ ప్రదేశాల గురించి గూగుల్‌ చేస్తారు. మీరు చూసిన చోటు గురించి మరిన్ని విషయాలు తెలుసుకుంటారు. ఉదాహరణకు రెండు రోజులు హంపీ చూసి వస్తారు. ఆ ప్లేస్‌ మీద మీకు ఇంట్రెస్ట్‌ వస్తుంది. గూగుల్‌ చేసి యూట్యూబ్‌ ద్వారా హంపి గురించి ఇంకా చాలా విషయాలు తెలుసుకుంటారు. దీనివల్ల ఆ ప్రదేశాల చరిత్ర, సాంస్కృతిక విశేషాలు తెలుసుకుంటారు. ఇది మీకెంతో మేలు చేస్తుంది. 

    నేరుగా తెలుస్తుంది
    ఎప్పుడూ స్వీట్‌ తినని వారికి ఎంత చెప్పినా స్వీట్‌ అంటే ఏంటో తెలియదు. కేరళ ఎలా ఉంటుందో ఎన్ని వీడియోలు చూసినా నేరుగా చూడటంలోని మజా రాదు. కేరళ వెళితే హౌస్‌బోట్‌లో తిరుగుతున్నప్పుడు ఆ బ్యాక్‌వాటర్స్‌లో ఎంత బాగుంటుందో అనుభవించి రాస్తే ఆ ఫీలింగ్‌ వేరేగా ఉంటుంది. 

    ప్రపంచంలో గొప్ప వారంతా నెలలో, మూడు నెలలకోసారి ఏదో ఒక కొత్త ప్రాంతానికి వెళతారు. ఎందుకంటే తిరిగితే నాలుగు విషయాలు తెలుస్తాయి. ఇప్పుడు యూట్యూబ్‌ ట్రావెలర్స్‌ ఎందరో తిరుగుతూ వీడియోలు చేస్తూ సంపాదిస్తున్నారు కూడా. వేసవి సెలవులన్నీ నెక్స్ట్‌ క్లాస్‌ సబ్జెక్ట్స్‌ చదువుతూ వృథా చేయకండి. కిటికీ పక్కన ఒక్కసారైనా కూచోండి. కదలండి.
    – కె. 

    (చదవండి: కళ్లకు గంతలు.. ‘కళ’అద్దే వింతలు..)

  • కళ్లెదుటే తండ్రి మరణాన్ని చూసి తట్టుకోలేకపోయింది సాగయా ఏంజిలిన్‌ శాలిని. తండ్రితో కలిసి హాస్టల్‌కు వెళుతుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. సహాయం కోసం ఎంతోమందిని వేడుకుంది. సహాయం చేసే బదులు తనని ఆశ్చర్యంగా చూస్తూ ఎవరి దారిలో వారు వెళుతున్నారు.కొందరైతే తన విషాదాన్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడానికి వీడియోలు తీస్తున్నారు!

    ‘సాటి మనిషి బాధను పంచుకునే టైమ్, దయ మానవులలో ఎందుకు మాయం అవుతుంది?’ అనే కోణంలో ఆలోచించింది. ఆ విషాద సంఘటన శాలినిని మానసికంగా, ఆర్థికంగా కృంగదీసింది. రెండు నెలల పాటు బయటి ప్రపంచంలోకి రాలేదు. ‘జీవితంలో విషాదం ఒక భాగం అని అర్థం చేసుకునే పరిణతి నాలో ఆ సమయంలో లేదు’ అని గతాన్ని గుర్తు చేసుకుంది శాలిని. తన దుఃఖాన్ని ఇతరులతో పంచుకొని మనసు తేలిక చేసుకోవడానికి ఇన్‌స్టాగ్రామ్‌లోకి వచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తన బాధనే కాదు ఇతరుల బాధను కూడా పంచుకుంటుంది. యాక్సిడెంట్‌ సంఘటన తరువాత తనకు ఎదురైన చేదు అనుభవం గురించి శాలిని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన వీడియోకు అనూహ్యమైన స్పందన వచ్చింది. ఆ స్పందనే ఒక కమ్యూనిటీ ఏర్పాటుకు దారి తీసింది.

    ఇదీ  చదవండి: Cannes: అరంగేట్రంలోనే ఎదురు దెబ్బ, లగేజీ మొత్తం గాయబ్‌!

     

     బాధితులకు తమ వంతు సహాయపడడానికి కమ్యూనిటీ ఏర్పాటైంది. తమిళనాడు నలుమూలల నుంచి ఈ కమ్యూనిటీలో వందలాది సభ్యులు ఉన్నారు. బాధితులకు నైతికస్థైర్యం ఇవ్వడం నుంచి ఆర్థిక సహాయం అందించడం వరకు ఈ కమ్యూనిటీ పనిచేస్తోంది. చెన్నైలోని మధ్యతరగతి కుటుంబంలో పుట్టింది శాలిని. తమ పుట్టిన రోజు వేడుకల సందర్భంగా అనాథాశ్రమాలకు వెళ్లడం, అక్కడి పిల్లలతో గడపడం శాలిని కటుంబ సభ్యులకు సంప్రదాయంగా వస్తుంది. ఆ సంప్రదాయమే శాలినిని సామాజిక సేవ వైపు అడుగులు వేసేలా చేసింది. సివిల్‌ ఇంజనీరింగ్‌ చేసిన శాలిని ΄ార్ట్‌ టైమ్‌ కంటెంట్‌ రైటర్‌గా పనిచేస్తూ వచ్చిన డబ్బులతో పిల్లలకు సహాయపడేది. తరచుగా అనాథాశ్రమాలకు వెళుతూ పిల్లల సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరిస్తుంటుంది. ‘నేను మీకు సహాయం చేస్తాను’ అని హామీ ఇవ్వడానికి ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తుంది. ‘నిలబెట్టుకోలేని హామీని ఇచ్చి వారిని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు’ అంటుంది శాలిని. పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడం నుంచి ఎవరైన చిన్న షాప్‌ పెట్టుకోవడం వరకు తనవంతుగా సహాయం చేస్తుంటుంది. 

     చదవండి: తీవ్ర నష్టాల్లో లగ్జరీ ఫ్యాషన్‌ హౌస్‌, 1700 మందికి ఉ‍ద్వాసన​

    ‘ఆర్థిక సహాయం మాత్రమే కాదు.. ప్రేమ పంచుకోవడం, ఎమోషనల్‌ సపోర్ట్‌తో ఎందరో జీవితాల్లో మార్పు తేవచ్చు’ అంటుంది శాలిని. ‘నేను ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడు నాన్న చనిపోయారు. ఎప్పుడూ బాధలో ఉండేదాన్ని. ఆత్మవిశ్వాసం కోల్పోయాను. ఆ సమయంలో శాలిని అక్క నాలో ధైర్యం నింపింది. ఉత్సాహాన్ని ఇచ్చింది. నేను తిరిగి చదువుకునేలా చేసింది. ఆమె నా వెనకాల ఉంది అనే భావన ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది’ అంటుంది తెన్‌కాశీకి చెందిన పద్దెనిమిది సంవత్సరాల ఆశ్మీ. శాలినిని అభిమానించే వాళ్లలో ఆశ్మీలాంటి వాళ్లు ఎంతోమంది ఉన్నారు. వారి అభిమానమే తన బలం.

    రోడ్డు ప్రమాదంలో తండ్రి...  సహాయం కోసం అరుస్తూనే ఉంది శాలిని. ఇలా చూసి అలా వెళ్లిపోతున్నారు కొందరు. కొందరైతే ఫోన్‌లో వీడియోలు తీస్తున్నారు. ...తన బాధను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది శాలిని. మాయమై΄ోతున్న మనిషి కోసం, మానవత్వం కోసం, ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడం కోసం ఆన్‌లైన్‌ కమ్యూనిటీని ఏర్పాటు చేయడంలో కీలక ΄ పాత్ర పోషించింది తమిళనాడుకు చెందిన శాలిని...
     

    అలా ఎప్పుడూ చేయలేదు
    ఇతరుల బాధలను సొమ్ము చేసుకోవాలని, నేను చేసిన వీడియోలు వైరల్‌ కావాలని ఎప్పుడూ ప్రయత్నించలేదు. నేను పోస్టు చేసిన 190 వీడియోలు నిజాయితీతో చేసినవి మాత్రమే. బాధితుల సమస్యలు నా దృష్టిలో కంటెంట్‌ కాదు.  ఏదో విధంగా వీడియోలు చేసి సొమ్ము చేసుకోవడం తేలికైన విషయం కావచ్చు. అయితే అలాంటి వారు వేగంగా నమ్మకంగా కోల్పోవడానికి ఎంతో సమయం పట్టదు. – శాలిని 

  • చక్కటి ఆభరణాలు వస్త్రధారణలో ఒక ముఖ్యమైన భాగం, ఇది దుస్తులను మెరిపించడం మాత్రమే కాదు డ్రెస్సింగ్‌ వెలవెల పోయేలా చేసే శక్తి కూడా కలిగి ఉంటుంది.  మెరవాలంటే ట్రెండ్‌కు అనుగుణంగా ఉంటే మాత్రమే సాధ్యం.   అయితే ప్రతి సీజన్‌లో రకరకాల ట్రెండ్‌లు వస్తుండటంతో, ఏది అనుసరించాలో, ఏది వదిలివేయాలో ? అనే గందరగోళం తప్పదు. ఈ నేపథ్యంలో సిటీ జ్యువెలరీ డిజైనర్‌లు అందిస్తున్న సూచనలివి.. 

    లేయరింగ్, స్టాకింగ్‌.. 
    పలు రకాల లెంగ్త్‌ ఉన్న చైన్‌ పెండెంట్‌లను లేయర్‌లాగా ధరించవచ్చు. లేదా ఒకే వైపు పలు బ్రేస్‌లెట్‌లను ఒకటిగా పేర్చవచ్చు. ఆల్‌ పీసెస్‌ రంగులు కలిసి కనబడేలా చూసుకోవడమే ఖచి్చతమైన స్టాక్‌కు కీలకం. ఇవి ఒక సాధారణ బైండింగ్‌ కారకంగా ఉండాలి.  

    షాండ్లియర్‌ చెవిపోగులు.. 
    ఈ షాండ్లియర్‌ శైలి చెవిపోగులు అత్యధికంగా మహిళల్ని ఆకట్టుకుంటాయి. దుస్తులకు నప్పేలా అలంకరణకు ఇది సరైన మార్గం. వీటిని మరే ఇతర ఆభరణాలూ లేకుండా ధరించవచ్చు.  డైమండ్‌ షాండ్లియర్స్‌ కావచ్చు లేదా జడౌ చంద్బాలిస్‌ కావచ్చు చెవిపోగులు మాత్రం తప్పనిసరిగా ఉండాలి. 

    బోల్డ్‌ రింగులు.. 
    ఒక పెద్ద డేరింగ్‌ రింగ్‌ ధరించడం రూపానికి అత్యాధునికతను జోడిస్తుంది. దీని కోసం ఓ అసాధారణమైన డిజైన్‌లను ఎంచుకోవాలి. రత్నం, సిగ్నెట్‌ పెద్ద వాస్తవిక పువ్వులు వంటివి మరింత అందాన్నిస్తాయి. 

    జడౌ..జతగా.. 
    ఏదైనా భారతీయ ఆభరణాల శైలిలో జడౌ నెక్లెస్‌ ధారణ తరతరాల వారసత్వంగా వస్తోంది. పూర్వ కాలంలో చాలా ఆభరణాలు మొఘల్‌ ఇతివృత్తంతో ప్రభావితమయ్యాయి, అయితే ప్రస్తుతం ఆధునిక ఆభరణాల తయారీలో పురాతన పద్ధతుల్లో ఏదైనా ఒకదానిని జత కలపడం ఒక ప్రత్యేకమైన కొత్త సంప్రదాయంగా మారింది. ఆ విధంగా జడౌ నెక్లెస్‌కు ఆదరణ పెరిగింది.  

    ఆమె..ఆభరణం.. 
    కాబోయే వధువు అయితే, పెళ్లి రోజు లుక్‌లో ఆభరణాలు అతి ముఖ్యమైన భాగం. పెళ్లి ఆభరణాలు, అవి ఏ వధువునైనా  యువరాణిగా చూపించగలవు. పెళ్లి వేడుకల్లో భారీ నెక్‌పీస్‌ ఎంచుకుంటారు. అయితే ఇవి విడదీసి, ధరించగలిగేలా ప్రత్యేకంగా రూపొందుతాయి. అన్నీ కలిపినప్పుడు అవి గ్రాండ్‌లుక్‌ని సంతరించుకుంటాయి. అలాగే వివాహానంతరం కూడా వాటిని సందర్భానుసారం ధరించవచ్చు. 

    ఆఫీస్‌..డైమండ్‌ పీస్‌.. 
    పని విధానాలకు అనుగుణంగా అలాగే సాయంత్రం సమావేశాల్లో సమర్థవంతంగా మమేకమయ్యే అందమైన పీసెస్, సెన్సిటివ్‌ డైమండ్‌ హగ్గీలు లేదా సాలిటైర్‌ స్టడ్‌లు రోజువారీ డ్రెస్సింగ్‌కు సరైన ఎంపిక. ఆఫీసుకు ఇండియన్‌ ఫార్మల్స్‌ ధరించడం ఇష్టపడితే, డైమండ్‌ సరౌండ్‌తో లేదా ఒక జత సింగిల్‌ పోల్కీ ఇయర్‌ స్టడ్‌తో సరిపెట్టొచ్చు.     

    (చదవండి: కళ్లకు గంతలు.. ‘కళ’అద్దే వింతలు..)

  • హైదరాబాద్‌ నగరంలో బ్లైండ్‌ ఫోల్డ్‌ వర్క్‌షాప్స్‌ ఊపందుకుంటున్నాయి. కళ్లకు గంతలు కట్టుకుని కుంచెకు పనిచెప్పే చిత్రకారులు సృష్టిస్తున్న చిత్రాలు కళాభిమానుల్ని ఆకట్టుకుంటున్నాయి. 

    ఈ నేపథ్యంలోనే నగరంలో ఆ తరహా చిత్రకళా నైపుణ్యం అందించే వర్క్‌షాప్స్‌ కూడా జరుగుతున్నాయి. తాజాగా నగరంలోని మాదాపూర్‌లో ఉన్న ట్రైలింగ్‌ ఐవీ కేఫ్‌ ఆధ్వర్యంలో ఒక వర్క్‌షాప్‌ జరగనుంది. 

    ఔత్సాహికులకు బ్‌లైండ్‌ ఫోల్డ్‌ ఆర్ట్‌ మెళకువలను నేర్పేందుకు శనివారం మధ్యాహ్నం 12.గంటలకు ఈ వర్క్‌షాప్‌ ప్రారంభం కానుంది. దాదాపు 2గంటల పాటు కొనసాగే ఈ కళాశిక్షణపై ఆసక్తి కలిగినవారు బుక్‌ మై షో ద్వారా ఎంట్రీలు పొందవచ్చు.   

    (చదవండి: Araku Aroma : హైదరాబాద్‌ టు యూఎస్‌..తొలి బ్రాండ్‌గా అరుకు అరోమా..!)

  • అరకు కాఫీ రుచిని యునైటెడ్‌ స్టేట్స్‌కు పరిచయం చేసిన మొదటి బ్రాండ్‌గా అరకు అరోమా నిలిచిందని, హైదరాబాద్‌ నగరంతో పాటు స్థానిక రుచులను విశ్వవ్యాప్తం చేయడంలో తాము వినూత్న ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు అరకు అరోమా వ్యవస్థాపకులు కృష్ణ చైతన్య తెలిపారు. 

    క్రిష్‌ ఫుడ్‌ అండ్‌ ఫన్‌ ఇండియా ఆధ్వర్యంలో అరకు అరోమా కొత్త కాఫీ బ్లెండ్‌లను ఆవిష్కరిస్తున్నామని పేర్కొన్నారు. రుచి, నాణ్యతకు ప్రసిద్ధి చెందిన ఈ ఆఫర్‌లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కాఫీ ఔత్సాహికులకు సరికొత్త అనుభవాలను అందిస్తాయని అన్నారు. ఈ కొత్త బ్లెండ్‌లలో అరకు అరోమా గ్రీన్‌ కాఫీ, అరబికా రీగేల్, ఫిల్టర్‌ కాఫీ, అరబికా ప్రైమ్‌ ఉన్నాయన్నారు. యూఎస్‌ఏలో రిజిస్టర్డ్‌ బ్రాండ్‌ ఉనికితో ప్రపంచవ్యాప్తంగా కాఫీ ప్రియులకు సేవలు అందిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.

    (చదవండి: Miss World 2025: మెక్సికన్‌ 'మే'నూ..! అందుబాటులో అందర్జాతీయ వంటకాలు..    )

  • వేసవి సెలవుల్లో అలా విదేశాలు తిరుగుతూ మెక్సికన్‌ ఫుడ్‌ తినాలనుకుంటున్నారా..! అవసరం లేదు, తామే మెక్సికన్‌ రుచులను నగరానికి తీసుకొస్తున్నామని ప్రముఖ చెఫ్‌ అమన్నా రాజు అంటున్నారు. మే నెల వేసవిలో వారాంతాలను అలా మెక్సికన్‌ స్మోకీ మెరినేడ్‌ రుచులను ఆస్వాదించాలనే వారికి తాము ప్రత్యేక వంటలను అందిస్తున్నట్లు సూచిస్తున్నారు. హైదరాబాద్‌ నగరంలోని నోవోటెల్‌ ఎయిర్‌పోర్ట్‌ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా మెక్సికన్‌ ఫుడ్‌ ఫెస్ట్‌ నిర్వహిస్తున్నారు. మెక్సికోలోని ఓక్సాకా, వెరాక్రూజ్‌ ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందిన విభిన్న రుచులను మెక్సికన్‌ గ్రిల్‌ నైట్స్‌తో నగరానికి పరిచయం చేస్తున్నారు. ఈ నెల 31వ తేదీ వరకూ ప్రతి శనివారం ఈ మెక్సికన్‌ ఫుడ్‌ ఫెస్ట్‌ అలరించనుంది.  

    ఓ వైపు భాగ్యనగరం వేదికగా ఈ నెల 31వ తేదీ వరకూ ప్రతిష్టాత్మక మిస్‌ వరల్డ్‌ పోటీలు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన మెక్సికన్‌ ఫుడ్‌ వెరైటీలు నగర వాసులను, నగరానికి విచ్చేస్తున్న విదేశీ అతిథులను ఆతీ్మయ విందుకు ఆహ్వానిస్తోంది. 

    అంతేకాకుండా ఈ ఫెస్ట్‌ నగరంలోని ఆహార వైవిధ్యానికి, విభిన్న సంస్కృతులకు చెందిన రుచుల సమ్మేళనానికి ప్రతీకగా నిలుస్తుందని నోవోటెల్‌ ఎయిర్‌పోర్ట్‌ జనరల్‌ మేనేజర్‌ సుఖ్‌బీర్‌ సింగ్‌ పేర్కొన్నారు.  

    గ్యాస్ట్రోనమిక్‌ సంతృప్తి.. 
    అంతర్జాతీయంగా మెక్సికన్‌ వంటలకు ప్రత్యేక ఆదరణ ఉంటుంది. ఫ్లేమ్‌–గ్రిల్డ్‌ మాంసాహారాలు, స్మోకీ మెరినేడ్‌లు, అరుదైన సుగంధ ద్రవ్యాల కలయికే ఈ వంటల ప్రత్యేకత. ఈ గ్యాస్ట్రోనమిక్‌ రుచుల వైవిధ్యాన్ని వేసవి ప్రత్యేకంగా నగరంలో ఆవిష్కరిస్తున్నారు. 

    ఈ ఫుడ్‌ ఫెస్ట్‌లో అతిథులు వెజిటబుల్‌ బౌల్, బీన్‌ ఎన్చిలాడా సూప్‌తో ప్రారంభిస్తారు. అనంతరం మినీ కార్న్‌ డాగ్స్‌ వంటి ఆహ్లాదకరమైన స్టార్టర్స్‌ను పచ్చి మిరపకాయ, ఆవాలు, రుచికరమైన గుమ్మడికాయ ఎంపనాడాస్‌తో కలిపి వడ్డిస్తారు. ప్రత్యేకంగా అందించే సలాడ్‌ టెక్స్చర్స్, వినూత్న రుచుల మిశ్రమంతో అలరిస్తుంది. 

    ప్రత్యేక దినుసులు.. 
    ఫెస్ట్‌లో భాగంగా సీఫుడ్‌ సెవిచే, శ్రీరాచా డ్రెస్సింగ్‌తో స్పైసీ మెక్సికన్‌ చికెన్‌ సలాడ్, చిపోటిల్‌ డ్రెస్సింగ్‌లో కలిపి కాల్చిన బెల్‌ పెప్పర్‌ సలాడ్‌ జిహ్వకు సరికొత్త రుచిని అందిస్తుంది. గ్వాకామోల్, పైనాపిల్‌ సల్సా, టొమాటో సల్సా వంటి క్లాసిక్‌ మెక్సికన్‌ రుచులు ఈ మెనూలో మరో ప్రత్యేకం. 

    మెక్సికో నుంచి దిగుమతి చేసుకున్న కొన్ని మసాలాలు దక్షిణాది మసాల రుచులకు భిన్నమైన అనుభూతిని అందిస్తాయి. చికెన్‌ క్యూసాడిల్లాస్, కాలాబాసిటాస్‌ కాన్‌ క్వెసో – చీజ్, వెజిటబుల్‌ చీజ్‌ ఎన్చిలాడాస్‌తో వండిన గుమ్మడికాయ, రుచికరమైన మొక్కజొన్న మిశ్రమాల్లో మసాల పరిమళం నగరవాసులను ఓక్సాకా, వెరాక్రూజ్‌ ప్రాంతాలకు తీసుకెళుతుంది. సీ ఫుడ్‌ లవర్స్‌ కోసం మెక్సికన్‌ రొయ్యలు, చేపల బిస్క్యూ పిసికాడో, కామరాన్‌ పోజోల్‌ను ఆస్వాదిస్తారు.   

    (చదవండి: మిస్‌ వరల్డ్‌ మధురమైన పాట)

  • అందంలోనే కాదు అద్భుతమైన గానంలోనూ ‘భేష్‌’ అనిపించుకున్నారు మిస్‌ వరల్డ్‌ అందాల తారలు...

    మిస్‌ వరల్డ్‌ (2019) టోని–అన్‌ సింగ్, వైట్నీ హ్యూస్టన్‌ పాట ‘ఐ హ్యావ్‌ నథింగ్‌’ను మిస్‌ వరల్డ్‌  ఫైనల్‌ ఈవెంట్‌లో అద్భుతంగా ఆలపించింది.

    మాజీ మిస్‌ వరల్డ్‌ ప్రియాంక చోప్రా తన సినిమాల్లోని పాటలను మ్యూజిక్‌ లేకుండానే పాడుతూ ప్రేక్షకులను అలరిస్తుంది.

    మిస్‌ వరల్డ్‌(1997) డయాన హేడెన్‌ ప్రొఫెషనల్‌ సింగర్‌. కాలేజీ రోజుల్లో ఎన్నో పోటీల్లో పాల్గొంది. మ్యూజిక్‌ ఇండస్ట్రీలో పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌గా పనిచేసింది.

    మిస్‌ వరల్డ్‌ (1999) యుక్తా ముఖీ మోడలింగ్, నటనలోనే కాదు గానంలోనూ ‘భేష్‌’ అనిపించుకుంది. హిందుస్థానీ క్లాసిక్‌ మ్యూజిక్‌లో మూడు సంవత్సరాల కోర్సు చేసింది.

    మిస్‌ వరల్డ్‌ (2017) మానుషి చిల్లర్‌ కూచిపూడి డ్యాన్సర్‌ మాత్రమే కాదు మంచి సింగర్‌ కూడా.

    మిస్‌ వరల్డ్‌ (1994) ఐశ్వర్య రాయ్‌ టెలివిజన్‌ షోలతో సహా ఎన్నో కార్యక్రమాలలో తన మధుర గాత్రాన్ని వినిపించింది. 

    (చదవండి: ఎవరీ అవధేష్ కుమార్ భారతి? ఏకంగా రాష్ట్రపతి ఆయన సేవలకు..)

Telangana

  • సాక్షి, హైదరాబాద్‌: తీవ్ర అనారోగ్యం బారిన పడిన కూతురును కాపాడుకునేందుకు ఆ తల్లి దండ్రులు చివరి క్షణంవరకు పోరాడారు. ఆస్తు లన్నీ అమ్మి, అప్పులు చేసి కూడా రెండేళ్లపాటు వైద్యం చేయించారు. అయినా, పాప ప్రాణాలు దక్కలేదు. మరోవైపు స్తోమతకు మించి వైద్యా నికి ఖర్చు చేయటంతో ఆ కుటుంబం ఆర్థికంగా చితికిపోయింది. ఆ విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆపన్నహస్తం అందించారు. 

    ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్‌) నుంచి గతంలో పాప వైద్యానికి రూ.8 లక్షలు ఇవ్వటంతోపాటు.. ఇప్పుడు ఆ పాప కుటుంబాన్ని ఆదుకునేందుకు మరో రూ.7 లక్షలు మంజూరు చేశారు. హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌కు చెందిన రఘు, మంజుల దంపతుల పెద్ద కుమార్తె వేదవల్లి (5)కి 2022లో బ్లడ్‌ క్యాన్సర్‌ సోకింది. పాపను రక్షించుకునేందుకు రెండేళ్లపాటు తల్లిదండ్రులు ఆసుపత్రుల చుట్టూ తిప్పారు. 2024లో సీఎం ఎ.రేవంత్‌రెడ్డి దృష్టికి ఈ విషయం రావటంతో చికిత్సకు అవసరమైన రూ.8 లక్షలు మంజూరు చేశారు. 

    చికిత్స అందించినప్పటికీ గతేడాది చివరలో వేదవల్లి మరణించింది. ఆమె చికిత్సకు ఆ కుటుంబం పెద్ద మొత్తంలో ఖర్చు చేయటంతో కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునేందుకు రూ.7 లక్షలు మంజూరు చేయాలని సీఎం అధికారుల ను ఆదేశించారు. ఆ మేరకు రూ.7 లక్షల చెక్కు ను సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు గురువా రం వేదవల్లి తండ్రి రఘుకు అందజేశారు.  
     

  • సాక్షి,హైదరాబాద్‌: మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. డబ్బులు తీసుకోకుండా మంత్రులు ఏ పనిచేయరూ అంటూ ఆమె చేసిన బహిరంగ వ్యాఖ్యలు వివాదంగా మారాయి. 

    వరంగల్‌లోని కృష్ణ కాలనీ ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల ఆవరణలో రూ.5 కోట్ల సీఎస్ఆర్‌ నిధులతో అరబిందో ఫార్మా ఫౌండేషన్‌ నిర్మించిన నూతన భవనం శంకుస్థాపన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.

    ‘నా దగ్గరకు కొన్ని కంపెనీల ఫైల్స్‌ వస్తుంటాయి. మామూలుగా మంత్రులు డబ్బులు తీసుకుని ఫైల్స్‌ క్లియర్‌ చేస్తుంటారు. నేను అలా చేయను.. సమాజ సేవే చేయమంటాను. నాకు నయా పైసా ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పా. స్కూల్‌ డెవలప్‌మెంట్‌ చేయమని కోరా’ అని వ్యాఖ్యానించారు. అయితే, మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీశాయి. 

    నేను చేసిన వ్యాఖ్యల్ని వక్రీకరిస్తూ.. 
    అయితే, తాను చేసిన వ్యాఖ్యలపై వివాదం కావడంతో మంత్రి కొండా సురేఖ స్పందించారు. ‘నేను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నాను. నేను వరంగల్‌లో చేసిన వ్యాఖ్యలు అక్షర సత్యం.  ప్రతి ఫైలుకు డబ్బులు తీసుకున్నారో లేదో గత ప్రభుత్వంలోని  మంత్రులకు తెలుసు. నా వ్యాఖ్యలను కొందరు వక్రీకరిస్తున్నారు. 

    నేను మాట్లాడిన దాంట్లో ముందు వెనక కట్ చేసి చిన్న క్లిప్‌లను కావాలని ట్రోల్ చేస్తున్నారు. మా కేబినెట్ మంత్రుల మధ్య గొడవలు పెట్టాలని కొందరు కుట్ర చేస్తున్నారు. పని చేస్తున్న మంత్రులపై తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకోం. గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఒక్కో మెట్టు ఎక్కి మంత్రినయ్యాను నాపై తప్పుడు ప్రచారాలు చేసే ఏ ఒక్కరిని వదిలిపెట్టను. గత ప్రభుత్వ పాలనపై బీఆర్ఎస్ నేతలు చర్చకు సిద్ధమా? ఎక్కడికి వస్తారో రండి’ అంటూ సవాల్‌ విసిరారు. 

  • సాక్షి, బంజారాహిల్స్‌: నీ భార్య ఫొటోలు డిలీట్‌ చేయాలంటే కోటి రూపాయలు ఇవ్వాలి. ఓ డ్రైవర్‌ తన యజమానిని బ్లాక్‌మెయిల్‌ చేసిన సంచలన ఘటన బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

    బంజారాహిల్స్‌ పోలీసుల కథనం మేరకు.. ఆసిఫ్‌నగర్‌ అహ్మద్‌నగర్‌కు చెందిన మహ్మద్‌ ఇప్తేకర్‌ అహ్మద్‌ జూబ్లీహిల్స్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త వద్ద డ్రైవర్‌గా పని చేసేవాడు. సదరు యజమాని భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఇప్తేకర్‌ అహ్మద్‌ ఆమెతో కలిసి ఉన్నప్పుడు ఫొటోలు తీసుకున్నాడు. ఆమె నగ్న  చిత్రాలు, వీడియోలను తీసి తన ఫోన్‌లో సేవ్‌ చేసుకున్నాడు. ఆ ఫొటోలను తన యజమానికి పంపించి మీ భార్య నగ్న చిత్రాలు, వీడియోలతో పాటు తనతో కలిసి ఉన్నప్పుడు దిగిన అశ్లీల వీడియోలను సోషల్‌ మీడియాలో, ఇతర వెబ్‌సైట్లలో పోస్ట్‌ చేస్తానని బెదిరింపులకు దిగాడు. అంతేగాక గతంలో యజమాని ఇంటికి వచ్చి బెదిరించగా ఆయన డయల్‌ 100కు ఫోన్‌ చేయడంతో అక్కడి నుంచి పరారయ్యాడు.

    కొన్నాళ్లుగా వేధింపులు తీవ్రతరం చేసిన ఇప్తెకార్‌ ఆహ్మద్‌ యజమానికి వాట్సాప్‌లో భార్య ఫొటోలు, నగ్న చిత్రాలు పంపుతూ, వెంటనే  వాటిని తొలగిస్తుండటం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో సదరు వ్యాపారవేత్త గత నెలలో తన న్యాయవాది ద్వారా ఇప్తేకర్‌ అహ్మద్‌కు ఫోన్‌ చేయించి వేధింపుల విషయమై అడిగించాడు. బంజారాహిల్స్‌లోని ఓ కేఫ్‌కు రావాలని యజమానికి సూచించాడు. 

    అక్కడికి వెళ్లిన యజమానిని మీ భార్యకు విడాకులు ఇవ్వాలని, లేదా ఖులా (భర్త నుంచి విడాకులు) అడగాలని బెదిరించాడు. అలాంటి చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడవద్దని, బ్లాక్‌మెయిల్‌ చేయవద్దని అతను కోరినా పట్టించుకోకుండా అసభ్యంగా దూషించాడు. ముగ్గురు పిల్లలను చంపి భవిష్యత్తు లేకుండా చేస్తానని బెదిరించాడు. ఫోన్‌లో సేవ్‌ చేసిన ఫొటోలు, వీడియోలు డిలీట్‌ చేయాలంటే రూ. కోటి ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. దీంతో బాధితుడు బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా, మహ్మద్‌ ఇఫ్తేకర్‌ అహ్మద్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

Andhra Pradesh

  • సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారికి ప్రముఖ వ్యాపారవేత్త సంజీవ్‌ గోయెంక భారీ విరాళం అందించారు. ఏడు కోట్ల రూపాయల విలువైన కటి హస్తం, వరద హస్తాలను శ్రీవారికి విరాళం ఇచ్చారు. ఆలయ అధికారులకు సంజీవ్‌ గోయెంక వీటిని అందజేశారు. ఇక, సంజీవ్‌ గోయెంక.. ఐపీఎల్‌లో లక్నో జట్టు ఓనర్‌గా ఉన్నారు.

     

  • సాక్షి, విజయవాడ: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. వంశీపై తాజాగా మరో కేసు నమోదు చేశారు పోలీసులు. గన్నవరంలో మైనింగ్ అక్రమాలపై ఏడీ ఫిర్యాదుతో పోలీసులు మరో కేసు నమోదు చేశారు.

    ఇప్పటికే వంశీకి ఐదు కేసుల్లో బెయిల్‌ మంజూరు అయినప్పటికీ కూటమి సర్కార్‌ మాత్రం తప్పుడు కేసులతో వంశీ​కి బెయిల్‌ రాకుండా అడ్డుకుంటోంది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో బెయిల్‌పై నేడు కోర్టు తీర్పు ఇవ్వనుంది. ఇంతలో నిన్న నూజివీడు పోలీసులు.. వంశీపై పీటీ వారెంట్‌ దాఖలు చేశారు. ఈరోజు మరో కేసు నమోదు చేశారు. గన్నవరంలో జరిగిన మైనింగ్‌పై 58 పేజీలతో గనుల శాఖ ఏడీ.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, క్రైమ్ నెం.142/2025తో గన్నవరం పీఎస్‍లో వంశీపై కేసు నమోదైంది. ఇలా.. వంశీపై ఏదో ఒక కేసు పెడుతూ వంశీకి బెయిల్ రాకుండా  కూటమి ప్రభుత్వం కక్ష సాధిస్తోంది. సర్కార్‌ తీరు కారణంగా వంశీ.. 90 రోజులుగా విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

     

     

  • సాక్షి, తిరుమల: శ్రీవారి భక్తులకు బెంగళూరుకు చెందిన ట్రావెల్స్‌ సంస్థ కుచ్చుటోపీ పెట్టింది. బెంగళూరు నుండి తిరుపతికి రవాణా ఖర్చుతోపాటు దర్శనం కల్పిస్తామని నమ్మించిన భక్తులను మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. దిక్కుతోచని స్థితిలో 35 మంది కన్నడ భక్తులు తిరుమలలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

    వివరాల ప్రకారం.. తిరుమల కొండను టార్గెట్ చేసుకొని కొన్ని ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు మోసాలకు పాల్పడుతున్నాయి. తాజాగా బెంగళూరు నుండి తిరుపతికి రవాణా ఖర్చుతోపాటు దర్శనం కల్పిస్తామని బెంగళూరుకు చెందిన వర్షా ట్రావెల్స్ భక్తులను మోసం చేసింది. సర్వదర్శనం పేరుతో నకిలీ దర్శన టిక్కెట్లను వారికి ఇచ్చింది. ఒక్కొక్క భక్తుడి నుండి రూ.3,350 నగదు వసూలు చేసింది. టికెట్‌ ఉందని ధీమాతో భక్తులు తిరుమలకు వచ్చారు.

    తిరుమలకు వచ్చాక.. తీరా నకిలీ టికెట్లని తెలడంతో శ్రీవారి భక్తులు బోరుమంటున్నారు. 35 మంది కన్నడ భక్తులు దిక్కుతోచని స్థితిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనంతరం, భక్తులు.. పోలీసులను ఆశ్రయించారు. వర్షా ట్రావెల్స్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, భక్తులకు విక్రయించిన టికెట్లపై తిరుమల శ్రీవారి ఫొటో ఉండటం గమనార్హం.

    ఇదిలా ఉండగా.. తిరుమలలోని విష్ణు నివాసం అతిథి గృహంలో భారీ దొంగతనం జరిగింది. 32 గ్రాముల బంగారం, 40వేల నగదు, ఓ సెల్ ఫోన్‌ అపహరణకు గురైంది. ఈనెల 7న శ్రీవారి దర్శనం కోసం నెల్లూరు జిల్లా, మర్రిపాడుకు చెందిన విజయభాస్కర్ కుటుంబం తిరుమలకు వచ్చింది. వీరంతా.. రైల్వే స్టేషన్ సమీపంలోని విష్ణు నివాసం రూమ్ నెంబర్ 461లో  బస చేశారు. రూమ్‌లో నిద్రిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి వీరి వస్తువులను దొంగతనం చేశాడు. దీంతో, బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఈస్ట్ ఎస్సై మహేష్ తెలిపారు. 

  • సాక్షి,  అనంతపురం:  రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత కుమారుడు, టీడీపీ ధర్మవరం నియోజక వర్గ ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్‌కు అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై 2023 అనంతపురం రెండో పట్టణ స్టేషన్‌లో పరిటాల శ్రీరామ్‌పై కేసు నమోదైంది. ఈ కేసు విచారణకు హాజరు కాకపోవడంపై  ఏజేఎఫ్‌సీఎం కోర్టు సీరియస్ అయ్యింది. పరిటాల శ్రీరామ్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది కోర్టు.  

  • సాక్షి, అమరావతి : కడప మేయర్‌ పదవి నుంచి తనను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ సురేష్‌ బాబు హైకోర్టులో అత్యవసర పిటిషన్‌ దాఖలు చేశారు. తొలగింపు ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధమని తెలిపారు.

    ఈ వ్యాజ్యంపై హైకోర్టు గురువారం విచారణ జరిపింది. తన కుటుంబ సభ్యులకు చెందిన వర్ధిని కన్‌స్ట్రక్షన్స్‌కు పనులు కేటాయించాలని మునిసిపల్‌ కమిషనర్‌ను సురేబాబు ఒత్తిడి చేశారా? అని ప్రశ్నించిన హైకోర్టు, ఈ వ్యవహారంలో పూర్తి వివరాలను తమ ముందుంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వే­సింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ చల్లా గుణరంజన్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

    అంతకు ముందు సురేష్‌బాబు తరఫు న్యాయవాది వీఆర్‌ రెడ్డి కొవ్వూ­రి వాదనలు వినిపించారు. ఆరోపణలపై వివరణ ఇచ్చేందుకు సురేష్‌ బాబు పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి ముందు వ్యక్తిగతంగా హాజరయ్యారని, పూర్తిస్థాయి వివరణ నిమిత్తం గడువు కోరారని కోర్టుకు నివేదించారు. అయితే ఆయన అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోకుండానే అధికారులు మేయ­ర్‌ పదవి నుంచి తొలగిస్తూ ఉత్తర్వులిచ్చారని పేర్కొన్నారు. 

    వర్ధిని కన్‌స్ట్రక్షన్స్‌ కంపెనీ పిటిషనర్‌ కుటుంబ సభ్యులకు చెందినది కాదని వివరించారు. మునిసిపల్‌ కమిషనర్‌ నిబంధనల మేరకే నేరుగా ఆ కంపెనీకి పనులు కేటాయించారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) సింగమనేని ప్రణతి వాదనలు వినిపిస్తూ, సురేష్‌బాబు అధికార దుర్వినయోగానికి పాల్ప­డ్డారని పేర్కొన్నారు. పిటిషనర్‌కు నోటీసులిచ్చి వివరణ తీసుకున్న తరువాతనే మేయర్‌ పదవి నుంచి తొలగించారని కోర్టుకు తెలిపారు.

    న్యాయమూర్తి స్పందిస్తూ మేయర్‌ తమ కుటుంబ కంపెనీకి పనులు కేటాయించాలని మునిపిసల్‌ కమిషనర్‌పై ఒత్తిడి తెచ్చారా? అని ప్రశ్నించారు. దీనిపై పూర్తి వివరాల సమర్పణకు గడు­వునివ్వాలని న్యాయవాది ప్రణతి కోరారు. సురేష్‌­­బాబు తొలగింపు ఉత్తర్వులు అమల్లోకి వచ్చేందుకు రెండు వారాలు పడుతుందని పేర్కొన్నారు. దీంతో న్యాయమూర్తి పూర్తి వివరాల సమర్పణకు గడువిస్తూ విచారణను వచ్చే వారానికి వాయిదా వేశారు.

Sports

  • విరాట్‌ కోహ్లి (Virat Kohli) రిటైర్మెంట్‌ కారణంగా టీమిండియా సెలక్టర్లకు కొత్త చిక్కు వచ్చి పడింది. టెస్టు జట్టులో ఈ దిగ్గజ ఆటగాడి స్థానాన్ని భర్తీ చేసే సరైన ప్లేయర్‌ కోసం సెలక్షన్‌ కమిటీ వేట కొనసాగిస్తోంది. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో కీలకమైన నాలుగో స్థానంలో ఎవరిని ఆడించాలన్నది తలనొప్పిగా మారింది.

    టీమిండియాలో అతడికి చోటు కష్టమే
    అయితే, వసీం జాఫర్‌, ఆకాశ్‌ చోప్రా వంటి మాజీ క్రికెటర్లు కోహ్లి స్థానంలో శుబ్‌మన్‌ గిల్‌ (Shubman Gill)ను పంపాలని సూచిస్తున్నారు. మరికొందరు మాత్రం శ్రేయస్‌ అయ్యర్‌ (Shreyas Iyer), సర్ఫరాజ్‌ ఖాన్‌, రజత్‌ పాటిదార్‌ల పేర్లు తెరమీదకు తీసుకువస్తున్నారు. ఇలాంటి తరుణంలో బీసీసీఐ అధికారి ఒకరు ‘టెలిగ్రాఫ్‌’తో మాట్లాడుతూ.. శ్రేయస్‌ అయ్యర్‌ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

    ‘‘ఒకవేళ టీమిండియా సొంతగడ్డ మీద టెస్టు సిరీస్‌ ఆడుతున్నట్లయితే శ్రేయస్‌ అయ్యర్‌కు జట్టులో చోటు దక్కే అవకాశాలు ఉండేవి. అయితే, తదుపరి భారత జట్టు విదేశంలో సిరీస్‌ ఆడబోతోంది.. అది కూడా ఇంగ్లండ్‌ గడ్డమీద.

    కాబట్టి శ్రేయస్‌కు ఛాన్స్‌ లేదనే చెప్పాలి. అతడు రెడ్‌ బాల్‌ క్రికెట్‌లో మరింత గొప్పగా రాణించాల్సిన అవసరం ఉంది. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో శ్రేయస్‌ అద్భుతంగా ఆడుతున్నాడు. పరిస్థితులకు తగ్గట్లుగా బ్యాటింగ్‌ చేస్తున్నాడు.

    కానీ టెస్టు ఫార్మాట్‌ వైట్‌బాల్‌ క్రికెట్‌తో పోలిస్తే పూర్తి భిన్నమైనది. అందుకే అతడి విషయంలో ఇప్పుడే ఓ నిర్ణయానికి రాలేము’’ అని సదరు అధికారి పేర్కొన్నారు.

    ఓపికగా బ్యాటింగ్‌ చేయాలి
    అదే విధంగా.. ఇంగ్లండ్‌లో పరిస్థితుల గురించి మాట్లాడుతూ.. ‘‘ఇంగ్లండ్‌లో బంతి ఎక్కువగా స్వింగ్‌ అవుతుంది. కాబట్టి ఒక్కోసారి అలాంటి బంతులను వదిలేయడమే ఉత్తమం. ఇంగ్లండ్‌ గడ్డ మీద ఎంత ఓపికగా బ్యాటింగ్‌ చేస్తున్నామనదే ముఖ్యం’’ అని పేర్కొన్నారు.

    కాగా శ్రేయస్‌ అయ్యర్‌ చివరగా గతేడాది ఫిబ్రవరిలో టీమిండియా తరఫున టెస్టు బరిలో దిగాడు. విశాఖపట్నంలో ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో ఆడాడు. ఆ తర్వాత అతడికి మళ్లీ ఇంత వరకు సెలక్టర్లు టెస్టు జట్టులో చోటివ్వలేదు.

    చాంపియన్స్‌ ట్రోఫీలో అదరగొట్టాడు
    అయితే, దేశవాళీ క్రికెట్‌లో శ్రేయస్‌ అయ్యర్‌ ముంబై తరఫున బరిలోకి దిగి దంచికొట్టాడు. రంజీల్లో రాణించడంతో పాటు టీ20 ఫార్మాట్‌లో నిర్వహించే సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ గెలవడంలోనూ కీలక పాత్ర పోషించాడు. అనంతరం ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025ని భారత్‌ సొంతం చేసుకోవడంలో  అతడిది ముఖ్య భూమిక.

    ఇక ఐపీఎల్‌-2025లో పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌గా, బ్యాటర్‌గానూ శ్రేయస్‌ అ‍య్యర్‌ అదరగొడుతున్నాడు. అయితే, టెస్టుల్లో మాత్రం అతడు ఇప్పట్లో పునరాగమనం చేసే అవకాశం కనిపించడం లేదు. 

    కాగా జూన్‌ 20 నుంచి భారత జట్టు ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ ఆడనుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ 2025-27 సీజన్‌ ఈ సిరీస్‌తోనే మొదలుకానుంది. ఇదిలా ఉంటే.. కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో పాటు దిగ్గజ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి ఇటీవలే టెస్టులకు రిటైర్మెంట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. 

    చదవండి: ఓపెనర్‌గా కేఎల్‌ రాహుల్‌.. నాలుగో స్థానంలో ‘కొత్త’ ఆటగాడు!

  • భారత్‌, పాక్‌ మధ్య యుద్దం కారణంగా వారం రోజులు వాయిదా పడిన ఐపీఎల్‌ 2025 రేపటి నుండి (మే 17) పునఃప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో (రీస్టార్ట్‌లో) కేకేఆర్‌, ఆర్సీబీ బెంగళూరు వేదికగా తలపడనున్నాయి. రీవైజ్డ్‌ షెడ్యూల్‌ ప్రకారం జూన్‌ 3న జరిగే ఫైనల్‌తో ఈ సీజన్‌ ముస్తుంది. మే 27 వరకు లీగ్‌ మ్యాచ్‌లు జరుగనుండగా.. మే 29 (క్వాలిఫయర్‌ 1), మే 30 (ఎలిమినేటర్‌), జూన్‌ 1 (క్వాలిఫయర్‌ 2) తేదీల్లో ప్లే ఆఫ్స్‌ జరుగుతాయి.

    ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్‌కు ముందు మరో 13 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ప్రస్తుతం ప్లే ఆఫ్స్‌ రేసులో అధికారంగా ఏడు జట్లు ఉండగా.. చెన్నై, రాజస్థాన్‌, ఎస్‌ఆర్‌హెచ్‌ నిష్క్రమించాయి. ప్లే ఆఫ్స్‌ రేసులో పేరుకు ఏడు జట్లు ఉన్నప్పటికీ ప్రధానమైన పోటీ మాత్రం ఐదు జట్ల మధ్యే ఉంది. వీటిలోనూ రెండు బెర్త్‌లను ప్రస్తుతం టేబుల్‌ టాపర్లుగా ఉన్న గుజరాత్‌, ఆర్సీబీ (11 మ్యాచ్‌ల్లో తలో 8 విజయాలతో 16 పాయింట్లు) దాదాపు ఖరారు చేసుకున్నాయి.

    ఈ రెండు జట్లు మరో మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉండటంతో వారి ప్లే ఆఫ్స్‌ అవకాశాలు నల్లేరుపై నడకే అని చెప్పాలి. గుజరాత్‌, ఆర్సీబీ మూడింటిలో తలో మ్యాచ్‌ గెలిచినా కనీసం మూడు, నాలుగు స్థానాల్లోనైనా ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తాయి.

    ఇక మిగిలింది రెండు బెర్త్‌లు. ఈ రెండు బెర్త్‌ల కోసం మూడు జట్ల మధ్య పోటీ ఉంది. రేసులో పంజాబ్‌ కింగ్స్‌కు (11 మ్యాచ్‌ల్లో 15 పాయింట్లు) అవకాశాలు ఎక్కువగా ఉండగా.. ఢిల్లీ, ముంబైకి ఆతర్వాతి అవకాశాలు ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ముంబైతో పోలిస్తే ఢిల్లీకే కాస్త ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. 

    ఢిల్లీ 11 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో 13 పాయింట్లు కలిగి ఉండగా.. ముంబై 12 మ్యాచ్‌ల్లో 7 విజయాలతో 14 పాయింట్లు ఖాతాలో కలిగి ఉంది. ప్లే ఆఫ్స్‌ రేసులో ఉన్న ఐదు జట్లలో ముంబై మినహా మిగతా నాలుగు జట్లు ఇంకా తలో మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.

    ప్లే ఆఫ్స్‌ రేసులో ప్రధానంగా ఉన్న జట్లు ఆడాల్సి మ్యాచ్‌లు ఇవే..

    గుజరాత్‌
    మే 18న ఢిల్లీతో (రాత్రి, ఢిల్లీ)
    మే 22న లక్నోతో (అహ్మదాబాద్‌)
    మే 25న సీఎస్‌కేతో (మధ్యాహ్నం, అహ్మదాబాద్‌)

    ఆర్సీబీ
    మే 17న కేకేఆర్‌తో (బెంగళూరు)
    మే 23- సన్‌రైజర్స్‌తో (బెంగళూరు)
    మే 27- లక్నోతో (లక్నో)

    పంజాబ్‌
    మే 18న రాజస్థాన్‌తో (మధ్యాహ్నం, జైపూర్‌)
    మే 24న ఢిల్లీతో (జైపూర్‌)
    మే 26న ముంబై ఇండియన్స్‌తో (జైపూర్‌)

    ముంబై ఇండియన్స్‌
    మే 21న ఢిల్లీతో (ముంబై)
    మే 26న పంజాబ్‌తో (జైపూర్‌)

    ఢిల్లీ
    మే 18న గుజరాత్‌తో (రాత్రి, ఢిల్లీ)
    మే 21న ముంబై ఇండియన్స్‌తో (ముంబై)
    మే 24న పంజాబ్‌తో (జైపూర్‌)

  • ఐపీఎల్‌ 2025 పునఃప్రారంభానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌కు గుండె పగిలే వార్త తెలిసింది. ఆ జట్టు స్టార్‌ పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ లీగ్‌ తదుపరి మ్యాచ్‌లకు దూరం కానున్నాడు​. ఈ విషయాన్ని స్టార్క్‌ స్వయంగా కన్ఫర్మ్‌ చేశాడు. భారత్‌, పాక్‌ మధ్య యుద్దం కారణంగా అందరూ విదేశీ ఆటగాళ్లతో పాటే స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్క్‌.. భారత్‌కు తిరిగి రావడం​ లేదని తేల్చి చెప్పాడు. దీనికి ఢిల్లీ యాజమాన్యం కూడా ఒప్పుకుంది.

    ఈ సీజన్‌లో మంచి ఫామ్‌లో ఉన్న స్టార్క్‌ (11 మ్యాచ్‌ల్లో 14 వికెట్లు, ఓ ఐదు వికెట్ల ప్రదర్శన కూడా) లీగ్‌ కీలక దశలో హ్యాండ్‌ ఇవ్వడం ఢిల్లీ విజయావకాశాలను భారీగా దెబ్బ తీస్తుంది. స్టార్క్‌.. ఐపీఎల్‌ ముగిసిన తర్వాత వారం​ రోజుల్లో ప్రారంభం కానున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌ కోసమే భారత్‌కు తిరిగి రాకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. 

    భారత్‌, పాక్‌ మధ్య యుద్దం కారణంగా స్వదేశానికి వెళ్లి, తిరిగి రానని ప్రకటించిన రెండో ఆటగాడు స్టార్క్‌. స్టార్క్‌కు ముందు అతని దేశానికే (ఆస్ట్రేలియా) చెందిన జేక్‌ ఫ్రేజర్‌ మెక్‌గుర్క్‌ కూడా లీగ్‌ తదుపరి లెగ్‌ కోసం​ భారత్‌కు రానని స్పష్టం చేశాడు.

    స్టార్క్‌ గురించి ముందుగానే సమాచారమున్న ఢిల్లీ యాజమాన్యం అతనికి ప్రత్యామ్నాయంగా బంగ్లాదేశ్‌ పేసర్‌ ముస్తాఫిజుర్‌కు తాత్కాలిక రీప్లేస్‌మెంట్‌గా ఎంపిక చేసుకుంది. అయితే ప్రస్తుతం​ ముస్తాఫిజుర్‌ కూడా అందుబాటులోకి రావడం అనుమానంగా మారింది. ముస్తాఫిజుర్‌కు అతని దేశ క్రికెట్‌ బోర్డు ఇప్పటివరకు నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ ఇవ్వలేదు.

    ఇదిలా ఉంటే, ఈ సీజన్‌లో ఢిల్లీ ప్లే ఆఫ్స్‌ అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడిన ఆ జట్టు 6 విజయాలతో 13 పాయింట్లు (సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌ రద్దు కావడంతో ఓ పాయింట్‌ లభించింది) సాధించి, పట్టికలో ఐదో స్థానంలో ఉంది. ఈ సీజన్‌లో ఢిల్లీ ఇంకా మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. 

    మే 18న గుజరాత్‌ను ఢీకొట్టనున్న ఈ జట్టు.. మే 21 ముంబైతో.. మే 24న పంజాబ్‌తో తలపడాల్సి ఉంది. ఈ మూడు మ్యాచ్‌ల్లో ఢిల్లీ.. గుజరాత్‌, పంజాబ్‌ చేతుల్లో ఓడి, ముంబై ఇండియన్స్‌ ఒక్కదానిపై గెలిచినా ప్లే ఆఫ్స్‌ అవకాశాలు ఉంటాయి (ముంబై ఇండియన్స్‌ పంజాబ్‌ చేతుల్లో కూడా ఓడాల్సి ఉంటుంది). 

     

     

     

     

     

  • భారత్‌, పాక్‌ మధ్య యుద్దం కారణంగా వారం రోజులు వాయిదా పడిన ఐపీఎల్‌ 2025 రేపటి నుండి (మే 17) పునఃప్రారంభం కానుంది. కేకేఆర్‌, ఆర్సీబీ మధ్య మ్యాచ్‌తో (బెంగళూరు) ఐపీఎల్‌ రీస్టార్‌ అవుతుంది. ఐపీఎల్‌ పునఃప్రారంభం నేపథ్యంలో ప్లే ఆఫ్స్‌ బెర్త్‌లు ఏయే జట్లకు దక్కే అవకాశం ఉందో అన్న దానిపై ఓ లుక్కేద్దాం.

    ప్రస్తుతం​ గుజరాత్‌, ఆర్సీబీ తలో 16 పాయింట్లు (11 మ్యాచ్‌ల్లో తలో 8 విజయాలు) ఖాతాలో కలిగి ఉండి ప్లే ఆఫ్స్‌ రేసులో ముందున్నాయి. ఇరు జట్లు మరో మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉండటంతో ఈ జట్ల ప్లే ఆఫ్స్‌ అవకాశాలు నల్లేరుపై నడకే అని చెప్పాలి. ఈ రెండు జట్లు మూడింటిలో తలో మ్యాచ్‌ గెలిచినా కనీసం మూడు, నాలుగు స్థానాల్లోనైనా ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తాయి.

    ఇక మిగిలింది రెండు బెర్త్‌లు. ఈ రెండు బెర్త్‌ల కోసం ప్రధానంగా మూడు జట్ల మధ్య పోటీ ఉంటుంది. రేసులో పంజాబ్‌ కింగ్స్‌కు (11 మ్యాచ్‌ల్లో 15 పాయింట్లు) అవకాశాలు ఎక్కువగా ఉండగా.. ఢిల్లీ, ముంబైకి ఆతర్వాతి అవకాశాలు ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ముంబైతో పోలిస్తే ఢిల్లీకే కాస్త ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. 

    ఢిల్లీ 11 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో 13 పాయింట్లు కలిగి ఉండగా.. ముంబై 12 మ్యాచ్‌ల్లో 7 విజయాలతో 14 పాయింట్లు ఖాతాలో కలిగి ఉంది. ప్లే ఆఫ్స్‌ రేసులో ఉన్న ఐదు జట్లలో ముంబై మినహా మిగతా నాలుగు జట్లు ఇంకా తలో మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.

    ముంబై ఇండియన్స్‌ ప్లే ఆఫ్స్‌కు ఎలా చేరుతుంది..?

    • ఈ సీజన్‌లో ముంబై మరో 2 మ్యాచ్‌లు మాత్రమే ఆడాల్సి ‍ఉంది. ప్రస్తుతం ఆ జట్టు 14 పాయింట్లతో పట్టికలో 4వ స్థానంలో ఉంది. ముంబై మిగిలిన రెండు మ్యాచ్‌లు పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడాల్సి ఉంది. ముంబై ఈ రెండు మ్యాచ్‌ల్లో భారీ తేడాతో గెలిస్తే 18 పాయింట్లతో ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తుంది. వీరి టేబుల్ స్థానం మొదటి రెండు స్థానాల్లో ఉన్న గుజరాత్, ఆర్సీబీ ఫలితాలపై ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఆ రెండు జట్లు 22 పాయింట్లతో ముగించే అవకాశాలు ఉన్నాయి.

    • ముంబై తదుపరి ఆడబోయే రెండు మ్యాచ్‌ల్లో ఒకటి మాత్రమే గెలిస్తే, వారి ప్లే ఆఫ్స్‌ అవకాశాలు చాలా సంక్లిష్టమవుతాయి. ఒకవేళ ముంబై ఢిల్లీని ఓడిస్తే.. ఆతర్వాత పంజాబ్‌ కూడా ఢిల్లీని ఓడించాలి. అప్పుడు ఢిల్లీ ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి వైదొలుగుతుంది. ముంబై ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తుంది.

    • ఒకవేళ ముంబై పంజాబ్‌ను ఓడించి ఢిల్లీ చేతిలో ఓడితే.. ఆతర్వాతి మ్యాచ్‌లో ఢిల్లీ కూడా పంజాబ్‌ను ఓడిస్తే పంజాబ్‌ ఇంటికి (పంజాబ్‌ రాజస్థాన్‌ చేతిలో కూడా ఓడాలి) ఢిల్లీ (17), ముంబై (16) ప్లే ఆఫ్స్‌కు చేరతాయి.  

    • ఒకవేళ ముంబై తమ రెండు మ్యాచ్‌ల్లో ఓడితే వారి ప్లే ఆఫ్స్‌ అవకాశాలు దాదాపుగా గల్లంతైనట్లే.

    కేకేఆర్‌, లక్నో కూడా రేసులోనే..!
    కేకేఆర్‌ (11), లక్నోకు (10) ప్లే ఆఫ్స్‌ అవకాశాలు లేనప్పటికీ.. టెక్నికల్‌గా ఆ జట్లకు ఇంకా ఛాన్స్‌లు ఉన్నాయి. ఈ రెండు జట్లు తదుపరి ఆడాల్సిన అన్ని మ్యాచ్‌ల్లో (కేకేఆర్‌ 2, లక్నో 3) గెలవాల్సి ఉండటంతో పాటు.. ఈ జట్ల ప్లే ఆఫ్స్‌ అవకాశాలు ఇతర జట్ల జయాపజయాలపై ఆధారపడి ఉన్నాయి.

    ఈ మూడు టీమ్‌లు ఔట్‌
    ఈ సీజన్‌లో సీఎస్‌కే, రాజస్థాన్‌ రాయల్స్‌, సన్‌రైజర్స్‌ ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి ఇదివరకే నిష్క్రమించాయి. తదుపరి ఆడబోయే మ్యాచ్‌ల ఫలితాలతో ఈ జట్లకు ఒరిగేదేమీ లేనప్పటికీ.. ఈ జట్లు ఇతర జట్ల ప్లే ఆఫ్స్‌ అవకాశాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది.

     

     

     

     

     

  • భారత్‌, పాక్‌ మధ్య యుద్దం కారణంగా వారం రోజులు వాయిదా పడిన ఐపీఎల్‌ 2025 రేపటి నుండి (మే 17) పునఃప్రారంభం కానుంది. ఆటగాళ్లంతా ఒక్కొక్కరుగా తమతమ ఫ్రాంచైజీల క్యాంప్‌ల్లో చేరుతున్నారు. తదుపరి లెగ్‌కు కొందరు విదేశీ ఆటగాళ్ల లభ్యత సమస్య మినహా లీగ్‌ ముందులా రంజుగా సాగేందుకు ఎలాంటి అడ్డంకులు లేవు. పునఃప్రారంభం రోజున జరిగే మ్యాచ్‌లో కేకేఆర్‌, ఆర్సీబీ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌ బెంగళూరులో జరుగనుంది.

    టాప్‌లో గుజరాత్‌
    ఈ సీజన్‌లో అంచనాలకు మించి రాణిస్తున్న గుజరాత్‌ లీగ్‌ వాయిదా పడే సమయానికి పాయింట్ల పట్టికలో టాప్‌ ప్లేస్‌లో ఉంది. ఈ సీజన్‌ 11 మ్యాచ్‌లు ఆడిన గుజరాత్‌ 8 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి 16 పాయింట్లు​ సాధించింది. గుజరాత్‌ ఇంకా 3 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. వీటిలో ఒకటి గెలిచినా ఆ జట్టు ప్లే ఆఫ్స్‌ బెర్తు ఖరారవుతుంది.

    ప్లే ఆఫ్స్‌ రేసులో మొత్తం ఐదు జట్లు
    లీగ్‌ వాయిదా పడే సమయానికి ఐదు జట్లు ప్లే ఆఫ్స్‌ రేసులో ఉన్నాయి. ఇంకా ఏ జట్టుకు ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ అధికారికంగా ఖరారు కాలేదు. ప్లే ఆఫ్స్‌ రేసులో గుజరాత్‌ (16), ఆర్సీబీ (16) ముందు వరుసలో ఉండగా.. పంజాబ్‌ (15), ముంబై ఇండియన్స్‌ (14), ఢిల్లీ (13) పోటాపోటీ పడుతున్నాయి.

    కేకేఆర్‌, లక్నో కూడా రేసులోనే..!
    లీగ్‌ వాయిదా పడే సమయానికి కేకేఆర్‌ (11), లక్నోకు (10) ప్లే ఆఫ్స్‌ అవకాశాలు లేనప్పటికీ.. టెక్నికల్‌గా ఆ జట్లకు ఇంకా ఛాన్స్‌లు ఉన్నాయి. ఈ రెండు జట్లు తదుపరి ఆడాల్సిన అన్ని మ్యాచ్‌ల్లో గెలవాల్సి ఉండటంతో పాటు.. ఈ జట్ల ప్లే ఆఫ్స్‌ అవకాశాలు ఇతర జట్ల జయాపజయాలపై ఆధారపడి ఉన్నాయి.

    ఈ మూడు టీమ్‌లు ఔట్‌
    లీగ్‌ వాయిదా పడే సమయానికి సీఎస్‌కే, రాజస్థాన్‌ రాయల్స్‌, సన్‌రైజర్స్‌ ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించాయి. తదుపరి ఆడబోయే మ్యాచ్‌ల ఫలితాలతో ఈ జట్లకు ఒరిగేదేమీ లేనప్పటికీ.. ఈ జట్లు ఇతర జట్ల ప్లే ఆఫ్స్‌ అవకాశాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది.

    ఆరెంజ్‌ క్యాప్‌ హెల్డర్‌గా సూర్యకుమార్‌
    లీగ్‌ వాయిదా పడే సమయానికి ముంబై ఇండియన్స్‌ బ్యాటర్‌ సూర్యకుమార్‌ వద్ద ఆరెంజ్‌ క్యాప్‌ (అత్యధిక పరుగులు) ఉంది. స్కై ఈ సీజన్‌లో 12 మ్యాచ్‌లు ఆడి 63.75 సగటున 170.57 స్ట్రయిక్‌రేట్‌తో 510 పరుగులు చేశాడు.

    నూర్‌ అహ్మద్‌, ప్రసిద్ద్‌ కృష్ణ వద్ద పర్పుల్‌ క్యాప్‌
    లీగ్‌ వాయిదా పడకముందు ప్రసిద్ద్‌ కృష్ణ (గుజరాత్‌), నూర్‌ అహ్మద్‌ (సీఎస్‌కే) వద్ద పర్పుల్‌ క్యాప్‌ (అత్యధిక వికెట్లు) ఉంది. వీరిద్దరు తలో 20 వికెట్లు తీశారు.

    పునఃప్రారంభానికి ముందు ఐపీఎల్‌ 2025 పరిస్థితి ఇది
    57 మ్యాచ్‌ల పాటు సజావుగా సాగిన ఐపీఎల్‌ 2025.. భారత్‌, పాక్‌ల మధ్య ఉద్రిక్తతల కారణంగా 58వ మ్యాచ్‌ మధ్యలో బ్రేక్‌ పడింది. పునఃప్రారంభానికి ముందు ఐపీఎల్‌ 2025 పరిస్థితి ఇలా ఉంది.

    పాయింట్ల పట్టిక..

    అత్యధిక పరుగులు..

    అత్యధిక వికెట్లు..

     

     

     

     

     

  • భారత్‌, పాక్‌ మధ్య యుద్దం కారణంగా వారం వాయిదా పడ్డ ఐపీఎల్‌ 2025 రేపటి నుండి (మే 17) పునఃప్రారంభం కానుంది. ఈ సీజన్‌ జూన్‌ 3న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. యుద్దం కారణంగా మధ్యలో వెళ్లిపోయిన విదేశీ ఆటగాళ్లు ఎవరు తిరిగొస్తున్నారు.. తిరిగి రాని వారికి ప్రత్యామ్నాయాలు ఎవరు అన్న సమాచారాన్ని ఈ వార్తలో తెలుసుకుందాం. తిరిగి రాని​ విదేశీ క్రికెటర్లకు ప్రత్యామ్నాయ ఆటగాళ్ల ఎంపికకు ఐపీఎల్‌ బోర్డు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.

    గుజరాత్‌ టైటాన్స్‌
    తిరిగి వస్తున్న (వచ్చిన) ఆటగాళ్లు..
    జోస్‌ బట్లర్‌ (దేశీయ విధుల కారణంగా ప్లే ఆఫ్స్‌కు అందుబాటులో ఉండడు)
    కగిసో రబాడ
    షెర్ఫాన్‌ రూథర్‌ఫోర్డ్‌
    రషీద్‌ ఖాన్‌
    దసున్‌ షనక
    కరీమ్‌ జనత్‌
    గెరాల్డ్‌ కొయెట్జీ

    ప్రత్యమ్నాయ ఆటగాళ్లు..
    కుసాల్‌ మెండిస్‌ (బట్లర్‌కు ప్రత్యామ్నాయం, ప్లే ఆఫ్స్‌ కోసం)

    ఆర్సీబీ
    తిరిగి వస్తున్న (వచ్చిన) ఆటగాళ్లు..
    ఫిల్‌ సాల్ట్‌ 
    లియామ్‌ లివింగ​్‌స్టోన్‌
    జేకబ్‌ బేతెల్‌
    రొమారియో షెపర్డ్‌
    టిమ్‌ డేవిడ్‌
    లుంగి ఎంగిడి
    నువాన్‌ తుషార

    ఢిల్లీ క్యాపిటల్స్‌
    తిరిగి వస్తున్న (వచ్చిన) ఆటగాళ్లు..
    డుప్లెసిస్‌
    సెదిఖుల్లా అటల్‌
    ట్రిస్టన్‌ స్టబ్స్‌
    డొనొవన్‌ ఫెరియెరా
    దుష్మంత చమీరా

    ప్రత్యమ్నాయ ఆటగాళ్లు..
    ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌ (జేక్‌ ఫ్రేజర్‌కు ప్రత్యామ్నాయం)
    * ముస్తాఫిజుర్‌కు ఇంకా అతని సొంత దేశ క్రికెట్‌ బోర్డు నుంచి అనుమతి రాలేదు. 
    * మిచెల్‌ స్టార్క్‌ అందుబాటులోకి వచ్చేది లేనది ఇంకా తెలియ రాలేదు.

    కోల్‌కతా నైట్‌ రైడర్స్‌
    తిరిగి వస్తున్న (వచ్చిన) ఆటగాళ్లు..
    సునీల్‌ నరైన్‌
    ఆండ్రీ రసెల్‌
    క్వింటన్‌ డికాక్‌
    రహ్మానుల్లా గుర్బాజ్‌
    స్పెన్సర్‌ జాన్సన్‌
    అన్రిచ్‌ నోర్జే

    తిరిగి రాని ఆటగాళ్లు..
    రోవ్‌మన్‌ పోవెల్‌ (ఆరోగ్య సమస్య)
    మొయిన్‌ అలీ (కుటుంబ ఆరోగ్య సమస్య)

    పంజాబ్‌ కింగ్స్‌
    తిరిగి వస్తున్న (వచ్చిన) ఆటగాళ్లు..
    అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌
    మార్కో జన్సెన్‌
    జేవియర్‌ బార్ట్‌లెట్‌

    ప్రత్యమ్నాయ ఆటగాళ్లు..
    కైల్‌ జేమీసన్‌ (ఫెర్గూసన్‌కు ప్రత్యామ్నాయం)
    మిచెల్‌ ఓవెన్‌ (మ్యాక్స్‌వెల్‌కు ప్రత్యామ్నాం, ఐపీఎల్‌ వాయిదాకు ముందే ఎంపిక)

    * స్టోయినిస్‌, ఆరోన్‌ హార్డీ, జోస్‌ ఇంగ్లిస్‌పై ఇంకా స్పష్టత లేదు (పంజాబ్‌ తొలి మ్యాచ్‌ తర్వాత రావచ్చు)

    లక్నో సూపర్‌ జెయింట్స్‌
    తిరిగి వస్తున్న (వచ్చిన) ఆటగాళ్లు..
    డేవిడ్‌ మిల్లర్‌
    మార్క్రమ్‌
    మిచెల్‌ మార్ష్‌
    మాథ్యూ బ్రీట్జ్కీ
    నికోలస్‌ పూరన్‌
    షమార్‌ జోసఫ్‌

    ప్రత్యమ్నాయ ఆటగాళ్లు..
    విలియర్‌ ఓరూర్కీ (మయాంక్‌ యాదవ్‌కు ప్రత్యామ్నాయం)

    సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌
    తిరిగి వస్తున్న (వచ్చిన) ఆటగాళ్లు..
    పాట్‌ కమిన్స్‌
    ట్రవిస్‌ హెడ్‌
    వియాన్‌ ముల్దర్‌
    కమిందు మెండిస్‌
    హెన్రిచ్‌ క్లాసెన్‌
    ఎషాన్‌ మలింగ

    రాజస్థాన్‌ రాయల్స్‌
    తిరిగి వస్తున్న (వచ్చిన) ఆటగాళ్లు..
    హసరంగ
    మఫాక
    ఫజల్‌హక్‌ ఫారూకీ
    తీక్షణ
    బర్గర్‌

    తిరిగి రాని ఆటగాళ్లు..
    జోఫ్రా ఆర్చర్‌ (రీప్లేస్‌మెంట్‌ను ప్రకటించలేదు)

    * హెట్‌మైర్‌ రావడం అనుమానమే

    చెన్నై సూపర్‌కింగ్స్‌
    తిరిగి వస్తున్న (వచ్చిన) ఆటగాళ్లు..
    డెవాల్డ్‌ బ్రెవిస్‌
    రచిన్‌ రవీంద్ర
    డెవాన్‌ కాన్వే
    నాథన్‌ ఇల్లిస్‌
    పతిరణ
    నూర్‌ అహ్మద్‌

    తిరిగి రాని ఆటగాళ్లు..
    సామ్‌ కర్రన్‌
    జేమీ ఓవర్టన్‌

    ముంబై ఇండియన్స్‌
    తిరిగి వస్తున్న (వచ్చిన) ఆటగాళ్లు..
    విల్‌ జాక్స్‌ (ప్లే ఆఫ్స్‌కు అందుబాటులో ఉండడు)
    కార్బిన్‌ బాష్‌
    మిచెల్‌ సాంట్నర్‌
    రికెల్టన్‌
    రీస్‌ టాప్లే
    ట్రెంట్‌ బౌల్ట్‌
    ముజీబ్‌ రెహ్మాన్‌

     

     

International

  • ఇస్లామాబాద్‌: పాక్‌ ఉప ప్రధాని ఇషాక్‌దార్‌ మరోసారి నవ్వుల పాలయ్యారు. ఫేక్‌ వార్తను పార్లమెంట్‌లో చదివి వినిపించి గొప్పలు చెప్పుకున్నారు. పాక్‌ ఎయిర్‌ఫోర్స్‌ను విదేశీ మీడియా ప్రశంచిందంటూ ప్రకటించుకున్నారు. అయితే విదేశీ మీడియా తమ ఎయిర్‌ఫోర్స్‌ గురించి నిజంగా ప్రశంసలు కురిపించిందా? అని పాకిస్తాన్‌ మీడియా సంస్థ ‘డాన్‌’ నిజనిర్ధారణ చేసింది. అందులో విదేశీ మీడియా కథనం బూటకమని తేల్చి చెప్పింది. అసలు ఇషాక్‌ దార్‌ చెప్పినట్లుగా సదరు మీడియా సంస్థ సైన్యానికి సంబంధించిన ఎలాంటి  వార్తల్ని ప్రచురించలేదని తెలిపింది.

    ఇంతకీ ఏం జరిగిందంటే?  
    పాకిస్తాన్‌పై భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌ను కీర్తిస్తూ అంతర్జాతీయ మీడియా సంస్థలు పలు కథనాల్ని ప్రచురించాయి.  ఈ క్రమంలో బ్రిటన్‌కు చెందిన డైలీ టెలిగ్రాఫ్‌ అందుకు భిన్నంగా ‘ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో పాకిస్తాన్‌ ఎయిర్‌ఫోర్స్‌ వ్యవహరించిన తీరును ప్రశంసంపై  ఓ కథనాన్ని ప్రచురించింది’ అంటూ  డైలీ  టెలిగ్రాఫ్‌ హెడ్‌లైన్‌ను పార్లమెంట్‌లో ఇషాక్‌ దార్‌ ప్రస్తావించారు. అసలు విషయం ఏంటంటే?

     

    ‘గగనతల రారాజు పాక్‌ ఎయిర్‌ఫోర్స్‌’ 
    వాస్తవానికి డైలీ టెలిగ్రాఫ్‌ ఆ హెడ్‌లైన్‌ను రాయలేదు. పాకిస్తానీయులే ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌తో తప్పుడు వార్తను సృష్టించారు. దాన్నే నిజమనుకుని ఇషాక్‌దార్‌ భ్రమపడ్డారు. ‘గగనతల రారాజు పాక్‌ ఎయిర్‌ఫోర్స్‌’ అంటూ విదేశీ మీడియా కీర్తించిందని ప్రకటన చేశారు. దీంతో కంగుతిన్న డైలీ టెలిగ్రాఫ్‌ .. అసలు తాము అలాంటి హెడ్‌లైన్‌ పెట్టలేదని స్పష్టం చేసింది. డైలీ టెలిగ్రాఫ్‌ మాత్రమే కాదు.. పాక్‌ దేశ మీడియా సంస్థ డాన్‌న్యూస్‌ సైతం ఇదే విషయాన్ని చెప్పింది. పాకిస్తాన్‌ పార్లమెంట్‌ సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యల్ని ఖండించింది.

    ఇషాక్‌ దార్‌వి పచ్చి అబద్ధాలు 
    ‘పాకిస్తాన్‌ ఎయిర్ ఫోర్స్ ఆకాశాలలో తిరుగులేని రాజు’ అని పేర్కొంటూ డైలీ టెలిగ్రాఫ్‌ వార్త రాసిందా? లేదా? అని డాన్‌ మీడియా ప్రతినిధులు పరిశీలించారు. ఇషాక్‌ దార్‌ చెప్పినట్లుగా సోషల్‌ మీడియాలో ప్రసారం అవుతున్నట్లుగా మే 10న  ది డైలీ టెలిగ్రాఫ్‌ ఫ్రంట్‌ పేజీలో ఉన్న వార్తకి.. ఇషాక్‌ దార్‌ చదివి వినిపించిన హెడ్‌లైన్‌కు పొంతన లేదని తేలింది. ఆ పత్రిక ఎప్పుడూ అలాంటి కథనాల్ని ప్రచురించలేదని డాన్‌ తేల్చింది. దీంతో పాక్‌ ఉప ప్రధాని ఇషాక్‌ దార్‌పై నెటిజన్లు చూసికోవాలని కదాయ్యా అంటూ కామెంట్లు చేస్తున్నారు.  

  • బీజింగ్‌: చైనాలో భూకంపం సంభవించింది. శుక్రవారం ఉదయం రిక్టర్ స్కేలుపై 4.5 తీవ్రతతో భూకంపం సంభవించినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (NCS) వెల్లడించింది.

    భారత కాలమానం ప్రకారం ఉదయం 6:29 గంటలకు ఈ ప్రకంపనలు సంభవించాయి. భూమి లోతులో 10 కిలోమీటర్ల లోపల భూకంపం నమోదైనట్లు ఎన్‌సీఎస్‌ అధికారులు తెలిపారు. ఈ మేరకు భూకంప వివరాలను ఎన్‌సీఎస్ తమ ఎక్స్‌  ఖాతాలో పోస్ట్ చేసింది.  

    ఈనెల మే 12న తెల్లవారుజామున 2:41 గంటలకు టిబెట్‌, చైనా పలు ప్రాంతాల్లో 5.6 తీవ్రతతో  భూకంపం సంభవించింది. ఆ భూకంపం భూమిలో 9 కిలోమీటర్ల లోతులో నమోదైంది.

     

  • వాష్టింగన్‌:  పహల్గాంలో ఉగ్రదాడి, ఆ దాడిపై భారత చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’కు ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. పాకిస్తాన్‌ ప్రభుత్వంతో జరిపిన ఓ చీకటి ఒప్పందం బట్టబయలైంది. ఆ చీకటి ఒప్పందానికి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌కు సైతం సంబంధం ఉండడం మరింత అనుమానాలకు తెరతీసింది. 

    అమెరికాకు చెందిన ప్రైవేట్ క్రిప్టోకరెన్సీ కంపెనీ వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్, పాకిస్తాన్ క్రిప్టో కౌన్సిల్ మధ్య జరిగింది. పాకిస్తాన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నెల రోజుల వయసున్న (అప్పటికి ఏర్పాటు చేసి నెలరోజులే) క్రిప్టో కౌన్సిల్‌తో కుదుర్చుకున్న ఈ కంపెనీలో ట్రంప్ కుమారులు ఎరిక్ ట్రంప్, డొనాల్డ్ ట్రంప్ జూనియర్, అల్లుడు జారెడ్ కుష్నర్ కలిపి 60శాతం వాటా ఉంది. గత నెలలో వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్‌, పాకిస్తాన్ క్రిప్టో కౌన్సిల్‌తో ఒప్పందం చేసుకున్నారని తెలిపే లెటర్ ఆఫ్ ఇంటెంట్ సైతం ఉంది.

    ఆఘమేఘాల మీద
    ఈ ఒప్పందం తర్వాత వరల్డ్‌ లిబర్టీ ఫైనాన్షియల్‌ సంస్థకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేలా కొద్ది రోజుల వ్యవధిలోనే పాకిస్తాన్ క్రిప్టో కౌన్సిల్ తమ సలహాదారుగా బైనాన్స్ వ్యవస్థాపకుడు ఛాంగ్‌పెంగ్ జావోను పాక్‌ ప్రభుత్వం నియమించింది.  

    ఘన స్వాగతం పలికిన ఆసిమ్ మునీర్  
    ఈ ఒప్పందంలో భాగంగా అమెరికా నుంచి పాకిస్తాన్‌కు వచ్చిన ఓ ప్రతినిధి బృందానికి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ స్వయంగా ఆ అమెరికన్‌ బృందానికి నాయకత్వం వహించింది మరెవరో కాదు ట్రంప్‌ అత్యంత సన్నిహితుడు,వ్యాపార భాగస్వామి స్టీవ్ విట్కాఫ్ కుమారుడు జాకరీ విట్కాఫ్. జాకరీ విట్కాఫ్‌ ప్రస్తుతంప్రస్తుత మిడిల్ ఈస్ట్‌కు అమెరికా ప్రత్యేక రాయబారిగా ఉన్నారు. జాకరీ విట్కాఫ్‌ బృందం పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌తో రహస్య సమావేశం సైతం నిర్వహించింది.  

    పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థలో  
    ఈ ఒప్పందం ప్రకారం, పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థలో బ్లాక్‌చైన్ టెక్నాలజీని ప్రవేశపెట్టడం, ఆస్తుల టోకనైజేషన్, స్టేబుల్‌కాయిన్ అభివృద్ధి, డిసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ పై పైలట్ ప్రాజెక్టులకు అనుమతి లభించనుంది. దీని ద్వారా పాకిస్తాన్‌లో డిజిటల్ ఫైనాన్స్ విస్తరణతో పాటు బ్యాంకింగ్, క్రెడిట్, ఇన్సూరెన్స్, పెట్టుబడులు, పెన్షన్ వంటి సేవల్ని అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేలా ఒప్పందం జరిగినట్లు సమాచారం.  

    పాక్‌-ట్రంప్‌ చీకటి ఒప్పందంపై అనుమానం
    పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఈ ఒప్పందంపై ప్రశ్నలు ఉత్పన్నం కావడంతో, వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ ఓ ప్రకటన విడుదల చేసింది. పాకిస్తాన్‌ ప్రభుత్వంతో తాము కుదుర్చుకున్న ఒప్పందానికి వెనుక ఎలాంటి దురుద్దేశాలు లేవని స్పష్టం చేసింది. అయితే, ఈ ఒప్పందంపై అటు ట్రంప్ కుటుంబం, ఇటు వైట్ హౌస్ ఎలాంటి ప్రకటన చేయలేదు. 

  • ప్రపంచంలో సొంతంగా అతి పెద్ద ప్రైవేట్ జెట్స్ శ్రేణి కలిగిన యజమానుల్లో ఖతార్ రాజకుటుంబం ఒకటి. తమకు ఆర్థిక భారంగా పరిణమించిన కొన్ని భారీ విమానాలను అది తాపీగా వదిలించుకుంటోంది. ప్రయోజనం లేని, నిర్వహణ భారం మితిమీరిన ‘తెల్ల ఏనుగు’ లాంటి తమ ‘బోయింగ్ 747 జంబో’ను అచ్చం రాజకుటుంబం లాగే పోషించగల డొనాల్డ్ ట్రంప్ లాంటి సరైన వ్యక్తిని ఖతార్ రాజకుటుంబం ఎట్టకేలకు పట్టుకోగలిగింది!.  

    అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నుంచి లబ్ధి పొందడానికే ఖతార్ అత్యంత విలాసవంతమైన విమానాన్ని ఆయనకు బహుమతిగా ఇస్తోందని ఊహాగానాలు వినిపించినా ఈ వ్యవహారం వెనక అసలు కారణం.. ఖతార్ రాజవంశీయులకు ఆ విమానంతో అవసరం తీరిపోవడం!. నిజానికి వారు 2020లోనే ఆ విమానాన్ని అమ్మకానికి పెట్టారు. కానీ, కొనుగోలుదారు దొరక్క విక్రయంలో విఫలమయ్యారు. తమకు అవసరం లేని ఆ ‘చెత్త’ విమానాన్ని ఇప్పుడు ట్రంప్ ముఖాన ‘డంప్’ చేస్తున్నారు కనుక వారికి నిర్వహణ ఖర్చులు, స్టోరేజి వ్యయం బాగానే తగ్గుతాయని వైమానికరంగ నిపుణులు అంటున్నారు. ‘ఒక దెబ్బకు రెండు పిట్టలు’ అన్నట్టు.. అలా అటు ఖతార్ రాజకుటుంబానికి ఖర్చూ తగ్గింది, ఇటు ట్రంప్ కూడా ఫ్రీ గిఫ్టుతో ఉబ్పితబ్బిబ్బవుతున్నారు. మొత్తానికి ఖతార్ ఒక బోయింగ్ 747 జంబో పీడను ఇలా వదిలించుకుంది.

    ఇంకా ఇలాంటివే మరో రెండు విమానాలు దాని దగ్గరున్నాయి. పరిమాణంలో పెద్దవైన, సుందరంగా అలంకరించిన, వాడకపోయినా నిరంతరం సరైన స్థితిలో (కండిషన్లో) ఉంచాల్సిన, ఇంధనం విపరీతంగా తాగే, పూర్తిగా వ్యక్తిగత అవసరాలకు ఉద్దేశించిన ఇలాంటి విమానాలకు డిమాండ్ పడిపోయిందని తాజా ఉదంతం చాటుతోంది. బహిరంగ మార్కెట్లో ప్రస్తుతం ఈ విమానాలను కొనేవారు లేరు. అందుకే రాజకుటుంబాలు, ఆయా దేశాల ప్రభుత్వాలు దశాబ్ద కాలంగా ఈ ‘తెల్ల ఏనుగు’లను వదిలించుకునే పనిలో ఉన్నాయి.

    ఇతర ఆధునిక దేశాల మాదిరిగానే ఖతార్ కూడా ప్రస్తుతం నాజూకైన, బహుళ ప్రయోజనకర, ఆర్థిక అంశాలు కలిసొచ్చే, అధికారిక ప్రయాణాలకు అనువుగా ఉండే విమానాల వైపు మొగ్గు చూపుతోందని దుబాయ్ కేంద్రంగా పనిచేసే ఏవియేషన్ కన్సల్టింగ్ సంస్థ ‘బీఏఏ & పార్టనర్స్’ మేనేజింగ్ డైరెక్టర్ లైనస్ బాయర్ ‘ఫోర్బ్స్’కు వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడికి బోయింగ్ 747-8 విమానాన్ని ఖతార్ అప్పగించడాన్ని ఓ ‘సృజనాత్మక పరిష్కార వ్యూహం’గా, ‘ఆకాశంలో పోటాపోటీ బలప్రదర్శన అనే గతించిన నమూనాకు వీడ్కోలు’గా బాయర్ అభివర్ణించారు.

    అంతా ‘ఆయిల్ అండ్ గ్యాస్’ మహిమ!
    సౌదీ అరేబియా పక్కనే పర్షియన్ సింధుశాఖలో సుమారుగా అమెరికాలోని కనెక్టికట్ రాష్ట్ర భూభాగం సైజులో ఉంటుంది ఖతార్ ద్వీపకల్పం. చమురు, సహజ వాయువు నిక్షేపాలు తెచ్చిపెట్టిన సంపద ఈ దేశాన్ని తలసరి జీడీపీ పరంగా ప్రపంచంలోనే నాలుగో స్థానంలో నిలబెట్టింది. అటు ఖతార్ పాలకులనూ ఆగర్భ శ్రీమంతులను చేసింది. అలా ఖతార్ ఎమిర్ తమిమ్ బిన్ హమద్ అల్ థాని కుటుంబం సిరి సంపదలతో అలరారుతోంది. దీంతో దాదాపు డజను ఎయిర్ బస్, బోయింగ్ విమానాల శ్రేణిని థాని కుటుంబం సమకూర్చుకుంది. కొద్దిమంది వ్యక్తులు విలాసవంతమైన ప్రయాణాలు చేయడానికి వీలుగా ఆ విమానాలకు మార్పులు చేయించారు.

    ఇవి కాకుండా రాజ కుటుంబానికి చిన్నపాటి బంబార్డియర్, డసాల్ట్ బిజినెస్ జెట్స్ ఎలాగూ ఉన్నాయి. ట్రంప్ కు బహూకరించిన 747 విమానం తోకపై ‘ఏ7-హెచ్బీజే’ (A7-HBJ) అని ఉంటుంది. 2007 నుంచి 2013 వరకు ఖతార్ ప్రధానమంత్రిగా వ్యవహరించిన హమద్ బిన్ జసిమ్ బిన్ జబర్ అల్ థాని పేరులోని తొలి మూడు పదాల ప్రధమ అక్షరాలను ‘హెచ్బీజే’ (HBJ) స్ఫురింపజేస్తుంది.

    ప్రస్తుతం ఖతార్ ‘రాజ’ విమానాల శ్రేణిలో ఉన్న మూడు 747-8 విమానాల్లో ఈ విమానం ఒకటి. ‘ఖతార్ అమీరీ ఫ్లైట్’ సంస్థ దీని నిర్వహణను చూస్తోంది. 13 ఏళ్ల కిందట 2012లో కొనుగోలు చేసినప్పుడు ఈ విమానం ఖరీదు 367 మిలియన్ డాలర్లు. అంటే రూ.3,130 కోట్లు. కొన్న తర్వాత మూడేళ్లపాటు వందల కోట్లు కుమ్మరించి విమానం లోపలి స్వరూపాన్ని (ఇంటీరియర్) సుందరంగా తీర్చిదిద్దారు. సాధారణ బోయింగ్ 747-8 విమానంలో 467 మంది ప్రయాణించవచ్చు. కానీ ‘ఎగిరే ప్యాలెస్’గా అభివర్ణిస్తున్న ‘హెచ్బీజే’లో 89 మంది మాత్రమే ప్రయాణించేలా మార్పులు చేసి హంగులు అద్దారు. రెండు పడక గదులు, వినోద గది, సమావేశ గదులు అందులో ఉన్నాయి.

    ఎగిరితే గంటకు రూ.20 లక్షల ఖర్చు!
    బోయింగ్ తయారుచేసే 747 సిరీస్ విమానాలు 1970 నుంచి ప్రపంచవ్యాప్తంగా సేవలు అందిస్తున్నాయి. వైమానిక దూర ప్రయాణాలను అవి ఎక్కువ మందికి అందుబాటులోకి తెచ్చాయి. అయితే పెరుగుతున్న ఇంధనం ధర ఆకాశవీధిలో ఈ నాలుగు భారీ ఇంజిన్ల విమానం ప్రయాణాన్ని వ్యయభరితంగా మార్చింది. ‘కార్పొరేట్ జెట్ ఇన్వెస్టర్’ అంచనా ప్రకారం 747-8 వీఐపీ వెర్షన్ విమానాన్ని ఆపరేట్ చేయడానికి గంటకు 23 వేల డాలర్లు (రూ.20 లక్షలు) ఖర్చవుతుంది. వ్యయభారం తట్టుకోలేక గత దశాబ్ద కాలంగా పలు విమానయాన సంస్థలు బోయింగ్ 747, నాలుగు ఇంజిన్ల ఎయిర్ బస్ ఏ340 విమానాలను సేవల నుంచి తప్పిస్తున్నాయి. వీటి బదులుగా రెండు ఇంజిన్లు గల వెడల్పాటి బోయింగ్ 787, ఎయిర్ బస్ ఏ350 విమానాలపై ఆధారపడుతున్నాయి. నాలుగు ఇంజిన్ల 747 సిరీస్ విమానాలు ఇంధనాన్ని విపరీతంగా తాగుతాయి!.

    ఈ ‘ఎగిరే భవనాలు’ను ఒక్క ఖతారే కాదు.. సౌదీ అరేబియా, బ్రూనై, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, జర్మనీ కూడా క్రమంగా వదిలించుకుంటున్నాయి. తక్కువ ఇంధన సామర్థ్యం అటుంచి పెద్ద విమానాలతో భద్రతాపరమైన సమస్యలున్నాయని, వాటిని పెద్ద లక్ష్యాలుగా ఎంచుకునే ప్రమాదం ఉందని ఏరోడైనమిక్ అడ్వైజరీ మేనేజింగ్ డైరెక్టర్ రిచర్డ్ అబౌలాఫియా చెప్పారు. పెద్ద విమానాలు దిగాలంటే పొడవైన రన్ వేలు కావాలని, దాంతో ఆ విమానాల వినియోగం పరిమితమేనని వివరించారు. సన్నటి విమానాలకైతే చాలా ఎయిర్ పోర్టులు, సంప్రదాయ బిజినెస్ జెట్స్ అయితే మరిన్ని విమానాశ్రాయాలు అందుబాటులో ఉంటాయన్నారు. 2020లో మార్కెట్లో అమ్మకానికి పెట్టడానికి ముందు ఐదేళ్లలో ఖతారీ విమానం ప్రయాణించింది మొత్తం కలిపి 1,059 గంటలే.

    ఇక ఖతార్ దగ్గరున్న మిగతా రెండు వీఐపీ 747-8 విమానాల్లో ఒకదాన్ని పూర్తిగా క్రియాశీల సేవల తప్పించారని లైనస్ బాయర్ తెలిపారు. 2018లో ఖతార్ ఇలాంటి 747-8 విమానాన్నే తుర్కియే అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్డోగన్ కు కూడా ఇచ్చింది. మరో పాత 747-ఎస్పీ విమానాన్ని ఓ అసెట్ మేనేజ్మెంట్ సంస్థకు అప్పగించగా దాన్ని ఆ సంస్థ స్టోరేజికి తరలించింది. ఇలాంటి ఉదాహరణలు బోలెడు. సౌదీ యువరాజు సుల్తాన్ బిన్ అబ్దులజీజ్ అల్ సాద్ 2011లో మరణించాడు. అతడి మరణానికి ముందు ఓ విలాసవంతమైన 747-8 విమానాన్ని అతడి కోసం సేవల్లోకి తీసుకున్నారు. కేవలం 42 గంటలే ప్రయాణించిన ఆ విమానాన్ని చివరికి 2022లో తుక్కు కింద ముక్కలు చేశారు. ప్రస్తుతం సౌదీలో రాజకుటుంబ ఉపయోగంలో ఉన్న 747 విమానాల శ్రేణిని ఒకే ఒక విమానానికి కుదించారు. సౌదీ యువరాజు మఃహమ్మద్ బిన్ సాల్మన్ ప్రస్తుతం బోయింగ్ 737, 787-8 వంటి చిన్న విమానాలు వినియోగిస్తున్నారు.

    అయితే లోపల ఖాళీ ప్రదేశం అధికం కనుక బోయింగ్ 747-8లకు సరకు రవాణా (కార్గో) రంగంలో మంచి డిమాండ్ ఉంది. 2023లో కర్మాగారం నుంచి బయటికొచ్చిన చివరి 747-8తో కలిపి బోయింగ్ ఇప్పటివరకు మొత్తం 155 విమానాలను విక్రయించగా వాటిలో రెండొంతులు సరకు రవాణాలోనే నిమగ్నమయ్యాయి. కేవలం కొద్దిమంది దూర ప్రయాణాల కోసమని స్వరూపం పరంగా, యాంత్రికంగా, కస్టమ్ ఇంటీరియర్స్ పరంగా మార్పులు చేసిన ఖతారీ 747-8 విమానాలను కార్గో విమానాల రూపంలోకి తేవడం కష్టమని బాయర్ అభిప్రాయం వెలిబుచ్చారు. ఇక బహుమతిగా ట్రంప్ స్వీకరిస్తున్న ఖతార్ విమానాన్ని పరికిస్తే... భద్రతపరమైన నిబంధనలను సడలిస్తే తప్ప... ఆ విమానాన్ని విడదీసి పునర్నిర్మించడానికి కనీసం ఐదేళ్లు పడుతుందని రిచర్డ్ అబౌలాఫియా అంచనా. అంటే అప్పటికి అధ్యక్షుడిగా ట్రంప్ రెండో విడత పుణ్యకాలం... ఆ విమానంలో తిరగాలనే ఆయన బులపాటం తీరకుండానే ముగిసిపోతుంది! 
    - జమ్ముల శ్రీకాంత్ 
    Source: Forbes

  • ఇస్లామాబాద్: భారత్‌ శక్తి, సామర్థ్యం తెలుసుకున్న పాకిస్తాన్‌.. చివరకు దిగి వచ్చింది. పాకిస్తాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ఎట్టకేలకు కీలక ప్రకటన చేశారు. భారత్‌తో చర్చలకు పాక్‌ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ మేరకు శాంతి కోసం భారత్‌తో చర్చలకు సిద్ధంగా ఉన్నామని షరీఫ్‌ వెల్లడించారు.

    పాక్‌లోని పంజాబ్‌ ప్రావిన్సులో కామ్రా వైమానిక స్థావరాన్ని షెహబాజ్‌ షరీఫ్‌ సందర్శించారు. అనంతరం, షరీఫ్‌ పాక్‌ మీడియాతో మాట్లాడుతూ.. పాకిస్తాన్‌ శాంతి కోసం సిద్ధంగా ఉంది. అందుకు భారత్‌తో చర్యలకు సిద్ధం. భారత్‌తో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నాను. అయితే, కశ్మీర్‌ అంశం కూడా చర్చల్లో చేర్చాలనేది తమ షరతు అని పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ చెప్పారు. జమ్ముకశ్మీర్, లద్దాఖ్‌ కేంద్రపాలిత ప్రాంతాలు ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగాలని, వాటిని తమ నుంచి విడదీయలేరని భారత్‌ పదేపదే స్పష్టం చేస్తున్నా ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

    పాక్‌ ప్రధాని ప్రకటన చేసిన సమయంలో షెహబాజ్‌తో పాటు ఉప ప్రధాన మంత్రి ఇషాక్ దార్, రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్, ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్, వైమానిక దళ అధిపతి, ఎయిర్ చీఫ్ మార్షల్ జహీర్ అహ్మద్ బాబర్ సిద్ధూ అక్కడే ఉన్నారు. ఈ నేపథ్యంలో భారత్‌ వైరం వద్దని వారంతా ఒక అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇక.. భారత్‌, పాకిస్తాన్‌ యుద్ధం తర్వాత.. పాక్‌ ప్రధాని షరీఫ్‌ రక్షణ కేంద్రాన్ని సందర్శించడం ఇది రెండోసారి.

    ఇదిలా ఉండగా.. అంతకుముందు పాకిస్తాన్‌ అంశంపై భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ కీలక ప్రకటన చేశారు. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ను పాకిస్తాన్‌ ఎలా ఖాళీ చేయాలనే అంశంపైనైతే ఆ దేశంతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో పాకిస్తాన్‌తో కేవలం ద్వైపాక్షిక సంబంధాలే ఉంటాయని, అనేక ఏళ్లుగా దానిపై ఏకాభిప్రాయంతో ఉన్నామని అన్నారు. పహల్గాం ఉగ్రదాడి ముష్కరులపై చర్యలు చేపట్టాల్సిందేనని ఐరాస భద్రతామండలి కూడా నొక్కిచెప్పిందని, ఆపరేషన్‌ సిందూర్‌ ద్వారా ఈ నెల 7న అదే చేశామని పేర్కొన్నారు. ఆపరేషన్‌ను ప్రారంభించడానికి ముందే పాక్‌కు సందేశం పంపించాం. ఉగ్రస్థావరాలపైనే దాడులు చేస్తామని, సైనిక స్థావరాల జోలికి వెళ్లబోమని చెప్పాం. దానిని వారు పెడచెవినపెట్టారు. మనం వారికి ఎంత నష్టం కలిగించామో, వారు ఎంత స్వల్పంగా మనకు నష్టపరిచారో అందరికీ తెలుసు. శాటిలైట్‌ చిత్రాలే దీనికి సాక్ష్యం. అందుకే నాలుగు రోజుల్లో వారు వైఖరి మార్చుకున్నారు. కాల్పుల విరమణకు ఎవరు పిలుపునిచ్చారు అని తెలిపారు.  

Business

  • ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఖరీదైన లోహాల్లో బంగారం ఒకటి. బంగారాన్ని వేలాది సంవత్సరాలుగా ఐశ్వర్యానికి, హోదాకు ప్రతిరూపంగా పరిగణిస్తూ వస్తున్నారు. బంగారం మంచి విద్యుత్ వాహకం. దీని ఉపయోగాలు ఎలా ఉన్నా మృదువైన, అరుదైన, సులభంగా ఆకృతులు చేసేందుకు అనువైన ఈ లోహాన్ని ముఖ్యంగా ఆభరణాలలో ఎక్కువగా వినియోగిస్తున్నారు. డిమాండ్‌ కారణంగా బంగారం విలువ అంతకంతకూ పెరుగుతూ అత్యంత ఖరీదైన లోహంగా మారింది. అందుకే దీన్ని పెట్టుబడి సాధనంగా కూడా భావిస్తారు. శతాబ్దాలుగా మాంద్యం సమయంలో మంచి పెట్టుబడి మార్గంగా బంగారం కొనసాగుతోంది.

    ఈ దేశం బంగారు భూమి
    ఘనాను బంగారు భూమి అంటారు. ఈ ప్రదేశం పశ్చిమ ఆఫ్రికాలో ఉంది.  వైవిధ్యమైన బంగారు వనరులు, అభివృద్ధి చెందుతున్న వాణిజ్యం కారణంగా అరబ్ వ్యాపారులు ఘనాకు ఆ పేరు పెట్టారు. బంగారం ఈ ప్రాంత అత్యంత ముఖ్యమైన వస్తువుగా మారింది.

    అంతేకాకుండా జపాన్ లోని సాడో ద్వీపాన్ని కూడా ఎడో కాలంలో బంగారు భూమిగా పిలిచేవాళ్లు. ఎందుకంటే ఈ ప్రదేశం ఆ సమయంలో జపాన్ మొత్తం బంగారు ఉత్పత్తిలో దాదాపు సగం ఉత్పత్తి చేసేది. అపారమైన సంపదకు, బంగారానికి నిలయంగా ఉండే ఇండోనేషియాలోని ఒకప్పటి శ్రీవిజయ నగరాన్ని కూడా బంగారు ద్వీపంగా పరిగణించేశాళ్లు.


    👉ఇది చదవారా? బంగారం మాయలో పడొద్దు..


    టాప్ 10 అతిపెద్ద బంగారం ఉత్పత్తి దేశాలు
    వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఇచ్చిన గణాంకాల ప్రకారం ప్రపంచంలోనే అత్యధికంగా బంగారం ఉత్పత్తి చేసే టాప్ 10 దేశాల జాబితా ఇలా ఉంది.

     దేశం    బంగారం ఉత్పత్తి (టన్నులు)
    1    చైనా    378.2

    2    
    రష్యన్ ఫెడరేషన్ 321.8
    3    ఆస్ట్రేలియా    293.8
    4    కెనడా    191.9
    5    యునైటెడ్‌ స్టేట్స్‌    166.7
    6    ఘనా   135.1
    7    ఇండోనేషియా    132.5
    8    పెరూ    128.8
    9    మెక్సికో    126.6
    10    ఉజ్బెకిస్తాన్    119.6










     

  • దేశంలో బంగారం ధరలు తగ్గుతున్నాయి అనుకునే లోపే.. ఈ రోజు (మే 16) మళ్ళీ భారీగా పెరిగాయి. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా పసిడి ధరలలో మార్పులు జరిగాయి. ఈ కథనంలో ఏ ప్రాంతంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయనే వివరాలను తెలుసుకుందాం.

    హైదరాబాద్, విజయవాడలలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 87,200 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 95,130 వద్ద నిలిచాయి. నిన్న భారీగా తగ్గిన ధరలు.. ఈ రోజు భారీగా పెరిగాయి. ఈ రోజు కూడా రూ. 1100 (22 క్యారెట్స్ 10గ్రా), రూ. 1200 (24 క్యారెట్స్ 10గ్రా) పెరిగింది. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.

    చైన్నైలో కూడా బంగారం ధరలు వరుసగా రూ. 1100 (22 క్యారెట్స్ 10గ్రా), రూ. 1200 (24 క్యారెట్స్ 10గ్రా) పెరిగింది. దీంతో ఇక్కడ 10గ్రా 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 87,200 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 95,130 వద్ద ఉంది.

    దేశ రాజధాని నగరంలో పసిడి ధరలు రూ. 87,350 (10గ్రా 22 క్యారెట్స్), రూ. 95,280 (10గ్రా 24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 1100, రూ. 1200 ఎక్కువ. అంతే కాకుండా.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఢిల్లీలో గోల్డ్ రేటు కొంత ఎక్కువగానే ఉంది.

    వెండి ధరలు (Silver Price)
    బంగారం ధరలు భారీగా పెరిగినప్పటికీ.. వెండి ధరలు మాత్రం స్థిరంగానే ఉన్నాయి. ఈ రోజు (శుక్రవారం) కేజీ సిల్వర్ రేటు రూ.1,08,000 వద్దకు చేరింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధరలు ఒకే విధంగా ఉన్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 97,000 వద్ద ఉంది.

    (Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్‌టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).

    ఇదీ చదవండి: జియో కొత్త రీఛార్జ్ ప్లాన్స్: 365 రోజుల వ్యాలిడిటీ కోసం..

  • ప్రముఖ్ ఐటీ దిగ్గజం 'టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్' (TCS) కాంటర్ బ్రాండ్‌జెడ్ మోస్ట్ వాల్యూయబుల్ గ్లోబల్ బ్రాండ్స్ 2025 నివేదికలో.. ప్రపంచవ్యాప్తంగా 100 అత్యంత విలువైన బ్రాండ్లలో ఒకటిగా నిలిచింది. న్యూయార్క్‌లో కాంటార్ నిర్వహించిన స్పెషల్ 20వ ఎడిషన్ వేడుకలో.. టీసీఎస్ బ్రాండ్ వాల్యూ 57.3 బిలియన్ డాలర్లకు (రూ. 4.89 లక్షల కోట్లు) చేరుకుంది. ఇది గత ఏడాదికంటే 28 శాతం ఎక్కువని తెలుస్తోంది.

    మొమెంటమ్ ఐటీఎస్ఎంఏ నిర్వహించిన స్వతంత్ర బ్రాండ్ ఆడిట్లో ప్రపంచవ్యాప్తంగా 95 శాతం మంది బిజినెస్ ఎగ్జిక్యూటివ్‌లు టీసీఎస్ బ్రాండ్‌ను గుర్తించారని తేలింది. పరిశ్రమ రంగాలలో ప్రపంచంలోని ప్రముఖ బ్రాండ్‌లను కలిగి ఉన్న జాబితాలో.. TCS ప్రపంచవ్యాప్తంగా 45వ స్థానంలో ఉంది. ఇది కంపెనీ వేగవంతమైన వృద్ధిని సూచిస్తుంది. బ్రాండ్ విలువ, ఈక్విటీలో ఈ పెరుగుదల కంపెనీ నిరంతర బ్రాండ్ నిర్మాణ ప్రయత్నాలను హైలైట్ చేస్తుంది.

    ఈ సందర్భంగా కాంటర్ బ్రాండ్‌జెడ్ హెడ్ మార్టిన్ గెరిరియా అధిపతి మాట్లాడుతూ.. సరైన పెట్టుబడి, వ్యూహాత్మక దృష్టితో.. బ్రాండ్లు తమ యజమానులకు మంచి వృద్ధిని అందించగలవు. టీసీఎస్ ఈ ఏడాది చూపిన పనితీరు, ఏఐ సామర్థ్యాలను విస్తృతంగా వినియోగించుకోవడం వంటికి దీని వృద్ధికి దోహదపడ్డాయి. టీసీఎస్ చేపడుతున్న కార్యక్రమాలే సంస్థ బలమైన గుర్తింపుకు కారణమైందని ఆయన అన్నారు.

    ప్రపంచ టాప్‌ 50 బ్రాండ్లలో టీసీఎస్‌ ఒకటిగా చేరిన సందర్భంగా కంపెనీ మార్కెటింగ్ ఆఫీసర్ 'అభినవ్ కుమార్' మాట్లాడుతూ.. 20 సంవత్సరాలుగా కాంటార్ బ్రాండ్‌జెడ్ ప్రపంచంలోని అత్యంత విలువైన బ్రాండ్‌లను గుర్తించింది. పరిశ్రమలో మాకు ఉన్న బ్రాండ్ నాయకత్వంతో పాటు.. ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ బ్రాండ్‌లలో TCS బ్రాండ్‌కు ఈ గుర్తింపు లభించడం చాలా సంతోషంగా ఉంది. సంస్థ వృద్ధికి దోహదపడిన నా సహోద్యోగులందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు.

  • గురువారం భారీ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. శుక్రవారం ఉదయం నష్టాల్లోనే ప్రారంభమయ్యాయి. ఉదయం 9:40 గంటలకు సెన్సెక్స్ 205.81 పాయింట్లు లేదా 0.25 శాతం నష్టంతో 82,324.93 వద్ద, నిఫ్టీ 45.95 పాయింట్లు లేదా 0.18 శాతం నష్టంతో 25,016.15 వద్ద ముందుకు సాగుతున్నాయి.

    బియర్డ్‌సెల్, జీ లెర్న్, వాన్‌బరీ, శివమ్ ఆటోటెక్, రుద్రాభిషేక్ ఎంటర్‌ప్రైజెస్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. డిదేవ్ ప్లాస్టిక్స్ ఇండస్ట్రీస్, సోలారా యాక్టివ్ ఫార్మా సైన్సెస్, న్యూలాండ్ లాబొరేటరీస్, సెనోర్స్ ఫార్మాస్యూటికల్స్, డేటామాటిక్స్ గ్లోబల్ సర్వీసెస్ వంటి కంపెనీలు నష్టాల జాబితాలో చేరాయి.

    (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు).

  • ఇండియన్ మార్కెట్లో అత్యధిక ప్రజాదరణ పొందిన.. మారుతి సుజుకి ఫ్రాంక్స్‌ విదేశీ మార్కట్లకు కూడా ఎగుమతి అవుతోంది. ఇందులో జపాన్ కూడా ఉంది. ఇటీవల 'జపాన్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్' (JNCAP) క్రాష్ టెస్ట్‌లో భారతదేశంలో తయారైన 'ఫ్రాంక్స్‌' 4 స్టార్ రేటింగ్ సొంతం చేసుకుంది.

    సుజుకి ఫ్రాంక్స్ అసెస్‌మెంట్‌లో 84 శాతం స్కోర్‌ను కలిగి ఉంది. మొత్తం 193.8 పాయింట్లలో 163.75 పాయింట్లను పొందగలిగింది. అంతేకాకుండా, ప్రివెంటివ్ సేఫ్టీ పెర్ఫార్మెన్స్ టెస్ట్‌లో 85.8 పాయింట్లకు గానూ 79.42 పాయింట్లను సాధించగా.. కొలిషన్ సేఫ్టీ పెర్ఫార్మెన్స్ టెస్ట్ 100 పాయింట్లలో 76.33 పాయింట్లను సొంతం చేసుకుంది.

    ఆఫ్‌సెట్ ఫ్రంటల్ కొలిషన్ టెస్ట్‌లో, సుజుకి ఫ్రాంక్స్ 24 పాయింట్లకు 21.08 పాయింట్లు సాధించింది. ఫుల్-ర్యాప్ ఫ్రంటల్ కొలిషన్ టెస్ట్, సైడ్ కొలిషన్ టెస్ట్ మరియు పాదచారుల లెగ్ ప్రొటెక్షన్ పెర్ఫార్మెన్స్ టెస్ట్‌లలో కూడా ఈ కారు లెవల్ 5/5 సాధించింది.

    జపాన్‌లో విక్రయించే సుజుకి ఫ్రాంక్స్ భారత మార్కెట్ నుంచి ఎగుమతి అయినప్పటికీ.. ఇది భారతీయ వెర్షన్ మాదిరిగా కాకుండా.. అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ డిపార్చర్ ప్రివెన్షన్ సిస్టమ్ వంటి మరిన్ని లేటెస్ట్ సేఫ్టీ ఫీచర్స్ పొందుతాయి. ఇవన్నీ వాహన వినియోగదారులకు మంచి సేఫ్టీ అందిస్తాయి.

  • భారతదేశంలో రెండవ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ 'ఇన్ఫోసిస్' బోనస్ విషయంలో ఉద్యోగులకు షాకిచ్చింది. క్లిష్టమైన ఆర్ధిక పరిస్థితుల కారణంగా.. 2025 ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో అర్హులైన ఉద్యోగులకు 65 శాతం మాత్రమే బోనస్ చెల్లించనున్నట్లు వెల్లడించినట్లు తెలుస్తోంది. గత త్రైమాసికం (మూడో త్రైమాసికం)లో 80 శాతం బోనస్ అందించిన కంపెనీ.. రెండో త్రైమాసికంలో 90 శాతం బోనస్ చెల్లింది.

    2025 ఆర్ధిక సంవత్సరం రెండు, మూడు త్రైమాసికాలలో కంపెనీ ఉద్యోగులకు చెల్లించిన బోనస్.. నాల్గవ త్రైమాసికంలో చెల్లించనున్న బోనస్‌తో పోలిస్తే క్రమంగా తగ్గుతున్నట్లు స్పష్టమవుతోంది. పర్ఫామెన్స్ బోనస్ మే 2025 సైకిల్‌లో ప్రాసెస్ అవుతుందని తెలుస్తోంది.

    ఇక ఇన్ఫోసిస్ ఆఖరి త్రైమాసిక ఫలితాల విషయానికి వస్తే.. కంపెనీ లాభాలో అంతకు ముంది ఏడాది నాల్గవ త్రైమాసికం ఫలితాలతో పోలిస్తే 12 శాతం తగ్గి రూ. 7033 కోట్లకు చేరుకుంది. గత సంవత్సరం కంపెనీ నాల్గవ త్రైమాసిక ఫలితాల్లో సంస్థ లాభం రూ. 7696 కోట్లుగా ఉంది. మొత్తం ఆదాయం మాత్రం 8 శాతం ఎగసి రూ. 40,925 కోట్లకు చేరింది. అంత క్రితం క్యూ4లో రూ. 37,923 కోట్ల టర్నోవర్‌ సాధించింది.

    ఇదీ చదవండి: వారానికి 90 గంటల పని!.. ఆయనతో పనిచేయడం నా అదృష్టం

    నియామకాలు
    టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ ఈ ఆర్థిక సంవత్సరంలో 20,000 మందికి పైగా ఫ్రెషర్లను నియమించుకోవాలని యోచిస్తోందని కంపెనీ సిఎఫ్‌ఓ జయేష్ సంఘ్రాజ్కా స్పష్టం చేశారు. 2025 ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫోసిస్ 6,388 మంది ఉద్యోగులను నియమించుకుంది. దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 323,578కి చేరుకుంది.

  • ఖతార్‌లో పర్యటిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గురువారం మధ్యాహ్నం... ‘‘భారత్‌ ఒక వాణిజ్య ఒప్పందాన్ని ప్రతిపాదించింది. దీని ప్రకారం అనేక అమెరికా ఉత్పత్తులపై ప్రాథమికంగా సున్నా టారిఫ్‌లు ఉంటాయి’’ అన్నారు. ట్రంప్‌ ప్రకటనతో మార్కెట్లో సెంటిమెంట్‌ ఒక్కసారిగా మారిపోయింది. మిడ్‌సెషన్‌ వరకు ఫ్లాట్‌గానే కదలాడిన సూచీలు భారీ లాభాలు నమోదు చేశాయి.

    ఇరాన్‌తో అమెరికా అణు ఒప్పందం కుదిరే అవకాశం నేపథ్యంలో సరఫరా పెరుగుతుందనే అంచనాలతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గాయి. భారత్‌కు దిగుమతయ్యే బ్రెంట్‌ క్రూడాయిల్‌ బ్యారెల్‌ ధర 3.50% తగ్గి 63.79 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. రిటైల్‌ ద్రవ్యోల్బణం అరేళ్ల కనిష్టానికి చేరుకోవడంతో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కీలక వడ్డీ రేట్లు తగ్గించే అవకాశాలు మరింత బలపడ్డాయి.

    ఇదీ చదవండి: మరింత తగ్గుతున్న గోల్డ్ రేటు: ఆల్‌టైమ్‌ గరిష్టాల నుంచి..

    వరుస మూడు నెలల అమ్మకాల అనంతరం విదేశీ ఇన్వెస్టర్లు ఏప్రిల్‌ 15 నుంచి భారతీయ ఈక్విటీలలో దాదాపు రూ.50 వేల కోట్లు పెట్టుబడి పెట్టారు. గత 20 సెషన్లలో 19 సార్లు నికర కొనుగోలుదారులుగా నిలిచారు. ఎఫ్‌ఐఐల వరుస కొనుగోళ్లు మన సూచీల ర్యాలీకి దన్నుగా నిలిచాయి.

Cartoon

Guest Columns

  • గత వారం ఘటనలూ, పరిణామాలూ చూస్తే ‘అదిగో పులి... ఇదిగో తోక’ సామెత గుర్తుకొస్తోంది. విహారయాత్రలకు వెళ్లిన వారిని ఊచకోత కోసిన దుర్మార్గం ఎవరైనా ఖండించవలసినది, కన్నీరు కార్చవలసినది. నేరస్థులను పట్టుకుని, విచారించి, కఠినంగా శిక్షించమని కోరవలసినది. ఆ దుర్మార్గానికి కారకులైన వారిని పొరుగుదేశం ప్రోత్సహిస్తున్నదని, బుద్ధి చెప్పాలని భారత ప్రభుత్వం ఆ దేశంలోని ‘టెర్రరిస్టుల స్థావరాలు’ అని అనుమానం ఉన్నచోట్ల దాడి చేసింది. పాకిస్తాన్‌ ప్రభుత్వం డ్రోన్లతో ఎదురుదాడులు చేసింది. స్వయంగా భారత ప్రభుత్వ అధికారులే అది యుద్ధం కాదని ఎన్నోసార్లు అన్నారు. కాని లేని పులికి తోకలు వెతికి, తాము చూశామని ప్రచారం చేసి అమాయకులను నమ్మించేందుకు అనేకమంది వీరంగం వేశారు. అందులో బాధ్యతాయుతంగా ఉండవలసిన నాలుగో స్తంభమూ ఉంది. వ్యక్తులుగానూ, బృందాలుగానూ... భావజాల ప్రోత్సాహపు ఐటీ సెల్స్‌ ఉన్నాయి.  

    సున్నిత సందర్భంలో టీవీ ఛానళ్లూ, యూట్యూబ్, వాట్సప్, ఫేస్‌ బుక్, ఎక్స్‌ వంటి సామాజిక మాధ్యమాలూ గత వారంలో కోట్లాది అబద్ధాలను వండి వార్చాయి. టీవీ ఛానళ్లు వార్తా, విశ్లేషణా ప్రసార వేదికలు గనుక అక్కడ చెప్పే చిన్నపాటి అబద్ధమైనా, అర్ధసత్యమైనా బహుగుణీకృతమై ప్రచారంలోకి వస్తుంది. దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఆ అవకాశాన్ని తప్పని సరిగా బాధ్యతాయుతంగా వాడాలి. కాని భారత ప్రధాన స్రవంతి ఛానళ్లన్నీ బాధ్యతా రాహిత్యంలో అవధులు దాటాయి.  ‘ఆజ్‌ తక్‌’ లాహోర్‌ను స్వాధీనం చేసుకుంది, ‘జీన్యూస్‌’ కరాచీని పట్టుకుంది. రిపబ్లిక్‌ టీవీ న్యూయార్క్‌ను స్వాధీనం చేసుకుంది. ఉదయానికల్లా వాళ్లు అన్నీ వెనక్కి ఇచ్చేశారు, మళ్లీ రాత్రి స్వాధీనం చేసు కోవడానికి!’ అని మే 9 రాత్రి సుప్రీంకోర్టు మాజీ న్యాయ మూర్తి మార్కండేయ ఖట్జూ చేసిన వ్యంగ్య ట్వీట్‌ పరిస్థితి ఎంత చేజారిందో చూపుతుంది. ఆ ట్వీట్‌లో ఆయన మూడు ఛానళ్ల పేర్లే ప్రస్తావించారు గాని, ఎటువంటి మినహాయింపు లేకుండా దాదాపు అన్ని ఛానళ్ల రిపోర్టర్లూ,యాంకర్లూ పోటీ పడి తామే స్వయంగా యుద్ధ క్షేత్రంలో ఉన్నట్టు, తమ ముందరే బాంబు దాడులు, వైమానిక దాడులు, డ్రోన్‌ దాడులు జరుగుతున్నట్టు అభినయించారు. తమ పని నిష్పక్షపాతంగా, వస్తుగతంగా, తటస్థంగా ప్రజలకు వార్తలు చెప్పడం మాత్రమే అనేది మరిచిపోయి, తామే ఒక పక్షం తీసుకుని, వార్తలు వండి వార్చారు. కేకలూ పెడబొబ్బలూ పెట్టారు. ప్రాంతీయ భాషా ఛానళ్లు, పత్రికలు కూడా ఆ టీవీ ఛానళ్లనూ సామాజిక మాధ్య మాలలో ఉద్దేశపూర్వకంగా వెలువడిన అబద్ధాలనూ అనుసరించాయి. మొత్తం మీద సత్యం కనబడకుండా పోయింది.  

    యుద్ధ మేఘాలు కమ్ముకున్నప్పుడు సత్యం మీద పొగమంచు కమ్మే మాట నిజమే. కాని వార్తామాధ్యమాల పని ఆ పొగమంచును చెదరగొట్టడం! దాన్ని పెంచడం కాదు! కాని సత్యం మీద పొగమంచు కమ్మే పని, నేరుగా అబద్ధాలు ప్రచారం చేసే పని సరిహద్దుకు అవతలా, ఇవతలా... ప్రచార మాధ్యమాలూ, సామాజిక మాధ్య మాలూ శాయశక్తులా చేశాయి.  ఆశ్చర్యమేమంటే, ఈ అబద్ధాల కాలపరిమితి కొన్ని గంటలు మాత్రమే. ఎందుకంటే, ఇక్కడ ఎన్ని అబద్ధాలు చెప్పినా కొన్ని గంటల్లోనే నిజమేమిటో ప్రభుత్వం అధికా రికంగా ప్రకటిస్తుంది. ఒకవేళ ప్రభుత్వం చెప్పేది కూడా పూర్తి నిజం కాదనుకుంటే అంతర్జాతీయ ప్రచార మాధ్య మాలు చూసే సాంకేతికత అందుబాటులో ఉంది. ఇవాళ్టి సమాచార విస్ఫోటనంలో దేశదేశాల రక్షణ వ్యవహారాల నిపుణులు ఆ యా ఘటనల మీద నిమిషాల్లోనే తమ విశ్లేషణ వినిపిస్తున్నారు. అంటే జర్నలిస్టులమని చెప్పుకునే ఆర్ణబ్‌ గోస్వామి వంటివారు ఎన్ని అరుపులు అరిచినా కొన్ని గంటల్లో అబద్ధాలని రుజువైపోయే అవకా శాలున్నాయి. నిజాలు చెప్పే, అంతర్జాతీయ తటస్థ వార్తలు పునర్ము ద్రించే వెబ్‌సైట్ల మీద ఆంక్షలు విధించిన ప్రభుత్వం, ఈ అబద్ధాల దుమారాన్ని మాత్రం యథావిధిగా సాగనిచ్చింది. ఈ అబద్ధాలు, అర్ధసత్యాలు ఒక ఎత్తయితే... కనీస మర్యాద, సభ్యత లేకుండా సంబంధం లేని వారిని లాగడం, తిట్లూ, దుర్భాషలూ కురిపించడం విపరీతంగా జరిగాయి. యుద్ధం వద్దన్నవారి మీద, శాంతి వాక్యాలు చెప్పినవారి మీద ద్వేషం వెదజల్లడం జరిగింది.   

     ఈ పరిణామం ఎంత దూరం పోయిందంటే... రిపబ్లిక్‌ ఛానల్‌కు సలహాదారుగా ఉన్న మేజర్‌ (రిటైర్డ్‌) గౌరవ్‌ ఆర్య... తన సొంత యూట్యూబ్‌ ఛానల్‌లో చేసిన వ్యాఖ్యలతో భారత ప్రభుత్వం దౌత్యస్థాయిలో క్షమాప ణలు చెప్పుకోవలసిన పరిస్థితి వచ్చింది. ఆయన ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరఘ్చిని సువ్వర్‌ (పంది) అనీ, సువ్వర్‌ కె ఔలాద్‌ (పంది సంతానం) అనీ అసభ్య కరమైన మాటలెన్నో అన్నాడు. అక్కడ ఆయన చూపిన కారణం – ఇరాన్‌ మంత్రి భారత పర్యటనకు ముందు పాకిస్తాన్‌ పర్యటన చేశారని! ఆ వీడియో ఇరాన్‌లో కూడా వైరల్‌ అయి, న్యూఢిల్లీలోని ఇరాన్‌ రాయబార కార్యా లయం ‘అతిథులను గౌరవించడం ఇరానియన్‌ సంస్కృతిలో చిరకాల సంప్రదాయం. ఇరానియన్లం అతిథులను దైవానికి ప్రియమైనవారిగా భావిస్తాం. మరి మీరో?’ అని ట్వీట్‌ చేయగా, భారత ప్రభుత్వం అది ‘ఒక ప్రైవేటు భారత పౌరుడి’ అభిప్రాయం అనీ, తమకు దానితోసంబంధం లేదనీ వివరణ ఇచ్చుకోవలసి వచ్చింది. మర్నాడే ఆ ఇరాన్‌ మంత్రి భారత్‌కు కూడా వచ్చి ఎన్నో ద్వైపాక్షిక, వాణిజ్య ఒప్పందాల మీద సంతకాలు చేశారు!   

    అలాగే, ఇరుదేశాల సైనికాధిపతులు కాల్పుల విరమ ణకు అంగీకరించారనే వార్త ప్రకటించినందుకు భారత విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ మీద, ఆయన కుటుంబ సభ్యుల మీద బూతులు కురిపించారు. అటువంటి దాడులకు గురైనవారు మరెందరో ఉన్నారు. యుద్ధంలో మొట్టమొదట మరణించేది సత్యం అంటారు. ప్రస్తుత సత్యానంతర యుగంలో మరణించడాని కైనా, సజీవంగా ఉండడానికైనా సత్యానికి స్థానమే లేదు. భావోద్వేగాలదీ, మనోభావాలదీ మాత్రమే రాజ్యం! ఎంత రెచ్చగొడితే అంత వ్యాపారం, అంత జనాకర్షణ!!

    -ఎన్‌ వేణుగోపాల్‌ 
    వ్యాసకర్త ‘వీక్షణం’ ఎడిటర్‌ 

Politics

  • ఎవరైనా బలవంతంగా ఇంట్లోకి చొరబడితే ఏం చేస్తాం?. ముందుగా అడ్డుకునే ప్రయత్నం చేస్తాం. ఆ తరువాత పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. మరి పోలీసులే వ్యక్తుల ఇళ్లల్లోకి బలవంతంగా చొరబడితే? చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తే? ప్రజల స్వేచ్ఛను కాపాడాల్సిన ప్రభుత్వమే వాటిని హరిస్తూ అరాచకాలకు పాల్పడితే? ఏపీలో ప్రస్తుత పరిస్థితి ఇదే.

    ఏపీ ప్రభుత్వం మిగిలిన పనులన్నీ పక్కనబెట్టి మరీ పోలీసులతో తప్పుడు కేసులు పెట్టిస్తూ విపక్ష  వైఎస్సార్‌ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను వేధిస్తూ చివరికి ప్రజల పక్షాన వార్తలు రాస్తున్న మీడియా గొంతు నొక్కేందుకూ ప్రయత్నిస్తోంది. సాక్షి ఎడిటర్ ధనుంజయ్ రెడ్డి నివాసంపై పోలీసుల దాడిని కూడా ఈ కోణంలోనే చూడాలి. టీడీపీ, అధికారంలోకి వచ్చినప్పటి జనసేన, బీజేపీ కూటమి దుశ్చర్యలకు అంతు లేకుండా పోతోంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఎప్పుడూ మీడియాపై ఒక కన్నేసే ఉంచుతారు. బాకా మీడియాను ఒకరకంగా, వైఫల్యాలను, ప్రభుత్వ స్కామ్‌లను బయటపెట్టే మీడియాను మరో రకంగా చూస్తారు. మాట వినని జర్నలిస్టులను ఉద్యోగాల నుంచి తొలగించేలా యాజమాన్యాలపై ఒత్తిడి తీసుకు వస్తారు కూడా. అనుకూలంగా ఉండే మీడియాకు రకరకాల రూపాలలో మేళ్లు చేస్తారు. తద్వారా ఆ యాజమాన్యాలను తన గుప్పెట్లో ఉంచుకుంటారు.

    1995లో తన మామ ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉండగా ఒక వర్గం మీడియా ద్వారా ఆయనపైనే వ్యతిరేక ప్రచారం అనండి.. దుష్ప్రచారం చేయించిన చరిత్ర చంద్రబాబుది అని అప్పటి నుంచి రాజకీయాలు చూస్తున్నవారు చెబుతుంటారు. ఎన్టీఆర్‌ కేబినెట్‌లో మంత్రిగా ఉంటూనే ఆయన తెలివిగా ఎన్టీఆర్‌ ప్రతిష్టను తగ్గించే వ్యూహాలు అమలు చేశారని ఆరోపణలున్నాయి. ఎన్టీఆర్‌  భార్య లక్ష్మీపార్వతిని బూచిగా చూపెట్టేందుకు ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి పత్రికలను బాగా వాడుకోగలిగేవారు. ఈనాడు చూడడానికే అసహ్యంగా ఉండే ఘోరమైన కార్టూన్లు ఎన్టీఆర్‌పై వేసేది. అయినా ఆ రోజుల్లో ఈ పత్రికలపై ఎన్టీఆర్‌ కేసులు పెట్టలేదు.

    మామను కూలదోసి ముఖ్యమంత్రి అయిన తరువాత చంద్రబాబు పాలన మాటెలా ఉన్నా అనుకూల మీడియా వ్యవస్థనైతే బాగానే ఏర్పాటు చేసుకున్నారు. మీటింగ్‌లు జరిగినా, జరగకపోయినా, కల్పిత కథనాలకు కొదవ ఉండేది కాదు. అదే టైమ్‌లో రాజకీయ ప్రత్యర్థులపై బురద చల్లే వ్యూహాలు పక్కాగా అమలయ్యేవి. ఆ రోజుల్లో కూడా ప్రభుత్వ వ్యతిరేక వార్తలు రాసే కొన్ని పత్రికలకు ప్రభుత్వ ప్రచార ప్రకటనలు నిలిపివేసే వారు. కానీ ఇప్పటిలా బరితెగించి మరీ కేసులు పెట్టేవారు కాదనే చెప్పాలి. ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వడం చంద్రబాబుకు కొత్తకాదు. అయితే, ఆ హామీలను అమలు చేయకపోయినా ఎవరూ వాటిని గుర్తు చేయకూడదు! అందుకోసం ఆయన నానా ప్రయత్నాలూ చేస్తుంటారు.

    2014లో రైతుల సంపూర్ణ రుణమాఫీ కావచ్చు.. కాపుల రిజర్వేషన్‌ ఉద్యమం కావచ్చు.. మరేదైనా కావచ్చు. చంద్రబాబు పంథా ఒక్కటే. తనకు వ్యతిరేకంగా ఏదైనా జరుగుతుంటే అనుకూల మీడియా చేత వాటిని అణచివేసే ప్రయత్నం చేయడం. అంశం ఏదైనా.. టీవీ ఛానళ్లలో అనుకూల ప్రచారమే సాగాలన్నది ఆయన ఆకాంక్ష. కాపుల రిజర్వేషన్‌ విషయమే తీసుకుందాం.. ఇచ్చిన హామీ అమలుకు ముద్రగడ పద్మనాభం ఉద్యమం చేపడితే ఆ విషయం  ప్రజలలోకి వెళ్లనీయకుండా కొన్ని టీవీ చానళ్లను బ్లాక్ చేయడానికి యత్నించారు. ఇదే చంద్రబాబు ప్రతిపక్షంలో ఉంటే మాత్రం అధికార పార్టీపై వ్యతిరేక వార్తలు రాయాలని జర్నలిస్టులకు నూరి పోస్తుంటారు. దానికి తగినట్లే ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి తమ రాజకీయ, వ్యాపార ప్రయోజనాల కోసం ఉన్నవి, లేనివి కల్పించి వార్తలు ఇచ్చేవి. ఈ మీడియా 2019-2024 మధ్యలో ముఖ్యమంత్రి జగన్‌పై కక్కినంత విషం బహుశా ప్రపంచంలోనే మరే మీడియా కక్కి ఉండదు. ఇందుకోసం పచ్చి అబద్ధాలు రాసేందుకూ వెనుకాడలేదు ఈ సంస్థలు.

    టీడీపీ మీడియా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జగన్‌ను కించపరిచేలా కథనాలు ఇచ్చినా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్‌ తదితరులు దారుణమైన వ్యాఖ్యలు చేసినా అప్పట్లో ఎవరిపై కేసులు పెట్టలేదు. కానీ 2024లో అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చంద్రబాబు.. సాక్షి మీడియా అణచివేతకు యత్నిస్తూనే ఉన్నారు. పలువురు విలేకరులపై పోలీసు కేసులు నమోదవడం ఇందుకు నిదర్శనం. నెల్లూరు జిల్లా కావలి వద్ద ఎప్పుడో మూడేళ్ల క్రితం శిలాఫలకం పడవేశారంటూ అప్పటి ఎమ్మెల్యేతోపాటు విలేకరిపై కూడా కేసు పెట్టారట. అప్పుడు ఏం చేశారో కాని, కూటమి అధికారంలోకి వచ్చాక, టీడీపీ, జనసేన వారు లెక్కలేనని శిలా ఫలకాలను ధ్వంసం చేసినా ఒక్క కేసు నమోదు కాలేదు. మనోభావాలు దెబ్బతిన్నాయంటూ ఎవరెవరో ఫిర్యాదు చేయడం పోలీసులు హుటాహుటిన వైఎస్సార్‌సీపీ వారిని అరెస్టు చేయడం సాధారణమై పోతోంది.

    ముఖ్యమంత్రి కుమారుడు, మంత్రి లోకేశ్‌ ‘రెడ్ బుక్’పేరుతో కక్ష రాజకీయాలు చేస్తున్నారు. ఎందుకు ఇవన్నీ?. చాలా సింపుల్‌ ప్రభుత్వ తప్పులు ఎవరూ ఎత్తి చూపకూడదు. సూపర్ సిక్స్ తో సహా ఎన్నికల సమయంలో ఇచ్చిన 150 హామీలు ఎందుకు అమలు చేయడం లేదని ఎవరూ ప్రశ్నించకూడదు. గత ప్రభుత్వం చేసిన అప్పులపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తదితరుల అసత్యపు ప్రచారాన్ని ఎవరూ గుర్తు చేయకూడదు. ఏడాది తిరగకుండానే కూటమి ప్రభుత్వం చేసిన రూ.1.5 లక్షల కోట్ల అప్పులు ఎందుకు? దేనికి ఖర్చుపెట్టారు? అని ఎవరూ అడగకూడదు. ప్రభుత్వంలో జరుగుతున్న కుంభకోణాలను ఎవరూ వెలికి తీయకూడదు. సాక్షి మీడియా ఇవన్నీ చేస్తున్నందునే చంద్రబాబు ప్రభుత్వం కక్ష కట్టి దాడి చేస్తోంది.

    నిజానికి సాక్షి మీడియా ప్రతీ వార్తనూ ఆధార సహితంగానే రాస్తుంది. సౌర శక్తి ఒప్పందాలనే తీసుకుందాం. జగన్‌ హయాంలో యూనిట్‌కు రూ.2.49లకు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సంస్థ సెకీతో ఒప్పందం చేసుకుంది. ఇందుకు గగ్గోలు పెట్టిన చంద్రబాబు, ఎల్లోమీడియా..లక్ష కోట్ల రూపాయల నష్టం జరిగిపోయిందని ప్రచారం చేశాయి. తీరా చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిందేమిటి? అదే విద్యుత్తును రూ.4.60లకు కొనుగోలు చేస్తున్నారు. అంటే.. యూనిట్‌కు దాదాపు రెండు రూపాయలు ఎక్కువ పోసి కొంటున్నారన్నమాట. అయినా సరే.. దీనిపై ఈనాడు, ఆంధ్రజ్యోతుల్లో ఒక్క వార్త కూడా రాలేదు. సాక్షి మాత్రం పక్కా ఆధారాలతో జరిగిన అవినీతిని వివరించారు. సౌర శక్తి కొనుగోళ్ల విషయంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో చంద్రబాబు ప్రభుత్వ ప్రతిష్ట మసకబారింది.

    అలాగే.. విశాఖలో టీసీఎస్‌కు 99 పైసలకు ఎకరా భూమి ఇవ్వడం, ఊరు, పేరు లేని ఒక కంపెనీకి అరవై ఎకరాలు కట్టబెట్టడం, అమరావతి రాజధాని నిర్మాణాల పేరుతో అధిక రేట్లకు ఇష్టారాజ్యంగా టెండర్లు కేటాయించడం, అప్పుల కోసం ఏకంగా రాష్ట్ర  ఖజానాను కూడా తాకట్టు పెట్టడం పెన్షన్లు మినహా మరే  హామీ అమలు చేయకపోవడంతో ప్రజలలో అసంతృప్తి నెలకొనడం మొదలైన వార్తలను సాక్షి మీడియా ఇస్తోంది. ఏలికలకు ఇది పంటికింద రాయిలా మారింది. దీంతో సాక్షిని ఇబ్బంది పెట్టడానికి యత్నిస్తోంది. ఈ క్రమంలో ఆధారాలు లేని మద్యం స్కామ్‌ను సృష్టించి వైఎస్సార్‌సీపీ నేతల అరెస్టుకు చంద్రబాబు.. పోలీసులను ప్రయోగించారు. నిందితులు సాక్షి ఎడిటర్ ధనుంజయ్ రెడ్డి ఇంటిలో ఉన్నారన్న  అనుమానం వచ్చిందని పోలీసులు.. చెప్పా పెట్టకుండా విజయవాడలో ఆయన ఇంటిపై పడ్డారు. నిజంగా అలాంటి అనుమానం ఉంటే ఏమి చేయాలి? సెర్చ్ వారంటే ఇచ్చి సోదాలు చేయాలి. అసలు ఒక పత్రికా సంపాదకుడి ఇంటికి అంత ధైర్యంగా వెళ్లారంటే ఈ ప్రభుత్వం ఎంత నియంతృత్వంగా వ్యవహరిస్తున్నది అర్థం చేసుకోవచ్చు.

    సాక్షి సిబ్బందిని మానసికంగా వేధించడానికి ఇలా చేసినట్లు తెలుసుకోవడం కష్టం కాదు. ఇంత మాత్రానికే సాక్షి మీడియా వణికిపోతుందా?. 2008  నుంచి సాక్షి మీడియా ఇలాంటి ఆటుపోట్లను ఎన్నింటినో ఎదుర్కొంది. ఈ మీడియాను దెబ్బతీయడానికి చంద్రబాబు కాంగ్రెస్‌తో కలిసి ఎన్ని కుట్రలు పన్నింది.. ఎన్ని కేసులు పెట్టించింది తెలియనిది కాదు. 2014 టర్మ్‌లో కూడా సాక్షిని లేకుండా చేయాలని ప్రయత్నించి విఫలం అయ్యారు. తిరిగి ఈ టర్మ్‌లో అంతకన్నా ఎక్కువగా కక్ష సాధింపు చర్యలకు తెగిస్తున్నారు. ఎడిటర్ ధనుంజయ్ రెడ్డి వాటిని సమర్థంగానే ఎదుర్కొన్నారు. పోలీసులు మూడు గంటలపాటు అక్కడ ఉన్నా వారికి ఏమీ దొరకలేదు. దాంతో వారు సైలెంట్‌గా వెళ్లిపోక తప్పలేదు. సెర్చ్ వారంట్ లేకుండా వెళ్లడం ద్వారా పోలీసులు దుశ్చర్యకు పాల్పడినట్లు అయింది.

    ఇక, ఎమర్జన్సీలో సైతం ఇందిరాగాంధీ ఇలాంటి పద్దతులు అనుసరించి మీడియా గొంతు నులమాలని విశ్వయత్నం చేశారు. కానీ, అంతిమంగా ఆమె ఘోర పరాజయాన్ని మూట కట్టుకున్నారు. తొలుత ఇందిరాగాంధీ శిష్యుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసి, ఆ తర్వాత తెలుగుదేశంను తన అధీనంలోకి తెచ్చుకుని రాజకీయం చేస్తున్న చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు అవే పద్దతులు అవలంభిస్తున్నారు. చరిత్ర చెప్పిన పాఠాలను మర్చిపోయి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఎవరికైనా ఓటమి తప్పదు.

    - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

  • గుంతకల్లు/గుత్తి : ‘రెడ్‌బుక్‌ను ఎట్టి పరిస్థితిల్లోనూ మర్చిపోను.. టీడీపీ కేడర్‌ను ఇబ్బంది పెట్టిన అందరూ మూల్యం చెల్లించుకోకతప్పదు. టీడీపీ కార్యకర్తలపై ఉన్న కేసులన్నీ ఎత్తేపిస్తా’ అని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్య, ఐటీ ఎలక్ట్రానిక్‌ శాఖల మంత్రి నారాలోకేశ్‌ పేర్కొన్నారు.

    గురువారం ఆయన అనంతపురం జిల్లా గుత్తి మండలం రామరాజుపల్లిలో ఉత్తమ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి నారా లోకేష్‌.. మాట్లాడుతూ ఏ సమావేశానికి వెళ్లినా పార్టీ కేడర్‌ రెడ్‌బుక్‌ గురించి అడుగుతున్నారని, ప్రతి ఒక్కరి చిట్టా విప్పి, చేయాల్సిన పని చేస్తానన్నారు. కాకపోతే కాస్త సమయం పడుతుందని పేర్కొన్నారు. కార్యకర్తలపై గత ప్రభుత్వం పెట్టిన కేసులను ఎత్తివేయిస్తానని చెప్పారు. వైఎస్‌ జగన్‌ నిర్వహకం వల్లే కరెంటు బిల్లుల్లో ట్రూఅప్‌ చార్జీలు వేయాల్సి వస్తోందని పేర్కొన్నారు.

    కూటమి ప్రభుత్వం స్కూల్‌ మూసివేస్తుందని వైఎస్సార్సీపీ చేస్తున్న ప్రచారాన్ని తిప్పి కొట్టాలని లోకేష్‌ చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో స్కూళ్లలో 45 లక్షల మంది విద్యార్థులు ఉండగా, ఇప్పడు ఆ సంఖ్య 33 లక్షలకు పడిపోయిందన్నారు. అనంతపురానికి రూ.22 వేల కోట్ల విలువైన భారీ సోలార్‌ విండ్‌ ప్రాజెక్టు వస్తుందని వెల్లడించారు. అనంతరం ఉత్తమ కార్యకర్తలకు ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యకర్తలతో సెల్ఫీలు దిగారు. 

National

  • బెంగళూరు: పాకిస్తాన్‌పై భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌పై ప్రతిపక్ష కాంగ్రెస్‌ సంచలన ఆరోపణలు చేశారు. ఆపరేషన్‌ సిందూర్‌తో ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. భారత దాడుల్లో మరణించింది ఎవరు?. పహల్గాంలో దాడి చేసిన వారు మృతుల్లో ఒక్కరైనా ఉన్నారా?. సరిహద్దులో ఎందుకు భద్రత లేదు?. పహల్గాం ఘటన జరిగిన తర్వాత వారు ఎలా తప్పించుకున్నారు? అని ప్రశ్నలు సంధించారు.

    కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే కోతూర్ మంజునాథ్‌ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘ఆపరేషన్‌ సిందూర్‌ భారత్‌కు ఎలాంటి ప్రయోజనం అందించలేదు. ఈ ఆపరేషన్‌లో ఏమీ చేయలేదు. కేవలం గొప్పగా చూపించుకోవడానికే ఇదంతా చెబుతున్నారు. ఓ నాలుగు విమానాలు సరిహద్దులు దాటి వెళ్లి.. మళ్లీ తిరిగి వచ్చాయి. అంతే తప్ప ఇంకేమీ జరగలేదు. భారత దాడుల్లో మరణించిన వారు ఎవరు?. పహల్గాంలో దాడి చేసిన వారు మృతుల్లో ఎవరైనా ఉన్నారా?. అధికారులు ఒకటి చెబితే.. టీవీలు మరొకటి చెబుతున్నాయి. మరొకరు ఇంకేదో అంటున్నారు. మనం ఎవరిని నమ్ముతాము? అధికారిక ప్రకటన ఎక్కడ?’ అని ప్రశ్నించారు.

    అలాగే, భారత్‌ దాడుల్లో కనీసం 100 మంది ఉగ్రవాదులు మృతిచెందినట్టు చెబుతున్నారు. ఈ విషయాన్ని ఎవరు నిర్ధారించారు?. మన సరిహద్దును దాటిన ఆ ఉగ్రవాదులు ఎవరు? వారి గుర్తింపు ఏంటి? సరిహద్దులో ఎందుకు భద్రత లేదు? వారు ఎలా తప్పించుకున్నారు? ఉగ్రవాద మూలాలు, శాఖలను గుర్తించి వాటిని నిర్మూలించాలి. పహల్గాం ఘటన పూర్తిగా నిఘా వైఫల్యమే. పహల్గాం దాడి బాధితుల కుటుంబాలకు న్యాయం చేయడంలో కేంద్రం​ విఫలమైంది. పహల్గాం బాధితులకు కేంద్రం పరిహారం ఇచ్చిందా?. కర్ణాటక, పాకిస్తాన్, చైనా లేదా బంగ్లాదేశ్‌లో ఎక్కడైనా పౌరులపై జరిగే దాడులను మేము వ్యతిరేకిస్తాం’ అని చెప్పుకొచ్చారు. 


    ఇదిలా ఉండగా.. ‘ఆపరేషన్‌ సిందూర్‌’లో 100 మంది ఉగ్రవాదులు హతమైనట్లు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. ఈ ఆపరేషన్‌ ఇంకా కొనసాగుతుందని చెప్పారు. పాక్‌ దాడులు చేస్తే తిరిగి దాడులు చేస్తామని పేర్కొన్నారు. ‘ఆపరేషన్ సిందూర్‌’ పేరుతో పాకిస్తాన్‌, పీవోకేలోని తొమ్మిది ఉగ్ర శిబిరాలపై దాడులు చేసిన విషయం తెలిసిందే. భారత్‌.. నూర్‌ఖాన్‌, రఫీకీ, షోర్కోట్‌, మురిద్‌, సుక్కోర్‌, సియాల్కోట్‌, పసురూర్‌, చునియన్‌, సర్గోదా, భోలారీ, జకోబాబాద్‌లో దాడులు చేసింది. దాడికి ముందు.. తర్వాత ఇక్కడినుంచి సేకరించిన ఉపగ్రహ చిత్రాల్లో నష్టం తీవ్రత స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా జకోబాబాద్‌లోని షాబాజ్‌ బేస్‌ చాలావరకు ధ్వంసమై కనిపిస్తోంది. ఇక భారత పదాతి దళం జరిపిన దాడిలో నియంత్రణ రేఖ వద్ద పాక్‌ సైనిక స్థావరాలు, ఉగ్ర బంకర్లు నాశనమయ్యాయి.

  • లక్నో: ఉత్త‌ర ప్ర‌దేశ్ సమాజ్‌వాది పార్టీ నేత రామ్ గోపాల్‌ యాదవ్‌ (Ram Gopal Yadav) వింగ్ క‌మాండ్ వ్యోమికా సింగ్‌పై (Vyomika Singh)వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.

    ఇటీవల, కల్నల్‌ సోఫియా ఖురేషీ (Sofia Khureshi)పై మధ్యప్రదేశ్‌ మంత్రి విజయ్‌ షా (Vijay Shah) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల్ని రామ్ గోపాల్ యాదవ్ తాజాగా, ప్రస్తావిస్తూ.. ‘వింగ్ క‌మాండర్‌ వ్యోమికా సింగ్ రాజ్‌పుత్ కాబ‌ట్టే ఆమెను వ‌దిలేసి.. ముస్లిం మతానికి చెందిన క‌ల్న‌ల్ సోఫియా ఖురేషీ గురించి విజ‌య్ షా మాట్లాడారని అన్నారు. 

    ఉత్త‌ర‌ప్ర‌దేశ్ మోరాబాద్‌లో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో ఎస్పీ నేత రామ్ గోపాల్ యాద‌వ్ పాల్గొన్నారు. ఆ కార్య‌క్ర‌మంలో మంత్రి విజ‌య్ షా కల్నల్ ఖురేషీపైచేసిన వ్యాఖ్య‌ల్ని ప్ర‌స్తావించారు. ‘ఓ మంత్రి క‌ల్న‌ల్ ఖురేషీని ఉద్దేశిస్తూ చేసిన మ‌త‌త‌త్వ వ్యాఖ్య‌ల‌పై హైకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. అత‌నిపై ఎఫ్ఐఆర్ న‌మోదు చేయాల‌ని ఆదేశించింది. కానీ అతనికి వింగ్ క‌మాండర్‌ వ్యోమికా సింగ్, ఎయిర్ మార్షల్ ఏకే భారతిల గురించి తెలియదు. లేదంటే వాళ్ల‌ని టార్గెట్ చేసేవారు’ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ సంద‌ర్భంగా వ్యోమికా సింగ్, ఎయిర్ మార్ష‌ల్ ఏకే భార‌తి కులాల ప్రస్తావనకు తెచ్చారు. 

    అదే సమయంలో ఆపరేషన్‌ సిందూర్‌తో పాక్ ఉగ్రవాదుల పీచమణిచిన సాయుధ దళాల సేవల కంటే  బీజేపీ స్వీయ ప్రశంసలకు ప్రాధాన్యత ఇస్తుందని రామ్ గోపాల్ యాదవ్ ఆరోపించారు. మనస్తత్వం చెడుగా ఉన్నప్పుడు, సైన్యం సాధించిన విజయాల గురించి మాట్లాడటానికి బదులుగా, వారు తమ సొంత విజయాలను హైలైట్ చేస్తారంటూ అభిప్రాయ పడ్డారు. 

     

     సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆగ్రహం
    రామ్‌ గోపాల్‌ యాదవ్ వ్యాఖ్యలపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశానికి సేవ చేస్తున్న సైనికుల యూనిఫామ్‌ను కుల దృక్పథంతో చూడరని, సైనికులు ఏ కులానికి లేదా మతానికి ప్రతినిధులు  కాదని  అన్నారు. దేశ వీర వనితను గురించి అనుచిత వ్యాఖ్యలు చేసి రామ్‌ గోపాల్‌ యాదవ్‌ ఆలోచనలకు నిదర్శనం మాత్రమే కాదు, సైనికుల వీరత్వాన్ని, దేశ గౌరవాన్ని అవమానించడమేనని ట్వీట్‌ చేశారు. 

Vikarabad

  • నిలిచిన పనులు.. రాకపోకలకు తిప్పలు

    దుద్యాల్‌: అర్ధాంతరంగా మండల పరిధిలో మహబూబ్‌నగర్‌–చించోలి రోడ్డు నిర్మాణ పనులు నిలిచిపోయాయి. దీంతో కల్వర్టుల కోసం తీసిన గోతులు ప్రమాదకరంగా మారాయి. నిత్యం బిక్కుబిక్కుమంటూ వాహనదారులు ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తున్నారు. రోడ్డు పనులు ప్రారంభమై ఏడాదిన్నర గడుస్తున్నా ఇంకా పూర్తి కాకపోవడంతో స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసంపూర్తి పనులు కలిగిన రహదారిపై వెళ్తూ ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.

    సూచికలు లేవు

    దుద్యాల్‌ గేట్‌ నుంచి హస్నాబాద్‌ వెళ్లే మార్గమధ్యలో కల్వర్టుల పనులు అసంపూర్తిగా వదిలేశారు. అక్కడ రోడ్డు పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా మారడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నిత్యం వేల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ప్రమాదం పొంచి ఉన్నా కల్వర్టు దగ్గర తాత్కాలికంగా ప్రమాద సూచికలు కూడా ఏర్పాటు చేయలేకపోవడం విడ్డూరంగా ఉందని చోదకులు వాపోతున్నారు. దీంతో ఏ సమయంతో అయిన ప్రమాదం జరిగే అవకాశం ఉందని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. కల్వర్టుల దగ్గర వేసిన రోడ్డు వాహనాల రాకపోకలకు కొంత భాగం కూలిపోయి ప్రమాద స్థాయిని మరింత పెంచింది. అలాగే హస్నాబాద్‌ గ్రామంలో రోడు నిర్మాణ పనుల్లో భాగంగా అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ కోసం తీసిన గుంతలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. పనులు పూర్తిగా నిలిపివేయడంతో గుంతల్లో వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలకు కారణమవుతుంది. గతేడాది డిసెంబర్‌లో తెల్లవారుజామున పాలను తరలించే ఓ ఆటో ప్రమాదానికి గురైంది. రోడ్డు పనులు త్వరగా పూర్తి చేస్తే ప్రమాదాలు నివారించవచ్చని వాహనదారులు తెలుపుతున్నారు.

    అసంపూర్తిగా మహబూబ్‌నగర్‌–చించోలి రహదారి నిర్మాణం

    కల్వర్టుల వద్ద ప్రమాదకరంగా మారిన వైనం

    పట్టించుకోని అధికార యంత్రాంగం

  • పంటల బీమా పునరుద్ధరణ!

    షాబాద్‌: రైతులను అన్నివిధాలా ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతోంది. ఆశించిన మేర పంట చేతికొచ్చి మంచి ధర పలికితే రైతులకు ఎంతో మేలు. కానీ కొన్నిసార్లు పండించిన పంట అకాల వర్షాలకు గురై తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. వ్యవసాయం పూర్తిగా ప్రకృతిపై ఆధారపడి ఉండటంతో పంటలకు బీమా తప్పనిసరి అని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు తిరిగి అమలు చేసే యోచనలో ఉంది.

    2018 నుంచి నిలిపివేత

    పంటల బీమా పథకం రాష్ట్రంలో 2018 నుంచి అమ లు కావడం లేదు. దీంతో పంటలు నష్టపోయిన రైతన్నలకు ఎలాంటి పరిహారం అందడం లేదు. బీమాను అమలు చేస్తే ప్రీమియం చల్లించిన అన్నదాతలకు నష్టపరిహారం అందించే అవకాశం ఉంటుంది. మండలంలో ఏటా వానాకాలం, యాసంగి లో సుమారు వేల ఎకరాల్లో వివిధ పంటలను సాగు చేస్తారు. ప్రకృతి వైపరీత్యాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో ఫసల్‌ బీమా అమ లు చేస్తే రైతులకు ఎంతో మేలు జరిగే అవకాశం ఉంటుంది. గతంలో పంటను బట్టి కొంత ప్రీమి యం చెల్లిస్తే మిగతాది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించే విధానం ఉండేది. ప్రస్తుతం ఎలాంటి విధివిధానాలు అమలు చేస్తారో వేచి చూడాలి.

    గతంలో భారీ నష్టం

    గతేడాది సెప్టెంబర్‌లో కురిసిన భారీ వర్షాలకు మండలంలో నాగర్‌గూడ, తాళ్లపల్లి, తిమ్మారెడ్డిగూడ, ఏట్ల ఎర్రవల్లి, రుద్రారం, హైతాబాద్‌, సోలీపేట్‌ ప్రాంతాల్లో పంటలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. ఆయా గ్రామాల్లో సుమారు 2 వేల ఎకరాల వరకు పంట నష్టం జరిగిందని అధికారులు అంచనా వేసినా అనధికారికంగా ఇంకా ఎక్కువే ఉంటుందని తెలుస్తోంది. నీరందక పంటలు ఎండిపోవడం, అకాల వర్షాలు, తెగుళ్లు సోకి పంటలు దెబ్బతిన్నా బీమా రక్షణ కవచంలా పని చేస్తుంది. దీంతో రైతులు ఈ పథకాన్ని అమలు చేయాలని పెద్దఎత్తున డిమాండ్‌ చేస్తున్నారు.

    వానాకాలం నుంచి అమలుయోచనలో ప్రభుత్వం

    రైతుల్లో చిగురిస్తున్న ఆశలు

  • ఫేక్‌ ఆధార్‌తో స్థలం కాజేసే కుట్ర

    అబ్దుల్లాపూర్‌మెట్‌: చనిపోయిన వ్యక్తి స్థానంలో వేరొకరిని చూపించి.. నకిలీ ఆధార్‌ కార్డును సృష్టించిన కేటుగాళ్లు ఓ ప్లాటును తమ పేరు మీద రిజిస్ట్రేషన్‌ చేయించుకునేందుకు కుట్ర పన్నారు. ఆధార్‌ కార్డుపై మార్ఫింగ్‌ చేసి రిజిస్ట్రేషన్‌ చేయించుకునేందుకు వచ్చిన ముఠా సభ్యుల తీరుపై అనుమానం వచ్చిన సబ్‌ రిజిస్ట్రార్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అదుపులోకి తీసుకున్నారు. అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకున్న సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని గోషామహల్‌కు చెందిన చంద్రకాంత్‌కు మండల పరిధిలోని మజీద్‌పూర్‌లో ఉన్న 267 గజాల స్థలాన్ని మనకర్‌ ఆనంద్‌ జీపీఏ(866/2013) చేయించుకున్నాడు. కొన్ని నెలలకే ఆనంద్‌ మృతి చెందాడు. ఈ విషయాన్ని గుర్తించి ఆ స్థలాన్ని కాజేయాలని చంపాపేటలో నివాసముండే కొసిరెడ్డి భాస్కర్‌రెడ్డి(సస్పెండ్‌కు గురైన ఆర్టీసీ ఉద్యోగి) పన్నాగం వేశాడు. ఇందులో భాగంగా నల్లగొండ జిల్లా గోనకోల్కు చెందిన బోదాసు ఆంజనేయులును ప్లాట్‌ యజమాని ఆనంద్‌గా చూపించేందుకు నకిలీ ఆధార్‌ కార్డు సృష్టించాడు. అదే సమయంలో వరంగల్‌లోని బలపాలకు చెందిన జిల్లాపల్లి సంజీవరావును చంద్రకాంత్‌గా చూపించేలా మరో ఆధార్‌ కార్డును తయారు చేశాడు. సాక్షులుగా గోనకోల్క చెందిన దండుగల ఆంజనేయులు, చంపాపేట్‌లో ఉంటున్న కురువ శ్రీనివాసులును తీసుకెళ్లాడు. వీరందరి నుంచి భాస్కర్‌రెడ్డి కొనుగోలు చేస్తున్నట్టు డాక్యుమెంట్‌ రైటర్‌ ఉదయ్‌కుమార్‌తో పత్రాలు సిద్ధం చేసుకున్నాడు. బుధవారం రిజిస్ట్రేషన్‌ చేసుకునే సమయానికి ఆధార్‌ కార్డుల నంబర్లు నమోదు చేసే సమయంలో బయోమెట్రిక్‌లో అసలు, నకిలీ వ్యక్తులకు సరి తూగలేదు. బయోమెట్రిక్‌ సమయంలో ఆనంద్‌ పేరుతో ఉన్న ఆధార్‌ కార్డు నంబరు నమోదు చేయగా ఆంజనేయులు పేరు. చంద్రకాంత్‌ పేరిట ఉన్న ఆధార్‌ కార్డును నమోదు చేయగా సంజీవ పేర్లు రావడంతో సబ్‌రిజిస్ట్రార్‌ సునీతా రాణి అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ అశోక్‌ రెడ్డి తెలిపారు. నిందితులు భాస్కర్‌రెడ్డి, శ్రీనివాసులును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిగతావారు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేపడుతున్నట్లు వివరించారు.

    సబ్‌రిజిస్ట్రార్‌ ఫిర్యాదుతో భగ్నం

    పోలీసుల అదుపులో నిందితులు

  • ఫ్లెక్సీ రాజేసిన చిచ్చు

    మహేశ్వరం: కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీకి కట్టిన ఫ్లెక్సీ అధికార, ప్రతిపక్ష పార్టీల్లో చిచ్చు రాజేసింది. ప్రభుత్వ కార్యక్రమాలకు గులాబీ రంగు బ్యానర్‌ను ఎలా వాడతారని కాంగ్రెస్‌ నాయకులు వాగ్వాదానికి దిగారు. గురువారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. గేటు వద్ద ఎమ్మెల్యే సబితారెడ్డికి బీఆర్‌ఎస్‌ నేతలు ఆహ్వానం పలుకుతూ గులాబీ రంగుతో కూడిన బ్యానర్‌ కట్టారు. అధికారిక కార్యక్రమం వద్ద పార్టీ ఫ్లెక్సీ ఎందుకు కట్టారని బీఆర్‌ఎస్‌ నేతలతో కాంగ్రెస్‌ నాయకులు మాటల యుద్ధానికి దిగారు. ఎమ్మెల్యే సబితారెడ్డి కారు దిగగానే కాంగ్రెస్‌ నేతలు నినాదాలతో హోరెత్తించారు. ఈ క్రమంలోనే బీఆర్‌ఎస్‌ ఫ్లెక్సీని చించేశారు. దీంతో ఇరు పార్టీల నేతల మధ్య తోపులాట జరిగింది. వెంటనే మహేశ్వరం సీఐ వెంకటేశ్వర్లు ఇరువర్గాలను చెదరగొట్టి నచ్చజెప్పారు. పరస్పరం ఇరు పార్టీల నేతలు ఫిర్యాదు చేసుకున్నారు. అనంతరం 180 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను ఎమ్మెల్యే సబితారెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఫ్లెక్సీ విషయంలో రాజకీయాలు చేయడం తగదన్నారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నేరవేర్చకుండా ప్రజలను మోసం చేశారన్నారు. తులం బంగారం ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుందని చురకలంటించారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సభావత్‌ కృష్ణా నాయక్‌, వైస్‌ చైర్మన్‌ చాకలి యాదయ్య, పీఏసీఎస్‌ చైర్మన్‌ మంచె పాండు యాదవ్‌, వైస్‌ చైర్మన్‌ దేవరంపల్లి వెంకటేశ్వరరెడ్డి, తహసీల్దార్‌ సైదులు, ఎంపీఓ రవీందర్‌రెడ్డి, ఆర్‌ఐలు స్వర్ణకుమారి, ప్రేమ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

    కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నేతల వాగ్వాదం

  • భూ భారతితో సమస్యలకు చెక్‌

    ధారూరు: భూభారతి రెవెన్యూ సదస్సుల్లో అధికారులు గ్రామలకు వచ్చి రైతుల సమస్యలను పరిష్కరిస్తున్నారని వికారాబాద్‌ ఆర్డీఓ వాసుచంద్ర చెప్పారు. గురువారం మండలంలోని అంతారంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. జిల్లాలో పైలెట్‌ ప్రాజెక్టు కింద ఎంపికై న ధారూరు మండలాన్ని భూ సమస్యలు లేని మండలంగా చేద్దామని పిలుపునిచ్చారు. ఈ సదస్సుల్లో రైతుల నుంచి దరఖాస్తులన్నింటినీ పరిష్కరించే విధంగా రెవెన్యూ అధికారులు పని చేయాలని ఆదేశించారు. అనంతరం ఆయన భూ సమస్యల దరఖాస్తులను రైతుల నుంచి స్వీకరించి పరిశీలించారు. మోమిన్‌కలాన్‌, అంతారం, మోమిన్‌ఖుర్దు గ్రామాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో 59 దరఖాస్తులు వచ్చాయి. కార్యక్రమంలో తహసీల్దార్లు సాజిదాబేగం, శ్రీనివాస్‌, దీపక్‌సాంసన్‌, డీటీ విజయేందర్‌, ఆర్‌ఐ స్వప్న, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

    నేటి రెవెన్యూ సదస్సులు

    మండల పరిధిలోని కొడాపూర్‌ఖుర్దు, రాజాపూర్‌, నాగారం గ్రామాల్లో భూభారతి రెవెన్యూ సదస్సులను శుక్రవారం నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్‌ సాజిదాబేగం తెలిపారు. ఆయా గ్రామాల్లో రైతులు భూ సమస్యలపై దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

    వికారాబాద్‌ ఆర్డీఓ వాసుచంద్ర

  • స్థాన
    స్థానికం

    పూడూరు: స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొప్పుల రాజశేఖర్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన పూడూరు మండల కమిటీని ప్రకటించారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడనిగా రాఘవేందర్‌, ఉపాధ్యక్షులుగా నర్సింహారెడ్డి, వెంకటేష్‌, ప్రభాకర్‌యాదవ్‌, శ్రీనివాస్‌, ప్రధాన కార్యదర్శులుగా వడ్ల క్రిష్ణాచారి, రామచంద్రయ్య, కార్యదర్శులుగా శ్రీకాంత్‌రెడ్డి, బాలమణి, మనోహర్‌గౌడ్‌, ప్రభగౌడ్‌, కోశాధికారిగా మంజుల, కమిటీ సభ్యులుగా రాజు, శ్రీహరిచారి, శ్రీశైలం, రవి, రమేష్‌, సతీష్‌ తదితరులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు కృషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో సినిమా సెన్సార్‌బోర్డు సభ్యుడు మల్లేష్‌పటేల్‌, నాయకులు సుభాన్‌, శివరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

    బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి

  • పచ్చిరొట్ట సాగుతో భూసారం పెంపు

    మొయినాబాద్‌: పచ్చిరొట్ట పైర్ల సాగుతో భూమిలో భూసారాన్ని పెంచుకోవాలని ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం సీనియర్‌ శాస్త్రవేత్త ఎస్‌.జి మహాదేవప్ప అన్నారు. మొ యినాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలోని చిలుకూరులో గురువారం వరిలో యాజమాన్య పద్ధతులపై శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరి సాగులో రైతులు రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలన్నారు. పచ్చిరొట్ట పైర్లతోపాటు సేంద్రియ ఎరువులను వాడి అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు. పంటమార్పిడి విధానం, చిరుధాన్యాల సాగుతో భూమి ఆరోగ్యాన్ని పెండంతోపాటు పర్యావరణ సంరక్షించుకోవచ్చన్నారు. కార్యక్రమంలో శాస్త్రవేత్త రమేష్‌, సహాయ వ్యవసాయ సంచాలకులు బీజే సురేష్‌, ఏఓ అనురాధ, ఏఈఓ సునీల్‌, రైతులు పాల్గొన్నారు.

  • ‘సన్నాల’ సాగును ప్రోత్సహించండి

    అనంతగిరి: జిల్లాలో సన్నరకం వరి సాగును ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్‌లో పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ డీఎస్‌ చౌహన్‌, కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌తో కలసి అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సన్న రకం వడ్లకు ప్రభుత్వం ఇస్తున్న రూ.500 బోనస్‌ గురించి రైతులకు వివరించి సాగు విస్తీర్ణం పెరిగేలా చూడాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా అమలయ్యే విధంగా చూడాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. రాజీవ యువ వికాసం పథకం ద్వారా యువతకు ఉపాధి కల్పించాలని పేర్కొన్నారు. అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరుపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. రైతు భరోసా, రుణమాఫీ పథకాలపై ఆరా తీశారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని.. విద్యార్థుల్లో మానసిక వికాసాన్ని పెంపొందించేందుకు కృషి చేయాలన్నారు. భూ భారతి చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. సమావేశంలో ఎస్పీ నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్లు లింగ్యా నాయక్‌, సుధీర్‌, సబ్‌ కలెక్టర్‌ ఉమాశంకర్‌ ప్రసాద్‌, కడా ప్రత్యేక అధికారి వెంకట్‌ రెడ్డి, ఆర్‌డీఓ వాసుచంద్ర, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. అనంతరం వికారాబాద్‌ పట్టణం వెంకటేశ్వర కాలనీలోని 54 నంబర్‌ రేషన్‌ దుకాణాన్ని గురువారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టాక్‌ వివరాలు, కార్డుదారులు బియ్యం తీసుకెళ్తున్నారా తదితర విషయాలను డీలర్‌ను అడిగి తెలుసుకున్నారు.

    అభివృద్ధి పనుల్లో వేగం పెంచండి

    కొడంగల్‌: పట్టణంలో కొత్తగా చేపట్టిన ఆస్పత్రి భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఆదేశించారు. గురువారం నిర్మణ పనులను పరిశీలించారు. పనుల్లో వేగం పెంచాలని సంబంధిత ఇంజనీరింగ్‌ విభాగం అధికారులకు సూచించారు. అనంతరం ఆస్పత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు, ప్రసవాల సంఖ్యను వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత పట్టణంలోని హరే కృష్ణ సంస్థ ద్వారా పాఠశాలలకు అల్పాహారాన్ని సరఫరా చేసే కిచెన్‌ షెడ్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌, ఎస్పీ నారాయణరెడ్డి, తాండూరు సబ్‌ కలెక్టర్‌ ఉమాశంకర్‌ప్రసాద్‌, కడా ప్రతేకాధికారి వెంకట్‌రెడ్డి, డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ ఆనంద్‌, వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ పద్మ, నర్సింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ లిల్లీమేరి, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ చంద్రప్రియ, తహసీల్దార్‌ విజయకుమార్‌, మున్సిపల్‌ కమిషనర్‌ బలరాం నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

    రైతులకు ఇబ్బందులు కలిగించొద్దు

    పరిగి: రైతులు పండించిన పంటలకు ప్రభుత్వం మద్దతు ధర కల్పిస్తూ వారిని ప్రోత్సహిస్తోందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు. గురువారం పరిగి మండలం సుల్తాన్‌పూర్‌లో డీసీఎంఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడారు. ధాన్యం విక్రయించేందుకు వచ్చే రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని కేంద్రం నిర్వాహకులకు సూచించారు. టార్పాలిన్లు, గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ధాన్యం విక్రయించిన రైతుల ఖాతాల్లో ఎప్పటికప్పుడు డబ్బులు జమ చేయాలన్నారు. వర్షాలు కురుస్తున్నందున కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌, కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌, ఎస్పీ నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్‌ లింగ్యానాయక్‌, తాండూర్‌ సబ్‌కలెక్టర్‌ ఉమాశంకర్‌ ప్రసాద్‌, డీఎస్‌ఓ మోహన్‌బాబు, జిల్లా మేనేజర్‌ వెంకటేశ్వర్లు, అధికారులు సారంగపాణి, తహసీల్దార్‌ ఆనంద్‌రావు తదితరులు పాల్గొన్నారు.

    అర్హులకు సంక్షేమ పథకాలు అందాలి

    రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు

Sangareddy

  • ఉద్యాన సాగుకు రాయితీలు
    ● పండ్ల తోటలు, కూరగాయల సాగు, యంత్ర పరికరాలకు రాయితీలు ● జిల్లాలో ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం 27,633 ఎకరాలు

    సదాశివపేట రూరల్‌(సంగారెడ్డి): ఉద్యాన పంటల సాగుపెంపుపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. సమగ్ర ఉద్యాన అభివృద్ధి పథకంలో భాగంగా ప్రభుత్వం ఇందుకోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది. ఉద్యాన పంట సాగువైపు రైతులు మొగ్గు చూపేందుకు వారికి ఆయా పంటల సాగు, యంత్రపరికరాలపై రాయితీలను కల్పించనుంది. పండ్ల తోటలు, పూల సాగు,కూరగాయల సాగుకు సబ్సిడీలతోపాటు యంత్రాలు, యంత్ర పరికరాలు, సూక్ష్మ నీటి సేద్యానికి 2025–2026 ఏడాదికి ఉద్యానవన శాఖ రాయితీలను అందిస్తోంది. జిల్లాలో ఉద్యాన పంటలు 27,633 ఎకరాల విస్తీర్ణంలో సాగవుతుండగా ఈ ఏడాది అదనంగా 1,094 ఎకరాలకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది.

    పండ్ల తోటలకు (హెక్టారుకు)...

    హెక్టారు మామిడి పంటకు రూ. 19,200, నిమ్మ రూ. 19,200, జామ రూ.19,200,అరటి రూ. 16,800, బొప్పాయి రూ. 7,200, డ్రాగన్‌ ఫ్రూట్‌ రూ. 64,800, దానిమ్మ రూ.19,200, ముదురు మామిడి తోటల పునరుద్ధరణకు రూ. 9,600ను ప్రోత్సాహకాన్ని అందజేయనున్నారు.

    కూరగాయల పంటలకు (ఎకరాకు)

    టమాటా పంట రూ. 9,600, వంగ రూ. 9,600, క్యాబేజీ రూ. 9,600, క్యాలీఫ్లవర్‌ రూ. 9,600, మిర్చి నారుకు రూ. 9,600ల సబ్సిడీ ఇవ్వనున్నారు. ప్లాస్టిక్‌ మల్చింగ్‌ వేసుకునే రైతులకు ఎకరాకు రూ. 8 వేలు, తీగజాతి కూరగాయల సాగు శాశ్వత పందిళ్ల నిర్మాణం కోసం ఎకరానికి రూ.లక్ష, పూల రైతులకు ఎకరాకు రూ. 8 వేలు రాయితీగా అందించనుంది.

    ఆయిల్‌పామ్‌ సాగుకు...

    రాష్ట్రంలో ఆయిల్‌పామ్‌ సాగును పెంచాలనే లక్ష్యంతో ఎకరాకు మూడేళ్ల బిందు సేద్యంతో కలిపి రూ.50,918లను సబ్సిడీ రూపంలో అందజేస్తుంది. ఈ ఏడాది ఆయిల్‌పామ్‌ సాగు విస్తీర్ణాన్ని 3,050 ఎకరాలకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది.

    యంత్రాలు...

    ● ఉద్యాన పంటల సాగుకు 20 హెచ్‌పీ ట్రాక్టరుకు రూ. 2.45 లక్షల సబ్సిడీ, పవర్‌టిల్లర్‌కు రూ. లక్ష,

    ● పవర్‌ వీడర్‌కు రూ.75వేలు, బ్రష్‌ కట్టర్స్‌ రూ. 25 వేల సబ్సిడీని అందజేయనున్నారు.

    సూక్ష్మ నీటి సేద్యం...

    సద్వినియోగం చేసుకోవాలి

    ప్రభుత్వం అందజేస్తున్న రాయితీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి. ఉద్యాన పంటలతోపాటు కూరగాయల సాగుకు, ఇతర పంటల సాగుకు ప్రోత్సాహం అందుతుంది. ఉద్యాన పంటలసాగు ద్వారా రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. డ్రిప్‌ను కూడా సబ్సిడీపై అందజేస్తాం. ఆయిల్‌పామ్‌ సాగును విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందించాం.

    –సోమేశ్వర్‌ రావు, ఉద్యాన, పట్టు పరిశ్రమల జిల్లా అధికారి, సంగారెడ్డి

    ప్రైమ్‌మినిస్టర్‌ క్రిషి సించాయి యోజన పథకం కింద పండ్ల తోటలతోపాటు కూరగాయలకు, మిరప, ఆయిల్‌పామ్‌ సాగుకు బిందు,తుంపర సేద్యం చేసేందుకు అవసరమైన పరికరాలను కూడా రాయితీపై అందించనున్నారు. ఎస్సీ,ఎస్టీలకు 100% బీసీ, సన్న, చిన్నకారు రైతులకు 90%, ఇతర రైతులకు 80% రాయితీ ఇవ్వనున్నారు.

  • ‘ఉపాధి’లో మరింత పారదర్శకత
    ● ఉపాధి పర్యవేక్షణకు కమిటీలు ● ఐదుగురు సభ్యులతో వీఎంసీల ఏర్పాటు ● 619 గ్రామ పంచాయతీల్లో ఉపాధి అమలు

    సంగారెడ్డి జోన్‌: గ్రామీణ ప్రాంతాల్లోని వలసలు నివారించేందుకు స్థానికంగా ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో అప్పటి యూపీఏ ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ పథకాన్ని క్షేత్రస్థాయిలో పారదర్శకంగా పకడ్బందీగా అమలు చేస్తున్నాయి. గ్రామాల్లో కొనసాగుతున్న ఉపాధి హామీ పనులను పర్యవేక్షించి మరింత పారదర్శకంగా అమలు చేసేందుకు రాష్ట్రప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో వేలాదిమంది సద్వినియోగం చేసుకుని, ఆర్థికంగా బలోపేతం అవుతున్నారు.

    ప్రతి గ్రామంలో వీఎంసీ కమిటీ ఏర్పాటు

    జిల్లాలో ఉపాధి హామీ పథకం అమలవుతున్న ప్రతీ గ్రామంలో విజిలెన్స్‌ మానిటరింగ్‌ కమిటీ (వీఎంసీ)లను ఏర్పాటు చేశారు. కమిటీలో ఆ గ్రామంలో పనిచేసే ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు, అంగన్‌వాడీ టీచర్‌, స్వయం సహాయక సంఘాల సభ్యురాలు, రిసోర్స్‌ పర్సన్‌, యువత సభ్యులుగా ఉండే విధంగా ఏర్పాటు చేశారు. జిల్లాలో 619 గ్రామపంచాయతీలో ఉపాధి హామీ పథకం అమలు అవుతుంది. ప్రస్తుతం ఆయా గ్రామ పంచాయతీలలో పనులు జోరుగా సాగుతున్నాయి.

    రాష్ట్ర అధికారులకు కమిటీల నివేదికలు

    గ్రామాలలో ఏర్పాటుచేసిన వీఎంసీ కమిటీల నివేదికలను మండల అధికారులు జిల్లా అధికారులకు పంపించారు. జిల్లా అధికారులు పూర్తి నివేదికలు సిద్ధం చేసి రాష్ట్ర అధికారులకు పంపించారు. ఆరు నెలలపాటు ఈ కమిటీలు ఉపాధిలో ప్రాతినిధ్యం వహించనున్నాయి.

    కమిటీ సభ్యుల తనిఖీలు, పర్యవేక్షణ

    ఈ పథకంలో చేపట్టిన పనులకు సామాజిక తనిఖీ నిర్వహించి అవకతవకలను గుర్తించేది. దాంతోపాటే గ్రామస్థాయిలో ఏర్పాటుచేసిన వీఎంసీలు ఉపాధి పనులను ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టి పర్యవేక్షించనున్నారు. తనిఖీల్లో భాగంగా చేపట్టిన పనిపేరు, హాజరైన కూలీల సంఖ్య, పనులకు సంబంధించిన రికార్డులు, అధికారులు ఇచ్చిన కొలతల ప్రకారం పనులు చేపట్టారా లేదా, చేపట్టిన పనుల్లో నాణ్యత, మాస్టర్‌లతోపాటు రిజిస్టర్ల తనిఖీ చేపట్టనున్నారు. కమిటీల పర్యవేక్షణతో చేపట్టే పనిలో పారదర్శకత పెంపొందనుంది. అంతేకాకుండా పనులలో నాణ్యత పెంపొంది అవకతవకలకు తావు లేకుండా పనులు కొనసాగనున్నాయి.

  • కష్టం.. కన్నీళ్ల పాలు

    జోగిపేట (అందోల్‌)/హత్నూర(సంగారెడ్డి)/సంగారెడ్డి టౌన్‌:

    జిల్లా వ్యాప్తంగా బుధవారం రాత్రి నుంచి కురిసిన అకాల వర్షాలకు పలు మండలాల్లో ధాన్యం తడిసిపోయింది. పలుమండలాల్లో కొనుగోలు కేంద్రాలవద్ద, రోడ్లమీద, కల్లాలో ఆరబెట్టిన ధాన్యపు రాసులు తడిసిముద్దయ్యాయి. సంగారెడ్డి, కంది, కొండాపూర్‌, పుల్కల్‌ , చౌటకూరు, హత్నూర, అందోల్‌, జోగిపేట మండలాల్లోని పలు గ్రామాల్లో ధాన్యం పూర్తిగా తడిసిపోగా కొన్ని చోట్ల వర్షపు నీటిలో కొట్టుకుపోయింది. సింగూరు డ్యామ్‌ వెళ్లే దారిలో ఎటు చూసినా తడిసిన ధాన్యమే కనిపించింది. ధాన్యపు రాసులపై ప్లాస్టిక్‌, టార్పాలిన్‌ కవర్లు కప్పి ఉంచినా ప్రయోజనం లేకపోయింది. జోగిపేటలో సుమారు 12 లారీల ధాన్యం తడిసిముద్దయిపోయింది. కల్లాలో కొన్ని చోట్ల ధాన్యం మొలకలు వచ్చి కనిపించింది. జోగిపేట మార్కెట్‌ కార్యదర్శి సునీల్‌తో పాటు కేంద్రం నిర్వాహకులు తడిసిన ధాన్యంను పరిశీలించారు. తడిచిపోయిన ధాన్యాన్ని చూసి రైతులు విలపిస్తున్నారు. ఆరుగాలం పనిచేసిన కష్టమంతా ఒక్క వర్షానికే నష్టంపోవడం తలచుకుని దైన్యంగా మిగిలిపోయారు. ఇప్పటికై నా కొనుగోలు కేంద్రాల వద్ద తడిసిన ధాన్యంతోపాటు జాప్యం లేకుండా కొనుగోళ్లు చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

    – సాక్షి, స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్‌, సంగారెడ్డి

  • 100 రోజులకు చేరిన డంప్‌యార్డ్‌ నిరసన

    జిన్నారం(పటాన్‌చెరు): గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని డంపింగ్‌యార్డ్‌ ఏర్పాటును నిరసిస్తూ చేపట్టిన నిరసన దీక్షలు గురువారం 100 రోజులకు చేరాయి. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ...స్థానికంగా ఆందోళనకారులు చేపడుతున్న దీక్షలకు ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం అన్యాయమన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం దిగిరావాల న్నారు. ప్రజాపాలనలో ఇలాంటి దుస్థితి నెలకొనడంపై విచారం వ్యక్తం చేస్తున్నామన్నారు. ప్రభుత్వం డంపింగ్‌యార్డ్‌ ఏర్పాటు రద్దు చేస్తున్నట్లు ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.

  • అనుమతి లేకుండా నిర్మిస్తే చర్యలే
    ● అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ ● బోరుపట్లలో పరిశ్రమల నిర్మాణాలను పరిశీలించిన జిల్లా అధికారుల బృందం

    హత్నూర (సంగారెడ్డి): అనుమతులు లేకుండా భవన నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్ప వని అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ పరిశ్రమల ప్రతినిధులను హెచ్చరించారు. హత్నూర మండలం బోరుపట్ల గ్రామ శివారులోని ఎపిటోరియా పరిశ్రమ, నూతనంగా నిర్మిస్తున్న తెరనియం బైలోజీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పరిశ్రమలపై స్థానికులు ప్రజావాణిలో ఫిర్యాదు చేయడంతో అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, జిల్లా పంచాయతీ అధికారి సాయి బాబా, నీటిపారుదల శాఖ ఎస్‌ఈ ఏస య్య, డీఈ రవికుమార్‌, కాలుష్య నియంత్రణ మండలి గీతతో కూడిన అధికారుల బృందం ఆ పరిశ్రమల అక్రమ నిర్మాణాలను గురువారం పరిశీలించింది. ఈ సందర్భంగా చంద్రశేఖర్‌ మాట్లాడుతూ...పరిశ్రమలు నిర్మాణాలు చేపడితే ముందుగా అనుమతులు తీసుకోవాలన్నారు. ఇప్పటికే ఎపిటోరియా పరిశ్రమకు మూడుసార్లు నోటీసులు ఇచ్చినా ఇప్పటివరకు స్పందించలేదని మండిపడ్డారు. రెండు రోజుల్లో నోటీసులకు వివరణ ఇవ్వకపోతే వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు.

  • పారదర్శకంగా పరిహారం చెల్లింపు
    కలెక్టర్‌ వల్లూరు క్రాంతి

    సంగారెడ్డి జోన్‌: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనుల్లో భూములు కోల్పోయిన రైతులకు అందించే పారదర్శకంగా పరిహారం చెల్లించాలని కలెక్టర్‌ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టరేట్‌లో గురువారం వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ క్రాంతి మాట్లాడుతూ...రీజినల్‌ రింగ్‌ రోడ్డు విస్తరణ పనులు వేగవంతం చేయాలన్నారు. రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు పరిహారం త్వరితగతిన అందించి, ప్రతీ రైతుకు న్యాయం చేయాలని సూచించారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టుపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. సర్వే ప్రక్రియ నుంచి పరిహారం చెల్లింపు వరకు ప్రతీదశలో అధికారులే పూర్తి బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. మార్కెట్‌ ధర ప్రకారం పరిహారం నిర్ణయించాలన్నారు. సమావేశంలో రీజినల్‌ అధికారి శివశంకర్‌, జిల్లా అదనపు కలెక్టర్‌ మాధురి, ఆర్డీఓ రవీందర్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా అదనపు కలెక్టర్లు, యాదాద్రి భువనగిరి జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

  • సాంకేతిక నైపుణ్యత పెంపొందించుకోవాలి
    ఎస్పీ పరితోశ్‌ పంకజ్‌

    సంగారెడ్డి జోన్‌: మారుతున్న కాలానికనుగుణంగా ప్రతి ఒక్కరూ సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని, విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరచాలని ఎస్పీ పరితోశ్‌ పంకజ్‌ సూచించారు. ఎస్పీ కార్యాలయంలో వివిధ పోలీస్‌ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న టెక్నికల్‌ సిబ్బందికి గురువారం ఒకరోజు శిక్షణ తరగతి నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఎస్పీ పరితోశ్‌ మాట్లాడుతూ... ఎఫ్‌ఐఆర్‌ మొదలుకుని డేటా ఎంట్రీ, వివిధ రకాల కేసుల నమోదులో ఏమైనా సందేహాలుంటే శిక్షణ తరగతుల ద్వారా తెలుసుకోవచ్చన్నారు. వర్టికల్‌ విభాగంలో జిల్లాను ముందంజలో ఉండే విధంగా చూడాలని చెప్పారు. రాష్ట్ర ప్రజలకు మెరుగైన సేవలు, నాణ్యమైన నేరపరిశోధన చేసేందుకు వివిధ రకాల యాప్‌లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. సమావేశంలో వర్టికల్‌ మానిటరింగ్‌ అధికారి, జహీరాబాద్‌ డీఎస్పీ రామ్మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

  • తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి
    ఎమ్మెల్యే సునీతారెడ్డి

    హత్నూర (సంగారెడ్డి): అకాల వర్షంతో తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి డిమాండ్‌ చేశారు. హత్నూర మండలం దౌలాపూర్‌ దౌల్తాబాద్‌ ధాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం ఎమ్మెల్యే సునీతారెడ్డి సందర్శించి తడిచిన ధాన్యాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...ధాన్యం తెచ్చి రోజులు గడిచినా కేంద్రాల వద్ద కొనుగోళ్లు చేయకపోవడంతోనే వర్షాలకు ధాన్యం తడిచిపోయిందన్నారు. తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని లేకుండా ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.

Siddipet

  • సరికొ
    నేత్రపర్వం.. తెప్పోత్సవం
    మిన్నంటిన శ్రీరామ నామస్మరణతో గురువారం రాత్రి కోమటిచెరువులో తెప్పోత్సవం నేత్రపర్వంగా సాగింది. గంగమ్మ ఒడిలో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా అందంగా అలంకరించిన బోటులో హనుమంతుని ఉత్సవ విగ్రహాన్ని ప్రతిష్ఠించి చెరువు అంతా తిప్పారు. అంతకుముందు రావిచెట్టు హనుమాన్‌ దేవాలయం నుంచి పట్టణ ప్రధాన వీధుల గుండా కోమటిచెరువు వరకు శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి చెరువులో తెప్పోత్సవం వైభోవంగా చేపట్టారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే హరీశ్‌రావు, పీఠాధిపతులు దుర్గాప్రసాద్‌ స్వామీజీ, మాలధారులు పెద్ద ఎత్తున పొల్గొని తరించారు. – సిద్దిపేటజోన్‌
    ● పంట మార్పిడితోనే అధిక లాభాలు ● నేపియర్‌ గడ్డి సాగుతో45 రోజుల్లోనే కోత ● ఎకరం పంటకు రూ.70వేల వరకు ఆదాయం : కలెక్టర్‌ మనుచౌదరి

    అక్కన్నపేట(హుస్నాబాద్‌): వరి, పత్తి, మొక్కజొన్న పంటల సాగు కాకుండా సరికొత్తగా సాగు చేసేలా ప్రతి రైతు ఆలోచించాలని కలెక్టర్‌ మనుచౌదరి అన్నారు. మండల పరిధిలోని కుందనవానిపల్లిలో గురువారం ప్రసిద్ధ రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో కృషికల్ప సహకారంతో గండిపల్లి, కుందనవానిపల్లి గ్రామ రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు. కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా సుమారు 40 రైతు ఉత్పత్తిదారుల సంఘాలున్నాయన్నారు. అందులో అక్కన్నపేట మండలంలోని ప్రసిద్ధ, సహస్ర సంఘాల ద్వారా సరికొత్త పంట సాగు వైపు దృష్టిసారించామన్నారు. పంట మార్పిడితోనే అధిక లాభాలు వస్తాయన్నారు. కృషికల్ప సహకారంతో నేపియర్‌ గడ్డి సాగుకు రైతులందరూ ఆలోచించుకోవాలన్నారు. ఈ గడ్డి సాగు కేవలం 45రోజులోనే కోతకు వస్తుందన్నారు. నేపియర్‌ గడ్డి ఒక ఎకరంలో సాగు చేస్తే దాదాపు రూ.70వేల వరకు ఆదాయం వస్తుందన్నారు. ఈ గడ్డితో బయోగ్యాస్‌ తయారు చేస్తారన్నారు. గండిపల్లి, కుందనవానిపల్లి గ్రామాల్లో సుమారు 300ఎకరాల్లో ఈ గడ్డి సాగు చేసేలా రైతులు ముందుకు రావాలన్నారు. ఈ ప్రాంతంలోనే రూ.50కోట్ల వ్యయంతో బయోగ్యాస్‌ తయారీ కంపనీ ఏర్పాటు చేస్తారన్నారు. దీంతో ఈ ప్రాంత యువతకు ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి రాధిక, హార్టికల్చర్‌ అధికారి సువర్ణ, కృషికల్ప వ్యవస్థాపకులు పాటిల్‌, బయోగ్యాస్‌ కంపెనీ సీఈఓ గుప్తా, హుస్నాబాద్‌ వ్యవసాయ శాఖ ఏడీఏ శ్రీనివాస్‌, మండల వ్యవసాయ అధికారి తస్లీమా సుల్తానా, ప్రసిద్ధ రైతు ఉత్పత్తిదారుల సంఘం చైర్మన్‌ ఏలేటి స్వామిరెడ్డి, నాయకులు, రైతులు పాల్గొన్నారు.

    నాణ్యమైన ఉచిత విద్య

    సిద్దిపేటరూరల్‌: జిల్లాలోని గురుకుల పాఠశాలలో నాణ్యమైన ఉచిత విద్య అందుతోందని కలెక్టర్‌ మనుచౌదరి అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో 6 మైనారిటీ గురుకులాలకు సంబంధించి 5వ తరగతి ప్రవేశాల కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం ఇటీవలే కాస్మోటిక్‌ చార్జీలు పెంచిందని, 2025– 26 సంవత్సరానికి గాను 5వ తరగతిలో మైనార్టీ గురుకులాల్లో రిజిస్ట్రేషన్‌ చేసుకుని ప్రవేశం పొందాలన్నారు. ఈ అవకాశాన్ని మైనారిటీ విద్యార్థులు తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో రీజినల్‌ కో ఆర్డినేటర్‌ సుధారాణి, జిల్లాలోని మైనార్టీ పాఠశాలల ప్రిన్సిపాల్స్‌ పాల్గొన్నారు.

  • ప్రగతి బాటలో కీలక అడుగు
    ఉమ్మడి మెదక్‌ జిల్లాకు భారీ ప్రాజెక్ట్‌

    ప్రగతి బాటలో మరో కీలక అడుగు పడింది. ట్రిపుల్‌ఆర్‌, జాతీయ రహదారుల సమాహారం, రైల్వేలైన్‌ ఇతర సానుకూల అంశాల వల్ల ఉమ్మడి మెదక్‌ జిల్లాలో మరో భారీ ప్రాజెక్ట్‌ నిర్మాణానికి రంగం సిద్ధమైంది. గజ్వేల్‌ నియోజకవర్గంలోని మనోహరాబాద్‌ మండలం పరికిబండ శివారులో రూ.996కోట్ల వ్యయంతో మల్టీ మోడల్‌ లాజిస్టిక్‌ పార్కు నిర్మాణానికి కేంద్రం టెండర్లను పిలిచింది. ఇందుకోసం సుమారు 350ఎకరాల భూసేకరణ కూడా పూర్తయ్యింది.

    గజ్వేల్‌: మల్టీ మోడల్‌ లాజిస్టిక్స్‌ పార్కు(బహుళవిధ సరుకు రవాణా సేవల సముదాయం) నిర్మాణానికి మార్గం సుగమమైంది. కేంద్ర ప్రభుత్వం రెండున్నరేళ్ల క్రితం 16 లాజిసిక్స్‌ పార్కులను మంజూరు చేసింది. అందులో మనోహరాబాద్‌ మండలం పరికిబండ శివారులో నిర్మించనున్న పార్కు ఒకటి. రూ.996కోట్ల అంచనాల వ్యయంతో ఎన్‌హెచ్‌ఏఐ (నేషనల్‌ హైవే అథారిటీ అథారిటీ ఆఫ్‌ ఇండియా) అనుబంధ సంస్థ అయిన నేషనల్‌ హైవేస్‌ మేనేజ్‌మెంట్‌ లిమిటెడ్‌ (ఎన్‌హెచ్‌ఎల్‌ఎమ్‌ఎల్‌) టెండర్లను పిలిచింది. ఈమేరకు పత్రికల్లో ప్రకటనలు సైతం వెలువడ్డాయి. ఈ పనులను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టడానికి నిర్ణయించారు. వేల కోట్ల పెట్టుబడుల సమీకరణే లక్ష్యంగా ఈ పార్కు ఏర్పాటు చేయాల్సి ఉన్నది. ప్రత్యక్షంగా లక్ష, పరోక్షంగా మరో రెండు లక్షల మందికి ఉపాధి కల్పనే లక్ష్యంగా ఈ లాజిస్టిక్‌ పార్కును ఏర్పాటు చేస్తున్నారు.

    మచిలీపట్నం పోర్టుకు నేరుగా

    మల్టీ మోడల్‌ లాజిస్టిక్స్‌ పార్కు అందుబాటులోకి వస్తే ఇక్కడ సరుకు రవాణా, సమీకరణ, పంపిణీ లాంటి సేవలు అందుబాటులోకి వస్తాయి. ఇక్కడి నుంచి ఏపీలోని మచిలీపట్నం పోర్టుకు నేరుగా సరుకుల ఎగుమతులు, దిగుమతులు చేసుకునేందుకు వీలుంటుంది. ఇందుకోసం త్వరలోనే నిర్మించనున్న ట్రిపుల్‌ఆర్‌ నుంచి ఉమ్మడి నల్గొండ జిల్లా మీదుగా మచిలీపట్నం వరకు రోడ్డు కనెక్టివిటీ అవకాశాలు ఉండటంతో ఈ ప్రతిపాదన ఆమోదం పొందడానికి అవకాశం కలిగింది.

    ఉమ్మడి మెదక్‌ జిల్లాకు మహర్దశ

    లాజిస్టిక్‌ పార్కు నిర్మాణం వల్ల ఉమ్మడి మెదక్‌ జిల్లాకు మహర్దశ పట్టనుంది. హైదరాబాద్‌ నగరానికి సమీపంలో ఉన్న ఈ జిల్లా వస్తు రవాణా రంగంలో హబ్‌గా మారితే.. దీనికి అనుబంధంగా మరెన్నో పరిశ్రమలకు ఏర్పాటుకు అడుగులు పడనున్నాయి. కొత్తపల్లి–మనోహరాబాద్‌ రైల్వేలైన్‌ కారణంగా గజ్వేల్‌లో ఇప్పటికే గూడ్స్‌ రైళ్లు నడుస్తుండగా, ఎరువుల రేక్‌ పాయింట్‌ విజయవంతంగా నడుస్తోంది. లాజిస్టిక్‌ పార్కు ఏర్పాటుతో మరింత అభివృద్ధి చెందనునుంది. దీని ద్వారా పరోక్షంగా, ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు భారీగా పెరగనున్నాయి.

    ఎన్నో అనుకూలతలు..

    ఎన్నో అనుకూలతల కారణంగా మల్టీమోడల్‌ లాజిస్టిక్‌ పార్కు నిర్మాణానికి పరికిబండ శివారు ప్రాంతాన్ని ఎంచుకున్నారు. ఇక్కడ లాజిస్టిక్‌ పార్కు ఏర్పాటైతే.. ఈ ప్రాంతానికి 44వ నంబర్‌ ఆరువరుసల జాతీయ రహదారి, కొత్తగా నిర్మాణం కానున్న ట్రిపుల్‌ఆర్‌కు సమీపంలో ఉండటం, ఇక్కడి నుంచి హైదరాబాద్‌, కొత్తపల్లి రైల్వేలైన్‌లు అనుసంధానం కావడం, హైదరాబాద్‌లోని శంషాబాద్‌ అంతర్జాతీయ విమనాశ్రయం కూడా చేరువలో ఉండటం కలిసి వచ్చింది.

    మల్టీ మోడల్‌ లాజిస్టిక్‌ పార్కునిర్మాణానికి సన్నాహాలు

    పరికిబండ శివారులో350ఎకరాల భూసేకరణ

    రూ.996కోట్లతో టెండర్లకు ఆహ్వానం

    లక్షలాదిమందికి ఉపాధి కల్పనే లక్ష్యం

  • రాయపోల్‌లో చిరుత కలకలం

    దుబ్బాకటౌన్‌: రాయపోల్‌ మండలం వడ్డేపల్లిలో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. వరుస దాడులతో గ్రామస్తులు, రైతులు భయాందోళన చెందుతున్నారు. ఇటీవల పొలాల వద్ద రెండు కుక్కలపై దాడి చేసి చంపడంతో ఆందోళనకు గురవుతున్నారు. గడిచిన 4 నెలల వ్యవధిలో చిరుత మూడు సార్లు కనిపించడంతో తీవ్ర చర్చనీయాంశమైంది. రాత్రివేళల్లో, వేకువజామున పొలాలకు వెళ్లేందుకు రైతులు, కూలీలు జంకుతున్నారు. మరిన్ని దాడులు జరగకుండా చిరుతను బంధించాలని రైతులు కోరుతున్నారు.

    ఆచూకి కోసం..

    దుబ్బాక ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ సందీప్‌ కుమార్‌ ఆధ్వర్యంలో చిరుత పులి ఆచూకి కోసం అటవీ శాఖ అధికారులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. చిరుత పులిని చూసిన రైతుల నుంచి వివరాలు సేకరించారు. కనబడిన ప్రదేశాన్ని పరిశీలించి పాద ముద్రలను పరిశీలించి చిరుత పులేనని నిర్ధారించారు. చిరుత పులి జాడ కోసం అడవిలో అనుమానిత ప్రదేశాల్లో అధికారులు ట్రాప్‌ కెమెరాలు ఏర్పాటు చేశారు. దీంతో చిరుత కదలికలను సులభంగా తెలుసుకోవచ్చని చెబుతున్నారు.

    ఒకే చోట ఉండదు

    చిరుత కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. చిరుత ఎప్పుడూ ఒకే చోట ఉండదు. రైతులు రాత్రి వేళ పొలాల వద్ద ఉండవద్దు. పశువులను సైతం ఇంటి వద్దే ఉంచాలి. పశువుల మేత కోసం ఒంటరిగా అడవిలోకి వెళ్లవద్దు. చిరుత కనిపిస్తే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలి.

    – సందీప్‌ కుమార్‌,

    ఫారెస్టు రేంజ్‌ ఆఫీసర్‌, దుబ్బాక

    గ్రామ సమీప పొలాల్లో సంచారం

    వరుస దాడులతో ప్రజల్లో భయాందోళన

    జాడ కోసం చర్యలు ముమ్మరం

    ట్రాప్‌ కెమెరాల ఏర్పాటు

    అధికారుల సూచనలు

    వ్యవసాయ పొలాలు అడవికి దగ్గరగా ఉండడంతో రైతులు అప్రమత్తంగా ఉండాలి.

    పులి కనిపిస్తే వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారమివ్వాలి.

    పొలాల చుట్టూ విద్యుత్‌ కంచెను

    ఏర్పాటు చేయవద్దు.

    పిల్లలు ఎట్టి పరిస్థితుల్లోనూ అడవి దగ్గరగా ఉన్న పాలాల్లో ఒంటరిగా తిరుగవద్దు. రాత్రి వేళ రైతులు పొలాల వద్ద ఉండవద్దు.

  • అంబేడ్కర్‌ జీవితం అందరికీ ఆదర్శం

    ములుగు(గజ్వేల్‌): అంబేడ్కర్‌ జీవితం అందరికీ ఆదర్శమని, ఆయన రచించిన రాజ్యాంగం వల్లే దళితులకు, అణగారిన వర్గాలకు హక్కులు దక్కుతున్నాయని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. ములుగు మండలం బస్వాపూర్‌లో గురువారం ఎంపీ రఘునందన్‌ రావుతో కలసి అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్‌ జీవితం భావితరాలకు ఆదర్శమన్నారు. మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేయడమే కాకుండా వారి జీవితాల నుంచి స్ఫూర్తి పొందాలన్నారు. దేశంలోని ప్రతి పౌరుడు స్వేచ్ఛగా జీవిస్తున్నాడంటే అది అంబేడ్కర్‌ రచించిన రాజ్యాంగ ఫలమే అన్నారు. ఎంపీ రఘునందన్‌ రావు మట్లాడుతూ కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నింపి, అక్షరాన్ని ఆయుధంగా మలిచి, జ్ఞానాన్ని ప్రపంచ ఎల్లలు దాటించిన మహోన్నత మూర్తి బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ అన్నారు. ప్రజలు అనుభవిస్తున్న రిజర్వేషన్లు అంబేడ్కర్‌ వల్లే వచ్చాయన్నారు. అంబేద్కర్‌ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ప్రముఖ గాయకుడు ఏపూరి సోమన్న అంబేడ్కర్‌పై పాడిన పాటలు సభికులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు భైరీ శంకర్‌ ముదిరాజ్‌, బీజెపీ, కాంగ్రెస్‌ మండల అధ్యక్షులు లక్ష్మణ్‌గౌడ్‌, శ్రీనివాస్‌గుప్తా, ఎమ్మార్పీఎస్‌ జిల్లా ఉపాధ్యక్షుడు మహేష్‌, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

    రాజ్యాంగంతోనే దళితులకు హక్కులు

    ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకఅధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ

  • మా భూములకు హక్కులు కల్పించండి

    అక్కన్నపేట(హుస్నాబాద్‌): మా భూములకు హక్కులు కల్పించాలంటూ రైతులు నిరసన తెలిపారు. మండల పరిధిలోని నందారంలో గురువారం భూ భారతి చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సులో రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుమారు 930 ఎకరాల వరకు పచ్చని పంట పొలాలన్నీ సీలింగ్‌ భూములుగా ఉండడంతో అమ్మకాలు, కొనుగోలు లేక ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. గతంలో అనేకసార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కావడంలేదన్నారు. బ్యాంకులు సైతం రుణాలు ఇవ్వడంలేదన్నారు. తక్షణం కలెక్టర్‌ జోక్యం చేసుకుని సమస్య పరిష్కరించాలని, లేదంటే ఆందోళనలు చేస్తామని రైతులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రైతులకు అధికారులు హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. అనంతరం సదస్సులో పాల్గొన్న కొహెడ మండల తహసీల్దార్‌ సురేఖకు వినతిపత్రం అందజేశారు.

    భూ భారతి రెవెన్యూ సదస్సులో రైతుల నిరసన

  • సప్లిమెంటరీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

    సిద్దిపేటరూరల్‌: ఇంటర్‌ అడ్వాన్స్‌ సంప్లిమెంటరీ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు అదనపు కలెక్టర్‌ గరిమా అగర్వాల్‌ తెలిపారు. ఆ దిశగా అధికారులకు దిశానిర్దేశం చేశారు. గురువారం గరిమా అగర్వాల్‌ అధ్యక్షతన పరీక్షల నిర్వాహణపై సమావేశం నిర్వహించారు. గరిమా అగర్వాల్‌ మాట్లాడుతూ ఈనెల 22 నుంచి 29వ తేది వరకు జరగనున్నాయన్నారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు మొదటి సంవత్సరం విద్యార్థులకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సెకండియర్‌ విద్యార్థులకు జరగనున్నాయని తెలిపారు. మొత్తం 27 పరీక్షా కేంద్రాలలో పరీక్షలు జరగనున్నాయన్నారు. సమావేశంలో రెవెన్యూ, వైద్య, మిషన్‌ భగీరథ, పోలీస్‌, విద్యుత్‌, రవాణా, పోస్టల్‌, అధికారులు పాల్గొన్నారు.

    అదనపు కలెక్టర్‌ గరిమా అగర్వాల్‌

Rangareddy

  • భవిష్యత్‌ తరాలకు మెరుగైన విద్యావకాశాలు

    మంచాల: భవిష్యత్‌ తరాలకు మెరుగైన విద్యావకాశాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి కార్యదర్శి అజిత్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలోనే ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దనున్న ఆరుట్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలను గురువారం సాయంత్రం ఆయన రాష్ట్ర విద్యా కమిషన్‌ చైర్మన్‌ ఆకునూరి మురళితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమీక్ష సమావేశంలో అజిత్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆరుట్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని పేర్కొన్నారు. పాఠశాలలో విద్యా ప్రమాణాలు పెంచుతామన్నారు. ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలి పారు. కార్యక్రమంలో తెలంగాణ విద్యా శాఖ సభ్యులు ప్రొఫెసర్‌ విశ్వేశ్వర రావు, చారకోన వెంకటేశ్‌, జోష్నా రెడ్డి, డీఈఓ సుశీందర్‌రావు, మండల విద్యాధికారి రాందాస్‌, ఆరుట్ల ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గిరధర్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Medak

  • సంఘాల రుణాలు స్వాహా!

    మహిళా సాధికారత కోసం ప్రారంభించిన స్వయం సహకార సంఘం రుణాలు పక్కదారి పడుతున్నాయి. గ్రామస్థాయి స్వయం సహాయక సంఘం నాయకురాలు సుమారు రూ. 75 లక్షలు స్వాహా చేసినట్లు తెలిసింది. ఇందులో బ్యాంకు అధికారుల పాత్ర ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా సమస్య పరిష్కారం కోసం గ్రామస్థాయిలో గుట్టుగా పంచాయితీలు నిర్వహించినప్పటికీ పరిష్కారం దొరకలేదు.

    – పాపన్నపేట(మెదక్‌)

    పాపన్నపేట మండలం పొడిచన్‌పల్లిలో 39 మ హిళా స్యయం సహాయక గ్రూపులు ఉన్నాయి. వీరికి స్థానిక యూకో బ్యాంకు రుణాలు ఇస్తుంటుంది. బ్యాంకు లోన్‌, సీ్త్రనిధి, గ్రామ సంఘం ద్వారా రుణాలు అందుతున్నాయి. ఇందులో భాగంగా ఓ గ్రామ సంఘం నాయకురాలు గ్రూపు సభ్యులకు అందాల్సిన రుణాలను తన సొంతానికి వాడుకున్నట్లు తెలిసింది. అప్పట్లో ఉన్న బ్యాంకు మేనేజర్‌ ఈ తతంగంలో తన వంతు పాత్ర నిర్వహించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయం గ్రూపు సభ్యుల ద్వారా బయటపడటంతో గ్రామ స్థాయిలో పంచాయితీలు పెట్టినట్లు తెలిసింది. అయితే వాటిని చెల్లించడానికి సదరు నాయకురాలు గడువు కోరినట్లు సమాచారం.

    రుణాలు ఎలా బదిలీ చేశారు?

    స్వయం సహాయక గ్రూపులకు రుణాలు మంజూరు కాగానే, బ్యాంకు మేనేజర్లు మైక్రో క్రెడిట్‌ ప్లాన్‌ ద్వారా అందులో సభ్యుల పేర్లు రాసి నేరుగా వారి అకౌంట్లలోకి నిధులు బదిలీ చేయాలి. కానీ ఇక్కడ సభ్యులకు తెలియకుండానే వారి రుణాలు, ఓ గ్రామ స్థాయి నాయకురాలి అకౌంట్లోకి బదిలీ అయ్యాయన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. లేకుంటే సభ్యులకు తెలియకుండా వారి పేరిట రుణాలు తీసుకునే అవకాశం లేదని తెలుస్తుంది. అయితే అప్పట్లో రుణాలు ఇచ్చినప్పుడు ఇక్కడ పని చేసిన బ్యాంకు మేనేజర్‌, ప్రస్తుతం పనిచేస్తున్న మేనేజర్‌కు ఇటీవల ఫోన్‌ చేసి, ఫలాన గ్రూపునకు సంబంధించిన రూ. 5 లక్షలు వెంటనే కట్టించుకోవాలని, లేకుంటే వారి అకౌంట్‌ ఎన్‌పీఏ (నాన్‌ పర్ఫార్మెన్స్‌ అసెట్‌)గా మారుతుందని హెచ్చరించినట్లు సమాచారం. దీంతో అనుమానం వచ్చిన ప్రస్తుత మేనేజర్‌ లోతుగా దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం. ఈ విషయం మహిళా సమాఖ్య అధికారుల దృష్టికి రావడంతో వెంటనే వారు రంగంలోకి దిగి, బ్యాంకు స్టేట్‌మెంట్లు సేకరించే పనిలో పడ్డారు. అలాగే గ్రూపు సభ్యులతో మాట్లాడి వివరాలు రాబడుతున్నారు.

    విచారణ ప్రారంభించాం

    పొడిచన్‌పల్లి స్వయం సహాయక గ్రూపులకు సంబంధించిన రుణాలు పక్కదారి పట్టినట్లు సమాచారం అందింది. వెంటనే జిల్లా అధికారులకు తెలియజేశాం. బ్యాంకు స్టేట్‌మె ంట్లు తీసుకుంటున్నాం. సభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకుంటున్నాం.

    – సాయిలు, ఏపీఎం, పాపన్నపేట

    రూ. 75 లక్షలు పక్కదారి

    గ్రామస్థాయి నాయకురాలు,బ్యాంకు అధికారులపై అనుమానం

    పాపన్నపేట మండలంపొడిచన్‌పల్లిలో ఘటన

    గుట్టు చప్పడు కాకుండా పంచాయితీలు

  • యాంత్రీకరణపై పట్టింపేది?
    సబ్సిడీ యంత్రాలు, పరికరాలు అందక రైతుల ఇబ్బందులు

    2024– 25 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం జిల్లాకు కేవలం రూ. 68 లక్షల నిధులు మంజూరు చేసింది. మార్చి 21వ తేదీన పథకానికి సంబంధించి రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. 31వ తేదీన కార్యక్రమం ముగించింది. కేవలం వారం రోజుల సమయం ఉండటంతో అధికారులు రైతులకు పథకంపై ప్రచారం కల్పించలేకపోయారు. వ్యవసాయ అధికారులు దరఖాస్తులు స్వీకరణ పూర్తి చేసేలోగానే ప్రభుత్వం పథకాన్ని నిలిపివేసింది. దీంతో ఏ ఒక్క లబ్ధిదారుడికి పథకం అందలేదు. అయితే ఈ వానాకాలం సీజన్‌లోనైనా పథకం ద్వారా అర్హులైన వారికి చేయూతనిస్తారో..? లేదో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు.

    అందించే పరికరాలు ఇవే..

    వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద రైతులకు ఎక్కువగా ఉపయోగపడే వాటికి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. నియోజకవర్గానికి ఒక ట్రాక్టర్‌తో పాటు చేతి పంపులు, తైవాన్‌ పంపులు, డ్రోన్లు, రొటోవేటర్లు, విత్తనాలు నాటే మిషన్లు, కేజ్‌వీల్స్‌, కలుపుతీత, గడ్డికోసే యంత్రాలు, పవర్‌ ట్రిల్లర్లు, ట్రాక్టర్లు, పత్తిని మూటకట్టే పరికరాలు ఇవ్వనున్నారు. ఎంపికై న రైతులు సంబంధిత కంపెనీలకు రాయితీ పోనూ మిగితా డబ్బులు డీడీ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది.

    మళ్లీ ప్రారంభించే అవకాశం ఉంది

    ఏడాది మార్చి నెలాఖరులో వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. కొంతమంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. వాటిని పరిశీలించేలోగానే ఆర్థిక సంవత్సరం ముగియడంతో పథకాన్ని క్లోజ్‌ చేసింది. ఒక్క రైతుకు కూడా పథకం అందకుండా పోయింది. ఈ వానాకాలంలో మళ్లీ పథకాన్ని ప్రారంభించే అవకాశం ఉంది.

    – వినయ్‌కుమార్‌, డీఏఓ

    వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగమైన రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన తొమ్మిదేళ్లుగా అటకెక్కింది. 2016లో తొలి విడత నిధులు కేటాయించగా.. తదుపరి కార్యాచరణ కరువైంది. ఏళ్లుగా పథకంపై ఊసే లేకపోవడంతో అన్నదాతలు వ్యవసాయ పనులకు కూలీలు దొరకక, యంత్రాలను అద్దెకు తీసుకుంటూ ఆర్థికంగా ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఇదే క్రమంలో ఈ ఏడాది పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వం ఒక్క రైతుకు కూడా ప్రయోజనం అందించకుండానే వారం రోజుల్లోనే ముగించింది.

    – మెదక్‌ కలెక్టరేట్‌

  • రమణీయం.. రథోత్సవం
    కనుల పండువగా దొంతి జాతర

    శివ్వంపేట(నర్సాపూర్‌): మండల పరిధిలోని దొంతి గ్రామంలో కొలువైన వేణుగోపాలస్వామి ఉత్సవా లు అంగరంగ వైభ వంగా సాగుతున్నాయి. గురు వారం రథోత్సవం కనుల పండువగా నిర్వహించారు. గురువారం తెల్లవారుజామున అర్చకుడు గోపాలకృష్ణ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయం నుంచి గాంధీ చౌరస్తా వరకు పల్లకీ సేవ నిర్వహించారు. అక్కడి నుంచి మహంకాళీ ఆలయం వరకు రథోత్సవం చేపట్టారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ధర్మకర్తలు అమరేందర్‌రెడ్డి, సంజయ్‌రెడ్డి, శ్రావణ్‌కుమార్‌రెడ్డి, పవన్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో ఉత్సవాలు కొనసాగుతున్నాయి. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నా యి. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అల్పాహారం, మాజీ జెడ్పీటీసీ పబ్బ మహేష్‌గుప్తా భక్తులకు వా టర్‌ బాటిల్స్‌ పంపిణీ చేశారు. ఎమ్మెల్యే సునీతారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్‌ సుహాసినిరెడ్డి, కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి రాజిరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేష్‌గౌడ్‌, వివిధ పార్టీల నాయకులు ఉత్సవాల్లో పాల్గొన్నారు.

    ఉత్సవాలకు హాజరైన భక్తజనం