ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం ఉదయం బొంగులూరు గేటు నుంచి గచ్చిబౌలి వైపు వెళ్తున్న కారు అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఒక వ్యక్తి గాయపడ్డాడు. అతడిని వెంటనే తోటి వాహనదారులు ఆస్పత్రికి తరలించారు.