
సాక్షి, విజయవాడ: ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని సీఎం చంద్రబాబు అమలు కాని హామీలు ఇస్తున్నారని వైఎస్సార్‌సీపీ నేత బుద్దా నగేశ్వరరావు మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. 2014 ఎన్నికల్లో చంద్రబాబు 640 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. రెండున్నర సంవత్సరాల పాటు టీడీపీతో అంటకాగిన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నాని విమర్శించారు.
ప్రశ్నిస్తామన్న పవన్ కళ్యాణ్ టీడీపీ ఇసుక దోపిడీలను ఎందుకు ప్రశ్నించ లేదని ధ్వజమెత్తారు. ఓటుకు నోటు కేసులో హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ఆంధ్రా వర్సెస్ తెలంగాణ అంటూ ప్రాంతీయ వాదాన్ని రెచ్చగొడుతున్నారు. పవన్ కళ్యాణ్ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని తిడుతున్నారంటే మీరు టీడీపీని భుజాన వేసుకున్నటేనని అందరికి అర్థ మవుతుంది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశ పట్టిన నవరత్నాలను తెలుగుదేశం పార్టీ కాపీ కొట్టిందన్నారు. చివరి మూడు నెలలు పథకాల పేరుతో టీడీపీ గారడి చేయాలని చూస్తోందని అన్నారు.