Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Some People Have Habit Of Crying: Pm Modi Veiled Jab At Cm Stalin1
కొందరు ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటారు.. స్టాలిన్‌కు మోదీ కౌంటర్‌

రామేశ్వరం: కొంతమందికి కారణం లేకుండానే ఎప్పుడూ ఏడ్చే అలవాటు ఉంటుందంటూ తమిళనాడు సీఎం స్టాలిన్‌పై ప్రధాని నరేంద్ర మోదీ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. తమిళనాడులోని రామేశ్వరంలో జరిగిన బహిరంగ సభ వేదికగా ఆయన ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సీఎం స్టాలిన్ చేసిన ఆరోపణలను ఆయన ఖండిస్తూ.. కేంద్ర ప్రభుత్వం తమిళనాడుకు భారీగా నిధులు కేటాయిస్తోందని, గతంతో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువ నిధులు ఇచ్చామని తెలిపారు.త్రిభాషా విధానంపై స్టాలిన్‌ వ్యాఖ్యలకు మోదీ కౌంటర్‌ ఇస్తూ.. తమిళ నాయకులు నాకు లేఖలు రాస్తుంటారు. ఒక్కరు కూడా మాృతభాష తమిళంలో సంతకం చేయరు. తమిళ భాషను గౌరవించండి.. తమిళంలో సంతకం చేయండి. చాలా రాష్ట్రాల్లో మాృతభాషలో వైద్య విద్యా బోధన జరుగుతోంది. తమిళనాడులోనూ తమిళంలో వైద్య విద్యను అందించాలి. గత దశాబ్దంలో తమిళనాడు అభివృద్ధికి కేంద్రం భారీగా నిధులు కేటాయించాం. రైల్వే ప్రాజెక్టులకు నిధులు గణనీయంగా పెంచాం’’ అని మోదీ చెప్పారు.‘‘తమిళనాడు అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది. 2014 నుంచి అధికంగా తమిళనాడుకు ఇచ్చాం. 2014కు ముందు రైల్వే ప్రాజెక్టుకు ఏటా రూ.900 కోట్లు మాత్రమే వచ్చేవని, ఈ ఏడాది తమిళనాడు రైల్వే బడ్జెట్ రూ.6,000 కోట్లకు పైగా ఉందన్నారు. అభివృద్ధి చెందిన భారత్‌లో తమిళనాడు పాత్ర చాలా గొప్పదన్న మోదీ.. ఈ రాష్ట్రం ఎంత బలంగా ఉంటే మన దేశం అంత వేగంగా అభివృద్ధి చెందుతుందని ప్రధాని మోదీ అన్నారు.

IPL 2025: Gujarat titans vs Sunrisers Hyderabad live updates and highlights2
SRH Vs GT: ఎస్ఆర్‌హెచ్‌కు బిగ్ షాక్‌.. హెడ్ ఔట్‌

IPL 2025 GT vs SRH Live updates: ఐపీఎల్‌-2025లో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌, గుజ‌రాత్ టైటాన్స్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌తున్నాయి. నిల‌క‌డ‌గా ఆడుతున్న కిష‌న్‌, అభిషేక్‌4 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ఎస్ఆర్‌హెచ్ వికెట్ న‌ష్టానికి 37 ప‌రుగులు చేసింది. క్రీజులో ఇషాన్ కిష‌న్‌(11), అభిషేక్ శ‌ర్మ‌(18) ఉన్నారు.ఎస్ఆర్‌హెచ్‌కు బిగ్ షాక్‌.. హెడ్ ఔట్‌టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌కు భారీ షాక్ త‌గిలింది. 8 ప‌రుగులు చేసిన ట్రావిస్ హెడ్ మ‌హ్మ‌ద్ సిరాజ్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. క్రీజులో ఇషాన్ కిష‌న్ వ‌చ్చాడు.ఐపీఎల్‌-2025లో కీల‌క పోరుకు స‌మ‌యం అస‌న్న‌మైంది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌, గుజ‌రాత్ టైటాన్స్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌తున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజ‌రాత్ టైటాన్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.ఈ మ్యాచ్‌లో గుజ‌రాత్ టైటాన్స్ ఓ మార్పుతో బ‌రిలోకి దిగింది. అర్ష‌ద్ ఖాన్ స్ధానంలో వాషింగ్ట‌న్ సుంద‌ర్ తుది జ‌ట్టులోకి వ‌చ్చాడు. సిమ‌ర్జీత్ సింగ్ స్దానంలో జ‌య‌దేవ్ ఉన‌ద్క‌ట్ వ‌చ్చాడు. ఎస్ఆర్‌హెచ్ కూడా ఓ మార్పుతో బ‌రిలోకి దిగింది.తుది జ‌ట్లుసన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీప‌ర్‌), అనికేత్ వర్మ, కమిందు మెండిస్, పాట్ కమిన్స్(కెప్టెన్‌), జీషన్ అన్సారీ, జయదేవ్ ఉనద్కట్‌, మహమ్మద్ షమీగుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): సాయి సుదర్శన్, శుభమన్ గిల్(కెప్టెన్‌), జోస్ బట్లర్(వికెట్ కీప‌ర్‌), షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, వాషింగ్టన్ సుందర్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాంత్ శర్మ

Farmer leader Jagjit Singh Dallewal ends hunger strike after 131 days3
రైతుల కోసం 131 రోజుల పాటు నిరాహార దీక్ష

ఆయనొక రైతు.. రైతు నేత.. రైతులకు మద్దతు ధర కావాల్సిందేనని పట్టుబట్టుకుని కూర్చున్నారు. తాము పండించే పంటలకు మద్దతు ధర లేకపోతే రైతు నష్టపోతున్నాడు అనేది ఆయన ఆవేదన. దాంతో రైతుల కోసం పెద్ద ఎత్తున నిరసన కార్యక‍్రమాలు చేపట్టారు. అయినా ప్రభుత్వాల నుంచి స్పందన కనిపించలేదు. అంతే తాను నిరాహార దీక్షకు దిగాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడువుగా నిరవధిక నిరాహార దీక్షకు పూనుకున్నారు. సుమారు నాలుగు నెలలకు పైగా నిరాహార దీక్ష చేసి కేంద్ర పెద్దల దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. చివరకు కేంద్ర మంత్రులు ఆయనకు హామీ ఇవ్వడంతో తన 131 రోజుల నిరవధిక నిరాహార దీక్షను విరమించారు.జగజ్జీత్ సింగ్ దల్లేవాల్.. పంజాబ్ రాష్ట్రానికి చెందిన రైతు. రైతు నాయకుడు కూడా. రైతులకు మద్దతు ధరతో పాటు అనేక డిమాండ్లను కేంద్రం దృష్టికి తీసుకెళ్లిన రైతు ప్రేమికుడు. రైతు సమస్యలకు ముగింపు పడటం లేదని, మరీ ముఖ్యంగా మద్దతు ధర ఉండటం లేదని ఆందోళన చేపట్టి రైతులను ఒక్కతాటిపైకి తీసుకొచ్చాడు. రైతులు కలిసి నడిచి ఆయన.. చివరకు గతేడాది నవంబర్ 26వ తేదీన నిరవధిక నిరాహార దీక్షకు దిగారు.అప్పట్నుంచి నేటి వరకూ అదే పంతంతో కూర్చున్నారు. అయితే రైతు సమస్యలను కేంద్ర చర్చిస్తోందని, త్వరలోనే పరిష్కారం లభిస్తుందని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, రైల్వే సహాయ మంత్రి రవ్ నీత్ సింగ్ బిట్టులు ఆయనకు హామీ ఇచ్చారు. దీక్షను విరమించాలని, ఆరోగ్యం బాగా క్షీణించిందని వారు పదే పదే విజ‍్క్షప్తులు చేసి, హామీ ఇవ్వడంతో జగజ్జీత్ సింగ్ దల్లేవాల్ తన నిరవధిక నిరాహార దీక్షను విరమించారు. ఈ క్రమంలోనే దల్లేవాల్ మాట్లాడుతూ.. ‘ మీరంతా నన్ను దీక్ష విరమించమని కోరుతున్నారు. మా ఆందోళనను గుర్తించినందకు మీకు ధన్యవాదాలు. మీ సెంటిమెంట్స్ ను నేను గౌరవిస్తున్నారు. మీ ఆదేశాలను నేను పాటిస్తాను’ అని పేర్కొన్నారు.రైతు సమస్యలపై ఇప్పటికే డేట్ ఫిక్స్ చేశాంరైతు సమస్యలపై మాట్లాడటానికి ఇప్పటికే డేట్ ఫిక్స్ చేసిన విషయాన్ని శివరాజ్ సింగ్ చౌహాన్.. ఎక్స్ వేదికగా తెలిపారు. రైతు నాయకుల డిమాండ్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వ ప్రతినిధులుగా మేము కూడా అదే పనిలో ఉన్నాం. రైతు సమస్యలను పరిష్కరించే దిశగా ముందుకు సాగుతున్నాం. అందుచేతు ఆస్పత్రి నుంచి తిరిగి వచ్చిన జగజ్జీత్ సింగ్ దల్లేవాల్ దీక్ష విరమించాలని కోరాం. ఆయన త్వరగా పూర్తి ఆరోగ్యవంతుడవ్వాలని ఆశిస్తున్నాను. రైతు ప్రతినిధులతో మేము మాట్లాడటానికి ఒక తేదీ ఇప్పటికే ఫిక్స్ చేశాం. మే 4వ తేదీ ఉదయం 11 గంటలకు రైతుల తరఫున వచ్చే ప్రతినిధులతో మాట్లాడాలని నిర్ణయించాం’ అని చౌహాన్ పేర్కొన్నారు.

Canada Parliament Put Under Lockdown After Unknown Man Sneaks In4
కెనడా పార్లమెంట్‌కు తాళాలు.. ఎన్నికల వేళ అసలేం జరుగుతోంది?

కెనడా పార్లమెంటు భవనంలోకి గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించడంతో తాత్కాలికంగా మూసివేసినట్లు ఒట్టావా పోలీసులు వెల్లడించారు. అక్రమంగా పార్లమెంట్ హిల్‌లోని ఈస్ట్‌ బ్లాక్‌లోకి ప్రవేశించిన ఓ వ్యక్తి రాత్రంతా లోపలే ఉన్నట్లు పోలీసులు గుర్తించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. అయితే, దుండగుడి వద్ద ఆయుధాలు ఉన్నాయా లేదా అనే దానిపై స్పష్టత లేదని పోలీసులు తెలిపారు.శనివారం రాత్రి ఓ వ్యక్తి పార్లమెంట్‌ భవనంలోకి అక్రమంగా చొరబడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. భవనం చుట్టూ పోలీసులను మోహరించారు. బ్యాంక్ స్ట్రీట్ నుండి సస్సెక్స్ డ్రైవ్ వరకు వెల్లింగ్టన్ స్ట్రీట్‌లోని అన్ని రోడ్లను మూసివేశారు. పెద్ద సంఖ్యల్లో పోలీసులు మోహరించారు. తూర్పు బ్లాక్‌లో ఉన్న సిబ్బంది మొత్తం ఒకే గదిలోకి చేరుకొని తాళాలు వేసుకోవాలని సూచించారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఆ వ్యక్తిని అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు ప్రకటించారు. దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు. సహకరించిన ప్రజలకు పోలీసులు కృతజ్ఞతలు తెలిపారు.కాగా, కెనడాలో అక్టోబర్ 27న జరగాల్సిన ఎన్నికలను ఆరు నెలలకు ముందుగానే నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 28న ముందస్తు ఎన్నికల నేపథ్యంలో కెనడా ప్రధాన మంత్రి మార్క్ కార్నీ పార్లమెంటును రద్దు చేశారు. ఈ క్రమంలో పార్లమెంట్‌ భవనంలోకి దుండగుడు ప్రవేశించడంపై అధికారులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దేశానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని అపహరించడానికి దుండగుడు ప్రయత్నించి ఉంటాడా అనే కోణంలో దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.

Chief Minister mk Stalin is Missing from pm Modi new Pamban Bridge Inauguration5
అందుకే పంబన్‌ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి రాలేదు: సీఎం స్టాలిన్‌

చెన్నై: శ్రీరామనవమి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశానికి అద్భుత కానుకను అందించారు. తమిళనాడులోని రామేశ్వరంలో కొత్తగా నిర్మించిన పంబన్ రైలు వంతెన(Pamban Railway Bridge)ను ప్రధాని మోదీ దేశానికి అంకితం చేశారు. ఎంతో ఘనంగా జరిగిన ఈ కార్యక్రమానికి తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ హాజరుకాలేదు. దీని వెనుక కారణం ఏమై ఉంటుందా? అని పలువురు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. దీనికి సీఎం స్టాలిన్‌ స్వయంగా సమాధానమిచ్చారు.2019లో రూ.700 కోట్ల వ్యయంతో పంబన్‌ వంతెన నిర్మాణాన్ని చేపట్టారు. నేడు ప్రధాని మోదీ పంబన్ వంతెనను ప్రారంభించడంతో పాటు, రామేశ్వరం-తాంబరం (చెన్నై) మధ్య నడిచే నూతన రైలు సర్వీసుకు కూడా పచ్చ జెండా చూపారు. తమిళనాడులోని రామేశ్వరంలో జరిగిన ఈ కార్యక్రమంలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్(Railway Minister Ashwini Vaishnav), తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి, రాష్ట్ర ఆర్థిక మంత్రి తంగం తేనరసు తదితరులు పాల్గొన్నారు.తాజాగా ముఖ్యమంత్రి స్టాలిన్ మీడియాతో మాట్లాడుతూ, ‘రామేశ్వరంలో జరిగే పంబన్‌ బ్రిడ్జి ప్రారంభోత్సవ కార్యక్రమానికి తాను హాజరు కాలేనని ముందుగానే ప్రధాని నరేంద్ర మోదీకి తెలియజేశానని, రాష్ట్రంలోని నీలగిరిలో ఇంతకు ముందే నిర్ణయించిన కార్యక్రమాలకు తాను హాజరు కావాల్సి ఉందని వివరించానన్నారు. అందుకే తాను వంతెన ప్రారంభోత్సవానికి రాలేనని తెలియజేశానన్నారు. అయితే తమ ప్రభుత్వం తరపున మంత్రులు తంగం తెన్నరసు, రాజకన్నప్పన్ ప్రధానమంత్రిని స్వాగతిస్తారని ముందుగానే తెలియజేశానని సీఎం స్టాలిన్‌ పేర్కొన్నారు.తమిళనాడు సీఎం స్టాలిన్(Tamil Nadu CM Stalin) ఆదివారం (ఏప్రిల్ 6) ఉదగమండలంలో రూ.494.51 కోట్లతో నిర్మించిన 1,703 ప్రభుత్వ నిర్మాణాలను ప్రారంభించారు. ఇందులో కొత్తగా నిర్మించిన ఉదగమండలం ప్రభుత్వ వైద్య కళాశాల, ఆసుపత్రి కూడా ఉంది. దీనితో పాటు, నీలగిరి జిల్లాలో రూ. 130.35 కోట్ల విలువైన 56 కొత్త ప్రాజెక్టులకు సీఎం శంకుస్థాపన చేశారు.ఇది కూడా చదవండి: ఫేర్‌వెల్‌లో స్పీచ్‌ ఇస్తూ.. గుండెపోటుతో 20 ఏళ్ల విద్యార్థిని మృతి

boAT Founder Aman Gupta Supports Piyush Goyal6
‘మీ లక్ష్యం ఏమిటో ప్రతీరోజూ ప్రభుత్వం చెబుతుందా?’

న్యూఢిల్లీ: భారత్ కు చెందిన స్టార్టప్ కంపెనీలను ఉద్దేశించి కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్‌ గోయల్ ఇటీవల చేసిన వ్యాఖ్యలకు బోట్ సహ వ్యవస్థాపకుడు అమన్ గుప్తా మద్దతు పలికారు. పీయూష్ చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తును దుమారం చెలరేగగా, అమన్ గుప్తా మాత్రం ఆయన వ్యాఖ్యలను సమర్ధించారు. పీయూష్ చేసిన వ్యాఖ్యల్లో తనకు తప్పు ఏమీ కనిపించలేదంటూ ట్వీట్ చేశారు అమన్ గుప్తా. పీయూష్ చెప్పిన దానికి వక్రార్థాలు సృష్టించాల్సిన అవసరం లేదన్నారు. ఆయన మాట్లాడిన మొత్తం స్పీచ్ తాను విన్నానని, అందులో తప్పులు వెతకాల్సిన పని లేదన్నారు అమన్ గుప్తా.‘స్టార్టప్ ఫౌండర్లకు మీ లక్ష్యం పెద్దదిగా ఉండాలని ప్రతీరోజూ గవర్నమెంట్ చెప్పలేదు. నేను అక్కడ ఉన్నాను. నేను ఆయన ప్రసంగం మొత్తం విన్నాను. ఆయనేమీ కంపెనీల వ్యవస్థాపలకు వ్యతిరేకం కాదు. మనపై నమ్మకం ఉంది కాబట్టే కొన్ని మంచి విషయాలు చెప్పారు. భారత్ ఇంకా మరింత వేగంగా ముందుకెళ్లాలనేది ఆయన ఉద్దేశం. మన లక్ష్యాలు ఉన్నతంగా ఉన్నప్పుడే వాటిని సాధించడానికి కృషి చేస్తామనేది ఆయన చెప్పిందాంట్లో నాకు అర్థమైంది’ అంటూ అమన్ గుప్తా పేర్కొన్నారు.ఇటీవల జరిగిన స్టార్టప్ మహాకుంబ్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి గోయల్‌ మాట్లాడుతూ.. దేశంలోని పలు స్టార్టప్‌ కంపెనీలు ఫుడ్ డెలివరీ, బెట్టింగ్, ఫాంటసీ స్పోర్ట్స్ వంటి యాప్‌లపై ఎక్కువగా దృష్టి సారించాయి. కానీ చైనాలోని స్టార్టప్‌లు మాత్రం ఇందుకు భిన్నమైన రంగాలను ఎంచుకుంటున్నాయని చెప్పారు. కానీ, మనం ఐస్‌క్రీం, చిప్స్‌ అమ్మడం దగ్గరే ఉన్నాం. ఇక్కడే మనం ఆగిపోకూడదు. డెలివరీ బాయ్స్‌/గర్ల్స్‌గానే మిగిలిపోదామా? అదే భారత్‌ లక్ష్యమా..? అది స్టార్టప్‌ల ఉద్దేశం కాదు కదా’’ అని అన్నారు.అయితే.. భారత్‌లో స్టార్టప్‌లను తక్కువ చేయొద్దంటూ కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తడంతో కాంగ్రెస్‌ పార్టీ ఓ పోస్ట్‌ చేసింది. ఈ క్రమంలోనే భారత్ లోని పలు స్టార్టప్ కంపెనీలు కూడా పీయూష్ గోయల్ వ్యాఖ్యలపై ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ తరుణంలో బోట్ సహ వ్యవస్థాపకుడు పీయూష్ కు మద్దతుగా నిలవడం విశేషం.It’s not every day that the government asks founders to dream bigger.But at Startup Mahakumbh, that’s exactly what happened. I was there. I heard the full speech. Hon. Minister @PiyushGoyal Ji isn’t against founders. He believes in us.His point was simple: India has come far,… pic.twitter.com/bA4ontAz1M— Aman Gupta (@amangupta0303) April 6, 2025

How Will China Tariffs Impact MCX Gold Rates7
చైనా సుంకాల ప్రభావం: గోల్డ్ రేటు మరింత తగ్గుతుందా?

అమెరికా అధ్యక్షుడు 'డొనాల్డ్ ట్రంప్' ప్రపంచ దేశాలపై సుంకాలను ప్రకటించారు. ఆ తరువాత చైనా.. యూఎస్ఏ మీద 34 శాతం ప్రతీకార సుంకం ప్రకటించింది. దీంతో బంగారం ధర సుమారు రూ. 2,800 లేదా రెండు శాతం తగ్గింది.అమెరికా ప్రతీకార సుంకాల కారణంగా స్టాక్ మార్కెట్ భారీ నష్టాలను చవిచూసింది. ఈ సమయంలోనే బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతల కారణంగా గోల్డ్ రేటు మరింత తగ్గే అవకాశం ఉందని కమోడిటీ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.అమెరికా, చైనాతో సహా ఇతర దేశాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం కారణంగా.. బంగారం ధరల ర్యాలీ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నదని ఎస్ఎస్ వెల్త్‌స్ట్రీట్ వ్యవస్థాపకురాలు 'సుగంధ సచ్‌దేవా' పేర్కొన్నారు. అయితే అమ్మకాలు మాత్రమే స్థిరంగా కొనసాగుతున్నాయి.ఇదీ చదవండి: ఇన్వెస్టర్లు ధనవంతులవుతారు.. ఇదే మంచి సమయం: డొనాల్డ్ ట్రంప్ఇండియన్ మార్కెట్లో బంగారం ధరలు రూ. 83,100 (22 క్యారెట్ 10 గ్రామ్స్), రూ. 90,660 (24 క్యారెట్ 10 గ్రామ్స్) వద్ద ఉన్నాయి. వెండి ధరలు కూడా భారీగానే తగ్గుముఖం పట్టాయి. రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరింత తగ్గే సూచనలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

Brondby Garden City In Denmark Most Beautiful Village8
భలే బతుకు చక్రాలు..! చూస్తే మతిపోవాల్సిందే..

సాధారణంగా ఇల్లస్థలాలు చతురస్రంగానో దీర్ఘచతురస్రంగానో చూస్తుంటాం. కానీ డెన్మార్క్‌ రాజధాని కోపెన్‌హాగన్‌ నగర శివారు ప్రాంతానికి వెళ్తే, పచ్చదనంతో నిండిన పెద్దపెద్ద చక్రాలు కనువిందు చేస్తాయి. ఒక్కో చక్రంలో 16 ఇళ్లు సకల సౌకర్యాలతో, ఆవాసయోగ్యంగా అగుపిస్తాయి. ‘బ్రాండ్‌బై గార్డెన్‌ సిటీ’ అనే ఈ ప్రత్యేకమైన కమ్యూనిటీ.. ప్రకృతి జీవనానికీ దగ్గరగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇక్కడ ఇళ్ల నిర్మాణాలు అందరి మనసుల్ని దోచేస్తుంటాయి. 1964లో ఎరిక్‌ మైగిండ్‌ అనే భవన నిర్మాణకర్త ఆలోచనల్లోంచి ఈ లేఔట్‌ పుట్టిందట. ఇలాంటి పచ్చని చక్రాలు ఈ ప్రదేశంలో చాలానే ఉంటాయి. ప్రతి సర్కిల్‌ మధ్యలో పార్కింగ్‌ స్థలం ఉంటుంది. సామాజిక సంబంధాలను పెంపొందించుకోవడానికి ఇలాంటి నిర్మాణాలు మరింత మేలు చేస్తాయని స్థానికుల నమ్ముతారు. చక్రంలోనే ప్లాట్‌ చూడటానికి కట్‌ చేసిన కేకుముక్కలా ఉంటుంది. అయితే ఈ అందమైన ఇళ్ల నిర్మాణాలను డ్రోన్‌ వ్యూలో చూసిన వారు ఎవరైనా ‘అబ్బా భలే ఉంది, ఇలాంటి చోట ప్రశాంతంగా బతకొచ్చు’అంటుంటారు. అయితే కొందరు ‘చూడటానికి బాగున్నా, నివాసానికి అసౌకర్యంగా ఉంటుంది, అగ్ని ప్రమాదాలు లాంటివి జరిగినప్పుడు తప్పించుకోవడం కష్టమవుతుంది’ అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: అతిచిన్న అంతర్జాతీయ వారధి..!)

Gajraj Rao: Mani Ratnam Warns When I pushed Shah Rukh Khan9
స్టార్‌ హీరోను పట్టుకుని అలా తోసేస్తావేంటి? నటుడికి మణిరత్నం వార్నింగ్‌

దర్శకుడు మణిరత్నం ఓసారి తనపై ఆగ్రహం వ్యక్తం చేశాడని, అప్పుడు షారూఖ్‌ ఖాన్‌ (Shah Rukh Khan) తనకు సపోర్ట్‌ చేశాడని చెప్తున్నాడు నటుడు గజరాజ్‌ రావు. షారూఖ్‌, మణిరత్నం, గజ్‌రాజ్‌ ముగ్గురి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం దిల్‌సే. 1998లో వచ్చిన ఈ సినిమా తెర వెనుక జరిగిన ఓ సంఘటనను గజరాజ్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ.. దిల్‌సేలో నాది సీబీఐ ఆఫీసర్‌ పాత్ర. నేను షారూఖ్‌ ఖాన్‌ను ప్రశ్నించాల్సి ఉంటుంది. షారూఖ్‌ను గోడకు నెట్టేశాఅందుకు సంబంధించిన సన్నివేశం రిహార్సల్స్‌ చేస్తున్నాం. అందులో భాగంగా నేను షారూఖ్‌ను గోడకేసి కొట్టాను. అప్పుడు మణిరత్నం నాపై అసహనం వ్యక్తం చేశాడు. షారూఖ్‌ పెద్ద హీరో.. ఆయనొక స్టార్‌.. మనం ఈ సినిమా పూర్తి చేయాలి, అర్థమవుతుందా? ఆయన్ను అలా బలంగా నెట్టేయకు అని వారించాడు. కానీ షారూఖ్‌ మాత్రం అదేమీ పట్టించుకోలేదు. ఇంతకుముందెలా చేశావో మళ్లీ అలాగే చేయు అని ఎంకరేజ్‌ చేశాడుఅందరికంటే ఎక్కువ ఎనర్జీనా బలాన్నంతా ఉపయోగించమనేవాడు. సెట్‌లో, బయటా అందరూ సమానమే అని చాటిచెప్పేవాడు. ఆయన్ను నేను రఫ్‌గా ఎందుకు హ్యాండిల్‌ చేశానంటే మేమిద్దరం ఢిల్లీలోని థియేటర్‌ స్కూల్‌ నుంచి వచ్చినవాళ్లమే! ఏదేమైనా షారూఖ్‌ ఎనర్జీ మిగతా అందరు నటులకంటే 10 వేల రెట్లు ఎక్కువగా ఉంటుంది అని గజ్‌రాజ్‌ చెప్పుకొచ్చాడు. ఇతడు.. తల్వార్‌, బదాయి హో, రంగూన్‌, మేడ్‌ ఇన్‌ చైనా, శుభ్‌ మంగళ్‌ జ్యాద సావధాన్‌, మైదాన్‌, సత్యప్రేమ్‌ కీ కథ, బ్యాడ్‌ న్యూజ్‌, యుద్ర చిత్రాల్లో నటించాడు.చదవండి: బీచ్‌లో సిగరెట్‌ తాగిన బోల్డ్‌ బ్యూటీ..

Kuno Park Cheetah Responds Drinks Water Offered10
కూనో చీతాలకు నీరు పోశాడు.. ఉద్యోగం నుంచి సస్పెండ్‌!

గాంధీనగర్‌: ఎండా కాలంలో దాహంతో ఉన్న చీతాలకు నీరు అందించిన కారణంగా ఓ డ్రైవర్‌ తన ఉద్యోగాన్ని కోల్పోయాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని కూనో నేషనల్‌ పార్క్‌లో చోటుచేసుకుంది. అదేంటీ.. నీరు పోసినందుకు ఎందుకు ఉద్యోగం పోయిందనుకుంటున్నారా? అసలు ట్విస్ట్‌ అక్కడే ఉంది.వివరాల ప్రకారం.. కూనో పార్కులో చీతా జ్వాల దాని పిల్లలు ఇటీవల ఓ జంతువును వెంబడిస్తూ గ్రామంలోకి చొరబడ్డాయి. పొలంలోని కొందరు వాటిని చూసి ఆందోళనకు గురయ్యారు. గ్రామస్థులు చీతాలపై రాళ్ల దాడికి తెగబడ్డారు. అక్కడి నుంచి పారిపోయి ప్రాణాలతో బయటపడ్డాయి. ఈ క్రమంలో ఓ చెట్టు కింద సేద తీరుతున్న జ్వాల (చిరుత) దాని నాలుగు పిల్లలను గమనించిన అటవీ శాఖకు చెందిన ఓ డ్రైవర్.. వాటికి నీరు అందించాడు. ఓ క్యానులో నీటిని తీసుకొచ్చి.. పాత్రలో నీటిని నింపి వాటిని తాగమంటు పిలిచాడు. దాహంతో ఉన్న ఆ వన్యప్రాణులు వాటిని తాగాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.A heartwarming video from Madhya Pradesh's Kuno National Park shows a female cheetah and her four cubs being offered water by a member of the monitoring team. pic.twitter.com/SN9Q4e8vxq— NDTV (@ndtv) April 6, 2025ఈ వీడియో అటవీ శాఖ అధికారులు దృష్టికి చేరింది. ఆ డ్రైవర్‌పై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడిని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు. ఈ మేరకు ఓ ప్రకటనలో..‘చీతాలకు నీరు అందించాలని గ్రామస్థులు అనుకుంటున్నారు. ఈ జీవాలు సహజంగానే ముప్పు కలిగించేవి కావని తెలుసుకుంటున్నారు. కానీ, ఈ ప్రాంతం సహజ పర్యావరణ వ్యవస్థలో భాగమని వారంతా గ్రహించారు. అందుకే, వన్యప్రాణులతో (చీతాలతో) స్నేహపూర్వకంగా ఉండాలని కోరుకుంటున్నారు. కానీ, ఇది ఏ మాత్రం పద్ధతి కాదు. ఇలాంటి చర్యలు వాటి మనుగడకే ప్రమాదం’ అంటూ వ్యాఖ్యలు చేశారు.Historic moment in Kuno National Park! ✨ Cheetah Jwala and her 4 cubs spotted thriving in the wild for the first time! A true milestone for India’s cheetah conservation efforts. Witness the legacy of speed and survival unfold in Kuno!#Cheetah #KunoCheetahSafari #FlyingCatSafari pic.twitter.com/Bs5ThPnqhI— Flying Cat Safari (@KunoSafari) February 28, 2025మరోవైపు.. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ సదరు డ్రైవర్‌ చేసిన పనికి అభినందనలు తెలుపుతున్నారు. ఆ వ్యక్తి చేసింది నిజంగా గొప్ప పని.. మనుషులు, వన్యప్రాణులకు మధ్య ఇలాంటి స్నేహపూర్వక బంధం ఉండాలి అంటూ కామెంట్స్‌ చేశారు. @KunoNationalPrk female #cheetah #Jwala along with her cubs hunted 6 goats in Umrikalan village in Agra area of Vijaypur - villagers made a video, tracking team of Kuno National Park was also on the spot.. @Ajaydubey9#cheetah #kuno #wildlifephotography #viralvideo pic.twitter.com/RgJHqJFXgS— UTTAM SINGH (@R_UTTAMSINGH) April 4, 2025

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement