Army convoy
-
బెలూచిస్థాన్ లో పాకిస్థాన్ ఆర్మీపై దాడి
-
పాకిస్తాన్ ఆర్మీ కాన్వాయ్‌పై దాడి.. పది మంది సైనికులు మృతి
ఢిల్లీ: పాకిస్తాన్ ఆర్మీకి మరోసారి బిగ్ షాక్ తగిలింది. బెలుచిస్తాన్లో పాక్ ఆర్మీపై దాడి జరిగింది. పాక్ ఆర్మీ కాన్వాయ్‌పై బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ(Baloch Liberation Army-BLA)దాడి చేసింది. ఈ ఘటనలో 10 మంది పాకిస్తాన్ సైనికులు మృతిచెందినట్టు సమాచారం.వివరాల ప్రకారం.. పాకిస్తాన్‌కు చెందిన బెలూచిస్థాన్ ప్రావిన్స్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పాక్ ఆర్మీ కాన్వాయ్‌పై బెలూచ్ ఫ్రీడమ్ ఫైటర్స్ దాడి చేశారు. ఈ దాడిలో కనీసం 10 మంది పాకిస్తాన్ సైనికులు మృతిచెందినట్టు సమాచారం. ఆర్మీ కాన్వాయ్‌లోని ఒక వాహనం పూర్తిగా ధ్వంసమైపోయింది. కాగా, ఇది బెలూచ్ విప్లవకారుల తాజా యుద్ధ ప్రకటనగా చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను బీఎల్ఏ స్వయంగా విడుదల చేసింది. ఈ వీడియోలో పేలుళ్లు, కాల్పుల శబ్దాలు, నాశనమైన పాక్ ఆర్మీ వాహనాలు కనిపిస్తున్నాయి.🚨 The Baloch Liberation Army (BLA) has taken responsibility for an improvised explosive device (IED) attack on a Pakistani Army convoy in Margat, near Quetta, on April 25, 2025. According to BLA spokesperson Jeeyand Baloch, the attack was carried out using a remote-controlled… pic.twitter.com/9SmHRfTcyr— The Tradesman (@The_Tradesman1) April 26, 2025ఇక, ఈ దాడితో పాటు బీఎల్ఏ మరోసారి పాకిస్తాన్ ఆర్మీకి భారీ హెచ్చరిక జారీ చేసింది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. పాక్ ఆర్మీకి ఇకపై భద్రత ఉండదు. మేం మా హక్కుల కోసం చివరి వరకు పోరాడతాం.. అంటూ వారు ప్రకటించారు. అయితే, పాకిస్తాన్ ప్రభుత్వం ఇప్పటివరకు ఈ ఘటనపై అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఈ ఘటన తర్వాత సైనిక వర్గాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. బెలూచిస్థాన్లో భద్రతా వ్యవస్థ మరింత కఠినంగా అమలు చేయబోతున్నట్టు సమాచారం.Always a big fan of video editing skills of Baloch Liberation Army 😉https://t.co/LFu7OiouoD— Kriti Singh (@kritiitweets) April 25, 2025ఇదిలా ఉండగా.. ఎన్నో దశాబ్దాలుగా స్వతంత్ర బెలూచిస్థాన్ కోసం బీఎల్ఏ పోరాడుతోంది. ఈ క్రమంలో పాక్ ప్రభుత్వం తమ హక్కులు దూరం చేస్తున్నదని ఆరోపిస్తూ వరుస దాడులకు పాల్పడుతోంది. గత కొన్ని నెలలుగా BLA కార్యకలాపాలు మరింత ఉధృతంగా మారాయి. ఈ దాడి తర్వాత పాక్‌లో పరిస్థితి అత్యంత అస్థిరంగా మారింది. తాజా దాడి నేపథ్యంలో ప్రజల్లో భయం, భద్రతా వర్గాల్లో ఆందోళన నెలకొంది.10 🐖 s gone! Well done Baloch Liberation Army #Pakistan #PahalgamTerroristAttack #TerrorAttack #Baloch #Kashmir pic.twitter.com/ZavhIoEBjx— Adri chatterjee (@stay_fit_mate) April 26, 2025 -
పాకిస్థాన్ ఆర్మీ కాన్వాయ్‌పై దాడి.. 10 మంది సైనికులు మృతి!
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. పాకిస్థాన్ సైనికుల కాన్వాయ్‌ను టార్గెట్ చేసి బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) దాడి చేసింది. ఈ క్రమంలో 10 మంది సైనికులు మృతిచెందగా.. మరో 21 మంది తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది.వివరాల ప్రకారం.. పాకిస్థాన్‌లోని క్వెట్టా నుండి టఫ్తాన్‌కు వెళ్తున్న ఆర్మీ కాన్వాయ్‌పై బలూచ్ లిబరేషన్ ఆర్మీ బాంబు దాడి చేసింది. ఎనిమిది ఆర్మీ సిబ్బంది బస్సులు వెళ్తున్న సమయంలో బలూచ్ ఆర్మీ కాల్పులు జరిపింది. ఒక బస్సుపై ఆత్మహుతి దాడి చేసింది. ఈ దాడిలో పది మంది పాకిస్తాన్ సైనికులు మరణించగా, 21 మంది గాయపడ్డారు. పాకిస్తాన్‌లోని నోష్కి సమీపంలో ఈ దాడి జరిగినట్టు స్థానిక మీడియా తెలిపింది. ఈ దాడి ఘటనను పాకిస్తాన్ అధికారులు సైతం ధృవీకరించారు. మరోవైపు.. ఈ దాడిని తామే చేసినట్టు బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) పేర్కొంది. ఈ దాడిలో 90 మంది పాకిస్థాన్ సైనికులు చనిపోయినట్టు తెలిపింది. ఇదిఆ ఉండగా.. ఈ ఘటనలో కేవలం ఏడుగురు సైనికులు మాత్రమే చనిపోయినట్టు పాకిస్థాన్ ఆర్మీ అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. #UPDATE The Baloch Liberation Army has claimed that its "self-sacrificing" squad, the Majeed Brigade, carried out a "Fidayee" attack on a #Pakistan Army convoy consisting of 8 buses in #Noshki.#balochistan #quetta #islamabad #Baloch https://t.co/M5Qczo5bAB pic.twitter.com/LM81CJR69Y— Shekhar Pujari (@ShekharPujari2) March 16, 2025 BREAKING!! 🚨‼️‼️At least 10 #PakistaniSoldiers Killed, 26 Injured in Noshki Ambush when a Frontier Corps (FC) bus was attacked on the N-40 highway in Noshki, #Balochistan. It came under attack while moving from Quetta to Taftan,Baluchistan.#Balochistanattack pic.twitter.com/kJDLQxD8QN— सदप्रयास (@sadprayas) March 16, 2025 -
పాకిస్తాన్ ఆర్మీ కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడి
ఢిల్లీ: బలూచిస్తాన్‌లోని తుర్బట్ ప్రాంతంలో పాకిస్తాన్ ఆర్మీ కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో తొమ్మిది మంది సైనికులు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో 11 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. తామే ఈ దాడికి పాల్పడినట్లు బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ అనే సంస్థ, బలోచ్ రిపబ్లికన్ గార్డ్ ప్రకటించుకున్నాయి. సౌదీ అరేబియా రాజు మహ్మద్ బిన్ సల్మాన్ వచ్చే కొన్ని గంటల ముందే ఈ ఘటన చోటుచేసుకుంది. భారత్, పాకిస్తాన్లలో జరిగిన ఈ ఘటనలతో ఉపఖండంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆర్మీ కాన్వాయ్ పై ఉగ్రవాదుల కాల్పులు
-
ఆర్మీ కాన్వాయ్ పై కాల్పుల కలకలం!
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పాంపోర్ లోని శ్రీనగర్-జమ్మూ జాతీయ రహదారిపై ఆర్మీ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు ఆర్మీ జవాన్లు అమరులయ్యారు. పుల్వామా జిల్లాలోని కద్లబాల్ ఏరియాలో శనివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. జవాన్లు ఎదరుకాల్పులు ప్రారంభించగానే కాన్వాయ్ పై కాల్పులు జరిపిన ఉగ్రవాదులు అక్కడి నుంచి పరారయ్యారు. కాల్పులు జరిగిన వెంటనే ఆర్మీ సిబ్బంది చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. ఉగ్రవాదులను పట్టుకునేందుకు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కశ్మీర్లో ‘ఉగ్ర’దాడి.. ముగ్గురు జవాన్ల మృతి
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో శుక్రవారం ఉగ్రవాదులు ఆర్మీ కాన్వాయ్‌పై జరిపిన మెరుపు దాడిలో ముగ్గురు బీఎస్ఎఫ్ జవాన్లు మృతిచెందగా, మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. శ్రీనగర్-జమ్మూ జాతీయ రహదారిపై బిజ్బెహరా సమీపంలో వాహన శ్రేణి లక్ష్యంగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.హెడ్ కానిస్టేబుల్ గిరీశ్‌కుమార్ శుక్లా, కానిస్టేబుల్ మహీందర్ రామ్, హవల్దార్ దినేశ్ మృతిచెందారు. ఆ ప్రాంతంలో ప్రజలు వుండడంతో జవాన్లు సంయమనం పాటించి కాల్పులు జరపలేద ని అధికారులు చెప్పారు. సెలవులు ముగించుకున్న జవాన్లు 23 వాహనాల్లో తిరిగి విధుల్లోకి చేరడానికి వెళ్తుండగా ఈ దాడి జరిగింది. ఇది హిజ్బుల్ ముజాహిదీన్ పనేనని అనుమానిస్తున్నారు. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ ఆదేశంపై బీఎస్ఎఫ్ డెరైక్టర్ జనరల్ కెకె వర్మ సంఘటనాస్థలికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. -
'మణిపూర్ దాడి మా పనే'
ఇంఫాల్: ఆర్మీ వాహన శ్రేణిపై మందుపాతరలు, గ్రెనేడ్లు, అత్యాధునిక ఆయుధాలతో మెరుపుదాడి చేసి 18 మంది సైనికులను హతమార్చింది తామేనని ఎన్ఎస్సీఎన్- కె (నాగాలాండ్ నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ - ఖప్లాంగ్) సంస్థ ప్రకటించింది. ఈ మేరకు ఘటనకు బాధ్యవవహిస్టున్నట్లుగా శుక్రవారం ఒక ప్రకటనను విడుదల చేసింది. నాగాలాండ్ కు స్వయం ప్రతిపత్తి కల్పించాలనే డిమాండ్ తో గత కొన్నేళ్లుగా ఈ సంస్థ ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహిస్తున్నది. మణిపూర్ రాజధాని ఇంఫాల్‌కు 80 కి.మీ.ల దూరంలో ఉన్న తెంగ్నౌపాల్- న్యూ సంతాల్ రోడ్‌పై గురువారం ఈ సంఘటన జరిగిన సంగతి తెలిసిందే. డోగ్రా రెజిమెంట్‌కు చెందిన సైనికులు నాలుగు వాహనాల్లో పెట్రోలింగ్‌కు బయల్దేరగా.. పారలాంగ్, చరాంగ్ గ్రామాల మధ్యకు రాగానే మిలిటెంట్లు ఆ వాహన శ్రేణిని శక్తిమంతమైన మందుపాతరతో పేల్చేశారు. ఆ వెంటనే రాకెట్‌తో ప్రయోగించే గ్రెనేడ్లు, అత్యాధునిక ఆటోమేటిక్ తుపాకులతో సైనికులపై విరుచుకుపడి, విచక్షణారహితంగా కాల్పులు ప్రారంభించారు. గడిచిన ముప్పై ఏళ్లలో భారత సైన్యం పై జరిగిన భారీ దాడి ఇదే. దాడిలో 18 మంది సైనికులు చనిపోగా, 11 మంది గాయాల పాలయ్యారు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈశాన్య రాష్ట్రాల్లో రెడ్ అలెర్ట ను ప్రకటించింది. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కాల్పుల ఘటనను దర్యాప్తుచేస్తోంది.