Bhuma nagireddy
-
అఖిలమ్మా... అప్పు కట్టమ్మా! మాజీ మంత్రి ఇంటి ముందు నిరసన
ఆళ్లగడ్డ: అప్పు చెల్లించాలని మాజీ మంత్రి అఖిలప్రియ ఇంటి ముందు బ్యాంకు అధికారులు బుధవారం వినూత్నంగా నిరసన తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు దివంగత భూమా నాగిరెడ్డి ఆళ్లగడ్డలో జగత్ డెయిరీ కోసం నంద్యాల ఆంధ్రా బ్యాంకు నుంచి రుణం తీసుకున్నారు. ఆయన మృతి చెందినప్పటి నుంచి వాయిదాలు సకాలంలో చెల్లించకపోవడంతో వారసులకు పలు దఫాలు నోటీసులు ఇచ్చారు. అయినా స్పందించకపోవడంతో యూనియన్ బ్యాంకు (ప్రస్తుతం ఆంధ్రా బ్యాంక్ విలీనమైంది) లోన్ రికవరీ అధికారులు ఆళ్లగడ్డ చేరుకుని అఖిలప్రియ ఇంటి ముందు అప్పు చెల్లించాలని ప్ల కార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. ఆ సమయంలో ఆమె ఇంట్లో లేరని తెలిసింది. అనంతరం ఈ అప్పునకు ష్యూరిటీ పెట్టిన ఏవీ సుబ్బారెడ్డికి చెందిన హోట్‌ల్ ముందు కూడా ‘బ్యాంక్ మనీ పబ్లిక్ మనీ, మా బకాయిలు చెల్లించండి–సగర్వంగా జీవించండి’ అంటూ నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఈ విషయంపై అఖిలప్రియ ఫోన్లో బ్యాంకు అధికారులతో మాట్లాడి కొంత గడువు ఇస్తే డబ్బు చెల్లిస్తామని చెప్పడంతో వారు వెళ్లిపోయారు. -
Bhuma Family: భూమా కుటుంబంలో 'దావా'నలం
దివంగత భూమా నాగిరెడ్డి దంపతులపై చీటింగ్ కేసు నమోదు చేయాలని ఆళ్లగడ్డ కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనను నిశితంగా పరిశీలిస్తే భూమా అఖిల ప్రియ భర్త భార్గవ్ ప్రధాన అనుచరుడు గుంటూరు శీను తండ్రి మాదాల వెంకటరమణయ్య ఈ దావా వేశారు. దీనికి ప్రధాన కారణం నంద్యాల ఆంధ్రా బ్యాంకులోని అప్పును ఎగవేసేందుకు ఓ పథకం ప్రకారం కోర్టులో దావా వేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతున్న ఈఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. సాక్షి, ఆళ్లగడ్డ: భూమా నాగిరెడ్డి తన పేరుపై ఉన్న భూమిని నంద్యాల ఆంధ్రా బ్యాంకులో తనఖాపెట్టి రుణం తీసుకున్నారు. నాగిరెడ్డి బతికి ఉన్నంత వరకూ నెలవారీగా వాయిదాలు చెల్లించారు. వారు చనిపోయిన తర్వాత అసలు, వడ్డీ కలిపి దాదాపు రూ.19 కోట్లు బకాయిలు ఉన్నాయి. వీటిని చెల్లించాలని బ్యాంకు నుంచి భూమా వారసులపై ఒత్తిడి పెరిగింది. దీని నుంచి బయట పడేందుకు వారు పథకం రచించారు. బ్యాంకులో రుణం తీసుకునేందుకు ముందే తనఖా పెట్టిన ఆస్తి మాదాల వెంకటరమణయ్య అనే వ్యక్తికి విక్రయించినట్లు ఓ అగ్రిమెంట్ సృష్టించారు. తర్వాత తమకు విక్రయించిన ఆస్తిని తమకు తెలియకుండా బ్యాంకులో తనఖా పెట్టి మోసం చేశారని కోర్టులో దావా వేశారు. అయితే, ఈ దావా దాఖలు వెనుక భూమా వారసుల ప్రమేయం ఉందనే చర్చ జిల్లాలో జోరుగా నడుస్తోంది. ఈ దిశగానే సోషల్ మీడియాలో కూడా కథనాలు వస్తున్నాయి. బకాయిల బాగోతం ఇదీ 2011 డిసెంబరు నెలలో భూమానాగి రెడ్డి పేరు మీద ఉన్న సర్వే నంబర్ 66/1 లో 1.94, 66/1 లో 4.37, 73 లో 6.17, 370/1ఎ లో 1.50, 370/ఏ2 లో 4.10, 370 /ఏ3 లో 0.40, 370/బి3లో 0.43, ఎకరాలు, భూమా శోభానాగి రెడ్డి పేరుమీద ఉన్న 356/ఏ, 170/ఏ లోని 1190 చదరపు గజాలు, 75/3 లో 1.08, 75/1లో 013 ఎకరాలు, భూమా శివలక్షమ్మ పేరుమీద ఉన్న 574/1లో 1.00, 574/2లో 1.40 ఎకరాల భూము లను ఉమ్మడిగా నంద్యాల ఆంధ్రా బ్యాంకులో కుదువ పెట్టి రుణం తీసుకున్నారు. ఈ ఆస్తులను బ్యాంకు తనఖా కంటే 4 నెలల ముందే అంటే 2011 ఆగస్టు 10న తనకు విక్రయించారని, అందుకు సంబంధించి అగ్రిమెంట్ రాసిచ్చారని వెంకటరమణయ్య ఓ అగ్రిమెంట్ సృష్టించినట్లు తెలుస్తోంది. రూ. 30 లక్షలు అగ్రిమెంట్ రోజు ఇచ్చారని, ఆపై 2014 ఫిబ్రవరి 10న మరో రూ.3 లక్షలు ఇచ్చారని దావాలో పేర్కొన్నారు. శోభానాగిరెడ్డి మృతి తర్వాత వారి వారసులు అఖిల, నాగమౌనిక, జగత్ విఖ్యాత్ రెడ్డిలు 2016 జనవరి 5న రూ.5 లక్షలు, భూమానాగిరెడ్డి మృతి తర్వాత 2019 డిసెంబర్ 26న రూ.6 లక్షలు తీసుకున్నారని, మిగిలిన సొమ్ము చెల్లిస్తామని సదరు ఆస్తిని రిజిస్ట్రేషన్ చేయించాలని ఆళ్లగడ్డ కోర్టులో ఈ నెల 6న వెంకటరమణయ్య దావా వేశారు. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు! తల్లిదండ్రులు మృతి చెందిన తరువాత వారి పేరు ప్రతిష్టలు తగ్గకుండా వారసులు చూస్తారు. ఎవరైనా వారి గురించి తప్పుగా మాట్లాడినా జీర్ణించుకోలేరు. ఇందుకు విరుద్ధంగా భూమా వారసులు రాజకీయంగా పదవులు.. కోట్లాది రూపాయల ఆస్తుల అనుభవిస్తూ వారిపైనే కోర్టులో దావా వేయించడం పట్ల భూమా అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. వారసత్వం అంటే ఆస్తులు పంచుకోవడమే కాదు వారు చేసిన అప్పులను కూడా చెల్లించాలని చర్చించుకుంటున్నారు. దీనికి తోడు పై ఆస్తుల విలువ ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో సుమారు రూ 100 కోట్ల దాకా ఉంటుంది. ఇంత విలువైన ఆస్తులను భూమా దంపతులు మాదాల వెంకటరమణయ్యకు కేవలం రూ. 45 లక్షలకు విక్రయించారంటే నమ్మశక్యం కావడం లేదని భూమా అభిమానులు చర్చించుకుంటున్నారు. ఎవరీ మాదాల వెంకటరమణయ్య గుంటూరు పట్టణానికి చెందిన వెంకటరమణయ్య ఇటీవల ఆళ్లగడ్డ ప్రాంతంలో తరచూ వినపడుతున్న గుంటూరు శీనుకు తండ్రి. అఖిలప్రియ భర్త భార్గవరామ్‌కు శీను అత్యంత సన్నిహితుడు. టీడీపీ నాయకుడు ఏవీ సుబ్బారెడ్డి హత్యాయత్నం కేసు, హైదరాబాద్‌లో స్థలం విషయంలో జరిగిన కిడ్నాప్ కేసులు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించాయి. ఆయా కేసుల్లో అఖిలప్రియ, భార్గవరామ్‌తో పాటు గుంటూరు శీను ప్రధాన నిందితుడు. ఇప్పుడు అతని తండ్రి వెంకటరమణయ్య భూమా దంపతులతో పాటు వారి వారసులైన భూమా అఖిలప్రియ, నాగమౌనిక, జగత్ విఖ్యాత్ రెడ్డిలపై కోర్టులో కేసు వేయడం ఒక ఎత్తైతే ఆ దావాకు వకాల్తా పుచ్చుకున్నది అభిలప్రియ వ్యక్తిగత లాయరే కావడం విశేషం. బ్యాంకుకు శఠగోపం పెట్టేందుకే! భూమా దంపతులు ఉన్నప్పుడు తీసుకున్న రుణానికి సంబంధించి 2015 సంవత్సరం వరకు క్రమం తప్పకుండా కంతులు చెల్లిస్తూ వచ్చారు. వారు మృతి చెందినప్పటి నుంచి వారసులు కంతులు కట్టక పోవడంతో ప్రస్తుతం సుమారు రూ. 19 కోట్ల వరకు బకాయి పడ్డట్టు తెలుస్తోంది. ఈ రుణం చెల్లించాలని అనేక దఫాలుగా వారి వారసులైన కూతుర్లు, కొడుకుకు నోటీసులు పంపినప్పటికీ ఎలాంటి స్పందన లేదు. దీంతో విసిగి పోయిన బ్యాంకర్లు తనఖా పెట్టిన ఆస్తులను వేలం వేస్తామని ఇటీవల నోటీసులు పంపించారు. అయితే, సదరు షెడ్యూల్ ఆస్తులు వివాదాస్పదంగా ఉన్నాయని సృష్టిస్తే వేలం పాటలో ఎవ్వరూ పాల్గొనరు. తద్వారా బ్యాంకులకు శఠగోపం పెట్టొచ్చనే ఉద్దేశంతో తమకు అత్యంత సన్నిహితుడు అయిన గుంటూరు శీను తండ్రి మాదాల వెంకటరమణయ్యతో దావా వేయించారని జిల్లావాసులు చర్చించుకుంటున్నారు. -
బోయిన్పల్లి కిడ్నాప్: వెలుగులోకి సంచలన విషయాలు
సాక్షి, హైదరాబాద్ : బోయిన్పల్లి కిడ్నాప్ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. ఆ వివరాలు.. కొన్నేళ్ల క్రితం భూమా నాగిరెడ్డి, ఏవీ సుబ్బారెడ్డిలు హఫీజ్ పేట్లో భూములు కొనుగోలు చేశారు. ప్రవీణ్‌రావ్ తండ్రి కిషన్ రావ్.. భూమా నాగిరెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నాడు. నాగిరెడ్డి బతికి ఉన్న సమయంలో కిషన్ రావు కీలకంగా వ్యవహరించారు. భూమా మరణం తర్వాత ఏవీ సుబ్బా రెడ్డి ల్యాండ్ విషయంలో రంగంలోకి దిగారు. ఏవీ ఎస్టేట్స్ పేరుతో ల్యాండ్‌లోకి ప్రవేశించారు. ( బెంగళూరులో ఏ-3 భార్గవరామ్? ) ఈ నేపథ్యంలో 2020లో ఏవీ సుబ్బారెడ్డిపై కేపీ ఎస్టేట్స్ ఓనర్ ప్రవీణ్‌రావ్ ట్రెస్ పాస్ కేసు పెట్టారు. గతంలోనే 50 ఎకరాల భూమిలో చెరో 25 ఎకరాల ల్యాండ్ చెందేట్లు ఏవీ సుబ్బారెడ్డి మీడియేషన్ చేశారు. సెటిల్మెంట్ కూడా జరిగిపోయింది. కానీ, మిగతా 25 ఎకరాలు కూడా తమకే కావాలని ప్రవీణ్‌రావ్‌పై భూమా కుటుంబ సభ్యులు ఒత్తిడి తెచ్చారు. పక్కా ప్లాన్‌తో కిడ్నాప్‌కు పాల్పడ్డారు. -
అవన్నీ అవాస్తవాలు: భూమా జగత్‌విఖ్యాత్ రెడ్డి
సాక్షి, ఆళ్లగడ్డ: భూ వివాదానికి సంబంధించి టీడీపీ నేత భూమా అఖిలప్రియకు వ్యతిరేకంగా ఆమె సోదరుడు జగత్‌విఖ్యాత్‌రెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. ఇద్దరు అక్కల నుంచి తనకు న్యాయం చేయాలంటూ ఈనెల 14న రంగారెడ్డి జిల్లా అదనపు కోర్డులో కేసు దాఖలు చేసి ప్రతివాదులకు నోటీసులు పంపించారు. భూమా శోభా నాగిరెడ్డి పేరుతో రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం మంచిరేవులలో ఉన్న వెయ్యి గజాల స్థలాన్ని ఆమె మృతి అనంతరం 2016లో దాదాపు రూ.2 కోట్లకు విక్రయించినట్లు సమాచారం. అప్పట్లో భూమా నాగిరెడ్డితోపాటు ఆయన ఇద్దరు కుమార్తెలు ఆఖిలప్రియ, మౌనికారెడ్డి దీనిపై సంతకాలు చేయగా తనయుడు జగత్‌విఖ్యాత్‌రెడ్డి వేలిముద్ర వేశాడు. ప్రస్తుతం ఆ స్థలం విలువ రెట్టింపు అయింది. అయితే స్థలం అమ్మే సమయానికి తాను మైనర్‌నని, తనకు ఏమీ తెలియని వయసులో తండ్రితో పాటు సోదరిలిద్దరూ కలిసి విక్రయించారని, ఇప్పుడు తన వాటాగా మూడో భాగం కావాలని కోరుతూ జగత్‌విఖ్యాత్‌రెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. అక్కలతో పాటు భూమిని కొనుగోలు చేసిన హైదరాబాద్‌కు చెందిన సుధాకర్‌రెడ్డి, వెంకటహరిత చీమల, సుబ్బరాయ ప్రఫుల్ల చందు రేటూరి, సయ్యద్ ఎతేష్యామ్ హుస్సేన్, పశ్చిమ గోదావరికి చెందిన ప్రవీణ రంగోలను ప్రతివాదులుగా పేర్కొన్నాడు. కాగా జగత్‌విఖ్యాత్‌రెడ్డి తరపున అఖిలప్రియ మరిది (భార్గవరామ్ తమ్ముడు) శ్రీసాయి చంద్రహాస్ కేసు వేశారు. అందరూ ఒకే ఇంట్లో ఉంటూ కోర్టును ఆశ్రయించడం పట్ల కొనుగోలుదారులు అఖిలప్రియపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. అయితే తన సోదరుడు తమపై కేసు వేయలేదని అఖిలప్రియ అన్నారు. భూ విక్రయంపై కొనుగోలుదారులు కోర్టుకు వెళ్లారని, అందులో భాగంగా తమకు తాఖీదులు వచ్చాయన్నారు. మరోవైపు జగత్‌విఖ్యాత్‌రెడ్డి తమ కుటుంబంలో ఎలాంటి విభేదాలు లేవంటూ ఓ వీడియో విడుదల చేశారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు అవాస్తవమని, ప్రస్తుతం సోదరి అఖిలప్రియతో కలిసి దుబాయ్‌లో ఉన్నట్లు చెప్పారు. -
ఏవీ సుబ్బారెడ్డి కుటుంబంతో మా బంధం అప్పుడే తెగిపోయింది
-
'మమ్మల్ని వేలెత్తి చూపితే ఊరుకోం'
సాక్షి, అమరావతి : టీడీపీ నాయకుడు ఏవీ సుబ్బారెడ్డిపై పర్యాటక శాఖమంత్రి భూమా అఖిలప్రియ సోదరి మౌనికరెడ్డి నిప్పులు చెరిగారు. ఆళ్లగడ్డ రాళ్ల పంచాయితీ వ్యవహారానికి సంబంధించి మంత్రి అఖిలప్రియ గురువారం తన కుటుంబసభ్యులతో కలిసి అమరావతి చేరుకున్నారు. ఈ సందర్భంగా మౌనికా రెడ్డి మాట్లాడుతూ...‘ ఈ పంచాయితీ తేల్చాలని అధిష్టానాన్నే అడుగుతాం. మా అక్క మంత్రిగా ఉన్న నియోజకవర్గంలో ఏవీ సుబ్బారెడ్డి సైకిల్ యాత్ర చేయడం ఎంతవరకూ సబబు. గుంటనక్క అని ఏవీ సుబ్బారెడ్డిని మా అక్క ఏనాడు అనలేదు. అఖిలప్రియ ధర్నా చేసినప్పుడు ఏవీ వర్గీయులు వచ్చి ఈలలు వేస్తూ వెటకారంగా కామెంట్లు చేశారు. అందుకే రాళ్ల దాడి జరిగి ఉండవచ్చు. అక్క వెంట భూమా, ఎస్వీ కుటుంబాలు అండగా ఉన్నాయి. మమ్మల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి విమర్శిస్తే, ఆళ్లగడ్డ ప్రజలు చూస్తూ ఊరుకోరు. ఆళ్లగడ్డ, నంద్యాల ప్రజలు తప్పకుండా బుద్ధి చెబుతారు. నాన్న చనిపోయిన రెండోరోజు నుంచే ఏవీ సుబ్బారెడ్డి పద్ధతిలో మార్పు వచ్చింది. రాజకీయంగా ఎదగడం కోసం సుబ్బారెడ్డి మా అక్కపై విమర్శలు చేస్తున్నారు. భూమా కుటుంబంతో సంబంధాలు తెగిపోయాయని ఏవీ సుబ్బారెడ్డి చెప్పారు. సుబ్బారెడ్డి కూతుళ్లు నాన్న సమాధి వద్దకు రానప్పుడే మా మధ్య బంధం తెగిపోయింది. నాన్న వాళ్ల పిల్లలను ఎలా చూసుకున్నారో అందరికీ తెలుసు. నాన్న చనిపోయాక మా కుటుంబం ఎన్నో ఇబ్బందులు పడ్డాం. ఎంతోమంది విమర్శలు చేసినా సహనంతో ఉన్నాం. ఏవీ సుబ్బారెడ్డి వైఖరిని అంతా చూశారు. ఆయనను మామా అనే హక్కు ఉందో లేదో. అఖిలప్రియ ముందు భూమా అఖిలప్రియ అనే విషయం మరిచారు. రాజకీయంగా ఎదగాలనుకుంటే మా సహకారం ఉంటుంది. కానీ తన రాజకీయ ఎదుగుదలకు మాపై వేలెత్తి చూపితే చూస్తూ ఊరుకోం. పబ్లిక్‌లో మా కుటుంబంపై వేలెత్తి చూపిస్తే సహించేది లేదు. సుబ్బారెడ్డి కూతురు మాపై విమర్శలు చేసినా మాతో కలిసి పెరిగారని ఓపికతో ఉన్నాం. ఇంకా విమర్శలు చేస్తూ ఆళ్లగడ్డ ప్రజలు సహించరు. అఖిలను తాకాలంటే భూమా కేడర్ ఉందనే విషయాన్ని ఏవీ సుబ్బారెడ్డి గుర్తుంచుకోవాలి. ముఖ్యమంత్రిపై మాకు నమ్మకం ఉంది. భూమా కుటుంబానికి అండగా ఉంటామని సీఎం భరోసా ఇచ్చారు. ఇక రాళ్లదాడి మా అనుచరులే చేశారా? లేదా అనేది విచారణలో తేలుతుంది.’ అని అన్నారు. -
‘అఖిలప్రియకు ఇగో ఎక్కువ..’
సాక్షి, విజయవాడ: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ టీడీపీలో మరోసారి విభేదాలు బయట పడ్డాయి. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియపై ఏఐఆర్సీ మాజీ చైర్మన్, టీడీపీ నాయకుడు ఏవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. అఖిలప్రియతో మనస్పర్ధలు వాస్తవమేనని ఆయన స్పష్టం చేశారు. ఏవీ సుబ్బారెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఇగో ప్రాబ్లమ్స్ వల్లే అఖిలప్రియ తనపై విమర్శలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ‘నన్ను గుంట నక్కతో పోల్చడం బాధాకరం.. మంత్రి విమర్శలకు కాలమే సమాధానం చెబుతుంది. సీనియర్లను మంత్రి ఎందుకు దూరం పెడుతున్నారో అర్థం కావడం లేదు. నేను ఆళ్లగడ్డ నుంచి పోటీ చేయాలా? నంద్యాల నుంచి పోటీ చేయాలా? అన్న విషయం పార్టీ నిర్ణయిస్తుంది. నన్ను ఆళ్లగడ్డకు వెళ్లొద్దని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పినట్టు వస్తున్న వార్తలు అవాస్తవం. అందరూ కలిసి పనిచేయాలని సీఎం సూచించారు. చంద్రబాబు నిర్ణయానికి కట్టుబడి ఉంటాను. భూమా నాగిరెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా నాతో చర్చించేవారు.. కానీ అఖిలప్రియ నాతో చర్చించాల్సిన అవసరం లేదనుకుంటున్నారు. చంద్రబాబు సింగపూర్ నుంచి వచ్చాక మరోసారి ఆయనతో భేటీ అవుతాను’ అని ఆయన అన్నారు. -
అఖిలప్రియ వార్తా.. ఐతే ఆపెయ్!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ, భూమా నాగిరెడ్డి ‘ఆత్మ స్నేహితుడు’ ఏవీ సుబ్బారెడ్డి మధ్య వార్ మరింత ముదిరింది. ఏకంగా భూమా అఖిలప్రియకు సంబంధించిన వార్తలను ప్రసారం చేయకూడదని ఏవీ సుబ్బారెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఆదేశాల నేపథ్యంలో నంద్యాల సిటీ కేబుల్‌లో మంత్రి వార్తలతో పాటు నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి కార్యక్రమాలను కూడా ప్రసారం చేయడం లేదు. నంద్యాలతో పాటు ఆళ్లగడ్డ, బనగానపల్లె ప్రాంతాల్లోనూ వీరి వార్తలకు బ్రేక్ పడింది. అయితే.. సిటీకేబుల్‌లో తమకూ వాటా ఉందని, తమ వార్తలను ఎందుకు ప్రసారం చేయరంటూ కేబుల్ సిబ్బందిని మంత్రి అఖిలప్రియ హెచ్చరించారు. ఏ విషయమైనా ఏవీతోనే తేల్చుకోవాలని వారు స్పష్టం చేశారు. ఆయనతో మాట్లాడే ప్రసక్తే లేదని అఖిలప్రియ భీష్మించారు. మొత్తమ్మీద వారం రోజులుగా వీరిద్దరి వార్తలు లేకుండానే సిటీకేబుల్ నడుస్తుండటం చర్చనీయాంశమయ్యింది. భూమా కుటుంబ వార్తలు లేకుండా ఉండటం సిటీ కేబుల్ చరిత్రలోనే మొదటిసారి కావడం గమనార్హం. రోజురోజుకూ... భూమా నాగిరెడ్డికి ఏవీ సుబ్బారెడ్డి ఆత్మగా వ్యవహరించేవారు. ఏవీ లేకుండా ఏ రాజకీయ నిర్ణయమూ భూమా తీసుకునే పరిస్థితి ఉండేది కాదు. అయితే, భూమా నాగిరెడ్డి మరణం తర్వాత ఇరు కుటుంబాల మధ్య దూరం పెరిగింది. ఒకరినొకరు మాట్లాడుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఇక కొత్త సంవత్సరం సాక్షిగా వీరి మధ్య అగాధం మరింత పెరిగింది. నూతన సంవత్సర వేడుకల పేరుతో ఏవీ సుబ్బారెడ్డి భారీ విందును ఆళ్లగడ్డలో ఏర్పాటు చేశారు. దీనికి వెళ్లొద్దని మంత్రి ఆదేశాలు జారీచేశారు. అయినా, వారి కుటుంబ సభ్యులు కూడా కొద్ది మంది హాజరుకావడం గమనార్హం. తాజాగా ఏవీ హెల్ప్‌లైన్ పేరుతో సుబ్బారెడ్డి ఆళ్లగడ్డలో కార్యకలాపాలు ప్రారంభించారు. మార్కెట్‌యార్డులో రైతులకు భోజన వసతి కల్పించే విషయంలో కూడా గొడవ పడ్డారు. నేరుగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునేదాకా వెళ్లారు. ఇదే తరుణంలో కేబుల్ వార్‌కు ఏవీ సుబ్బారెడ్డి తెరలేపారు. మొదటగా మంత్రి అఖిలప్రియకు సంబంధించిన కార్యక్రమాలను ప్రసారం చేయొద్దని సిటీ కేబుల్ సిబ్బందిని ఆదేశించారు. ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి కార్యక్రమాలను మాత్రం ప్రసారం చేశారు. అయితే..తన సోదరి అఖిలప్రియ కార్యక్రమాలనూ కవర్ చేయాలని బ్రహ్మానందరెడ్డి కోరారు. ఇందుకు ఏవీ ససేమిరా అన్నారు. ఈ నేపథ్యంలో తన వార్తలు కూడా ప్రసారం చేయొద్దని బ్రహ్మానందరెడ్డి తేల్చిచెప్పినట్టు సమాచారం. దీంతో వాటిని కూడా నిలిపివేశారు. కాగా.. సిటీ కేబుల్‌లో తమకూ 50 శాతం వాటా ఉందని, ఎందుకు ప్రసారం చేయరంటూ మేనేజర్ జయచంద్రారెడ్డితో అఖిలప్రియ వాదించినట్టు సమాచారం. అయితే, ఏ విషయమూ ఏవీ సుబ్బారెడ్డితోనే తేల్చుకోవాలని ఆయన పేర్కొన్నట్టు తెలిసింది. ఏవీతో మాట్లాడే ప్రసక్తే లేదని అఖిలప్రియ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో వారం రోజుల నుంచి ఇద్దరి వార్తలకు నంద్యాల సిటీ కేబుల్‌లో బ్రేక్ పడింది. -
భూమా బతికుంటే అఖిలప్రియ చెంపలు వాయించేవారు..
-
భూమా బతికుంటే అఖిలప్రియ చెంపలు వాయించేవారు..
సాక్షి, కర్నూలు : కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో అధికార పార్టీలో అసంతృప్తి సెగలు చల్లారడం లేదు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి భూమా అఖిలప్రియపై దివంగత భూమా నాగిరెడ్డి సన్నిహితుడు ఏవీ సుబ్బారెడ్డి మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టారు. ఇప్పటికే వీరిద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. ఓ దశలో అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి మధ్య సయోధ్య కుదిర్చేందుకు సీఎం చంద్రబాబు ఆదేశంతో టీడీపీ నేతలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఏవీ సుబ్బారెడ్డి ...మంత్రి అఖిలప్రియతో ఢీ అంటే ఢీ అంటున్నారు. ఆళ్లగడ్డలో గురువారం జరిగిన ఏవీ హెల్ఫ్‌లైన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఏవీ సుబ్బారెడ్డి ...మంత్రి అఖిలప్రియపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘భూమా నాగిరెడ్డి బతికుంటే నన్ను గుంటనక్కలు అని సంబోధించినందుకు అఖిలప్రియ చెంపలు వాయించి ఇంట్లో కూర్చోమని చెప్పేవాడు. అది మా ఇద్దరి మధ్య అనుబంధం. భూమా నాగిరెడ్డి హీరో అయితే నేను డైరెక్టర్‌ను. సినిమాలో హీరోనే కనబడతాడు..డైరెక్టర్ కనిపించడు...నేను కూడా అంతే. భూమా వర్థంతి సభలో నేను లేకుంటే.. ఆయన ఆత్మ శాంతిస్తుందా?. భూమా నాగిరెడ్డి కోసం ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో నాకు తెలుసు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవకాశం ఇస్తే ఎమ్మెల్యేగా ఆళ్లగడ్డలో పోటీ చేస్తా. ఆళ్లగడ్డలో ఏ సమస్య ఉన్నా నాకు ఫోన్ చేయండి. నా నెంబర్ 7093382333’ అని తెలిపారు. కాగా దివంగత భూమా నాగిరెడ్డి, ఏవీ సుబ్బారెడ్డిల స్నేహం బలమైంది. వీరిద్దరూ ప్రాణ స్నేహితులుగా మెలిగారు. అయితే భూమా మరణించిన తర్వాత భూమా కుమార్తె మంత్రి అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డిల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఏవీ సుబ్బారెడ్డిని.. అఖిలప్రియ ఖాతరు చేయకపోవడంతో ఆళ్లగడ్డలో ఆయన తిష్టవేశారు. తన బలాన్ని అధికార పార్టీ నేతల దృష్టికి తీసుకొని వెళ్లి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆళ్లగడ్డ నుంచి పోటీ చేసే యోచనలో ఉన్నారు. ఇందుకు అనుగుణంగా పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం ఛాన్స్ ఇస్తే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ఇప్పటి నుంచే ఫీలర్స్ వదులుతున్నారు. అందులో భాగంగానే ఏవీ హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. -
మంత్రి కళా వెంకట్రావుతో అఖిలప్రియ భేటీ
-
నంద్యాల ఉప ఎన్నికపై కొనసాగుతున్న వివాదం
అమరావతి: కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నిక అభ్యర్ధిత్వంపై ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. నంద్యాల ఉప ఎన్నికలో తాను నూటికి నూరుపాళ్లు పోటీ చేసి తీరతానని శిల్పా మోహన్‌రెడ్డి ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి స్పష్టం చేశారు. కొద్దిరోజుల క్రితమే శిల్పా సోదరులు సీఎంను కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. తన వర్గాన్ని కాపాడుకోవడానికి, తన ఉనికిని నిలబెట్టుకోవడానికి పోటీ చేయక తప్పదని స్పష్టం చేశారు. మరోవైపు మంత్రి అఖిలప్రియ కూడా తమ అనుచరులకే సీటు ఇవ్వాలని పట్టుపడుతున్నారు. దీంతో ఇరువురి మధ్య విభేదాల నేపథ్యంలో ఏకాభిప్రాయం కోసం చంద్రబాబు పాట్లు పడుతున్నారు. ఈ సందర్భంగా మంత్రి కళా వెంకట్రావు అధ్యక్షతన జరిగిన సమావేశానికి అఖిలప్రియ, మాజీ మంత్రి ఎన్ఎండి ఫరూక్ హాజరై నంద్యాల ఉప ఎన్నిక అభ్యర్థిత్వంపై చర్చించారు. నంద్యాల ఉప ఎన్నికపై నేతలతో కళా వెంకట్రావు విడివిడిగా భేటీ అవుతున్నారు. అలాగే ఎస్పీవై రెడ్డి అల్లుడు శ్రీధర్‌రెడ్డి కూడా వెంకటరావుతో మాట్లాడారు. కళా వెంకట్రావుతో చర్చల అనంతరం వీరంతా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలవనున్నట్లు సమాచారం. -
'నంద్యాల అభ్యర్థిని చంద్రబాబే నిర్ణయిస్తారు'
కర్నూలు : కర్నూలు జిల్లా నంద్యాల అభ్యర్థిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే నిర్ణయిస్తారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు. ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ టికెట్ ఎవరికి ఇచ్చినా తాము గెలుపు కోసం ప్రయత్నిస్తామని తెలిపారు. కాగా నంద్యాల అసెంబ్లీ సీటు తమదంటే తమదని శిల్పా, భూమా వర్గాలు ధీమాగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏకాభిప్రాయం వచ్చాకే అభ్యర్థిని ప్రకటించాలని పార్టీ అధిష్టానవర్గం భావిస్తోంది. నంద్యాల టిక్కెట్ విషయంపై మాజీ మంత్రి శిల్పామోహన్‌రెడ్డి పట్టుదలగా ఉన్నారనే సమాచారంతో పర్యాటక శాఖ మంత్రి అఖిలప్రియ వేగంగా పావులు కదిపారు. శిల్పా సోదరుల కంటే ముందుగానే సీఎంతో భేటీ అయ్యారు. తన తండ్రి మరణించడంతో జరుగుతున్న ఉప ఎన్నికలు కాబట్టి తమ కుటుంబానికే టిక్కెట్ ఇవ్వాలని మరోసారి కోరారు. తన తల్లి శోభానాగిరెడ్డి వర్ధంతి సందర్భంగా తమ కుటుంబ అభ్యర్థిని ప్రకటిస్తామని సీఎంకు తేల్చిచెప్పారు. దీనికి సీఎం కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. అయితే అభ్యర్థిని ముందుగా ప్రకటిస్తే ఇబ్బందులు వస్తాయని భావించిన చంద్రబాబు నాయుడు అభ్యర్థిని ఇప్పుడే ప్రకటించవద్దని అఖిలప్రియను ఆదేశించడంతో ఆమె తన ప్రయత్నాన్ని విరమించుకున్నారు. అంతేకాకుండా నంద్యాల ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపిక విషయంలో పార్టీదే తుది నిర్ణయమని తన తల్లి శోభానాగిరెడ్డి మూడో వర్థంతి కార్యక్రమంలో పాల్గొన్న అఖిలప్రియ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆమె మాట్లాడుతూ నంద్యాల ఉప ఎన్నిక అభ్యర్థి విషయంలో పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు. దీనిపై చర్చిచేందుకు రెండుమూడు రోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబును కలుస్తానని ఆమె తెలిపారు. మరోవైపు శిల్పామోహన్‌రెడ్డిని బుజ్జగించేందుకు సీఎం శతవిధాలా ప్రయత్నించారు. 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్‌తో పాటు మోహన్‌రెడ్డి కుమారునికి ఎంపీ టిక్కెట్ కూడా ఆఫర్ చేసినట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అంతే కాకుండా మంత్రి పదవిని కూడా ఇస్తామని సీఎం పేర్కొన్నట్లు సమాచారం. అయితే భూమానాగిరెడ్డి మంత్రి పదవి ఉదంతం నేపథ్యంలో సీఎం మాటలను నమ్మేందుకు శిల్పామోహన్‌రెడ్డి సుముఖంగా లేరని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. మొత్తం మీద మరో రెండు, మూడు రోజుల్లో నంద్యాల ఉప ఎన్నికల రాజకీయం విషయంలో అధికార పార్టీ వ్యవహారం తేటతెల్లం కానుంది. -
నంద్యాలలో పోటీ చేస్తా
-
నంద్యాలలో పోటీ చేస్తా
చంద్రబాబుకు తెగేసి చెప్పిన శిల్పా మోహన్‌రెడ్డి సాక్షి, అమరావతి: కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికలో తాను నూటికి నూరుపాళ్లు పోటీ చేసి తీరతానని శిల్పా మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి తెగేసి చెప్పారు. తన వర్గాన్ని కాపాడుకోవడానికి, తన ఉనికిని నిలబెట్టుకోవడానికి పోటీ చేయక తప్పదని స్పష్టం చేశారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో బుధవారం రాత్రి శిల్పా సోదరులు ఆయనను కలిశారు. ఈ సందర్భంగా నంద్యాల ఉప ఎన్నికలో పోటీ చేసే అవకాశం తనకు ఇవ్వాల్సిందేనని మోహన్‌రెడ్డి పట్టుబట్టారు. ఒకవేళ సీటు రాకపోతే క్యాడర్‌ను నిలబెట్టుకోవడానికి తాను ఎలాంటి నిర్ణయాన్నయినా తీసుకుంటానని చెప్పారు. దీంతో తొందరపడి ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోవద్దని సీఎం సూచించారు. శిల్పా చక్రపాణిరెడ్డికి శాసన మండలి ఛైర్మన్ పదవి ఇస్తున్నాం కాబట్టి సహకరించాలని కోరారు. భూమా కుటుంబానికి మంత్రి పదవి ఇచ్చినా తాను అభ్యంతరం వ్యక్తం చేయలేదని, తన సోదరుడికి మండలి ఛైర్మన్ ఇచ్చినా తన సీటు తనకివ్వాల్సిందేనని మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. నచ్చజెప్పడానికి ప్రయత్నించినా మోహన్‌రెడ్డి వినిపించుకోకపోవడంతో... ఒకటి, రెండు రోజులు ఆగాక నిర్ణయం తీసుకుందామని చంద్రబాబు ఆయనకు చెప్పారు. నంద్యాలలో తమ కుటుంబానికి చెందిన వ్యక్తే పోటీ చేస్తారని, ఈ నెల 24న శోభానాగిరెడ్డి వర్థంతి రోజున అభ్యర్థిని ప్రకటిస్తామని మంత్రి అఖిలప్రియ చెప్పిన విషయం కూడా చర్చకు వచ్చినట్లు తెలిసింది. ఆ తర్వాత బయటకు వచ్చి మోహన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... నంద్యాల ఉప ఎన్నికలో తాను వంద శాతం పోటీ చేస్తానని స్పష్టం చేశారు. (చదవండి: ఉపఎన్నికపై మంత్రి సంచలన ప్రకటన) -
ఉపఎన్నికపై మంత్రి సంచలన ప్రకటన
నంద్యాల ఉప ఎన్నికలలో తమ కుటుంబ సభ్యులే పోటీ చేస్తారంటూ మంత్రి భూమా అఖిలప్రియ సంచలన ప్రకటన చేశారు. పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి విజయవాడ భవానీ ఐలండ్‌లో పర్యటించిన ఆమె.. పర్యాటకానికి సంబంధించిన విషయాలతో పాటు ఈ అంశంపై కూడా స్పందించారు. మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. ఈ ఎన్నికలలో తమ కుటుంబం నుంచే పోటీ చేస్తారని, తన తల్లి శోభా నాగిరెడ్డి వర్ధంతి అయిన 24వ తేదీన అభ్యర్థిని ప్రకటిస్తామని ఆమె ఏకపక్షంగా ప్రకటించారు. భూమా నాగిరెడ్డి మరణంతో ఖాళీ అయిన ఈ స్థానం ఉప ఎన్నిక గురించి ఇంతవరకు పార్టీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు గానీ, ఆయన కుమారుడు లోకేష్ గానీ ఒక్క మాట కూడా చెప్పకముందే అఖిలప్రియ ఈ విషయాన్ని వెల్లడించడం నేతలను విస్మయపరిచింది. వాస్తవానికి నంద్యాల నియోజకవర్గానికి టీడీపీ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న శిల్పా మోహన్ రెడ్డి ఈ స్థానాన్ని ఆశిస్తున్నారు. దాంతో ఆయనతో ఈ విషయమై చర్చించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు మోహన్ రెడ్డిని విజయవాడ రప్పించారు. సాయంత్రం 6 గంటల సమయంలో ముఖ్యమంత్రితో ఆయన భేటీ కావాల్సి ఉండగా, ఈలోపే అఖిలప్రియ ఏకపక్షంగా ఇలా ప్రకటన చేయడం ఎవరికీ మింగుడు పడటం లేదు. అఖిలప్రియకు మంత్రిపదవి ఇచ్చినప్పుడు కూడా అభ్యంతరం చెప్పని శిల్పా మోహన్ రెడ్డి.. ఇప్పుడు టికెట్ దక్కకపోతే మాత్రం ఊరుకునే పరిస్థితి లేదు. ఒకవైపు ఆయనను మంత్రి అచ్చెన్నాయుడు బుజ్జగించే ప్రయత్నం చేస్తుండగా, ఇంతలో భూమా కుటుంబం నుంచి ఇలాంటి విషయం రావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. -
ఉపఎన్నికపై మంత్రి సంచలన ప్రకటన
-
కుందూలో భూమాకు పిండ ప్రదానం
ఉయ్యాలవాడ : దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి పెద్దకర్మ సందర్భంగా కుమారుడు జగత్‌విఖ్యాత్‌రెడ్డి గురువారం ఉయ్యాలవాడ సమీప కుందూనదిలో వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య తండ్రికి పిండ ప్రదానం చేశారు. ఆళ్లగడ్డ పట్టణ పరిసర ప్రాంతాల్లోని నదులు, వాగుల్లో నీటి పారకం లేకపోవడంతో ప్రత్యేక వాహనాల్లో తరలివచ్చి ఉయ్యాలవాడ, రూపనగుడి మధ్య కుందూనదిలో పిండప్రదానం చేశారు. భూమా బ్రహ్మానందరెడ్డి, భూమా కిశోర్‌రెడ్డి, భూమా మహేష్‌రెడ్డి, భూమా జగన్నాథరెడ్డితో పాటు స్థానిక నాయకులు బుడ్డా రామిరెడ్డి, కూడాల నారాయణరెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు. -
ఓటు.. తిరుగుబాటు!
► శిల్పాకు ఓటేయడంపై భూమా వర్గం కినుక ► తమపై కేసులు పెట్టిన వారికి ఎలా సహకరించేదని మండిపాటు ► ఆందోళనలో అధికార పార్టీ అభ్యర్థి సాక్షి ప్రతినిధి, కర్నూలు: తమపై అక్రమ కేసులు బనాయించి.. ఇన్ని రోజులు మానసికంగా హింసించిన వ్యక్తికి తాము ఎలా ఓటు వేస్తామని నంద్యాల, ఆళ్లగడ్డలోని భూమా అనుచరులు ప్రశ్నిస్తున్నారు. కేవలం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు కోసం ఇప్పుడు తమను అడిగితే సానుకూలంగా ఎలా స్పందిస్తామని భూమా అనుచర ఎంపీటీసీలు, జెడ్పీటీసీ సభ్యులు, కౌన్సిలర్లు సూటిగా నిలదీస్తున్నారు. ఎన్నికల్లో గెలుపునకు తమను ఉపయోగించుకుంటామంటే ఎలా సహకరిస్తామని తేల్చి చెబుతున్నారు. తమ నేతను కూడా మంత్రి పదవి ఆశ చూపి కరివేపాకులా వాడుకుని వదిలేసిన అంశాన్ని తాము ఎలా మర్చిపోగలమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైగా తమపై నమ్మకం లేదని బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్న వ్యక్తికి తాము మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తున్నారు. ఇదే విషయాన్ని భూమా నాగిరెడ్డి కూతురు, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియకు కూడా తేల్చిచెప్పినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో అధికార పార్టీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిలో ఆందోళన మొదలైనట్టు తెలిసింది. నమ్మకం లేదన్నారుగా..! వాస్తవానికి తాము ఓటేస్తామన్న నమ్మకం అభ్యర్థికి లేదని ఈ నేతలు వాదిస్తున్నారు. అందుకే తాము ఓటు వేయమనే అపనమ్మకంతోనే ఏకంగా సీఎంకు ఫిర్యాదు చేసిన శిల్పా వర్గం ఇప్పుడు తమను ఓటు అడగటం ఎంత వరకు సమంజసమని భూమా అనుచరులు అంటున్నారు. కేవలం తమ నేతను లక్ష్యంగా చేసుకుని మానసికంగా హింసించి చనిపోవడానికి కారణమైన పార్టీకి కూడా తాము ఓటు వేసే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. ఇది ఆయన ఆత్మకు కూడా శాంతి చేకూర్చే అవకాశం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా తాజాగా కూడా తమపై కేసు నమోదైన విషయాన్ని వీరు ఉదహరిస్తున్నారు. ఓటు వేయకపోతే పనులు కావంటూ తమను పరోక్షంగా హెచ్చరిస్తున్నారనే అంశాన్ని కూడా వీరు చర్చించుకుంటున్నారు. అంటే ముందుగానే తాము ఓటు వేయమని.. వేయకపోతే బెదిరింపులకు దిగితే తాము వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని పేర్కొంటున్నారు. మొత్తం మీద అధికార పార్టీలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల వ్యవహారం కాస్తా వర్గపోరుకు వేదికగా మారినట్లు తెలుస్తోంది. విందులు.. వినోదాలు అధికారపార్టీ నేతల్లో తాజా పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. దీంతో భారీగా విందులు, వినోదాల పేరిట కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఒక్కో ఓటుకు లక్ష రూపాయల నుంచి రెండు లక్షల వరకూ పంచుతున్నారు. ఇప్పటికే గోవా, ఊటీల్లో క్యాంపులు వేసిన అధికారపార్టీ నేతలు.. విందులు, వినోదాలు ఇస్తూ కూడా ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ అనుమానం ఉండటంతో.. తమ వద్ద డబ్బులు తీసుకుని మళ్లీ ప్రతిపక్షానికి ఓటు వేస్తే రావద్దొంటూ తమ వద్దకు వచ్చిన నేతలతో వ్యాఖ్యానిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ వ్యాఖ్యలతో తమను అవమానించినట్టేనని మదనపడుతున్నారు. మొత్తం మీద అధికారపార్టీలో గతంలో గెలిచిన తరహాలో పోటీ సులువగా లేదని.. పైగా ఓటమి తప్పదనే ఆందోళన వ్యక్తమవుతోంది. -
మరో వెన్నుపోటు విషాదం
-
కేసులు.. వేధింపులు.. అవమానాలు
-
ఇదేం దిగజారుడు రాజకీయం?
-
ఇదేం దిగజారుడు రాజకీయం?
టీడీపీ తీరుపై వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫైర్ ⇒ భూమా సంతాప తీర్మానాన్ని కూడా రాజకీయాలకు వాడుకుంటారా? ⇒ ఆయన మంచి మాత్రమే రికార్డుల్లో ఉండాలని సభకు దూరంగా ఉన్నాం ⇒ భూమాతో చంద్రబాబు తప్పు చేయించారు.. అది మేం చెప్పాల్సి వచ్చేది ⇒ అఖిల ప్రియకు మొట్టమొదట ఫోన్ చేసింది నేను, మా అమ్మే.. ⇒ భూమా మరణించి 24 గంటలు కూడా గడవలేదు..రాజకీయం కోసమే ఆయన కూతుర్ని శాసనసభకు తీసుకొచ్చారు ⇒ బాబు మూడురోజుల్లో మంత్రిని చేస్తానన్నాడని మావాళ్లకు భూమా చెప్పాడు ⇒ నంద్యాల మాదే.. ఉప ఎన్నికలలో కచ్చితంగా పోటీ చేస్తాం సాక్షి, అమరావతి: దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మంచితనమే ఏపీ శాసనసభ రికార్డుల్లో ఉండాలని, ఆయన చివరి దశలో చేసిన తప్పులు రికార్డుల్లోకి వెళ్లడం తమకు ఇష్టం లేదని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. ఈ కారణంగానే వైఎస్సార్సీపీ శాసనసభా పక్షం మంగళవారం భూమా సంతాప తీర్మానం సందర్భంగా శాసనసభలోకి వెళ్లలేదని స్పష్టం చేశారు. దివంగత నాయకుడి సంతాప తీర్మానాన్ని కూడా రాజకీయం చేసిన ఘనత టీడీపీదేనని ధ్వజమెత్తారు. దిగజారుడు, కుసంస్కార రాజకీయాలు ఆ పార్టీకి కొత్తేమీ కాదని మండిపడ్డారు. మంగళవారం అసెంబ్లీ వాయిదా పడిన తరువాత వైఎస్ జగన్ లాబీల్లోని తన చాంబర్లో మీడియాతో మాట్లాడారు. మనుషుల్లో ఉండాల్సింది తొలుత మానవత్వమని చెప్పారు. అయితే, మంగళవారం అసెంబ్లీలో జరిగింది చూస్తే సంతాప తీర్మానం వెనక్కిపోయి రాజకీయమే ముందుకొచ్చిందనే విషయం స్పష్టమైందన్నారు. తాము సభలోకి వెళ్లి సంతాప తీర్మానంపై మాట్లాడి ఉంటే భూమా నాగిరెడ్డి మంచితోపాటుగా చివరలో ఆయన చేసిన తప్పును కూడా చెప్పాల్సి వచ్చేదన్నారు. భూమా చేసిన తప్పును చెప్పడం ఇష్టంలేకనే హుందాతనం పాటించామని పేర్కొన్నారు. జగన్ ఇంకా ఏం చెప్పారంటే.... మొదట ఫోన్ చేసింది నేను, మా అమ్మే ‘‘భూమా నాగిరెడ్డి చనిపోయాడు. ఆయన చివరిదశలో చేసిన తప్పును ఎందుకు చెప్పడం, అదంతా అసెంబ్లీ రికార్డుల్లోకి పోవడం ఎందుకు అని సభలోకి వెళ్లకుండా మౌనంగానే ఉందామనుకున్నాం. మేము కనుక అసెంబ్లీలోకి వెళ్లి ఉంటే.. చంద్రబాబు చేయిస్తే భూమా ఎలా తప్పు చేశారో మేం చెప్పాల్సి వచ్చేది. అలా చెప్పి ఉంటే ఏమయ్యేది? ఎవరు రాజకీయాలు చేస్తున్నారు? ఎవరు హుందాగా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోండి. నాగిరెడ్డి చనిపోయాడని తెలిసి మొట్టమొదట ఫోన్ చేసింది నేనూ, మా అమ్మే. మృతి వార్త తెలియగానే చాలా బాధేసింది. ఇద్దరమూ అఖిలప్రియతో మాట్లాడి ధైర్యం చెప్పాం. అదీ వ్యక్తిగతంగా మేం ప్రదర్శించిన మానవత్వం. కానీ, ఇక్కడ కుట్ర రాజకీయాలు జరుగుతున్నాయి. 24 గంటలైనా గడవక ముందే అఖిలను అసెంబ్లీకి ఎందుకు తీసుకొచ్చారు? తండ్రి మరణించి 24 గంటలైనా గడవక ముందే అఖిలప్రియను రాజకీయాల కోసం అసెంబ్లీకి తీసుకొ చ్చారు. ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి ఉండి ఏడ్వడానికీ అవకాశం ఇవ్వలేదు. వీళ్ల(టీడీపీ పెద్దలు) రాజకీయాలను చూసి అందరూ సిగ్గుపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజకీయ పార్టీని నడిపేటప్పుడు ఒక అంశాన్ని గుర్తుంచుకోవాలి. మేము సారథ్యం వహిస్తున్న పార్టీని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అది చాలా ముఖ్యం. మనకు ఒకరిపై ఉన్న వ్యక్తిగత అభిమానం పార్టీ శ్రేణుల నైతికతను దెబ్బతీసే విధంగా ఉండరాదు. భూమా మృతి చెందిన విషయం తెలియగానే మేము ఆయన కుమార్తెకు ఫోన్ చేసి, పరామర్శించాం. ఇదీ తక్షణమే మేము స్పందించిన తీరు. అంతకు మించి ఏం చేసినా పార్టీ శ్రేణులకు తప్పుడు సంకేతాలు వెళతాయి. ఫిరాయించినవారితో మాట్లాడించి లబ్ధి పొందుదామనుకున్నారు.. మేం అక్కడకు (సభలోకి) వెళ్లి ఏం చెప్పినా అది వివాదానికి దారితీసి, పరిస్థితి వేరే రకంగా ఉండేది. మా పార్టీ నుంచి ఎవరైతే టీడీపీలోకి ఫిరాయించారో అలాంటి వారి చేతనే... చాంద్‌బాషా మొదలు డేవిడ్‌రాజు లాంటి వారి చేతనే మాట్లాడించారు. వాళ్లతో మాట్లాడించిన తీరు చూస్తే దీనిలో నుంచి ఏ విధంగా రాజకీయ లబ్ది పొందాలా అనే ఆలోచనలోనే టీడీపీ వారు మునిగిపోయినట్లుగా కనిపిస్తుంది. 24 గంటలైనా గడవక ముందే అఖిలప్రియను తీసుకొచ్చి శాసనసభలో కూర్చోబెట్టి రాజకీయాలు చేస్తా ఉన్నపుడు అలాంటి సభలో మేం ఏం మాట్లాడినా భూమా ప్రతిష్ట దెబ్బతినడమే కాకుండా మొత్తం రాజకీయంగా వివాదాస్పదం అవుతుంది. అసెంబ్లీలో సంతాపతీర్మానంపై ముందు విష్ణుకుమార్‌రాజుతో మాట్లాడించారు. ఆయన మాట్లాడిన మాటలు ఎంత రెచ్చగొట్టే విధంగా ఉన్నాయో అర్ధం అయ్యే ఉంటుంది. మేం కనుక అసెంబ్లీలోకి వెళ్లి ఉంటే చంద్రబాబు తప్పు చేయిస్తే భూమా నాగిరెడ్డి ఎలా తప్పు చేశారో మేం చెప్పాల్సి వచ్చేది. అలా చెప్పి ఉంటే ఏమయ్యేదో అర్ధం చేసుకోండి. చంద్రబాబు మూడు రోజుల్లో మంత్రిపదవి ఇస్తానని చెప్పాడట.. భూమా వైఎస్సార్సీపీని వీడి వెళ్లాలని అనుకుంటున్న రోజు సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి ఆయనతో మాట్లాడ్డానికి ఆయన ఇంటికి వెళ్లారు. ‘ఎందుకు వెళుతున్నారన్నా.. మీరు పొరబాటు చేస్తున్నారు’ అని నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. ‘నాకు మూడే మూడు రోజుల్లో మంత్రి పదవి ఇస్తానని చంద్రబాబు చెప్పారు. పచ్చకండువా వేసుకోవడమే ఆలస్యం... వెంటనే మంత్రిగా ప్రమాణస్వీకారం చేయిస్తారు. అందుకే టీడీపీలోకి వెళుతున్నా’ అని సజ్జల, వైవీతో భూమా చెప్పారు. ‘జగన్‌ను విడిచిపెట్టి పోవడం ఇష్టం లేదు’ అని భూమా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వెళితే మంత్రి పదవి ఎలా ఇస్తారని రామకృష్ణారెడ్డి ప్రశ్నిస్తే... చంద్రబాబు ఇస్తానన్నాడని నాగిరెడ్డి సమాధానమిచ్చారు. అలాంటి వ్యక్తిని సంవత్సరంపాటు అలాగే ఉంచేశారు. ప్రలోభాలు పెట్టినవాళ్లది ఎంత తప్పో, ఆ ప్రలోభాలకు లొంగిన వాళ్లది కూడా అంతే తప్పు. చంద్రబాబు గతంలో ఎన్టీ రామారావును ఏ రకంగా క్షోభకు గురిచేసి గుండెపోటుతో చనిపోయేటట్లుగా చేశారో ఇప్పుడు భూమా విషయంలో కూడా సరిగ్గా అలాగే జరిగింది. ఇంగితం ఉన్న వారికెవరికైనా.... ఒక పార్టీ నుంచి గెలిచిన వారికి మరో పార్టీలో మంత్రి పదవి ఇవ్వరాదనేది ఇంగితం ఉన్న వారెవరికైనా తెలిసిన అంశం. పదో తరగతి చదివినోడికి కూడా ఈ విషయం తెలుస్తుంది. అందుకే భూమా దగ్గరకి మా వాళ్లు వెళ్లి ఆయనకు జ్ఞానోదయం కలిగించేందుకు ప్రయత్నించారు. కానీ మూడు రోజుల్లో మంత్రి పదవి ఇస్తానని చంద్రబాబు చూపిన ఆశ ముందు మా వాళ్ల హితవు పని చేయలేదు. తెలంగాణలో టీడీపీ వారికి టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రి పదవి ఇచ్చినపుడు చంద్రబాబు ఏ విధంగా బయటకు వచ్చి మాట్లాడారో అందరికీ తెలుసు. గవర్నర్‌ను తప్పు దోవ పట్టించారనీ, అందుకే గవర్నర్ తప్పు చేశారని అన్నారు కదా. ఆరోజు గవర్నర్‌ను తప్పుదోవ పట్టించిన పరిస్థితుల్లో ఆయన తప్పు చేశారు. అక్కడ జరిగిన అదే తప్పును గవర్నర్ చేత రెండోసారి, మూడో సారి తప్పు చేయించాలంటే ఎవరూ చేయరు. ఒక పార్టీలో ఉన్న వారికి మంత్రిపదవి ఇవ్వాలంటే ఉన్న పార్టీకి రాజీనామా ఇచ్చి దానిని ఆమోదింప జేసుకున్న తరువాతనే మంత్రివర్గంలోకి తీసుకుంటారు. అలా జరగక పోతే ఇక ప్రజాస్వామ్యమనేదే ఉండదు. ఏ పార్టీ టికెట్ మీద గెలిచిన వాడైనా వచ్చి మంత్రి పదవి తీసుకోవడం ఏ మాత్రం ప్రజాస్వామ్య బద్ధం కాదు. స్పీకర్ మనవాడే... అధికారపక్షానికి చెందిన వాడే కాబట్టి ఏం చేసినా అనర్హత వేటు పడదు అంటే, అసలు ప్రజాస్వామ్యం ఉందనుకోవాలా... బతుకుతుందా? ప్రజాస్వామ్యం బతకాలి అనంటే అందుకు కొన్ని విధానాలు కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ప్రజాస్వామ్యంలో మెజారిటీ వచ్చిన పార్టీ అధికారంలోకి వస్తుంది. అధికారపక్షం ఎమ్మెల్యేలే మంత్రులుగా ప్రమాణస్వీకారం చేస్తారు. దాన్నే ప్రజాస్వామ్యమంటారు. దేశంలో... ప్రపంచంలో ఎక్కడ చూసినా ఇదే కనిపిస్తుంది. అధికారపక్షంలో మంత్రి పదవి పొందాలంటే ముందుగా తామున్న పదవికి రాజీనామా చేయాలి. మళ్లీ గెలుపొందాలి. ఆ తరువాతనే పదవి పొందాలి. ఎవరి ఇష్టా ఇష్టాల మీదనో ఆధారపడి అన్నీ ఇష్టానుసారం చేస్తాం అంటే కుదరదు. రేపు పొద్దున మేం కూడా అధికారంలోకి వస్తాం. వచ్చాక ఇదే కార్యక్రమం టప టప చేయాలంటే అదేమీ పెద్ద పని కానే కాదు. ఎవరైనా చేస్తారు. అందుకే గవర్నర్ ఫిరాయించిన వాళ్లతో ప్రమాణం చేయించలేరు. గవర్నర్ ఇలాంటివి ప్రోత్సహించరు. (భవిష్యత్తులో మీరు ఇలాంటివి ప్రోత్సహించరా? అని ప్రశ్నించినపుడు) ఇపుడే కాదు, గతంలో కూడా ఇలాంటివి చేయించలేదు. నా వ్యక్తిత్వానికి, చంద్రబాబు వ్యక్తిత్వానికి నక్కకూ... నాకలోకానికీ ఉన్నంత తేడా ఉంది. మేం ఎప్పుడైనా ఏదైనా రాజకీయాలు చేయాలనుకుంటే హుందాగానే చేస్తాం. నేనెవరికైనా మంత్రి పదవి ఇవ్వాలనుకుంటే ముందున్న పార్టీ పదవికి రాజీనామా చేయించి ఆమోదింప జేస్తాను. ఆ తరువాతనే మంత్రి పదవిని ఇస్తాను. అలా మంత్రి పదవి ఇచ్చిన వ్యక్తిని ప్రజల దగ్గరకు తీసుకు పోయి నా పార్టీ టికెట్ ఇచ్చి, నేనే ప్రచారం చేసి నన్ను చూసి ఓట్లేయమని అడుగుతాను. గెలిపించుకుని వస్తాను. ఇది కొత్తగా ఈ రోజు చేసింది కాదు. గతంలో మా పార్టీలోకి చేరడానికి ఉత్సాహం చూపించిన 18 మంది ఎమ్మెల్యేల చేత అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాసతీర్మానంపై ఓట్లు వేయించాను. వారంతా అనర్హతకు గురయ్యాక మా పార్టీ బీ ఫాం ఇచ్చి ఉప ఎన్నికల్లో పోటీ చేయించాం. అపుడు నేను, మా అమ్మ మాత్రమే పార్టీలో ఉన్నాం. ఎన్నికల్లో 15 మంది ఎమ్మెల్యేలు తిరిగి గెలుపొందారు. నంద్యాలలో పోటీ చేస్తాం విలేకరుల ప్రశ్నలకు జగన్ సమాధానమిస్తూ....‘నంద్యాల ఉప ఎన్నికలో కచ్చితంగా పోటీ చేస్తాం... అది అక్షరాలా మాసీటే... అయితే మేం ఈ విషయంలో ఏం చేస్తాం... ఎప్పుడు చేస్తాం అనేది వేచి చూడండి. సరైన సమయంలో మేం కచ్చితంగా ఒక నిర్ణయం తీసుకుంటాం. ఈ విషయంలో మాకు ఎలాంటి మొహమాటం (ఆబ్లిగేషన్) లేదు. ఎందుకంటే అది మా సీటే... గతంలో కొన్ని సందర్భాల్లో ఎవరైనా ఎమ్మెల్యేలు ఏ పార్టీకి చెందిన వారైనా చనిపోతే వారి కుటుంబం నుంచే మరొకరు పోటీ చేసినపుడు అలాంటి చోట్ల పోటీ చేయరాదనే విధానానికి కట్టుబడి పోటీ పెట్టలేదు. కానీ నంద్యాల విషయంలో ఈ సారి అలా చేయం. ఈ సీటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదే. అక్కడి ప్రజలు గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే ఓట్లేశారు. అందుకే పోటీ చేస్తాం. చంద్రబాబుది విలన్ క్యారెక్టర్ ఏ సినిమాకు వెళ్లినా... ఏ కథలోనైనా ఒకటే కనిపిస్తుందని రాజకీయాలు చేసే వారు ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. వాటిలో ఒక హీరో క్యారెక్టర్, ఒక విలన్ క్యారెక్టర్ ఉంటాయి. హీరో క్యారెక్టర్ ఎలా ఉంటుందో కొంచెం ఆలోచించుకోండి. కానీ విలన్ క్యారెక్టర్ గురించి పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు. చంద్రబాబు దగ్గర కూర్చుంటే తెలిసి పోతుంది. మేము కనుక సంతాప తీర్మానం సందర్భంగా సభలోకి వెళ్లి ఉంటే పాపం చనిపోయిన భూమా నాగిరెడ్డిని తప్పు చేసిన వ్యక్తిగా చెప్పాల్సి వచ్చేది. చనిపోయాడు కనుక ఆయన విషయంలో మర్యాద పాటించాలనుకున్నాం. మా మంచితనం చూపించాలనుకున్నాం, మంచితనాన్ని ప్రదర్శించాం. టీడీపీ వాళ్లు కుసంస్కార రాజకీయాల్లో పుట్టి పెరిగారు. 24 గంటలైనా గడవక ముందే భూమా కుమార్తెను అసెంబ్లీకి తేవడం వారి కుసంస్కారానికి నిదర్శనం. నిజంగా కుసంస్కారం, దిగజారుడు రాజకీయాలు వారివే. గతంలో శాసనసభలో శోభానాగిరెడ్డికి సంతాపం చెప్పడానికి కూడా టీడీపీ ప్రభుత్వం అంగీకరించలేదు. మా ఎమ్మెల్యేలు ప్రెస్‌మీట్ పెట్టి విమర్శించిన తరువాత గానీ ఆమె పేరును తీర్మానంలో చేర్చలేదు. ఇవన్నీ జరిగిన యథార్థాలే... అసెంబ్లీ రికార్డులను తిరగేస్తే అన్నీ తెలుస్తాయి. కుసంస్కార రాజకీయాల్లో పుట్టి పెరిగిన వీళ్లు ఎన్టీరామారావును వెన్నుపోటు పొడిచిన దగ్గరి నుంచీ అంతా కుసంస్కార రాజకీయాలే చేశారు. అయినా ఎవరు రాజకీయాలు చేస్తున్నారు, ఎవరు చేయడం లేదు, ఎవరు హుందాతనాన్ని ప్రదర్శించారు, ఎవరు ప్రదర్శించలేదు ఇవన్నీ చూసే వారికి అర్థం అవుతుంది. ఇంతకంటే నేను చెప్పేదేమీ లేదు. -
మరో వెన్నుపోటు విషాదం
డేట్లైన్ హైదరాబాద్ నాగిరెడ్డిని మంత్రిని చేస్తానని, తామే పెట్టిన తప్పుడు కేసులు ఎత్తేస్తాననీ చెప్పి పార్టీ ఫిరాయించేటట్టు చేసిన చంద్రబాబు ఆయనను తీవ్ర మానసిక ఒత్తిడికి గురి చేశారు. తీరా చివరకు నీ ప్రత్యర్థి వర్గ అభ్యర్థిని ఎంఎల్సీగా గెలిపించుకోనిస్తేనే అవన్నీ చేస్తామన్నారు. ఆ కారణంగానే నాగిరెడ్డి తీవ్ర మానసిక వ్యధకు గురై మరణించారని బాబుకు బాగా తెలుసు. కాబట్టే నాగిరెడ్డి మరణ వార్త విన్నప్పటి నుంచి ఆయన ఏ పదవీ ఆశించలేదు, ఆయనకు ఏ కోరికలూ లేవు అంటూ పదే పదే మాట్లాడుతున్నారు. శవయాత్ర సాగుతుండగా పాడె మీదకు విసిరే చిల్లర డబ్బులు, పేలాలు ఏరుకునే వారు ఉంటారు. అది వారి వృత్తి కావొచ్చు లేదా పేదరికం వారిచేత ఆ పని చేయిస్తూ ఉండొచ్చు. అంత హీన స్థితిలో ఉన్న మనుషులు ఇంకా మన మధ్య జీవిస్తున్నందుకు, వారి బ్రతుకులను మార్చలేక పోతున్నందుకు మనం అందరం సిగ్గుపడాలి తప్ప వారిని అగౌరవంగా చూడాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ, దాని అధినాయకుడు చంద్రబాబునా యుడు నాయకత్వంలో ప్రస్తుతం చేస్తున్న రాజకీయం అంతకన్నా హీనంగా ఉన్నది. ఇటువంటి రాజకీయం చేస్తున్న వారిని చూసి సభ్య సమాజం సిగ్గుతో తల దించుకునే పరిస్థితి. కర్నూల్ జిల్లా నంద్యాల వైఎస్ఆర్ కాంగ్రెస్ శాసన సభ్యుడు భూమా నాగిరెడ్డి మొన్న ఆకస్మికంగా మరణించారు. ఆయన ఏడాది క్రితం ఏవో ప్రలోభాలకో లేదా ఒత్తిడులకో లొంగి తెలుగుదేశం పార్టీ పంచన చేరినా సాంకేతికంగా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడే. అందుకే ఈ మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గ విస్తరణ చేస్తానని గవర్నర్ దగ్గరికి వెళ్లినప్పుడు... తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ శాసనసభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించేదిలేదని, వారి శాసనసభ సభ్యత్వాలకు రాజీ నామా చేయించి అప్పుడు రండని చెప్పి పంపేశారు. తెలంగాణలో పార్టీ ఫిరాయించి మంత్రివర్గంలో చేరిన తలసాని శ్రీనివాస్ యాదవ్ చేత ప్రమా ణం చేయించినందుకు తెలుగుదేశం వాళ్లు తిట్టిన తిట్లను గవర్నర్ ఎలా మరచి పోతారు? కాబట్టి భూమా నాగిరెడ్డి, ఆయన కూతురు అఖిలప్రియ, ఆయన బావమరిది ఎస్వీ మోహన్‌రెడ్డి సహా మొత్తం 21 మంది ఎంఎల్ ఏలూ సాంకేతికంగా ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంఎల్ఏలే. అఖిలప్రియ, మోహన్‌రెడ్డి సహా ఆ ఫిరాయింపుదారుల్లో ఎవరికి మంత్రి పదవి కట్టబెట్టాల నుకున్నా ఇప్పుడు చంద్రబాబు రాష్ట్ర గవర్నర్‌ను మార్పించి, అందుకు అను కూలంగా నడుచుకునే గవర్నర్‌ను వేయించుకోవాలి. ప్రస్తుతానికి అది ఆయన వల్ల జరిగే పనిలా కనిపించడం లేదు. ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్ని కల్లో సాధించిన అద్భుత విజయం తరువాత మోదీకి చంద్రబాబు కోరికలను తీర్చాల్సిన పరిస్థితి లేదు. మోదీ గురించి తెలిసిన వారు ఇప్పుడు అసలు బాబుకు ప్రధాని అపాయింట్మెంట్ దొరకడం కూడా కష్టమే అంటున్నారు. క్షుద్ర రాజకీయంతోనే గుండెలు పగిలే వ్యధ నాగిరెడ్డి చితి మంటలు ఇంకా ఆరక ముందే ఆయన కుమార్తెను, బావమరి దిని శాసనసభకు రప్పించి వారి చేత రాజకీయాలు మాట్లాడించిన వైనం చూసి విస్తుపోవాల్సి వచ్చింది. అందువల్లనే మంత్రి పదవుల విషయంలో అఖిలప్రియ, మోహన్‌రెడ్డిల పేర్లను ప్రస్తావించాల్సి వచ్చింది. నాగిరెడ్డి మర ణించిన విషయం తెలిసినప్పటి నుండి ఆయన భౌతిక కాయానికి అంత్య క్రియలు జరిగే వరకూ... ఆయన ఏ పదవీ ఆశించలేదు, ఆయనకు ఏ కోరి కలూ లేవు అంటూ పదే పదే అరిగిపోయిన రికార్డ్‌లా బాబు మాట్లాడిన తీరు అట్లాగే ఉంది. నాగిరెడ్డిని మంత్రిని చేస్తానని, తామే పెట్టిన తప్పుడు కేసులు ఎత్తేస్తాననీ ప్రలోభపెట్టి, పార్టీ ఫిరాయించేటట్టు చేసి ఒక ఏడాది పాటు తీవ్ర మానసిక ఒత్తిడికి గురి చేశారు. తీరా చివరి రోజున నీ ప్రత్యర్ధి ముఠా వ్యక్తిని ఎంఎల్సీగా గెలిపించుకోనిస్తేనే అవన్నీ చేస్తామని చెప్పి పంపించిన కార ణంగానే నాగిరెడ్డి తీవ్ర మానసిక వ్యథకు గురై, దాన్ని తట్టుకోలేకనే మర ణించారని బాబు మనసుకు బాగా తెలుసు. కాబట్టే ఆయన ఇప్పుడు ఈ మాటలు వల్లెవేస్తున్నాడు. శిల్పా చక్రపాణిరెడ్డిని గెలిపించుకు రావడం అంత సులభం కాదు. రాయలసీమలో ముఠాలు, ముఖ్యంగా కర్నూలు జిల్లాలో ముఠాలు ఎట్లా పని చేస్తాయో అందరికీ తెలుసు. చట్టసభలోకి ప్రవేశించే నాటికే నాగిరెడ్డికి అది అనుభవపూర్వకంగా తెలుసు. ఆ తరువాత కూడా అదే రాజకీయాల్లో జీవించాడు కాబట్టి ప్రలోభపెట్టి పార్టీ ఫిరాయింపు చేయించిన చంద్రబాబే షరతులు పెట్టే దగ్గరికి వచ్చే సరికి తట్టుకోలేక పోయాడు. ఏం జరిగిందో తెలిపే వాస్తవాలన్నీ కాలక్రమేణా తప్పకుండా బయటకు వస్తాయి. శవ రాజకీయం బ్రతికి ఉన్నప్పుడు, చనిపోయాకా ఎన్టీ రామారావుకు ఏం జరిగిందో నాగి రెడ్డికి కూడా అదే జరుగుతున్నది. ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉన్న నాయకు రాలు శోభా నాగిరెడ్డి ప్రమాదంలో మరణిస్తే అభ్యర్ధుల జాబితా నుండి ఆమె పేరు తొలగించాలని ఎన్నికల సంఘానికి పిటిషన్లు పెట్టిన తెలుగుదేశం వారు, విభజనానంతర ఏపీ తొలి శాసనసభలో ఆమెకు కనీసం సంతాపం తెలపడానికైనా ఇష్టపడని తెలుగుదేశం వారు, నాగిరెడ్డిని అడ్డగోలు కేసుల్లో ఇరికించి ఆస్పత్రుల పాలు చేసి, చివరకు జైలుకు కూడా పంపిన తెలుగుదేశం వారు... ఆయన చనిపోయాక ఆ కుటుంబం మొత్తం తమదేనని ప్రకటించు కునే ప్రయత్నం చెయ్యడాన్ని మించిన శవ రాజకీయం ఇంకొకటి ఉండబోదు. వయసులో, అనుభవంలో చిన్న కాబట్టి అఖిలప్రియకు ఇంకా ఈ విషయం అర్థం కాకపోవచ్చు, మోహన్‌రెడ్డికయినా తెలియకుండా ఉంటుందా ? ఏది ఏమైనా నాగిరెడ్డి మరణం ఆయన కుటుంబానికి, ముఖ్యంగా పిల్ల లకు తీరని లోటు. ఎవరూ తీర్చలేని వ్యక్తిగత దుఃఖం. తల్లిని కోల్పోయిన మూడేళ్లలోపే తండ్రిని కూడా పోగొట్టుకున్న ఆ పిల్లల దుఃఖాన్ని ఎవరూ తీర్చ జాలరు. నాగిరెడ్డి శాసనసభకు వచ్చింది కూడా అటువంటి విషాద సంద ర్భమే. తన అన్న, శాసనసభ్యుడు భూమా వీరశేఖర్ రెడ్డి ఆకస్మిక మరణం వల్ల ఖాళీ అయిన ఆళ్లగడ్డ స్థానం నుండి 1992 ఉప ఎన్నికల్లో నాగి రెడ్డి పోటీ చేశారు. అదే సమయంలో ప్రధాని పీవీ నరసింహారావు నంద్యాల నుండి లోక్‌సభకు పోటీ చేశారు. ఆ వార్తల కోసం వెళ్లిన నాకు నాగి రెడ్డి నామినేషన్ సందర్భంగా జరిగిన ఘర్షణను ప్రత్యక్షంగా చూసే అవకాశం లభించింది. కాకలు తీరిన నేత భవితనే ప్రశ్నార్థకంగా మారిస్తే? పీవీ కోసం లోక్‌సభ సభ్యత్వాన్ని త్యజించిన గంగుల ప్రతాప్‌రెడ్డిని కలసి నాగిరెడ్డి ఇంటికి చేరుకునే సరికి ఆయన నామినేషన్ వెయ్యడానికి ఊరేగిం పుగా బయలుదేరారు. ఆ వాహన శ్రేణి చివర మా వాహనం ఉంది. కొద్దిగా ముందుకు పోగానే ర్యాలీ మీద బాంబుల వర్షం. జీపుపైన నాగిరెడ్డితోబాటు అప్పటి తెలుగుదేశం నాయకుడు అవుకుకు చెందిన చల్లా రామకృష్ణారెడ్డి కూడా ఉన్నారు. నాగిరెడ్డిని నామినేషన్ వెయ్యకుండా ఆపే ప్రయత్నంలో జరి గిన ఆ దాడిని ఎదుర్కొంటూ, సమయం మించి పోతుండటంతో ఆయన ఒక లారీలో దాక్కుని నామినేషన్ వేయాల్సిన కార్యాలయానికి చేరుకొని మీడి యాతో మాట్లాడారు. ఈ ఘటన అంతటికీ నాతో బాటు ‘ఇండియా టుడే’ ఆంగ్ల పత్రిక ప్రతినిధి అమర్నాథ్ మీనన్ కూడా ప్రత్యక్ష సాక్షి. ప్రత్యర్థి ముఠా బాంబు దాడిని ఎదుర్కొని, తొలి నామినేషన్ వేసి గెలిచి శాసనసభకు వెళ్లిన నాగిరెడ్డి పలు మార్లు శాసనసభ సభ్యునిగా, పార్లమెంటు సభ్యుని గెలిచారు. చివరికి అటువంటి మరో ప్రత్యర్థిని గెలిపించకపోతే రాజకీయ భవిష్యత్తు ఏమవుతుందో అన్న మానసిక వ్యధతో కుంగిపోవాల్సి రావడం, ఆ కార ణంగా గుండె ఆగి చనిపోవడం విచారకరం. నాగిరెడ్డి మరణాన్ని రాజకీయ ప్రయోజనంగా మలచుకోచూస్తున్న తెలుగుదేశం అధినేత పోకడ మరీ దుర్మార్గం. మనిషి చనిపోయినంత మాత్రాన వాస్తవాలు మారిపోవు. తప్పులు ఒప్పులు అయిపోవు. తల్లి తండ్రి లేని అమ్మాయి కాబట్టి అఖిలప్రియ పార్టీ ఫిరాయింపు చట్టబద్ధం కాబోదు. మిగిలిన 19 మందితో బాటు మరణించిన నాగిరెడ్డి ఫిరాయింపు కూడా చట్ట వ్యతిరేకమే, ప్రజాస్వామ్య విలువలకు, సంప్రదాయాలకూ విఘాతమే, అత్యంత అనైతికమే. మరణించిన వారి గురించి మంచే మాట్లాడాలి. కాబట్టి ఈ విషయాలు ప్రస్తావించలేకే మంగళవారం నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభకు బయటే ఉండిపోయింది. ఇంతకూ లోపల ఉన్న తెలుగుదేశం అధినేత, నాగిరెడ్డిని ఏ పార్టీ మనిషిగా భావించి నివాళి అర్పించినట్టు? - దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
చంద్రబాబు వింత వాదన!
సాక్షి, అమరావతి: ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆకస్మిక మరణాన్ని రాజకీయం చేసిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంపై వింత ప్రదర్శన, విచిత్రమైన విమర్శలు గుప్పించారు. మంగళవారం శాసనసభలో భూమా నాగిరెడ్డికి నివాళులు అర్పించి ఆయన కుటుంబానికి సంతాపం తెలియజేయడంకన్నా ప్రతిపక్ష పార్టీని విమర్శించడానికే ఎక్కువ సమయం వెచ్చించారు. అంత్యక్రియలు పూర్తయిన మరుసటి రోజే భూమా నాగిరెడ్డి కుమార్తెను అసెంబ్లీకి రప్పించిన దరిమిలా ఎలాంటి రాజకీయపరమైన అంశాల జోలికి వెళ్లకుండా నివాళులకే పరిమితం కావలసింది. అలా కాకుండా చంద్రబాబు తన పార్టీ ఎమ్మెల్యేలతో ప్రతిపక్షంపై విమర్శలు గుప్పించే కార్యక్రమాన్ని చేపట్టారు. సభలో ఒక సభ్యుడు ఆకస్మికంగా మరణించిన సందర్భాల్లో సభ్యుడికి నివాళులర్పించడంతో పాటు ఆ కుటుంబానికి అండగా ఉంటామన్న భరోసా శాసనసభ ద్వారా కల్పించాల్సిన బాధ్యత అధికార పక్షానికి ఉంటుంది. అనేక సంవత్సరాలుగా శాసనసభ సాక్షిగా ఇదే సంప్రదాయం కొనసాగుతోంది. అలాంటి సంప్రదాయానికి భిన్నంగా అసెంబ్లీలో టీడీపీ నేతలతో ప్రతిపక్షంపై దుమ్మెత్తిపోయడం అసందర్భమే అవుతుందన్న విమర్శలున్నాయి. మరణించిన సభ్యుడిని పట్ల ఆ రకంగా వ్యవహరించడం సభా మర్యాద కాదన్న వాదనలు ఉన్నాయి. వీటన్నింటినీ పక్కన పెట్టి టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులతో ప్రతిపక్షంపై తిట్ల పురాణం కురిపించిన చంద్రబాబు సభ వాయిదా పడిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ వింత వాదన చేశారు. ‘‘ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని మంత్రి పదవిలోకి తీసుకోవద్దని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ వాళ్లే గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు కదా?" అని ప్రశ్నించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన భూమా నాగిరెడ్డిని అనేక రకాలుగా ప్రలోభ పెట్టి పార్టీ ఫిరాయించేలా చంద్రబాబు ఒత్తిడి చేసినట్లు అప్పట్లోనే అనేక వార్తలొచ్చాయి. చంద్రబాబు ఒత్తిడి మేరకు భూమా నాగిరెడ్డి, ఆయన కుమార్తె అఖిల ప్రియలు ఇద్దరూ పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. ఇదే విషయంపై అప్పట్లో వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు స్పీకర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. వారిపై అనర్హత వేటు వేయాలని కోరారు. ఇదే విషయంపై గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. అనేక రకాల ప్రలోభాలకు గురిచేస్తూ ప్రజాస్వామిక విలువలను కాలరాస్తూ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని చంద్రబాబుపై ఫిర్యాదు చేశారు. నాణానికి మరోవైపు చూస్తూ... తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలోకి ఫిరాయిస్తే వారిపైన టీడీపీ నాయకత్వం కూడా గవర్నర్ ను కలిసి ఇదే విధంగా ఫిర్యాదు చేసింది. కేసీఆర్ మంత్రివర్గంలో చేరిన టీడీపీ ఎమ్మెల్యేలను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆ విషయాన్ని విస్మరించిన మంగళవారం అసెంబ్లీలో దివంగత భూమానాగిరెడ్డికి సంతాపతీర్మానం ముగిసి సభ వాయిదా పడిన అనంతరం చంద్రబాబునాయుడు తన చాంబర్‌నుంచి బయటకు వెళ్తూ అక్కడ కలసిన మీడియాతో మాట్లాడుతూ, మంత్రి పదవిలోకి తీసుకోవద్దని గవర్నర్ కు ఫిర్యాదు చేశారు కదా అంటూ మాట్లాడటం విడ్డూరం. "భూమాకు మంత్రి పదవి ఇస్తామని ఆశచూపి ఇవ్వకపోవడం వల్లనే చనిపోయారని మాపై బురద చల్లుతున్నారు. మంత్రి పదవి ఇవ్వవద్దని చెప్పిందీ వాళ్లే... ఇప్పుడు ఇవ్వలేదని మాట్లాడుతున్నదీ వాళ్లే’’ అని చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. భూమా పార్టీ ఫిరాయించిన రోజునే కుటుంబంలో ఒకరికి మంత్రి పదవి ఇస్తారని టీడీపీ వర్గాలే చెప్పుకొచ్చాయి. అప్పట్లో ఆ ప్రచారాన్ని టీడీపీ నేతలు గానీ చంద్రబాబు నాయుడు గానీ ఎక్కడా ఖండించలేదు. తాజాగా ఈ విషయంలో... మీరు మంత్రి పదవి ఆశచూపి ఇవ్వకపోవడం, క్షోభ పెట్టడం వల్లనే భూమా నాగిరెడ్డి అస్వస్థతకు గురై చనిపోయినట్లు వచ్చిన విమర్శల గురించి విలేకరులు అడగ్గా ‘‘భూమాకు మంత్రి పదవి ఇస్తానని మీకు (మీడియాకు) చెప్పానా.... అయినా మంత్రి పదవిలోకి తీసుకోవద్దని గవర్నర్‌కు వాళ్లే (వైఎస్సార్ కాంగ్రెస్) ఫిర్యాదు చేశారు. ఇప్పుడు మళ్లీ మంత్రి పదవి ఇవ్వలేదంటారు.’’ అని రుసరుసలాడారు. ఎమ్మెల్యేలు తమ ఆరోగ్యం గురించి పట్టించుకోవడం లేదని గతంలో మాదిరి యోగా వంటి శిక్షణ ఇస్తారా? అంటే అదే ఆలోచిస్తున్నామని, వారితో పాటు మీకూ (మీడియా) ఇవ్వాల్సిన అవసరముందని సీఎం చెప్పుకొచ్చారు. -
భూమా చనిపోయాక బాబుకు గుర్తుకొచ్చాయా?
-
భూమా చనిపోయాక బాబుకు గుర్తుకొచ్చాయా?
విజయవాడ : మహాభారతంలో దుర్యోధనుడి మరణానికి శకుని కారణమైతే ...నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మృతికి కారణం మాత్రం చంద్రబాబు నాయుడే అని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే నారాయణస్వామి అన్నారు. ఆయన మంగళవారమిక్కడ మాట్లాడుతూ బతికున్నంతకాలం నాగిరెడ్డిని చంద్రబాబు పట్టించుకోలేదని, ఆయన చనిపోయిన తర్వాత మాత్రం కర్నూలు జిల్లా అభివృద్ధికి కృషి చేస్తామంటూ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మనిషిని పోగొట్టుకున్నాక చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నారని నారాయణస్వామి వ్యాఖ్యానించారు. భూమా కోరిక అంటూ ఇప్పుడేమో నంద్యాల అభివృద్ధికి కృషి చేస్తామని చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. తండ్రి అంత్యక్రియల జరిగి 24 గంటలు గడవకముందే అఖిలప్రియను చంద్రబాబు అసెంబ్లీకి తీసుకు వచ్చారన్నారు. ఈ ఘటన చూస్తుంటే ఆయనకు మానవత్వం ఉందా అనే అనుమానం కలుగుతుందన్నారు. భూమా నాగిరెడ్డికి సానుభూతి తెలపాల్సిన సభలో వైఎస్ జగన్‌ను టార్గెట్ చేసుకుని మాట్లాడటం ఎంతవరకూ సమంజసమని ఎమ్మెల్యే నారాయణస్వామి ప్రశ్నించారు. సంతాప తీర్మానానికి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ రాలేదంటూ, దుర్మార్గులంతూ సభ ద్వారా కుట్రపూరితంగా వ్యవహరిస్తూ విలువైన సమాయాన్ని దుర్వినియోగం చేశారన్నారు. శకునిలాంటి చంద్రబాబును కాపాడేందుకు మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు, పార్టీ మారిన ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నారన్నారు. వైఎస్ఆర్ సీపీ నుంచి టీడీపీలో చేరిన వారితో వైఎస్ జగన్‌ను తిట్టించారన్నారు. తనకు రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీఆర్‌పై వైస్రాయ్ హోటల్ సాక్షిగా చెప్పులు వేయించిన ఘనత చంద్రబాబుది అని ఎమ్మెల్యే నారాయణస్వామి ధ్వజమెత్తారు. మంత్రి పదవి ఆశచూపి.... సంవత్సరం అయినా ఇవ్వకుండా భూమాను మానసిక క్షోభకు గురిచేసి ఆయన మృతికి చంద్రబాబే కారణమని అందరికీ తెలుసని నారాయణస్వామి అన్నారు. -
అఖిలప్రియతో అబద్ధాలు చెప్పించారు..
విజయవాడ: అసెంబ్లీ సాక్షిగా తెలుగుదేశం పార్టీ శవ రాజకీయాలు చేస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గిడ్డి ఈశ్వరి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇవాళ అసెంబ్లీలో జరిగిన తీరు చూస్తుంటే.. భూమా నాగిరెడ్డికి సంతాప తీర్మానం కార్యక్రమమా లేక వైఎస్ జగన్‌పై విమర్శలా అనే అనుమానం కలుగుతోందన్నారు. భూమా నాగిరెడ్డి సతీమణి శోభా నాగిరెడ్డి ఒకప్పుడు టీడీపీలో కీలక పాత్ర వహించారని, ఆ పార్టీకి ఎంత చేశారని, అలాంటిది...ఆమె చనిపోయినప్పుడు సంతాపం తెలిపేందుకు టీడీపీ నేతలు ఎందుకు రాలేదని ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ప్రశ్నలు సంధించారు. అసెంబ్లీలో శోభా నాగిరెడ్డికి సంతాప తీర్మానం తెలిపేందుకు కూడా టీడీపీ ఇష్టపడలేదన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు ప్రవర్తించిన తీరు ఇప్పుడు గుర్తుకు రావడం లేదా అని అడిగారు. శోభా నాగిరెడ్డి చనిపోతే ... ఆ స్థానంలో ఎన్నికలు జరిగితే ఇదే చంద్రబాబు తమ పార్టీ అభ్యర్థిని ఎందుకు నిలబెట్టారన్నారు. ఇక భూమా నాగిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయనపై రౌడీషీట్ పెట్టిందెవరని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించి, పోలీసులతో అరెస్ట్ చేయించి వేధింపులకు గురి చేసింది ఎవరో చెప్పాలని గిడ్డి ఈశ్వరి డిమాండ్ చేశారు. ఆ రోజు భూమా నాగిరెడ్డిని కేసులతో వేధించింది టీడీపీ కాదా అని అడిగారు. పార్టీ మారితే మూడు రోజుల్లో మంత్రి ఇస్తానని చెప్పి, ఏడాది గడిచినా పదవి ఇవ్వకపోవడం వాస్తవం కాదా అని అన్నారు. చంద్రబాబు మోసంతోనే భూమా నాగిరెడ్డి మానసిక క్షోభకు గురయ్యారన్నారు. చనిపోయిన తర్వాత భూమా నాగిరెడ్డిపై ప్రేమ ఒలకబోస్తున్న చంద్రబాబు ... ఆయన బతికి ఉన్నప్పుడు ఏం చేశారన్నారు. హిందు సంప్రదాయం ప్రకారం కుటుంబంలో వ్యక్తి చనిపోతే ... ఆ కుటుంబసభ్యులు కనీసం మూడురోజుల పాటు అయినా ఊరి పొలిమేర దాటరన్నారు. అలాంటిది తండ్రిని కోల్పోయి పుట్టెడు దుఖంలో ఉన్న అఖిలప్రియను అసెంబ్లీ సమావేశాలుకు తీసుకు రావడం వెనుక చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ పాత్ర ఉందన్నారు. ఒక మహిళగా అఖిలప్రియ బాధ, ఆవేదన, సంఘర్షణను తాము అర్థం చేసుకుంటామన్నారు. అలాంటిది ఓ అమాయకురాలి చేత లేనిపోని అబద్ధాలు మాట్లాడించారన్నారు. తనను ఎవరూ అసెంబ్లీ సమావేశాలకు రమ్మనలేదని, తన అంతట తానుగానే వచ్చానని అఖిలప్రియతో చెప్పించారన్నారు. ఆమెను చంద్రబాబు, ఆయన కుమారుడే బలవంతంగా సమావేశాలకు రప్పించారన్నారు. నూతన రాజధానిలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంలో హాజరు కాని అఖిలప్రియ.... తండ్రి చనిపోయి పట్టుమని మూడు రోజులు కూడా కాకముందే సభకు ఎలా వచ్చారన్నారు. ఇక భూమా సంతాప తీర్మాన కార్యక్రమం సందర్భంగా అసెంబ్లీకి వెళ్లకపోవడంతో ప్రతిపక్ష పార్టీపై టీడీపీ బురద జల్లుతుందన్నారు. ప్రజల ముందు తమను తప్పుగా చిత్రీకరించేందుకు చూస్తోందన్నారు. ఈ విషయాన్ని ప్రజలంతా గమనిస్తున్నారని అన్నారు. విలువల గురించి మాట్లాడేవారు ఒకసారి గతాన్ని గుర్తు చేసుకుంటే మంచిదని అన్నారు. ఓ పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలోకి వెళ్లడం నైతిక విలువలతో కూడిన రాజకీయమా అని గిడ్డి ఈశ్వరి ప్రశ్నించారు. సంతాప తీర్మానంలో ఎక్కడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచి టీడీపీలోకి వెళ్లిన విషయాన్ని ప్రస్తావించకపోవడం సరికాదన్నారు. -
అఖిలప్రియతో అబద్ధాలు చెప్పించారు..
-
24గంటల్లో అఖిలప్రియను అసెంబ్లీకా?
-
24గంటల్లో అఖిలప్రియను అసెంబ్లీకా?: వైఎస్ జగన్
విజయవాడ : నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి సంతాప తీర్మానాన్ని రాజకీయం చేస్తున్నారని ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. సంతాప తీర్మానం సమయంలోనూ రాజకీయ విమర్శలు చేయడం సరికాదన్నారు. ఇంత దిగజారుడు రాజకీయాలు అవసరమా అని వైఎస్ జగన్ సూటిగా ప్రశ్నించారు. మంగళవారం వైఎస్ జగన్ ఇక్కడ మాట్లాడుతూ అసెంబ్లీ జరుగుతున్న తీరు చూస్తుంటే సిగ్గుతో తల దించుకోవాల్సి వస్తోందన్నారు. తండ్రి మృతి చెందిన 24 గంటల్లోనే అఖిలప్రియను అసెంబ్లీకి తీసుకురావడం చంద్రబాబు కుసంస్కారానికి నిదర్శనమని వైఎస్ జగన్ అన్నారు. నాగిరెడ్డి చనిపోయిన విషయం తెలియగానే అఖిలప్రియతో తాను, అమ్మ ఫోన్లో మాట్లాడామన్నారు. మంత్రి పదవి ఆశ చూపినందువల్లే భూమా నాగిరెడ్డి పార్టీ మారారన్నారు. పార్టీ మారిన మూడు రోజుల్లో మంత్రి పదవి ఇస్తానని చంద్రబాబు నాయుడు తనకు చెప్పారని తమ పార్టీ నేతలతో భూమా చెప్పారన్నారు. ఏడాది గడిచినా పదవి ఇవ్వలేదని, అంటే భూమా ఎంత మానసిక క్షోభకు గురయ్యారో అర్థం అవుతుందన్నారు. ఎన్టీఆర్ లాగానే నాగిరెడ్డిని కూడా చంద్రబాబు మానసిక క్షోభకు గురి చేశారని వైఎస్ జగన్ అన్నారు. భూమా హుందాతనాన్ని కాపాడేందుకే తాము సభకు వెళ్లలేదన్నారు. తాము సభకు వెళితే చంద్రబాబు చేయించిన తప్పులు, భూమా చేసిన పనులు గురించి మాట్లాడాల్సి వచ్చేదని అన్నారు. అవన్నీ రికార్డుల్లో వెళ్లేవని, అందుకే తాము సభకు వెళ్లలేదని వైఎస్ జగన్ పేర్కొన్నారు. తనకు, చంద్రబాబుకు నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసినప్పుడు తమ వాళ్లతో రాజీనామా చేయించి గెలిపించుకున్నామన్నారు. భూమా నాగిరెడ్డి మరణించారని, ఆయనపై వివాదాలు అనవసరమని వైఎస్ జగన్ అన్నారు. అలాగే నంద్యాల ఉప ఎన్నికపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఆ సీటు తమ పార్టీదే అని, గతంలో ఏ పార్టీవారు మరణిస్తే..గౌరవంగా వాళ్లకే వదిలేసేవాళ్లమని అన్నారు. కాగా భూమా నాగిరెడ్డి మృతికి సంతాప తీర్మానం సందర్భంగా ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ఎమ్మెల్యే భూమ అఖిలప్రియ హాజరయ్యారు. -
నాడు ఎన్టీఆర్ నుంచి నేడు భూమా వరకూ...
విజయవాడ: చంద్రబాబు నాయుడును నమ్ముకుంటే మానసిక వ్యధకు గురి కావాల్సిందేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జోగి రమేష్ వ్యాఖ్యానించారు. నాడు ఎన్టీఆర్ నుంచి నేడు భూమా నాగిరెడ్డి వరకూ రాజకీయ వేధింపులకు గురి చేసి వారి మరణాలకు చంద్రబాబు నాయుడు కారణం అయ్యారని ఆయన మంగళవారమిక్కడ అన్నారు. హామీలు ఇచ్చి, ఆ తర్వాత వాటిని మరిచిపోవడం చంద్రబాబు నైజం అని జోగి రమేష్ దుయ్యబట్టారు. -
'మోసం చేసిన వారితో పాల్గొనకూడదనే'
-
‘భూమాను మోసం చేసినవారితో పాల్గొనకూడదనే’
విజయవాడ: ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆకస్మిక మరణం బాధాకరమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలిపింది. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపింది. అయితే ఏపీ అసెంబ్లీలో భూమా నాగిరెడ్డి సంతాప తీర్మాన కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ పాల్గొనట్లేదని పార్టీ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా మంగళవారమిక్కడ తెలిపారు. తమ పార్టీలో ఉన్నప్పుడు భూమా నాగిరెడ్డికి పీఏసీ చైర్మన్‌గా కేబినెట్ హోదా పదవి ఇచ్చి గౌరవంగా చూసుకున్నామన్నారు. అయితే చంద్రబాబు నాయుడు మంత్రి పదవి ఆశ చూపి... ఇవ్వకపోవడం వల్లే మనస్థాపానికి గురై ఆ క్షోభతోనే ఆయన మరణించారన్నారు. భూమాను మోసం చేసిన వారితో కలిసి సంతాప కార్యక్రమ తీర్మానంలో పాల్గొనకూడదని తమ పార్టీ నిర్ణయించిందన్నారు. మానసిక క్షోభకు గురి చేయడం చంద్రబాబుకు అలవాటేనని, గతంలో ఎన్టీఆర్‌ను, ఇప్పుడు భూమా నాగిరెడ్డికి అలాగే చేశారన్నారు. టీడీపీలో చేరిన కొంతమంది ఎమ్మెల్యేల పరిస్థితి కూడా ఇలాగే ఉందని అన్నారు. -
భూమా భౌతికకాయానికి బాబు నివాళి
-
భూమా భౌతికకాయానికి బాబు నివాళి
హైదరాబాద్: గుండెపోటుతో ఆదివారం హఠాన్మరణం చెందిన టీడీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి భౌతికకాయానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. భూమా కుమార్తె, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియను ఓదార్చారు. అనంతరం మాట్లాడుతూ.. పార్టీ పట్ల భూమా ఎంతో విధేయతగా ఉండేవారని, తనకు చాలా సన్నిహితుడని గుర్తు చేసుకున్నారు. ఆయన మృతి పార్టీకు తీరని లోటని అన్నారు. నంద్యాల అభివృద్ధికి భూమా అహర్నిశలు కృషి చేశారని కొనియాడారు. భూమా ఆశయాల కోసం అఖిలప్రియ కృషి చేయాలన్నారు. భూమా ఆకస్మిక మృతి తననెంతగానో బాధించిందన్నారు. -
కర్నూలు జిల్లా నేతలతో లోకేష్ సమావేశం
- నంద్యాల అసెంబ్లీ స్ధానంపై చర్చ నంద్యాల: కర్నూలు జిల్లా టీడీపీ నేతలతో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమావేశమయ్యారు. నంద్యాలలోని ఓ హోటల్లో సోమవారం ఉదయం నేతలతో భేటీ అయినట్టు సమాచారం. నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మృతి చెందినందున ఆ సీటును ఎవరికి కేటాయించాలన్న దానిపై చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఈ భేటీలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, శిల్పా బ్రదర్స్, మాజీ మంత్రి ఫరూక్, టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, పార్టీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కాగా నంద్యాల సీటును నాగిరెడ్డి మరో కుమార్తె నాగమౌనికకు గానీ, భూమా అన్న కుమారుడు బ్రహ్మానందరెడ్డికి గానీ కేటాయించాలన్న డిమాండ్ వ్యక్తమవుతోంది. అయితే ప్రస్తుతం ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా అఖిల ప్రియకు మంత్రి వర్గంలో స్థానం కల్సించి, నంద్యాల ఎమ్మెల్యే స్థానాన్ని మాజీ మంత్రి శిల్పా మెహన్ రెడ్డికి గానీ, ఫరూక్ గానీ కేటాయించాలని మరికొందరు కోరుతున్నట్టు సమాచారం. -
‘భూమా ఆకస్మిక మరణం నన్నెంతో బాధించింది'
ఒంగోలు : నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆకస్మిక మరణం తనను ఎంతో బాధించిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఆయన మృతితో తమ కుటుంబసభ్యులను కోల్పోయినంతగా కలత చెందానని ఆయన సోమవారమిక్కడ తెలిపారు. నాగిరెడ్డి పిల్లలకు దేవుడు మనోధైర్యం ఇవ్వాలని ప్రార్థిస్తున్నానని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. కాగా గుండెపోటుతో భూమా నాగిరెడ్డి నిన్న మరణించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ వలిగొండ ప్రాజెక్ట్ పూర్తి చేయాలన్న చిత్తశుద్ధి రాష్ట్ర ప్రభుత్వానికి లేదని ధ్వజమెత్తారు. 2018కల్లా వలిగొండ పూర్తి చేస్తామన్న చంద్రబాబు మాటలను రైతులు నమ్మడం లేదన్నారు. ఇప్పటికైనా ఈ బడ్జెట్లో వలిగొండ ప్రాజెక్ట్ కు రూ.1000 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్ట్‌ను త్వరితగతిన పూర్తి చేసి 2018 డిసెంబర్‌కల్లా తాగు,సాగునీటిని అందించాలన్నారు. లేకుంటే రైతాంగాన్ని కూడగట్టి వైఎస్ఆర్ సీపీ ఆందోళనకు సిద్ధమవుతుందని వైవీ సుబ్బారెడ్డి హెచ్చరించారు. మూడేళ్లపాటు వరుస కరువుతో ప్రకాశం జిల్లా రైతాంగం కకావికలమైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కంది, మిర్చి, పొగాకు రైతులకు గిట్టుబాటు ధరలేక పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయారన్నారు. ప్రభుత్వం మిర్చికి కనీసం రూ.10వేలు, కందికి రూ.6వేలు ధర ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. పొగాకు రైతుల ఆత్మహత్యలు నిరోధించాలంటే తక్షణమే కిలోకు సగటు ధర రూ.160 తగ్గకుండా కోనుగోలు చేసేలా ప్రభుత్వం చొరవ చూపాలని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. రైతులకు నిబంధనలు విధించడం మాని దళారులను, బయ్యర్లను ప్రభుత్వం అదుపులో పెట్టాలని ఆయన సూచించారు. -
‘భూమా మృతికి చంద్రబాబే కారణం’
హైదరాబాద్: నంద్యాల ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి మరణానికి ఏపీ సీఎం చంద్రబాబు బాధ్యత వహించాలని ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జి.కరుణాకర్‌రెడ్డి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. భూమాపై అక్రమ కేసులు బనాయించి ఆర్థికంగా దెబ్బతీసేందుకు చంద్రబాబు ప్రయత్నించారని, ఆ కుటుంబాన్ని మానసిక వేదనకు గురిచేసి టీడీపీలో చేర్చుకుని అవమానాలపాలు చేశారన్నారు. మంత్రి పదవి ఇచ్చే విషయంలో చంద్రబాబు విపరీతమైన ఒత్తిడికి గురిచేసి ఆయన మృతికి కారణమయ్యారన్నారు. ఎస్సీ,ఎస్టీ, ఎర్రచందనం కేసులు బనాయించిన చంద్రబాబుకు భూమా నాగిరెడ్డి భౌతికకాయాన్ని సందర్శించే అర్హత లేదన్నారు. -
జాతీయ పతాకం అవనతం
కర్నూలు(అగ్రికల్చర్): నంద్యాల శాసనసభ్యుడు భూమా నాగిరెడ్డి మరణానికి సంతాప సూచకంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంపై ఉన్న జాతీయ పతాకాన్ని అవనతం( ఆఫ్ మాస్ట్) చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంపై నిరంతరం జాతీయ పతాకం రెపరెపలాడుతోంది. ప్రజాప్రతినిధులు మరణించిన సమయాల్లో సంతాపం ప్రకటిస్తూ జాతీయ పతాకాన్ని ఆదివారం అవనతం చేశారు. జాతీయ పతాకాన్ని పై నుంచి కిందకు దించి భూమా మృతికి అధికార యంత్రాంగం ప్రకటించింది. -
గతంలో భూమాకు రెండుసార్లు గుండెనొప్పి
-
నేనొక స్నేహితున్ని కోల్పోయాను: మోహన్‌బాబు
ప్రముఖ రాజకీయ నాయకుడు, నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆకస్మిక మరణంపై సినీ నటుడు మోహన్‌బాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 'భూమా మరణం నన్ను ఎంతగానో బాధించింది. నేను ఒక మంచి స్నేహితుడిని, మా కుటుంబం మంచి సన్నిహితుడిని కోల్పోయింది. కోయంబత్తూరులో ఉన్న నన్ను భూమా మరణం కలిచివేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ.. ఆయన కుటుంబానికి షిరిడీ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని ఆశిస్తున్నాను' అని మోహన్‌బాబు పేర్కొన్నారు. భూమా మృతిపై చిరంజీవి, బాలకృష్ణ సంతాపం రాజకీయ నాయకుడు, నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అకాల మృతిపై కాంగ్రెస్ నేత, ఎంపీ చిరంజీవి, సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ, సంతాపం తెలిపారు. భూమా కుటుంబసభ్యులకు తమ సానుభూతిని తెలియజేశారు. నంద్యాల నియోజకవర్గానికి భూమా విశేషమైన సేవలు అందించారని, ఆయన మరణం ఆ నియోజకవర్గానికి తీరని లోటని బాలకృష్ణ పేర్కొన్నారు. -
గతంలో భూమాకు రెండుసార్లు గుండెనొప్పి
నంద్యాల: ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి ఈ రోజు తెల్లవారుజామున అకస్మాత్తుగా పిట్స్ వచ్చాయని, వెంటనే ఆయన్ను ఆళ్లగడ్డలోని ఆస్పత్రికి తరలించారని డాక్టర్ హరినాథ్ చెప్పారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం నంద్యాల తీసుకొచ్చారని తెలిపారు. భూమాకు తీవ్ర గుండెనొప్పి రావడంతో పల్స్ రేట్ పడిపోయిందని, దాదాపు రెండు గంటల పాటు ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని డాక్టర్ హరినాథ్ చెప్పారు. 1999లో నాగిరెడ్డికి మొదటిసారి బైపాస్ సర్జరీ చేశారని, ఏడాదిన్నర క్రితం ఆయనకు మరోసారి గుండెపోటు రావడంతో యాంజియోగ్రామ్ చేశారని తెలిపారు. భూమాకు షుగర్, బీపీ, హైపర్ టెన్షన్ ఉన్నాయని చెప్పారు. నాగిరెడ్డికి గుండెనొప్పి రావడానికి తీవ్ర మానసిక ఒత్తిడి కూడా కారణమని డాక్టర్ హరినాథ్ తెలిపారు. -
నాగిరెడ్డి మృతిపట్ల కేసీఆర్ సంతాపం
హైదరాబాద్: నంద్యాల ఎమ్మెల్యే, తెలుగుదేశం నేత భూమా నాగిరెడ్డి మృతిపట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు. భూమా కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ బాధాకర పరిస్థితి నుంచి వారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని కోరుకున్నారు. ఈ సమయంలో భూమా కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని సూచించారు. భూమా రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనే వారని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. -
డాక్టర్ అవ్వాలనుకున్న భూమా, తండ్రి హత్యతో..
-
డాక్టర్ అవ్వాలనుకున్న భూమా, తండ్రి హత్యతో..
నంద్యాల: కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆకస్మిక మృతితో ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. 53 ఏళ్లకే ఆయన గుండెపోటుకు గురై చనిపోవడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి ఆయన వ్యక్తిగత జీవితం, రాజకీయ జీవితాలు పరిశీలిస్తే.. వ్యక్తిగత జీవితం.. భూమా నాగిరెడ్డి కర్నూలు జిల్లా దొర్నిపాడు మండలం కొత్తపల్లె అనే ఒక మారుమూల గ్రామంలో జన్మించారు. భూమా బాలిరెడ్డి , ఈశ్వరమ్మకు ఈయన చిన్న కుమారుడు. ఆ ప్రాంతంలో ఉన్న కుటుంబ కక్షల రాజకీయాల కారణంగా తన తండ్రి బాలిరెడ్డి ఆయనను సుదూర ప్రదేశములలో ఉంచి చదివించాలని కోరుకున్నారు. దాని ప్రకారమే నాగిరెడ్డిని తమిళనాడు లోని చెన్నైలో సీబీఎస్ఈకి అనుబంధంగా ఉన్న వెలంకన్ని ప్రైవేట్ పాఠశాలలో 10+2 చదివించారు. ఆ తరువాత, నాగిరెడ్డి వైద్య విద్యను అభ్యసించడానికి బెంగుళూరు వెళ్ళారు. కానీ వెంటనే తన తండ్రి హత్యకు గురి కావడంతో తిరిగి వచ్చేశారు. ఈ సంఘటన కారణంగా ఆయన జీవితం మొత్తం మారిపోయింది. రాయలసీమ ప్రాంతంలో కీలక నేతగా మారారు. సీనియర్ రాజకీయవేత్త మరియు మాజీ మంత్రి యస్.వి.సుబ్బారెడ్డి కుమార్తె శోభారాణితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు. 2014లో భార్య శోభానాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. రాజకీయ ప్రస్తానం.. కర్నూలు జిల్లాలో జనవరి 8, 1964న జన్మించిన భూమా నాగిరెడ్డి తొలిసారిగా 1984లో ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేశారు. తొలుత సొసైటీ ప్రెసిడెంట్‌గా పనిచేసిన ఆయన తర్వాత ఎంపీపీగా ఎన్నికయ్యారు. 1992లో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు మధ్యంతర ఎన్నికలలో ఎన్నికయ్యారు. కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ శాసనసభ నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా ఉన్న ఆయన సోదరుడు భూమా శేఖర్‌రెడ్డి ఆకస్మిక మరణంతో భూమా ఈ స్థానానికి ఎంపికయ్యారు. 1996లో మధ్యంతర ఎన్నికలు జరుగుతున్న నంద్యాల లోకసభ నియోజకవర్గానికి ప్రధానమంత్రి పి.వి.నరసింహారావుపై పోటీ చేసేందుకు టీడీపీ ఆయనను ఎంపిక చేయడంతో మరింత వెలుగులోకి వచ్చారు. భూమా నాగిరెడ్డి లోక్‌సభ సభ్యుడిగా మూడు సార్లు తన సేవలను అందించారు. తొలుత టీడీపీలో ఉన్న నాగిరెడ్డి అక్కడి నుంచి ఎంపీగా కూడా పోటీ చేశారు. తర్వాత ప్రజారాజ్యం పార్టీలో చేరి అక్కడి నుంచి కూడా ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 2014లో వైఎస్సార్సీపీ టికెట్‌పై భూమా నాగిరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 ఏప్రిల్ 24 న రోడ్డు ప్రమాదంలో భూమా సతీమణి శోభ మృతి చెందారు. శోభ మృతి తర్వాత భూమా నాగిరెడ్డి మానసికంగా కుంగిపోయారు. అనారోగ్యం కారణంగా ఆయనకు బైపాస్ సర్జరీ కూడా జరిగింది. 2016లో కూతురు అఖిలప్రియతో కలిసి భూమా తెలుగుదేశం పార్టీలో చేరారు. ఏడాది నుంచి భూమా నాగిరెడ్డి ఆరోగ్యం సరిగా లేదు. గత వారం రోజులుగా భూమా అనారోగ్య కారణంగా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నిన్న విజయవాడలో భూమానాగిరెడ్డి చంద్రబాబును కలిశారు. భూమా నాగిరెడ్డి కూతురు అఖిలప్రియ ప్రస్తుతం ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. టీడీపీ తరపున భూమా నాగిరెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఇటీవల చురుగ్గా పాల్గొన్నారు. శనివారం విజయవాడకు వెళ్ళి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి వివిధ అంశాలపై చర్చించారు. రాత్రి బయలుదేరి ఆళ్లగడ్డకు వచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో శిల్పా చక్రపాణికి మద్దతు తెలుపుతున్నట్లు భూమా నాగిరెడ్డి శనివారం చంద్రబాబును కలిసి స్పష్టం చేశారు. తమ మధ్య ఉన్న అంతర్గత విభేదాల కారణంగా పార్టీకి నష్టం కలగకూడదన్న ఉద్దేశంతోనే శిల్పాకు మద్దతు తెలిపేందుకు భూమా నాగిరెడ్డి ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఆయనకు కేబినెట్ పదవి లభించలేదనే అసంతృప్తి మాత్రం అలాగే ఉండిపోయిందని చెబుతుంటారు. ఇటీవల తనకు మంత్రిపదవి ఇచ్చి కేబినెట్లోకి తీసుకుంటానని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చినట్లు సమాచారం. దాని మేరకే ఈ మధ్య పలుమార్లు చర్చలు కూడా జరిపారంట. ఈలోగానే ఆయన అకాల మరణం చెందడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. -
ఇవ్వాలా.. వద్దా!
సర్వే చేయిస్తున్నవారు టీడీపీ అధినేత? - నివేదిక తర్వాతే నిర్ణయం - సర్వేపై జిల్లాలో ఆసక్తికర చర్చ సాక్షి ప్రతినిధి, కర్నూలు: నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి మంత్రి పదవి ఇచ్చే వ్యవహారాన్ని ఒక సర్వే తేల్చనుందా? అదీ నంద్యాల ప్రజల అభిప్రాయాలపై ఆధారపడి ఉందా? ముఖ్యమంత్రి స్థాయిలో ఈ నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదా? అంటే అవుననే తెలుస్తోంది. ఇందుకు కారణం... నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలా... వద్దా... మీ అభిప్రాయం ఏమిటి? అంటూ అధికారపార్టీ ఏకంగా ఒక సర్వే చేయిస్తుండటమే ఉదాహరణ. బెంగళూరుకు చెందిన ఓ ప్రైవేటు సంస్థ ద్వారా సర్వే నిర్వహిస్తున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో సర్వేపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నాలుగైదు రోజుల్లో సర్వే పూర్తికానున్నట్టు సమాచారం. అనంతరం ఈ సర్వే నివేదిక ఆధారంగా అధికారపార్టీ అధినేత ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే, కేవలం సర్వే నివేదిక ఆధారంగానే మంత్రి పదవి నిర్ణయం జరుగుతుందా? ముందుగానే కుదిరిన ఒప్పందం మేరకు పదవి అప్పగిస్తారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆది నుంచీ వివాదమే...! వాస్తవానికి భూమా నాగిరెడ్డి అధికారపార్టీలో చేరిక మొదలు మంత్రి పదవి వ్యవహారం వరకూ అధికారపార్టీలో రోజుకో వివాదం రేగుతూనే ఉంది. మొదట్లో ఆయన రాకను శిల్పా సోదరులతో పాటు గంగుల వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. అయినప్పటికీ ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చామంటూ చేరికలు జరిగిపోయాయి. అయితే, అప్పటి నుంచి ఇప్పటివరకు ఇరువర్గాల మధ్య అగ్గిరాజుకుంటూనే ఉంది. ఒకానొక సమయంలో బహిరంగంగానే విమర్శలు గుప్పించుకున్నారు. ఢీ అంటే ఢీ అని ఇరువర్గాలు సవాళ్లు కూడా విసురుకున్నాయి. అయితే, తాజాగా ఆ పార్టీ అధినేత ఎమ్మెల్యేలకే పట్టం అంటూ... నియోజకవర్గ ఇంచార్జీలను డమ్మీలను చేయడంతో మరోసారి పాత నేతలు భగ్గుమన్నారు. తాజాగా ఆళ్లగడ్డ నియోజకవర్గ ఇంచార్జీ గంగుల ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. నంద్యాల నియోజకవర్గంలోనూ ఇదే అలజడి మొదలయ్యింది. ఆయనకు మంత్రి పదవి ఇస్తే వచ్చే ఉప ఎన్నికల్లో తాము స్వతంత్రంగానైనా పోటీ చేస్తామని శిల్పా వర్గీయులు సంకేతాలు పంపించారు. అంతేకాకుండా విజయవాడలో సీఎం క్యాంపు కార్యాలయంలో మంగళవారం సమావేశమై... తమకు జరుగుతున్న అవమానాలను వివరించారు. గతంలో కర్నూలులో జరిగిన సమన్వయ కమిటీ భేటీల్లోనూ ఇదే అంశాన్ని శిల్పా సోదరులు లేవనెత్తారు. తద్వారా భూమా దూకుడుకు కళ్లెం వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విధంగా ఇరు నేతల మధ్య ఆది నుంచీ విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. సర్వేలో వ్యతిరేక ఫలితాలే...! భూమాకు మంత్రి పదవి ఇవ్వాలా? వద్దా అంటూ జరుగుతున్న సర్వేలో ఆయనకు వ్యతిరేకంగా ఫలితం వస్తోందని వ్యతిరేక వర్గం ప్రచారం చేస్తోంది. తద్వారా ఆయనకు మంత్రి పదవి వచ్చే అవకాశం లేదని బల్లగుద్ది మరీ చెబుతున్నట్టు నమాచారం. సర్వేను కాదని తమ అధినేత ముందుకు వెళ్లడనే ధీమా వ్యతిరేక వర్గంలో కనిపిస్తోందని అధికారపార్టీలో జోరుగా చర్చ సాగుతోంది. సర్వే అంటే జనాభిప్రాయమని.. ఇందుకు భిన్నంగా పదవి కట్టబెట్టే ప్రసక్తే లేదని గాంభీర్యంగా ఉంటున్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద అధికారపార్టీలో ఇరువర్గాల మధ్య రేగిన విభేదాల పర్వం విరామం లేకుండా కొనసాగుతూనే ఉంది. -
టీడీపీలో ‘కొత్త’ ముసలం
► పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్న పాత నేతలు ► ఆళ్లగడ్డ నియోజకవర్గ ముఖ్యులతో గంగుల భేటీ ► పార్టీలో తీవ్ర అవమానాలు ఎదురవుతున్నాయని ఆవేదన ► నంద్యాల, కోడుమూరు నియోజకవర్గాలోనూ ఇదే పరిస్థితి సాక్షి ప్రతినిధి, కర్నూలు : తెలుగుదేశం పార్టీలో అంసతృప్తి సెగ పెరుగుతోంది. పార్టీలో కొత్తగా చేరిన నేతలు, పాత నేతల మధ్య రోజురోజుకూ విభేదాలు పెరుగుతున్నాయి. ఎన్నికల ముందు నుంచీ పార్టీలో ఉండి నిలబడిన తమకు జరుగుతున్న అవమానాలపై పాత నేతలు మండిపడుతున్నారు. తమ పరిస్థితిని అనుచరులు, పార్టీ నేతలకు వివరించేందుకు ఒక్కొక్కరూ సిద్ధమవుతున్నారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం టీడీపీ నేత గంగుల ప్రభాకర్‌రెడ్డి తాజాగా తన అనుచరులు, ముఖ్యనేతలతో వరుసగా భేటీ అవుతున్నారు. పార్టీలో ఆయన ఎలాంటి అవమానాలు ఎదుర్కొంటున్నారో వారికి వివరించినట్టు తెలిసింది. ఈ పరిస్థితుల్లో ఏం చేద్దామని వారి సలహాలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఎటువంటి నిర్ణయం తీసుకున్నా తామంతా మీ వెంటే ఉంటామని వారు గంగులకు తేల్చిచెప్పినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో అధికార పార్టీకి రాం రాం చెప్పేందుకు గంగుల ప్రభాకర్‌రెడ్డి సిద్ధమవుతున్నట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఈ నెల 12వ తేదీన నియోజకవర్గంలోని అందరితో సమావేశమై తన భవిష్యత్ కార్యాచరణను ఆయన ప్రకటించినున్నట్టు తెలిసింది. రానున్న రోజుల్లో మరికొందరు నేతలు కూడా ఇదే రీతిలో అధికార పార్టీకి దూరం కానున్నారని తెలుస్తోంది. నంద్యాలలో రాజుకున్న అసంతృప్తి సెగ ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని టీడీపీలో ముసలం పుట్టగా.. నంద్యాలలో కూడా అసంతృప్తి అగ్గిరాజుకుంది. తాజాగా విజయవాడలో సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబుతో శిల్పా సోదరులు సమావేశమయ్యారు. భూమా నాగిరెడ్డికి మంత్రి పదవి విషయమై ప్రధానంగా చర్చ జరిగినట్టు సమాచారం. ఎన్నికలకు ముందు టీడీపీ అధికారంలోకి రాదన్న అభిప్రాయం సర్వత్రా ఉన్న సందర్భంలో పార్టీలోకి తాము వచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేసినట్టు తెలిసింది. అటువంటి తమను కాదని మధ్యలో వచ్చిన వారికి ఏకంగా మంత్రి పదవి అప్పగిస్తే పార్టీలో ఏ ముఖంతో తాము కొనసాగాలో అర్థం కావడం లేదని వాపోయినట్టు సమాచారం. నియోజకవర్గ ఇన్చార్జిగా తమను కాదని, కనీసం ప్రోటోకాల్ కోసమైనా తమను కార్యక్రమాలకు పిలవకపోవడం తమను మరింత పలుచన చేస్తోందని వాపోయినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో సర్దుకుని పనిచేయాలని సీఎం సూచించినట్టు అధికార పార్టీ వర్గాలే పేర్కొంటున్నాయి. అయితే కింది స్థాయిలో ఆ పరిస్థితి లేదన్న విషయాన్ని అధిష్టానం గ్రహించాలని ఆ పార్టీలోని పలువురు నేతలు అంటున్నారు. ముఖ్యమంత్రి సమాధానంతో శిల్పా సోదరులు సంతృప్తి చెందలేదని సమాచారం. అన్ని చోట్లా ఇదే పరిస్థితే.. ఆళ్లగడ్డ, నంద్యాలతో పాటు కర్నూలు, కోడుమూరు, శ్రీశైలం నియోజకవర్గాల్లో కూడా టీడీపీలో ఇదే పరిస్థితి నెలకొంది. కోడుమూరు నియోజకవర్గంలో ఇప్పటివరకు కొత్త పింఛన్లను ఇవ్వని పరిస్థితి. కొత్త పింఛన్ల కోసం ధర్నా చేస్తామని విష్ణువర్ధన్ రెడ్డి అనుచరులు ప్రకటించారు. కర్నూలు నియోజకవర్గంలో పరిస్థితి ఇద్దరి నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది. తెలివైన నాయకులైతే తనను కలుపుకుని పనిచేస్తారంటూ పరోక్షంగా ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఎంపీ టీజీ వ్యాఖ్యానించారు. శ్రీశైలం నియోజకవర్గంలో కూడా తమ వారికి పార్టీలో పదవులు ఇవ్వాలని కొత్తగా చేరిన ఎమ్మెల్యే అనుచరులు కోరుతున్నారు. ఇలా అన్ని నియోజకవర్గాల్లోని టీడీపీలో నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. -
‘నన్ను జైల్లో పెట్టించడం నీ తరం కాదు’
నంద్యాల: ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ శిల్పా మోహన్ రెడ్డి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఇరువురు నాయకుల మధ్య మాటల యుద్ధం ముదిరి తిట్లకు దారి తీసింది. తాజాగా శిల్పా మోహన్ రెడ్డిపై నాగిరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘శిల్పా మోహన్ రెడ్డి లాంటి నేతలను వేల మందిని చూశాను. నన్ను జైల్లో పెట్టించడం నీ అబ్బ తరం కాదు. నా మౌనాన్ని చేతగానితనంగా భావించొద్దు. మోహన్ రెడ్డి వల్లే కుందు నది ఆక్రమణలకు గురైంది. శిల్పా 12 ఏళ్లలో 12 ఇళ్లు మంజూరు చేయించలేకపోయారు. నేను ఐదు నెలల్లో నంద్యాల నియోజకవర్గానికి రూ. 500 కోట్లు నిధులు మంజూరు చేయించాన’ని భూమా నాగిరెడ్డి అన్నారు. జనచైతన్య యాత్ర వేదికగా ఇంతకుముందు ఇరువురు నేతలు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. ‘ఇలాగే మాట్లాడితే మీరు ఏఏ వ్యాపారాలు చేస్తారో, ఏ దందా చేస్తున్నారో బహిర్గతం చేస్తాం. నంద్యాలకు రూ.450 కోట్లు తెచ్చామని ప్రకటిస్తున్నారు. ఏఏ పనులకు, ఏఏ ప్రాంతంలో ఈ నిధులను కేటాయించారో వివరాలతో వెల్లడించాలి. ఆలోచించి మాట్లాడండి. ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోమ’ని శిల్పా మోహన్ రెడ్డి అంతకుముందు ధ్వజమెత్తారు. -
భూమా వర్సెస్ శిల్పా
⇒ పార్టీలో ఉంటే ఉండు.. లేకుంటే పో : భూమా ⇒ రెండు రోజుల్లో బండారం బయట పెడతా : శిల్పా ⇒ భూమా సెటిల్మెంట్ దందాలు చేస్తున్నారు : చైర్పర్సన్ నంద్యాల: ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ శిల్పామోహన్‌రెడ్డి వర్గాల మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఇప్పుడు ఇరువురు ఒకరిపై ఒకరు మాటల యుద్ధానికి దిగుతున్నారు. ఇందుకు జనచైతన్య యాత్రలను వేదికలుగా చేసుకున్నారు. భూమా తొలి సభ నుంచే శిల్పాపై విమర్శల దాడికి దిగగా, శిల్పా రెండు రోజుల నుంచి తానేమి తీసిపోనని ఎదురుదాడికి దిగారు. భూమాకు మద్దతుగా వైస్ చైర్మన్ గంగిశెట్టి విజయ్‌కుమార్, శిల్పాకు మద్దతుగా చైర్పర్సన్ దేశం సులోచన నిలిచి ప్రత్యర్థులపై విమర్శలు సంధిస్తున్నారు. భూమా శుక్రవారం పట్టణంలోని 22, 23వార్డుల్లో, శిల్పా సాయంత్రం పట్టణంలోని 18వ వార్డులో పర్యటించారు. ఈ సందర్భంగా వారు ఒకరిపై ఒకరు మాటల దాడికి దిగారు. పార్టీలో ఉండాలో లేదో తేల్చుకోండి : భూమానాగిరెడ్డి నన్ను రెచ్చగొట్టడంతోనే పార్టీ ఫిరాయించాను. ఇదంతా మీ స్వయం కృపారాదం. మీరు పార్టీలో ఉండాలో లేదో తేల్చుకోండి నేను మాత్రం మళ్లీ పోటీ చేస్తా. ఉప్పు, పప్పులు అమ్ముకునే వారికి రాజకీయాలు ఎందుకు. అలాంటి వారు నాకు పోటీనేకాదు. గెలిచిన వారికి, ఓడిన వారికి తేడా ఉంది. గెలిచిన వారే ప్రజల సమస్యలను తీరుస్తారు. ఓడిన వారు ఏం చేయగలరు. ప్రతి మీటింగ్‌లో తనకు ఓట్లు వేయకుండా ఓడించారని ప్రజలను నిందించడం కంటే ఆత్మపరిశీలన చేసుకోవడం మంచిది. బండారం బయట పెడతా : శిల్పామోహన్‌రెడ్డి, టీడీపీ ఇన్చార్జి ఉప్పు, కందిపప్పు విక్రయించినది వాస్తవమే. కాని పేద ప్రజలకు లాభాపేక్షలేకుండా అందించాను. రెండు మూడు రోజులు చూస్తా. ఇలాగే మాట్లాడితే మీరు ఏఏ వ్యాపారాలు చేస్తారో, ఏ దందా చేస్తున్నారో బహిర్గతం చేస్తాం. నంద్యాలకు రూ.450 కోట్లు తెచ్చామని ప్రకటిస్తున్నారు. ఏఏ పనులకు, ఏఏ ప్రాంతంలో ఈ నిధులను కేటాయించారో వివరాలతో వెల్లడించాలి. రోడ్ల వెడల్పు మాత్రమే సమస్యలకు పరిష్కారం కాదు. ముందు మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఆలోచించి మాట్లాడండి. ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోం. సెటిల్మెంట్లు చేయడమే మీ పని: దేశం సులోచన, చైర్పర్సన్ శిల్పా ఉప్పు, పప్పు అమ్ముకున్నది నిజమే. ఆయన ప్రజల బాగుకోసమే చేశారు. మీరు మాత్రం సెటిల్మెంట్లు, దందా చేస్తున్నారు. శిల్పా రెండోసారి గెలిచినప్పుడే మంత్రి పదవి వచ్చింది. మీరు 30ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నా మంత్రి పదవి రాకపోవడానికి కారణం నేతలకు మీ పై నమ్మకం లేకపోవడమే. అధికారులపై ఒత్తిడి తెచ్చి పనులు చేయించుకోవడం మంచిది కాదు. అమృత్ పథకం కింద శిల్పా బ్రదర్స్ తెచ్చిన నిధులను తాము తెచ్చినట్లు చెప్పుకోవడం సిగ్గుచేటు. -
భూమా, గంగుల వర్గీయుల మధ్య ఘర్షణ
కర్నూలు: కర్నూలు జిల్లాలో టీడీపీ నేతల మధ్య ఘర్షణతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చాగలమర్రి మండలం గొడిగనూరులో ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, గంగుల ప్రభాకర్‌రెడ్డి వర్గీయుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ గొడవల్లో కానిస్టేబుల్ సహా ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. సీసీ రోడ్డు పనుల విషయంలో ఇరు వర్గాల మధ్య వివాదం తలెత్తినట్లు తెలుస్తుంది. ఇప్పటికే జిల్లాలో భూమాకు శిల్పా వర్గీయులకు ఆధిపత్య పోరు నడుస్తుంది. తాజాగా గంగుల వర్గీయులతో భూమా గొడవలతో గ్రామాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీలో భూమా చేరికను మొదటి నుంచి గంగుల, శిల్పా వర్గీయులు తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. -
చంద్రబాబు వద్దకు నంద్యాల టీడీపీ పంచాయితీ
విజయవాడ: కర్నూలు జిల్లా నంద్యాల టీడీపీ పంచాయతీ మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్దకు చేరింది. నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, మాజీ మంత్రి, నంద్యాల టీడీపీ ఇన్చార్జి శిల్పామోహన్‌రెడ్డి సోదరులు మంగళవారం చంద్రబాబుతో సీఎం క్యాంప్ కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు తమ వాదనలు వినిపించారు. వైఎస్ఆర్ సీపీ తరపున ఎమ్మెల్యేలుగా గెలిచిన భూమా నాగిరెడ్డి, అఖిల ప్రియ ఇటీవల టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే శిల్పా సోదరులకు, భూమాకు సయోధ్య కుదరలేదు. భూమా నాగిరెడ్డి పార్టీలో చేరినప్పటి నుంచి ఇరువర్గాల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. భూమా అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని, అంతేకాకుండా తమ అనుచరులపై దాడులు చేయిస్తున్నారని శిల్పా సోదరులు ఫిర్యాదు చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య రాజీ కుదిర్చేందుకు భూమా నాగిరెడ్డితో పాటు శిల్పా సోదరులను చంద్రబాబు పిలిపించారు. నిన్న కూడా ఇరువర్గాలు విడివిడిగా చంద్రబాబుతో భేటీ అయిన విషయం విదితమే. -
భూమా నాగిరెడ్డి దాడులు చేయిస్తున్నారు
విజయవాడ: నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి తమ అనుచరులపై దాడులు చేయిస్తున్నారని మాజీ మంత్రి, నంద్యాల టీడీపీ ఇన్చార్జి శిల్పామోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదు చేశారు. తాము మొదటినుంచి పార్టీ కోసం పనిచేస్తున్నామని, తమకు తగిన ప్రాధాన్యమివ్వాలని శిల్పామోహన్ రెడ్డి సోదరులు చంద్రబాబును కోరారు. సోమవారం విజయవాడ క్యాంప్ ఆఫీసులో శిల్పామోహన్ రెడ్డి సోదరులు.. భూమా నాగిరెడ్డి, ఆయన కుమార్తె, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిల ప్రియ వేర్వేరుగా ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. వైఎస్ఆర్ సీపీ తరపున ఎమ్మెల్యేలుగా గెలిచిన భూమా నాగిరెడ్డి, అఖిల ప్రియ ఇటీవల టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే శిల్పా సోదరులకు, భూమాకు సయోధ్య కుదరలేదు. విభేదాలతో ఇరు వర్గాలు పరస్పరం చంద్రబాబుకు ఫిర్యాదు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఇరువర్గాలను పిలిచి రాజీచేసేందుకు ప్రయత్నించారు. ఇరు వర్గాల వాదనలు విని, కలసి పనిచేయాలని వారికి సూచించారు. -
భూమా X శిల్పా
► నేడు చంద్రబాబు వద్ద పంచాయితీ ► విజయవాడకు తరలి వెళ్లిన నేతలు నంద్యాల: కర్నూలు టీడీపీలో శిల్పా సోదరులు, ఇటీవలే పార్టీలో చేరిన భూమా నాగిరెడ్డి మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇందుకు సంబంధించి ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి, మాజీ మంత్రి, టీడీపీ ఇన్చార్జి శిల్పామోహన్‌రెడ్డి మధ్య పంచాయితీ సోమవారం సీఎం చంద్రబాబు కోర్టులో జరగనుంది. ఇందుకోసం వీరిద్దరితో పాటు మాజీ మంత్రి ఫరూక్, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ చక్రపాణిరెడ్డి కూడా ఆదివారమే విజయవాడకు బయలుదేరి వెళ్లారు. ఆధిపత్యం విషయంలో ఇరువర్గాల వారు పట్టుదలగా ఉండటంతో సయోధ్య కుదిరే అవకాశం లేదని తెలుస్తోంది. సీఎం కూడా సర్ధుకుపోవాలని సూచించి పంపే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఇరు వర్గాలు చంద్రబాబుకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. -
'భూమా అక్రమాలను చంద్రబాబుకు వివరించాం'
హైదరాబాద్: కర్నూలు జిల్లాకు చెందిన టీడీపీ నాయకుడు శిల్పా మోహన్ రెడ్డి, తన సోదరుడితో కలిసి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అసెంబ్లీ ఆవరణలో ప్రత్యేకంగా కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్ సీపీ నుంచి ఇటీవలే పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరిన ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి వల్ల తనకు సమస్యలు ఎదరవుతున్నాయని తన గోడు వెళ్లబోసుకున్నారు. భూమా కుటుంబం టీడీపీలో చేరినప్పటి నుంచి జిల్లా రాజకీయాలలో గొడవలు మొదలయ్యాయని పార్టీ అధ్యక్షుడికి ఫిర్యాదుచేశారు. భూమా నాగిరెడ్డి ఆర్థిక అక్రమాలకు పాల్పడుతున్నారని శిల్పా మోహన్ రెడ్డి ఆరోపించారు. తాను పదేళ్లు ఎమ్మెల్యేగా పనిచేశానని, అయితే ఆ సమయంలో ఎలాంటి గొడవలు జరగలేదని చంద్రబాబుకు వివరించారు. భూమా అక్రమాలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లామని వారు తెలిపారు. తామిద్దరిని టీడీపీలో లేకుండా చేయాలని భూమా ప్రయత్నిస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. -
శోభమ్మ అభివృద్ధి చేయలేదా?
మరోవైపు అభివృద్ధి చేయలేదంటూ పరోక్షంగా శిల్పాపై భూమా విమర్శలు మండిపడుతున్న మాజీ మంత్రి సాక్షి ప్రతినిధి, కర్నూలు: నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ వ్యాఖ్యలు ఆ రెండు నియోజకవర్గాలతో పాటు అధికార పార్టీ నేతల్లోనూ కలకలం రేపుతున్నాయి. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో మొదటి నుంచీ భూమా కుటుంబ సభ్యులదే హవా. సుమారు రెండు దశాబ్దాల పాటు నియోజకవర్గాన్ని పాలించింది ఆ కుటుంబమే. అయినప్పటికీ నియోజకవర్గ అభివృద్ధి జరగలేదన్న భూమా అఖిలప్రియ వ్యాఖ్యలపై ఆ నియోజకవర్గంలో చర్చనీయాంశమవుతోంది. అంటే తమ కుటుంబ హయాంలోనే అభివృద్ధి జరగలేదంటూ.. అందులోనూ శోభమ్మ అభివృద్ధి చేయలేదనే రీతిలో ఆమె వ్యాఖ్యలు ఉన్నాయని కేడర్ బాధపడుతున్నట్లు సమాచారం. మరోవైపు నంద్యాలను గతంలో అభివృద్ధి చేయలేదంటూ భూమా నాగిరెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల శిల్పా వర్గీయులు గుర్రుమంటున్నారు. తమ నేతను లక్ష్యంగా చేసుకునే భూమా మాట్లాడారని మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజా చేరికలు అధికార పార్టీలో కొత్త చర్చకు దారితీస్తున్నాయి. రెండు దశాబ్దాల పాలనలో.. వాస్తవానికి ఆళ్లగడ్డ నియోజకవర్గంలో మొదటి నుంచి భూమా కుటుంబానిదే హవా. 1989 లో భూమా శేఖర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఆ కుటుంబం నుంచి రంగప్రవేశం చేశారు. అయితే, 1992 లో శేఖర్ రెడ్డి చనిపోవడంతో భూమా నాగిరెడ్డి ఎమ్మెల్యే అయ్యారు. 1994లో సాధారణ ఎన్నికల్లో భూమా నాగిరెడ్డి తిరిగి ఎమ్మెల్యేగా ఎన్నికయినప్పటికీ.. ఆ తర్వాత ఎంపీ కావడంతో 1997లో ఉప ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో 1997లో శోభానాగిరెడ్డి ఎమ్మెల్యే అయ్యారు. అనంతరం 1999 సాధారణ ఎన్నికల్లోనూ ఆమె గెలు పొందారు. కేవలం 2004 నుంచి 2009 వరకూ గంగుల ప్రతాప్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక 2009లో పీఆర్పీ నుంచి శోభానాగిరెడ్డి ఎన్నికయ్యారు. తాజాగా భూమా అఖిలప్రియ ఎన్నికయ్యారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో అధికారంలో ఉన్నది రెండు దశాబ్దాల పాటు పాలించింది భూమా కుటుంబమే. అయినప్పటికీ నియోజకవర్గం అభివృద్ధి చెందలేదంటూ తమ కుటుంబాన్నే విమర్శించేలా మాట్లాడటం తగదనే అభిప్రాయం వారి అనుచరుల్లో వ్యక్తమవుతోంది. మా పైనే విమర్శలా? నంద్యాల అభివృద్ధిపై అనేక వాగ్దానాలు చేసి ఎమ్మెల్యేగా గెలు పొంది.. చివరకు ఏమీ చేయలేక అధికార పార్టీలో చేరుతూ తమపై పరోక్షంగా విమర్శలు చేయడం తగదని అధికార పార్టీలోని నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. నంద్యాలను గతంలో అభివృద్ధి చేయలేదన్న వ్యాఖ్యలు.. పరోక్షంగా శిల్పా, ఫరూఖ్లపై విమర్శలు చేశారని తెలుస్తోంది. కేవలం గతంలో ఎన్నడూ అభివృద్ధి జరగలేదనే వ్యాఖ్యలపై అటు శిల్పా వర్గీయులు కూడా గుర్రుగా ఉన్నారు. పార్టీలో చేరిన వెంటనే తనను లక్ష్యంగా చేసుకుని మాట్లాడటం చూస్తుంటే విభేదాలకు ఆజ్యం పోయడమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భూమా వ్యాఖ్యలపై మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. ‘‘ఆళ్లగడ్డ నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదు. అందుకే నియోజకవర్గ అభివృద్ధి కోసమే అధికార పార్టీలో చేరాను.’’ - టీడీపీలో చేరిక సందర్భంగా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ‘‘నంద్యాల నియోజకవర్గాన్ని గతంలో అభివృద్ధి చేయలేదు. కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసమే తెలుగుదేశంలో చేరుతున్నా.’’ - విజయవాడలో భూమా నాగిరెడ్డి -
'శోభా నాగిరెడ్డి ఆత్మ క్షోభిస్తుంది'
తిరుపతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి భూమా నాగిరెడ్డి, అఖిలప్రియ టీడీపీలోకి వెళ్లడం వల్ల పైలోకంలో ఉన్న శోభానాగిరెడ్డి ఆత్మ క్షోభించి ఉంటుందని ఎమ్మెల్యే ఆర్కే రోజా వ్యాఖ్యానించారు. చిత్తూరు జిల్లా తిరుపతిలో మీడియాతో ఆమె మాట్లాడారు. శోభా నాగిరెడ్డి మరణం తర్వాత టీడీపీ సర్కార్ ఏపీ శాసనసభలో కనీసం సంతాపాన్ని కూడా ప్రకటించలేదని ఆమె విమర్శించారు. ఇప్పుడు అదే పార్టీలోకి ఆమె కుటుంబ సభ్యులే వెళ్లడం దారుణమన్నారు. దేశ రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శని లాంటి వాడంటూ మండిపడ్డారు. టీఆర్ఎస్లోకి టీడీపీ ఎమ్మెల్యేలు వెళ్తే నైతిక విలువలు లేవన్న చంద్రబాబు ఇప్పుడు ఏం చేశారని ఈ సందర్భంగా రోజా ప్రశ్నించారు. మునిగిపోయే పడవ లాంటి టీడీపీలోకి ఎమ్మెల్యేలు వెళ్లారంటే.. ఏదో ప్రయోజనం ఆశించి వెళ్లి ఉంటారని ఆరోపించారు. చంద్రబాబుకు దమ్ము, ధైర్యం ఉంటే ఎన్నికలకు సిద్ధపడాలని డిమాండ్ చేశారు. నలుగురు ఎమ్మెల్యే పోయినంత మాత్రాన వైఎస్ఆర్ సీపీ బెదిరేది లేదని పేర్కొన్నారు. అభివృద్ధి పనుల పేరుతో చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ వేల కోట్లు సంపాదించారని, సెక్యూరిటీ లేకుండా చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లగలడా అంటూ ఏపీ సీఎంను వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజా సూటిగా ప్రశ్నించారు. మా పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు భూమా నాగిరెడ్డికి సంకెళ్లు వేసి కూర్చోబెట్టారు. ప్రస్తుతం షేక్ హ్యాండ్ ఇచ్చి, కండువా కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. శోభా నాగిరెడ్డికి కనీసం సంతాపం తెలిపలేదని.. అంతా తెలిసి కూడా ఆమె భర్త, కూతురు అధికార టీడీపీలో చేరడాన్ని తప్పుబట్టారు. తమ పార్టీ చేసిన అభివృద్ది చూసి వస్తున్నారని అధికార పార్టీ వారు చెప్పడం నిజంగా సిగ్గుచేటు. అసలు టీడీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏంటని ఈ సందర్భంగా రోజా ధ్వజమెత్తారు. ఒక్క నిరుద్యోగికి కూడా ఉద్యోగం ఇవ్వలేదని, రైతులు, చేనేత కార్మికులకు రుణమాఫీ చేయలేదని వివరించారు. మొదటి నుంచి కూడా బాబుకు రాజకీయాలను భ్రష్టు పట్టించడం అలవాటు అని.. అందులో భాగంగానే తెలంగాణలో ఓటుకు కోట్లు కేసులో రెడ్ హ్యాండెడ్ గా దొరికి పోయాడని ఆరోపించారు. అందుకే అక్కడ టీడీపీ సీన్ రివర్స్ అయిందన్నారు. ఈ పార్టీ వాళ్లు టీఆర్ఎస్ లో చేరితో సంతలో పశువుల్లా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొంటున్నారంటూ టీఆర్ఎస్ పార్టీని విమర్శించిన చంద్రబాబు ఈ రోజు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలను రాజీనామా చేయించకుండా, టీడీపీ నుంచి ఎన్నికల్లో నిలబెట్టకుండానే మీ పార్టీలో ఏ విధంగా చేర్చుకున్నారని చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. రాజధాని రైతుల భూములను దోచుకుని, సింగపూర్ బృందం చేతికి అప్పగించి అభివృద్ధి చేస్తామని చెప్పిన చంద్రబాబు... టీడీపీ నేతలు, తన సన్నిహితులకు ఆ భూములను కట్టబెట్టడం దారుణమంటూ మండిపడ్డారు. -
అభివృద్ధి కోసమే టీడీపీలో చేరాం: భూమా
విజయవాడ: రాష్ట్రంలో రాజకీయ పరిస్థుతులు, కార్యకర్తల మనోభావాలు ఎలా ఉన్నాయో తనకు తెలియదని, కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసమే అధికార టీడీపీలో చేరామని నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి తెలిపారు. సోమవారం రాత్రి ముఖ్యమంత్రి అధికార నివాసంలో చంద్రబాబుతో భేటీ అనంతరం టీడీపీలో చేరినట్లు ఆయన పేర్కొన్నారు. తనతో కలిపి నలుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నట్లు చెప్పారు. 'గడిచిన 20 ఏళ్లుగా ప్రతిపక్షంలోనే ఉంటున్నా. ఇన్నేళ్ల కాలంలో ఆళ్లగడ్డ, నంద్యాల నియోజవకవర్గాలు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనిస్తున్నదని నేను నమ్మాను. కార్యకర్తలు కూడా అదే మాట నాతో చెప్పారు. చంద్రబాబుతో కలిసి పనిచేద్దామని నిర్ణయించుకున్నాం. అందుకే టీడీపీలో చేరుతున్నాం'అని భూమా విలేకరులతో చెప్పారు. చంద్రబాబు నుంచి ఎలాంటి మంత్రిపదవి హామీ లభించలేదని, కేవలం అభివృద్ధి కోసమే అధికారపార్టీలో చేరానన్న నాగిరెడ్డి.. తమ రాకతో టీడీపీ బలపడుతుందేకానీ నిర్వీర్యంకాదన్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే విషయం పై తర్వాత ఆలోచిస్తానన్న ఆయన.. విపక్షం నుంచి ఇంకా ఎవరుచేరతారో చెప్పలేనన్నారు. వైరివర్గాలతో సర్దుబాట్ల విషయమై చంద్రబాబు సూచనలు చేశారని, కలిసి ముందుకుసాగుతూ టీడీపీ ఉన్నతికి కృషిచేస్తానని భూమా నాగిరెడ్డి అన్నారు. ఆయనతోపాటు కుమార్తె అఖిలప్రియ, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్ ఖాన్, ఎమ్మెల్సీ నారాయణరెడ్డిలు కూడా టీడీపీలో చేరారు. 'ఆళ్లగడ్డ అభివృద్ధి కోసమే టీడీపీలో చేరాను. 20 ఏళ్లుగా ఆళ్లగడ్డ అభివృద్ధికి నోటు కోలేదు. అందుకే పార్టీ మారుతున్నాం' అని భూమా అఖిల ప్రియ అన్నారు. 'రెండు సంవత్సరాలుగా నా నియోజక వర్గంలో ఒక్క పని జరగలేదు. పనులు అవుతాయనే టీడీపీలో చేరాను' అని జలీల్ ఖాన్ తెలిపారు. 'చాలా రోజులుగా టీడీపీలో చేరాలనుకుంటున్నా. స్థానిక నాయకత్వం విభేధించడం వల్ల..ఆరు నెలలుగా వాయిదా పడుతూ వస్తుంది' అని ఆదినారాయణ రెడ్డి అన్నారు. -
టీడీపీలో చేరిన భూమా నాగిరెడ్డి, ఆదినారాయణ రెడ్డి..
విజయవాడ: రెండేళ్ల పరిపాలనా వైఫల్యాలు, భారీ అవినీతి ఆరోపణల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేక్రమంలో దిగజారుడు రాజకీయాలను తెరపైకి తీసుకొచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు. ఓవైపు తెలంగాణలో టీఆర్ఎస్ లోకి టీడీపీ ఎమ్మెల్యేల చేరికలను గర్హిస్తున్న ఆయనే.. ఏపీ ప్రతిపక్ష పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను సోమవారం తమ పార్టీలోకి చేర్చుకున్నారు. సోమవారం రాత్రి చంద్రబాబుతో భేటీ అనంతరం టీడీపీలో చేరినట్లు ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, ఆయన కుమార్తె భూమా అఖిలప్రియ, జలీల్ ఖాన్, ఆదినారాయణ రెడ్డిలు ప్రకటించారు. సోమవారం మధ్యహ్నం పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) చైర్మన్ పదవికి రాజీనామాచేసిన అనంతరం భూమా తన కూతురుతో కలిసి విజయవాడలోని చంద్రబాబు నివాసానికి వెళ్లారు. మరికాసేపటికి జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, విజయవాడ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ లు కూడా బాబుతో భేటీ అయ్యారు. కాగా, ఆదినారాయణ రెడ్డి చేరికను ఆ నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జి రామసుబ్బారెడ్డి, మాజీ మంత్రి శివారెడ్డి సతీమణి లక్ష్మీదేవమ్మలు తీవ్రంగా వ్యతిరేకించారు. వాళ్లను పార్టీలో చేర్చుకుంటే తమదారి తాము చూసుకుంటామని హెచ్చరించారు. చంద్రబాబు సర్దిచెప్పడంతో చివరికి కాస్త మెత్తబడ్డారు. -
చంద్రబాబుకు కూడా క్లారిటీ లేదు: కేఈ
విజయవాడ: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి (నంద్యాల) కుటుంబం టీడీపీలో చేరే అంశంపై అసలు ఇంతవరకు తమ పార్టీలో ఎవరికీ స్పష్టత లేదని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి పేర్కొన్నారు. ఈ అంశంపై అసలు చంద్రబాబుకు కూడా క్లారిటీ లేదని ఆయన వ్యాఖ్యానించారు. శనివారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. భూమాను చేర్చుకోవడానికి తమకు అభ్యంతరం లేదని కేఈ అన్నారు. శిల్పా మోహన్ రెడ్డి సోదరులు భూమా నాగిరెడ్డి రాకను సీఎం చంద్రబాబు నాయుడు వద్ద వ్యతిరేకించారని, అయితే చంద్రబాబు వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారని చెప్పారు. -
'పార్లమెంట్లో ఇచ్చిన హామీని మరచిపోయారు'
కర్నూలు: కేంద్ర, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కలసి ప్రజల నోట్లో మట్టికొట్టాయని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్లో ఇచ్చిన హామీని మరచిపోయారని అన్నారు. ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ సహా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా అంశం ప్రస్తావించలేదని భూమా నాగిరెడ్డి గుర్తు చేశారు. చంద్రబాబు రాజధాని శంకుస్థాపనకు ఆడంబరంగా 400 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని విమర్శించారు. -
'హోదా' మరచి విదేశీ పర్యటనలా: భూమా
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయాన్ని వదిలేసి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విదేశీ పర్యటనలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి (నంద్యాల) ఆరోపించారు. గురువారం ఆయన కర్నూలు పట్టణంలో మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదాకు మద్దతు తెలుపుతున్న ప్రొఫెసర్లను సస్పెండ్ చేయడం దారుణమని ఆయన మండిపడ్డారు. పట్టిసీమ కోసం హంద్రీనీవా నుంచి మోటార్లను తరలిస్తుంటూ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సమర్థించుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మోటార్లను తరలించిన ప్రభుత్వం రాబోయే రోజుల్లో రిజర్వాయర్లను కూడా తరలిస్తుందని భూమానాగిరెడ్డి పేర్కొన్నారు. -
'హోదా కోసం కలసి పోరాడుదాం'
నంద్యాల: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు ప్రతి ఒక్కరూ శ్రమించాలని, అందుకోసం వైఎస్సార్సీపీ అధినేత జగన్ ఆధ్వర్యంలో జరిగే పోరాటానికి మద్దతుగా నిలవాలని వైఎస్సార్సీపీ నేత, నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి కోరారు. గురువారం ఆయన స్థానిక రామకృష్ణ డిగ్రీ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. ఈ పోరాటంలో విద్యార్థులు ముందు నిలవాలన్నారు. ప్రత్యేక హోదా వస్తే ప్రతి ఒక్కరికి లబ్ధి కలుగుతుందని, రాష్ట్రం పురోభివృద్ధి చెందుతుందని తెలిపారు. -
వంతాడ, చింతలూరులో అక్రమ మైనింగ్:భూమా
కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా వంతాడ, చింతలూరులో అక్రమ మైనింగ్ జరిగినట్లు గుర్తించామని ఆంధ్రప్రదేశ్ శాసనసభ పబ్లిక్ ఎకౌంట్స్ కమిటీ (పీఏసీ) చైర్మన్ భూమా నాగిరెడ్డి తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా అటవీ భూముల్లో లీజుదారులు 40 అడుగుల మేర రోడ్లు నిర్మించారని ఆయన గురువారమిక్కడ పేర్కొన్నారు. మైనింగ్ లీజు వ్యవహారంలో రెవెన్యూ, అటవీశాఖ, మైనింగ్ శాఖలు జాయింట్ సర్వే చేయలేదని భూమా అన్నారు. పర్యావరణ అనుమతులు లేకుండానే చింతలూరు, పెద్దినపూడిలలో మైనింగ్ తవ్వకాలు చేపట్టారని ఆయన తెలిపారు. ఎస్ఈజెడ్ పరిహారం విషయంలో రైతులు అసంతృప్తితో ఉన్నారని, వీటిపై నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అంద చేస్తామని భూమా నాగిరెడ్డి చెప్పారు. కాగా జిల్లాలోని కొత్తపల్లి మండలం కొత్తమూలపేటలోని కేఎస్ఈజెడ్ నిర్వాసిత కాలనీ, చైనా బొమ్మల తయారీ కంపెనీలను బుధవారం పబ్లిక్ ఎకౌంట్స్ కమిటీ సభ్యులు పరిశీలించారు. -
సీపీఎం దీక్షకు వైఎస్ఆర్ సీపీ మద్ధతు
కర్నూలు(నంద్యాల): సీపీఎం చేపట్టిన దీక్షకు వైఎస్ఆర్ సీపీ పార్టీ మద్ధతు తెలిపింది. ఇందుకు సంఘీభావంగా పార్టీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఈ దీక్షకు మద్ధతునిచ్చారు. నంద్యాల పట్టణ అభివృద్ధికి తక్షణమే రూ.350 కోట్లు కేటాయించాలని కోరుతూ సీపీఎం నాయకులు నంద్యాల పట్టణంలో 72 గంటల నిరసన దీక్షకు దిగారు. మూతపడిన చక్కెరఫ్యాక్టరీ, స్పిన్నింగ్ మిల్లు, కూల్‌డ్రింక్స్ పరిశ్రమలను తెరిపించాలని కోరారు. నంద్యాల జిల్లా జనరల్ ఆసుపత్రిని 500 పడకల స్ధాయికి పెంచాలని, కల్చరల్ యూనివర్సిటీని, ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలను నంద్యాలలో ఏర్పాటు చేయాలని కోరుతూ ఈ దీక్షలో నలుగురు సీపీఎం నాయకులు కూర్చున్నారు. అనంతరం భూమానాగిరెడ్డి మాట్లాడుతూ.. ప్రజల సమస్యల గురించి ప్రస్తావిస్తే ప్రభుత్వం వ్యక్తిగత కక్షలకు పోయి తమ నేతలపై ఎస్సీ,ఎస్టీ కేసులు పెడుతోందని ఆరోపించారు. ఈ దీక్షకు కాంగ్రెస్, సీపీఐలతో పాటు పలు రాజకీయపక్షాలు మద్ధతు తెలిపాయి. -
ఇదెక్కడి న్యాయం చంద్రబాబూ: భూమా
నంద్యాల: ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక్కో పార్టీకి ఒక్కో విధంగా చట్టాన్ని అమలు చేయాలని చూస్తున్నారని కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి విమర్శించారు. ఒకే చట్టాన్ని ఒకే రాష్ట్రంలో ఒక్కో తీరుగా అమలు చేయడం ఎంతరకూ సమంజసమని ప్రశ్నించారు. శుక్రవారం ఆయన నంద్యాలలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను అణగదొక్కడమే లక్ష్యంగా ఆయన ముందుకు సాగుతున్నారన్నారు. ఇందులో భాగంగానే తెలంగాణలో శాసనమండలి ఎన్నికల సందర్భంగా రేవంత్‌రెడ్డిని అరెస్ట్ చేస్తే ఎన్నికల సంఘం అనుమతి లేకుండా ఎలా అరెస్ట్ చేశారని ప్రశ్నించారన్నారు. అదే తన విషయానికొచ్చే సరికి ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ ఎలా అరెస్టు చేయించారని అన్నారు. ఏసీబీ కేసులో కీలక నిందితుడిగా ఉన్న సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వీరయ్య ఏపీలో వైద్య చికిత్సలు చేయించుకోవడానికి అనుమతిచ్చిన చంద్రబాబు.. తనకు మాత్రం హైదరాబాద్‌లో చికిత్సలు చేయించుకోవడానికి అనుమతి ఇవ్వకపోవడంలోని ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఎమ్మార్వో వనజాక్షిపై దాడి చేస్తే ఇంత వరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని అన్నారు. ఎస్పీ నంద్యాలకు వస్తే స్వాగతిస్తా.. జిల్లా ఎస్పీ నంద్యాలకు అధికారిగా వచ్చి ప్రజలకు న్యాయం చేస్తానంటే స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. తాను గాని, తన అనుచరులు గానీ నంద్యాలలో ఎక్కడా అరాచకాలు, అన్యాయాలు చేయడం లేదని.. అందు వల్ల ఎలాంటి అధికారి వచ్చినా భయపడమన్నారు.ఎస్పీకి ప్రస్తుతం సీఎం నుంచి మంచి మార్కులు వచ్చి ఉండొచ్చని, అందువల్ల ఆయన జిల్లాలో ఏ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసినా స్వాగతిస్తానన్నారు. -
'ఎస్పీ రాజీనామా చేసి టీడీపీలో చేరాలి'
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతోనే కర్నూలు జిల్లా ఎస్పీ.. వైఎస్ఆర్ సీపీ నేతలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి విమర్శించారు. కర్నూలు జిల్లా ఎస్పీ వ్యక్తిగత కక్షలు పెంచుకునే బదులు ఉద్యోగానికి రాజీనామా చేసి టీడీపీలో చేరాలని భూమా వ్యాఖ్యానించారు. ఎన్నికల సంఘం అనుమతి లేకుండా తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయడాన్ని ఆ పార్టీ ఖండించిందని, అలాంటపుడు ఈసీ అనుమతి లేకుండా తనను ఎలా అరెస్ట్ చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తనను అరెస్ట్ చేసిన విషయాన్ని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని భూమా చెప్పారు. కర్నూలు జిల్లా స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నంద్యాలలో భూమాను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. -
భూమా నాగిరెడ్డికి బెయిల్ మంజూరు
మంజూరు చేసిన ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు కర్నూలు(లీగల్): ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా బనాయించిన అక్రమ కేసులో అరెస్టయిన ప్రజా పద్దుల కమిటీ(పీఏసీ) చైర్మన్, నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి బెయిల్ మంజూరయింది. ఈ మేరకు కర్నూలు ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక విచారణ కోర్టు బుధవారం ఆదేశాలు జారీచేసింది. భూమా నాగిరెడ్డి తరఫు న్యాయవాదులు వై.రాజశేఖర్‌రెడ్డి, టి.సూర్యనారాయణరెడ్డిలు కోర్టులో బెయిల్‌కు దరఖాస్తు చేశారు. దీనిపై బుధవారం ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టులో వాదనలు జరిగాయి. భూమాకు బెయిల్ ఇవ్వవద్దని పబ్లిక్ ప్రాసిక్యూటర్ రామచంద్రారెడ్డి కోర్టుకు విన్నవించారు. ఆయనకు అనారోగ్యం ఉందని.. ఇవన్నీ రాజకీయ కోణంలో బనాయించిన అక్రమ కేసులని భూమా తరఫు న్యాయవాదులు విన్నవించారు. ఇరువురి వాదనలు విన్న న్యాయమూర్తి వి.వి.శేషుబాబు.. భూమా నాగిరెడ్డికి రూ.20 వేల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశించారు. రాష్ట్రంలో అనధికార ఎమర్జెన్సీ ఆళ్లగడ్డ: ‘‘డోన్ట్ టచ్ మీ... అనే పదానికి పెడర్థం తీశారు. నేను మాట్లాడింది డీఎస్పీ హరినాథ్‌రెడ్డితో అయితే.. పక్కనున్న ఎస్సీ వర్గానికి చెందిన డీఎస్పీచేత అట్రాసిటీ కేసు బనాయించారు. ఈ పరిణామం చూస్తే ఇకపై పోలీసు అధికారులు నేమ్‌బోర్డులో పేరుతోపాటు కులం పేరు రాసుకోవాల్సి వస్తుంది’’ అని భూమా నాగిరెడ్డి అన్నారు. అక్రమంగా బనాయించిన ఎస్సీ, ఎస్టీ కేసులో బుధవారం రాత్రి 7.30 గంటల సమయంలో భూమా బెయిల్‌పై విడుదలయ్యారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. -
భూమా నాగిరెడ్డికి బెయిల్ మంజూరు
-
నెట్టేస్తే 'డోంట్ టచ్ మీ' అన్నందుకు కేసా?
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓట్లకు కోట్లు కురిపించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని ఆయన మంగళవారం పరామర్శించారు. అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజకీయ విలువలకు పాతర వేసిన చంద్రబాబు సిగ్గుతో తలదించుకోవాలన్నారు. లంచాల సొమ్ముతో ఓట్లు కొనుగోలు చేశారని, ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లకు కోట్లు గుమ్మరించారన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైఎస్ఆర్ సీపీ నేతలను బెదిరించారని, తప్పు చేసి తిరిగి వాళ్లే కేసులు పెట్టారని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. భూమా నాగిరెడ్డిపై కుట్ర చేసి కేసు పెట్టారని, ఎమ్మెల్యే అఖిలప్రియపై దురుసుగా ప్రవర్తించరన్నారు. మహిళా ఎమ్మెల్యే అని చూడకుండా నెట్టడంతో పాటు, దుర్భాషలాడారని, ఇదేమిటని ప్రశ్నించినందుకు భూమా నాగిరెడ్డిపై కేసు పెట్టారని వైఎస్ జగన్ అన్నారు. కన్న కూతురిని దుర్భాషలు ఆడితే.. తండ్రిగా ఆయన స్పందించారని, ఆ సమయంలో భూమా నాగిరెడ్డిని అక్కడ నుంచి పక్కకు నెట్టేశారని, దాంతో ఆయన తనను నెట్టొద్దంటూ 'డోంట్ టచ్ మీ' అన్నారని, ఆ పదాన్ని తీసుకుని భూమాపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి చివరకు ఆయనకు బెయిల్ కూడా రాకుండా ఇబ్బంది పెడుతున్నారన్నారు. అసలే భూమా నాగిరెడ్డికి ఓపెన్ హార్ట్ సర్జరీ అయిందని, అయితే మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ నిమ్స్‌కు తరలించాలని వైద్యులు సూచించినా... కక్ష గట్టి కర్నూలులోనే ఉంచారన్నారు. అదేమంటే హైదరాబాద్ వేరే రాష్ట్రం అంటున్నారని, మరి చంద్రబాబుకు అక్కడే నివాసం ఉందని, ఓటర్, ఆధార్ కార్డు కూడా హైదరాబాద్‌లోనే ఉందని, అలాంటప్పుడు అది వేరే రాష్టమన్న విషయం గుర్తు రాదా అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు చర్యలను ప్రజలు గమనిస్తున్నారని, ఎల్లకాలం టీడీపీ అధికారంలో ఉండదనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. చంద్రబాబు సర్కారు బంగాళాఖాతంలో కలిసిపోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. -
భూమా నాగిరెడ్డికి వైఎస్ జగన్ పరామర్శ
హైదరాబాద్: వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం మధ్యాహ్యం కర్నూలు జిల్లాలో పర్యటించారు. జిల్లాలోని ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న నంద్యాల వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని ఆయన పరామర్శించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పీఎసీ చైర్మన్, నంద్యాల ఎమ్యెల్యే భూమా నాగిరెడ్డిపై అధికార పార్టీ అండదండలతో అక్రమ కేసులను నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అరెస్టు అయిన ఆరోగ్య కారణాలరీత్యా కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. జగన్ మోహన్ రెడ్డి సాయంత్రం 4 గంటలకు కడప కు బయల్దేరి వెళతారు. -
రాజకీయ కారణలతోనే అక్రమ కేసులు
-
పోలీసుల అనుమతితో తండ్రిని కలిసిన అఖిల ప్రియ
కర్నూలు: పీఏసీ చైర్మన్, నంద్యాల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ఎమ్మెల్యే అఖిల ప్రియ సోమవారం ఆసుపత్రికి వచ్చారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో అరెస్టు అయిన భూమా మధుమేహం, రక్తపోటుతో బాధపడుతూ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసుల అనుమతితో తండ్రి భూమానాగిరెడ్డిని అఖిల ప్రియ కలిశారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో భూమాను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మెరుగైన చికిత్స కోసం భూమాను తిరుపతి స్విమ్స్‌కుగానీ, హైదరాబాద్‌లోని నిమ్స్ లేక కిమ్స్‌కు తరలించే అవకాశాలు ఉన్నాయని డాక్టర్ల బృందం వెల్లడించింది. అయితే దీనిపై నేడు(సోమవారం) నిర్ణయం తీసుకోనున్నారు. భూమా ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని వారు డిమాండ్ చేశారు. -
'నాపై ఏసీపీ దౌర్జన్యకరంగా వ్యవహరించారు'
పాడేరు: వైఎస్సార్సీపీ నేత, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భూమా నాగిరెడ్డి అరెస్ట్ అక్రమమని, పోలీసులు ఆయనపై అక్రమ కేసులు బనాయించి వేధింపులకు పూనుకుంటున్నారని పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ధ్వజమెత్తారు. విశాఖ జిల్లా పాడేరులో ఆదివారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పోలీసు వ్యవస్థ అధికార పార్టీకి పూర్తిగా కొమ్ముకాస్తోందని విమర్శించారు. ఇటీవల విశాఖ కలెక్టరేట్లో తాము ఆందోళన చేసి వినతిపత్రం ఇవ్వాలని వేచివుంటే మహిళా ఎమ్మెల్యేనని కూడా చూడకుండా ఏసీపీ రమణ తనపై దౌర్జన్యకరంగా వ్యవహరించారని ఆమె విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ప్రమేయం ఏమీ లేకున్నా పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని అన్నారు. తెలుగుదేశం పాలనలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు రక్షణ లేకుండా పోతోందని ఆమె ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఏపీ సీఎం చంద్రబాబు నెరవేర్చలేదని, ఈ విషయంలో ఎమ్మెల్యేలు, నాయకులు ప్రజలకు అండగా ఉంటున్నారనే అక్కసుతోనే వైఎస్సార్సీపీ నేతలపై పోలీసు నిర్బంధాలను ప్రయోగిస్తున్నారని దుయ్యబట్టారు. -
'నేతలను, కార్యకర్తలను టార్గెట్ చేస్తున్నారు'
విజయనగరం: వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని అన్యాయంగా అరెస్టు చేశారంటూ వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ నేతల నుంచి కార్యకర్తల వరకూ టార్గెట్ చేసి బలహీనపర్చాలనే ఈ తరహా చర్యలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ఎయిర్‌పోర్టు నిర్మాణానికి వ్యతిరేకంగా రైతులు పోరాటం చేస్తున్నారని అన్నారు. అధికారులు మాత్రం పరుగు పేరుతో గ్రామాల్లో ప్రజలను అశాంతి పరుస్తున్నారని విమర్శించారు. ఇదిలా ఉండగా, ఎమ్మెల్యే భూమా అరెస్ట్ ను కురుపాం వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి ఖండించారు. -
భూమా అరెస్టును ఖండించిన వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు
హైదరాబాద్:వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని అక్రమంగా అరెస్టు చేయడంపై పార్టీ ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్ సీపీ నేతలపై అధికార పార్టీ అక్రమంగా అరెస్టు చేయడమే కాకుండా దౌర్జన్యాలకు పాల్పడుతుందని ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి విమర్శించారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా, అధికార పార్టీకి పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తూ భూమాపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మరో ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు మండిపడ్డారు. భవిష్యత్తులో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని ఈ సందర్భంగా కోరుముట్ల హెచ్చరించారు. -
భూమాపై వేధింపుల పర్వం
* నిమ్స్‌కు తరలించేందుకు పోలీసులు ససేమిరా * డాక్టర్ సూచించినా ఎస్కార్ట్ ఇవ్వలేమని సాకులు * జైలులోనే దీక్షకు దిగిన భూమా దిగొచ్చిన అధికారులు.. * కర్నూలు నుంచి ప్రత్యేక వైద్యబృందంతో పరీక్షలు * రాత్రికి కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలింపు సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి భయంతో పీఏసీ చైర్మన్, నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిపై ఏపీలో అధికార టీడీపీ నేతలు వేధింపులపర్వాన్ని కొనసాగించారు. కేవలం ‘నన్ను తాకొద్దు’ అన్నందుకు ఏకంగా ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేసిన పోలీసులు.. ఆయన్ను జైలుకు తరలించేందుకు నానాహంగామా సృష్టించారు. ఇందుకోసం 12 గంట ల పాటు ఆయన్ను విచారణ పేరిట తీవ్ర మానసిక ఇబ్బందులకు గురిచేశారు. చివరకు శనివారం తెల్లవారుజామున నంద్యాలలో జడ్జి ఎదుట హాజరుపరిచి.. ఆళ్లగడ్డ సబ్‌జైలుకు తరలించారు. జైలుకు తరలించాక వైద్యపరీక్షలు నిర్వహించిన డాక్టర్లు.. నిమ్స్‌కు తరలించాలని చెప్పినా ఎస్కార్టు ఇవ్వలేమంటూ పోలీ సులు కుటిలయత్నాలకు దిగారు. వారి తీరుకు నిరసనగా భూమా జైల్లోనే దీక్ష చేపట్టగా.. అధికారులు దిగివచ్చారు. కర్నూలు నుంచి రప్పించిన ప్రత్యేక వైద్యబృందం సలహాతో శనివారం రాత్రి 9.30కి కర్నూలు పెద్దాసుపత్రికి భూమాను తరలించారు. రాత్రి నుంచే హైడ్రామా: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి భయంతో ఏపీలో అధికారపార్టీ.. ప్రతిపక్ష వైఎస్సార్సీపీకి జిల్లాలో పెద్దదిక్కుగా ఉన్న భూమా నాగిరెడ్డిని లక్ష్యంగా ఎంచుకుంది. దీనిలో భాగంగా శుక్రవారం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోలీసులతో ఫిర్యాదు ఇప్పించి భూమాపై పలు కేసులు నమోదు చేయిం చారు. వీటిపై విచారణ పేరిట నంద్యాల త్రీటౌన్ పోలీ సులు ఆయన్ను శుక్రవారం సాయంత్రం 6 గంటలకు నివాసం నుంచి స్టేషన్‌కు తీసుకెళ్లారు. విచారణ పేరి ట 6 గంటలకు పైగా తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. చివరకు అర్ధరాత్రి దాటాక జడ్జి ఎదుట హాజరుపరిచారు. ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసిన పోలీసులు.. ఇందుకోసం సర్టిఫికెట్‌ను సమర్పించలేదు. దీంతో సర్టిఫికెట్‌ను తీసుకొచ్చి... తెల్లవారుజామున 4 గంటలకు ఆయన్ను మళ్లీ జడ్జి ఎదుట హాజరుపరిచారు. ఈ నెల 14 వరకు రిమాండ్ విధిస్తూ ఆళ్లగడ్డ సబ్‌జైలుకు తరలించాలని న్యాయమూర్తి ఆదేశాలిచ్చారు. ఎలాగైనా జైలుకు పంపేందుకు 12 గంటలపాటు ఈ తతంగాన్ని అధికారపార్టీ నేతల ఆదేశాలకనుగుణంగా పోలీసులు నడిపించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
'పోలీసులతో నిర్బంధ అరెస్టులు చేయిస్తున్నారు'
గుంటూరు(మాచర్ల): టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ కేసులు నమోదు చేసి వైఎస్సార్ సీపీ నాయకులు, ఎమ్మెల్యేలను వేధింపులకు గురిచేస్తూ రాష్ట్రంలో రాక్షస పాలనసాగిస్తోందని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. సీఎం చంద్రబాబు అన్ని వర్గాలపై పోలీసులను ప్రయోగిస్తూ నిర్బంధ అరెస్ట్‌లు చేయిస్తూ ప్రజల సమస్యలను గాలికొదిలేశారని ఆయన విమర్శించారు. శనివారం గుంటూరు జిల్లా మాచర్లలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కర్నూలు జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించు కునేందుకు పోలింగ్‌బూత్ వద్దకు వచ్చిన ఎమ్మెల్యే అఖిలప్రియపై పోలీసులు అనుచితంగా వ్యవహరించారన్నారు. దీనిపై ప్రశ్నించిన ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిపై పోలీసులే అక్రమంగా ఫిర్యాదు చేసి ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదు చేయించడం అధికార పార్టీ నాయకుల ఒత్తిడితోనే జరిగిందని ఆరోపించారు. గతంలో కూడా కర్నూలు కార్పొరేషన్ సమావేశంలో భూమా నాగిరెడ్డిపై అక్రమంగా కేసులు నమోదు చేసినట్టు గుర్తుచేశారు. వైఎస్సార్సీపీ బలంగా ఉన్న ప్రాంతాలలో పార్టీని నిర్వీర్యం చేసేందుకు అధికార పార్టీ పలు కుట్రలకు పాల్పడుతోందని, అందులో భాగంగానే ఎమ్మెల్యేలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని పేర్కొన్నారు. తనపై కూడా గతంలో చెన్నాయపాలెం భూముల విషయంలో అధికార పార్టీ వారు అక్రమ కేసులు బనాయించారని చెప్పారు. -
కర్నూలు ప్రభుత్వాస్పత్రికి భూమా నాగిరెడ్డి
-
'టీడీపీ ఆటలు సాగనివ్వం'
-
'టీడీపీ ఆటలు సాగనివ్వం'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకే వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిపై అక్రమంగా కేసు పెట్టారని పార్టీ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఎమ్మెల్యే భూమాపై అక్రమంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడాన్ని బొత్స తప్పుబట్టారు. శనివారం మీడియాతో మాట్లాడిన బొత్స.. కర్నూలులో పోలీసుల తీరును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. భూమా నాగిరెడ్డిని పోలీసు అధికారి ఉద్దేశపూర్వంగానే నెట్టారన్నారు. తన నెట్టవద్దన్నందుకు భూమాపై ఎస్సీ , ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతారా? అని ప్రశ్నించారు. టీడీపీ ఆటలు సాగనివ్వమని బొత్స హెచ్చరించారు. భూమాకు ఏమైనా జరిగితే చంద్రబాబే బాధ్యత వహించాలన్నారు. ఎస్కార్ట్ లేదని భూమాను హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తరలించలేదని.. ఈ ఘటనపై న్యాయ విచారణ జరిపించాలన్నారు. మహిళా ఎమ్మెల్యే అని చూడకుండా ఎమ్మెల్యే అఖిల ప్రియపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారన్నారు. ప్రాజెక్టుల్లో అవినీతిని జగన్ ప్రశ్నిస్తే ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నట్లా? అని బొత్స ప్రశ్నించారు. -
'డిప్యూటీ సీఎం ప్రకటన మేరకే మాపై కేసులు'
కర్నూలు: ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ప్రకటన మేరకే తమపై కేసులు పెట్టారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి మండిపడ్డారు. బలంతో పోలీసు కేసులు పెట్టి వైఎస్సార్ సీపీని అణిచేస్తామని గతంలో డిప్యూటీ సీఎం బహిరంగంగా ప్రకటన చేశారని ఈ సందర్భంగా ఎస్వీ మోహన్ రెడ్డి గుర్తు చేశారు. ఆయన ప్రకటనకు అనుగుణంగానే అందరిమీదా కేసులు పెట్టాలని చూస్తున్నారని ప్రభుత్వ తీరును విమర్శించారు. ఇటీవల ఓ ఫ్లెక్సీ కాల్చారని ఆరోపిస్తూ డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డిపై నాన్ బెయిలబుల్ కేసు పెట్టారని మోహన్ రెడ్డి తెలిపారు. జిల్లాలో వైఎస్సార్ సీపీ బలంగా ఉందని.. దీనిలో భాగంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ గెలుస్తుందన్న ఆక్రోశంతో నాయకులను భయపెట్టాలనే ఉద్దేశంతో అధికార పార్టీ ఇలా కేసులు బనాయిస్తుందన్నారు. అంతకుముందు భూమా నాగిరెడ్డి మీద అక్రమంగా కేసు పెట్టారని.. ఇంతలోనే మళ్లీ కేసు పెట్టారన్నారు. తప్పుడు ఫిర్యాదుతోనే భూమాపై కేసు పెట్టారన్నాడు. ప్రభుత్వోద్యోగి మీద నేర పూరితంగా ఏమైనా చేస్తేనే సెక్షన్- 353 నమోదు చేయాలన్నారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిల ప్రియ పట్ల దురుసుగా ప్రవర్తించారని.. ఎందుకలా చేశారని అడిగితే అరిచి ఏం చేద్దామనుకుంటాన్నావని నాగిరెడ్డిని ఏకవచనంతో సంబోధించారన్నారు. అరెస్టు చేయమంటావా అని బెదిరింపు ధోరణితో మాట్లాడటంతో నాగిరెడ్డి కూడా దీటుగా మాట్లాడారే తప్ప వాళ్లను తిట్టింది లేదన్నారు. ప్రభుత్వం పెట్టే కేసులకు కర్నూలు జిల్లాలో ఏ నాయకుడూ, కార్యకర్తా కూడా భయపడరని తెలిపారు. కేసులకు భయపడే వాళ్లు ఈ జిల్లాలో రాజకీయాల్లో రారని మోహన్ రెడ్డి పేర్కొన్నారు. దీనిపై తాను అసెంబ్లీ హక్కుల తీర్మానాన్నిప్రవేశపెడతామన్నారు. భూమా నాగిరెడ్డి అరెస్టుపై శనివారం ప్రజా ఉద్యమం చేపడతామన్నారు. -
టీడీపీని చిత్తుగా ఓడించండి
జిల్లాలో ఆ పార్టీకి బలం లేదు చంద్రబాబుది ద్వంద్వ విధానం ఓటుకు నోటు వ్యవహారంలో దొరికిపోయారు నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి నంద్యాల: ఎమ్మెల్సీ ఎన్నికలో టీడీపీని చిత్తుగా ఓడించాలని నంద్యాల ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం సాయంత్రం నంద్యాల పట్టణంలో తన నివాసంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భూమా మాట్లాడుతూ.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాలే వైఎస్సార్సీపీ అభ్యర్థి డి. వెంకటేశ్వరరెడ్డి విజయానికి కారణమవుతున్నాయన్నారు. దళితులను అవమానిస్తూ ఎస్సీ నియోజకవర్గాల్లో ఓసీలను ఇన్చార్జిలుగా నియమించడం, సీనియర్లను కాదని కాంగ్రెస్ పార్టీ నుంచి వలస వచ్చిన వారికి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడంతో టీడీపీలో కలకలం రేగిందన్నారు. పార్టీని నమ్ముకొని ఉన్న మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలను కాదని తెలుగుదేశం పార్టీని చిత్తచిత్తుగా ఓడించడానికి ప్రయత్నం చేసిన వ్యక్తికి ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోకి దించడం బాధాకరమన్నారు. తమ పార్టీలో 11మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీతో పాటు వైఎస్సార్సీపీ తరఫున ఎంపికైన జెడ్పీటీసీలు, ఎంపీటీసీ సభ్యులు, కౌన్సిలర్లు ఐక్యంగా వైఎస్సార్సీపీ అభ్యర్థి గెలుపుకోసం ప్రయత్నం చేస్తున్నామన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తెలంగాణలో ఒక విధంగా, ఆంధ్రాలో ఒక విధంగా రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. ఆయన ద్వంద వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటమి తప్పదన్నారు. అవినీతి పార్టీకి ఓటు వేయొద్దు: ఎస్వీ అవినీతి ఊబిలో కూరుకొని పోయిన టీడీపీకి ఓటు వేసి, దానిని నిరుపయోగం చేసుకోవద్దని టీడీపీకి చెందిన కౌన్సిలర్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులను ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి కోరారు. తెలంగాణలో ఓటుకు నోటు ఇచ్చి అడ్డంగా దొరికిపోయిన టీడీపీ అధినేత చంద్రబాబుకు నీతులు మాట్లాడే అర్హత లేదన్నారు. జిల్లాలో తెలుగుదేశం పార్టీకి 86 ఓట్లు మైనస్ ఉంటే ఎలా అభ్యర్థిని రంగంలోకి దించుతారని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ ప్రభావితం ఏ మాత్రం చేయని తెలంగాణలోనే ఒక ఓటుకు రూ.5కోట్లు ఖర్చు చేశారని, ప్రభుత్వం ఉన్న చోట ఎన్ని కోట్లు ఖర్చు చేస్తారో అర్థమవుతుందని ఆయన అన్నారు. జిల్లాలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలోని నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ల సహకారంతో తాను విజయం సాధిస్తానని వెంకటేశ్వరరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పార్టీ నాయకులు ఏవీ సుబ్బారెడ్డి, రాజగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
'బాబు' ప్రజా విశ్వాసం కోల్పోయారు
కర్నూలు: ఓటుకు నోటు వ్యవహారంతో ఏపీ సీఎం చంద్రబాబు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అన్నారు. ఆయన గురువారం కర్నూలులో జరిగిన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కుంభకోణాల్లో పీకల్లోతు కూరుకునిపోయి కాంగ్రెస్ పార్టీ పదేళ్లలో ప్రజలకు దూరంకాగా.. చంద్రబాబు మాత్రం ఏడాదిలోనే నమ్మకాన్ని వమ్ము చేశారని తెలిపారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే వైఎస్సార్ కాంగ్రెస్ అఖండ విజయం సాధిస్తుందని ఆయన తెలిపారు. కార్యక్రమాల్లో పార్టీ నేత, నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సీఎం లోకేశా..? బాలయ్యా..?
నంద్యాల : ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడికి ఆ పదవిలో కొనసాగే హక్కులేదని కావాలంటే బాలయ్యని కానీ, లేదా లోకేష్ బాబును కానీ నియమించుకోవాలని నంద్యాల ఎమ్మెల్యే భూమానాగిరెడ్డి అన్నారు. మంగళవారం కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో సుమారు 3000 మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం పట్టణంలోని వైఎస్సార్ విగ్రహం వద్ద ఆయన మాట్లాడారు. ఓటుకు నోటు విషయంలో చంద్రబాబు సీఎం పదవిలో కొనసాగడానికి అనర్హుడన్నారు. కావాలంటే ఆయన కొడుకు లోకేష్ ను గానీ లేకపోతే బాలకృష్ణను గానీ సీఎం పదవిలో కూర్చొబెట్టుకోవాలని సూచించారు. మీరు చేస్తే సంసారం మేం చేస్తే వ్యభిచారం అన్న చందంగా బాబు ప్రవర్తిస్తున్నాడని భూమానాగిరెడ్డి విమర్శించారు. స్వయానా పిల్లనిచ్చిన మామ స్వర్గీయ ఎన్టీఆరే బాబు అవినీతి పరుడని చెప్పారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇన్ని రోజులు చంద్రబాబు రాజకీయాలు సాగాయని ఇక సాగవని భూమా అన్నారు. -
'భార్యగానే కాదు.. మంచి స్నేహితురాలు కూడా'
ఆళ్లగడ్డ: భార్యగానే కాదు.. మంచి స్నేహితురాలు కూడా తనకు శోభానాగిరెడ్డి దగ్గరయిందని భూమా నాగిరెడ్డి అన్నారు. ఆళ్లగడ్డలో ఏర్పాటు చేసిన శోభా నాగిరెడ్డి సంతాప సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ శోభ లేని లోటు తీరనిదని, ఎంతో బాధగా ఉందంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఇలాంటి రోజు తన జీవితంలో ఉంటుందని ఊహించలేదని చెప్పారు. ప్రస్తుతం తాను బతికి ఉన్నానంటే అది తన పిల్లలకోసమేనని చెప్పారు. శోభా నాగిరెడ్డి జీవితమంతా కష్టాలే అనుభవించిందని చెప్పారు. ఈ సందర్భంగా భూమా నాగిరెడ్డి గుర్తు చేశారు. తమది చాలా పెద్ద కుటుంబమన్న ఆయన ఆమె తమ కుటుంబంలోని ప్రతి ఒక్కరి యోగక్షేమాలు తెలుసుకునేదని చెప్పారు. తాను ఏ పార్టీలో ఉన్న.. ఎక్కడ ఉన్నా నెంబర్ వన్ గా ఉండాలని కోరుకునేవారని చెప్పారు. తనకు వైఎస్ఆర్ తప్ప ఎవరూ తెలియదని, వైఎస్ఆర్ మరణం తర్వాతే తాను జగన్‌ను కలిసినట్లు తెలిపారు. జగన్ సీఎం కావాలని శోభా నాగిరెడ్డి కోరుకున్నారని చెప్పారు. ఆమె అడుగు అడుగునా ఇదే విషయం చెప్పారని.. ప్రతి చోట అదే మాట పలికారంటూ కన్నీటి పర్యంతమయ్యారు. శోభా నాగిరెడ్డి చివరి బహిరంగ సభలో కూడా జగన్ సీఎం కావాలనే కోరుకున్నారని భూమా అన్నారు. -
బాబూ.. మభ్యపెట్టొద్దు
నంద్యాల: రాష్ట్రంలో ఆరు ప్రధాన నీటి పారుదల ప్రాజెక్టులను పూర్తి చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని నంద్యాల శాసనసభ్యుడు భూమా నాగిరెడ్డి ఆరోపించారు. ఆదివారం ఆయన నంద్యాలలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలోని హెచ్ఎన్ఎస్ఎస్, జీఎన్ఎస్ఎస్, వెలిగొండ, పట్టుసీమ, ఎత్తిపోతల పథకం, వంశధార, తోటపల్లి నీటి పారుదల ప్రాజెక్టులకు రూ.8361 కోట్లు అవసరమైతే రూ.1104 కోట్లు కేటాయించారన్నారు. అరకొర నిధులు కేటాయించి ప్రాజెక్టులను పూర్తి చేస్తాననడం విడ్డూరంగా ఉందన్నారు. పాత ప్రాజెక్టులను పక్కకు బెట్టి పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని ఏడాదిలో పూర్తి చేస్తానని ప్రకటించడం చూస్తుంటే ఆయన మానసిక స్థితిని అనుమానించాల్సి వస్తుందన్నారు. అలాగే వచ్చే ఏడాది 70 టీఎంసీలతో కడప జిల్లాలో నీటిని నిల్వ ఉంచుతానని, పులివెందులకు నీరు ఇస్తానని పేర్కొనడాన్ని తాను కూడా స్వాగతిస్తున్నానన్నారు. అయితే అది ఎటువంటి పరిస్థితిలో సాధ్యం కాదని భూమా పేర్కొన్నారు. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ నుంచి 44 వేల క్యూసెక్కుల వరద నీటిని వాడుకునే అవకాశం ఉన్నప్పటికీ.. ముందు, వెనుక కాల్వల పనులే పూర్తి కాలేదన్నారు. అలాగే గోరుకల్లు రిజర్వాయర్‌ను పూర్తి చేయడంలో కూడా ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఎస్సార్బీసీ, గాలేరునగరి.. తదితర ప్రధాన కాల్వల నిర్మాణం ఎక్కడికక్కడే నిలిచిపోయిన విషయాన్ని ముఖ్యమంత్రి గమనించి ఉంటే ఈ ప్రకటన చేయరన్నారు. చివరికి అవుకు రిజర్వాయర్‌లో ఒక టన్నల్ పనిని మాత్రమే పూర్తి చేశారని, మరో టన్నల్ పని పెండింగ్‌లో ఉందన్నారు. గతంలో పాత తూముపై నిర్మాణాన్ని చేపట్టారని ప్రస్తుతం ఆ పని వల్ల నష్టం జరిగే ప్రమాదం ఉందని ఇరిగేషన్ నిపుణులు హెచ్చరిస్తున్న విషయాన్ని భూమా గుర్తు చేశారు. గండికోట రిజర్వాయర్ నుంచి సర్వరాయసాగర్ మీదుగా నగరికి నీళ్లు తీసుకొని పోతానని చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. మాటలు తప్ప చేతల్లేవు.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి వద్ద మాటలు తప్ప చేతల్లేవని భూమా విమర్శించారు. వైఎస్సార్ జిల్లాలో వచ్చే ఏడాది 70 టీఎంసీల నీటిని నిల్వ చేస్తామని సీఎం చెప్పారని, అయితే ఆయన పర్యటన సమయంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను ఎందుకు అరెస్ట్ చేయించారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక వైపు ట్రిబ్యునల్ సమస్యలు, మరో వైపు తెలంగాణ రాష్ట్ర సమస్యలు ఇరిగేషన్‌ను వెంటాడుతున్నాయన్నారు. వీటిని పరిష్కరించకుండానే నీటిని నిల్వ చేస్తామని ప్రకటించడం చూస్తుంటే మసిపూసి మారెడుకాయ చేసే విధంగా ఉందన్నారు. సీమ ప్రాజెక్టులపై చంద్రబాబుకు ఏనాడు ఆసక్తి లేదన్నారు. గతంలో ఓట్లు వేసినప్పుడే సీమ ప్రాజెక్టులను చేపట్టలేదని, ఇప్పుడు ఓట్లు వేయలేదని సీమ ప్రజలపై బాబు విషం కక్కుతున్నారని విమర్శించారు. రాయలసీమకు వచ్చే ఏడాది నీటిని విడుదల చేస్తామని పేర్కొంటున్న భారీ నీటి పారుదల మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుకు తాను సవాల్ విసిరిన విషయాన్ని భూమా గుర్తు చేశారు. ప్రభుత్వం చెప్పిన విధంగా పనులు పూర్తి చేస్తే తాను రాజకీయ సన్యాసం స్వీకరిస్తానని, లేని పక్షంలో దేవినేని ఉమ రాజకీయ సన్యాసం తీసుకుంటారా అని ఆయన సవాల్ విసిరారు. సీఎంగా 1996లో బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు.. గోదావరి, కృష్ణా నదులను అనుసంధానం చేస్తానని చెప్పడమే తప్ప చేసింది ఏమీ లేదని అన్నారు. నిధులు రాబట్టడంలో విఫలం రాజధాని నిర్మాణం, రైల్వే, పోలవరం ప్రాజెక్టులకు నిధులను రాబట్టడంలో సీఎం చంద్రబాబు విఫలమయ్యారని భూమా ఆరోపించారు. అసెంబ్లీలో ఈ విషయాన్ని ప్రస్తావించిన ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డిపై విమర్శలు చేసి ప్రజల్లో చులకన య్యారన్నారు. బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన దగ్గర నుంచి ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు అధికార పార్టీని ఢీకొంటున్నారని ఇరకాటంలో పడి ఎదురు దాడికి దిగుతూ నోళ్లు నొక్కుతున్నారన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా పదేళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు ఇప్పుడు ముఖ్యమంత్రిగా వ్యవహరించే తీరు చూస్తుంటే ప్రజాస్వామ్యంపై ఎంత నమ్మకం ఉందో అర్థం కావడం లేదని భూమా అన్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు శాసనసభలో పైకి లేస్తేనే ఉలిక్కి పడుతున్నారన్నారు. రాష్ట్రానికి ముఖ్యంగా సీమకు న్యాయం జరిగింది ఒక్క వైఎస్సార్, ఎన్టీఆర్‌ల హయాంలో తప్ప మరే ముఖ్యమంత్రి హయాంలో కాలేదన్నారు. రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టుల వెంట త్వరలో పీఏసీ బృందం పర్యటించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. అధికార పార్టీ అక్రమాలపై శాసనసభలోను, బయట పోరాటం నిర్వహిస్తామని హెచ్చరించారు. -
నా హక్కులకు భంగం కల్గించారు
పోలీసులపై మానవ హక్కుల కమిషన్‌కు భూమా ఫిర్యాదు ఒక చిన్న సంఘటనపై నా మీద మూడు కేసులు పెట్టారు నాపై రౌడ్‌షీట్ కూడా తెరిచి ఇరికించడానికి ప్లాన్ చేశారు సాక్షి, హైదరాబాద్: తన హక్కులకు భంగం కలిగిం చిన కర్నూలు జిల్లా పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని, తన హక్కులకు రక్షణ కల్పించాలని పీఏసీ చైర్మన్, నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి రాష్ట్ర మానవ హక్కుల సంఘానికి విజ్ఞప్తి చేశారు. ఆయన బుధవారం కమిషన్ చైర్మన్ జస్టిస్ నిసార్ అహ్మద్ కక్రూను కలసి ఈ మేరకు ఫిర్యాదును అందజేశారు. గత అక్టోబర్ 31న నంద్యాల మున్సిపాలిటీ సమావేశంలో జరిగిన ఒక చిన్న సంఘటనను ఆసరాగా చేసుకుని తనపై మూడు కేసులు పెట్టడమే కాక, రౌడీ షీటును కూడా తెరిచారని భూమా హెచ్ఆర్సీ చైర్మన్ దృష్టికి తెచ్చారు. తన ఇంటి చుట్టూ 200 మంది పోలీసులు మోహరించి తన కదలికలను నియంత్రించేందుకు ప్రయత్నించారని ఆయనకు చెప్పారు. తన న్యాయవాదితో కలసి భూమా మధ్యాహ్నం కమిషన్ చైర్మన్‌ను కలుసుకుని ఈ మేరకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును తీసుకున్న చైర్మన్ పరిశీలిస్తానని వారికి హామీ ఇచ్చారు. నాగిరెడ్డి ఆ తరువాత మీడియాతో మాట్లాడుతూ ఒక సంఘటనకు సంబంధించి ఒకే ఎఫ్ఐఆర్ను రూపొందించాలని సుప్రీంకోర్టు స్పష్టంగా ఇదివరకే ఇచ్చిన తీర్పును కూడా కాదని తనపై మూడు కేసులు పెట్టడమే కాక, పోలీసులు రౌడీషీటును కూడా తెరిచారన్నారు. సంఘటన జరి గింది ఉదయం 11 గంటల ప్రాంతంలోనైనా తనపై కేసు నమోదు చేసింది రాత్రి 8 ఎనిమిది గంటలకని, అప్పటి వరకూ ఎమ్మెల్యేపై ఎలాంటి కేసులు పెట్టి ఇరికించాలా అని పోలీసు అధికారులు చర్చలు జరిపారని ఆయన దుయ్యబట్టారు. తనపై కేసు రిజిస్టర్ కాకముందే తన ఇంటి చుట్టూ 200 మంది పోలీసులు మోహరించడమే కాక, లోనికి కూడా ప్రవేశించారన్నారు. దీన్ని బట్టి వారు పక్కా ప్రణాళికతో తనపై పన్నాగాలు పన్నారనేది స్పష్టమవుతోందన్నారు. ఎస్పీ అత్యుత్సాహం: ప్రభుత్వ ఆదేశాలను తు.చ. తప్పకుండా పాటించాలనే ఉద్దేశంతో జిల్లా ఎస్పీ ఈ వ్యవహారంలో అత్యుత్సాహాన్ని ప్రదర్శించారన్నారు. మున్సిపల్ సమావేశంలో జరిగిన ఓ చిన్న అవాంఛనీయ సంఘటనను సాకుగా చేసుకుని తనతో పాటు 13 మంది కౌన్సిలర్లపై కేసులు పెట్టారన్నారు. నూటికి నూరు శాతం తనపై రాజకీయ దురుద్దేశంతోనే ఈ కేసులు బనాయించారని, ఈ విషయాలన్నీ తాను కమిషన్‌కు నివేదించి తన హక్కులకు భంగం కల్గించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. దీనిపై కమిషన్ సానుకూలంగా స్పందించినట్టు ఆయన పేర్కొన్నారు. -
హెచ్ఆర్సీని ఆశ్రయించిన భూమా నాగిరెడ్డి
హైదరాబాద్: రాజకీయ దురుద్దేశంతోనే తనపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆరోపించారు. పోలీసుల వేధింపులు, అక్రమ కేసులపై భూమ మంగళవారం హైదరాబాద్‌లోని మానవహక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో అనుకోకుండా జరిగిన సంఘటనను కావాలనే పెద్దదిగా చేసి చూపిస్తున్నారని విమర్శించారు. ఒకే ఘటనపై మూడు కేసులు నమోదు చేయడం దారణమని అన్నారు. ఎమ్మెల్యే అని కూడా చూడకుండా తనపై రౌడీషీట్ ఓపెన్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని భూమా నాగిరెడ్డి అన్నారు. -
హెచ్చార్సీని ఆశ్రయించిన భూమా
-
'ఇవాళ నాకు...రేపు మరొకరికి జరుగుతుంది'
-
'ఇవాళ నాకు...రేపు మరొకరికి జరుగుతుంది'
హైదరాబాద్ : నంద్యాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఇచ్చిన సభా హక్కుల ఉల్లంఘన నోటీసును స్పీకర్ కోడెల శివప్రసాద్ సోమవారం తిరస్కరించారు. నియమాల ప్రకారం, సభ్యుల మద్దతు ఉన్నందున నోటీసును అంగీకరించాలని భూమా నాగిరెడ్డి కోరారు. ఎమ్మెల్యేనని కూడా చూడకుండా తనపై రౌడీషీ తెరిచారని.. ఇవాళ తనకు జరిగిందని....రేపు మరొకరికి జరుగుతుందని ఆయన అన్నారు. ప్రజా సమస్యలపై తాము ప్రశ్నిస్తే..ఇలాంటి కేసులు పెడుతున్నారన్నారు. అలాగే నగరి ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ కొత్తగా సభకు ఎన్నికైన సభ్యులపైనా ఇలాంటి కేసులే పెడుతున్నారని అన్నారు. తనపై కూడా ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టారని సభ దృష్టికి తీసుకు వచ్చారు. అయితే నంద్యాల మున్సిపాలిటీలో జరిగిన వివాదానికి అసెంబ్లీకి సంబంధం లేదని స్పీకర్ స్పష్టం చేశారు. తమ బాధ వినాలని భూమ నాగిరెడ్డి పదేపదే స్పీకర్‌ను కోరారు. పోడియం ముందుకు వచ్చిన మరీ స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. స్పీకర్ మాత్రం నిబంధనల ప్రకారం తాను నడుచుకుంటున్నానని అన్నారు. దీనిపై సభలో తీవ్ర గందరగోళం చోటుచేసుకుంది. ఈ క్రమంలో స్పీకర్ సభను పది నిమిషాల పాటు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన తర్వాత స్పీకర్...భూమా నాగిరెడ్డి విజ్ఞప్తి మేరకు... ప్రివిలేజ్ మోషన్‌ను... ప్రివిలేజ్ కమిటీకి రెఫర్ చేస్తానని ప్రకటించారు. -
కర్నూలు అధికారులపై భూమా సభాహక్కుల నోటీసు
-
కర్నూలు అధికారులపై భూమా సభాహక్కుల నోటీసు
సాక్షి, హైదరాబాద్: అక్రమ కేసులు బనాయించి, తనపై చట్ట విరుద్ధంగా రౌడీషీటును తెరవడానికి కారణమైన కర్నూలు పోలీసు సూపరింటెండెంట్ ఎ. రవికృష్ణ, మరో ముగ్గురు పోలీసు అధికారులపై పీఏసీ చైర్మన్, నంద్యాల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి శాసనసభా హక్కుల తీర్మానానికి నోటీసును ఇచ్చారు. ఆయన శనివారం హక్కుల నోటీసును ఆంధ్రప్రదేశ్ శాసనసభ కార్యదర్శి కె.సత్యనారాయణకు అందజేశారు. గత అక్టోబర్ 31వ తేదీన నంద్యాల మున్సిపల్ సమావేశం సందర్భంగా చోటు చేసుకున్న సంఘటనల్లో నిరాధారమైన ఆరోపణలతో తనపై కేసు పెట్టడమే కాకుండా అరెస్టు చేశారని ఆయన నోటీసులో పేర్కొన్నారు. -
ప్రభుత్వానికి ముస్లింల పట్ల ప్రేమ లేదా?
-
అఖిలకు మంత్రి పదవి ఆశ చూపారు!
-
'అఖిలకు మంత్రి పదవి ఆశచూపారు'
హైదరాబాద్ : కర్నూలు జిల్లాలో బలంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేందుకే అధికార పార్టీపై తనపై అక్రమ కేసులు బనాయించిందని నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆరోపించారు. అయితే తానేమి కేసులకు భయపడటం లేదని స్పష్టం చేశారు. నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో జరిగిన గొడవ, ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాల్ని తాను అసెంబ్లీలో ప్రస్తావిస్తానని భూమా నాగిరెడ్డి ప్రకటించారు. వాస్తవానికి తన కూతురు అఖిల ప్రియను టీడీపీ తరపున పోటీ చేయిస్తే... మంత్రి పదవి కూడా ఇస్తామని ఆపార్టీ తనకు ఆశ చూపిందని ఆయన వెల్లడించారు. తాను తిరస్కరించడంతో.. ఆ కక్షతో తనపై కేసులు మోపారని భూమా నాగిరెడ్డి ఆరోపించారు. మనుషులే శాశ్వతం కానప్పుడు...పదవులు శాశ్వతమా అని ఆయన అన్నారు. పదవి పోతే చంద్రబాబు నాయుడు కూడా మాజీ ముఖ్యమంత్రే అవుతునారని భూమా వ్యాఖ్యానించారు. -
శోభా నాగిరెడ్డికి భూమా, అఖిలప్రియ నివాళులు
కర్నూలు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత దివంగత శోభా నాగిరెడ్డి (46) జయంతి కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ముందుగా నంద్యాల ఎమ్మెల్యే, భర్త భూమా నాగిరెడ్డి, కుమార్తె అఖిలప్రియలు శోభా ఘాట్ వద్దకు చేరుకుని నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏవీ కళ్యాణ మండపంలో నేత్ర, రక్తదాన కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 200 మంది రక్త దాతలు, అభిమానుల, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. దీంతో పాటు అన్ని హాస్టళ్లలో అన్నదాన కార్యక్రమం, హరిజనవాడ, మురికివాడలల్లో మెడికల్ క్యాంపులు కూడా నిర్వహించనున్నారు. -
అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదు: భూమా
కర్నూలు : ప్రజా ప్రతినిధులపై రౌడీషీట్ నమోదు చేస్తూ అధికార పార్టీ కక్ష సాధింపుకు పాల్పడుతోందని నంద్యాల వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎలాంటి పోరాటానికైనా సిద్ధమని ఆయన మంగళవారమిక్కడ పేర్కొన్నారు. అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదని భూమా నాగిరెడ్డి స్పష్టం చేశారు. -
భూమా నాగిరెడ్డికి వైఎస్ జగన్ పరామర్శ
కర్నూలు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కర్నూలు జిల్లా నంద్యాల వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని పరామర్శించారు. వైఎస్ జగన్ ఫోన్ చేసి నాగిరెడ్డిని ఓదార్చారు. భూమా నాగిరెడ్డి తల్లి భూమా ఈశ్వరమ్మ (80) సోమవారం ఉదయం హైదరాబాద్ లోని స్వగృహంలో మరణించారు. ఈశ్వరమ్మ గత కొంతకాలంగా అనారోగ్యంగా బాధపడుతుండేవారు. ఆమె భౌతికకాయాన్నిఅంత్యక్రియల నిమిత్తం ఆళ్లగడ్డ తరలిస్తున్నారు. కాగా ఇటీవల భూమా నాగిరెడ్డి సతీమణి శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారానికి వెళ్లి తిరిగి వస్తూ ఆమె ప్రమాదానికి గురయ్యారు. -
ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి మాతృ వియోగం
కర్నూలు : కర్నూలు జిల్లా నంద్యాల వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి మాతృ వియోగం కలిగింది. ఆయన తల్లి భూమా ఈశ్వరమ్మ (80) సోమవారం ఉదయం హైదరాబాద్ లోని స్వగృహంలో మరణించారు. ఈశ్వరమ్మ గత కొంతకాలంగా అనారోగ్యంగా బాధపడుతున్నారు. కాగా ఆమె భౌతికకాయాన్ని ...అంత్యక్రియల నిమిత్తం ఆళ్లగడ్డ తరలిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ఇటీవల భూమా నాగిరెడ్డి సతీమణి శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారానికి వెళ్లి తిరిగి వస్తూ ఆమె ప్రమాదానికి గురయ్యారు. -
'వారిని ఎందుకు అరెస్ట్ చేయటంలేదు?'
కర్నూలు : టీడీపీ ప్రభుత్వం తమపై కక్ష సాధిస్తోందని కర్నూలు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. ఆయన శనివారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ భూమా నాగిరెడ్డిపై ఆగమేఘాల మీద కేసులు నమోదు చేసిన పోలీసులు టీడీపీ నేతల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కోర్టు ఆదేశిస్తే తప్ప నంద్యాల మున్సిపల్ చైర్మన్, మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి తదితరులపై కేసులు నమోదు చేయలేదని ఎస్వీ మోహన్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేసులు నమోదైనా వారిని ఎందుకు అరెస్ట్ చేయటం లేదని ఆయన సూటిగా ప్రశ్నించారు. -
అధికారముంటే.. ఏదైనా చెల్లు(నా)..!!
-
భూమా నాగిరెడ్డికి బెయిల్ మంజూరు
-
అమ్మ లేనిలోటు ఇప్పటికీ బాధిస్తోంది
-
అమ్మ లేనిలోటు ఇప్పటికీ బాధిస్తోంది: అఖిల ప్రియ
హైదరాబాద్ : తనపై నమ్మకముంచిన ఆళ్లగడ్డ ప్రజల కష్టాల్లో పాలు పంచుకుంటానని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే అఖిల ప్రియ అన్నారు. గురువారం ఆమె ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా అఖిల ప్రియ మాట్లాడుతూ 'అమ్మ లేని లోటు ఇప్పటికీ బాధగానే ఉంది. నాన్నపై అక్రమ కేసులు పెట్టి నా ప్రమాణ స్వీకారానికి దూరం చేశారు. నాన్న భూమా నాగిరెడ్డి పీఏసీ ఛైర్మన్‌గా, నేను ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా ఒకేసారి ప్రమాణం చేయాలనుకున్నాం. నాన్న విడుదలయ్యేంత వరకూ నంద్యాల నియోజకవర్గ ప్రజల సమస్యల్లో కూడా భాగస్వామ్యమవుతా. ఎమ్మెల్యేగా నాకు అవకాశం కల్పించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ సీపీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటా'నని తెలిపారు. -
ఎన్ని కేసులు పెట్టినా.. ధైర్యంగా ఎదుర్కొంటా!
-
తప్పుడు కేసులెన్ని పెట్టినా బెదరను: భూమా
నంద్యాల: పోలీసులపై తెలుగుదేశ ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి తనపై తప్పుడు కేసులు పెట్టించిందని నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆరోపించారు. అయితే ఇందుకు విరుద్ధంగా పోలీసులు మాత్రం స్వచ్ఛందంగా కేసు నమోదు చేశామని కొత్త వాదన వినిపిస్తున్నారని భూమా అన్నారు. తనను, వైఎస్ఆర్సీపీని ఇబ్బంది పెట్టడానికే తప్పుడు కేసులు బనాయించారు. ఇలాంటి కేసులు ఎన్ని పెట్టినా.. నేను బెదరను అని నాగిరెడ్డి అన్నారు. ప్రజలు, అభివృద్ధి కోసం ప్రశ్నించిన తనపై తప్పుడు కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా..ధైర్యంగా ఎదుర్కొంటానని భూమా నాగిరెడ్డి అన్నారు. -
పోలీసుల ముందుకు భూమా నాగిరెడ్డి
-
నంద్యాలలో పరిస్థితి ఉద్రిక్తం!
-
రాజకీయాల్లోకి వస్తాననుకోలేదు: అఖిలప్రియ
హైదరాబాద్: తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని ఎప్పుడు అనుకోలేదని ఆళ్లగడ్డ వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి అఖిల ప్రియ అన్నారు. ఆమె శుక్రవారం సాక్షి బ్రేక్ ఫాస్ట్ షో లో తండ్రి భూమా నాగిరెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అఖిల ప్రియ మాట్లాడుతూ ఇంట్లో అమ్మానాన్న రాజకీయాలతో మునిగి తేలేవారని, అయితే వారిని తాము దగ్గర నుంచి పరిశీలించేవారమన్నారు. రాజకీయ నేతలు ఇంట్లో ఉన్నా..రాజకీయాలకు మాత్రం దూరంగానే ఉన్నామన్నారు. అయితే ఎన్నికలప్పుడు ప్రచారంలో పాల్గొనేవారిమని అఖిలప్రియ తెలిపారు. రాజకీయాల్లో బిజీగా ఉండి తమకు అమ్మ సమయాన్ని కేటాయించలేకపోయినా తాను, చెల్లి, తమ్ముడు ఎప్పుడూ వెలితిగా ఫీల్ అవలేదని అఖిలప్రియ తెలిపారు. నియోజకవర్గ ప్రజల అమ్మపై చూపే అభిమానం, ప్రేమను చూసి తాము గర్వపడేవారిమని ఆమె అన్నారు. మొదటి నుంచి తనకు బిజినెస్ అంటే ఇష్టమని, ఆవైపుగానే తను అమ్మా,నాన్న ప్రోత్సహించేవారని అఖిలప్రియ తెలిపారు. అమ్మ ఉన్నప్పుడు తన రాజకీయ ప్రవేశం గురించి ఎప్పుడూ చర్చకు రాలేదన్నారు. అయితే ఇప్పుడు అమ్మ స్థానంలో పోటీ చేయటం అనేది తాను ఊహించలేదన్నారు. ప్రజలకు మంచి చేయాలనే అమ్మ ఆశయాలను నాన్న సాయంతో నెరవేర్చేందుకు కృషి చేస్తానని అఖిలప్రియ తెలిపారు. అమ్మ దూరమై ఇన్ని రోజులు అయినా... ఆమె లేని లోటు ఇంకా ఎక్కువగా తెలుస్తోందన్నారు. కాగా ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉపఎన్నికలో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థిగా దివంగత నేత భూమా శోభా నాగిరెడ్డి, ప్రస్తుత పీఏసీ ఛైర్మన్ భూమా నాగిరెడ్డిల పెద్ద కుమార్తె భూమా అఖిల ప్రియను పేరును పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ఖరారు చేశారు. -
పీఏసీ చైర్మన్‌గా భూమా నాగిరెడ్డి!
* నేడు ప్రకటన లాంఛనమే.. * పీయూసీకి కాగిత వెంకట్రావు * అంచనాల కమిటీ చైర్మన్‌గా మోదుగుల సాక్షి, హైదరాబాద్: ఏపీ అసెంబ్లీ, శాసన మండలి ఉమ్మడి ప్రజా పద్దుల కమిటీ(పీఏసీ) చైర్మన్‌గా నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. పీఏసీ చైర్మన్ పదవికి ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఎన్నిక లాంఛనమే కానుంది. ఈ నేపథ్యంలో భూమా ఎంపికను స్పీకర్ కోడెల శివప్రసాదరావు శనివారం అధికారికంగా ప్రకటించే అవకాశముంది. పీఏసీ చైర్మ న్ పదవిని అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షానికి కేటాయించడం ఆనవాయితీ. దీంతో శాసనసభలో ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్సీపీ పీఏసీ చైర్మన్ పదవికి భూమా పేరును ప్రతిపాదిం చింది. అదేవిధంగా.. ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ(పీయూసీ) చైర్మన్‌గా అధికార టీడీపీ పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు, అంచనాల కమిటీ చైర్మన్‌గా గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి పేర్లను ప్రతిపాదించారు. వీరు కూడా ఆయా పదవులకు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ ఇద్దరి ఎంపిక కూడా లాంఛనమే కానుంది. వీరి ఎంపికపై కూడా స్పీకర్ కోడెల శనివారం అధికారిక ప్రకటన చేసే అవకాశ ముంది. ఇక.. పీఏసీలో సభ్యులుగా ఎమ్మెల్యేల కోటాలో వైఎస్సార్సీపీ సభ్యులు కాకాని గోవర్ధనరెడ్డి, ఆది మూలం సురేష్, దాడిశెట్టి రాజా పేర్లను ప్రతిపాదించారు. టీడీపీ తరఫున ఎమ్మెల్యేలు యరపతినేని శ్రీనివాసరావు, బోండా ఉమామహేశ్వరరావు, బీకే పార్థసారథి, తోట త్రిమూర్తులు, పీవీజీఆర్ నాయుడు, బీజేపీ నుంచి ఆ పార్టీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పేరును ప్రతిపాదించారు. పీయూసీ సభ్యులుగా వైఎస్సార్సీపీ సభ్యులు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, జలీల్‌ఖాన్, సుజయ్‌కృష్ణ రంగారావు, కొరుముట్ల శ్రీనివాస్‌ల పేర్లను ఆ పార్టీ ప్రతిపాదించింది. టీడీపీ నుంచి పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి, కోళ్ల లలితకుమారి, ప్రభాకర్ చౌదరి, శివరామరాజు పేర్లను ఆ పార్టీ ప్రతిపాదించింది. అంచనాల కమిటీ సభ్యులుగా.. వైఎస్సార్సీపీ నుంచి ఎమ్మెల్యేలు కలమట వేంకట రమణ, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, కిడారి సర్వేశ్వరరావు, ఉప్పులేటి కల్పన పేర్లను ఆ పార్టీ ప్రతిపాదిం చింది. టీడీపీ నుంచి ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, మీసాల గీత, తెనాలి శ్రావణ్‌కుమార్, శంకర్‌యాదవ్ పేర్లను ఆపార్టీ ప్రతిపాదించింది. -
పీఏసీ ఛైర్మన్‌గా భూమా నాగిరెడ్డి
-
పీఏసీ ఛైర్మన్‌గా భూమా నాగిరెడ్డి
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్‌గా పదవికి వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఎంపికయ్యారు. అలాగే పీయూసీ కాగిత వెంకట్రావు, ఎస్టిమేట్ కమిటీ ఛైర్మన్‌గా మోదుగుల వేణుగోపాలరెడ్డి పేర్లు ఖరారు అయ్యాయి. లోక్‌సభ, శాసనసభల్లో పీఏసీ ఛైర్మన్ పదవిని ప్రతిపక్ష పార్టీకి ఇవ్వడం సాంప్రదాయం. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష పార్టీ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు ఈ పదవి దక్కింది. పీఏసీ ఛైర్మన్ పదవికి భూమా నాగిరెడ్డి నిన్న నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. -
ఏపీ పీఏసీ చైర్మన్‌గా భూమా నామినేషన్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) చైర్మన్ పదవికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. గత ఎన్నికల్లో భూమా నాగిరెడ్డి నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. లోక్‌సభ, శాసనసభల్లో పీఏసీ చైర్మన్ పదవిని ప్రతిపక్ష పార్టీకి ఇవ్వడం సంప్రదాయం. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష పార్టీ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ పదవి దక్కింది. ఈ పదవికి భూమా నాగిరెడ్డిని ఎంపిక చేశారు. -
ఇటువైపు నవ్వు ముఖమే పెట్టడం లేదు అధ్యక్షా!
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సోమవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి చేసిన సరదా వ్యాఖ్యలకు నవ్వులు పూశాయి. టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ స్పీకర్ అయిన తర్వాత తమవైపు నవ్వు ముఖమే పెట్టడం లేదని భూమా అన్నారు. అంతకు ముందు సభ సజావుగా జరిగేందుకు అందరూ సహకరించాలని భూమా నాగిరెడ్డి కోరారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఈరోజు ఉదయం సభ ప్రారంభం కాగానే ఆయన ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. ప్రధాన ప్రతిపక్షానికి నిరసన వ్యక్తం చేసే అవకాశం కూడా ఇవ్వడం లేదని అన్నారు. ఈ విషయంలో ఎలాంటి అపోహలకు తావు లేదని సభ సక్రమంగా నిర్వహించేందుకు తాము పూర్తిగా సహకరిస్తామని స్పీకర్ చెప్పారు. -
మేమూ ప్రజలు ఓట్లేస్తే గెలిచిన వాళ్లమే!
-
ఇక మా బాధెవరికి చెప్పుకోవాలి?
-
'ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు'
-
ఎన్నికల్లో అక్రమాన్ని నిలదీసిన భూమా
-
'స్పీకర్‌గా మీ ఎన్నిక అభినందనీయం'
-
మిమ్మల్నీ టీడీపీలో కలిపేశారు.. జాగ్రత్త!
-
'శత్రువుకు కూడా ఆ నరకం రాకూడదు'
-
నంద్యాల ఓటరు లెక్కతప్పింది!
నంద్యాల, న్యూస్‌లైన్ : మూడు దశాబ్ధాల తర్వాత నంద్యాల ఓటర్ల లెక్కతప్పింది. ప్రతిసారి నంద్యాల నియోజకవర్గంలో అధికార పక్షానికి పట్టం కట్టడం సంప్రదాయంగా వస్తుండేది. అయితే ఈ సారి మాత్రం ఓటర్లు భిన్నంగా తీర్పు ఇవ్వడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. నియోజకవర్గంలో ఎన్నికలు రెండు ప్రధాన సెంటిమెంట్లు ఉన్నాయి. ఈసారి అందులో ఒకటి విఫలం కాగా మరొకటి సఫలమైంది. ఫలితం తారుమారైంది నంద్యాల ఎమ్మెల్యేగా ఏ పార్టీకి చెందిన వారు గెలుపొందితే అదే పార్టీనే రాష్ట్రంలో అధికారం చేపడుతుండేది. 1983, 1985, 1994, 1999 ఎన్నికల్లో నంద్యాల నుంచి టీడీపీ అభ్యర్థులు సంజీవరెడ్డి, ఫరూక్ గెలుపొందగా రాష్ట్రంలో ఎన్టీఆర్, చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రులుగా కొనసాగారు. 1989, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు స్థానికంగా గెలుపొందగా రాష్ట్రంలో కూడా ఇదే పార్టీ అధికారంలోకి వచ్చింది. ఏడు ఎన్నికలు తర్వాత మొదటి సారి సెంటిమెంట్‌ను స్థానిక ఓటర్లు తిరగరాశారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకోగా నంద్యాలలో మాత్రం వైఎస్సార్సీపీ అభ్యర్థి భూమానాగిరెడ్డి విజయం సాధించారు. హ్యాట్రిక్ ఎమ్మెల్యే లేనేలేడు నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో హ్యాట్రిక్ కొట్టిన ఎమ్మెల్యేనే లేడు. నియోజకవర్గం మొదటి ఎమ్మెల్యే మల్లు రామచంద్రారెడ్డి, ఫరూక్, బొజ్జా వెంకటరెడ్డి రెండు సార్లు వరుసగా గెలుపొంది మూడోసారి ఓడిపోయారు. ఈ సారి చరిత్ర తిరగరాయాలని శిల్పామోహన్‌రెడ్డి ప్రయత్నం చేశారు. ఆయన రెండుసార్లు వరుసగా గెలుపొందారు. అయినా మూడోసారి ఓటమి చూడక తప్పలేదు. దీంతో హ్యాట్రిక్ మిస్ అయినా నాయకుల్లో శిల్పా కూడా చేరారు. -
నంద్యాలలో భూమా నాగిరెడ్డి ఆధిక్యం
కర్నూలు : కర్నూలు జిల్లా నంద్యాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భూమా నాగిరెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. ఆయన తన సమీప టీడీపీ అభ్యర్థిపై ముందంజలో ఉన్నారు. ఇక నంద్యాల ఎంపీ అభ్యర్థి ఎస్పీవై రెడ్డి ముందంజలో ఉన్నారు. కర్నూలు వైఎస్ఆర్ సీపీ ఎంపీ అభ్యర్థిని బుట్టా రేణుక ముందు వరుసలో ఉన్నారు. అలాగే కర్నూలు అసెంబ్లీ స్థానంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. -
'జగన్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం'
-
కార్యకర్తలకు ధైర్యం చెప్పిన భూమా నాగిరెడ్డి
కర్నూలు : రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన శోభా నాగిరెడ్డి సంతాప సభలో భూమా నాగిరెడ్డి శనివారం కన్నీటిపర్యంతమయ్యారు. నంద్యాలలో జరిగిన సంతాప సభలో ఆయన పార్టీ కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేయాలని భూమా నాగిరెడ్డి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కాగా శోభా నాగిరెడ్డి బుధవారం రాత్రి నంద్యాల నుంచి ఆళ్లగడ్డకు వెళ్తుండగా గూబగుండం మిట్ట సమీపంలో ఆమె ప్రయాణిస్తున్న వాహనం బోల్తా కొట్టిన విషయం తెలిసిందే. -
కారు డ్రైవర్ కనిపించట్లేదు...
నంద్యాల, న్యూస్‌లైన్: శోభా నాగిరెడ్డి కారు డ్రైవర్ నాగేంద్ర(32) నంద్యాలలోని సాయివాణి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కనిపించకుండాపోయాడు. బుధవారం రాత్రి ప్రమాదంలో గాయపడిన అతన్ని పోలీసులు తొలుత ఆళ్లగడ్డలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. బంధువులు మెరుగైన వైద్యం కోసం అర్ధరాత్రి నంద్యాలకు తరలించారు. శరీరంపై గాయాలు లేకపోయినా కడుపు, ఛాతీలో నొప్పితో బాధపడుతుండటంతో వైద్యులు చికిత్స చేశారు. గురువారం ఉదయం 9 గంటల తర్వాత నాగేంద్ర తాను ఆరోగ్యంగానే ఉన్నానని.. వెంటనే మేడమ్‌ను చూడాలని ఆసుపత్రి సిబ్బందికి చెప్పి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఇతను ఎక్కడా కనిపించకపోవడం పోలీసు వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. అదృశ్యమైన నాగేంద్ర స్వస్థలం ఆళ్లగడ్డ మండలంలోని కోటకందుకూరుగా, తండ్రి సుబ్బరాయుడుగా ఆసుపత్రిలో వివరాలు నమోదయ్యాయి. -
డ్రైవర్ దూకుడుగా నడపడంవల్లే ప్రమాదం
సాక్షి, కర్నూలు: శోభా నాగిరెడ్డి కారు ప్రమాదంలో గన్మెన్లు మహబూబ్‌బాషా, శ్రీనివాసులు గాయపడి కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం జరిగిన తీరు వారి మాటల్లోనే.. కారు స్పీడ్ తగ్గించాలని చెప్పాం మాది గోనెగండ్ల మండలం ఐరన్‌బండ గ్రామం. 2009లో ఏఆర్ కానిస్టేబుల్‌గా ఉద్యోగం వచ్చింది. రెండు వారాల కిందటే అక్క (శోభా నాగిరెడ్డి) వద్ద డ్యూటీలో చేరాను. నంద్యాల నుంచి షర్మిలమ్మ పర్యటన ముగించుకుని రాత్రి ఆళ్లగడ్డకు అవుట్లాండ్ కారులో అక్కతో పాటు నేను, మరో గన్‌మెన్ శ్రీనివాసులు బయలుదేరాం. రెగ్యులర్ డ్రైవర్ కాకుండా నాగేంద్ర అనే మరో డ్రైవర్ వచ్చాడు. అతను మొదటినుంచి కారును చాలా దూకుడుగా నడపటం గమనించి స్పీడ్ తగ్గించమని కూడా చెప్పాం. వరి ధాన్యం కుప్ప పక్కనే ఉన్న రాళ్లను ఎక్కించగానే... ఏయ్ అని అరవడంతో సడన్‌గా స్టీరింగ్ తిప్పేశాడు. దీంతో 140-150 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న కారు అదుపు తప్పి నాలుగు పల్టీలు కొట్టింది. గన్మెన్లిద్దరం తేరుకునేలోపే అక్కను ఆసుపత్రికి తరలించారు. - ఎన్.మహబూబ్‌బాషా, గన్‌మన్ ఎప్పుడూ సీటు బెల్టు పెట్టుకునేవారు మాది గోస్పాడు మండలం యాళ్లూరు. నేను 2009లో ఏఆర్ కానిస్టేబుల్‌గా ఉద్యోగంలో చేరాను. అక్క (శోభా నాగిరెడ్డి) వద్ద గన్‌మన్‌గా గత సంవత్సరం జూలైలో చేరాను. బుధవారం ఉదయం 7.30 గంటలకు గ్రామాల్లో ఎన్నిక ల ప్రచారానికి బయలుదేరాం. తర్వాత సాయంత్రం 4.30 గంటలకు నంద్యాలలో షర్మిలక్క ప్రచారంలో పాల్గొన్నాం. రాత్రి 11 గంటలకు ఆళ్లగడ్డ బయలుదేరాం. అక్క (శోభానాగిరెడ్డి) ముందు సీట్లో కూర్చున్నారు. ఉదయం, సాయంత్రం ఆ రోడ్డునే వెళ్లినా... రోడ్డుపక్కగా ఉన్న వరి ధాన్యం కుప్పలను మేము పెద్దగా గమనించలేదు. ప్రమాదం ధాటికి అక్క కారులోంచి ఎగిరి పడినట్లున్నారు. కారులో అక్క ఎప్పుడూ సీటు బెల్టు పెట్టుకునే కూర్చునేవారు. కానీ నిన్న అలసిపోయి బెల్టు పెట్టుకోవడం మరిచిపోయినట్లున్నారు. -శ్రీనివాసులు, గన్‌మన్ -
సీమ రాజకీయాల్లో ‘మహిళా శోభ’
నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికైన మహిళా నేత బలమైన ప్రత్యర్థులను దీటుగా ఎదుర్కొన్న శోభా నాగిరెడ్డి సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాయలసీమలో భూమా శోభా నాగిరెడ్డి తిరుగులేని మహిళా నేత. 1997లో కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ అసెంబ్లీ ఉప ఎన్నికలతో రాజకీయ రంగ ప్రవేశం చేసిన శోభ.. తనదైన ముద్రతో సీమ రాజకీయాలకు వన్నె తెచ్చారు. అత్యంత సమస్యాత్మకమైన ఆళ్లగడ్డలో రెండు బలమైన వర్గాలైన గంగుల, ఇరిగెలను ఎదుర్కొని నాలుగు పర్యాయాలు విజయం సాధించటమే కాదు.. అక్కడ ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు ఆమె ఎనలేని కృషి చేశారు. తొలుత టీడీపీ, ఆ తర్వాత పీఆర్పీ.. తదనంతరం తుదివరకూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో.. ఎక్కడ ఉన్నా కీలక నేతగానే ఉన్నారు. తను కొనసాగుతున్న పార్టీపై విమర్శలు వస్తే దీటుగా తిప్పికొట్టగలిగే నేర్పు ఆమెకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది. సీమ జిల్లాల్లో ముఖ్యంగా కర్నూలు జిల్లాల్లోని పలు నియోజకవర్గాల ప్రజలతో శోభకు ప్రత్యేక అనుబంధం ఉంది. సీమలో తాగు, సాగునీటి కోసం నిరంతరం పోరాటాలు చేస్తూ జనం గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. రాజకీయ కుటుంబంలో జననం... మాజీ మంత్రి ఎస్.వి.సుబ్బారెడ్డి, దివంగత నారాయణమ్మ దంపతుల ఐదో సంతానం శోభా నాగిరెడ్డి. 1969 డిసెంబర్ 16న జన్మించారు. శోభకు నాగలక్ష్మమ్మ, నాగరత్నమ్మ అక్కలు కాగా.. ఎస్.వి.ప్రసాదరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఎస్.వి.మోహన్‌రెడ్డి అన్నలు. 1986లో భూమా నాగిరెడ్డితో వివాహమైంది. కూతుర్లు అఖిలప్రియ, నాగమౌనిక, కుమారుడు జగత్‌విఖ్యాత్‌రెడ్డి. తండ్రి సుబ్బారెడ్డి ఆళ్లగడ్డ గ్రామ పంచాయతీ సర్పంచ్, కేడీసీసీ బ్యాంకు చైర్మన్, ఆళ్లగడ్డ, పత్తికొండ ఎమ్మెల్యేగా, రెండు పర్యాయాలు రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. సోదరి నాగరత్నమ్మ పత్తికొండ మేజర్ పంచాయతీ సర్పంచ్ కాగా, సోదరుడు ఎస్.వి.మోహన్‌రెడ్డి ఎమ్మెల్సీగా పనిచేశారు. శోభ భర్త భూమా నాగిరెడ్డి ఎమ్మెల్యేగా, ఎంపీగా సేవలందించారు. బావలు భూమా శేఖరరెడ్డి ఎమ్మెల్యే గాను, భూమా భాస్కర్‌రెడ్డి ఎంపీపీగా పదవుల్లో ఉంటూనే చనిపోయారు. నాలుగుసార్లు వరుస విజయాలు... తండ్రి మాజీ మంత్రి ఎస్.వి.సుబ్బారెడ్డి నుంచి రాజకీయ వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని, భర్త భూమా నాగిరెడ్డి సాహచర్యంలో 1997, 1999, 2009, 2012 ఎన్నికల్లో వరుసగా నాలుగుసార్లు శాసనసభకు ఎన్నికైన మహిళా ప్రతినిధిగా శోభానాగిరెడ్డి రికార్డును సొంతం చేసుకున్నారు. 1997లో జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా గెలుపొందారు. 1999 లోనూ ఎమ్మెల్యేగా గెలిచారు. 2002 నవంబర్ 7న రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మొట్టమొదటి మహిళా చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టారు. టీడీపీలో జనరల్ సెక్రటరీగా, పార్టీలో కీలక సభ్యురాలిగా పనిచేశారు. ఆ తర్వాత సినీ నటుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన సమయంలో భర్తతో పాటు శోభ ఆ పార్టీలో చేరారు. అక్కడ కూడా కీలకమైన అధికార ప్రతినిధిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ నుంచి కేవలం 18 మంది మాత్రమే ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అందులో రాయలసీమ జిల్లాల్లో ఆ పార్టీ తరఫున మహిళా ఎమ్మెల్యేగా శోభా నాగిరెడ్డి మాత్రమే గెలుపొందారు. వైఎస్ కుటుంబంతో సన్నిహితంగా...: చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయటం.. వై.ఎస్. కుటుంబంతో సన్నిహిత సంబంధాల నేపథ్యంలో భూమా దంపతులు ఆ కుటుంబం వెంట నడిచారు. పీఆర్పీకి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2012లో ఉప ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ తరఫున శోభానాగిరెడ్డి సుమారు 37 వేల ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి అక్రమ నిర్బంధంలో ఉండగా గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మకు శోభ తోడునీడగా నిలిచారు. ఆ ప్రాంతాల వారితో విడదీయరాని బంధం: జిల్లాలో కర్నూలు, నంద్యాల, పత్తికొండ, ఆళ్లగడ్డ నియోజకవర్గాల వారితో భూమా శోభా నాగిరెడ్డికి విడదీయరాని బంధం ఉంది. ఆళ్లగడ్డ జన్మస్థలం కావడంతో ఆ ప్రాంత వాసులు పార్టీలతో నిమిత్తం లేకండా భూమా కుటుంబానికి అండగా నిలుస్తున్నారు. నంద్యాల ప్రజల్లో శోభా నాగిరెడ్డికి ప్రత్యేక స్థానం ఉంది. తండ్రి ఎస్.వి.సుబ్బారెడ్డి ప్రాతినిధ్యం వహించిన పత్తికొండ ప్రజలతోనూ ఆమెకు అనుబంధం ఉంది. సోదరుడు, మాజీ ఎమ్మెల్సీ, ఎస్.వి.మోహన్‌రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు అసెంబ్లీ అభ్యర్థి కావడంతో నియోజకవర్గ ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉన్నారు. తాగు, సాగునీటి కోసం పోరాటం: కర్నూలు, వైఎస్సార్ జిల్లాల రైతులకు సాగు, తాగునీటి ప్రధాన కాలువ కేసీ కెనాల్ రైతుల కోసం అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, అధికారులను నిలదీశారు. తాగు, సాగునీటి కోసం జరిగిన సాగునీటి సలహా మండలి, డీడీఆర్సీ సమావేశాలకు ఎవరు హాజరు కాకపోయినా.. ఎమ్మెల్యే హోదాలో శోభా నాగిరెడ్డి హాజరయ్యే వారు. ఆమె వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మంత్రులు, అధికారులు నీళ్లు నమిలేవారు. ప్రశ్నల వర్షం కురిపిస్తూ ప్రజల తరఫున ఆమె గళం వినిపిస్తూ ప్రత్యేకతను సంతరించుకున్నారు. రాజకీయాలకు స్ఫూర్తి భూమానే శోభా నాగిరెడ్డి రాజకీయాలకు స్ఫూర్తి భర్త భూమా నాగిరెడ్డే. రాయలసీమ రాజకీయాల్లో మహిళలు నిలదొక్కుకోవడం ఎంతో కష్టం. అలాంటిది ఆళ్లగడ్డ లాంటి సమస్యాత్మక నియోజకవర్గంలో ఓ మహిళ 13 ఏళ్ల పాటు ప్రజాప్రతినిధిగా సేవలందించడం అబ్బురపరచే విషయం. ఇందుకు భర్త, మాజీ ఎంపీ భూమా నాగిరెడ్డి ప్రోత్సాహమే ప్రధాన కారణం. ‘మీ రాజకీయ గురువు ఎవర’ని ఎవరైనా అడిగితే తడుముకోకుండా భర్త భూమా నాగిరెడ్డి పేరు చెప్పేవారామె. 1997లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆమె.. శాసనసభకు వెళ్లేందుకు జంకుతుండగా భూమా స్వయంగా తీసుకెళ్లి అందరినీ పరిచయం చేశారు. శాసనసభ సమావేశాల్లో ఎలాంటి ప్రశ్నలు వేయాలనే విషయంపైనా ఆమె భర్తతో చర్చలు జరిపేవారని సన్నిహితులు చెప్తారు. -
శోభా నాగిరెడ్డి మరిలేరు
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభా పక్షం ఉప నాయకురాలు, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా శోభా నాగిరెడ్డి(46) ఇకలేరు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ సమీపంలోని 18వ జాతీయ రహదారిపై గూబగుండంమిట్ట వద్ద బుధవారం రాత్రి చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శోభ... గురువారం ఉదయం హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కేర్ ఆసుపత్రిలో మృతి చెందారు. ఈ ప్రమాదంలో ఆమె తలకు తీవ్ర గాయాలయ్యాయి. పక్కటెముకలు విరిగిపోవడంతో ఊపిరి పీల్చుకోలేక అపస్మారక స్థితిలో ఉన్న శోభను మెరుగైన చికిత్స కోసం గురువారం ఉదయానికి బంజారాహిల్స్‌లోని కేర్ ఆసుపత్రికి తరలించారు. వెంటిలేటర్‌పై ఉంచి వైద్యులు చికిత్స చేశారు. అయితే ఈ ప్రయత్నం ఫలించకపోవడంతో ఉదయం 11.05 గంటలకు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. బుధవారం రాత్రి నంద్యాలలో షర్మిల బహిరంగసభలో పాల్గొని ఆళ్లగడ్డకు తిరిగి వెళుతుండగా శోభా నాగిరెడ్డి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ప్రమాద స్థలిలోనే అపస్మారక స్థితిలోకి వెళ్లిన శోభను ఆళ్లగడ్డకు తరలించగా అక్కడి వైద్యులు ప్రథమ చికిత్స చేసి నంద్యాలకు తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్ల సూచనల మేరకు ఆమెను నేరుగా హైదరాబాద్ కు తరలించారు. ఉదయం 7.30కు అక్కడకు చేరుకోగానే ఆమె పరిస్థితిని ‘బ్రెయిన్ డెడ్’ (మెదడు పనిచేయని స్థితి)గా వైద్యులు అంచనా వేశారు. 11 గంటలకుపైగా మృత్యువుతో పోరాడిన శోభ ఉదయం 11.05 గంటలకు తుదిశ్వాస విడిచారు. నంద్యాల వైఎస్సార్ కాంగ్రెస్ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి, ఆమె భర్త భూమా నాగిరెడ్డి, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు చికిత్స జరుగుతున్నపుడు ఆసుపత్రిలోనే ఉన్నారు. శోభ తిరిగిరాని లోకాలకు వెళ్లి పోయారన్న వార్త తెలియగానే ఆ కుటుంబసభ్యులంతా కన్నీరు మున్నీరయ్యారు. భూమా నాగిరెడ్డి సృ్పహతప్పి పోవడంతో వైద్యులు తక్షణం చికిత్సను అందించారు. ఆమె ఆరోగ్యం విషమంగా ఉందని తెలియగానే అభిమానులు, ప్రజలు, వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఉదయం నుంచే భారీస్థాయిలో ఆసుపత్రికి చేరుకున్నారు. నేత్రదానం: శోభ తన కళ్లను దానం చేస్తూ గతంలో అంగీకారపత్రం ఇవ్వడంతో వైద్యులు ఆమె నేత్రాలను తొలగించి ‘ఐ బ్యాంక్’కు పంపారు. శోభ కళ్లను శుక్రవారం ఇద్దరు అంధులకు అమర్చనున్నట్లు హైదరాబాద్ జిల్లా అంధత్వ నివారణ కార్యక్రమం అధికారి డాక్టర్ రవీందర్‌గౌడ్ తెలిపారు. విజయమ్మ సహా పలువురి సందర్శన: శోభ పార్థివదేహం కేర్ ఆసుపత్రిలో ఉండగానే వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మతో సహా పలువురు ప్రముఖులు సందర్శించారు. శోభ భౌతికకాయాన్ని చూడగానే విజయమ్మ దుఖాన్ని ఆపుకోలేక విలపించారు. చికిత్స జరుగుతున్నపుడే ఎంవీ మైసూరారెడ్డి, డీఏ సోమయాజులు, లక్ష్మీపార్వతి, విజయచందర్, వాసిరెడ్డి పద్మ, అల్లు అరవింద్, ఐపీఎస్ మాజీ అధికారి ఆర్.పి.మీనా, టీడీపీ ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి పరామర్శించారు. మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి, మాజీ డీజీపీ దినేష్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జె.ఆర్.ఆనంద్, విద్యుత్ శాఖ ఉన్నతాధికారి చంద్రశేఖరరెడ్డి, సినీ నటులు మంచు మనోజ్, మంచు లక్ష్మి, రాజా, జీవిత, రాజశేఖర్, ప్రొఫెసర్ ఆర్.వేణుగోపాల్‌రెడ్డితో పాటు పలువురు శోభ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆళ్లగడ్డలో నేడు అంత్యక్రియలు శోభా నాగిరెడ్డి పార్థివదేహానికి శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం వరకు ప్రజల సందర్శనార్థం ఆమె భౌతికకాయాన్ని ఇంటి వద్దే ఉంచనున్నారు. ఆ తర్వాత భూమా నివాసం నుంచి పాతబస్టాండ్, ఇండోర్‌స్టేడియం, జాతీయరహదారి, చిన్నకందుకూరు రస్తా మీదుగా అంతిమయాత్ర కొనసాగుతుంది. మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్య జాతీయ రహదారి సమీపంలోని సుద్దపల్లి క్రాస్ రోడ్డు వద్ద సొంత స్థలంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సన్నిహితులు తెలిపారు. భూమా నివాసం శోకసంద్రం ఆళ్లగడ్డ, న్యూస్‌లైన్: భూమా శోభా నాగిరెడ్డి మరణవార్తతో ఆళ్లగడ్డ శోకసంద్రమైంది. ఆమె పార్థివదేహం ఆళ్లగడ్డలోని నివాసానికి చేరుకోగానే ప్రజలు ఉద్వేగానికి లోనయ్యారు. శోభా నాగిరెడ్డి అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. అమ్మా ఎక్కడికి పోతివమ్మా అంటూ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు ఒక్కసారిగా కన్నీటి పర్యంతమయ్యారు. ఆమె మృతదేహాన్ని అంబులెన్స్ నుంచి దించగానే కుమార్తెలు బోరున విలపించారు. అమ్మా లేమ్మా... అంటూ రోదిస్తున్న వారిని ఓదార్చడం ఎవరితరం కాలేదు. శవపేటికపై తలపెట్టి ఏడుస్తున్న కొడుకును చూసి అక్కడి వారంతా కన్నీరు పెట్టారు. మేనమామ ఎస్వీ మోహన్‌రెడ్డి వారిని ఓదార్చారు. ఆళ్లగడ్డలో మధ్యాహ్నం నుంచి స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు. తమ ప్రియతమ నేతను కడసారి చూసేందుకు జనాలు బారులు తీరారు. భూమా నివాస ప్రాంగణంలో మిత్రులు, కుటుంబసభ్యులు ఆప్తులు, సన్నిహితులు పార్టీ శ్రేణులతో కిక్కిరిసిపోయింది. ‘‘ఎమ్మెల్యేగా తప్పక గెలుస్తుంది. మంత్రి అవుతుందనే ఆశించాం. మీకు ఇలా జరుగుతుందని ఊహించలేదు తల్లీ’’ అంటూ మహిళలు బోరున విలపించారు. ఎంత శ్రమించినా ఫలితం లేకపోయింది: వైద్యులు అపస్మారక స్థితిలో ఉన్న శోభానాగిరెడ్డిని బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రి అత్యవసర విభాగానికి తీసుకొచ్చిన వెంటనే డాక్టర్ సోమరాజు నేతృత్వంలోని క్రిటికల్ కేర్, ఆర్థో, న్యూరో విభాగం వైద్యబృందం ఆమెకు పలు పరీక్షలు చేసింది. ఉదయం 9 గంటలకు తల, ఛాతీ, మెడ భాగంలో సీటీస్కాన్ తీయించారు. తలకు తగిలిన బలమైన గాయంవల్ల మెదడులో రక్తం గడ్డకట్టడంతో పాటు చెవి, ముక్కు నుంచి అధిక రక్తస్రావమైనట్లు గుర్తించారు. పక్కటెముకలు విరిగి గుండె, ఊపిరితిత్తులకు ఆనుకోవడంతో గుండె రెట్టింపు వేగంతో కొట్టుకుంటున్నట్లు, శ్వాస కూడా తీసుకోలేకపోతున్నట్లు నిర్ధారించారు. మెడలోని నరాలు కూడా చిట్లిపోయినట్లు ఉదయం 10 గంటలకు విడుదల చేసిన మెడికల్ బులెటిన్‌లో వైద్యులు స్పష్టం చేశారు. ఆపరేషన్ చేసి గుండెకు ఆనుకుని ఉన్న పక్కటెముకలను సరిచేయాలని వారు నిర్ణయించారు. అదే సమయంలో అకస్మాత్తుగా పల్స్‌రేటు పడిపోయింది. గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు పనిచేయడం మానేశాయి. దీంతో శోభానాగిరెడ్డి చికిత్స పొందుతూ ఉదయం 11.05 నిమిషాలకు మృతి చెందినట్లు ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ గోపీకృష్ణ ప్రకటించారు. ఆమెను కాపాడేందుకు నాలుగు గంటలపాటు తామెంతో శ్రమించినా ఫలితం లేకపోయిందని తెలిపారు. -
జగన్ దిగ్భ్రాంతి
శోభా నాగిరెడ్డి మృతితో వైఎస్సార్సీపీలో తీవ్ర విషాదం జగన్, విజయమ్మ, షర్మిల ప్రచారం రెండ్రోజులు వాయిదా పార్టీ కార్యాలయంలో నివాళులు, జెండా అవనతం సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్సీపీ శాసనసభాపక్ష ఉప నాయకురాలు, ఆళ్లగడ్డ అసెంబ్లీ అభ్యర్థి భూమా శోభా నాగిరెడ్డి మరణవార్తతో పార్టీలో విషాదం అలముకుంది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి, గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, జగన్ సోదరి షర్మిల, సతీమణి భారతి ప్రచార కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకుని హుటాహుటిన హైదరాబాద్ చేరుకున్నారు. శోభ మృతికి సంతాప సూచకంగా గురు, శుక్రవారాలు జగన్, విజయమ్మ, షర్మిల పర్యటనలతో పాటు అన్ని ప్రచార కార్యక్రమాలు నిలిపివేస్తున్నట్టు పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ తెలిపారు. ఆళ్లగడ్డలో శోభ అంత్యక్రియలకు పార్టీ పెద్దలంతా హాజరవుతారని చెప్పారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శోభా నాగిరెడ్డి చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. పార్టీ జెండాను అవనతం చేశారు. పార్టీ నేతలు పీఎన్వీ ప్రసాద్, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నేడు ఆళ్లగడ్డకు జగన్ పార్టీలో అందరితో ఎంతో కలుపుగోలుగా ఉండే తమ ఆత్మీయురాలు మరణించారని తెలిసి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి, గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, సోదరి షర్మిల తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. గుంటూరు జిల్లాలో రెండ్రోజులపాటు విస్తృతంగా పర్యటించి బుధవారం రాత్రికి పొన్నూరుకు చేరుకున్న జగన్‌కు శోభా నాగిరెడ్డి ప్రమాదవార్త తెలియడంతో హతాశులయ్యారు. ఆమెను కేర్ ఆస్పత్రికి తరలించారని తెలియడంలో ఆయన ఆస్పత్రి వర్గాలతో ఎప్పటికప్పుడు ఫోన్లో మాట్లాడుతూ శోభా నాగిరెడ్డి పరిస్థితి తెలుసుకుంటూ వచ్చారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందనడంతో గురువారం ఉదయం పొన్నూరులో క్లుప్తంగా ప్రసంగించి హుటాహుటిన హైదరాబాద్‌కు బయలుదేరారు. అయితే శోభ ఉదయం 11 గంటలకే మృతి చెందడంతో భౌతిక కాయాన్ని స్వస్థలం ఆళ్లగడ్డ తీసుకువెళ్లారు. గురువారం సాయంత్రానికి హైదరాబాద్ చేరుకున్న జగన్ శుక్రవారం ఆళ్లగడ్డకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. ఆయన మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో హెలికాప్టర్లో ఆళ్లగడ్డకు వెళతారని పార్టీ వర్గాలు తెలిపాయి. అంత్యక్రియలకు పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, షర్మిల, వైఎస్ భారతితో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు. హుటాహుటిన వచ్చిన విజయమ్మ శోభా నాగిరెడ్డి ప్రమాదానికి గురయ్యారన్న సమాచారం తెలియడంతో విజయమ్మ రాజమండ్రి నుంచి హుటాహుటిన ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు. అయితే ఆమె కేర్ ఆస్పత్రికి చేరుకునే సమయానికే శోభ కన్ను మూయడంతో కన్నీరు మున్నీరయ్యారు. తన కూతురులాంటి శోభ మరణం భరించలేనిదని విలపించారు. తూర్పు గోదావరి జిల్లాలో మూడు రోజులపాటు ఎన్నికల ప్రచారం నిర్వహించిన విజయమ్మ బుధవారం రాత్రి రాజమండ్రిలో బస చేశారు. గురువారం నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆమె ‘వైఎస్సార్ జనభేరి’ చేపట్టాల్సి ఉంది. ఈ కార్యక్రమం వాయిదా వేశారు. పులివెందుల నుంచి షర్మిల, భారతి నంద్యాలలో శోభానాగిరెడ్డితో కలసి వైఎస్సార్ జనభేరి నిర్వహించిన షర్మిల బుధవారం రాత్రి పులివెందుల చేరుకున్నారు. ఆమె గురువారం అనంతపురం జిల్లా కదిరిలో పర్యటించాల్సి ఉంది. అలాగే పులివెందులలో జగన్ తరఫున విస్తృతంగా ప్రచారం చేస్తున్న ఆయన సతీమణి వైఎస్ భారతి వేంపల్లె మండలంలో పర్యటించాల్సి ఉంది. శోభానాగిరెడ్డి ప్రమాదవార్త తెలియడంతో వారు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని తెలియడంతో అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకుని ఒకే వాహనంలో హుటాహుటిన హైదరాబాద్ చేరుకున్నారు. శోభా నాగిరెడ్డి, -
ప్రమాదం జరిగిన తీరిదీ..
బుధవారం సాయంత్రం 4.40 గంటలు: నంద్యాలలో షర్మిల వైఎస్సార్ జనభేరి సభలో పాల్గొనేందుకు శోభా నాగిరెడ్డి అవుట్‌లాండర్ కారులో (నంబర్ ఏపీ21 ఏఎఫ్ 0001) ఆళ్లగడ్డ నుంచి 45 కి.మీ. దూరంలోని నంద్యాలకు వచ్చారు. రాత్రి 9.30: జనభేరి సభ ముగిసింది. రాత్రి 10.35: శోభానాగిరెడ్డి నంద్యాలలో భోజనం చేసి ఆళ్లగడ్డకు బయలుదేరారు. ఆమె కారు ముందు సీటులో కూర్చున్నారు. వెనుక సీటులో ఇద్దరు గన్మెన్లు కూర్చున్నారు. కారు వెంట రెండు ఎస్కార్టు వాహనాల్లో ఏడుగురు చొప్పున ఉన్నారు. రాత్రి 11.20: ఆళ్లగడ్డకు ఐదు కిలోమీటర్ల దూరంలోని గూబగుండం మిట్ట వద్ద రోడ్డుపై ఆరబోసిన ధాన్యం (వడ్లు) రాశికి అడ్డంగా పెట్టిన రాళ్లను తప్పించబోయి డ్రైవర్ కారును ఎడమవైపు తిప్పడంతో నాలుగు పల్టీలు కొట్టి బోల్తా పడింది. ప్రధాన రోడ్డు నుంచి 100 మీటర్ల దూరం వరకు పోయి కారు ఆగిపోయింది. ప్రమాద సమయంలో కారు వేగం గంటకు 120 కిలోమీటర్లు ఉంది. సీటు బెల్టు పెట్టుకోకపోవడంతో శోభా నాగిరెడ్డి ముందున్న అద్దంలో నుంచి ఎగిరి కింద పడ్డారు. దీంతో తీవ్ర గాయాలయ్యాయి. రాత్రి 11.30: కారు వెనుక వస్తున్న మరో వాహనంలోని అనుచరులు (వీరు నంద్యాలలోని షర్మిల జనభేరి సభకు వెళ్లి వస్తున్న వారు) ప్రమాదాన్ని గుర్తించి ఆళ్లగడ్డలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. సంఘటన జరిగిన 10 నిమిషాల తర్వాత ఎస్కార్ట్ వాహనాలు చేరుకున్నాయి. రాత్రి 11.40: ప్రథమ చికిత్స అనంతరం శోభా నాగిరెడ్డిని అంబులెన్స్‌లో నంద్యాలకు తీసుకెళ్లారు. రాత్రి 12.35: నంద్యాల ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అక్కడ దాదాపు 3 గంటల పాటు వైద్యులు సేవలందించినా ఫలితం లేకపోయింది. గురువారం తెల్లవారుజామున 2.50: మెరుగైన వైద్యం కోసం అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు తరలించారు. ఉదయం 5.30: బీచ్పల్లి వద్ద అత్యాధునిక సౌకర్యాలతో హైదరాబాద్ నుంచి వచ్చిన మరో వాహనంలోకి మార్చారు. ఉదయం 7.10: హైదరాబాద్‌లోని బంజారా హిల్స్ రోడ్ నంబర్ 1లోని కేర్ ఆసుపత్రిలో చేర్పించారు. ఉదయం 11.05: వెంటిలేటర్‌పై వైద్య సేవలందించిన వైద్యులు చివరకు శోభా నాగిరెడ్డి మరణించినట్లు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. - కర్నూలు, సాక్షి -
కేర్ లో శొభా నాగిరెడ్డికి ప్రముఖుల నివాళి
-
ఆఖరి క్షణం వరకూ జనం కోసం... జనం నడుమ
-
శోభా నాగిరెడ్డి కన్నుమూత.
-
శోభా నాగిరెడ్డి గతస్మృతులు
-
ఆర్టీసీకి మొట్టమొదటి మహిళా ఛైర్మన్
శోభానాగిరెడ్డి .. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఏపీఎస్ ఆర్టీసీకి మొట్టమొదటి మహిళా ఛైర్మన్‌గా వ్యవహరించారు. రాయలసీమలో బలమైన నేతగా ఎదిగిన శోభానాగిరెడ్డి కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో 1968 నవంబర్ 16న పుట్టారు. ఇంటర్ వరకూ చదువుకున్నారు. తండ్రి మాజీ మంత్రి ఎస్వీ సుబ్బారెడ్డి. శోభానాగిరెడ్డికి 1986లో భూమా నాగిరెడ్డితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. 1996లో శోభా నాగిరెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. 1997లో ఆళ్లగడ్డ ఉప ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1999లో మరో దఫా టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో పీఆర్పీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. ఆ ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున రాయలసీమ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మల్యే ఆమె మాత్రమే. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు నచ్చిన ఆమె పార్టీలో చేరారు. అనతికాలంలోనే మంచి పేరు తెచ్చుకున్నారు. 2012లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. అప్పటి నుంచి పార్టీలో కీలక బాధ్యతలు పోషించారు. ఇప్పటివరకూ శోభానాగిరెడ్డి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఏపీఎస్ ఆర్టీసీకి మొట్టమొదటి మహిళా చైర్‌పర్సన్‌గా కూడా పనిచేశారు. శోభానాగిరెడ్డి సోదరుడు ఎస్వీ మోహన్‌రెడ్డి మాజీ ఎమ్మెల్సీ. శోభానాగిరెడ్డి కుటుంబం కర్నూలులో ఎంతో ప్రజాసేవ చేసింది. శోభానాగిరెడ్డి ఇక లేరన్న విషయం తెలియగానే కర్నూలు ప్రజలు దుఖఃసాగరంలో మునిగిపోయారు. -
శోభా నాగిరెడ్డి కన్నుమూత
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వైఎస్ఆర్సీపీ అగ్రనేత శోభా నాగిరెడ్డి కన్నుమూశారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం 11.05 గంటలకు ఆమె మరణించారు. ఈ విషయాన్ని కేర్ ఆస్పత్రి వైద్యులు ధ్రువీకరించారు. ఈ విషయం తెలిసి ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు, అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు కన్నీరు మున్నీరయ్యారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే, అసెంబ్లీలో పార్టీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యురాలు అయిన శోభా నాగిరెడ్డి చురుకైన నేత. ఆమె 1968 నవంబర్ 16న ఆళ్లగడ్డలో జన్మించారు. మాజీ మంత్రి ఎస్వీ సుబ్బారెడ్డి కుమార్తె అయిన శోభ ఇంటర్ వరకు చదివారు. 1986లో ఆమెకు భూమా నాగిరెడ్డితో వివాహం జరిగింది. 1996 నుంచి ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1997లో ఆళ్లగడ్డకు జరిగిన ఉపఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1999లో మరోదఫా టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తర్వాత చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఆ పార్టీ తరఫున రాయలసీమలో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి మాత్రమే. అది కూడా చిరంజీవి ప్రభావం వల్ల కాకుండా, తమ కుటుంబానికి ఉన్న పరపతితోనే ఆమె గెలిచారు. -
ఆస్తులు అమ్మైనా మాట నిలబెట్టుకుంటా:భూమా నాగిరెడ్డి
నంద్యాల, న్యూస్‌లైన్ : ఆస్తులు అమ్మైనా సరే పట్టణ ప్రజలకు ఇచ్చిన 10 వేల ఇళ్ల నిర్మాణాల హామీని అపార్ట్మెంట్ పద్ధతిలో నిర్మించి తీరుతానని వైఎస్ఆర్సీపీ నంద్యాల సమన్వయకర్త భూమా నాగిరెడ్డి అన్నారు. పద్మావతినగర్‌లోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో పేదల నుంచి సమస్యలపై దరఖాస్తుల స్వీకరణను సోమవారం భూమా ప్రారంభించారు. అర్జీలు ఇచ్చేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. పార్టీ కార్యాలయం ఆవరణ కిక్కిరిసిపోయింది. మొదటి రోజు ఆరు వేల మంది వరకు వచ్చి దరఖాస్తులను అందజేశారు. భూమా స్వయంగా రంగంలోకి దిగి దరఖాస్తులను స్వీకరిస్తూ సందేహాలను నివృత్తి చేశారు. అనంతరం భూమా మాట్లాడుతూ ఈ కార్యక్రమం నెల రోజుల పాటు కొనసాగుతుందన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేయడంలో తమ పార్టీ ముందుంటుందన్నారు. మహానేత నిత్యం పేదల అభివృద్ధినే కోరేవారని, ఆయన తనయుడు జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా పేదల కోసం దేనికైనా సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. నంద్యాల పట్టణ ప్రజల సమస్యల పరిష్కరించడంలో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. కొందరు అపార్ట్మెంట్ నిర్మాణాలకు అభ్యంతరాలు ఉన్నాయని ఆరోపణలు చేస్తున్నారని శిల్పాను విమర్శించారు. భూమా ఆలోచన అద్భుతం: ఎస్పీవై రెడ్డి నంద్యాల పట్టణం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి భూమా తీసుకున్న నిర్ణయాన్ని ఎంపీ ఎస్పీవై రెడ్డి అభినందించారు. దరఖాస్తుల స్వీకరణపై ఎంపీ, భూమా పార్టీ కార్యాలయంలో చర్చించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ ఎంతో పట్టుదలతో భూమా అనేక కార్యక్రమాలను ప్రకటించారన్నారు. అయితే దీనిని ప్రత్యర్థులు జీర్ణించుకోలేక పోతున్నారని విమర్శించారు. ప్రజల పక్షాన పోరాడే వాడే నాయకుడు నంద్యాల, న్యూస్‌లైన్: ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడే వాడే నాయకుడని భూమా నాగిరెడ్డిని ఉద్దేశించి ఎంపీ ఎస్పీవెరైడ్డి అన్నారు. సోమవారం నంద్యాల పట్టణంలో భూమా సొంత నిధులతో నిర్మించిన వారధి ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎస్పీవై రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమా నంద్యాల పట్టణాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారన్నారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రభుత్వ సొమ్ముతో పనులు చేయడం అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్లుగా ఉంటుందని, ఇది అందరికి సాధ్యమేనన్నారు, ప్రతి పక్షంలో ఉండి ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు భూమా చేపట్టడం హర్షించదగ్గ విషయమన్నారు. ఇక్కడ వారధి నిర్మించాలని ప్రజలు తనకు వినతిపత్రం ఇచ్చారని.. పదేళ్లలో చేయలేకపోయానన్నారు. అనంతరం భూమా మాట్లాడుతూ ఎస్పీవై రెడ్డి వంతెన నిర్మించలేక పోయినా.. పట్టణంలో ఎన్నో పనులు ప్రభుత్వ, సొంత నిధులతో చేపట్టారన్నారు. నంద్యాల ఎమ్మెల్యే శిల్పా మాత్రం అవకాశం ఉండి కూడా వంతెన నిర్మించలేక పోయారని విమర్శించారు. ప్రజలకు మేలు చేసేవారిని విమర్శించడం ఎమ్మెల్యేకే చెల్లిందన్నారు. త్వరలో వార్డు పర్యటన కొనసాగించి ప్రతి కుటుంబ సమస్యను తెలుసుకుంటానన్నారు. చేసేదే చెప్పడం.. చెప్పిందే చేయడం తన లక్ష్యమన్నారు. వారధి ప్రారంభం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. పాత బ్రిడ్జిపై ప్రయాణిస్తూ మృతి చెందిన వారికి కొత్త వారధిని అంకితం చేస్తున్నట్లు చెప్పారు. వారధిని ప్రతి రోజూ ప్రయాణించే విద్యార్థునుల చేత ప్రారంభించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు డాక్టర్ బాబన్, మాజీ కౌన్సిలర్ దస్తగిరితో పాటు స్థానికులు పాల్గొన్నారు. -
సమస్యల పరిష్కారానికి కాల్ సెంటర్
నంద్యాల, న్యూస్‌లైన్: సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్సీపీ కేంద్రపాలక మండలి సభ్యుడు భూమానాగిరెడ్డి మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నంద్యాల నియోజకవర్గంలోని ప్రజలు ఏ సమస్య తలెత్తినా తక్షణం వివరించడానికి ఒక కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఇది 24గంటల పాటు పనిచేయనుంది. కాల్ సెంటర్‌కు ఫిర్యాదు చేసినా సమస్యను పరిష్కరించడానికి కొన్ని బృందాలను నంద్యాల పట్టణంలోని వార్డుల వారీగా, గ్రామాల వారీగా ఏర్పాటు చేస్తున్నారు. ఫిర్యాదు అందిన వెంటనే దాని అవసరాన్ని బట్టి స్పందిస్తారు. ఇందు కోసం కాల్‌సెంటర్ నం: 7660888881ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ఇది శాశ్వతంగా పని చేసే విధంగా నంద్యాల పట్టణంలోని పద్మావతినగర్‌లోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక రామకృష్ణ డిగ్రీ కళాశాలలో శుక్రవారం శ్రీకారం చుట్టారు. ఏపీ మీడియా సహకారంతో చేపడుతున్న ఈ కాల్ సెంటర్ కార్యక్రమానికి రామకృష్ణ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రామకృష్ణారెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు ఏవీ సుబ్బారెడ్డి, ఏవీఆర్ ప్రసాద్, డాక్టర్ బాబన్, ఏపీ మీడియా ప్రతినిధి రమేష్ తదితరులు పాల్గొన్నారు. మీ అన్నగా.. తమ్ముడిగా.. సేవలందిస్తా.. ‘‘ మీ అన్నగా.. మీ తమ్ముడిగా సేవలు అందిస్తాను.. నిర్మొహమాటంగా మీ కున్న సమస్యలను తెలపండి’ అని నం ద్యాల నియోజకవర్గ ప్రజలకు భూమా భరోసాను ఇచ్చారు. తన ఇమేజిని తట్టుకోలేక ప్రత్యర్థులు జీతాలు, కూలీలు ఇ చ్చి విమర్శలు చేయిస్తున్నారని.. అయితే వాటిని ప్రజలు నమ్మడం లేదన్నారు. ప్రజలకు మేలు జరిగే విషయంలో తాను ఎలాంటి సాహసానికైనా సిద్ధమని చెప్పారు. ఇటువంటి విషయాల్లో విమర్శలను లెక్కచేయనని పేర్కొన్నారు. అందుకే తాను నంద్యాల పట్టణంలో ఎన్నో కార్యక్రమాలను చేపడుతున్నానని వివరించారు. అధికార పార్టీకి చెందిన నాయకులు ఎన్నో అడ్డంకులు సృష్టిస్తున్నారని, వాటన్నింటిని ప్రాణం ఇచ్చే వైఎస్సార్సీపీ కార్యకర్తల ద్వారా, ప్రజల ద్వారా అధిగమిస్తున్నట్లు భూమా తెలిపారు. నంద్యాల పట్టణంలో అర్ధరాత్రి సైతం ఎలాంటి సంఘటనలు ఎదుర్కొన్నా కాల్ సెంటర్‌కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. చట్టపరిధిలో అధికారులు విధులు నిర్వహిస్తారన్నారు. కాల్ సెంటర్ పరిధిలోకి వచ్చే నెట్‌వర్క్‌లో సభ్యత్వం తీసుకుంటే నెలకు రూ.99తో ఎన్నో సమాచారాలను పొందవచ్చన్నారు. భారీఎత్తున సెల్‌పోన్ బిల్లులో ఆదా అవుతుందన్నారు. రైతులు ఎప్పటికప్పుడు గిట్టుబాటు ధరలను, నిరుద్యోగులు ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకోవచ్చన్నారు. ఎన్నో రకాలుగా ప్రయోజనం కలిగించే ఈ నెట్‌వర్క్‌లో సభ్యత్వం తీసుకోవాలన్నారు. తన వంతు సహకారం కార్యకర్తలకు అందిస్తానన్నారు. నంద్యాలతో పాటు ఆళ్లగడ్డ, అసెంబ్లీ నియోజకవర్గాల్లోని వైఎస్సార్సీపీ కార్యకర్తలందరికీ గ్రూప్ సిమ్‌లను ఏర్పాటు చేశారు. తాను క్లీన్‌సిటీ ఉద్యమం చేపట్టిన సమయంలో ఎన్నో విమర్శలు వచ్చాయని వాటిని లెక్కచేయకుండా ముందుకు సాగడం వల్లే ఎన్నో కుటుంబాలు బాగుపడ్డాయన్నారు. అలాగే కాల్ సెంటర్ వల్ల సమస్యల పరిష్కారం మరింత వేగంగా జరుగుతుందన్నారు. -
పేదల అభివృద్ధే ధ్యేయం
నంద్యాల, న్యూస్‌లైన్: పేదల అభివృద్ధే ధ్యేయంగా తాను నిరంతరం పోరాడుతానని వైఎస్సార్సీపీ నంద్యాల సమన్వయకర్త భూమానాగిరెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని జీఎం విద్యాసంస్థల ఆవరణలో నిర్వహించిన మైనార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజల సమస్యలపైనా బాధితుల వెనువెంటే ఉండి పోరాటం చేస్తానని, అధికార పార్టీ అవాంతరాలకు జడిచే వ్యక్తిని కాదన్నారు. పట్టణంలో ఎంపీలను, ఎమ్మెల్యేలను శాసించే శక్తి ఉన్న మైనార్టీలను అధికార పార్టీకి చెందిన నాయకులు మాయ మాటలతో మోసగిస్తున్నారంటే వారి పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. పదేళ్ల నుంచి పట్టణంలోని మైనార్టీలు ఇళ్లు, ఇళ్ల స్థలాలు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. పింఛన్లు లేని వికలాంగులు, వృద్ధులు చూస్తుంటే బాధేస్తోందని ఆవేదన చెందారు. మైనార్టీలతో పాటు అన్ని వర్గాలకు చెందిన పేదలను ఎంపిక చేసి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన ఏడాది కాలం లోపే పేదలకు ఇళ్లను నిర్మించి ఇస్తామన్నారు. ప్రతి వార్డులో ప్రధాన సమస్యలను గుర్తించడానికే డయల్ యువర్ భూమా, పరిష్కారం, క్లీన్‌సిటీ ఉద్యమాలను చేపట్టినట్లు తెలిపారు. దీంతో అధికార పార్టీ నాయకుల అక్రమాలు వెలుగులోకి వస్తుండటంతో తన కార్యక్రమాలకు అవరోధాలను కల్పిస్తున్నారని, వాటిని పట్టించుకునే పరిస్థితే లేదన్నారు. పేదలు తనపై చూపుతున్న అభిమానంతోనే సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తున్నానన్నారు. పట్టణంలో వార్డుకు 200మంది పేదలున్నారని, వీరందరికీ ప్రభుత్వ స్థలాల్లో అపార్ట్మెంట్లను నిర్మించి ఇళ్లను సమకూర్చుతామన్నారు. భారీగా తరలి వచ్చిన మైనార్టీలు: జీఎం విద్యాసంస్థల అధినేత మహబూబ్‌పీరా ఆధ్వర్యంలో సలీంనగర్‌కు చెందిన 500కుటుంబాలు భూమా సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. అంతకుముందు పద్మావతినగర్‌లోని భూమా నివాసం నుంచి ఊరేగింపుగా ముస్లిం మైనార్టీలు ర్యాలీని నిర్వహించారు. అలాగే ఎంబీటీ బాబు, మహబూబ్పీరాల ఆధ్వర్యంలో వందలాది మంది వైఎస్సార్సీపీ కండువాలు ధరించి భూమా సమక్షంలో పార్టీలో చేరారు. మాజీ కౌన్సెలర్ దాదాబాయ్, ఆర్టీసీ కార్మిక సంఘం నాయకుడు ఖాన్‌ను, జిల్లా వక్ఫ్‌బోర్డు మాజీ అధ్యక్షుడు ఇస్మాయిల్, ఆత్మకూరు ముస్తఫా పాల్గొన్నారు. -
నేడు ‘సమైక్య’ ర్యాలీ
కర్నూలు(రూరల్), న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర పరిరక్షణకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంగళంవారం జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన ర్యాలీలు చేపట్టేందుకు పిలుపునిచ్చింది. యూపీఏ ప్రభుత్వం తీసుకున్న రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తల ఆధ్వర్యంలో కార్యకర్తలు, విద్యార్థులతో ర్యాలీ చేపట్టి ప్రభుత్వ కార్యాలయాల ఎదుట ఆందోళనలు నిర్వహించనున్నట్లు జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి, కేంద్ర పాలక మండలి సభ్యుడు భూమా నాగిరెడ్డి సోమవారం సంయుక్త ప్రకటనలో తెలిపారు. కర్నూలులో కొత్తబస్టాండ్ నుంచి బంగారుపేట, ఆర్ఎస్ రోడ్, మౌర్యా ఇన్ సర్కిల్, రాజ్‌విహార్ మీదుగా కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి అక్కడే ధర్నా నిర్వహిస్తామన్నారు. మరో బృందం నంద్యాల చెక్‌పోస్టు నుంచి సి.క్యాంప్, మద్దూర్‌నగర్, విశ్వేశ్వరయ్య సర్కిల్ మీదుగా కలెక్టరేట్ చేరుకుని ధర్నాలో పాల్గొంటుందని వారు పేర్కొన్నారు. -
సీఎం...నీ ఆక్రోశం సోనియా ముందు వెళ్లగక్కు
నంద్యాల, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆక్రోశం పులిచింతల ప్రాజెక్టు వద్ద కాకుండా ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియగాంధీ ఎదుట వ్యక్తం చేస్తే బాగుంటుందని వైఎస్ఆర్సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు భూమా నాగిరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన కర్నూలు జిల్లా నంద్యాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విభజన నిర్ణయంపై ప్రజలు, ఉద్యోగులు అంకితభావంతో ఆందోళనలు చేపట్టగా సీఎం స్వయంగా నీరుగార్చారన్నారు. తమ నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సమైక్యాంధ్ర కోసం అన్ని పార్టీలు కలసి రావాలని మొదటి నుంచి కోరుతున్నా స్పందించని కాంగ్రెస్.. తాజాగా అన్ని పార్టీలను కలుపుకుపోతామని చెబితే ఎవరూ నమ్మరన్నారు. ఇక చంద్రబాబు విషయానికి వస్తే..విభజన ఆయనకు తప్ప ఎవరికీ ఆమోదయోగ్యం కాదన్నారు. విభజన సందర్భంగా కేంద్ర మంత్రి వర్గ సమావేశానికి హాజరైన మంత్రులు సమైక్యాంధ్ర గురించి మాట్లాడకుండా కేవలం వ్యక్తిగత ప్యాకేజీలపై చర్చించుకోవడం బాధాకరమన్నారు. వ్యాపారస్తులు రాజకీయ నాయకులైతే ఏ పరిస్థితి ఉంటుందో ఆ సమావేశం కళ్లకు కట్టిందన్నారు. -
'జగన్‌పై అభిమానం వెలకట్టలేనిది'
-
'చివరి వరకూ జగన్ అడుగు జాడల్లోనే నడుస్తాం'
కర్నూలు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు వచ్చిన వార్తలను ఆపార్టీ నేతలు భూమా నాగిరెడ్డి, భూమా శోభానాగిరెడ్డి దంపతులు ఖండించారు. తాము పార్టీని వీడుతున్నామని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ దుష్ప్రచారం చేస్తోందని వారు ఆరోపించారు. ఆ ఛానల్లో ప్రసారం అయిన కథనాలను భూమా దంపతులు మంగళవారమిక్కడ తీవ్రంగా ఖండించారు. తప్పుడు ప్రచారం చేస్తున్న ఏబీఎన్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని భూమా నాగిరెడ్డి హెచ్చరించారు. పార్టీలో చేరికలు, రచ్చబండ కార్యక్రమం వల్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి తాము హాజరు కాలేకపోయామని భూమా నాగిరెడ్డి తెలిపారు. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేందుకు తాము కృషి చేస్తామన్నారు. చివరి వరకూ జగన్ అడుగు జాడల్లోనే నడుస్తామని భూమా దంపతులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా శోభా నాగిరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్, టీడీపీలు చేతనైతే వైఎస్ జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోవాలని సవాల్ విసిరారు. ఆ రెండు పార్టీల నేతలే తమపై ఏబీఎన్ ఛానల్లో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని ఆమె మండిపడ్డారు. వైఎస్ఆర్ కుటుంబంపై అభిమానంతో పార్టీలో కొనసాగుతున్నామని శోభా నాగిరెడ్డి తెలిపారు. -
కలిసే ఉందాం
కర్నూలు, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర పరిరక్షణే ధ్యేయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లాలో ఉద్యమాన్ని కొనసాగిస్తోంది. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మంగళవారం పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులు కదంతొక్కారు. రాష్ట్రం ముక్కలైతే తమ భవిష్యత్తు ఏమిటంటూ ర్యాలీలు, మానవహారాలతో హోరెత్తించారు. విద్యార్థి గర్జన పేరిట ఆదోనిలో నియోజకవర్గ సమన్వయకర్త వై.సాయిప్రసాద్‌రెడ్డి నాయకత్వంలో దాదాపు 5వేల మంది విద్యార్థులు స్థానిక మున్సిపల్ గ్రౌండ్ నుంచి వైఎస్సార్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడే రోడ్డుపై బైఠాయించి విభజనకు వ్యతిరేకంగా నినదించారు. పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు భూమా నాగిరెడ్డి ఆదేశాలతో నంద్యాలలో నలంద, శ్రీనివాస, వెంకటేశ్వర కళాశాలల విద్యార్థులు పద్మావతి నగర్, శ్రీనివాస సెంటర్ మీదుగా సంజీవనగర్ వరకు ర్యాలీ చేపట్టారు. రెండు గంటల పాటు మానవహారం నిర్మించి వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించారు. ఆళ్లగడ్డలో ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి ఆధ్వర్యంలో దాదాపు రెండు వేల మందికి పైగా యువకులు, విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఆలూరులో వైఎస్సార్సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు రాంభీం నాయుడు, మండల కలిసే ఉందాం మహిళా కన్వీనర్ సుభాషిణి, యువజన విభాగం కన్వీనర్ భాస్కర్ ఆధ్వర్యంలో విద్యార్థులు స్థానిక అంబేద్కర్ సర్కిల్లో రాస్తారోకో చేపట్టారు. ప్యాపిలిలో పార్టీ నాయకులు శ్రీరామిరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులు జూనియర్ కళాశాల నుంచి పాతబస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి రాకపోకలను స్తంభింపజేశారు. మంత్రాలయంలో తాజా మాజీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు దాదాపు వెయ్యి మందికి పైగా విద్యార్థులు రాఘవేంద్ర సర్కిల్లో మానవహారం నిర్మించారు. ఆ తర్వాత కర్నూలు-రాయచూర్ రహదారిని దిగ్బంధించారు. కొనసాగుతున్న దీక్షలు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు సమైక్యాంధ్రకు మద్దతుగా జిల్లాలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. మంగళవారం నంద్యాలలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త భూమా నాగిరెడ్డి ఆదేశాలతో పద్మావతినగర్‌లో పలువురు డ్రైవర్లు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. డోన్ పాత బస్టాండ్‌లోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద నిర్వహిస్తున్న శిబిరంలో వెంకటాంపల్లె గ్రామస్తులు దీక్ష నిర్వహించారు. ప్యాపిలిలో శ్రీరామిరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ఏనుగుమర్రి గ్రామస్తులు దీక్ష చేశారు. ఆళ్లగడ్డలోని నాలుగు రోడ్ల కూడలిలో బి.వి.రామిరెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షల్లో మాల మహానాడుకు చెందిన పలువురు సభ్యులు పాల్గొన్నారు. డోన్ నియోజకవర్గ సమన్వయకర్త బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆదేశాల మేరకు బేతంచెర్లలో రిలే నిరాహార దీక్ష కొనసాగుతోంది. -
జేఏసీ నేతలు బాబును నిలదీయాలి : భూమా నాగిరెడ్డి
నంద్యాల, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర కోసం జీతాలు రాకపోయినా ఉద్యోగులు అర్ధాకలితో పోరాటాలు సాగిస్తున్నారని, రాష్ట్రస్థాయిలోని నాయకులు మాత్రం ప్రకటనలకు పరిమితమవుతున్నారని వైఎస్సార్సీపీ కేంద్రపాలక మండలి సభ్యుడు భూమా నాగిరెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా నంద్యాలలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తాను మూడు రోజుల నుంచి జేఏసీ నాయకుల నిర్లిప్తతను ఎండగడుతున్నట్లు భూమా తెలిపారు. ఇప్పటికైనా జేఏసీ నాయకులు తమ ఉనికిని కోల్పోకుండా ఉండాలని, వారి ఉద్యమంపై అనుమానాలు రాకుండా ఉండాలంటే ఉద్యమాన్ని ఉధృతం చేయాలన్నారు. సమైక్యాంధ్రకు ద్రోహం చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబును నిలదీయాలన్నారు. వారికి అండగా తాము ఉంటామని లేని పక్షంలో తామే ఆ బాధ్యతను స్వీకరించాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
ఎజెండాలో లేకున్నా ఆమోదమా... : భూమా నాగిరెడ్డి
నంద్యాల(కర్నూలుజిల్లా), న్యూస్‌లైన్: సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు రాజీనామా చేసి అప్పుడే రాజకీయ సంక్షోభాన్ని సృష్టించి ఉండాల్సిందని వైఎస్సార్సీపీ నేత భూమా నాగిరెడ్డి అన్నారు. టీ-నోట్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం లభించిన తర్వాత రాజీనామా చేయడంలో అంతర్యం ఏమిటని, ఇది కూడా ఒక డ్రామా అని ఆరోపించారు. కేబినెట్ తీసుకున్న నిర్ణయంతో సీమాంధ్ర సమరాంధ్రగా మారిందన్నారు. అసలు క్యాబినెట్ అజెండాలోనే లేకుండా ఈ అంశాన్ని ఆమోదించారంటే సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రుల పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు. రాష్ట్రం తగలబడి పోతుంటే పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, టీడీపీ నాయకుడు సీఎం రమేష్‌లు రహస్యంగా సమావేశం కావడం ఆ పార్టీ అక్రమ మైత్రికి మరో తార్కాణమని భూమా నాగిరెడ్డి విమర్శించారు. -
భూమా నాగిరెడ్డి ఆధ్వర్యంలో దీక్షలు