విజయవాడ: రెండేళ్ల పరిపాలనా వైఫల్యాలు, భారీ అవినీతి ఆరోపణల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేక్రమంలో దిగజారుడు రాజకీయాలను తెరపైకి తీసుకొచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు. ఓవైపు తెలంగాణలో టీఆర్ఎస్ లోకి టీడీపీ ఎమ్మెల్యేల చేరికలను గర్హిస్తున్న ఆయనే.. ఏపీ ప్రతిపక్ష పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను సోమవారం తమ పార్టీలోకి చేర్చుకున్నారు. సోమవారం రాత్రి చంద్రబాబుతో భేటీ అనంతరం టీడీపీలో చేరినట్లు ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, ఆయన కుమార్తె భూమా అఖిలప్రియ, జలీల్ ఖాన్, ఆదినారాయణ రెడ్డిలు ప్రకటించారు.
సోమవారం మధ్యహ్నం పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) చైర్మన్ పదవికి రాజీనామాచేసిన అనంతరం భూమా తన కూతురుతో కలిసి విజయవాడలోని చంద్రబాబు నివాసానికి వెళ్లారు. మరికాసేపటికి జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, విజయవాడ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ లు కూడా బాబుతో భేటీ అయ్యారు. కాగా, ఆదినారాయణ రెడ్డి చేరికను ఆ నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జి రామసుబ్బారెడ్డి, మాజీ మంత్రి శివారెడ్డి సతీమణి లక్ష్మీదేవమ్మలు తీవ్రంగా వ్యతిరేకించారు. వాళ్లను పార్టీలో చేర్చుకుంటే తమదారి తాము చూసుకుంటామని హెచ్చరించారు. చంద్రబాబు సర్దిచెప్పడంతో చివరికి కాస్త మెత్తబడ్డారు.
టీడీపీలో చేరిన భూమా నాగిరెడ్డి, ఆదినారాయణ రెడ్డి..
Published Mon, Feb 22 2016 9:19 PM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM
Advertisement