
సాక్షి, అమరావతి : తాను పార్టీ మారబోతున్నట్లు వస్తున్న వార్తలను ఆంధ్రప్రదేశ్ మంత్రి అఖిలప్రియ ఖండించారు. తానే పార్టీలోకి వెళ్లబోవడం లేదని తేల్చిచెప్పారు. తెలుగుదేశం పార్టీ నుంచి 2019 ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు. ఆళ్లగడ్డ సీటును ముఖ్యమంత్రి చంద్రబాబు చేతిలో పెడతానని.. ఆపై మిగతా విషయాలు సీఎం ఇష్టమని వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను వెనక్కుతీసుకోబోనని అన్నారు.
మోదీపై చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని చెప్పారు. దేశంలో మహిళలకు, మైనర్ బాలికలు రక్షణ లేదని అఖిలప్రియ పునురుద్ఘాటించారు. అందుకే ఒక మహిళగా, మంత్రిగా ప్రధానిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేసినట్లు వెల్లడించారు. ప్రధానిని వ్యక్తిగతం విమర్శించే స్థాయి తనకు లేదని అన్నారు. 13 సంవత్సరాలు దాటిన బాలికలపై రేప్ జరిగితే బీజేపీ ప్రభుత్వం పట్టించుకోదా? అని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment