రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు ప్రతి ఒక్కరూ శ్రమించాలని, అందుకోసం వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ ఆధ్వర్యంలో జరిగే పోరాటానికి మద్దతుగా నిలవాలని వైఎస్సార్‌సీపీ నేత, నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి కోరారు.
నంద్యాల: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు ప్రతి ఒక్కరూ శ్రమించాలని, అందుకోసం వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ ఆధ్వర్యంలో జరిగే పోరాటానికి మద్దతుగా నిలవాలని వైఎస్సార్‌సీపీ నేత, నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి కోరారు. గురువారం ఆయన స్థానిక రామకృష్ణ డిగ్రీ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. ఈ పోరాటంలో విద్యార్థులు ముందు నిలవాలన్నారు. ప్రత్యేక హోదా వస్తే ప్రతి ఒక్కరికి లబ్ధి కలుగుతుందని, రాష్ట్రం పురోభివృద్ధి చెందుతుందని తెలిపారు.