చంద్రబాబును నమ్ముకుంటే మానసిక వ్యధకు గురి కావాల్సిందేనని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జోగి రమేష్ వ్యాఖ్యానించారు.
విజయవాడ: చంద్రబాబు నాయుడును నమ్ముకుంటే మానసిక వ్యధకు గురి కావాల్సిందేనని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జోగి రమేష్ వ్యాఖ్యానించారు. నాడు ఎన్టీఆర్ నుంచి నేడు భూమా నాగిరెడ్డి వరకూ రాజకీయ వేధింపులకు గురి చేసి వారి మరణాలకు చంద్రబాబు నాయుడు కారణం అయ్యారని ఆయన మంగళవారమిక్కడ అన్నారు. హామీలు ఇచ్చి, ఆ తర్వాత వాటిని మరిచిపోవడం చంద్రబాబు నైజం అని జోగి రమేష్ దుయ్యబట్టారు.