
'బాబు' ప్రజా విశ్వాసం కోల్పోయారు
ఓటుకు నోటు వ్యవహారంతో ఏపీ సీఎం చంద్రబాబు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అన్నారు.
కర్నూలు: ఓటుకు నోటు వ్యవహారంతో ఏపీ సీఎం చంద్రబాబు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అన్నారు. ఆయన గురువారం కర్నూలులో జరిగిన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కుంభకోణాల్లో పీకల్లోతు కూరుకునిపోయి కాంగ్రెస్ పార్టీ పదేళ్లలో ప్రజలకు దూరంకాగా.. చంద్రబాబు మాత్రం ఏడాదిలోనే నమ్మకాన్ని వమ్ము చేశారని తెలిపారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే వైఎస్సార్ కాంగ్రెస్ అఖండ విజయం సాధిస్తుందని ఆయన తెలిపారు. కార్యక్రమాల్లో పార్టీ నేత, నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.